Beauty: గోధుమ పిండితో ట్యాన్‌కు చెక్‌! వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తున్నారా? | Beauty Tips: Wheat Flour Pack For Tan Free Skin Garlic To Control Acne | Sakshi
Sakshi News home page

How To Prevent Acne: గోధుమ పిండితో ట్యాన్‌కు చెక్‌! వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తే జరిగేది ఇదే!

Published Wed, Oct 26 2022 11:42 AM | Last Updated on Wed, Oct 26 2022 12:32 PM

Beauty Tips: Wheat Flour Pack For Tan Free Skin Garlic To Control Acne - Sakshi

ట్యాన్‌ తొలగి ముఖం మెరిసిపోవాలన్నా.. మొటిమలు తగ్గించుకోవాలన్నా ఈ చిట్కాలు ట్రై చేయొచ్చు. పార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండా మెరిసే మోము సొంతం చేసుకోవచ్చు.

ట్యాన్‌ పోగొట్టే ఆటా ప్యాక్‌
►గోధుమపిండితో రుచికరమైన రోటీలేగాక ఎండవల్ల ముఖంపై ఏర్పడిన ట్యాన్‌ను కూడా తగ్గించవచ్చు.
►దీనికోసం రెండు స్పూన్ల గోధుమపిండి, స్పూను తేనె, స్పూను పెరుగు, స్పూను రోజ్‌ వాటర్, స్పూను ఓట్స్, అరస్పూను కొబ్బరి నూనె తీసుకోవాలి.
►వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్టులా కలుపుకోవాలి.

►తరువాత ఈ పేస్టును ముఖానికి రాసి ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి.
►ఈ ‘ఆటా ఫేస్‌ప్యాక్‌’ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగడమేగాక, ట్యాన్‌ తగ్గుముఖం పట్టి ముఖచర్మం కాంతిమంతమవుతుంది.

వెల్లుల్లితో..
►ముఖం మీది మొటిమలను ఇంటి చిట్కాతో సులభంగా వదిలించుకోవచ్చు.
►నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టుతీసి మెత్తగా పేస్టులా నూరుకోవాలి.
►ఈ పేస్టును ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి.

►పేస్టు ఆరుతుంది అనుకున్నప్పుడు దానిపై బ్యాండేజ్‌ వేయాలి.
►ఈ బ్యాండేజ్‌ను రాత్రంతా ఉంచుకుని ఉదయం తీసేయాలి.
►ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి.  
నోట్‌: చర్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రై చేస్తే బెటర్‌.

చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే..
రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే
Health Tips: రోజూ స్కిప్పింగ్‌ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement