Rose water
-
ఫెస్టివ్ సీజన్లో మెరిసివాలంటే ఇదిగో చిట్కా, చిటికెలో మ్యాజిక్!
గులాబీలంటే అందరికీ ఇష్టమే. ఒకలాంటి మత్తు వాసనతో కూడిన మృదువైన శృంగార భరిత పువ్వులు. రోజెస్ కేవలం అలకరణకు మాత్రమే కాదు సౌందర్య సంరక్షణలో కూడా అమృతంలా పనిచేస్తాయి. గులాబీ పువ్వుల నుంచి తీసిన రోజ్ వాటర్ ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలుగా చర్మం, జుట్టు రక్షణలో వినియోగిస్తున్నారు. ఇందులో యాంటీ బాక్టీరియల్, క్రిమినాశక లక్షణాలు సమృద్ధిగా ఉన్నాయి. అందుకే అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలోదీన్ని విరివిగా ఉపయోగిస్తారు. స్వచ్ఛమైన రోజ్ వాటర్‌తో అద్భుతమైన ప్రయోజనాలు, ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి!మార్కెట్లో దొరికే రోజ్ వాటర్‌కు బదులుగా ఇంట్లోనే తయారు చేసుకోవడం చాలా సులభం. బయట లభించే రోజ్ వాటర్‌లో హానీకరమైన కెమికల్స్ ఉంటాయి. దీని వల్ల మొటిమలు, మచ్చలు వచ్చే అవకాశం ఉంది. అందుకే సహాజంగా ఇంట్లోనే రోజ్ వాటర్ తయారు చేసుకోవడం ఉత్తమం. తయారీ చాలా సులువు కూడా.రోజ్ వాటర్ ఉపయోగాలు అన్ని రకాల చర్మాలకు చక్కగా పనిచేస్తుంది.చర్మాన్ని చల్లబర్చి ,మొటిమలు, మచ్చలను తొలగిస్తుంది. ఎర్రబడటం, మంటను తగ్గించడంలో రోజ్ వాటర్ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. చర్మ రంధ్రాలను శుభ్రపరచి, పీహెచ్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.చర్మాన్ని తేమగా ఉంచి, ఫ్రెష్‌గా, మెరిసేలా చేస్తుంది. సన్ బర్న్స్ తగ్గిస్తుంది.విటమిన్ ఏ సీ పుష్కలంగా ఉండే రోజ్ వాటర్ కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది.చర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి, ముడతలు పడకుండా తొలగిస్తుంది. చర్మంపై మచ్చలు కాలిన గాయాలను నయం చేసే అద్భుత సామర్థ్యం రోజ్ వాటర్‌లో ఉంది. కలిగి ఉంటాయి.ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలిచీడ పీడ లేని తాజా గులాబీరేకులను శుభ్రంగా నీటిలో బాగా కడగండి. ఒక గిన్నెల నీళ్లు తీసుకొని బాగా మరిగించడం. ఆ నీటిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గులాబీ రేకులను నీటిలో వేసి, తరువాత స్టవ్ ఆఫ్ చేయండి. దీన్ని కనీసం 4-5 గంటలు అలానే పక్కనపెట్టండి. దీంతో గులాబీ రేకుల్లోని లక్షణాలన్నీ ఆ నీటిలోకి చేరతాయి. బాగా చల్లారిన తరువాత చక్కగా వడబోసుకుని తడిలేని గాజు సీసాలోకి తీసుకోవాలి. మంచి సువాసనతో ఉన్న ఈ రోజ్ వాటర్‌ను ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఎలా వాడాలి?రోజూ ముఖం కడిగిన తర్వాత రోజ్ వాటర్‌తో ముఖం తుడుచుకుంటే ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. డార్క్ సర్కిల్స్ ఉన్నవారు రోజ్ వాటర్‌లో ముంచిన కాటన్ బాల్స్‌ను ప్రతిరోజు ఉపయోగిస్తే నల్ల వలయాలు క్రమంగా తగ్గుతాయి. ఇందులోని యాంటీ ఏజింగ్ లక్షణాలు ముఖాన్ని కాంతివంగా మెరిసేలా చేస్తాయి. ముల్తానా మట్టి, ఇతర ఫేస్‌ప్యాక్‌లలో నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలిపితే మరింత ఫ్రెష్‌లుక్ వస్తుంది. -
Beauty Tips: ముఖం మొటిమలతో నల్లబారుతుందా? అయితే ఇలా చేయండి..
కాలుష్యంతో మీ ముఖం నల్లబడటంగానీ, మొటిమలతోగానీ ఇబ్బందికి గురవుతుందా..? అయితే ఈ బ్యూటీ టిప్స్ మీకోసమే..! అవేంటో చూద్దాం.ఇలా చేయండి..ఆపిల్ ముక్కతో ముఖమంతా మృదువుగా రబ్ చేసి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ముఖంలోని అదనపు జిడ్డు తొలగిపోవడంతో మొటిమలు తగ్గి చర్మం తాజాగా కనిపిస్తుంది.కీరా రసంలో రోజ్‌వాటర్, నిమ్మరసం కలపాలి. రాత్రి పడుకోబోయే ముందు ఈ మిశ్రమాన్ని వేళ్లతో అద్దుకొని ముఖానికి రాసుకోవాలి. మరుసటి రోజు ఉదయాన్నే శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు తగ్గడమే కాకుండా ముఖం తాజాగా కనిపిస్తుంది.ఇవి చదవండి: నిజమే..! తాను తొమ్మిదేళ్ల సూపర్ రేసర్!! -
Beauty Tips: చర్మం కాంతివంతంగా మెరిసేలా.. ఈ బ్యూటీ టిప్స్!
దగదగా మెరిసే ముఖానికై చాలామంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ మన ఇంట్లోనే ఉన్న పసుపు, కొబ్బరిపాలు, రోజ్‌వాటర్‌తో ముఖం కాంతివంతంగా మెరిసేలా చేయవచ్చని మీకు తెలుసా! అయితే ఇలా ప్రయత్నించి చూడండి..ఇలా చేయండి..టీస్పూను పసుపు, టీస్పూను ముల్తానీ మట్టి, టీస్పూను ఆరెంజ్ పీల్ పౌడర్, కప్పు రోజ్‌వాటర్, టీస్పూను కొబ్బరిపాలు, ఆరు చుక్కల నిమ్మనూనెను తీసుకుని ఒక బౌల్లో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఐస్‌క్యూబ్స్ ట్రేలోపోసి గడ్డకట్టేంత వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ఈ క్యూబ్‌లు మూడు వారాల వరకు తాజాగా ఉంటాయి.ముఖాన్ని శుభ్రంగా కడిగి ఈ ఐస్‌క్యూబ్స్‌తో ఇరవై నిమిషాలపాటు సున్నితంగా మర్దన చేయాలి.ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగి తడిలేకుండా తుడవాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్‌ను రాసుకోవాలి.ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల ముఖంపై పేరుకు΄ోయిన మొటిమల తాలూకు మచ్చలు, వైట్, బ్లాక్ హెడ్స్, ట్యాన్పోయి ముఖం ప్రకాశవంతంగా... తాజాగా కనిపిస్తుంది.చర్మం జిడ్డు కారడం నియంత్రణలో ఉండడమేగాక, దీర్ఘకాలంగా వేధిస్తోన్న మొటిమలు కూడా తగ్గుముఖం పడతాయి.పసుపు, కొబ్బరిపాలు వృద్ధాప్య ఛాయలను నియంత్రించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. -
ఈ బ్యూటిప్స్ వాడారో.. ఇకపై ట్యాన్‌కు చెక్!
చలికాలంలో చాలా మంది తమ ముఖాలు అందంగా కనిపించేలా ప్రయత్నాలు చేస్తుంటారు. చలి తీవ్రతతో.. ముఖం నిగారింపు తగ్గడం, పెదవులు పొడిబారిపోవడం, కళ్లకింద నల్లరంగు చారలు ఏర్పడటంలాంటి సమస్యలు కనిపిస్తూంటాయి. వీటిని అధిగమించడానికి మరెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు తెలియని ఫేస్‌క్రీమ్స్ వాడి లేని సమస్యలను కొనితెచ్చుకుంటారు. మరి వీటినుండి బయటపడాలంటే ఈ చిన్న చిన్న బ్యూటిప్స్ని వాడితే చాలు. అవేంటో చూద్దాం. రోజ్ వాటర్, తేనెతో.. రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. చక్కగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్‌ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తగ్గుముఖం పడుతుంది. రోజ్ వాటర్ ముఖానికి సహజసిద్ధ్ద నిగారింపుని ఇస్తే, తేనె చర్మానికి తేమనందిస్తుంది. ఇంగువతో నిగారింపు.. రెండు స్పూన్ల ముల్తానీ మట్టిలో స్పూను తేనె, చిటికెడు ఇంగువ, స్పూను రోజ్‌వాటర్ వేసి చక్కగా కల΄ాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా వేసి ఇరవై నిమిషాల΄ాటు ఆరబెట్టాలి. తరువాత చల్లని నీటితో కడిగేయాలి. ఈ ΄్యాక్‌ను వారంలో రెండుసార్లు వేయడం వల్ల మొటిమలు, నల్లమచ్చలు, ముడతలు ΄ోతాయి. చర్మం ΄÷డిబారడం తగ్గి ముఖం కాంతిమంతమవుతుంది. ఇవి కూడా చదవండి: ఏంటి? కనీసం 6 గంటలైనా నిద్ర పోవట్లేదా..! -
కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో ఐస్‌క్యూబ్స్.. పిగ్మెంటేషన్‌కు చెక్!
ఐస్‌క్యూబ్స్‌తో చర్మానికి సరికొత్త అందాన్ని తీసుకురావచ్చు. చర్మం, మెడ మీద ఉండే నొప్పులు తగ్గిపోతాయి. దీంతోపాటు నలుపు మచ్చలు, ముఖం మీద పేరుకున్న మట్టి తొలగిపోతాయి. రక్త ప్రసరణ మెరుగవటంతో పాటు చర్మంలోని నూనె శాతాన్ని తగ్గించే ఈ ఐస్ క్యూబ్స్ బ్యూటీ టిప్స్‌ను తెలుసుకుందాం. తులసి, అలొవెరా జెల్ ఒక బౌల్లో నీళ్లు తీసుకుని అందులో గుప్పెడు తులసి ఆకుల్ని నలిపి వేయాలి. ఆ తర్వాత రెండు స్పూన్ల అలొవెరా జెల్‌ను వేసి బాగా కలపాలి. ఆ నీటిని ఐస్‌క్యూబ్స్ ట్రేలో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ ఐస్‌క్యూబ్స్‌తో చర్మాన్ని రుద్దితే ముఖ చర్మం తాజాగా మెరవడంతోపాటు వేడివల్ల వచ్చిన మచ్చలు తొలగి పోతాయి. స్పిన్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఐస్‌క్యూబ్స్ ట్రేలో ఒక కప్పు రోజ్‌వాటర్‌తో పాటు కప్పు మంచి నీళ్లు కలపాలి. దీనిని ఫ్రీజర్‌లో ఉంచాలి. ఆ ఐస్‌క్యూబ్స్‌తో మెల్లగా చర్మంపై రుద్దితే ముడతలు తగ్గిపోతాయి. స్కిన్ ఇన్ఫెక్షన్స్ దరి చేరవు. దీంతోపాటు ముఖం ఫ్రెష్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. దోసకాయ ముక్కలతో ఒక బౌల్లో మెత్తగా దంచిన దోసకాయ ముక్కలను వేయాలి. దీనికి ఐదారు చుక్కల నిమ్మరసం కలపాలి. ఇందులో ఐస్‌క్యూబ్స్ వేసి కొన్ని గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచి.. తీసిన తర్వాత వీటితో ముఖంపై రబ్ చేయాలి. దీనివల్ల రక్తప్రసరణ సాఫీగా జరిగి నొప్పులు, మొటిమలు తగ్గిపోతాయి. కమిలినట్లుగా ఉన్న ముఖం తాజాగా మారుతుంది. కుంకుమ పువ్వు, రోజ్ వాటర్‌తో చర్మ సౌందర్యానికి కుంకుమ పువ్వుకి సాటి లేదు. కుంకుమ పువ్వును కొంచెం రోజ్ వాటర్‌లో కలపాలి. ఈ రెండిటినీ బాగా కలిపాక.. ఐస్ క్యూబ్స్ ట్రేలో వేసి క్యూబ్స్ తయారు చేసుకోవాలి. వాటితో ముఖం మీద సున్నితంగా మర్దన చేస్తే పిగ్మెంటేషన్ , నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గిపోతాయి. ముఖ్యంగా స్కిన్‌టోన్ మారిపోతుంది. చదవండి: Beauty: కొబ్బరి పాలతో స్క్రబ్.. వేపాకులు వేసిన నీటితో స్నానం చేస్తే.. -
ముఖంపై మొటిమలా? పచ్చి కూరగాయలు తిన్నా, జ్యూస్ తాగినా..
ముఖంపై మొటిమలతో ఇబ్బందిగా అనిపిస్తోందా? అయితే, ఈ చిట్కాలు మీకోసమే.. ►ముఖంపై మొటిమలు ఉంటే రోజ్ వాటర్, అలోవెరా జెల్ కలిపి రాసుకోండి. ►టీస్పూన్ అలోవెరా జెల్‌ను స్పూన్ రోజ్ వాటర్‌లో కలిపి మీ ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ►అరగంట తరువాత, ముఖాన్ని శుభ్రమైన నీటితో కడగాలి. ►కలబందను ముఖానికి రోజుకు రెండు మూడు సార్లు అప్లై చేయడం ద్వారా మొటిమల సమస్య నుండి బయటపడవచ్చు. ముఖ సౌందర్యం కోసం.. ►ముఖ సౌందర్యానికి రోజూ పచ్చి కూరగాయలు తినాలి. ►లేదా పచ్చి కూరగాయల జ్యూస్ తాగినా అద్భుతంగా పనిచేస్తుంది. ►కూరగాయలతో జ్యూస్ చేసుకుని తీసుకోవడం వల్ల అందంగా తయారవుతారు. ►పసుపు, చందనం కలిపి తరచూ ముఖానికి మసాజ్ చేయటం కూడా అందాన్ని రెట్టింపు చేస్తుంది. ►స్నానం చేసే సమయంలో లేదంటే మామూలుగా అయినా వీటిని శరీరానికి రాసుకోవటం అలవాటు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. చదవండి: Skin Care: చేమంతులతో ముడతల్లేని చర్మం.. తేనెతో గులాబీ రంగు పెదాలు.. ఇంకా.. రక్తనాళాల్లో రక్తం గడ్డ కట్టడం దేనికి సంకేతం? బ్లాక్ కాఫీ తాగుతున్నారా? ఇవి తింటే.. -
Beauty Tips: మొటిమలను శాశ్వతంగా దూరం చేసేందుకు ఇలా చేస్తే సరి!
పుదీనా ఆకులను ఎండబెట్టి పొడి చేయాలి. ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ఈ పేస్టుని ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ఈ పేస్టు చర్మంపై పేరుకు పోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. -
Beauty: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే
ముఖం మీద నల్ల మచ్చలు, ట్యాన్ కారణంగా ఇబ్బంది పడతారు చాలామంది. అలాంటి వారు ఈ చిట్కాను ట్రై చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. మెరిసే చర్మం సొంతమవుతుంది. బియ్యం, రోజ్‌వాటర్‌తో పాటు.. ►అర కప్పు బియ్యంలో కాస్త రోజ్‌వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ►ఉదయాన్నే రోజ్వాటర్తోపాటు బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ►దీనిలో ఎనిమిది కుంకుమపువ్వు రేకులు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ వేసి చక్కగా కలుపుకోవాలి. ►మిశ్రమం క్రీమ్‌లా మారేంతవరకు కలుపుకుని గాజుసీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. ►రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ►ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ►క్రమం తప్పకుండా వారం రోజుల పాటు క్రీమ్ రాసుకోవడం వల్ల నల్లమచ్చలు, ట్యాన్ తగ్గి, ముఖచర్మం కాంతిమంతంగా మారుతుంది. చర్మం తాజాగా ఉండేందుకు.. రోజ్ వాటర్ ముఖానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. తరచుగా ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖ చర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకుని.. చర్మం తాజాగా కనిపిస్తుంది. చదవండి: Chicken Eggs: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఇలా చేస్తే
మొటిమల సమస్య వేధిస్తోందా? ఈ చిట్కాలు ట్రై చేసి చూడండి. ►పదిహేను పుదీనా ఆకుల్ని తీసుకుని మెత్తగా నూరాలి. ►దీనిలో రెండు టీస్పూన్ల ఓట్స్, రెండు టీస్పూన్ల కీరా రసం, టీస్పూను తేనె వేసి చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూతలా వేసుకుని ఇరవై నిమిషాల తరువాత నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల మొటిమలు పోతాయి. తేనెతో పాటు.. పుదీనా ఆకుల పేస్టులో తేనె, రోజ్‌వాటర్ వేసి కలిపాలి. మొటిమలపైన పూతలా వేసుకుంటే మొటిమలు, వాటి తాలూకు మచ్చలు పోతాయి. ఇలా కూడా! కొన్ని పుదీనా, కొన్ని తులసి ఆకులు తీసుకొని బాగా పిండాలి. ఒక నిమ్మకాయ తీసుకుని ఈ రసంలో పిండాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని మొటిమలపై పూయాలి. ఆరిన తర్వాత ముఖం కడుక్కోవాలి. చర్మం గరుకుగా ఉంటే.. ముఖంపై చర్మం గరుకుగా అనిపిస్తోందా? అలాంటప్పుడు.. క్యాబేజీని ఉడికించిన నీళ్లలో కొద్దిగా శనగపిండి కలిపి ముఖానికి మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా మారే అవకాశం ఉంటుంది. గుంతలు పోవాలంటే.. మొటిమలు తగ్గిన తర్వాత కూడా వాటికి సంబంధించిన గుంతలు అలాగే ఉంటాయి చాలా మందికి. ఈ సమస్య నుంచి బయపడాలంటే.. ఉడకపెట్టిన బంగాళదుంప గుజ్జును ఓ వారం పాటు రాత్రుళ్లు నిద్రపోయే ముందు ముఖానికి రాస్తే సరి! చదవండి: Hair Fall Control: అల్లం, ఆవాలు, లవంగాలతో.. ఇలా చేస్తే జుట్టు ఒత్తుగా, పొడవుగా! Madhuri Dixit: వారానికి 3 సార్లు ఇలా చేస్తా! నా బ్యూటీ సీక్రెట్ అదే! -
ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! ఇవి ట్రై చేస్తే..
