Garlic
-
జ్వరంతో బాధపడుతున్నారా? వెల్లుల్లి రసంతో అద్భుతం!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జలుబు, దగ్గు, వైరల్, డెంగీ జ్వరాలు పట్టి పీడిస్తున్నాయి. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడంతో పాటు, కొన్ని ఇంటి చిట్కాల ద్వారా ఇలాంటి సమస్యలకు వెల్లుల్లి రసం లేదా వెల్లుల్లి చారు అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే జ్వరం తగ్గిన తరువాత నోటికి ఏమీ రుచించని వారికి కూడా ఇది చక్కటి పరిష్కారం. ఈ చారుతో అనేక ఇతర లాభాలు కూడా ఉన్నాయి. మరి వెల్లుల్లి చారు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి!కావాల్సిన పదార్థాలువెల్లుల్లి , కొద్దిగా చింతపండు, టమాటాలు, మిరియాలు, చారు పొడి, తాలింపు దినుసులు , పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, కొత్తిమీర.వెల్లుల్లి చారు తయారీ విధానం:ముందుగా వెల్లుల్లిని అట్ల కాడ సన్నని మొనకు గుచ్చి నిప్పుల మీద కాల్చుకోవాలి. ఆ తరువాత వీటికి కాసిన్ని మిరియాలు జోడించి చెక్కముక్కగా (మరీ మెత్తగా కాకుండా) దంచుకోవాలి. బాగా పండిన టమాటాలతో మెత్తగా రసం తీసిపెట్టుకోవాలి. ఈ రెండూ కలిపిన నీటిలో ఉప్పు, పసుపు, చీలికలు చేసిన పచ్చిమిర్చి వేసి పొంగు వచ్చే వరకు బాగా మరిగించాలి. ఇలా మరుగుతున్నప్పుడు కొద్దిగా నానబెట్టిన చింతపండు, కరివేపాకు వేయాలి. తరువాత , ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి వేయించుకొని తయారు చేసుకున్న రసం పొడి వేయాలి. చక్కగా మరిగి కమ్మటి వాసన వస్తున్నపుడు, పోపు గింజలు, ఇంగువతో తాలింపు వేసుకోవాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచిగా ఉండే వెల్లుల్లి చారు రెడీ. దీన్ని అన్నంలో గానీ, ఇష్టమున్న వారు ఇడ్లీలో కానీ వేసుకొని తినవచ్చు. -
వెల్లుల్లిని కొంటున్నారా.. ఇది తెలిస్తే
ఘాటైన వాసన దాని సహజ లక్షణం. అందుకే దాన్ని చూడగానే చాలామంది ముక్కు చిట్లాస్తారు. కానీ అదిలేని వంటిల్లు సాధారణంగా ఉండదు. ఎందుకంటే ఆ ఘాటే నోరూరించే రుచికి కారణం. ఆ ఘాటే ఆరోగ్యానికి అద్భుతమైన ఔషదం. అందుకే పప్పు నుంచి చికెన్ దాకా ఏది వండాలన్నా వెల్లుల్ని ఉండాల్సిందే. అలాంటి దివ్య ఔషదాలున్న వెల్లుల్ని ధరలు విపరీతంగా ఉన్నాయి. ఆ డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు కొందరు కాసుల కక్కుర్తికోసం అడ్డదార్లు తొక్కుతున్నారు.మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సిమెంట్‌తో తయారు చేసిన నకిలీ వెల్లుల్లి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది.ఆ వీడియోలో వెల్లుల్ని పొట్టు ఒలిచిన తర్వాత రాయిలా గట్టిగా ఉండడం మనకు కనిపిస్తుంది. ఆ దృశ్యాలు ఇప్పుడు వినియోగదారుల్లో ఆందోళన రేకెత్తిస్తున్నాయి.దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో కొన్ని కూరగాయల మార్కెట్లలో నకిలీ వెల్లుల్లిని విక్రయిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తాజా వెలుగులోకి వచ్చిన కొనుగోలు దారులలో భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న వెల్లుల్ని స్వచ్ఛతపై అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు.देशभर में लहसुन के दाम फिलहाल आसमान छू रहे हैं। इस बीच एक हैरान करने वाला मामला सामने आया है, जहां महाराष्ट्र के अकोला में कुछ फेरीवाले नागरिकों को सीमेंट से बना नकली लहसुन बेचकर धोखा दे रहे हैं। #Garlic #Maharashtra #Akola इनपुट्स: धनंजय साबले pic.twitter.com/Q4v1hZBhR9— सत्य सनातन भारत (Modi ka parivar)🚩🙏🕉️🙏🕉 (@NirdoshSha33274) August 18, 2024 -
వెల్లుల్లి కూరగాయ లేదా సుగంధ ద్రవ్యమా? హైకోర్టు ఏం చెప్పిందంటే..
వెల్లుల్లి మసాలాకు చెందిందా, కూరగాయనా అనే సందేహం ఎప్పుడైనా వచ్చింది. కానీ అది పెద్ద చర్చనీయాంశంగా మారి సుదీర్ఘ న్యాయ పోరాటానికి దారితీసింది. చివరికి హైకోర్టు తీర్పుతో ఆ న్యాయ పోరాటానికి తెరపడింది. వంటగదికి మసాలాకు చెందిన ఈ వెల్లుల్లి విషయంలో హైకోర్టు ఏం పేర్కొంది?. అసలు ఏం జరిగింది అంటే..భారతీయ వంటకాలలో ప్రధానమైన వెల్లుల్లి మధ్యప్రదేశ్‌లో కూరగాయ? లేదా మసాలాకు చెందిందా? అనే వర్గీకరణపై సుదీర్ఘ న్యాయపోరాటానికి కారణమయ్యింది. ఈ వివాదాన్ని ఇటీవలే మధ్యప్రదేశ్ హైకోర్టు పరిష్కరించింది. ఇది రైతులు, వ్యాపారుల పై గణనీయమైన ప్రభావాన్ని చూపించింది. 1972 వ్యవసాయోత్పత్తి మార్కెట్ కమిటీ చట్టం కారణంగా ఈ వివాదం మొదలయ్యింది. ఇది వెల్లుల్లిని సుగంధ ద్రవ్యంగా వర్గీకరించింది. నిర్దిష్ట మార్కెట్లలో దాని అమ్మేలా పరిమితం చేసింది. ఇది రైతులను మరింత సమస్యల్లోకి నెట్టేసింది. వారు వ్యవసాయ మార్కెట్లలో అమ్ముకునే వీలులేక ఇబ్బందులు పడేవారు. దీంతో 2007లో మాంద్‌సౌర్‌కు చెందిన ఒక వెల్లుల్లి వ్యాపారి ఈ వర్గీకరణను సవాలు చేస్తూ, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లో వెల్లుల్లిని విక్రయించడానికి అనుమతి కోరడం జరిగింది. పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, మండి బోర్డు మొదట్లో వెల్లుల్లి విక్రయానికి కొంత వెసులుబాటు కల్పించింది. ఐతే ఎప్పుడైతే వ్యవసాయ మార్కెట్లలో మాత్రమే వెల్లుల్లి విక్రయించాలని మధ్యప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఆదేశించారో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో అసంతృప్తి చెందిన వ్యాపారులు హైకోర్టుని ఆశ్రయించగా చివరికి రైతులకు అనుకూలంగా తీర్పునిస్తూ..వెల్లులిని ఏ మార్కెట్లో అయినా విక్రయించేందుకు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని హైకోర్టు డబుల్ బెంచ్ సమర్థించింది, వెల్లుల్లి వ్యవసాయ ఉత్పత్తి హోదాను పునరుద్ఘాటించింది. అయితే, పొటాటో ఆనియన్ కమీషన్ అసోసియేషన్ రివ్యూ పిటిషన్‌ను దాఖలు చేసింది. ధర్మాసనం దీన్ని తోసిపుచ్చి మరీ వ్యవసాయ లేదా కూరగాయల మార్కెట్లలో వెల్లుల్లిని విక్రయించడానికి రైతులకు వెసులుబాటును మంజూరు చేసింది. అంతలా వివాదం రేకెత్తించిన ఈ వెల్లుల్లితో చేసే వంటకాలేంటో చూద్దామా..వెల్లుల్లి చట్నీఇది ప్రధానంగా వెల్లుల్లి, ఎర్ర మిరపకాయలు, మసాలా దినుసుల మిశ్రమంతో తయారుచేసే ఘాటైన చట్నీ. వెల్లుల్లిని చూర్ణం చేసి, ఆపై మిరపకాయలతో కలిపి పేస్ట్ తయారు చేస్తారు. ఇది తరచుగా చింతపండు, నిమ్మరసం లేదా వెనిగర్‌తో కలిపి పుల్లటి రుచితో ఉంటుంది. ఈ చట్నీని సాధారణంగా పకోరాలు లేదా సమోసాల వంటి స్నాక్స్‌తో పాటుగా వడ్డిస్తారు.వెల్లుల్లి సూప్వెల్లుల్లి సూప్ అనేది ఓదార్పునిచ్చే సువాసనగల వంటకం. దీనిని తరచుగా వెల్లుల్లి రెబ్బలను వివిధ రకాల కూరగాయలు లేదా చికెన్ ఉడకబెట్టిన పులుసుతో మరిగించి తయారు చేస్తారు. రెసిపీని సిద్ధం చేయడానికి, వెల్లుల్లిని ముందుగా వేయించి, ఆపై ఉల్లిపాయలు, బంగాళాదుంపలు వంటి పదార్థాలతో కలుపుతారు. ఈ వేడెక్కడం సుగంధ సూప్ చల్లని సీజన్లో రోజులో ఏ సమయంలోనైనా ఆస్వాదించడానికి అనువైనది.వెల్లుల్లి ఊరగాయవెల్లుల్లి ఊరగాయ అనేది ఆవాల నూనె, సుగంధ ద్రవ్యాల మిశ్రమంలో మొత్తం వెల్లుల్లి రెబ్బలను మెరినేట్ చేయడం ద్వారా తయారు చేయబడిన స్పైసీ ఊరగాయ. కొన్నిసార్లు వెనిగర్ లేదా నిమ్మరసం కూడా ఉపయోగిస్తారు. వెల్లుల్లి, లవంగాల చూర్ణం కూడా జోడిస్తారు. ఇది అన్నం, రోటీ లేదా పరాఠాల్లో బాగుటుంది. వెల్లుల్లి బ్రెడ్గార్లిక్ బ్రెడ్ అనేది రొట్టెతో కూడిన ఒక ప్రియమైన ఆకలి లేదా సైడ్ డిష్. వెన్న, మెత్తగా తరిగిన వెల్లుల్లి, పార్స్లీ వంటి మూలికల మిశ్రమంతో దీన్ని తయారు చేస్తారు. దీనిలో బయట మంచిగా కరకరలాడుతూ లోపల మెత్తగా ఉండేలా బ్రెడ్‌ని కాల్చుతారు. గార్లిక్ బ్రెడ్ సాధారణంగా పాస్తా లేదా సూప్‌లతో వడ్డిస్తారు.(చదవండి: 'అరంగేట్రం' చేసిన తొలి నర్తకిగా 13 ఏళ్ల చైనా విద్యార్థిని రికార్డు..!) -
వెల్లుల్లిని కాల్చి తింటే ఎన్ని లాభాలో.. తెలిస్తే అస్సలు వదలరు!
వంటకాల్లో విరివిగా వాడే వెల్లుల్లితో అనేక ఆరోగ్యప్రయోజనాలున్నాయి. ఔషధ గుణాలు కూడా మెండుగా ఉన్నాయి. సుగంధ ద్రవ్యంగానూ, వెజ్, నాన్‌వెజ్ కూరల్లోనూ, పచ్చళ్లల్లోనూ వాడుకుంటాం. అలాగే పచ్చి వెల్లుల్లిని వేడి వేడి అన్నంలో ముందు ముద్దలో తీసుకోవడం కూడా పెద్దవాళ్లకి అలవాటు. అంతేకాదు కాల్చిన వెల్లుల్లిని తీసుకుంటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం! వెల్లుల్లిని కాల్చినప్పుడు రుచి పెరగడంతోపాటు, దాంట్లోని ఆరోగ్య ప్రయోజనాలు మరింత పెరుగుతాయట. విటమిన్ B6, విటమిన్ సీ, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్ మూలకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఇందులోని అధిక స్థాయి యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.ప్రతిరోజు ఆహారంలో వెల్లుల్లి చేర్చుకోవడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం గుండెకు బలాన్నిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.రక్త ప్రసరణను మెరుగుపర్చి, రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. వెల్లుల్లిలోని క్వెర్సెటిన్ , కెంప్ఫెరోల్ వంటి సమ్మేళనాలే దీనికి కారణం.వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కారకాలు బీపీని తగ్గించడంలో సాయపడతాయి.షుగర్ స్థాయిలను తగ్గించడంలో వెల్లుల్లి పనిచేస్తుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది సున్నాగా ఉంటుంది. శరీరంలో ఉన్న ఇన్సూలిన్స్ స్థాయిలను రెగ్యులేట్ చేయడంలో ఉపయోగపడుతుంది.కాల్చిన వెల్లుల్లి కొన్ని రకాల కేన్సర్ల బారినుంచి రక్షిస్తుంది. కడుపు కేన్సర్, పెద్దప్రేగు కేన్సర్ , పేగు కేన్సర్ , రొమ్ము కేన్సర్ , ప్రోస్టేట్ కేన్సర్ల నివారణలో సాయపడుతుంది. డయాలిల్ సల్ఫైడ్ , అల్లైల్ సిస్టీన్ సల్ఫాక్సైడ్ వంటి సమ్మేళనాలను కలిగి ఉండడమే దీనికి కారణం. పురుషుల్లో లైంగిక పటుత్వానికి కూడా వెల్లుల్లి చాలా బాగా ఉపయోగపడుతుంది.బాలింతల్లో పాలు సమృద్ధిగా రావడానికి కూడా వెల్లుల్లిని వాడతారు. -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది.వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్‌గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం.నిపుణుల మాట► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి.► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి.►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది.►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి.నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
వెల్లుల్లితో మొటిమలు మటుమాయం? నిపుణులు ఏమంటున్నారు?
వెల్లుల్లి గురించి దాదాపు తెలియని వారుండరు. మరో విధంగా చెప్పాలంటే వెల్లుల్లి లేని మసాలా వంట ఉండదు. కొంతమందికి వెల్లుల్లి వానస నచ్చనప్పటికీ, అల్లంవెల్లుల్లి మిశ్రమం వేసిన తరువాత ఏ రెసిపీ అయినా రుచి రెట్టింపు అవ్వడమేకాదు వాసన కూడా ఘుమ ఘమ లాడాల్సిందే. వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే సౌందర్య పోషణగా కూడా పనిచేస్తుందంటారు. మరి ఈ విషయంలో నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. ఆరోగ్యానికి వెల్లుల్లి సంజీవని: ముఖ్యంగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల, మధుమేహం, బీపీ నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని ఎర్రరక్తకణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్స్‌ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్‌గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది.అందేకాదు ఇది చర్మాన్ని కాపాడుతుంది. మొటిమలు, యాక్నె, నల్లమచ్చలు వంటివి బాధిస్తున్నా, చర్మం మెరవాలన్నా పచ్చి వెల్లుల్లి మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధిచేసే గుణం ఉంది. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. ఖాళీ కడుపుతో నాలుగు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహాన్ని నయం చేస్తుంది. అలాగే రోజుకు కొన్ని వెల్లుల్లి రెమ్మలు తింటే జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండానే బరువు తగ్గవచ్చట. వెల్లుల్లి జీర్ణాశయంలోని ఎంజైములను ఉత్తేజపరచడం వల్ల బరువు తగ్గుతారు. కొవ్వును కరిగించడంలో వెల్లుల్లికి కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మ్యాజిక్ క్యూర్ పచ్చి వెల్లుల్లి మోటిమలకు మ్యాజిక్ క్యూర్‌గా పనిచేస్తుందని ఇటీవల ఒక .బ్యూటీ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్‌స్టా వీడియో వైరల్ అయిందితన 'రాత్రిపూట చర్మ సంరక్షణ దినచర్య'లో భాగంగా పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకొని నేరుగా తీసుకుంది. పచ్చి వెల్లుల్లిని తీసుకోవడం చాలా మొండి సిస్టిక్ మొటిమలకు కూడాపనిచేస్తుందని కొంతమంది పేర్కొన్నారు. కొంతమంది కూడా సానుకూలంగా స్పందించగా మరికొందరు మాత్రం తమ సమస్యమరింత ఎక్కువైందని కమెంట్ చేయడం గమనార్హం. నిపుణుల మాట ► వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్ , క్రిమినాశక లక్షణాలు ఉన్నాయి. ► వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ మొటిమలకుకారణమైన బ్యాక్టీరియాను (ప్రొపియోనిబాక్టీరియం) నిరోధిస్తుంది ► రక్త ప్రసరణను మెరుగుపరిచే లక్షణంగా కారణంగా, సేబాషియస్ గ్రంధి, వెంట్రుకల కుదుళ్లలో అనేక అడ్డుపడే పదార్థాలు క్లియర్ అవుతాయి. ►వెల్లుల్లిలో జింక్,ఇతర విటమిన్లు ,ఖనిజాలు కూడా ఉన్నాయి. జింక్ మొటిమలను తగ్గించడంలో సహాయపడుతుంది. ►వెల్లుల్లిలోని థియోసల్ఫేట్లు (సల్ఫర్ సమ్మేళనం) యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటాయి. నోట్ : ఇది పలువురు నిపుణుల, రిపోర్టులు ఆధారిత కథనం మాత్రమే. ఈ చిట్కాలు కొందరిలో ప్రతికూల ప్రభావం ఉండవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య తలెత్తినా వైద్యులను సంప్రదించడం మేలు. -
వంట దినుసులే కదా అని తేలిగ్గా తీసుకోకండి!
మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే! ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే. అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే. వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది. -
ఆ వెల్లుల్లికి జీఐ ట్యాగ్!
మధ్యప్రదేశ్‌లోని రియావాన్ గ్రామానికి చెందిన వెల్లుల్లికి జియోగ్రాఫికల్ ఇండికేషన్(జీఐ) ట్యాగ్ లభించింది. రియాన్ వెల్లులి జీఐ నమోదు కోసం చెన్నైలోని రైతు ఉత్పత్తుల సంస్థ(ఎఫ్‌పీఓ) రియావాన్ ఫార్మ్ ఫ్రెష్ ప్రొడ్యూసర్ కంపెనీ జనవరి 2022 నుంచి ప్రారంభించింది. ఉద్యానవన శాఖ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం జిల్లా పరిపాలన సహకారంతో మార్చి 2న రియాన్ వెల్లుల్లి ఈ జిఐ ట్యాగ్‌ని పొందింది. ఆ రాష్ట్ర ఎమ్మెల్యే పాండే, వ్యవసాయమంత్రి, ముఖ్యమంత్రి అభ్యర్థనలు అసెంబ్లీలో ఆమోదం పొందడంతో ఆ వెల్లుల్లి ఈ ప్రతిష్టాత్మక ట్యాగ్‌ని పొందగలిగింది. ఈ వెల్లుల్లి ప్రత్యేకత.. ఈ వెల్లుల్లి ప్రతి రెమ్మ లవంగంతో సరిపడ ఘాటు ఉంటుంది. దీనిలో అధిక నూనె ఉంటుంది. ఈ వెల్లుల్లిని రియావాన్ సిల్వర్ గార్లిక్ అని కూడా పిలుస్తారు. దేశంలోనే అత్యధిక డిమాండ్ కలిగిన వెల్లుల్లి ఇది. దీనిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ఇతర వెల్లుల్లిపాయల కంటే మంచి సువాసనతో కూడిన ఘాటు ఉంటుంది. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇక్కడ గ్రామస్తులు దశాబ్దాలుగా ఈ వెల్లుల్లిని సంప్రదాయ పద్ధతిలో సాగు చేస్తుండటం విశేషం. పొరగు ప్రాంతా వారు ఇక్కడ రైతుల నుంచి రియావాన్ వెల్లుల్లి విత్తనాలను పట్టుకెళ్తుంటారు. నాణ్యతకు, అధిక దిగుబడికి పెట్టింది పేరు ఈ వెల్లుల్లి (చదవండి: మొక్కలతో భారత్ మాత అని రాసి గిన్నిస్ రికార్డు!) -
కోటీశ్వరుణ్ణి చేసిన వెల్లుల్లి సాగు.. రూ 25 లక్షలకు రూ. కోటి ఆదాయం!
దేశవ్యాప్తంగా వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు కిలో రూ.70-80 పలికిన వెల్లుల్లి ఇప్పుడు రూ.400-500కు చేరింది. దీనివల్ల సామాన్యులపై భారం పడినా, వెల్లుల్లి పండించిన రైతులు అత్యధిక లాభాలతో ఆనందంలో మునిగితేలుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని చింద్వారాకు చెందిన రైతు రాహుల్ దేశ్‌ముఖ్ వెల్లుల్లిని విక్రయించడం ద్వారా కోటి రూపాయల లాభం పొందాడు. 25 లక్షల పెట్టుబడితో రాహుల్ ఇంతటి లాభం పొందాడు. కాగా రాహుల్ తన వెల్లుల్లి పంటను కాపాడుకునేందుకు పొలాల్లో సీసీ కెమెరాలను అమర్చుకోవాల్సి వచ్చింది. ఇందుకోసం రాహుల్ సౌరశక్తితో నడిచే సీసీ కెమెరాలను అమర్చాడు. రాహుల్ దేశ్‌ముఖ్ ఛింద్వారాకు 20 కిలోమీటర్ల దూరంలోని సవారి గ్రామంలో ఉంటున్నాడు. రాహుల్ దేశ్‌ముఖ్ దాదాపు 13 ఎకరాల్లో వెల్లుల్లిపాయలు సాగుచేశాడు. ఇంకా మిగిలిన తన పొలంలో టమాటా సాగు చేశాడు. అయితే కొద్దిరోజుల క్రితం అతని పొలంలో 25-30 కిలోల టమోటాలు అపహరణకు గురయ్యాయి. ఆ తర్వాత రాహుల్ దేశ్‌ముఖ్ రూ.10వేలు వెచ్చించి పొలాన్ని పర్యవేక్షించేందుకు మూడు సీసీ కెమెరాలు అమర్చాడు. రాహుల్ పొలంలో దాదాపు 150 మంది కూలీలు పనిచేస్తున్నారు. రాహుల్ దేశ్‌ముఖ్ మీడియాతో మాట్లాడుతూ ఇటీవలే పెద్దఎత్తున వెల్లుల్లి సాగు చేశానని తెలిపాడు. పెరుగుతున్న వెల్లుల్లి ధరలను దృష్టిలో ఉంచుకుని , వాటిని సాగుచేస్తున్నానని, అయితే భద్రతా కారణాల దృష్ట్యా పొలంలో సీసీ కెమెరాలు అమర్చానని అన్నాడు. రాహుల్ తాను పండించిన వెల్లుల్లిని హైదరాబాద్‌కు కూడా పంపే యోచనలో ఉన్నాడు. వెల్లుల్లి ధరల్లో ఇంత భారీ పెరుగుదల ఇటీవలి కాలంలో ఎన్నడూ లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వెల్లుల్లి ధర గరిష్టంగా రూ.80-90 వరకు మాత్రమే ఉంటుందని రైతులు చెబుతున్నారు. చింద్వారాలోని బద్నూర్లో నివసించే మరో రైతు పవన్ చౌదరి కూడా తన 4 ఎకరాల పొలంలో వెల్లుల్లిని నాటాడు. ఇందుకు రూ.4 లక్షలు ఖర్చు చేయగా, ఇప్పటి వరకు రూ.6 లక్షల లాభం వచ్చింది. తన పొలాన్ని పర్యవేక్షించేందుకు ఆయన కూడా మూడు సీసీ కెమెరాలను అమర్చాడు. -
కొండెక్కిన వెల్లుల్లి ..ఈ చిట్కాలు ఫాలోకండి!
దేశంలో ఇటీవల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. దీంతో ఉల్లి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరాయి. మొన్నమొన్నటి నుంచి తగ్గుతూ రాగా, ఇప్పుడు వెల్లుల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో వెల్లుల్లి ధర రూ.400 నుంచి రూ. 500 వరకు పలుకుతుంది. ఇలాంటప్పుడూ మహిళలు స్పైసీ కూరలు ఎలా వండి పెట్టగలం అన్న సందిగ్ధంలో పడిపోతారు. పైగా వెల్లుల్లి ఆరోగ్యానికి మంచిదని తాలింపుల దగ్గరి నుంచి ప్రతి దాంట్లోని తప్పనిసరిగా వాడేస్తుంటారు. అలాంటిది వెల్లుల్లి వాడకం లేకుండా గడపడం అంటే..కొందరికి చాల కష్టం. అలాంటివారు ప్రత్యామ్రాయంగా ఇలాంటి వాటితో వెల్లుల్లి ప్లేస్‌ని భర్తీ చేసుకోవచ్చు. వెల్లుల్లి బదులుగా ఏం ఉపయోగించొచ్చంటే.. సింపుల్ చిట్కాలు.. ముందుగా మీ కిచెన్ కప్‌బోర్డ్‌లో ఎన్ని వెల్లులిపాయలు ఉన్నాయో చూడండి. వాటిని పాయలుగా విడదీయండి. ఆ తర్వాత చక్కగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండలో పెట్టి బాగా ఎండనివ్వండి. ఇక వాటిని చక్కగా పొడి చేసుకుని పాడవ్వకుండా చిన్న లవంగ మొగ్గ వేసి గాలి చొరబడి డబ్బాలో నిల్వ ఉంచండి. ఈ పొడి వెల్లులి మాదిరి రుచిని సువాసనను తెప్పిస్తుంది కూరకి. ఇది మంచి ప్రత్యామ్నాయం. అలాగే ఈ వెల్లుల్లి పొడికి కాస్త ఉప్పు చేరిస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. అయితే కూరల్లో ఈ పొడిని ఉపయోగిస్తున్నట్లయితే కాస్త ఉప్పు తగ్గించండి. అప్పుడు కూర రుచికి వెల్లుల్లికి దగ్గదగ్గరగా మంచి రుచిని అందిస్తుంది. అస్సలు ఇంట్లో వెల్లుల్లి లేదంటే పచ్చి ఉల్లిపాయాలను ఎండలో ఎండబెట్టి చక్కగా పొడి చేసుకుంటే వెల్లులి మాదిరిగా టేస్ట్ వస్తుంది కూరకి. అయితే కూరలో తక్కువ ఉల్లిపాయలను ఉపయోగిస్తే సరిపోతుంది. ఆర్థిక పరంగా సమస్య రాకుండా కొద్దిపాటి చిట్కాలతో ఇంటిని చక్కగా చక్కబెట్టుకుంటే ఆరోగ్యానికా ఆరోగ్యమే గాక ధరల సమస్యకు చెక్ పెట్టొచ్చు. (చదవండి: కళ్లు కలువ పువ్వుల్లా పెద్దవిగా ఉండాలంటే.. ఈ ఐ బ్యాండ్ ఉంటే చాలు!) -
వెల్లుల్లి ధరలకు వామ్మో అంటున్న రవళి
-
జీడిపప్పుకు సవాల్ విసిరిన వెల్లుల్లి!
వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరుగుతూ, జీడిపప్పుకు సవాల్ విసురుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని వైకుంఠ్‌పూర్, మనేంద్రగఢ్, చిర్మిరి, ఖడ్గవాన్‌తో సహా పరిసర ప్రాంతాల్లో కిలో వెల్లుల్లిని రూ.400 నుండి రూ.600కు విక్రయిస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో వెల్లుల్లి రూ.200కు విక్రయించగా, తరువాత అంతకంతకూ పెరుగుతూవస్తోంది. స్థానిక కూరగాయల వ్యాపారి రాజ్ కుష్వాహ తెలిపిన వివరాల ప్రకారం జనవరిలో కిలో వెల్లుల్లి ధర రూ.200 ఉండగా, ప్రస్తుతం రూ.600 దాటింది. కూరల రుచిని పెంచే వెల్లుల్లి ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ప్రస్తుతం జీడిపప్పు ధరలతో వెల్లుల్లి ధర పోటీ పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మార్కెట్లో కిలో జీడి పప్పు ధర రూ. 800 నుంచి 1000 మధ్య ఉంటోంది. ప్రభుత్వం వెల్లుల్లి ధరలను నియంత్రించే ప్రయత్నం చేయడంలేదని పలువురు విమర్శిస్తున్నారు. ఈసారి హోల్‌సేల్‌లో కూడా వెల్లుల్లి కిలో రూ.421 చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో రిటైల్ మార్కెట్లో వెల్లుల్లి ధర రూ.600 దాటింది. గత శనివారం నుంచి కొత్త వెల్లుల్లి మార్కెట్లోకి రావడంతోనే వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వెల్లుల్లి ధర ఒక్కసారిగా పెరగడంపై ఈ ప్రాంత రైతు అమిత్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. గత ఏడాది అధికశాతం రైతులు వెల్లుల్లి సాగు చేశారన్నారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి ధర బాగా తగ్గిందన్నారు. దీంతో ఈ ఏడాది రైతులు వెల్లుల్లి సాగును తగ్గించారు. దీంతో మార్కెట్లో వెల్లుల్లి కొరత ఏర్పడింది. ఫలితంగా వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. గత ఏడాది స్థానికంగా వెల్లుల్లి ఎక్కువగా పండడంతో గిట్టుబాటు ధర లభించక రైతులు తమ పంటలను నదులు, కాలువల్లో పడేశారు. గత సంవత్సరం, వెల్లుల్లి హోల్‌సేల్ ధర కిలో రూ. 40. మార్కెట్ ధర దీని కంటే తక్కువగా ఉంది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. ఫలితంగా రైతులు ఈసారి వెల్లుల్లి సాగును తగ్గించారు. -
National Deworming Day: చిన్ని బొజ్జలకు కావాలి ఈ రక్ష
నులిపురుగులు చిన్న సమస్య కాదు. అలాగని పెద్ద సమస్యా కాదు. చిన్న పిల్లలను బాధించే చికాకు సమస్య. ఆరోగ్యంగా పిల్లలు ఎదగాలంటే ఆరోగ్యకరమైన జీర్ణ వ్యవస్థ ఉండాలి. మన దేశంలో 65 శాతం మంది చిన్నారులు నులిపురుగులతో బాధ పడుతున్నారు. పూర్వం అమ్మమ్మలు, నానమ్మలు పిల్లల ప్రవర్తనలో మార్పు గమనించి నులిపురుగుల మందు వేసే వారు. ఇప్పుడు తల్లులకు వ్యవధి ఉండటం లేదు. కాని తప్పదు జాగ్రత్త. నులిపురుగులు పిల్లలను బాగా ఇబ్బంది పెడతాయి. అవి కడుపులో ఉన్నాయంటే పిల్లలు మలద్వారం వద్ద దురద ఉందని చెబుతుంటారు. పదేపదే అక్కడ గీరుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ముక్కు ఎక్కువగా దురద పెడుతున్నా ‘కడుపులో నులిపురుగులున్నాయేమో’ అని పెద్దలు అనేవారు. ఇంతకు మునుపు పిల్లలు ఆరుబయలులో విసర్జన చేసేవారు కాబట్టి పెద్దలు నులిపురుగులు గమనించేవారు. ఇప్పుడు ఇళ్లల్లో టాయిలెట్లు వాడి ఫ్లష్ చేయడం వల్ల నులి పురుగులను గమనించే అవకాశం లేదు. పెద్దల కంటే పిల్లలకు నులి పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందని గ్రహించాలి. నులి పురుగులంటే? నులి పురుగులు పేగుల్లో చేరి మన ΄ోషకాలను దొంగిలించి తినే పరాన్న జీవులు. వీటివల్ల వచ్చే ఇన్ఫెక్షన్ని ‘అస్కారియాసిస్’ అంటారు, మన దేశంలోదాదాపు 85 శాతం మంది పిల్లల్లో ఈ సమస్య స్పష్టంగా కనిపిస్తోందని ఆరోగ్య సంస్థలు ప్రకటించాయి. నులిపురుగుల వల్ల పిల్లల్లో రక్తహీనత, నీరసం, కడుపులో నొప్పి వంటి అనారోగ్య సమస్యలు కనిపిస్తాయి. అకలి మందగిస్తుంది. ‘మా పిల్లవాడు ఇంతకుముందు బాగా తినేవాడు ఇప్పుడు తినడం లేదు’ అని తల్లులు కంప్లయింట్ చేస్తారు. పిల్లల ఎదుగుదల దెబ్బతింటుంది. కొందరు పిల్లలు నులిపురుగుల వల్ల సరిగా నిద్ర΄ోలేక ఇబ్బంది పడతారు. ఎలా ప్రవేశిస్తాయి? చిన్నపిల్లలు మట్టిలో ఆడుకోవడం సర్వసాధారణం. మట్టిలో ఆడుకొని చేతులు శుభ్రం చేసుకోకుండా తింటే నోటి ద్వారా ΄పొట్ట, పేగుల్లోకి నులి పురుగులు ప్రవేశిస్తాయి. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మలవిసర్జన చేయడం, కాళ్లకు చెప్పులు వేసుకోకుండా తిరగడం, వ్యక్తిగత శుభ్రత ΄ాటించక΄ోవడం, దుమ్ము ధూళి చేరిన కలుషిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల నులిపురుగుల సమస్య తలెత్తవచ్చు. ఏం చేయాలి? ప్రధానంగా చిన్నపిల్లల చేతి గోళ్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. గోళ్లు కొరికే అలవాటును మాన్పించాలి. ప్రతిరోజూ వేడి చేసి చల్లార్చిన మంచినీటిని మాత్రమే తాగించాలి. వైద్యుల సలహాతో అల్బెండజోల్ మాత్రలు వాడాలి. ప్రకృతి వైద్యంలో ఎనిమా ద్వారా కూడా ఈ నులి పురుగుల బెడద తొలగిస్తారు. కొన్ని సులువైన చిట్కాల ద్వారా కూడా నులిపురుగుల సమస్యను అధిగమించవచ్చు. వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల నులిపురుగులను నివారించడంలో కీలక ΄ాత్ర ΄ోషిస్తుంది. రెండు వెల్లుల్లి రెబ్బలను బాగా దంచి ఆ రసంలో గ్లాసు నీటిని కలిపి తాగించడం ద్వారా కడుపులో నులిపురుగులను నివారించవచ్చు. రెండు లవంగాలను ఒక గ్లాసు నీటిలో వేసి ఆ నీటిని తాగించడం వల్ల కడుపులో నులి పురుగులను నివారించవచ్చు. బొప్పాయి పండును తినిపించడం, సన్నగా ఉండే ఆవాలను వేయించి ΄పొడిచేసి మజ్జిగలో కలిపి తాగించడం వంటి వాటి ద్వారా నులిపురుగుల బెడదను అధిగమించేలా చేయవచ్చు. అన్నింటికీ మించి వ్యక్తిగత పరిశుభ్రతను అలవాటు చేయడం అవసరం. -
ఇలా చేయండి.. వెల్లుల్లి పెంచండి
-
రొయ్యలతో.. టేస్టీ టేస్టీగా బట్టర్ గార్లిక్ ఫ్రాన్స్ చేయండిలా..!
గ్లారిక్ బటర్ ప్రాన్స్‌కి కావలసినవి: పచ్చిరొయ్యలు – అరకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఐదు వెన్న – రెండు టేబుల్ స్పూన్లు నూనె – టేబుల్ స్పూను కారం – టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను నిమ్మరసం – టేబుల్ స్పూను కొత్తిమీర తరుగు – పావు కప్పు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ విధానం: రొయ్యలను శుభ్రం చేసి, నాలుగైదు సార్లు కడగాలి. మందపాటి బాణలిలో టేబుల్ స్పూను వెన్న, నూనె వేసి మంటమీద పెట్టాలి. వెన్న కరిగిన వెంటనే కడిగిన రొయ్యలు వేసి రెండు నిమిషాలు వేయించాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి వేసి కలపాలి. ఐదు నిమిషాలు మగ్గిన తరువాత వెల్లుల్లి రెబ్బలను సన్నగా తరిగి వేయాలి. రెండు నిమిషాలు తరువాత మిగిలిన వెన్న, కారం నిమ్మరసం వేసి అన్ని కలిసేలా కలపాలి. వెన్న పైకి తేలేంత వరకు వేయించాలి. వెన్న పైకి తేలిన తరువాత సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేయాలి. (చదవండి: ఈజీగా బరువు తగ్గేలా..ఈ ఓట్స్ లడ్డూ ట్రై చేయండిలా!) -
పూతరేకులు.. వెరీ స్పైసీ గురూ..
సాక్షి, విశాఖపట్నం: పూతరేకు ఏంటీ.. స్పైసీగా ఉండట మేంటి...? విడ్డూరం కాకపోతేనూ...! అని అనుకుంటు న్నారా... లేదండీ... నిజమే.. ఇక నుంచి స్పైసీ పూత రేకులు మార్కెట్లో హాట్ హాట్‌గా కనిపించనున్నాయి. ప్రత్యేకంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల కోసం కాకరకాయ, వెల్లుల్లి కారంతో పూతరేకులను రూపొందించారు ఆత్రేయ పురానికి చెందిన తయారీదారులు. పూతరేకుల తయారీ అనేది డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం ప్రజలకు తరతరాలుగా వారసత్వంగా వస్తోంది. తొలినాళ్లలో పంచదారతోనే పూతరేకులు తయారు చేసేవారు. కాలానుగుణంగా మారుతున్న అభిరుచుల మేరకు పూతరేకుల్లోనూ అనేక రకాలు వచ్చేశాయి. బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్ వంటి వాటితో రకరకాల పూతరేకులు తయారు చేస్తున్నారు. ఇప్పుడు పూతరేకుల తయారీదారులు ట్రెండ్ మార్చారు. స్పైసీ పూతరేకులు సిద్ధం చేశారు. కాకరకాయ, వెల్లుల్లి కారంపొడితో పూతరేకు చుడతారు. డయాబెటిక్‌తో ఉన్నవారికి ఇది ఒక ఔషధంలా పనిచేస్తుంది. ఈ పూతరేకులు తింటే రక్తశుద్ధి, ఇన్సులిన్ సామర్థ్యం పెరిగే అవకాశాలు ఉన్నాయని తయారీదారులు చెబుతున్నారు. మార్కెట్లోకి స్సైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులు ఇన్నాళ్లూ పూతరేకులు తీయని రుచితో నోరూరిస్తూ.. మధుమేహ బాధితులకు మాత్రం శత్రువుగా ఉండేవి. షుగర్ ఫ్రీ పూతరేకులు అందుబాటులోకి వచ్చినా వాటిపై డయాబెటిక్ రోగులు అంతగా ఆసక్తి చూపించలేదు. అందుకే ఇప్పుడు స్వీట్‌ని హాట్‌గా తింటూ... మధుమేహాన్ని కంట్రోల్ చేసుకునేందుకు ఆత్రేయపురం వాసులు తయారు చేసిన కొత్త తరహా పూతరేకులను శుక్ర వారం మార్కెట్లోకి విడుదల చేశారు. అత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం ప్రతినిధులు తీసుకువచ్చిన స్పైసీ బిట్టర్గార్డ్, గార్లిక్ పూతరేకులను దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ శ్రీసుధ మార్కెట్లోకి విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఆస్వాదించేలా... ఆత్రేయపురం పూతరేకులు అంటే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. మా పూతరేకు ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తూ తినాలన్నదే తయారీదారులందరి కోరిక. పంచదారతో తయారు చేయడం వల్ల తినలేకపోతున్నామంటూ చాలామంది మధుమేహం ఉన్నవారు మా ఊరు వచ్చినప్పుడు చెప్పి బాధపడేవారు. అందుకే భౌగోళిక గుర్తింపు వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకుని స్పైసీ పూతరేకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాం. – గాదిరాజు ప్రసాదరాజు, ఆత్రేయపురం -
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేస్తే తాజాగా ఉంటుంది
రుచిగా, వేగంగా వంట చేయాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి... ♦కూర ఏదైనా రుచికోసం అల్లం వెల్లుల్లి పేస్టుని వాడుతుంటాం. ఈ పేస్టుని రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసినప్పటికీ కొన్నిసార్లు రంగు మారి, ఎండిపోయినట్లు అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్టుని నిల్వచేసేముందు కొద్దిగా నూనె కలిపి పెడితే మరిన్ని రోజులు తాజాగా ఉంటుంది. అల్లం, వెల్లుల్లి పేస్టులను విడివిడిగా నిల్వచేసినా నూనె కలుపుకోవడం మంచిది. ♦ మిగిలిపోయిన ఆహార పదార్థాలు, మసాలాలు, ఇడ్లీ దోశపిండిలతో రిఫ్రిజిరేటర్ నిండిపోతుంటుంది. దీంతో తలుపు తీసినప్పుడల్లా అదొక రకమైన వాసన వస్తుంటుంది. కాటన్ బాల్‌ను వెనీలా ఎసెన్స్‌లో ముంచి, రిఫ్రిజిరేటర్లో ఒక మూలన ఉంచితే దుర్వాసన పోతుంది. ♦ మిగిలిపోయిన దోశ, ఇడ్లీ్ల పిండి, గారెల పిండి వంటివాటిని రిఫ్రిజిరేటర్లో పెట్టినా, కొన్నిరోజులకే ఎండిపోవడమో, బాగా పులిసిపోవడమో జరుగుతుంది. అందువల్ల మిగిలిపోయిన పిండిలో రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. -
ప్రమాదకర రసాయనాలతో అల్లం, వెల్లుల్లి పేస్ట్ నుంచి కూల్ డ్రింక్స్ దాకా..
రాజేంద్రనగర్: ఎలాంటి అనుమతులు లేకుండా పరిశ్రమను నిర్వహించడమేగాక రసాయనాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్, శీతల పానీయాలు(కూల్‌డ్రింక్స్) తయారు చేస్తున్న కర్మాగారంపై ఆదివారం రాజేంద్రనగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా 500 కిలోల అల్లం వెల్లుల్లి పేస్ట్, మ్యాంగో డ్రింక్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కిలోల మసాలా ప్యాకెట్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసి మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాటేదాన్ శాంతినగర్‌లో ఫిరోజ్, అజిత్ గత రెండేళ్లగా ఎలాంటి అనుమతులు లేకుండా ఉమ్మాని ఫుడ్ కంపెనీ పేరుతో పరిశ్రమను నిర్వహిస్తున్నారు. సదరు పరిశ్రమలో అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు మ్యాంగో, ఆరెంజ్ జ్యూస్‌తో పాటు పుడ్ మసాలాలను తయారు చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ప్రమాదకరమైన రసాయనాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. అల్లం, వెల్లుల్లి పేస్ట్‌లో కేవలం వెల్లుల్లి పొట్టును మాత్రమే వినియోగిస్తుండటం గమనార్హం. అల్లం వెల్లుల్లి పేస్ట్‌లో రెండు సంవత్సరాలుగా అల్లమే వాడకుండా తయారు చేస్తున్నారు. ఎస్ఓటీ పోలీసులు దాడి చేసిన సమయంలో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న పదార్థాలే కనిపించాయి. శీతల పానీయాలను తయారు చేసేందుకు మురుగునీటిని వాడుతున్నారని, ప్లేవర్ల కోసం రసాయనాలను వినియోగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. రెండేళ్లుగా నిందితులు ఎలాంటి అనుమానం రాకుండా పరిశ్రమను నిర్వహించడం గమనార్హం. భారీ యంత్రాలతో పెద్ద ఎత్తున ఉత్పత్తులు చేస్తున్న వీరు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని సరఫరా చేసినట్లు వెల్లడైంది. నిందితులను అదుపులోకి తీసుకుని మైలార్‌దేవ్‌పల్లి పోలీసులకు అప్పగించారు. అధునాతన యంత్రాల వినియోగం... అల్లం, వెల్లుల్లి పేస్ట్‌తో పాటు గరంమసాలాలు, శీతల పానీయాల మిక్సింగ్, ప్యాక్ చేసేందుకు నిందితులు అధునాతన యంత్రాలను ఏర్పాటు చేశారు. పదుల సంఖ్యలో ఉన్న ఈ యంత్రాల ద్వారా ప్రతి రోజు రూ. లక్షల విలువైన మసాలాలు, అల్లం పేస్ట్, శీతల పానీయాలను తయారు చేస్తున్నారు. ఈ ఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశామని, స్వాధీనం చేసుకున్న పదార్థాలను ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు. -
హెల్త్ టిప్స్
♦ రాత్రి పడుకోబోయేటప్పుడు ఒక గ్లాసు మంచి నీటిలో చిన్న పటిక బెల్లం ముక్కను వేసి ఉంచి ఆ నీటిని ఉదయం లేవగానే తాగాలి. పదిహేను రోజుల పాటు ఇలా చేస్తే పార్శ్వపు తలనొప్పి తగ్గుతుంది. ♦ చిటికెడు పసుపును గ్లాసు పాలలో కాచి, రోజూ ఉదయాన్నే తాగుతుంటే జలుబు, దగ్గు, ఆయాసం తగ్గుతాయి.. ♦ గ్యాస్ట్రిక్ ట్రబుల్ తగ్గాలంటే రోజుకు రెండుసార్లు కప్పు పాలల్లో ముక్కలుగా చేసిన ఒక వెల్లుల్లి రెబ్బను వేసి బాగా మరగనిచ్చి వెల్లుల్లి ముక్కలను తీసి, ఆ పాలు తాగితే మంచి గుణం కన్పిస్తుంది. ♦ దగ్గు, ఆయాసంతో బాధపడేవారు స్పూన్ అల్లం రసం, స్పూను దానిమ్మరసం, స్పూన్ తేనె కలిపి రోజుకు రెండుసార్లు తీసుకుంటే సరి ∙చిన్నపిల్లలు మలబద్దకంతో బాధపడుతుంటే రోజూ రెండు స్పూన్లు ద్రాక్షరసం ఇస్తూ ఉంటే సమస్య తొలగుతుంది, ♦ అజీర్ణం, గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడేవారు తోటకూర, క్యారెట్, నారింజలను సమంగా కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. -
Health Tips: ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే
♦ ప్రతిరోజు ఉదయం, సాయంత్రం రెండు మూడు వెల్లుల్లి రేకులు తింటే రక్తపోటు, కడుపులో మంట, నులిపురుగుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ♦ కొన్ని స్పాంజి ముక్కలను నీళ్ళలో తడిపి ఫ్రీజర్‌లో ఉంచండి. చెయ్యి కాలినా లేదా ఏ తలుపు సందులోనో పడి నలిగినా ఒక స్పాంజి ముక్కను తీసి బాధ ఉన్న ప్రదేశంలో కొద్దిసేపు ఉంచితే నొప్పి, వాపు వెంటనే తగ్గుతాయి. ♦ పళ్ళు వచ్చే ముందు పిల్లలు ప్రతిదాన్నీ కొరుకుతూ చిగుళ్ళు నొప్పి పుట్టి ఏడుస్తూ ఉంటారు. అటువంటప్పుడు సారింజ తొనలలోని విత్తనాలు తీసేసి, ఆ తొనలను కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి వాటిని పిల్లలకు ఇస్తే ఆ చల్లదనం వారి బాధను పోగొట్టి రిలీఫ్ ఇస్తుంది. వారికి అవసరమైన ‘సి’ విటమిన్ కూడా లభిస్తుంది. ♦ ద్రాక్ష రసాన్ని కొంచెం తేనెలో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకుంటే దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందవచ్చు. ♦ కొబ్బరినూనె, నిమ్మరసం సమపాళ్ళలో తీసుకుని బాగా కలిపి కొద్దిగా వేడిచేసి నొప్పిగా ఉన్న ప్రాంతం లో మర్దన చేస్తే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ♦ కిడ్నీ వ్యాధుల నివారణకు రెండు వంతుల దోసకాయ రసానికి, ఒక వంతు ద్రాక్ష రసాన్ని కలిపి ఉదయం, సాయంత్రం ఒక కప్పు చొప్పున తాగి చూడండి ♦ బచ్చలి రసం, అనాసరసం సమపా ళ్లలో తీసుకుని దానిలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. -
Recipe: బ్రెడ్.. వెల్లుల్లి, గుడ్లు, కూరగాయలు... సూప్ చేసుకోండిలా!
Winter- Recipes In Telugu: చలికాలంలో బ్రెడ్ గార్లిక్ సూప్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►బ్రెడ్ ముక్కలు – అర కప్పు ►వెల్లుల్లిపాయ – సగం ( పలుచగా ముక్కలుగా కట్ చేసుకోవాలి) ►గుడ్లు – 2 (తినేవారి సంఖ్యని బట్టి పెంచుకోవచ్చు) ►కారం – 1 టేబుల్ స్పూన్ పైనే ►ఉప్పు – తగినంత ►బిర్యానీ ఆకు – 1 ►అన్నిరకాల కూరగాయ ముక్కలు – (చిన్నచిన్నగా తరిగి, 4 కప్పుల నీళ్లు పోసి.. కొద్దిగా ఉప్పు, కారం వేసుకుని.. సుమారు రెండున్నర కప్పులు అయ్యేలా.. బాగా మరిగించి, ముక్కల్ని వడకట్టి.. ఆ వెజిటబుల్ స్టాక్‌ని పక్కన పెట్టుకోవాలి) ►నూనె – సరిపడా ►కొత్తిమీర తురుము – గార్నిష్‌కి తయారీ: ►ముందుగా ఒక కళాయిలో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి.. అందులో వెల్లుల్లి ముక్కలు వేసుకుని దోరగా వేయించాలి. ►అవి వేగాక బ్రెడ్ ముక్కలు వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. ►అనంతరం.. ఉడికించిన కూరగాయలను వడకట్టిన నీటిని 2 కప్పుల వరకు ఇందులో పోసుకోవాలి ► తర్వాత బిర్యానీ ఆకు వేసుకుని మూత పెట్టి చిన్న మంట మీద ఉడికిస్తూ ఉండాలి. ►మధ్యలో రెండు గుడ్లను పగలగొట్టి.. పసుపు సొన విడిపోకుండా కళాయిలో వేరువేరుగా వేసుకోవాలి. ►గరిటెతో జాగ్రత్తగా కలుపుతూ ఉడకనివ్వాలి. ►మొత్తం మిశ్రమం కాస్త దగ్గర పడిన తర్వాత బౌల్లోకి తీసుకోవాలి. ►గుంట గరిటెతో గుడ్లను సర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. ►తినే ముందు కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mushroom Omelette: మష్రూమ్స్ ఆమ్లెట్.. వేయడం చాలా ఈజీ! Recipe: రుచికరమైన మీల్ మేకర్ – చికెన్ బాల్స్ తయారీ ఇలా! -
Beauty: గోధుమ పిండితో ట్యాన్‌కు చెక్! వెల్లుల్లి పేస్టు మొటిమలపై రాస్తున్నారా?
