![Beauty Tips: Rice Flour Rose Water Aloe Vera Gel For Tan Free Skin - Sakshi](/styles/webp/s3/article_images/2022/10/15/sakashi%201.jpg.webp?itok=U1e_Kq49)
ప్రతీకాత్మక చిత్రం
ముఖం మీద నల్ల మచ్చలు, ట్యాన్ కారణంగా ఇబ్బంది పడతారు చాలామంది. అలాంటి వారు ఈ చిట్కాను ట్రై చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. మెరిసే చర్మం సొంతమవుతుంది.
బియ్యం, రోజ్‌వాటర్‌తో పాటు..
►అర కప్పు బియ్యంలో కాస్త రోజ్‌వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి.
►ఉదయాన్నే రోజ్‌వాటర్‌తోపాటు బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి.
►దీనిలో ఎనిమిది కుంకుమపువ్వు రేకులు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ వేసి చక్కగా కలుపుకోవాలి.
►మిశ్రమం క్రీమ్‌లా మారేంతవరకు కలుపుకుని గాజుసీసాలో వేసి రిఫ్రిజిరేటర్‌లో నిల్వ చేసుకోవాలి.
►రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకుని మర్దన చేయాలి.
►ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
►క్రమం తప్పకుండా వారం రోజుల పాటు క్రీమ్ రాసుకోవడం వల్ల నల్లమచ్చలు, ట్యాన్ తగ్గి, ముఖచర్మం కాంతిమంతంగా మారుతుంది.
చర్మం తాజాగా ఉండేందుకు..
రోజ్ వాటర్ ముఖానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. తరచుగా ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖ చర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకుని.. చర్మం తాజాగా కనిపిస్తుంది.
చదవండి: Chicken Eggs: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే!
Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో..
Comments
Please login to add a commentAdd a comment