Tips To Relax Eyes- Stress Relief: ఎక్కువ సమయం కంప్యూటర్ స్క్రీన్ లేదా మొబైల్ స్క్రీన్ చూడడం వల్ల కళ్లు ఒత్తిడికి గురై అలసిపోతుంటాయి. ఇలాంటి కళ్ల ఒత్తిడిని తగ్గించి ఉపశాంతిని కలిగించే మాస్క్‌లను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... రోజ్‌వాటర్‌తో.. ►రోజ్‌వాటర్‌లో కాటన్ ముక్కను కాసేపు నానబెట్టాలి. తరువాత కాటన్‌ను రెండుకళ్లపై మొత్తం కప్పి ఉంచి, పదిహేను నిమిషాలు తరువాత తీసేయాలి. ఒకసారి ఇలా చేసిన తరువాత కాటన్‌ను రిఫ్రిజిరేటర్లో పెట్టి మరోసారి కూడా వాడుకోవచ్చు. నల్లని వలయాలు సైతం తగ్గుముఖం ►టీ బ్యాగ్‌లను చల్లటి నీటిలో నానబెట్టాలి. తరువాత టీ బ్యాగ్‌లను నీటి నుంచి బయటకు తీసి, టీబ్యాగ్లో అధికంగా ఉన్న నీటిని పిండి కళ్లమీద పెట్టుకుని పదినిమిషాలు ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల కళ్లకు ఒత్తిడి తగ్గడంతోపాటు, కంటిచుట్టూ ఏర్పడిన నల్లని వలయాలు క్రమంగా తగ్గుముఖం పడతాయి. బంగాళదుంప, పుదీనా పుదీనాతో.. ►బంగాళదుంప, పుదీనా ముఖాన్ని అందంగా ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ►అదేవిధంగా కళ్ల ఒత్తిడిని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తాయి. ►పుదీనా రసం, బంగాళ దుంప రసాన్ని సమపాళ్లలో తీసుకుని బాగా కలిపి పదినిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►మిశ్రమం చల్లబడిన తరువాత .. కాటన్ బాల్‌ను ముంచి కళ్లమీద పెట్టుకుని ఐదు నిమిషాలు ఉంచుకోవాలి. ►కళ్ల ఒత్తిడి తగ్గడంతోపాటు, కళ్లచుట్టూ ఏర్పడిన ముడతలు తగ్గుముఖం పడతాయి. ►వీటిలో ఏ ఒక్కటి పాటించినా కళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చదవండి: Tips To Increase Platelet Count: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో పాటు గుమ్మడి, గోధుమ గడ్డి.. ఇంకా ఇవి తింటే.. Mental Health: ఎక్కువ సేపు కూర్చుని ఉంటున్నారా? ఆ మూడింటిపై నియంత్రణ లేకపోతే! అంతే ఇక.. -
Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో..
ముఖం మీద మొటిమల మచ్చలు, గీతలు ఉంటే ఇబ్బంది పడతారు చాలా మంది. బ్యూటీ పార్లర్లకు వెళ్లి డబ్బు ఖర్చు చేస్తారు. అయితే, ఇంట్లోనే కొద్దిపాటి శ్రద్ధ తీసుకుంటూ ఈ చిట్కాలు పాటిస్తే మీ ముఖారవిందం మీకే కనువిందు చేస్తుంది. తేనె, రోజ్ వాటర్ వేసి.. ►రెండు టేబుల్ స్పూన్ల బియ్యప్పిండిలో టీస్పూను తేనె, టీస్పూను రోజ్ వాటర్ వేసి చక్కగా కలపాలి. ►శుభ్రంగా కడిగి పొడిగా తుడిచిన ముఖానికి ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. ►తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►వారానికి ఒకసారి ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ముఖం మీద నల్లటి మచ్చలు, ట్యాన్ వల్ల ఏర్పడిన నలుపు పోతుంది. ►రోజ్ వాటర్ చర్మానికి సహజసిద్ధమైన మెరుపునిస్తే, తేనె చర్మానికి లోపలినుంచి తేమనందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇవి కూడా పాటిస్తే... ►ఒక టేబుల్ స్పూన్ తేనెలో టీ స్పూన్ నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి ముఖానికి రాయాలి. ►ఇలా ప్రతిరోజూ చేస్తుంటే మూడు వారాలకు ఫలితం కనిపిస్తుంది. ►ముఖం మీదున్న నల్ల గీతలు, మచ్చలు తొలగిపోయి చంద్రబింబంలా మెరుస్తుంది. బంగాళా దుంపతో.. ►ఒక టేబుల్ స్పూన్ బంగాళదుంప తురుములో ఐదారు చుక్కల నిమ్మరసం, అంతే మోతాదులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి. ►కొంచెం మంటగా ఉంటుంది. కాబట్టి ముఖమంతా పట్టించవద్దనుకుంటే మచ్చల మీద మాత్రమే రాయవచ్చు. ►ఇరవై నిమిషాల తర్వాత చన్నీటితో కడగాలి. ►అయితే పిగ్మెంటేషన్, సన్‌బర్న్ వంటి సమస్యలకు పై ప్యాక్‌ను ముఖమంతా వేస్తే మంచి ఫలితం ఉంటుంది. వేపాకులతో.. ►వేపాకులను పచ్చిగా కాని ఉడికించి కాని పేస్టు చేసి ముఖానికి రాస్తే మచ్చలు, గుల్లలు విస్తరించకుండా తగ్గిపోతాయి. చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Smart Necklace: నెక్లెస్ ఉంటే ఆరోగ్యం పదిలం... -
Beauty Tips: పెరుగు, రోజ్ వాటర్.. ఇంకా! నా బ్యూటీ సీక్రెట్ అదే: అనుష్క
అందం, అభినయంతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ రబ్ నే బనాదీ జోడీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అనుష్క.. బీ-టౌన్ అగ్ర హీరోయిన్గా ఎదిగింది. అంతేకాదు తన సోదరుడు కర్ణేశ్ శర్మతో కలిసి పలు హిట్ సినిమాలు నిర్మించింది కూడా! ఇక 2017లో టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని పెళ్లాడింది ఈ అయోధ్య అందం. ఈ క్రమంలో గతేడాది పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అనుష్క శర్మ. కాగా ఎంతటి బిజీ షెడ్యూల్‌లోనైనా ఫిట్‌నెస్‌కు సమయం కేటాయించే ఆమె.. ముఖ సౌందర్యాన్ని కాపాడుకోవడానికీ అంతే ప్రాధాన్యతనిస్తుంది. అయితే, నిగనిగలాడే చర్మం కోసం కృత్రిమ పద్ధతుల బదులు ఇప్పటికీ తన