
యువతను ఇబ్బంది పెట్టే సమస్యల్లో మొటిమలు ఒకటి. చాలామంది ముఖంపై మొటిమలు వస్తే అసలు బయటకే రారు. మరికొంతమంది వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే, చిటికెలో మొటిమలను మాయం చేసే ఒక స్మార్ట్ సొల్యూషన్ మార్కెట్‌లోకి వచ్చేసింది.
నెదర్లండ్స్‌కు చెందిన ‘ఫీవీస్’ కంపెనీ మొటిమలను తగ్గించే ఎల్‌ఈడీ ప్యాచ్‌ను తయారుచేసింది. ఇది పిల్లిపిల్ల బొమ్మతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్యాచ్‌ను మొటిమలపై అతికించుకుంటే చాలు, ఎల్‌ఈడీ స్పాట్ ట్రీట్‌మెంట్ సాయంతో మొటిమలను, వాటి మచ్చలను తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు వారంపాటు పనిచేస్తుంది. నీలం, ఎరుపు, నారింజ రంగుల్లో మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ధర 50 డాలర్లు (అంటే రూ. 4,339) మాత్రమే!
ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా..