gym
-
అనకాపల్లి: జిమ్ కు కోటి రూపాయల కరెంటు బిల్లు
-
నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!
ఈజీగా బరువు తగ్గడం అనేది లేటెస్ట్ హాట్ టాపిక్. అందుకే ఇన్‌ప్లూయెన్సర్లు, సెలబ్రిటీలు తమ వెయిట్ లాస్ జర్నీలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూఉంటారు. తాజాగా ఫిట్నెస్ ఇన్‌ప్లూయెన్సర్ రిధిశర్మ ఎలాంటి కఠినమైన డైట్ పాటించకుండానే విజయ వంతంగా 20 కిలోల బరువును తగ్గించుకుంది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది.రిధి శర్మ అందించిన వివరాల ప్రకారం పీసీఓఏస్ సమస్యతో బాధపడుతున్నప్పటికీ, జిమ్‌కు వెళ్లకుండా, ఇంట్లోనే వ్యాయామాలు చేస్తూ తనబరువును గణనీయంగా తగ్గించుకుంది. రిధి శర్మ పాటించిన నిబంధనల్లో మరో ముఖ్యమైన అంశం ఇంట్లో తయారు చేసుకున్న ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం. నో ఫాస్ట్‌ఫుడ్, ఇంటి ఫుడ్డే ముద్దుచక్కెర , ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉంది. రోజూ నడవడం, నిద్రకు ప్రాధాన్యత ఇవ్వడం లాంటి చక్కటి జీవనశైలి మార్పులపై దృష్టి పెట్టడం ద్వారా ఆమె దీనిని సాధించింది. అనవసరమైన క్యాలరీలు తీసుకోకుండా పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారమే తీసుకుంది. అలాగే ప్రోటీన్ ఎక్కువగా ఉండే టోఫు, పన్నీర్, సోయా, చిక్కుళ్ళు , గింజధాన్యాలు, తింటే శక్తిని పెంచుకోవడంతో కడుపు నిండిన భావన కలుగు తుందని రిధి శర్మ వివరించారు. View this post on Instagram A post shared by Ridhi Sharma | Fitness & Lifestyle (@getfitwithrid)>ఇంట్లోనే వ్యాయామంజిమ్ మెంబర్షిప్ కోసం ఖర్చు చేయడం మానేసిన శర్మ, వారాంతంలో మినహా ప్రతి రోజూ 30-40 నిమిషాల ఇంట్లోనే వ్యాయామాలు చేసింది. యోగా మ్యాట్, రెండు డంబెల్స్, రెసిస్టెన్స్ బ్యాండ్‌తో దీన్ని సాధించానని చెప్పారు. తన వ్యాయామంలో పైలేట్స్ (కండరాలకుబలంచేకూర్చే ఆసనాలు) స్ట్రెంత్ ట్రైనింగ్, పైలేట్స్ కూడా ఉండేవని తెలిపారు.కంటినిడా నిద్రప్రతీ రోజు 7 నుంచి 8 గంటలు చక్కటి నిద్ర ఉండేలా జాగ్రత్త పడిందట. ఇదే బరువు తగ్గే తన ప్రయాణంలో, రికవరీలో ఇది కీలకమైన పాత్ర పోషించిందని తెలిపింది. వాకింగ్ తన జర్నీలో పెద్ద గేమ్ ఛేంజర్ అని, రోజుకు 7 వేల నుంచి 10 వేల అడుగులు నడిచానని రిధి తెలిపింది. కేవలం కడుపు మాడ్చుకోవడం కాకుండా, శ్రద్ధగా వ్యాయామం చేసి ప్రొటీన్ ఫుడ్ తీసుకుంటూ 20 కేజీల బరువు తగ్గినట్టు చెప్పింది రిధి.నోట్: బరువు తగ్గడం అనేది శరీర పరిస్థితులు, ఆరోగ్యం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది. కేవలం ఉపవాసం ఉండటం ఒఒక్కటే పరిష్కారం కాదు. కచ్చితంగా ఏదో ఒక వ్యాయామం చేయాలి. అందుకే బరువు తగ్గాలనుకుంటే, ఎందుకు బరువు పెరుగుతోందనే కారణాలను విశ్లేషించుకొని, నిపుణుల సలహా తీసుకోవాలి. దానికి తగ్గట్టుగా బరువు తగ్గే ప్లాన్ చేసుకోవాలి. -
జిమ్‌కి వెళ్లకుండానే 16 కిలోలు తగ్గింది, ఎలా?
బరువు తగ్గే ప్రక్రియ అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి బరువు తగ్గడం అంటే అదొక యజ్ఞం. కొందరు జిమ్‌కు వెళ్లి వర్కౌట్స్ చేస్తారు. మరికొంతమంది యోగాసనాలతో ఈజీగా బరువు తగ్గుతారు. మరికొంతమంది వాకింగ్, జాగింగ్ ద్వారా తమ అధిక బరువును తగ్గించు కుంటారు. మరికొందరు ఇవన్నీ చేస్తారు. జిమ్‌కు వెళ్లకుండానే సాహిబా ఏకంగా 16 కిలోల బరువు తగ్గింది. తన వెయిట్ లాస్ జర్నీని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. సాహిబా మొదట్లో 104 కిలోల బరువు ఉండేది. దీంతో ఎలాగైన బరువు తగ్గించుకోవాలని నిశ్చయించుకుంది. దీనికి రోజూ 10-20 వేల అడుగులు నడిచేది. అంతేకాదు ఎన్ని కేలరీల ఫుడ్ తింటున్నదీ నిత్యం పరిశీలించుకుంటూ ఉండేది. ఆహార నియమాలను పాటించి భారీగా బరువు తగ్గింది. ప్రస్తుతం 87.85 కిలోల బరువుకు చేరింది. ఇంట్లోనే కొంత కార్డియో చేసానని ,స్కిప్పింగ్ వ్యాయామం కూడా చేసినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా కొన్ని చిట్కాలను కూడా తన ఫాలోవర్స్‌కు అందించింది. అధిక బరువు ఉన్నవారు అరగంట నడకతో ప్రారంభించి, వారి వారి కంఫర్ట్ జోన్‌కు అనుగుణంగా ఈ సమయాన్నిపెంచుకోవాలని సూచించింది.16 కిలోల బరువు తగ్గడానికి స్టెప్స్ సాహిబా మాటల్లోపూర్తిగా ఉపవాసం కాకుండా మితంగా తిన్నాను. కోరుకున్నది తిన్నారు. తగ్గించి తింటూ కేలరీలను ట్రాక్ చేసుకున్నాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ 12:12 (12గం ఉపవాసం 12గం తినడం)శరీరం దీనికి సహకరిస్తే ఈ ఉపవాసాన్ని పెంచుకోవచ్చు.డయాబెటిక్ లేదా కొన్ని మందులు తీసుకుంటే ఉపవాసం వద్దు. 16:8 ఉపవాస పద్ధతిలో రోజుకు 16 గంటల పాటు ఉపవాసం. ప్రోటీన్ , ఫైబర్ ఎక్కువ, పిండి పదార్థాలు , కొవ్వు తక్కువ ఉన్న ఆహారందేన్ని ఎలా తినాలి అనేది లెక్క వేసుకోవాలి.నీటిని తాగుతూ హైడ్రేట్ గా ఉంచుకున్నారు. జిమ్‌కు వెళ్లకూడదని కాదు!అయితే జిమ్‌కి వెళ్లడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కూడా చెప్పింది. అయితే, అందరికీ ఆర్థిక స్థోమత ఉండదు కాబట్టి, తానూ కూడా ఆర్థిక భారం లేకుండా ఈ పద్ధతిని ఎంచుకున్నట్టు వెల్లడించింది. View this post on Instagram A post shared by Sahiba a.k.a Savleen | Vocals & Self-Care 🩷 (@sahibavox) నోట్: మనం ముందే అనుకున్నట్టుగా వెయిట్ లాస్ జర్నీ అనేది అందరికీ ఒకేలా ఉండదు. వారి వారి వ్యక్తిగత ఆరోగ్యం , పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. ఎవరి శరీర తత్వానికి తగ్గట్టు, మన బాడీ అందించే సంకేతాలను గుర్తించాలనే గమనించాలి. ఇటీవల విద్యాబాలన్ చెప్పినట్టు మన బరువు గుట్టు ఏంటి అనేది తెలుసుకుని రంగంలోకి దిగాలి.ఇదీ చదవండి : డైట్ చేస్తున్నారా? బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రాగుల ఉప్మా -
ఫిట్నెస్ కోసం హోం జిమ్!
మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సామాజిక మాధ్యమాల్లో వివిధ అంశాలపై స్పందిస్తూ నెటిజన్లకు ఆసక్తి కలిగిస్తుంటారు. ఫిజికల్ ఫిట్‌నెస్‌కు చాలామంది ప్రాధాన్యం ఇస్తారు. అందుకు జిమ్‌కు వెళ్లాలని అనుకుంటారు. కానీ ప్రత్యేకంగా జిమ్‌కు వెళ్లకుండా ఒకే పరికరంతో ఇంట్లోనే ఆ అనుభూతిని పొందుతూ ఫిట్‌గా ఉండొచ్చంటూ మహీంద్రా తెలిపారు. అందుకు సంబంధించి ఇటీవల ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అరొలీప్ అనే సంస్థ ద్వారా ఈ పరికరాన్ని నలుగురు ఐఐటీ విద్యార్థులు తయారు చేసినట్లు మహీంద్రా తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.Home gym created by 4 IIT grads. No rocket science here.But a clever convergence of mechanics & physical therapy principles to design a product that has global potential. In small apartments & even in Business Hotel rooms! Bravo! pic.twitter.com/Tz1vm1rIYN— anand mahindra (@anandmahindra) October 24, 2024ఇదీ చదవండి: ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్‘ఈ హోమ్ జిమ్ పరికరాన్ని నలుగురు ఐఐటీ గ్రాడ్యుయేట్లు తయారు చేశారు. ఇదేమంతా రాకెట్ సైన్స్ కాదు. ఈ పరికరాన్ని చిన్న అపార్ట్మెంట్లు, హోటల్ రూమ్‌ల్లో, చిన్న ఇళ్లల్లోనూ వినియోగించేలా ఏర్పాటు చేశారు. మెకానిక్స్, ఫిజికల్ థెరపీను అనుసందానిస్తూ దీన్ని తయారు చేయడం నిజంగా గొప్ప విషయం’ అని మహీంద్రా ట్వీట్ చేశారు. ఈ కంపెనీలో స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోధా సీఈవో నితిన్ కామత్ కూడా ఇన్వెస్ట్ చేసినట్లు వీడియో ద్వారా తెలిసింది. ఇందులో ఏఐ ఆధారిత ట్రెయినింగ్ సెషన్లు కూడా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. -
వైద్యం.. వైవిధ్యం..
మనకు అనారోగ్యం వస్తే.. వైద్యులను ఆశ్రయిస్తాం. మరి అలాంటి వైద్యులే అనారోగ్యం పాలైతే? ఒక వైద్యుడు ఆరోగ్యంగా ఉంటే వందలాది మంది రోగులకు ఆరోగ్యాన్ని అందిస్తాడు. ప్రాణాపాయం నుంచి తప్పిస్తాడు. అందుకే వైద్యుల ఆరోగ్యం అత్యంత విలువైనది. అయితే దురదృష్టవశాత్తూ ప్రజల్ని అనారోగ్యాల నుంచి విముక్తం చేయాల్సిన వైద్యులే తరచూ అనారోగ్యాలకు గురవుతున్నారని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైద్యులు/ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు చేపట్టిన చర్యల్లో భాగంగా ఆస్పత్రి ప్రాంగణంలో జిమ్ అనే కొత్త సంప్రదాయం ఊపిరి పోసుకుంది. ఈ నేపథ్యంలో దీని గురించి మరిన్ని వివరాలు.. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎమ్సీ) ప్రకారం.. దేశంలో వైద్యులు, జనాభా నిష్పత్తి 1:854 కావడంతో తీవ్ర పని ఒత్తిడి తప్పడం లేదు. దీంతో పాటే అనేక రకాల ఇతరత్రా పరిస్థితులు సైతం వైద్యులను రోగులుగా మారుస్తున్నాయి. ముఖ్యంగా కరోనా సంక్షోభ సమయంలో వైద్యులు/ ఆస్పత్రి సిబ్బంది ఆరోగ్యాల అంశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే వైద్య రంగంలో రకరకాల మార్పు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగమే ఆస్పత్రుల్లో వ్యాయామ కేంద్రాలు. ఇప్పటి దాకా పలు దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న హాస్పిటల్ జిమ్స్.. ఇప్పుడిప్పుడే మన నగరంలోనూ అందుబాటులోకి వస్తున్నాయి.ఆస్పత్రిలో జిమ్.. అంత ఈజీ కాదు.. నిజానికి కరోనా సమయంలో ప్రభుత్వ ప్రైవేటు ఆస్పత్రుల్లో రద్దీ, బెడ్స్ లేకపోవడం వంటివి అనేక మంది మరణాలకు కారణమవడం అందరికీ తెలిసిందే. మరోవైపు అత్యంత వ్యాపారాత్మక ధోరణిలో నడుస్తున్న కార్పొరేట్ ఆస్పత్రులు తమ వైద్యుల కోసం ఆస్పత్రిలో అత్యంత విలువైన స్థలాన్ని జిమ్‌కు కేటాయించడం అంత సులభం కాదు కాబట్టి.. ఈ తరహా ట్రెండ్‌కు శ్రీకారం చుట్టిన ఆస్పత్రివైపు అందరూ అశ్చర్యంగా, అభినందనపూర్వకంగా చూస్తున్నారు. ఒత్తిడిని జయించేందుకు.. ఆస్పత్రి ఆవరణలో జిమ్ ఉండడం అనేక రకాలుగా ప్రయోజనకరం అంటున్నారు పలువురు వైద్యులు. ముఖ్యంగా క్లిష్టమైన కేసుల్ని డీల్ చేయడం, ఆపరేషన్లు వంటివి చేసిన తరువాత కలిగే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవడానికి ఫీల్ గుడ్ హార్మోన్లు విడుదల కావడానికి సంగీతం నేపథ్యంలో సాగే వర్కవుట్స్ వీలు కల్పిస్తాయని అంటున్నారు. అంతేకాకుండా గంటల తరబడి ఎక్కువ సమయం ఆస్పత్రిలో గడపాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా జిమ్ అందుబాటులో ఉండడం వల్ల మేలు కలుగుతుందని అంటున్నారు.సిబ్బందికి ఉపయుక్తం.. ఒక పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో వైద్యుల కంటే నర్సులు, అసిస్టెంట్ స్టాఫ్.. ఇతరత్రా సిబ్బంది ఎక్కువ సంఖ్యలో ఉంటారు. వైద్యుల కన్నా రోగులతో అత్యధిక సమయం గడిపే వీరి ఆరోగ్యం కాపాడుకోడం చాలా ప్రధానమైన విషయమే. వీరి పనివేళలు సుదీర్ఘంగా ఉన్నా చెప్పుకోదగ్గ ఆదాయం ఉండని, ఈ దిగువ స్థాయి సిబ్బందికి నెలవారీ వేల రూపాయలు చెల్లించి జిమ్స్‌కు వెళ్లే స్థోమత ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆస్పత్రి ఆవరణలోనే జిమ్ ఉండడం, ఉచితంగా వ్యాయామం చేసుకునే వీలు వల్ల వీరికి వెసులుబాటు కలుగుతోంది. అరుదుగా కొందరు రోగులకు సైతం ప్రత్యేక వ్యాయామాలు అవసరమైనప్పుడు ఈ తరహా జిమ్స్ ఉపయుక్తంగా ఉంటాయి.లాభనష్టాల బేరీజు లేకుండా.. ఆస్పత్రుల్లో జిమ్స్ అనేది విదేశాల్లో కామన్. నేను సింగపూర్‌లోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నప్పుడు అక్కడ టాప్ ఫ్లోర్లో జిమ్ ఉండేది. అక్కడ నేను వర్కవుట్ చేసేవాడిని. ఏ సమయంలోనైనా ఆస్పత్రికి చెందిన వారు వెళ్లి అక్కడ వర్కవుట్ చేయవచ్చు. హౌస్ కీపింగ్ స్టాఫ్ నుంచి డాక్టర్స్ వరకూ ఎవరైనా వర్కవుట్ చేసేందుకు వీలుగా జిమ్ ఉండడం నాకు చాలా నచి్చంది. అదే కాన్సెప్ట్ నగరంలో తీసుకురావాలని అనుకున్నా. సిటీలో ఆస్పత్రి నెలకొలి్పనప్పుడు మా హాస్పిటల్లోనే దాదాపు రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 24/7 పనిచేసే జిమ్‌ను నెలకొల్పాం. లాభనష్టాలను బేరీజు వేసుకోకుండా దీన్ని ఏర్పాటు చేశాం. ఇప్పుడు మా ఆస్పత్రిలోని అన్ని స్థాయిల సిబ్బందీ ఈ జిమ్‌ను వినియోగించుకుంటున్నారు. – డా.కిషోర్‌రెడ్డి, ఎండీ, అమోర్ హాస్పిటల్స్ -
జిమ్ లో స్టెరాయిడ్స్ వాడుతున్నారా?
-
అక్రమంగా స్టెరాయిడ్స్ అమ్మకం
సాక్షి, హైదరాబాద్: శారీరక సౌష్టవం, కండలు పెంచాలనుకునే వారి బలహీనతను ఆసరాగా చేసుకుని స్టెరాయిడ్స్ అమ్ముతున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్ పై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు చర్యలు చేపట్టారు. రూ.2 లక్షల విలువైన 22 రకాల స్టెరాయిడ్స్‌ను స్వా«దీనం చేసుకుని, సంస్థను సీజ్ చేసినట్లు డీసీఏ డీజీ కమలాసన్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోఠిలోని ఈసామియా బజార్లో రాకేశ్ కనోడియా నిర్వహిస్తున్న రాకేశ్ డిస్ట్రిబ్యూటర్స్‌లో అక్రమంగా స్టెరాయిడ్స్ విక్రయి స్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 18, 19 తేదీల్లో సోదాలు చేసినట్టు తెలిపారు. స్వా«దీనం చేసుకున్న స్టెరాయిడ్స్‌ను పరీక్షల కోసం పంపామన్నారు. అనుమతి లేకుండానే మందుల దుకాణం.. మియాపూర్‌లోని శ్రీకాంత్ న్యూరోసెంటర్లో లెసెన్స్ లేని మందుల దుకాణాన్ని సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండానే మందుల దుకాణాన్ని నిర్వహిస్తున్నట్టు సోదాల్లో భాగంగా గుర్తించామని కమలాసన్‌రెడ్డి వెల్లడించారు. -
12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్, దెబ్బకు ఊబకాయం పరార్! ఇంట్రస్టింగ్ స్టోరీ
బరువు తగ్గడం అనేది చిటికెలోనో, చిట్కాలతోనో జరిగేది కాదు. దీనికోసం సమతుల ఆహారం, నిరంతర వ్యాయామం కావాలి. వీటన్నింటికీ మించి పట్టుదల, చిత్తశుద్ధి, నిరంతర సాధన ఉండాలి. ఈ విషయాన్నే అక్షరాలా నిజం చేసి చూపించింది ఇంగ్లాండ్‌లోని నార్త్ ఆప్టన్షైర్కు చెందిన 20 ఏళ్ల మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ మిల్లీ స్లేటర్. చిన్న జిమ్ చిట్కాతో ఏడాది పాటు శ్రమించి బరువు ఎలా తగ్గిందో తెలుసుకుందాం రండి!మిల్లీ స్లేటర్ 2023లో 115 కేజీల బరువుండేది. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకుంది. జిమ్ చేసి ఒక్క ఏడాదిలో48 కిలోల బరువు తగ్గింది. ఇపుడు టోన్డ్ ఫిజిక్‌తో నాజూగ్గా తయారైంది. ఇపుడు ఆమె బరువు 67 కిలోలు. తన వెయిట్ లాస్ జర్నీని టిక్‌టాక్‌లో(టిక్‌టాక్‌పై ఇండియాలో నిషేధం) పంచుకుంది. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.న్యూస్‌వీక్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో, ట్రెడ్‌మిల్‌పై వెయిట్ ట్రైనింగ్, ట్రెడ్మిల్ ఇంక్లైన్ వాకింగ్ ద్వారా తన జిమ్ అనుభవాన్ని గణనీయంగా పెంచిందని స్లేటర్ వెల్లడించింది. ఫిట్నెస్కి పోషకాహారం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో వివరించింది. జిమ్‌లో సాధనతోపాటు, తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్ల ఆహారంపై దృష్టి సారించాలని పేర్కొంది. వ్యాయామం అనేది ఆహ్లాదకరంగా ఉండాలని సూచించింది. 30 నిమిషాల పాటు గంటకు 3 మైళ్ల వేగంతో 12 శాతం గ్రేడ్‌తో ట్రెడ్మిల్ వర్కౌట్ చేస్తానని తెలిపింది. ఇది లారెన్ గిరాల్డో చెప్పిన 12-3-30 ట్రెడ్మిల్ వర్కౌట్ లా ఉంటుందని స్లేటర్ తెలిపింది. మరోవైపు బయోమెకానిక్స్ జర్నల్ ఇటీవల ప్రచురించిన అధ్యయనం ప్రకారం చదునైన నేల మీద నడిచిన దానితో పోలిస్తే ట్రెడ్మిల్ మీద 5 శాతం ఇంక్లైన్లో నడిస్తే 17 శాతం, 10 శాతం ఇంక్లైన్లో నడిస్తే 32 శాతం అదనంగా కేలరీలు ఖర్చు అవుతాయట. మరోవైపు 12-3-30 వర్కవుట్‌తో కేవలం 30 నిమిషాల్లో 150 పౌండ్ల బరువున్నవ్యక్తి దాదాపు 300 కేలరీలు ఖర్చు చేయగలడని హెల్త్ సెంట్రల్ చెబుతోంది. -
Video: జిమ్‌లో వ్యాయామం చేస్తూ కుప్పకూలిన యువకుడు
గత కొన్నేళ్లుగా యువతలో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలు నేడు యువకులను పీడిస్తున్నాయి. ముఖ్యంగా డ్యాన్స్ చేసేటప్పుడు, జిమ్‌లో గుండెపోటుకు గురవడం పెరుగుతోంది. ప్రస్తుత జీవన విధానంలో గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఆకస్మిక గుండెపోటు ఒక రకమైన సైలెంట్ హార్ట్ ఎటాక్ అని వైద్యులు చెబుతున్నారు.తాజాగా మహారాష్ట్రలో ఓ వ్యక్తి జిమ్ చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. జిమ్‌లోని సీసీటీవీ ఫుటేజీలో ఈ ఘటన రికార్డు అయింది. ఇందులో కన్వల్జిత్ సింగ్ బగ్గా అనే వ్యక్తి ఇతరులతో కలిసి కొన్ని వ్యాయామాలు చేస్తున్నాడు. అయితే అలా చేస్తూ కన్వల్ జిత్ కాస్త అసౌకర్యానికి గురయ్యాడు.మిగిలిన వాళ్లు వ్యాయామాన్ని కొనసాగిస్తూ ఉండగా.. అతడుగా నిదానంగా పక్కకు ఒరుగుతూ కనిపించాడు.క్షణాల్లోనే బగ్గా ఓ పిల్లర్‌కు ఆనుకొని అక్కడే కుప్పకూలిపోయాడు. కిందపడిపోవడం చూసిన అక్కడున్నవారు అతడి వద్దకు పరిగెత్తుకుని వెళ్లారు. అతనికి ఏమైందో జరిగిందో తెలియక వాళ్లంతా అటూ ఇటు పరిగెత్తడం వీడియోలో రికార్డు అయింది. అయితే బాధితుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఛత్రపతి సంభాజీనగర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.Another death due to heart attack⚠️Businessman Kawaljeet Singh collapses after suffering a fatal heart attack while working out at a gym in Maharashtra's Chhatrapati Sambhajinagar. pic.twitter.com/LXMne0qElz— Sneha Mordani (@snehamordani) July 22, 2024 -
75 ఏళ్ల వయస్సులోనూ ఫిట్‌గా..
ఆయనకు సరిగ్గా 75 ఏళ్లు.. అయితేనేం..? నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో కష్టపడితేగానీ నేటితరం యువత సాధించలేని సిక్స్‌ప్యాక్‌ను నలభై ఏళ్ల క్రితమే తన సొంతం చేసుకున్నాడు. వృద్ధాప్యంలోనూ సిక్స్‌ప్యాక్‌ను కాపాడుకుంటూ నేటితరం యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆయనే సికింద్రాబాద్ ఓల్డ్‌బోయిన్‌పల్లికి చెందిన విజయ్‌కుమార్. అనేక కారణాలతో నేటి తరం యువత తమ సిక్స్‌ప్యాక్ కలను సాధించలేకపోతున్నారు.సిక్స్‌ప్యాక్ కోసం గంటల తరబడి జిమ్‌లో కసరత్తులు తప్పనిసరి. ఎన్ని కసరత్తులు చేసినా సిక్స్‌ప్యాక్ సాధ్యం అవుతుందన్న గ్యారంటీ లేదు. ఇటువంటి కఠోర వ్యాయామాలను సునాయసంగా చేస్తూ తన సిక్స్‌ప్యాక్‌ను నేటికీ పదిలపరుచుకుంటున్నారు. వయసు శరీరానికే తప్ప మనసుకు కాదు అంటున్న విజయ్‌కుమార్ ఈ వయసులోనూ హుషారుగా వ్యాయామాలు చేస్తున్నారు.. ర్యాంప్‌వాక్‌లు సైతం చేయవచ్చని నిరూపిస్తున్నారు. క్రమం తప్పకుండా జిమ్‌కు వెళ్లడం, వ్యాయామంతోపాటు జాగింగ్, సైక్లింగ్ చేస్తూ ఎందరో యువకులు, విద్యార్థులకు ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధ కండలవీరుడు విజయ్‌కుమార్‌పై సాక్షి కథనం.. సునాయాసంగా కఠోర ఆసనాలు 28 ఏళ్ల వయస్సు నుంచే వ్యాయామాలుఓల్డ్బోయిన్పల్లికి చెందిన ఎం.విజయ్‌కుమార్ నాలుగు దశాబ్దాలుగా క్రమం తప్పకుడా వ్యాయామం చేస్తూ అనారోగ్యాన్ని దరిచేరకుండా జాగ్రత్తపడుతున్నారు. సికింద్రాబాద్ నుంచి సుచిత్ర వరకూ, ప్యారడైజ్ నుంచి బొల్లారం వరకూ, మారేడుపల్లి నుంచి బాలానగర్ వరకూ ఉన్న జిమ్ నిర్వాహకులకు, అందులో శిక్షణ తీసుకుంటున్న యువతకు సుపరిచితులు. సికింద్రాబాద్‌లో ఇంజినీరింగ్ వ్యాపారంలో స్థిపరడిన విజయ్‌కుమార్ తన 28 ఏళ్ల వయసు నుంచే వ్యాయాయం మొదలుపెట్టాడు. కొద్ది సంవత్సరాల క్రితం వరకూ వ్యాపారాన్ని కొనసాగించిన ఆయన ప్రస్తుతం వ్యాయామంతోపాటు యువతకు స్ఫూర్తిగా నిలిచే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. సీనియర్ సిటిజన్స్లోనూ...కొద్ది సంవత్సరాలుగా స్నేహ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ ప్రతినిధిగా కొనసాగుతున్న విజయ్‌కుమార్ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ వృద్ధులకు స్పూర్తిగా నిలుస్తున్నారు. డీజే పాటలకు డ్యాన్స్ చేయడం, స్వతహాగా పాటలు పాడడం వంటి కార్యక్రమాలతో అటు వృద్ధుల్లో ఇటు యువకుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నారు. జిమ్ వర్కవుట్తోపాటు జాగింగ్, సైక్లింగ్ పోటీల్లోనూ పలు మెడల్స్‌ను అందుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నిర్వహించిన బాడీబిల్డింగ్, సైక్లింగ్ పోటీల్లో నేటికీ పాల్గొంటుంటారు.అందరూ క్రీడాకారులే... వ్యాయామం, క్రీడలు విజయ్‌కుమార్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులకు అలవాటయ్యాయి. విజయ్‌కుమార్, భార్య పిల్లలు కూడా ఉదయం నిద్రలేచింది మొదలు వర్కవుట్స్ చేయడం వారి దినచర్య. భార్య శారద కూడా భర్తకు తోడుగా వాకింగ్, జాగింగ్‌లకు వెళతారు. సీనియర్ సిటిజన్స్ క్రీడల్లో శారద పలు పతకాలు గెలుచుకుంది. కూతురు వాణి వాలీబాల్ జాతీయ క్రీడాకారిణిగా అవార్డులు అందుకుంది. కుమారులు పవన్, నవీన్ ఇరువురూ జాతీయ, అంతర్జాతీయ స్విమ్మర్లు. పెద్దకుమారుడు ఆ్రస్టేలియాలో స్థిరపడగా చిన్నకుమారుడు స్విమ్మింగ్ కోచ్‌గా ఉన్నాడు.ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ...సికింద్రాబాద్ ప్రాంతంలో విజయ్‌కుమార్ వర్కవుట్ చేయని జిమ్, సైక్లింగ్ చేయని రోడ్డు, జాగింగ్ చేయని మైదానం లేదంటే అతిశయోక్తి కాదు. ఆయన వర్కవుట్ చేయడంతో పాటు అక్కడి యువకులకు వర్కవుట్‌లో మెళకువలు నేర్పుతుంటారు. ఇంటి ఆహారం అందులోనూ శాకాహారానికి ప్రాధాన్యత ఇవ్వడం, దురలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పదిలం చేసుకోవడం పట్ల అవగాహన కలిగిస్తున్నారు.శేషజీవితం సమాజానికి అంకితం నిరంతర వ్యాయామంతో వృద్ధాప్యంలోనూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా. ప్రస్తుతం కుటుంబ, వ్యాపార బాధ్యతలు ఏవీ నాపై లేవు. శేష జీవితం సమాజాభివృద్ధికి అంకితం చేయాలన్నదే లక్ష్యం. సీనియర్ సిటిజన్లలో నిరాశ, నిస్పృహలను దూరం చేసేందుకు చేతనైన సహాయం చేస్తున్నా. – మందుల విజయ్‌కుమార్ -
జిమ్ రిసెప్షనిస్ట్ ఆత్మహత్య
దొడ్డబళ్లాపురం: జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తున్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బాగలకుంట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దావణగెరెకి చెందిన మల్లనగౌడ, జ్యోతి దంపతుల కుమార్తె శ్రావణి(22) దాసరహళ్లిలో ఉంటూ బాగలకుంట పరిధిలోని గోల్డెన్ జిమ్‌లో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తోంది. సోమవారం ఉదయం రోజులాగే పనికి వెళ్లిన శ్రావణి హఠాత్తుగా కూర్చున్న చోటే వాంతులు చేసుకుని అస్వస్థతకు గురై కుప్పకూలింది. జిమ్ సిబ్బంది ఆమెను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. శ్రావణికి తలంలితండ్రులు వివాహం నిశ్చయించారు. అయితే ఆమె శంకర్ అనే యువకుడిని ప్రేమిస్తోందని సమాచారం. శ్రావణిని పెళ్లికి ఒప్పించాలని తల్లితండ్రులు ఇటీవల బెంగళూరు వచ్చారు. అయితే వివాహం చేసుకోవడానికి ఇష్టం లేని శ్రావణి చివరిసారిగా ప్రియుడికి ఫోన్ చేసి విషయం చెప్పింది. అప్పటికే ఆమె విషం తాగింది. కేసు దర్యాప్తులో ఉంది. -
జిమ్‌లో చెమట చిందిస్తోన్న రకుల్.. ఫిట్నెస్ కోసం ఎన్ని కష్టాలో! (ఫోటోలు)
-
జిమ్‌లో అల్లు స్నేహారెడ్డి.. వర్కవుట్స్ చూశారా!
టాలీవుడ్ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భార్యగా స్నేహా రెడ్డి అందరికీ పరిచయమే. సినిమాలకు సంబంధం లేకపోయినా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఎక్కడికెళ్లినా ఫ్యామిలీతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని అందంతో నెటిజన్లను ఆకట్టుకుంటారు. ఈ క్రమంలో ఆమెకు నెట్టింట ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు సుమారు 10 మిలియన్ల వరకు ఫాలోవర్స్ ఉన్నారుతాజాగా స్నేహారెడ్డి జిమ్‌లో వర్కవుట్ చేస్తోన్న సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన బన్నీ ఫ్యాన్స్ సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫిట్‌నెస్‌పై శ్రద్ధ వేరే లెవెల్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కాగా.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2 మూవీతో బిజీగా ఉన్నారు. సుకుమార్ డైరెక్షన్లో వస్తోన్న ఈ చిత్రాన్ని పుష్ప పార్ట్-1కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలోనూ రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన పుష్ప-2 ఊహించని విధంగా డిసెంబర్‌కు వాయిదా పడింది.Giving us major fitness goals, #AlluSnehaReddy seen streching & flexing to the core at the gym! 📸💪#AlluArjun #TFNReels #TeluguFilmNagar pic.twitter.com/QHMYWqNuNA— Telugu FilmNagar (@telugufilmnagar) June 28, 2024 -
ఇలాంటి జిమ్ సెంటర్లకి వెళ్లకపోవడమే మేలు...!
ఇటీవల ఫిట్నెస్ మీద దృష్టిసారిస్తోంది యువత. అందుకోసమని యోగా, ఏరోబిక్, జిమ్ వంటి పలు రకాల సెంటర్లకి వెళ్లి మరీ వర్కౌట్లు చేస్తున్నారు. అయితే చాలామంది చేసే తప్పు ఏంటంటే.. ఆ జిమ్ సెంటర్ ఫేమస్? కాదా అన్నది చూస్తారు గానీ ఆ సెంటర్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది గమనించారు. పాపం అలానే ఇక్కడొక మహిళ జిమ్ సెంటర్ పరిస్థితిని గమనించకపోవడంతో ప్రాణాలు పోగొట్టుకుంది. ఈ దిగ్బ్రాంతికర ఘటన ఇండోనేషియాలో చోటు చేసుకుంది.వివరాల్లోకెళ్తే..ఇండోనేషియాలోని జిమ్‌లో 22 ఏళ్ల మహిళ మూడో అంతస్తులో ఉన్న ట్రెడ్‌మిల్‌పై నుంచి జారిపడి.. నేరుగా కిటికిలోంచి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం ఇండోనేషియాలోని కాలిమంటన్‌లోని పోంటియానాక్లో జూన్ 18న చోటు చేసుకుంది. ఆ మహిళ ట్రెడ్మీల్పై నడుస్తూ ఉండగా అనూహ్యంగా బ్యాలెన్స్ కోల్పోయింది. అయితే వెనుక ఎంతో మేర ప్రదేశం లేకపోవడం ..దీనికి తగ్గట్టు అక్కడ ఉన్న గోడ మాదిరి అద్దంలాంటి విండో తెరిచి ఉండటంతో వెంటనే నేరుగా పడిపోయింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలై అయక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదం ఆమె తన ప్రియుడితో కలిసి జిమ్ చేసేందుకు వచ్చినప్పుడూ చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియ పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా..ట్రెడ్‌మిల్‌కి కిటికి మధ్య దూరం కేవలం 60 సెంటిమీటర్ల దూరం ఉన్నట్లు తేలింది. పోస్ట్‌మార్టం రిపోర్టు కూడా తలకు తీవ్ర గాయలవ్వడంతోనే మృతి చెందిదని పేర్కొంది. నిజానికి ట్రెడ్‌మిల్‌పై ఎవరైనా కిందపడిపోవటం కామన్ అని, అయితే తగురీతిలో అక్కడ భద్రత లేకపోవడమే బాధకరమని అన్నారు ఇండోనేషియా పోలీసులు.అలాగే సదరు జిమ్ యజామనిని ఇలా ఎందుకు ఏర్పాట్లు చేశారని ప్రశ్నించగా..అద్దానికి వ్యతిరేకంగా చేస్తే దృష్టి మరలదని ఇలా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. అలాగే విండోలు క్లోజ్ చేసేలా వ్యక్తిగత పర్యవేక్షకులు పరివేక్షిస్తుంటారని చెప్పుకొచ్చాడు. అయితే ఈ ప్రమాదం జరిగినప్పుడూ ఒకరూ లీవ్‌లో ఉండటంతోనే ఇది జరిగిందని చెప్పాడు సదరు యజమాని. ప్రస్తుతం పొలీసులు సదరు జిమ్ నిర్వహణ అనుమతిపై కూడా విచారణ చేపడుతున్నారు.(చదవండి: పారిస్ ఫ్యాషన్ వీక్‌లో జాన్వీ స్టైలిష్ లుక్..గజగామిని మాదిరి..!) -
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
టాలీవుడ్లో పరిచయం అవసరంలేని అందమైన జంట ప్రిన్స్ మహేష్ బాబు, నటి నమ్రతా శిరోద్కర్ది. పెళ్లి తరువాత నటనకు గుడ్ బై చెప్పి నమ్రత కుటుంబ బాధ్యతలను చూసుకుంటోంది. వీరి ముద్దుల తనయ సితార నటిగా, మోడల్‌గా ఇప్పటికే తన హవాను చాటుకుంటోంది. అయితే తాజాగా నమ్రత వర్కౌవుట్ చేస్తున్న వీడియో ఇంటర్నెట్లో సందడి చేస్తోంది. దీంతో వదినమ్మ ఎందుకింత కసరత్తు చేస్తోందంటూ ఫ్యాన్స్ చేస్తున్న ఊహాగానాలు వైరల్‌గా మారాయి.2004 నుండి పెద్ద స్క్రీన్కు దూరంగా ఉన్నారు నమ్రత. అయితే సోషల్ మీడియా అభిమానులకు అప్డేట్స్ మాత్రం అస్సలు మర్చిపోదు. భర్త , సూపర్ స్టార్ మహేష్ బాబు, పిల్లలు సితార గౌతమ్ గురించి తరచుగా పోస్ట్ చేస్తుంది. తాజాగా మాజీ మిస్ ఇండియా ఇటీవల ఒక రీల్‌ను షేర్ చేసింది. ఆమె భారీ వర్కౌట్ సెషన్ చూసి అభిమానులు తెగ ఫిదా అవుతున్నారు.ఫిట్నెస్ కోసం ఆమె చేస్తున్న పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. ‘‘బలమైన మహిళ!!’’ ‘‘సూపర్ వుమన్’’, , ‘‘వావ్’’, ‘‘బ్యూటిఫుల్’’ , ‘‘సూపర్ మామ్’’ అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) కాగా నమ్రతా గతంలో వివిధ సందర్భాలలో వర్కౌట్ వీడియోలను షేర్ చేసింది. గత ఏడాది మేలో, ట్రైనర్ కుమార్ మన్నవతో కలిసి హార్డ్‌కోర్ వ్యాయామాలు చేస్తున్న వీడియోను పోస్ట్ చేయడంతో ఆమె మళ్ళీ నటించనుందనే ఊహాగానాలకు దారితీసిన సంగతి తెలిసిందే. -
జిమ్ చేస్తూ కుప్పకూలి 17 ఏళ్ల మైనర్ కన్నుమూత
జీవితంలో మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా కోవిడ్ సంక్షోభం తరువాత ఆరోగ్యం ఉన్నవారు వ్యాయామం చేస్తూ పలు ఆకస్మిక మరణాలు ఆందోళన రేపుతున్నాయి. జిమ్‌లో వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల బాలుడు మరణించిన షాకింగ్ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్పూర్లోఈ విషాదం చోటు చేసుకుంది. భాన్‌పురిలోని స్పేస్ జిమ్‌లో బుధవారం వ్యాయామం చేస్తూ 17 ఏళ్ల మైనర్ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రోజు మాదిరిగానే ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతూ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పోలీసుల సమాచారం ప్రకారం సత్యం (17) రహంగ్‌డేల్ భన్‌పురిలోని ధనలక్ష్మి నగర్లో నివాసముంటున్నాడు. ఎప్పటిలాగే బుధవారం ఉదయం జిమ్‌లోని ట్రెడ్‌మిల్‌పై పరిగెత్తుతున్న అతడు ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కిందపడిపో యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేదు. అయితే అతని మరణానికి గల కారణాలను ఇంకా అధికారికంగా వెల్లడిరచలేదు. పోస్టుమార్టం నివేదిక తరువాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.సత్యం తండ్రి సుభాష్ రహంగ్‌డేల్ చిరు వ్యాపారం చేసుకునేవాడు. ఇద్దరు కుమారుల్లో సత్యం పెద్దవాడు. ఇటీవల ధనలక్ష్మి నగర్‌లోని కృష్ణ ఇంగ్లీషు మీడియం స్కూల్లో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. కానీ ఈ సంతోషం వారికి ఎంతోకాలం నిలవలేదు. ఎదిగిన కొడుకు ఆకస్మికంగా మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
పొట్ట తగ్గాలంటే.. జిమ్‌కే వెళ్లాలా? ఏంటి?
నేటి ఆధునిక శారీరక శ్రమ బాగా తగ్గిపోయింది. దీనికితోడు జీవనశైలిలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి కారణంగా చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. దీన్ని తగ్గించుకోవడానికి ఉపవాసాలున్నా, జిమ్ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదని వాపోతున్న వారిని చూస్తూ ఉంటాం. అలాగే ఏం తిన్నా ఇక్కడికే.. అంటూ హీరోయిన్ సమంతా తరహాలో అద్దముందు నిలబడి డైలాగులుకొట్టే అమ్మాయిలు కూడా చాలామందే ఉన్నారు. ఈ నేపథ్యంలో జిమ్‌కెళ్లకుండానే, ఇంట్లోనే సింపుల్ చిట్కాలతో, ఊబకాయం, బెల్లీ ఫ్యాట్, ఫ్యాటీ బటక్స్ సమస్యకు చెప్పవచ్చు.గంటల తరబడి ఒకే చోట కూర్చుంటే గండమే!గంటల తరబడి టీవీలకు అతుక్కు పోకూడదు. పనిలో పడి అలాగే 8 నుంచి 10 గంటల పాటు కూర్చుని పని చేయకూడదు. ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చోవడం వల్ల కొవ్వు పేరుకుపోతోంది. అలాగే కడుపు ఉబ్బరం వస్తుంది. కాబట్టి ప్రతి గంటకు 5 నిమిషాలు విరామం తీసుకోవాలి. మెట్లు ఎక్కడం, గుంజీలు తీయడం లాంటివి చేయాలి. దీంతో అవయవాలకు రక్త ప్రసరణ సవ్యంగా జరుగుతుంది. బరువు అదుపులో ఉంటుంది క్రమం తప్పకుండా వ్యాయామంఉదయం, సాయంత్రం లేదా మీకు వీలైన సమయంలో వేగంగా నడవడం, జాగింగ్, యోగా, సైక్లింగ్, స్విమ్మింగ్ తప్పకుండా చేయాలి. స్నేహితులతో కలిసి మీకు నచ్చిన గేమ్స్ (క్రికెట్, టెన్నిస్, కబడ్డీ,ఇ తర) అవయవాలు పూర్తిగా కదిలేలా ఆడండి. శరీరమంతా చెమట పట్టేదాకా శ్రమిస్తే బాడీలో టాక్సిన్స్ అన్నీ బయటికి పోతాయి.ఎముకలు, కండరాలు బలతంతా తయారవుతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అతి ముఖ్యమైన డీ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది.తగినన్ని నీళ్లు, కంటినిండా నిద్ర: వ్యాయామం చేసేటప్పుడు వీలైనంత ఎక్కువ నీరు త్రాగాలి. ఇది ఆకలిని తగ్గిస్తుంది , బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. రోజుకు కనీసం 8 గ్లాసుల నీరు త్రాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతారు. నీటిని తాగడం వల్ల పొట్ట, పొత్తికడుపు కొవ్వు తగ్గుతుంది. చక్కటి నిద్ర కూడా మన బరువును ప్రభావితం చేస్తుంది. రోజుకు ఎనిమిది గంటల నిద్ర అవసరం.ఫైబర్ రిచ్ ఫుడ్స్: శరీర బరువు నియంత్రణలో ఉండాలంటే మనం తీసుకునే ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. బరువు పెరగడం గురించి ఆందోళన మానేసి పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.తాజా ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోండి, ఈ రకమైన ఆహారాన్ని తినడం వల్ల మీ కడుపు చాలా సేపు నిండుగా ఉంటుంది. అలాగే రాత్రి 7 గంటల లోపు డిన్నర్ కంప్లీట్ చేయాలి. బరువు క్రమంగా తగ్గడం ప్రారంభమవుతుంది.ఇంకా: ఒకేసారి కడుపు నిండా.. ఇక చాలురా బాబూ అనేంతగా తినవద్దు. అలాగే మైదాతో తయారుచేసిన పదార్థాలు, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలి. మద్యం, ధూమమానం లాంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. పొట్ట, పిరుదులు, పిక్కలు, భుజాలు లాంటి ప్రదేశాల్లో కొవ్వును కరిగించుకునేందుకు నిపుణుల సలహా మేరకు కొన్ని స్పాట్ రిడక్షన్ ఎక్స్‌ర్‌సైజ్‌లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. యోగాలో కూడా ఇందుకోసం మంచి ఆసనాలు ఉన్నాయి. వాటినా ప్రాక్టీస్ చేయవచ్చు. నిజంగా వీటిని చిత్తశుద్ధిగా ఆచరిస్తే వారంలో బరువు తగ్గడం ఖాయం.నోట్: ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే అని గమనించగలరు. ఏదైనా అనారోగ్య సమస్యలున్న వారు వైద్యులను సంప్రదించడం ఉత్తమం. -
జిమ్ చేస్తూ కుప్పకూలిన యువకుడు..చివరకు వీడియో వైరల్
ఫిట్నెస్ కోసం వ్యాయామం చేస్తూ కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆందోళన రేపుతోంది. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు ఒక యువకుడు. ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఈ విషాదం చోటు చేసుకుంది.వారణాసికి చెందిన దీపక్ గుప్తా (32)గత పదేళ్లుగా జిమ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తుండేవాడు.పలు ఫిట్నెస్ పోటీలలో చురుకుగా పాల్గొనేవాడు. ఫిట్నెస్ అంటే ప్రాణం పెట్టే దీపక్ రోజూలాగానే జిమ్‌కెళ్లి వ్యాయామం చేస్తుండగా తీవ్రమైన తలపోటుతో బాధపడినట్టుగా వీడియో ఫుటేజ్‌ని బట్టి తెలుస్తోంది. నేలపై పడకముందే తన తలని చేతుల్లో పెట్టుకుని కూర్చున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. కిందపడిపోయిన దీపక్‌ను అక్కడున్న వారు లేపి కూర్చోబెట్టారు. నీళ్లు తాగించారు, వీపు, తలపై మసాజ్ చేశారు.అయినా గజ గజ వణికిపోయాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాత అతడి మృతికి ఖచ్చితమైన కారణం తెలియనుంది. -
జిమ్‌లో వర్కౌట్ : క్రేజీ హీరోయిన్ ఫన్నీ వీడియో వైరల్
ఫ్యామిలీ స్టార్ హీరోయిన్, క్రేజీ హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) అందానికి మాత్రమే కాదు ఫిట్‌నెస్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇంట్రెస్టింగ్ పోస్టులు, జిమ్‌లో హెవీ వర్కౌట్స్ ఫోటోలు, వీడియోలతో ఫ్యాన్స్‌ను ఇంప్రెస్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఇన్‌స్టాలో ఒక వీడియో షేర్ చేసింది. ట్రైనర్ చూసేటపుడు, కెమెరా సహా ట్రైనర్ మన ముందుకు వచ్చినపుడు అనే క్యాప్షన్‌తో వర్కౌట్ ఫన్నీ చీటింగ్ వీడియోను పోస్ట్ చేసింది. ఇందులో ట్రైనర్ కెమెరాను ఆమెవైపు చూపినప్పుడల్లా, వెంటనే వ్యాయామం చేయడం ప్రారంభించడం, ట్రైనర్ చూడని సమయంలో వర్కవుట్స్ ఆపేసి డాన్స్ మూమెంట్స్ చేస్తుంది. మళ్లీ అతడు చూడగానే కష్టపడి వర్కవుట్ చేస్తున్నట్లు నటించడాన్ని ఈ వీడియోలో గమనించవచ్చు. దీంతో నెటిజన్లు కోచ్ ఉన్నపుడు మేము కూడా ఇంతే అంటూ కమెంట్ చేయడం విశేషం. View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) కాగా ‘సీతారామం’ చిత్రంతో ఒక్కసారిగా మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. త తన అద్భుతమైన నటన, అందంతో స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకుంది. ఆ తరువాతహీరో నానీతో కలిసి ‘హాయ్ నాన్న’ చిత్రంతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అలాగే విజయ దేవర కొండ సరసన నటించి మెప్పించింది ఈ బ్యూటీ. -
జిమ్‌లో పుష్ప డైరెక్టర్ భార్య.. పెద్ద సాహసమే!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం పుష్ప-2 ది రూల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఇటీవల బన్నీ బర్త్ డే సందర్భంగా ఆడియన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా పుష్ప-2 టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ విడుదలైన కొన్ని గంటల్లోనే పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు 138 గంటల పాటు యూట్యూబ్‌లో నంబర్‌వన్ ప్లేస్‌లో ట్రెండ్ అయింది. ఈ విషయాన్ని మైత్రి మూవీ మేకర్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. అయితే క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత గురించి చాలామందికి తెలియదు. ఆమె సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటున్నారు. సినిమాలతో పాటు ఎక్కడికెళ్లినా ఫోటోలు, వీడియోలు అభిమానులతో పంచుకుంటారు. తాజాగా ఆమె జిమ్‌లో కసరత్తులు చేస్తున్న వీడియోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జిమ్‌లో కసరత్తులు చేస్తూ తబిత కనిపించారు. ఆమె వర్కవుట్స్ సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) View this post on Instagram A post shared by Thabitha Bandreddi (@thabitha_sukumar) -
చిచ్చర పిడుగు!..తొమ్మిదేళ్లకే ఏకంగా 75 కిలోలు..!
చిన్నారులు తమలో దాగున్న అసాధారణ ప్రతిభను బయటపెట్టి అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తుంటారు. ఇలాంటి ఘటనలు ఎన్నో చూశాం. అవన్నీ ఏదో వాళ్ల పెద్దొళ్ల ట్రైనింగ్ లేదా వాళ్ల ఆసక్తి కొద్ది త్వరితగతిన నేర్చుకున్నవి. అయినా ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఏదీ లేదన్న రీతిలో అంత పసిమొగలు కూడా అలవోకగా నేర్చుకోవడం జరుగుతుంది. అదే బరువుల ఎత్తడం లాంటి వాటి వద్దకు వస్తే..అంత ఈజీ కాదు. కానీ ఈ చిచ్చర పిడుగు రామయణంలో సీత శివధనుస్సు ఎత్తినట్లుగా ఈజీగా ఎన్ని కిలోలు ఎత్తిపడేసిందో తెలుసా..! అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో 9 ఏళ్ల చిన్నారి జిమ్‌లో ఏకంగా 75 కిలోల బరువుని అలవోకగా ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి హర్యానాకు చెందిన అర్షియా గోస్వామి. ఈ వీడియోని చూసిన ఫిట్నెస్ ఔత్సాహికులు, నిపుణులు, నెటిజన్లు ఆమెను వావ్ నువ్వు గ్రేట్ రా అంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. ఇక ఆర్షియా వెయిట్ లిఫ్టింగ్ అంటే ఆమెకు అత్యంత ఇష్టమట. అంతేగాదు చిన్న వయసులోనే అధిక బరువుల లిఫ్ట్ చేసిన పిన్న వయస్కురాలిగా ఇండియా బుక్ ఆఫ్ రికార్డులోకెక్కింది. అంతేగాదు ఆరేళ్ల ప్రాయంలోనే ఏకంగా 45 కిలోల బరువు ఎత్తి అందర్నీ ఆశ్చర్యపరిచిందంటా. నిజంగా ఆ చిట్టి తల్లి గ్రేట్ కదూ. మిగతా రంగాలన్ని ఏదో ప్రాక్టీస్ చేసి సాధించేయొచ్చు కానీ ఇది తనకు మించిన బరువు ఎత్తడం అది కూడా అంత చిన్న వయసులో అంటే..మాములు విషయం కాదు కదా..! View this post on Instagram A post shared by Arshia Goswami (@fit_arshia) (చదవండి: కళకు వయసుతో సంబంధం లేదంటే ఇదే! నలభైలలో ఆ మదర్స్..!) -
' నాలుగు రోజులు పట్టిందట'.. మెగా కోడలి స్టన్నింగ్ వీడియో వైరల్!
మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఇటీవలే వేకేషన్ నుంచి తిరిగొచ్చింది. వరుణ్ తేజ్‌తో పెళ్లి తర్వాత తొలిసారి ట్రిప్‌కు వెళ్లిన లావణ్య ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంది. లావణ్య పెళ్లి తర్వాత ఆమె నటించిన మిస్ ఫర్ఫెక్ట్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను అలరించింది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లావణ్య.. తాజాగా షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. జిమ్‌లో తన వర్కవుట్స్‌కు సంబంధించిన వీడియోను లావణ్య ఇన్‌స్టాలో షేర్ చేసింది. అత్యంత కఠినమైన సాధన చేస్తూ కనిపించింది. ఈ వీడియోను చూసిన పలువురు లావణ్య సూపర్బ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. లావణ్య తన ఇన్‌స్టాలో రాస్తూ..'నాలుగు నెలల తర్వాత జిమ్‌కు వచ్చా. మునుపటిలా మళ్లీ సాధన చేయడానికి నాలుగు రోజులు పట్టింది. నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడైతే మొత్తానికి మళ్లీ నా దారిలోకి వచ్చా' అంటూ రాసుకొచ్చింది. కాగా.. దాదాపు ఏడేళ్ల క్రితం లావణ్య త్రిపాఠి, సందీప్ కిషన్, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏప్రిల్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. 2017లో తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
Jyothika-Suriya Workout: జిమ్‌లో సూర్య- జ్యోతిక కసరత్తులు.. ఫోటోలు వైరల్!
-
Janhvi Kapoor: జిమ్‌లో శ్రీదేవి కూతురి కష్టాలు.. ఫ్యాన్స్ ఫిదా (ఫోటోలు)
-
కండల కోసం కంగారు పడితే.. గుండెకు ముప్పు, ప్రాణాలే పోతాయ్!
మనసులో అనుకోగానే బరువు తగ్గిపోవాలి. చిటికె వేయగానే కండలు తిరిగిన బాడీ సొంతం కావాలి. ప్రతీదీ షార్ట్ కట్లో అయి పోవాలి. ప్రస్తుతం యువత మనుసుల్లోమెదులుతున్న ట్రెండ్ ఇదే. ఈ క్రేజ్‌నే కొంతమంది కేడీగాళ్లు సొంతం చేసుకుంటున్నారు. అక్రమాలకు పాల్పడుతూ యువత ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. వారి ప్రాణాలమీదికి తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా అక్రమంగా మెఫాటర్మైన్ సల్ఫేట్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న గ్యాంగ్‌ను టాస్క్ఫోర్క్ అదుపులోకి తీసుకుంది. ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి, నిందితుల నుండి 75 ఇంజక్షన్లను సీజ్ చేశామని టాస్క్ ఫోర్స్ డీసీపీ రేష్మి పెరుమాళ్ ప్రకటించారు. కండరాల పెరుగుదలకు ఇంజక్షన్లు దోహదపడతాయని నమ్మబలుకుతారు. వాటిని అక్రమంగా విక్రయిస్తున్నారు. దీన్ని నమ్మిన బాడీ బిల్డర్లు డాక్టర్ట సిఫారసు, ప్రికాషన్స్ లేకుండానే ఈ ఇంజక్షన్లను ఎడా పెడా వాడేస్తున్నారు. దీంతో కండలు పెరగడం సంగతి మాట అటుంచి గుండెకు తీరని ముప్పని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి నకిలి ఇంజెక్షన్లను అమ్ముతున్నగ్యాంగ్కు సంబంధించి ప్రధాన నిందితుడు నితేష్ సింగ్ ఆసిఫ్ నగర్లో పల్స్ ఫిట్నెస్ పేరిట జిమ్ నడిపిస్తున్నాడు. ఇతనికి సయ్యద్ జాఫర్ అలీ, రాహుల్ సింగ్ రిసెప్షనిస్ట్ లుగా వర్క్ చేస్తున్నారు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండానే ఇంజక్షన్లను అక్రమంగా విక్రయించడమే వీరి దందా. ఈ ఇంజక్షన్లు తీసుకుంటే షార్ట్ టైంలో కండరాలు పెరుగుతాయని జిమ్‌కు వచ్చేవారిని నమ్మిస్తారు. ముంబై నుండి ఈ ఇంజక్షన్లను కొరియర్ ద్వారా నగరానికి తెప్పిస్తారు. బహిరంగ మార్కెట్లో 500 పలికే ఇంజక్షన్లను అక్రమంగా 2000 వరకు విక్రయిస్తారు. ఇంజక్షన్స్ అతిగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, స్ట్రోకులు, సడన్ కార్డియాక్ అరెస్ట్ దారి తీయవచ్చుని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.