తల్లి చెప్పిన చిట్కానే ఫాలో అవుతానంటోంది ఈ అందాల రాశి. అమ్మ చెప్పింది! అనుష్క శర్మ సౌందర్య రహస్యం ఆమె మాటల్లోనే.. ‘‘నిగనిగలాడే చర్మం కోసం సదా నేను పాటించే చిట్కా ఒక్కటే... ఫేస్ ప్యాక్. కొంచెం పెరుగు, రోజ్ వాటర్‌లో కాసింత వేపాకు పొడి వేసి బాగా కలిపి మొహానికి, మెడకు అప్లయ్ చేస్తాను. అది ఆరిపోయాక చన్నీళ్లతో మొహం కడిగేసుకుంటాను. ఎంత తరచుగా వీలైతే అంత తరచుగా ఈ చిట్కాను పాటిస్తా. నేను టీన్స్‌లో ఉన్నప్పుడు పింపుల్స్ వస్తుంటే మా అమ్మ చెప్పింది ఈ కిటుకు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా మొహమ్మీద చిన్న మచ్చ కూడా లేకుండా.. రాకుండా కాపాడుతోంది ఈ ఫేస్ ప్యాక్’’. కాగా అనుష్క శర్మ ప్రస్తుతం.. భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్ చక్దా ఎక్స్‌ప్రెస్ సినిమాతో బిజీగా ఉంది. ఇక వీలు చిక్కినప్పుడల్లా భర్త విరాట్ కోహ్లి, కూతురు వామికతో అనుష్క సరదాగా సమయం గడుపుతుంది. ఈ అప్డేట్లను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో అకౌంట్లలో షేర్ చేస్తూ ఉంటుంది. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) చదవండి: Shilpa Shetty: పొరపాటున కూడా మొహానికి సబ్బు వాడను.. నా బ్యూటీ సీక్రెట్ అదే! -
Beauty Tips: ఈ చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం!
కొంతమంది ఎత్తుకు తగిన బరువుతో ఆకర్షణీయమైన పర్సనాలిటీతో ఉంటారు. తీరా ముఖం దగ్గరికొచ్చేసరికి మచ్చలు కనిపించి ఉస్సురనిపిస్తాయి. ముఖాన్ని అందహీనంగా మార్చే ఈ నల్లటి మచ్చలనే మంగు మచ్చలంటారు. ఈ మచ్చలు ముఖం రెండు వైపులా బుగ్గలపై నుంచి ముక్కు వరకూ వ్యాపిస్తాయి. ఇవి ముఖంతో పాటు మెడ, భుజాలు, వీపు వెనుకభాగంలో కూడా ఏర్పడే అవకాశం ఉంది. ఇదేమీ వ్యాధి కాదు కానీ, ఇలా మచ్చలు ఉన్న వారు ఆత్మన్యూనతతో పదిమందిలోకీ వెళ్లడానికి ఇబ్బంది పడతారు. అసలు ఇలాంటి మచ్చలు ఎందుకు వస్తాయో తెలుసుకుంటే వాటిని నివారించవచ్చు. తొలిదశలోనే ఉన్న వాటిని చిన్న చిన్న చిట్కాలతో నయం చేసుకోవచ్చు. శరీరతత్వాన్ని బట్టి ముఖంపై మొటిమలు, పులిపిర్లు, పెద్ద పరిమాణంలో ఉండే పుట్టుమచ్చలు, వయసుతో పాటు ఏర్పడిన మార్పులు, ఎండలో తిరగటం వల్ల ఏర్పడిన మచ్చలు మొదలైనవి ఏర్పడుతుంటాయి. వీటిలో కొన్ని వంశపారంపర్యంగా వస్తే, మరికొన్ని హార్మోన్లలో సమతుల్యత లోపించడం వల్ల కూడా రావచ్చు. వంశపారంపర్యంగా వచ్చే మచ్చలను నివారించలేకపోయినా, వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు. ఈ చిట్కాలతో ముఖంపై మంగు మచ్చలు మాయం! ►తాజా వెన్నను ముఖంపైన ఉండే మంగు మచ్చలపై రోజూ రుద్దుతుంటే క్రమేణా పలచబడి కొంతకాలానికి చర్మం రంగులో కలిసిపోతాయి. ►పచ్చి పసుపు, ఎర్రచందనం సమభాగాలుగా కలిపి పాలల్లో కలిపి రాస్తుంటే మంగు మచ్చలు, చెంపలపైన ఉన్న నల్లని మచ్చలూ తగ్గుతాయి. ►జాజికాయను పాలలో అరగదీసి రాయడం వల్ల గుణం కనిపిస్తుంది. ►పాలల్లో ఎర్రకందిపప్పు నూరి నేతిలో కలిపి మంగు మచ్చలపై రాస్తుంటే కొద్ది రోజుల్లోనే నలుపుదనం పోతుంది. ► పావు టీ స్పూన్ నిమ్మరసానికి సమంగా తేనె కలిపి మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా నెల రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ►టొమాటోను రెండు ముక్కలుగా తరిగి, ఆ ముక్కలతో మచ్చలపై బాగా రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. క్రమం తప్పకుండా ఇలా చేయడం వల్ల మచ్చలు తగ్గడంతోపాటు ముఖ వర్చస్సు పెరుగుతుంది. ►అలోవెరా పేస్టును మచ్చలపై పూయాలి. ఆ మచ్చతడి ఆరిపోయాక చల్లని నీటితో శుభ్రంగా కడిగేయాలి. ఇలా చేయడం వల్ల క్రమంగా మచ్చలు తగ్గిపోతాయి. టీ స్పూన్ టొమాటో రసం, టీ స్పూన్ గంధం పొడి, రెండు టీ స్పూన్ల ముల్తాని మట్టి కలిపి మెత్తని పేస్టులా చేసి మచ్చలపై పట్టించి 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు లేదా మూడుసార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ►రోజ్ వాటర్, కీరా రసం, నిమ్మరసం, తేనె సమంగా కలిపి మచ్చలపై రుద్ది 20 నిమిషాల తర్వాత చల్లని నీటితో కడుగుతుంటే నెల రోజులు గడిచేసరికి మంచి మార్పు వస్తుంది. ►బంగాళదుంప చెక్కు తీసి, సన్నగా తురిమి పల్చని గుడ్డలో పిండి, రసం తీయాలి. దానిలో దూది ఉండలని ముంచి, వాటితో మచ్చలపై అద్దాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేయాలి. అన్నింటికన్నా ముఖ్యమైనది ఆత్మన్యూనతకు గురికాకుండా ఉండటం. ఆత్మన్యూనత వల్ల, బిడియం వల్ల పదిమందిలో కలవలేకపోవడం, కలిసినా, ముఖాన్ని చేతులతో కవర్ చేసుకోవడం వంటి వాటి వల్ల అందరి దృష్టి పడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఉండి చక్కగా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉంటే ఏ మచ్చలూ మన అందాన్ని మసక బార్చలేవు. చదవండి👉🏾 Sugarcane Juice: చెరుకు రసం తరచుగా తాగుతున్నారా.. అయితే -
చెమట కాయలా? ఆ నీటితో స్నానం చేశారంటే!
ఎండలు మండుతున్నాయి. దీంతో విపరీతమైన చెమట, దురదలతో చాలా ఇబ్బంది పడిపోతుంటారు. చర్మం తన మృదుత్వాన్ని కూడా కోల్పోతుంది. చెమటకాయలు దురదకు కారణమై, చికాకు, ఆయా భాగాలలో మంట, నొప్పికి దారితీస్తాయి. అతిగా చెమట పట్టే వారిలో వీటి సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా నుదుటిపై, ముఖం, మెడ, వీపు, ఛాతీ, తొడల మీద చెమట కాయలు వస్తుంటాయి. వీటి తీవ్రత ఎక్కువైతే చర్మం ఎర్రపొక్కులుగా మారటం, గోకటం వల్ల చర్మం చిట్లి రక్తం కారడం జరుగుతుంది. కొన్ని చిట్కాలతో కొంత ఉపశమనం పొందవచ్చు. అవేంటో చూద్దాం. ►రెండు పూటలా స్నానం చేస్తూ శరీరాన్ని శుభ్రంగా వుంచుకోవాలి. చెమట ఎక్కువగా పట్టినప్పుడు స్నానం చేయడం, లేదా తడి వస్త్రంతో శరీరాన్ని తుడవడం తప్పనిసరి. వదులుగా ఉండే పల్చని కాటన్ వస్త్రాలు వేసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. దాంతో శరీరం చల్లగా ఉంటుంది. వీలైనంత వరకు ఎండలోకి వెళ్లకుండా చూసుకోవాలి. ►స్నానం చేసే నీటిలో గుప్పెడు మల్లెపూలు, జాజిపూలు లేదా వట్టివేళ్ల చూర్ణం వేసి గంటసేపు నాననిచ్చి, ఆ నీటితో స్నానం చేయడం మంచిది. ఇటువంటి స్నానం శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. ►వంటినిండా చెమటకాయలు వచ్చినప్పుడు గంధం ముద్దని పేలిన చోట పల్చని పూతలా వేసుకుంటే, మంట, దురద తగ్గుతాయి. ఇందులో కర్పూరాన్ని కలిపి పేలిన చోట లేపనంలా రాసినా కూడా సమస్య అదుపులోకి వస్తుంది. మార్కెట్లో లభ్యమయ్యే గంధం పొడిలో సహజత్వం ఉండదు. అందుకే గంధపు చెక్కని సానపై అరగదీసి, దాన్ని వాడటం శ్రేయస్కరం. ►చందనం పొడి, వట్టివేళ్ల పొడిని రోజ్‌వాటర్‌లో కలిపి పల్చని లేపనంలా చెమట కాయలపై రాసినా మంచిదే. కలబంద గుజ్జుని రాసుకున్నా కూడా చెమటకాయల నుంచి ఉపశమనం కలుగుతుంది. ►తాటి ముంజెలలోని నీటిని చెమట కాయలపై రాసి, ఆరిన తర్వాత శుభ్రమైన వస్త్రంతో మృదువుగా తుడిచేయాలి. పుచ్చకాయ, కర్బూజా, కీరదోస, ముంజెలు, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, పల్చని మజ్జిగ... వంటి చలువచేసే పదార్థాలు వీలైనంత ఎక్కువగా తీసుకోవాలి. కారం, గరం మసాలా, నూనెలో వేయించిన పదార్థాలకు దూరంగా ఉండాలి. చదవండి: మొలకలు తింటున్నారా? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు! -
తులసి ఆకుల గుజ్జు, శనగపిండి.. మోము మెరిసేలా!
మోము మెరుపు కోసం మార్కెట్టులో దొరికే లోషన్లు, క్రీముల వంటివి ఎన్ని కొనుగోలు చేసి వాడినా... తాత్కాలిక మెరుపు తప్ప శాశ్వతమైన కాంతి సొంతం కాదంటున్నారు. అందుకే ముఖసౌందర్యానికి కాస్త సమయాన్ని వెచ్చిస్తే సరిపోతుంది. కావల్సినవి: క్లీనప్ : రోజ్ వాటర్ – 2 టీ స్పూన్లు; స్క్రబ్ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు; మాస్క్: తులసి ఆకుల గుజ్జు – 1 టీ స్పూన్, కమలా జ్యూస్ – అర టీ స్పూన్, శనగపిండి – 1 టీ స్పూన్ తయారీ: ►ముందుగా మెత్తని క్లాత్ తీసుకుని.. రోజ్ వాటర్‌తో ముఖం, మెడ క్లీన్ చేసుకోవాలి. ►ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. ►తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ►ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, కమలా జ్యూస్, శనగపిండి కలిపి.. ముఖానికి అప్లై చేసుకోవాలి. ►ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ►ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడంతో పాటు రోజుకు మూడు లీటర్లకు తగ్గకుండా నీళ్లు తాగాలి. చదవండి: Summer Tips: స్విమ్ చేస్తే చర్మం పాడైపోతుందా? ఈ చిట్కాలు పాటిస్తే సరి! -
గంధం పొడి, రోజ్ వాటర్, నిమ్మరసం.. నేచురల్ బ్లీచ్ తయారీ ఇలా!
Natural Face Bleaching Home Remedies: ముఖ చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, ముఖవర్చస్సుని మరింతగా మెరిపించడంలో ఫేషియల్ బ్లీచ్ బాగా పనిచేస్తుంది. కానీ రసాయనాలతో తయారైన బ్లీచ్ల వల్ల కొన్నిరకాల అలెర్జీలు, దద్దుర్లు వంటివి వచ్చి ముఖం పాడైపోతుంటుంది. ఇలాంటి సమస్యలేవి ఎదురుకాకుండా ఇంట్లోనే సులభంగా బ్లీచ్‌ను తయారు చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం... ►టీస్పూను పసుపు, టీస్పూను రోజ్ వాటర్, అర టీస్పూను నిమ్మరసం, పావు టీస్పూను గంధం పొడి ఒక గిన్నెలో తీసుకుని కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పదినిమిషాలు నానబెట్టుకోవాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. నానబెట్టిన మిశ్రమాన్ని బ్రష్ తో ముఖానికి అప్లై చేసి పదినిమిషాలపాటు ఆరనివ్వాలి. ►పది నిమిషాల తరువాత టొమాటో లేదా నిమ్మ చెక్కతో ముఖాన్ని గుండ్రంగా ఏడు నిమిషాలపాటు మర్దన చేసి చల్లని నీటితో కడిగేయాలి. ►తడిలేకుండా తుడిచి, ముఖానికి అలొవెరా జెల్‌ను అప్లై చేయాలి. పదిహేనురోజులకొకసారి ఇలా చేయడం వల్ల ముఖం మెరుపుని సంతరించుకుంటుంది. చదవండి: ‘రక్తపిశాచ’ జబ్బు.. దీని గురించి మీకు తెలుసా! -
బ్యూటిప్
వాతావరణం చల్లబడిందంటే పెదవులు పగలడం మొదల వుతుంది. వాటిని మళ్లీ అందంగా చేయాలంటే... రెండు చెంచాల తేనెలో ఒక చెంచా మీగడ, నాలుగైదు చుక్కల రోజ్ వాటర్ కలిపి, రోజూ రాత్రిపూట పెదవులపై రాసుకోవాలి. నిమ్మరసంలో ధనియాల పొడి కలిపి రాసుకున్నా పగుళ్లు పోతాయి. కొత్తిమీర రసాన్ని కానీ, బీట్రూట్ రసాన్ని కానీ క్రమం తప్పకుండా రాసినా మంచి ఫలితముంటుంది. -
తాజాగా తేజస్సుతో..
కొన్ని ద్రాక్ష పండ్లను సగానికి కట్ చేసి, ఆ సగం ముక్కలతో ఒక దాని తర్వాత ఒకటిని ఉపయోగిస్తూ ముఖంపైన మృదువుగా రుద్దాలి. ద్రాక్షలోని ఔషధ గుణాల వల్ల మృతకణాలు సులువుగా వదిలిపోతాయి. ఎండ వల్ల కందిన చర్మం పూర్వపు స్థితికి చేరుకుంటుంది ∙టేబుల్ స్పూన్ ముడి తేనెను కొద్దిగా వేడిచేయాలి. తట్టుకోగలిగేంత వేడిగా ఉన్నప్పుడు వేళ్లతో ఆ తేనెను తీసుకొని ముఖమంతా రాయాలి. 5–10 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి ∙టేబుల్‌స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ల మీగడ కలిపి ముఖానికి పట్టించి, పది నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే చర్మకాంతి ఇనుమడిస్తుంది ∙పిగ్మెంటేషన్ వల్ల అయిన నలుపు మచ్చలు పోవాలంటే బంగాళదంపను సగానికి కోసి, ఆ ముక్కతో మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తూ ఉంటే నలుపు తగ్గుతుంది ∙దోస రసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. చల్లబడిన తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి రాయాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇది ఎండ వేడి నుంచి ఉపశమిస్తుంది. సన్స్క్రీన్లోషన్లా పనిచేస్తుంది. -
స్నానంతో...
స్నానం శరీరాన్ని ఆరోగ్యంగా, చురుగ్గా, మనసుని ఉల్లాసంగా ఉంచుతుంది. మెదడుని ఉత్తేజపరుస్తుంది. అలసిన దేహం తిరిగి తాజాదనం పొందుతుంది. ∙ ఉదయం వేళ రెండు స్పూన్ల నిమ్మరసాన్ని బకెట్ నీటిలో కలిపి స్నానం చేస్తే వేసవిలో బాధించే చెమట వాసన రాదు. ∙పొడిచర్మం వున్నవాళ్లు బకెట్ నీటిలో అర టీ స్పూన్ కొబ్బరినూనె లేదా బాదంనూనె కలిపి స్నానం చేస్తే చర్మం మృదువుగా అవుతుంది. ∙ రోజంతా తాజాగా అనిపించాలంటే నీటిలో అరకప్పు రోజ్‌వాటర్ కలుపుకొని స్నానం చే యాలి. రోజూ సాయంకాలం గోరువెచ్చని నీటిలో గుప్పెడు గులాబీ రేకుల్ని వేసి స్నానం చేస్తే బడలిక తీరుతుంది. చర్మానికి మంచి రంగు వస్తుంది. ∙చిన్న అల్లం ముక్క వేసి ఉడకబెట్టిన నీటిని కలుపుకొని స్నానం చేస్తే కీళ్ళనొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.స్నానం చేసిన తరువాత తడి ఒంటికి మాయిశ్చరైజర్‌ని రాసుకుంటే చర్మం మృదుత్వాన్ని కోల్పోదు. స్నానానికి ముందు శరీరానికి, ముఖానికి నూనెతో మర్దన చేయడం వల్ల కండరాలు ఉత్తేజితమవుతాయి. చర్మం మృదువుగా తయారవుతుంది. -
ఇన్స్టంట్ కేర్
ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు చర్మ సంరక్షణ కోసం ఎక్కువ సమయం కేటాయించడం కష్టమే. ఆ లోటును రోజ్ వాటర్ భర్తీ చేస్తుంది. పన్నీరు ఇన్‌స్టంట్‌గా పని చేస్తుంది. ఇది నాచురల్ క్లెన్సర్, స్కిన్ టోనర్‌గా కూడా పని చేస్తుంది. పన్నీటిలో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే సన్‌బర్న్, యాక్నె సమస్యలు తగ్గుతాయి. ఎండాకాలం దేహానికి చల్లదనాన్నిస్తుంది ∙శీతాకాలంలో సాధారణంగానే నీటిని తక్కువ తాగుతాం. దాని వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఆ సమస్యకు కూడా పన్నీరు రాయడం ఓ పరిష్కారం పన్నీరు చర్మాన్ని మృదువుగా ఉంచి సాగేగుణాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పని చేస్తుంది. చర్మానికి కవర్‌గా పని చేసి వాతావరణంలోని మార్పుల ప్రభావం నుంచి కాపాడుతుంది. రోజుకోసారి పన్నీటిని అప్లై చేస్తే మంచిది. -
వామ్మో ! బిర్యానీలో రోజ్ వాటర్
-
రోజ్ రోజ్ రోజ్ వాటర్...
బ్యూటిప్స్ రోజ్‌వాటర్‌ను అచ్చ తెలుగులో చెప్పాలంటే గులాబీ నీరు. దీనిని ముఖానికి పట్టిస్తే చాలా మంచిది. అయితే దానికొక పద్ధతి ఉంది. అదేమిటో చూద్దాం. కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖచర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకొంటాయి. దానివల్ల ముఖ చర్మం తాజాగా ఉంటుంది. దీనికి మరికొన్ని పొడులు కలిపితే చర్మసౌందర్యం చెప్పనలవి కాదు. వాటిలో ముల్తానీ మట్టి బెస్ట్. ఇది అన్ని ఫేస్ ప్యాక్స్‌లో కంటే చాలామంచి ఫేస్ ప్యాక్. ఇది వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశిస్తుంది. ముల్తానీ మట్టిలో కొద్దిగా రోజ్ వాటర్ చుక్కలను కలిపి ఈ పేస్ట్‌ను ముఖానికి, మెడకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసినట్లైతే ముఖం ప్రకాశవంతంగా మెరుస్తుంటుంది.ఆరెంజ్ ఫేస్‌ప్యాక్ చర్మ రంధ్రాలను తెరచుకొనేలా చేస్తుంది. నారింజ తొక్కలను ఎండబెట్టి మెత్తటి పొడిలా చేసుకోవాలి. అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి, ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే ముఖం ప్రకాశవంతంగా తయారవుతుంది. -
బ్యూటిప్స్
బంగాళదుంప తురుము – రెండు టేబుల్ స్పూన్లు, తేనె – సరిపడా. ముందుగా బంగాళదుంప తురుముని ఐస్ వాటర్‌లో అయిదు నిమిషాల పాటుంచి తీయాలి. దీంట్లో తేనె కలిపి ఈ మిశ్రమాన్ని కళ్ల చుట్టూ అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు రిలాక్స్ అవ్వాలి. తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తే కళ్ల చుట్టూ ఏర్పడ్డ నల్లటి వలయాలు తగ్గుతాయి. రెండు టీ స్పూన్ల శనగపిండిలో చిటికెడు పసుపు, కొన్ని చుక్కల రోజ్ వాటర్, కొద్దిగా గ్లిజరిన్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడ మొదలుకొని ముఖానికి పట్టించి ఆరిన తరవాత చన్నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే చర్మ కాంతిలో వచ్చే మార్పు ఇట్టే తెలిసిపోతుంది. -
బ్యూటిప్స్
టేబుల్ స్పూన్ పచ్చి పాలలో కొన్ని చుక్కల రోజ్ వాటర్, తేనె, కొద్దిగా శనగపిండి వేసి పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిస్తే ముఖం నిగారిస్తుంది.టీ స్పూన్ శనగపిండిలో మూడు చుక్కల నిమ్మరసం, కొద్దిగా బొప్పాయి రసం కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. అర టేబుల్ స్పూన్ మెంతులను పొడి చేయాలి. దీంట్లో పెరుగు, మూడుచుక్కల రోజ్‌వాటర్ కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మెడకు, ముఖానికి పట్టించి 20 నిమిషాల తరవాత కడిగేయాలి. వారంలో ఒకసారి ఈ ప్యాక్ వేసుకుంటే చర్మం నిగారిస్తుంది. -
తులసి ఫేస్ ప్యాక్
బ్యూటిప్స్ తులసి ఆకులు – కొన్ని, ఓట్స్ పొడి – రెండు టీ స్పూన్లు, పాల పొడి – రెండు టీ స్పూన్లు తులసి ఆకులు మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. దీంట్లో ఓట్మీల్ పొడి, పాల పొడి వేసి కొద్దిగా నీటిని చేర్చి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి ఆరిన తరవాత కడిగేయాలి. కాఫీ పౌడర్ మాస్క్ జిడ్డు చర్మం పెట్టే కష్టాలు భరించలేకపోతున్నారా? అయితే ఈ చిట్కా మీ కోసమే. కాఫీ పొడి, పాల పొడి మీ సమస్యను ఇట్టే దూరం చేస్తాయి. పాల పొడి, కాఫీ పొడి రెండింటిని సమపాళ్లల్లో తీసుకోవాలి. వీటిని రోజ్ వాటర్‌తో కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకుని పదిహేను నిమిషాల పాటు ఉంచుకోవాలి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఈ మాస్క్ ముఖంపై ఉన్న మలినాలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ని తొలగిస్తుంది. చర్మం ఆయిలీ అయిపోకుండా ఎక్కువసేపు తాజాగా ఉంటుంది.