
►వాతావరణంలో దుమ్మూ, ధూళి ఎక్కువై చర్మ సమస్యలు అధికంగా పెరిగిపోయాయి. ఎక్కువగా, చర్మంపై జిడ్డు పేరుకుపోవడం వలన మొటిమలు వస్తుంటాయి.
►మొటిమలు తగ్గించుకోవటానికి ఒక అరటి పండుని గుజ్జుగా చేసి ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసాన్ని కలపాలి.
►ఈ పేస్ట్‌ని ముఖం, మెడ భాగాల మీద రాసుకుని 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.
►అరటిపండులో ఉండే విటమిన్ బి2,విటమిన్ బి6, విటమిన్ బి12 మీ చర్మం పొడి బారకుండా చేసి మృదువుగా ఉంచుతుంది.
►పుచ్చకాయ రసం మీ చర్మం పై ఉన్న జిడ్డుని తగ్గించి ఎక్కువ సేపు మీ ముఖాన్ని తాజాగా ఉంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment