ముస్లింలు జరుపుకునే ప్రధాన పండుగల్లో రెండోది బక్రీద్. ఇది త్యాగానికి ప్రతీక. దీనిని ‘ఈదుల్ అజ్ హా’ అని కూడా అంటారు. ఈ రోజూ ప్రతి ముస్లిం తమ తాహతుకు తగ్గట్టుగా ఇరుగు పొరుగు వారికి ఖుర్బానీ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తోంది. ఏటా మంచి ఘుమ ఘుమలతో ఈ పండుగను జరుపు కుంటారు. ఈ సందర్భంగా కాలా మటన్ తయారీ విధానం మీకోసం..
కాలా మటన్
కావలసినవి:
►మటన్ – ముప్పావు కేజీ
►గ్రీన్ చట్నీ(పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు) – అరకప్పు
►పసుపు – అరటీస్పూను
►ఉప్పు – రుచికి సరిపడా
►పెరుగు – కప్పు
►ఉల్లిపాయ తరుగు – రెండు కప్పులు
►నూనె – ఐదు టేబుల్ స్పూన్లు
►ధనియాలు – టేబుల్ స్పూను
►గసగసాలు – టేబుల్ స్పూను
►యాలుక్కాయలు – నాలుగు
►దాల్చిన చెక్క – అంగుళం ముక్క
►లవంగాలు – ఐదు
►మిరియాలు – ఐదు
►సోంపు – టేబుల్ స్పూను
►ఎండు మిర్చి – నాలుగు
►ఎండుకొబ్బరి తురుము – అరకప్పు
►బిర్యానీ ఆకు – ఒకటి
►షాజీరా – టీస్పూను
►వెల్లుల్లి తరుగు – రెండు టేబుల్ స్పూన్లు
►అల్లం తరుగు – టేబుల్ స్పూను
►బంగాళ దుంపలు – రెండు
►చింతపండు గుజ్జు – రెండు టేబుల్ స్పూన్లు
తయారీ:
►మటన్ ముక్కలను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలో వేయాలి.
►దీనిలో పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గ్రీన్ చట్ని, పెరుగు వేసి కలిపి ఇరవైనిమిషాలు పక్కన పెట్టుకోవాలి.
►ఇరవై నిమిషాల తరువాత మటన్‌ను కుకర్‌లో వేయాలి.
►దీనిలో కొద్దిగా ఉల్లిపాయ తరుగు, కప్పు నీళ్లు పోసి ఒక విజిల్ వచ్చేంతవరకు పెద్దమంట మీద ఉడికించాలి.
►తరువాత సన్నని మంట మీద పదినిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి టేబుల్ స్పూన్ నూనె వేయాలి.
►వేడెక్కిన నూనెలో ధనియాలు, గసగసాలు, యాలుక్కాయలు, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, సోంపు, ఎండు మిర్చి వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి.
►దీనిలో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసి ముదురు బ్రౌన్ రంగు వచ్చేంతవరకు వేయించాలి.
►ఇప్పుడు ఎండుకొబ్బరి తురుము వేసి రంగు మారేంత వరకు వేయించి, చల్లారాక కొద్దిగా నీళ్లు పోసి పేస్టులా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి.
►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి.
►నూనె వేడెక్కిన తరువాత బిర్యానీ ఆకు, షాజీరా వేసి నిమిషంపాటు వేయించాలి.
►తరువాత అల్లం, వెల్లుల్లి తరుగు, మిగిలిన ఉల్లిపాయ తరుగు వేసి లేత బ్రౌన్ కలర్‌లోకి మారేంత వరకు వేయించాలి.
►ఇప్పుడు బంగాళ దుంపల్ని తొక్కతీసి ముక్కలు తరిగి వేసి, కొద్దిగా నీళ్లుపోసి మగ్గనివ్వాలి.
►దుంప ముక్కలు సగం ఉడికిన తరువాత ఉడికిన మటన్ మిశ్రమం వేయాలి.
►ఐదు నిమిషాల తరువాత మసాలా పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసి పదినిమిషాలపాటు మగ్గనిచ్చి దించేయాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Sugarcane Shrimp With Prawns: పచ్చి రొయ్యలు... చెరకు ముక్కలు! సుగర్ కేన్ ష్రింప్ తయారీ ఇలా!
Senagapindi Masala Roti Recipe: హర్యానా స్టైల్.. శనగపిండి మసాలా రోటీ తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment