కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి!  | These juices to fight with obesity and cholesterol | Sakshi
Sakshi News home page

కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి రావడం లేదా? ఇలా ట్రై చేయండి! 

Published Thu, Apr 11 2024 5:15 PM | Last Updated on Thu, Apr 11 2024 6:36 PM

These juices to fight with obesity and cholesterol  - Sakshi

ఊబకాయం, లేదా  ఒబెసిటీ  అనేక  రోగాలకు మూలం. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే  ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తు తాయి. అందుకే వయసు, ఎత్తుకు తగ్గట్టు బరువును, కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడం చాలా అవసరం. అయితే వెయిట్‌ లాజ్‌ జర్నీ అనుకున్నంత  ఈజీకాదు.  దీనికి పట్టుదల,  జీవన శైలి మార్పులు, తగిన వ్యాయామం  తప్పనిసరి.  ఈ క్రమంలో  చెడు కొలెస్ట్రాల్‌కి చెక్‌ చెప్పే కొన్ని సహజమైన జ్యూసెస్‌ గురించి తెలుసుకుందాం.

కరివేపాకు: ప్రతి వంటలోనూ  కరివేపాకును  ఉపయోగించడం మనకు బాగా అలవాటు. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కరివేపాకు చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మంచి కొలెస్ట్రాల్‌పెరగడానికి దోహదపడతాయి. ప్రతిరోజూ  కరివేపాకు రాసం తాగడం వల్లన కొలెస్ట్రాల్‌ నియంత్రణకు బాగా ఉపయోగపడుతుంది. అయితే  ఈ  రసం తయారుచేసుకునే ముందు, ఆకులను శుభ్రంగా  కడగాలి.  చీడపీడలు లేని  ఆకులను తీసుకోవాలి. 

కొత్తిమీర: వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడంలో కొత్తిమీర  తరువాతే ఏదైనా. ఆహారం రుచిని మెరుగుపరచడంతో పాటు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అధిక కొలెస్ట్రాల్ సమస్యను నయం చేసుకోవచ్చు.  కొత్తిమీర ఆకులను సలాడ్‌లో చేర్చుకోవచ్చు.  కొత్తిమీర రసం రక్త వృద్ధికి బాగా పనిచేస్తుంది. 

నేరేడు ఆకులు :  మధుమేహాన్ని అదుపులో ఉంచడంలో నేరేడు పళ్లు, గింజలు బాగా పనిచేస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. అయితే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో కూడా ఇది బేషుగ్గా పనిచేస్తుంది. యాంటీఆక్సిడెంట్ ఆంథోసైనిన్ వంటి లక్షణాలు వీటిల్లో మెండుగా ఉన్నాయి. ఇదిసిరల్లోపేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి పని చేస్తుంది.  జామున్ ఆకులను  శుభ్రంగా ఎండ బెట్టి పొడి రూపంలో తీసుకోవచ్చు. లేదా  టీ లేదా డికాషన్ తయారు చేసి రోజుకు 1-2 సార్లు త్రాగవచ్చు.

మెంతి ఆకులు: మెంతి  కూరలో   చాలా ఔషధ గుణాలున్నాయి. ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది.  అధిక కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మెంతి ఆకులను తినవచ్చు. జ్యూస్‌ రూపంలో తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్‌,  ఊబకాయం లాంటి సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. 

తులసి ఆకులు : తులసి  పవిత్రమైందిగా భావిస్తాం. దీని ఆకులు, జలుబు, గొంతు నొప్పినివారణలో  బాగా పనిచేస్తుంది. అలాఏగ కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో తులసి ఆకులు చాలా ప్రయోజనకరం.  జీవక్రియ ఒత్తిడిని తగ్గిస్తుంది.   ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో తులసి ఆకులను  శుభ్రంగా కడిగి తింటే నోటికి, ఒంటికి కూడా  చాలా మంచిది.

అలోవెరా:  కలబందప్రయోజనాల గురించి ఎంత చెప్పినా తక్కువే.  సౌందర్యపోషణలో, ఆరోగ్య రక్షణలోనూ  ఇది  చక్కటి ఔషధం. ఉదయాన్నే ఖాళీ కడుపుతో  అలోవెరా గుజ్జును తీసుకుంటే  కొలెస్ట్రాల్‌ మాయమైపోతుంది. శరీరంలోని ఇతర అనారోగ్యాలకు  కూడా ఇది  దివ్యౌషధం.  పైన పేర్కొన్న వాటి అన్నింటిలో  కావాలంటే  కొత్తిగా తేనెను యాడ్‌ చేసుకోవచ్చు.

నోట్‌:  ఈ సూచనలు అన్నీ అవగాహన కోసం మాత్రమే. వైద్యులు, ఆయుర్వేద  నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం  ఉత్తమం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement