మన వంట గదే ఔషధాల నిలయం. మనకు తెలియకుండానే మన పూర్వీకులు, పెద్ద వాళ్లు అలవాటు చేసిన, చెప్పిన పద్దతుల ద్వారా కొన్ని ఆరోగ్యకరమైన దినుసులు, మసాలాలను వాడుతుంటాం. ముఖ్యంగా పసుపు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు ఇలా ప్రతిదీ మన ఆరోగ్యానికి మేలు చేసేవే!
ఆయుర్వేద గుణాలు పుష్కలంగా ఉండటంతో పాటు, వాడాల్సిన పద్దతిలో వీటిని వాడితే అదనపు రుచిని అందిస్తాయి. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. అలాంటి వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
పసుపు: అనేక యాంటి బయోటిక్ గుణాలు, పోషకాలు ఇందులో ఉన్నాయి. అందుకే ప్రతీ కూరలోనూ చిటికెడు పసుపు వేయడం మన భారతీయులకు అలవాటు. పసుపులో ఉండే కర్కుమిన్ ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ మంటను తగ్గిస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్లు మొదలైన వాటి నుంచి కాపాడుతుంది. జలుబు చేసినపుడు పసుపు ఆవిరిపట్టడం, పసుపు,పాలు తాగడం, గాయాలకు పూయడం లాంటివి కూడా మంచిదే.
అల్లం: రోజువారీ వినియోగంలో అల్లం పాత్ర చాలా పెద్దదే. అల్లంలో ఉండే జింజెరాల్ అనే సమ్మేళనం శ్వాసకోశ మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసకోశ వ్యవస్థకు మేలు జరుగుతుంది. శ్లేష్మం తగ్గించడంలో సాయపడుతుంది. శ్వాస ఒత్తిడిని తగ్గిస్తుంది. అల్లంతో శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. కండరాల నొప్పులు తగ్గుతాయి. ఉదయాన్ని టీలో అల్లం కలుపుకుని తింటే అనారోగ్యం దరిచేరదు. అల్లాన్ని పచ్చిగా నమిలినా సరే లేదా తేనెతో కలిపి తిన్నా, జ్యూస్‌లా చేసుకుని తాగినా మంచిదే.
వెల్లుల్లి: వెల్లుల్లి వంటలకు రుచి, వాసనను అందిచడమే కాకుండా జీర్ణ ప్రక్రియను సులభ తరం చేస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల అనేక వ్యాధులను నివారించవచ్చు. ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు నీటితోపాటు వెల్లుల్లి రెబ్బను తింటే,జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు జీర్ణ సమస్యలు దూరమవుతాయి. అంతేకాదు శరీర బరువు కూడా తగ్గించేందుకు దోహద పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఏ, బీలు వ్యాధులకు నివారణలో పని చేస్తాయి. ఊపిరితిత్తులను క్లీన్ చేస్తుంది. అలోసిన్-సల్ఫర్ సమ్మేళనం వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది.
ఒరేగానో: వంటకాల్లో ఉపయోగించే ఒరేగానో హెర్బ్, యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంది. దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్, శ్వాసకోశ వాపు, క్షయవ్యాధి నివారణకు సహాయపడుతుంది. రుమాటిజం, తిమ్మిరి, మైగ్రేన్లు, ఉబ్బరం, ఆకలి లేకపోవడం, విరేచనాలు, కామెర్లు , వంటి ఇతర కాలేయ వ్యాధులకు ఒరేగానోను ఉపయోగిస్తారు. ఈ ఆకుల్లో పాలీ ఫినాల్స్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. జలుబు, దగ్గు మొదలైన బ్యాక్టీరియా, వైరస్‌ల వల్ల వచ్చే సమస్యల నుంచి రక్షించడంలో సాయపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment