రోజురోజుకీ పెరిగిపోతున్న కాలుష్యం బారినపడి.. ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతోందా? మచ్చలు, మొటిమలు పెరిగి అందాన్ని పాడుచేస్తున్నాయా? అయితే ఈ సహజ చిట్కాలను మీరూ పాటించండి. సూపర్ షైనింగ్‌ని పొందండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి.
కావల్సినవి : క్లీనప్ : చిక్కటిపాలు – 1 టేబుల్ స్పూన్, తేనె – 1 టీ స్పూన్
స్క్రబ్ : కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు, పెసరపిండి – 1 టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు
మాస్క్: బీట్‌రూట్ రసం – 2 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 1 టీ స్పూన్
తయారీ : ముందుగా చిక్కటిపాలు, తేనె ఒక చిన్న బౌల్‌లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి నూనె ముఖం, మెడ భాగాలకు బాగా పట్టించి... పెసరపిండి, శనగపిండి ఒక బౌల్‌లోకి తీసుకుని కొద్దిగా నీళ్లు కలిపి, ఆ మిశ్రమంతో ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు బీట్‌రూట్ రసం, ముల్తానీ మట్టి, టమాటా గుజ్జు ఒక బౌల్‌లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల ముఖానికి మంచి షైనింగ్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment