‘సోషల్‌ ట్రేడ్‌’ కేసుల కలవరం | Disturbing the 'Social Trade' cases | Sakshi

‘సోషల్‌ ట్రేడ్‌’ కేసుల కలవరం

Feb 7 2017 4:22 AM | Updated on Sep 5 2017 3:03 AM

ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టిం చిన సోషల్‌ ట్రేడ్‌ బిజ్‌ హైదరాబాద్‌లోనూ కలవరం సృష్టిస్తోంది.

రాచకొండలో 15 మంది,సైబరాబాద్‌లో ఒకరు ఫిర్యాదు

హైదరాబాద్‌: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టిం చిన సోషల్‌ ట్రేడ్‌ బిజ్‌ హైదరాబాద్‌లోనూ కలవరం సృష్టిస్తోంది. రోజురోజుకూ బాధితుల సం ఖ్య పెరుగుతోంది. మోసపోయినవారిలో హైదరాబాద్‌కు చెందిన 500 మందికిపైగా ఉన్నట్టు తెలిసింది. వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. సోషల్‌ ట్రేడ్‌పై సైబరాబాద్‌లో ఒకటి, రాచకొండలో 15 కేసులు నమోదయ్యాయని ,రాచకొండలో ఫిర్యాదు చేసినవారిలో ఒక తెలుగు దినపత్రిక విలేకరితోపాటు గృహిణులు, ఇంజనీర్లు, రీసెర్చ్‌ స్కాలర్లు ఉన్నారన్నారు. దాదాపు రూ.15 లక్షల వరకు మోసపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.

సోషల్‌ ట్రేడ్‌ పేరిట మోసగించిన అనుభవ్‌ మిట్టల్, అతని అనుచరులను నోయిడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని, వీరిని పీటీ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి విచారిస్తామని తెలిపారు. సోషల్‌ ట్రేడ్‌ మోసంపై నగరంలో ఇప్పటివరకు 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యూపీ కేంద్రంగా 57,,500 పెట్టుబడిగా పెడితే 3 ఐడీలు ఇచ్చి, ఒక్కో ఐడీకి వెబ్‌సైట్‌ లింక్‌ పంపిస్తారు. క్లిక్‌ చేసిన ప్రతిసారి రూ.5 వస్తాయని, 4 నెలల్లో పెట్టుబడి తిరిగి వస్తుందని, ఐదో నెల నుంచి లాభం వస్తుందని సోషల్‌ ట్రేడ్‌ వ్యాపారులు నమ్మబలికారు. పెట్టిన పెట్టుబడిని కొద్దిరోజులు అందరికీ సర్దుబాటు చేసి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement