నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు.
ఈ నేపథ్యంలో జిమ్‌కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.
గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!
గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది
క్రమం తప్పకుండా వ్యాయామం
ఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.
తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.
ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.
ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.
నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
Comments
Please login to add a commentAdd a comment