జిమ్‌లపై త్వరలో స్పెషల్ డ్రైవ్
Published Mon, Mar 27 2017 5:39 PM | Last Updated on Tue, Sep 5 2017 7:14 AM
హైదరాబాద్: త్వరలోనే వ్యాయామశాలపై ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. రెండు నెలల్లోగా ప్రతి జిమ్‌లో ఎస్టాబ్లిష్‌మెంట్ లైసెన్స్ ఉండితీరాలని తెలిపారు.
లేదంటే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. తమ కమిషనరేట్ పరిధిలోని జిమ్‌లకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశామన్నారు. ప్రతి జిమ్ యజమాని తమ కమిషనరేట్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు జిమ్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించుకోవాలని తెలిపారు.
Advertisement
Advertisement