ట్యాన్ తొలగి ముఖం మెరిసిపోవాలన్నా.. మొటిమలు తగ్గించుకోవాలన్నా ఈ చిట్కాలు ట్రై చేయొచ్చు. పార్లర్‌కు వెళ్లే అవసరం లేకుండా మెరిసే మోము సొంతం చేసుకోవచ్చు. ట్యాన్ పోగొట్టే ఆటా ప్యాక్ ►గోధుమపిండితో రుచికరమైన రోటీలేగాక ఎండవల్ల ముఖంపై ఏర్పడిన ట్యాన్‌ను కూడా తగ్గించవచ్చు. ►దీనికోసం రెండు స్పూన్ల గోధుమపిండి, స్పూను తేనె, స్పూను పెరుగు, స్పూను రోజ్ వాటర్, స్పూను ఓట్స్, అరస్పూను కొబ్బరి నూనె తీసుకోవాలి. ►వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి పేస్టులా కలుపుకోవాలి. ►తరువాత ఈ పేస్టును ముఖానికి రాసి ఆరిన తరువాత ముఖాన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. ►ఈ ‘ఆటా ఫేస్‌ప్యాక్’ను వారానికి ఒకసారి వేసుకోవడం వల్ల ముఖంపై ఉన్న మృతకణాలు తొలగడమేగాక, ట్యాన్ తగ్గుముఖం పట్టి ముఖచర్మం కాంతిమంతమవుతుంది. వెల్లుల్లితో.. ►ముఖం మీది మొటిమలను ఇంటి చిట్కాతో సులభంగా వదిలించుకోవచ్చు. ►నాలుగు వెల్లుల్లి రెబ్బలు తీసుకుని పొట్టుతీసి మెత్తగా పేస్టులా నూరుకోవాలి. ►ఈ పేస్టును ముఖంపై ఉన్న మొటిమలపై రాయాలి. ►పేస్టు ఆరుతుంది అనుకున్నప్పుడు దానిపై బ్యాండేజ్ వేయాలి. ►ఈ బ్యాండేజ్‌ను రాత్రంతా ఉంచుకుని ఉదయం తీసేయాలి. ►ఇలా వారానికి రెండుసార్లు చేయడం ద్వారా మొటిమలు తగ్గుముఖం పడతాయి. నోట్: చర్మ తత్వాన్ని దృష్టిలో పెట్టుకుని ట్రై చేస్తే బెటర్. చదవండి: Health Tips: నీరసం.. నిస్సత్తువా? వీటిని ఆహారంలో చేర్చుకున్నారంటే.. రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే Health Tips: రోజూ స్కిప్పింగ్ చేసే అలవాటుందా? ఎండార్ఫిన్ల ఉత్పత్తి పెరిగి.. -
Recipe: కాలా మటన్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి!
ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. ఈ సందర్భంగా కాలా మటన్ తయారీ విధానం మీకోసం.. కాలా మటన్ కావలసినవి: ►మటన్ – ముప్పావు కేజీ ►గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు ►పసుపు – అరటీస్పూను ►ఉప్పు – రుచికి సరిపడా ►పెరుగు – కప్పు ►ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు ►నూనె – ఐదు టేబుల్ స్పూన్లు ►ధనియాలు – టేబుల్ స్పూను ►గసగసాలు – టేబుల్ స్పూను ►యాలుక్కాయలు – నాలుగు ►దాల్చిన చెక్క – అంగుళం ముక్క ►లవంగాలు – ఐదు ►మిరియాలు – ఐదు ►సోంపు – టేబుల్ స్పూను ►ఎండు మిర్చి – నాలుగు ►ఎండుకొబ్బరి తురుము – అరకప్పు ►బిర్యానీ ఆకు – ఒకటి ►షాజీరా – టీస్పూను ►వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►అల్లం తరుగు – టేబుల్ స్పూను ►బంగాళ దుంపలు – రెండు ►చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ: ►మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి. ►దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ►ఇరవై నిమిషాల తరువాత మటన్‌ను కుకర్‌లో వేయాలి. ►దీనిలో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి. ►తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి. ►వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. ►దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. ►నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషంపాటు వేయించాలి. ►తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లుపోసి మగ్గనివ్వాలి. ►దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి. ►ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలపాటు మగ్గనిచ్చి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Sugarcane Shrimp With Prawns: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా! Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా! -
Recipe: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా!
పచ్చిరొయ్యలు, చెరకు ముక్కల కాంబినేషన్‌తో సుగర్ కేన్ ష్రింప్ ఎలా వండుకోవాలో తెలుసా? సుగర్ కేన్ ష్రింప్ తయారీకి కావలసినవి: ►పచ్చిరొయ్యలు – అరకేజీ ►వెల్లుల్లి రెబ్బలు – మూడు ►ఉప్పు – రుచికి సరిపడా ►పంచదార – అరటేబుల్ స్పూను ►గుడ్డు తెల్ల సొన – ఒకటి ►తెల్లమిరియాలపొడి – రెండు టేబుల్ స్పూన్లు ►ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ►తొక్కతీసిన ఐదంగుళాల చెరుకు ముక్కలు – నాలుగు. తయారీ.. ►రొయ్యలను శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడవాలి. ►రొయ్యలు, వెల్లుల్లి, మిరియాలపొడి, పంచదార ఆయిల్‌ను బ్లెండర్లో వేసి పేస్టుచేసి పక్కన పెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో గుడ్డు తెల్ల సొన వేసి బాగా కలపాలి. ►ఈ సొనలో రొయ్యల పేస్టు వేసి చక్కగా కలిపి అరగంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►అరగంట తరువాత రెండు చేతులకు ఆయిల్ రాసుకుని రొయ్యల మిశ్రమాన్ని నాలుగు భాగాలుగా చేసి చెరుకు ముక్కలకు చుట్టూ పెట్టాలి. ►ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు డీప్‌ఫ్రై చేసి సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Egg Bhurji Balls Recipe: క్యారెట్, బీట్ రూట్ తురుము.. ఎగ్ బుర్జీ బాల్స్ తయారీ ఇలా! Panasa Ginjala Vadalu: పనస గింజలతో వడలు.. ఇలా తయారు చేసుకోండి! -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. ఈజీ పొటాటో స్నాక్.. టేస్టు అదిరిపోద్ది!
ఆలు చిప్స్ తినీతిని బోర్ కొట్టిందా! అయితే, బంగాళా దుంపతో ఈ వైరైటీ వంటకాన్ని ట్రై చేయండి. రొటీన్‌కు భిన్నంగా పొటాటో టోర్నడో రుచిని ఆస్వాదించండి. పొటాటో టోర్నడో తయారీకి కావాల్సిన పదార్థాలు: ►బంగాళ దుంపలు – 4 లేదా 5 ►మైదాపిండి – అర కప్పు ►మొక్కజొన్నపిండి – 1 టేబుల్ స్పూన్ ►బేకింగ్ సోడా – అర టీ స్పూన్ ►ఉప్పు – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ►గార్లిక్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►చీజ్ సాస్ – 4 టేబుల్ స్పూన్ల పైనే ►డ్రై పార్సీ – అర టేబుల్ స్పూన్ ►ఎండు మిర్చి పొడి – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్లో గార్లిక్ పౌడర్, చీజ్ తురుము, డ్రై పార్సీ.. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో బంగాళదుంపను ఒక్కో పొడవాటి పుల్లకు గుచ్చి.. చాకుతో స్ప్రిల్స్లా (వలయంలా, మొత్తం కట్ చెయ్యకుండా చిత్రంలో ఉన్న విధంగా) కట్ చేసుకుని పెట్టుకోవాలి. ►అనంతరం వెడల్పుగా ఉండే బౌల్లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ►ఆ మిశ్రమంలో ఒక్కో పొటాటో స్ప్రింగ్‌ని ముంచి.. నూనెలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని వరుసగా పెట్టుకుని.. అటు ఇటు తిప్పుతూ గార్లిక్–చీజ్ మిశ్రమాన్ని చల్లుకోవాలి. ►ఆ పైన చీజ్ సాస్ స్ప్రిల్స్ పొడవునా స్ప్రెడ్ చేసుకుని.. చివరిగా ఎండుమిర్చి పొడిని చల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: Summer Drink: సుగంధ షర్బత్ ఎలా తయారు చేస్తారో తెలుసా?