pimples
-
మొటిమలను నివారిద్దాం..పెదవులను మృదువుగా చేసేద్దాం ఇలా..!
పెదవులు పొడిబారితే ముఖమే అందహీనంగా మారుతుంది. అందుకే చాలామంది అధరాలను మృదువుగా మార్చుకోవడానికి ఏదైనా చిట్కా ఉందా అని అడుగుతుంటారు. అలాంటి వారికి ఈ లిప్‌బామ్ ఉత్తమ ఎంపిక. దీని పేరు ‘కోలరెన్ స్క్వాలేన్ + అమైనో యాసిడ్స్ లిప్ బామ్’. దీన్ని ఎక్కువసార్లు అప్లై చేయాల్సిన పనిలేదు. ఒక్కసారి అప్లై చేసుకుంటే చాలాసేపటి వరకూ నిలిచి ఉంటుంది. దీన్ని పెదవులకే కాదు మోచేతులు, గోళ్లు వంటి పగుళ్లు ఉన్న భాగాల్లో అప్లై చేస్తే వెంటనే మృదువుగా మారతాయి. దీన్ని సులభంగా ఎక్కడికైనా తీసుకుని వెళ్లేలా చిన్నగా రూపొందించడంతో, క్యారీ చేయడం చాలా తేలిక. ఈ లిప్ బామ్ని రాత్రి పూట అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.మొటిమలకు చెక్ పెట్టేద్దాం ఇలా..అందానికి ప్రాధాన్యమిచ్చేవారు ముఖం మీద చిన్న మొటిమ వచ్చినా, మచ్చ పడినా అసలు తట్టుకోలేరు. వెంటనే దాన్ని తగ్గించుకోవడానికి బ్యూటీ పార్లర్ బాట పడుతుంటారు. ప్రస్తుత సాంకేతికత అలాంటి సమస్యలను ఇట్టే దూరం చేస్తుంది. ఇంట్లోనే స్వయంగా, సులభంగా, తమకు తామే ట్రీట్మెంట్ చేసుకునే విధంగా గాడ్జెట్స్‌ను పరిచయం చేస్తోంది. అందులో భాగమే ఈ స్కిన్ కేర్ డివైస్. చిత్రంలోని ఈ మినీ మెషిన్.. మచ్చలను, మొటిమలను, చర్మంపై రంధ్రాలను పోగొట్టి, ముఖాన్ని మృదువుగా మారుస్తుంది. ఇది బ్లూకలర్ లైట్ థెరపీతో మొటిమల్లోని బ్యాక్టీరియాను నిర్మూలించి, వాటి కారణంగా ఏర్పడిన మచ్చలను వేగంగా తగ్గిస్తుంది. దీనిలోని నీలం రంగు లైట్ 415 నానోమీటర్ల తరంగదైర్ఘ్యంతో వెలుగుతూ, 0.5 మిల్లీమీటర్ల మేరకు చర్మం లోతుల్లోకి చొచ్చుకుని వెళ్లి, ముఖాన్ని శుభ్రపరుస్తుంది. సున్నితమైన చర్మానికి కూడా ఇది చక్కటి ట్రీట్మెంట్ అందిస్తుంది. అయితే ఈ లైట్ థెరపీ తీసుకునేటప్పుడు కళ్లకు ప్రత్యేకమైన కళ్లజోడును కచ్చితంగా ధరించాలి. ఈ కళ్లజోడు డివైస్‌తో పాటు లభిస్తుంది.మెషిన్‌కి ఉన్న లైట్ హెడ్ మీద, 44 హై–ఇంటెన్సిటీ ఎల్ఈడీ బల్బులు ఉంటాయి. ఈ గాడ్జెట్ చర్మాన్ని బిగుతుగా మార్చడంతో పాటు రకరకాల అలర్జీలను తగ్గిస్తుంది. ఇక ఆయిలీ స్కిన్ ఉన్నవారికి ఇది పర్ఫెక్ట్ డివైస్ అని చెప్పుకోవచ్చు. దీనిలోని కాంతి చర్మంపై పేరుకున్న జిడ్డును తొలగిస్తుంది. అలాగే దీనిలోని కంటిన్యూస్, పల్సేటింగ్ అనే రెండు మోడ్స్ ఉంటాయి. మనకు కావలసిన రీతిలో 1 నిమిషం, 3 నిమిషాలు, 5 నిమిషాలు, 12 నిమిషాల వరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్ 120 నిమిషాల పాటు నిరంతరాయంగా పని చేయగలదు. చార్జింగ్ పెట్టుకుని దీన్ని వైర్‌లెస్‌గా కూడా వినియోగించుకోవచ్చు. ఫేస్ క్రీమ్, సీరమ్ వంటివి అప్లై చేసుకున్నాక ఈ ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం. (చదవండి: ప్రెగ్నెన్సీలో ఎలాంటి మల్టీ విటమిన్ టాబ్లెట్స్ బెస్ట్..!) -
చిటికెలో మొటిమలను మాయం చేసే ఎల్ఈడీ ప్యాచ్
యువతను ఇబ్బంది పెట్టే సమస్యల్లో మొటిమలు ఒకటి. చాలామంది ముఖంపై మొటిమలు వస్తే అసలు బయటకే రారు. మరికొంతమంది వాటిని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అందుకే, చిటికెలో మొటిమలను మాయం చేసే ఒక స్మార్ట్ సొల్యూషన్ మార్కెట్లోకి వచ్చేసింది.నెదర్లండ్స్‌కు చెందిన ‘ఫీవీస్’ కంపెనీ మొటిమలను తగ్గించే ఎల్ఈడీ ప్యాచ్‌ను తయారుచేసింది. ఇది పిల్లిపిల్ల బొమ్మతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఈ ప్యాచ్‌ను మొటిమలపై అతికించుకుంటే చాలు, ఎల్ఈడీ స్పాట్ ట్రీట్మెంట్ సాయంతో మొటిమలను, వాటి మచ్చలను తగ్గిస్తుంది. దీనిని ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపు వారంపాటు పనిచేస్తుంది. నీలం, ఎరుపు, నారింజ రంగుల్లో మార్కెట్లో అందుబాటులో ఉంది. ధర 50 డాలర్లు (అంటే రూ. 4,339) మాత్రమే!ఇదీ చదవండి: బిలియనీర్ కుమార్తె జైలు కష్టాలు.. ఆహారం, నీరు ఇవ్వడానికి కూడా.. -
Beauty Tips: హార్మోన్ల అల్లరిది గిల్లకండి!
యువతుల లుక్స్‌ను ప్రభావితం చేసి వారిని బాధపెట్టేవాటిల్లో మొటిమలు ముఖ్యమైనవి. ఆడపిల్లలైనా, మగపిల్లలైనా వారు బాల్యం వీడి కౌమారంలోకి వచ్చే దశలో ఈ మొటిమలు మొదలవుతుంటాయి. ఆ టైమ్‌లో దేహంలో కొన్ని రకాల కొత్త హార్మోన్ల ఉత్పత్తి మొదలవడం, ఆ టైమ్‌లో చర్మం మీద ఉండే గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనెవంటి పదార్థం స్రవిస్తుంటుంది. ఆ నూనె వంటి పదార్థం గ్రంథుల చివర్లలో పేరుకుపోవడం వల్ల మృతిచెందిన కణాలను బయటకు రాకుండా ఆపడం... దాంతో నూనె గ్రంథి మూసుకుపోవడం వల్ల మొటిమ వస్తుంది. దీన్ని గిల్లినప్పుడు సీబమ్ బయటకు వచ్చేసి, అక్కడ చిన్న గుంట మిగిలిపోతుంది. అయితే అబ్బాయిల కంటే అమ్మాయిలను అమితంగా బాధించే ఈ మొటిమలూ... అవి వచ్చేందుకు కారణాలూ, వాటి నివారణా, చికిత్స వంటి అనేక విషయాలను తెలిపే కథనమిది.సాధారణంగా మొటిమలు ముఖం మీదే కనిపిస్తాయని అనుకుంటారు. గానీ అవి ముఖం మీద చెంపలూ, ముక్కు అలాగే భుజాలు, వీపు ఇలా అనేక భాగాల్లో వస్తుంటాయి. మొటిమలు... లక్షణాలు:మొటిమల్లో ప్రధానంగా నాలుగు గ్రేడ్స్ ఉంటాయి. అవి... గ్రేడ్ – 1 : (కొమెడోజెనిక్) : ఈ తరహా మొటిమను వైట్ హెడ్ లేదా బ్లీచ్ హెడ్ అని పిలుస్తారు. దీని బయటి చివరి భాగం మూసుకుపోవడం వల్ల అక్కడ ఇది తెల్లరంగులో గడ్డగట్టుకుపోయిన చిన్న బంతి ఆకృతిలో కనిపిస్తుంది. బాల్‌పాయింట్ పెన్ చివరి టిప్ సైజ్‌లో ఈ వైట్‌హెడ్ ఉంటుంది. ఒకవేళ మూతి చివరి చర్మకణాలు చనిపోయి నల్లగా మారిపోతే దాన్ని బ్లాక్హెడ్గా అభివర్ణిస్తారు. గ్రేడ్ – 2 : (పాపులర్ ఆక్నే) : ఈ దశలో మొటిమలో కొద్దిపాటి వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) కనిపిస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ కనిపించే దశను పాపులర్ ఆక్నే అంటారు. ఈ దశలో ఇది చిన్నగా ఎర్రగా మరి ఉబ్బినట్లుగా బయటికి తన్నుకొని వచ్చి కనిపిస్తుంది. గ్రేడ్ – 3 : (పుస్టులార్ ఆక్నే): ఈ దశలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ. పైగా ఈ దశలో ్రపాపియోనిక్ బ్యాక్టీరియా అనే ఒక తరహా బ్యాక్టీరియా ఆ మొటిమకు తోడవుతుంది. ఈ దశలో మొటిమలో ఇన్ఫ్లమేషన్కు తోడు చీము చేరుతుంది. దాంతో ఎర్రగా ఉబ్బుకుని వచ్చిన భాగం మీద తెల్లటి చీము కనిపిస్తూ ఉంటుంది. గ్రేడ్ – 4 : (సిస్టిక్ ఆక్నే) : ఒకవేళ పైన పేర్కొన్న పుస్టులార్ ఆక్నే మరింత తీవ్రమైనప్పుడు అది చిన్న నాడ్యూల్‌గా (నీటి తిత్తిగా) మారిపోయి, బయటకు తన్నుకు వచ్చినట్లగా కనిపిస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్తో పాటు, చీము, నొప్పి, నీటిగుల్ల... ఇవన్నీ కలిపి ఉన్నందున మొటిమ తీవ్రంగా మారుతుంది. కొన్ని మొటిమల్లో మొదటి గ్రేడ్ నుంచి నాలుగో గ్రేడ్ వరకూ ఒకే మొటిమలోనే అన్ని దశలూ కనిపించవచ్చు. ఈ తరహా మొటిమలు ముఖం, ఛాతీ, భుజాలు, వీపు... ఇలా అన్ని భాగాల్లో రావచ్చు.కారణాలు : 1. బాలలు ఒక్కసారిగా యౌవన (కౌమార) దశలోకి ప్రవేశిస్తుంటారు. దీన్నే ప్యూబర్టీ స్పర్ట్గా పేర్కొంటారు. టీనేజీ యువతుల్లో అనేక రకాల హార్మోన్లు స్రవిస్తుండటం, వాటి మధ్య సమతౌల్యత లోపించడం మొదలైతే మొటిమలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘పాలీసిస్టిక్ ఒవేరియస్ డిజార్డర్’ లేదా పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల్లో ముఖాలపై మొటిమలు చాలా ఎక్కువ. 2. ఆహారం : చక్కెర మోతాదులు ఎక్కువగా ఉండే (హై గ్లూకోజ్) ఆహారాన్ని తీసుకునే వారిలో మొటిమల సమస్య చాలా ఎక్కువ. పాల ఉత్పాదనలతో కూడిన స్వీట్లు, చాక్లెట్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాల్ని ఎక్కువగా తీసుకునేవారిలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. ఈ తరహా ఆహారాన్ని తగ్గించగానే మొటిమలూ తగ్గుముఖం పడతాయి. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇలాగే జరగకపోవచ్చు. మొటిమలకూ, ఇన్సులిన్ మెటబాలిజమ్ (ఇన్సులిన్ జీవక్రియల తీరు), స్థూలకాయానికీ సంబంధం ఉందని కొన్ని అధ్యయనాల్లో స్పష్టమైంది. 3. జన్యుసంబంధమైన కారణాలు : కొందరిలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండా కేవలం జన్యుసంబంధమైన కారణాలతోనూ మొటిమలు రావచ్చు. 4. ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని కొన్ని అధ్యయనాల్లో తేలింది. 5. ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ : కొన్ని రకాల బ్యాక్టీరియా అంటే... ్రపోపియోనీ బ్యాక్టీరియా, స్టెఫాలోకోకస్ ఆరియస్, డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ వంటి ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాతోనూ కొందరిలో మొటిమలు రావచ్చు.మొటిమలు మరింత తీవ్రంగా వచ్చేదిలా... 1. మురికి సెల్ఫోన్లు : టీనేజీ పిల్లల్లో మొటిమలు వస్తున్నప్పుడు వారు మురికిగా ఉండే సెల్ఫోన్లు వాడుతున్నప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వయసు పిల్లలు తాము వాడే సెల్‌ఫోన్‌ను, స్క్రీన్‌ను శుభ్రంగా తుడిచి వాడాలి. 2. హెయిర్ స్ప్రే లు వాడటం : టీనేజీ అమ్మాయిలూ, యువతులు హెయిర్ స్ప్రేలు, హెయిర్ స్టిఫెనర్లు, తలకు రంగులు, స్రెచ్లు, జెల్లు, క్రీములు వంటి వాటి వాడకం ఎక్కువ. వీటి వల్ల కూడా సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఇలా వచ్చే మొటిమలు నుదురు భాగంలో ఎక్కువగా కనిపిస్తుంటాయి. 3. రకరకాల కాస్మటిక్స్ వాడటం : కొందరు తాము వాడే కాస్మటిక్స్‌లో కొమిడొజెనిక్ ఏజెంట్స్ అని పిలిచే లెనోలిన్, వెజిటబుల్ ఆయిల్స్, బ్యూటల్ స్ట్రియటైట్, లారిల్ ఆల్కహాల్, శరీరాన్ని తెల్లబరిచేందుకు ఉపయోగించే కాస్మటిక్స్ వాడుతుంటారు. అవి తీవ్రపరిణామాలతో పాటు మొటిమలకు కారణమవుతుంటాయి. అందుకే కొనేముందు అవి ‘నాన్ కొమిడోజెనిక్ కాస్మటిక్స్’ అని నిర్ధారణ చేసుకున్న తర్వాతే వాటిని కొనుగోలు చేయడం మేలు. 4. ముఖాన్ని అతిగా కడగటం : ముఖం తేటగా కనిపించాలనే ఉద్దేశంతో మాటిమాటికీ కడగటం, స్క్రబ్బింగ్ చేయడం, ఆవిరిపట్టించడం (స్టీమింగ్), ఫేషియల్స్ అతిగా ఉపయోగించడం వంటి పనుల వల్ల మొటిమలు రావడంతో పాటు ముఖానికి నష్టం జరుగుతుంది. 5. మొటిమలను గిల్లడం, గట్టిగా నొక్కడం వల్ల వాటి తీవ్రత పెరుగుతుంది. ముఖపై చిన్నచిన్న గుంటల్లా పడే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్ వస్తే ముఖం మరింత అందవికారంగా మారవచ్చు. అందుకే మొటిమలు గిల్లడం వంటివి చేయకూడదు. నివారణ / చికిత్సలు : ముఖాన్ని మృదువైన (మైల్డ్) సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంపై జిడ్డుగా ఉండేలా మేకప్ వేసుకోకూడదు. పొడిగా ఉంచుకోవాలి. రోజుకు కనీసం ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. ముఖాన్ని స్క్రబ్‌తో రుద్దుకోవడం, మాటిమాటికీ కడుక్కోవడం చేయకూడదు. వెంట్రుకలు జిడ్డుగా ఉండేవారు ప్రతిరోజూ షాంపూతో తలస్నానం చేయాలి. మొటిమలను గిల్లడం, నొక్కడం చేయకూడదు. జిడ్డుగా ఉండే కాస్మటిక్స్ వేసుకోకూడదు. ఒకవేళ కాస్మటిక్స్ వాడాలనుకుంటే ‘నాన్–కొమిడోజెనిక్’ తరహావి మాత్రమే వాడాలి. ఈ చర్యలతో మొటిమలు తగ్గకపోతే అప్పుడు మొటిమలను నివారించే మందులను డాక్టర్ సలహా మేరకే వాడాలి. మందుల షాపుల్లో అమ్మే మొటిమలను తగ్గించే మందుల్ని ఎవరంతట వారే వాడకూడదు. ఎందుకంటే అందులో బెంజోయిల్ పెరాక్సైడ్ / సల్ఫర్ / రిజార్సినాల్ / శాల్సిలిక్ ఆసిడ్ అనే రసాయనాలు ఉండవచ్చు. అవి బ్యాక్టీరియాను చంపి, ముఖాన్ని తేమగా ఉంచే నూనెగ్రంథులను నాశనం చేయవచ్చు లేదా పైపొరను దెబ్బతీయవచ్చు. దాంతో ముఖంపై చర్మం ఎర్రబారిపోవచ్చు. ఆహారపరమైన జాగ్రత్తలు టీనేజ్ పిల్లలు తీసుకునే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటివి. అవి... చాక్లెట్లు / కాఫీలు : మొటిమలను ప్రేరేపించే అంశాల్లో చాక్లెట్లు, కాఫీ లోని కెఫిన్ చాలా ప్రధానమైనవి. వాటిని పరిమితంగా తీసుకుంటూ ఆహారంలో కొవ్వులు, చక్కెర తగ్గించాలి ∙ముఖానికి కాస్త లేత ఎండ తగిలేలా జాగ్రత్త తీసుకోవడం అన్నది మొటిమలను చాలావరకు నివారిస్తుంది. ఈ తరహా నివారణ చర్యల తర్వాత కూడా మొటిమలు తగ్గకపోతే అప్పుడు డర్మటాలజిస్ట్‌ను కలవాలి. -
మామిడి పండ్లను తినడం వల్ల మొటిమలు వస్తాయా?
మామిడి పండ్లు తినడం వల్ల ముఖంపై మొటిమలు, గడ్డలు వస్తాయని చాలామంది చెబుతుంటారు. పాపం ఆ ఉద్దేశ్యంతోనే మామిపండు తినేందుకు భయపడుతుంటారు. నిజానికి మామిడి పండ్లకు మొటిమలకు సంబంధం ఉందా? వాటిని తినడం వల్ల వస్తాయా ? అంటే..వేసవిలో అందరూ మామిడి పండ్లంటే ఇష్టంగా తింటారు. పోషకాల రీత్యా మామిడిని పండ్లలో రారాజు అని పిలుస్తారు. నిజానికి ఈ మామిడి ఆగ్నేయాసియాలో ఉద్భవించింది. కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా సాగు చేసే సాధారణ పండుగా మారింది. ఈ మామిడి తినడం వల్ల శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల విటమిన్లు, పోషకాలు అందుతాయి. దీనిలో బీటా కెరోటిన్ అధికంగా ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో కీలకపాత్ర పోషిస్తుందని డెర్మటాలజీ నిపుణులు చెబుతున్నారు.ఈ బీటా కెరోటిన్ అనేది యాంటీ ఆక్సిడెంట్ పిగ్మెంట్, శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులతో పోరాడుతుంది. అంతేగాక దీనిలో ఉండే పోషకాలన్నీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా మంటను తగ్గించి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాంటి మామిడి పండ్లను తింటే కొందరిలో మొటిములు ఎందుక వస్తాయంటే..? అధిక చక్కెర స్థాయి, గ్లైసెమిక్ సూచిక అని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది రక్తంలో చక్కెర స్థాయిలను సూచించే స్కేల్. ఇక్కడ పండ్లు, బియ్యం, ఇతర కార్బ్ రిచ్ ఉత్పత్తులు, ముఖ్యంగా వేయించిన లేదా ప్రాసెస్ చేసిన ఆహారాల్లో అత్యధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ అసోసీయేషన్ ప్రకారం..తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారం బరువు తగ్గడానికి మెటిమలు తగ్గించడానికి 91% సహాయపడుతుందని వైద్యులు తెలిపారు. ఇక్కడ మొటిమలు రక్తంలోని చక్కెర స్థాయిలతో ముడిపడి ఉందని తెలిపారు. అందులోనూ ఈ మామిడిపండ్లను చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలు తెగ ఇష్టంగా తింటారు. ఇది వారు యుక్త వయసుకు చేరుకునే సమయం..సరిగ్గా ఈ టైంలోనే వారిలో సెబమ్ ఉత్పత్తి అవుతుంటుంది. దీంతో వారిలో జిడ్డు చర్మం, మొటిమలు మొదలయ్యే దశ స్లోగా మొదలవుతుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఈ మామిడి పండ్లు కూడా వాళ్లుగా ఇష్టంగా తినడంతో పెద్దవాళ్లు మొటిమలకి, మామిడి పండ్లకి లింక్ చేసి..అవి తినడం వల్లనే వస్తున్నాయని అనేస్తారు. వాస్తవానికి అది అపోహ అని తేల్చి చెబుతున్నారు నిపుణులు. సముతల్యమైన ఆహారం తీసుకున్నవాళ్లు హాయిగా మామిడి పండ్లను తినవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మొటిమలు చర్మ పరిస్థితికి ఒక లక్షణం అనేది గ్రహించాలి. ఇక్కడ చర్మాన్ని శుభ్రంగా ఉంచుకుని, మంచి పరిశుభ్రతను పాటిస్తూ.. మొటిమలను నిరోధించే క్రీమ్‌లను ఉపయోగిస్తే..ఈ సమస్య నుంచి సులభంగా బయటపడగలుగుతారు. పైగా చర్మం కూడా ప్రకాశవంతంగా అందంగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు.(చదవండి: గురుద్వారా సేవా కార్యక్రమంలో మోదీ! ఏంటీ లంగర్ ..?) -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్‌గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం.నిపుణుల మాట► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి.► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి.►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్ పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్‌గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం. నిపుణుల మాట ► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది ► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి. ►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
దాల్చిన చెక్కతో మొటిమల సమస్యకు చెక్‌పెట్టండిలా!
చర్మగ్రంథుల నుంచి స్రవించే సెబమ్, ఇతర నూనెలు చర్మం మీద ఒక చోట గూడుకట్టుకున్నప్పుడు, వాటికి మృతకణాలు తోడైనప్పుడు మొటిమలు, యాక్నే వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇందుకోసం మార్కెట్లో దొరికే క్రీమ్‌లకంటే ఇంట్లోనే చేసుకోగలిగిన పరిష్కారాలు మంచి ఫలితాన్నిస్తాయి. దాల్చినచెక్కతో ఫేస్‌ప్యాక్: ముఖాన్ని క్లెన్సర్‌తో కానీ మామూలు సబ్బుతో కానీ శుభ్రం చేసుకుని తుడిచేయాలి. రెండు టేబుల్ స్పూన్ల తేనెలో టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఇప్పుడు చన్నీటితో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం మీద మృతకణాలు, నూనెలు, సెబమ్ వంటివి నిలవకుండా ఎప్పటికప్పుడు తొలగిపోతుంటాయి. కాబట్టి కొత్త మొటిమలు రావు. అప్పటికే ఉన్న మొటిమలు, యాక్నే కూడా తగ్గుముఖం పడుతుంది. గ్రీన్ టీ ప్యాక్: ఒక గ్లాసు నీటిటో గ్రీన్ టీ బ్యాగ్ వేసి నాలుగు నిమిషాల సేపు మరిగించాలి. గ్రీన్‌టీ పూర్తిగా చల్లారిన తర్వాత అందులో కాటన్ బాల్‌ను ముంచి టీని ముఖానికి పట్టించాలి. టీని ముఖానికి కాటన్ బాల్‌తో పట్టించడం కుదరకపోతే స్ప్రే బాటిల్లో పోసుకుని ముఖం మీద స్ప్రే చేసుకుని చర్మానికి పట్టేటట్లు వేళ్లతో అద్దాలి. ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. ఇప్పుడు టీ బ్యాగ్‌ను ఓపెన్ చేసి అందులో రెండు చుక్కల తేనె కలిపి ముఖానికి ప్యాక్ వేయాలి. ఈ ప్యాక్ బాగా ఆరిన తర్వాత చన్నీటితో శుభ్రం చేయాలి. రోజుకోసారి ఇలా చేస్తుంటే వారంలోనే మొటిమలు, యాక్నే పోయి చర్మం కాంతిమంతమవుతుంది. (చదవండి: బెస్ట్ శాండ్‌విచ్‌గా ఈ భారతీయద స్ట్రీట్ ఫుడ్‌కి చోటు! ఎన్నో ర్యాంకులో నిలిచిందంటే..) -
టీనేజర్స్‌ని ఇబ్బంది పెట్టే మొటిమల సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చు
మొటిమలు.. చాలామంది టీనేజర్స్‌ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.కాలుష్యం, హార్మోన్లలో మార్పులు,పోషకాహార లోపాలు వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే సమస్యకు నివారించేందుకు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అవి మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే కంటే మన ఇంట్లోనే దొరికే నేచురల్ ఫేస్‌ప్యాక్‌తో మొటిమలకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా. ►బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. ► జాజికాయ, మిరియాలు, మంచి గంధం..ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. ► ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి. ► రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి -
ముఖమంతా మొటిమలు, బయటకు వెళ్లలేకపోతున్నా.. ఏం చేయాలి?
‘బేబీ... పొద్దున లేచిందగ్గర్నుంచీ అద్దం ముందేనా? త్వరగా రెడీ అయ్యి కాలేజీకి వెళ్లు’ అని అరిచింది అరవింద. ‘వెళ్తాలేమ్మా’ అని సమాధానమిచ్చింది మానవి. కానీ అద్దం ముందు నుంచి కదల్లేదు. తన మొహంపై మొటిమలు అసహ్యంగా ఉన్నాయని బాధపడుతూ కూర్చుంది. ‘బేబీ... కాలేజీ బస్ వచ్చిందమ్మా’ అని కేకేశాడు ఆనంద్. ‘వస్తున్నా డాడీ... కాస్త ఆగమని చెప్పు’ అని హడావుడిగా తయారై బస్సెక్కింది. ∙∙ ‘హాయ్... బేబీ’ అని పలకరించింది అర్పిత. ‘హాయ్.. అర్పీ’ ‘హేయ్... కరోనా పొయ్యి ఏడాదైందే. ఇంకా ఆ మాస్క్ ఏంటే బాబూ?’ ‘ఏం చెప్పమంటావే... మొహమంతా పింపుల్స్. ఎన్ని రకాల క్రీమ్స్ వాడినా తగ్గడంలేదు. డాక్టర్ని కలిసి మెడిసిన్స్ కూడా వాడా. అయినా నో రిలీఫ్.’ ‘హ్మ్... వాటి గురించి అంత ఆలోచనెందుకే బాబూ! ఆ పింపుల్స్‌తో నువ్వు సాయిపల్లవిలా కనిపిస్తున్నావ్ తెలుసా?’ ‘నా మొహంలే’ అని బలవంతంగా నవ్వింది మానవి. క్లాసులో కూర్చుందన్న మాటే కాని మనసంతా పింపుల్స్ చుట్టూనే తిరుగుతోంది. వాటివల్లనే తాను అందంగా కనిపించడంలేదని, వాటివల్లనే తనను ఎవ్వరూ చూడటం లేదని అనుకుంటోంది. ఎలాగోలా క్లాసులు పూర్తిచేసి ఇంటికి వచ్చింది. ‘బేబీ.. త్వరగా స్నాక్స్ తిని రెడీ అవ్వు. మావయ్య వాళ్లింట్లో ఫంక్షన్ ఉంది, వెళ్దాం’ అని చెప్పింది అరవింద. ‘నువ్వెళ్లు మమ్మీ... నేను రాను.’‘అదేంటే.. అన్నిటికీ, నేను రాను, నేను రాను అంటావ్. నువ్వు రాకపోతే మావయ్య ఫీలవుతాడు. మీ అత్త నిష్టూరమాడుతుంది.’ ‘వాళ్లతో నేను ఫోన్లో మాట్లాడతాలే, నువ్వెళ్లు.’‘ఏవిటో ఇది.. ఎక్కడికీ రానంటుంది’ అనుకుంటూ వెళ్లింది అరవింద. ∙∙ పింపుల్స్ సమస్య చిన్నదే. టీనేజ్‌లో చాలామంది అనుభవించేదే. కానీ మానవికి మాత్రం అదో పే...ద్ద సమస్యగా మారింది. ఎవ్వరూ ఏమీ అనకపోయినా, దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఎస్టీమ్ తగ్గిపోయాయి. నిత్యం ఆందోళనగా ఉంటోంది. దాన్ని అధిగమేంచేందుకు విపరీతంగా తింటోంది. దానివల్ల బరువు పెరుగుతోంది. దానివల్ల మళ్లీ ఆందోళన. ఇదో అందులేని నెగెటివ్ సైకిల్‌గా మారిపోయింది. పలకరిస్తే ఏడుస్తోంది. దీనికేదో అయ్యిందని అరవింద.. మానవిని కౌన్సెలింగ్‌కు తీసుకొచ్చారు. లేని సమస్య గురించే ఆలోచనలు మానవితో అరగంట మాట్లాడేసరికి... ఆమె మనసంతా మొటిమలపైనే ఉందని అర్థమైంది. మానవికి ఉన్న సమస్యను బాడీ డిస్మార్ఫిక్ డిజార్డర్ (బీడీడీ) అంటారు. అంటే శరీరంలో ఇతరులకు కనిపించని లోపం ఉందని భావిస్తూ, దాని గురించే ఆలోచిస్తూ ఉండటం. ఇదో రకమైన మానసిక రుగ్మత. ఓసీడీలో ఇదో రకం. మానవి మొటిమల గురించి ఆలోచిస్తే, ఇంకొకరు ముక్కు గురించి లేదా రంగు గురించి లేదా బరువు గురించి లేదా ముడతల గురించి లేదా వక్షస్థలం కొలత గురించి ఆలోచించవచ్చు. టీనేజ్ కుర్రాళ్లు జుట్టు పలచబడటం లేదా రాలిపోవడం లేదా కండలు లేకపోవడం గురించి బాధపడుతూ ఉండవచ్చు. ఈ ఆలోచనలను నియంత్రించడం కష్టం. కారణాలు అనేకం... బీడీడీ ఎలా, ఎందుకు వస్తుందో నిర్దిష్టంగా తెలియదు. జెనెటిక్స్ నుంచి కల్చర్, మీడియా వరకూ రకరకాల కారకాలు ఉంటాయి. బీడీడీ ఉన్న కుటుంబ సభ్యులుంటే ఇది వచ్చే అవకాశం మూడు నుంచి ఎనిమిది రెట్లు ఎక్కువ. కల్చర్, మీడియా, మూవీస్ కలిసి ఆలోచనలను ప్రభావితం చేయవచ్చు. బాల్యంలో ఎవ్వరూ పట్టించుకోకపోవడం లేదా బెదిరించడం లేదా ఆటపట్టించడం లాంటివి కూడా కారణం కావచ్చు. బీడీడీ సంకేతాలు, లక్షణాలు ►ఇతరులకు కనిపించని లేదా మైనర్‌గా అనిపించే లోపాల గురించే ఆలోచిస్తూ ఉండటం .మీ రూపాన్ని అగ్లీగా మార్చే లోపం ఉందని బలమైన నమ్మకం ►మీ రూపాన్ని ఇతరులు ఎగతాళి చేస్తారనే నమ్మకం. ►తరచూ అద్దంలో చూసుకోవడం ∙స్టైలింగ్, మేకప్ లేదా దుస్తులతో లేని లోపాలను దాచడానికి ప్రయత్నించడం ►మీ రూపాన్ని నిరంతరం ఇతరులతో పోల్చడం ∙లోపాన్ని సరిదిద్దుకునేందుకు విస్తృతంగా కాస్మెటిక్స్ వాడటం ∙మీలో లోపం ఉందని, ఫంక్షన్స్‌కు వెళ్లకుండా తప్పించుకోవడం. సైకోథెరపీతో చెక్ పెట్టొచ్చు మొదటి సెషన్లో సైకో డయాగ్నసిస్ ద్వారా మానవి సమస్యను నిర్ధారణయ్యాక, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ) ద్వారా చికిత్స ప్రారంభించాను. ప్రతికూల ఆలోచనలు, ఎమోషనల్ రియాక్షన్స్, ప్రవర్తనలు సమస్యకు ఎలా కారణమవుతాయో తెలుసుకోవడానికి ఈ థెరపీ ఉపయోగపడుతుంది. ఆ తర్వాత పింపుల్స్ గురించి ఉన్న ప్రతికూల ఆలోచనలను సవాలు చేసి, సరైన ఆలోచనా విధానాన్ని నేర్చుకునేలా చేస్తుంది. తరచూ అద్దం చూసుకోవడం, కాస్మెటిక్స్ తగ్గించడంలో, ప్రత్యామ్నాయ మార్గాలను నేర్చుకోవడంలో ఉపయోగపడుతుంది. అలా పది సెషన్లలో మానవి సమస్య పరిష్కారమైంది. ఇప్పుడు తాను మొటిమల సమస్యను పక్కకు నెట్టేసి, కాన్ఫిడెంట్‌గా అన్ని ఫంక్షన్స్‌కు హాజరవుతోంది. -సైకాలజిస్ట్ విశేష్ psy.vishesh@gmail.com -
ఈ డివైస్‌తో శాశ్వతంగా మొటిమలను పోగొట్టుకోవచ్చు..
సాధారణంగా తీసుకుంటున్న ఆహారంతోనో, వయసులో వచ్చే మార్పులతోనో, నెలసరి సమయాల్లోనో.. మొటిమలు రావడం.. అవి పూర్తిగా తగ్గకుండా నల్లటి మచ్చలుగా మిగిలిపోవడం, ఎర్రటి దద్దుర్లు ఏర్పడటం వంటివి చాలామందిలో కనిపించే సమస్యలే. వాటికి చెక్ పెడుతుంది చిత్రంలోని మినీ మెషిన్.ఈ ఎల్ఈడీ మెడికల్ డివైస్ (యాక్నే లైట్ షాట్).. వాడుతున్న తొలి రోజు నుంచే మెరుగైన ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. అంటే ట్రీట్మెంట్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుందన్న మాట. ఇది చర్మం మీద ఏర్పడే మొటిమల్ని, మచ్చల్ని, గాయాలను శాశ్వతంగా దూరం చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మార్చేస్తుంది. దీన్ని వినియోగించే సమయంలో చేతులతో అవసరం ఉండదు. పైగా ఈ డివైస్‌ని సులభంగా ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. టార్గెటెడ్ డెలివరీ సిస్టమ్‌తో రూపొందిన ఈ మినీ మెషిన్.. మొటిమలు లేదా మచ్చలున్న చోట లైట్ థెరపీతో చర్మాన్ని మెరిపిస్తుంది. ఇది చాలా సురక్షితమైనది. ప్రభావవంతమైనది. వేగవంతమైనది కూడా. ఈ చికిత్సతో 90 శాతం మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ డివైస్‌ని వినియోగించి.. ముఖం మీదున్న రంధ్రాలను 80 శాతం వరకూ తగ్గించుకోవచ్చు. గాయాలను వాటి తాలుకు మచ్చలను 75 శాతం వరకూ నయం చేసుకోవచ్చు. దీన్ని మగవారు కూడా ఉపయోగించుకోవచ్చు. అయితే కంటి పరిసరాల్లో వినియోగిస్తున్నప్పుడు.. చిత్రంలోని ప్రత్యేకమైన కళ్లజోడును పెట్టుకోవాలి. బాగుంది కదూ! -
మొటిమలు, మచ్చల నివారణ.. ఈ ప్యాక్స్ ప్రయత్నించండి
బీట్రూట్ ఆరోగ్య పరిరక్షణకే కాదు, మంచి సౌందర్య సాధనంగా కూడా ఉపకరిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, జింక్ పింపుల్స్, వాటి మచ్చలను తొలగించడానికి చాలా సమర్థంగా పనిచేస్తాయి. మీకు పింపుల్స్ సమస్య ఉంటే.. ఈ ప్యాక్స్ ప్రయత్నించి చూడండి. రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి. బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. (క్లిక్ చేయండి: రోజూ తలస్నానం చేస్తున్నారా? కీర దోస జ్యూస్‌తో లాభాలివే!) -
Beauty Tips: మొటిమలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఇలా చేస్తే సరి!
పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ఈ పేస్టు చర్మంపై పేరుకు పోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. -
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే
మొటిమల సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. ►పదిహేను పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ►దీనిలో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల కీరా రసం, టీస్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూతలా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల మొటిమలు పోతాయి. తేనెతో పాటు.. పుదీనా ఆకుల పేస్టులో తేనె, రోజ్‌వాటర్ వేసి కలిపాలి. మొటిమలపైన పూతలా వేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇలా కూడా! కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు తీసుకొని బాగా పిండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసంలో పిండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం గరుకుగా ఉంటే.. ముఖంపై చర్మం గరుకుగా అనిపిస్తోందా? అలాంటప్పుడు.. క్యాబేజీని ఉడికించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది. గుంతలు పోవాలంటే.. మొటిమలు తగ్గిన తర్వాత కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి చాలా మందికి. ఈ సమస్య నుంచి బయపడాలంటే.. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాస్తే సరి! చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
Beauty Tips: పసుపు ఐస్‌క్యూబ్‌లతో.. మచ్చలు, వైట్ హెడ్స్, ట్యాన్ మాయం!
ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నప్పటికీ ముఖ చర్మం జిడ్డుగా, మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్ వల్ల నీరసంగా వడలిపోయినట్లుగా కనిపిస్తుంది. ఈ సమస్యలన్నింటికీ పసుపు ఐస్‌క్యూబ్‌లతో మంచి పరిష్కారం లభిస్తుంది. ►టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పొడి, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరి పాలు, ఆరు చుక్కల నిమ్మ నూనెను తీసుకుని ఒక గిన్నెలో వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలో పోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు మర్దన చేయాలి. ►ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడి లేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి. ►ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్ పోయి ముఖం ఫ్రెష్‌గా రేడియంట్‌గా కనిపిస్తుంది. ►చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. ► పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య చాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చదవండి: 5 Fruits For Monsoon Diet: జలుబు, దగ్గు.. వర్షాకాలంలో ఈ ఐదు రకాల పండ్లు తిన్నారంటే..! Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్ అదే! -
మొటిమలు పోవడం లేదా?
►ముఖం జిడ్డుగా ఉంటే మొటిమల సమస్య పెరుగుతుంది. ఆపిల్ స్లైస్‌తో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపైన జిడ్డు తగ్గి, చర్మం తాజాగా కనిపిస్తుంది. ►మొటిమల సమస్య బాధిస్తుంటే వేరుశనగ నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి. ►వెనిగర్‌లో ఉప్పు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి, మృదువుగా రబ్ చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. ►తేనెలో దాల్చినచెక్క పొడి కలపాలి. పడుకునేముందు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే మొటిమలు తగ్గుతాయి. -
పాపకు ముఖం నిండా మొటిమలు...
మా పాప వయసు 18 ఏళ్లు. గత కొంతకాలంగా ఆమెకు ముఖం నిండా మొటిమలు వస్తున్నాయి. పాప ముఖం చాలా కళగా ఉంటుంది. అయితే ఈ వయసులో ఇలా మొటిమలు రావడంతో కాస్తంత న్యూనతకు గురవుతోంది. మా అందరికీ అవగాహన కలిగేలా మొటిమల గురించి పూర్తి వివరణ ఇస్తూ, ఆమె విషయంలో మేము ఎలాంటి జాగ్రత్తలు/చికిత్స తీసుకోవాలో తెలియజేయండి.– కె. సురేఖ, సికింద్రాబాద్ మొటిమలు రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి... 1) జిడ్డుస్వభావంతో కూడిన చర్మం (ఆయిలీ స్కిన్) 2) చర్మంపై ఉండే స్వేద రంధ్రాలు పూడుకుపోవడం 3) చర్మంపైని స్వేద రంధ్రాలలో బ్యాక్టీరియా చేరడం 4) ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట). సాధారణంగా చర్మకణాలు పుట్టే క్రమంలో చర్మంపై ఉండే స్వేదరంధ్రాలు పూడుకుపోతాయి. దాంతో అక్కడ చర్మాన్ని తేమగా ఉంచేందుకు పుట్టే స్రావమైన ‘సీబమ్’ బయటికి రావడానికి మార్గం ఉండదు. ఫలితంగా అక్కడ పేరుకున్న ‘సీబమ్’ బ్యాక్టీరియా పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. ఫలితంగా అక్కడ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇలా మొటిమలు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో యుక్తవయసుకు రాగానే పెరిగే పురుష హార్మోన్లు మొటిమలకు కారణం అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇది కేవలం అపోహ మాత్రమే. ఎందుకంటే మొటిమలు ఉన్న మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పాళ్లను పరిశీలిస్తే అవి నార్మల్‌గా ఉండాల్సిన మోతాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యుక్తవయసులో ఉన్న ఆడపిల్లల్లో ఈ హార్మోన్ పాళ్లు పెరగడం వల్ల రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు రావడం కనిపించవచ్చు. అందుకే దాదాపు 25 ఏళ్లు దాటిన మహిళల్లో మొటిమలు రావడం జరుగుతుంటే వాళ్లలో హార్మోన్ అసమతౌల్యత ఉన్నట్లుగా అనుమానించాలి. పాలిసిస్టిక్ ఓవరీ (అండాశయాల్లో నీటితిత్తులు ఉండటం) అనే కండిషన్లో మహిళల్లో మొటిమలు చాలా ఎక్కువగా వస్తాయి. పైగా ఇవి చికిత్సకు ఒక పట్టాన లొంగవు. అందుకే మొటిమలు ఉన్న పురుషులలో కంటే మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యతకు అవకాశాలు ఎక్కువ అని తెలుస్తుంది. కొన్ని రకాల మందులు వాడటం వంటి అంశాలు కూడా మొటిమలను ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. కొన్నిసార్లు సౌందర్యసాధనాలు (కాస్మటిక్స్) వల్ల కూడా మొటిమలు రావచ్చు. ఇక ఆహారం విషయానికొస్తే కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారం, చాక్లెట్లతో మొటిమలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది అందరిలో జరగకపోయినా, మొటిమలు వచ్చే దేహ స్వభావం ఉన్నవారిలో మొటిమలు రావడం, అవి మరింతగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటివారు కొవ్వులను, చాక్లెట్లను మినహాయించాలి. మొటిమలు రావడం కూడా ఒక రకం వ్యాధే... చాలామంది తల్లిదండ్రులు మొటిమలను ఒక వ్యాధిగా పరిగణించరు. కానీ చర్మానికి సంబంధించిన ఒక రుగ్మతగానే దీన్ని చూడాలి. సాధారణంగా ముఖం మీద, కొందరిలో ఛాతీ, వీపు మీద కనిపించే ఈ మొటిమలు చాలా తక్కువ తీవ్రత (మైల్డ్) మొదలుకొని తీవ్రమైన (సివియర్) వరకు వేర్వేరు స్థాయుల్లో కనిపిస్తాయి. కొందరిలో చాలా తీవ్రమైన (వెరీ సివియర్) స్థాయి మొటిమల తీవ్రత ఎంతగా ఉంటుందంటే అది కొన్ని జీవ వ్యవస్థలను (సిస్టమ్స్‌ను) కూడా ప్రభావితం చేస్తుంది. మొటిమ తన తొలిదశలో చిన్న బొడిపెలా కనిపిస్తుంది. దీని చివరిభాగం మూసుకుపోయి తెల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాతి దలో దీని చివరిభాగం నల్లగా మారి, తెరచుకుని కూడా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ఎర్రగా బాగా ఉబ్బిపోయి లేదా వాపుతో కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో చర్మం గట్టిబారి పోయి ఒక పెద్దబొడిపె (నాడ్యూల్) లా అనిపించవచ్చు. ఇలా ముఖమంతా అనేక దశల్లోని మొటిమలు కనిపిస్తూ ఉండవచ్చు. ముఖం మీద ఉన్న గాట్లు వంటి భాగాలు, మచ్చలు (స్కార్స్) ఆధారంగా వీటిని ఐదు గ్రేడ్స్‌గా విభజించి చూస్తారు. కొందరిలో ఇవి నీరునిండినట్లుగా గట్టి పెద్ద బొడిపె మాదిరిగా (నాడ్యులో–సిస్టిక్) పుండ్లలా కనిపిస్తూ జ్వరం, కీళ్లనొప్పులు కూడా కనిపించవచ్చు. కొందరిలో అకస్మాత్తుగా మటుమాయమవుతాయి... కొందరిలో ఇవి తమ కౌమార దశ నుంచి బయటపడగానే (అడల్ట్హుడ్కు రాగానే) అకస్మాత్తుగా మాయమైపోతాయి. లేదా తీవ్రత తగ్గిపోతాయి. అయితే మొటిమల అనంతర దశల్లో వచ్చే మచ్చలు మిగిలిపోవడం వంటి కొన్ని దుష్ప్రభావాలను దృష్టిలో పెట్టుకొని చికిత్స కొనసాగించాలా, అయితే ఎంతకాలం కొనసాగించాలన్నది తెలుసుకోవాలి. కొందరిలో చికిత్స అవసరం చాలామంది పేరెంట్స్ యుక్తవయసులోని తమ పిల్లలకు మొటిమలు వస్తున్నప్పుడు కొంత వయసు తర్వాత అదే తగ్గిపోతుందంటూ చికిత్స ఇప్పించరు. ఇది సరికాదు. తీవ్రమైన మొటిమలు ఉన్నప్పుడు అవి ముఖం మీద గాట్ల వంటి మచ్చలను ఏర్పరుస్తాయి. అవి ఎదిగే వయసులోని పిల్లల్లో తీవ్రమైన న్యూనతను కలిగిస్తాయి. కాబట్టి ఆ వయసు పిల్లల ఎదిగే మానసిక ఆరోగ్య వికాసాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కౌమారంలో ఉన్న పిల్లల నాణ్యమైన జీవితం కోసం, ఆత్మవిశ్వాసం పెంపొందించండం కోసం మొటిమలకు చికిత్స అవసరం. ఈ చికిత్స ఎంతగా జరిగితే మచ్చలను అంతగా రాకుండా చూడవచ్చు. చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, క్లెన్సర్లు అందుబాటులో ఉంటాయి. అయితే మొటిమలు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో పూతమందుల (టాపికల్ మెడిసిన్స్)తో పాటు నోటి ద్వారా తీసుకోవాల్సిన మందులు (ఓరల్ మెడిసిన్స్) కూడా వాడాల్సి ఉంటుంది. నివారణకు ఉపయోగపడే క్లెన్సర్స్ ఇవి: ఇప్పుడు మార్కెట్లో మొటిమలను నివారించడానికి చాలా క్లెన్సర్ లభ్యమవుతున్నాయి. వీటిలో శాల్సిలిక్ యాసిడ్, గ్లైకోలిక్ యాసిడ్, సల్ఫర్ ఉంటాయి. ఇవి సబ్బులు, లిక్విడ్ ఫేస్‌వాష్ ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ఉపయోగిస్తూ, ముల్తానీ మిట్టీ లాంటి వాటితో ఫేస్‌ప్యాక్‌లా వేస్తూ జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలోని జిడ్డుపాళ్లను తగ్గించవచ్చు. ఇది మొటిమలు తగ్గించడానికి ఒక మార్గం. అయితే మొటిమలు తక్కువగా ఉన్నవారు మినహాయించి, ఒకింత ఎక్కువగా ఉన్నవారు ముఖాన్ని శుభ్రపరచుకునేందుకు ఫేషియల్ స్క్రబ్ వాడకపోవడమే మంచిది. పూతమందులతో చికిత్స: మొటిమలు ఉన్న స్థాయిని, తీవ్రతను బట్టి పూత మందుల్లో అనేక రకాలు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు రెటినాయిడ్స్ అనే పూత మందులు స్వేదరంధ్రాలు పూడుకుపోయిన మొటిమలకు బాగా ఉపయోగపడతాయి. ఇక రెటినాయిడ్స్‌తో పాటు క్లిండమైసిన్, అజిథ్రోమైసిన్, నాడిఫ్లోక్లసిస్ వంటి యాంటీబయాటిక్స్ పూతమందులుగా లభ్యమవుతున్న కాంబినేషన్లు మొటిమలపై మరింత ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అయితే కొన్ని రెటినాయిడ్ కాంబినేషన్ పూత మందుల వల్ల చర్మంపై మంట, చర్మం ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీన్ని తగ్గించడానికి అవి పూసి ఉంచాల్సిన వ్యవధిని తగ్గించడం, వాటర్ బేస్డ్ మాయిష్చరైజర్స్ వాడటం మేలు. ఒకవేళ పూతమందులతో మొటిమలు 6–8 వారాలు గడిచినా తగ్గనప్పుడు పూతమందులతో పాటు నోటిద్వారా తీసుకునే మందులు వాడాలి. నోటి ద్వారా తీసుకునే మందులతో (ఓరల్ థెరపీ): ఒకింత తీవ్రత కలిగిన మొటిమలు మొదలుకొని తీవ్రమైన మొటిమలకు పూతమందులతో పాటు... నోటి ద్వారా తీసుకోవాల్సిన అరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూడు వారాల పాటు వాడాక కూడా ఫలితం కనిపించకపోతే చికిత్స వ్యవధిని కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు పొడిగించాల్సి ఉంటుంది. ఇక మహిళల్లో పాలీసిస్టిక్ ఓవరీస్ వంటి హార్మోన్ల అసమతౌల్యత లక్షణాలు కూడా కనిపిస్తే నోటిద్వారా తీసుకునే మందులతో చికిత్స అవసరం. మహిళల్లో మొటిమలతో పాటు హార్మోన్ అసమతౌల్యతలకు సైప్రోస్టెరాన్ ఎసిటేట్ వంటి యాంటీయాండ్రోజెన్ మందులు, గర్భనిరోధక మాత్రలు వాడుతుంటే అందులో కొద్దిపాటి ఈస్ట్రోజెన్‌తో పాటు లో–యాండ్రోజెనిక్ ప్రోజెస్టెరాన్ ఉన్న మందులను కనీసం ఆరు వారాల పాటు వాడితే మంచి ఫలితాలు వస్తాయి. యాంటీబయాటిక్స్‌తో కూడా ఫలితం లేనప్పుడు ఐసోట్రెటినియాన్ వంటివి మొటిమల చికిత్సలో మంచి ఫలితాలను ఇచ్చే మందులుగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తీవ్రమైన మొటిమల కోసం యాంటీబయాటిక్స్ కూడా ఉపయోగపడనప్పుడు వీటిని 16 వారాలపాటు వాడాలి. మొటిమలకు కారణాలు ఏవైనప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా ఫలితం చూపే మంచి మందులివి. వాటితో పాటు ఇప్పుడు చవగ్గానే లభించే డర్మారోలర్, హైస్ట్రెంత్ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్‌ను పూసే చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స: ఇక ముఖంపైన మచ్చలు, గాట్లు మిగిలిపోయినవారికి ఒక్కోసారి వాటి తీవ్రతను బట్టి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. అయితే ఇది చాలా అరుదు. డాక్టర్ స్వప్నప్రియ, డర్మటాలజిస్ట్,కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
మొటిమలు తగ్గడానికి ఇది ట్రై చేయండి
పండ్లు తింటేనే కాదు గుజ్జు లేదా జ్యూస్ చేసుకుని.. ముఖానికి అప్లై చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. మచ్చలు తొలగిపోయి.. మొటిమలు తగ్గిపోయి.. ముఖం తేజోవంతంగా మారాలంటే మీరు కూడా ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : ఆపిల్ జ్యూస్ – 2 టీ స్పూన్లు స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 3 టీ స్పూన్ నిమ్మరసం – పావు టీ స్పూన్ మాస్క్: బొప్పాయి గుజ్జు –4 టీ స్పూన్లు ఆరెంజ్ జ్యూస్ – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా ఆపిల్ జ్యూస్‌తో క్లీనప్ చేసుకోవాలి. తర్వాత దానిమ్మ గుజ్జు, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ఇప్పుడు చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. తర్వాత బొప్పాయి గుజ్జు, ఆరెంజ్ జ్యూస్ కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై లేదా ఇరవై ఐదు నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. -
మొటిమలు, మచ్చలు మాయం
ఎటువంటి దుష్ఫలితాలూ లేకుండా మొటిమలను, మచ్చలను సులువుగా తగ్గించుకునే ఔషధాన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దామా... జాజికాయ, మిరియాలు, మంచి గంధం... ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి. -
ముఖంలోనే జబ్బుల లక్షణాలు
సాక్షి, న్యూఢిల్లీ : ముఖారవిందానికి అధిక ప్రాధాన్యతనిచ్చే మహిళలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడమే కాకుండా ముఖానికి వికారంగా మొటిమలు పెరిగిపోతున్నాయంటూ స్కిన్ స్పెషలిస్టుల దగ్గరికి పరిగెత్తుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇటీవల డెర్మటాలజిస్టుల సంఖ్య కూడా ఏకంగా 200 శాతానికి పెరిగింది. ముఖాన మొటిమలుగానీ, గాయం లాంటి మడతలుగానీ ఊరికే రావట. శరీరంలోని అంతరావయాల్లో కలిగే మార్పులు లేదా లోపాలను ఎత్తిచూపడం కోసం అవి వస్తాయట. ఈ విషయాన్ని చైనా ఆయుర్వేద వైద్యులు ‘ఫేస్ మ్యాపింగ్’ ద్వారా ఎప్పుడో తేల్చి చెప్పారు. కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని చూసి ‘జాండిస్’ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్న విషయం కూడా మనకు తెల్సిందే. అలాగే కుడి బుగ్గ వద్ద చీలినట్లయితే ఊపిరి తిత్తులకు సంబంధించి ఏదో సమస్య ఉన్నట్లు లెక్కట. అలాగే గుండె గురించి ముక్కు, హార్మోన్ల గురించి గడ్డం చెబుతుందట. చైనా ఆయుర్వేద వైద్యుల ఈ నమ్మకాలు నిజమేనని న్యూయార్క్‌కు చెందిన డ్యాన్ హుసు కూడా నిర్ధారిస్తున్నారు. మన ముఖంలోని ప్రతిభాగం మన శరీరంలోని ఒక్కో అవయవానికి ప్రాతినిథ్యం వహిస్తాయని ఆయన చెప్పారు. 1. కనుబొమ్మలుపైన: మొటిమలు వస్తే గాల్ బ్లాడర్, కాలేయానికి సంబంధించిన సమస్య ఉన్నట్లు లెక్క. కొవ్వు పదార్థాలు, శుద్ధి చేసిన ఆహారం తగ్గిస్తే సమస్య పరిష్కారం అవుతుందని డాక్టర్ డ్యాన్ సూచించారు. 2. రెండు కనుబొమ్మల మధ్య: మొటిమలు వస్తే ఎక్కువగా మద్యం, ధూమపానం సేవిస్తున్నట్లు సూచనట. 3. ముక్కుమీద మొటిమలు వస్తే: హృదయం, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య. అంటే ఉప్పు, మసాలా ఆహార పదార్థాలకు దూరంగా ఉండమే కాకుండా బీ విటమిన్ ట్యాబ్లెట్లు తీసుకోవాలని డాక్టర్ సూచిస్తున్నారు. 4. ఇక ఎడమ బుగ్గ నేరుగా కాలేయానికి ప్రాతినిధ్యం వహిస్తుందట. అక్కడ మొటిమలు వస్తే చల్లటి ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటూ మంచి నీరు ఎక్కువగా తీసుకోవాలట. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలట. 5. ఇక నోరు మనలోని జీర్ణ వ్యవస్థకు ప్రాతినిధ్యం వహిస్తుందట. నోటి దగ్గర మొటిమలు లేదా కురుపులు కనిపిస్తే ఫైబర్, కూర గాయలు ఎక్కువగా తీసుకోవాలట. 6. ముఖం మీది చర్మం శీరరంలోని హార్మోన్లను సూచిస్తుందట. ఒమెగా 3 తీసుకుంటే సమతౌల్యం అవుతాయట. చైనా ఆయుర్వేద వైద్యులు ముఖంలోని మార్పులనుబట్టి శరీరంలోని లోపాలను లేదా జబ్బులను చెప్పి ఉండవచ్చు. న్యూయార్క్‌లోని ఈ డాక్టర్ మాత్రం శరీరంలోని లోపాల వల్ల మొటిమలు వస్తాయని, వాటిని ఎలా నివారించవచ్చో సూచిస్తున్నారు. -
మృదువైన మెరుపు
మార్కెట్లో కొన్న క్రీమ్స్ కంటే.. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి. మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇలా ఒక్కటేమిటి వయసుతో వచ్చిన సమస్యలను, కాలుష్యం తెచ్చిపెట్టిన ఇబ్బందులను సహజసిద్ధమైన చిట్కాలు పరిష్కరిస్తాయి. అందుకే చాలా మంది ఈ చిట్కాలను తు.చ. తప్పకుండా పాటిస్తారు. నిపుణుల సలహాలు కూడా ఇవే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : కమలా రసం – 2 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ మాస్క్: కీరదోస గుజ్జు – 3 టీ స్పూన్లు, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా కమలా రసం, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కీరదోసగుజ్జు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
అందాల రాశిలా
సహజసిద్ధమైన అందం నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడుతుంది. అయితే మచ్చలు, మొటిమలు లేని మృదుత్వం శాశ్వతంగా నిలవాలంటే ఏం చెయ్యాలి? ఇది చాలా మందికి తలెత్తే సమస్యే. పరిష్కారం ఉందంటున్నారు నిపుణులు. అందాల రాశిలా మెరవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే అంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : రోజ్ వాటర్ – 1 టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, స్క్రబ్ : పెసరపిండి – అర టేబుల్ స్పూన్, చిక్కటి పాలు – అర టేబుల్ స్పూన్, మాస్క్: క్యారెట్ గుజ్జు – రెండు టీ స్పూన్లు, కొబ్బరి పాలు – 1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా రోజ్‌వాటర్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, కొబ్బరిపాలు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
సహజమైన సౌందర్యం
ఓ పక్క కాలుష్యంతో, మరోపక్క ఉక్కబోతలతో ముఖం రోజురోజుకీ కాంతిహీనంగా మారిపోతుందా? జిడ్డు, మచ్చలు, మొటిమలతో అందహీనంగా తయారవుతుందా? అయితే కాస్త తీరక చేసుకుని క్లీనప్, స్క్రబ్ వంటివి ప్రయత్నించండి. ఆవిరి పట్టించుకుని, ఇరవై నిమిషాల పాటు సహజసిద్ధమైన మాస్క్ వేసుకోండి. ఇక రిజల్ట్ మీకే తెలుస్తోంది. కావల్సినవి: క్లీనప్ : చిక్కటి పాలు – 2 టీ స్పూన్లు(కాచనివి), తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – అర టేబుల్ స్పూన్, టమాటా గుజ్జు – అర టేబుల్ స్పూన్ మాస్క్: కమలాపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, మంచి గంధం – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు, గడ్డ పెరుగు – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా చిక్కటి పాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కమలాపండు గుజ్జు, మంచి గంధం, శనగపిండి, గడ్డపెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
కళ్లు చెదిరే అందం
ముఖం కాంతివంతంగా మెరవాలంటే... మార్కెట్లో వందలకు వందలు పోసి కొన్న ఫేస్‌క్రీమ్స్ అవసరం లేదు. కాస్త తీరిక చేసుకుని క్లీనప్, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకుని, ఇరవై నిమిషాల పాటు మాస్క్ వేసుకుంటే చాలు. సహజసిద్ధమైన అందం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే ఇలాంటి సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే అంటున్నారునిపుణులు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : కొబ్బరిపాలు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, చిక్కటి పాలు – అర టేబుల్ స్పూన్ మాస్క్: క్యారెట్ గుజ్జు – అర టేబుల్ స్పూన్, టమాటా గుజ్జు – పావు టేబుల్ స్పూన్, గడ్డపెరుగు – 1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – అర టేబుల్ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, టమాటా గుజ్జు, గడ్డపెరుగు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
బ్యూటిప్
ఎంత చక్కని ముఖ కవళికలు ఉన్నా... చర్మం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే అందం మరుగున పడిపోతుంది. అందుకే ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. ∙ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మారుతుంది. ∙ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. ∙వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి. -
మచ్చలను పోగొట్టే మెరుపు
మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : ఆలివ్ నూనె – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్, నిమ్మరసం – 5 లేదా 6 చుక్కలు స్క్రబ్ : మొక్కజొన్న పిండి – 1 టేబుల్ స్పూన్, నీళ్లు – కొద్దిగా మాస్క్: తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పసుపు – చిటికెడు, గడ్డపెరుగు – పావు టీ స్పూన్, శనగపిండి – పావు టీ స్పూన్ తయారీ : ముందుగా ఆలివ్ నూనె, తేనె, నిమ్మరసం ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు మొక్కజొన్న పిండి, సరిపడా నీళ్లు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, పసుపు, గడ్డపెరుగు, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
బ్యూటిప్స్
►వాతావరణంలో దుమ్మూ, ధూళి ఎక్కువై చర్మ సమస్యలు అధికంగా పెరిగిపోయాయి. ఎక్కువగా, చర్మంపై జిడ్డు పేరుకుపోవడం వలన మొటిమలు వస్తుంటాయి. ►మొటిమలు తగ్గించుకోవటానికి ఒక అరటి పండుని గుజ్జుగా చేసి ఒక టేబుల్ స్పూన్ పుచ్చకాయ రసాన్ని కలపాలి. ►ఈ పేస్ట్‌ని ముఖం, మెడ భాగాల మీద రాసుకుని 20 నిముషాల పాటు ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►అరటిపండులో ఉండే విటమిన్ బి2,విటమిన్ బి6, విటమిన్ బి12 మీ చర్మం పొడి బారకుండా చేసి మృదువుగా ఉంచుతుంది. ►పుచ్చకాయ రసం మీ చర్మం పై ఉన్న జిడ్డుని తగ్గించి ఎక్కువ సేపు మీ ముఖాన్ని తాజాగా ఉంచుతుంది. -
ఆకర్షణీయమైన అందం
సహజసిద్ధమైన చిట్కాలను ఫాలో అయితే.. ఫేస్ క్రీమ్స్, లోషన్స్‌తో పనిలేదంటున్నారు నిపుణులు. ముఖంపైన మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు కెమికల్స్‌తో తయారుచేసిన మార్కెట్ ప్రొడక్ట్స్‌తో పనిలేదంటున్నారు. మరైతే సహజసిద్ధమైన చిట్కాలతో వచ్చే ఫలితాలను మీరూ ప్రయత్నించండి. కావాల్సినవి : క్లీనప్ : టమాటా గుజ్జు – 1 టేబుల్ స్పూన్, గడ్డపెరుగు – అర టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, చిక్కటి పాలు – అర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్, పసుపు – చిటికెడు తయారీ : ముందుగా టమాటా గుజ్జు, గడ్డపెరుగు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, కీరదోస గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు యాపిల్ గుజ్జు, చిక్కటి పాలు, పసుపు, తేనె కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మెరుస్తూనే ఉండిపోతారు
మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇవి అందాన్ని మాయం చేసి ముఖాన్ని కాంతిహీనంగా తయారు చేసి మగువలను ఇబ్బంది పెట్టే సమస్యలు. వయసుతో వచ్చే ముడతలు కొన్నైతే... కాలుష్యంతో పెరిగే మచ్చలు, మొటిమలు మరికొన్ని. అవన్నీ పూర్తిగా తగ్గి.. మృదువైన మోమును సొంతం చేసుకోవాలంటే ఇలాంటి చిట్కాలను ఫాలో అవ్వాల్సిందే. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, తేనె – పావు టీ స్పూన్ స్క్రబ్ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు మాస్క్: అరటిపండు గుజ్జు – 1 టేబుల్ స్పూన్, బాదం గుజ్జు – 1 టీ స్పూన్, గడ్డ పెరుగు – 1 టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా కొబ్బరిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, బాదం గుజ్జు, గడ్డపెరుగు, శనగపిండి కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి అప్లై చేసుకోవాలి. తర్వాత ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
సూపర్ షైనింగ్
రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం బారినపడి.. ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతోందా? మచ్చలు, మొటిమలు పెరిగి అందాన్ని పాడుచేస్తున్నాయా? అయితే ఈ సహజ చిట్కాలను మీరూ పాటించండి. సూపర్ షైనింగ్‌ని పొందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్ స్క్రబ్ : కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు, పెసరపిండి – 1 టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు మాస్క్: బీట్రూట్ రసం – 2 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా చిక్కటిపాలు, తేనె ఒక చిన్న బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె ముఖం, మెడ భాగాలకు బాగా పట్టించి... పెసరపిండి, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి, ఆ మిశ్రమంతో ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు బీట్రూట్ రసం, ముల్తానీ మట్టి, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల ముఖానికి మంచి షైనింగ్ వస్తుంది. -
ముఖ కాంతికి...
►కొద్దిగా తులసి ఆకులు, మూడు బచ్చలి ఆకులను కలిపి గ్రైండ్ చేయాలి. దీంట్లో సరిపడా నీటిని జత చేసి పేస్ట్ చేసి ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి క్రమం తప్పకుండా చేస్తే చర్మం మీ కాంతిమంతం అవుతుంది. ►అర టీ స్పూన్ ఆవాల నూనెలో కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమన్ని వేళ్లతో కొద్దికొద్దిగా తీసుకుని వలయాకారంలో 10 నిమిషాల పాటు మసాజ్ చేసి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తే చర్మం నిగారిస్తుంది. ►తెల్ల ఉల్లిపాయని గ్రైండ్ చేసి రసం తీయాలి. దీంట్లో పావు టీ స్పూన్ తేనె, చిటికెడు రాళ్ల ఉప్పు వేయాలి. అది కరిగిన తరవాత ఈ మిశ్రమాన్ని మొటిమల మీద అప్లై చేసి 20 నిమిషాల వరకు ఉంచి చన్నీటితో కడిగేయాలి. మొటిమలు తగ్గుతాయి. ►దాల్చిన చెక్కను పొడి చేయాలి. దీంట్లో కొద్దిగా నీటిని చేర్చి పేస్ట్‌లా కలపాలి. మొటిమలు, మచ్చలు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఆరిన తరవాత కడిగేయాలి. వారానికి ఒక్కసారి ఈ విధంగా క్రమం తప్పకుండా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గి చర్మకాంతి పెరుగుతుంది. ►టేబుల్ స్పూన్ శనగపిండిలో గుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గంధం పొడి కలపాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి, మెడకు పట్టించి 20 నిమిషాల తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌లు అన్ని రకాల చర్మాల వారికి అనువుగా ఉంటాయి. వారంలో ఒక్కసారి ఈ ప్యాక్‌లను వాడడం వలన చర్మకాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. ►సగం క్యారట్, ఒక ముక్క నారింజ, అర టేబుల్ స్పూన్ పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ వారంలో ఒకసారి చేయడం వల్ల చర్మకాంతి మెరుగుపడుతుంది. -
మచ్చలేని అందం!
మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ కేవలం ఆయా సమయాల్లో మాత్రమే మెరుపునిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే.. మచ్చలు, మొటిమలు శాశ్వతంగా తొలగిపోవాలంటే సహజసిద్ధమైన సౌందర్యలేపనాలను వాడాల్సిందే. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – ఒకటిన్నర టీ స్పూన్, కీరదోస జ్యూస్ – ఒకటిన్నర టీ స్పూన్, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : పెసరపిండి – 2 టీ స్పూన్లు, గడ్డ పెరుగు – ఒకటిన్నర టీ స్పూన్లు మాస్క్: క్యారెట్ గుజ్జు – 3 టీ స్పూన్లు, కిస్మిస్ గుజ్జు – 1 టీ స్పూన్, చిక్కటి పాలు – ఒకటిన్నర టీ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కీరదోస జ్యూస్, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు పెసరపిండి, గడ్డ పెరుగు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు క్యారెట్ గుజ్జు, కిస్మిస్ గుజ్జు, చిక్కటి పాలు బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
అందానికి సరైన చిట్కా
స్పెషల్ డేస్‌లో స్పెషల్‌గా రెడీ అయ్యేందుకు ఖరీదైన ఫేస్‌క్రీమ్స్ వాడుతుంటారు చాలా మంది. అయితే ఆ క్రీమ్స్ కేవలం ఆ క్షణానికి మాత్రమే మెరుపునిస్తాయి. ఆ తర్వాత మళ్లీ మామూలే. మచ్చలు, మొటిమలు కనిపించకుండా ఉండేందుకు పైపై పూతలు పూసుకునేకంటే... శాశ్వతంగా తొలగిపోయేందుకు సహజ సిద్ధమైన చిట్కాలను పాటించాల్సిందే. అప్పుడే అందం సహజత్వాన్ని పొందుతుంది. శాశ్వతంగా నిలుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆరెంజ్ జ్యూస్ – 3 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్, గ్లిజరిన్ – 3 చుక్కలు స్క్రబ్ : ఓట్స్ – 1 టీ స్పూన్, యాపిల్ గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటి పాలు – 1 టీ స్పూన్ మాస్క్: కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, శనగపిండి – 1 టీ స్పూన్, జామపండు గుజ్జు – 2 టీ స్పూన్లు (గింజలు తొలగించి) తయారీ : ముందుగా తేనె, గ్లిజరిన్, ఆరెంజ్ జ్యూస్ ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు యాపిల్ గుజ్జు, చిక్కటి పాలు, ఓట్స్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు జామపండు గుజ్జు, కొబ్బరిపాలు, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
మెరుపు చూడతరమా!
ఖర్చుతో కూడిన ఫేస్ క్రీమ్స్ కంటే.. ఖర్చులేని సహజసిద్ధమైన చిట్కాలే ముఖానికి అన్నివిధాలా మంచిదంటున్నారు నిపుణులు. అందుకే మరి మీ ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చించండి. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం మరింత కాంతివంతం అవుతుంది. మచ్చలు, మొటిమలు లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : రోజ్‌వాటర్ – 1 టీ స్పూన్, గ్లిజరిన్ – 3 లేదా 4 చుక్కలు స్క్రబ్ : కొబ్బరి పాలు – ఒకటిన్నర టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పెసర పిండి – అర టీ స్పూన్ మాస్క్ : చిక్కటి పాలు – 2 టీ స్పూన్లు, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, శనగ పిండి – అర టీ స్పూన్ తయారీ : ముందుగా రోజ్‌వాటర్, గ్లిజరిన్ చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిపాలు, బియ్యప్పిండి, పెసర పిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు చిక్కటిపాలు, కీరదోస గుజ్జు, శనగపిండి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
ఇలా చేస్తే... అందం మీ సొంతం
∙క్యారెట్, ఓట్స్ పౌడర్, పంచదార, పసుపు కలిపి మెత్తని పేస్ట్ చేసుకుని మొటిమలపై అప్లై చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ∙ క్యారెట్, నారింజ రసం, పంచదార తీసుకుని మూడింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్న వారు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుంది. ∙ముఖానికి మేకప్ వేసుకునే ముందు క్యారెట్, నారింజ రసం రెండింటినీ కలిపి ముఖంపై వలయాకారంలో మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని చన్నీటితో కడిగేసి 20 నిమిషాల తర్వాత మేకప్ వేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ మరింత అందంగా కనబడుతుంది. ∙మెడ చుట్టూ చర్మం నల్లగా ఉన్నవారు... క్యారెట్ పేస్ట్‌లో నిమ్మరసం, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మెడ చుట్టూ నల్లగా ఉన్న చర్మంపై నూనె రాసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసి మసాజ్ చేయాలి. -
ఫేస్‌క్రీమ్స్‌తో పనిలేదు!
మేకప్‌తో వచ్చే అందం కంటే.. మేకప్ వేయకుండా మెరిసే అందానికే ఓటేస్తుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఖర్చులేని ఈ చిట్కాలను పాటించడానికి మాత్రం కాసింత సమయం వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమవుతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆలీవ్ నూనె – పావు టీ స్పూన్, దానిమ్మ జ్యూస్ – 2 టీ స్పూన్లు(చెత్త తొలగించి), బాదం పాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి. వాటిని ఫ్రిజ్‌లో నిలువ చేసుకోవచ్చు.) స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పచ్చిపసుపు – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు – 2 టీ స్పూన్లు, యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, పెసరు పిండి – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్ తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్, బాదం పాలు, ఆలీవ్ నూనె ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, బియ్యప్పిండి, ఆరెంజ్ జ్యూస్, పచ్చి పసుపు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, యాపిల్ గుజ్జు, పెసరు పిండి, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. వెంటనే సబ్బు ముఖానికి రాసుకోకపోవడమే మంచిది. -
పొడిబారిన చర్మానికి...
చలికాలం చర్మం త్వరగా పొడిబారుతుంది. చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారాలంటే వంటింట్లో ఉండే దినుసులతోనే బ్యూటీ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. ∙బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. పొడిబారి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. రోజుకు రెండు సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది. ∙మూడు 3 టేబుల్ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, 6 చుక్కల నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు. ∙మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది. -
ఎవర్గ్రీన్ చిట్కాలు
మచ్చలు, మొటిమలు లేని మోముకోసం చాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. రకరకాల ఫేస్ క్రీమ్స్, లోషన్స్ వాడేందుకు సిద్ధమవుతుంటారు. అయితే వాటి వల్ల శాశ్వత పరిష్కారం లభించడం కష్టమే. అలాంటి వారి కోసమే ఈ సహజసిద్ధమైన చిట్కాలు. అయితే ఫేస్‌ప్యాక్ వేసుకునే ముందు క్లీనప్ చేసుకుని, స్క్రబ్ చేసుకుని, ఆవిరి పట్టించుకోవడం తప్పనిసరి. కాస్త సమయం పట్టినా ఇవన్నీ చేస్తేనే ఈ కాలుష్యబారినపడిన మీ చర్మం తిరిగి కాంతివంతంగా మెరుస్తుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – పావు టీ స్పూన్, నిమ్మరసం – పావు టీ స్పూన్, యాపిల్ జ్యూస్ – 1 టీ స్పూన్ స్క్రబ్ : చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు, క్యారెట్ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఓట్స్ – 2 టీ స్పూన్లు మాస్క్ : కలబంద గుజ్జు –అర టీ స్పూన్, యాపిల్ గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి పాలు– అర టీ స్పూన్ తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం, యాపిల్ జ్యూస్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కటిపాలు, క్యారెట్ గుజు ్జ, ఓట్స్ ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పాలు, కలబంద గుజ్జు, యాపిల్ గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మచ్చలు మటుమాయం
నున్నటి మృదువైన మోముపైన చిన్నపాటి మొటిమ వస్తే చాలు.. అది పూర్తిగా తగ్గించుకునేంతవరకు శతవిధాలా ప్రయత్నిస్తుంటారు మగువలు. మార్కెట్లో దొరికే రకరకాల క్రీమ్స్, లోషన్స్ వంటివి ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : నిమ్మరసం – పావు టీ స్పూన్, రోజ్ వాటర్ – పావు టీ స్పూన్, బాదంపాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి) స్క్రబ్ : బ్రౌన్ సుగర్ – 2 టీ స్పూన్లు, అరటి గుజ్జు – 2 టీ స్పూన్ల గంధం – అర టీ స్పూన్ (గంధం చెక్క నుంచి నూరి తీసుకోవాలి) మాస్క్ : శనగ పిండి – 1 టీ స్పూన్, కిస్మిస్ గుజ్జు – అర టేబుల్ స్పూన్కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు తయారీ : ముందుగా నిమ్మరసం, బాదంపాలు, రోజ్‌వాటర్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ సుగర్, అరటి గుజ్జు, గంధం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కిస్మిస్ గుజ్జు, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
పులిపిర్లకు ఉల్లి .. వెల్లుల్లి
మెడ, భుజాలు, చంక, కళ్ల ప్రాంతాలలో పులిపుర్లు మొలుస్తూ ఉంటాయి. వీటికి చర్మసమస్యలు, ఊబకాయం, జన్యుకారకాలు.. ఇలా ఎన్నో కారణాలు అవుతుంటాయి. చర్మ సౌందర్యాన్ని దెబ్బతీసే ఈ పులిపిర్లను తగ్గించుకోవడానికి కొన్ని జాగ్రత్తలను ఇంటి వద్దే తీసుకోవచ్చు. చర్మ సహజత్వమూ కోల్పోకుండా కాపాడుకోవచ్చు. ఉప్పు, ఉల్లిపాయ: ఉల్లిపాయలో సల్ఫర్ శాతం అధికం. ఇది మొండిగా ఉండే మొటిమలను, పులిపిర్లను నివారించడంలో మహత్తరంగా పనిచేస్తుంది. రాత్రి సమయంలో ఒక గిన్నె తీసుకొని అందులో అర కప్పు నీళ్లు, టీ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. దీంట్లో 2–3 ఉల్లిపాయ ముక్కలను కోసి వేసి, మూత పెట్టి ఆ రాత్రంతా అలాగే ఉంచాలి. ఈ రసాన్ని రోజుకు మూడు సార్లు పులిపిర్ల మీద, పులిపిర్లు వచ్చేఅవకాశం ఉంది అనుకున్న చోట చర్మం మీద రాయాలి. ఇలా కొన్ని వారాల పాటు చేస్తూ ఉంటే పులిపిర్ల సమస్య తగ్గుముఖం పడుతుంది. వెల్లుల్లి: ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే ఔషధ గుణాలు వెల్లుల్లిలో సమృద్ధిగా ఉన్నాయి. రెండు పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలను మెత్తగా నూరాలి. ఈ పేస్ట్‌ని పులిపిర్లు ఉన్న చోట రాసి, గంట సేపు ఉంచాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తూ ఉండాలి. కొన్ని రోజులకు పులిపిరి చర్మం నుంచి విడివడుతుంది. అల్లం: యాంటీమైక్రోబయల్ లక్షణాలు గల అల్లం చర్మ సమస్యల నివారిస్తుంది. తాజా అల్లంను సన్నని స్లైసులుగా కట్ చేయాలి. ఆ ముక్కలతో పులిపిర్ల మీద మృదువుగా రుద్దాలి. రోజుకు 5 నుంచి 6 సార్లు ఇలా చేస్తూ ఉంటే సహజపద్ధతుల్లోనే పులిపిర్లు రాలిపోతాయి. నిమ్మరసం: దూది ఉండను నిమ్మరసంలో ముంచి దాంతో పులిపిర్లు, యాక్నె ఉన్న చోట అద్దాలి. పది నిమిషాలు ఉంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజులో 2 నుంచి 3 సార్లు చేస్తూ ఉంటే పులిపిర్లు సహజ పద్ధతిలో వదిలే అవకాశం ఉంది. కొబ్బరి నూనె: జుట్టుకు వాడేది కాకుండా సహజమైన కొబ్బరి నూనె ఎన్నో చర్మ సమస్యలను నివారిస్తుంది. పులిపిర్లు ఉన్న చోట కొబ్బరి నూనె రాసి ఓ గంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజుకు రెండు సార్లు కొబ్బరి నూనె పులిపిర్లు ఉన్న చోట రాస్తూ ఉంటే కొన్ని వారాలలో వాటి సంఖ్య తగ్గుముఖం పడుతుంది. వేప నూనె: వేప చెట్టు ఆరోగ్యప్రదాయిని అని మనకు తెలిసిందే! వేప నూనెలో ఓషధ గుణాలు అధికం. పులిపిర్లను నివారించడంలో వేపనూనె మహత్తరంగా పనిచేస్తుందని ఆయుర్వేదం చెబుతోంది. రోజుకు 3 సార్లు పులిపిర్లకు వేపనూనె రాయాలి. ఇలా రోజూ చేస్తూ ఉంటే కొన్ని వారాలకు మొలిచిన పులిపిర్లు రాలిపోతాయి. -
మొటిమలు రాకుండా ఉండాలంటే..
న్యూఢిల్లీ : యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను భయపెట్టేది పరీక్షలు కాదు, సిలబస్ కాదు ...మరేంటంటే ‘ఆక్నే’ మన భాషలో చెప్పాలంటే మొటిమలు. అవును చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని పాడు చేయడానికి చిన్న మొటిమ చాలు. అందుకే మొటిమలంటే అంతలా భయపడతారు. మరి ఈ మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఓ సారి చూద్దామా... మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్ ఇలా రకరకాల కారణాలు. మారుతున్న జీవనశైలి కూడా మొటిమలు రావడానికి కారణం. మొటిమలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునేముంది మేకప్‌ను పూర్తిగా తొలగించాలి రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం వారు అయితే ఎక్కువ సార్లు శుభ్రంచేసుకోవాలి. మేకప్‌ను తొలగించడానికి అల్కహాల్ రహిత మేకప్ రిమూవరన్ని ఉపయోగించాలి. తర్వాత డీప్ పూర్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మసాలాలకు దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. నీరు శరీరం నుంచి విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా, తేమగా ఉంటుంది. ప్రతిరోజు యోగా చేయ్యాలి. శ్వాస తీసుకోవడం, శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేయడం వల్ల శరీరమంతా మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి. ముఖాన్ని శుభ్రపర్చుకోవడానికి సబ్బు వాడకూడదు. సబ్బు వాడటం వల్ల ముఖం పొడిబారుతుంది. బాక్టీరియా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మొటిమలు రాకుండా నివారించవచ్చు. ఆకు కూరలు ఆకుపచ్చ కూరలు బచ్చలి, పాలకూర వంటివి మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ ఆంటీ ఏజింగ్ ఎజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థలో ఉన్న బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. పసుపు మొటిమలను తగ్గించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపుకు కూడా పసుపును వావడతారు. పసుపును ఆహారంలో తీసుకోవడం వల్ల మొటిమలను కలిగించే బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు నెట్టి వేస్తుంది. క్యారేట్ క్యారేట్లలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రోజువారి ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి. సాల్మన్ వీటిల్లో ఓమేగా3 ఫాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను నివారించడమే కాక నొప్పి, వాపుని తగ్గిస్తుంది. -
మెరిసే మృదువైన మేను
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం నానా తంటాలు పడుతుంటారు మహిళలు. చర్మం కాస్త రఫ్‌గా అనిపించినా.. చిన్న మొటిమ కనిపించినా అది తగ్గేంత వరకూ ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మంచి ఫేస్‌క్రీమ్స్ కోసం మార్కెట్లో వేట మొదలుపెడతారు. అయితే కెమికల్స్‌తో తయారైన ఫేస్‌క్రీమ్స్ కంటే.. ఇంటిపట్టున దొరికే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే మంచివంటున్నారు నిపుణులు. దాంతో ముఖంపైన ఉన్న మృతకణాలు తొలగిపోయి.. అందంగా మారుతుందని అంటున్నారు. మరైతే ఇలా ట్రై చెయ్యండి. కావలసినవి: క్యారెట్ గుజ్జు – 3 టేబుల్ స్పూన్స్, అరటిపండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్స్ పెరుగు – అర టేబుల్ స్పూన్, తేనె – పావు టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని... క్యారెట్ గుజ్జు, అరటిపండు గుజ్జు మిక్స్ చేసుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో పెరుగు, తేనె కలుపుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు బాగా పట్టించి ఓ 20 నిమిషాలు పాటు బాగా ఆరనివ్వాలి. తరువాత గోరువెచ్చని నీళ్లతో మొత్తం క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి 2 లేదా 3 సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ∙ -
తులసిదళం.. ముఖ సౌందర్యం...
గులాబి రేకుల్లా మృదువుగా ఉండాల్సిన ముఖం మొటిమలు, దద్దుర్లు, నల్ల మచ్చలతో నిండిపోయిందా? అయితే వాటిని దూరం చేసే ఔషధం మీ పెరట్లోనే ఉంది. 10–15 తులసి ఆకులను పేస్ట్‌లా చేసి, దాన్ని టొమాటో గుజ్జుతో కలిపి ముఖానికి రాసుకోవాలి. అలా ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ∙ ఈ వర్షాకాలంలో వానకు తడిసీ తడిసీ జుట్టు సౌందర్యాన్ని కోల్పోతుంది. అలా కాకుండా కురులు నిగనిగలాడాలంటే... ∙ తలంటు స్నానం చేసిన ప్రతిసారి రెండు టీ స్పూన్ల (శనగ పిండి), ఒక గుడ్డు తెల్ల సొన, ఒక టీ స్పూన్ పెరుగు, అర టీస్పూన్ నిమ్మరసం తీసుకొని వాటన్నింటిని కలిపి, ఆ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి ఆరిన తర్వాత చల్లటి నీటితో తల స్నానం చేయాలి. రెండు వారాల్లో కనీసం ఇలా నాలుగుసార్లు చేస్తే మేనితో సమానంగా మెరిసే కురులు మీ సొంతం. చేతులు, పాదాల చర్మకాంతి పెరగాలంటే... మూడు స్పూన్ల బోరాక్స్ పౌడర్, రెండు స్పూన్ల గ్లిజరిన్, రెండు కప్పుల రోజ్ వాటర్‌ను బాగా కలపాలి. దాన్ని కాళ్లకు, చేతులకు రాసుకొని ఓ 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. అది మంచి స్క్రబ్‌లా పని చేస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు అల్లం రసాన్ని తాగితే అది ముఖంపై మొటిమలను దూరం చేస్తుంది. అంతేకాదు ఆ రసాన్ని మాడుకు రాసుకుంటే రక్త ప్రసరణ బాగా జరగడంతో చుండ్రు మాయమవుతుంది. అలాగే జుట్టు రాలడం తగ్గి ఒత్తుగా పెరుగుతుంది. -
మొటిమలు వచ్చాయా...? మీకు శుభవార్త...!
మీకు గతంలో మొటిమలు ఎక్కువగా వచ్చే ఆరోగ్య చరిత్ర (మెడికల్ హిస్టరీ) ఉందా? మీ యుక్తవయసులో ముఖం అంతా మొటిమలు అని బాధపడ్డారా? అయితే అప్పుడలా రావడం నిజంగా అదృష్టమే. ఇలా మొటిమలు వచ్చే ఆరోగ్య చరిత్ర ఉన్నవారిలో వయసు పెరగడం (ఏజింగ్) వల్ల చర్మంలో వచ్చే మార్పులు చాలా ఆలస్యంగా వస్తాయంటున్నారు బ్రిటన్ పరిశోధకులు. ఇలాంటి వారిలో చర్మం ముడుతలు పడటం కూడా చాలా ఆలస్యంగా జరుగుతుందని లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన జెనెటిక్ ఎపిడెమాలజీ విభాగానికి చెందిన నిపుణులు, ఈ పరిశోధనల్లో పాల్గొన్న బృందానికి నేతృత్వం వహిస్తున్న డాక్టర్ సిమోన్ రిబేరో పేర్కొంటున్నారు. ఈ విషయాలు జర్నల్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ డెర్మటాలజీలో ప్రచురితం అయ్యాయి. -
హెల్త్‌టిప్స్
ముఖం మీద బ్లాక్ హెడ్స్, మొటిమలు వస్తుంటే నూనెలో వేయించిన ఆహారాన్ని పూర్తిగా మానేయాలి. ఆహారంలో తాజా పండ్లు, పచ్చికూరగాయలతో చేసిన సలాడ్లు, మొలకెత్తిన గింజలు, మీగడ లేని పెరుగు తీసుకోవాలి. క్రమం తప్పకుండా వీటిని ఆహారంలో చేర్చుకుంటే శరీరంలోని విషపదార్థాలన్నీ బయటకు పోయి అనవసరమైన కొవ్వు శరీరంలోకి చేరకుండా చర్మం తాజాగా ఉంటుంది. పచ్చి కూరగాయలు, ఆకులను తినే ముందు వాటిని తప్పనిసరిగా ఉప్పు కలిపిన గోరువెచ్చటి నీటితో కడగాలి. వాటిని పండించేటప్పుడు చల్లిన క్రిమిసంహారక మందుల అవశేషాలు, పొలం నుంచి ఇంటికి వచ్చేవరకు అవి చేసే ప్రయాణంలో వాటినాశించిన రకరకాల క్రిమికీటకాలు, దుమ్ముధూళి చన్నీటితో కడిగితే పూర్తిగా పోవు. ఇక్కడ నిర్లక్ష్యం చేస్తే పచ్చి కూరగాయలతో వచ్చే ఆరోగ్యం కంటే ముందు పురుగు మందుల ప్రభావంతో సైడ్ఎఫెక్ట్స్ వస్తాయి. -
మొటిమలుంటే అందమైన చర్మం...
యుక్త వయసు వచ్చిన అమ్మాయిలకు ముఖంపై మొటిమలు రావడం సర్వసాధారణం. అయితే వారు తెగ ఇబ్బంది పడిపోయి రకరకాల క్రీములు, లోషన్లు వాడుతుంటారు. ఇలాంటివి వాడకపోయినా వయసు పెరిగే కొద్ది అందమైన, మృదువైన చర్మం దానంతట అదే వస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మొటిమలే లేని యువతుల జన్యు సమాచారాన్ని, మొటిమలు కలిగిన వారితో పోల్చి చూసినపుడు వారి కణాల్లోని టెలిమోర్ల పొడవులో తేడా ఉన్నట్లు గుర్తించారు. దీనివల్ల వారి కణాలు ఇతరుల కంటే ఎక్కువసార్లు విభజన చెందుతాయి. అంటే టెలిమోర్ల పొడవు ఎక్కువగా ఉన్నవారు ఎక్కువ కాలం కూడా ఆరోగ్యంగా ఉంటారు. వీరిలో టెలిమరేజ్ అనే ఎంజైమ్ ఎక్కువగా ఉత్పత్తి అయి, టెలిమోర్ల పొడవు తగ్గిపోకుండా చూస్తుంటుంది. ఇది టెలిమోర్ల పొడవు తగ్గిపోకుండా చూస్తుంటుంది. ఈ ఎంజైమ్ కొందరిలో ఎక్కువగా, మరికొందరిలో తక్కువగా ఉత్పత్తి అవడం వల్ల సమస్యలు వస్తుంటాయన్నమాట. -
టీ డికాక్షన్‌తో మెరుపు
న్యూ ఫేస్ ఉదయాన్నే టీ తాగితే తాజాదనం భావన కలుగుతుంది, చురుగ్గా ఉంటామని చాలా మంది ఆలోచన. అందుకే ఉదయాన్నే రోజును టీతో మొదలుపెడతారు. కొంతమంది పాలు కలపకుండా బ్లాక్ టీని సేవిస్తారు. అంటే కేవలం డికాక్షన్ మాత్రమే అన్నమాట. టీ డికాక్షన్‌తో మేని మెరుపును కూడా పెంచుకోవచ్చు. కావాల్సినవి: ♦ స్పూన్ టీ పొడి ♦ అర స్పూన్ తేనె ♦ 2 స్పూన్ల బియ్యప్పిండి తయారీ: ⇒ కప్పున్నర నీళ్లను వేడి చేసి, అందులో టీ పొడి వేయాలి. అర కప్పు టీ అయ్యేంత వరకు మరిగించి, చల్లారనివ్వాలి. ⇒ టీ డికాక్షన్ చల్లారాక అందులో తేనె, బియ్యప్పిండి కలపాలి. ⇒ ముఖానికి, మెడకు, చేతులకు పట్టించి, పూర్తిగా ఆరనివ్వాలి. ఇందుకు కనీసం 20 నిమిషాల సమయం పడుతుంది. ⇒ ముఖం మీద నీళ్లు చిలకరించి, వేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. ⇒ తర్వాత చల్లని నీటితో మొత్తం కడిగేయాలి. ⇒ టీ డికాక్షన్లోని యాంటీ ఆక్సిడెంట్లు మచ్చలు, మొటిమలు తొలగించడానికి సహాయపడతాయి. ముడతలను నివారిస్తాయి. బియ్యప్పిండి మర్దన వల్ల మృతకణాలు తొలగిపోతాయి. తేనెలోని పోషకాలు సహజకాంతిని ఇస్తాయి. అందుకని, వారానికి 2-3 సార్లు ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మ సమస్యలు దరిచేరవు. స్నానానికి ముందు శరీరానికంత టీ డికాక్షన్‌తో ప్యాక్ వేసుకొని, తర్వాత స్నానం చేస్తే తాజాదనం అనుభూతి కలుగుతుంది. మేనికాంతి సహజసౌందర్యంతో నిగనిగలాడుతుంది. -
చర్మకాంతికి కందిపప్పు ఫేస్ ప్యాక్
న్యూ ఫేస్ మొటిమలు, యాక్నె, నల్ల మచ్చలు ముఖం మీద ఉంటే కందిపప్పుతో తయారుచేసిన ప్యాక్ వేసుకుంటే సరైన ఫలితం కనిపిస్తుంది. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి ఈ ప్యాక్ తగినంత మాయిశ్చరైజర్‌ని అందిస్తుంది. ఫలితంగా చర్మ కాంతిమంతంగా కనిపిస్తుంది. స్టెప్ 1: అర కప్పు కందిపప్పును కడిగి కనీసం 4-5 గంటల సేపు నీళ్లలో నానబెట్టాలి. నీళ్లన్నీ వడకట్టి మెత్తగా రుబ్బాలి. దీంట్లో పావు కప్పు పాలు, టీ స్పూన్ బాదం నూనె కలపాలి. స్టెప్ 2: ముందుగా ముఖాన్ని చల్లని నీటితో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా తుడవాలి. తయారుచేసుకున్న కందిపప్పు చిక్కటి మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 20 నిమిషాల సేపు ఆరనివ్వాలి. స్టెప్ 3: ముఖాన్ని కడిగేముందు కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ మునివేళ్లతో వలయాకారంగా మృదువుగా రుద్దుతూ ప్యాక్‌ని తొలగించాలి. * ఈ ప్యాక్‌లో రోజ్‌వాటర్‌ని కూడా కలుపుకోవచ్చు. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. * యాక్నే సమస్య ఉన్న వారు మెత్తగా రుబ్బిన కందిపప్పు మిశ్రమంలో చిటికెడు పసుపు, అర టీ స్పూన్ శనగపిండి, ముప్పావు కప్పు పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖం మీద వెంట్రుకలు పోవాలంటే.... ముఖ చర్మం మీద ఉండే వెంట్రుకలను తొలగించడానికి కందిపప్పు ఫేసియల్ బాగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల కందిపప్పు, 50 గ్రాముల గంధంపొడి, నారింజ తొక్క పొడి, తగినన్ని పాలు కలిపి రాత్రంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఇవన్నీ కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ ప్యాక్‌ని ముఖానికి రాసి 15-20 నిమిషాలు ఉంచాలి. పైన కొన్ని నీళ్లు చల్లి ప్యాక్ మెత్తబడ్డాక మునివేళ్లతో వలయాకారంగా రుద్దుతూ నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. దీంట్లో ఆలివ్ ఆయిల్‌ను కూడా వాడచ్చు. -
గ్రీన్ టీతో మొటిమలూ తగ్గుతాయి!
పరిపరి శోధన ఇప్పటికే గ్రీన్ టీ వల్ల కలిగే అనేక ఉపయోగాలు చాలా మందికి తెలిసిన విషయమే. సరికొత్త అధ్యయనం వల్ల ఇప్పుడు మరో అంశం కూడా ఈ జాబితాకు తోడైంది. గ్రీన్ టీ తాగే మహిళల ముఖం నుంచి మొటిమలు తుడిచిపెట్టుకుపోతాయంటున్నారు పరిశోధకులు. మరీ ముఖ్యంగా ముక్కు, గదమ ప్రాంతాల్లోని మొటిమలు వెంటనే తగ్గిపోతాయట. గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, పోషకాలు మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. దీనికి తోడు ప్రతిరోజూ గ్రీన్‌టీ తాగడం వల్ల కేశంలోని అంకురప్రాంతంలో ఉండే నూనె స్రవించే గ్రంథుల వద్ద బ్యాక్టీరియా పెరిగేందుకు అనువుగా ఉన్న ప్రాంతంలో సైతం మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియా అంతగా పెరిగే అవకాశం ఉండదంటున్నారు తైవాన్‌లోని నేషనల్ యాంగ్ మింగ్ యూనిర్సిటీకి చెందన పరిశోధకులు. గ్రీన్-టీలోని ఎపిగాలోకేటెచిన్-3 గ్యాలేట్ (ఈజీసీజీ) అనే పోషకం ఇలా మొటిమల పెరుగుదలకు దోహదం చేసే ప్రాంతంలోనూ బ్యాక్టీరియా పెరగకుండా చేస్తుందట. దీనికి తోడు ఆ పోషకంలోని వాపు, మంట తగ్గించే (యాంటీ ఇన్ఫ్లమేటరీ) గుణం సైతం మొటిమలు రాకుండా ఉండేలా చేసేందుకు దోహదం చేస్తుందని పరిశోధకులు వెల్లడించారు. -
మొటిమల మచ్చలు తగ్గాలంటే..
బ్యూటిప్స్ * వేసవిలో ముఖ చర్మం త్వరగా జిడ్డుగా అయ్యేవారికి మొటిమలు, యాక్నె సమస్య అధికంగా ఉంటుంది. ఈ సమస్య అదుపులో ఉండటానికి ఇంట్లోనే ఉపయోగించదగిన మేలైన ప్యాక్‌లు ఇవి... * పది వేపాకులు, పది తులసి ఆకులు కొద్దిగా మంచినీళ్లు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా పెరుగు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 15 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. * బంగాళదుంపను మెత్తగా రుబ్బి రసం తీయాలి. ఈ రసంలో కొద్దిగా తేనె కలిపి ముఖానికి రాసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. యాక్నె వల్ల అయిన మచ్చలు కూడా తొలగిపోతాయి. * సపోటా తొక్క తీసి గుజ్జు చేయాలి. దీంట్లో పాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖమంతా రాసి, ఆరనివ్వాలి. తర్వాత కడిగేయాలి. రెండు-మూడు రోజులకోసారి ఇలా చేస్తూ ఉంటే చర్మం జిడ్డుగా మారదు. * బంతిపువ్వును కొద్దిగా పాలు కలిపి మెత్తగా రుబ్బాయిలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15 నిమిషాలు ఉంచాలి. తర్వాత కడిగేయాలి. మొటిమలు, తరచూ ఇలా చేస్తుంటే యాక్నె వల్ల అయిన మచ్చలు తగ్గిపోతాయి. * టీ స్పూన్ తేనెలో కొద్దిగా దాల్చిన చెక్క పొడి కలిపి మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ ఉన్న చోట రాయాలి. అర గంట తర్వాత కడిగేయాలి. ప్రతి మూడు రోజులకోసారి ఈ ప్యాక్ వేసుకోవాలి. మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ మెల్లగా తగ్గిపోతాయి. -
ముఖ కాంతికి... బియ్యం నీళ్లు!
మచ్చలు, మొటిమలు సమస్య ఉంటే ఇంట్లోనే కొన్ని చిట్కాలు పాటించి ముఖారవిందాన్ని కాంతిమంతంగా మార్చుకోవచ్చు. ♦ 3 టేబుల్ స్పూన్ల పిండిలో పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కొబ్బరి నూనె, టీ స్పూన్ నిమ్మరసం, కొద్దిగా పాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, అర గంట లేదంటే పూర్తిగా ఆరేదాకా ఉంచి శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు రోజూ కూడా ఈ ప్యాక్‌ను వేసుకోవచ్చు. ♦ బియ్యాన్ని నానబెట్టి, బాగా కడిగి.. ఆ నీటిని వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి, మెడకు రాస్తూ మృదువుగా మసాజ్ చేయాలి. ఎండవేడికి నిస్తేజంగా మారిన చర్మం తాజాగా మారుతుంది. చర్మం ముడతలు పడటం కూడా తగ్గుతుంది. ♦ మొటిమలు, యాక్నె సమస్య ఉన్నవారు దాల్చిన చెక్కను పొడి చేసి, దాంట్లో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, మృదువుగా రుద్దాలి. యాక్నె సమస్య తగ్గుతుంది. చర్మం కాంతిమంతం అవుతుంది. ♦ టీ స్పూన్ తేనె, సగం అరటిపండు , పావు కప్పు పెరుగు కలిపి మెత్తటి మిశ్రమం తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి, మృదువుగా రుద్ది, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. -
చర్మకాంతికి...
బ్యూటిప్స్ వేసవిలో చర్మం కమలడం, చమట కారణంగా జిడ్డుగా మారుతుంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ట్యాన్, మొటిమల సమస్య బాధిస్తుంటుంది. ఈ సమస్యల నివారణకు... ♦ బార్లీ గింజలను నీళ్లలో వేసి, రాత్రంగా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగాలి. అలాగే కొద్దిగా బార్లీ నీళ్లను ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల ఎండ కారణంగా కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలాగే మొటిమలు, యాక్నెసమస్యలు తగ్గుతాయి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది. ♦ టీ స్పూన్ బార్లీ పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి జీవకళ తీసుకువస్తుంది. ♦ ఒక గిన్నెలో టేబుల్ స్పూన్ చొప్పన ఉల్లి, క్యారెట్ రసం, గుడ్డు సొన, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని యాక్నె, మొటిమలు ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. యాక్నె, మొటిమలు తగ్గి ముఖం కాంతిమంతం అవుతుంది. ♦ వెల్లుల్లి రెబ్బను చిదిమి, మొటిమ అయిన చోట రాయాలి. అర గంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచాలి. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ తగ్గి, మొటిమల సమస్య బాధించదు. ♦ ఓట్స్, బాదంపప్పు పొడి, తేనె, అలొవెరా జెల్ సమపాళ్లలో తీసుకొని కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకొని, వేళ్లతో వలయకారంగా రుద్దుతూ సున్నితంగా మసాజ్ చేయాలి. తర్వాత పది నిమిషాలు వదిలేసి, చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం మృదువుగా మారుతుంది. ♦ ముల్తానీమిట్టి, తేనె, బొప్పాయిపండు గుజ్జు సమభాగాలుగా తీసుకొని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, కాంతివంతంగా కనిపిస్తుంది. -
బొప్పాయితో బోలెడంత సౌందర్యం
బొప్పాయి పండు ఆరోగ్యానికే కాదు.. అందానికీ ఎంతో ముఖ్యమైనది. ఈ బొప్పాయి ప్యాక్‌తో ఇంట్లోనే ‘ఫేషియల్ గ్లో’ సొంతం చేసుకోవచ్చు. అందులోని విటమిన్-ఎ, విటమిన్-సి, మెగ్నీషియం, పొటాషియం మీ ముఖారబిందాన్ని రెట్టింపు చేస్తాయి. డ్రై స్కిన్ ఒక గిన్నెలో రెండు బొప్పాయి పండు ముక్కల్ని చిదిమి గుజ్జులా చేసుకోవాలి. అందులో ఒక చెంచా తేనె, మూడు చెంచాల పాలు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంతో ముఖం, మెడపై ప్యాక్ వేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ప్యాక్ వేసుకున్న చోట్లను శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ డ్రై స్కిన్ (పొడి చర్మం) వారికి మంచి మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది. మొటిమలు, జిడ్డు చర్మం రెండు చెంచాల బొప్పాయి గుజ్జులో ఒక చెంచా ముల్తానీ మట్టిని కలపాలి. ఆ మిశ్రమంతో రోజు విడిచి రోజు ప్యాక్ వేసుకోవాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. అలా చేస్తే జిడ్డుతనం పోయి చర్మం నిగారిస్తుంది. పిగ్మెంటేషన్ ముఖంపై నల్ల మచ్చలతో బాధపడే వారికి బొప్పాయి పండు మంచి ఉపశమనం. రెండు చెంచాల బొప్పాయి పండు గుజ్జులో ఒక చెంచా నిమ్మరసం కలిపి రోజూ స్నానం చేసే ముందు ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే నల్లమచ్చలు తొలగిపోతాయి. -
బార్లీ బ్యూటీ
బ్యూటిప్స్ క్లెన్సర్: బార్లీ పొడిలో పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి రాసుకొని, 15 నిమిషాలు వదిలేసి తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇది స్వేదరంధ్రాలను శుభ్రపరచడమే కాకుండా, చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. రోజూ ఈ ప్యాక్ వేసుకోవచ్చు. ప్యాక్: బార్లీ గింజలను పొడి చేసి అందులో తగినన్ని నీళ్లు, కొన్ని చుక్కల నిమ్మరసం కలపాలి. దీన్ని ముఖానికి రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం గలవారికి ఇది మేలైన ప్యాక్. చర్మం కాంతిమంతం కూడా అవుతుంది. వాటర్ థెరపీ: బార్లీ గింజలను నీళ్లలో వేసి, రాత్రంతా ఉంచాలి. మరుసటి రోజు ఉదయం ఈ నీటిని తాగాలి. అలాగే కొద్దిగా నీళ్లను ముఖానికి రాసుకోవాలి. రోజూ ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం సహజకాంతితో మెరుస్తుంది. తేనెతో: టీ స్పూన్ బార్లీ పొడిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి ఇది జీవకళ తీసుకువస్తుంది. -
ముఖంపై మొటిమలు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య
పార్వతీపురం: ముఖంపై మొటిమలు వచ్చాయని ఓ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన విజయనగరం జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. పార్వతీపురంలోని వైకేఎం కాలనీకి చెందిన గెంబలి సాయితేజ(16) పట్టణంలోని ఓ ప్రై వేట్ కళాశాలలో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ద్వితీయసంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల తన ముఖంపై మొటిమలు కనిపించాయి. వాటిని పదే పదే అద్దంలో చూసుకొని మనోవేదన చెందాడు. వీటిపై తల్లిదండ్రులు, స్నేహితుల వద్ద తరచూ చెప్పి వాపోయేవాడు. మొటిమలు వచ్చినప్పటినుంచి ముఖానికి రుమాలు కట్టుకొని కళాశాలకు వెళ్తుండేవాడు. అదేమంటే మొటిమల గూర్చి మాట్లాడేవాడు. గత ఆదివారం సాయంత్రం నుంచి అకస్మాత్తుగా అదృశ్యమయ్యాడు. తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వెతికి చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం స్థానిక వైకేఎం కాలనీ శివారున గల ఓ బావిలో సాయితేజ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మొటిమలు మాయం కావాలంటే
కొన్ని తమలపాకులను మెత్తగా దంచి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి కొద్దిగా కొబ్బరి నూనె కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోండి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే మొటిమలు మటుమాయం.ముఖంపై నల్లమచ్చలు తొలగిపోవడానికి తేయాకు తైలం బాగా పని చేస్తుంది. అందుకు రెండు టీస్పూన్ల టీ పొడిని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టాలి. ఉదయమే ఆ నానిన ఆకులతో నల్లమచ్చలపై ఓ నిమిషం పాటు రుద్దాలి. తర్వాత ఆ పాలతో ముఖాన్ని కడుక్కుంటే మచ్చలు పోతాయి.మోచేతులు, మోకాళ్లు నల్లగా గరుగ్గా ఉండటం సహజం. ఆ నల్లటి మరకలను పోగొట్టుకునేందుకు అనాస పండు గుజ్జును వాటిపై అప్లై చేయండి. అయిదు నిమిషాల తర్వాత అదే గుజ్జుతో మర్దన చేసి చల్లటి నీటితో కడిగేసుకోండి. -
అందువల్లే మొటిమలు వస్తున్నాయా?
ప్రైవేట్ కౌన్సెలింగ్ నా వయుస్సు 17 ఏళ్లు. గత రెండేళ్లుగా హస్తప్రయోగం అలవాటు ఉంది. అది అలవాటైనప్పటి నుంచి నాకు ముఖం, భుజాలు, వీపు మీద మొటిమలు బాగా వస్తున్నారుు. డాక్టర్‌ను సంప్రదించి రకరకాల మందులు వాడాను. అయినా అవి వస్తున్నాయి, తగ్గుతున్నారుు. హస్తప్రయోగం చేయుడం ఆపితే మొటివులు రావడం లేదు. కానీ ఆపుకోలేక వారానికి రెండుసార్లరుునా హస్తప్రయోగం చేస్తూనే ఉన్నాను. మొటిమలు రాకుండా ఉండాలంటే ఏం చేయూలి. మొటిమల వల్ల ఎవరికీ నా ముఖం చూపించుకోలేకపోతున్నాను. నాకు తగిన సలహా ఇవ్వండి. - కే.ఆర్. చిత్తూరు మీ వయుస్సు పిల్లల్లో హార్మోన్ల ప్రభావం (ప్రధానంగా టెస్టోస్టెరాన్) వల్ల మొటివులు రావడం సాధారణం. ఈ వయుస్సులోనే హస్తప్రయోగం చేయుడం కూడా అలవాటవుతుంది. అరుుతే... హస్తప్రయోగం వల్ల మొటివులు రావు. అసలు హస్తప్రయోగానికీ, మొటివులు రావడానికి ఎలాంటి సంబంధం లేదు. కాకపోతే... పరీక్షల్లాంటి టెన్షన్లు ఉన్నా, ఏవైనా ఇతర ఒత్తిళ్లు ఉన్నా మొటివులు ఎక్కువ కావచ్చు. ఇలా మొటివులు వచ్చినప్పుడు తరచూ వుుఖం కడుక్కోకపోవడం వల్ల, వుుఖం శుభ్రత పాటించకపోవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చి అవి వురీ పెద్దగా వూరడానికి అవకాశం ఉంది. జన్యుపరమైన కారణాలవల్ల మొటివులు కొందరిలో వురీ ఎక్కువగానూ, కొందరిలో తక్కువగానూ ఉంటారుు. మొటివులు వస్తే అవి ఇన్ఫెక్ట్ కాకుండా చూసుకోవడం తప్ప... వాటికి ఇతరత్రా ఏవిధమైన చికిత్స అవసరం లేదు. అరుుతే వాటిని గిల్లడం వంటి పనులు అస్సలు చేయుకూడదు. నా వయుస్సు 26 ఏళ్లు. నాకింకా పెళ్లి కాలేదు. నాకు అంగస్తంభన కలిగినప్పుడు నా పురుషాంగం కిందికి ఒంగుతోంది. అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు అంగం అరటిపండు ఆకారంలో ఉంటోంది. దీన్ని కార్డీ అంటారని పేపర్లో చదివాను. దీనికి సర్జరీ ఒక్కటే వూర్గవుని తెలిసింది. ఆపరేషన్ ద్వారా సరి అవుతుందా? ఏ డాక్టర్‌ను సంప్రదించాలి. పెళ్లిచేసుకోవచ్చా? - పి.వి.కె., నలొండ అంగస్తంభన కలిగినప్పుడు అంగం సాధారణంగా నిటారుగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కుడి, ఎడవు పక్కలకు కొద్దిగా ఒంగి ఉన్నా పర్లేదు. కానీ ఆ ఒంపు కాస్తా... వుూత్రవిసర్జనకూ, సెక్స్ చేయుడానికి అడ్డంకిగా ఉన్నంతగా వంగి ఉంటే ఆ పరిస్థితిని కార్డీ అంటారు. వుూత్రనాళం (యుురెథ్ర)గానీ, అంగస్తంభన కలిగించే ఎరెక్టైల్ బాడీస్లోగానీ సరిగ్గా పెరుగుదల లేక తేడాలు (డిస్పారిటీస్) రావడం వల్ల ఈ కార్డీ అనే కండిషన్ వస్తుంది. ‘సర్జరీ కార్డీ కరెక్షన్’ ఆపరేషన్‌తో ఒంపును బట్టి ఓవైపు పొడవు పెంచడమో, వురోవైపు తగ్గించడమో చేసి అంగాన్ని వుళ్లీ నిటారుగా ఉండేలా సరిచేస్తారు. అరుుతే ఈ సర్జరీకి వుుందు యుూరాలజిస్టులు ఆర్టిఫిషియుల్గా ఎరెక్షన్ తెప్పించి కార్డీ తీవ్రత ఎంత ఉందో నిర్ధరణ చేస్తారు. దాన్ని బట్టే సర్జరీ చేయూల్సిన అవసరం ఉందా లేదా అన్నది నిర్ణరుుస్తారు. నాకు వరిబీజం వచ్చింది. ఆపరేషన్ అంటే భయుం. ఒక ఆర్ఎంపీని కలిస్తే ఆయున సిరంజీతో నీరు తీసేశాడు. ఇప్పుడు పొట్టలో ఎడవుపక్కన, వెనకభాగంలో వాచినట్లు అనిపిస్తోంది. ఒకసారి స్కానింగ్ కూడా తీయించుకున్నాను. టౌన్లో డాక్టర్ సవుస్య ఏమీ లేదన్నారు. కానీ నాకు వృషణాల వాపు వస్తూనే ఉంది. చాలా ఆందోళనగా ఉంది. మీరు తగిన సలహా ఇవ్వగలరు. - జే.వి.వి., విజయవాడ వరిబీజం (హైడ్రోసిల్) అంటే వృషణాల చుట్టూ నీరు చేరడం. ఈ సవుస్య ఉన్నప్పుడు శస్త్రచికిత్స చేసి అక్కడ చేరిన నీరు తొలగిస్తారు. అంతేకాదు... డాక్టర్లు ఆ నీరు వచ్చే పొరను కూడా తీసివేయుడం, లేదా వుళ్లీ వుళ్లీ నీరు రాకుండా ఆ పొరను వెనక్కు వుడతపెట్టడం కూడా చేస్తారు. ఇలా శస్త్రచికిత్స చేరుుంచుకోకుండా సిరంజీతో నీటిని తీస్తే తాత్కాలికంగా నీరు తొలగి వృషణాల సంచి సైజ్ తగ్గినట్లుగా అనిపిస్తుంది. అరుుతే కొద్దిరోజుల్లోనే వుళ్లీ నీరు చేరడం, ఒక్కోసారి రక్తం కూడా చేరడం, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రావడం జరుగుతారుు. అందువల్ల సిరంజీ ద్వారా నీరు తీరుుంచడం ఏవూత్రం వుంచిది కాదు. హైడ్రోసిల్ సవుస్య ఉంటే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేరుుంచుకోవాలి. నా వయుస్సు 41 ఏళ్లు. నాకు 22 ఏళ్ల క్రితం పెళ్లరుు్యంది. అప్పటినుంచి నేను సెక్స్‌లో ఎలాంటి అవాంతరాలు లేకుండా పాల్గొంటున్నాను. అరుుతే నాకు ఒక ఏడాది క్రితం అంగం ఎడవువైపునకు 45 డిగ్రీలు ఒంపు తిరిగింది. ఈ వంకర సెక్స్‌లో పాల్గొన్నప్పుడు వూత్రమే ఉంటోంది. ప్రస్తుతానికి దీనిల్ల సెక్స్‌కు ఎలాంటి అవరోధం లేకపోరుునా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు జరిగే అవకాశం ఉందా? ఈ వంకరకు కారణం ఏమిటి? - ఎన్ఆర్జీ, ఖమ్మం పురుషాంగం వంకరగా ఉండటం కొంతవరకు సాధారణం. దీనివల్ల సెక్స్‌లో పాల్గొనడానికి సవుస్య లేకపోతే అంగం కొంత వంకరగా ఉన్నా నష్టం ఏమీ లేదు. మీరు చెప్పిన విధంగా ఈ సవుస్య ఒక సంవత్సరం నుంచే ఉంటే కొన్నిసార్లు పెరోనిస్ డిసీజ్‌కు అయ్యేందుకు అవకాశం ఉంది. ఇందులో అంగం మీద ఒకవైపు ఉన్న లోచర్మం గట్టిపడి ఎలాస్టిక్ స్వభావం తగ్గుతుంది. యుూరాలజిస్ట్ పురుషాంగాన్ని పరీక్షిస్తే దీన్ని కనుక్కుంటారు. ఇలాంటి సవుస్య వల్ల మీకు ఎలాంటి సవుస్య లేకపోతే ఈ వంకరకు చికిత్స అవసరమే లేదు. పెరోనిస్ డిజీజ్తో సెక్స్ సావుర్థ్యానికి లోపం ఉండదు. ఒకవేళ చికిత్స తీసుకోవాలనుకున్నా యుూరాలజిస్ట్ ద్వారా పొందవచ్చు. నా వయస్సు 28 ఏళ్లు. నా పురుషాంగంపైన అంటే ముందు ఉండే గుండ్రటి భాగంలో చిన్న చిన్న బుడిపెలు ఉన్నాయి. ఎందువల్ల వచ్చాయో తెలియడం లేదు. నాకు చాలా ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి. - సీహెచ్.ఎస్., కరీంనగర్, పురుషాంగం ముందు భాగం (గ్లాన్స్) మీద చిన్న చిన్న బుడిపెలు ఉండటం చాలా సాధారణం. ముఖం మీద మొటిమల్లాగే వీటిల్లోంచి కూడా స్రావాలు తయారవుతూ ఉంటాయి. కొందరికి అవి చుట్టూరా తెల్లగా బుడిపెలు, బుడిపెలుగా సాధారణం కంటే పెద్దగా ఉండవచ్చు. గట్టిగా నొక్కితే తెల్లటి స్రావం కూడా వస్తుంది. ఇవన్నీ చాలా సాధారణం. చాలామంది వీటిని ఇన్ఫెక్షన్ అనుకుంటారు. నొప్పి, మంట, దురద లేకుంటే ఈ చిన్న బుడిపెల గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. -
మొటిమలు, మచ్చలు పోవాలంటే...
బ్యూటిప్స్ ముఖంపై మృతకణాలను ఎప్పటికప్పుడు తొలగించుకోకుంటే మొటిమలు, మచ్చలు లాంటి సమస్యలు తలెత్తుతాయి. అలా కాకుండా ఉండాలంటే ఇంట్లో ఆరోగ్యకరమైన స్క్రబ్‌ను తయారు చేసుకోవచ్చు. అందుకు మూడు టీస్పూన్ల బేకింగ్ సోడాలో ఒక టీస్పూన్ ఓట్స్ వేసి కొన్ని నీళ్లతో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. రోజూ ఆఫీసు నుంచి ఇంటికి రాగానే ఈ మిశ్రమంతో ముఖాన్ని స్క్రబ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చుండ్రు చూడటానికి చిన్న సమస్యగా ఉన్నా అది చేసే అనర్థాలు ఎన్నో. కాబట్టి యాంటీ డాండ్రఫ్ షాంపు మీకు ఏ విధంగాను పని చేయకపోతే ఈ చిట్కాను ట్రై చేయండి. తల స్నానం చేసే గంట ముందు మాడుకు పెరుగులో మిరియాల పొడి కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. తర్వాత కుంకుడు రసంతో తలను శుభ్రం చేసుకుంటే చుండ్రు మటుమాయం అవుతుంది. మోకాళ్లు, మోచేతులు నల్లగా, గరుకుగా ఉండటం చూసేవాళ్లకు అసలు బాగుండదు. అందుకు నారింజ పండ్లను గుజ్జుగా చేసి అందులో కొబ్బరినూనె పోసి అరగంట పాటు నానబెట్టి దాన్ని రాసుకోవాలి. అది కడుక్కోకుండానే శనగపిండి, తేనె, పాలు కలిపిన మిశ్రమాన్ని ప్యాక్‌లా వేసుకోవాలి. అది ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కుంటే నలుపుదనం పోతుంది. -
మొటిమలకు పుదీనా...
బ్యూటిప్స్ అదేం చిత్రమో ఏమో.... రాత్రి నిద్రపోయే ముందు అందంగా ఉన్న ముఖంపై రాత్రికి రాత్రే మొటిమలు పుట్టుకొస్తుంటాయి. ఉదయం లేచిన వెంటనే వాటిని చూసి భయం కానీ బాధ కానీ పడాల్సిన అవసరం లేదు. చిన్న ఇంటి చిట్కాతో పరిష్కారం పొందొచ్చు. కొన్ని తులసి ఆకులు, పుదీనా ఆకులు తీసుకొని వాటిని బాగా పిండాలి. ఆ రసంలో ఒక నిమ్మకాయ పిండి ఆ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. అది ఆరాక ముఖాన్ని కడుక్కోవాలి. ఈ చిట్కా మంచి ఫలితాన్ని ఇస్తుంది. ముఖంపై చర్మం గరుకుగా ఉన్నవారు దాని నుంచి బయట పడటానికి పెద్దగా శ్రమించాల్సిన పని లేదు. ఇంట్లో క్యాబేజీ వండేటప్పుడు దాని నీళ్లలో ఉడికిస్తారు. అప్పుడు ఆ నీటిని పడేయకుండా ఓ గిన్నెలో తీసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకుంటూ కడుక్కుంటే చాలు. ముఖం మృదువుగా మారడంతో పాటు చక్కటి రంగు వస్తుంది. ముఖంపై కాలిన గాయాలు, మొటిమలు తగ్గాక కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి. వాటిని పోగొట్టే మార్గం తెలియక చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు ఈ చిట్కా పాటించి చూడండి. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాసుకోండి. ఆ తర్వాత తేడా మీకే తెలుస్తుంది. -
మోటుమలు
పింపుల్స్ యుక్తవయసులో వచ్చే సాధారణ సమస్య మొటిమలు. కౌమారం నుంచి యుక్తవయసులోకి వస్తుండగా... నునుపైన ముఖం కాస్తా ‘మోటు’గా మారి ఎదుటివారికి తాము అందంగా కనిపించడం లేదనే ఆందోళన కలిగిస్తుంది. అయితే కొందరిలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంటుంది. ముఖం మోటుగా ఉండటం ఎవరికి మాత్రం ఇష్టం. అందరికీ కష్టం. అందునా లుక్స్ కోసం బాధపడే ఆ వయసులో మానసికంగానూ నష్టం. మొటిమల మోటుదనం నుంచి ఊరట పొంది ముఖాన్ని నునుపుగా ఎలా రూపుదిద్దుకోవచ్చో చూద్దాం. మొటిమలు రావడానికి నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి... 1) జిడ్డు స్వభావంతో కూడిన చర్మం (ఆయిలీ స్కిన్) 2) చర్మంపై ఉండే స్వేద రంధ్రాలు పూడుకుపోవడం 3) చర్మంపైని స్వేద రంధ్రాలలో బ్యాక్టీరియా చేరడం 4) ఇన్ఫ్లమేషన్ (నొప్పి, వాపు, మంట). సాధారణంగా చర్మకణాలు పుట్టే క్రమంలో చర్మంపై ఉండే స్వేదరంధ్రాలు పూడుకుపోతాయి. దాంతో అక్కడ చర్మాన్ని తేమగా ఉంచేందుకు పుట్టే స్రావమైన ‘సెబమ్’ బయటికి రావడానికి మార్గం ఉండదు. ఫలితంగా అక్కడ పేరుకున్న ‘సేబమ్’ బ్యాక్టీరియా పెరుగుదలకు మరింత దోహదపడుతుంది. ఫలితంగా అక్కడ వాపు వస్తుంది. ఇలా మొటిమలు వస్తుంటాయి. చాలా సందర్భాల్లో యుక్తవయసుకు రాగానే పెరిగే పురుష హార్మోన్లు మొటిమలకు కారణం అనే ఒక అభిప్రాయం ఉంది. కానీ ఇది అపోహ మాత్రమే. ఎందుకంటే మొటిమలు ఉన్న మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ పాళ్లను పరిశీలిస్తే అవి నార్మల్‌గా ఉండాల్సిన మోతాదులోనే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే యుక్తవయసులో ఉన్న ఆడపిల్లల్లో ఈ హార్మోన్ పాళ్లు పెరగడం వల్ల రుతుక్రమం సక్రమంగా రాకపోవడం, అవాంఛిత రోమాలు కనిపించవచ్చు. అందుకే దాదాపు 25 ఏళ్లు దాటిన మహిళల్లో మొటిమలు రావడం జరుగుతుంటే వాళ్లలో హార్మోన్ అసమతౌల్యత ఉన్నట్లు అనుమానించాలి. పాలిసిస్టిక్ ఓవరీ అనే కండిషన్లో మహిళల్లో మొటిమలు చాలా ఎక్కువగా వస్తాయి. పైగా ఇవి చికిత్సకు ఒక పట్టాన లొంగవు. అందుకే మొటిమలు ఉన్న పురుషులలో కంటే మహిళల్లో హార్మోన్ల అసమతౌల్యతకు అవకాశాలు ఎక్కువ అని తెలుస్తుంది. కొన్ని రకాల మందులు, గర్భనిరోధక మాత్రలు వాడటం వంటివి మొటిమలను ఎక్కువగా వచ్చేలా చేస్తాయి. కొన్నిసార్లు సౌందర్యసాధనాల (కాస్మటిక్స్) వల్ల కూడా మొటిమలు రావచ్చు. వ్యాధిగానే చూడాలి: చాలామంది తల్లిదండ్రులు దీన్ని ఒక వ్యాధిగా పరిగణించరు. కానీ చర్మానికి సంబంధించిన ఒక రుగ్మతగానే దీన్ని చూడాలి. సాధారణంగా ముఖం మీద, కొందరిలో ఛాతీ, వీపు మీద కనిపించే ఈ మొటిమలు చాలా తక్కువ తీవ్రత (మైల్డ్) మొదలుకొని తీవ్రమైన (సివియర్) వరకు వేర్వేరు స్థాయుల్లో కనిపిస్తాయి. కొందరిలో మొటిమల తీవ్రత ఎంతగా ఉంటుందంటే అది కొన్ని జీవ వ్యవస్థలను సైతం ప్రభావితం చేసేంతగా! మొటిమ తన తొలిదశలో చిన్న బొడిపెలా కనిపిస్తుంది. దీని చివరిభాగం మూసుకుపోయి తెల్లగా కనిపిస్తుంది. ఆ తర్వాతి దశలో దీని చివరిభాగం నల్లగా మారి, తెరచుకుని కూడా ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఇది ఎర్రగా బాగా ఉబ్బిపోయి లేదా వాపుతో కనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో చర్మం గట్టిబారి పోయి ఒక పెద్దబొడిపె (నాడ్యూల్) లా అనిపించవచ్చు. ఇలా ముఖమంతా అనేక దశల్లోని మొటిమలు కనిపిస్తూ ఉండవచ్చు. ముఖం మీద ఉన్న గాట్లు వంటి భాగాలు, మచ్చలు (స్కార్స్) ఆధారంగా వీటిని ఐదు గ్రేడ్స్‌గా విభజించి చూస్తారు. కొందరిలో ఇవి నీరు నిండినట్లుగా గట్టి పెద్ద బొడిపె మాదిరిగా (నాడ్యులో-సిస్టిక్) పుండ్లలా కనిపిస్తూ జ్వరం, కీళ్లనొప్పులు కూడా కనిపించవచ్చు. నివారణకు ఉపయోగపడే క్లెన్సర్స్ ఇవి మొటిమల నివారణ కోసం ముఖం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మార్కెట్లో మొటిమలను నివారించడానికి చాలా క్లెన్సర్స్ లభ్యమవుతున్నాయి. ఇవి సబ్బులు, లిక్విడ్ ఫేస్‌వాష్‌ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ఉపయోగిస్తూ, ముల్తానీ మిట్టీ లాంటి వాటితో ఫేస్‌ప్యాక్‌లా వేస్తూ జిడ్డు చర్మం (ఆయిలీ స్కిన్) ఉన్నవారిలోని జిడ్డుపాళ్లను తగ్గించవచ్చు. అయితే మొటిమలు ఒకింత ఎక్కువగా ఉన్నవారు ముఖాన్ని శుభ్రపరచుకునేందుకు ఫేషియల్ స్క్రబ్ వాడకపోవడమే మంచిది. పూతమందులతో చికిత్స: మొటిమలు ఉన్న స్థాయిని, తీవ్రతను బట్టి పూత మందుల్లో అనేక రకాలు లభ్యమవుతున్నాయి. ఉదాహరణకు రెటినాయిడ్స్ అనే పూత మందులు స్వేదరంధ్రాలు పూడుకుపోయిన మొటిమలకు బాగా ఉపయోగపడతాయి. ఇక రెటినాయిడ్స్‌తో పాటు క్లిండమైసిన్, అజిథ్రోమైసిన్, నాడిఫ్లోక్లసిస్ వంటి యాంటీబయాటిక్స్ పూతమందులుగా లభ్యమవుతున్న కాంబినేషన్లు మొటిమలపై మరింత ప్రభావపూర్వకంగా పనిచేస్తాయి. అయితే కొన్ని రెటినాయిడ్ కాంబినేషన్ పూత మందుల వల్ల చర్మంపై మంట, చర్మం ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. దీన్ని తగ్గించడానికి అవి పూసి ఉంచాల్సిన వ్యవధిని తగ్గించడం, వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ వాడటం మేలు. ఒకవేళ పూతమందులతో మొటిమలు 6-8 వారాలు గడిచినా తగ్గనప్పుడు పూతమందులతో పాటు నోటిద్వారా తీసుకునే మందులు వాడాలి. ఓరల్ థెరపీ : ఒకింత తీవ్రత కలిగిన మొటిమలు మొదలుకొని తీవ్రమైన మొటిమలకు పూతమందులతో పాటు... నోటి ద్వారా తీసుకోవాల్సిన అరిథ్రోమైసిన్, అజిథ్రోమైసిన్, డాక్సిసైక్లిన్, మినోసైక్లిన్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ఇవి మూడు వారాల పాటు వాడాక కూడా ఫలితం కనిపించకపోతే చికిత్స వ్యవధిని కొన్ని వారాల నుంచి నెలల వరకు పొడిగించాలి. యాంటీబయాటిక్స్‌తో కూడా ఫలితం లేనప్పుడు ఐసోట్రెటినియాన్ వంటివి మొటిమల చికిత్సలో మంచి ఫలితాలను ఇచ్చే మందులుగా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. తీవ్రమైన మొటిమల కోసం యాంటీబయాటిక్స్ కూడా ఉపయోగపడనప్పుడు వీటిని 16 వారాలపాటు వాడాలి. మొటిమలకు కారణాలు ఏవైనప్పటికీ వాటితో నిమిత్తం లేకుండా ఫలితం చూపే మంచి మందులివి. వాటితో పాటు ఇప్పుడు చవగ్గానే లభించే డర్మారోలర్, హైస్ట్రెంత్ ట్రైక్లోరో అసిటిక్ యాసిడ్‌ను పూసే చికిత్సలూ అందుబాటులో ఉన్నాయి. శస్త్రచికిత్స: ఇక ముఖంపైన మచ్చలు, గాట్లు మిగిలిపోయినవారికి ఒక్కోసారి వాటి తీవ్రతను బట్టి శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. చికిత్స అవసరం: చాలామంది తల్లిదండ్రులు యుక్తవయసులోని తమ పిల్లలకు మొటిమలు వస్తున్నప్పుడు కొంత వయసు తర్వాత అదే తగ్గిపోతుందంటూ చికిత్స ఇప్పించరు. ఇది సరికాదు. తీవ్రమైన మొటిమలు ఉన్నప్పుడు అవి ముఖం మీద గాట్ల వంటి మచ్చలను ఏర్పరుస్తాయి. అవి ఎదిగే వయసులోని పిల్లల్లో తీవ్రమైన న్యూనతను కలిగిస్తాయి. కాబట్టి ఆ వయసు పిల్లల ఎదిగే మానసిక ఆరోగ్య వికాసాన్ని దృష్టిలో ఉంచుకుని, మంచి నాణ్యమైన జీవితం కోసం, ఆత్మవిశ్వాసం పొందించండం కోసం మొటిమలకు చికిత్స అవసరం. ఈ చికిత్స ఎంతగా జరిగితే మచ్చలను అంతగా రాకుండా చూడవచ్చు. చాలా తక్కువ తీవ్రతతో (మైల్డ్‌గా) ఉన్న మొటిమలకు పైపూతగా వాడే మందులు, క్లెన్సర్లు అందుబాటులో ఉంటాయి. అయితే మొటిమలు తీవ్రంగా ఉన్న సందర్భాల్లో పూతమందుల (టాపికల్ మెడిసిన్స్)తో పాటు నోటి ద్వారా తీసుకోవాల్సిన మందులు (ఓరల్ మెడిసిన్స్) కూడా వాడాల్సి ఉంటుంది. -
ఎండాకాలం ముఖ కాంతి...
బ్యూటిప్స్ * ఎండాకాలం చర్మం ఇరిటేషన్‌కు లోనై దద్దుర్లు వస్తుంటాయి. జిడ్డుగా ఉన్న ముఖ చర్మం మరింత జిడ్డుగా మారుతుంది. మొటిమలు పెరగడం, జీవం కోల్పోవడం వంటి సమస్యలు విసిగిస్తాయి. వీటికి విరుగుడుగా.. * మూడు టీ స్పూన్ల దోసరసం, రెండు టీ స్పూన్ల అలొవెరా జెల్, టీ స్పూన్ పెరుగు కలిపి ముఖానికి, మెడకు పట్టించి, పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. * ఎండవల్ల కందిపోయిన, రసాయనాల వల్ల ర్యాష్ ఏర్పడిన చర్మానికి ఈ ప్యాక్ సహజమైన సౌందర్యలేపనంలా పనిచేస్తుంది. * టీ స్పూన్ గోధుమపిండిలో పచ్చిపాలు కలిపి ముఖానికి పట్టించి స్క్రబ్ చేయాలి. పాలు చర్మంలో బాగా ఇంకాయనిపించాక చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం కోల్పోయిన చర్మానికి ఈ ప్యాక్ వల్ల మంచి కాంతి లభిస్తుంది. * బార్లీ పొడిలో పచ్చిపాలు కలిపి పేస్ట్ చేయాలి. దీంట్లో కొద్దిగా ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. ఎండదెబ్బకు కందిపోయిన చర్మానికి జీవకళ వస్తుంది. * కొబ్బరి నీళ్లను వేళ్లతో అద్దుకుంటూ ముఖానికి అప్లై చేస్తూ, మసాజ్ చేసుకోవాలి. పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఎండ వల్ల నిస్తేజంగా మారిన ముఖ చర్మం మిలమిలలాడుతుంది. -
డర్మటాలజీ కౌన్సెలింగ్
నాకు ముఖం నిండా విపరీతంగా మొటిమలు వస్తున్నాయి. ఇవి ఇలా ఎందుకు వస్తున్నాయి. దీనికి చికిత్స ఏమిటి? - వైదేహి, ఖమ్మం సాధారణంగా యువతీయువకుల కౌమార దశలో మొటిమలు వస్తుంటాయి. ఇవి ముఖం మీదే కాకుండా ఛాతీ, వీపు మీద కూడా కనిపిస్తుంటాయి. మన చర్మం మీద ఉంటే స్వేదగ్రంధుల ఖాళీలలో ఒక రకమైన నూనె స్రవించే గ్రంథులు కూడా ఉంటాయి. ఈ స్వేదగ్రంథుల ఖాళీలు నూనె, చర్మానికి సంబంధించిన మృతకణాల లేదా బ్యాక్టీరియాతో నిండితే మొటిమలు వస్తుంటాయి. మొటిమలకు చికిత్స అన్నది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. వీటి తీవ్రత, ఎంతకాలంగా అవి వస్తున్నాయి వంటి అనేక అంశాల ఆధారంగా చికిత్స చేస్తారు. మీరు ఒకసారి మీకు దగ్గర్లో ఉన్న డర్మటాలజిస్ట్‌ను కలవండి. నేను గత కొంతకాలంగా హెల్మెట్ వాడుతున్నాను. ఇటీవలే నా తలవెంట్రుకలు రాలిపోవడం గమనించాను. బట్టతల వస్తోంది. ఇలా వెంట్రుకలు రాలడానికి హెల్మెటే కారణమా? నా బట్టతలకు చికిత్స విషయంలో చేయాలో సూచించగలరు. - కిరణ్, కొత్తపేట హెల్మెట్ వాడటానికీ జుట్టు రాలిపోవడానికి ఎలాంటి సంబంధమూ లేదు. పైగా హెల్మెట్ వల్ల తలకు రక్షణ కలుగుతుంది. మీ జట్టు రాలిపోతుందంటే బహుశా మీ జన్యువుల ప్రభావమే కారణం కావచ్చు. ఇటీవల పురుషుల్లో వచ్చే బట్టతలకు ఫెనస్టెరైడ్ మినాక్సిడిల్, పీఆర్పీ వంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అయితే మీ పూర్తి మెడికల్ హిస్టరీని అధ్యయనం చేసి, మీ బట్టతలకు ఇతరత్రా కారణాలు ఏవైనా ఉన్నాయా అని తెలుసుకోవాలి. ఆ తర్వాతనే పైన పేర్కొన్న మందులను తప్పనిసరిగా డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే వాడాల్సి ఉంటుంది. మీరు మీకు దగ్గరలోని అనుభవజ్ఞులైన డర్మటాలజిస్టును కలవండి. -
మొటిమలు తుడిచి... మెటికలు విరిచి!
చాలామంది తల్లిదండ్రులు టీనేజ్‌లో మొటిమలు రావడం సహజమే అనుకుంటారు. కానీ ఆక్నేకి ఆ సమయంలోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీనికి మెడికల్ ట్రీట్మెంట్, కెమికల్ ట్రీట్మెంట్, లేజర్ ట్రీట్మెంట్ ఉంటాయి. ప్రీతి ఆ రోజు స్నేహితురాళ్లతో కలిసి క్లాస్ డే ఫంక్షన్లో పాల్గొనాలి. పద్నాలుగేళ్ల ఆ అమ్మాయి చాలా ఉద్వేగంగా ఉంది. అందునా త్రైమాసిక పరీక్షలూ పూర్తికావడంతో క్లాస్‌లో జరగబోయే వేడుకలపై పూర్తి దృష్టి కేంద్రీకరించవచ్చన్న ఆనందం కూడా. ఆ తర్వాత క్లాస్డే ఫంక్షన్ తర్వాత కొన్ని రోజులు సెలవలు కూడా. దాంతో రెట్టించిన ఉత్సాహంతో ఉంది. క్లాస్‌కు వెళ్లడానికి తయారవుతూ అద్దంలో చూసుకుని అకస్మాత్తుగా నిరుత్సాహపడిందా అమ్మాయి. కారణం... ఆమె కుడి బుగ్గ మీద ఎర్రగా చిన్న ఉబ్బు. పరిశీలించి చూసి అది మొటిమ అని గ్రహించింది. అంతే... ఆమె ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయ్యింది. ఆ చిన్న కారణంతోనే పూర్తిగా నిరుత్సాహానికీ, నిర్వేదానికీ లోనై ఆవేళ పార్టీ ఎగొట్టింది. అచ్చం ప్రీతిలా ఫీలయ్యే టీనేజీ పిల్లలు ఎందరో! వాళ్ల అందం పట్ల, లుక్స్ పట్ల కాస్త అనుమానం వచ్చినా చాలు ఎంతో డీలా పడిపోతారు. మానసికంగా కుంగిపోతారు. ఆ వయసులో మొటిమలు చాలా సాధారణమైనవన్న విషయాన్ని జీర్ణించుకోలేరు. చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు... బాల్యం దాటి అలా యుక్తవయసులోకి ప్రవేశిస్తుండగానే వాళ్ల ముఖాలు, బుగ్గలపై మొటిమలు మొదలైపోతాయి. బుగ్గలపై మొటిమలు రావడానికి ముఖంపై ఉండే ‘పైలో సబేషియస్ యూనిట్’ అనే వ్యవస్థ చాలా చురుగ్గా పనిచేయడమే. ముఖంపై ఉండే ‘సబేషియస్ గ్రంథులు’ ముఖంపై నూనె వంటి పదార్థాన్ని స్రవిస్తుంటాయి. ఒక్కోసారి ఈ గ్రంథుల చివర్లు మూసుకుపోతాయి. దాంతో నూనె వంటి పదార్థం లోపలే చిక్కుకుపోతుంది. దాంతోపాటు అక్కడ బ్యాక్టీరియా పెరిగి ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. అది క్రమంగా చీము పేరుకుపోడానికి కూడా కారణం కావచ్చు. ఇలా మొటిమ (ఆక్నే) అభివృద్ధి చెందుతుంది. యుక్తవయసులో కనిపించే సాధారణ మొటిమలు (ఆక్నే వల్గారిస్) బాల్యం దాటి కౌమార్యం ప్రవేశించేనాటికి ఈ మొటిమలు మొదలవుతుంటాయని మొదటే చెప్పుకున్నాం. ఎందుకంటే బాల్యం నుంచి కౌమార దశలోకి ప్రవేశించే సమయంలో కొన్ని రకాల కొత్త హార్మోన్ల ఉత్పత్తి శరీరంలో ప్రారంభమవుతుంది. మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పన్నం కావడం మొదలువుతుంది. దీంతో మగపిల్లల్లో సెబేషియస్ గ్లాండ్స్ ప్రభావితమై, తీవ్రంగా పనిచేయడం ప్రారంభిస్తాయి. (హైపర్ ఆక్టివ్ అవుతాయి). ఆ గ్రంథుల్లోంచి ‘సెబమ్’ అనే నూనెవంటి పదార్థం స్రవిస్తుంది. అయితే ఈ గ్రంథుల చివర్లలో ఉన్న కణజాలం మృతిచెంది ఆ నూనెవంటి పదార్థాన్ని బయటకు రాకుండా ఆపినప్పుడు, నూనె గ్రంథి మూసుకుపోయి మొటిమ వస్తుంది. దీన్ని గిల్లినప్పుడు సీబమ్ బయటకు వచ్చేసి, అక్కడ చిన్న గుంట మిగిలిపోతుంది. ఆక్నే (మొటిమల)లో రకాలు 1. నియోనేటల్ ఆక్నే: అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా మొటిమలు వస్తాయి. పిల్లల రక్తంలో మిగిలిన తల్లుల రక్తం అవశేషాల వల్ల ఇలా అప్పుడే పుట్టిన పిల్లల్లో మొటిమలు వస్తాయి. దీన్నే నియోనేటల్ ఆక్నే అంటారు. 2. ఇన్‌ఫ్యాంటైల్ ఆక్నే : ఇది మూడు నుంచి ఆరు నెలల పిల్లల్లో వచ్చే అరుదైన మొటిమలు. పిల్లలు పెరుగుతూ పోతూ ఉన్న కొద్దీ ఇవి చాలా ఎక్కువ సంఖ్యలో పెరిగిపోవచ్చు. 3. ఆక్నే వల్గారిస్ : ఇవి మనకు సాధారణంగా కనబడే మొటిమలు. బాల్యం నుంచి యుక్తవయసులోకి ప్రవేశించిన పిల్లల్లో కనిపించే మామూలు మొటిమలు. వీటిని వైద్య పరిభాషలో ‘ఆక్నే వల్గారిస్’ అంటారు. ఇవి పిల్లల్లో తరచూ కనిపిస్తాయి. యుక్తవయసులో స్రవించడం మొదలుపెట్టే ‘హార్మోన్లే’ వీటికి ప్రధాన కారణం. ఇప్పుడు మనం ఈ కథనంలో విపులంగా చర్చించబోయేది ప్రధానంగా యుక్తవయసులో వచ్చే ఈ మొటిమల గురించే. ఎందుకంటే యుక్తవయసులోకి రాగానే తమ లుక్స్ గురించి ఆడపిల్లలూ, మగపిల్లలూ అందరు బెంగపడేది ప్రధానంగా వీటి గురించే కాబట్టి. 4. అడల్ట్ ఆక్నే: ఇవి కౌమార వయసులో వచ్చే ఆక్నేకు కొనసాగింపుగా వస్తూ ఉండేవి. అయితే కొందరిలో కౌమారంలో రాకపోయినా ఆ తర్వాతి దశలో ఇవి రావచ్చు. ఇవి ప్రధానంగా మహిళల్లో ఎక్కువ. ఎందుకంటే వాళ్లలో సాధారణంగా అనేక రకాల హార్మోన్లు స్రవిస్తాయి. వాటి అసమతౌల్యతల కారణంగా అడల్ట్ ఆక్నే మహిళల్లోనే ఎక్కువ. ఇవి ఎక్కువ దవడ కింది భాగంలో, చుబుకం, ప్రధాన ముఖానికి పక్క భాగంలో (పెరీఓరల్) ఎక్కువగా కనిపిస్తాయి. 5. ఆక్నే కంగ్లాబేట్ : ఇవి మొటిమల్లో చాలా తీవ్రమైన రకం. ఇవి యువకుల్లో, యువతుల్లో కనిపిస్తాయి. సాధారణంగా ముఖానికి పరిమితం కాకుండా ఛాతీ, భుజాలు, వీపు, పిరుదులు... ఇలా అన్ని శరీర భాగాల్లో వస్తాయి. ఇవి ఒక్కోసారి బ్యాక్టీరియల్ (గ్రామ్ పాజిటివ్ బాక్టీరియా) ఇన్ఫెక్షన్ రూపాన్ని తీసుకోవచ్చు. ఇక ఇవి వచ్చినప్పుడు ఆయా భాగాల్లో పెద్ద మచ్చలు ఏర్పడతాయి. 6. ఆక్నే ఇన్వర్సా : వీటినే హైడ్రెడినైటిస్ సప్యురేటివా అని కూడా అంటారు. తీవ్రంగా వచ్చే మొటిమలు మళ్లీ మళ్లీ తిరగబెట్టడాన్ని ఇలా అభివర్ణిస్తారు. సాధారణంగా ఇవి తొడలు, చంకలు, మర్మావయవాలు కలిసే ముడుతలు (గ్రోయిన్), రెండు పిరుదుల మధ్య భాగంలో వస్తాయి. చాలా శ్రద్ధతో తీవ్రమైన చికిత్స చేయడం వల్లనే తగ్గడం సాధ్యం. 7. ఆక్నే ఫల్మినన్స్ : ఇవి తీవ్రమైన సిస్టిక్ ఆక్నే. అంటే గుల్లలుగా వచ్చే మొటిమలు అన్నమాట. ఇవి ప్రధానంగా రక్తస్రావం అవుతూ ఉండే కండర భాగాలతో పాటు మొటిమలుగా పైకి తేలి కనిపిస్తుంటాయి. ఇవి ప్రధానంగా పుండ్లలా కనిపిస్తాయి. ఇవి ఒక్కోసారి ఆర్థరైటిస్ వచ్చిన వారిలో ఎక్కువగా కనిపిస్తాయి. 8. ఆక్నే కాస్మటికా : కొన్ని రకాల కాస్మటిక్ పదార్థాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల వచ్చే మొటిమలు ఇవి. ఉదాహరణకు లానోలిన్, వెజిటబుల్ ఆయిల్స్, బ్యుటైల్ స్టియరైట్, లారిల్ ఆల్కహాల్, ఆలియాక్ ఆసిడ్ వంటివి. 9. ఐట్రోజెనిక్ ఆక్నే : కొన్ని రకాల మందులు వాడిన తర్వాత కనిపించే మొటిమలు ఇవి. ఉదాహరణకు... కార్టికోస్టెరాయిడ్స్, యాంటీసెప్టిక్స్, యాంటీ డిప్రెసెంట్స్, యాంటీ సైకోటిక్స్, యాంటీ ట్యూబర్కులోన్స్, యాంటీ నియోప్లాస్టిక్ (యాంటీ క్యాన్సర్), యాంటీవైరల్, కాలమైన్, కొన్ని రకాల విటమిన్ మాత్రలు (ప్రధానంగా విటమిన్ బి12, బీ కాంప్లెక్స్) రకాలకు చెందినవి వాడాక ఇవి కనిపిస్తుంటాయి. 