TAN
-
ఇలాంటి సన్ స్క్రీన్ లోషన్ వాడండి సమ్మర్ లో మీ చర్మం మెరిసిపోతుంది
-
Beauty: గోధుమ పిండితో ట్యాన్‌కు చెక్! వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తున్నారా?
ట్యాన్ తొలగి ముఖం మెరిసిపోవాలన్నా.. మొటిమలు తగ్గించుకోవాలన్నా ఈ చిట్కాలు ట్రై చేయొచ్చు. పార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండా మెరిసే మోము సొంతం చేసుకోవచ్చు. ట్యాన్ పోగొట్టే ఆటా ప్యాక్ ►గోధుమపిండితో రుచికరమైన రోటీలేగాక ఎండవల్ల ముఖంపై ఏర్పడిన ట్యాన్‌ను కూడా తగ్గించవచ్చు. ►దీనికోసం రెండు స్పూన్ల గోధుమపిండి, స్పూను తేనె, స్పూను పెరుగు, స్పూను రోజ్ వాటర్, స్పూను ఓట్స్, అరస్పూను కొబ్బరి నూనె తీసుకోవాలి. ►వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ►తరువాత ఈ పేస్టును ముఖానికి రాసి ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ►ఈ ‘ఆటా ఫేస్‌ప్యాక్’ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగడమేగాక, ట్యాన్ తగ్గుముఖం పట్టి ముఖచర్మం కాంతిమంతమవుతుంది. వెల్లుల్లితో.. ►ముఖం మీది మొటిమలను ఇంటి చిట్కాతో సులభంగా వదిలించుకోవచ్చు. ►నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టుతీసి మెత్తగా పేస్టులా నూరుకోవాలి. ►ఈ పేస్టును ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. ►పేస్టు ఆరుతుంది అనుకున్నప్పుడు దానిపై బ్యాండేజ్ వేయాలి. ►ఈ బ్యాండేజ్‌ను రాత్రంతా ఉంచుకుని ఉదయం తీసేయాలి. ►ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి. నోట్: చర్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రై చేస్తే బెటర్. చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే Health Tips: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి.. -
Beauty: ట్యాన్, నల్ల మచ్చల సమస్యా? బియ్యం, రోజ్‌వాటర్.. ఇలా చేశారంటే
ముఖం మీద నల్ల మచ్చలు, ట్యాన్ కారణంగా ఇబ్బంది పడతారు చాలామంది. అలాంటి వారు ఈ చిట్కాను ట్రై చేస్తే మెరుగైన ఫలితం ఉంటుంది. మెరిసే చర్మం సొంతమవుతుంది. బియ్యం, రోజ్‌వాటర్‌తో పాటు.. ►అర కప్పు బియ్యంలో కాస్త రోజ్‌వాటర్ వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ►ఉదయాన్నే రోజ్వాటర్తోపాటు బియ్యాన్ని మెత్తగా రుబ్బుకోవాలి. ►దీనిలో ఎనిమిది కుంకుమపువ్వు రేకులు, రెండు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, కొన్ని చుక్కల కొబ్బరి నూనె లేదా గ్లిజరిన్ వేసి చక్కగా కలుపుకోవాలి. ►మిశ్రమం క్రీమ్‌లా మారేంతవరకు కలుపుకుని గాజుసీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. ►రోజూ ఉదయం, రాత్రి పడుకునే ముందు ఈ క్రీమ్‌ను ముఖానికి రాసుకుని మర్దన చేయాలి. ►ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ►క్రమం తప్పకుండా వారం రోజుల పాటు క్రీమ్ రాసుకోవడం వల్ల నల్లమచ్చలు, ట్యాన్ తగ్గి, ముఖచర్మం కాంతిమంతంగా మారుతుంది. చర్మం తాజాగా ఉండేందుకు.. రోజ్ వాటర్ ముఖానికి పట్టిస్తే మంచి ఫలితం ఉంటుంది. కాటన్ బాల్‌ను రోజ్ వాటర్‌లో ముంచి ముఖం మీద అద్దాలి. తరచుగా ఇలా చేయడం వల్ల చర్మం శుభ్రపడటమే కాకుండా ముఖ చర్మం మీద ఉండే స్వేద గ్రంథులు తెరచుకుని.. చర్మం తాజాగా కనిపిస్తుంది. చదవండి: Chicken Eggs: కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో తెలుసా? Beard Shaving: రోజూ షేవింగ్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలిస్తే! Beauty Tips: మొటిమలు, వాటి తాలుకు గుంతల సమస్య వేధిస్తోందా? ఈ రెండింటితో.. -
Beauty Tips: పాదాలపై ట్యాన్ తగ్గి, కాంతిమంతంగా మారాలంటే..
