
ఈ ఫొటోలో కనిపిస్తున్న సీలింగ్ లైట్ కేవలం ప్రకాశవంతమైన వెలుగు కోసం మాత్రమే పరిమితమైన లైట్ కాదు. ఎప్పటికప్పుడు మీ మూడ్‌కు తగ్గట్టు సంగీతంతోపాటు, రంగు రంగుల లైట్లతో ఇంటిని పార్టీ థీమ్‌లోకి తీసుకొని వెళ్లగలిగే స్మార్ట్ లైట్.
రీచార్జబుల్ బ్యాటరీతోనూ పనిచేస్తుంది. కాబట్టి, మధ్యలో కరెంట్ పోయినా కూడా పార్టీకి అంతరాయం ఏర్పడదు. మొబైల్ యాప్, గూగుల్ హోమ్, అమెజాన్ అలెక్సాతో అనుసంధానం చేసుకొని వాడుకోవచ్చు. ధర 139 డాలర్లు (రూ. 11,995).