
వాతావరణం చల్లబడిందంటే పెదవులు పగలడం మొదల వుతుంది. వాటిని మళ్లీ అందంగా చేయాలంటే... రెండు చెంచాల తేనెలో ఒక చెంచా మీగడ, నాలుగైదు చుక్కల రోజ్ వాటర్ కలిపి, రోజూ రాత్రిపూట పెదవులపై రాసుకోవాలి. నిమ్మరసంలో ధనియాల పొడి కలిపి రాసుకున్నా పగుళ్లు పోతాయి. కొత్తిమీర రసాన్ని కానీ, బీట్‌రూట్ రసాన్ని కానీ క్రమం తప్పకుండా రాసినా మంచి ఫలితముంటుంది.