గులాబీలంటే అందరికీ ఇష్టమే. ఒకలాంటి మత్తు వాసనతో కూడిన మృదువైన శృంగార భరిత పువ్వులు. రోజెస్ కేవలం అలకరణకు మాత్రమే కాదు సౌందర్య సంరక్షణలో కూడా అమృతంలా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల నుంచి తీసిన రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చర్మం, జుట్టు రక్షణలో వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలోదీన్ని విరివిగా ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన రోజ్ వాటర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు, ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి!
మార్కెట్లో దొరికే రోజ్ వాటర్‌కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్‌లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తయారీ చాలా సులువు కూడా.
రోజ్ వాటర్ ఉపయోగాలు
అన్ని రకాల చర్మాలకు చక్కగా పనిచేస్తుంది.
చర్మాన్ని చల్లబర్చి ,మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి, పీహెచ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
చర్మాన్ని తేమగా ఉంచి, ఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తుంది. సన్ బర్న్స్ తగ్గిస్తుంది.
విటమిన్ ఏ సీ పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.
చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది.చర్మంపై మచ్చలు కాలిన గాయాలను నయం చేసే అద్భుత సామర్థ్యం రోజ్ వాటర్‌లో ఉంది. కలిగి ఉంటాయి.
ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి
చీడ పీడ లేని తాజా గులాబీరేకులను శుభ్రంగా నీటిలో బాగా కడగండి. ఒక గిన్నెల నీళ్లు తీసుకొని బాగా మరిగించడం. ఆ నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులను నీటిలో వేసి, తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కనీసం 4-5 గంటలు అలానే పక్కనపెట్టండి. దీంతో గులాబీ రేకుల్లోని లక్షణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. బాగా చల్లారిన తరువాత చక్కగా వడబోసుకుని తడిలేని గాజు సీసాలోకి తీసుకోవాలి. మంచి సువాసనతో ఉన్న ఈ రోజ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి.
ఎలా వాడాలి?
రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్‌తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజ్ వాటర్‌లో ముంచిన కాటన్ బాల్స్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తే నల్ల వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంగా మెరిసేలా చేస్తాయి. ముల్తానా మట్టి, ఇతర ఫేస్‌ప్యాక్‌లలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపితే మరింత ఫ్రెష్‌లుక్ వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment