మొటిమలు పోవడం లేదా? | Problem Of Pimples Increases If The Face Is Oily | Sakshi
Sakshi News home page

మొటిమలు పోవడం లేదా?

Published Mon, Nov 4 2019 2:26 AM | Last Updated on Mon, Nov 4 2019 2:26 AM

Problem Of Pimples Increases If The Face Is Oily - Sakshi

►ముఖం జిడ్డుగా ఉంటే మొటిమల సమస్య పెరుగుతుంది. ఆపిల్‌ స్లైస్‌తో ముఖమంతా మృదువుగా రబ్‌ చేసి, పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపైన జిడ్డు తగ్గి, చర్మం తాజాగా కనిపిస్తుంది.
►మొటిమల సమస్య బాధిస్తుంటే వేరుశనగ నూనె, నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని ముఖానికి అప్లై చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే బ్లాక్‌హెడ్స్, మొటిమలు తగ్గుతాయి.
►వెనిగర్‌లో ఉప్పు కలిపి చిక్కటి మిశ్రమం తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రాసి, మృదువుగా రబ్‌ చేయాలి. ఇరవై నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు తగ్గుతాయి.
►తేనెలో దాల్చినచెక్క పొడి కలపాలి. పడుకునేముందు ఈ మిశ్రమాన్ని మొటిమలు ఉన్న చోట రాయాలి. మరుసటి రోజు ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా రెండువారాల పాటు చేస్తే మొటిమలు తగ్గుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement