mahesh bhagwat
-
సెల్ఫోన్ల రికవరీలో దేశంలోనే రెండోస్థానంలో తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: చోరీకి గురైన, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల జాడను తిరిగి కనిపెట్టి రికవరీ చేయడంలో తెలంగాణ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. కేంద్ర టెలీకమ్యూనికేషన్స్‌కు చెందిన సీఈఐఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్) పోర్టల్ సాంకేతికతను వినియోగించి గత 369 రోజుల్లో తెలంగాణ పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా 30,049 మొబైల్ ఫోన్ల జాడను కనుగొన్నారు.ఈ మేరకు సీఐడీ ఇన్చార్జి అదనపు డీజీ మహేశ్‌భగవత్ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 780 పోలీస్ స్టేషన్లలో సీఈఐఆర్ సాంకేతికను వినియోగిస్తున్నట్లు తెలిరు. గతేడాది ఏప్రిల్ 19న తెలంగాణ రాష్ట్రంలో సీఈఐఆర్‌ను పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టి, మే 17న పూర్తిస్థాయిలో ప్రారంభించారు. రోజుకు సరాసరిన 76 మొబైల్ ఫోన్ల చొప్పున జాడ కనిపెట్టినట్లు మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇందులో అత్యధికంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 4,869 మొబైల్ ఫోన్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 3,078 మొబైల్ ఫోన్లు, రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 3,042 మొబైల్ ఫోన్లు, వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,919 మొబైల్ ఫోన్లు గుర్తించినట్టు పేర్కొన్నారు. జాతీయస్థాయిలో 35,945 ఫోన్ల రికవరీతో కర్ణాటక తొలిస్థానంలో ఉందని తెలిపారు. -
ఈసీనగర్‌లో కాల్పుల కలకలం
హైదరాబాద్: చర్లపల్లిలోని ఈసీనగర్‌లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. కూరగాయల మార్కెట్లో నెలకొన్న స్థల వివాదంలో స్థానికులతో ఘర్షణ పడ్డ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తులు తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన సంఘటన శుక్రవారం కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాల్పులకు పాల్పడ్డ నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, మల్కాజిగిరి డీసీపీ ఉమామహేశ్వరశర్మ, కుషాయిగూడ ఏసీపీ కృష్ణమూర్తి మీడియాకు ఈ విషయాన్ని వెల్లడించారు. సంతలో స్థలంకోసం... నెహ్రూనగర్‌కు చెందిన దండు తులసీదాస్, మరో ముగ్గురు వ్యక్తులు, మర్రి గూడలో నివసించే ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బబ్లూ, ధర్మేంద్ర అనే సోద రులు చర్లపల్లి ఈసీనగర్ మెయిన్‌రోడ్డులో వ్యాపారం చేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం సంతలో స్థలంకోసం ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి పరస్పరం దాడులు చేసుకున్నారు. బబ్లూ, ధర్మేంద్రలు ఘర్షణ విషయాన్ని తండ్రి గజరాజ్‌సింగ్‌కు ఫోన్లో తెలిపారు. దీంతో ఆగ్రహంతో ఈసీనగర్ చేరుకున్న గజరాజ్‌సింగ్ తన వెంట తీసుకువచ్చిన నాటు తుపాకీతో తులసీదాస్ వర్గీయులను కాల్చేందుకు సిద్ధపడ్డాడు. అప్పటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది ఇరు పక్షాలను చెదరగొట్టారు. అదే సమయంలో గజరాజ్‌సింగ్ తన తుపాకీని తులసీదాసుకు గురిపెట్టడాన్ని పసిగట్టిన కానిస్టేబుల్ చక్రపాణి చాకచక్యంగా వ్యవహరించి తుపాకీని పక్కకు తోయడంతో అది గాలిలోకి పేలింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు గజరాజ్సింగ్ను అదుపులోకి తీసుకొని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత గజరాజ్‌సింగ్ ఇంటికి వెళ్లి సోదా చేయగా రెండు బుల్లెట్లు, ఓ తల్వార్ లభ్యమయ్యాయి. ఈ సంఘటనలో గాయపడ్డ తులసీదాస్‌తో పాటు శంకర్, చంద్రశేఖర్, పవన్‌లను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
సీఐ మసాజ్ బాగోతంపై సీపీ సీరియస్
సాక్షి, హైదరాబాద్ : సరూర్‌నగర్ సిఐ లింగయ్య తన స్టేషన్లో హోంగార్డుతో మసాజ్ చేయించుకున్న బాగోతంపై రాచకొండ కమిషనర్ సీరియస్ అయ్యారు. కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సీపీ మహేష్ భగవత్ దీనిపై దర్యాప్తు జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని డీసీపీ(అడ్మిన్) ప్రకాష్‌రెడ్డిని సంఘటనపై విచారణ అధికారిగా నియమించారు. వివరాల్లోకి వెళితే... సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ సుందరి లింగయ్య వివాదంలో చిక్కుకున్నారు. స్టేషన్లో పనిచేసే హోంగార్డుతో ఇంటి వద్ద బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు మీడియా ఛానెల్లో హల్చల్ చేశాయి. మన్సూరాబాద్‌లోని ఇంటివద్ద సీఐ లింగయ్య యూనిఫామ్‌లో ఉన్న హోంగార్డు సైదానాయక్తో బాడీ మసాజ్ చేయించుకుంటున్న దృశ్యాలు బయటకు వచ్చాయి. అయితే మీడియాలో ప్రసారం అయిన దృశ్యాల్లో ఉన్నది తాను కాదని, తనకు మసాజ్ చేయించుకోవటంకానీ, మద్యం సేవించే అలవాటు అసలే లేదని సీఐ లింగయ్య పేర్కొన్నారు. సైదానాయక్ అనే హోంగార్డు అక్టోబర్ 14న రోడ్డు ప్రమాదంలో గాయపడటంతో సెలవులో ఉన్నాడని, అనంతరం ఇక్కడినుంచి బదిలీపై వెళ్ళాడని అన్నారు. మూడు నెలలుగా సరూర్‌నగర్‌లో హోంగార్డు లేడని ఆయన స్పష్టం చేశారు. తనపై గిట్టనివాళ్లే ఈ దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. -
అతిపెద్ద కమిషనరేట్ ‘రాచకొండ’
- ఈ ఏడాదే వీఎం హోంలో కొత్త కమిషనరేట్ పనులు - సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటాం - వాట్సాప్ ఫిర్యాదుల నంబర్ 9490617111 - ‘మీట్ ది ప్రెస్’లో రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ సాక్షి, హైదరాబాద్: నగరంలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ దేశంలోనే అతి పెద్ద పోలీసు కమిషనరేట్ అని..ఈ కమిషనరేట్‌కు ఈ ఏడాదిలోనే నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని అమెరికా ప్రభుత్వ రియల్‌హీరో అవార్డు గ్రహీత, రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్ అన్నారు. నూతన కార్యాలయం ఏర్పాటుకు సరూర్‌నగర్ విక్టోరియా మెమోరియల్ (వీఎం) హోంలో పది ఎకరాల భూమి లీజు ఇవ్వడానికి ప్రభుత్వం ఇప్పటికే జీవోను విడుదల చేసిందన్నారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో ఆయన మాట్లాడుతూ వ్యవస్థీకృత నేరాల మూలాలను గుర్తించి కూకటివేళ్లతో పెకలిస్తున్నట్లు తెలిపారు. నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ప్రజలకు 24/7 అందుబాటులో ఉంటామన్నారు. నేర నివారణ, పరిశోధనకు పెద్దపీట వేస్తూ, మహిళలు, పిల్లల రక్షణ, గౌరవం కోసం అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్నారు. యాదాద్రి దేవాలయానికి తిరుమల తరహాలో ఐదంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మహిళల భద్రతకు పెద్దపీట మహిళల భద్రత కోసం భువనగిరిలో మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థినులకు భరోసా కల్పించేందుకు ఇటీవల ‘షీ ఫర్ హర్’కార్యక్రమాన్ని ప్రారంభించి వారిచే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయించామన్నారు. ఆన్లైన్ సెక్స్ రాకెట్ నిర్మూలనకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. తల్లిదండ్రుల్లో ఆందోళన వద్దు గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఏడాదిలో 4,500 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్ కేసుల్లో మీడియా సంయమనం పాటించాలన్నారు. కల్తీ విత్తనాలు, కల్తీ ఆహార పదార్ధాల కేసులో నిందితులపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ప్రజలు తమ చుట్టూ జరిగే నేరాలు, అక్రమ దందాలు, నిబంధనల ఉల్లంఘనలపై రాచకొండ వాట్సాప్ నంబర్ 94906 17111కు సమాచారం అందించాలన్నారు. అభ్యర్థులను తయారు చేయడంలోనే సంతృప్తి తనకు రియల్ హీరో అవార్డు కన్నా సివిల్స్‌కు అభ్యర్థులను తయారు చేయడంలోనే ‘రియల్’సంతృప్తి ఉందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్రలో తన వద్ద శిక్షణ తీసుకున్నవారిలో 84 మంది సివిల్స్‌కు ఎంపికకావడం ఓ టీచర్‌కు ఉండే ఆనందం దక్కిందన్నారు. అనంతరం మహేశ్ భగవత్‌ను ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు రాజమౌళి చారి, ప్రధాన కార్యదర్శి శ్రీగిరి విజయ్‌కుమార్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ప్రెస్‌క్లబ్ ఉపాధ్యక్షుడు జనార్దన్, సంయుక్త కార్యదర్శి దగ్గు రఘు, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, ఈసీ సభ్యులు అనుమల్ల గంగాధర్, నరేందర్, అనిల్, హరిప్రసాద్, యశోద పాల్గొన్నారు. -
ఐపీఎల్ ఫైనల్‌కు భారీ బందోబస్తు
ఉప్పల్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో భాగంగా ఈనెల 21న జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. గురువారం ఉప్పల్ మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు భద్రతా అంశాల గురించి ఆయన చెప్పారు. ఈ సమావేశంలో హెచ్‌సీఏ కార్యదర్శి శేష్ నారాయణ్, జాయింట్ సీపీ తరుణ్ జోషి, మల్కాజ్గిరి డీసీపీ రమా ఉమామహేశ్వర్ వర్మ, ట్రాఫిక్ డీసీపీ రమేశ్ నాయుడు, అదనపు డీసీపీ దివ్యచరణ్ పాల్గొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 1800 మంది సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. ఫైనల్ మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా 250 మంది సెక్యూరిటీ వింగ్, 270 మంది ట్రాఫిక్ పోలీసులు, 870 లా అండ్ ఆర్డర్ పోలీసులు, 6 ప్లాటున్ల ఆర్మ్డ్ ఫోర్స్ బృందాలు, ఆక్టోపస్, స్పెషల్ బ్రాంచ్, సీసీఎస్ స్టాఫ్‌తో పాటు 88 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 8 బాంబ్ డిస్పోజల్ బృందాలు మ్యాచ్ ముగిసేవరకు నిరంతరం పహారా కాస్తాయని పేర్కొన్నారు. సంఘవిద్రోహ శక్తులపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. గతంలో లాగానే షీ టీమ్స్‌ను రంగంలోకి దించుతున్నట్లు తెలిపారు. బ్లాక్ టిక్కెట్ల విక్రయ సమాచారాన్ని అందించాలనుకునే వారు 100కు డయల్ చేయాలని లేదా 94906 17111 వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. వీఐపీల సెక్యూరిటీకి అనుమతి లేదు వీఐపీల వెంట వచ్చే గన్మెన్లు, ఇతర సెక్యూరిటీ సిబ్బందిని లోపలికి అనుమతించబోమన్నారు. వారికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు గత అనుభవాల దృష్ట్యా పార్కింగ్‌కు ఇబ్బందులు కలగకుండా అధికంగా పార్కింగ్ ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. 5150 ద్విచక్రవాహనాలకు, 4000 ఫోర్ వీలర్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పార్కింగ్‌లోకి వచ్చే ప్రతీ వాహనంలో టిక్కెట్ కలిగిన వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తామని, ఇతర వ్యక్తులకు ప్రవేశం లేదని స్పష్టం చేశారు. -
జిమ్‌లపై త్వరలో స్పెషల్ డ్రైవ్
హైదరాబాద్: త్వరలోనే వ్యాయామశాలపై ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ వెల్లడించారు. రెండు నెలల్లోగా ప్రతి జిమ్‌లో ఎస్టాబ్లిష్మెంట్ లైసెన్స్ ఉండితీరాలని తెలిపారు. లేదంటే కఠినచర్యలుంటాయని హెచ్చరించారు. తమ కమిషనరేట్ పరిధిలోని జిమ్‌లకు ఈ మేరకు సర్క్యులర్ జారీ చేశామన్నారు. ప్రతి జిమ్ యజమాని తమ కమిషనరేట్‌లో నమోదు చేయించుకోవాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే చర్యలు తప్పవన్నారు. స్త్రీ, పురుషులకు వేర్వేరు జిమ్ ఇన్స్ట్రక్టర్లను నియమించుకోవాలని తెలిపారు. -
‘సోషల్ ట్రేడ్’ కేసుల కలవరం
రాచకొండలో 15 మంది,సైబరాబాద్‌లో ఒకరు ఫిర్యాదు హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టిం చిన సోషల్ ట్రేడ్ బిజ్ హైదరాబాద్‌లోనూ కలవరం సృష్టిస్తోంది. రోజురోజుకూ బాధితుల సం ఖ్య పెరుగుతోంది. మోసపోయినవారిలో హైదరాబాద్‌కు చెందిన 500 మందికిపైగా ఉన్నట్టు తెలిసింది. వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. సోషల్ ట్రేడ్‌పై సైబరాబాద్‌లో ఒకటి, రాచకొండలో 15 కేసులు నమోదయ్యాయని ,రాచకొండలో ఫిర్యాదు చేసినవారిలో ఒక తెలుగు దినపత్రిక విలేకరితోపాటు గృహిణులు, ఇంజనీర్లు, రీసెర్చ్ స్కాలర్లు ఉన్నారన్నారు. దాదాపు రూ.15 లక్షల వరకు మోసపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సోషల్ ట్రేడ్ పేరిట మోసగించిన అనుభవ్ మిట్టల్, అతని అనుచరులను నోయిడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని, వీరిని పీటీ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి విచారిస్తామని తెలిపారు. సోషల్ ట్రేడ్ మోసంపై నగరంలో ఇప్పటివరకు 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యూపీ కేంద్రంగా 57,,500 పెట్టుబడిగా పెడితే 3 ఐడీలు ఇచ్చి, ఒక్కో ఐడీకి వెబ్సైట్ లింక్ పంపిస్తారు. క్లిక్ చేసిన ప్రతిసారి రూ.5 వస్తాయని, 4 నెలల్లో పెట్టుబడి తిరిగి వస్తుందని, ఐదో నెల నుంచి లాభం వస్తుందని సోషల్ ట్రేడ్ వ్యాపారులు నమ్మబలికారు. పెట్టిన పెట్టుబడిని కొద్దిరోజులు అందరికీ సర్దుబాటు చేసి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. -
ఇంకా విషమంగానే చిన్నారి సంజన ఆరోగ్యం
-
విషమంగానే సంజన ఆరోగ్యం
ప్రమాద వార్త తెలిసి ఆమె తాతకు గుండె నొప్పి హైదరాబాద్: ముగ్గురు యువకులు మద్యం మత్తులో కారుతో ఢీకొట్టిన ఘటనలో గాయపడిన చిన్నారి సంజన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. హైదరాబాద్‌లోని పెద్దఅంబర్‌పేట వద్ద ఆదివారం రాత్రి ముగ్గురు యువకులు మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి రోడ్డు దాటుతున్న తల్లి శ్రీదేవి, కూతురు సంజనను ఢీకొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి ఎల్బీ నగర్‌లోని కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంజన పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు వెల్లడించారు. ఆమె తల్లి శ్రీదేవిని కూడా మెరుగైన చికిత్స కోసం కామినేని ఆస్పత్రికి తరలించారు. మనవరాలిని, కుమార్తెను ఈ పరిస్థితిలో చూసి తట్టుకోలేక శ్రీదేవి తండ్రి నరేందర్ ఛాతీలో నొప్పితో ఆస్పత్రి పాలయ్యారు. ఇక సంజన పరిస్థితి గురించి ఇప్పుడే చెప్పలేమని, శ్రీదేవికి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు తెలిపినట్లు శ్రీదేవి భర్త శివానంద్ కన్నీళ్ల పర్యంతమయ్యారు. వీరిద్దరికీ ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ సహకారంతో సీఎం సహాయనిధి ద్వారా వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు. కాగా ఆక్సిడెంటుకు కారణమైన నిందితులకు పూచీకత్తుపై బెయిల్ లభించింది. మరో ఇద్దరి అరెస్ట్: మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి కారణమైన మరో ఇద్దరు నిందితులు యాదిరెడ్డి, శ్రీనివాస్‌లను మంగళవారం హయత్‌నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటరమణను సోమవారం రాత్రి అరెస్టు చేశారు. మిగతా ఇద్దరూ వెంకటరమణను మద్యం తాగేందుకు ప్రేరేపించి ప్రమాదానికి కారణమయ్యారని కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
సంజన కుటుంబానికి కష్టాలు
-
వ్యభిచార దందాపై పోలీసుల ఉక్కుపాదం
హైదరాబాద్: నగరంలో వ్యభిచార దందాను నిలువరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. అపార్ట్మెంట్లు, ఇళ్లలో వ్యభిచార దందా నిర్వాహకులను పట్టుకునే క్రమంలో ఆ ఇళ్లలో మైనర్లు దొరికితే మూడేళ్ల పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం మెజిస్ట్రేట్‌కు ఉందని, మేజర్లు దొరికితే మూడు నెలల నుంచి ఏడాది పాటు ఆ ఇంటిని సీజ్ చేసే అధికారం ఉందని మహేష్ భగవత్ తెలిపారు. గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వివరాలను వెల్లడించారు. ఎల్బీనగర్, మల్కాజిగిరి జోన్లలో ఈ ఏడాది జూలై ఒకటి నుంచి ఇప్పటివరకు మహిళల అక్రమ రవాణాపై 23 కేసులు నమోదు చేసి 75 మంది నిందితులను అరెస్టు చేశామన్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌కు చెందిన 40 మందికి వ్యభిచార కూపం నుంచి విముక్తి కల్పించారు. ఇటువంటి అరాచకాలు సాగకుండా ఉండేందుకు వ్యభిచార గృహాలను సీజ్ చేస్తున్నారు. రాచకొండ పోలీసుల అభ్యర్థన మేరకు నాలుగు అపార్ట్మెంట్లను ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండ్ డిప్యూటీ కలెక్టర్ కం తహసీల్దార్ సీజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. వీటిలో సరూర్‌నగర్ మండలం అల్కాపురిలోని దుగ్గిరాల అపార్ట్మెంట్ ఫ్లాట్ నంబర్ 103, దిల్సుఖ్నగర్ లలితా నగర్‌లోని శిల్పి అపార్ట్మెంట్లోని ఫ్లాట్ నంబర్ 106, సరూర్‌నగర్ కర్మన్‌ఘాట్‌లోని జ్యోతినగర్ రోడ్డు నంబర్ త్రీలోని రెండో అంతస్తు ప్లాట్ నంబర్ 22ను, కొత్తపేట న్యూ మారుతీనగర్ బాబు కాంప్లెక్స్‌లోని తొలి అంతస్తు 1-6-30ని సరూర్‌నగర్ తహసీల్దార్ సీజ్ చేశారు. అలాగే, వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇళ్లలో ఇకపై అటువంటి కార్యకలాపాలు ఆపేయాలని ఆరు అపార్ట్మెంట్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. -
తాగినడిపితే తాట తీస్తారు
సాక్షి, సిటీబ్యూరో/మన్సూరాబాద్: మందు తాగి వాహనాలు నడిపేవారు ఇకపై జాగ్రత్తగా ఉండాలని సైబరాబాద్ ఈస్ట్ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో అమలులోకి తేనున్న ఎంవీ యాక్ట్ 2016 ప్రకారం డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడితే రూ. 10 వేల జరిమానాతో పాటు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారన్నారు. ఈ కేసులో జైలుకెళితే కన్విక్షన్(నేరం)గా పరిగణిస్తారని తెలిపారు. సైబరాబాద్ ఈస్ట్ కమిషనరేట్, అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీనగర్లోని గోటేటీ కల్యాణ మండపంలో డ్రంకన్ డ్రైవ్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... డ్రంకన్ డ్రైవ్ వల్ల జరిగే ప్రమాదాలను నియంత్రించేందుకు పగటి పూట కూడా ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అయినా ఈ ఏడాది ఇప్పటివరకు 5879 మంది డ్రంకన్ డ్రైవింగ్ కేసులు నమోదుకావడం దారుణమన్నారు. ఇందులో 202 మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఎక్సైజ్ శాఖతో కలిసి మల్కాజిగిరి, ఎల్బీనగర్ జోన్ పరిధిలోని బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాలలో బ్రీత్ఎన్లైజర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, సిట్టింగ్ పర్మిట్ ఉన్న మద్యం దుకాణాల యజమానులు 30 ఎండీ కన్నా ఎక్కువ మద్యం సేవించిన వారిని గుర్తించి వారు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుతం 30ఎండీ కన్నా మద్యం సేవించి వాహనం నడుపుతూ మొదటిసారి చిక్కితే 6 నెలలు జైలుశిక్ష లేదా రూ.2 వేల జరిమానా విధిస్తున్నారని, నూతన చట్టంలో రెండేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10వేల జరిమానా ఉంటుందన్నారు. మైనర్లు పట్టుబడితే వారి కళాశాల, పాఠశాల యజామాన్యాలకు తెలియజేసి వారి అడ్మిషన్లు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు అతిగా మద్యం సేవించి వాహనం నడిపితే వారి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి శాఖాపరమైన చర్యలు చేపడతామని హెచ్చరించారు. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, వనస్థలిపురం పరిధిలో 500 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ...మైనర్లు మద్యం తాగకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. మైనర్లకు మద్యం అమ్మే బార్లు, రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటున్నామని, భర్త పట్టుబడితే భార్య, యువకుడు పట్టుబడితే తల్లిదండ్రులను తీసుకొని కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుందన్నారు. ఫస్ట్ టైమ్ డౌన్లోడ్ చేసుకుంటే ఫ్రీ రైడ్... మద్యం తాగడం వల్ల జరిగే అనర్ధాలపై అమృత పౌండేషన్, మిషన్ స్మార్ట్ రైడ్ అవగాహన కల్పించాయి. మందుబాబులు మిషన్ స్మార్ట్ రైడ్ రూపొందించిన యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే తొలి రైడ్ ఉచితంగా అందజేస్తామని మిషన్స్మార్ట్ రైడ్ ప్రతినిధి నాగేశ్వర్రావు తెలిపారు. ఆ తర్వాత యాప్ ద్వారా బుక్ చేసుకుంటే తమ సంస్థతో టై అప్ అయిన ఉబెర్ క్యాబ్‌లు సర్వీసు అందిస్తాయన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ దివ్యచరణ్రావు, డీసీపీ తప్సీర్ ఇక్బాల్, ఏసీపీ వేణుగోపాల్‌రావు ట్రాఫిక్ డీసీపీ రమేష్‌నాయుడు, సీఐ కాశిరెడ్డి, అమృత పౌండేషన్ ప్రతినిధి డా. దేవిక, తదితరులు పాల్గొన్నారు. -
తొమ్మండుగురు తోడేళ్లు
బెస్ట్ కేస్ ఖమ్మంలో ఎస్పిగా ఉన్నప్పుడు పరిష్కరించిన కేసు నేను ఎప్పటికీ మరచిపోలేను. ఏడాదిపాటు కంటిమీద కునుకు లేకుండా చేధించిన కేసు. మహిళలపై దాడి కేసుల గురించి విన్నప్పుడల్లా నాకు ఖమ్మంలో జరిగిన సంఘటనే కళ్లముందుంటుంది. 2009లో జరిగిన సంఘటన ఇది. ఒకరోజు పొద్దునే ఫోన్‌కాల్స్ రావడం మొదలయ్యాయి. ఖమ్మం కొత్తగూడెం సిటికేబుల్‌లో బ్లూఫిల్మ్‌లు టెలికాస్ట్ చేస్తున్నారని ఫిర్యాదు. టీవీ పెట్టి చూస్తే రక్తం ఉడికిపోయే సంఘటన. అందరూ అనుకుంటున్నట్టు అవి బ్లూఫిల్మ్ దృశ్యాలు కావు. ఒకమ్మాయిని తొమ్మిదిమంది రేప్ చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను వీడియోకింద తయారుచేశారు. బ్యాగ్రౌండ్లో సినిమాపాటలు పెట్టి వీడియో ప్లే చేస్తున్నారు. వెంటనే కేబుల్ ఆపరేటర్లను అరెస్ట్ చేశాం. కొందరు మార్ఫింగ్ వీడియో అన్నారు, ఇంకొందరు ఈ ప్రాంతానికి చెందిన చిత్రాలు కావన్నారు. కానీ నాకు, కొత్తగూడెం డిఎస్పికి ఆ రేప్ లోకల్‌దే అనిపించింది. రేప్‌కు గురైన అమ్మాయి ఫొటో ఆధారంగా ఏ ప్రాంతానికి చెందిందో ఎంక్వైరీ చేయిస్తే అక్కడే ఒక గ్రామానికి చెందిన అమ్మాయని తెలిసింది. తెలిసిన వ్యక్తి పనే... మహిళాపోలీసులు మారువేషాల్లో అమ్మాయి దగ్గరికి వెళ్లి కౌన్సెలింగ్ చేసి, తల్లిదండ్రులను ఒప్పించి కేసు పరిష్కారానికి సహకరించమని చెప్పారు. కొద్దిగా టైం తీసుకున్నా ఒప్పుకున్నారు. మీడియావాళ్లు కూడా ఈ కేసు విషయంలో చాలా సహకరించారు. వారికి అమ్మాయి వివరాలు, కేసు వివరాలు తెలిసినా పత్రికల్లో, టీవీల్లో వార్తలు వేయకుండా సాయపడ్డారు. అమ్మాయి పేరు, వివరాలు బయటపెట్టకుండా ఆమెతో కేసు ఫైల్ చేయించాం. విషయం ఏంటంటే, అప్పటికి ఆ అమ్మాయిపై రేప్ జరిగి రెండేళ్లవుతోంది. పదో తరగతి చదువుకుంటున్న ఆ అమ్మాయి ఒకరోజు సాయంత్రం తెలిసిన వ్యక్తితో కలిసి ఆటోలో బంధువుల ఇంటికి బయలుదేరింది. కొంత దూరం వెళ్లాక ఆటో గ్రామం శివార్లకు వెళుతుంటే ఆమె ప్రతిఘటించింది. తెలిసిన వ్యక్తి ఆమెను అరవకుండా నోరునొక్కి, చాకు చూపించి బెదిరించాడు. నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లాక అక్కడ అతని స్నేహితులు మరో ఎనిమిదిమంది ఉన్నారు. ఆటో డ్రైవర్ని కాపలా పెట్టి తొమ్మిదిమంది అత్యాచారం చేశారు. ఈ సంఘటనను ఫొటోలు తీశారు. బాధితురాలు ఇంట్లోవాళ్లకి విషయం చెప్పింది. ఆడపిల్ల జీవితం. నలుగురికి తెలిస్తే పరువు పోతుందని నోరునొక్కుకుని ఊరుకున్నారు. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారనే మీడియావార్తలు వింటూనే ఉంటాం. కానీ చాలామంది పోలీసులు తమ ఇంటి ఆడపిల్లకు అన్యాయం జరిగినట్టు భావించి పనిచేస్తారు. 24 గంటల్లో... అత్యాచారం జరిగిన ఏడాది తర్వాత ఆ కిరాతకులు దాన్ని సీడీగా తయారుచేసి ఆ అమ్మాయికి పంపారు. మళ్లీ వాళ్లు చెప్పినచోటుకు రాకపోతే కేబుల్టీవీలో ప్రసారం చేస్తామని బెదిరించడం మొదలుపెట్టారు. బాధితురాలు రానని చెప్పింది. అత్యాచారానికి పాల్పడ్డ వ్యక్తి తెలిసినవాడే అయినా ఏం చెయ్యలేని దుస్థితి! ఎన్నిసార్లు బెదిరించినా అమ్మాయి లొంగకపోయేసరికి వాళ్లు కేబుల్‌టీవీ ఆపరేటర్లకు డబ్బిచ్చి దీన్ని ప్రసారం చేయించారు. తన రెండేళ్ల నరకం గురించి బాధితురాలు మాకు చెప్పుకొస్తుంటే డిపార్టుమెంట్లో ప్రతిఒక్కరు ఆవేశంతో ఊగిపోయారు. ఆ కిరాతుకుల్ని వీలైనంత త్వరగా పట్టుకోవాలన్న పట్టుదలతో ఎవరికివారు టీమ్‌ల మాదిరిగా విడిపోయి పనిచేశారు. కొత్తగూడెం డిఎస్పి, ఇంకా ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లు అందరూ ఇదేపనిలో పడ్డారు. 24గంటల్లో తొమ్మిదిమందిని అరెస్టు చేశారు. వారిలో పద్దెనిమిదేళ్ల కుర్రాడి నుంచి యాభైఅయిదేళ్ల పెద్దమనిషి వరకూ ఉండడం సిగ్గుచేటనిపించింది. ఆ పనిచేసింది కుర్రాళ్లయితే యువత చెడు మార్గంలో పోతుందని చెప్పుకుంటాం. కానీ యాభై ఏళ్ల వయసున్న వ్యక్తులున్నారంటే ఎలాంటి సమాజంలో ఉన్నామోనని అందరం తలదించుకున్నాం. అన్ని కేసులు... అత్యాచారం చేసిన వారిని అరెస్టు చేయడంతో మాపని పూర్తవ్వలేదు. వారిచ్చిన ఫొటోలను వీడియోలా తయారుచేసిన నలుగురు కుర్రాళ్లను ఐటియాక్ట్ కింద అరెస్టు చేశాం. ఆటోడ్రైవర్ని అదుపులోకి తీసుకున్నాం. అందరిపై కేసులు పెట్టాం. గ్యాంగ్ రేప్, కిడ్నాపింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్... అన్నీ ఫైల్ చేశాం. కొత్తగూడెం పోలీస్‌స్టేషన్‌కి కోర్టు కిలోమీటరు దూరం ఉంటుంది. మామూలుగా నిందితుల్ని కోర్టుకి జీపులోనే తీసుకెళతాం. కానీ ఈ కేసులో నేను వీరిని రోడ్డుపై అందరికీ వీళ్ల గురించి తెలిసేలా నడిపించుకుని తీసుకురమ్మన్నాను. సాక్ష్యాలన్నీ పక్కాగా ఉండాలి కదా! రెండేళ్ల తర్వాత కూడా బాధితురాలికి చేసిన వైద్య పరీక్షల్లో పాజిటివ్ రిపోర్టు వచ్చింది. అలాగే అత్యాచారానికి సంబంధించి తయారుచేసిన సీడీలో ఉన్న ఫొటోలు మార్ఫింగ్‌వి కావన్న రిపోర్టు కూడా వచ్చింది. కేసు సీరియస్‌నెస్‌ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్టిగేషన్ డిఎస్పి రేంజ్ ఆఫీసర్‌కి అప్పజెప్పారు. యావజ్జీవం... ఈ బాలిక కేసుని జిల్లా జడ్జి జగన్నాథ్ రెడ్డిగారి దగ్గర్నుంచి అందరూ సీరియస్‌గా తీసుకున్నారు. కలెక్టర్ ఉషారాణి కూడా ప్రత్యేక దృష్టి పెట్టారు. రెండు రోజులకోసారి ఎంతవరకు వచ్చిందంటూ ఎంక్వయిరీలుండేవి. మా డిపార్టుమెంట్ సంగతంటారా... అందరినీ కటకటాల వెనక్కి నెట్టేవరకూ ఎవరూ నిద్రపోయేట్టు లేరు. కేసుని ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకి తరలించారు. ఏడాది తిరక్కుండా తీర్పు వచ్చింది. తొమ్మిదిమందికి జీవితఖైదు పడింది. ఆటో డ్రైవర్‌కి పది సంవత్సరాల జైలు శిక్ష. సీడీలు చేసిన నలుగురు కుర్రాళ్లకి ఐదేళ్లజైలు శిక్ష, యాభైవేల రూపాయల జరిమానా విధించారు. అక్కడితో అయిపోలేదు... మా దృష్టికి వచ్చిన కేసుని సాక్ష్యాలతో సహా కోర్టులో ఫైల్ చేశాక నేరస్తుడికి శిక్ష పడడంతో మామూలుగా మా పని పూర్తయిపోతుంది. కానీ ఈ కేసు విషయంలో అలా అనుకోలేదు. బాధితురాలి సంక్షేమం కోసం మేం చేయాల్సిన పనులన్నీ పూర్తిచేయాలనుకున్నాను. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అప్పటికి 2003- 28 జీవో ప్రకారం గ్యాంగ్‌రేప్ బాధితురాలికి ప్రభుత్వం లక్ష రూపాయల నష్టపరిహారం ఇస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినపుడు 25 వేలు, చార్జ్‌షీటు దాఖలు చేసినపుడు 25 వేలు, కేసు ట్రయిలర్ అయ్యాక మిగతా 50 వేల రూపాయలు ఇస్తారు. ఈ బాధితురాలికి కూడా ఆ నగదు అందేలా చేశాం. అలాగే హైదరాబాద్‌లో దుర్గాబాయి దేశ్‌ముఖ్ పాలిటెక్నిక్ కళాశాలలో మహిళా బాధితులకు 70 శాతం రిజర్వేషన్ ఉంటుంది. జిల్లా కలెక్టర్‌గారి సాయంతో ఆ బాధితురాలికి సీటు ఇప్పించాం. ఓ స్వచ్చంద సంస్థ సాయంతో అవసరమైన కౌన్సెలింగ్‌లు చేయించాం. మొదటిసారి ఆ అమ్మాయిని చూసినపుడు బాధనిపించింది. డిప్లమా పూర్తిచేసిందని తెలిశాక సంతోషం కలిగింది. కనీస బాధ్యత... రేప్ కేసులు వచ్చినప్పుడు ఇన్వెస్టిగేషన్‌కి ఈ కేసు ఫైలు ఉపయోగపడుతుందని కేసు తీర్పు కాపీని అన్ని జిల్లాల ఎస్పీలకు పంపించారు. కేసు పరిష్కారం తర్వాత నాకు, కొత్తగూడెం డిఎస్పికి, ఇన్స్పెక్టర్కి పై అధికారుల నుంచి ప్రశంసా పత్రాలు వచ్చాయి. ఇక్కడ మరోసారి నేను మెచ్చుకోవాల్సినవారు ఖమ్మం మీడియా ప్రతినిధులు. ఒక్క వార్త కూడా రాకుండా, బాధితురాలి వివరాలు నలుగురికీ తెలియకుండా జాగ్రత్తపడ్డారు. మహిళలపై దాడులకు సంబంధించిన కేసుల పరిష్కారంలో పోలీసులకు మీడియా నుంచి, పబ్లిక్ నుంచి అవసరమైన సహకారం అందకపోతే మా కష్టం మొత్తం వృథా అయిపోతుందని ఈ సందర్భంగా మరొకసారి గుర్తుచేస్తున్నాను. రిపోర్టింగ్: భువనేశ్వరి ఫొటో: రాజేశ్