ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు చర్మ సంరక్షణ కోసం ఎక్కువ సమయం కేటాయించడం కష్టమే. ఆ లోటును రోజ్ వాటర్ భర్తీ చేస్తుంది. పన్నీరు ఇన్‌స్టంట్‌గా పని చేస్తుంది. ఇది నాచురల్ క్లెన్సర్, స్కిన్ టోనర్‌గా కూడా పని చేస్తుంది. పన్నీటిలో దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే సన్‌బర్న్, యాక్నె సమస్యలు తగ్గుతాయి. ఎండాకాలం దేహానికి చల్లదనాన్నిస్తుంది ∙శీతాకాలంలో సాధారణంగానే నీటిని తక్కువ తాగుతాం. దాని వల్ల చర్మం తేమను కోల్పోతుంది. ఆ సమస్యకు కూడా పన్నీరు రాయడం ఓ పరిష్కారం
పన్నీరు చర్మాన్ని మృదువుగా ఉంచి సాగేగుణాన్ని కోల్పోకుండా కాపాడుతుంది. ఇది అన్ని రకాల చర్మతత్త్వాలకు చక్కగా పని చేస్తుంది. చర్మానికి కవర్‌గా పని చేసి వాతావరణంలోని మార్పుల ప్రభావం నుంచి కాపాడుతుంది. రోజుకోసారి పన్నీటిని అప్లై చేస్తే మంచిది.
ఇన్‌స్టంట్ కేర్
Published Sat, Sep 23 2017 12:56 AM | Last Updated on Mon, Sep 25 2017 12:56 AM
Advertisement
Advertisement