10. ఆక్నే ఎక్స్గోరి: ఇవి ఒత్తిడి కారణంగా కనిపించే మొటిమలు. వీటిని గట్టిగా ఒత్తడం, గిల్లడం వల్ల ఇవి మరింత తీవ్రమవుతాయి. ప్రధానంగా మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొనే మహిళల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తుంటాయి. మొటిమలు... లక్షణాలు మొటిమల్లో ప్రధానంగా నాలుగు గ్రేడ్స్ ఉంటాయి. అవి... గ్రేడ్ - 1 : (కొమెడోజెనిక్) : ఈ దశలో ఉన్న మొటిమను వైట్ హెడ్ లేదా బ్లాక్ హెడ్ అని పిలుస్తారు. దీని బయటి చివరి భాగం (మూతి భాగం) మూసుకుపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఇది తెల్లరంగులో గడ్డగట్టుకుపోయిన చిన్న బంతి ఆకృతిలో కనిపిస్తుంది. ఒక్కోసారి మన బాల్‌పాయింట్ పెన్లోచి చివరి టిప్ సైజ్‌లో ఈ వైట్‌హెడ్ ఉంటుంది. ఒకవేళ మూతి చివరి చర్మకణాలు చనిపోయి నల్లగా మారిపోతే దాన్ని బ్లాక్హెడ్గా అభివర్ణిస్తారు. గ్రేడ్ - 2 : (పాప్యులర్ ఆక్నే) : ఈ దశలో మొటిమలో కొద్దిపాటి వాపు, మంట (ఇన్ఫ్లమేషన్) కనిపిస్తుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ కనిపించే దశను పాపులర్ ఆక్నే అంటారు. ఈ దశలో ఇది చిన్నగా ఎర్రగా బయటికి తన్నుకొని వచ్చినట్టు కనిపిస్తుంది. గ్రేడ్ - 3 : (పస్టులార్ ఆక్నే): ఈ దశలో ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా ఈ దశలో ప్రాపియోనిక్ బ్యాక్టీరియా అనే ఒక తరహా బ్యాక్టీరియా ఆ మొటిమకు తోడవుతుంది. ఈ దశలో మొటిమలో ఇన్ఫ్లమేషన్కు తోడుగా చీము చేరుతుంది. దాంతో ఎర్రటి ఉబ్బుకు వచ్చిన భాగం మీద తెల్లటి చీము కనిపిస్తూ ఉంటుంది. గ్రేడ్ - 4 : (సిస్టిక్ ఆక్నే) : ఒకవేళ పైన పేర్కొన్న పుస్టులార్ ఆక్నే మరింత తీవ్రమైనప్పుడు అది చిన్న నాడ్యూల్‌గా (నీటి తిత్తిగా) మారిపోయి, బయటకు తన్నుకు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఇందులో ఇన్ఫ్లమేషన్తో పాటు, చీము, నొప్పి, నీటిగుల్ల... ఇవన్నీ కలిపి ఉన్నందున మొటిమ తాలూకు తీవ్రమైన రూపంగా పరిగణిస్తారు. కొన్ని మొటిమల్లో మొదటి గ్రేడ్ నుంచి నాలుగో గ్రేడ్ వరకూ ఒకే మొటిమలోనే అన్ని దశలూ కనిపించవచ్చు. ఈ తరహా మొటిమలు ముఖం, ఛాతీ, భుజాలు, వీపు... ఇలా అన్ని భాగాల్లో రావచ్చు. తీవ్రతరం చేసే మరిన్ని అంశాలు మురికిగా ఉండే సెల్ఫోన్లు : టీనేజి పిల్లల్లో మొటిమలు వస్తున్నప్పుడు వారు మురికిగా ఉండే సెల్ఫోన్లు వాడితే మొటిమల సమస్య మరింత తీవ్రమవుతుంది. ఈ వయసు పిల్లలు తాము వాడే సెల్‌ఫోన్ ఉపరితలాన్ని, స్క్రీన్‌ను శుభ్రంగా తుడిచి ఉపయోగిస్తుండాలి. హెయిర్ స్ప్రే ల వాడకం : ఈ వయసు పిల్లలు హెయిర్ స్ప్రేలు, హెయిర్ స్టిఫెనర్లు, తలకు రంగులు, స్రెచ్లు, జెల్లు, క్రీములు వంటివి ఎక్కవగా వాడుతుంటారు. ఒక్కోసారి వీటి వల్ల సమస్య మరింత తీవ్రం కావచ్చు. ఇలాంటి సమయాల్లో మొటిమలు నుదుటి భాగంలో కనిపించడం చాలా సాధారణం. చాలా రకాల కాస్మటిక్స్ వాడకం : కొందరు తాము మరింత అందంగా కనిపించాలనే ఉద్దేశంతో అనేక రకాల కాస్మటిక్స్ వాడుతుంటారు. ఇలా రకరకాల కాస్మటిక్స్ వాడేవారిలో (వాళ్లు మగపిల్లలైనా, ఆడపిల్లలైనా) వాళ్లు ఉపయోగించే పదార్థాలలో కొమిడొజెనిక్ ఏజెంట్స్ అని పిలిచే లెనోలిన్, వెజిటబుల్ ఆయిల్స్, బ్యూటల్ స్ట్రియటైట్, లారిల్ ఆల్కహాల్, శరీరాన్ని తెల్లబరిచేందుకు ఉపయోగించే కాస్మటిక్స్ ఇలాంటి పరిణామాలకు దారి తీస్తాయి. అందుకే కాస్మటిక్స్ కొనేముందు అవి ‘నాన్ కొమిడోజెనిక్ కాస్మటిక్స్’ అని ధ్రువీకరించుకున్న తర్వాతనే వాటిని కొనుగోలు చేయాలి. ముఖాన్ని అతిగా కడగటం : ముఖం తేటగా కనిపించాలనే ఉద్దేశంతో మాటిమాటికీ కడగటం, స్క్రబ్బింగ్ చేయడం, ఆవిరిపట్టించడం (స్టీమింగ్), ఫేషియల్స్ అతిగా ఉపయోగించడం వంటి పనులు చేయడం వల్ల కూడా ముఖానికి నష్టం వాటిల్లుతుంది. మొటిమలను గిల్లడం, నొక్కడం : మొటిమలను గిల్లడం, గట్టిగా నొక్కడం ద్వారా వాటి నుంచి విముక్తి పొందడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. ఈ తరహా చేష్టల వల్ల వాటి తీవ్రత పెరుగుతుంది. అంతేకాదు ముఖంపై చిన్నచిన్న గుంటలు పడే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్ వంటివి సంభవిస్తే ముఖం మరింత అసహ్యంగా మారే అవకాశం ఉంది. అందుకే ఈ తరహా చేష్టలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రుల దృక్పథం : చాలా మంది తల్లిదండ్రులు వయసు పెరుగుతున్న కొద్దీ మొటిమలు వాటంతట అవే తగ్గుతాయని అపోహ పడుతుంటారు. కొందరి విషయంలో అది వాస్తవమే. కానీ అన్ని రకాల మొటిమలు అలా వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే తగ్గవు. అవి ఏ తరహాకు చెందినవి, వయసుతో పాటు వస్తున్నాయా లేక తీవ్రమైన మానసిక ఒత్తిడి వల్ల వస్తున్నాయా లేదా అమ్మాయిలు ఏదైనా సంకోచాలు (స్టిగ్మా)తో బాధపడుతున్నారా అనే విషయాలను గమనించారు. ఇలా అమ్మాయి ఏదో కారణాల వల్ల బాధపడుతూ, ఆ సమస్యకు తోడు ఒత్తిడితో మొటిమలు కూడా వస్తే అంతర్ముఖురాలిగా మారిపోవచ్చు. ఆమె తన సహజమైన కలివిడితనాన్ని వదిలేయవచ్చు. స్నేహితులు, బంధుమిత్రులను కలవడానికి ఇష్టపడకపోవచ్చు. దీనివల్ల ఆ అమ్మాయి తన బాల్యం/కౌమార్యంలో కొన్ని మాధుర్యాలను మిస్ అయ్యే అవకాశం ఉంది. అది మానసిక పెరుగుదలకు, ఆత్మస్థైర్యానికి విఘాతం అయ్యే అవకాశం ఉంది. ఇది వారి కెరియర్‌కు సంబంధించిన పరీక్షల ఫలితాలపై కూడా తీవ్రమైన ఫలితాలను చూపే అవకాశం ఉంది. అందుకే అవి ఏ తరహా మొటిమలు అయినప్పటికీ ఒకసారి డర్మటాలజిస్ట్‌కు చూపించి, సలహా పొందడం వారు ఏదైనా మందులు సూచిస్తే వాడటం వల్ల అమ్మాయిలు / అబ్బాయిలకు ఆ సమయంలో అందాల్సిన మానసిక స్థైర్యం చేకూరి, ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది. కాబట్టి సమయానికి చికిత్స అందడం మొటిమల విషయంలో చాలా ముఖ్యమని గ్రహించండి. అంతేగాని అవి వాటంటత అవే తగ్గుతాయనే భావనతో వాటిని ముదరనివ్వకండి. దాంతో పిల్లల మానసిక వికాసానికీ విఘాతం కలిగే అవకాశం ఉంది. కొన్ని సూచనలు ఓపికగా ఉండండి. డాక్టర్ ఇచ్చిన సూచనలు తప్పక పాటించండి. కొద్దిగా తగ్గగానే మందులు లేదా సూచనలు మానేయకండి. ఆహార విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. నూనె పాళ్లు తక్కువగా ఉండే లేపన ద్రవ్యాలనే (స్కిన్ ప్రాడక్ట్స్)నే వాడండి. చర్మాన్ని చాలా సున్నితంగా, సుకుమారంగా చూసుకోండి. కారణాలు ఇవి టీనేజీ దశలో స్రవించే హార్మోన్లు: దీనికి ప్రధాన కారణం బాలలు ఒక్కసారిగా యౌవన (కౌమార) దశలోకి ప్రవేశించడం. దీన్నే ప్యూబర్టీ స్పర్ట్గా పేర్కొంటారు. ముందుగా చెప్పినట్లు మగపిల్లల్లో టెస్టోస్టెరాన్ హార్మోన్ ఒక్కసారిగా ఉత్పన్నమయి సబేషియస్ గ్లాండ్స్‌ను ప్రేరేపించడంతో మగపిల్లల్లో మొటిమలు వస్తాయి. ఇక టీనేజీ అమ్మాయిల్లోనైతే అనేక రకాల హార్మోన్లు స్రవిస్తుంటాయి. అవి అనేకం ఉండటం వల్ల వీటి మధ్య సమతౌల్యత లోపిస్తే మొటిమలు కనిపిస్తాయి. ముఖ్యంగా ‘పాలీసిస్టిక్ ఒవేరియన్ డిజార్డర్’ లేదా పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ ఉన్న అమ్మాయిల్లో ముఖాలపై మొటిమలు చాలా ఎక్కువ. ఆహారం : ఎక్కువ చక్కెరపాళ్లు ఉండే (హై గ్లూకోజ్) ఆహారాన్ని తీసుకునే వారిలో మొటిమల సమస్య చాలా ఎక్కువ. ప్రతిరోజూ పాల ఉత్పాదనలతో కూడిన స్వీట్లు, చాక్లెట్లు, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం, నూనె ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకునేవారిలో మొటిమలు ఎక్కువగా వస్తాయి. మనం ఈ తరహా ఆహారాన్ని తగ్గిస్తే మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి. అయితే అన్ని కేసుల్లోనూ ఇదే జరుగుతుందన్న హామీ ఉండదు. కొన్నిసార్లు ఆహారాన్ని మార్చినా తగ్గకపోవచ్చు. ఇక మొటిమలకూ, ఇన్సులిన్ మెటబాలిజమ్ (ఇన్సులిన్ జీవక్రియల తీరు), స్థూలకాయానికీ సంబంధం ఉందని స్పష్టంగా కొన్ని అధ్యయనాల్లో తేలింది. జన్యుసంబంధమైన కారణాలు : కొందరిలో ఇవి ఎలాంటి కారణం లేకుండా కేవలం జన్యుసంబంధరమైన కారణాలతోనూ రావచ్చు. ఒత్తిడి : తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే కొందరిలో మొటిమలు ఎక్కువగా వస్తాయని స్పష్టంగా తెలిసింది. ఇన్ఫెక్షన్ ఏజెంట్స్ : కొన్ని రకాల బ్యాక్టీరియా అంటే... ప్రోపియోనీ బ్యాక్టీరియా, స్టెఫాలోకోకస్ ఆరియస్, డెమోడెక్స్ ఫాలిక్యులోరమ్ వంటి ఇన్ఫెక్షన్లను కలిగించే బ్యాక్టీరియాతోనూ కొందరిలో మొటిమలు రావచ్చు. పిగ్మెంటేషన్ తగ్గడానికి మెడికల్ షాపుల్లో లభించే స్టిరాయిడ్ క్రీముల వాడకం వల్ల కూడా మొటిమలు రావచ్చు. వృత్తిపరంగానూ : కొందరు ఎరువుల ఫ్యాక్టరీలలో పనిచేస్తుంటారు. మరికొందరు సిమెంట్ పరిశ్రమల్లో పనిచేస్తుంటారు. ఇలాంటి పరిశ్రమల్లో పనిచేసేవారికి మొటిమలు రావడం చాలా సాధారణం. అయితే ఈ తరహా మొటిమలు కాళ్లు, మోకాళ్ల కిందిభాగాలు, ముంజేతులు, మోచేతుల వంటి భాగాల్లో ఇవి వస్తాయి. ఇలాంటి మొటిమలు వచ్చిన వారు సదరు వృత్తులనుంచి దూరమైతే... ఈ తరహా మొటిమలు కూడా వాటంతట అవే తగ్గుతాయి. నివారణ / చికిత్సలు మొటిమల నివారణ చాలా సులువు. ఉదాహరణకు టీనేజ్ పిల్లలు తీసుకునే కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటం వంటివి. అవి... చాక్లెట్లు / కాఫీలు : చాక్లెట్లు, కాఫీ లోని కెఫిన్ మొటిమలను ప్రేరేపించే అంశాల్లో చాలా ప్రధానమైనది. అందుకే ఆ వయసులో పిల్లలకు అందాల్సిన ఆహారాలు ఆరోగ్యకరంగానూ, కొవ్వులు, చక్కెరపాళ్లు తక్కువగా ఉండేవి గాను ఉండాలి. అవి సెబేషియస్ గ్రంథులను ప్రేరేపించే ఆహారాలని గుర్తిస్తే వాటికి దూరంగా ఉండాలి. ఈ తరహా నివారణ చర్యల తర్వాత కూడా మొటిమలు తగ్గకపోతే అప్పుడు క్వాలిఫైడ్ డర్మటాలజిస్ట్‌ను కలవాలి. మళ్లీ మళ్లీ కనిపించే మొటిమలు : కొందరిలో చికిత్స తీసుకున్న తర్వాత తగ్గినట్లుగా కనిపించే మొటిమలే చికిత్స మానేయగానే పునరావృతమవుతుంటాయి. అందుకే కేవలం ఒకటి లేదా రెండు నెలల చికిత్స సరిపోదని గ్రహించాలి. మొటిమలు పూర్తిగా తగ్గాలంటే అవి ఏ తరహాకు చెందినవి అనే అంశం ప్రధానమైనది. కొందరిలో చికిత్స ఆరు నుంచి ఎనిమిది నెలలు కూడా పట్టవచ్చని గ్రహించాలి. ఈ సమయంలోనే కొందరు పేషెంట్లు తగ్గినట్టే తగ్గి మళ్లీ మొటిమలు కనిపించగానే ఒక డాక్టర్ నుంచి మరో డాక్టర్ వద్దకు తిరుగుతూ ఉంటారు. మొటిమలు మాటిమాటికీ వచ్చే సమస్యల్లో ఒకటని గ్రహిస్తే ఈ తరహా తప్పటడుగులకు ఆస్కారం ఉండదు. మరికొందరు చికిత్స కోసం ఇతర చికిత్సా విధానాలపై ఆధారపడతారు. ఒక్కోసారి అది ప్రమాదకరం కావచ్చు. పై అంశాలన్నింటినీ పరిశీలించి చూస్తే పిల్లల చర్మం చాలా సున్నితమైనదనీ, సమస్యను బట్టి వాటిని రకరకాల ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని గ్రహించాలి. పైగా కొన్ని రకాల మొటిమల్లో గుణం కనిపించడానికి చాలా వ్యవధి పట్టవచ్చని కూడా తెలుసుకోవాలి. కాబట్టి మొటిమల్లోని అనేక రకాలను బట్టి చికిత్సలు మారుతుంటాయని గ్రహించి దానికి అనుగుణంగా నడుచుకోవాలనే అవగాహనను పెంచుకుంటే మానసికంగానూ అవి కల్పించే ఇబ్బందులను చాలా సమర్థంగా ఎదుర్కోవచ్చు. అందుకే మొటిమల చికిత్సలో పిల్లల (యుక్తవయసు, కౌమార బాలల) పాత్ర ఎంత ముఖ్యమో, వారి తల్లిదండ్రుల భూమికా అంతే ప్రధానం. -
అంకురంలోనే అంకుశం!
కొత్త కళలకు రెక్కలు తొడిగే వయసు టీనేజీది. ఈ వయసులో పరిసరాలపై గమనింపు ఎంతగా ఉంటుందో... తమ శరీరాన్ని అందంగా అలంకరించుకోవడంలో అంతే శ్రద్ధ ఉంటుంది. అయితే కొన్ని తెలిసి, కొన్ని తెలియక ఈ వయసులో అమ్మాయిలు, అబ్బాయిలు ఇబ్బందులు పడుతుంటారు. వాటిలో ప్రధానమైనవి చర్మ సౌందర్య సమస్యలు. చర్మం అంతర్గత అవయవాల ఆరోగ్యానికి అద్దంలాంటిది. చర్మం ఎంత నిగారింపుగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. సాధారణంగా 13 నుంచి 19 ఏళ్ల వయసులో పిల్లల్లో చర్మం నునుపుగా, బిగువుగా ఉంటుంది. కానీ, ఇటీవల ఈ వయసులోనూ చర్మసమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. వీరిలో ప్రధానంగా కనిపించే సమస్య మొటిమలు, యాక్నె (చర్మం పై పొరలలో గడ్డలుగా కనిపించడం). ఇవి ముఖం, మెడ, భుజాలు, వీపుపై భాగాలలో కనిపిస్తుంటాయి. అలాగే వదిలేస్తే మచ్చలు ఏర్పడతాయి. ఇవి యుక్తవయసులోనే కాదు ఒక్కోసారి జీవితాంతం వేధించవచ్చు. ఇవి గమనించండి... హార్మోన్లు... పిల్లలు యుక్తవయసుకు వచ్చేటప్పుడు వారి శరీరంలో రకరకాల మార్పులు జరుగుతుంటాయి. అబ్బాయిల్లో టెస్టోస్టిరాన్, అమ్మాయిల్లో ఈస్ట్రోజెన్ హార్మోన్లు కీలకమైనవి. ఈ స్రావాల అసమతౌల్యతల వల్ల సమస్యలు ఉత్పన్నమవుతుంటాయి. ఈ ప్రభావం మేనిపై పడుతుంది. నూనె గ్రంథుల నుంచి స్రావాలు అధికంగా వెలువడి, మొటిమలకు కారణమవుతుంటాయి. శుభ్రత లోపం... ఇంటా బయట రకరకాల కాలుష్య ప్రభావాలు చర్మం మీద పడుతుంటాయి. ఇలాంటప్పుడు సరైన శుభ్రత పాటించకపోయినా చర్మం నిగారింపు కోల్పోతుంది. చుండ్రు... ఈ వయసులో తలలో చుండ్రు అధికంగా గమనిస్తుంటాం. చుండ్రు భుజాలు, ముఖం, వీపు మీద పడటం వల్ల బ్యాక్టీరియా వృద్ధి చెంది మొటిమలకు కారణం అవుతుంది. మానసిక ఒత్తిడి.... ర్యాంకులు, మార్కులు, చదువు స్ట్రెస్‌తో పాటు నిద్రవేళలు సరిగా పాటించకపోవడం వల్ల ఈ వయసువారి హార్మోన్లలో తేడాలు వస్తున్నాయి. చర్మం పొడిబారడం, మలబద్ధకం.. వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవీ మొటిమలు, యాక్నెకు కారణాలు అవుతాయి. జీవనశైలిలో తేడాలు... నేటి యాంత్రిక కాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు వాడటం పెరిగి, శరీరానికి తగినంత శ్రమ ఉండటం లేదు. దీని వల్ల హార్మోన్లలో తేడాలు వస్తున్నాయి. సమతుల ఆహారం తీసుకోకపోవడం, బేకరీ, నిల్వ పదార్థాలు తినడం ఈ వయసు పిల్లల్లో అధికం. ఆహార సమయాలలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఆరోగ్యంపై తద్వారా చర్మంపై ప్రభావం చూపిస్తున్నాయి. ఇవి పాటించండి...పిల్లలు వయసురీత్యా తమ విషయాలలో అశ్రద్ధ వహిస్తుంటారు. తల్లిదండ్రులే ఎదిగే వయసులో ఉన్న పిల్లల ఆరోగ్యంపై సరైన శ్రద్ధ పెట్టాలి. ఫేస్‌వాష్ మేలు... అబ్బాయిలు, అమ్మాయిలు ... సబ్బులకు బదులుగా గ్లైకాలిక్ యాసిడ్, ఫాలిక్యులార్ యాసిడ్ వంటి ఔషధగుణాలు గల ఫేస్‌వాష్‌లను వాడాలి. మసాజ్‌లకు దూరం... యాక్నె, మొటిమల సమస్యలు ఉండటంతో చాలామంది మసాజ్‌లు చేయిస్తే ఫలితం ఉంటుందని భావిస్తారు. కానీ మసాజ్ వల్ల మొటిమలలోని పస్ ఇతర భాగాలకు చేరి, బ్యాక్టీరియా వృద్ధి చెంది, మచ్చలు ఏర్పడే అవకాశం ఉంది. అందుకని మసాజ్‌లు, ఫేస్‌ప్యాక్‌లకు వీరు దూరంగా ఉండటం మేలు. క్రీములు వద్దే వద్దు... చర్మం రంగుతేలాలని చాలా మంది టీనేజ్ నుంచే ‘వెటైనింగ్ క్రీముల’ను వాడుతుంటారు. వీటి వల్ల చర్మంపై మచ్చలు ఏర్పడతాయి. కొన్ని రకాల క్రీములు మొటిమలలోనికి చొచ్చుకుపోయి, దురద, దద్దుర్లకు కారణం అవుతాయి. రోజూ తలస్నానం... నిపుణులు సూచించిన యాంటీ డాండ్రఫ్ షాంపూతో రోజూ తలస్నానం చేయాలి. హెయిర్ స్టైల్స్‌కు వాడే జెల్స్, సీరమ్ ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. పైపై క్రీములతో మెరుగులు దిద్దడం కన్నా అంతర్గత ఆరోగ్యంపై దృష్టిపెట్టాలి. సమస్య ఉన్నవారు ఒకసారి నిపుణులను సంప్రదించి వదిలేయకుండా కనీసం 3-4 ఏళ్లపాటు వైద్యుల సలహాలను పాటిస్తూ ఉండాలి. ఇప్పటికే యాక్నె వల్ల మచ్చలు ఏర్పడిన వారికి విటమిన్ క్రీమ్స్, గ్లైకాలిక్ పీల్, డెర్మారోలర్.. వంటి వాటితో మచ్చలు, స్కార్స్ తగ్గించవచ్చు. - డా.షాను, చర్మ వైద్య నిపుణులు, కాయా స్కిన్ క్లినిక్ -
మేనికి వరాల జల్లు...
నిన్న మొన్నటి దాకా ఎండలకు చర్మం కమిలి, దుమ్ము పేరుకుపోయి నల్లబడి ఉంటుంది. చినుకుల వల్ల వాతావరణం చల్లబడటంతో చర్మం పొడిగా మారి పైన తెల్లటి పొలుసులుగా మృతకణాలు కనిపిస్తుంటాయి. జిడ్డుచర్మం అయితే స్వేదగ్రంథులు మూసుకుపోతాయి. దీంతో మొటిమలు, బ్లాక్, వైట్ హెడ్స్(చర్మంపై అక్కడక్కడా సన్నని పొక్కులు) వస్తుంటాయి. వేళ్ల మధ్య బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు చోటుచేసుకుంటాయి. ఈ సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే... తడిస్తే తప్పనిసరి: వర్షంలో తడవడం ఆరడం ఈ కాలం సాధారణమే! అయితే వర్షంలో తడిసి ఇంటికి చేరుకుంటే మాత్రం స్నానం చేయడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మానుకోకూడదు. వర్షపు నీటిలో ఉండే ఆమ్లాలు, మలినాలు ఒంటిని మురికిగా చేస్తాయి. దీని వల్ల చర్మం, శిరోజాలు దెబ్బతింటాయి. అందుకని వానలో తడిస్తే తదుపరి స్నానం తప్పనిసరి. మలినాల తొలగింపు: రోజూ ఉదయం సాయంత్రం యాంటీబ్యాక్టీరియల్ సబ్బు/లోషన్‌ను శరీర శుభ్రతకు ఉపయోగించాలి. వీటి వల్ల చర్మంపై మలినాలు తొలగిపోవడమే గాక ఈ కాలపు బ్యాక్టీరియా దాడిని అడ్డుకోవచ్చు. చర్మంపై పొలుసులుగా కనిపించే మృతకణాల తొలగింపుకు నలుగుపిండి మేలైన ఎంపిక. నిమ్మరసం, పసుపు బ్యాక్టీరియా నాశనకారిగా పనిచేస్తాయి. చర్మంపై మలినాలను తొలగించడానికి ఆల్కహాల్(మద్యం) లేని టోనర్ ఉత్పత్తులను ఉపయోగించాలి. (క్లెన్సింగ్ ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు ప్రొడక్ట్ వెనక వైపు ఇచ్చే లేబుల్ పరిశీలించాలి) చల్లగా, మబ్బుగా వాతావరణం ఉంటుంది కదా అని వదిలేయకుండా బయటకు వెళ్లడానికి ముందు సన్‌స్క్రీన్ లోషన్/ఎస్.పి.ఎఫ్ 15 నుంచి 30 శాతం ఉన్న మాయిశ్చరైజర్‌ను సూర్యకాంతి పడే శరీరభాగాలకు కొద్ది మోతాదులో ఉపయోగించాలి. క్రీమ్‌లు కాకుండా లోషన్ బేస్డ్ మాయిశ్చరైజర్ వాడితే ఈ కాలం చర్మం డీహైడ్రేట్(నిస్తేజం) కాకుండా, కాంతిమంతంగా కనిపిస్తుంది. ఈ కాలంలో చేయకూడనివి...! పదే పదే ముఖాన్ని శుభ్రపరచకూడదు. దీని వల్ల సహజమైన తేమను కోల్పోయి చర్మం పొడిబారుతుంది. ముఖం తుడుచుకోవడానికి టిష్యూ పేపర్ని ఉపయోగించినా చర్మానికి హాని కలిగేలా రుద్దకూడదు. అధికంగా చేసే మసాజ్‌ల వల్ల చర్మంపై పొర నిర్జీవంగా తయారవుతుంది. బ్యూటీ బాటలో బామ్మ మాట సెనగపిండి, పాలు, రోజ్‌వాటర్ కలిపిన మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసి 15-20 నిమిషాలు ఉంచి, ఆరిన తర్వాత శుభ్రపరుచు కోవాలి. ఈ మిశ్రమం మంచి క్లెన్సర్(శుభ్రపరిచే ఉత్పత్తి)లా ఉపయోగపడుతుంది. రోజుకు ఒక సారి ఈ ప్యాక్ వేసుకోవచ్చు. పండిన బొప్పాయి గుజ్జును మేనుకు పట్టించి, మెల్లగా రుద్దితే, మలినాలు తొలగి చర్మం మృదువుగా మారుతుంది. మృదువైన చర్మానికి సలాడ్స్ శరీర భాగలలో అతి పెద్దది, అత్యంత ప్రాధాన్యం గలది చర్మం. ఇందుకు బయటి వరకే తీసుకునే సంరక్షణ చర్యలు కొంతమేరకే సహాయపడతాయి. చర్మకాంతి మెరుగవ్వాలంటే రోజువారీగా తీసుకునే ఆహారంపై అత్యవసర జాగ్రత్తలు తప్పనిసరి. పూర్తి పచ్చి ఆహారాన్ని కాకుండా ఈ కాలంలో కొద్దిగా ఉడికించిన సలాడ్స్, కూరగాయలు, ఆకుకూరల రసాలు (సూప్స్) తీసుకోవాలి. కాచివడబోసిన నీళ్లు రోజుకు 10-12 గ్లాసులు సేవించాలి. దీని వల్ల చర్మం లోపలి మలినాలు తొలగిపోయి, కాంతిమంతంగా తయారవుతుంది. పాలు, పాల ఉత్పత్తులు, నట్స్, సోయా వంటివి ఆహారంగా తీసుకుంటే చర్మం, శిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది. వేసవిలో తలెత్తిన ట్యాన్ (చర్మం నల్లబడటం) సమస్య తగ్గాలంటే బంగాళదుంప తొక్కతో చర్మంపై నెమ్మదిగా రబ్ చేస్తూ, శుభ్రపరుచుకోవాలి. టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్ స్పూన్ల బాదంపప్పు పొడి, 3 టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ కలపాలి. ఈ మిశ్రమాన్ని ఒంటికి పట్టిస్తూ, మెల్లగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. వారానికి ఒక్కసారైనా ఇలా చేయడం వల్ల చర్మకాంతి పెరుగుతుంది. రోజ్ వాటర్‌లో ముంచిన దూదితో ముఖమంతా అద్దుతూ, తుడిచేస్తే ఈ కాలంలో తలెత్తే మొటిమల సమస్య తగ్గుతుంది. - డా. షాను చర్మ వైద్య నిపుణురాలు, కాయా స్కిన్‌కేర్ క్లినిక్ -
పండ్లతో మేనికాంతి...
బ్యూటీ దుమ్ము, ఎండ, కాలుష్యం, రసాయన సౌందర్య ఉత్పత్తుల మూలంగా చర్మం నల్లబడటమే కాకుండా పొడిబారి జీవం కోల్పోతుంది. అలాంటప్పుడు పండ్లతో మసాజ్ చేసుకోవడంవల్ల కణాలను శుభ్రపరిచి, చర్మానికి విశ్రాంతినివ్వడమే కాదు పండ్లు సహజ కాంతిని, మెరుపును తీసుకువస్తాయి. పొడిబారిన చర్మానికి సహజసిద్ధమైన క్లెన్సర్‌లా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి, అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు రాసి మసాజ్ చేయాలి. 15-20 నిమిషాలు అలాగే ఉంచి, చల్లని నీటితో శుభ్రపరచాలి. వారానికి రెండుసార్లైనా ఈ విధంగా చేస్తూ ఉంటే చర్మం నిస్తేజంగా మారదు. జిడ్డు చర్మం గలవారికి టొమాటో సరైన ఎంపిక. సాధారణంగా జిడ్డుచర్మం గలవారికి మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. ఇలాంటప్పుడు బాగా పండిన టొమాటా గుజ్జును ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. స్క్రబ్ చేయడం వల్ల మొటిమలున్న చోట చర్మం ఎర్రబడే అవకాశం ఉంది. 20 నిమిషాలు ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో మృదువుగా రుద్దుతూ కడగాలి. చర్మంపై స్వేదరంధ్రాలు శుభ్రపడి మొటిమల సమస్య తగ్గుతుంది. ముఖంపై అక్కడక్కడా మొటిమలు విపరీతంగా గడ్డల్లా ఏర్పడుతుంటాయి. దీనినే యాక్నె అంటుంటారు. ఈ సమస్య నివారణకు దాక్ష్ర పండ్లు మహత్తరంగా పనిచేస్తాయి. ద్రాక్షపండ్ల గుజ్జును ముఖానికి, మెడకు రాసి, వేళ్లతో వలయకారంగా మసాజ్ చేయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరిచి, మెత్తని కాటన్ క్లాత్‌తో తడిని అద్దాలి. ఎండకు కమిలిన చర్మం (ట్యాన్) నిస్తేజంగా మారుతుంది. ఈ సమస్య నుంచి స్ట్రాబెర్రీ సత్వర ఉపశమనం ఇస్తుంది. స్ట్రా బెర్రీలను కొద్దిగా నీరు కలిపి గుజ్జులా చేసుకోవాలి. ఈ గుజ్జును ట్యాన్ అయిన శరీర భాగాలకు రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల నిస్తేజంగా మారిన చర్మం పూర్వపు కాంతిని పొందుతుంది. -
వెంట్రుకలు చిట్లుతున్నాయి..
నా జుట్టు బాగా పొడిబారి, వెంట్రుక మధ్య నుంచి చిట్లుతోంది. వెంట్రుకల చివర్లు బాగా దెబ్బతిన్నాయి. ఇంట్లోనే చేసుకోదగిన చిట్కాలు చెప్పండి. - క్షేత్ర, ఇ-మెయిల్ శిరోజాలకు తగినంత ప్రొటీన్ అందనప్పుడు ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముందుగా ప్రొటీన్లు ఉన్న ఆహారంపై దృష్టిపెట్టండి. కోడిగుడ్డు, బాదంపప్పు ... వంటివి రోజూ తగు మోతాదులో తీసుకోండి. జుట్టు బాగా పొడిబారడం వల్ల చిట్లుతోందని గ్రహించండి. చిట్లిన వెంట్రుకలను కత్తిరించక అలాగే వదిలేయడం వల్ల చివర్లు పెరిగి, వెంట్రుక మధ్యలోకి విరిగినట్టుగా కనిపిస్తోంది. మీరు తల దువ్వుకోవడానికి కలపతో తయారుచేసిన వెడల్పాటి పళ్లు ఉన్న దువ్వెనను వాడండి. మాడు నుంచి, కింది వరకు జుట్టులో చిక్కులు లేకుండా దువ్వండి. దీని వల్ల మాడుకు రక్తప్రసరణ మెరుగవుతుంది. లోహంతో తయారైన హెయిర్ పిన్స్‌ను ఉపయోగించకుండా వెడల్పాటి రబ్బర్ బ్యాండ్స్ వాడండి. మాడుకు కాకుండా వారానికి ఒకసారి పెరుగుతో జుట్టుకు ప్యాక్ వేసి, వేళ్లతో మృదువుగా మసాజ్ చేయండి. ఈ జాగ్రత్తలు మీ శిరోజాలను ఆరోగ్యవంతంగా మారుస్తాయి. నాకు ముక్కుపైన మాత్రమే మొటిమలు ఎక్కువ అవుతున్నాయి. దీని వల్ల ముక్కు ఎర్రగా కనిపిస్తుంటుంది. మొటిమల లోపల పస్ కూడా ఉంటుంది. మచ్చలు కూడా ఉన్నాయి. - వి.సౌమ్య, విశాఖపట్నం మీకు ముక్కు మీద నూనె గ్రంథులు ఎక్కువ స్రవిస్తున్నాయి. శుభ్రపరుచుకోకపోవడం వల్ల మొటిమల సమస్య పెరుగుతోంది. మొటిమల్లోని పస్ తీయకండి. అలా చేస్తే మచ్చలు ఏర్పడతాయి. మార్కెట్లో డెర్మలాజికల్ స్పా రెమెడీ క్రీమ్ దొరుకుతుంది. ఈ క్రీమ్‌ను రోజుకు రెండుసార్లు రాయండి. -
జిడ్డు తగ్గాలంటే ఏం చేయాలి?
- కిన్నెర, ఇ-మెయిల్ ముఖం మీద జిడ్డు చేరినప్పుడు వెంటనే తొలగించకపోతే దుమ్ము, ధూళి కణాలు చేరి మొటిమలకు కారణాలు అవుతాయి. జిడ్డు చర్మం గలవారికి వచ్చే ప్రధాన సమస్య మొటిమలు. అందుకని ఎప్పటిక ప్పుడు ముఖం మీద అదనంగా చేరే జిడ్డును తొలగించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఆర్గానిక్ ఫేస్ స్క్రబ్‌ని ముఖానికి రాసుకొని, సున్నితంగా రబ్ చేసి, వెచ్చని నీటితో కడగాలి. రోజులో మూడు, నాలుగు సార్లు ఫేస్‌వాష్‌తో ముఖాన్ని శుభ్రపరుచుకుంటే త్వరగా జిడ్డు పట్టే సమస్య తగ్గి, రోజంతా తాజాగా ఉంటుంది. ముఖచర్మం నిస్తేజంగా ఉంటోంది! - రాగిణి, సీతాఫల్మండి, హైదరాబాద్ బయట తిరిగే వారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే చర్మం త్వరగా డల్‌గా మారుతోంది. రోజూ సాయంకాలం ఇంటికి వెళ్లిన తర్వాత స్వచ్ఛమైన రోజ్‌వాటర్‌లో దూదిని ముంచి ముఖమంతా తుడుచుకోవాలి. అదే విధంగా ఉదయం కూడా చేయాలి. తర్వాత మంచి నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండుసార్లు బంగాళదుంపను తురిమి ముఖానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజులో ఏర్పడే జిడ్డును తొలగించుకోవడానికి పదే పదే నీటితో శుభ్రం చేయాల్సిన అవసరం లేదు. వెట్ వైట్ టిష్యూ పేపర్‌తో చెమటను అద్దాలి. అంతే తప్ప గట్టిగా రుద్దకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే ట్యాన్ తగ్గుతుంది. ముఖం మృదువుగా, కాంతిమంతంగా మారుతుంది. -
మేను హాయిలే ఇలా...
నల్లబడడం, మంటగా అనిపించడం, నిస్తేజంగా మారడం, మచ్చలు, మొటిమలు, పిగ్మేంటేషన్.. వంటివి వేసవిలో చర్మం ఎదుర్కొనే ప్రధాన సమస్యలు. మీరు వీటి నుంచి దూరంగా ఉండాలంటే దాడి చేసే వేసవిని సమర్థంగా ఎదుర్కోవాలి. అమితమైన వేడికి తోడు అధికమైన గాలి కూడా ఈ కాలంలో చర్మాన్ని నిర్జీవం చేస్తుంది. ఫలితంగా సున్నితమైన చర్మం దెబ్బతిని, పై పొరలో మృతకణాలు ఏర్పడతాయి. స్వేదరంధ్రాలకు మృతకణాలు అడ్డుతగలడంతో అవి తగినంత సహజ నూనెలను విడుదల చేయలేవు. దీంతో చర్మం మరింత పొడిబారి త్వరగా ముడతలు పడుతుంది. ఇలాంటప్పుడే చర్మానికి సంరక్షణ అవసరం. మీది సాధారణ చర్మతత్త్వమా? మృతకణాలు టీ స్పూన్ ఓట్స్, టీ స్పూన్ బేకింగ్ సోడా, తగినంత నీళ్ళు కలిపి చిక్కటి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమంతో 2-3 నిమిషాలు ముఖాన్ని, మెడను, చేతులను మృదువుగా రుద్దాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల చలికాలంలో చర్మంపై పొలుసులుగా చేరిన మృతకణాలు సులువుగా వదులుతాయి. ఈ మిశ్రమం అన్ని రకాల చర్మతత్త్వాలకు ఉపయోగపడుతుంది నిన్నమొన్నటి వరకు చలికి చర్మం పొడిబారకుండా చూసుకున్నాం. హమ్మయ్య! అనుకున్నామో లేదో... ఎండలు మొదలైపోయాయి... సూర్యుడు చండప్రచండంగా తన ప్రతాపం చూపించేస్తున్నాడు... ఆ వేడిని తట్టుకోలేక శరీరం త్వరగా అలసిపోతే... చర్మం జీవం కోల్పోతుంది... సాధారణంగా ఈ కాలం వేధించే సమస్యలు చర్మం దరిచేరకుండా చూసుకోవాలని... కాలాన్ని అను‘కూల్’గా మార్చుకోవాలనేవారి కోసమే ఈ సూచనలు మృదుత్వం టీ స్పూన్ శనగపిండి, టీ స్పూన్ నిమ్మరసం, 2-3 పుదీనా ఆకులు, పెరుగు, క్యారట్ తురుము కలిపి పేస్ట్ చేసిన మిశ్రమాన్ని చర్మానికి రాసి, వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చేయాలి. ఇది చర్మంపై మలినాలను, పై మృతకణాలను తొలగిస్తుంది. ఫలితంగా చర్మం మృదువుగా అవుతుంది. తాజాదనం బొప్పాయిగుజ్జు, పైనాపిల్ గుజ్జు, ద్రాక్ష నూనె, పసుపు కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీంతో చర్మం తాజాగా కనిపిస్తుంది. మొటిమలు రెండు టేబుల్ స్పూన్ల దోసరసం, టేబుల్ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు, గంధంపొడి, పుదీనా, తులసి ఆకులు కలిపి ముద్ద చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరిన తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల మొటిమలలో పొడిబారిన సీబమ్ తొలగిపోతుంది. స్వేదరంధ్రాలు శుభ్రపడటం వల్ల ఇన్ఫెక్షన్కు కారణమైన బ్యాక్టీరియా నశించి, మొటిమల సమస్య తగ్గుతుంది. సహజమే మేలు వేసవిలో చర్మానికి బ్లీచింగ్, క్లెన్సింగ్, స్క్రబ్బింగ్ తప్పక అవసరం అవుతాయి. అయితే ఇందుకు రసాయన ఉత్పత్తులకు బదులు సహజసిద్ధమైన ఉత్పాదనల్ని ఎంచుకోవాలి. నోట్: అలోవెరా ఆకును తుంచి, దాన్నుంచి వచ్చిన రసానికి రోజ్‌వాటర్ కలిపి చర్మంపై మృదువుగా మసాజ్ చేస్తూ ఉంటే ఎండ కారణంగా నల్లబడిన చర్మానికి సహజకాంతి వస్తుంది. దురద, దద్దుర్లు వంటి సమస్యలు తగ్గుతాయి. మీది జిడ్డుచర్మమా? జిడ్డుచర్మం గలవారికి వేసవి మరింత పరీక్ష పెడుతుంది. చమట అధికమై బయటి దుమ్ము, ధూళి చేరి చర్మం మరింత జిడ్డుగా తయారవుతుంది. నివారణకు... ఫేసియల్ బ్లీచ్: 4 టేబుల్స్పూన్ల పాలు, టేబుల్ స్పూన్ తేనె, 2 టేబుల్స్పూన్ల నిమ్మరసం కలిపి చర్మం కమిలి నల్లబడిన చోట రాయాలి. 15 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెరుగుతో క్లెన్సర్: 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల తేనె, 3 టేబుల్ సూన్ల నిమ్మరసం వేసి చిక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి 2-3 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. వేపతో నివారణ: వేప ఆకుల ముద్ద, నారింజ తొనల ముద్ద సమానపాళ్లలో తీసుకోవాలి. దీంట్లో చందనం, ముల్తానీమిట్టి, తేనె, నిమ్మరసం, రోజ్‌వాటర్ కలిపి, ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. నారింజ రసం: టీ స్పూన్ నారింజ రసం, 3 టీ స్పూన్ల ఓట్స్, టీ స్పూన్ తేనె, గుడ్డులోని తెల్లసొన లేదా పెరుగు ఓ టీ స్పూన్ కలిపి ముఖానికి పట్టించి, వలయాకారంగా 5 నిమిషాల సేపు స్క్రబ్ చేయాలి. తర్వాత నీటితో శుభ్రపరుచుకోవాలి. బియ్యప్పిండి: మూడు టీ స్పూన్ల బియ్యప్పిండి, చిటికెడు పసుపు, టీ స్పూన్ తేనె, దోస రసం కలిపి పేస్ట్‌లా చేయాలి. ముఖానికి పట్టించి, ఆరాక శుభ్రపరుచుకోవాలి. మేనికి కూడా ఇది మేలైన ప్యాక్. మీది పొడిచర్మమా? చలికాలంలో చర్మం పొరలలో ఏర్పడిన ఇతర సమస్యలు వేసవిలో బయటపడుతుంటాయి. అయితే జిడ్డు చర్మం కన్నా పొడిచర్మాన్ని వేసవిలో సులువుగా సంరక్షించుకోవచ్చు. ఎండ నుంచి రక్షణగా... పొడిచర్మం కాబట్టి ఎస్.పి.ఎఫ్ 30 గల మాయిశ్చరైజర్‌ను, సన్‌స్క్రీన్ లోషన్ ను ఉపయోగించడం మేలు. పెదవులపై చర్మం పొడిబారడం, పగుళ్ల సమస్యలకు నివారణగా ఎస్.పి.ఎఫ్ 30 ఉన్న లిప్‌బామ్‌ను ఉపయోగిస్తే ఉపశమనం కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత విటమిన్ ‘ఇ’ ఉన్న మాయిశ్చరైజర్‌ను వాడాలి. జీవకాంతికి ఎండాకాలంలో చర్మం పైపూతలకు కాకుండా లోపలి పొరలు ఆరోగ్యంగా ఉండేలా జాగ్రత్తపడాలి. పగటి పూట నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల చర్మం సహజమైన నూనెలను విడుదల చేస్తుంది. శరీరబరువును బట్టి నీటిని సేవించాలి. ఉదా: మీ శరీర బరువు 50 కేజీలు అయితే, 5 లీటర్ల నీరు తాగాలి. మద్యం ఉత్పాదనలు వద్దు ఆల్కహాల్‌ని సౌందర్య ఉత్పాదనలలో సువాసనల కోసం ఉపయోగిస్తారు. పొడి చర్మం గలవారు ఆల్కహాల్ ఉత్పాదనలు వాడితే చర్మం మరింత పొడిబారుతుంది. ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు లేబుల్‌పై ఇచ్చిన జాబితాలో ‘ఆల్కహాల్’ లేనిది చూసి మాత్రమే కొనుగోలు చేయాలి. ఈత కొలనులలో కలిపే క్లోరిన్ వల్ల చర్మ సమస్యలు తలెత్తుతుంటాయి. ఈత పూర్తయిన తర్వాత మరొకసారి మంచినీటితో స్నానం చేసి, మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఏసీ చల్లదనమా?! వేసవిలో చల్లదనం కోసం ఎయిర్ కండిషనర్ల వాడకం ఎక్కువ. అయితే ఇవి ఉత్పత్తి చేసే చల్లని గాలులు చర్మంపై సహజసిద్ధమైన తేమను లాగేసి, పొడిబారుస్తాయి. మీ చర్మం సురక్షితంగా ఉండాలంటే గాలిలో తేమ తగ్గకుండా వారానికి ఒకసారి ఇంటిలో నీటిని స్ప్రే చేయాలి. -
బ్యూటీ
కుంకుడుకాయలు వాడచ్చా? ‘మన అమ్మలు, అమ్మమ్మల కాలంలో తలంటుకోవడానికి షికాయి, కుంకుడుకాయలను వాడేవారు. అప్పుడే జుట్టు బాగుండేది. ఇప్పుడు ఎక్కువగా ఊడటం, పొడిబారడం సమస్యలను ఎదుర్కొంటున్నాం’ అంటుంటారు చాలామంది. అయితే పూర్వ కాలంలో కాలుష్యం ఇంతగా లేదు. ఈ షాంపూలు, సబ్బుల వాడకమూ అంతగా లేదు. పైగా తలకు వాడే నూనెలు కూడా బాగా జిడ్డుగా ఉండేవి. కుంకుడుకాయ, షికాకాయ్లతో వారానికి ఒకసారి మాత్రమే తలంటుకోవడం వల్ల జుట్టు తేమను కోల్పోయేది కాదు. ఇప్పుడు జిడ్డు తక్కువగా, సుగంధాలు ఉండే నూనెలను వాడుతున్నాం. వారంలో ఎక్కువసార్లు తలంటుకుంటున్నాం. ఇలాంటప్పుడు కుంకుడు కాయలు, షికాకాయలు వారంలో ఎక్కువసార్లు వాడితే వాటిలో ఉండే ఆమ్లతత్వం వెంట్రుకలో ఉండే తేమను ఎక్కువగా తీసేస్తుంది. దీని వల్ల జుట్టు మరింత పొడిబారుతోంది. పీచులా అవ్వచ్చు. వెంట్రుకలకు జీవం లేదు అనుకుంటే ముందు నిపుణులను సంప్రదించి జుట్టు తత్వాన్ని పరీక్షించుకోవాలి.. దానికి తగిన చికిత్స తీసుకొని, వారి సూచనలు పాటించాలి. వీపుపైన మొటిమలు వస్తే! కొంతమందికి మొహం మీదనే కాదు భుజం మీద, వీపుపైన కూడా మొటిమలు వస్తుంటాయి. తలలో చుండ్రు సమస్య ఉండటం వల్ల ఇలా అవుతుంది. కొన్నిసార్లు హెయిర్ రిమూవల్ పద్ధతిలో తేడాల వల్ల కూడా మొటిమలు వస్తుంటాయి. ఇలాంటి వారు పాలపౌడర్‌లో తేనె కలిపి పేస్ట్ చేసి, ఆ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి ఒకసారి ఈ విధంగా చేస్తుంటే సమస్య తగ్గుముఖం పడుతుంది. మాయిశ్చరైజర్ తప్పనిసరా? చలికాలం గాల్లో తేమ తక్కువగా ఉండటం వల్ల చర్మం పొడిగా మారుతుంది. పొడి చర్మం త్వరగా ముడతలు పడుతుంటుంది. అలాగని ఫేషియల్ చేయించుకుంటే అక్కడ ఉపయోగించే కొన్ని సౌందర్య ఉత్పత్తులు సరిపడక చర్మం ఇంకా నల్లబడడం, జీవం కోల్పోయినట్టుగా మారుతుంది. ఈ సమస్యల దరిచేరకుండా చర్మం మృదువుగా, కాంతిమంతంగా మారాలంటే... ముందు చర్మవైద్య నిపుణులను సంప్రదించాలి. వారి సూచనల మేరకు చర్మతత్వతానికి సరిపడే ఉత్పాదనలు వాడాలి. అలాగే వాటినే ఉపయోగించమని బ్యుటిషియన్లను కోరవచ్చు. ఫేసియల్ అవసరం లేకుండా రాత్రి పడుకునేముందు తప్పనిసరిగా (నైట్ స్కిన్ రిపేర్ క్రీమ్స్) మాయిశ్చరైజర్స్ వాడాలి. ఆలివ్, బాదం నూనెలను మసాజ్‌కు ఉపయోగించడం వల్ల చర్మం మృదువుగానూ, కాంతిమంతంగానూ అవుతుంది. -
బ్యూటీ
హెయిర్ డై జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు. ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్ రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీపడకూడదు. జుట్టు సువాసనలు వెదజల్లాలంటే హెయిర్ సీరమ్ లేదా హెయిర్ స్ప్రే వాడచ్చు. జుట్టు సిల్కీగా మారాలనుకుంటే స్ట్రెయిటనింగ్ షాంపూ, కండిషనర్ వాడితే కొంతవరకు ఫలితం ఉంటుంది. ముల్తానీ మిట్టి ముల్తానీ మిట్టి ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం టైట్ అవుతుందని, కాంతిమంతం కూడా అవుతుందని అంటారు. అయితే కాలుష్యం, సరైన జీవనశైలి లేని ఈ కాలంలో ముల్తానీ మిట్టిని వాడకపోవడమే మంచిది. ఎందుకంటే ముల్తానీ మిట్టి చర్మాన్ని మరింతగా పొడిబారేలా చేస్తుంది. దీని వల్ల చర్మం త్వరగా ముడతలు పడుతుంది. అంతగా కావాలనుకుంటే 1ఎమ్.ఎల్, 2 ఎమ్.ఎల్ మాత్రమే అదీ ముల్తానీ మిట్టి లిక్విడ్‌ను ఫేస్‌ప్యాక్‌లలో ఉపయోగించవచ్చు. స్టీమ్ ఫేసియల్ చేసే సమయంలో ముఖానికి ఆవిరి పట్టడం చూస్తుంటాం. అధికంగా ఆవిరిపట్టడం వల్ల చర్మంలోని పోర్స్ ఓపెన్ అయ్యి, చర్మం వదులయ్యే అవకాశాలు ఉన్నాయి. అమితంగా స్క్రబ్ చేయడం, స్టీమ్ పట్టడం వంటివి చర్మంలోని సహజతేమను పోగొడతాయి. అప్పటికి కాంతిగానే అనిపించినా, తర్వాత చర్మం జీవం కోల్పోయినట్టు తయారవుతుంది. అందుకని వీలైనంత వరకు స్టీమ్‌ను తగ్గించడం మేలు. మొటిమలు మొటిమలు రావడానికి తలలో చుండ్రు ప్రధాన కారణం. తలలో చుండ్రు ఏ స్థాయిలో ఉందో తెలుసుకొని, యాంటీ డాండ్రఫ్ షాంపూ వాడాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి ఆ నీటితో తలను శుభ్రపరుచుకోవాలి. ముఖం మీద జిడ్డు లేకుండా జాగ్రత్తపడాలి. అప్పటికీ మొటిమల సమస్య వదలకపోతే చిరోంజి పప్పును పొడి చేసి, పచ్చిపాలలో కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసి, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ విధంగా చేస్తుంటే మొటిమలు, నల్లమచ్చలు తగ్గి, ముఖం ఫెయిర్‌గా అవుతుంది. ట్యాన్ స్నానం చేయడానికి అరగంట ముందు కమలాపండు తొక్కను గుజ్జులా చేసి, కొద్దిగా పాలు కలిపి మేనికి పట్టించి, స్క్రబ్ చేయాలి. ఇవి ట్యాన్‌ని పోగొట్టడమే కాకుండా, చర్మాన్ని కాంతిమంతంగా చేస్తాయి.