ముఖానికి ఇచ్చినంత ప్రాముఖ్యత పాదాలకు ఇవ్వకపోడంవల్ల .. ముఖం తెల్లగా ఉన్నప్పటికీ పాదాలపై ట్యాన్ పేరుకుపోయి నల్లగా కాంతిహీనంగా కనిపిస్తాయి. కాళ్లమీద నలుపు తగ్గి, ఆకర్షణీయంగా కనిపించేందుకు చిన్నపాటి ఇంటిచిట్కా పాటిస్తే సరిపోతుంది. ►పావు బకెట్ నీళ్లలో టేబుల్ స్పూను వంటసోడా, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను ఉప్పు వేసి బాగా కలపాలి. ►ఆ నీటిలో పాదాలను ఉంచి, ఐదునిమిషాలపాటు స్క్రబర్‌తో రుద్దాలి. ►తరువాత గోరువెచ్చని నీటిలో పాదాలను పదిహేను నిమిషాలపాటు నానబెట్టాలి. ►తరవాత పాదాలను బయటకు తీసి తడిలేకుండా శుభ్రంగా తుడిచి కొబ్బరి నూనె రాసి మర్దన చేయాలి. ►రోజూ క్రమం తప్పకుండా ఈ పద్ధతిని అనుసరిస్తే కొద్దిరోజుల్లోనే పాదాలు మంచి నిగారింపుని సంతరించుకుంటాయి. చదవండి: Health Tips: ఈ పండ్ల గింజల్లో సైనైడ్‌ను విడుదల చేసే కారకాలు! తిన్నారంటే అంతే సంగతులు! జాగ్రత్త! Eye Stress Relief: ఎక్కువ సేపు కంప్యూటర్ స్క్రీన్ చూసేవాళ్లు! రోజ్‌వాటర్, టీ బ్యాగ్‌లు, పుదీనా.. ఈ చిట్కాలు పాటిస్తే.. -
ఇక ఒక్కరోజులోనే పాన్ కార్డు!
న్యూఢిల్లీ : డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ దాఖలుతో ఇక కంపెనీలు కేవలం ఒక్క రోజులోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్లను పొందనున్నాయి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం చర్యలు ప్రారంభించేసింది. పాన్, టాన్ రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలను ప్రారంభించినట్టు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. అదేవిధంగా సాధారణ వ్యక్తులు కూడా పాన్‌ను తేలికగా.. తక్కువ సమయంలో పొందేందుకు ఆధార్ ఆధారిత ఈ-సిగ్నేచర్ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. పాన్ కార్డును, టాక్స్ డిడక్షన్ అండ్ కలెక్షన్ అకౌంట్ నంబర్(టాన్)ను కంపెనీలకు త్వరగా అందించడానికి ఎన్ఎస్డీఎల్ ఈగవర్నమెంట్, యూటీఐఐటీఎస్ఎల్ లాంటి పాన్ సర్వీసు ప్రొవైడర్స్ కు డిజిటల్ సంతక ఆధారిత అప్లికేషన్ ను ప్రవేశపెట్టినట్టు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ కొత్త ప్రక్రియతో ఆన్ లైన్ లో అప్లికేషన్ ను నమోదుచేసిన ఒక్క రోజులోనే పాన్, టాన్ లను కంపెనీలకు అందిస్తామని పేర్కొంది. అదేవిధంగా సాధారణ అప్లికెంట్స్ కు కూడా ఆధార్ ఆధారిత అప్లికేషన్ ప్రక్రియను పాన్ సర్వీసు ప్రొవేడర్లు ఎన్ఎస్డీఎల్ ఈగవర్నమెంట్ ద్వారా అందుబాటులో ఉంచినట్టు తెలిపింది. ఆధార్ ఆధారితంగా సాధారణ వ్యక్తులకు జారీచేసే పాన్ సర్వీసులతో, పేపర్ లెస్ అప్లికేషన్ ప్రక్రియను ఉచితంగా అందించడమే కాక, డ్యూప్లికేట్ పాన్ సమస్యను అధిగమించవచ్చని ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. ఈ అప్లికేషన్ల యూఆర్ఎల్ లింక్స్ డిపార్ట్ మెంటల్ వెబ్సైట్ ఇన్కమ్టాక్స్ఇండియా.గవర్నమెంట్.ఇన్ లోని హోమ్ పేజ్ పై "ఇంపార్ట్టెంట్ లింక్స్"లో అందుబాటులో ఉండనున్నాయి..