engineers
-
‘ఇందిరమ్మ’కు ప్రైవేట్ ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్ల తనిఖీ బాధ్యతను ప్రభుత్వం ప్రైవేట్ ఇంజనీర్లకు అప్పగించబోతోంది. తొలుత 390 మందిని ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమించుకునేందుకు మేన్‌పవర్ సప్లయర్స్‌కు బాధ్యత అప్పగించింది. అందుకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఈనెల 11 వరకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు. ఇందులో ఎంపికైనవారు అసిస్టెంట్ ఇంజనీర్ హోదాలో పనిచేయాల్సి ఉంటుంది. మొదటగా ఒక సంవత్సరం కోసం వీరితో గృహనిర్మాణ శాఖ ఒప్పందం కుదుర్చుకోనుంది. మరో రెండుమూడు వారాల్లో ఈ ప్రైవేట్ ఇంజనీర్లు విధుల్లోకి రానున్నారు. వీరికి నెలకు రూ.33,800 చొప్పున చెల్లించనున్నట్టు తెలిసింది. ప్రభుత్వం నియామకాలు వద్దనే ? గతంలో గృహనిర్మాణ శాఖలో చాలినంతమంది ప్రభుత్వ ఇంజనీర్లు ఉండేవారు. డాక్టర్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, భారీ ఎత్తున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ సమయంలో సొంత సిబ్బంది సరిపోకపోవటంతో ఔట్సోర్సింగ్ పద్ధతిలో కొందరి సేవలు తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం వీరిని తొలగించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకాన్ని కూడా రద్దు చేసింది. ఆ తర్వాత గృహనిర్మాణ శాఖ నిర్వీర్యమైంది. దాన్ని రోడ్లు భవనాల శాఖలో కలిపేశారు. గృహనిర్మాణ సంస్థలోని ఇంజినీర్లను వివిధ శాఖల ఇంజనీరింగ్ విభాగాలకు బదిలీ చేశారు. ఇప్పుడు మళ్లీ పెద్ద సంఖ్యలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రారంభించటంతో, వివిధ శాఖల్లో పనిచేస్తున్న కొందరు ఇంజనీర్లను తిరిగి గృహనిర్మాణ సంస్థకు రప్పించారు. అలా ప్రస్తుతం 125 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. గృహనిర్మాణ సంస్థలో 505 మంది అసిస్టెంట్ ఇంజనీర్లను వినియోగించుకునేలా పోస్టులకు అనుమతి ఉంది. ప్రస్తుతం 125 మందే ఉన్నందున, మిగతావారిని పబ్లిక్‌సర్విస్ కమిషన్ ద్వారా నియమించుకోవాల్సి ఉంది. కానీ, ఇటీవలి పబ్లిస్ సర్విస్ కమిషన్ నియామక ప్రక్రియలో గృహనిర్మాణ శాఖ ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో, ఆ వివరాలు ఇవ్వలేదు. దీంతో ఇటీవలి గ్రూప్ పరీక్షల్లో వీటిని చేర్చలేదు. ఔట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునే వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వ నియామకాల్లో చూపలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రస్తుతానికి ఔట్సోర్సింగ్ ఇంజనీర్ల సేవలు వినియోగించుకొని తదుపరి నియామక ప్రక్రియలో తీసుకునే అవకాశం ఉందని అధికారులంటున్నారు. తనిఖీ చేసేది వీరే.. తొలివిడతలో ప్రభుత్వం 72 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చింది. వారిలో 12 వేల మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. అందులో 500 మంది బేస్మెంట్ స్థాయి వరకు పనులు పూర్తి చేశారు. బేస్మెంట్ స్థాయి ముగిసిన వెంటనే తొలి విడత రూ.లక్ష నిధులు వారి ఖాతాల్లో డిపాజిట్ కావాల్సి ఉంటుంది. అది జరగాలంటే అసిస్టెంట్ ఇంజనీర్లు తనిఖీ చేసి సర్టిఫై చేయాలి. ఇప్పుడు ఈ పనిని ఉన్న 125 మంది ఇంజనీర్లు సహా కొత్తగా తీసుకోబోయే ఔట్సోర్సింగ్ ఇంజనీర్లు చేయనున్నారు. -
నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లకు సకల సౌకర్యాలు
దేశంలో ప్రవాస ఇంజినీర్ల సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. శ్రామిక కొరత సమస్యను పరిష్కరించడానికి, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి అధిక నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్ల(expat engineers)ను దేశంలోకి ఆహ్వానించేందుకు ప్రభుత్వం కొత్త విధానాలను ప్రకటించింది. ఈ నిర్ణయంతో నిపుణుల ద్వారా సంపద సృష్టి జరుగుతుందని, వివిధ పరిశ్రమల్లో సాంకేతిక పురోగతి మెరుగుపడతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.నిపుణుల కొరతకు పరిష్కారంఇంజినీరింగ్ రంగంలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సాంకేతిక అభివృద్ధి పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది. నైపుణ్యం కలిగిన ప్రవాస ఇంజినీర్లను దేశంలోకి ఆహ్వానించడం ద్వారా ఈ లోటును భర్తీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు ప్రాజెక్టులు సకాలంలో, అత్యున్నత ప్రమాణాలతో పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసం ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకుంటోంది.ఇదీ చదవండి: వేసవి కాలం కంపెనీలకు లాభం!ప్రభుత్వ చర్యలు ఇలా..ప్రవాస ఇంజినీర్లు భారత్‌లో పనిచేయడానికి వీలుగా వీసా ప్రక్రియలను ప్రభుత్వం సులభతరం చేసింది. వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గించింది. నిపుణులు అనవసరమైన ఆలస్యం లేకుండా శ్రామిక శక్తిలో భాగమయ్యేలా చర్యలు చేపడుతోంది. ప్రతిభావంతులను ఆకర్షించడానికి మెరుగైన జీతాలు, పునరావాసం, గృహ ప్రయోజనాలు వంటి ప్రోత్సాహకాలను అందిస్తోంది. భాషా శిక్షణ, సాంస్కృతిక ఓరియెంటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటికే స్థానికంగా ఉన్న శ్రామిక శక్తిలో నైపుణ్య అంతరాలను గుర్తించడానికి పరిశ్రమ నాయకులతో కలిసి పనిచేస్తోంది. ప్రవాస ఇంజినీర్లు అవసరాలకు తగిన విధంగా స్థానికులకు శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేస్తోంది. ఇంజినీర్లకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో గణనీయంగా పెట్టుబడులు పెడుతోంది. అధునాతన ఇంజినీరింగ్ పనులకు అవసరమైన వనరులను అందించే అత్యాధునిక సౌకర్యాలు, పరిశోధనా కేంద్రాలు, టెక్నాలజీ పార్కుల అభివృద్ధి చేస్తోంది. -
‘మేడిగడ్డ’ లోపాలు..ఇంజినీర్లకు విజిలెన్స్ నోటీసులు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై సంబంధిత ఇంజినీర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది. బ్యారేజీ పనులు పూర్తికాకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లు రమణారెడ్డి,తిరుపతి రావులకు నోటీసులు విజిలెన్స్ నోటీసులిచ్చింది. నోటీసులపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొత్తం ఇరవై మందికిపైగా ఇంజనీర్లు తప్పులు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.2023అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పెద్దశబ్దంతో పగుళ్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.ఇదీ చదవండి: రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే -
కమిషన్ ముందు కథలు చెప్పొద్దు
సాక్షి, హైదరాబాద్: ‘మీరు ఇంజనీరేనా? ఏ యూనివర్సిటీలో చదువుకున్నారు? కమిషన్ ముందు కథలు చెబుతున్నారా? బాధ్యతలను కేంద్రంపైకి నెట్టేయడానికి ప్రయత్నిస్తున్నారా? ఎవరిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు? పక్కదోవ పట్టించడానికి యత్నించినా వాస్తవాలన్నీ వెలుగులోకి తెస్తాం..’అని కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ చీఫ్ ఇంజనీర్ (సీఈ) శంకర్ నాయక్‌పై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బరాజ్‌ల నిర్మాణంలో లోపాలు, అవకతవకలపై విచారణలో భాగంగా బుధవారం 15 మంది ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. డిజైన్ ఫ్లడ్స్ అంటే ఏమిటని కమిషన్ ప్రశ్నించగా, పరీవాహక ప్రాంతంలో వచ్చే వరద ఆధారంగా డిజైన్లు తయారు చేయడమేనని నాయక్ బదులిచ్చారు. దీంతో మీరు ఇంజనీరేనా? డిజైన్ ఫ్లడ్ అంటే కూడా తెలియదా? అని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తాను జేఎనీ్టయూలో చదువుకున్నానని, నదిలో వచ్చే వరద ఆధారంగా చేసేదే డిజైన్ ఫ్లడ్ అని ఆయన బదులిచ్చారు. ‘ఏం దాస్తున్నారు? రిటైరయ్యాక కూడా దాచేది ఏముంది? విచారణను పక్కదారిపట్టించే ప్రయత్నం చేస్తారా? అని కమిషన్ ఆయనపై మండిపడగా, లేదని శంకర్‌నాయక్ వివరణ ఇచ్చారు. 2016 జనవరి 17న నాటి సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్‌ను వ్యాప్కోస్ సంస్థ సమరి్పంచిందా? ఆ సమావేశం మినిట్స్‌ను పరిశీలించారా? అన్న ప్రశ్నకు మినిట్స్‌ను చూడలేదని నాయక్ తెలిపారు. కేంద్ర జలవనరుల సంఘం కాళేశ్వరం ప్రాజెక్టుకు హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. నీటి లభ్యతను తొలుత ఇక్కడి ఇంజనీర్లే నిర్ధారించాల్సి ఉంటుందని కమిషన్ తప్పుబట్టింది. కేంద్రంపై తోసేందుకు ప్రయత్నిస్తున్నారా? ఎంత ప్రయత్ని0చినా వాస్తవాలను బయటికి తీసుకొస్తాం అని ఆగ్రహం వ్యక్తంచేసింది.క్షేత్రస్థాయిలోని ఇంజనీర్లు పంపే నీటి లభ్యత లెక్కలను పరిశీలించి సరిగ్గా ఉన్నట్టు నిర్ధారించడమే తమ బాధ్యత అని శంకర్‌నాయక్ తెలిపారు. బరాజ్‌ల నిర్మాణ స్థలాలను మార్చిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. నీటి లభ్యత అధ్యయనాలు జరపకముందే జనరల్ అలైన్మెంట్ డ్రాయింగ్స్ తయారు చేస్తారా? అని కమిషన్ ప్రశ్నించగా, లేదని నాయక్ బదులిచ్చారు. వరద తీవ్రత ఆధారంగా ఎన్ని గేట్లు పెట్టాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారన్నారు. కాగా, బరాజ్ సీసీ బ్లాక్స్ ఎందుకు కొట్టుకుపోయాయి? బ్లాకులు కొట్టుకుపోతే పైఅధికారులకు ఎందుకు లేఖలు రాయలేదు? మౌఖికంగానే సమాచారం ఇస్తారా? అని అన్నారం బరాజ్ ఏఈఈ ఆర్మూరి రామచందర్‌పై కమిషన్ మండిపడింది. పినాకిని అంటే అర్థం తెలుసా? మీ పదవీకాలంలో బరాజ్‌లను ఎన్నిసార్లు సందర్శించారు? నివేదికలు ఏమైనా ఇచ్చారా? అని ఓ అండ్ ఎం విభాగం మాజీ సీఈ జి.రమేశ్‌ను కమిషన్ ప్రశ్నించింది. 2021 జూలైలో ఒక్కసారి పరిశీలించి నివేదిక ఇచ్చానని రమేశ్ బదులిచ్చారు. జస్టిస్ పినాకి చంద్రఘోష్ పేరుకి బదులు అఫిడవిట్లో పినాకిని చంద్రఘోష్ అని రాయడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. పినాకిని అంటే అర్థం తెలుసా?, అఫిడవిట్ ప్రారంభంలోనే తప్పులు ఉంటే ఎలా? సంతకం చేయడానికి ముందు అఫిడవిట్ చదువుకోరా? అని నిలదీసింది. అర్జీల్లో అచ్చు తప్పులున్నా న్యాయస్థానాలు కేసులను కొట్టివేసిన సందర్భాలున్నాయని గుర్తు చేసింది. సరైన పరిశోధనలు చేయకుండానే బరాజ్‌ల నిర్మాణంపై నిర్ణయాలు తీసుకున్నారని మాజీ ఇంజనీర్ ఐ.వికల్రార్ కమిషన్‌కు తెలిపారు. బరాజ్‌ల వైఫల్యానికి హైపవర్ కమిటీ ప్రధాన కారణమని ఆరోపించారు. 2–3 టీఎంసీల సామర్థ్యంతోనే బరాజ్‌లను నిర్మిస్తారని, 16 టీఎంసీల సామర్థ్యంతో కట్టడంతోనే సమస్యలొచ్చాయన్నారు. గత మూడు రోజుల్లో మొత్తం 49 మంది ఇంజనీర్లకు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించడంతో ఇంజనీర్ల వంతు ముగిసింది. మళ్లీ సోమవారం నుంచి ఐఏఎస్, మాజీ ఐఏఎస్‌లతోపాటు కాంట్రాక్టర్లను ప్రశ్నించనుంది. -
విద్యార్థి ప్రాణాలను బలి తీసుకున్న ఆన్ లైన్ బెట్టింగ్ భూతం
-
బరాజ్‌ల వైఫల్యంలో 20 మంది ఇంజనీర్లు!
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల వైఫల్యానికి 20 మంది ఇంజనీర్లు బాధ్యులని జస్టిస్ పినాకి ఘోష్ కమిషన్ ప్రాథమికంగా తేలి్చనట్టు సమాచారం. ఈ బరాజ్‌లపై విచారణ జరిపిన రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం కమిషన్‌కు ఇచ్చిన నివేదికలో 10 మంది దాకా ఇంజనీర్లు బాధ్యులని తేలి్చంది. ఈ మేరకు విచారణకు సంబంధించిన మధ్యంతర నివేదికను కాళేశ్వరం కమిషన్‌కు అందించింది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అలసత్వం బరాజ్‌ల వైఫల్యానికి కారణాలని ఎన్ఫోర్స్మెంట్ తన నివేదికలో పేర్కొంది.పూర్తి నివేదిక అందించడానికి మరికొంతకాలం గడువు కావాలని విజిలెన్స్ నివేదించగా.. పత్రాలన్నీ ఇస్తే తామే వైఫల్యానికి కారణాలను తేల్చుకుంటామని కమిషన్ స్పష్టం చేయడంతో నెలాఖరుకల్లా నివేదిక అందించడానికి విజిలెన్స్ అంగీకరించింది. ఇక విచారణను తప్పుదోవ పట్టించిన, నేరపూరితంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలతోపాటు, క్రిమినల్ కేసుల నమోదుకు ప్రభుత్వానికి సిఫారసు చేయాలని కమిషన్ యోచిస్తోంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టుతో ముడిపడిన కేసులో ఉన్న ఇంజనీర్లపై కఠిన చర్యలకు ఉపక్రమించాలని, వీరికి పదోన్నతులు కూడా ఇవ్వరాదని ప్రభుత్వానికి లేఖ రాయాలని కమిషన్ భావిస్తున్నట్టు సమాచారం. చాలామంది అధికారులు అఫిడవిట్ రూపంలో దాఖలు చేసిన సమాచారంలో ఈ విషయాన్ని కమిషన్ గుర్తించింది. విచారణను తప్పుదోవ పట్టించడానికి వీరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరించినట్టు తేలింది.ఇక కాళేశ్వరంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతో ముడిపడిన అన్నీ డాక్యుమెంట్లు అందించాలని నీటిపారుదలశాఖను మరోమారు కమిషన్ ఆదేశించింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్మెంట్ రిజిస్టర్, ఎం–బుక్ (మెజర్మెంట్ బుక్)లు కూడా కమిషన్‌కు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. రెండురోజులుగా జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్‌లో ఈ రెండు బుక్‌లకు సంబంధించిన ప్రస్తావన పలు సందర్భాల్లో వచ్చింది. దీంతో క్రాస్ ఎగ్జామినేషన్‌లో పేర్కొన్న వివరాలు సరైనవా? కావా? అనేది నిర్ధారణ కావాలంటే కీలకమైన రెండు బుక్‌లను తెప్పించుకోవడమే మేలని కమిషన్ నిర్ణయించింది. కాళేశ్వరంపై ఇదివరకే కాగ్ నివేదిక ఇచి్చన నేపథ్యంలో ఆ అధికారిని పిలిపించి, సమాచారం సేకరించాలని కమిషన్ నిర్ణయించింది.40 మంది ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని.. విచారణలో భాగంగా మంగళవారం నుంచి శనివారం దాకా 40 మంది దాకా ఇంజనీర్లను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కమిషన్ నిర్ణయించింది.తాజా జాబితాలో మాజీ ఈఎన్సీతో పాటు పలువురు అధికారులు ఉన్నారు.ఇంజనీర్లను పూర్తిగా ప్రశ్నించిన తర్వాత ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌లకు కమిషన్ కబురు పంపనుంది. ఆ పిదప కీలక ప్రజాప్రతినిధులకు కూడా సమన్లు పంపించనుంది. ఇప్పటికే విచారణలో స్పష్టత వచి్చంది.లాయర్ లేకుండానే క్రాస్ ఎగ్జామినేషన్ లాయర్ లేకుండానే ఒంటరిగా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని కాళేశ్వరం కమిషన్ నిర్ణయించింది. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో మొత్తం 18 మందిని కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది. ఒకవేళ కమిషన్ లాయర్‌ను సమకూర్చుకుంటే..ప్రతివాదులు కూడా లాయర్లనుతెచ్చుకుంటున్నారని, దీనివల్ల రోజుకు ఒక్కరిని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేయలేమనే అభిప్రాయానికి కమిషన్ వచి్చంది. క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియలో లాయర్లను అనుమతించడమంటే... విచారణ ప్రక్రియను మరింత జఠిలం, వాయిదా వేయడమే అవుతుందనే అభిప్రాయంలో కమిషన్ ఉంది. అయితే కమిషన్‌కు న్యాయవాదిని సమకూర్చడానికి ప్రభుత్వం ఇదివరకే సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. -
కాళేశ్వరం కమిషన్‌కు కీలక విషయాలు వెల్లడించిన ఇంజినీర్లు
సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతోంది.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్లుగా పనిచేసిన ఈఈ, సీఈ,ఎస్ఈ శనివారం(సెప్టెంబర్21)నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధలో కమిషన్ ముందు హాజరయ్యారు.మూడు బ్యారేజీలలో క్వాలిటీ కంట్రోల్ వింగ్ పోషించిన పాత్రపై అధికారులను కమిషన్ ప్రశ్నించింది. ఈ ప్రశ్నలకుగాను క్వాలిటీ కంట్రోల్ అధికారులు కమిషన్‌కు విభిన్న సమాధానాలు చెప్పడం గమనార్హం.బ్యారేజీల సైట్ విజిట్ ఎన్ని రోజుల కొకసారి చేసేవారని అధికారులను కమిషన్ ప్రశ్నించింది.రెండు మూడు నెలలకొకసారని ఒకరు,అసలు సైట్ విజిట్ చేయలేదని మరొకరు పొంతన లేని సమాధానాలిచ్చినట్లు తెలిసింది.అన్నారం బ్యారేజ్ డిజైన్ సరిగా లేదని అన్నారం బ్యారేజ్ ఈఈ కమిషన్‌కు చెప్పారు.వరదకు తగ్గట్టుగా అన్నారం బ్యారేజ్ డిజైన్ లేదని తెలిపారు.తక్కువ వరదకు డిజైన్ చేస్తే ఎక్కువ వరద వస్తోందన్నారు. ఎత్తిపోతలకు బ్యారేజ్ అనుగుణంగా లేదని సమాధానమిచ్చారు.ఇదీ చదవండి.. కాళేశ్వరం తెలంగాణకు వెయ్యి ఏనుగుల బలం: హరీశ్‌రావు -
గుర్తు లేదు..మరిచిపోయిన!
సాక్షి, హైదరాబాద్: ‘నాకు తెలియదు.. గుర్తు లేదు..మర్చిపోయిన..’కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ వేసిన ప్రశ్నలకు కొందరు నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెప్పిన వింత సమాధానాలు ఇవి. తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్ రీసెర్చ్ లే»ొరేటరీ(టీఎస్ఈఆర్ఎల్) చీఫ్ ఇంజనీర్‌గా వ్యవహరించిన శ్రీదేవిని కమిషన్ ఏ ప్రశ్న అడిగినా ‘తెలీదు..గుర్తు లేదు’అని సమాధానాలివ్వగా, కమిషన్ ఆమెపై తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. బరాజ్‌ల నిర్మాణానికి సంబంధించిన మోడల్ స్టడీస్ విషయంలో కీలకపాత్ర పోషించిన ఆమెపై కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించగా, సమాధానాలు ఇవ్వలేక నీళ్లు నమిలారు. బరాజ్‌లను నిర్మించడానికి ముందే మోడల్ స్టడీస్ చేశామని తొలుత చెప్పిన ఆమె, ఆ వెంటనే మాట మార్చారు. దీంతో మీరు ఇచ్చిన అఫిడవిట్‌లోని సమాచారానికి సైతం కట్టుబడి ఉండకపోతే ఎలా? అని ఆమెపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్‌ల నిర్మాణంపై విచారణ నిర్వహిస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ శుక్రవారం బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో పలువురు ఇంజనీర్లకు క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. ⇒ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్(ఎస్డీఎస్ఓ) సీఈగా సైతం శ్రీదేవి వ్యవహరించగా, ఆ పోస్టులో ఉండి బరాజ్‌ల పరిరక్షణకు ఐఎస్ కోడ్‌ను అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, మౌనంగా ఉండిపోయారు. ⇒ బరాజ్‌లకు వరదలు ఎప్పుడొచ్చాయన్న ప్రశ్నకు సైతం తెలియదు అని బదులిచ్చారు. ⇒ బరాజ్‌లకు 2020లో త్రిడీ మోడల్ స్టడీస్ నిర్వహించినట్టు ఆమె చెప్పగా, 2023లో జరిగినట్టు టీఎస్ఈఆర్ఎల్ నివేదిక ఇచి్చందని కమిషన్ ఆమెకు తెలియజేసింది. అయితే ఆ విషయం తనకు గుర్తు లేదని ఆమె బదులివ్వడంతో కమిషన్ అసహనం వ్యక్తం చేసింది. బరాజ్‌లకు తనిఖీలు చేయలేదు బరాజ్‌ల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకున్నారని ఎస్డీఎస్ఓ సీఈ ప్రమీళను కమిషన్ ప్రశించగా, ఆ బాధ్యత ప్రాజెక్టు అథారిటీదేనని ఆమె బదులిచ్చారు. డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అమల్లోకి వచి్చనా బరాజ్‌ల భద్రత వాటి చీఫ్ ఇంజనీర్దేనని స్పష్టం చేశారు. గేట్ల నిర్వహణలో మ్యానువల్స్, బరాజ్‌ల నిర్వహణ ప్రొటోకాల్స్ అమలు చేశారా? అని కమిషన్ ప్రశ్నించగా, ఆమె సమాధానమివ్వడానికి ఇబ్బంది పడ్డారు. దీంతో పేర్లు చెప్పకుండా వివరాలు తెలపాలని కమిషన్ ఆమెను కోరింది. చట్టం ప్రకారం వర్షకాలానికి ముందు, తర్వాత తనిఖీలు నిర్వహించి నివేదికలు ఇవ్వలేదని ఆమె వివరించారు. – ఎస్స్డీఎస్ఓ ఈఈ విజయలక్ష్మి సైతం ఇదే విషయాన్ని కమిషన్‌కు తెలిపారు. అధ్యయనాలు, నిర్వహణ లేకపోవడమే కారణం బరాజ్‌ల వైఫల్యానికి కేవలం నిర్వహణ, పర్యవేక్షణ లోపాలే కాకుండా వాటికి ఎగువ, దిగువన రక్షణ చర్యలు తీసుకోకపోవడం కూడా కారణమేనని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) ఈఈ రఘునాథ శర్మ తెలిపారు. 2019 లోనే వరదల తర్వాత బరాజ్‌లలో లోపాలు బయటపడగా, 2023 అక్టోబర్‌లో మేడిగడ్డ బరాజ్ కుంగే వరకు మరమ్మతులు చేయలేదని ఆరోపించారు. వైఫల్యానికి కారకులు ఎవరు? నాటి ప్రభుత్వ అధినేతనా? అని కమిషన్ అడగ్గా, 3డీ మోడల్ అధ్యయనాలు జరపకపోవడం, నిర్వహణ ప్రొటోకాల్స్ పాటించకపోవడం కారణమని ఆయన బదులిచ్చారు. ⇒ మోడల్ స్టడీస్ పూర్తికాక ముందే బరాజ్‌ల నిర్మాణం ప్రారంభించడంతోనే విఫలమయ్యాయని పలువురు టీఎస్ఈఆర్ఎల్ ల్యాబ్ ఇంజనీర్లు కమిషన్‌కు తెలిపారు. బరాజ్‌లను నీటి మళ్లింపుకోసం నిర్మిస్తారని, నిల్వ చేయడంతోనే కుంగిపోవడం, సీపేజీలు ఏర్పడడం జరిగిందన్నారు. వరదల సమయంలో కూడా గేట్లు మూసి ఉంచడంతో ప్రమాద తీవ్రత పెరిగిందన్నారు. -
kaleshwaram commission: ‘తెలీదు.. గుర్తులేదు.. మర్చిపోయా..’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభమైంది. శుక్రవారం.. కమిషన్ ముందుకు తెలంగాణ రీసెర్చ్ అధికారులు హాజరయ్యారు. అయితే, కాళేశ్వరం కమిషన్ ముందు రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి వింత సమాధానాలు చెప్పారు. కమిషన్ అడిగే ప్రశ్నలకు తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ ఆమె చెప్పిన సమాధానాలకు కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్ర ఘోష్ షాక్ అయ్యారు. శ్రీదేవి పని చేసిన పిరియడ్‌లో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని కమిషన్ ఛైర్మన్ అడ్డగా.. ఏ ప్రశ్న అడిగినా తెలీదు, గుర్తుకు లేదు, మర్చిపోయా అంటూ శ్రీదేవి సమాధానాలు చెప్పింది.2017 నుంచి 2020 వరకు కాళేశ్వరం మూడు బ్యారేజీల నిర్మాణం సమయంలో పనిచేసిన శ్రీదేవి.. మోడల్ స్టడీస్ ఎప్పుడు చేశారు? ఫ్లడస్ ఎప్పుడు వచ్చాయి అనే ప్రశ్నలకు తనకు గుర్తుకు లేదంటూ దాటవేసేందుకు యత్నించారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటి మహిళా చీఫ్ ఇంజనీర్‌గా ఆమె పదవి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.కాగా, మూడు బ్యారేజీల కంటే ముందు మోడల్ స్టడీస్ కండక్ట్ చేశారా లేదా అంటూ రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది. నిర్మాణానికి ముందు, మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు కమిషన్‌కు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తికాకముందే నిర్మాణాలు మొదలైనట్లు కమిషన్ ముందు రీసెర్చ్ ఇంజనీర్లు ఒప్పుకున్నారు. మేడిగడ్డతో పాటు ఇతర డ్యామేజ్ జరగడానికి కారణం నీళ్లను స్టోరేజ్ చేయడం వల్లేనని కమిషన్‌కు ఇంజనీర్లు తెలిపారు.ఇదీ చదవండి: ‘ఓటుకు నోటు కేసుపై రేవంత్‌కు రిపోర్ట్ చేయొద్దు’వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకుండా ఫీల్డ్ అధికారులు నిర్లక్ష్యం వహించినట్లు కమిషన్ ముందు చెప్పిన రీసెర్చ్ ఇంజనీర్లు.. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్‌లో మార్పులు సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్నారు. బ్యారేజీలు డామేజ్ అవ్వడానికి మోడల్ స్టడీస్‌కి సంబంధం లేదని రీసెర్చ్ అధికారులు స్టేట్మెంట్ ఇచ్చారు. మూడు బ్యారేజీలలో నీళ్లు నిలువ చేయడానికి ఎవరి ఆదేశాలు ఉన్నాయని కాళేశ్వరం కమిషన్.. రీసెర్చ్ ఇంజనీర్లను ప్రశ్నించింది.అన్నారం గ్యారేజీ నిర్మాణం చేసే లొకేషన్ మారినట్లు రీసెర్చ్ ఇంజనీర్ల దృష్టిలో ఉందా?. మూడు బ్యారేజీలలో నీళ్లను స్టోరేజ్ చేయాలని ఎవరి ఆదేశాలు ఉంటాయని కమిషన్ ప్రశ్నించగానిబంధనల ప్రకారమే టీఎస్ ఈఆర్ఎల్ పని చేసిందని కమిషన్ ముందు చెప్పిన ఇంజనీర్లు. లొకేషన్, సీడీవో అథారిటీ రిపోర్ట్స్ ఆధారంగా రీసెర్చ్ చేశామని అధికారులు పేర్కొన్నారు. మొత్తం మూడు బ్యారేజీలలో 2016 నుంచి 2023 వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు అధికారులు తెలిపారు. ఒక వైపు నిర్మాణం జరుగుతుండగానే... మరొకవైపు రీసెర్చ్ కొనసాగుతుందని ఇంజనీర్లు పేర్కొన్నారు. -
మాయాలోకపు జీవన నైపుణ్యాలు
మోసం ఏ రూపంలోనైనా మనల్ని మాయలో పడేసే లోకంలో జీవిస్తున్నాం! ఒకరికి ఒకరం ఎన్ని జాగ్రత్తలు చెప్పుకుని మోసపోవటం అన్నది ఎప్పుడూ కొత్తగా జరుగుతుంది. కాలింగ్ బెల్ కొడతారు. ఫలానా కంపెనీ నుంచి వచ్చాం అంటారు. మనల్ని బుట్టలో పడేసి, ‘సర్దుకుని’ వెళ్లిపోతారు... ఇదొక రకం మోసం! ఎవరో ఒక పెద్ద కంపెనీ నుంచి ఫోన్ చేస్తారు. మీరు ఫారిన్ ట్రిప్‌కి ఎంపికయ్యారని చెబుతారు. ఫలానా చోటుకు రమ్మంటారు. వెళ్లాక అక్కడ మనల్ని పెద్ద వెంచర్లో ఇరికించేస్తారు... ఇది ఇంకో రకం మోసం! ఇక ఓటీపీ మోసాలైతే ఏ మార్గంలో మనల్ని వెతుక్కుంటూ వస్తాయో అంతే పట్టదు. అనుక్షణం జాగ్రత్తగా ఉండటం, ప్రతిదాన్నీ అనుమానించటం జీవితానికి ఇప్పుడు అవసరమైన నైపుణ్యాలు అయ్యాయి!వాట్సాప్‌లో తరచూ మిమ్మల్ని హెచ్చరిస్తూ వస్తుండే సందేశాల వంటిదే ఇది. గడప గడపకూ తిరిగే సేల్స్‌మెన్‌తో జాగ్రత్త, రాత్రికి రాత్రి బిచాణా ఎత్తేసే కంపెనీల ఆకర్షణీయమైన ఆఫర్ల ఎరకు చిక్కుకోకండి, బ్యాంకు నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మిమ్మల్ని మీ క్రెడిట్ కార్డు పిన్ నెంబర్ అడిగితే ఇవ్వకండి... అంటూ అప్రమత్తం చేసే మెసేజ్‌లు నాకు నిరంతరం వస్తూనే ఉంటాయి. మీక్కూడా వస్తుంటాయని కచ్చి తంగా చెప్పగలను. అలా వారు ఒక హెచ్చరికగా తప్పించాలనుకున్న సంఘటన గతవారం నా సోదరి కిరణ్ విషయంలో జరిగింది. శనివారం మధ్యాహ్నం ఆమె ఇంటి కాలింగ్ బెల్ మోగింది. వెళ్లి తలుపు తీయగానే ద్వారం ముందు ముగ్గురు వ్యక్తులు కనిపించారు. తాము ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) ఇంజినీర్లమని చెప్పు కున్నారు. గ్యాస్ కనెక్షన్‌ను పరిశీలించేందుకు వచ్చామని చెప్పారు. అదృష్టవశాత్తూ వారిని గుర్తింపు కార్డులు అడగాలన్న ఆలోచన కిరణ్‌కు వచ్చింది. వాళ్లవి చూపించినప్పటికీ, నేననుకోవటం అవి నకిలీవి అయుంటాయని. ఆమె తెలివిగా ఇంకో పని చేసింది. ఆ ఐడీ కార్టులను ఫొటో తీసుకుంది. వారి ఫోన్ నెంబర్లను అడిగి రాసుకుంది. అందుకు వాళ్లు కంగు తిన్నప్పటికీ వాళ్ల ఆత్మవిశ్వాసం ఏ మాత్రం సడలలేదు. కిరణ్... వాళ్లని వంటింట్లోకి తీసుకొని వెళ్లారు. కానీ, ఇంట్లో పనిమనుషులు కూడా వాళ్లతో పాటు అక్కడ ఉండేలా జాగ్రత్త పడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులు గ్యాస్ పైపులను ‘తనిఖీ’ చేసి, ఆ పైపులలో ఒకటి వారెంటీ గడువును దాటేసింది కనుక దానిని మార్చవలసిన అవసరం ఉందని చెప్పారు. అందుకు కిరణ్, ‘మాది పాతబడిపోతే మిగతా ఫ్లాట్‌లో ఉన్నవాళ్లవీ పాతబడి ఉండాలి కదా! మా గ్యాస్ కనెక్షన్లన్నీ ఒకేసారి బిగించినవి’ అని వారితో అన్నారు. ఆ మాటకు, ఆ ముగ్గురిలో సీనియర్ ఇంజినీర్‌నని చెప్పుకున్న వ్యక్తి ఏ మాత్రం వెరపు లేకుండా పక్క ఫ్లాట్‌లో చెక్ చేసి వస్తానని చెప్పి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత తిరిగొచ్చి, ‘వాళ్ల పైప్ బాగానే ఉంది. కొత్తది మార్చి ఉంటారు, మీక్కూడ కొత్తది వెయ్యవలసిన అవసరం ఉంది’ అని కిరణ్‌తో చెప్పాడు. ఆ ముగ్గురు వ్యక్తులు పైప్‌ను మార్చే పని ప్రారంభించగానే కిరణ్ తన దగ్గరున్న ఐజీఎల్ నెంబర్లకు మెసేజ్ చేయటం మొదలు పెట్టారు. ‘పైపును మార్చాలని, మా ఇంజినీర్లను పంపిస్తున్నామని’ ఐజీఎల్ తనకు ముందే సమాచారం ఇవ్వకపోవటం పట్ల కిరణ్ విసుగ్గా ఉన్నారు. పది, పదిహేను, ఇంకా ఎక్కువ నెంబర్లకే ఆమె మెసేజ్ పెట్టి ఉంటారు. వాటిల్లో ఒకటి ఐజీఎల్ పూర్వపు సీఈవోది అన్నట్లు ఆమెకు గుర్తు. ఆ నెంబర్ల నుండి రిప్లయ్‌లు రావటానికి మరీ అంత సమయం ఏమీ పట్టలేదు. ఆ వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఐజీఎల్ పంపినవారు కాదు! వారు మోసగాళ్లు. అంతకన్నా కూడా, ‘వాళ్లను పైపులు మార్చనివ్వకండి’ అని, ‘ఐజీఎల్ సిబ్బంది ముసుగులో కొందరు మోసాలకు పాల్పడుతున్నార’ని హెచ్చరిస్తూ ఐజీఎల్ నంబర్లలో కొన్నింటి నుంచి కిరణ్‌కు వాట్సాప్ మెసేజ్‌లు వచ్చాయి. ఆ మను షుల్ని తక్షణం బయటికి పంపించేయండి అన్నది వారి నుంచి వచ్చిన స్పష్టమైన సందేశం. నిజంగానే వాళ్లు మోసగాళ్లు! కానీ అప్పటికే వారు పైపును తొలగించి, దాని స్థానంలో మరొక పైపును బిగించారు. చిత్రంగా వాళ్లు ఆ పనికి డబ్బులు అడగలేదు. పైగా వెళ్లిపోయే తొందరలో ఉన్నట్లు కనిపించారు. బహుశా కిరణ్ ఐజీఎల్ వాళ్లతో మాట్లాడినందువల్ల భయపడినట్లున్నారు. తదుపరి గ్యాసు బిల్లులో పైపు మార్పిడి చార్జీలు కలిసి ఉంటాయని చెప్పి బయల్దేరుతూ, అనుకోకుండా కందెన అంటిన ఒక ఫోల్డర్‌ను అక్కడ వదిలి వెళ్లారు. ఈలోపు ఐజీఎల్ కంపెనీ వాళ్లు కిరణ్‌కి ఫోన్ చేసి, తక్షణం తమ ఇంజనీర్లను ఆమె ఇంటికి పంపుతున్నట్లు చెప్పారు. నిజానికి పూర్వపు సీఈఓ నెంబరు అయివుండవచ్చని మెసేజ్ ఇవ్వటం ద్వారా ఆమె చేసిన ప్రత్యేక ప్రయత్నం ఐజీఎల్ సొంత ఇంజనీర్లు – మెక్ కాయ్ కంపెనీ వాళ్లు – వీలైనంత త్వరగా ఆమె ఇంటికి చేరుకుని, ఆ మోసగాళ్లు బిగించి వెళ్లిన కొత్త పైప్‌ను ఒకటికి రెండుసార్లు పరిశీలించటాన్ని సాధ్యం చేసింది. మొత్తానికి మోసం జరగబోయిందన్నది స్పష్టం. కిరణ్ వసంత్ విహార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌కి ఫోన్ చేసిన వెంటనే ఆయన తమ పోలీసులను పంపారు. ఆఫీసర్ స్పందన నిజాయితీగా, చురుకుగా, సౌమ్యంగా ఉందని కిరణ్ చెప్పారు. ఆ ముగ్గురు మోసగాళ్లు తమ ‘పని’ పూర్తి చేసి వెళ్లిన కొద్దిసేపటికే ఐజీఎల్ ఇంజినీర్లు, పోలీసులు దాదాపుగా ఒకేసారి అక్కడికి చేరుకున్నారు. మార్చిన పైపు నకిలీది అవటమే కాకుండా, దాని దిగువ భాగం సరిగా బిగించి లేదని ఐజీఎల్ ఇంజనీర్లు కిరణ్‌కు చెప్పారు.అంటే ఒకవేళ గ్యాస్ స్విచ్ ఆన్ చేసి ఉంటే లీక్ అయుండేది.కిరణ్ ఫొటో తీసిన గుర్తింపు కార్డుల్ని, ఆ మోసగాళ్లు వదిలి వెళ్లిన ఫోల్డర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి కిరణ్ తీసుకున్న ఫోన్ నెంబర్లను బట్టి వారిని కనిపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఆ విధంగా 90 నిమిషాల వ్యవధిలో పరిస్థితి చక్కబడి, నష్టం జరగకుండా ఆగింది. ఇందుకు విరుద్ధంగా జరిగి ఉంటే కిరణ్ దాని గురించి చెప్పవలసి వచ్చినప్పుడు అది మరింత దారుణమైన పరిస్థితిగా ఉండేది. అదృష్టవంతురాలు. అలా జరగలేదు. మూడు విషయాలను ఆమెను రక్షించాయని నేను అంటాను. గుర్తింపు కార్డులను ఫొటో తీసుకోవటం, వాళ్ల ఫోన్ నెంబర్లను అడిగి తీసుకోవటం, ‘మీ ఇంజినీర్లను పంపిస్తున్నట్లు ముందుగా నాకెందుకు సమాచారం ఇవ్వలేద’ని ఐజీఎల్ వాళ్లను ఆమె అడగటం! అన్నిటి కన్నా ముఖ్యంగా ఆ మోసగాళ్లు ‘పాడైపోయిన’ పైపును మార్చే ‘పని’ మీద ఉన్నప్పుడు తన ఇంట్లో పని చేసేవాళ్లు కూడా అక్కడ ఉండేలా జాగ్రత్త పడటం. ఒకవేళ ఆమె ఇవేవీ చేయకపోయుంటే?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
క్రియేటివిటీకి ఆనంద్ మహీంద్రా ఫిదా..!
-
జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ ముందుకు కాళేశ్వరం పంపహౌస్ ఇంజినీర్లు
సాక్షి, హైదరాబాద్: జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ కొనసాగుతోంది. అఫిడవిట్లను కమిషన్ పరిశీలిస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రఘోష్ కమిషన్ కోరింది. రెండు వారాల్లోగా అన్ని డాక్యుమెంట్ల ఇవ్వాలని ఆదేశించింది. సోమవారం నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు పంపహౌస్ ఇంజినీర్లను జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారించనుంది. లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్‌హౌస్ ఇంజినీర్లను కమిషన్ ప్రశ్నించనుంది. ఈ మూడు పంప్‌హౌస్‌లకు చెందిన సీఈ నుంచి ఏఈఈల హోదాల్లో పనిచేసే ఇంజినీర్లు సోమవారం కమిషన్ ఎదుట హాజరుకానున్నారు.కాళేశ్వరానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలని ఇదివరకే ప్రభుత్వానికి కమిషన్ ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెండు వారాల్లోగా అన్నిడాక్యుమెంట్లు అప్పగించాలని స్పష్టం చేసింది. విజిలెన్స్, ఎన్డీఎస్ఏ నుంచి రిపోర్టులను కోరింది. మరోవైపు, పుణెలోని సీడబ్ల్యూపీఆర్‌కు తమ ప్రతినిధిని పంపించి అధ్యయనం చేయించింది. నిపుణుల కమిటీ నుంచి కూడా కమిషన్ నివేదిక కోరింది. అఫిడవిట్ల పరిశీలన తర్వాత నోటీసులు కమిషన్ ఇవ్వనుంది. -
కాళేశ్వరం ఇంజనీర్లకు.. క్రాస్ ఎగ్జామినేషన్!
సాక్షి, హైదరాబాద్: ‘బ్యారేజీలను డిజైన్ల ప్రకారమే కట్టారా. డిజైన్లను ఉల్లంఘించి ఏమైన పనులు చేశారా? నిర్మాణంలో డిజైన్లు మార్చితే ఆమోదం తీసుకున్నారా? సరైన ఇన్వెస్టిగేషన్లు చేశారా ? భూసార పరీక్షల కోసం డైమండ్ డ్రిల్లింగ్ చేశారా ? ప్లానింగ్ ఏ విధంగా చేశారు ? క్వాలిటీ సర్టిఫికెట్ల జారీకి ముందు పరీక్షలు జరిపారా? క్వాలిటీ, ఎగ్జిక్యూషన్ విభాగాలు నిరంతరం క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాయా? ..అంటూ కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణాల్లో పాల్గొన్న ఇంజనీర్లపై కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) రిటైర్డ్ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ప్రశ్నించింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల డిజైన్లు, నిర్మాణంపై అధ్యయనం కోసం జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) ఈ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గత రెండు రోజులుగా క్షేత్ర స్థాయిలో బ్యారేజీలను పరిశీలించిన నిపుణుల కమిటీ శనివారం మూడో రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6:40 గంటల వరకు జలసౌధలో నిర్మాణం(ఎగ్జిక్యూషన్), క్వాలిటీ కంట్రోల్, డిజైన్స్ విభాగాల ఇంజనీర్లతో పాటు నిర్మాణ సంస్థతో విడివిడిగా సమావేశమై బ్యారేజీల నిర్మాణంలో వారి పాత్రపై ప్రశ్నలను సంధించింది. ఒక విభాగం ఇంజనీర్లు అందించిన సమాచారంలో నిజానిజాలను నిర్ధారించుకోవడానికి మరో విభాగం ఇంజనీర్లకు సంబంధిత ప్రశ్నలు వేసి క్రాస్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైన 2016 నుంచి ఇప్పటి దాకా వాటి నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజనీర్లు, రిటైర్డ్ ఇంజనీర్లు, బదిలీ అయిన ఇంజనీర్లను కమిటీ ప్రశ్నించింది. కమిటీ ఇంజనీర్లను ప్రశి్నస్తున్న సమయంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీలు, ఇతర ఉన్నత స్థాయి అధికారులను సైతం లోపలికి అనుమతించలేదు. డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం.. బ్యారేజీల నిర్మాణంలో కీలకమైన డిజైన్లపై మరింత లోతుగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున వాటితో సంబంధం ఉన్న వారంతా సంబంధిత ఫైళ్లతో ఢిల్లీకి రావాలని చంద్రశేఖర్ అయ్యర్ ఆదేశించారు. భారీ సంఖ్యలో ఫైళ్లు, ఉద్యోగులను ఢిల్లీకి పంపించడం సాధ్యం కాదని, నిపుణుల కమిటీలో నుంచి ఎవరైనా మళ్లీ హైదరాబాద్‌కు వస్తే ఇంజనీర్లందరినీ పిలిపించి అవసరమైన ఇతర సమాచారాన్ని అందిస్తామని నీటిపారుదల శాఖ విజ్ఞప్తి చేయగా, అయ్యర్ సానుకూలంగా స్పందించారు. కమిటీకి ఈఆర్టీ, జీపీఆర్ టెస్టుల నివేదికలు.. మేడిగడ్డ బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్‌కి సంబంధించిన 20 రకాల సమాచారాన్ని గతంలో ఎన్డీఎస్ఏ కోరింది. తాజాగా నిపుణుల కమిటీ మొత్తంగా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన ఇదే 20 రకాల సమాచారాన్ని సమర్పించాలని కోరగా, నీటిపారుదల శాఖ అందించింది. దాదాపు 90శాతం సమాచారాన్ని వెంటనే నాలుగు బ్యాగుల్లో నింపి అప్పగించామని, వాటి బరువు 100 కేజీల కంటే ఎక్కువే ఉంటుందని అధికారవర్గాలు తెలిపాయి. సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదిక ఇవ్వండి: ఈఎన్సీ(జనరల్) అనిల్ ప్రాణహిత నదికి ఏటా మే నుంచే వరదలు ప్రారంభమవుతాయని, బ్యారేజీలకి మరింత నష్టం జరగకుండా ఆ లోపే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, మరమ్మతులను సూచిస్తూ సాధ్యమైనంత త్వరగా మధ్యంతర నివేదికను అందించాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ(జనరల్) అనిల్‌కుమార్ నిపుణుల కమిటీకి విజ్ఞప్తి చేయగా, కమిటీ సానుకూలంగా స్పందించింది. నీటిపారుదల శాఖ అందించిన సమాచారంపై లోతుగా అధ్యయనం జరపడానికే కమిటీకి కనీసం నెల రోజుల సమయం పట్టనుందని అధికారులు అంటున్నారు. జాతీయ డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం వేసిన డ్యామ్ సేఫ్టీ రివ్యూప్యానల్(డీఎస్ఆర్పీ) తయారుచేసిన నివేదికను ఎన్డీఎస్ నిపుణుల కమిటీకి అందించారు. అన్నారం, సుందిళ్లలో సీపేజీల కట్టడికి గ్రౌటింగ్ చేయాలని, మేడిగడ్డ బ్యారేజీ అప్/ డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాకులతో పాటు బ్యారేజీ కుంగిన చోట అదనంగా సీకెంట్ పైల్స్, స్టీల్ పైల్స్ వేసి... తాత్కాలికంగా మరమ్మతులు చేయాలని ఆ కమిటీ నివేదిక ఇచ్చింది. ఇక వానాకాలంలో బ్యారేజీల గేట్లన్నీ తెరిచే ఉంచాలని, వరదలన్నీ పూర్తిస్థాయిలో తగ్గాకే గేట్లు దించాలని కమిటీ గుర్తు చేసింది. మాజీ ఈఎన్సీలు దూరం.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వాములైన రిటైర్డ్ ఇంజనీర్లు సైతం నిపుణుల కమిటీ ముందుకు హాజరు కావాలని నీటిపారుదల శాఖ ఆదేశించగా, ఇద్దరు మాజీ ఈఎన్సీలు సి. మురళీధర్, నల్లా వెంకటేశ్వర్లు దూరంగా ఉన్నారు. నిపుణుల కమిటీ పిలిస్తే వస్తానని పూర్వ ఈఎన్సీ (జనరల్) సి.మురళీధర్ సమ్మతి తెలిపి... హైదరాబాద్‌లోనే అందుబాటులో ఉండగా, ఆరోగ్యం బాగాలేదని మాజీ రామగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు హాజరు కాలేదు. -
మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు
సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీకి తప్పుడు మార్గంలో వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఈఈ), సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్ 10న మహదేవపూర్ డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు ఎల్ అండ్ టీకి ‘సబ్‌స్టాన్షియల్ కన్స్ట్రక్షన్ కంప్లీషన్ సర్టిఫికెట్’ను జారీచేశారు. దానిపై నాటి సూపరింటెండింగ్ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్‌నగర్ జిల్లా చీఫ్ ఇంజనీర్ రమణారెడ్డి కౌంటర్ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను సైతం విడుదల చేశారు. 2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ వర్తిస్తుందని నాటి ఈఎన్సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్ అండ్ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. -
స్త్రీ సాధికారతతోనే దేశ పురోగమనం
ప్రపంచంలో వేగంగా వస్తున్న మార్పులను అనుసరించి భారతీయ సమాజం కూడా ఆధునికీకరణ చెందుతోంది. విద్య, వైద్యం, ఆరోగ్య, వాణిజ్య, పారిశ్రామిక, పర్యావరణ, సాంకేతిక రంగాల్లో స్త్రీలు దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు స్త్రీలు అంకురార్పణ చేస్తున్నారు. సుమారు వందమంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు చంద్రయాన్–3 మిషన్‌లో కీలక సేవల్ని అందించారు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిణామంలోనూ స్త్రీలు వారి ప్రతిభను చూపుతూనే వున్నారు. ఇది వారి వ్యక్తిత్వంలోని ఔన్నత్యం. వివక్ష, అణిచివేత వారిని నిలువరించలేక పోతున్నాయి. అయితే స్త్రీల రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెరిగినప్పుడే సమానత్వం పునాదిగా కలిగిన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. అన్ని రంగాల్లో ప్రాముఖ్యతను సాధించేందుకు, వివక్షకు వ్యతిరేకంగా స్త్రీలు యుద్ధం చేస్తూనే ఉన్నారు. గత రెండు సంవత్సరాల్లో ప్రకటించిన శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులలోస్త్రీలకు ఒక్కటి కూడా లభించలేదు. వీటిని ప్రతి సంవత్సరం 45 ఏళ్ళ లోపు వయసున్న 12 మంది అసాధారణ యువ శాస్త్రవేత్తలకు ఇస్తున్నారు. ఈ అంశంపై పలువురు మహిళా శాస్త్రవేత్తలు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏ రంగంలో అయినా సామర్థ్యాలను అంచనా వేసేటప్పుడు హేతుబద్ధత అవసరం. 1958 నుండి ఆరు దశాబ్దాలుగా 592 మంది భట్నాగర్ పుర స్కారాన్ని స్వీకరించారు. ఇప్పటి వరకు 20 మంది మహిళా శాస్త్ర వేత్తలకు మాత్రమే ఈ అవార్డు లభించింది. మహిళలు తమ కుటుంబ, సమాజ బాధ్యతలు పూరించేందుకుగానూ కోల్పోయిన కెరీర్ సంవ త్సరాలను వారి జీవ సంబంధ వయస్సుతో నిర్ణయించకుండా, ‘అకడమిక్’ వయసుతో పరిగణించాలని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. నోబెల్ బహుమతి గ్రహితల్లో స్త్రీకి ప్రాధాన్యం లేకపోవడంపై 2019లో ‘నేచర్’లో ఒక వ్యాసం ప్రచురితమైంది. ఈ వివక్షను వారు సైద్ధాంతికంగా అధ్యయనం చేసినపుడు పలు ఆసక్తికర విషయాలు వెల్లడైనాయి. మహిళలకు అందుబాటులో వున్న వనరులు తక్కువగా ఉండటంతో, వారి ప్రచురణలు పురుషులతో పోల్చినప్పుడు తక్కు వగా వుంటున్నాయి. అధ్యాపక రంగంలో వున్న మహిళలు పురుషు లతో సమానంగా వారి ప్రచురణార్థం ఖర్చు చేసుకోలేక ప్రచురణలో వెనుకబడుతున్నారు. అసంఘటిత కార్మిక రంగంలో స్త్రీల ఉత్పాదక తపై పరిశోధన గావించిన క్లాడియా గోల్పిన్కు ఆర్థిక శాస్త్రంలో 2023లో నోబెల్ బహుమతి లభించిన నేపథ్యంలో ఈ చర్చ ప్రాధా న్యత సంతరించుకుంది. అయితే ఈ సంవత్సరం వివిధ రంగాల్లో నోబెల్ బహుమతి పొందినవారిలో మహిళా ప్రాతినిధ్యం పెరిగింది. మానవ నాగరికతను పరిశీలించినపుడు, ప్రతి కీలకమైన పరి ణామంలో స్త్రీ ప్రధాన భూమిక పోషించింది. బ్రిటీష్ వారి అణచి వేతను ఎదుర్కోవలసినప్పుడు ముందుండి పోరాటాన్ని నడిపించిన ధీర వనితలు ఎందరో దేశం కోసం అసువులు బాశారు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రం నుంచి కుల మతాలకు తావులేకుండా కొల్లిపర సీతమ్మ, కొర్రపాటి అంతమ్మ, నాదెళ్ళ రంగమ్మ, మల్లంపాటి రత్నమాణి క్యమ్మ, దోనేపూడి బాలమ్మ, గొర్రెపాటి సరస్వతమ్మ, మానేపల్లి సరళా దేవి, సూరపనేని వెంకట సుబ్బమ్మ, మిక్కిలినేని వరలక్ష్మమ్మ మొద లుగు మహిళామణులు స్వాతంత్య్రోద్యమ సమరాన్ని ముందుండి నడి పారు. పోరాటాలను భారతీయ మహిళలకు కొత్తగా నేర్పించా ల్సిన పనిలేదు. వారి మాతృత్వం, కరుణ, సమానత్వం వారి వ్యక్తిత్వ వికాసానికి పునాది. ఇటీవలే నూతన పార్లమెంటు భవనంలో చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తొలి బిల్లును ప్రవేశపెట్టారు. ఇది చారిత్రాత్మక నిర్ణయం. అసలు చట్ట సభల్లో 33 శాతం మహిళలకు కేటాయించాల్సిన ఆవశ్యకత భారతదేశానికి ఎందుకు కలిగిందో ఆలోచించాలి. 1970లో లోక్‌సభలో వీరి ప్రాధాన్యం 5 శాతంగా వుండగా, 2009లో అత్యధికంగా 15 శాతం మంది మహిళా ప్రతినిధులు లోక్‌సభలో ప్రవేశించారు. 12.7 శాతం ప్రతినిధులు రాజ్యసభలో సభ్యత్వం పొందగలిగారు. ఈ గణాంకాలు భారతీయ సమాజం సమానత్వానికి ఎంత దూరంలో వుందో స్పష్టం చేస్తున్నాయి. ఈ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవు తోంది. అయినా రాజకీయ రంగంలోని లింగవివక్షను రూపు మాపాలంటే, సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక అసమానతలను రూపు మాపాల్సి ఉంటుందని గుర్తించాలి. డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ అన్నట్లు ఆర్థిక స్వావలంబన భారతీయ సమాజంలో స్త్రీకి యింకా పూర్తిగా లభించలేదు. అందుకే వారి రాజకీయ ప్రాతినిధ్యం పది నుండి పదిహేను శాతానికి పరిమి తమైంది. నూతన నారీ శక్తి వందన చట్టం అమలులోకి వస్తే లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని మొత్తం సీట్లలో 33 శాతం మహిళలకు రిజర్వ్ అవుతాయి. ఎక్కువమంది స్త్రీలు నాయకులుగా ఈ దేశానికి అవసరం. స్త్రీ నాయకురాలైనపుడు వ్యవస్థలో నీతి, నిజాయితీ, నిస్వార్థ సేవ, మాతృస్వామ్య గుణం వర్ధిల్లుతాయి. వీరి సారథ్యంలో దేశం నిష్పాక్షికంగా పురోగతి సాధిస్తుంది. స్త్రీ సాధికారికతను వారి సుస్థిత ఆర్థిక ప్రగతి, పురోగతి నిర్దేశిస్తాయి. బహిరంగ ప్రదేశాల్లో భద్రత, సమానత్వం పెంపొందించడం ద్వారా మరింత మహిళా భాగస్వామ్యం మెరుగుపరచడానికి అవకాశం వుంటుంది. అదే విధంగా అసంఘటిత స్త్రీలు, విద్యాధికు లతో పోల్చినపుడు ఓటు హక్కును వినియోగించుకోవడంలో స్వేచ్ఛగా వ్యవహరిస్తున్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. విద్యావంతులైన స్త్రీలు రాజకీయ నాయకురాళ్ళుగా మరింత ఉత్సా హంగా భాగస్వాములు కావాల్సి వుంది. ఈ లక్ష్యాలు నెరవేరడానికి స్త్రీపై పెట్రేగిపోతున్న దమనకాండను నిలువరించాలి. విద్యార్జన కొరకు స్కూళ్ళకు, కాలేజీలకు వెళ్తున్న వారిపై జరుగుతున్న లైంగిక దాడుల నుండి సమాజం రక్షణ కల్పించాలి. ఆనాడే వారు అభివృద్ధిలో కీలక భాగస్వాములు కాగలుగుతారు. వారి జీవన గమనాన్ని నిర్దేశించే చట్టాల రూపకల్పనలో వారి వాణి బలంగా వినిపించాల్సి వుంది. రాజకీయాల్లో స్త్రీ పాత్రపై విశ్లేషించినపుడు పలు ఆసక్తికర అంశాలు ముందుకు వస్తున్నాయి. కేవలం ప్రాతినిధ్యం వలన రాజ కీయ సమానత్వం సాధ్యమేనా? క్రియాశీలక నిర్ణయాధికారానికి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల్లో సమర్థులుగా పరిగణింపబడుతున్నారా? మహిళల నేతృత్వంతో అభివృద్ధి ఆకాంక్షిస్తున్న వేళ కేవలం రాజకీయ ప్రాతినిధ్యం సరిపోదు. ఆయా పార్టీలు రాజకీయ అవగాహనా తరగ తులు నిర్వహించి వారిని ప్రోత్సహించవలసి వుంది. అనేక సందర్భాల్లో డిబేట్స్‌లో గానీ, సోషల్ మీడియాలో గానీ నాయకమణులుగా గొంతు విప్పుతున్న స్త్రీలు టార్గెట్ అవుతున్నారు. ఇది రాజకీయ చైతన్యవంతులుగా ముందుకు వస్తున్న వారిని నీరు గార్చుతుంది. వ్యక్తిగత దూషణలు శృతిమించుతున్నాయి. ఒక పార్టీకి ప్రతినిధులుగా ఎదిగిన స్త్రీలు కూడా అవతలి పార్టీలలో వున్న మహిళా నాయకురాళ్ళను దారుణంగా దుర్భాషలాడుతుండడం గమ నిస్తున్నాము. ఆయా రాజకీయ పార్టీల వేదికను గౌరవిస్తూనే, పార్టీల కతీతంగా స్త్రీలందరూ ఐక్యంగా నైతిక విలువలు పెంపొందించాలి. వ్యక్తిగత పోరు వల్ల రాజకీయాలలో వున్న స్త్రీ గౌరవం ఇనుమడించే అవకాశం లేదు. నేటి స్త్రీలు ఆయా రాజకీయ పార్టీల ఎజెండాలకు తలాడించే వారుగా వున్నారో లేదా స్వతంత్ర భావవ్యక్తీకరణ ద్వారా స్ఫూర్తిదాయకంగా వుండదల్చుకున్నారో నిర్ణయించుకోవాల్సిన సందర్భం యిది. రాజకీయ ప్రవేశం స్త్రీ ఔన్నత్యాన్ని, వ్యక్తిత్వాన్ని ఇనుమడింప జేసేదిగా వుంటే మరింత మంది మహిళా మణులు ఈ రంగంలో కదంతొక్కే అవకాశం వుంటుంది. మహిళా మణులు పురుషాధిక్య సమాజం చేతిలో పావులుగా మిగిలిపోతున్నారనే బాధ కలుగుతుంది. ఈ పరిస్థితి మారాలి. పార్టీ లకు అతీతంగా మహిళా నాయకురాళ్ళు ఎదుర్కొంటున్న అణచివేతకు వ్యతిరేకంగా గొంతెత్తాలి. అదే విధంగా అణగారిన మహిళలను ముందుకు నడిపించాలి. చట్టాల్ని రూపొందించే ప్రక్రియలో భాగస్వా మ్యమే అసమానతల్ని రూపుమాపే కార్యాచరణకు పునాది. సమా నత్వం పునాదిగా కలిగిన సమాజాన్ని నిర్మిద్దాం. డా‘‘ కత్తి సృజన వ్యాసకర్త అసిస్టెంట్ ప్రొఫెసర్, పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ -
జాబ్ కోసం సైకిల్ తొక్కుతున్న ఇంజినీర్లు!
ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ మరే ఉద్యగానికి ఉండదు. చిన్న ఉద్యోగమైనా చాలు లైఫ్ సెటిల్ అవుతుందని యువత భావిస్తుంటారు. అయితే కేరళ రాష్ట్రంలో ఉన్నత విద్యార్హత ఉన్న అభ్యర్థులు చాలా కిందిస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తున్నారు. కేరళలో ప్రభుత్వ కార్యాలయాలలో ప్యూన్ ఉద్యోగానికి అవసరమైన అర్హత 7వ తరగతి ఉత్తీర్ణత. దీంతోపాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. (టీసీఎస్‌లో మరో కొత్త సమస్య! ఆఫీస్‌కి రావాల్సిందే అన్నారు.. తీరా వెళ్తే..) ప్యూన్ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండకూడదని నిబంధన ఉన్ననప్పటికీ చాలా మంది బీటెక్ గ్రాడ్యుయేట్లు, ఇతర డిగ్రీ ఉత్తీర్ణులు ఏటా దరఖాస్తు చేస్తూనే ఉన్నారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే సైకిల్ పరీక్ష కోసం వరుసలో ఉంటున్నారు. గత రెండు రోజులుగా ఆ రాష్ట్రంలోని వివిధ కేంద్రాల వద్ద పెద్ద సంఖ్యలో డిగ్రీలు ఉన్న యువకులు సైకిల్‌తో వచ్చి తమ వంతు కోసం వేచి ఉంటున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ భద్రతే కారణం ప్రైవేటు ఉద్యోగాలంటే ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు ఊడతాయో తెలియదు. అదే ప్రభుత్వ ఉద్యోగం అయితే భద్రత ఉంటుందని యువత భావిస్తున్నారు. దీంతో కేరళ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దశాబ్దాలుగా అధిక డిమాండ్ ఉంది. అంతేకాకుండా పెళ్లిళ్ల విషయంలోనూ ప్రభుత్వ ఉద్యోగులకు అధిక ప్రాధాన్యత ఉండటం మరో కారణం. ప్యూన్ ఉద్యోగాలకు ఎంపికైనవారికి ప్రారంభ జీతం దాదాపు రూ. 23వేలు ఉంటుంది. దరఖాస్తుల్లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులను అక్టోబర్ 26, 27 తేదీల్లో సైక్లింగ్ పరీక్షకు పిలిచారు. గతంలో ఆఫీసు అసిస్టెంట్లు విధుల్లో భాగంగా సైకిళ్లపైనే వెళ్లాల్సి ఉండేది. ఇప్పుడా అవసరం లేకపోయినప్పటికీ, ప్యూన్ పోస్టుల కోసం ఇప్పటికీ సైక్లింగ్ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ పోస్టులకు అభ్యుర్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఎటాంటి డిగ్రీ లేదని డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయ అధికారి ఒకరు పేర్కొన్నారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. డిగ్రీ లేని వ్యక్తులు కేరళ రాష్ట్రంలో అరుదుగా కనిపిస్తారని చెప్పారు. సైక్లింగ్ పరీక్ష పూర్తయిన తర్వాత, ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది. దేశంలోనే అత్యధికంగా ఉద్యోగార్థులు ఉండే రాష్ట్రాల్లో కేరళ ఒకటి. -
అనంతపూర్ లో టీడీపీ నేత రౌడీయిజం
-
గుడ్ న్యూస్: ఎయిర్‌బస్‌లో భారీగా ఉద్యోగాలు
గ్లోబల్ ఏరోస్పేస్ మేజర్ ఎయిర్‌బస్ (Airbus) వచ్చే రెండేళ్లలో భారత్ నుంచి 2,000 మంది ఇంజనీర్లను నియమించుకోవాలని చూస్తోంది. తద్వారా సంస్థలో భారతీయ ఇంజనీర్ల మొత్తం సంఖ్యను 5,000కి తీసుకెళ్లాలని భావిస్తోంది. ఎయిర్‌బస్ ఇండియా ప్రెసిడెంట్, దక్షిణాసియా ఎండీ రెమి మెయిలార్డ్ మాట్లాడుతూ.. తాము భారత్‌ను కేవలం మార్కెట్‌గా మాత్రమే కాకుండా టాలెంట్ హబ్‌గా చూస్తున్నామన్నారు. కొత్త ఇంజనీరింగ్ కోర్సు ఎయిర్‌బస్.. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సమక్షంలో వడోదరలోని గతి శక్తి విశ్వవిద్యాలయ (GSV)తో ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఏరోస్పేస్ రంగంలో కొత్త ఇంజనీరింగ్ కోర్సును ప్రారంభించేందుకు ఈ ఒప్పందం మార్గం సుగమం చేసింది. గతి శక్తి విశ్వవిద్యాలయ భాగస్వామ్యంతో నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను అభివృద్ధి చేస్తామని, ఇది వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్ రంగానికి సేవలందించేందుకు భవిష్యత్తులో సిద్ధంగా ఉంటుందని మెయిలార్డ్ తెలిపారు. (Google: ప్రభుత్వ ఉద్యోగులకు గూగుల్ బంపరాఫర్.. ) ఎయిర్‌బస్ సంస్థలోని డిజైన్, డిజిటల్ కేంద్రాలలో ఇప్పిటికే 3,000 మందికిపైగా భారతీయ ఇంజనీర్లు పనిచేస్తున్నారని, 2025 నాటికి ఈ సంఖ్యను 5,000లకు పైగా పెంచుతామని మెయిలార్డ్ వివరించారు. భారత్ శక్తిసామర్థ్యాలపై తమకు పూర్తి విశ్వాసం ఉందని, అందుకే ఇక్కడ పెట్టుబడులు పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఇక మొదటి మేక్-ఇన్-ఇండియా C295 మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను 2026 సెప్టెంబర్‌లో డెలివరీ చేయనున్నట్లు చెప్పారు. -
దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేం
హఫీజ్‌పేట్: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర మరువలేమని, ఇంజినిరింగ్ ఫీల్డ్ ఎంతో విలువైనదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఎస్కీ) ప్రాంగణంలో ది ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ–20 సమ్మిట్, అంతర్జాతీయ సదస్సును ఆమె జ్యోతి వెలిగించి ఆమె ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఇంజినీర్లు భారతదేశంతోనే కాకుండా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కూడా సమగ్ర అభివృద్ధికి కావాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి వారికి అందరికీ అందేలా చేయాల్సిన అవసరాన్ని కూడా గుర్తించాలన్నారు. ఇంజినీరింగ్ రంగంలో ఉండే వాళ్లు మొదట వారి అమ్మను సంతోషపరిచేలా చేస్తే దేశాన్ని కూడా సంతోషపరిచేలా చేస్తారన్నారు. 2030 నాటికి విద్యుత్‌కు ప్రత్యామ్నాంపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించడం మంచి నిర్ణయమన్నారు. ప్రతియేటా దశాబ్దాలుగా విద్యుత్ రంగంలో 50 మిలియన్ కొత్త కనెక్షన్లు అందిస్తున్నామని, ఇవి మరింత పెరిగేలా చూడాలన్నారు. విద్యుత్‌కు ప్రత్యామ్నాయం ఆలోచిస్తే పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో తోడ్పడుతుందన్నారు. 2070 ఎనర్జీ డిమాండ్ గణనీయంగా పెరగడంపై అందరూ దృష్టి పెట్టాలన్నారు. సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై పెద్ద ఎత్తున దృష్టి పెట్టడం సంతోషించదగ్గవిషయమని, 70 నుంచి 80 శాతం విద్యుత్‌ను సోలార్ ద్వారా వినియోగించేలా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంటుందన్నారు. భారత దేశం ఆర్థిక రంగం ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో మరింత పటిష్టంగా మారుతోందన్నారు. చంద్రుడిపై అడుగిడడం కూడా శాస్త్రవేత్తలు, ఇంజినీర్ల పాత్ర మరువలేనిదని, అందరినీ అభినందిం చాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం సదస్సు బ్రోచర్‌ను గవర్నర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా అధ్యక్షుడు శివానంద్ రాయ్, ఆర్టనైజింగ్ కమిటీ చైర్మన్ పి సూర్యప్రకాశ్, ‘ఎస్కీ’ డైరెక్టర్ డాక్టర జి రామేశ్వరరావు ప్రసంగించారు. తర్వాత జరిగిన చర్చా కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ మాజీ సభ్యుడు ప్రొఫెసర్ కీరిట్పారిఖ్, ఐఈఐ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ ఐ సత్యనారాయణరాజు, సెంటర్ ఫర్ సోషల్ ఎకనామిక్ ప్రొగ్రెస్ సీనియర్ ఫెల్లో రాహుల్టాంగియా,రీ సస్టేనబిలిటీ లిమిటెడ్, రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర పీజీ శాస్త్రి, హడ్కో సీఎండీ వి సురే‹Ù, ప్రణాళికాసంఘం మాజీ కమిషనర్ అశోక్‌కుమార్ జైన్ పాల్గొన్నారు. -
మహిళా ఇంజనీర్లకు టాటా టెక్నాలజీస్ ప్రాధాన్యం
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఇంజనీరింగ్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ డిజిటల్ సేవల సంస్థ టాటా టెక్నాలజీస్ మరింత మంది మహిళలను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తోంది. కార్యాలయాల్లో లింగ వైవిధ్యాన్ని పాటించే క్రమంలో ’రెయిన్బో’ కార్యక్రమం కింద 2023–24 ఆర్థిక సంవత్సరంలో 1,000 మంది పైగా మహిళా ఇంజనీర్లను తీసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది. అలాగే, నాయకత్వ బాధ్యతలను చేపట్టేలా మహిళా ఉద్యోగులను తీర్చిదిద్దే దిశగా ఆరు నెలల లీడర్‌బ్రిడ్జ్–వింగ్స్ ప్రోగ్రామ్‌ను రూపొందించినట్లు వివరించింది. ఉద్యోగినులు నాయకత్వ సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు ఇది ఉపయోగపడగలదని టాటా టెక్నాలజీస్ వివరించింది. సంస్థలో సమ్మిళిత సంస్కృతిని పెంపొందించేందుకు, ఉద్యోగులు చురుగ్గా పాలుపంచుకునేందుకు మరిన్ని కొత్త ప్లాట్‌ఫామ్‌లను కూడా ఆవిష్కరిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. -
6జీ టెక్నాలజీలో భారతీయులకు 100 పేటెంట్లు
న్యూఢిల్లీ: 6జీ టెక్నాలజీకి సంబంధించి భారతీయ సైంటిస్టులు, ఇంజినీర్లు, విద్యావేత్తలకు 100 పేటెంట్లు ఉన్నాయని కేంద్ర ఐటీ, టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్ అనేది చాలా సంక్లిష్టమైన అంశం అయినప్పటికీ మనవారు ఆ రంగంలో గణనీయ పురోగతి సాధిస్తున్నారని చెప్పారు. పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన భారత్ స్టార్టప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు వివరించారు. 5జీ నెట్వర్క్ విస్తరణ .. ప్రభుత్వం నిర్దేశించిన 200 నగరాలను కూడా దాటి ప్రస్తుతం 397 నగరాలకు చేరిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం 3.5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఉన్న భారత్.. పాలన, మౌలిక సదుపాయాలు, వ్యాపారాల నిర్వహణలో మార్పులతో ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగగలదని వైష్ణవ్ పేర్కొన్నారు. ఆ దిశగా అందరూ కృషి చేస్తే .. 30 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా భారత్ ఆవిర్భవించడాన్ని ఏ శక్తీ ఆపలేదని ఆయన చెప్పారు. -
శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు
సాక్షి,ముంబై: దక్షిణకొరియా దిగ్గజం శాంసంగ్ ఇండియా శుభవార్త అందించింది.టాప్ కంపెనీల్లో లక్షల కొద్దీ ఉద్యోగాలు కోల్పోతున్న సమయంలో శాంసంగ్ ఇండియా ఉద్యోగ నియామకాలను ప్రకటించి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు భారీ ఊరట నిచ్చింది. దాదాపు వెయ్యి మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. (ఎన్డీటీవీ: ప్రణయ్ రాయ్, రాధిక గుడ్‌బై, కేటీఆర్ ఏం చేశారంటే?) కంప్యూటర్ సైన్స్, అనుబంధ శాఖలు (AI/ML/కంప్యూటర్ విజన్/VLSI), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎంబెడెడ్ సిస్టమ్స్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లలో ఇంజనీర్లను రిక్రూట్ చేయనున్నట్లు శాంసంగ్ వెల్లడించింది. భారతదేశ కేంద్రీకృత ఆవిష్కరణలతో సహా, ప్రజల జీవితాలను సుసంపన్నం చేసే ఆవిష్కరణలు, సాంకేతికతలు, ఉత్పత్తుల, డిజైన్లపై వీరు పనిచేస్తారని, డిజిటల్ ఇండియాను శక్తివంతం చేయాలనే తమ విజన్‌ను మరింత మెరుగుపరుస్తుందని శాంసంగ్ ఇండియా హ్యూమన్ రిసోర్సెస్ హెడ్ సమీర్ వాధావన్ అన్నారు. బెంగళూరు, నోయిడా, ఢిల్లీ, బెంగళూరులోని రీసెర్చ్, అండ్ డెవలప్మెంట్ కేంద్రాల కోసం సుమారు 1000 మందిని నియమించుకోనుంది. దీనికి అదనంగా మేథ్స్, కంప్యూటింగ్ లేదా సాఫ్ట్వేర్ ఇంజనీర్లను నియమించుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఇమేజ్ ప్రాసెసింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT), కనెక్టివిటీ, క్లౌడ్, బిగ్ డేటా, బిజినెస్ ఇంటెలిజెన్స్, ప్రిడిక్టివ్ అనాలిసిస్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లు, సిస్టమ్ ఆన్‌లో పనిచేసేలా ఈ ఇంజనీర్లను 2023లో కంపెనీలో చేర్చుకుంటామని శాంసంగ్ తెలిపింది. పరిశోధనా కేంద్రాలు మల్టీ-కెమెరా సొల్యూషన్లు, టెలివిజన్లు, డిజిటల్ అప్లికేషన్లు, 5G, 6G అల్ట్రా-వైడ్‌బ్యాండ్ వైర్లెస్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్ లాంటి రంగాలలో 7,500కి పైగా పేటెంట్లను దాఖలు చేశాయి. ఈ పేటెంట్లలో చాలా వరకు శాంసంగ్ ఫ్లాగ్షిప్ గెలాక్సీ స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు,డిజిటల్ అప్లికేషన్లున్నాయి. అలాగే ఇండియాలో తయారైన ఆవిష్కరణలతో నంబర్ పేటెంట్ ఫైలర్గా నిలిచిందినీ, నేషనల్ IP అవార్డు 2021, 2022ని కూడా గెలుచుకుందని కంపెనీ తెలిపింది. -
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే?
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు అమెరికా ఇంజనీర్లు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఎల్ఎస్ఎస్టీ డిజిటల్ కెమెరా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ అన్ని భాగాలను అమర్చారు. ఆపరేట్ చేసి ఫోటోలు తీసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఎల్ఎస్ఎస్టీ కెమెరా అంటే? ఎల్ఎస్ఎస్టీ అంటే 'లార్జెస్ట్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్' డిజిటల్ కెమెరా. ఉత్తర చీలిలోని 2,682 మీటర్ల ఎత్తయిన పర్వతం సెర్రో పచోన్ అంచున 2023లో ఏఫ్రిల్‌లో దీన్ని అమర్చనున్నారు. భూమిపై పరిశోధలనకు ఈ ప్రాంతం అత్యంత అనువైంది. జెమినీ సౌత్, సౌథర్న్ ఆస్ట్రోఫిజికల్ రీసెర్చ్ టెలిస్కోప్‌లు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డిజిటల్ కెమెరాలోని సెన్సార్లు అత్యాధునిక ఐఫోన్ 14 ప్రోతో పోల్చితే చాలా రెట్లు అధికం. దీని ఓవరాల్ రిజొల్యూషన్ 3.2 గిగాపెక్సెల్స్ లేదా 3200 మెగా పిక్సెళ్లు. అంటే 266 ఐఫోన్ 14ప్రో ఫోన్లతో ఇది సమానం. ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు. ఇది చిన్న కారు సైజు పరిమాణం, మూడు టన్నుల బరువుంటుంది. చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! -
పవర్ ఆఫ్ సారీ: రూ. 6 లక్షలతో..50 కోట్లు వచ్చాయ్!
సాక్షి,ముంబై: ఇంజనీర్లు చేస్తున్న ఉద్యోగం వారికి సంతృప్తి ఇవ్వలేదు. దీనికిమించి ఇంకేదో చేయాలని గట్టిగా అనుకున్నారు. ఆ ఆలోచన ‘సుత’ అనే చీరల బ్రాండ్ ఆవిష్కారానికి నాంది పలికింది. తమదైన ప్రతిభ, చొరవతో రాణిస్తూ సక్సెస్‌పుల్ విమెన్ ఆంట్రప్రెన్యూర్స్‌గా అవతరించారు. చెరొక మూడు లక్షల రూపాయల పెట్టుబడితో ప్రారంభించిన వ్యాపారం కేవలం ఆరేళ్లలో ఇపుడు 50 కోట్లకు చేరింది. బిజినెస్ టుడే కథనం ప్రకారం ముంబైకి చెందిన సుజాత (36) తానియా (34) ఇద్దరూ ఇంజనీర్లుగా పనిచేసేవారు. కొన్నాళ్ల తరువాత మరింత కష్టపడి ‘ప్రభావవంతమైన’ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే పెద్దపెద్ద వ్యాపారాలు చేయాలన ఆలోచనలేనప్పటికీ, చీరల పట్ల మక్కువతో చీరల బిజినెస్ బావుంటుందని నిశ్చయించు కున్నారు. పైగా ఇద్దరికీ భారతీయ సాంప్రదాయ దుస్తులు, తీరుతెన్నులపై మంచి అవగాహన ఉంది. అలా తమ ఇరువురి పేర్లలోని సు, త అనే మొదటి రెండు అక్షరాలతో ‘సుత’ (Suta) బ్రాండ్‌ని సృష్టించారు. photo courtesy : BusinessToday.In ఒక్కొక్కరు రూ.3 లక్షలు వెచ్చించి రూ.6 లక్షల కార్పస్ ఫండ్‌తో మొదలుపెట్టారు. అలా ఇన్‌స్టాగ్రాంలో పాపులర్ బ్రాండ్‌గా అవతరించింది. అలా అంచెలంచెలుగా విస్తరిస్తూ గత ఏడాది తమ వ్యాపారాన్ని 50 కోట్ల ఆదాయం సాధించే స్థాయికి తెచ్చారు. ఇప్పుడిక భౌతిక దుకాణాలను తెరవడానికి సిద్ధంగా ఉన్నారు. సాంప్రదాయ,నేత దుస్తులు, నేతన్నలపై లోతైన పరిశోధన చేశారు. మొదట్లో బెంగాల్, ఫూలియా, బిష్ణుపూర్, రాజ్పూర్, ధనియాఖలి వంటి గ్రామాలు, ఒరిస్సాతో పాటు చీరలకోసం అవసరమైన ప్రతిచోటికీ వెళ్లారు. అలా మొదట్లో అల్మారలో మొదలైన ప్రస్థానం గిడ్డంగిని అద్దెకు తీసుకునేదాకా శరవేగంగా వృద్ధిచెందేలా పరుగులు పెట్టించారు. కరోనా మహమ్మారి తరువాత అందరూ ఆన్లైన్ స్టోర్ల వైపు మొగ్గుచూపుతోంటే..లాక్డౌన్లు ముగిసిన వెంటనే భౌతిక దుకాణాలను తెరవాలని సుతా ప్లాన్ చేస్తోంది. ఎందుకంటే దుస్తులు, ముఖ్యంగా చీరల షాపింగ్ ఆన్లైన్లో కంటే భౌతికంగా చూసిన తరువాత కొనడానికి ఇష్టపడతారు. అందుకే కోల్‌కతాలో ఒకటి ప్రారంభించగా, త్వరలోనే బెంగుళూరులో తొలి ఫ్లాగ్షిప్ స్టోర్‌ను ప్రారంభించబోతున్నారు. photo courtesy : BusinessToday.In తమ దగ్గర చీరలు సాధారణంగా రూ.2,500 నుంచి రూ.3,500 వరకు ఉంటాయని చెప్పారు. ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్‌ను బాగా స్టడీ చేయాలంటున్నారు. అంతేకాదు అక్కాచెల్లెళ్లుగా చిన్నచిన్న విషయాలపై పోట్లాడుకున్నా.. బిజినెస్ విషయంలోమాత్రం చాలా దృఢంగా ఉంటామని చెప్పారు. అలాగే సెల్ఫ్ ఫండింగ్‌తో నిర్వహించిన తమ బిజినెస్‌ను వీలైనంతవరకు అలాగే కొనసాగిస్తామని సుజాత ధీమా వ్యక్తం చేశారు. -
టెకీలకు గుడ్ న్యూస్: 2 వేల ఉద్యోగాలు
సాక్షి, ముంబై: సాఫ్ట్ వేర్ సేవల సంస్థ జోహో కార్పొరేషన్ టెకీలకు గుడ్ న్యూస్ చెప్పింది. తమ కార్య కలాపాలను విస్తరించుకునే ప్రణాళికలో భాగంగా త్వరలో 2వేల మంది ఉద్యోగులను ఎంపిక చేయనున్నట్టు వెల్లడించింది. ఇంజనీరింగ్, డిజైన్, కంటెంట్ సేల్స్‌లో విభాగంలో ఈ నియామకాలు ఉంటాయని కంపెనీ ప్రకటించింది. అనేక దిగ్గజ టెక్ సంస్థలు సహా, అనేక స్టార్టప్‌లు సిబ్బందిని తొలగిస్తున్న తరుణంలో, సాఫ్ట్వేర్-యాజ్-ఎ-సర్వీస్ (SaaS) స్టార్టప్ జోహా భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలపై దృష్టిపెట్టింది. ఇంజనీరింగ్, వెబ్ డెవలపర్లు, డిజైనర్లు, ఉత్పత్తి విక్రయదారులు, రైటర్లు, సపోర్ట్ ఇంజనీర్ విభాగం కనీసం 2,000 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అకౌంటింగ్, పేరోల్ హెడ్ ప్రశాంత్ గంటి నేషనల్ మీడియాకు వెల్లడించారు. కంపెనీ ఇప్పటికే స్థానికంగా నియామకాలను ప్రారంభించామని, స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్ వంటి అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని యోచిస్తున్నట్టు తెలిపారు కాగా ప్రపంచవ్యాప్తంగాసుమారు 10వేల 800 ఉద్యోగులతో, జోహో ఇండియా, అమెరికాలో విస్తృత సేవలు అందిస్తోంది. ఇటీవల ఈజిప్ట్, జెడ్డా, సౌత్ ఆఫ్రికా, కేప్ టౌన్ లాంటి ప్రాంతాలకు విస్తరించింది. ఈ నేపథ్యంలోనే గ్రామీణ భారతదేశంలోని టాలెంట్‌ను అందిపుచ్చుకోవాలని చూస్తోందట. -
చిక్కుల్లో మరో ఐఏఎస్..: ఇంజనీర్లపై బూతులు, అరెస్టు
శ్రీనగర్: కుక్కను వాకింగ్‌కు తీసుకెళ్లేందుకు ఢిల్లీలో స్టేడియాన్నే ఖాళీ చేయించి, చివరికి శంకరగిరి మాన్యాలు పట్టిన ఓ ఐఏఎస్ అధికారుల జంట నిర్వాకాన్ని మర్చిపోకముందే అలాంటిదే మరో ఉదంతం తెరపైకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కుడి భుజంగా చెప్పే ఐఏఎస్ అధికారి నితేశ్వర్ కుమార్ తమను అకారణంగా బూతులు తిట్టడమే గాక అక్రమంగా అరెస్టు చేయించారంటూ సీపీడబ్ల్యూడీ ఇంజనీర్లు ఆరోపించారు. అమర్నాథ్ ఆలయ బోర్డు సీఈఓ అయిన నితేశ్వర్ మే 25న స్థానిక నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ‘‘పనులు పెండింగ్‌లో ఉన్నాయంటూ ఆ సందర్భంగా ఇంజనీర్లపై ఆయన అకారణంగా ఆగ్రహించారు. సంయమనం కోల్పోయి నోటికొచ్చినట్టు బూతులు తిట్టారు. అంతటితో ఆగకుండా తన వెంట ఉన్న ఎస్పీని ఆదేశించి ఇద్దరు ఇంజనీర్లను అరెస్టు కూడా చేయించారు’’ అని ఇంజనీర్లు చెప్పారు. నితేశ్వర్ తీరును సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఆయనను అరెస్టు చేయాలని కోరుతూ కేంద్ర హౌజింగ్ మంత్రి హర్దీప్ సింగ్ పురీకి లేఖ రాసింది. -
కష్టాలు వెంటాడుతున్నా ‘తగ్గేదే లే’.. ఒక్కోమెట్టూ ఎక్కుతూ..
పేదరికం అడ్డొచ్చినా, కష్టాలు వెంటాడుతున్నా వెనక్కి తగ్గలేదు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ సహకారంతో ఉన్నత విద్యనభ్యసించారు. ఒక్కోమెట్టూ ఎక్కుతూ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. తాము సంపాదించిన మొత్తంలో కొంత స్వగ్రామాలకు, మరికొంత పేద విద్యార్థులకు వెచ్చిస్తూ సేవా కార్యక్రమాల్లో తరిస్తున్నారు.. వెంకటగిరి నియోజకవర్గంలోని సాఫ్ట్వేర్ ఉద్యోగులు. బిడ్డలు పెద్దవాళ్లయిన తర్వాత పేగుబంధాన్ని మరిచి తల్లిదండ్రులను ఒంటరివాళ్లను చేస్తున్న ఈ రోజుల్లో.. తాము ఉన్నతంగా స్థిరపడినా కుటుంబానికి వెన్నంటే ఉంటున్నారు. పుట్టిన ఊరి రుణం తీర్చుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామీణ సాఫ్ట్వేర్ ఇంజినీర్లపై ‘సాక్షి’ స్పెషల్ ఫోకస్. చదవండి: వింత అచారం: వరుడు వధువుగా.. వధువు వరుడిగా.. వెంకటగిరి(తిరుపతి జిల్లా): ఒకప్పుడు పల్లెటూళ్లంటే పాడుబడిన పూరిళ్లు.. చదువూసంధ్యలేని ప్రజలు. ఇప్పుడు కాలం మారింది. చదువుపై ఆసక్తి పెరిగింది. తాము పడ్డ కష్టాలు బిడ్డలు పడకూడదని తల్లిదండ్రులు నిశ్చయించుకుంటున్నారు. కూలిపనులు చేసి కూడా పైసాపైసా కూడబెట్టి ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ బిడ్డలు ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా, డాక్టర్లుగా రాణిస్తున్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో ఏ గ్రామానికి వెళ్లినా సాఫ్ట్వేర్ ఇంజినీర్లే దర్శనమిస్తున్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, ప్రభుత్వ ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఉన్నత చదువులు చదువుతున్నారు. సీనియర్లను స్ఫూర్తిగా తీసుకుని జూనియర్లు కూడా ఇంజీనీరింగ్ వైపు అడుగులు వేస్తున్నారు. లక్షల్లో వేత నాలు పొందుతూ ఊరి రుణం తీర్చుకుంటున్నారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు కేరాఫ్ అడ్రస్ కమ్మవారిపల్లె నియోజకవర్గంలోని డక్కిలి మండలం, కమ్మవారిపల్లిలోనే 45 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉన్నారు. 120 ఇళ్లు ఉన్న ఈ గ్రామంలో చాలామంది ఉన్నత విద్యనభ్యసించి వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. దళితవాడకు చెందిన పెంచలయ్య కుమార్తె జ్యోతి ఎంబీబీఎస్, కుమారుడు ప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా రాణిస్తున్నారు. ఓపిక ఉన్నంత వరకు కూలి పనులు చేస్తామని చెబుతున్నారు. తమ బిడ్డల సంపాదనతో ఇంట్లో అన్ని సౌకర్యాలు సమకూరాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ►డక్కిలి మండలం, కొత్తనాలపాడు గ్రామానికి చెందిన పీ.కృష్ణయ్య పైసాపైసా కూడబెట్టి తన కుమారుడు వెంకటేశ్వర్లును ఎంసీఐ వరకు చదివించాడు. ప్రస్తుతం వెంకటేశ్వర్లు చెన్నై హెచ్‌సీఎల్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్‌గా పనిచేస్తున్నారు. నెలకు రూ.1.8 లక్షల వేతనం. ►వెంకటగిరి మండలం, సిద్ధవరం గ్రామానికి చెందిన సుబ్బరాయుడుకు రాజేష్, రాఘవ ఇద్దరు కుమారులు. ఉన్న ఎకరా పొలాన్ని విక్రయించి పిల్లలను నెల్లూరులోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంటర్మీడియెట్ చదివించాడు. అనంతరం ప్రభుత్వం అందించిన సహకారం, ఫీజురీయింబర్స్‌మెంట్‌తో ఇంజినీరింగ్ వరకు చదివించాడు. తండ్రి కలలను సాకారం చేస్తూ బెంగళూరు, చెన్నైలో సాఫ్ట్వేర్లుగా స్థిరపడ్డారు. సాఫ్ట్వేర్ ఉద్యోగంపై మక్కువ ఎక్కువ నియోజకవర్గంలోని డక్కిలి మండలం, ఆల్తూరుపాడు గ్రామంలో సాఫ్ట్వేర్ ఉద్యోగం పొందిన కే.చైతన్య, చంద్రశేఖర్‌రెడ్డి తదితర యువకుల స్ఫూర్తితో పదులు సంఖ్యలో సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. రూ.లక్షల్లో జీతాలు ఉండడంతో తాము కూడా సాఫ్ట్‌వేర్‌గా ఎదగాలన్న కసి స్థానికుల నుంచి వ్యక్తమవుతోంది. మోపూరు, పాతనాలపాడు, కోత్తనాలపాడు, చాపలపల్లి, మిట్టపాళెం, కమ్మపల్లి, వల్లివేడు, యాతలూరు వంటి గ్రామాల్లోని ప్రతివీధిలో ఇద్దరోముగ్గురో సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉండడం గమనార్హం. తల్లిదండ్రలు కూడా తమ బిడ్డలు సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగానే స్థిరపడాలని కోరుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో వన్నెతగ్గని ఉద్యోగం రెండేళ్లుగా కరోనా కష్టాల్లోనూ సాఫ్ట్వేర్ రంగానికి ఎక్కడా డిమాండ్ తగ్గలేదు. సాఫ్ట్వేర్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇళ్ల నుంచి (వర్క్ ఫ్రం హోం) విధులు చేయించుకున్నాయి. కమ్మవారిపల్లి, కోత్తనాలపాడు, మోపూరు, ఆల్లూరుపాడు, డక్కిలి గ్రామాల్లో వందల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇళ్ల నుంచే తమ విధులు నిర్వహించారు. తల్లిదండ్రలతో పాటు బంధువులకు దగ్గరగా జీవనం సాగించారు. -
Anand Mahindra: ఇంజనీర్లు.. కాస్త మన అవసరాలు గుర్తించండయ్యా!
కార్పొరేట్ ప్రపంచంలో క్షణం తీరిక లేకుండా ఉన్నా.. దేశంలో క్షేత్రస్థాయిలో జరిగే అంశాలపై దృష్టి పెట్టే ఇండస్ట్రియలిస్టులో ఆనంద్ మహీంద్రా ఒకరు. సోషల్ మీడియాలో అంశాలను గమనిస్తూ.. సీరియస్ అంశాలపై రెగ్యులర్‌గా స్పందిస్తుంటారు. తాజాగా తన కంపెనీపైనే ఆయన సెటైర్ వేశారు. అదే సమయంలో ఓ సీరియస్ అంశాన్ని ట్విట్టర్ వేదికగా లేవనెత్తారు. ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేసిన వీడియోలో ఓవర్ లోడ్‌తో ఉన్న ఓ వాహానం దాదాపుగా అదుపు తప్పి పోతుంది. ముందు టైర్లు గాలిలో లేవగా అక్కడున్న ఇద్దరు ప్రమాదపుటంచుల వరకు వెళ్లారు. చివరకు ఎవరికీ ఏ ప్రమాదం జరగలేదు. ఈ వీడియోను చూస్తే వ్యవసాయ ఉత్పత్తులు ఓవర్ లోడ్ చేయడం వల్ల ట్రక్కుకి ఆ పరిస్థితి తలెత్తిందనే విషయం అర్థం అవుతుంది. కానీ ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను మరో కోణంలో చూశారు. The Auto Industry uses “Quality Function Deployment” (QFD) a structured approach to defining customer needs & translating them into specs of products to meet those needs. I don’t believe our engineers took these ‘needs’ into account when designing this Mahindra Supro Truck! 🙄 pic.twitter.com/CHGHj0Xwtz — anand mahindra (@anandmahindra) February 4, 2022 మన దేశీ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాహనాలను డిజైన్ చేయాలంటూ ఇంజనీర్లకు సలహా ఇచ్చారు. మన దగ్గర ఎక్కువ వినియోగం/ డిమాండ్‌లో ఉండే వాహనాలు అన్నీ ఓవర్‌లోడ్‌తో వెళ్తుంటాయి. ముఖ్యంగా రూరల్ ఇండియాలో ఈ తరహా దృష్యాలు సర్వసాధారణంగా కనిపిస్తుంటాయి. ఈ ఓవర్‌లోడ్ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని సేఫ్టీగా వాహనాలను తయారు చేయాలంటూ ఇంజనీర్లకు సూచించారు. వాహనం డిజైన్‌లో కీలక అంశాలతో ఆదాయం తక్కువగా ఉండే రూరల్ ఇండియా అగ్రికల్చర్ సెక్టార్‌ని దానిపై ఆధారపడే వాళ్ల అవసరాలు కూడా కీలకమన్నట్టుగా ఆనంద్ స్పందించారు. తన కంపెనీ వాహనం అదుపు తప్పడం, కొందరు ప్రమాదంలో పడటం వంటి అంశాలను కప్పిపుచ్చకుండా.. గ్రామీణ భారతీయుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయాలంటూ ఆనంద్ మహీంద్రా సూచించడంపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు వాహనం డిజైన్‌లో తప్పేమీ లేదని.. అంత ఓవర్ లోడ్ వేస్తే ఎలాగంటూ కామెంట్లు చేశారు. కాగా ఇండియన్ జుగాడ్‌కి సంబంధించి పలు వీడియోలు కూడా కొందరు పోస్ట్ చేశారు. చదవండి: Anand Mahindra : అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్.. ఇకపై వాటికి చెక్ -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్ల దుర్మరణం
సాక్షి, భువనేశ్వర్: కెంజొహర్ జిల్లాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజినీర్లు దుర్మరణం పాలయ్యారు. బాసుదేవ్‌పూర్ ప్రాంతంలో శనివారం ఉదయం ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. జోడా నుంచి చంపువా వెళ్తుండగా బాసుదేవ్‌పూర్ వద్ద వెనుక నుంచి వచ్చిన ట్రక్కు దూసుకు పోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలంలో ఒకరు మృతిచెందగా.. చంపువా ప్రభత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇంజినీర్ మృతిచెందాడు. కెంజొహర్ జిల్లా కొడొగొడియా ప్రాంతంలో భారీ నీటి సరఫరా ప్రాజెక్టు నిర్మాణం సమీక్షించేందుకు వెళ్తూ ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం. చంపువా ఠాణా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: అమానుషం: భర్త కంట్లో కారం చల్లి.. కుమారుడితో కలిసి.. -
జింజర్..పవర్ ఆఫ్ ఆల్ ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్
‘తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలు ఎవరు?’ అని అడిగితే చెప్పడం కష్టం కావచ్చుగానీ ‘జింజర్’ నిర్మాణానికి మేధోశక్తిని ఇచ్చిన వారు ఎవరు? అని అడిగితే జవాబు చెప్పడం మాత్రం సులభం! ఏమిటి జింజర్? ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్(ఐహెచ్సిఎల్), టాటా ప్రాజెక్ట్ లిమిటెడ్ ముంబైలోని శాంతక్రూజ్లో శ్రీకారం చుట్టిన జింజర్ హోటల్‌కు ఆల్–ఉమెన్ ఇంజినీరింగ్ టీమ్ నిర్మాణ సారథ్యం వహిస్తుంది. నిర్మాణరంగంలో స్త్రీల ఉన్నతావకాశాలకు సంబంధించి ఇది గొప్ప ముందడుగు అని చెప్పవచ్చు. ‘అనేక రంగాలలో స్త్రీలు తమను తాము నిరూపించుకుంటున్నారు. తమ ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఈ టీమ్ విజయం వారి వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం కాదు. నిర్మాణం, ఇంజినీరింగ్ రంగాలలో ఉన్నత అవకాశాలు వెదుక్కోవడానికి ఎంతోమంది మహిళలకు స్ఫూర్తి ఇస్తుంది’ అంటున్నారు ఐహెచ్సిఎల్ సీయివో పునీత్ చత్వాల్. ఆల్–ఉమెన్ టీమ్ ఏమిటి? మగవాళ్లు పనిచేయడానికి సుముఖంగా లేరా!...అంటూ అమాయకంగానో, అతి తెలివితోనో ఆశ్చర్యపోయేవాళ్లు ఉండొచ్చునేమో. అయితే అలాంటి అకారణ ఆశ్చర్యాలు స్త్రీల ప్రతిభ, శక్తిసామర్థ్యాల ముందు తలవంచుతాయని, వేనోళ్ల పొగుడుతాయని చరిత్ర చెబుతూనే ఉంది. కొన్నిసార్లు కట్టడాలు కట్టడాలుగానే ఉండవు. అందులో ప్రతి ఇటుక ఒక కథ చెబుతుంది. స్ఫూర్తిని ఇస్తుంది. శక్తిని ఇచ్చి ముందుకు నడిపిస్తుంది. 371 గదులతో నిర్మాణం కానున్న జింజర్ ఇలాంటి కట్టడమే అని చెప్పడానికి సందేహం అవసరం లేదు. -
పాకిస్తాన్లో భారీ పేలుళ్లు.. చైనా ఇంజినీర్లు మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో ఉగ్రవాదులు మరోసారి విరుచుకుపడ్డారు. చైనా ఇంజనీర్లు, పాకిస్తాన్ సైనికులతో వెళుతున్న బస్సు లక్ష్యంగా పేలుళ్లకు పాల్పడ్డారు. ఈ ఘటనలో నలుగురు చైనా ఇంజనీర్లు సహా ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఉత్తర పాకిస్తాన్లో బుధవారం ఈ విషాదం చోటు చేసుకుంది. దాసు ఆనకట్ట నిర్మాణ పనుల నిమిత్తం దాదాపు 30 మంది చైనా ఇంజినీర్లు, కార్మికులు బస్సులో వెళ్తుండగా ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వీరు జరిపిన ఐఈడీ పేలుళ్ల ధాటికి బస్సు లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చైనా ఇంజినీర్లు, ఇద్దరు పారామిలటరీ సిబ్బంది, మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఒక చైనా ఇంజినీర్, మరో సైనికుడు కనిపించకుండా పోయారని అధికారులు తెలిపారు. పలువురు తీవ్రంగా గాయపడగా, వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలను ప్రారంభించారు. మెరుగైన వైద్యం అందించే నిమిత్తం తీవ్రంగా గాయపడిని వారిని ఎయిర్ అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని తరలిస్తున్నారు. మరోవైపు సహాయ, రక్షణ చర్యలను ముమ్మరం చేశామని మొత్తం పరిస్థితిని సమీక్షిస్తున్నామని సీనియర్ ప్రభుత్వ అధికారి చెప్పారు. అయితే, పాక్ సైనికులు, చైనా ఇంజినీర్లు ప్రయాణిస్తున్న బస్సులోనే టెర్రరిస్టులు బాంబులు అమర్చారా? లేక రోడ్డు పక్కన అమర్చి పేలుళ్లకు పాల్పడ్డారా? అనే దానిపై స్పష్టత లేదు. -
ఇంజనీర్లకు ఉబెర్ గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న ఔత్సాహిక ఇంజినీర్లకు గుడ్ న్యూస్. క్యాబ్ అగ్రిగేటర్ ఉబెర్ బెంగళూరు, హైదరాబాద్‌లలో ఇంజనీర్లను నియమించుకుంటున్నట్లు బుధవారం ప్రకటించింది. దేశంలో తన ఇంజనీరింగ్ , ఉత్పత్తి కార్యకలాపాల పరిధిని విస్తరించే ప్రయత్నంలో 250 మంది ఇంజనీర్లను ఎంపిక చేయాలని భావిస్తున్నట్టు తెలిపింది. తద్వారా రైడర్, డ్రైవర్ వృద్ధి, డెలివరీ, ఈట్స్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కప్లైన్స్, మౌలిక సదుపాయాలు, అడ్టెక్, డేటా, భద్రత , ఫైనాన్స్ టెక్నాలజీ టీంను బలోపేతం చేయనున్నామని ఉబెర్ పేర్కొంది. విస్తరణ ప్రణాళికల్లో భాగంగా మొబిలిటీ, డెలివరీని మరింత అందుబాటులోకి తెచ్చే యోచనలో ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్, బెంగళూరు టెక్ సెంటర్లలో కొత్తగా ఇంజనీర్లను నియమించుకుంటామని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 10వేలకి పైగా నగరాల్లో రవాణాలో కీలకంగా మారాలని ఉబెర్ లక్ష్యంగా పెట్టుకున్నా మన్నారు. ఇందుకు హైదరాబాద్, బెంగళూరులోని తమ బృందాలు ప్రపంచ డిమాండ్‌కు అనుగుణంగా పనిచేస్తాయని తెలిపింది. ముఖ్యంగావివిధ పరిశ్రమ-మొదటి ఆవిష్కరణలకు మార్గదర్శకంగా ఉండనున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి సేవ చేసే ప్రయత్నాలలో భాగంగా నిపుణులైన ఇంజనీర్లను నియమించుకుంటామని, ఈ బృందాలద్వారా అన్ని గ్లోబల్ మార్కెట్లలో సవాళ్లను అధిగమించాలని భావిస్తున్నట్టు సంస్థ సీనియర్ ఇంజనీరింగ్ డైరెక్టర్ మణికందన్ తంగరత్నం వెల్లడించారు. చదవండి : Petrol, diesel prices: పెట్రో బాంబు, రికార్డు ధర వ్యాక్సినేషన్: టెస్లా కారు, ఇల్లు.. బహుమతుల బొనాంజా -
ఏళ్ల తరబడి తిష్ట: కదలరు.. వదలరు!
సాక్షి, విశాఖపట్నం: జీవీఎంసీలో ఉద్యోగం వచ్చిందంటే చాలు.. ఆ కుర్చీని వదిలేందుకు ఎవరూ ఇష్టపడటం లేదు. కీలమైన ఉద్యోగి ఏదైనా అక్రమాలకు పాల్పడినప్పుడు కదల్చాలని ప్రయత్నించినా ‘మేనేజ్’ చేసుకుంటూ ఏళ్ల తరబడి పాతుకుపోతున్నారు. అవకతవకలకు పాల్పడుతూ కొంతమంది ఉద్యోగులు చక్రం తిప్పుతున్నారు. రిటైర్ అయ్యే చివరి క్షణం వరకు చేయిచాపే పనులు కొనసాగిస్తున్నారు. కాంట్రాక్టర్లను బినామీలుగా మార్చుకుంటూ కార్పొరేషన్ ఖజానాను దోచేస్తున్నారు. మహా విశాఖ నగర పాలక సంస్థ రాష్ట్రంలో అతి పెద్ద కార్పొరేషన్. ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులతో కలిపి అత్యధిక మంది విధులు నిర్వర్తిస్తున్న కార్పొరేషనూ ఇదే. ఏటా రూ.150 నుంచి రూ.300 కోట్ల కార్పొరేషన్ నిధులతో పాటు, వివిధ గ్రాంట్లతో కలిపి మొత్తం రూ.వెయ్యి కోట్లకు పైగానే పనులు జరుగుతుంటాయి. అందుకే ఇక్కడి నుంచి వేరే కార్పొరేషన్‌కు బదిలీపై వెళ్లాలన్నా, తాము పనిచేస్తున్న జోన్ నుంచి వేరే జోన్‌కు వెళ్లాలన్నా కొందరు అధికారులు ఇష్టపడటం లేదు. ఫలితంగా అవకతవకలు, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. సాధారణంగా కార్పొరేషన్లో ఒక చోట మూడు నుంచి మూడున్నరేళ్లు మాత్రమే పనిచెయ్యాలి. టీడీపీ ప్రభుత్వ హయాంలో బదిలీ జీవోలు వచ్చినా వాటిని తొక్కిపెట్టి అక్కడే విధులు నిర్వర్తించేవారు. ప్రస్తుతం కూడా చాలా జోన్లలో ఏళ్లతరబడి పాతుకుపోయినవారే పనిచేస్తున్నారు. చివరి రోజుల్లో ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉండాలని, అవినీతి మరక పడకూడదని అంతా అనుకుంటారు. కాని జీవీఎంసీలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇందుకు ఉదాహరణ ఈ నెల 30న పదవీవిరమణ పొందనున్న జీవీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ) కాంట్రాక్టర్ వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కడమే. చివరి నిమిషం వరకూ దోచుకోవాలనే దాహంతో కొందరు ఉద్యోగులు వ్యవహరిస్తున్నారు. పదోన్నతులు వదులుకుంటూ..? ఎవరైనా ఉద్యోగికి పదోన్నతి వస్తే ఎగిరి గంతేస్తారు. ప్రమోషన్ వచ్చిన చోటికి ఆగమేఘాల మీద వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారు. కాని కార్పొరేషన్లో పనిచేసే ఉద్యోగులు మాత్రం ప్రమోషన్ వచ్చినా పట్టించుకోరు. దాన్ని వదులుకొని జీవీఎంసీలోనే కొనసాగేందుకు లాబీయింగ్ చేస్తూ ప్రమోషన్‌ను సైతం రద్దు చేసుకుంటున్నారు. ప్రధాన కార్యాలయంలో ఆర్వో గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి రెండేళ్ల క్రితం అసిస్టెంట్ కమిషనర్‌గా పదోన్నతి లభించింది. ఈ పదోన్నతి తీసుకుంటే వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లాలి. కాని తన పలుకుబడితో ప్రమోషన్‌ను రద్దు చేయించుకొని కార్పొరేషన్లోనే ఆర్వోగా విధులు నిర్వర్తిస్తున్నారు. అదే మాదిరిగా ఓ మహిళా ఉద్యోగి కూడా ప్రమోషన్‌ను వదులుకొని ఇక్కడే పనిచేస్తున్నారు. బదిలీ అయినా నెలరోజ్లులోనే తిరిగి ఇక్కడ పోస్టింగ్ సంపాదించుకుంటూ అదే కుర్చీకి ఇంజినీర్లు అతుక్కుపోతున్నారు. ఐదుగురు ఇంజినీర్లు ట్రాన్స్‌ఫర్‌పై అలా వెళ్లి ఇలా తిరిగి వచ్చేశారు. మెకానికల్ విభాగంలో ఓ ఇంజినీరింగ్ అధికారికి డీఈ హోదా పదోన్నతి లభించినా.. దాన్ని డీగ్రేడ్ చేసుకొని ఏఈగానే కొనసాగుతున్నారంటే ఆ పోస్టు ఎంత లాభసాటిగా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాజాగా జరిగిన ఏసీబీ దాడులతో ఇంజినీరింగ్ విభాగంలో దడపుడుతోంది. ఏసీబీ వలలో చిక్కిన ఈఈకి ఇద్దరు బినామీ కాంట్రాక్టర్లు కూడా ఉన్నట్టు తెలిసింది. ఈ ఇద్దరు కాంట్రాక్టర్లు ఓ ఇంజినీరింగ్ అధికారికి సైతం బినామీలుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఇలా కార్పొరేషన్లో తిష్టవేసిన అధికారులే ఇష్టారాజ్యంగా పనిచేస్తూ నిజాయితీగా పనిచేస్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతర్గత బదిలీలకు శ్రీకారం చుట్టి కార్పొరేషన్ని ప్రక్షాళన చేస్తే కొంతవరకు అవినీతిని అరికట్టవచ్చని భావిస్తున్నారు. మెకానికల్ మాయాజాలం ఇక మెకానికల్ విభాగమంటే.. జీవీఎంసీ కమిషనర్ సైతం చేతులెత్తేసే పరిస్థితి దాపురించింది. ఎవరిని మార్చినా ఆ అధికారులు వారందర్నీ ఏమార్చి కమిషన్ల వేట కొనసాగిస్తున్నారు. మెకానికల్‌లో ఓ ఇంజినీరింగ్ అధికారి కాంట్రాక్ట్‌ల విషయంలో చక్రం తిప్పుతున్నారు. టీడీపీ హయాంలో ఓ ఎమ్మెల్యేకు అనుచరుడిగా ఉంటూ ఇప్పటికీ వారు చెప్పిందే వేదంగా పనులు సాగిస్తున్నారు. 30 ఏళ్లుగా కార్పొరేషన్లో పనిచేస్తూ ఇంజినీర్ హోదాకు వచ్చిన ఆ అధికారి మెకానికల్‌లో ఉన్న లొసుగుల్ని క్యాష్ చేసుకుంటున్నారు. టెండర్ల విషయంలో కమిషనర్‌ను సైతం తప్పుదారి పట్టించి తాము చెప్పిందే వేదమన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కొన్ని నెలల క్రితం జీవీఎంసీ కమిషనర్ ఈ విభాగంలో అంతర్గత బదిలీలు చేసినా మార్పు మాత్రం కనిపించడం లేదు. వారు చెప్పిందే వేదం ఓ స్థాయి పదోన్నతి లభిస్తే చాలు.. ఆ కుర్చీ నుంచి కదిలేందుకు ససేమిరా అంటున్నారు. ఏళ్ల తరబడి విధులు నిర్వర్తిస్తూ.. అందులో లోటుపాట్లు, ఇతర విషయాలపై పూర్తి పట్టుసాధించి శాసిస్తున్నారు. ఉన్నతాధికారులను సైతం ఏమార్చుతూ అవకతవకలకు పాల్పడుతున్నారు. ఎటువైపు నుంచి కార్పొరేషన్‌కు ఆదాయం వస్తుంది, తమ జేబులు ఎలా నింపుకోవాలన్న ఆలోచనతోనే వీరు పనిచేస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో ఓ అధికారి కొన్నేళ్ల క్రితం అ..ఆ..ల నుంచి ప్రారంభించి ఇప్పుడు అన్నీ తానే అనే స్థాయికి ఎదిగిపోయారు. ఆయనను బదిలీచేస్తూ గతంలో జీవోలు వచ్చినా తన పలుకుబడితో అమలుకాకుండా చూసుకున్నారు. యూసీడీ విభాగంలో సూపరింటెండెంట్ హోదాలో పనిచేస్తున్న ఉద్యోగి సైతం అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. ఉన్నతాధికారి అండతో తోపుడు బళ్ల వ్యాపారుల వద్ద నుంచి లక్షలు గుంజుకుంటూ పంచుకుంటున్నారు. చదవండి: అంతా మా ఇష్టం: అక్కడవన్నీ ‘వెలగపూడి’ ఫుడ్‌కోర్టులే.. వాహన పన్ను చెల్లింపు గడువు పొడిగింపు -
గుడ్ న్యూస్ : 1000 ఇంజీనీర్ ఉద్యోగాలు
సాక్షి, ముంబై: ప్రముఖ డిజిటల్ పేమెంట్ సొల్యూషన్స్ సేవల సంస్థ పేపాల్ ఇంజనీర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. 2021లోభారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు వెల్లడించింది. సాఫ్ట్వేర్, ప్రొడక్ట్ డెవలప్మెంట్, డేటా సైన్స్, రిస్క్ అనలిటిక్స్, బిజినెస్ అనలిటిక్స్ స్ట్రీమ్స్ ఎంట్రీ, మిడ్-లెవల్ , సీనియర్ రోల్స్‌లో ఈ నియామకాలు జరుగుతాయి.హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలోని డెవలప్మెంట్ సెంటర్లలో దాదాపు వేయి మందిని కొత్తగా ఉద్యోగాల్లో చేర్చకోనున్నామని పేపాల్ తాజాప్రకటనలో తెలిపింది కరోనా మహమ్మారి కారణంగా డిజిటల్ చెల్లింపులకుడిమాండ్ పెరిగిందనీ, ఈ నేపథ్యంలో తమ కేంద్రాల కీలకంగా మారనుందని పేపాల్ తెలిపింది. పేపాల్‌కు ప్రస్తుతం భారతదేశంలోని మూడు కేంద్రాలలో 4,500 మందికి పైగా ఉద్యోగులున్నారు. అమెరికా తరువాత భారతదేశంలోని సాంకేతిక కేంద్రాలు అతిపెద్దవన్నారు. దేశంలో డిజిటల్ చెల్లింపులకు పెరుగుతున్న ఆదరన నేపథ్యంలో వినియోగదారులు, వ్యాపారుల అవసరాలను తీర్చడంపై దృష్టిపెట్టామన్నారు. ఈ క్రమంలో తాజా నియామకాలు కీలక పాత్ర పోషిస్తాయని పేపాల్ ఇండియా ప్రతినిధి గురు భట్ అన్నారు. కాగా దేశీయంగా ఏప్రిల్ 1 నుంచి తమ సర్వీసులు నిలిపేయనున్నట్లు గత నెలలో పేపాల్ ప్రకటించింది. భారత వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టనున్నాం. ఇకపై భారతీయ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయికి చేర్చేందుకు , భారతీయ వ్యాపారాలను అంతర్జాతీయంగా విస్తరించేందుకు కృషి చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గూగుల్‌కు ఉద్యోగుల షాక్
శాన్ఫ్రాన్సిస్కో : సెర్చింజన్ దిగ్గజం గూగుల్‌కు ఇద్దరు ఉద్యోగులు గుడ్బైచెప్పడం కలకలం రేపింది. గత నెలలో కృత్రిమ మేథ (ఏఐ)పరిశోధకుడు టిమ్నిట్ గెబ్రూపై గూగుల్ వేటు వేయడాన్ని నిరసిస్తూ ఇద్దరు కీలక టెకీలు సంస్థకు గుడ్‌బై చెప్పారు. వైవిధ్యం,నైతిక విలువలపై కొనసాగుతున్న వివాదాలు తీవ్రస్ధాయి స్ధాయికి చేరిన నేపథ్యంలో ఇంజనీరింగ్ డైరెక్టర్, సాఫ్ట్వేర్ డెవలపర్ గూగుల్ నుంచి నిష్క్రమించడం చర్చకు దారితీసింది.యూజర్ భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్ బకర్ 16 ఏళ్ల పాటు సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచుకుంటున్నానంటూ ప్రటించారు.గెబ్రూ నిష్క్రమణ అనంతరం గూగుల్‌లో కొనసాగదల్చుకోలేదని చెప్పారు. మరోవైపు సెర్చింజన్ దిగ్గజంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా మరో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వినీష్ కన్నన్ గూగుల్‌ను వీడుతున్నట్టు బుధవారం ట్వీట్ చేశారు. పేర్కొన్నారు. గెబ్రూ, ఏప్రిల్ క్రిస్టియానాల పట్ల గూగుల్ దురుసుగా ప్రవర్తించిందనీ, వారికి అన్యాయం జరిగిందంటూ కన్నన్ పేర్కొన్నారు. గెబ్రూ, క్రిస్టియానా ఇరువురూ నల్ల జాతీయులు కావడం గమనార్హం.మరోవైపు ఈ పరిణామంపై వ్యాఖ్యానించడానికి గూగుల్ నిరాకరించింది. అయితే గెబ్రూ నిష్క్రమణ తరువాత సంస్థపై ఉద్యోగుల నమ్మకాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపింది. -
ఇంజనీర్లకు ఎల్అండ్టీ చాన్స్
న్యూఢిల్లీ: నిర్మాణ, ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్అండ్టీ 2021లో సుమారు 1,100 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్లను నియమించుకునే ప్రణాళికతో ఉన్నట్టు సంస్థ సీఈవో, ఎండీ ఎస్ఎన్ సుబ్రమణ్యన్ తెలిపారు. ప్రస్తుతం ఆన్లైన్ విధానంలో కొనసాగుతున్న నియామకాల్లో భాగంగా.. ప్రతిష్టాత్మక ఐఐటీ సంస్థలకు చెందిన 250 మంది విద్యార్థులకు ఆఫర్లను అందించినట్టు చెప్పారు. ఏటా తాము 1,100 మందికిపైగా ఇంజనీర్లను నియమించుకుంటామని చెబుతూ.. అందులో 90 శాతం మంది ఐఐటీలు, ఎన్ఐటీల వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలకు చెందిన వారే ఉంటారని స్పష్టం చేశారు. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులపై ఎల్అండ్టీ ఎంఎఫ్ ప్రచారం ఎల్అండ్టీ మ్యూచువల్ ఫండ్ సంస్థ ‘లేట్ లతీఫ్ 2021’ పేరుతో ఒక డిజిటల్ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. పన్ను ఆదా కోసం ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్) పథకాల్లో ముందు నుంచే పెట్టుబడులు పెట్టడానికి ఉన్న ప్రాధాన్యం గురించి ఇన్వెస్టర్లకు ఈ కార్యక్రమంలో భాగంగా అవగాహన కల్పించనున్నట్టు తెలిపింది. లక్ష్యానికి ఎంత మేర పెట్టుబడులు పెట్టాలి తెలియజేసే కాలిక్యులేటర్ తదితర సమాచారాన్ని www.ltfs.com/companies/lnt-investment-management/elss.html పోర్టల్‌లో అందుబాటులో ఉంచినట్టు సంస్థ ప్రకటించింది. ఈవైలో కొత్తగా 9,000 మంది నిపుణులకు చోటు 2021లో నియమించుకోనున్నట్టు సంస్థ ప్రకటన ముంబై: ఎర్నెస్ట్ అండ్ యంగ్ సర్వీసెస్ (ఈవై) 2021లో వివిధ టెక్నాలజీ విభాగాల్లో 9,000 మంది నిపుణులను భారత్‌లో నియమించుకోనున్నట్టు ప్రకటించింది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమేటిక్స్ (స్టెమ్) కోర్సులు చదివిన వారు, కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, అనలైటిక్స్, ఇతర ఆధునిక టెక్నాలజీలకు సంబంధించి ఈ నియామకాలు ఉంటాయని ఈవై తెలిపింది. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని మా క్లయింట్లు టెక్నాలజీ ఆధారిత పరివర్తనం దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ ప్రయాణంలో వారికి మేము మద్దతుగా నిలవాల్సి ఉంటుంది. అత్యాధునిక టెక్నాలజీ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా మా సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటున్నాము. కనుక రానున్న సంవత్సరంలో నియామకాలను గణనీయంగా పెంచబోతున్నాము’’ అంటూ ఈవై ఇండియా పార్ట్నర్ రోహన్ సచ్దేవ్ తెలిపారు. ప్రస్తుతం ఈవై ఇండియా పరిధిలో 50,000 మంది పనిచేస్తున్నారు. వీరిలో 36 శాతం స్టెమ్ విభాగానికి చెందిన వారే ఉన్నారు. -
దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం
ఖైరతాబాద్ (హైదరాబాద్): ఏ దేశమైనా అభివృద్ధి పథంలో సాగాలంటే ఇంజనీర్ల పాత్ర కీలకమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. భారతరత్న, సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఏటా నిర్వహించే ఇంజనీర్స్ డే వేడుకలు మంగళవారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్లో వెబినార్ ద్వారా జరిగాయి. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్(ఐఈఐ)–తెలంగాణ స్టేట్ సెంటర్ ఆధ్వ ర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో గవర్నర్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను యువ ఇంజనీర్లు ఆదర్శంగా తీసుకోవాలని ఆమె సూచించారు. ప్రధాని మోదీ దేశాభివృద్ధి కోసం తీసుకొచ్చిన ‘మేకిన్ ఇండియా’ పథకాన్ని యువ ఇంజనీర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం అవార్డు గ్రహీతలు, ఐఈఐ సభ్యులను గవర్నర్ అభినందించారు. అంతకుముందు ఉదయం ఐఈఐ చైర్మన్ డాక్టర్ రామేశ్వర్రావు ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తాలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేశారు. కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా ప్రభుత్వ కార్యదర్శి కె.ఎస్.శ్రీనివాసరాజు, ఐఈఐ చైర్మన్ డాక్టర్ జి.రామేశ్వర్రావు, కార్యదర్శి టి.అంజయ్య, ఐఈఐ మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్.సత్యనారాయణ, డాక్టర్ జి.హనుమంతాచారి తదితరులు పాల్గొన్నారు. అవార్డు గ్రహీతలు వీరే.... ఏటా ఇంజనీర్ల దినోత్సవం పురస్కరించుకొని నైపుణ్యమున్న ఇంజనీర్లను ప్రోత్సహించేందుకు వివిధ అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇచ్చే సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అవార్డును ఈసారి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎన్ఐటీ) వరంగల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణారావు, డీఆర్డీఎల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ జైతీర్థ్ ఆర్.జోషి దక్కించుకున్నారు. ‘ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును ఉస్మానియా యూనివర్సిటీ, సివిల్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ కాలేజ్ ప్రొఫెసర్ ఎం.గోపాల్ నాయక్, డీఆర్డీవో అడ్వాన్స్డ్ సిస్టమ్ లేబొరేటరీ ప్రాజెక్ట్ డైరెక్టర్, శాస్త్రవేత్త ఎన్.కిశోర్‌నాథ్, బీహెచ్ఈఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ ఎం. మోహన్‌రావు అందుకున్నారు. ‘యంగ్ ఇంజనీర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డును శాస్త్రవేత్త అల్కా కుమారి, బీహెచ్ఈఎల్ మెటలర్జీ డిపార్ట్మెంట్ డిప్యూటీ మేనేజర్ డాక్టర్ పవన్ ఆళ్లపాటి వెంకటేశ్‌కు అందజేశారు. -
ఇంజినీర్లు.. ప్రజాధనం లూటీ!
సాక్షి, కరీంనగర్: ‘పట్టణ ప్రగతి’ పనుల పేరిట ప్రజల సొమ్ము కాజేసేందుకు కరీంనగర్ కార్పొరేషన్ ఇంజినీరింగ్ అధికారులు స్కెచ్ వేశారు. ఇందుకోసం వాహనాల నంబర్లనే తారుమారు చేశారు. జేసీబీ నంబర్ల స్థానంలో తమకు తోచిన ద్విచక్రవాహనాల నంబర్లు.. ట్రాక్టర్ల నంబర్ల స్థానంలో కనిపించిన ఆటో నంబర్ రాసి బిల్లుల కోసం ఫైళ్లు పెట్టారు. అన్నీ సరిచూసుకుని సంతకం చేయాల్సిన కమిషనర్ ఏమీ పట్టించుకోకుండా సంతకం చేసేశారు. చివరకు ఆడిటింగ్ అధికారుల వద్ద అసలు బాగోతం బయటపడింది. ఖాళీ స్థలాల చదును పేరిట.. పట్టణాల్లోని మురికివాడలు, వెనుక బడిన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో పట్టణ ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతీ మున్సిపాలిటీకి ప్రతీనెల నిధులు కేటాయిస్తోంది. పట్టణప్రగతి కార్యక్రమం ప్రారంభానికి ముందు సీఎం కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించి పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలన్నీ పరిష్కారం కావాలని, పారిశుధ్యం మెరుగుపడాలని ఆదేశించారు. 5.9 ఎకరాలు శుభ్రం చేశామని.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని 2020, ఫిబ్రవరి 24 నుంచి మార్చి 4 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 60 డివిజన్లలో పలు సమస్యలు గుర్తించారు. పరిష్కారానికి ప్రణాళిక రూపొందించారు. ఇందులో భాగంగా చెత్త, మురికినీరు నిలిచిన ఖాళీ స్థలాలను శుభ్రం చేయాలని నిర్ణయించారు. ఈమేరకు 60 డివిజన్లలో కలిపి 5.9 ఎకరాల విస్తీర్ణంలోని మూడువేలకుపైగా ఖాళీ స్థలాలను గుర్తించినట్లు ఇంజినీరింగ్ అధికారులు పేర్కొన్నారు. వీటిని శుభ్రం చేసేందుకు నిత్యం 25పైగా జేసీబీలు, 40కుపైగా బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు వినియోగించామని రికార్డులు నమోదు చేశారు. జేసీబీ స్థానంలో బైక్.. ట్రాక్టర్ల స్థానంలో ఆటోల నంబర్లు.. పది రోజులు నిర్వహించిన పట్టణ ప్రగతిలో ఖాళీ స్థలాలు శుభ్రం చేసేందుకు 150 జేసీబీలు, 200 ట్రా క్టర్లు ఉపయోగించినట్లు లెక్క తేల్చారు. 60 డివిజన్లలో 5.96 ఎకరాల ఖాళీ స్థలాల క్లీనింగ్‌కు రూ.40 లక్షలు ఖర్చయినట్లు లెక్కలు వేశారు. వాహనాల బిల్లుల కోసం రూ.5 లక్షలకు ఒక ఫైల్ చొప్పన 8 ఫైళ్లు సిద్ధం చేశారు. ఇందులో జేసీబీలు, బ్లేడ్ ట్రాక్టర్లు, లోడింగ్ ట్రాక్టర్లు ఏ రోజు ఎన్ని వినియోగించారు. ఎక్కడెక్కడ పనులు చేయించారు. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లతో వివరాలు నమోదు చేశారు. ఇక్కడే అధికారులు ‘తప్పు’లో కాలేశారు. జేసీబీ, ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో తమ కంటికి కనిపించిన బైకులు, ఆటోలు నంబర్లు నమోదు చేశారు. 150 జేసీబీల స్థానంలో 10 బైక్ నంబర్లు నమోదు చేసి వాటితో మళ్లీమళ్లీ పనులు చేయించినట్లు రికార్డులు రూపొందించారు. అలాగే 200 బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ నంబర్ల స్థానంలో సుమారు 25 ఆటోలు, బైక్ రిజిస్ట్రేషన్ నంబర్లు వేశారు. విధుల్లో లేని అధికారుల సంతకాలు.. ఖాళీ స్థలాలు శుభ్రం చేసే పనులు నిర్వహించే సమయంలో అసలు విధుల్లో లేని ఇద్దరు అధికారులు రూ.40 లక్షల బిల్లులకు సబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు. పట్టణ ప్రగతి సమయంలో సంతకాలు చేసిన ఏఈలు ఇతర మున్సిపాలిటీల్లో ఇన్‌చార్జీలుగా విధులు నిర్వర్తించారు. అయినా బిల్లుల ఫైళ్లపై సదరు ఏఈలతో సంతకాలు చేయించారు. నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అంతా తామై నడిపించారని తెలిసింది. తర్వాత వివరాలు సరిచూసుకోకుండానే డీఈలు, ఈఈలు సంతకాలు చేసి ఫైళ్లను కమిషనర్‌కు పంపించారు. గుడ్డిగా సంతకం చేసిన కమిషనర్.. ‘పట్టణ ప్రగతి’లో భాగంగా చేపట్టిన పనులకు నిధుల కొరత ఉండొద్దన్న ఉద్దేశంతో ప్రభుత్వం కరీంనగర్ కార్పొరేషన్‌కు నెలకు రూ.2.44 కోట్లు మంజూరు చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.17.09 కోట్లు మంజూరు చేసింది. ఈక్రమంలో 5.96 ఏకరాల్లోని ఖాళీ స్థలాలను శుభ్రం చేసినందుకు ఈ నిధుల నుంచి రూ.40 లక్షల బిల్లులు మంజూరు చేయాలని వచ్చిన 8 ఫైళ్లను కమిషనర్ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఎన్ని వాహనాలు వాడారు. ఎన్ని గంటలు పనిచేశాయి. వాహనాలు ఎక్కడెక్కడి నుంచి తెప్పించారు. నమోదు చేసిన వివరాలన్నీ సరైనవా కావా అని క్రాస్ చెక్ చేయాలి. అనుమానం వస్తే క్షేత్రస్థాయిలో కూడా పరిశీ లించాలి. కానీ కరీంనగర్ కమిషనర్ ఇవేవీ పట్టించుకోలేదు. గుడ్డిగా బిల్లుల మంజూరుకు వచ్చిన ఫైళ్లపై వేగంగా సంతకం చేసి బిల్లుల మంజూరుకు అకౌంట్ అధికారులకు అటునుంచి ఆడిటింగ్ అధికారులకు పంపించారు. ఆడిటింగ్‌లో గుట్టు రట్టు.. ఆడిటింగ్ సమయంలో ఫైళ్లు తనిఖీ చేస్తున్న అధికారులకు వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లపై అనుమానం వచ్చింది. దీంతో విచారణ చేపట్టారు. రవాణా శాఖ పోర్టల్‌లో జేసీబీ, ట్రాక్టర్ల నంబర్లు సరిచూసుకుని కంగుతిన్నారు. జేసీబీ, బ్లేడ్, లోడింగ్ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల నంబర్ల స్థానంలో బైక్, ఆటోల నంబర్లు దర్శనం ఇచ్చాయి. బైకులు, ఆటోలతో పనిచేయించారా అని ఆడిటింగ్ అధికారులు అవాక్కయ్యారు. వెంటనే ఈ విషయాన్ని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించి న కమిషనర్ ఫైళ్లను తిప్పి పంపమని సూచించడంతో ఆడిటింగ్ అధికారులు అకౌంట్ అధికారులకు అటు నుంచి ఇంజినీరింగ్ విభాగానికి ఫైళ్లు రిటర్న్ చేశారు. ఆ ఫైళ్లు.. ఆగమేఘాలపై.. కరీంనగర్ కార్పొరేషన్లో సుమారు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బిల్లులకు సబంధించిన ఫైళ్లు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటిలో చాలా వరకూ చిన్నచిన్న కారణాలతో పెండింగ్‌లో పెట్టారని సమాచారం. పట్టణ ప్రగతిలో పనిచేసిన వాహనాల బిల్లుల ఫైళ్లు మాత్రం ఆగమేఘాలపై రూపొందించారు. అంతే వేగంగా ఏఈలు, డీఈలు, ఈఈలు ఫైళ్లపై సంతకాలు చేశారు. కమిషనర్ కూడా ఎలాంటి క్రాస్ చెక్ చేసుకోకుండా సంతకం చేసి అకౌంటింగ్, ఆడిటింగ్ అధికారులకు పంపించారు. చిన్నచిన్న కారణాలతో కోట్లలో బిల్లులు ఉన్న ఫైళ్లు పెండింగ్‌లో ఉండగా, రూ.40 లక్షల బిల్లుల ఫైల్ వేగంగా కదలడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఫైళ్లు వేగంగా అకౌంటింగ్ అధికారుల వరకు చేరినట్లు తెలుస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లే తప్పుగా నమోదు చేసి తప్పుడు ఫైలింగ్ చేసినా ఇప్పటి వరకు కనీసం విచారణ చేపట్టకపోవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. కాగా సదరు ఫైళ్లలో తప్పులను సరిచేసి మళ్లీ బిల్లులు డ్రా చేసే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. -
ఇంజనీర్లకు ఉబెర్ గుడ్ న్యూస్
సాక్షి,ముంబై : క్యాబ్ సేవల సంస్థ ఉబెర్ శుభవార్త అందించింది. 140 మంది కొత్త ఇంజనీర్లను నియమించుకోనున్నామని తాజాగా ప్రకటించింది. డెలివరీ, మార్కెట్ ప్లేస్, కస్టమర్ సర్వీస్, డిజిటల్ చెల్లింపులు, రిస్క్ అండ్ కంప్లైయెన్స్, సేఫ్టీ అండ్ ఫైనాన్షియల్ టెక్నాలజీ రంగాలలో ఈ నియామకాలుంటాయని ఉబెర్ వెల్లడించింది. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా భారీగా ఉద్యోగులను తొలగించిన ఉబెర్ ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఇంజనీర్ల నియామకాలవైపు మొగ్గు చూపుతోంది. ఈ నేపథ్యంలో బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 140 మంది ఇంజనీర్లను ఎంపిక చేస్తామని ఉబెర్ సీనియర్ డైరెక్టర్ గ్లోబల్ ఫిన్‌టెక్ లీడర్ జయరామ్ వల్లియూర్ తెలిపారు. కరోనా సమయంలో భౌతిక దూరాన్ని ప్రోత్సహించేలా డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయడం, మార్కెట్లోకి ఆన్‌బోర్డ్ రెస్టారెంట్ మెనూలకు సంబంధించి మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల అభివృద్దికి పెట్టుబడులు పెడుతున్నామని ఉబెర్ సీఈఓ ఖోస్రోషాహి ఇటీవల ప్రకటించారు. ఈ క్రమంలోనే తాజా నియామకాలు జరగనున్నాయి. కాగా కరోనా సంక్షోభం కారణంగా భారీగా ఆదాయాన్ని కోల్పోయిన ఉబెర్ మే నెలలో ఇండియాలో 600 మంది ఉద్యోగులను తొలగించింది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 6700 మందిని లేదా 25 శాతం మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. 2017 లో 80 మందిగా ఉన్న ఇంజనీర్ల సంఖ్య ప్రస్తుతం 600 మంది పెరిగిందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. -
విమానాలకు కొత్తదారి
విమానం సాఫీగా పైకి లేవాలన్నా, సురక్షితంగా కిందికి దిగాలన్నా రన్‌వే బాగుండాలి. కొచ్చి, అంతర్జాతీయ విమానాశ్రయంలో.. మరమ్మతులు అవసరమైన స్థితిలో ఉన్న రన్‌వే పైనే గత నవంబర్ ముందు వరకు విమానాల రాకపోకలు జరుగుతుండేవి. రీ–కార్పెటింగ్కి (మరమ్మతులకు) నిపుణులైన ఇంజినీర్ల కోసం సి.ఐ.ఎ.ఎల్ (కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్) తన ఇంజినీరింగ్ విభాగంలోని సిబ్బందిలోంచి పెద్ద వడపోతనే పోయవలసి వచ్చింది. చివరికి ఎనిమిది మంది ఇంజినీర్లను, వాళ్లకు సహాయంగా 20 మంది అప్రెంటీస్లను ఎంపిక చేసుకుంది. విశేషం ఏంటంటే.. వాళ్లంతా కూడా మహిళలే! విమానం టేకాఫ్‌కి, ల్యాండింగ్కీ ఎలాగైతే మంచి రన్‌వే ఉండాలో, రన్‌వే రీ–కార్పెటింగ్ పనిని పరుగులు తీయించే బృందం అవసరమని భావించిన సి.ఐ.ఎ.ఎల్. మహిళా ఇంజినీర్ల వైపే మొగ్గు చూపింది. సి.ఐ.ఎ.ఎల్. సివిల్ ఇంజినీరింగ్ విభాగం జనరల్ మేనేజర్ బినీ టి.ఐ., అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు టి.పి.ఉషాదేవి, మినీ జాకబ్, జూనియర్ మేనేజర్లు పూజా టి.ఎస్., త్రీసా వర్ఘీస్, సీనియర్ సూపరింటెండెంట్లు పి.పి.శ్రీకళ, ఇ.వి. జెస్సీ, జిన్సీ ఎం పాల్.. ఈ ఎనిమిది మంది పర్యవేణలో, వారికి సహాయంగా ఉన్న ఇరవై మంది ట్రెయినీ ఇంజనీర్లతో గత ఏడాది నవంబర్ 20 న ప్రారంభమైన రీ–కార్పెటింగ్ పనులు తొలి రోజు నుంచే వేగంగా జరుగుతున్నాయి! ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు. ‘మిక్స్’ ప్లాంట్‌కూ వెళతారు రన్‌వే కార్పెటింగ్ రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతోంది. ఆ సమయంలో విమానాశ్రయాన్ని మూసి ఉంచుతున్నారు. 200 మంది పనివాళ్లు ఉంటారు. పనిని కాంట్రాక్టుకు తీసుకున్న సంస్థల వాహనాలు ఓ 50 వరకు వచ్చిపోతుంటాయి. 60 మీటర్ల వెడల్పు, 3,400 మీటర్ల పొడవున రీకార్పెటింగ్ పని జరుగుతూ ఉంటుంది. రన్‌వేపై దిగాక విమానాల కదలికలకు వీలు కల్పించే ఐదు ‘టాక్సీవే’ల పునఃనిర్మాణం కూడా ఏకకాలంలో అవుతోంది. వీటన్నిటికీ కావలసిన కంకర కోసం ఈ మహిళా ఇంజినీరింగ్ టీమ్ ఎప్పటికప్పుడు క్వారీలకు వెళ్లి నాణ్యతను పరీక్షిస్తోంది. తారును మిక్స్ చేసే ప్లాంట్‌కూ వెళుతుంది. మెటీరియల్ ఎంత వస్తున్నదీ, ఎంత మిగిలి ఉన్నదీ, అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు చేసిన మెటీరియల్ పూర్తిగా వినియోగం అవుతున్నదీ లేనిదీ వీరు పరిశీలిస్తారు. అంటే పని మొత్తం పూర్తిగా వీరి కనుసన్నల్లోనే నడుస్తుంది. రోజుకు 1500 టన్నుల తారు–కంకర కలుపు (మిక్సింగ్) విమానాశ్రయానికి చేరుకుంటుంది. అయితే అది సమయానికి చేరడం ముఖ్యం. సాయంత్రం 6 తర్వాత వస్తే ఇక ఆ రోజు పనికి వీలు పడనట్లే్ల. అందుకే ప్రతిదీ ఒక పద్ధతితో, ప్రణాళిక ప్రకారం అయ్యేలా శ్రద్ధ తీసుకుంటున్నారు బినీ, ఆమె బృందం. చిన్న తేడా రానివ్వరు మిక్సింగ్ ప్లాంట్ పని రోజూ తెల్లవారుజామునే 3 గంటలకు మొదలౌతుంది. ఉదయం 10 కల్లా విమానాశ్రయానికి ‘మిక్స్’ను మోసుకొచ్చేస్తాయి బండ్లు. సాయంత్రం 6 గంటలకు తొలి విమానం దిగేలోపే ఆవేళ్టి పని పూర్తి చేసేస్తారు. రీకార్పెటింగ్ ఒకసారి అయిపోయే పని కాదు. మిక్స్‌ని రెండు పూతలుగా (లేయర్లు) వేస్తారు. మొదటి పూత ఏడు సెంటీమీటర్ల మందంలో, దాని పైన వేసే రెండో పూత ఐదు సెంటీమీటర్ల మందంలో ఉంటుంది. పాత లెక్కలకు, కొత్త లెక్కలకు తేడాలు వచ్చాయంటే విమానం ల్యాండింగ్ ప్రమాదంలో పడినట్లే. ఇంత సూక్ష్మంగా, జాగ్రత్తగా అన్నీ సరి పోల్చుకుంటూ రోజుకు 150 మీటర్లు చొప్పున రన్‌వే రీ–కార్పెటింగ్ చేయిస్తున్నారు ఈ మహిళా ఇంజినీర్లు. ముందు అనుకున్న ప్రకారం ఈ నెల 29 కి రన్‌వే సిద్ధం అవాలి. అయితే ఈ మహిళా ఇంజనీర్ల అంకితభావం, దీక్ష చూస్తుంటే ఆలోపే రన్‌వే మా చేతికి వచ్చేలా ఉందని సి.ఐ.ఎ.ఎల్. అధికారులు ప్రశంసాపూర్వకంగా అంటున్నారు. -
‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు పదోన్నతులు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి కావడంలో కీలకపాత్ర పోషించిన ఐదుగురు ఇంజనీర్లకు పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు డివిజన్–1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న బీవీ రమణారెడ్డిని ఎస్ఈగా ప్రమోట్ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు సర్కిల్–1 ఎస్ఈగా ఆయనకు పోస్టింగ్ ఇచ్చిం ది. ఇప్పటివరకు అక్కడ ఎస్ఈగా కొనసాగుతు న్న సుధాకర్‌రెడ్డిని కరీంనగర్ సర్కిల్ ఎస్ఈగా బదిలీ చేసింది. లింక్–2లో డీఈఈగా పనిచేసిన నూనె శ్రీధర్‌కు ఈఈగా, ప్రాజెక్ట్ డివిజన్–2లో డీఈఈగా పనిచేస్తున్న ఎ.యాదగిరికి ఈఈగా ప్రమోషన్ ఇచ్చింది. వారు పనిచేస్తున్న చోటే ఈఈలుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. లింక్–1లో ఏఈఈలుగా పనిచేస్తున్న ఎం.రాజు, పి.రవిచంద్రకు డీఈఈలుగా పదోన్నతి కల్పించారు. తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్‌కు 10(హెచ్) పరిధి నుంచి వీరికి మినహాయింపునిచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రమోట్ అయిన ఇంజనీర్లు ఇన్‌చార్జీలుగానే ప్రస్తుతం ఇచ్చిన పోస్టుల్లో కొనసాగుతారని, పాత క్యాడర్లోని పేస్కేల్ కొనసాగుతుందని స్పష్టంచేశారు. వారికి పదోన్నతులు కల్పిస్తూ ఇచ్చిన ఉత్తర్వులు తాత్కాలిక ఏర్పాట్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఇన్చార్జి ఏర్పాట్లు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసుల తుదితీర్పునకు లోబడి ఉంటాయని, ఎలాంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఈ ప్రమోషన్ స్థానాల నుంచి ఇంజనీర్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని తెలిపారు. ప్రమోషన్ పొంది ఇన్‌చార్జీలుగా కొనసాగుతూ ఎవరైనా రిటైర్డ్ అయినా రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఈ పదోన్నతులను పరిగణనలోకి తీసుకోబోమని, వీటిపై సంబంధిత ఉద్యోగులకు ఎలాంటి అధికారం ఉండబోదని స్పష్టంచేశారు. -
‘సాగునీటి’ పటిష్టానికి మేధోమథనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటిశాఖ పునర్వ్యవస్థీకరణపై మేధోమథనం జరిపేందుకు ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్‌లో శనివారం నిర్వహించిన ఒక్కరోజు వర్క్‌షాప్ విజయవంతమైంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు ఆ శాఖ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓఅండ్ఎం)పాలసీ తయారు చేయడం, సాగునీటి శాఖ పునర్వ్యవస్థీకరణ, శాఖ ఆస్తులు, ఇతర సాంకేతిక అంశాల జాబితా రూపకల్పన, శాఖ కార్యకలాపాలను ప్రభావితం చేసే చట్టాలు, ఇతర శాఖలతో సమన్వయం వంటి అంశాలపై సదస్సులో కూలంకషంగా చర్చించారు. కార్యాచరణపై ఇంజనీర్లు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. సాగునీటి శాఖ ఈఎన్సీ మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ వర్క్‌షాప్‌లో ఈఎన్సీ స్థాయి నుంచి ఈఈ స్థాయి వరకు 250 మంది ఇంజనీర్లు పాల్గొన్నారు. సదస్సు లక్ష్యాలను, ప్రభుత్వ ఆలోచనను పరిపాలనా విభాగపు ఈఎన్సీ నాగేందర్రావు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న 1.25 కోట్ల ఎకరాల ఆయకట్టులో 75 లక్షల ఎకరాల ఆయకట్టు ఎత్తిపోతల పథకాల కిందే ఉందని, రానున్న రోజుల్లో వీటి నిర్వహణ కీలకం కానుందని తెలిపారు. సీఎం ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే మాట్లాడుతూ, కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు వీలుగా ఈఎన్సీల మధ్య పని విభజన జరగాలని సీఎం అభిలషించారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ఎత్తిపోతల పథకాల్లో 80కి పైగా పంప్‌హౌస్‌ల నిర్వహణకు దీర్ఘకాలిక దృష్టితో ఒక సమగ్ర ‘ఓఅండ్ఎం’పాలసీని తయారు చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల సలహాదారులు పెంటారెడ్డి పథకాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. పంప్‌హౌస్‌లు, విద్యుత్ పరికరాలు, విద్యుత్ సరఫరా వ్యవస్థల నిర్వహణ, షిఫ్ట్ ఇంజనీర్ల బాధ్యతలు, సిబ్బంది అవసరాలు తదితర అంశాలపై వివరించారు. పదోన్నతుల సంగతి సీఎం దృష్టికి తీసుకెళ్లాలి ఈ సందర్భంగా ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రాజెక్టుల నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేయడానికి తాము కష్టించి పని చేయడానికి సిద్ధంగా ఉన్నామని సదస్సులో పాల్గొన్న ఇంజనీర్లు తెలిపారు. అయితే గత రెండేళ్లుగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయిన పదోన్నతులకు హైకోర్టు తీర్పుతో అన్ని అడ్డంకులు తొలగిపోయినందున వెంటనే పదోన్నతులు ఇవ్వాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోవాలని సూచించారు. దీని తర్వాత జనవరిలో మరో సదస్సును కూడా నిర్వహిస్తామని, అవసరమైతే సీఎం స్థాయిలో మరో విస్తృత స్థాయి సదస్సును నిర్వహిస్తామని ఈఎన్సీ మురళీధర్ అన్నారు. సదస్సులో ఈఎన్సీలు హరిరాం, నల్లా వెంకటేశ్వర్లు, అనిల్ కుమార్, చీఫ్ ఇంజనీర్లు, శ్రీనివాస్ రెడ్డి, మధుసూదనరావు, బంగారయ్య, వీరయ్య, శంకర్, హమీద్ ఖాన్, నరసింహా, అనంత రెడ్డి, శ్రీదేవి, శ్రీనివాస రావు, అజయ్ కుమార్, మోహన్ కుమార్, శంకర్ నాయక్, వి.రమేశ్, వి.సుధాకర్, డీసీఈలు అజ్మల్‌ఖాన్, నరహరిబాబులు పాల్గొన్నారు. -
‘కాళేశ్వరం’ ఇంజనీర్లకు ప్రమోషన్
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని ఐదుగురు ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లకు పదోన్నతులు ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఈ మేరకు రెండ్రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీర్లు కుటుంబాలకు దూరంగా ఉండి రాత్రింబవళ్లు శ్రమించి లక్ష్యానికి అనుగుణంగా కృషి చేసినందుకు ప్రభుత్వం స్పెషల్ ప్రమోషన్ ఇవ్వాలని నిర్ణయించింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లింకు–1లోని మేడిగడ్డ లక్ష్మీబ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బీవీ రమణారెడ్డికి ఎస్ఈగా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.రాజుకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా, అన్నారం సరస్వతీ బ్యారేజీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎ.యాదగిరికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి.రవిచంద్రకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పదోన్నతి ఇవ్వనున్నారు. అలాగే లింకు–2 పరిధిలోని నంది, గాయత్రి పంపుహౌస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్‌కు ఎస్ఈగా ప్రమోషన్ రానుంది. వీరందరికి ఒక నెల జీతం లేదా ఒక ఇంక్రిమెంట్‌ను ఇవ్వనున్నారు. -
ఆ ఉద్యోగం కోసం వేలమంది ఇంజనీర్లు క్యూ
కోయంబత్తూరు : తమిళనాడు, కోయంబత్తూరు నగర కార్పొరేషన్లో వందల సంఖ్యలో ఉన్న శానిటరీ కార్మికుల పోస్టుల భర్తీకోసం ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు (బీఎస్సీ, ఎంఎస్సీ,ఎంకామ్,)వేలకొద్దీ ఎగబడిన వైనం నిరుద్యోగ భారతానికి అద్దం పట్టింది. కార్పొరేషన్‌లోని 549 శానిటరీ కార్మికుల పోస్టులకు అధికారులు దరఖాస్తులను ఆహ్వానించారు. దీంతో మొత్తం 7 వేల మంది ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు దరఖాస్తు చేసుకోవడం విశేషం. గ్రేడ్ -1 శానిటరీ పోస్టుల కోసం పిలుపునివ్వగా వేల దరఖాస్తులు వచ్చి పడ్డాయని కార్పొరేషన్ అధికారులు స్వయంగా ప్రకటించారు. ఈ ఉద్యోగాల కోసం నిన్న(బుధవారం) ప్రారంభమైన మూడు రోజుల ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల ధృవీకరణ కార్యక్రమంలో 7వేల మంది దరఖాస్తుదారులు హాజరైనట్లు కార్పొరేషన్ అధికారిక వర్గాలు తెలిపాయి. దాదాపు 70 శాతం మంది అభ్యర్థులు ఎస్ఎస్ఎల్సి, కనీస అర్హత పూర్తి చేసినవారు కాగా, వీరిలో ఎక్కువ మంది ఇంజనీర్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, గ్రాడ్యుయేట్లు, డిప్లొమా హోల్డర్లు ఉన్నారని వారు తెలిపారు. వీరిలో ఇప్పటికే ప్రైవేట్ సంస్థలలో ఉద్యోగం చేస్తున్నవారు కూడా ఉన్నారు. అలాగే గత పదేళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులుగా పనిచేస్తున్న వారు కూడా ఈ శాశ్వత ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రతిదీ ఒక వృత్తి కాబట్టి శానిటరీ వర్కర్‌గా పనిచేయడంలో పెద్దగా సిగ్గు లేదనీ బిఇ మెకానికల్ గ్రాడ్యుయేట్ ఎస్ విఘ్నేష్ అన్నారు. తల్లి, తమ్ముళ్లను పోషించుకోవాల్సి వుంది. అందుకే ఈ ఇంటర్వ్యూకి వచ్చానన్నారు. బీకామ్ గ్రాడ్యుయేట్ అయిన పూవిజి మీనా, ఎంకామ్ గ్రాడ్యుయేట్ అయిన ఆమె భర్త ఎస్ రాహుల్, ఇంటర్వ్యూలో ఎంపికైతే తాము శానిటరీ కార్మికులుగా పనిచేయడానికి అభ్యంతరం లేదని ఈ జంట తెలిపింది. అలాగే 15 ఏళ్లుగా కాంట్రాక్ట్ శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న పి ఈశ్వరి మాట్లాడుతూ, కార్పొరేషన్ చాలా సంవత్సరాల తరువాత ఉద్యోగ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నందున పర్మినెంట్ జాబ్ కోసం చూస్తున్నానని చెప్పారు. ఈ ఉద్యోగాలకు కనీస విద్యార్హత 10వ తరగతి. ప్రారంభ జీతం రూ .15,700. పొద్దున మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు పని గంటలు. ఈ మధ్యలో ఉన్న విశ్రాంతి సమయంలో ఇతర చిన్న పనులు చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది. ఇదే ఉద్యోగార్థులను ఆకర్షించినట్టు అధికారులు భావిస్తున్నారు. కాగా నగర కార్పొరేషన్లో 2,000 మంది పర్మినెంట్, 500 మంది కాంట్రాక్ట్ శానిటరీ కార్మికులు పనిచేస్తున్నారు. -
రాష్ట్ర అభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకం
ఖైరతాబాద్: తెలంగాణలో చేపట్టిన మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, మెట్రో రైల్ ఇలా అన్నింట్లో ఇంజనీర్ల పాత్ర కీలకమైందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ స్టేట్ సెంటర్ సెంచురీ సెలబ్రేషన్స్‌లో భాగంగా రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ఆటోమేషన్ అండ్ డిజిటల్ మాన్యుఫ్రాక్షరింగ్ అంశంపై నిర్వహించిన ఆలిండియా సెమినార్‌ను మంత్రి ప్రారంభించారు. సెమినార్ సావనీర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. సెమినార్లో వచ్చిన సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఇంజనీర్ల కృషి వల్లే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని కొనియాడారు. కార్యక్రమంలో డిఫెన్స్ ఆర్సీఐ ప్రోగ్రాం డైరెక్టర్ డాక్టర్ వై.శ్రీనివాస్‌రావు, ఐఈఐ చైర్మన్ రామేశ్వర్రావు, ఏఆర్‌సీఐ శాస్త్రవేత్త గురురాజ్, డాక్టర్ పి.చంద్రశేఖర్, ప్రొఫెసర్లు శ్రీరాం వెంకటేశ్, చంద్రమోహన్‌రెడ్డి, ఐఈఐ సెక్రటరీ అంజయ్య, ఆర్గనైజింగ్ కమిటీ కన్వీనర్ రాజ్‌కిరణ్, ప్రొఫెసర్ రమణా నాయక్, ఇంజనీరింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. -
దుమ్ముగూడెం..పోలవరం టు సాగర్, శ్రీశైలం
సాక్షి, హైదరాబాద్: గోదావరి నదీ జలాలను కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకు తరలించే ప్రతిపాదనల తయారీ ప్రక్రియకు తెలంగాణ నీటి పారుదలశాఖ ఇంజనీర్లు పదునుపెట్టారు. రెండు తెలుగు రాష్ట్రాల సీఎంల సూచనల మేరకు ఏయే ప్రాంతాల నుంచి గోదావరి నీటిని కృష్ణాలోని నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు తరలించాలన్న అంశాలపై ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దుమ్ముగూడెం, పోలవరంల నుంచి నీటిని ఈ రెండు ప్రాజెక్టులకు తరలించే అంశాలపై అధ్యయనం చేయాలని ఇంజనీర్లు నిర్ణయించినట్లుగా తెలిసింది. తెరపైకి అయిదురకాల ప్రతిపాదనలు.. ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగానే ఐదు రకాల ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ఇందులో దుమ్ముగూడెం నుంచి సాగర్‌కు నీటిని తరలించడం ఒకటి కాగా, మరొకటి పోలవరం నుంచి పులిచింతల, సాగర్ల మీదుగా శ్రీశైలానికి తరలించడం ప్రధానంగా ఉన్నాయి. ఇందులో ఇప్పటికే దుమ్ముగూడెం నుంచి సాగర్‌కు తరలించేలా ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రతిపాదనలు చేశారు. దు మ్ముగూడెం ప్రాంతం నుంచి 165 టీఎంసీల నీటిని తీసుకుంటూ ఖమ్మం జిల్లా బయ్యారం నుంచి నాగార్జునసాగర్ దిగువన నల్లగొండ జిల్లాలోని హాలియా సమీపంలో ఉన్న టెయిల్‌పాండ్ ప్రాజెక్టులోకి నీటిని తరలించేలా ప్రతిపాదన ఉంది. దీని కోసం 244 కిలోమీటర్ల పొడవున లింక్‌కెనాల్ తవ్వడంతో పాటు, 6 లిఫ్టు వ్యవస్థల నిర్మాణం చేయాల్సి ఉంది. ఈ నీటిని టెయిల్‌పాండ్‌కు తరలించాక సాగర్ డ్యామ్‌లోని హైడ్రో ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్‌లోని 7 రివర్సబుల్ టర్బైన్ల ద్వారా నీటిని సాగర్ రిజర్వాయర్‌లోకి తరలించవచ్చని అప్పట్లో నిర్ధారించారు.లింక్‌కెనాల్ తవ్వకంతో ఖమ్మం, నల్లగొండ జిల్లాల పరిధిలో 3,701 ఎకరాల అటవీభూమి, 16,084 ఎకరా ల ప్రైవేటు భూమిని రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ప్రస్తుతం ముంపు ప్రాంతాన్ని తగ్గించి, కనిష్టంగా 200 టీఎంసీల నీటిని, ఇరు రాష్ట్రాల్లోని కరువు జిల్లాల్లో గరిష్ట ఆయకట్టుకు తరలించే ప్రతిపాదనలపై ఇంజనీర్లు దృష్టి సారించారు. ఇక పోలవరం నుంచి వైకుంఠాపురం బ్యా రేజీ మీదుగా పులిచింతలకు, అటునుంచి సాగర్, అక్కడి నుంచి శ్రీశైలానికి తరలించే ప్రతిపాదనపైనా క్షుణ్నం గా అధ్యయనం చేయాలని ఇంజనీర్లు నిర్ణయించారు. నదీగర్భం ద్వారానే నీటిని తరలించే ఈ విధానంతోనే తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే ప్రాజెక్టును పూర్తి చేయవచ్చని తెలంగాణ ఇంజనీర్లు చెబుతున్నారు. ఈఎన్సీ నేతృత్వంలో కమిటీ.. ఇక గోదావరి నుంచి శ్రీశైలానికి నీటిని తరలించే ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పది మంది ఇంజనీర్లతో కమిటీని నియమించింది. ఈఎన్సీ మురళీధర్ నేతృత్వంలోని ఈ కమిటీలో అంతర్రాష్ట్ర జల విభాగపు సీఈ ఎస్.నరసింహరావు, సాగర్ సీఈ నర్సింహా, సీతారామ ఎస్ఈ టి.నాగేశ్వర్రావు, అంతర్రాష్ట్ర విభాగపు ఎస్ఈ మోహన్‌కుమార్‌లతో పాటు రిటైర్డ్ ఇంజనీర్లు వెంకటరామారావు, చంద్రమౌళి, సత్తిరెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, భవానీరామ్ శంకర్లు ఉన్నారు. -
ఐఐటీల్లో అమ్మాయిలు అంతంతే!
దేశంలోని 3,000 విద్యాసంస్థల నుంచి ఏటా 15 లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు. వారిలో యువతులు 30 శాతం మంది మాత్రమే. అడ్వాన్స్డ్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) కోచింగ్ క్లాసుల తాలూకూ ప్రకటనల్లో అమ్మాయిల ఫొటోలు దాదాపుగా కనిపించని పరిస్థితి. ఐఐటీల్లో పరిస్థితి మరింత అన్యాయం. ఈ ఏడాది 23 ఐఐటీల్లో మొత్తం 38,705 మంది అభ్యర్థులు ప్రవేశార్హత సాధించగా అందులో బాలికలు 5,356 (13.8 శాతం) మంది మాత్రమే. అమ్మాయిల్లో టాపర్‌గా నిలిచిన షబ్నమ్ సహాయ్ 10వ ర్యాంకు సాధించింది. 2018లో టాప్ 500 మంది అభ్యర్థుల్లో అమ్మాయిల సంఖ్య 23 మించలేదు. ఉన్నత విద్యారంగంలో చోటుచేసుకున్న లింగ వివక్షకు ఇదొక ప్రబల ఉదాహరణ. బాలికలపట్ల సమాజ ధోరణులే ఇందుకు కారణమవుతున్నాయంటున్నారు శాస్త్ర సాంకేతికశాఖ కార్యదర్శి అశుతోశ్ శర్మ. కుటుంబం అబ్బాయిలను ప్రోత్సహిస్తోంది. వారు మరో ఆలోచన లేకుండా తమ ఐఐటీ కలలను సాకారం చేసుకోగలుగుతున్నారు. అమ్మాయిలకు సమర్థత ఉన్నప్పటికీ ప్రోత్సాహం కరువవుతోంది. ‘నా కూతురు భద్రంగా ఉంటుందా? ఇంటికి దూరంగా మనగలుగుతుందా? కోర్సు డిమాండ్ చేసిన విధంగా చదువు సాగించేందుకు ఆమె ఆరోగ్యం సహకరిస్తుందా?’ వంటి ఎన్నో ప్రశ్నలు తల్లిదండ్రుల్లో తలెత్తుతున్నాయి. వారిని ఆందోళనకు లోను చేస్తున్నాయి. ఐఐటీల్లో సీటు సంపాదించాలంటే విద్యార్థులు గట్టి కోచింగ్ తీసుకోవాల్సి ఉంటుంది. అదొక ఖరీదైన వ్యవహారం. ఇంటికి దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు అమ్మాయిల విషయంలో ఖర్చు పెట్టేందుకు సిద్ధ్దపడని దుస్థితి. పైగా రవాణా సౌకర్యం, హాస్టల్లో ఉండాల్సి రావడం గురించి నానారకాల భయాలు. ఈ పరిస్థితుల్లో అమ్మాయిల్ని స్థానిక కళాశాలల్లో చేర్చడం ఉత్తమమని తల్లిదండ్రులు భావిస్తున్నట్లు కాన్పూర్‌లో పార్ధా కోచింగ్ సెంటర్ నడుపుతున్న మనీష్ సింగ్ చెబుతున్నారు. ఈ ఏడాది ఆయన 1,500 మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. వారిలో 10 శాతం మంది మాత్రమే బాలికలు. వారెవ్వరూ ఉత్తీర్ణులు కాలేదు. సీటు లభించాలేగానీ అమ్మాయిలు అబ్బాయిల కంటే మెరుగ్గా రాణించగలుగుతున్నారంటారు ఐఐటీ ఢిల్లీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సుమీత్ అగర్వాల్. ప్రవేశపరీక్ష బాలికలకు ఒకింత అవరోధంగా ఉందని ఆయన చెబుతున్నారు. ఐఐటీల్లో లింగ నిష్పత్తి మెరుగుపరచాలనే ఉద్దేశంతో గతేడాది ఐఐటీ కౌన్సిల్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన బాలికలకు అదనంగా సీట్లు కేటాయించింది. దీంతో వారి శాతం 8 నుంచి 16కి పెరిగింది. ఐఐటీ ఢిల్లీ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లో 2016లో 70 మంది బాలికలు చేరగా ఈ ఏడాదికి ఆ సంఖ్య 190కి పెరిగిందని అగర్వాల్ తెలిపారు. ఐఐటీలు లింగ సమతౌల్యత పాటించేలా చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ పరిస్థితి విశదపరుస్తోంది. లేకుంటే జనాభాలో 50 శాతం మంది ప్రతిభా సామర్థ్యాలను మనం కోల్పోతామంటున్నారు అగర్వాల్. మెరుగైన సమాజం కోసం సాంకేతికతను వాడుకోవాలని భావిస్తున్న మనం.. ఇందులో అన్ని తరగతుల ప్రజలను భాగస్వాముల్ని చేయాల్సి ఉందని అగర్వాల్ వంటి మేధావులు సూచిస్తున్నారు. -
నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత
మోర్తాడ్(బాల్కొండ): చిన్న తరహా నీటిపారుదల శాఖ లో ఇంజినీర్ల కొరత వేధిస్తోంది. ఖాళీ అయిన పోస్టులలో ప్రభుత్వం భర్తీ చేయకపోవడంతో ఇన్‌చార్జులతోనే శాఖలోని పనులను అధికారులు నెట్టుకొస్తున్నారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకం పనులకు తీరని ఆటంకం కలుగుతోంది. క్షేత్ర స్థాయిలో పని చేయడానికి ఒక్కో మండలానికి ఒక ఏఈ ఖచ్చితంగా అవసరం. కొత్త మండలాల వారీగా కాకపోయినా పాత మండలాల వారిగానైనా ఏఈలు ఉండాల్సి ఉంది. అయితే పోస్టులు భర్తీ కాలేక పోయాయి. పదవీ విరమణ చేసిన అధికారుల స్థానంలో కొత్తగా ఉద్యోగులను నియమించకపోవడంతో ఖాళీలు పేరుకు పోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నీటిపారుదల శాఖను పాలించే ఎస్ఈ పోస్టు ఖాళీగా ఉంది. ఎస్ఈగా పని చేసిన దామోదర్ మాల్ ఏప్రిల్‌లో పదవీ విరమణ పొందారు. దీంతో నిర్మల్ జిల్లా ఎస్ఈగా పని చేస్తున్న మురళీధర్‌కు ఇక్కడ పదవీ బాధ్యతలను అదనంగా అప్పగించారు. రెండు జిల్లాల బాధ్యతలను ఒక్క అధికారే పర్యవేక్షించాల్సి ఉంది. బాల్కొండ నియోజకవర్గానికి సంబంధించి రెగ్యులర్ ఏఈ ఒక్క కమ్మర్పల్లి మండలానికి మాత్రమే ఉన్నారు. మోర్తాడ్‌లో పదవీ విరమణ పొందిన ఏఈ గంగాధర్‌ను తాత్కాలిక పద్ధతిలో నియమించారు. ఏర్గట్ల, భీమ్‌గల్, బాల్కొండ మండలాలతో పాటు కొత్తగా ఏర్పడిన ముప్కాల్, మెండోరా, ఏర్గట్ల మండల బాధ్యతలను మోర్తాడ్ బాధ్యతలను నిర్వహిస్తున్న అధికారే పరిశీలించాల్సి వస్తోంది. ఆర్మూర్ నియోజకవర్గంలో మాక్లూర్, ఆర్మూర్‌లకు మాత్రమే ఏఈలు ఉన్నారు. నందిపేట్ మండలంలోని పోస్టు ఖాళీగానే ఉంది. ఆర్మూర్ ఏఈ నందిపేట్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. నందిపేట్ మండలం భౌగోళికంగా చాలా పెద్దదిగా ఉండగా ఒకే అధికారి రెండు మండలాల బాధ్యతలను నిర్వహించడం కష్టంగానే ఉంది. నిజామాబాద్ రూరల్ మండలంలో డిచ్పల్లి, సిరికొండ మండలాల్లోనే ఏఈలు ఉన్నారు. ధర్పల్లి, ఇందల్వాయి, నిజామాబాద్ రూరల్, మోపాల్ మండలాల్లో పోస్టులు ఖాళీగా ఉండటంతో ఉన్న ఇద్దరు ఏఈలకు అదనపు బాధ్యతలను అప్పగించారు. నిజామాబాద్ అర్బన్‌కు సంబంధించి ఒక్కరే ఏఈ ఉన్నారు. ఇక్కడ సౌత్, నార్త్, సెంట్రల్ పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక్కరే అధికారి అదనపు బాధ్యతలను నిర్వహించాల్సి వస్తోంది. ఒక్క బోధన్ డివిజన్లో మాత్రం ఏఈ పోస్టుల్లో రెగ్యులర్ ఇంజినీర్లు ఉన్నారు. మిషన్ కాకతీయకు కీలకమైన నీటిపారుదల శాఖలో ఇంజినీర్ల కొరత ఉండటంతో చెరువుల పునరుద్ధరణ పనులు అటకెక్కాయి. రెండు, మూడు విడతల పునరుద్ధరణ పనులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఖాళీ పోస్టుల కారణంగా చెరువుల పునరుద్ధరణ ఆశించినంత మేర వేగంగా సాగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు. ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి నీటిపారుదల శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. మిషన్ కాకతీయ పథకం పనులు పూర్తి కావాలంటే ఏఈలు ఎంతో అవసరం. ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేస్తే నిరుద్యోగ సమస్య పరిష్కరించడంతో పాటు గ్రామాల్లో చెరువులు అభివృద్ధి చెందుతాయి. జిల్లా పరిషత్ ద్వారా ప్రభుత్వానికి ఈ సమస్యను విన్నవిస్తాం. ఖాళీ పోస్టులు భర్తీ అయ్యే వరకు ఉద్యమిస్తాం. – గుల్లె రాజేశ్వర్, జెడ్పీటీసీ సభ్యుడు, ఏర్గట్ల -
ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: వర్షాకాలం మొదలుకానున్న నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రాజెక్టు పరిధిలోని బ్యారేజీలు, రిజర్వాయర్లు, హెడ్ రెగ్యులేటర్ల పరిధిలోని గేట్లు, కాల్వలు, డిస్ట్రిబ్యూటర్లు, తూముల నిర్వహణను ప్రాధాన్యతగా తీసుకుంది. ప్రాజెక్టుల గేట్లు వాటి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విషయంలో అత్యం త శ్రద్ధ చూపాలని, గోదావరి, కృష్ణా నదులకు వరద పుంజుకునే సమయానికి నిర్వహణ అంశాలన్నింటినీ చక్కబెట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు జరిగిన సమీక్షలో ప్రధానంగా ప్రాజెక్టుల గేట్లు, తూములు, కాల్వలు, హెడ్ రెగ్యులేటరీల నిర్వహణ అంశాలపై కాళేశ్వరం, ఎస్సారెస్పీ, కడెం, పాలమూరు–రంగా రెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, జూరాలకు చీఫ్ ఇంజనీర్లకు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భం గా వరదల నిర్వహణ లోపాలను ఎత్తిచూపుతూ ఈ నెల ‘సాక్షి’ప్రచురించిన కథనాల్లోని అంశాలను సీఎం ప్రధానంగా ప్రస్తావించారు. గతేడాది కడెం ప్రాజెక్టు గేట్ల విషయంలో తలెత్తిన ఇబ్బందులను మరోమారు గుర్తు చేసినట్లు నీటిపారుదల వర్గాలు తెలిపాయి.దీంతోపాటే చాలా ప్రాజెక్టుల పరిధిలో వరదలు వచ్చే సమయాల్లో వర్క్ ఇన్స్పెక్టర్లు, గేటు ఆపరేటర్లు, హెల్పర్లు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, లష్కర్ ల పాత్ర కీలకంగా ఉన్నా అవసరానికి తగ్గట్లుగా వారు లేరన్న విషయాన్ని ప్రస్తావిస్తూ వారి నియామకాల విషయంలో జాప్యం చేయరాదని ఇంజనీర్లకు సూచించారు. గేట్లకు గ్రీజింగ్ చేసుకోవాలని, రోప్‌వైర్లు సరిచూసుకోవాలని మార్గనిర్దేశం చేశారు. ప్రధాన కాల్వలు, డిస్ట్రిబ్యూటరీల పరిధిలో లష్కర్ల నియామకాలను త్వరగా పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీటిని అందించే చర్యలు చేపట్టాలని సూచించారు. కాళేశ్వరం నీటితో తొలి ఫలితం ఎస్సారెస్పీ ఆయకట్టుకే అందనున్న దృష్ట్యా దాని పరిధిలోని కాకతీయ, లక్ష్మీ, సరస్వతి కాల్వల ఆధునీకరణ, అవసరమైన మరమ్మతు పనులను 20 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. కొండపోచమ్మ నుంచే సింగూరుకు.. మల్లన్న సాగర్ నుంచే కాళేశ్వరం నీటిని సింగూరుకు తరలించాలంటూ రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికపై పత్రికల్లో వచ్చిన కథనంపైనా సీఎం తన సమీక్షలో ప్రస్తావించినట్లు తెలిసింది. మల్లన్న సాగర్ నుంచి నీటి తరలింపులో 18 కి.మీ. టన్నెల్ పనుల పూర్తి అంశం అడ్డంకిగా ఉందని, అన్నీ ఆలోచించే కొండపోచమ్మ సాగర్ నుంచి నీటిని సింగూరుకు తరలించేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు సీఎం ఇంజనీర్లతో వ్యాఖ్యా నించినట్లు తెలిసింది. ఈ విషయంలో ఎటువంటి ప్రత్యామ్నాయాలకు తావులేదని, గతంలో నిర్ణయించిన మాదిరే సింగూరుకు నీటి తరలింపుపై ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించినట్లు సమాచారం. పాలమూరు–రంగారెడ్డి పనులకు కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారానే రూ.10 వేల కోట్ల మేర రుణం తీసుకుం టున్న దృష్ట్యా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. తుమ్మిళ్ల రెండోదశ పనులు, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఆర్డీఎస్లో మిగిలిన పనుల పూర్తిని వేగిరం చేయాలని సూచించారు. -
‘కాళేశ్వరం’ సర్జ్‌పూల్‌లో కొనసాగుతున్న పరిశీలన
సాక్షి, హైదరాబాద్ : కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా కొనసాగుతున్న ట్రయల్‌రన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఎల్లంపల్లి రిజర్వాయర్ నుంచి ప్యాకేజీ–6 కాల్వలకు నీటిని విడుదల చేసిన ఇంజనీర్లు, టన్నెళ్ల ద్వారా వస్తున్న నీటితో నందిమేడారం పంప్‌హౌజ్‌లోని సర్జ్‌పూల్‌ను నింపుతున్నారు. 138 మీటర్ల లోతైన సర్జ్‌పూల్‌ను క్రమంగా నీటితో నింపుతూ లీకేజీలను గమనిస్తున్నారు. ఇప్పటివరకు సర్జ్‌పూల్ లెవల్ని 16 మీటర్ల వరకు నింపినట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. ప్రతి గంటకు 0.6 మీటర్ల మేర నీరు సర్జ్‌పూల్‌లో నిండుతోందని తెలిపారు. ఇప్పటివరకు ఎలాం టి నీటి లీకేజీలు లేవని స్పష్టంచేశారు. 138 మీటర్ల లెవల్‌కు నీటి మట్టాలు చేరిన వెంటనే పంప్‌హౌజ్‌లోని మోటార్లను రన్ చేయనున్నారు. ఈ మోటార్ల ద్వారా వెట్ రన్ నిర్వహించనున్నారు. ఈ నెల 24న వెట్‌రన్‌ను నిర్వహించే అవకాశాలున్నట్లు ప్రాజెక్టు అధికారులు ప్రకటించారు. సర్జ్‌పూల్ నింపే ప్రక్రియను ప్రభుత్వ ఎత్తిపోతల సలహాదారు పెంటారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఈఈ నూనె శ్రీధర్‌లు పర్యవేక్షిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులను శుక్రవారం మహారాష్ట్ర నీటి పారదుల శాఖ ఇంజనీర్ల బృందం పరిశీలించింది. -
మా కొలువు.. మా ఇష్టం! జీహెచ్ఎంసీలో అంతే..
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో కొందరి మాట చెల్లుబాటవుతోంది. ఎంతగా అంటే వారు తమకిష్టమైన జోన్ లేదా సర్కిల్లో మాత్రమే పనిచేస్తారు. లేదంటే.. వేరే జోన్ లేదా సర్కిల్‌కు బదిలీ చేసినా వెళ్లరు. దీర్ఘకాలం సెలవులోనైనా ఉంటారు తప్ప మరో చోటుకు వెళ్లరు. ఇలాంటి వారు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగేందుకు పైఅధికారుల ఆశీస్సులు పుష్కలంగా ఉండటమే కారణం. ఇదే సందర్భంలో పనిలో పనిగా తమకు నచ్చని వారిని ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తారు. అలాంటి ఘటనలకు తాజా మచ్చుతునక ఇది. దీర్ఘకాలంగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న ఇంజినీర్ల బదిలీల్లో భాగంగా గత సంవత్సరం శేరిలింగంపల్లి సర్కిల్లో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం నిజామాబాద్‌కు బదిలీ చేసింది. హైదరాబాద్..అందునా శేరిలింగంపల్లి సర్కిల్లో తప్ప ఎక్కడా పనిచేయడం ఆయనకు ఇష్టముండదనేది సహచర ఇంజినీర్లు చెబుతున్న మాట. దానికి ఊతమిస్తూ ఆయన బదిలీ అయ్యాక దాదాపు వారం కూడా అక్కడ పనిచేయకుండానే దీర్ఘకాలంగా సెలవులో ఉన్నారు. ఏడాది తిరక్కముందే నిజామాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ నుంచి తిరిగి జీహెచ్ఎంసీకే బదిలీ అయ్యారు. దీర్ఘకాలంగా జీహెచ్ఎంసీలో పనిచేస్తున్నారని బదిలీ చేయగా, అక్కడ పనిచేయకుండా తిరిగి జీహెచ్ఎంసీకి వచ్చారు. ఈ సంవత్సరం జనవరి 24వ తేదీన ఆయన బదిలీ కాగా, 25వ తేదీన జాయినింగ్ రిపోర్టు ఇచ్చారు. జీహెచ్ఎంసీలో పలు సర్కిళ్లలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాంటి వాటిల్లో ఎక్కడైనా ఆయనను నియమించవచ్చు. కానీ..ఈనెల 12వ తేదీ వరకు ఆయనకు ఎలాంటి పోస్టింగు ఇవ్వలేదు. ఆయన కోరుకునే.. గతంలో పనిచేసిన శేరిలింగంపల్లి సర్కిల్లోనే నియమించేందుకు ఈ జాప్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఆయనను తిరిగి శేరిలింగంపల్లి ఈఈగా పోస్టింగ్ ఇచ్చారు. ఒక్కరినే మారిస్తే బాగోదని కావచ్చు లేదా ఉన్నతాధికారులు తమకు నచ్చని వారిని ఆయా స్థానాల నుంచి కదిలించేందుకు కావచ్చు మరికొందరి స్థానాల్లో సైతం మార్పుచేర్పులు చేస్తూ బదిలీలు చేశారు. ప్రాజెక్టు విభాగం నుంచి నిర్వహణకు.. ఇలా చేసిన బదిలీల్లోనూ అన్నీ నిర్వహణ విభాగంలోనివేనా అంటే కాదు.. ప్రాజెక్టు విభాగమైన హౌసింగ్ విభాగంలోని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను నిర్వహణ విభాగంలోకి.. నిర్వహణ విభాగంలోని వారిని హౌసింగ్ విభాగంలోకి మార్చారు. హౌసింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. లక్ష ఇళ్ల నిర్మాణ లక్ష్యంలో భాగంగా దాదాపు 30 వేల ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. మిగతావి పురోగతిలో ఉన్నాయి. నిధుల లేమి తదితర కారణాలతో మందకొడిగా పనులు సాగుతున్నాయి. పునాదుల నుంచి దాదాపు 60 శాతం వరకు పనులు చేసిన వారిని వారి స్థానంలో నుంచి తప్పించి, నిర్వహణ విభాగంనుంచి నియమించారు. హౌసింగ్ డివిజన్ –2 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను ముషీరాబాద్ సర్కిల్ నిర్వహణ విభాగానికి బదిలీ చేశారు. అంబర్‌పేట సర్కిల్ నిర్వహణ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌ను హౌసింగ్ విభాగానికి బదిలీ చేశారు. ఇంజినీర్లకు ఎక్కడైతేనేమీ పనిచేయడానికి అనే ప్రశ్నలు సహజమే అయినప్పటికీ.. అదే సూత్రం అందరికీ ఎందుకు వర్తించదనేదే ప్రశ్న. కొందరికేమో కనీసం సర్కిల్ కూడా మార్చరు. కొందరినేమో ఏకంగా విభాగాలే మార్చడం వెనుక మతలబేమిటన్నదీ జీహెచ్ఎంసీలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. హౌసింగ్పనులు మొదట్నుంచీ పర్యవేక్షిస్తున్న వారికి వాటిల్లో లోటుపాట్లను గుర్తించడంతో పాటు ఇతరత్రా అంశాల్లోనూ తగిన అనుభవం వచ్చినందున ఆమేరకు ప్రభావం ఉంటుంది. కొత్తవారికి మరికొంత సమయం తీసుకుంటుందనే అభిప్రాయాలున్నాయి. ఇటీవలే రాంపల్లిలో జరుగుతున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో జరిగిన ప్రమాదంలో కార్మికులు మృతి చెందడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్తగా నిర్వహణ విభాగం నుంచి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనుల్లో నియమించడం ఎందుకో అంతుబట్టడం లేదు. వీటిపై కమిషనర్, ఉన్నతాధికారులు ఏం చేయనున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
జూన్‌లో ఎల్లంపల్లికి మేడిగడ్డ నీళ్లు
మంథని/రామగుండం/కాళేశ్వరం: జూన్ నాటికి మేడిగడ్డ నీటిని ఎల్లంపల్లి ప్రాజెక్టుకు తరలిస్తామని తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల సంఘం ప్రధాన కార్యదర్శి మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలనలో భాగంగా ఆరుగురు సభ్యుల విశ్రాంత ఇంజనీర్ల బృందం మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలతోపాటు కన్నెపల్లి, అన్నారం, గోలివాడ పంపుహౌస్‌లను సోమవారం సందర్శించింది. ఈ సందర్భంగా శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్–4లో పనులు వెనుకబడ్డాయని, రెండు నదుల కలయికతో అసౌకర్యం ఏర్పడినట్లు తెలుస్తోందన్నారు. నీటిని మళ్లిస్తున్నామని, మార్చి నాటికి పనులు పూర్తి చేస్తామని ఏజెన్సీ నిర్వాహకులు చెప్పారన్నారు. 11 మోటార్లు, పంపులు, 87 గేట్లు బిగింపు పూర్తవుతుందన్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 పంపులకు గాను 4 బిగించారని తెలిపారు. 2 టీఎంసీకి డిజైన్‌తోపాటు అదనంగా మరో టీఎంసీ నీటిని వినియోగించుకునేందుకు వీలుగా పనులు జరుగుతున్నాయని వివరించారు. మరో 5 మోటార్లు రావాల్సి ఉందని,2 జనవరి, మరో 3 ఫిబ్రవరి వరకు చేరుతాయని ఏజెన్సీ వారు చెబుతున్నారని, సమయానికి చేరితే మార్చి నాటికి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు. జూన్ నాటికి రాష్ట్ర మంతటికి సాగునీరు అందుతుందన్నారు. కన్నెపల్లి పంపుçహౌస్, మార్చి, ఏప్రిల్ నాటికి పూర్తి కావచ్చన్నారు. అన్నారం బ్యారేజీ పూర్తయిందని, 66 గేట్లు బిగింపు, వంతెన పనులు పూర్తయ్యాయన్నారు. సుందిళ్ల బ్యారేజీలోనూ 74 గేట్ల బిగింపు పూర్తయిందన్నారు. ప్రస్తుత పరిస్థితిపై నివేదికను సీఎంకు అందిస్తామన్నారు. బ్యారేజీ డిజైన్, మ్యాప్‌లను పరిశీలించినన బృందం సభ్యులు సాంకేతికకు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. బృందంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమౌళి, సభ్యులు వేణుగోపాల్, రాంరెడ్డి, సత్తిరెడ్డి, వెంకట్రామరెడ్డి ఉన్నారు. -
మీకంటే చైనావాళ్లే సూపర్ ఫాస్ట్
సాక్షి, తిరుపతి: ‘‘మీ(భారతీయులు) కంటే చైనీయులు సూపర్ ఫాస్ట్. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న టీసీఎల్ కంపెనీ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 9 నెలల సమయం ఇస్తున్నానని చెప్పాను. వాళ్లు(చైనీయులు) ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే తొమ్మిది నెలల్లో పూర్తి చేయమని మీకు(భారతీయులు) చెబితే.. తొమ్మిది నెలలా? అని ఆశ్చర్యంగా అడిగేవారు. అదీ చైనీయుల కమిట్మెంట్. చైనావారు పట్టుదల, అంకితభావం, స్పీడ్‌తో ముందుకు వెళ్తుంటారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చైనీయులను పొగడ్తల్లో ముంచెత్తారు. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులో రేణిగుంట విమానాశ్రయం సమీపంలో వికృతమాల వద్ద టీసీఎల్ ఇండస్ట్రియల్ పార్క్‌కు గురువారం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రేణిగుంట విమానాశ్రయం వద్ద 1,000 ఎకరాల్లో కొత్తగా సిలికాన్ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్ హుబ్గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. టీసీఎల్ ప్రాజెక్టు రాకతో 6 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో 2,618 ప్రాజెక్టుల్లో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడితో 33 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. 2020 నాటికి 15 శాతం వృద్ధిరేటు ఆంధ్రప్రదేశ్‌ను 2029లోపు దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచం లోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 2020 నాటికి 15 శాతం వృద్ధిరేటు ఉండేలా పని చేస్తామన్నారు. తిరుపతి, నెల్లూరు, చెన్నైలను కలుపుతూ సిలికాన్ కారిడార్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు. దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు ఇందులో భాగమవుతాయని అన్నారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ తదితర పరిశ్రమల రాకతో చిత్తూరు జిల్లా రూపురేఖలు మారిపోతాయని, ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం పొందుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గ్లోబల్ టీవీ మార్కెట్లో జపాన్, కొరియాలతో తమ సంస్థ పోటీ పడుతోందని టీసీఎల్ ఛైర్మన్, సీఈఓ థామ్సన్ లీ పేర్కొన్నారు. టీసీఎల్ వ్యూహాత్మక మార్కెట్ ఇండియా అని చెప్పారు. టీవీ ప్యానళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే టీసీఎల్ మూడో స్థానంలో కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ విజయానంద్ మాట్లాడారు. దేశంలో బీజేపీ పతనం మొదలైంది తిరుపతి సమీపంలోని పాడిపేట వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన 3,216 గృహాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. బీజేపీ సహకరించి ఉంటే ఏపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవాళ్లమని అన్నారు. ఏపీలో తెలివైనవారు ఉన్నారనే ఉద్దేశంతో నరేంద్రమోదీ కక్షగట్టారని ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపుతో బీజేపీని ఓడించామన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో పది మంది ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపించాలని చంద్రబాబు కోరారు. -
ప్రముఖ ఐటీ సంస్థలో 30వేల ఉద్యోగాలు
సాక్షి,ముంబై: దేశీయ నాలుగవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ హెచ్‌సీఎల్ టెక్ శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించు కోనున్నట్టు తెలిపింది. ముఖ్యంగా స్టాక్ (అబ్స్ట్రాక్ట్ డేటా) ఇంజనీర్లను నియమించుకుంటామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరానికి అంచనా వేసిన గైడెన్స్ ప్రకారం వృద్ధిరేటును సాధించేందుకు 25-30వేల వరకు ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటామరని హెచ్‌సీఎల్ హెచ్ఆర్ విభాగం ముఖ్య అధికారి వి అప్పారావు ఒక మీడియా ఇంటర్వ్యూలో తెలిపారు. అలాగే అమెరికాలో స్థానికులకు 65శాతం ప్రాధాన్యత నిచ్చిన నేపథ్యంలో డిపెండెన్స్ వీసాలు బాగా తగ్గాయన్నారు. దీంతోపాటు వీసాల జారీ అస్యంగా కారణంగా హెచ్1బీ , ఎల్1బీ వీసాల సంఖ్య క్షీణించిందని అప్పారావు వెల్లడించారు. ఈ ఏడాది 640హెచ్1బీ వీసాలకు దరఖాస్తు చేయగా 400మందికి అనుమతి లభించినట్టు తెలిపారు. సెప్టెంబరు 30నాటి కంపెనీలో మొత్తం ఉద్యోగుల సంఖ్య 12875 ఉండగా క్యూ2లో అదనంగా మరో 3754మంది చేరారని కంపెనీ ఫలితాల సందర్భంగా వివరించింది. -
‘సీఐడీ పనితీరు దారుణం’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీస్ శాఖలోని కీలక విభాగమైన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్(సీఐడీ) పనితీరు అత్యంత దారుణం గా ఉందని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సీఎస్‌కు సోమవారం లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల స్కాం కేసులో సీఐడీ విచారణ తీరు, ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆ సంస్థ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఫిర్యాదులో స్పష్టం చేశారు. ఈ స్కాంలో భాగంగా 36గ్రామాల్లో సీఐడీ దర్యాప్తు చేసిందని, ఇళ్లు ఎప్పుడు కట్టారన్న అంశంలో ఇంజనీర్లు తేల్చాలని చెప్పడం ఆ సంస్థ పనితీరు డొల్లతనంగా ఉందన్నారు. రాష్ట్ర ఆవిర్భా వం తర్వాత సీఐడీ వద్ద 242 కేసులు పెండింగ్‌లో ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 402 కేసులకు చేరిందని, దీనివల్ల సీఐడీ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయడంలేదన్న వాదన వినిపిస్తోందన్నారు. సీఐడీకి ఏటా రూ.కోట్ల బడ్జెట్ కేటాయించి ఏం సాధించారో చెప్పాలన్నారు. ఈ విభాగం పనితీరును సమీక్షించి గాడిలో పెట్టాల్సిన అవసరముందని సీఎస్‌ను కోరారు. -
అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయలు కిడ్నాప్
-
ఏడుగురు భారతీయ ఇంజనీర్ల కిడ్నాప్
కాబూల్: అప్ఘనిస్తాన్‌లో ఏడుగురు భారతీయ ఇంజనీర్లను గుర్తుతెలియని సాయుధులు కిడ్నాప్ చేశారు. ఒక అప్ఘన్ ఉద్యోగిని కూడా దుండగులు అపహరించారు. వీరంతా అప్ఘనిస్తాన్‌లోని కేఈసీ కంపెనీకి చెందిన ఉద్యోగులని తెలుస్తోంది. కంపెనీ పనిపై వీరంతా ఓ బస్సులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు సమాచారం. కాగా, కిడ్నాప్ సమాచారంపై కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్రదిస్తోంది. భారత ఇంజినీర్లను విడిపించేందుకు చర్యలు ప్రారంభించినట్లు భారత రాయబార కార్యాలయ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఘటనకు పాల్పడింది తామేనంటూ ఇంతవరకూ ఏ సంస్థ ప్రకటించుకోలేదని చెప్పారు. కిడ్నాప్‌కు గురైన వారు ఎక్కడివారనే విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉందనన్నారు. మరోవైపు తాలిబన్ ఉగ్రవాద సంస్థ ఈ కిడ్నాప్‌కు పాల్పడినట్టుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
పునరుజ్జీవ’ పథక మోటార్లను పరిశీలించిన ఇంజనీర్లు
సాక్షి, హైదరాబాద్: ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంలో వినియోగించనున్న మోటార్ల తయారీ, పనితీరును చైనా వెళ్లిన రాష్ట్ర ఇంజనీర్ల బృందం గురువారం పరిశీలించింది. నిర్ణీత ప్రామాణికాల మేరకు పంపుల తయారీ ఉన్నదీ లేనిదీ తనిఖీ చేసింది. ఈఎన్సీ అనిల్‌కుమార్, ఎత్తిపోతల పథకాల సలహాదారు పెంటారెడ్డి, తెలంగాణ జెన్కో ఇంజనీర్ వాసుదేవ్ చైనాలోని వుషి నగరంలో ఎస్ఈసీ కంపెనీలో తయారవుతున్న వర్క్‌షాప్‌ను రెండు గంటల పాటు పరిశీలించారు. మోటారు పనితీరు సంతృప్తికరం గా, డిజైన్ స్పెసిఫికేషన్ల ప్రకారమే ఉన్నాయని పెంటారెడ్డి పేర్కొన్నారు. జూలై చివరి వరకు కనీసం మూడు పంపులు బిగించి నీటిని తోడవలసిన పరిస్థితి ఉందని, దానికి అనుగుణంగా పంపులు మోటార్ల సరఫరా జరగాలని పెంటారెడ్డి కంపెనీ ప్రతినిధులకు స్పష్టం చేశారు. మోటార్లు, పంపుల బిగింపు సమయంలో కంపెనీ ప్రతినిధులు తప్పనిసరిగా ఉండాలని వారికి సూచించారు. వీటి సరఫరా తేదీలను నిర్ధారించాలని కోరారు. సాయంత్రం 6 గంటల వరకు అనేక సాంకేతిక అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని అనిల్, పెంటారెడ్డి పేర్కొన్నారు. రెండు పంపు హౌస్‌లలో బిగించడానికి 6 మోటార్లు సిద్ధంగా ఉన్నాయని, జూన్ చివరికల్లా ప్రాజెక్టు ప్రదేశానికి వాటిని చేరుస్తామని కంపెనీ ప్రతినిధులు హామీ ఇచ్చినట్లు పెంటారెడ్డి తెలిపారు. -
కానిస్టేబుళ్లుగా ఇంజనీర్లు, టెకీలు, ఎంబీఏలు!
అహ్మదాబాద్ : హరీశ్ విటల్ చదివింది ఎంబీఏ. కానీ ఉద్యోగం నవ్‌రంగ్‌పుర పోలీసు స్టేషన్లో లోక్ రక్షక్ దల్(ఎల్ఆర్డీ) జవానుగా పోస్టింగ్. హరీశ్ ఒక్కడే కాదు అదే పోలీసు స్టేషన్‌కు ఇటీవల బదిలీ అయిన మరో ఇద్దరు కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్లే. అదే పోలీసు స్టేషన్లో బీసీఏ, బీఏ, బీఎడ్, పీజీడీసీఏ, ఎంఎస్సీ వంటి ప్రొఫిషనల్ డిగ్రీలు కలిగి వారు మరో ఐదుగురు ఉన్నారు. ఇలా మెజార్టీ పోలీస్ స్టేషన్లలో లోక్ రక్షక్ దల్ జవానుగా ఎంపికైన వారు ఎక్కువగా ప్రొఫిషనల్ డిగ్రీవారే ఉన్నారని తెలిసింది. అంటే గతేడాది గుజరాత్ పోలీసు విభాగం నిర్వహించిన పరీక్షలో ఎల్ఆర్డీ జవానులుగా ఎంపికైన వారిలో చాలా మంది ప్రొఫిషనల్ డిగ్రీ అభ్యర్థులు కలిగివారేనని వెల్లడైంది. ఈ పోస్టులకు అర్హత కేవలం పన్నెండో తరగతి ఉత్తీర్ణత అయితే చాలు. కానీ ఈ కానిస్టేబుల్ పోస్టులకు ఎక్కువగా ఎంబీఏలు, టెకీలు, ఇంజనీర్లే అర్హత సాధించినట్టు తెలిసింది. ఐదేళ్ల కాలానికి పిక్స్డ్ పేతో ఎల్ఆర్డీలను నియమిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ కానిస్టేబుల్‌గా వీరికి పోస్టింగ్ ఇస్తారు. మొత్తం ఎంపికైన 17,532 మంది ఎల్ఆర్డీ జవాన్లలో 50 శాతం మందికి పైగా గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిన వారే ఉన్నారని 2017 ఎల్ఆర్డీ రిక్రూట్మెంట్ చైర్మన్, వడోదర రేంజ్ ఐజీపీ జీఎస్ మాలిక్ చెప్పారు. అర్హత కంటే మించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో భద్రత లేకపోవడంతో, ఎక్కువగా యువత తక్కువ ప్రొఫైల్, వేతనం ఉన్నప్పటికీ, సెక్యుర్ జాబ్స్ వైపే ఆసక్తి చూపుతున్నట్టు గుజరాత్ యూనివర్సిటీ సోషయాలజీ డిపార్ట్మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గౌరంగ్ జాని అన్నారు. -
మీరు నిద్ర పోతున్నారు..!
మహదేవపూర్: మిత్రమా సమయం లేదు.. ప్రభుత్వం పరుగెడుతున్నా.. ఇంజినీర్లు నిద్రపోతున్నారు.. ఇలా అయితే డిసెంబర్‌లోగా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం ఎలా పూర్తి చేస్తారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు బ్యారేజీ ఈఈ రమణారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశా రు. సోమవారం మేడిగడ్డ బ్యారేజీని సందర్శించిన ఆయన ఇంజినీర్లతో మాట్లాడారు. మహారాష్ట్ర వైపు పనులు వేగవంతంగా ఎందుకు నడవటం లేదని ప్రశ్నించారు. ‘తెలంగాణ వైపు ప్రభుత్వం అన్నీ సమకూర్చింది.. ఇక్కడ ఐబీ ఇంజినీర్లకు ఏం పని.. ఎల్అండ్టీ కంపెనీ పనులు చేస్తోంది. మహారాష్ట్ర వైపు ఇంకా 170 ఎకరాలు భూసేక రించాల్సి ఉంది. రైతులను ఒప్పించి భూసేకరణ చేయాలి. గడ్చిరోలి జిల్లా కలెక్టర్‌ను కలవండి.. భూసేకరణ వేగవంతం చేయండి’ అని ఆదేశించారు. గడ్చిరోలి జిల్లా కలెక్టర్ రంగనాయక్, జేసీతో మంత్రి ఫోన్లో మాట్లాడారు. త్వరగా భూసేకరణ చేయాలని, ఏమైనా ఇబ్బందులు ఉంటే చెప్పండి తానే స్వయంగా ముంబై వెళ్లి ఆర్థికశాఖ మంత్రి సుధీర్ ముదిగంటివార్‌తో మాట్లాడుతానన్నారు. 15రోజుల్లో భూసేకరణ పూర్తి చేసి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. -
బాష్‌లో కొలువుల జోష్
సాక్షి, న్యూఢిల్లీ : జర్మన్ ఆటోమోటివ్ పరికరాల దిగ్గజం బాష్ భారత్ ఆర్అండ్డీ సెంటర్ కోసం 10,000 మంది ఇంజనీర్లను నియమించుకోనుంది. రానున్న కొన్నేళ్లలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి టెక్నాలజీపై పనిచేసేందుకు వీరిని రిక్రూట్ చేసుకోనుంది. వినూత్న ఉత్పత్తుల తయారీకి, వచ్చే రెండేళ్లలో భారత్‌లో రూ 500 కోట్ల నుంచి రూ 800 కోట్ల వరకూ పెట్టుబడి పెడుతున్నట్టు బాష్ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ సౌమిత్ర భట్టాచార్య చెప్పారు. ఐఓటీపై భారీగా వెచ్చిస్తున్నామని, భవిష్యత్‌లో దీనికి మంచి డిమాండ్ ఉందన్నారు. ఎలక్ర్టిక్ వాహనాలు పెరుగుతున్న క్రమంలో బ్యాటరీల తయారీని చేపట్టాలని కంపెనీ సన్నాహాలు చేస్తోందని, దీనిపై త్వరలోనే బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. భారత్‌లో బాష్ తన రెండో అతిపెద్ద ఆర్అండ్డీ సెంటర్‌ను బెంగళూర్‌లో నిర్వహిస్తోంది. ఈ సెంటర్లో 18,000 మందికి పైగా ఇంజనీర్లు పనిచేస్తున్నారు. -
శాంసంగ్‌లో భారీగా ఉద్యోగావకాశాలు
సాక్షి, బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ భారతీయ ఇంజనీర్లకు శుభవార్త అందించింది. దాదాపు వెయ్యిమంది ఇంజనీర్లను ఏడాది ఎంపిక చేయనున్నామని ప్రకటించింది. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలనుంచి వీరిని సెలెక్ట్ చేస్తామని, ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్నతమ ఆర్ అండ్ డీ సెంటర్ల కోసం ఈ ఇంజనీర్లను ఎంపిక చేయనున్నట్టు తెలిపింది. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్, మెషీన్ లెర్నింగ్, బయో మోట్రిక్స్, అగ్మెంటెడ్ రియాల్టీ, సహజ భాషా సంవిధానం, సిగ్నల్ ప్రాసెసింగ్, కంప్యూటర్ విజన్, మొబైల్ భద్రత, 5జీ నెట్‌వర్క్‌లాంటి డొమైన్లలో వీరిని నియమించుకుంటుంది. దేశంలో ఉన్న మూడు పరిశోధన మరియు అభివృద్ధి కేంద్రాల కోసం ఈ ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నామని సౌత్ కొరియన్ టెక్ దిగ్గజం బుధవారం ప్రకటించింది. వీరిలో 300మందిని ఐఐటీలనుంచి నియమించుకుంటామని వెల్లడించింది. అలాగే ఐఐటీ,, ఎన్ఐటీ, ఢిల్లీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్, పిట్స్ పిలానీ, మణిపాల్ టెక్నాలజీ లనుంచి వీరిని ఎంపిక చేసుకుంటామని శాంసంగ్ గ్లోబల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్,ఎండీ బెంగళూరు దీపేష్ షా వెల్లడించారు. ప్రతిభకు పెద్ద పీట వేస్తామనన్నారాయన. సాం ప్రదాయికంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ఎలక్ట్రకిల్ ఇంజనీరింగ్, మాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, అప్లైడ్ మెషీన్స్ అండ్ స్టాటస్టిక్స్ లాంటి ఇతర కోర్సుల వారిని కూడా పరిశీలిస్తామని చెప్పింది. కాగా శాంసంగ్‌కు బెంగళూరు, నోయిడా, ఢిల్లీలో ఆర్ అండ్ డి సెంటర్లు ఉన్నాయి. -
గూగుల్‌పై సంచలన ఆరోపణలు, దావా
శాన్‌ఫ్నాన్సిస్కో: గూగుల్ పై మాజీ ఉద్యోగులు సంచలన ఆరోపణలతో దావా వేశారు. గూగుల్ విధానాల్ని ప్రశ్నించినందుకే తమ పై వేటు వేశారని ఆరోపిస్తూ ఉద్వాసనకు గురైన ఇద్దరు గూగుల్ ఇంజనీర్లు పిటిషన్ దాఖలు చేశారు. శాంటా క్లారా కౌంటీ సుపీరియర్ కోర్ట్‌లో దాదాపు 161 పేజీల ఫిర్యాదును నమోదు చేశారు. గూగుల్ నిబద్ధతను ప్రశ్నించడం వల్లే తమని తొలగించారన్నారు. కార్పోరేట్ కల్చర్, తెల్లవారిపై వివక్ష కారణంగా తమను తొలగించారని వారు విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు దారులతో పాటు కన్సర్వేటివ్ దృక్పథం ఉన్న వారి పట్ల వివక్షా పూరితంగా వ్యవహరిస్తోందని జేమ్స్ దామోర్ (28), మరో మాజీ గూగుల్ ఇంజనీర్ మండిపడ్డారు. ఉన్నతమైన సంస్థగా వ్యవహరిస్తున్న గూగుల్ ఉదారవాద ఎజెండా నుంచి వైదొలగాలని ధైర్యం చేస్తున్న అనేక మంది ఉద్యోగులపై వేటు వేస్తోందని ఆరోపించారు. గూగుల్ సహా ఇతర ప్రముఖ టెక్నాలజీ కంపెనీల్లో కన్సర్వేటివ్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తే లేదా బహిరంగంగా ట్రంప్‌కు మద్దతు ఇస్తున్న డజన్ల కొద్దీ ఉద్యోగులపై వేటుపడుతోందనీ, దీంతో మిగిలిన ఉద్యోగులు కూడా భయపడుతున్నారని దామెర్ లాయర్ రిపబ్లికన్ పార్టీ అధికారి హర్మీత్ డల్లాన్ వ్యాఖ్యానించారు. గూగుల్ ఉద్యోగం పొందడానికి అధ్యక్షుడికి ఓటు వేయలేదని రుజువు చేసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. మరోవైపు దామోర్ ఆరోపణలపై తమవాదనలను కోర్టులో వినిపిస్తామని గూగుల్ చెప్పింది. అయితే అతని రాజకీయ అభిప్రాయాల నేపథ్యంలో తొలగించలేదని వెల్లడించింది. సంస్థ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకే చర్య తీసుకున్నామని గూగుల్ తెలిపింది. ఏ విధమైన వేధింపులను తాము సహించమని పేర్కొంది. కాగా సిలికాన్ వ్యాలీ టెక్ నియామాకాల్లో లింగ వివక్ష ఉందన్న వాదనను సమర్ధిస్తూ ఒక లేఖ రాయడం కలకలం రేపింది. గత ఏడాది ఆగస్టు 7 న గూగుల్ అతణ్ని తొలగించింది. -
కంపెనీల కుమ్మక్కు వల్లే..
హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఇంజనీర్ల వేతనాలు తక్కువగా ఉంచేందుకు కుమ్మక్కయ్యాయని ఐటీ నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టి.వి.మోహన్‌దాస్ పాయ్ విమర్శించారు. వేతనాలకు సంబంధించి దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పాయ్ ఏకీభవించారు. ఐటీ పరిశ్రమలో గత ఏడేళ్లుగా ఫ్రెషర్స్ (ప్రారంభ స్థాయి ఉద్యోగులు) వేతనాలు ఏమాత్రం పెరగలేదని మూర్తి ఆరోపించారు. అదే సమయంలో సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగుల జీతాలు మాత్రం పలు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. సప్లై ఎక్కువ.. ఇదే కంపెనీలకు వరం.. ‘దేశంలో ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు. ఏటా కొత్తగా వస్తున్న వారి సంఖ్యా ఎక్కువే ఉంది. ఇదే అంశాన్ని ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఈ విధానం సరైంది కాదు’ అని పాయ్ పేర్కొన్నారు. ‘పెద్ద కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఒకరితోనొకరు మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు వేతనాలు పెంచొద్దనే అంగీకారానికి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు పెంచకూడదనే విషయాన్ని పరస్పరం మాట్లాడుకుంటాయనే విషయం తనకు తెలుసన్నారు. ఏడేళ్లలో సగం తగ్గిన జీతాలు! ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. గత ఏడేళ్లలో ఐటీ పరిశ్రమలోని ఫ్రెషర్స్ వేతనాలు 50 శాతం మేర పడిపోయాయని పాయ్ వివరించారు. అందుకే తొలి ఐదేళ్లలో వలసలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు అక్కడక్కడే ఉన్నందున మంచి టాలెంట్ ఉన్న వారు ఐటీ పరిశ్రమలోకి రావడం లేదని తెలిపారు. ‘ప్రముఖ ఐటీ కంపెనీలు మెరుగైన వేతనాలివ్వాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులకు అధిక జీతాలివ్వకుండా చూసుకోవచ్చు. మధ్యస్థాయిలో మరింత వేతనాలివ్వాలి. సర్దుబాటు నేర్చుకోవాలి. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలను పెంచకుండా ఉండటం నైతికంగా తప్పు’ అన్నారాయన. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు ఫ్రెషర్స్‌కు మంచి జీతాలు ఇవ్వడానికి ముందడుగు వేయాలన్నారు. మెరుగైన వేతనం ఇవ్వాలి.. ‘ఫ్రెషర్స్ మెరుగైన వేతనం పొందలేకపోవడం చాలా నిరుత్సాహపరుస్తోంది. ఏం చేద్దాం? ఇంజనీర్లు ఎక్కువగా ఉంటున్నారు. వారు చదువులేమో నేరుగా మంచి ఉద్యోగం దక్కించుకోవడానికి సరిపోవడం లేదు. వారికి శిక్షణ అవసరమౌతోంది. ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ శిక్షణ కోసం చాలా డబ్బుల్ని ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిస్థితి కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే’ అని పాయ్ వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి కనక వారికి మెరుగైన వేతనాలివ్వాలని అభిప్రాయపడ్డారు. -
పదోన్నతులపై అదే పీటముడి
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖలో ఇంజనీర్ల పదోన్నతుల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఎటూ తేల్చడం లేదు. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో అక్కడి ప్రభుత్వం ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చి పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయగా, తెలంగాణలో దాని ఊసే కనబడకపోవడం ఇక్కడి ఇంజనీర్లను కలవరపెడుతోంది. రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సీనియార్టీ జాబితాను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించినా, ఏపీ మాత్రం కేవలం తన పరిధిలోని నాలుగు జోన్ల ఇంజనీర్ల జాబితానే ఇవ్వడం..తెలంగాణ పరిధిలోని ఐదు, ఆరు జోన్ ఇంజనీర్ల జాబితాను సమర్పించకపోవడంతో పదోన్నతులపై పీటముడి నెలకొంది. నీటి పారుదల శాఖలో పదోన్నతుల సమస్య ఉమ్మడి రాష్ట్రం నుంచే ఉంది. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉంటే, అదే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు జోన్–6లో ఎగ్జిక్యూటివ్, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారు. ఈ అంతరం పెరుగుతూ వస్తుండటంతో ప్రస్తుతం ఈ శాఖలో ముగ్గురు ఈఎన్సీలు, 23 మంది చీఫ్ ఇంజనీర్లు అంతా జోన్–5కి చెందిన వారే ఉన్నారు. దీనికి తోడు 45 సూపరింటెండెంట్ పోస్టుల్లో 28 మంది ఐదో జోన్ ఇంజనీర్లే ఉన్నారు. ఈ అన్యాయాన్ని కొత్త రాష్ట్రం తెలంగాణలో అయినా సవరించాలని జోన్–6 ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో వారికి న్యాయం చేసేలా నీటి పారుదల శాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. దీని ప్రకా రం న్యాయం జరుగుతుందనుకున్న సమయం లో 2014 అనంతరం ఉన్న జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ పదోన్నతులకు సీనియార్టీ జాబితా సిద్ధమైంది. దీనిపై జోన్–6 ఇంజనీర్లు కొందరు హైకోర్టుకు వెళ్లగా, కొత్తగా తయారు చేసిన జాబితాపై హైకోర్టు స్టే విధించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న సీనియార్టీ జాబితాను ఏపీ సమర్పించాలని, దానికి అనుగుణంగా తెలంగాణ నీటి పారుదల శాఖ చర్యలు తీసుకోవాలని సూచించింది. వివరాలివ్వని ఏపీ అయితే ఓ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టుకు సీనియార్టీ జాబితాను సమర్పించిన ఏపీ సర్కారు కేవలం తన పరిధిలోని నాలుగు జోన్ల వివరాలనే అందజేసింది. ఐదు, ఆరు జోన్ల జాబితాను ఇవ్వలేదు. ఇదే సమయంలో సుప్రీంకు సమర్పించిన జాబితా ప్రకారమే ఏపీ తన పరిధిలోని ఇంజనీర్లకు పదోన్నతులు సైతం కల్పించింది. అయితే తెలంగాణలో మాత్రం పదోన్నతుల అంశం ఇంకా నలుగుతూనే ఉంది. ఇలాంటి సమస్యే పోలీస్ శాఖలో కూడా వస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా జోక్యం చేసుకొని జోన్–6 ఉద్యోగులకు న్యాయం చేశారని, అదే తరహాలో తమకూ న్యాయం చేయాలని నీటి పారుదల శాఖ ఇంజనీర్లు మొర పెట్టుకుంటున్నారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పెషల్ సీఎస్ ఎస్కే జోషిని కలవాలని వారు నిర్ణయించుకున్నారు. -
మా చెక్ కాలనీ భలే ఉందే!
హైదరాబాద్: తమ దేశం పేరిట హైదరాబాద్‌లో ఒక కాలనీ ఉందని తెలిసి రెక్కలు కట్టుకుని వాలిపోయారాయన. ఒకనాడు తమ దేశ ఇంజనీర్లు గడిపిన ప్రాంతాలను చూసి మైమరచిపోయారు. తమ దేశస్తులు నడిచిన గడ్డకు సలాం కొట్టారు. ‘ఆల్ ఆర్ మై ఫ్రెండ్స్’ అంటూ అక్కడి వారిని గుండెలకు హత్తుకుని ఉద్వేగానికి గురయ్యారు. ఆ కాలనీవాసులు సైతం తమ ఆత్మ బంధువే ఇంటికొచ్చినట్టు ఆత్మీయ ఆతిథ్యంతో అక్కున చేర్చుకున్నారు. ఇంతకీ ఆయన ఎవరు..? ఏ దేశానికి చెందినవారు..? ఆ కాలనీ ఎక్కడ ఉంది..? ఆయన పేరు మిలన్ హోవర్కా.. భారత్‌లో చెక్ రిపబ్లిక్ రాయబారి. హైదరాబాద్ సనత్‌నగర్‌లోని చెక్ కాలనీ గురించి ఇంటర్నెట్ ద్వారా తెలుసుకున్నారు. తమ దేశం పేరిట ఉన్న ఆ కాలనీని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. ఆయన పర్యటన వివరాలను తెలియజేస్తూ ఢిల్లీలోని ఎంబసీ ఆఫ్ చెక్ రిపబ్లిక్ కార్యాలయం నుంచి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు లేఖ అందింది. సోమవారం మిలన్ హైదరాబాద్ వచ్చి చెక్ కాలనీని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయనకు అపూర్వ స్వాగతం లభించింది. స్థానిక కార్పొ రేటర్ కొలను లక్ష్మీబాల్‌రెడ్డి, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ సీఎన్ రఘుప్రసాద్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావుతో పాటు కాలనీ రెసిడెంట్స్ వెల్ఫేర్ ఫెడరేషన్ అధ్యక్షుడు సీహెచ్ అనంతరెడ్డి, సలహాదారులు జి.సూర్య శంకర్ రెడ్డి, విశ్వనాథరాజు ఆధ్వర్యంలో కాలనీ వాసులు భారీగా తరలివచ్చి అతిథికి రంగ వల్లులు, పూలతో స్వాగతించారు. మహిళలు బతుకమ్మలతో వెల్కమ్ చెప్పారు. మహిళలతో పాటు మిలన్ సైతం బతుకమ్మ ఆడారు. మిలన్ మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నిజాం కాలంలో తమ దేశ ఇంజనీర్లు నడయాడిన గల్లీలు.. బస చేసిన బంగ్లాలను సందర్శించి ఆనాటి విశేషాలను తెలుసుకున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త విశ్వనాథరాజు ఇంట్లో ఏర్పాటు చేసిన విందులో హైదరాబాద్ బిర్యానీ రుచి చూశారు. ‘చెక్ కాలనీ’పేరు ఎలా వచ్చిందంటే.. చెకోస్లేవేకియా పేరు మీద చెక్‌కాలనీకి ఆ పేరు రావడం వెనుక పెద్ద కథే ఉంది. నిజాం కాలంలో సనత్‌నగర్‌లో బ్రెన్ గన్ ఫ్యాక్టరీ (పస్తుత ఓల్టాస్ కంపెనీ) ఉండేది. గన్ల తయారీకి వాడే ముడిసరుకులు ఇక్కడ తయారయ్యేవి. వాటి తయారీకి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం చెకోస్లేవేకియా ఇంజనీర్ల వద్ద ఉండేది. దీంతో ఆ దేశం నుంచి పెద్ద సంఖ్యలో ఇంజనీర్లను రప్పించారు. ఇక్కడి నివాస ప్రాంతాలు చెకోస్లేవేకియా ఇంజనీర్లకు అనుకూలంగా లేకపోవడంతో చాలామంది వెనుదిరిగి వెళ్లిపోవడంతో వారి కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన బంగ్లాలను నిర్మించారు. దాదాపు 50 ఎకరాల్లో 52 బంగ్లాలను నిర్మించారు. చెకోస్లేవేకియన్స్ గడ్డగా పిలవడిన ఈ ప్రాంతం రానురాను చెక్‌కాలనీగా రూపాంతరం చెందింది. ప్రస్తుతం బంగ్లాల స్థానంలో 42 అపార్ట్ మెంట్లు వెలిశాయి. మిగతా పది బంగ్లాలు చెక్కుచెదరకుండా అలాగే ఉన్నాయి. స్వదేశంలా ఫీలయ్యా: మిలన్ హైదరాబాద్‌లో చెక్ ఫ్రెండ్స్ ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. మా దేశస్తులతో గడిపానన్న అనుభూతి కలిగింది. భారత్ నుంచి చెక్ రిపబ్లిక్కు వచ్చే వారిలో హైదరాబాద్ వారే ఎక్కువ. దేశవ్యాప్తంగా చెక్ వీసా సెంటర్ల ఏర్పాటుకు మా దేశ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులోనూ హైదరాబాద్‌తో సంబంధాలు కొనసాగిస్తాం. -
కారు బోల్తా, నలుగురు ఇంజినీర్లు దుర్మరణం
విహారయత్ర నలుగురు యువ ఇంజినీర్లను బలిగొంది. కొడైకెనాల్ వెళ్లి సరదాగా గడిపి తిరిగి వస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో వారిపై విరుచుకుపడింది. కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడడంతో నీటమునిగి నలుగురు మృతిచెందారు. స్థానికులు వారిని రక్షించేందుకు ప్రయత్నించినప్పటికీ ఒక్కరిని మాత్రమే కాపాడగలిగారు. ఉద్యోగాల్లో స్థిరపడి చేతికందివచ్చిన కుమారులు అర్ధా్దంతరంగా మృతిచెందడంతో వారి కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కేకే.నగర్: కోవై జిల్లా పల్లడం సమీపంలో బీఏబీ కాలువలో కారు బోల్తాపడిన సంఘటనలో నలుగురు ఇంజినీర్లు కాలువలో మునిగి దుర్మరణం పాలయ్యారు. కోవై జిల్లా అత్తిపాలయంలో శోభనా ఇంజినీరింగ్ కన్సల్టింగ్ సంస్థ ఉంది. ఇందులో పని చేస్తున్న ఇంజినీర్లు, ఆదివారం పర్యాటక యాత్రగా కొడైకెనాల్‌కు వెళ్లారు. 25 మంది ఒక బస్సులోను, ప్రదీప్(27), విజయన్(30), మారియప్పన్(32), సుధాకర్(25), అన్పలగన్(30) ఐదుగురు ఒక కారులో కొడైకెనాల్ వెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు విహారం పూర్తి చేసుకుని సాయంత్రం కోవైకు తిరుగు ప్రయాణం అయ్యారు. బస్సు వెనుకనే కారు ప్రయాణిస్తోంది. రాత్రి 8 గంటల సమయంలో పల్లడం సమీపంలో కల్లిపాలయం ప్రాంతంలో మలుపు తిరుగుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన గల బీఏబీ కాలువలో పడిపోయింది. ఈ కాలువలో ఏడాది తర్వాత వారం రోజుల కిందట నీరు వదిలినట్టు తెలిసింది. కారులో ఉన్న ఐదుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. వారి అరుపులు విని చుట్టు పక్కల వారు పరుగున వచ్చి కారులో ప్రాణాలకు పోరాడుతున్న అన్బళగన్‌ను రక్షించగలిగారు. ప్రదీప్, విజయన్, మారియప్పన్, సుధాకర్ నీటిలో మునిగి మృతి చెందారు. కామనాయగన్ పాలయం పోలీసులు, పల్లడం అగ్నిమాపకదళం సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని కారును వెలికి తీసే పనులలో నిమగ్నమయ్యారు. సుధాకర్ తప్ప మిగతా ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు. సుధాకర్ మృతదేహం కోసం కాలువలో గాలిస్తున్నారు. మృత దేహాలను పోస్టుమార్టం కోసం కోవై ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. విహార యాత్ర విషాదంగా మారి నలుగురు ప్రాణాలను బలి తీసుకున్న సంఘటన వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. -
పదోన్నతుల్లో న్యాయం కోసం ఆందోళన
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల శాఖ పదోన్నతుల్లో తమకు న్యాయం చేయాలని ఆరో జోన్ ఇంజనీర్లు ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ సీనియార్టీ జాబితా సిద్ధం చేసినందుకు నిరసనగా గాంధీ జయంతి సందర్భంగా ఇక్కడ జలసౌధ కార్యాలయంలో సోమవారం రోజంతా మౌనదీక్షకు కూర్చున్నారు. సుమారు 300 మంది రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాద్‌కు చెందిన ఇంజనీర్లు ఈ దీక్షలో పాల్గొన్నారు. జోన్–6 ఉద్యోగులపై వివక్ష తగదని, తమకు న్యాయం చేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. హైదరాబాద్ ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్, జనరల్ సెక్రటరీ శేఖర్‌రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ కె.చక్రధర్ మీడియాతో మాట్లాడారు. ఒకే బ్యాచ్‌కు చెందిన ఇంజనీర్లు కొందరు ఐదో జోన్లో చీఫ్ ఇంజనీర్ స్థాయిలో ఉంటే, జోన–6లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఇంజనీర్ల స్థాయిలోనే పనిచేస్తున్నారని చెప్పారు. ఈ అన్యాయాన్ని సవరించాలని ఆందోళనలు చేయగా, ప్రభుత్వం స్పందించి ఈ ఏడాది ఏప్రిల్ 19న ఓ సర్క్యులర్ జారీ చేసిందని అన్నారు. అయితే, ప్రస్తుతం ఆ సర్క్యులర్‌ను, అంతకుముందు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌ను పక్కనపెట్టి అడ్మినిస్ట్రేషన్ ఈఎన్సీ సీనియార్టీ జాబితా తయారు చేశారని అన్నారు. 2014 జూన్2కు ముందు ఉమ్మడి ఏపీలో ఉన్న సీనియార్టీని ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉన్నా, 2014 అనంతరం ఉన్న జాబితాను పరిగణనలోకి తీసుకుంటూ సీనియార్టీ జబితా తయారు చేశారని, దీంతో తమకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుతం శాఖలో ముగ్గురు ఈఎన్సీలు, 23 మంది సీఈలంతా జోన్–5కి చెందిన వారేనని, 45 ఎస్ఈ పోస్టుల్లో 28 మంది జోన్–5 ఇంజనీర్లే ఉన్నారని అన్నారు. దీక్షలో డీసీఈలు చంద్రశేఖర్, నరహరి, మురళి తదితరులు పాల్గొన్నారు. కాగా ఇంజనీర్ల దీక్షకు కొద్ది నిమిషాల జలసౌధకు వచ్చిన మంత్రి, అక్కడి టెంట్ వద్ద ఏర్పాటు చేసిన గాంధీ చిత్రపటం వద్ద నివాళులు అర్పించి ఖమ్మం పర్యటనకు వెళ్లడం గమనార్హం. సంకటంలో ప్రభుత్వం.. పదోన్నతులపై జోన్ –6 ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం ప్రభుత్వాన్ని సంకటంలోకి నెడుతోంది. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ , ఆర్అండ్బీ, పోలీసు, రెవెన్యూ శాఖల్లో ఉన్నత పదవుల్లో జోన్– 6 ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. ఒక్క ఇరిగేషన్ శాఖను సాకుగా చూపి, పదోన్నతుల జాబితాను మారిస్తే ఇతర శాఖల్లో జోన్–5 ఉద్యోగులకు జరిగిన అన్యాయాన్ని అక్కడ సైతం సవరిస్తారా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఈ సంక్లిష్టాల నేపథ్యంలో ఈ నెలాఖరులోగా నీటి పారుదల శాఖ ఈఎన్సీ పదోన్నతుల జాబితాను సుప్రీంకోర్టుకు అందించాల్సి ఉంటుంది. లేనిపక్షంలో వచ్చే నెల నుంచి జీతభత్యాలకు దూరం అయ్యే అవకాశం ఉంది. -
ఇట్లయితే పనులు చేయలేం బాబోయ్..!
- పూడికతీత పనుల్లో అధికార పార్టీ నేతల బెదిరింపులు - రక్షణ కల్పించాలని ఎస్ఈకి ఇంజినీర్ల విజ్ఞప్తి - నేడు సీఈతోపాటు జిల్లా ఎస్పీ దృష్టికి కర్నూలు సిటీ: నీరు - చెట్టు కింద చేపట్టిన పూడికతీత పనుల్లో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాలంటూ అధికార పార్టీ నాయకులు ఇంజినీర్లపై ఒత్తిడి తెస్తున్నారని రాయలసీమ నీటిపారుదలశాఖ ఏఈఈల అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పని చేయలేమంటూ రక్షణ కల్పించాలని కోరారు. గురువారం స్థానిక జలమండలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పూడిక తీత పనులకు సంబంధించి వారికి అనుకూలంగా పని చేయలేకపోతుండడంతో టీడీపీ నేతలు ఇంజనీర్లను బెదిరిస్తున్నారన్నారు. ఆస్పరి మండలం హలిగేర, తంగరడోణలో చేపట్టిన పనుల్లో తమకు అనుకూలంగా కొలతలు వేసి బిల్లులు చెల్లించాలని వారం రోజులుగా ఎంపీపీ కృష్ణ, హలిగేర సర్పంచు యువరాజ్ తదితరులు జేఈఈ రఘుచరణ్, క్వాలిటీ కంట్రోల్ అధికారి వెంకటచలంను బెదిరిస్తున్నారన్నారు. తమ కోసమే సీఎం చంద్రబాబు ఈ పనులు పెట్టాడని, తమకు కాకపోతే ఇంకెవరికి పనులు చేసి పెడతారంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. తక్షణమే వారిపై చర్యలు తీసుకొని ఇంజినీర్లకు రక్షణ కల్పించకపోతే విధులు నిర్వహించలేమని వెంకటేశ్వరెడ్డి తెలిపారు. విషయంపై సాయంత్రం జలవనరుల శాఖ ఎస్ఈ చంద్రశేఖర్‌రావుకు చిన్ననీటి పారుదల శాఖ కర్నూలు డివిజన్ ఈఈ చెంగయ్యకుమార్ ద్వారా వినతిపత్రం ఇచ్చారు. వీరిలో సంఘం నాయకులు రాఘవేంద్ర రావు, కె.వెంకటాచలం తదితరులున్నారు. -
ఎన్టీఆర్ గృహ నిర్మాణాలపై కలెక్టర్ అసంతృప్తి
– పలువురు ఇంజినీర్లకు షోకాజ్ నోటీసులు కర్నూలు (అర్బన్): ఎన్టీఆర్ గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపించకపోవడంపై జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని సమావేశ భవనంలో ఆయన హౌసింగ్ ఇంజినీర్లతో సమీక్ష నిర్వహించారు. గతేడాది సెప్టెంబరు నెలలో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం ప్రారంభమైనా, ఇంతవరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. వారంలోగా మంజూరైన ఇళ్లు వంద శాతం గ్రౌండింగ్ కావాలని ఆదేశించారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ హుసేన్ సాహెబ్, ఈఈలు, డీఈలు తదితరులు పాల్గొన్నారు. -
ఇన్ఫీలో భారీగా ఉద్యోగుల నియామకం
బెంగళూరు: భారీగా ఉద్యోగాలకు కోత పెడతారంటూ ఓ వైపు ఐటీ ఇండస్ట్రీ నుంచి తీవ్ర ప్రతికూల సంకేతాలు వస్తుండగా.. దేశీయ రెండో అతిపెద్ద ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ సంస్థ ఇన్ఫోసిస్ గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది వార్షికంగా క్యాంపస్ రిక్రూట్ మెంట్ కింద 20వేల మంది ఇంజనీర్లను కంపెనీలోకి తీసుకోనున్నట్టు ప్రకటించింది. అయితే డిజిటల్, అనాలిటిక్స్ లాంటి కొత్త స్కిల్స్ ఉన్న అభ్యర్థులకే తాము ఎక్కువ ఛాన్స్ ఇవ్వనున్నామని తెలిపింది. ఇటీవల కాలంలో క్లయింట్స్ ఎక్కువగా డిజిటల్, క్లౌడ్, అనాలిటిక్స్ వైపు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారని ఇన్ఫీ పేర్కొంది. సెప్టెంబర్ నుంచి వార్షిక క్యాంపస్ నియామకాలు చేపట్టనున్నట్టు ఇన్ఫీ అధికార ప్రతినిధి చెప్పారు. అదేవిధంగా ఎన్ని ఉద్యోగాలు కల్పించనున్నారో కూడా ఆయన ధృవీకరించారు. ఫిబ్రవరి వరకు ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్లేస్ మెంట్ల ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం నియామకాల పద్ధతిని మార్పు చేస్తున్నామని, విభిన్నమైన స్కిల్స్ ఉన్న హై-వాల్యు గ్రాడ్యుయేట్లు ఎక్కువగా ఆకట్టుకునే అవకాశముందని కూడా ఇన్ఫోసిస్ అధికార ప్రతినిధి తెలిపారు. స్కేల్ వైపు నుంచి స్కిల్ వైపు ఎక్కువగా ఐటీ సర్వీసుల సెక్టార్ ఫోకస్ చేసిందని కంపెనీలు చెబుతున్నాయి. అయితే అంతకముందు ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావముండేది కాదని, చివరేడాదిలోనే ప్లేస్ మెంట్లో 95 శాతం మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేయని ఆర్ వీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రెసిడెంట్ ఆఫ్ ట్రస్ట్ ఎంకే పాండురంగ శెట్టి చెప్పారు. కానీ వచ్చే ఏడాది మారుతున్న ఇంటస్ట్రి పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు ఎలా మారుతాయో వేచిచూడాల్సి ఉందన్నారు. 10వేల మంది అమెరికన్లకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించనున్నట్టు గత నెలలోనే ఇన్ఫోసిస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ ఇంజనీర్లకు ఆ నైపుణ్యం లేదట
హైదరాబాద్: దేశంలో కీలక నగరాలైన న్యూఢిల్లీ, ముంబై, బెంగుళూరు, చెన్నై, పుణె, కోల్‌కతాల్లో ఇంజినీరింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్లతో పోలిస్తే హైదరాబాద్ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు చాలా వెనుకబడి ఉన్నారని ఓ అధ్యాయనం తేల్చింది. హైదరాబాదీ విద్యార్థుల్లో ప్రోగ్రామింగ్ చేసే నైపుణ్యం చాలా తక్కువగా ఉందని అటోమట నేషనల్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ చెప్పింది. అతి కొద్ది మందికి మాత్రమే సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగావకాశాలు రావడానికి ఇది కూడా ఓ కారణమని తెలిపింది. దేశవ్యాప్తంగా 500 కాలేజీల్లోని 36వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్లు వివరించింది. విద్యార్థుల్లో లోపిస్తున్న ప్రోగ్రామింగ్ స్కిల్స్‌ను ఇంప్రూవ్ చేసుకోవడానికి తాము కోడింగ్ స్కిల్స్‌లో శిక్షణ ఇవ్వాలను భావిస్తున్నట్లు వెల్లడించింది. నగరానికి చెందిన గ్రాడ్యుయేట్లలో 0.7 శాతం మంది మాత్రమే ప్రాథమికంగా కోడ్ రాసే శక్తిసామర్ధ్యాలను కలిగివున్నారని నివేదికలో ఉంది. నివేదికపై తెలంగాణ అకాడెమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) సీఈవో సుజీవ్ నాయర్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో ఉద్యోగావకాశాలు పెంచేందుకు కాలేజీ స్థాయిలో ప్రత్యేక కోర్సులు ప్రారంభిస్తామని చెప్పారు. -
ఆ టెక్ కంపెనీలో భారీగా ఉద్యోగుల నియామకం
బెంగళూరు : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎఫెక్ట్ తో సాప్ట్ వేర్ సంస్థల ఉద్యోగాలు ఊడతాయనే ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. వారి ఆందోళనకు చెక్ పెడుతూ మరికొన్ని టెక్ సంస్థలు భారీగా ఉద్యోగాల నియామకంపైన కూడా దృష్టిపెడుతున్నాయి. బహుళ జాతీయ సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ సంస్థలో ఒకటైన ఎస్ఏపీ భారీగా ఇంజనీర్లను నియమించుకోనున్నట్టు తెలుస్తోంది. వచ్చే రెండేళ్లలో ఈ కంపెనీ దాదాపు 2500 మంది ఇంజనీర్లను రిక్రూట్ చేసుకోవాలని యోచిస్తోందని సంబంధిత వర్గాలు చెప్పాయి. బెంగళూరు క్యాంపస్‌లో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన క్రమంలో ఈ ఇంజనీర్ల రిక్రూట్ మెంట్‌ను కంపెనీ చేపట్టబోతుందని పేర్కొన్నాయి. 50 మిలియన్ యూరోల పెట్టుబడులతో 5.15 లక్షల చదరపు అడుగుల్లో ఈ కొత్త సౌకర్యాన్ని కంపెనీ ప్రారంభించింది. గత రెండేళ్లుగా కూడా కంపెనీ మంచి ఉద్యోగ నియామకాలు చేపడుతూ వస్తోంది. ప్రతేడాది 1500 మంది ఇంజనీర్లను ఇప్పటికే ఈ కంపెనీ నియమించుకుంది. గత రెండేళ్లుగా తమ నియామకాలు కాలేజీ క్యాంపస్‌ల ద్వారానే జరిపామని ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ కుమార్ ఖండెల్వాల్ చెప్పారు. ఎస్ఏపీ ల్యాబ్స్ ఇండియాలో 10వేలకు పైగా ఉద్యోగులున్నారని, వారిలో 7500 మంది ఇంజనీరింగ్ డివిజన్లో పనిచేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్ఏపీకి మొత్తం 85000 మంది ఉద్యోగులున్నారు. -
ఐదుగురిలో నలుగురు పనికిరానివారే
► ఇంజనీర్ పట్టభద్రుల్లో నైపుణ్యాల కొరత ► హెచ్డీఎఫ్సీ చీఫ్ దీపక్ పరేఖ్ వ్యాఖ్యలు చెన్నై: ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను పెంచుకోవలసిన అవసరం ఉందని హౌసింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్(హెచ్డీఎఫ్సీ) చైర్మన్ దీపక్ పరేఖ్ చెప్పారు. విద్యార్ధులు కాలేజీల నుంచి పట్టభద్రులై బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు చేసే విధంగా వారిని తీర్చిదిద్దాలని ఆయన సూచించారు. దేశంలో 3,300కు పైగా ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయని, సగటున ప్రతీ ఏడాది 15 లక్షల మంది ఇంజినీరింగ్ పట్టభద్రులు కాలేజీల నుంచి బయటకు వస్తున్నారని, అయితే వీరిలో తగినన్ని నైపుణ్యాలు లేకపోవడం వల్ల ప్రతి ఐదుగురిలో నలుగురు ఉద్యోగాలు చేయడానికి పనికిరావడం లేదని పేర్కొన్నారు. ఐఐటీ మద్రాస్‌లో దీపక్ పరేఖ్ ఇన్స్టిట్యూట్ చెయిర్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. ప్రపంచం వేగంగా మారుతోందని, అందుకనుగుణంగా ఉపాధ్యాయులు నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని ఆయన సూచించారు. మారుతున్న ప్రపంచ అవసరాలకు అనుగుణంగా విద్యార్ధులకు తగిన శిక్షణనివ్వాలని పేర్కొన్నారు. -
ఇలాగైతే పెట్టు‘బడి’లో ఫస్ట్‌క్లాస్!
⇒ లక్ష్యంలో స్పష్టత.. పెట్టుబడుల్లో వైవిధ్యత ⇒ క్రమానుగతంగా పనితీరు మదింపు ⇒ పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేర్పులు ⇒ ఆర్జన ప్రారంభమైనప్పటి నుంచే ఇన్వెస్ట్మెంట్ ⇒ అవసరం మేరకు నిపుణుల సేవలు ఇన్వెస్ట్మెంట్ అంటే...? పెట్టుబడులు పెట్టడమేగా అని చాలా మంది అనుకోవచ్చు. ఇటుక, ఇసుక, సిమెంటు ఉంటే ఇల్లు రెడీ అయిపోతుందా...? దానికి కొలతలు, కార్మికులు, నిపుణులు, ఇంజనీర్లు ఇలా ఎంతో మంది నిపుణులు... ఎన్నో రకాల మెటీరియల్ కలిస్తే కానీ అందమైన ఇల్లు నిర్మాణం సాధ్యం కాదు. ఇన్వెస్ట్మెంట్ సంపదగా మారాలంటే ఇలానే ఎన్నో అంశాలుంటాయి. ప్రతీ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, సమయానుకూలంగా సరైన నిర్ణయాలు తీసుకుంటూ, సరైన దిశలో పెట్టుబడులను కొనసాగించడం ద్వారానే జీవిత లక్ష్యాలను నెరవేర్చుకోవడం సాధ్యమవుతుంది. ఇన్వెస్ట్మెంట్ నిపుణులు చెబుతున్న ఆ కిటుకులే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనం. లక్ష్యం కావాలి దేనికైనా లక్ష్యం అన్నది ఒకటుండాలి. అందులో ఇన్వెస్ట్‌మెంట్‌కు తప్పనిసరి. లక్ష్యం లేకుంటే ఎంత కాలం మదుపు చేయాలి, ఎంత మొత్తం చేయాలన్న స్పష్టత ఉండదు. లక్ష్యం భవిష్యత్తు అవసరాలే అయితే ఈక్విటీల్లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడులను అందుకోవచ్చు. అదే స్వల్ప కాల అవసరాలు అయితే స్థిరమైన రాబడులను ఇచ్చే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. లక్ష్యాలకు అనుగుణంగా మదుపు కొనసాగనప్పుడు అవసరాలకు తగిన నిధి సమకూరడం కష్టతరమవుతుంది. అందుకే ఇన్వెస్ట్మెంట్ నిర్ణీత లక్ష్యాలకు అనుగుణంగా ఉండాలి. ముందు నుంచే... పెట్టుబడులు అన్నవి ఆర్జనతోపాటే ప్రారంభం కావాలి. ఎంత ముందుగా మొదలైతే అవసరాలకు కావాల్సిన నిధిని అంత సులభంగా సమకూర్చుకోవచ్చు. అదే సమయంలో ఆర్థిక ప్రణాళికల విషయంలో పొరపాట్లకు అవకాశం లేకుండా చూసుకోవాలి. అప్పుడే ఇన్వెస్ట్మెంట్ విజయవంతం అవుతుంది. పెట్టుబడులు అవసరాలను తీర్చేలా ఉండాలి. అవసరమైనప్పుడు పెట్టుబడులను వెనక్కి తీసుకునే వెసులుబాటూ ఉండాలి. అధిక రిస్క్ పనికిరాదు. వేచి ఉండడం సరికాదు... పెట్టుబడి పెట్టేందుకు సమయం కోసం వేచి చూడకూడదు. క్రమానుగతంగా పెట్టుబడి పెడుతూ వెళ్లడమే ఇన్వెస్టర్‌గా చేయాల్సింది. మార్కెట్ దిగువ స్థాయికి వచ్చినప్పుడే పెట్టుబడి పెట్టాలని కాచుక్కూర్చుంటే... అది ఎప్పుడు వస్తుంది...? ఏ స్థాయిలో స్థిరపడుతుందన్నది? గుర్తించలేకపోవచ్చు. గుర్తించేలోపే తిరిగి ధరలు పెరిగిపోవచ్చు. అదే సమయంలో గరిష్ట స్థాయిలోనే విక్రయించాలనుకోవడం కూడా అవగాహన రాహిత్యమే అవుతుంది. ఎందుకంటే ఇది గరిష్ట స్థాయి అని గుర్తించడం అన్ని వేళలా సాధ్యం కాదు? అందుకే క్రమానుగతంగా విక్రయించడం మొదలు పెట్టాలి. దీర్ఘకాల పనితీరు ఆధారంగా... చక్కని పనితీరున్న వాటిల్లోనే పెట్టుబడి పెట్టాలన్న ఆలోచన సరైనదే. కానీ, ఇందుకు గతేడాది కాలంలో అత్యుత్తమ పనితీరు చూపిన వాటిని ఎంచుకోకుండా ఐదేళ్లు, పదేళ్లు ఇలా దీర్ఘకాల పనితీరును పెట్టుబడులకు ప్రాథమిక సూత్రంగా తీసుకోవాలి. అప్పుడే నమ్మకమైన రాబడులకు అవకాశం ఉంటుంది. ఒక్క అంశానికే పరిమితం కారాదు పెట్టుబడికి షేర్ లేదా మ్యూచువల్ ఫండ్, ఫిక్స్డ్ డిపాజిట్ ఇలా ఎంపిక ఏదైనా కానీయండి. కేవలం ఏదో ఒక అంశానికి పరిమితమై ఫలానా దానిలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించుకోవడం తప్పటడుగే అవుతుంది. ఉదాహరణకు అధిక వడ్డీ రేటు వస్తుందని కంపెనీ డిబెంచర్ కొనుగోలు చేశారనుకుందాం. కానీ, అవసరమైనప్పడు నగదుగా మార్చుకునే సౌలభ్యత తక్కువగా ఉంటుంది. పైగా డిబెంచర్ చెల్లింపుల్లో కంపెనీలు విఫలమయ్యే పరిస్థితీ రావచ్చు. రాబడి హెచ్చుగా ఉంటుందని షేర్లో మదుపు చేశారనుకుందాం. దాని పనితీరు మార్కెట్ ఆటుపోట్లు, కంపెనీ యాజమాన్యం నిర్వహణ ఇలా ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే కాల వ్యవధి, ఆశిస్తున్న రాబడి, రిస్క్ సామర్థ్యం ఇలా ఎన్నో అంశాలనూ పరిశీలించిన తర్వాతే తగిన సాధనాలను ఎంచుకోవాలి. డైవర్సిఫికేషన్ అవసరమే కానీ... పెట్టుబడులు అన్నింటినీ తీసుకెళ్లి ఒకటే అస్సెట్ క్లాస్‌లో పెట్టరాదు. చాలా మందికి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టడం అలవాటు. ఇందులో 6–7 శాతం మించి రాబడులు రావు. పెట్టుబడంతా తీసుకెళ్లి డెట్ మార్కెట్లో పెడితే, ఈక్విటీ, కమోడిటీ మార్కెట్లలో ఉన్న అవకాశాల ప్రయోజనాలను అందుకోలేరు. అందుకే పెట్టుబడుల్లో వైవిధ్యం (డైవర్సిఫికేషన్) అవసరం. అది కూడా అవసరమైనంతే. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, ఇలా లెక్కకు మించిన సాధనాల్లో ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయనుకోండి. అప్పుడు డైవర్సిఫికేషన్ ఎక్కువైనట్టే. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో కొంత పెట్టుబడులు పెట్టి, అదే సమయంలో బ్లూచిప్ మ్యూచువల్ ఫండ్ పథకాల్లోనూ పెట్టుబడి పెడితే అది డూప్లికేషన్ అవుతుంది. ఇలా లేకుండా చూసుకోవాలి. పెట్టుబడులకు వైవిధ్యం అవసరం కదా అని ఎక్కువ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే... వాటి పనితీ రును ట్రాక్ చేయడం కష్టతరమవుతుంది. ఇక పెట్టుబడుల్లో భిన్నత్వం అన్నది ప్రతీ విభాగంలోనూ ఉండాలి. ఉదాహరణకు ఈక్విటీల్లో పెట్టుబడులన్నవి లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, మల్టీ క్యాప్ ఇలా అన్నమాట. మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఈ తరహా డైవర్సిఫైడ్ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. సమీక్ష... మార్పులు లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడమే కాదు... వాటిని మధ్య మధ్యలో సమీక్షించుకుంటూ ఉండాలి. మీ పెట్టుబడులపై తగిన ప్రతిఫలం వస్తోందా..? అన్నది పరిశీలించుకోవాలి. అవసరమైతే తగిన మార్పులు, చేర్పులు చేసుకోవడం, వైదొలగడం వంటి నిర్ణయాలు తీసుకోవాలి. లేదంటే లక్ష్యాలు రిస్క్‌లో పడతాయి. ఉదాహరణకు ఈక్విటీ, డెట్, కమోడిటీ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. కొంతకాలానికి అధిక రాబడుల కారణంగా మీ మొత్తం ఆస్తుల విలువ ఈక్విటీల్లోనే అధిక స్థాయికి చేరిందనుకోండి. అప్పుడు రిస్క్ స్థాయి ఎక్కువైనట్టే. అప్పుడు కొంత ఈక్విటీ నుంచి డెట్ సాధనాలకు మళ్లించడం ద్వారా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇలా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. దాంతో రిస్క్ తగ్గించుకోవడమే కాకుండా రాబడుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలుంటుంది. అదే సమయంలో రాబడుల విషయంలో పేలవ పనితీరుతో ఉన్న వాటిని వదిలించుకునేందుకూ అవకాశం ఉంటుంది. ఒకవేళ అది మీకు కష్టం అనుకుంటే ఆర్థిక సలహాదారుల సేవలు పొందాలి. నిర్లక్ష్యం తగదు పెట్టుబడుల విషయంలో శ్రద్ధ లేకపోవడం చాలా మందిలో కనిపించే అంశం. కొంత మంది తమ పొదుపు నిధులను నిర్లక్ష్యంగా తక్కువ రాబడులిచ్చే సేవింగ్స్ ఖాతాల్లోనే ఉంచేస్తుంటారు. మీ దగ్గర ఒక నెల అవసరాలకే నగదు రూపంలో ఉండాలి. పెట్టుబడులను ఎప్పుడూ వాయిదా వేయరాదు. దీనివల్ల పొదుపు సంపదగా మారడం కలే అవుతుంది. కష్టార్జితం అవసరాలను తీర్చలేని పరిస్థితి ఏర్పడవచ్చు. సరైన పెట్టుబడి సాధనాల గురించి తెలుసుకుని ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ద్వారా పొదుపు నిధులను పెట్టుబడులకు మళ్లించే ఏర్పాటు చేసుకోవాలి. అవసరానికి తీసుకున్నా... దీర్ఘకాల అవసరాల కోసం కొనసాగుతున్న పెట్టుబడులు మధ్య మధ్యలో అనూహ్యంగా ఎదురయ్యే అవసరాలకు బలి కాకుండా చూసుకోవాలి. అనుకోకుండా వచ్చే అవసరాలను అధిగమించేందుకు కొందరు ప్రావిడెంట్ ఫండ్ నుంచి రుణం తీసుకోవడం, బీమా పాలసీపై రుణం పొందడం చేస్తుంటారు. అత్యవసరమైతే ఇలా తీసుకోవడం కొంత వరకు సరైనదే. కానీ, ఇలా తీసుకున్న వాటిని వీలైనంత వెంటనే తిరిగి చెల్లించడం కూడా అంతే ముఖ్యం. లేదంటే అసలు ఆ పెట్టుబడి ఏ ఉద్దేశంతో అయితే మొదలు పెట్టామో అది దెబ్బతింటుంది. కొంతమంది తమ పెట్టుబడే కదా, నిదానంగా తీర్చేయవచ్చులే అనుకుంటూ ఉంటారు. దీనివల్ల మీ పెట్టుబడిపై వచ్చే రాబడి తీసుకున్న రుణానికి చెల్లించే వడ్డీ రూపంలో ఆవిరైపోతుంది. అందుకే స్వల్పకాలిక అవసరాలకు కూడా కొంత నిధిని ప్లాన్ చేసుకోవడం అవసరం. ఇక భావోద్వేగాలు పెట్టుబడులను శాసించకుండా జాగ్రత్తపడాలి. పెట్టుబడుల మళ్లింపు లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ చేయడంతోపాటు చివర్లో ముందు నుంచే వాటిని ఉపసంహరించుకోవాలి. ఉదాహరణకు పిల్లల వివాహం కోసం పెట్టుబడి పెడుతున్నారనుకుందాం. వివాహం నిశ్చయమైన తర్వాత వాటిని ఉపసంహరించుకుంటామంటే ఆ సమయంలో స్టాక్ మార్కెట్లు క్షీణతలో ఉండొచ్చు. దీనివల్ల రాబడుల ప్రతిఫలాన్ని కొంత నష్టపోవాల్సి వస్తుంది. అందుకే ఓ ఏడాది ముందు నుంచే నెలనెలా కొంత చొప్పున ఉపసంహరించుకుంటూ షార్ట్‌టర్మ్ డెట్ ఫండ్స్, లిక్విడ్ ఫండ్స్‌కు మళ్లించాలి. దానివల్ల చివరి నిమిషంలో ఆటుపోట్ల ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. -
విద్యుత్ ఇంజినీర్ల ధర్నా
– రెగ్యులర్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ కర్నూలు(రాజ్‌విహార్): డిప్యూటేషన్ పద్ధతిన సబ్‌స్టేషన్‌లో పోస్టులు భర్తీచేయడడాన్ని నిర్వసిస్తూ పవర్ ప్లాంగ్ వద్ద సోమవారం విద్యుత్ శాఖ ఇంజినీర్లు ధర్నా నిర్వహించారు. సోలార్ పవర్ ప్లాంట్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభిస్తే ఆందోళన తప్పదని విద్యుత్ శాఖ ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఎం. ఉమాపతి హెచ్చరించారు. ఓర్వకల్లు, గడివేముల మండలాలలోని నిర్మిస్తున్న సోలార్ పవర్ ప్లాంట్ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను చార్జ్ చేసేందుకు హైదరాబాదు నుంచి వచ్చిన 400కేవీ చీఫ్ ఇంజనీర్ ఆదామ్‌ను అడ్డుకున్నారు. అక్కడ విధుల్లో ఉన్న డీఈలు, ఏడీఈలను బయటకు పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 1000 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి సామార్థ్యం కలిగిన అల్ట్రా సోలార్ పవర్ ప్లాంట్‌లో పని చేసేందుకు రెగ్యూలర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. అప్పటి వరకు వీటిని చార్జ్ (ప్రారంభించకుండా) చేయకుండా నిలిపివేయాలని డిమాండ్ చేశారు. డిప్యూటేషన్ పద్ధతిలో ఉద్యోగులను నియమిస్తే ఇప్పటికే పనిచేసే ప్రాంతాల్లో పనిభారం పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 400 కేవీ, 220కేవీ సబ్స్టేషన్లలో రెగ్యులర్ ఏడీఈలు, ఇతర విభాగాల ఉద్యోగులను నియమించాలని కోరారు. కొత్త అధికారులు వచ్చే వరకు ఉపకేంద్రాల ప్రారంభాన్ని నిలిపివేయాలని, లేనిపక్షంలో ఆందోళనలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ట్రాన్స్‌కో ఏడీఈ ఉపేంద్రం శ్రీనివాసులు, ఇంజనీరింగ్ సంఘం ప్రతినిధులు ఇంజనీర్ల సంఘం జిల్లా ప్రతినిధి రవికుమార్, రాజులయ్య, గంగన్న, ఏడీఈలు నవీన్‌బాబు, శ్రీరాముడు, ఏఈలు ఓనేశీము, కోటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
‘సోషల్ ట్రేడ్’ కేసుల కలవరం
రాచకొండలో 15 మంది,సైబరాబాద్‌లో ఒకరు ఫిర్యాదు హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లో సంచలనం సృష్టిం చిన సోషల్ ట్రేడ్ బిజ్ హైదరాబాద్‌లోనూ కలవరం సృష్టిస్తోంది. రోజురోజుకూ బాధితుల సం ఖ్య పెరుగుతోంది. మోసపోయినవారిలో హైదరాబాద్‌కు చెందిన 500 మందికిపైగా ఉన్నట్టు తెలిసింది. వివరాలను రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. సోషల్ ట్రేడ్‌పై సైబరాబాద్‌లో ఒకటి, రాచకొండలో 15 కేసులు నమోదయ్యాయని ,రాచకొండలో ఫిర్యాదు చేసినవారిలో ఒక తెలుగు దినపత్రిక విలేకరితోపాటు గృహిణులు, ఇంజనీర్లు, రీసెర్చ్ స్కాలర్లు ఉన్నారన్నారు. దాదాపు రూ.15 లక్షల వరకు మోసపోయినట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. సోషల్ ట్రేడ్ పేరిట మోసగించిన అనుభవ్ మిట్టల్, అతని అనుచరులను నోయిడా పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారని, వీరిని పీటీ వారంట్‌పై నగరానికి తీసుకొచ్చి విచారిస్తామని తెలిపారు. సోషల్ ట్రేడ్ మోసంపై నగరంలో ఇప్పటివరకు 9 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. యూపీ కేంద్రంగా 57,,500 పెట్టుబడిగా పెడితే 3 ఐడీలు ఇచ్చి, ఒక్కో ఐడీకి వెబ్సైట్ లింక్ పంపిస్తారు. క్లిక్ చేసిన ప్రతిసారి రూ.5 వస్తాయని, 4 నెలల్లో పెట్టుబడి తిరిగి వస్తుందని, ఐదో నెల నుంచి లాభం వస్తుందని సోషల్ ట్రేడ్ వ్యాపారులు నమ్మబలికారు. పెట్టిన పెట్టుబడిని కొద్దిరోజులు అందరికీ సర్దుబాటు చేసి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. -
నలుగురి ఇళ్లల్లో 152 కోట్ల ఆస్తులు
-
నలుగురి ఇళ్లల్లో 152 కోట్ల ఆస్తులు
కర్ణాటకలో దడ పుట్టించిన ఐటీ దాడులు సాక్షి, బెంగళూరు: నలుగురి ఇళ్లపై ఆదాయపు పన్ను శాఖ అధికారుల దాడుల్లో రూ.152 కోట్ల విలువైన సంపద బయటపడింది. బెంగళూరు లో నవంబర్ 30 నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు దాడులు నిర్వ హించినట్లు ఐటీ అధికారులు ప్రకట నలో వెల్లడించారు. ఇద్దరు ప్రభుత్వ ఇంజనీర్లు, ఇద్దరు కాంట్రాక్టర్ల ఇళ్లు, కార్యాలయాలతో పాటు వారి బంధు వులు, స్నేహితుల ఇళ్లలో సోదాలు జరిపామన్నారు. రూ.6 కోట్లకు పైగా బయట పడిన నగదులో రూ.5.7 కోట్ల విలువ చేసే కొత్త రూ.2 వేల నోట్లు ఉన్నాయి. దాదాపు 7 కిలోల బంగారం, వెండి బిస్కెట్లు, 9 కిలోల ఆభరణాలు సోదాల్లో వెలుగు చూశాయి. వందల కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులు, విలాసవం తమైన కార్లు బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి కావేరి నిరావరి నిగమ మేనేజింగ్ డెరైక్టర్ చిక్కరాయప్ప, ప్రజాపనుల శాఖలో చీఫ్ ప్రాజెక్ట్ ఆఫీసర్ జయచంద్రను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం శాఖ మంత్రి పరమేశ్వర్ విధానపరిషత్‌లో వెల్లడించారు. మరో ఇద్దరు కాంట్రాక్టర్లపై కేసు నమోదు చేశారు. -
సీఎంకు ఫిర్యాదు చేస్తా
- సీఎంకు ఫిర్యాదు చేస్తా – జల వనరుల శాఖ ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం కర్నూలు సిటీ: సాగు నీటి ప్రాజెక్టుల పనులు మీ నిర్లక్ష్యం వల్లే పూర్తి కావడం లేదని ఇలాగైతే సీఎంకు ఫిర్యాదు చేస్తానని కలెక్టర్ చల్లా విజయ మోహన్ జల వనరుల శాఖ ఇంజినీర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ భవనంలో సాగు నీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా సర్కిళ్ల ఇంజినీర్లతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సాగు నీటి ప్రాజెక్టుల పనులు నత్తనడకన సాగుతున్నాయని, కాంట్రాక్టర్లు పనులు చేయడంలో నిర్లక్ష్యం చేస్తుంటే ఇంజినీర్లు ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. పనులు సక్రమంగా చేయని కాంట్రాక్టర్లపై ఎందుకు ఇన్ని రోజులు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. గత సమావేశంలో నవంబర్ 15 లోపు పనులు పూర్తి చేస్తామని చెప్పి ఇంత వరకు పనులు మొదలే పెట్టలేదంటే శాఖ పనితీరు ఎలాంటిదో తెలిసిపోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గాలేరు పనుల్లో రోజుకు 8500 క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు గాను, కేవలం 3500 క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మాత్రమే జరిగితే ఎప్పటికి పూర్తి కావాలని ఈఈ, డీఈఈలపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. హంద్రీనీవా 25, 26, 28, 29 ప్యాకేజీలలో పెండింగ్ పనులు పూర్తయినప్పటికీ పనులు పూర్తి కాలేదన్నారు. పత్తికొండ, దేవనకొండ ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులను భాగస్వాములను చేసినా ఎందుకు పనులు ముందుకు సాగడం లేదని ప్రశ్నించారు. పనులు విభజించుకొని వచ్చే నెల 31లోపు పూర్తి చేయాలని ఇంజినీర్లును ఆదేశించారు. సిద్ధాపురం ఎత్తిపోతల పథకం 2007లో ప్రారంభించినా ఇప్పటీకి పనులు పూర్తి కాలేదన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పనులు నిలిచిపోయినా తన దృష్టికి ఎందుకు తీసుకరాలేదని ఈఈని ప్రశ్నించారు. ఆయన సమాధానం చెప్పకపోవడంతో మీ మౌనం చూస్తేనే పని తీరు ఏంటో అర్థమవుతుందని చురుకలంటించారు. ఈ నెల 29న మరో సారి సమీక్షిస్తానని, ఆలోపు మెరుగైన పురోగతితో రావాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో ఎస్ఈలు చంద్రశేఖర్ రావు, నారాయణ స్వామి, ఈఈ, డీఈఈ, ఏఈఈలు పాల్గొన్నారు. -
ఏఈఈల పరీక్ష ప్రశాంతం
కర్నూలు సిటీ: రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 748 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టులకు ఆదివారం ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. జిల్లాలో ఈ పరీక్ష రాసేందుకు 4251 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 3114 మంది పరీక్షకు హాజరయ్యారు. జిల్లాలో మొత్తం 9 కేంద్రాలను ఎంపిక చేశారు. కర్నూలు నగరంలో 8, ఆదోని ఒక కేంద్ర. నగరంలో ఎంపిక చేసిన పరీక్ష కేంద్రాలలో రెండు కేంద్రాల అడ్రసులు తెలియక పోవడంతో కొంత మంది అభ్యర్థులు ఇబ్బందులు పడ్డారు. పోలీసు అధికారుల సహకారంతో సకాలంలో ఆయా కేంద్రాలకు చేరుకున్నారు. బీ క్యాంపులోని భాష్యం స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రంలో ఇద్దరు అభ్యర్థులకు ప్రింటింగ్‌లో జరిగిన పోరపాటుతో ఒకే హాల్‌టికెట్ నంబరు వచ్చింది. దీంతో దానిపై ఫొటో ఉన్న అభ్యర్థి మాత్రమే పరీక్ష రాయాలని ఎగ్జామినర్ మరో అభ్యర్థి కొద్దిసేపు అందోళనకు గురి అయ్యాడు. కొందరు సూచనతో తర్వాత నెట్ సెంటర్‌కు వెళ్లి హాల్ టికెట్‌ను డౌన్లోడ్ చేసుకోగా అందులో సంబంధిత అభ్యర్థి ఫొటో వచ్చింది. వెంటనే పరిగెత్తుకుంటూ కేంద్రానికి చేరుకుని పరీక్ష రాశాడు. -
ఈ– ఆఫీసులను వేగవంతం చేయండి
– మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ కన్నబాబు కర్నూలు(టౌన్): కాగిత రహిత పాలనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో ఈ– ఆఫీసులను అమల్లోకి తీసుకొస్తుందని, ఆ దిశగా ఏర్పాట్లను వేగవంతం చేయాలని మున్సిపల్ పరిపాలన శాఖ రాష్ట్ర డైరెక్టర్ కన్నబాబు ఆదేశించారు. శనివారం ఆయన సాయంత్రం స్థానిక నగరపాలకలో మున్సిపల్ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాలు, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించేందుకు ఈ – ఆఫీసు పాలన ఎంతో ఉపయోగకరమన్నారు. పాలనలో జవాబుదారీ తనం, నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. అలాగే కర్నూలు నగరంలో రూ.కోట్లతో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బిల్లుల్లో జాప్యం వల్ల పనులు సక్రమంగా జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మరోసారి ఈ పరిస్థితి పునరావృతం కానివ్వొదన్నారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ ఎస్.రవీంద్రబాబు, ఇంజనీరింగ్ అధికారులు శివరామిరెడ్డి, రాజశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. -
వీబీఆర్‌ను సందర్శించిన నిపుణుల కమిటీ
వెలుగోడు: వీబీఆర్‌ను నిపుణుల కమిటీ బృందం శుక్రవారం సందర్శించింది. వీబీఆర్ కట్ట పటిష్టత హెడ్‌రెగ్యులేటర్, స్పిల్‌వే, వన్‌ఆర్‌తూము, ఇన్‌ఫాల్ రెగ్యులేటర్ల పనితీరును పరిశీలించి గంగ అధికారులకు పలు సలహాలు ఇచ్చారు. వీబీఆర్ కట్ట పటిష్టంగా ఉందని ధ్రువీకరించారు. రెగ్యులేటర్ల నిర్వహణ, మరమ్మతులపై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. జిల్లాలో రిజర్వాయర్ల పరిశీలన కోసం ప్రస్తుతం రిటైర్డు ఇంజనీర్లతో బృందం ఏర్పాట్లు చేసినట్లు రిటైర్డు డీఈ అబ్దుల్ బషీర్ అహమ్మద్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్, బానకచర్ల క్రాస్ రెగ్యులేటర్, వీబీఆర్లను సందర్శించినట్లు తెలిపారు. సందర్శించిన నిపుణుల కమిటీలో రిటైర్డు సీఈ సత్యనారాయణ, రిటైర్డు డీఈ కృష్ణారావు, స్థానిక గంగ ఈఈ పుల్లారావు, డీఈలు రఘురామిరెడ్డి, దామోదర్, ఏఈ ఇలియాస్ తదితరులు ఉన్నారు. -
'ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి'
హైదరాబాద్ : ఇంజినీర్లు అసమర్థులన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండించింది. తెలుగువారిని కించపరచడం చంద్రబాబుకు ఆనవాయితీగా మారిందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి బత్తులు బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ 'దేశంలోనే గొప్ప ఇంజినీర్ల మన తెలుగు గడ్డపై పుట్టిన విషయం చంద్రబాబుకు తెలియదా?. నాసాలో కూడా 36శాతం ఇంజినీర్లు భారతీయులే. వెంటనే ఇంజినీర్లకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రంలో టీడీపీ నేతలు ఎందుకు పెట్టుబడులు పెట్టారు?. హోదా అవసరం లేదంటున్న టీడీపీ నేతలు ఏపీలో ఎందుకు పెట్టుబడి పెట్టడం లేదు?' అని ప్రశ్నించారు. ఇటీవల రాయలసీమ పర్యటనలో భాగంగా చంద్రబాబు... తన మొహమాటంతో ఇన్నాళ్లు మిమ్మల్ని శిక్షించకుండా క్షమించానని, నా వేగాన్ని అందుకోవాలి, లేదంటే వెళ్లిపోవాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. -
జుకర్‌బర్గ్ విరాళం రూ.20,100 కోట్లు
- వచ్చే పదేళ్లలో వ్యాధులపై పోరుకు వినియోగం - నివారణకు ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు కలిసి పనిచేసేలా ప్రణాళిక హ్యూస్టన్: దాదాపు రూ. 20,100 కోట్లు... ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్, అతని భార్య ప్రిస్కిల్లా చాన్‌లు వచ్చే పదేళ్లలో వ్యాధుల నిర్మూలనకు వెచ్చించనున్న మొత్తం... గతేడాది డిసెంబర్లో తమ సంపదలో 99 శాతాన్ని ధార్మిక కార్యకలాపాలకు ఇస్తామంటూ జుకర్‌బర్గ్ దంపతులు ప్రకటించిన అనంతరం వేసిన మొదటి అడుగు ఇది. ఈ శతాబ్దం చివరి నాటికి అన్ని వ్యాధుల్ని రూపుమాపాలన్న ప్రతిష్టాత్మక లక్ష్యం సాధించే క్రమంలో గురువారం ఈ భారీ విరాళం ప్రకటించారు. ఇందులో భాగంగా శాన్ఫ్రాన్సిస్కోలో చాన్-జుకర్‌బర్గ్ బయోహబ్ పేరిట పరిశోధన కేంద్రం కోసం రూ. 4,020 కోట్లు ఖర్చుపెడతారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాన్ఫ్రాన్సిస్కో మెడికల్ సెంటర్(యూసీఎస్ఎఫ్), స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలతో కలిసి చిన్నారుల్లో వ్యాధుల నిర్మూలనకు ఈ పరిశోధన సంస్థ కలిసి పనిచేస్తుంది. ‘చాన్ జుకర్‌బెర్గ్ ఇనీషియేషన్’ ప్రణాళికలో భాగంగా మొదటి దశను శాన్ ఫ్రాన్సికోలో యుసీఎస్ఎఫ్ మిషన్ బే క్యాంపస్‌లో జుకర్‌బర్గ్, చాన్‌లు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ మాట్లాడుతూ.. మరణాలకు కారణమవుతున్న గుండె జబ్బులు, క్యాన్సర్, అంటు వ్యాధులు, న్యూరో వాధుల నివారణలో అత్యాధునిక ఆవిష్కరణల కోసం.. కొత్త పరికరాల్ని వేగంగా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు కలిసికట్టుగా తయారుచేయడమే తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ‘నాలుగు రకాల వ్యాధులు అత్యధిక మరణాలకు కారణమవుతున్నాయి. సరైన సాంకేతికతతో మనం వాటిపై విజయం సాధించగలం’ అని తెలిపారు. మెదడుపై మరింత పరిశోధనకు కృత్రిమ తె లివితేటలపై, క్యాన్సర్ జీన్స్ గుర్తించేందుకు యంత్ర విజ్ఞానం, అంటువ్యాధుల్ని పసిగట్టేందుకు కంప్యూటర్ చిప్స్, అలాగే రక్తప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించే పరికరాలపై పెట్టుబడులు అవసరమని చెప్పారు. పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తు కోసం ఈ ప్రక్రియను ప్రారంభించామన్నారు. ‘ఇది మనందరం కోరుకునే మన పిల్లల భవిష్యత్తు కోసమే’ అని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు. గతాన్ని తలచుకుని కన్నీటి పర్యంతమైన చాన్ మన పిల్లల జీవితకాలంలో అన్ని వ్యాధుల్ని నయం చేయడం, నివారణకు కలిసికట్టుగా పనిచేయడమే లక్ష్యమని పిల్లల వైద్య నిపుణురాలైన చాన్ చెప్పారు.. ‘మా చిన్నారికి నయంకాని వ్యాధి ఉంది లేదా బతికించుకోలేక పోయామంటూ ఎంతో మంది తల్లిదండ్రులు చెప్పేవారు’ అంటూ గత అనుభవాల్ని తలచుకుని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు. ఈ శతాబ్దం చివరికి చిన్నారుల ప్రాణాలు కాపాడేలా ఆ అనుభవాలు... కొత్త పరికరాల రూపకల్పన కోసం శాస్త్రవేత్తలు, ఇంజినీర్లతో కలిసి పనిచేసేలా ద్రుఢనిశ్చయాన్ని మరింత పెంచిందని చెప్పారు. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు కలిసికట్టుగా కృషిచేయడంతో పాటు విజ్ఞాన ర ంగంలో మరింత సహకారం, నూతన పరికరాల రూపకల్పన, మరింత అత్యాధునిక సాంకేతికత, ఇతర ప్రాజెక్టులకు మరిన్ని నిధుల కోసం సహకారంతో సాగడమే లక్ష్యమని జుకర్‌బర్గ్ దంపతులు పేర్కొన్నారు. కొత్త విజ్ఞానం కోసం అన్ని విధాల పరిశోధనా పరికరాలు కనుగొనేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఇప్పటికే పిల్లల విద్యాభివృద్ధి కోసం చాన్-జుకర్‌బర్గ్ సంస్థ కృషి చేస్తోంది. సాహసంతో కూడిన ప్రతిష్టాత్మక కార్యక్రమం.. గేట్స్: ఈ శతాబ్ది చివరినాటికి అన్ని వ్యాధుల నివారణ, నియంత్రణ అనేది చాలా ధైర్యం కూడిన ప్రతిష్టాత్మక కార్యక్రమని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అన్నారు. -
పీఆర్ ఇంజనీర్లపై ఒత్తిడి తగ్గాలి
గూడూరు : పంచాయతీరాజ్ ఇంజనీర్లపై ఆయా జిల్లాల కలెక్టర్ల ఒత్తిళ్లు తగ్గాలని పంచాయతీరాజ్ డిప్లొమో ఇంజనీర్ల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్ కోరారు. పట్టణంలోని పంచాయతీరాజ్ కార్యాలయంలో ఆదివారం పీఆర్ డిప్లొమా ఇంజనీర్ల సర్వసభ్య సమావేశం జరిగింది. రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ముఖ్యంగా క్షేత్రస్థాయి పీఆర్ అధికారులకు బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలన్నారు. ఈ నెల 27వ తేదీన జిల్లా, డివిజన్ కేంద్రాల్లో జేఏసీ తలపెట్టిన ధర్నాలను జయప్రదం చేయాలని కోరారు. సమస్యలను రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతున్నా హామీలు ఇస్తోందే గానీ, సమస్యలు మాత్రం పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. ఇంకా అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంతరావు, అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణమూర్తి మాట్లాడారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రసాద్‌రావు, జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మున్వర్, గూడూరు డివిజన్ ఏపీ ఎన్జీఓల సంఘం అధ్యక్షుడు శివకుమార్, కార్యదర్శి మధులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో ఇంజనీర్లు కీలకం
జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ ఘనంగా మోక్షగండం విశ్వేశ్వరయ్య జయంతి హన్మకొండ : దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పాత్ర కీలకమని జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ గద్దల పద్మ అన్నారు. హన్మకొండలోని జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచినఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఇంజనీర్లు గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయ ఆవరణలోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి చైర్పర్సన్ గద్దల పద్మ, ఇంజనీర్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో పద్మ మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఇంజనీర్ అని అని కొనియాడారు. విశ్వేశ్వరయ్య నుంచి నేటి ఇంజనీర్లు స్ఫూర్తిని పొందాలని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. అదేక్రమంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతగా ఉండేల చూడాలన్నారు. పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు సంయుక్తంగా జెడ్పీ ఆవరణలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయమని గద్దల పద్మ కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు ఇంజనీర్లను సన్మానించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్, పంచాయతీరాజ్ ఎస్ఈ సత్యనారాయణ, ఈఈలు శ్రీనివాస్‌రావు, రాజేంద్రప్రసాద్, డీఈలు సురేష్, కృష్ణారెడ్డి, ఇంజనీర్ అసోషియేషన్ల నాయకులు పులి ప్రభాకర్, మహిపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో... కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా హన్మకొండలోని జెడ్పీ ఆవరణలో ఉన్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, గ్రేటర్ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్, నాయకుడు ఈవీ శ్రీనివాస్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. -
ఘనంగా ఇంజనీర్స్‌డే వేడుకలు
అనంతగిరి(కోదాడఅర్బన్): మండల పరిధిలోని అనంతగిరిలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా ఇంజనీర్స్‌డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీ శివప్రసాద్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకుని ఇంజనీరింగ్ విద్యార్థులు దేశాభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్ధులకు క్విజ్, పోస్టర్ ప్రెజెంటేషన్, డిబేట్, పేపర్ ప్రెజెంటేషన్, మాక్ ఇంటర్వూలు నిర్వహించి విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘పాలమూరు’ పంపుహౌస్‌పై సందిగ్ధత!
ప్యాకేజీ-1లో ఇంజనీర్ల మధ్య కుదరని ఏకాభిప్రాయం సాక్షి, హైదరాబాద్: పాలమూరు ప్రాజెక్టు ఒకటో ప్యాకేజీలో మార్పులపై సందిగ్ధత కొనసాగుతోంది. అందులో మార్పులు చేయాలని పలువురు ఇంజనీర్లతోపాటు కాంట్రాక్టు సంస్థ చెబుతుండగా.. ఆ అవసరం లేదని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై ఇంజనీర్లు బుధవారం మరోసారి చర్చించి నా.. ఏకాభిప్రాయం రాకపోవడంతో ఉన్నతాధికారుల నిర్ణయానికి వదిలేశారు. ఒకటో ప్యాకేజీలో ఉన్న పంపుహౌస్ ప్రాంతంలో 287 ఎకరాల అటవీ భూమి ఉంది. దాంతో పంపింగ్ స్టేషన్ నిర్మాణ స్థలాన్ని మార్చాలని కాంట్రాక్టు ఏజెన్సీ ప్రభుత్వానికి నివేదిం చింది. లేకపోతే అధికారులు ప్రతిపాదించినట్లుగా భూగర్భ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి అనుమతించాలని కోరింది. ఈ ప్రతిపాదనలను అధికారులు తిరస్కరించారు. నిర్మాణ ప్రాంతాన్ని మార్చి, బ్లాస్టింగ్ వంటివి చేస్తే 300 మీటర్ల దూరంలోనే ఉన్న కల్వకుర్తి పంప్‌హౌస్ పునాదులు బీటలు వారే అవకాశం ఉంటుందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు దగ్గరగా భూగర్భంలో పంప్‌హౌస్ నిర్మిస్తే సీపేజీ నష్టాలు ఉంటాయని, వరదల సమయంలో పంప్‌హౌస్ మునిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పంపుహౌస్ నుంచి అప్రోచ్ చానల్ వీలైనంత దగ్గరగా ఉండాలన్నారు. కాంట్రాక్టు సంస్థ చెప్పినట్లు మారిస్తే అది 1.5 కి.మీ. నుంచి 2.5 కి.మీ.కు పెరుగుతుందని, దీంతో పూడిక పెరిగే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. అయితే మరికొందరు ఇంజనీర్లు దీనితో విభేదిస్తున్నారు. ప్యాకేజీ-1 పనులను యధావిధిగా కొనసాగిస్తే అటవీ శాఖ నుంచి ఇబ్బందులు తప్పవని.. ఎలాంటి అనుమతులు లేకుండా పనులు చేపట్టడం అటవీ చట్టాలను ఉల్లఘించడమేనని స్పష్టం చేస్తున్నారు. ప్రాజెక్టుకు ఇదే మొదటి పంపుహౌస్ అయినందున.. దీని నిర్మాణం ఆగితే మొత్తం ప్రాజెక్టు ఆగుతుందని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పంపుహౌస్‌ను భూగర్భంలో నిర్మించడమే సమంజసమని అంటున్నారు. -
నేడు ఇరిగేషన్ ఇంజినీర్లకు జియో ట్యాగింగ్‌పై శిక్షణ..!
వరంగల్ : మిషన్ కాకతీయలో చేపట్టిన చెరువుల పునరుద్ధరణలో భాగంగా చిన్న నీటిపారుదల శాఖలో ఇంజినీర్లకు జియో ట్యాంగింగ్పై శిక్షణ ఇస్తున్నారు. మిషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చెరువుల పునరుద్ధరణ చేపట్టినందున వాటి పూర్వపరాలు ఆన్లైన్లో ఉంచేందుకు ఈ జియో ట్యాగింగ్ వ్యవస్థ ఉపకరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యవస్థపై ఇంజినీర్లకు ఒక రోజు శిక్షణ ఇస్తున్నారు. ఈ మేరకు గురువారం ఐఐటీకి చెందిన నిపుణులు జిల్లాకు వస్తున్నట్లు సమాచారం. శిక్షణ కార్యక్రమం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో చేసే అవకాశాలున్నాయి. -
ఇంజనీర్లపై నమ్మకం లేకనే సీఎం సొంత సమీక్ష
పాములపాడు/జూపాడుబంగ్లా: రాష్ట్రంలోని ప్రాజెక్టులపై ఇంజనీర్లు సరైన వివరాలు చెప్పడం లేదని.. అందువల్లే సీఎం సొంతంగా సమీక్షలు చేస్తూ చర్యలు చేపడుతున్నారని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అన్నారు. గురువారం వీరు మండలంలోని యర్రగూడూరు గ్రామం వద్ద 24 ప్యాకేజీలోని ఎస్ఆర్ఎంసీ విస్తరణ పనుల్లో భాగంగా నిర్మాణంలోని వంతెనను పరిశీలించారు. జూన్ చివరి నాటికే పనులు పూర్తి కావాల్సి ఉండగా ఇంత వరకు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బానకచెర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్ద నిర్మాణంలోని గాలేరు నగరి అదనపు గేట్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఎస్ఆర్బీసీ వెంట సూపర్ప్యాసేజీ స్టీలు బ్రిడ్జీలు కూల్చివేయడంతో కేసీ ఆయకట్టు పొలాలు సాగు నీరు లేక బీళ్లుగా మారే పరిస్థితి ఉందని విలేకరులు ప్రశ్నించగా నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. అంతకు ముందు జూపాడుబంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌ను సందర్శించారు. శ్రీశైలం జలాశయం నీటిని ప్రస్తుతం దిగువ ప్రాంతాలకు తరలించే వెసలుబాటుపై ఎస్ఈ రామచంద్రను అడిగి తెలుసుకున్నారు. వీరి వెంట కపడ జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, ఈఈలు గంగయ్య, శ్రీనివాసరెడ్డి, డీఈ శిరాంప్రసాద్ ఉన్నారు. -
క్షమించాలని కోరితే వదిలేస్తాం
అక్రమాలకు పాల్పడ్డ ఇంజినీర్లకు మంత్రి బంపర్ ఆఫర్ బెంగళూరు: అక్రమాలకు పాల్పడ్డ ఇంజినీర్లకు ఓ అమాత్యుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తప్పు చేసామని ఒప్పుకుంటే క్షమించి వదిలేస్తానని చెప్పారు. రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తి పథకానికి సంబంధించి అక్రమాలకు పాల్పడిన ఇంజనీర్లు స్వయంగా తమ తప్పును ఒప్పుకుంటే సస్పెండ్ చేయబోనని ఇంధనశాఖ మంత్రి డీ.కే శివకుమార్ తెలిపారు. బెంగళూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రూఫ్‌టాప్ సౌరవిద్యుత్ ఉత్పత్తిలో అవకతవకలకు పాల్పడిన 9 మందిని ఇప్పటికే సస్పెండ్ చేశామన్నారు. ఈ పథకానికి సంబందించి మరో 50 మంచి ఇంజినీర్లు కూడా అక్రమాలకు పాల్పడ్డారని తెలిసిందన్నారు. ఇందుకు సంబంధించి వారే తన వద్దకు వచ్చి స్వయంగా తప్పును ఒప్పుకుంటే క్షమిస్తానన్నారు. లేదంటే సస్పెండ్ చేస్తానని తెలిపారు. మంత్రి డీ.కే శివకుమార్ తప్పుచేసిన వారిని చట్టం ప్రకారం శిక్షించాల్సింది పోయి క్షమిస్తానని చెప్పడం చర్చనీయాంశమైంది. -
ఆ ఉద్యోగానికి డాక్టరేట్లు,ఇంజినీర్ల క్యూ!
భోపాల్: దేశంలో రోజురోజుకూ పెరుగుతున్న నిరుద్యోగ సమస్య తీవ్రతకు ఈ ఘటన అద్దం పడుతోంది. మధ్యప్రదేశ్ లోని పదవ తరగతి అర్హత గల నాల్గవ తరగతి గ్రేడ్ ఉద్యోగానికి 34 మంది పీహెచ్డీ ,12 వేల మంది ఇంజనీరింగ్ పట్టభద్రులు దరఖాస్తు చేసుకున్నారు. కాగా ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది. తాను అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు కల్పిస్తానన్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ నిరుద్యోగ నిర్మూలనకు తీసుకున్న చర్యలు శూన్యమని, ఉపాధి కల్పనలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం విఫలమైందని ఆ పార్టీ తీవ్రంగా విమర్శించింది. కాగా మహారాష్ట్రలో ఐదు హమాలీ (పోర్టర్) ఉద్యోగాలకు 2,500 మంది దరఖాస్తు చేశారు. నాలుగో తరగతి పాసైతే సరిపోయే ఈ పరీక్ష కోసం ఏకంగా 984 మంది గ్రాడ్యుయేట్లు, 253 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, ఐదుగురు ఎంఫిల్ పట్టభద్రులు కూడా దరఖాస్తు చేశారు. -
అభివృద్ధి పనుల్లో అలసత్వం వద్దు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో అలసత్వం తగదని, బంగారు తెలంగాణ కోసం అందరూ కలిసికట్టుగా పనిచేయాలని వ్యవసాయ, సహకార శాఖల మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. మిషన్ భగీరథ పనుల్లో అక్రమాలు, అవకతవకలు జరిగితే ఉపేక్షించబోమన్నారు. బాధ్యులైన ఇంజినీర్లు ఎక్కడ ఉన్నా చర్యలు తప్పవన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో హరితహారం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనులపై ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పీ చైర్మన్ దఫేదార్ రాజు, ఎంపీలు కవిత, బీబీ పాటిల్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి సమీక్షించారు. ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, భూపతిరెడ్డి, రాజేశ్వర్, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, హన్మంత్ సింధే, కలెక్టర్ యోగితారాణా, జేసీ రవీందర్‌రెడ్డి, మేయర్ సుజాత, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. కోటి మొక్కలు.. రెండేళ్లలో ప్రతి నియోజకవర్గంలో కోటి మొక్కలను నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందని మంత్రి తెలిపారు. ఈ ఏడాది వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని, 11 రకాల కాంపోనెంట్ల కింద 3.35 కోట్ల మొక్కలను పెట్టేందుకు ఈ నెలాఖరులోపు ఉపాధి పనులతో గుంతలను తవ్వించాలని సూచించారు. వర్షాలు ప్రారంభం ఆయన వెంటనే మొక్కలు నాటడాన్ని చేపట్టి ఆగస్టు నెలాఖరుకు పూర్తి చేయాలన్నారు. హరితహారంలో భాగస్వాములను చేసేందుకు మండలాలు, గ్రామాల వారీగా రూపొందించిన కార్యాచరణ నివేదికలను ప్రజాప్రతినిధులకు అందజేయాలన్నారు. మిషన్ కాకతీయ.. మిషన్ కాకతీయ మొదటి దశ కింద రూ. 234 కోట్లతో 76,724 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించేందుకు మంజూరు చేసిన 658 పనులలో 571 పనులు పూర్తి అయ్యాయని పోచారం తెలిపారు. మిగిలిన 87 పనులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మిషన్ కాకతీయ రెండో దశ కింద గుర్తించిన 674 పనులలో 50 వేల ఎకరాలకు నీరు అందించే 649 చెరువుల పునరుద్ధరణకు రూ. 227 కోట్ల అంచనాతో పనులను మంజూరయ్యాయన్నారు. వాటిలో 610 పనుల అగ్రిమెంట్లు పూర్తయ్యాయని, 604 పనులు గ్రౌండింగ్ అయ్యాయని తెలిపారు. మిగిలిన పనులను ఈ నెలాఖరులోపు అగ్రిమెంట్‌తో పాటు గ్రౌండింగ్ చేయాలని అధికారులకు ఆదేశించారు. పనిచేయని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్టులో పెట్టాలన్నారు. ప్రతి వర్షపు చుక్కను నిలువ చేసేందుకు అనువుగా చెరువుల తూములు, అలుగులను ముందస్తుగా పటిష్టపర్చాలని సూచించారు. నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువల ఆధునికీకణకు ప్రభుత్వం రూ. 115 కోట్లను మంజూరు చేయనుందన్నారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం పరిధిలోకి రాని భూములకు నీటి వసతి కల్పించేందుకు చేపట్టాల్సిన పనుల గుర్తింపునకు ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నామన్నారు. పథకాల అమలులో మనమే ఫస్టు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో మన జిల్లా ప్రథమస్థానంలో ఉందని ఎంపీ కవిత పేర్కొన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, హరితహారంలపై ప్రత్యేక దృష్టి సారిం చాలని అధికారులకు సూచిం చారు. గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులు ప్రతిభ కనబరిచారన్నారు. ఉపాధి హామీ తదితర పథకాల్లో జిల్లా మొదటిస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో అడవుల విస్తీర్ణం 24 శాతం ఉంటే, జిల్లాలో 21.46 శాతం మాత్రమే ఉందని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విరివిగా మొక్కలు నాటాలని కోరారు. ప్రస్తుతం ఉన్న చెట్లకు కూడా నీరందించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. జిల్లా కేంద్రం లోని రఘునాథ చెరువును ట్యాంకు బండ్‌గా మార్చనున్నామని కవిత తెలిపారు. చెరువు పక్కనుంచే నిజాంసాగర్ కాలువ వెళ్తున్నందున అందులోనుంచి నీరు ఈ చెరువులోకి వచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ట్యాంకు బండ్ నిర్మించనున్నట్లు తెలిపారు. జూన్ 10 నుంచి హరితహారం ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో 40 వేల మొక్కలను నాటించడానికి ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. వచ్చేనెల 10 నుంచి హరితహారం ప్రారంభమవుతుందన్నారు. జిల్లాలో రెండేళ్లల్లో వేయి ఎకరాలలో గమ్‌కరియా మొక్కలను నాటించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేసేందుకు సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు అవగాహన సదస్సులు నిర్వహించామన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల నిర్మాణానికి అవసరమైన 43.73 ఎకరాల ప్రభుత్వ భూములలో 42.22 ఎకరాలను సేకరించామని తెలిపారు. అలాగే 2.65 ఎకరాల ప్రైవేటు భూములలో రెండు ఎకరాలను సేకరించి అప్పగించామన్నారు. పైపులైన్లు, ఇతర నిర్మాణ పనులకు అవసమరైన 36 హెక్టార్ల అటవీ భూములను అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద సేకరించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అలాగే 36 రైల్వే క్రాసింగ్‌ల గుండా పైపులైన్లు నిర్మించేందుకు రైల్వే అధికారులతో సంయుక్తంగా సర్వే ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. జాతీయ రహదారులకు సంబంధించి 35, ఆర్‌అండ్‌బీకి సంబంధించి 451, పీఆర్‌కు సంబంధించి 748, సాగునీటి కాలువలకు సంబంధించి 206 చోట్ల క్రాసింగ్‌లు ఉన్నాయని, వాటిపై సంయుక్త తనిఖీలు పూర్తి చేశామని పేర్కొన్నారు. మిషన్ భగీరథకు సంబంధించిన అన్ని పనులను ఏకకాలంలో పూర్తి చేయించేందుకు రెగ్యులర్ మానిటరింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ‘భగీరథ’ వేగం పెంచండి ఇంటింటికి సురక్షిత తాగునీరు అందించేందుకు నిజామాబాద్ జిల్లాలో రూ. 4 వేల కోట్ల విలువైన పనులను ప్రభుత్వం చేపడుతోందని, చరిత్రలో ఇది ఒక అద్భుత విషయమని మంత్రి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మిషన్ భగీరథ పనులను వేగవంతం చేయాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. రూ. 41.11 కోట్లతో జలాల్పూర్ వద్ద నిర్మిస్తున్న ఇన్‌టెక్ వెల్ పనులలో ఎక్కువ మంది కూలీలను నియమించాలని సూచించారు. ఎస్సారెస్పీ నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,350 కోట్లు, సింగూరు నుంచి నీటిని తరలించేందుకు రూ. 1,300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసిందన్నారు. జిల్లాలోని 1,645 ఆవాసాలకు సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. జూన్ 30 నాటికి 121 గ్రామాలకు, డిసెంబరు నాటికి మరో 148 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. రైతులకు నష్టం జరగకుండా ఉండేందుకు వ్యవసాయ భూములలో వేసే పైపులను ఈ నెలాఖరులోపు పూర్తి చేయాలని తెలిపారు. అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదు ‘‘మిషన్ కాకతీయ విషయంలో నాకు ఒక్కసారి కూడా ఇరిగేషన్ ఎస్ఈ, సంబంధిత అధికారులు సమాచారం ఇవ్వలేదు’’ అని ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ పనులు జరుగుతున్నాయో కూడా చెప్పడం లేదన్నారు. ఎస్ఈ వద్ద తన ఫోన్ నంబరు కూడా లేదని పేర్కొన్నారు. ఈఈ, డీఈలకు కూడా నేను తెలియదన్నారు. రాజేశ్వర్ ఆవేదనపై మంత్రి పోచారం స్పందించారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా ప్రజాప్రతినిధులకు సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. అటవీ అధికారుల నిర్లక్ష్యంతో.. ఇందల్వాయి నుంచి ధర్పల్లికి వెళ్లే రెండు కిలోమీటర్ల రోడ్డు అత్యంత దారుణంగా ఉందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. రోడ్డుకు అనుమతుల విషయంలో అటవీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రోడ్డు బాగు చేయించలేకపోతున్నామన్నారు. రోడ్డు నిర్మాణంలో ఎక్కడా చెట్లు అడ్డుగా లేవన్నారు. అయినా అటవీ అధికారులు అనుమతులు ఇవ్వడం లేదని ఆరోపించారు. అనుమతులు ఇస్తే రోడ్డు వేయించనున్నట్లు తెలిపారు. నిజామాబాద్ రూరల్ నియోజక వర్గంలో మిషన్ కాకతీయ పనులు ఆశించిన వేగంతో సాగడం లేదని, అధికారులు కాంట్రాక్టర్లకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. -
ప్రాజెక్టులకు ‘ఎస్కలేషన్’గ్రహణం
నేడు సీఈలు, ఏజెన్సీలతో ప్రభుత్వం సమావేశం సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులకు ఎస్కలేషన్ గ్రహణం వీడడంలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా ధరలు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించినా కాంట్రాక్టర్లు మాత్రం పనులు చేసేందుకు ముందుకు రావడం లేదు. మరిన్ని పనులకు ఎస్కలేషన్ వర్తింజేయాలని ఒకసారి, ఇన్సూరెన్స్, డిపాజిట్లు విడుదల చేయాలని మరోసారి డిమాండ్లను ముందుకు తీసుకువస్తున్నారు. దీంతో ఇప్పటికే నత్తనడకన సాగుతున్న రూ.9 వేల కోట్ల పనులు మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, ఏజెన్సీలతో నీటిపారుదల శాఖ సమావేశం నిర్వహించనుంది. సమావేశానికి శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి సైతం హాజరుకానున్నారు. ఏజెన్సీలకు డెడ్‌లైన్ పెట్టి ప్రతిపాదనలు తీసుకోవాలని, అప్పటికీ ముందుకు రాని సంస్థలపై ప్రభుత్వ స్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని నీటి పారుదల శాఖ భావిస్తోంది. -
పేరుకే యూఎస్.. మెజారిటీ భారతీయతే!
అమెరికా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లలో మనమే ఎక్కువ * అక్కడి మేధావుల్లో ఆసియన్లు ఎక్కువ.. అందులోనూ భారత్ టాప్ * ఉన్నత విద్యలో నాణ్యత, ఎక్కువ సంపాదనతోనే వలసలు వాషింగ్టన్: అమెరికన్ ఇమిగ్రేషన్ పొందుతున్న సైంటిస్టులు, ఇంజనీర్లలో భారతీయులే ఎక్కువగా ఉన్నారని యూఎస్‌కు చెందిన నేషనల్ సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ స్టాటిస్టిక్స్ (ఎన్‌సీఎస్‌ఈఎస్) వెల్లడించింది. ఆసియా దేశాలనుంచి ఈ విభాగంలో వలస వస్తున్నవారు ఎక్కువగా ఉండగా.. అందులోనూ భారత్ మొదటి స్థానంలో కొనసాగుతోంది. జీవ శాస్త్రవేత్తలు, కంప్యూటర్, గణిత శాస్త్రవేత్తలు, ఇంజనీర్లే ఎక్కువగా అమెరికాకు వలసవస్తున్నట్లు వెల్లడైంది. ఉన్నత విద్యాభ్యాసం కోసం వచ్చిన వారు ఆయా దేశాలకంటే ఎక్కువ సంపాదన అక్కడే ఉండటంతో అమెరికాలోనే సెటిల య్యేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికితోడు అక్కడి వర్సిటీల్లో స్థానికుల కంటే విదేశీయులే ఎక్కువగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఉన్నత చదువులకు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో చదువు పూర్తవగానే మంచి వేతనంతో ఉద్యోగం వస్తుండటం మరో కారణం. ఆసియా నుంచి 29 లక్షల మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు అమెరికాలో ఉండగా.. అందులో 9.5లక్షల మంది భారతీయులే. 2003 నుంచి యూఎస్ వెళ్తున్న భారతీయుల సంఖ్యలో 2013 వరకు 85శాతం పెరుగుదల కనిపించిందని తెలిపింది. 2013 వరకు యూఎస్‌లోని విదేశీ శాస్త్రవేత్తల్లో 57శాతం ఆసియావారేనని వెల్లడించింది. ఐక్యరాజ్యసమితి లెక్కా ఇదే! ప్రపంచంలో వలసల్లో భారత్ అగ్రస్థానంలో ఉందని ఐక్యరాజ్యసమితి తాజాగా నిర్వహించిన సర్వే నివేదిక వెల్లడించింది. ఐరాసకు చెందిన ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం (డీఈఎస్ఏ) అంతర్జాతీయ వలసదారులపై ఈ సర్వే చేసింది. భారత్ నుంచి ఇతర దేశాలకు వెళ్లి నివసిస్తున్న వలసదారుల జనాభా, ఇతర దేశాల వలసల కన్నా ఎక్కువగా ఉంది. 2015లో భారత్‌కు చెందిన 1.6 కోట్ల మంది ఇతర దేశాల్లో నివసిస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. దీని ప్రకారం.. 2015 వరకు ప్రపంచవ్యాప్తంగా 24.4 కోట్ల మంది వలస వెళ్లారు. ఇది 2000 సంవత్సరంలో లెక్కల కన్నా 41 శాతం ఎక్కువ. -
చందమామపై నివాసాలు!
లండన్: చంద్రుడిపై అతి త్వరలోనే గ్రామాలు వెలియనున్నాయా..? అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. వ్యోమగాములు, రోబోటిక్ వ్యవస్థల సాయంతో వీటిని నిర్మించి 2030 వరకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్‌లో చంద్రుడిపైకి వెళ్లే వ్యోమగాముల నివాసానికి ఈ గ్రామాలు ఉపయోగపడేందుకు నిర్మిస్తున్నారు. నెదర్లాండ్‌లో యురోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్ఏ) నిర్వహిస్తున్న ‘న్యూ ఎరా ఆఫ్ కో ఆర్డినేటెడ్ హ్యూమన్, రోబోటిక్ ఎక్స్‌ప్లోరేషన్’ సదస్సులో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు, పరిశ్రమల నిపుణుల బృందం ఈ మేరకు ప్రకటించింది. అయితే గృహ నిర్మాణాలు నిజం కావాలంటే ముందుగా చంద్రుడిపై సరిపడా వనరులు ఉన్నాయా అనే అంశంపై శాస్త్రవేత్తలు పరిశోధించాలని అమెరికాకు చెందిన క్లైవ్ నీల్ పేర్కొన్నారు. అంతే కాకుండా అవి ఎంత వరకు పనికొస్తాయో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ వనరులను కూడా నిర్మాణ యోగ్యంగా మలుచుకునే సాంకేతికతను రూపొందించాలని సూచించారు. అప్పుడే అందరం కలలు కంటున్న చంద్రుడిపై గ్రామాలు నిజమవుతుందని పేర్కొన్నారు. -
కలవరపరుస్తున్నవరుస ఇంజనీర్ల హత్యలు
పట్నా: బిహార్ లో వరుసగా ఇంజనీర్లు హత్యకు గురి కావడం కలకలం రేపింది. ఇటీవల దర్భాంగా జిల్లాలో ఇద్దరు ఇంజనీర్లను దారుణంగా హత్యచేసిన ఘటన మరువక ముందే సోమవారం రాత్రి మరో ఘటన చోటు చేసుకుంది. వైశాలి జిల్లాలో ఇంజనీర్ అంకిత్ ఝా అనుమానాస్పద స్థితిలో శవమై తేలాడు. అంకిత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, దుండగులు గొంతుకోసి హత్య చేశారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. అతని హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నామని కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. కాగా డిసెంబర్ 26, ఒక ప్రైవేట్ రహదారి నిర్మాణ సంస్థలో పనిచేసే ఇద్దరు ఇంజనీర్లను గుర్తుతెలియని దుండగులు కాల్చి చంపారు. దోపిడీదారులే ఈ హత్యలకు పాల్పడి ఉండారనే అనుమానాలువ్యక్తమయ్యాయి. ఈ కేసులో అనుమానితవ్యక్తులుగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇది విచారణలో ఉండగానే తాజా హత్య పోలీసులకు సవాల్ గా మారింది. -
హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక సంస్థ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రాబోతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ అనుకూల భవనాల (గ్రీన్ బిల్డింగ్స్) నిర్మాణానికి ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఆ తరహా నిర్మాణాల్లో మెళకువలు నేర్పే జాతీయ శిక్షణ సంస్థ ‘అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎఫిసెంట్ కన్స్ట్రక్షన్ టెక్నాలజీ’ ఏర్పాటు కాబోతోంది. దీనికి జర్మనీ మేథో సహకారం అందించనుండగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారం ఇవ్వనుంది. దేశంలో హైదరాబాద్‌తోపాటు ముంబై, కోల్‌కతాల్లో ఇవి ఏర్పాటవుతాయి. మాదాపూర్‌లోని న్యాక్‌కు అనుబంధంగా వచ్చే ఈ కేంద్రం అదే ప్రాంగణంలో సిద్ధం కానుంది. దీనికి కేంద్రం రూ.15 కోట్లు ఇవ్వనుంది. రెండేళ్లపాటు శిక్షణ ఇచ్చేందుకు మరో రూ.5 కోట్లు ఇస్తుంది. వెంటనే పనులు మొదలయ్యేలా లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇంజనీర్లకు శిక్షణ పర్యావరణంపై దుష్ర్పభావం లేకుండా నిర్మాణాలను ప్రోత్సహించాలని ఐక్యరాజ్యసమితి సూచిస్తోంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో గ్రీన్ బిల్డింగ్ అంశం బాగా అభివృద్ధి చెందింది. మన దేశంలో దీనిపై అంతగా అవగాహన లేదు. దీంతో ఇంజనీర్లను ఆ దిశగా సిద్ధం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రపంచంలో నిర్మాణ రంగంలో శిక్షణ ఇవ్వటంలో ముందున్న జర్మనీని సాయం కోరింది. దీంతో జర్మనీ ప్రత్యేకంగా నిపుణులను మనదేశానికి పంపగా, వారు వివిధ ప్రాంతాల్లోని న్యాక్ తరహా కేంద్రాలను పరిశీలించారు. అభివృద్ధి చేస్తాం: తుమ్మల న్యాక్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి దాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హామీ ఇచ్చారు. గురువారం న్యాక్ 17వ ఆవిర్భావ దినోత్సవాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. న్యాక్ సిబ్బంది అతి తక్కువ జీతాలకే పనిచేస్తున్నారని సంస్థ డీజీ భిక్షపతితోపాటు డెరైక్టర్ శాంతిశ్రీ, ఫైనాన్స్ డెరైక్టర్ హేమలత, ఇతర అధికారులు వెంకట్రామయ్య, గంగాధర్‌లు అదే సభలో పేర్కొనటంతో మంత్రి వెంటనే స్పందించారు. వారి జీతాల పెంపుతోపాటు సర్వీసు క్రమబద్ధీకరణకు సీఎంతో చర్చిస్తానని హామీ ఇచ్చారు. న్యాక్‌లో యువతకు నిర్మాణరంగంలో మెళకువలు నేర్పటం ద్వారా ఉపాధిని మెరుగుపరుస్తామన్నారు. సంవత్సర కాలంలో 3,800 మందికి శిక్షణ ఇస్తే 3,200 మందికి ఉద్యోగాలు లభించాయని సంస్థ డీజీ బిక్షపతి పేర్కొన్నారు. -
రూ.22 కోట్లు బొక్కేశారు..!
నగరపాలక సంస్థలో భారీ కుంభకోణం ♦ భవన నిర్మాణాల అనుమతుల మంజూరులో చేతివాటం ♦ ఒక్కొక్క యజమాని నుంచి రూ.లక్షల్లో తీసుకుని వేలల్లో జమ ♦ మిగిలిన సొమ్మును మింగేసిన లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు ♦ ఆడిట్ తనిఖీల్లో వెలుగు చూసిన అవినీతి బాగోతం ♦ బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేసిన ఉన్నతాధికారులు ♦ టౌన్‌ప్లానింగ్ విభాగం మంజూరు చేసిన భవనాల ప్లాన్లపై విజిలెన్స్‌కు లేఖ నగరపాలక సంస్థలో ఇదో భారీ కుంభకోణం..సంస్థకు చెల్లించాల్సిన సొమ్మును పక్కదారి పట్టించి ఏకంగా 22 కోట్ల రూపాయల వరకు బొక్కేశారు. ఈ అవినీతి దందాలో పరిపాలన సిబ్బంది, లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల నుంచి పూర్వ కమిషనర్ల వరకు కార్పొరేషన్‌కు పంగనామాలు పెట్టినవారే. మూడేళ్లపాటు నిరాటంకంగా సాగిన ఈ అవినీతి బాగోతంపై ‘సాక్షి’ అందిస్తున్న పరిశోధనాత్మక కథనం ఇది.. అరండల్‌పేట(గుంటూరు) : నగరపాలక సంస్థ అంటేనే అవినీతికి కేరాఫ్ అని ప్రజలు భావిస్తుంటారు. అందులో పట్టణ ప్రణాళిక విభాగం అంటే ముడుపులు ఇవ్వనిదే పనిజరగదన్న భావన ప్రజల్లో నాటుకుపోయింది. అయితే ఈ సారి అధికారులు సరికొత్త పంథాలో అవినీతికి తెరతీశారు. నగరంలో భవనాలు, అపార్టుమెంట్ల నిర్మాణాల కోసం అనుమతులు కోరుతూ లెసైన్స్డ్ ఇంజినీర్లు ద్వారా భవన యజమానులు కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకొనేవారు. వీటిని పరిశీలించిన బిల్డింగ్ ఇన్స్పెక్టరు, పరిపాలనా సిబ్బంది నిబంధనల మేరకు చెల్లించాల్సిన ఫీజులపై యజమానులకు ఎండార్స్మెంట్లు పంపేవారు. ఉదాహరణకు ఒక అపార్టుమెంట్ నిర్మాణానికి అనుమతి మంజూరు చేయాలంటే కార్పొరేషన్‌కు నాలుగు లక్షల రూపాయలు ఫీజుగా చెల్లించాలని ఎండార్స్మెంట్ పంపేవారు. యజమాని నుంచి ఈ డబ్బు తీసుకున్న లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు కేవలం రూ. 40 వేలు మాత్రమే కార్పొరేషన్‌కు చెల్లించేవారు. రశీదులో నలభైవేల పక్కన సున్నాలు కలిపి నాలుగు లక్షలుగా చూపి దరఖాస్తు ఫారానికి జత చేసేవారు. మిగిలిన రూ. 3.60 లక్షలు పంచుకొనేవారు. ఇలా మూడేళ్లలో రూ. 22 కోట్లు నొక్కేశారు. బయటపడిందిలా.. నగరపాలక సంస్థలో మూడు సంవత్సరాలుగా జరిపిన లావాదేవీలపై ఆడిట్ అధికారులు ఈ నెలలో తనిఖీలు నిర్వహించారు. 2012-13, 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి పట్టణ ప్రణాళికా విభాగం ద్వారా మంజూరు చేసిన భవనాలు, వాటి ద్వారా వచ్చిన ఆదాయం తదితర వివరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. దీంతో అసలు బాగోతం బయటపడింది. దీనిలో కొంతమంది లెసైన్స్డ్ ఇంజినీర్లు, బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు పాత్రధారులుగా గుర్తించారు. ఆడిట్ అధికారులు సంబంధిత ఫైళ్లు ట్యాంపరింగ్ అయిన సొమ్ము, బాధ్యులైన అధికారుల పేర్లను గత కమిషనర్ కన్నబాబుకు అందజేసినట్టు సమాచారం. బాధ్యులపై చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు.... పట్టణ ప్రణాళికా విభాగంలో జరిగిన నిధుల గోల్‌మాల్‌లో ప్రధాన పాత్రదారులపై చర్యలు తీసు కోవాల్సిందిగా నగరపాలక సంస్థ ఉన్నతాధికారులు రాష్ట్రప్రభుత్వానికి సిఫార్సు చేశారు. అదేవిధంగా మూడేళ్లుగా పట్టణ ప్రణాళికా విభాగం మంజూరు చేసిన భవనాల ప్లాన్లు, తదితర అంశాలపై విజిలెన్స్ విచారణకు లేఖ రాస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి ... నగరపాలక సంస్థలో బిల్డింగ్ ఇన్స్పెక్టర్ల ధన దాహంతో అక్రమ నిర్మాణాలకు ఊతం ఇస్తూ కార్పొ రేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు. నగరంలో నెలకు 80 నుంచి వంద నిర్మాణాలు జరుగుతు న్నాయి. వీటిద్వారా కార్పొరేషన్ ఆదాయానికి గండిపడటంతో పాటు పట్టణ ప్రణాళికాధికారుల జేబు లు నిండుతున్నాయి. ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి. - ఈదర వీరయ్య,పెన్షన్‌దారుల చర్చావేదిక అధ్యక్షులు -
పట్టిసీమలో అడ్డులేకుండా..అయినోడికి అందలం!
ఏపీలోనే కొనసాగనున్న పోలవరం ఎస్ఈ రమేష్‌బాబు పదవీ విరమణ రోజు హడావుడిగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు పోలవరం, పట్టిసీమ అడ్డగోలు బిల్లులు ఆమోదం పొందడానికే..! నజరానాగా రెండేళ్ల సర్వీసు తెలంగాణ జోన్లలోనే ఎంపికైన 182 మంది ఏపీ ఇంజనీర్లకు అన్యాయం సాక్షి, హైదరాబాద్: పోలవరానికి ‘చంద్ర గ్రహణం’ పట్టించి ప్రాజెక్టు పనుల్లో కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించడానికి, పట్టిసీమ ఎత్తిపోతల పనుల్లో అవినీతిని పట్టించుకోకుండా అడ్డగోలు బిల్లులకు ఆమోదం తెలపడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వం వ్యూహరచన చేసింది. ఈ ప్రాజెక్టుల విషయంలో తాము అనుకున్నది అనుకున్నట్టు సులభంగా జరిగిపోయేలా ఎత్తుగడ వేసింది. వివరాల్లోకి వెళితే.. 182 మంది ఏపీ ఇంజనీర్లను తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికయ్యారనే పేరిట ప్రభుత్వం ఆ రాష్ట్రానికి పంపించింది. తెలంగాణ ప్రభుత్వం తమకు పోస్టింగులు ఇవ్వకుండా సతాయిస్తోందని, తమను ఏపీలోనే కొనసాగించాలని, సీనియారిటీ సైతం అడగబోమని వారెంతగా వేడుకున్నా కనికరం లేకుండా వ్యవహరించింది. కానీ ఒకే ఒక్క అధికారికి మాత్రం ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది. ఆ ఒక్కరే పోలవరం ఎస్ఈ రమేష్‌బాబు. తెలంగాణలోని ఆరో జోన్లో ఎంపికైన రమేష్‌బాబును.. ఆ రాష్ట్రానికి పంపించకుండా, ఏపీలోనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన తెలంగాణలోనే కనుక కొనసాగితే గురువారమే (ఏప్రిల్ 30న) పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల నేపథ్యంలో ఆయన మరో రెండేళ్ల పాటు సర్వీసులో కొనసాగనున్నారు. ఆయన సేవల్ని వినియోగించుకుంటే.. అసాధ్యమనుకునే అద్భుత నిర్మాణాలను సైతం సాకారం చేయగలరు.. అంతటి నైపుణ్యం ఆయన సొంతం.. అన్న రికార్డేమీ లేదు. అత్యంత నిజాయితీతో పనిచేశారనే క్లీన్చిట్ కూడా లేదు. ఉన్నదల్లా సర్కారు పెద్దలు చెప్పినట్లుగా అడ్డగోలు బిల్లులైనా సరే మారు మాట్లాడకుండా ఆమోదముద్ర వేసే చాతుర్యమే. నాణ్యత ఉన్నా లేకున్నా.. అద్భుతం అంటూ నివేదిక రాయగల నైపుణ్యమే. ఇవీ రమేష్‌బాబు గురించి నీటిపారుదల శాఖ అధికారులు చెబుతున్న మాటలు. ఆ నైపుణ్యమే.. ఆయన్ను తెలంగాణకు పంపించకుండా ఏపీలోనే కొనసాగించడానికి కారణమైంది. తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికై, రాష్ట్రంలో పనిచేస్తున్న 182 మంది ఏపీ ఇంజనీర్లను రాష్ట్ర విభజన నేపథ్యంలో ప్రభుత్వం తెలంగాణకు పంపించింది. వీరు ఏపీలో కొనసాగేందుకు ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం అంగీకరించదని నీటిపారుదల శాఖ అధికారులు తేల్చిచెప్పారు. కానీ అదే ఆరో జోన్లో ఎంపికైన రమేష్‌బాబును మా త్రం ఏపీలో కొనసాగించడానికి అనుమతించాలని కోరుతూ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ గత మార్చి 26న తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం ఒక్క రమేష్‌బాబు విషయంలోనే ఎందుకు మినహాయింపు కోరుతోందనే విషయం అర్థంకాని తెలంగాణ అధికారులు ఆ లేఖకు జవాబివ్వకుండా తాత్సారం చేశారు. రమేష్‌బాబుకు ఈ నెల్లో (ఏప్రిల్) 58 సంవత్సరాలు నిండాయి. ఆయన్ను ఏపీలో కొనసాగించడానికి తెలంగాణ సర్కారు కనుక అనుమతి మంజూరు చేయని పక్షంలో గురువారం పదవీ విరమణ చేయాల్సి వచ్చేది. అయితే ఏపీ అధికారుల ఒత్తిడి నేపథ్యంలో.. రమేష్‌బాబును ఏపీలో కొనసాగించడానికి తమకు అభ్యంతరం లేదంటూ తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి బుధవారం (ఏప్రిల్ 29న) ఏపీ సర్కారుకు లేఖ వచ్చింది. లేఖ అందిన వెంటనే.. గురువారం రమేష్‌బాబును ఏపీలోనే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు (జీవో నంబర్ 42) ఇచ్చింది. ఆయన ఒక్కరికి మాత్రమే ఇలా మినహాయింపు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందనే విషయాన్ని జీవోలో ఎక్కడా ప్రభుత్వం పేర్కొనకపోవడం గమనార్హం. ఇద్దరు సీఎస్‌లకు అవమానం! రెండు రాష్ట్రాల మధ్య లావాదేవీలు కేవలం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ద్వారానే జరగాలి. సమాచారం కూడా సీఎస్ల ద్వారానే ఇచ్చిపుచ్చుకోవాలి. కానీ రమేష్‌బాబు విషయంలో అందుకు భిన్నంగా జరిగింది. ఇరు రాష్ట్రాల సీఎస్‌లకు కనీస సమాచారం లేకుండానే.. నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శుల మధ్యే వ్యవహారం సాగింది. ఇది ఇటు ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావుకు, అటు తెలంగాణ సీఎస్ రాజీవ్‌శర్మకు అవమానమని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
- కేటీపీఎస్ ఆరవ దశలో .. - ప్రస్తుతం 350 మెగావాట్లకే పరిమితం - జెన్కోకు సుమారు - రూ.12 కోట్ల వరకు నష్టం పాల్వంచ : విద్యుత్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కేటీపీఎస్ 6వదశలో నిలిపి వేసిన 500 మెగావాట్లను శనివారం రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. గత నాలుగు రోజుల క్రితం రాష్ర్ట వ్యాప్తంగా వర్షాలు పడటంతో విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి జెన్కో లోడ్ డిస్పాచ్ అధికారుల ఆదేశాల మేరకు విరామం ఇచ్చారు. ఈక్రమంలో ఇంజనీర్లు లైటప్‌లను పూర్తి చేశారు. తిరిగి వినియోగం పెరుగుదల చూపడంతో రాష్ట్ర గ్రిడ్‌కు 500 మెగావాట్లలో 350 మెగావాట్లను అనుసంధానించాలని ఆదేశాలు జారీఅ య్యూరుు. ఉత్పత్తిని పున :ప్రారంభించారు. అయితే నాలుగు రోజులుగా రోజుకు 12 వేల మిలియన్ యూనిట్ల చొప్పున మొత్తం 48 వేల మిలియన్ యూనిట్ల ఉత్పత్తి గండి పడటంతో జెన్కోకు రూ.12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మరోవైపు పీఎల్ఎఫ్ శాతం గ ణనీయంగా తగ్గడంతో 5 శాతం మానిటరింగ్ బెనిఫిట్స్‌లో కూడా ఉద్యోగులకు కోత విధించే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రూ.లక్ష ఇవ్వాల్సిందే
కడప కార్పొరేషన్: ఆయన వామపక్షాలకు చెందిన ఓ పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉండేవాడు.. ఏదేదో చేయడంతో ఆ పార్టీ ఆయనను సస్పెండ్ చేసింది. కేవలం ఐదేళ్లలోనే యువసేనను ఏర్పాటు చేసుకునే స్థాయికి ఆ నాయకుడు ఎదిగాడు. అనంతర ఆయన చేరనిపార్టీలేదు.. చేయని వివాదం లేదు.. కొన్నాళ్లకు సినీనటుడు స్థాపించిన పార్టీలోకి చేరిపోయాడు. ఆ పార్టీ మరో పార్టీలో విలీనం కావడంతో తాను కూడా అక్కడికి చేరిపోయాడు.. అప్పటి మంత్రి అనుచరులే తన కారును కాల్చివేశారని ఆరోపణలు చేసి పత్రిలకెక్కాడు. ఈ వివాదాలవల్లే ఆ పార్టీలో అధికారప్రతినిధి పదవి సంపాదించాడు. గత ఎన్నికల్లో కార్పోరేటర్ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేశారు. ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఓడిపోక తప్పలేదు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీలో చేరి, నెలతిరక్కుండానే అక్కడా ఇమడలేక ఇటీవల కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని ఆశ్రయించాడు. ఆయన పార్టీలు మారడం ఎవ రికీ అభ్యంతరం లేకపోయినా ఆ కారణంతో చేసిన అక్రమ వసూళ్లు వివాదంగా మారుతున్నాయి. తాను అడిగిన సొమ్మును ఇవ్వలేదని ఓ ఇంజినీర్‌ను ఏకంగా తుపాకీతో బెదిరించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయం కడప కార్పొరేషన్లో చర్చనీయాంశమైంది. బెదిరింపులు ఇలా... నేను పార్టీ మారాను.. మా నాయకుడు రేపు కడపకు వస్తున్నారు.. మీ తరుపున లక్ష రూపాయలు ఇవ్వాలి..అంత లేదంటే కనీసం యాభై వేలైనా ఇవ్వాలి.. అంతకు ఏమాత్రం తగ్గినా మీ స్థాయికి బాగుండదు... ఇలాంటి మాటలు చెప్పే కడప నగరపాలక సంస్థలో ఇంజినీర్లు, టౌన్‌ప్లానింగ్ అధికారులనుంచి సుమారు లక్షన్నర రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఐదువేలో, పదివేలో అంటే ఇవ్వగలంగానీ లక్షరూపాయలంటే ఎక్కడినుంచి తేవాలి.. అంత ఇవ్వలేను అని ఎదురుతిరిగిన ఇంజినీరుపై కార్పొరేషన్లోనే తుపాకీ చూపెట్టి బెదిరించినట్లు తెలుస్తోంది. కాగా అదే ఇంజినీరుపై మంత్రి పల్లె రఘునాథరెడ్డి లెటర్‌హెడ్‌లో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. కడప నగరపాలక సంస్థలో అధికారులనుంచి చేసిన వసూళ్ల పట్ల మేయర్ సీరియస్‌గా స్పందించినట్లు తెలిసింది. ఎవరెవరైతే డబ్బు ఇచ్చారో వారికి సంబంధించిన వర్క్‌లను తానే తనిఖీ చేస్తానని, ఆ తర్వాతే వారికి బిల్లులు చేస్తామని తెగేసి చెప్పినట్లు సమాచారం. * మీ డివిజనల్ స్థాయి అధికారిని ఇక్కడికి నేనే రప్పించాను.. మీకు భవిష్యత్తులో ఏ సాయం కావాలన్నా నాకు చెప్పండి. చేయిస్తా. ప్రస్తుతం నేను ఉంటున్న పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది అంటూ ఉద్యోగుల నుంచి సుమారు రెండున్నర లక్షల వరకూ రాబట్టినట్లు తెలుస్తోంది. * గతంలో రెవెన్యూ మంత్రిగా ఉన్న రఘువీరారెడ్డి కడపకు వచ్చినప్పుడు కూడా అధికారులనుంచి ఇదేరీతిలో వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తోంది. అమర్ హాస్పిటల్ వద్ద ఇళ్లస్థలాలు ఇప్పిస్తానని చెప్పి సుమారు 40 మంది వద్ద రెండు లక్షల చొప్పున వసూలు చేసినట్లు సమాచారం. ఆయన ఉంటున్న ఇంటిపై కూడా గతంలో వివాదం ఏర్పడింది. తమ ఇళ్లు ఆక్రమించుకుని బాడుగ చెల్లించడం లేదని, గట్టిగా అడిగితే తుపాకీ చూపించి బెదిరించాడని ఆలంఖాన్‌పల్లెకు చెందిన బాధితులు విలేకరుల సమావేశం నిర్వహించి వాపోయారు. ఇన్ని చేస్తున్నా.. తుపాకీ ై లెసైన్సును దుర్వినియోగం చేస్తున్నా ఈయనపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
వచ్చిపోతమంటే కుదరదు..
అధికారులకు మంత్రి హరీష్‌రావు హెచ్చరిక కరీంనగర్ సిటీ : ‘హైదరాబాద్‌ల ఉంటం... గతంలో లాగా అక్కడి నుంచి వస్తం పోతం అంటే కుదరదు... ఎక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు అక్కడ ఉండాల్సిందే’ అంటూ మంత్రి హరీష్‌రావు ఇంజనీరింగ్ అధికారులను హెచ్చరించారు. సమావేశంలో కొద్దిసేపు ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ని చెరువులకు ఎన్నింటి అంచనాలు రూపొందించారంటూ ఆరా తీశారు. డీఈలు చెప్పేదానికి తనకు ఇచ్చే రిపోర్ట్‌కు పొంతన లేకపోవడంతో వాళ్లేమో ఎక్కువ చెబుతున్నరు... నాకిచ్చిన రిపోర్ట్‌ల తక్కువున్నాయేంటి అంటూ ప్రశ్నించారు. ప్రతి మండల సమావేశానికి నీటిపారుదల శాఖ ఏఈలు కూడా వెళ్లాలన్నారు. చిన్ననీటి పారుదల శాఖకు గతంలో చెడ్డపేరుందని దానిని తుడిచేయాలన్నారు. చెరువుల అంచనాలు రూపొందించడంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవన్నారు. మహబూబ్‌నగర్‌లో ఒక రు చెరువు వరకు బీటీ రోడ్డు, కట్టపై సీసీ రోడ్డు ప్రతిపాదనలు చేశారని, అలా చేయొద్దని సూచించారు. రాష్ట్రస్థాయిలో క్వాలిటీ కంట్రోల్ అధికారులు పనిచేస్తారన్నారు. డిసెంబర్ చివరివారంలోగా అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. మే నెల వరకు మొదటి విడత చెరువులు పునరుద్దరించి వచ్చే సీజన్లోనే ప్రజలకు ఫలితాన్ని అందివ్వాలన్నారు. మంథని డీఈ మాట్లాడుతుండగా.. ఎక్కడ నివాసం ఉంటున్నారని మంత్రి ఆరా తీశారు. తాను మంథనిలోనే ఉంటున్నానని డీఈ చెప్పడంతో జెడ్పీటీసీ, ఎంపీపీ ఎవరైనా చెప్పండి... అక్కడే ఉంటున్నారా అని మంత్రి అడిగేలోపే సర్దుకున్న డీఈ ‘నేను పెద్దపల్లిలో ఉంటున్నాను సార్’ అంటూ బదులివ్వడంతో సభ ఘొల్లుమంది. చెరువు శిఖంలో 1996 తరువాత ఇచ్చిన ఏక్‌సాల్ పట్టాలను రద్దు చేశామని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య తెలిపారు. 1996 కన్నా ముందు వాటి కూడా నోటీసులుజారీ చేసి రద్దు చేస్తామన్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మాట్లాడుతూ.. మట్టిని తీసేందుకు ప్రొక్లయిన్‌ను సమకూర్చినట్లే పొలాలకు తరలించేందుకు ట్రాక్టర్ కిరాయి కూడా ప్రభుత్వమే భరించాలన్నారు. కాకతీయ కాలువ నుంచి కొత్తపల్లి చెరువుకు నీళ్లు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి. - ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్.. ఐదు చె రువులకు కలిపి ఒక అధికారిని పర్యవేక్షణకు నియమించాలన్నారు. రూ.15 వేల పరిమితిని పెంచాలని కోరారు. హద్దులు ముందుగా రెవెన్యూ అధికారులు గుర్తించాలని, లేదంటే పునరుద్దరణ సమయంలో ఇబ్బందులు ఏర్పడుతాయన్నారు. - కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు.. మిషన్ కాకతీయ విజయవంతం కావాలంటే ముందుగా చెరువులను ఖాళీ చేయాలన్నారు. సీజన్‌వరకు పునరుద్దరణ పూర్తయి నీళ్లు చేరుతాయన్నారు. - మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్.. సాంస్కృతిక సారథి చైర్మన్‌గా చెరువుల పునరుద్దరణపై ప్రచారం చేపట్టే అవకాశం రావడం అదృష్టమన్నారు. తెలంగాణ ఉద్యమ తరహాలోనే మిషన్ కాకతీయ ఫలితాన్ని ప్రజలు చూస్తామంటూ తనదైన శైలిలో పాటపాడారు. - చెరువుల పునరుద్దరణలో భాగంగా తూముల వద్ద ఎక్కువ లోతు తీయొద్దని, దాని వల్ల దుష్పరిణామాలు ఎదురవుతాయని రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. అటవీశాఖ, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల అధికారులు సమన్వయంతో దీనిని విజయవంతం చేయాలని వేములవాడ ఎమ్మెల్యే రమేశ్‌బాబు అన్నారు. - అధికారులు నిర్లక్ష్యం చేయకుండా చూడాలి. డీఈలు చెరువులు తిరిగి రిపోర్ట్ చేయాలి. ఇప్పటికే నా నియోజకవర్గంలోని జెడ్పీటీసీలు, అధికారులతో సమావేశం నిర్వహించానని చొప్పదండి ఎమ్మెల్యే బొడిగే శోభ పేర్కొన్నారు. పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ, గుండమ్మ చెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చాలని స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి కోరారు. ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, టి.భానుప్రసాద్‌రావు సైతం తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. నియోజకవర్గాల వారీగా.. జిల్లాలో 5939 చెరువులు, కుంటలను పునరుద్దరణకు గుర్తించామమని మంత్రి హరీష్‌రావు తెలిపారు. మొదటి విడతగా ఈ సంవత్సరం 1202 చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు. ఇందులో కరీంనగర్ డివిజన్ పరిధిలో 2253 చెరువులకు గాను 455, జగిత్యాల డివిజన్లో 978కు గాను 199, పెద్దపల్లి డివిజన్లో 759కు గాను 153, మంథని డివిజన్లో 1035కు గాను 210, సిరిసిల్ల డివిజన్లో 914 చెరువులకు 185 చెరువులను పూర్తి చేస్తామన్నారు. -
డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్...
చార్మినార్‌కూ, మదీనాకీ మధ్య గుల్జార్ హౌజ్ అనే కొలను ఉంది. ఇక్కడ ‘హౌజ్’ అంటే ఫౌంటెయిన్ అని అర్థం. హైదరాబాద్ పాలకులు అప్పటి ఇంజనీర్ల సాయంతో ఇలాంటి ఫౌంటెయిన్లు చాలా చోట్ల కట్టించారు. దారి మధ్యలో కట్టించి మరీ నీరు ఉవ్వెత్తున అందంగా ఎగిసేలా చేశారు. అప్పటి ఇంజనీర్లు ఏదో కొన్ని చోట్ల ఇలా హౌజ్‌లు అనే ఫౌంటెయిన్లు కట్టించారేమోగానీ... తమ సంకల్పం లేకుండానే ఈ తరహా ఫౌంటెయిన్లను మన ఆధునిక ఇంజనీర్లూ ఏర్పాటు చేశారు. కాకపోతే వాళ్లు డ్రైనేజీ మ్యాన్‌హోల్ కవర్స్‌ను ఏర్పాటు చేస్తే... అవి ఆటోమేటిగ్గా గుల్జార్ హౌజ్ లాంటి ఫౌంటెయిన్లుగా రూపుదిద్దుకున్నాయి. తేడా అల్లా ఒక్కటే. గుల్జార్ హౌజ్ ఫౌంటెయిన్ వర్షం కురిసినా, కురవకపోయినా నీళ్లు చిమ్మదు. కానీ మన ఆధునిక ఇంజనీర్లు డ్రైనేజీ కోసం కట్టించిన హౌస్‌లు... అదే ఫౌంటెయిన్లు వర్షం వచ్చినప్పుడు నీళ్లు చిమ్ముతాయి. మరో గొప్ప విషయం ఏమిటంటే... వాళ్ల ప్రమేయం లేకుండానే వాళ్లు ఇంకో ఘనమైన రికార్డునూ సాధించారు. అదేమిటంటే... ఈ డ్రైనేజీ ఫౌంటెయిన్‌పై ఉండే మ్యాన్‌హోల్ కవర్‌కు నాట్యం నేర్పడం! వర్షం కురిసి డ్రైనేజీ పొంగడం మొదలుపెట్టగానే మ్యాన్‌హోల్ హౌజ్ అదే ఫౌంటెయిన్‌పై నల్లటి లోహచంద్రుడి షేపులో గుండ్రంగా ఉంటే ఇనుపచక్రం కింద నుంచి ఉవ్వెత్తున పొంగి వచ్చే నీళ్ల తాకిడికి డ్యాన్స్ చేస్తుంటుంది. వర్షం వేళ మ్యాన్‌హోల్‌పై ఉండే సదరు గుండ్రని ఇనుప కవరు మూతకు ఆనకుండా చిత్తడిలో ఇత్తడి పళ్లెంలా అటూ ఇటూ కదుల్తూ డ్యాన్స్ చేస్తుంటే... డ్యాన్స్ అంటే ఆసక్తి లేనివారైనా సరే కళ్లప్పగించి చూస్తూ ఉండిపోవాల్సిందే. ఇలా మ్యాన్‌హోల్ పైచక్రానికి మణిపురి... డ్రైనేజీపై ఉండే కవర్‌కి కూచిపూడి నేర్పడం అలనాటి ఏ ఇంజనీర్‌కు సాధ్యమైంది చెప్పండి! సాక్షాత్తూ అప్పటి ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైతం తాను డిజైన్ చేసిన... మ్యాన్‌హోల్ మూతకూ డ్యాన్సు నేర్పలేకపోయేవాడు. కాబట్టి అలనాటి మోక్షగుండం వంటి ఇంజనీర్ల కంటే ఇప్పటి జలగండం ఇంజనీర్లే గ్రేట్ అని నా అభిప్రాయం. అలనాటి ఇంజనీర్లు మరో అద్భుతం సాధించారట. గోల్కొండ కోట ఎంట్రన్స్‌లో చప్పట్లు కొడితే ఎక్కడో కొండపైన కోట చివర ఉండే నవాబుగారికి వినిపిస్తుందట. అదేదో గొప్ప అనుకుంటున్నారుగానీ... ఇప్పడు మనం అడ్వాన్స్డ్ అంటూ పేర్కొంటున్న వైర్లెస్ లాంటిదే కదా ఇది. పైగా వాళ్లేదో ఒక్క కోటలోనే ఈ ఏర్పాటు చేసుకున్నారు. కానీ మనం ప్రతి బస్సులోనూ చేసుకున్న ఏర్పాటే కదా ఇది. టికెట్ల కట్టలు ఉండే హోల్డరుతో కండక్టరు ఒక్క దెబ్బ కొడితే బస్సు ఆగుతుంది. అదే రెండో మూడో దెబ్బలు కొడితే అది బయల్దేరుతుంది. ఇలా ఓ మాటా-ముచ్చటా లేకుండా కేవలం లోహపు చప్పట్లతోనే డ్రైవర్‌కూ, కండక్టర్‌కూ కమ్యూనికేషన్ నడుస్తుంటుంది. ఇది కూడా వైర్లెస్సే. మరి వైర్లతో జరిగే కమ్యూనికేషన్ కంటే వైర్‌లెస్‌లు మరింత అభివృద్ధి చెందినవైనప్పుడూ... రోజూ బస్సుల్లో జరిగే ఈ సమాచార వినిమయాన్ని మనం ఎంత గొప్పగా చెప్పుకోవాలి! అందుకే... మనం రోజువారీ ఉపయోగించుకునే టెక్నాలజీ విషయం నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే నిరభ్యంతరంగా మన సిటీ మరింత అడ్వాన్స్డే. అటు డ్యాన్సింగ్ మ్యాన్‌హోల్స్ అయినా... ఇటు టాక్లెస్ టికెట్ హోల్డర్ అయినా! -
ఆంధ్రా ఇంజనీర్లు వెనక్కి..
96 మందిని బదిలీ చేస్తూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఏపీలోని వివిధ జోన్లలో ఎంపికై ప్రస్తుతం తెలంగాణ నీటి పారుదల శాఖలో పని చేస్తున్న 96 మంది ఇంజనీర్లను వెనక్కి పంపిస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు లు జారీ చేసింది. ఇందులో 10 మంది ఎస్ఈలు, 11 మంది ఈఈలు, 20 మంది డీఈలు, 55 మంది ఏఈఈలు ఉన్నారు. తెలంగాణలోని 5, 6 జోన్లలో ఎంపికై ఆంధ్రాలో పనిచేస్తున్న ఇంజ నీర్లను ఏపీ ప్రభుత్వం ఇటీవల తెలంగాణకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ సైతం ఏపీ అధికారులను వెనక్కి పం పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ ప్రభుత్వం వెనక్కి పంపిన అధికారుల్లో తెలంగాణతోపాటు ఆంధ్రాకు చెందిన ఇంజనీర్లు కూడా ఉండగా తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఇక్కడి స్థానికత కలిగిన ఉద్యోగులను కాకుండా కేవలం ఏపీ వారినే వెనక్కి పంపింది. ముందు నుంచీ చెబుతున్నట్లుగా తెలంగాణ స్థానికత కలిగిన ఉద్యోగులకు ఇక్కడే పోస్టింగ్‌లు కల్పించేందుకు సిద్ధమైంది. -
ఇంకా అంధకారమే
జిల్లాలో లక్షన్నర ఇళ్లు ఇంకా చీకట్లోనే విశాఖలో 23 వేల కనెక్షన్లకు అందని సరఫరా గుడ్డిదీపాల వెలుగులో నర్సీపట్నం పునరుద్ధరణకు మరో నాలుగైదు రోజులు విశాఖపట్నం సిటీ: జిల్లాలో హుదూద్ సృష్టించిన చీకట్లు ఇంకా తొలిగిపోలేదు. దీపావళినాడు అందరి ఇళ్లల్లోనూ విద్యుత్ కాంతులు విరజిమ్మేలా ప్రయత్నిస్తున్నామని అధికారులు చేసిన ప్రకటన నాగులచవితి నాటికి కూడా సాధ్యమయ్యేలా కనబడడం లేదు. గ్రామీణ ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా వుంది. గుడ్డిదీపాల వెలుగులోనే గడుపుతున్నారు. కొవ్వొత్తుల కాంతితోనే కాలం నెట్టుకొస్తున్నారు. జిల్లా అంతటా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు మరో నాలుగు ఐదు రోజులు పట్టేటట్టు కనిపిస్తోంది. తుపాను ముగిసి రెండు వారాలు దాటినా జిల్లాను అంధకారం విడచిపెట్టడం లేదు. వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు సైతం విద్యుత్ ఇంజినీర్లను పరుగులు పెట్టించి పునరుద్ధరణ పనులు చేయిస్తున్నా జిల్లాను పూర్తిగా వెలుగులతో నింపలేకపోతున్నారు. ఆదివారం నాటికి జిల్లా మొత్తంగా 1.67 లక్షల సర్వీసులకు కరెంట్ అందని దుస్థితి. విశాఖ మహానగరంలో అందరికీ విద్యుత్ అందించినట్టు చెప్పుకుంటున్నా...ఇప్పటికీ 23 వేల కనెక్షన్లకు విద్యుత్ సౌకర్యం లేదు. చుట్టుపక్కల వారికి విద్యుత్ వెలుగులు వచ్చినా తమ ఇళ్లకే ఎందుకు రావడం లేదో తెలియక తెగ ఆందోళనచెందుతున్నారు. విశాఖ నగరంలోని వన్‌టౌన్ ఏరియాలో 110 కుటుంబాల వారు ఇప్పటికీ అంధకారంలో మగ్గుతున్నారు. కంచరపాలెం నుంచి గాజువాక పరిధిలో మరో 3 వేల మంది వినియోగదారుల ఇళ్లు చీకట్లోనే వున్నాయి. మధురవాడ పరిసర ప్రాంతాల్లో అయితే 20 వేల వినియోగదారులు నిత్యం విద్యుత్ కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అంతటా కరెంట్ ఇచ్చేశారని తమకెప్పుడు విద్యుత్ వస్తుందోనని ఎదురు చూస్తున్నారు. అనకాపల్లి, నర్సీపట్నం, పాడేరు విద్యుత్ డివిజన్లలో 1.44 లక్షల కనెక్షన్లకు విద్యుత్ లేదు. జిల్లా వ్యాప్తంగా 11.31లక్షల మంది వినియోగదారులుంటే, ఆదివారం సాయంత్రానికి 9.64 లక్షల మందికి విద్యుత్‌ను పునరుద్ధరించగలిగారు. మిగిలిన 1.67 లక్షల కనెక్షన్‌దారులకు చీకట్లే గతయ్యాయి. వీరందరికీ సరఫరా పునరుద్ధరించాలంటే మరో నాలుగైదు రోజులు సమయం పట్టే అవకాశాలున్నాయని విద్యుత్ వర్గాలే పేర్కొంటున్నాయి. ఈపీడీసీఎల్ సీఎండీ ఎంవి శేషగిరి బాబు ఆదివారం జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు అధికారులను అప్రమత్తం చేశారు. -
జీఆర్పీ ఇంజినీర్లపై కలెక్టర్ ఆగ్రహం
మంత్రాలయం : ‘‘కరెంట్ ఇప్పించి 45 రోజులైంది. ఇప్పటి వరకు నీళ్లు పంపింగ్ చేయలేదు. కాలయాపనతో రైతాంగానికి నష్టం తెచ్చారు. కాంట్రాక్టర్ ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నా ఇంజినీర్లుగా మీరేం చేశారు.. కలెక్టర్ ఆదేశించినా లెక్కలేదా..తమాషాగా ఉందా.. ఈ జిల్లా నుంచి గెంటేస్తా.’’ అంటూ కలెక్టర్ విజయమోహన్ గురురాఘవేంద్ర ప్రాజెక్టు ఇంజినీర్లు, కాంట్రాక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మూడోసారి గురురాఘవేంద్ర ప్రాజెక్టు పరిధిలోని మాధవరం, బసలదొడ్డి ఎత్తిపోతల పథకాల పరిశీలన జరిపారు. నాలుగేళ్లుగా పనులు చేస్తూనే ఉన్నారు. కాలయాపన చేసి విలువైన ప్రభుత్వ సొమ్మును వృథా చేశారు. రైతులకు చుక్క నీరు ఇవ్వలేదు. జిల్లాకు తీరని నష్టం కల్గించారు. కాంట్రాక్టర్ ఇంతగా నిర్లక్ష్యం చేస్తున్నా ఇంజినీర్లుగా మీరేం చేశారు.’’ అంటూ నిలదీశారు. కలెక్టర్ నిలదీతకు బదులు చెప్పుకోలేక అధికారులు, కాంట్రాక్టర్ నీళ్లు నమిలారు. వెంటనే సదరు కాంట్రాక్టర్ సంస్థను బ్లాక్ లిస్టులో ఉంచాలని ఆదేశించారు. మీ నిర్లక్ష్యం మూలంగా మూడుసార్లు ప్రాజెక్టును పరిశీలించాల్సి వచ్చిందన్నారు. ఏడాదిలో మూడు పర్యాయాలు రిజర్వాయర్లను నింపాల్సి ఉందని, ఇప్పటికీ చేయకపోవడం ఏంటని ప్రశ్నించారు. మీ నిర్లక్ష్యం మూలంగా నదిలోని నీరంతా కిందకు పోయిందన్నారు. రైతు పొలాలకు చుక్కనీరు ఇవ్వలేదు. కోట్లు వెచ్చించినా లాభమేముందన్నారు. ఒక్కరోజులో పంపుహౌస్‌లను రన్ చేయాలని, లేనిపక్షంలో అందరిపై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. సహనానికి పరీక్ష పెట్టొదని, వెంటనే పనులు చేయకపోతే ప్రభుత్వ ధనాన్ని వృథా చేసినందుకు కాంట్రాక్టు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామన్నారు. ముందుగా ఆయన బసలదొడ్డి పంపుహౌస్ స్టేజ్-1, మాధవరం జలాశయాలను పరిశీలించారు. సబ్ కాంట్రాక్టు ఇచ్చిన సంస్థను బ్లాక్ లిస్టు ఉంచేందుకు నివేదికలు తయారు చేయాలని ఆర్డీవో వెంకటకృష్ణకు ఆదేశించారు. అందుకు ఎస్ఈ నాగేశ్వరరావుకు తగు సూచనలు చేశారు. పర్యటనలో తహశీల్దార్ శ్రీనివాసరావు, జీఆర్పీ ఈఈ నారాయణస్వామి, డీఈ అన్వర్‌బాష, సర్వేయర్ జ్ఞానప్రకాష్ పాల్గొన్నారు. -
ఈ-టెండరింగ్ కుంభకోణంలో దోషులుగా 27 మంది ఇంజనీర్లు
సాక్షి, ముంబై: మహానగర పాలక సంస్థలో చోటుచేసుక్ను ఈ-టెండరింగ్ కుంభకోణంలో 27 మంది ఇంజనీర్లను దోషులుగా గుర్తించారు. ఇందులో తొమ్మిది మంది ఇంజినీర్లను సస్పెండ్ చేయగా మిగతా ఇంజినీర్లపై దర్యాప్తు జరుగుతోంది. అంతేకాక 40 మంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు బీఎంసీ కమిషనర్ సీతారాం కుంటే చెప్పారు. గత వారంరోజులుగా బీఎంసీలో కొనసాగుతున్న ఈ ఉత్కంఠకు తెరపడింది. ఈ ఘటన బీఎంసీ కార్యాలయాల్లో పనిచేస్తున్న అధికారుల్లో, ఇంజనీర్లలో కలకలం రేపింది. బీఎంసీ పరిధిలో తమతమ వార్డు స్థాయిలో చేపట్టే వివిధ మరమ్మతులు, అభివృద్ధి పనుల్లో అవకతవకలు జరుగుతున్నాయని, కార్పొరేటర్లు, అధికారులు కుమ్మక్కై తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే పనులు అప్పజెపుతున్నారని, అందుకు పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారుతున్నాయని అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ-టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సీతారాం కుంటే భావించారు. కాని ఈ ప్రక్రియను అధికారులు, కార్పొరేటర్లు వ్యతిరేకించారు. అయినప్పటికీ కుంటే దీన్ని బలవంతంగా అమలు చేశారు. ఇందులో కూడా అధికారులు కుమ్మక్కై తమకు అనుకూలంగా ఉన్న కాంట్రాక్టర్లకే బాధ్యతలు అప్పగించారు. గత ఆరు నెలల కాల వ్యవధిలో రూ.600 కోట్లతో పూర్తిచేసిన నాలాలు, మురికి కాల్వల శుభ్రత, ఇతర అభివృద్ధి పనుల్లో ఏకంగా రూ.100 కోట్ల మేర అవినీతి జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గతవారం ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందులో హస్తమున్న ఇంజినీర్లు, అధికారులు, కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని కుంటే వెల్లడించారు. దీంతో ప్రత్యేకంగా నియమించిన కమిటీ 27 మంది ఇంజినీర్లను దోషులుగా గుర్తించింది. -
మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర కీలకం
కలెక్టర్ శ్రీకాంత్ నెల్లూరు (హరనాథపురం) : మౌలిక వసతుల కల్పనలో ఇంజనీర్ల పాత్ర కీలకమని కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ అన్నారు. స్థానిక సోమశిల ప్రాజెక్ట్ సర్కిల్ కార్యాలయంలో ఏపీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య 154 జయంతిని పురస్కరించుకుని సోమవారం ‘ఇంజనీర్స్ డే’ నిర్వహించా రు. కలెక్టర్ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, మంచి నీరు తదితర ప్రాజెక్టుల రూపకల్పనలో ఇంజనీర్లు సరైన ప్లానింగ్‌తో పని చేసినప్పుడే సాధ్యమవుతుందన్నారు. ప్రాజెక్ట్‌లు దీర్ఘకాలం మన్నికగా ఉండేలా ప్లాన్ ఉండాలన్నారు. మోక్షగుండ విశ్వేశ్వరయ్య, కేఎల్‌రావు, శ్రీధరన్ వంటి ఇంజ నీర్లు మంచి ప్రాజెక్ట్‌ల రూపకల్పనలో కీలకపాత్ర పోషించారన్నారు. మోక్షగుండం జయంతిని భారత ప్రభుత్వం ఇంజనీరింగ్ డేగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికే జిల్లాలో ఎక్కువ నీరు సముద్రంలో కలుస్తుందని, ఆ నీటిని మనం వినియోగించుకునేలా ఇంజనీర్లు డిజైన్లను తయారు చేయాలని సూచించారు. తొలుత మోక్షగుండ విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కేక్‌ను కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రక్తదానం కార్యక్రమా న్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ జేసీ ఇంతియాజ్, రిటైర్డ్ సీఈ ప్రభాకర్, ఇరిగేషన్, తెలుగుగంగ, సోమశిల ప్రాజెక్టుల ఎస్ఈలు కోటేశ్వరరావు, సుబ్బారావు, సాబ్జాన్, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కాకి విజయబాబు, వేణుగోపాల్, ప్రియదర్శిని పాల్గొన్నారు. -
భావి తరాలకు మార్గదర్శి మోక్షగుండం
ఘనంగా ఇంజనీర్స్ డే కల్లూరు రూరల్: దేశంలోని భావి ఇంజనీర్లకు సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకులని జిల్లా ఎస్పీ ఆకే రవికృష్ణ, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి అన్నారు. దూపాడులోని కేవీ సుబ్బారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్‌డేను పురస్కరించుకొని మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కళాశాల చైర్మన్ కేవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ విజయలక్ష్మమ్మ, ప్రిన్సిపాల్ తిమ్మయ్య పాల్గొన్నారు. శాలువలు వద్దూ..దుప్పట్లు కావాలి..: ఇంజనీర్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఎస్పీ రవికృష్ణను కళాశాల యాజమాన్యం శాలువతో సన్మానించారు. అయితే ఆయన తనకు శాలువలు వద్దని, విధి నిర్వహణలో భాగంగా రాత్రి వేళ గస్తీ తిరుగుతుండగా చాలా మంది పేదలు కప్పుకునేందుకు దుప్పట్లు లేక చలికి వణుకుతున్నారన్నారు. అలాంటి వాళ్ల కోసం దుప్పట్లు ఇస్తే ఉపయోగకరంగా ఉంటుందని ఎస్పీ సూచించడంతో కేవీ సుబ్బారెడ్డి 500 దుప్పట్లు గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాస ఇంజనీరింగ్ కాలేజీలో..: నగర శివారులోని శ్రీని వాస ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ శ్రీనివాస రావు మోక్షగుండం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పిం చారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంచాయతీరాజ్ డిప్యూటీ ఎక్సిక్యూటివ్ ఇంజనీర్ కే.నాగరాజు హజరయ్యారు. విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ కర్నూలు(అర్బన్): విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్ ఉందని జేఎన్టీయు విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ హేమచంద్రారెడ్డి అన్నారు. సోమవారం నగరంలోని విశ్వేశ్వరయ్య సర్కిల్లో కర్నూలు జిల్లా టెక్నికల్ ఫోరం ఆధ్వర్యంలో 47వ ఇంజనీర్స్ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఫోరం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బీ శ్రీనివాసరెడ్డి, పీ నరసింహారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హేమచంద్రారెడ్డి ముందుగా విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని రోడ్లు,భవనాలు, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్, ఎస్ఎస్ఏ, ఏపీఎస్ఐడీసీ, హౌసింగ్, ఇరిగేషన్ తదితర విభాగాలకు చెందిన ఇంజనీర్లు విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జీ పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల డెరైక్టర్ జయరామిరెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ నాగేశ్వరరావు,ఆర్అండ్బీ ఈఈ ఉమామహేశ్వర్, డీఈఈ శ్రీధర్‌రెడ్డి, ఏఈ ఫణిరామ్, హెచ్డీ ప్రసాదరెడ్డి, ఎస్ఎస్ఏ డీఈఈ కేవీకేవీ ప్రసాద్‌తో పాటు పలువురు రిటైర్డు ఇంజనీర్లు పాల్గొన్నారు. -
వారంతే.. పనులింతే!
జిల్లాలో జడ్పీ జనరల్ ఫండ్ నిధులతో చేపడుతున్న పనులు నత్తనడకను తలపిస్తున్నాయి. కాలవ్యవధి పట్టించుకోకుండా కాంట్రాక్టర్లు ఏళ్లుగా పనులు చేపడుతున్నారు. పట్టించుకోవాల్సిన ఇంజినీర్లు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పలు పనులు ఇప్పటికీ ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో పనులు రద్దయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇందూరు: జిల్లా పరిషత్ జనరల్ ఫండ్ నిధులతో జిల్లా లో చేపడుతున్న పనులు ఓ పట్టాన పూర్తికావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక ఏళ్లుగా నత్తనడకన కొనసాగుతున్నాయి. కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పంచాయతీరాజ్ ఇంజినీర్లు కాంట్రాక్టర్ల మూమూళ్లకు అలవాటుపడి వారిపై చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదీ సంగతి.. జిల్లాలో 2011 నుంచి 2014 వరకు జడ్పీ జనరల్ ఫండ్ పనులు మొత్తం 393 గుర్తించారు. వీటికి రూ.5.49 కోట్ల నిధులు కేటాయించారు. ఇంజినీరింగ్అధికారులు టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఇప్పటి వరకు 258 పనులు పూర్తయినట్లు అధికారులు లెక్కలు చెబుతున్నాయి. కానీ, నిజానికి ఇందులో చాలా పనులు పూర్తి కాకుండానే పూర్తయినట్లుగా చూపిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 66 పనులు నిర్మాణంలో ఉండగా, ఇంకా 69 పనులకు నేటి వరకు ప్రారంభించ లేదు. ఈ సంవత్సరాలలో.. కొనసాగుతున్న, ప్రారంభం కాని పనులలో దాదాపు 2011-12, 2012-13 సంవత్సరానికి సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి. కాల వ్యవధి ముగిసినా కాంట్రాక్టర్ లను అనే నాథుడే కరువయ్యాడు. దీంతో వారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారింది. అప్పగించిన పనిని గడువులోగా పూర్తిచేయని కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటిసారి నోటీసులు ఇచ్చి హెచ్చరించాలి. అలా వినకుంటే వారి డిపాజిట్లు బ్లాక్ చేసి, కాంట్రాక్టర్ లెసైన్స్‌ను రద్దుచేయాలి. కాని ఇ లాంటి చర్యలు జిల్లాలో ఒక్కటైనా కానరావడంలేదు. నిజాయితీ అధికారి ఎవరైనా కాంట్రాక్టర్‌కు నోటీసులిస్తే నాయకుల అండదండలతో బయటపడుతున్నారు. పట్టించుకునేదెవరు?.. పనులు ఎక్కడి వరకు వచ్చాయో పరిశీలించేందుకు ఇంజినీరింగ్ అధికారులు గ్రామాలలో, మండలాలలో తిరిగిన దాఖలాలు లేవు. దీంతో పనులు నత్తనడకన సాగు తున్నాయి. పనులు ప్రారంభం కాకున్నా ప్రారంభించినట్లుగా కాంట్రాక్టర్లు తెలపడంతో, వాటినే రిపోర్టులో చేర్చి ఉన్నతాధికారులకు చూపిస్తున్నారు. అసలు పనులు జరగుతున్నాయా? లేదా? పనులెన్ని ప్రారంభించారు అన్న వాస్తవ విషయాల జోలికి మాత్రం పోవడం లేదు. జడ్పీలో చర్చకు... జడ్పీ జనరల్ ఫండ్ పనులు ఏళ్లుగా పూర్తి కాకుండా, ప్రారంభానికి నోచుకోకుండా ఉండటంతో జిల్లా పరిషత్ అధికారులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. జిల్లా వ్యా ప్తంగా పనులు ఎన్ని నిర్మాణంలో ఉన్నాయి, ఎన్ని పనులు ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు అన్న వివరాలను క్షేత్రస్థాయి నుంచి సీఈఓ రాజారాం తెప్పించుకుంటున్నా రు. ఎంపీడీఓలు స్థానికంగా ఉన్న పనుల వద్దకు వెళ్లి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని కోరనున్నట్లు తెలిసింది. దీని ఆధారంగా ఈ నెల 15న జరిగే సర్వ సభ్య సమా వే శంలో చర్చించనున్నారు. గడువు దాటిన పూర్తి కాని పనులను త్వరగా పూర్తి చేయడానికి ఒక తేదీని నిర్ణయించి, ఇంజినీర్లకు, కాంట్రాక్టర్లకు ఆదేశాలు ఇవ్వనున్నారు. ప్రారంభం కాని పనులను దాదాపు రద్దు చేసే అవకాశాలున్నాయి. -
ఇంజనీర్ల కిడ్నాప్ కథ సుఖాంతం
విజయవాడ: నాగా తీవ్రవాదుల చెరలో ఉన్న కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు ఇంజ నీర్లు ఎట్టకేలకు విడుదలయ్యారు. దీంతో ఐదు రోజులుగా ఆందోళన చెందుతు న్న రెండు కుటుంబాలు...ఊపిరి పీల్చుకున్నాయి. జూలై 27న విజయవాడ కరెన్సీనగర్‌కు చెందిన గోగినేని ప్రతీష్‌చంద్ర, నూజివీడు మండలం గొల్లపల్లికి చెం దిన చింతకింద రాఘవేంద్రరావు(రఘు)లను నాగా రివల్యూషనరీ ఫ్రంట్ (ఎన్ఆర్ఎఫ్) తీవ్రవాదులు కిడ్నాప్ చేసిన విషయం తెలిసిందే. చర్చల్లో భాగంగా ముందస్తు ఒప్పందంలోని కొంత నగదును బుధవారం తీవ్రవాద సంస్థకు చెల్లిం చిన పృథ్వీ కన్స్ట్రక్షన్స్ సంస్థ ప్రతినిధులు..మిగిలిన మొత్తం గురువారం ఉద యం చెల్లించడంతో కిడ్నాప్ చేసిన ఇంజనీర్లను విడుదల చేశారు. ఈ విషయాన్ని సదరు ఇంజనీర్లు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారు విడుదలైన తర్వాత దిమ్మాపూర్ నుంచి అస్సాం రాజధాని గువాహటికి గురువారం సాయంత్రం చేరుకుని, అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్‌కు గురువారం రాత్రి చేరుకుంటారు. శుక్రవారం విజయవాడకు వస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
జాబ్ పాయింట్: బెస్టు ఇంజనీరింగ్ జాబ్స్
ఒకదేశం ప్రగతి పథంలో ముందుకు సాగడానికి చోదక శక్తులుగా పనిచేసేవారే ఇంజనీర్లు. నిపుణులైన ఇంజనీర్లు ఉన్న దేశం త్వరగా అభివృద్ధి చెందుతుంది, అగ్రస్థాయికి చేరుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందుతున్న వృత్తి ఇంజనీరింగ్. ఇందులో అధిక వేతనాలు, పనిలో సంతృప్తి ఉంటాయి. ఆధునిక సమాజంలో మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌లో కొత్తకొత్త రంగాలు, కోర్సులు తెరపైకి వస్తున్నాయి. వినూత్నమైన ఈ కోర్సులను అభ్యసిస్తే ఉజ్వల భవిష్యత్తును సొంతం చేసుకోవచ్చు. 2014లో ఎక్కువ డిమాండ్ ఉన్న టాప్ ఇంజనీరింగ్ జాబ్స్ ఏమిటో తెలుసుకుందాం.. రోబోటిక్స్: రోగులకు శస్త్రచికిత్సలను మర మనుషులే(రోబోలు) చేసే రోజులొచ్చాయి. భవిష్యత్తంతా రోబోలదేనని చెప్పుకోవచ్చు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు అందుబాటులో ఉన్న బెస్టు ఆప్షన్ రోబోటిక్స్. ఎలక్ట్రికల్, కంప్యూటర్స్, మెకానికల్ సబ్జెక్టుల్లో పట్టున్న విద్యార్థులు ఈ కోర్సును ఎంచుకోవచ్చు. కొత్త రోబోలను రూపొంది ంచడం ప్రస్తుతానికి ఖరీదైన వ్యవహారమే అయినప్పటికీ భవిష్యత్తులో పరిస్థితి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కోర్సు చేస్తే రోబోటిక్స్ పరిశ్రమలో టెస్టర్స్, ప్రోగ్రామర్స్, ఆపరేటర్స్‌గా కూడా స్థిరపడొచ్చు. రోబోటిక్స్ నిపుణులు ప్రస్తుతం భారీ డిమాండ్ ఉంది. 3డీ ప్రింటింగ్ : ఆధునిక సాంకేతిక విప్లవానికి ఉదాహరణ 3డీ ప్రింటింగ్. అస్ట్రోనాట్స్ నుంచి ఆర్కిటెక్ట్‌ల దాకా.. అందరికీ ఈ సాంకేతిక పరిజ్ఞానంతో అవసరం ఏర్పడుతోంది. మన దేశంలో 3డీ ప్రింటింగ్ అనేది ప్రారంభ దశలోనే ఉంది. అద్భుతమైన 3డీ మోడల్స్, ప్రింటర్స్‌ను సృష్టించగల నిపుణులకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. 3డీ ప్రింటింగ్ అండ్ డిజైన్‌లో డిగ్రీతో తగిన అనుభవం సంపాదిస్తే భవిష్యత్తుకు ఢోకా లేదని చెప్పొచ్చు. ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్ : విద్యుత్ అవసరాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ఉత్పత్తికి అవసరమైన వనరులు మాత్రం వేగంగా తరిగిపోతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాల్లో కరెంటును ఉత్పత్తి చేయడం అనివార్యంగా మారుతోంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరులపై అందరి దృష్టి పడింది. ఇలాంటి వనరులతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీర్లకు డిమాండ్ పెరిగింది. ఎనర్జీ జనరేషన్, కన్వర్షన్ ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్‌పై పరిజ్ఞానం, నైపుణ్యం ఉంటే ఎనర్జీ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌గా వృత్తిలో రాణించొచ్చు. నానో టెక్నాలజీ : ఇది ఇంజనీరింగ్‌లో బహుముఖాలు కలిగిన రంగం. మెటీరియల్స్ సైన్స్, ఇంజనీరింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల సమ్మిళిత రూపమే నానో టెక్నాలజీ ఇంజనీరింగ్. ప్రస్తుతం అన్ని వస్తువుల పరిమాణం తగ్గిపోతోంది. వస్తువు పరిమాణంలో చిన్నగా ఉన్నా.. సమర్థంగా పనిచేసేలా చేయడం నానో టెక్నాలజీ నిపుణుల బాధ్యత. ప్రస్తుతం నానో టెక్నాలజీ నిపుణుల కొరత ఉంది. ఫ్యూయెల్ సెల్స్ : కెమికల్ ఇంజనీరింగ్‌లో ఆదరణ పొందుతున్న స్పెషలైజ్డ్ ఫీల్డ్.. ఫ్యూయెల్ సెల్స్. రసాయనిక చర్య ద్వారా ఇంధనంలోని రసాయన శక్తిని విద్యుత్ శక్తిగా మార్చడం ఫ్యూయెల్ సెల్స్ ఇంజనీర్ విధి. ఫ్యూయెల్ సెల్స్ నిపుణులకు విద్యుత్, అటోమొబైల్ కంపెనీల్లో భారీగా అవకాశాలున్నాయి. నేటి విద్యలో.. సివిల్స్-ప్రిలిమ్స్ పేపర్-1: సైన్స్ అండ్ టెక్నాలజీ బ్యాంక్ ఎగ్జామ్స్ స్పెషల్: బ్యాంకింగ్ అవేర్నెస్. పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
రైల్వే సిబ్బంది.. తప్పిదాలు చేయొద్దు
సేఫ్టీ సెమినార్లో రైల్వే డీఆర్ఎం మిశ్రా పాల్గొన్న కాజీపేట-బల్లార్షా, కొండపల్లి, భువనగిరి అధికారులు కాజీపేట రూరల్, న్యూస్‌లైన్ : రైల్వే సిబ్బంది విధి నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగుకుండా వ్యవహరించాలని సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా సూచించారు. కాజీపేట జంక్షన్‌లోని సెమినార్ హాల్లో శుక్రవారం సికింద్రాబాద్ డివిజన్ స్థాయి సేప్టి సమావేశం జరిగింది. ఈ సెమినార్లో కాజీపేట-బల్లార్షా, కొండపెల్లి, భువనగిరి రైల్వే సెక్షన్లలో పనిచేస్తున్న రైల్వే అధికారులు, సూపర్వైజర్లు, రైల్వే గేట్మెన్లు. సీనియర్ సెక్షన్ ఇంజనీర్లు, పాయింట్స్ మెన్లు, స్టేషన్ మాస్టర్లు, డ్రైవర్లు, కీ మెన్లు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు హాజరయ్యూరు. ఈ సేఫ్టీ సెమినార్లో సికింద్రాబాద్ డివిజన్ రైల్వే మేనేజర్ ఎస్కె.మిశ్రా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని విభాగాల వారు అప్రమత్తంగా ఉండి రైల్వే ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చేశారు. సమావేశంలో సికింద్రాబాద్ సీనియర్ డీఎస్ఓ మోహన్రాం, డీఈఎన్ సెంట్రల్ నాయక్, డిప్యూటీ సీఎస్ఓ ప్రజాపతి, కాజీపేట ఆర్పీఎఫ్ అదనపు కమిషనర్ విజయ్‌కుమార్, కాజీపేట ఏరియా ఆఫీసర్ కుమార్, స్టేషన్ మేనేజర్ ఓదేలు, ఆర్పీఎఫ్ సీఐ సయ్యద్ ఇక్బాల్ అహ్మద్, జీఆర్పీ ఎస్సై శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు. అనంతరం డీఆర్ఎం మిశ్రా కాజీపేట జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వరకు గూడ్స్ రైళ్లో ఫుట్ప్లేటింగ్ తనిఖీ చేస్తూ వెళ్లారని అధికారులు తెలిపారు. డీఆర్ఎంకు రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకుల వినతి కాజీపేటలో రైల్వే కార్మికులు ఎదుర్కొటున్న పలు సమస్యలపై మజ్దూర్ యూనియన్ ఇంజినీరింగ్ బ్రాంచ్ సెక్రటరీ బి. రామనాథం ఆధ్వర్యంలో నాయకులు డీఆర్ఎం మిశ్రాను కలిసి వినతిపత్రం అందజేశారు. రైల్వే క్వార్టర్స్‌లలో సౌకర్యాలు లేవని, నిరుపయోగంగా ఉన్న క్వార్టర్స్‌ను నేలమట్టం చేయకపోవడంతో అందులో అసాంఘిక కార్యాకలాపాలు సాగుతున్నాయ ని, రైల్వే ఆస్పత్రిలో మందుల కొరత ఉందని తదితర సమస్యలను వినతి పత్రంలో పేర్కొన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు ఎ.శ్రీనివాస్, పి.వేదప్రకాష్, ఎన్.సదానందం, నిజాముద్దీన్, జేపీ యాదవ్, ఎన్.కుమారస్వామి ఉన్నారు. -
జెట్ కారు @880 కి.మీల స్పీడు
బయల్దేరిన రెండు గంటల్లోపే ముంబై నుంచి న్యూఢిల్లీకి చేరుకోవాలంటే ఈ అధునాతన జెట్ కారు ఎక్కాల్సిందే. ఎందుకంటే ఈ జెట్ కారు స్పీడు గంటకు 880 కిలోమీటర్లు. జీఎఫ్7గా పిలవడే ఈ అసాధారణ వాహనాన్ని తయారుచేయాలనే ఆలోచన అమెరికాకు చెందిన గ్రెగ్ బ్రౌన్, డేవ్ ఫాసెట్ అనే ఇద్దరు ఇంజనీర్లకు వచ్చింది. 3,500 పౌండ్ల పీడన సామర్థ్యముండే టర్భైన్ ఇంజిన్‌ను బిగించడం ద్వారా ఇంతటి స్పీడు సాధ్యమని వీరు చెబుతున్నారు. జెట్ కారు టేకాఫ్ కోసం ఎయిర్‌పోర్ట్‌లోని రన్‌వేతో పనేలేదు. చక్కని రహదారి చాలు. గంటకు 160 కిలోమీటర్ల స్పీడుతో టేకాఫ్ అయ్యాక 38,000 అడుగుల ఎత్తులో గంటకు 880 కిలోమీటర్ల స్పీడుతో జెట్ కారు దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రయోగదశలో ఉన్న ఈ వాహన నమూనాను వచ్చే నాలుగేళ్లలో ఆవిష్కరిస్తామని ఇంజనీర్లు ప్రకటించారు. -
విద్యుత్ సంక్షోభం
సగానికి పడిపోయిన ఉత్పత్తి రెండవ యూనిట్ ఇప్పటికే బంద్ అర్ధరాత్రికి మరో రెండు యూనిట్లు మూసివేత బొగ్గు కొరత ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : వేతన సవరణ చేయడానికి ప్రభుత్వం అంగీకరించనందుకు నిరసనగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ( ఎన్టీటీపీఎస్)లో ఇంజినీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. దీంతో ఆదివారం సాయంత్రానికి ఎన్టీటీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి సగానికి పడిపోయింది. ఇదే పరిస్థితి సోమవారం కొనసాగితే ఎన్టీటీపీఎస్ పూర్తిగా మూతపడే అవకాశాలు ఉన్నాయని ఇంజినీర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీటీపీఎస్లో తగ్గుతున్న బొగ్గునిల్వలు ఎన్టీటీపీఎస్కు ఇతర రాష్ట్రాల నుంచి బొగ్గు రైల్వే వ్యాగన్ల ద్వారా సరఫరా అవుతుంది. అలా వచ్చిన బొగ్గును ట్రక్కుల ద్వారా ఎన్టీటీపీఎస్కు చేర్చి కన్వేయర్‌బెల్ట్ ద్వారా ప్లాంట్‌లోకి సరఫరా చేస్తారు. అయితే ఉద్యోగస్తులు మెరుపు సమ్మెలో రైల్వే వ్యాగన్లలో వచ్చిన బొగ్గును కన్వేయర్ బెల్డ్ వరకు సరఫరా చేసే సిబ్బంది కరువయ్యారు. దీంతో ఆదివారం ఉదయం అందుబాటులో ఉన్న బొగ్గును ఉపయోగించి, ఆ తరువాత ఆయిల్ ఫైరింగ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఎన్టీటీపీఎస్లో ఏడు యూనిట్లు ఉన్నాయి. అయితే బొగ్గు తగినంతగా అందక పోవడంతో రెండవ యూనిట్ ట్రిప్పింగ్ అయింది. కాగా ఆదివారం అర్ధరాత్రికి ఐదు, ఆరు యూనిట్లు కూడా ఆగిపోవచ్చని కార్మిక సంఘాలనేతలు చెబుతున్నారు. సోమవారం ఇదే పరిస్థితి కొనసాగితే ఏడు యూనిట్లు నిర్వహణ కష్టమేనని ఇంజనీర్లు అంగీకరిస్తున్నారు. సగానికి పడిపోయిన ఉత్పత్తి... ప్లాంట్‌లోని ఏడు యూనిట్ల ద్వారా 1760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. రెండవ యూనిట్ ఆగిపోవడంతో 210 మెగావాట్ల ఉత్పత్తి తగ్గింది. కాగా మిగిలిన యూనిట్లలో కూడా విద్యుత్‌ను తగ్గించి ఉత్పత్తి చేస్తున్నారు. దీంతో ఆదివారం రాత్రికి 800 మెగావాట్లకు విద్యుత్ ఉత్పత్తి పడిపోయిందని అధికారులు చెబుతున్నారు. సోమవారం విద్యుత్ ఉత్పత్తి మరింత పడిపోయే అవకాశం కనపడుతోంది. రోడ్డెక్కిన ఎన్టీటీపీఎస్ ఉద్యోగస్తులు..... వేతన సవరణకు ప్రభుత్వం తక్షణం అంగీకరించాలని కోరుతూ ఎన్టీటీపీఎస్ ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు ఇంజినీర్లు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు ఆదివారం ఉదయం నుంచి మెరుపు సమ్మెకు దిగారు. ఉదయం 6 గంటలకే మొదటి షిఫ్ట్ ఉద్యోగులందరూ ఎన్టీటీపీఎస్ మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. వీరితో అన్ని కార్మిక సంఘాలు కలిసి మెయిన్ గేట్ వద్ద ధర్నా నిర్వహించాయి. కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గవర్నర్ వేతన సవరణ ఒప్పందానికి అంగీకరించి కూడా ఇప్పుడు తమ సమస్య పరిష్కరించ కపోవడంపై నిరసన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో ఉద్యోగులు కూడా పాల్గొన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత రెండో షిఫ్ట్ ఉద్యోగులు కూడా విధుల్లోకి వెళ్లలేదు. శనివారం అర్ధరాత్రి విధులకు వెళ్లిన సిబ్బందిని ఆదివారం ఉదయం టిఫెన్లు, భోజనాలు ఏర్పాట్లు చేసి ఆదివారం ఉదయమంతా అధికారులు పనిచేయించారు. అయితే ఆదివారం రాత్రి పనిచేయడానికి ప్లాంట్‌లో ఉన్న కార్మికులు అంగీకరించకుండా ఒకొక్కరే బయటకు వచ్చేశారు. దక్షిణాది గ్రిడ్‌పై ఎఫెక్ట్.. ఎన్టీటీపీఎస్లో యూనిట్లు ట్రిప్ అయితే రాష్ట్రంలోని మిగిలిన థర్మల్ స్టేషన్లలో కూడా యూనిట్లు ఆగిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే దక్షిణాది గ్రిడ్‌పై ఆ ప్రభావం పడి కర్ణాటక, ఒడిశా, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లలో అంధకారం అలముకునే అవకాశం ఉంది. ఉద్యోగుల ఆందోళనపై గవర్నర్ సీరియస్‌గా ఉన్న నేపథ్యంలో కార్మిక, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ఐక్యంగా సమ్మెను కొనసాగించాలన్న ఉద్దేశంతో ఉన్నారు. ఎన్టీటీపీఎస్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా నిఘా ముమ్మరం చేశారు. నగరంలోనూ విద్యుత్ కోతలు.... ఇప్పటికే గ్రామాల్లో సుమారు 12 గంటలు విద్యుత్ కోతలు విధిస్తున్నారు. తాజాగా విద్యుత్ ఉద్యోగులంతా సమ్మెలోకి దిగడంతో ఆదివారం రాత్రి విజయవాడ నగరంలోనూ చీకట్లు అలముకున్నాయి. సమ్మె మరింత తీవ్రమైతే గ్రామాలతో పాటు నగరాల్లోనూ గంటల తరబడి విద్యుత్ కోతలు విధించాల్సి వస్తుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. ఎస్ఈ కార్యాలయం వద్ద ధర్నాలు.... విజయవాడ స్వరాజ్యమైదానం వద్ద ఉన్న విద్యుత్ ఎస్ఈ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగుల జేఏసీ కన్వీనర్ సత్యానందం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఇప్పటికైనా తమకు ఇచ్చిన హామీ ప్రకారం పీఆర్సీ ఇవ్వాలని లేకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. సీమాంధ్ర ఉద్యమం మరవకముందే.... సీమాంధ్ర ఉద్యమం ముమ్మరంగా జరుగుతుండగా విద్యుత జేఏసీ ఉద్యోగులు సమ్మెకు దిగారు. దీంతో ఎన్టీటీపీఎస్ ఇంజినీర్లు, కార్మికులు సమ్మెచేయడంతో మొత్తం ఉత్పత్తే ఆగిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. -
‘ఎన్టీపీసీలానే వేతనాలివ్వాలి’
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్టీపీసీ) తరహాలో తమకూ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాను కలిసి సంఘం అధ్యక్షుడు శివాజీ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం యాజమాన్యం ఇవ్వచూపుతున్న 22 శాతం ఫిట్మెంట్ తమకు సమ్మతం కాదన్నారు. ఎన్టీపీసీ తరహాలో వేతనాలు, 33 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్నారు. తమ డిమాండ్ల కోసం మంగళవారం నుంచి విద్యుత్ సౌధలో ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు. -
అధికారుల గుండెల్లో రైళ్లు
- చుక్క నీరు నిలిచినా బాధ్యులను చేస్తామన్న సర్కార్ - అవసరమైతే జరిమానాలు విధిస్తామని హెచ్చరిక - దీంతో పూడికతీతలు, నీరు నిలిచే ప్రాంతాలపై దృష్టిసారించిన ఇంజనీర్లు - వానాకాలానికి సన్నద్ధమవుతున్న కార్పొరేషన్లు న్యూఢిల్లీ: వర్షాకాలానికి దాదాపు రెండు నెలల సమయమున్నా ఎల్జీ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచే సంబంధిత అధికారులను అప్రమత్తం చేస్తోంది. ఈ వర్షాకాలంలో రోడ్లపై చుక్క నీరు నిలిచినా సంబంధిత అధికారులను, ఇంజనీర్లను బాధ్యులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పనుల విభాగం, సంబంధిత అధికారులు, ఇంజనీర్లను బాధ్యులను చేయడమే కాకుండా వారి నుంచి జరిమానాలు కూడా వసూలు చేయనుంది. గురువారం సమావేశమైన కీలక ప్రభుత్వ విభాగాలు వర్షాకాల ఏర్పాట్ల విషయమై చర్చించాయి. ఈ సమావేశంలో ఆయా మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులతోపాటు వరదలు, నీటిపారుదల విభాగం అధికారులు, ప్రజాపనుల విభాగం అధికారులు పాల్గొని తమ తమ పరిధుల్లో వర్షాకాలంలో తలెత్తే సమస్యలపై సమీక్షించారు. ఢిల్లీలో ప్రస్తుతం ప్రభుత్వమేదీ లేనందున అన్ని విభాగాలకు లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ నేతృత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆయన జారీ చేసిన ఆదేశాల మేరకే ఆయా ప్రభుత్వ విభాగాలు గురువారం సమావేశమయ్యాయని, వర్షాకాలంలో రోడ్లపై నీరు నిలిచిపోవడం పెద్ద సమస్యగా మారిన నేపథ్యంలో దానిపైనే ప్రధానంగా చర్చ జరిపారని తెలిసింది. ఈ సమస్యకు తాము బాధ్యులము కాదంటూ మున్సిపల్ కార్పొరేషన్లు, ప్రజాపనుల విభాగం తప్పించుకునే ప్రయత్నం చేసేవి. దీంతో ఈసారి కూడా అలాంటి పరిస్థితి తలెత్తకుండా ఉండేందుకు దాదాపు రెండు నెలల ముందుగానే సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టారు. ఇందులోభాగంగానే సమస్య తలెత్తితే సంబంధిత అధికారితోపాటు అక్కడి ఇంజనీర్‌ను బాధ్యలను చేసి, వారి నుంచి జరిమానా వసూలు చేయాలని నిర్ణయించారు. ‘నగరంలో 153 సమస్యాత్మక ప్రాంతాలున్నాయి. ఈ ప్రాంతాల్లో చిన్నపాటి జల్లులు కురిసినా నీరు నిలిచిపోతుంటుంది. దీంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. పరిష్కరించకపోతే ఒక్క వర్షాకాలంలోనేకాకుండా శాశ్వత సమస్యగా మారే అవకాశముంది. ఈ విషయంలో అధికారులను, ఇంజనీర్లను బాధ్యులను చేయాలంటూ ఢిల్లీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయి. పరిష్కారానికి అధికారుల వద్ద కూడా తగినంత సమయముంది. ఐటీఓ, వికాస్ మార్గ్, కశ్మీరీ గేట్, సరాయి కాలేఖాన్, ధౌలాకువా, మూల్‌చంద్ ఫేస్ వంటి ప్రాంతాల్లో ఎక్కువగా నీరు నిలుస్తుంటుంది. దీంతో ఈ ప్రాంతానికి చెందిన ఆయా విభాగాల అధికారులు సమావేశమై, పరస్పర సహకారంతో ప్రణాళికలు సిద్ధం చేసుకొని, సమస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాల’ని రాష్ట్ర ప్రభుత్వ ప్రజాపనుల విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. వానాకాలానికి సన్నద్ధమవుతున్న కార్పొరేషన్ వానాకాలం అనగానే... వేసవి ఎండల తాకిడికి వాడిపోయిన ముఖాల్లో ఒక్కసారిగా ఆనందం వెల్లివిరుస్తుంది. కానీ ఢిల్లీ నగరం మాత్రం ఇందుకు మినహాయింపు. కారణం... వానలతో పాటు ఇక్కడి వాళ్లకు సమస్యలూ వరదల్లా రావడమే. అస్థవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ, మురికి, బురద, ఎక్కడ చూసినా నిలిచిన వరద నీరు... ఇలా వర్షాకాలం రాగానే ఢిల్లీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతుంది. ఇందుకు ప్రధాన కారణం... నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థ అతి పురాతనమైనది కావడం, అంతసమర్థవంతమైనది కాకపోవడం. దీంతో వర్షపు నీరు బయటకు పోలేక కాలనీల్లోనే నిలిచిపోతుంది. వర్షాకాలంలో నగరం నీటి ప్రపంచాన్ని తలపిస్తుందంటే అతిశయోక్తి కాదు. నీటిపారుదల, వరద నివారణ శాఖ, ఢిల్లీ మున్సిపల్ కర్పొరేషన్ సంయుక్తంగా నీరు నిలవకుండా ఉండేందుకు, వరద నీటిని అదుపు చేసేందుకు ప్రతి ఏటా ముందస్తు చర్యలు తీసుకుంటూనే ఉంటారు. ఇందులో భాగంగా వర్షపు నీటి కాలువల శుద్ధి, మరమ్మతులు, నీటి పైపులను శుద్ధి, మరమ్మతులు, నగరంలోని 12 మున్సిపల్ జోన్లలో కంట్రోల్ రూమ్‌లు కూడా ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి వర్షాకాలాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామని ఈశాన్య మున్సిల్ కార్పొరేషన్ అధికార ప్రతినిధి యోగేంద్రమన్ తెలిపారు. ‘ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాల్లో పర్యవేక్షణ ప్రారంభించాం. నిలిచిపోయిన నీటిని తోడి పారబోయడానికి కొత్త పంపులను కూడా ఏరాపటు చేశాం. ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం 24 గంటలు పనిచేసే కంట్రోల్‌రూమ్‌లను కూడా ఏర్పాటు చేశామని యోగేంద్ర చెప్పారు. అన్ని విభాగాలు కలిసి ఈ ఏడాది వానాకాలంలో వచ్చే సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటామని, జూన్ 15కల్లా పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. అయితే డ్రైనేజ్ కాలువల్లో ప్లాస్టిక్ బ్యాగులు పడేయకుండా ఉండాలని యోగేంద్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ ఏరియా, బరఫ్ ఖానా చౌక్, ఐఎస్బీటీ కష్మీరీ గేట్, రైల్వేబ్రిడ్జ్, సబ్జీమండీ, షాద్రా, జేజే బులంద్ మసీదు, మానస సరోవర్ పార్క్, బాదర్పూర్ రోడ్, ఖిచ్రిపూర్, మండవలిలను అత్యంత దుర్భలమైన ప్రాంతాలుగా గుర్తించింది కార్పొరేషన్. చిన్నవర్షం పడినా చిత్తడిగా మారే ఈ ప్రాంతాలపై దృష్టి సారించింది. -
మండు వేసవిలోనూ...నిండు నీళ్ళ బోరు
ప్రయత్నం వేసవి వచ్చిందంటే నో(బో)రెండిపోతుంది. గుక్కెడు నీళ్ళు నోట్లో పోస్తేకాని దాహం తీరదు. అదే చేత్తో బోరులో కూడా కాసిన్ని నీళ్లు పోయమంటున్నారు ఆక్వాఫైర్ని కనుగొన్న బృందం. ఒకపక్క తాగడానికే గుక్కెడు నీళ్లు లేవని బోరుమంటుంటే... బోరులో నీళ్లు పోయడమేంటనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ సరోజినీనాయుడు కాలనీకెళితే భూమిలోని నీటిని పెకైలా రప్పించాలో తెలుసుకోవచ్చు. ప్రతి ఆదివారం ఉదయం ఆరుగంటల నుంచి పది గంటలవరకూ మెహర్‌బాబా మందిర ప్రాంగణంలోని మొక్కలను సాగు చేయడం కోసం ఓ ఇరవై ముప్ఫైమంది భక్తులు వస్తారక్కడికి. వారిలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, వ్యాపారులు, విద్యార్థులు అందరూ ఉంటారు. ఎకరం విస్తీర్ణంలో ఉన్న కొండపై సిమెంట్‌తో మడులు కట్టి అందులో మట్టి నింపి మొక్కలు పెంచుతున్నారు. అరటి చెట్ల నుంచి దానిమ్మ వరకూ అన్ని రకాల మొక్కలూ, చెట్లు ఉన్నాయక్కడ. వాటికి నీరు పోయడం కోసం మొదలైన జలయజ్ఞం ఫలితంగానే భూమిలోని నీటి నిల్వను పెంచే సరికొత్త పద్ధతిని కనుగొన్నామంటారు భక్తులంతా. దీన్నే ఆక్వాఫైర్ అంటున్నారు. బోరెండిపోవడంతో... పాతికేళ్లక్రితం కట్టిన మందిరం అది. అక్కడ వేసిన బోరు కూడా అప్పటిదే. పదేళ్లక్రితం ఉన్నట్టుండి బోరు ఎండిపోయింది. ఏం చేస్తారు...మందిర అవసరాలకోసం నీటిని ట్యాంకర్లతో తెప్పించుకోవడం మొదలుపెట్టారు. ఎత్తై ప్రదేశం కావడంతో ఒకసారి నీళ్లట్యాంకరు పెకైక్కుతూ బోల్తాపడింది. అప్పటి నుంచి ట్యాంకర్లవాళ్ళు అక్కడికి రావడానికి వెనుకాడసాగారు. అప్పుడిక చేసేది లేక... 550 అడుగుల లోతుగా బోరు వేశారు. ఆ బోరు కూడా మూడేళ్లక్రితం ఎండిపోయింది. ‘‘పాతికేళ్ల నుంచి ఇక్కడ ప్రాంగణంలో మొక్కలు పెంచుతున్నాం. అలాంటిది నీళ్ళు లేకపోతే... పచ్చని ప్రదేశమంతా ఇప్పుడు తిరిగి రాయిలా మారిపోతుండడంతో డాక్టర్ విజయసారథి మాకు ఒక ఉపాయం చెప్పారు. ఆయన చెప్పిన పద్ధతిని అనుసరించడం వల్ల ఎండిపోయిన బోరులో నుంచి వేసవిలో కూడా పుష్కలంగా నీరు వస్తోంది. మా మందిరం బోరులోనే కాదు... చుట్టుపక్కల ఎక్కడ బోరువేసినా నీళ్లకు కొదవలేదు’’ అని చెప్పారు చార్టర్‌డ ఎకౌంటెంట్‌గా పనిచేస్తున్న రాజేందర్. నీటి నిల్వ పెంచడం కోసం... వర్షపు నీటిని ఫిల్టర్ చేసి బోరు ద్వారా భూమిలోకి పంపడం వల్ల ఇప్పుడు బోరులో బోలెడు నీరు ఉంది. బోరులోకి నీరెలా పంపాలంటారా? వర్షం వచ్చినపుడు మందిరం పైభాగంలో పడ్డ నీరంతా కిందకు పోతుంది. అలాగే కింద రాళ్లపై పడ్డనీరు కూడా పల్లపు ప్రాంతానికి పోతుంది. ఇక్కడే కాదు ఎక్కడైనా వర్షంనీరు 40శాతం ఆవిరైపోతుంది, 40 శాతం డ్రైనేజీలో కలిసిపోతుంది. పదిశాతం మట్టి పీల్చుకుంటుంది. మరో పదిశాతం మాత్రమే భూమిలోని నీటి నిల్వలను చేరుతుంది. యాభైశాతం వర్షం నీటిని బోరుబావుల ద్వారా భూమిలోకి పంపగలిగితే ఏ కాలంలోనూ నీటికొదవ ఉండదు. ‘‘మా మందిరంపై కురిసే వర్షపు నీరు పడేచోట సిమెంటు ట్యాంకుతో తయారుచేసిన ఇంకుడు గుంతను ఏర్పాటు చేశాం. ఆ ఇంకుడు గుంతకు కిందిభాగంలో ఒక పైపు పెట్టాం. ఈ ఇంకుడు గుంత వల్ల వర్షపు నీరు ఫిల్టర్ అయిపోతుంది. పది అడుగుల లోతు సిమెంటు, లేదా ప్లాస్టిక్ తొట్టిలో మొదట పెద్దసైజు కంకరరాళ్లు, తర్వాత సన్నకంకర, చివరగా ఇసుక ఒకదాని తరువాత మరొకటిగా పొరలు పొరలుగా పోయాలి. పైన దుమ్ము పడకుండా ఏదైనా ఒక మ్యాట్ని వేయాలి. దానిపై పైపులద్వారా పడుతున్న వర్షపునీరంతా ఫిల్టరయి కింద అమర్చిన గొట్టం ద్వారా మరో ట్యాంకులో వెళ్లిపోతాయి. ఆ ట్యాంకు నుంచి నేరుగా బోరుబావిలో పెట్టిన పైపులోకి వెళ్లిపోతాయి. బోరులో నీటికోసం ఎంతలోతు పైపు వేశామో దానికి ఆనుకునే మరోపైపుని వేసి దానిద్వారా ఈ ఫిల్టరయిన నీటిని లోపలికి పంపించాలి. మేం గత జూన్‌నెల నుంచి మా బోరులోకి కొన్ని లక్షల లీటర్ల నీటిని భూమిలోపలికి పంపించాం. దాని ఫలితం కనిపిస్తోంది. గతంలో మామూలు రోజుల్లో కూడా బోరు స్విచ్ వేశాక ఆరు నిమిషాలకు గానీ నీళ్ళు పైకి వచ్చేవి కావు. కానీ, ఇప్పుడు వేసవికాలంలో యాభై సెకన్లకే నీళ్ళు పైకి వస్తున్నాయి. అంటే మా బోరుకిందున్న నీటినిల్వలస్థాయి పెరిగిందన్నమాట. అంతేకాదు మా చుట్టుపక్కల ఎక్కడ బోరువేసినా వెంటనే నీళ్లు వచ్చేస్తున్నాయి’’ అని చెప్పారు గిరిధర్ అనే బ్యాంక్ ఉద్యోగి. ఇంకుడు గుంతల వల్ల నీరు నేరుగా నీటి నిల్వలను చేరుకునే అవకాశం తక్కువగా ఉంటుంది. ఇలా బోరుద్వారా కొన్ని వందల అడుగుల లోపలికి నీరు పంపించడం వల్ల మన నీటిని మనమే భద్రంగా దాచుకోవడంతో సమానమంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కీర్తి. అపార్ట్‌మెంట్‌పై నీటితో... భవిష్యత్తులో 90లక్షల లీటర్ల నీళ్ళును నిల్వ చేసే అండర్‌గ్రౌండ్ ట్యాంకు నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నారు ఆక్వాఫైర్ బృందం. దాని ద్వారా వేసవిలో ఉచితంగా నీటిని సరఫరా చేయాలన్నది వారి లక్ష్యం. రోజురోజుకీ వేల సంఖ్యలో పెరుగుతున్న అపార్టుమెంట్ల వల్ల భూమిలోని నీరంతా మాయమైపోతోందన్న మాటలు వింటూనే ఉంటాం. అపార్టుమెంట్ల సంఖ్య పెరిగిన చాలా ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయి. అలాంటిచోట్ల ఈ నీటినిల్వ ఏర్పాటు పద్ధతి చాలా అవసరం. ఆక్వాఫైర్ బృందం ప్రతి ఆదివారం ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తున్నారు. ఎవరైనా తమ ప్రాంతంలో నీటి నిల్వలను పెంచుకోవాలనుకుంటున్నవారికి ఉచితంగా ఆ విధానాన్ని బోధించడానికి వీరు సిద్ధంగా ఉన్నారు. ఆకాశగంగను... నేరుగా పాతాళానికి పంపిస్తూ నీటికొరత అనే మాటకు చోటులేకుండా చేసిన వీరి విజయం అందరి సొంతమవ్వాలంటే... ఆక్వాఫైర్ బృంద సభ్యుడు రాజేందర్ (9849046848)ని సంప్రదించవచ్చు. - భువనేశ్వరి -
యువతా.. మీ చేతిలోనే దేశ భవిత
చుట్టూ చీకటి...దారీతెన్నూకానరావడంలేదు....నిస్సత్తువ, నిరాశనిస్పృహ చుట్టముట్టిన వేళ. చదువు, ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ఇలా ఏం చేద్దామన్నా అందుబాటులేని పరిస్థితి. అగమ్యగోచరంగా కొట్టుమిట్టాడుతున్న యువత. పేదలకు అందని ద్రాక్షలా విద్య, ఎవరికీ దొరకని ఉపాధి...నిరుద్యోగం తాండవించడంతో చదువుకున్న యువత కూలీలా మారి వలసపోయే దుస్థితి. ఇదంతా చంద్రబాబు పాలనలో 2004 సంవత్సరం ముందు పరిస్థితి. ఇన్ని సమస్యలు యువతను ఉక్కిరిబిక్కిరి చేసే సమయంలో ఆశాకిరణం మెరిసింది. రాజశేఖర రెడ్డి రూపంలో వారికి ఆధారం దొరికింది. పేదలు పెద్ద చదువులు చదివేందుకు, కార్పొరేట్ విద్య అభ్యసించేందుకు ఆయన నడుంబిగించారు. స్కాలర్ షిప్‌లు, ఫీజ్ రీయింబర్స్మెంట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో సీట్లు, ప్రత్యేక మేళాల ద్వారా ఉపాధి కల్పనతో వారిని ఆదుకున్నారు. దీంతో యువకుల తల్లిదండ్రుల కళ్లల్లో ఇంద్ర ధనసులు విరబూశాయి. ఎంతో మంది పేద విద్యార్థులు ఇంజినీర్లుగా, డాక్టర్లుగా తయారయ్యారు. మహానేత మరణానంతరం పరిస్థితులు మళ్లీ మారిపోయాయి. ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల మంజూరు సక్రమంగా సాగక కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధించడం ప్రారంభించారు. నిబంధనల పేరుతో చాలా మంది విద్యార్థులకు వీటిని మంజూరు చేయడం నిలిపివేశారు. పాలకులు రాష్ట్రాన్ని విభజించి విద్య,ఉద్యోగావకాశాలను దెబ్బతీశారు. రెండు ప్రాంతాల విద్యార్థులు, యువకుల మధ్య చిచ్చురేపారు. చేతికి అందివచ్చిన తమ సంతానం ఉద్యమాలకోసం బలిదానమవడంతో కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. ఒక్క మంచి నేత మనమధ్యలేకపోవడంతో రాష్ర్టం అతలాకుతలమైంది. యువతను మళ్లీ పాత బాధలు చుట్టుముట్టాయి. ఇటువంటి తరుణంలో యువత మేలుకోవాలి. సమాజం మేలుకోరాలి. యువత అంటే నవ చైతన్యం, సమాజ భవితవ్యం అందుకే యువకులే నవ సమాజ సారథలు కావాలి, రాష్ర్ట పునర్నిర్మాణంలో ముందుండాలి. తిమిరసంహారానికి అరమరికలు లేని నేతలు అవసరం. సత్తువ చచ్చి, కీళ్లు వదిలిన నేతలను, పాత కుళ్లును కడిగేయాలి. ధైర్యమున్న యువ నాయకత్వానికి పగ్గాలు అప్పగిం చాలి. నడుము వంగిన శకుని మామలు, వారి కుటిల గురువులపై ప్రళయకాల గర్జనలై విజృంభించాలి. ఈ సమరంలో ఉడుకు రక్తానికి కావాలి ఓటు ఆయుధం...ఆ ఆయుధమే ఇస్తుంది మీకు నాయకత్వం. మన చిన్నప్పుడు పాఠశాల స్థాయిలో చదివాం.. భారత దేశం అభివృద్ధి చెందుతున్న దేశమని! కళాశాలకు వచ్చాం.. అదే పాఠం, మరలా అదే వాక్యం.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని! విద్యార్థి స్థాయి నుంచి ఉద్యోగ, వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాం. ఇప్పుడూ పత్రికల్లో చదువుతున్నాం.. భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమని..! ఏళ్లు గడుస్తున్నా... మన దేశ అభివృద్ధిలో మార్పు రావడం లేదు. రేపు మన పిల్లలూ, వారి పిల్లలూ ‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమ’నే చెప్పుకోవాల్సిందేనా? అభివృద్ధి చెందిన దేశాల్లో భారతదేశం పేరు చేరేదెప్పుడు? సమాజంలో మార్పు అవసరం. గతి తప్పిన రాజకీయాలను గాడిన పెట్టగలిగే.. భ్రష్టుపట్టిన వ్యవస్థను సమూలంగా మార్చగలిగే నాయకత్వం అవసరం. ఇది రాచరిక వ్యవస్థ కాదు.. ప్రజాస్వామ్య దేశం. మన పాలకులను మనమే నిర్ణయించగలిగే హక్కు మనకు ఉంది. గతించిన కాలాన్ని తలచుకుని బాధ పడే క్షణాలను వదిలేద్దాం. ఈ వ్యవస్థను మార్చగలిగే సమర్థవంతమైన యువ నాయకత్వాన్ని తెచ్చుకుందాం. అందుకు యువతే ముందుకు రావాలి. రాజకీయాల్లో వారి భాగస్వామ్యం పెరగాలి. దేశానికి చేటు తెస్తున్న నాయకులను ఓటు అనే ఆయుధం ద్వారా ఇంటికి పంపిద్దాం. యువ నాయకత్వానికి జై కొడదాం.. నయా భారత్‌ను నిర్మిద్దాం. -
టవర్ల పేరుతో ఫ్లవర్లు
నిరుద్యోగుల అమాయకత్వాన్ని మోసగాడు దర్జాగా సొమ్ము చేసుకున్నాడు. గ్రామాల్లో ఇళ్లపై సెల్‌టవర్లు, సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేయాలని, ఇంజనీర్లు కావాలంటూ ప్రకటన గుప్పించి వారి నుంచి డబ్బులు వసూలు నిండా ముంచాడు. పోలీసుల వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లాకు చెందిన మహ్మద్ సాద్ ఏడాదికాలంగా బంజారాహిల్స్ రోడ్డునెం.2లోని కమలాపురికాలనీలో సిల్వర్టన్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్ పేరుతో ఓ సంస్థను స్థాపించాడు. తమ సంస్థ గ్రామీణ ప్రాంతాల్లో సెల్‌టవర్లు, సోలార్ ప్యానళ్లను ఏర్పాటుచేస్తుందని..వీటి కోసం సర్వే చేయడానికి ఇంజనీర్లు కావాలంటూ ఆయా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చాడు. దీన్ని నమ్మిన ఆయా జిల్లాలకు చెందిన బీటెక్,ఎంటెక్ తదితర విద్యార్హతలు కలిగిన 300మంది నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్కోరి వద్ద రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు వసూలు చేశాడు. మూడునెలలు వీరందర్ని గ్రామాల్లో సర్వే పేరుతో పనిచేయించుకొని జీతం చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన పలువురు నిరుద్యోగులు వారం క్రితం కార్యాలయానికి చేరుకొని యజమానిని నిలదీశారు. విషయం తెలిసిపోయిందని గ్రహించిన మహ్మద్సాద్ పరారయ్యాడు. మోసపోయామని నిర్దారించుకున్న నిరుద్యోగులు అనేకమంది మంగళవారం కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చే యగా..సాద్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు. జిల్లాల్లోనూ దగా : మీ ఇంటిపై, ఖాళీ స్థలంలో సెల్‌టవర్లు నిర్మించి వేలాది రూపాయల అద్దె ఇస్తామంటూ వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్టణం తదితర జిల్లాల్లో మారుమూల ప్రాంతాలకు సంస్థ తరఫున ఉద్యోగులు వెళ్లారు. తమ సంస్థ దేశంలోని పలు టెలికాం సంస్థలతో సెల్టవర్ల నిర్మాణం కోసం ఒప్పందం కుదుర్చుకుందని..ఇందులో భాగంగానే గ్రామాల్లో, పట్టణాల్లో సెల్టవర్ల నిర్మాణం కోసం సర్వే నిర్వహిస్తున్నామని నమ్మబలికారు. ఇవి ఏర్పాటు చేస్తే ఆదాయం బాగా వస్తుందని నమ్మించారు. ఇలా అనేక గ్రామాల్లో వందలాదిమంది నుంచి రూ.9వేల చొప్పున డీడీలు కట్టించుకున్నారు. డీడీలు పంపి నెలలు గడిచినా సెల్టవర్ల నిర్మాణం ప్రారంభం కాకపోవడంతో అనుమానం వచ్చిన కొందరు బాధితులు సంస్థ కార్యాలయాన్ని సంప్రదిస్తే ఇదంతా పచ్చిమోసమని తేలింది. దీంతో లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. జిల్లాల్లో ప్రముఖ పత్రికల్లో ప్రకటనలు రావడంతో నమ్మి మోసపోయామని వరంగల్‌వాసి రాజయ్య ఆవేదన వ్యక్తం చేశారు. - బంజారాహిల్స్,న్యూస్‌లైన్ -
నాణ్యత తా‘కట్టు’
=సింగరేణి క్వార్టర్ల నిర్మాణానికి నాసిరకం ఇసుక =కాంట్రాక్టర్ ఇష్టారాజ్యం =చోద్యం చూస్తున్న ఇంజినీర్లు సాధారణంగా చిన్నపాటి ఇల్లు కట్టుకున్నా పది కాలాల పాటు నిలబడాలని కోరుకుం టాం.. అందుకు గోదావరి ఇసుక వాడుతాం. ఒకటి కాదు.. రెండు కాదు.. వెయ్యి క్వార్టర్ల నిర్మాణం. పనులకు వాడుతున్నది లోకల్ ఇసుక. ఎర్రని దుబ్బను తలపిస్తోం ది. సున్నం వేసినట్లు తెల్లగా మెరుస్తున్న పిల్లర్లు. వాడకముందే పగిలిపోతున్న సిమెంటు ఇటుకలు. ఈ తరహాలో నిర్మించిన కట్టడాలు ఎన్నికాలాలుంటాయో తెలి యదు. నాణ్యతలేని నిర్మాణాలు భవిష్యత్‌లో కార్మికులకు శాపంగా మారే ప్రమాదం కనిపిస్తోంది. ఈ పనులను స్వయంగా చూసిన గుర్తింపు సంఘం నాయకుడు అప్పాని శ్రీనివాస్ ఒక్కసారిగా అవాక్కయ్యాడు. గణపురం(వరంగల్), న్యూస్‌లైన్ : సింగరేణి కార్మికులకు గృహవసతి కల్పించడానికి యాజమాన్యం చేపట్టిన క్వార్టర్ల నిర్మాణ పనుల్లో నాణ్యత కొరవడింది. మండలంలోని చెల్పూరు శివారు సింగరేణి ఏరియా ఆస్పత్రి సమీపంలో కంపెనీ సేకరించిన 160 ఎకరా ల స్థలంలో 1,000 మంది కార్మికులు నివాసం ఉండడానికి సరిపోను క్వార్టర్లు నిర్మిస్తున్నారు. 2011 ఏప్రిల్ 11న అప్పటి సీఎండీ నర్సింగరావు శంకుస్థాపన చేయగా నిర్మాణానికిసంస్థ రూ.74 కోట్లు కేటాయించింది. వాస్తవానికి 2013 డిసెంబర్ నాటికి క్వార్టర్ల నిర్మాణం పూర్తికావల్సి ఉంది. ఇప్పటికీ 300 క్వార్టర్లు కూడా పూర్తి కాలేదు. కార్మికుల్లో ఆందోళన నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కార్మికులు ఆందోళ న చెందుతున్నారు. వాగులు, వంకల్లో లభించే నాసిరకం ఇసుకతో పనులు చేపడుతుండడంతో అవి ఎంతకాలం నిలుస్తాయోనని భయపడుతున్నారు. కాంట్రాక్టర్ లోకల్ ఇసుక వాడుతున్నా ఇంజినీరింగ్ అధికారులు పట్టించుకోకపోవడమే కాకుండా అతడి ని వెనకేసుకొస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం క్వార్టర్లను పరిశీ లించడానికి వచ్చిన భూపాలపల్లి సీఈ శివరావు దృష్టికి తీసుకువెళ్లినా సరైన సమాధానం రాలేదని పేర్కొంటున్నారు. పట్టుకుంటేనే పగిలిపోతున్న సిమెంట్ఇటుకలు క్వార్టర్ల నిర్మాణాలకు ఉపయోగించడానికి తీసుకు వచ్చిన సిమెంటు ఇటుకలు చేయితో పట్టుకుంటేనే పలిగిపోతున్నాయి. 40వేల ఇటుకల వరకు దిగుమ తి చేసి ఉన్నాయి. వాటిని ఎట్టిపరిస్థితుల్లో వినియోగించమని పనులను పర్యవేక్షిస్తున్న ఇంజినీర్లు చెబుతుండగా కాంట్రాక్టరు తరఫు ప్రతినిధి మాత్రం వాటినే వాడుతామంటున్నాడు. నిర్మాణాలకు వాట ర్ క్యూరింగ్ సక్రమంగా లేదు. పనులను పర్యవేక్షిం చాల్సిన సూపర్వైజర్లు పట్టించుకోవడంలేదు. నిర్మాణాలకు వాడుతున్నది మట్టే కార్వర్టర్ల నిర్మాణ పనులకు వాడుతున్నది ఇసుక అంటే ఎ వరైనా నవ్విపోతారు. యాభైశాతం మట్టి ఉన్న దు బ్బను ఇసుక అని అనవచ్చా. మామూలుగా చిన్న గది నిర్మించుకుంటేనే నాణ్యమైన గోదావరి ఇసుక వాడుతాం. అలాంటి రూ.కోట్లు వెచ్చించి ని ర్మిస్తున్న క్వార్టర్లకు దుబ్బలాంటి ఇసుక వాడటం దారు ణం. పట్టించుకోకుండా చోద్యం చూస్తున్న ఇంజినీర్లపై చర్య తీసుకోవాలి. గోదావరి ఇసుకతో నే నిర్మాణాలు చేపట్టాలి. నాణ్యత లేని ఇటుకలను అక్కడి నుంచి తొలగిం చాలి. ఈ విషయాన్ని సింగరేణి సీఎండీతోపాటు ఏరియా జీఎం దృష్టికి తీసుకుపోతాం. కాంట్రాక్టర్ ధోరణి, అధికారుల తీరు మారకుంటే కార్మికులతో ధర్నా చేస్తాం. - అప్పాని శ్రీనివాస్, టీబీజీకేఎస్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు -
అసోంలో కిడ్నాప్‌నకు గురైన ఇంజినీర్ అంకమ్మరావు
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబ సభ్యులు తమ కుమారుడిని విడిచి పెట్టాలంటూ వేడుకోలు తన భర్తకు ఏ పాపం తెలియదంటున్న భార్య వాణి బతుకుదెరువు కోసం కన్నవారిని, భార్యాబిడ్డలను వదిలి సుదూర ప్రాంతానికి వెళ్లిన ఇంజినీరు ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. డబ్బు ఆశతోనో..మరేదైనా కారణమో తెలియదు కానీ తీవ్రవాదులు అపహరించుకెళ్లారు. వారం కిందట తమ మధ్య ఆనందంగా గడిపి వెళ్లిన వ్యక్తి ఇలా పరాయిప్రాంతంలో ఆపదలో చిక్కుకున్నాడని తెలుసుకున్న అతని కుటుంబ సభ్యుల వేదన వర్ణనాతీతం. అసోంలో బోడో తీవ్రవాదుల చేతిలో ఆదివారం కిడ్నాప్‌కు గురైన యద్దనపూడి మండలం జాగర్లమూడికి చెందిన అంకమ్మరావు జాడ తెలియక అతని తల్లిదండ్రులు, భార్యాపిల్లలు కన్నీటి పర్యంతమవుతున్నారు. యద్దనపూడి, చీరాల, న్యూస్‌లైన్: ఉద్యోగం కోసం ఊరుకాని ఊరు వెళ్లిన తన భర్తను తీవ్రవాదులు అపహరించుకెళ్లారనే పిడుగులాంటి వార్త విన్న అతని భార్య నిర్ఘాంతపోయింది. కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపివెళ్లిన వ్యక్తి ఆపదలో ఉన్నాడని తెలిసి కన్నీరు మున్నీరవుతూ తన భర్తను ఎలాగైనా కాపాడాలని వేడుకొంటోంది. యద్దనపూడి మండలంలోని జాగర్లమూడి గ్రామానికి చెందిన అంకమ్మరావు(36) హైదరాబాద్ కేంద్రంగా ఉన్న బొల్లినేని శీనయ్య నిర్మాణ కంపెనీలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అసోంలో జరుగుతున్న పవర్ ప్రాజెక్టు పనులు పర్యవేక్షిస్తూ అక్కడే ఉంటున్నాడు. ఆదివారం విధులు ముగించుకుని వస్తున్న సమయంలో బోడోల చెరలో.. బోడో తీవ్రవాదులు అతడిని అపహరించుకు వెళ్లారు. సంఘటన సమాచారాన్ని కంపెనీ ప్రతినిధులు అంకమ్మరావు భార్యకు ఫోన్‌ద్వారా అందించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అంకమ్మరావు కుటుంబ నేపథ్యమిదీ... జాగర్లమూడికి చెందిన బత్తుల చిన్నబ్బాయి, బంగారమ్మలకు ఆరుగురు సంతానం. అంకమ్మరావు ఆఖరివాడు. చిన్నబ్బాయి అన్న దంపతులు వెంకటేశ్వర్లు, మంగమ్మలు అతడిని దత్తత తీసుకున్నారు. పదో తరగతి వరకు స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకున్న అంకమ్మరావు గుంటూరులో పాలిటెక్నిక్ విద్యనభ్యసించాడు. పదేళ్ల నుంచి నిర్మాణ రంగంలో సైట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఏడాది నుంచి అసోంలో విధులు నిర్వర్తిస్తున్నాడు. అంకమ్మరావుకి భార్య వాణి, పిల్లలు అనిల్, అనూష ఉన్నారు. ఒకరు ఐదో తరగతి, మరొకరు మూడో తరగతి చదువుతున్నారు. అంకమ్మరావు భార్య చీరాలలో నివాసం ఉంటూ పిల్లలను చదివించుకుంటోంది. వారం క్రితం ఇంటికి వచ్చి... వారం రోజుల క్రితం ఇంటికి వచ్చిన అంకమ్మరావు భార్యా పిల్లలతో కలిసి జాగర్లమూడి వెంకటేశ్వర స్వామి గుడిలో పొంగళ్లు పెట్టుకొని అందరితో కలివిడిగా మాట్లాడి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం బాబాయి బత్తుల శివయ్యకు ఫోన్ చేసి మాట్లాడాడు. తల్లిదండ్రుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. వారం తిరగక ముందే అంకమ్మరావు కిడ్నాప్‌నకు గురయ్యాడని తెలుసుకున్న గ్రామస్తులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. పర్చూరు ఎస్సై శ్రీహరిరావు జాగర్లమూడిలోని అంకమ్మరావు ఇంటికి వచ్చి తల్లిదండ్రులను అడిగి వివరాలు సేకరించారు. అంకమ్మరావు వివాద రహితుడని గ్రామంలోని అతని మిత్రులు చెబుతున్నారు. నా బిడ్డను వదిలిపెట్టండయ్యా.. మంగమ్మ, అంకమ్మరావు తల్లి ఎవరికీ ఎలాంటి అపకారం చేయని నా బిడ్డను తీవ్రవాదులు ఎత్తుకుపోయారని తెలిసిందయ్యా. నా బిడ్డ నాకు కావాలయ్యా. ప్రభుత్వం చొరవ తీసుకోవాలి... తండ్రి, వెంకటేశ్వర్లు నా బిడ్డను ప్రభుత్వం చొరవ తీసుకుని రక్షించాలి. వెంటనే నా బిడ్డ ఆచూకీ తెలపాలి. పని చేసే కంపెనీవారు వెంటనే నా బిడ్డను నాకు అప్పగించాలి. కుటుంబానికి అతనే ఆధారం. ఎవరికీ అపకారం చేయలేదు... శ్రీనివాసరావు, అంకమ్మరావు అన్న నా తమ్ముడిని వదిలి పెట్టాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. మేము ఎవరికీ ఎలాంటి అపకారం చేయలేదు. తీవ్రవాదులు మా తమ్ముడినే ఎందుకు తీసుకెళ్లారో తెలియదు. వెంటనే వారు దయతలచి వదిలిపెట్టాలి. ఎలాంటి అపకారం తలపెట్టకూడదు. నిన్న కూడా ఫోన్లో మాట్లాడాడు... బాబాయి, బత్తుల శివయ్య నిన్న మధ్యాహ్నం ఫోన్ చేసి మాట్లాడి బంధువులు, తల్లిదండ్రుల వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తెల్లవారగానే జనం వచ్చే సరికి ఏం జరిగిందో అర్థం కాలేదు. తెలుసుకునేసరికి తీవ్రవాదులు ఎత్తుకెళ్లారు. మంచి మిత్రుడు రమేష్, అదే కంపెనీలో పని చేస్తున్న ఇంజినీర్ పదేళ్ల నుంచి ఇద్దరం ఒకే కంపెనీలో పని చేస్తున్నాం. అంకమ్మరావు నాకు మంచి మిత్రుడు. జాతీయ రహదారి విస్తరణ పనుల్లో పని చేస్తుండగా అంకమ్మరావు అసోం వెళ్లాడు. ఇప్పుడు తీవ్రవాదులు ఎత్తుకెళ్లారని తెలియడం బాధ కలిగింది. వారి కుటుంబ సభ్యులను పరామర్శిద్దామని వచ్చా. వెంటనే అతనిని వదిలిపెట్టాలి. నా భర్తకు ఏ పాపం తెలియదు... తన భర్తకు ఏ పాపం తెలియదని, ఎటువంటి వివాదాలకు వెళ్లేవారు కాదని భార్య వాణి వాపోయారు. తన పని తాను చేసుకుంటూ అందరితో కలివిడిగా ఉండే వ్యక్తిని అకారణంగా అపహరించడం దారుణమని అన్నారు. గతంలో ఇదే కంపెనీకి చెందిన ఓ ఇంజినీర్‌ను కిడ్నాప్ చేసి 20 రోజులు తర్వాత విడిచిపెట్టారని, తన భర్తకు ఎటువంటి హాని తలపెట్టకుండా విడుదల చేసేలా ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కోరారు. -
స్వాహాలో సరి(గి)లేరు
ఇంజినీర్లే బినామీ కాంట్రాక్టర్ల అవతారమెత్తడం, భూసేకరణలో తీవ్ర జాప్యం, అధికార పార్టీ నాయకులు ముడుపులకు కక్కుర్తిపడటం వెరసి వందలాది మంది రైతులకు శాపంగా మారింది. బద్వేలు నియోజకవర్గం అట్లూరు మండలం కమలకూరు వద్ద 1500 ఎకరాల్లో వరి పంట ఎండిపోతుండటంతో గాలికొదిలేయాల్సిన దుస్థితి నెలకొంది. 11.93 కోట్ల రూపాయల పనులు పర్యవేక్షణ లేకపోవడంతో ఎందుకూ కొరగాకుండా పోయాయి. కాంట్రాక్టర్లు, ఇంజినీర్లు, అధికార పార్టీ నేతల జేబులు నింపేందుకే పనికొచ్చాయి. ప్రస్తుతం కట్ట తెగిన పనులను మరమ్మతులు చేసి రైతులకు నీళ్లు విడుదల చేయాలన్నా నిధులు వెతుక్కోవాల్సి వస్తోంది. అణువణువునా నిర్లక్ష్యమే! సగిలేరు ఆనకట్ట ప్రారంభం నుంచే అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. భూసేకరణలో రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేశారు. కాంట్రాక్టు పొందిన ప్రధాన కాంట్రాక్టర్ పనులు చేయకుండా సబ్ కాంట్రాక్టర్లకు అప్పజెప్పడంతోనే సమస్య మొదలైంది. మొదట చేసిన సబ్ కాంట్రాక్టర్ పనులను కొంతవరకు బాగానే చేశారు. భూసేకరణ జాప్యం అవుతుండటంతో పనులను చేయలేక చేతులేత్తేశారు. దీంతో రెండవసారి ఓ ఇంజినీరే బినామీ కాంట్రాక్టర్ అవతారం ఎత్తారు. భూసేకరణ పనులు పూర్తి కాకుండానే కాంక్రీటు గోడను పూర్తి స్థాయిలో కట్టారు. ప్రారంభంలోనే కట్ట పని చేయకుండా చుట్టూ కట్ట వేశారు. ఇదే తెగడానికి ప్రధాన కారణమైంది. ై రెతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ఇంజనీరింగ్ నిపుణుల అభిప్రాయం మేరకు కట్టలు పూర్తయిన తర్వాత కాంక్రీట్ గోడలు కట్టి ఉంటే ఇంత ఉపద్రవం వచ్చేది కాదని పేర్కొంటున్నారు. రెండు అడుగుల మేర కాంక్రీట్ గోడను కట్టకుండా వదిలి వేసివున్నా నీరు దానిగుండా వెళ్లేవని పలువురు చెబుతున్నారు. త్వరితగతిన బిల్లులు చేసుకోవాలనే కక్కుర్తితోనే భూసేకరణతో నిమిత్తం లేకుండా, ప్రారంభంలోనే కట్ట పూర్తి కాకున్నా కాంక్రీటు పనులు పూర్తి చేయడంతోపాటు చుట్టూ కట్టలను సైతం నిర్మించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మించిన కట్టలు కూడా కొన్నిచోట్ల తెగిపోయాయి. అంటే వీటి నాణ్యత ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పనులు చేశారిలా.. 2009 అక్టోబరులో రూ. 6.30 కోట్లతో సగిలేరు ఆనకట్టకు టెండర్లను ఖరారు చేశారు. ఏడాది కాలపరిమితిలో పనులు నిర్మించాలని గడువు విధించారు. అయితే చుట్టూ కట్టలు పెంచడంతోపాటు భూసేకరణ పనుల కోసం దాని అంచనాలను మళ్లీ రూ.11.93 కోట్లకు పెంచారు. రెండేళ్ల ముందే 101 ఎకరాల భూసేకరణ కోసం రెవెన్యూశాఖకు ఇరిగేషన్ వారు రూ.2.12 కోట్లు చెల్లించారు. అయినప్పటికీ భూసేకరణ గురించి వారు పట్టించుకోలేదు. దీంతో తీవ్ర జాప్యం జరిగింది. భూసేకరణ పూర్తయి ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేది కాదు. దీనికితోడు పనులు పూర్తి కాకుండానే రాజకీయ నాయకుల జోక్యంతో నీటిని నిలపడం కూడా మరో కారణం. ఇప్పటికే 90 శాతానికి పైగా నిధులు ఖర్చయ్యాయి. మిగిలింది అరకొర మాత్రమే. ఇన్ని కోట్లు ఖర్చయినా కట్ట తెగిపోవడంతో వ ృథానే అయింది. మళ్లీ దీన్ని పూర్తి స్థాయిలో బాగు చేయాలంటే కొత్తగా అంచనాలు రూపొందించి నిధుల కోసం ఎదురు చూడాల్సిందే. లబోదిబోమంటున్న రైతన్నలు రాజకీయ నాయకుల మాటలతోపాటు సగిలేరు ఆనకట్ట వద్ద ఉన్న నీటిని నమ్ముకుని నాలుగు గ్రామాల ప్రజలు 1500 ఎకరాలకు పైగా వరి పంటను సాగు చేశారు. ఇప్పుడు కట్ట తెగడంతో వరి పంటకు నీరందడం లేదు. పంట ఎండిపోతోంది. ఏం చేయాలో పాలుపోక రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికారులు తక్షణమే చేరుకుని కట్టకు తాత్కాలిక మరమ్మతులు చేయాలని, వరిపంట ఎండిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. - సాక్షి, కడప/అట్లూరు, న్యూస్‌లైన్ రైతులను ఆదుకునే యత్నం వరి పంట సాగు చేసిన రైతులను ఏ విధంగా ఆదుకోవాలో అన్ని మార్గాలను వెతుకుతాం. భూసేకరణలో జాప్యం, గతంలో జరిగిన కొన్ని పొరపాట్లతో ఈ దుస్థితి నెలకొంది. మొత్తం పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులకు నీరిచ్చే ప్రయత్నాలుచేస్తాం. - రమేష్, ఎస్ఈ, ఇరిగేషన్ ‘‘ఫోటోలోని రైతు మన్యంవారిపల్లెకు చెందిన కత్తెరపల్లె రామసుబ్బారెడ్డి. ఈయన కమలకూరు వద్ద నిర్మించిన సగిలేరు ఆనకట్టను నమ్ముకుని నాలుగు ఎకరాల్లో వరి పంటను సాగు చేశాడు.రూ.50 వేల పెట్టుబడి పెట్టాడు. రాజకీయ నాయకుల జోక్యం, నాసిరకం పనుల పుణ్యమా అని కట్ట తెగిపోయింది. నీళ్లు వృథాగా పోయాయి. ప్రస్తుతం వరి పంటకు నీళ్లు లేవు. ఎండిపోతోంది. పైరును గాలికి వదిలేయాల్సి వస్తోంది. దీన్ని నమ్ముకోకుండా ఆరుతడి పంటలు వేసుకుని ఉంటే పెట్టుబడి మిగలడంతోపాటు కొంత సొమ్ము వచ్చేది. ఇప్పుడు అన్ని విధాలా నష్టపోయాం. ప్రభుత్వమే ఆదుకోవాలి.’’అంటున్నాడు. ‘‘ఇతను కమలకూరుకు చెందిన రైతు సిద్ధారెడ్డి. రెండెకరాల్లో వరి పంటను సాగు చేశాడు. కట్ట తెగినప్పుడు వరి పంట మునిగి ఆందోళన చెందాడు. ఇప్పుడేమో నీళ్లు లేక పంట ఎండుతుంటే చూసి కన్నీటి పర్యంతమవుతున్నాడు’’. -
అక్రమార్కులకు షాక్!
సాక్షి, నిజామాబాద్: ఎన్పీడీసీఎల్లో అక్రమార్కులపై డిస్కం యాజమాన్యం ఉక్కుపాదం మోపుతోం ది. చేయి తడపనిదే పనిచేయని అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఏడాది కాలంలో ఓ ఏడీఈతో సహా నలుగురు ఏఈలపై ఏకంగా సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా మరో డివిజనల్ ఇంజినీర్‌ను కూడా సరెండర్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చర్యలు ఆ శాఖ వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ శాఖల్లో ఏవైనా అక్రమాలు జరిగితే విచారణ పేరుతో జాప్యం చేయడంతో పాటు, కింది స్థాయి సిబ్బందిని బలిచేసి, ఉన్నతాధికారులు తప్పించుకోవడం పరిపాటిగా మారుతోంది. కానీ ట్రాన్స్‌కో విషయంలోకి మాత్రం ఇందుకు భిన్నంగా జరుగుతోంది. ఏకంగా ఇంజనీరింగ్ అధికారులపైనే వేటు పడుతుండటంతో ఆ శాఖ అధికారుల్లో కలకలం రేగుతోంది. ఎవరైనా అధికారిపై అవినీతి ఆరోపణలు వస్తే చాలు.. యాజమాన్యం వెంటనే విచారణ చేపడుతోంది. ఏడాదిలో ఇలా సస్పెన్షన్ వేటు పడిన తీరును పరిశీలిస్తే... నాగిరెడ్డిపేట్లో పనిచేసిన ఏఈ రైతులకు ట్రాన్స్ఫార్మర్లను మంజూరు చేసేందుకు పెద్ద మొత్తంలో వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఒక్కో రైతు వద్ద రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేశారని ఫిర్యాదులు వెళ్లాయి. బొల్లారం, ఆత్మాకూర్ తదితర గ్రామాల రైతులు ట్రాన్స్‌కో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే స్పందించిన యాజమాన్యం ఓ డివిజన్ఇంజనీర్ స్థాయి అధికారితో విచారణ జరిపింది. వసూళ్ల దందా వాస్తవమే అని తేలడంతో ఆ ఏఈపై సస్పెన్షన్ వేటు వేసింది. దీంతో సదరు ఏఈ తాను వసూలు చేసిన డబ్బును తిరిగి ఇచ్చేసి ఫిర్యాదులు వాపస్ తీసుకోవాలని రైతులను వేడుకుంటున్నారు. డిచ్పల్లి మండలం బీబీపూర్‌తండా శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన ఓ పెట్రోల్‌బంక్‌కు హెచ్‌టీ విద్యుత్ కనెక్షన్ మంజూరు కోసం డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలపై స్థానిక ఏఈతో పాటు, రూరల్ ఏడీఈపై కూడా ముందుగా సస్పెన్షన్ వేటు పడింది. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన డిస్కం ఉన్నతాధికారులు ఇందులో ఏడీఈ పాత్ర లేదని తేల్చారు. ఆ ఏఈని మాత్రం ఆదిలాబాద్ జిల్లాలో మారుమూల ప్రాంతమైన ఊట్నూర్‌కు బదిలీచేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల మంజూరు విషయంలో మరో ఇద్దరు ఏఈలపై కూడా చర్యలు చేపట్టింది యాజమాన్యం. భీమ్‌గల్ రూరల్ ఏఈగా పనిచేసిన ఓ అధికారి మండలంలోని కారేపల్లికి చెందిన గిరిజన రైతుల వద్ద వసూళ్ల దందాకు పాల్పడ్డారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. అదేవిధంగా జుక్కల్ ఏఈగా పనిచేసిన మరో అధికారి కూడా సుమారు 20 మంది రైతుల వద్ద నుంచి రూ.రెండు లక్షలకు పైగా జేబులు నింపుకున్నాడు. అయితే నెలలు గడుస్తున్నప్పటికీ ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయకపోవడంతో రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ అక్రమాలపై విచారణ చేపట్టిన అధికారులు ఈ ఇద్దరు ఏఈలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజామాబాద్ నగరంతో పాటు, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి మున్సిపాలిటీల్లో ఆర్‌ఏపీడీఆర్‌పీ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల్లో పూర్తిగా నాణ్యత లోపించింది. విద్యుత్ సామగ్రి కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి. జరుగుతున్న పనులపై సరైన పర్యవేక్షణ చేపట్టకపోవడంతో కన్స్ట్రక్షన్ విభాగంలో ఏకంగా డివిజనల్ ఇంజనీర్‌పైనే సరెండర్వేటు పడింది. ఆయన్ను ఎన్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయానికి జిల్లా అధికారులు సరెండర్ చేశారు. -
రాజకీయ ‘ప్రభంజనం’
ఆరు పదుల స్వతంత్ర భారతం స్థితిగతులపై నలుగురు ఇంజినీర్లు చేసే పరిశోధనలో ఊహకందని విషయం బయటపడుతుంది. దేశం వెనకబాటుతనానికి ప్రధాన కారణం... ఎవరికీ అంతుచిక్కని ఓ అంశమని తెలుసుకున్న ఆ ఆరుగురు తర్వాత తీసుకున్న నిర్ణయం ఏంటి? మన రాజ్యాంగంలోని లొసుగుల్ని, బలహీనతల్ని ఆసరాగా తీసుకొని దేశ క్షామానికి కారకులవుతున్న రాజకీయ నాయకులపై ఎలాంటి అస్త్రాలను ఉపయోగించారు? అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందుతోన్న చిత్రం ‘ప్రభంజనం’. ‘రంగం’ఫేం అజ్మల్, సందేష్, శ్రీఐరా, నక్షా శెట్టి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని భాస్కరరావు వేండ్రాతి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం శనివారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి జేడీ లక్ష్మినారాయణ కెమెరా స్విచాన్ చేయగా, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ క్లాప్ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. భాస్కరరావు వేండ్రాతి మాట్లాడుతూ -‘‘ఓటర్లను ఎడ్యుకేట్ చేయడం, హెజిటేట్ చేయడం, ఆర్గనైజ్ చేయడం... మా సినిమా లక్ష్యం ఇదే. సమసమాజ స్థాపనకోసం నలుగురు వ్యక్తులు సాగించిన సమరమే మా సినిమా కథ. సిరివెన్నెల సాహిత్యం, ఆర్పీపట్నాయక్ స్వరాలు ఈ కథకు ఆభరణాలు. జనానికి ఉపయోగపడే సినిమా అవుతుంది’’ అని చెప్పారు. ‘‘సమాజం స్థితిగతులపై ‘బ్రోకర్’ సినిమాలో కొంత చూపించాను. కానీ చూపించాల్సింది ఇంకా చాలా ఉంది. సమాజాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి భాస్కరరావు. ఆయన కథ చెప్పాక ఉద్వేగానికి లోనై ఈ సినిమాకు స్వరాలందించడానికి అంగీకరించాను’’ అని ఆర్పీ పట్నాయక్ తెలిపారు. ప్రతి భారతీయుడూ చూడాల్సిన సినిమా ఇదని అజ్మల్ పేర్కొన్నారు. అవకాశమిచ్చిన దర్శక నిర్మాతకు సందేష్ కృతజ్ఞత తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, కూర్పు: మోహన్, రామారావు, నిర్మాణం: చైతన్య ఆర్ట్ క్రియేషన్స్. -
సమ్మెలో ఆర్అండ్బీ ఇంజనీర్లు
కర్నూలు(అర్బన్),న్యూస్‌లైన్: సమైక్యాంధ్రకు మద్దతుగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి రోడ్లు భవనాల శాఖ ఇంజనీర్లు ప్రత్యక్షంగా సమ్మెలోకి వెళ్తున్నారు. ఈ మేరకు కలెక్టర్ సి. సుదర్శన్‌రెడ్డిని కలిసి సమ్మె నోటీసును ఆర్అండ్బీ ఎస్ఈ వై. రాజీవ్‌రెడ్డి అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు ఆర్అండ్బీ మినిస్ట్రీయల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఇంజనీర్లు సైతం అర్ధరాత్రి నుంచి ప్రత్యక్షంగా సమ్మెలో పాల్గొంటున్నారని తెలిపారు. ఆర్అండ్బీ ఎస్ఈతో పాటు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఆర్డీసీ ఈఈలు, డీఈఈ, జేఈ, ఏఈలు అందరూ కలిపి 40 మంది సమ్మెలో పాల్గొంటున్నట్లు వివరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో కర్నూలు ఈఈ ఉమా మహేశ్వరరావు, డీఈఈ శ్రీధర్‌రెడ్డి, ఆర్అండ్బీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు. విభజనతో సీమకు తీవ్ర నష్టం - ఆర్అండ్బీ ఎస్ఈ రాజీవ్‌రెడ్డి కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్: రాష్ట్రాన్ని విభజిస్తే రాయలసీమ తీవ్రంగా నష్టపోతుందని రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ వై. రాజీవ్‌రెడ్డి తెలిపారు. స్థానిక ఎస్ఈ కార్యాలయ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన ఆర్అండ్బీ ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల సమష్టి కృషితో హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, రాష్ట్ర రాజధానిని వదలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. రాష్ట్ర విభజనతో తాగు, సాగునీటికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పాలక ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా నడచుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ భారీగా తరలివచ్చి ఈ నెల 29వ తేదీన కర్నూలులో జరగనున్న ప్రజాగర్జన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో డిప్యూటీ ఎస్ఈ వెంకటరమణారెడ్డి, ఈఈలు తులసీనాయక్, చెన్నకేశవులు, ఆర్డీసీ ఈఈ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రం విడిపోతే సీమ ఏడారే
కర్నూలు రూరల్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనను పాలకులు, అధికారులు, ప్రజలు సమైక్య గళం విప్పి అడ్డుకోకపోతే భావి తరాలు క్షమించవని నీటి పారుదల శాఖ ఇంజినీర్లు అన్నారు. రాయలసీమ నీటి వనరులు-లభ్యత-అభివృద్ధి-విభజన నష్టాలు-తదుపరి చర్యలు-ప్రణాళిక అనే అంశంపై గురువారం కర్నూలులో రాయలసీమ నీటి పారుదల శాఖ ఇంజినీర్ల జేఏసీ ఆధ్వర్యంలో రాయలసీమ ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఇరిగేషన్ ఇంజినీర్ల జేఏసి జిల్లా కన్వీనర్ పాండు రంగయ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో చీఫ్ ఇంజినీర్సుబ్బారావు, సూపరింటెండెంట్ ఇంజి నీర్ నాగేశ్వరరావు, రాయలసీమ ఇంజినీర్ల జేఏసీ కన్వీనర్ సుధాకర్‌బాబు హాజరయ్యారు. ఇందు లో అనంతపురం, కడప, చిత్తూరు జేఏసీ కన్వీనర్లు శ్రీనివాసరెడ్డి, క్రిష్ణయ్య, మురళి, నంద్యాల సర్కిల్ జేఏసీ అధ్యక్షుడు చెన్నప్పరెడ్డి, డిప్యూటీ చీఫ్ ఇంజినీర్ మనోహర్, రిటైర్డ్ డీఈ సుబ్బరాయుడు ప్రసంగించారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమ ఎడారిగా మారుతుందని, వరద జలాల ఆధారితమై నిర్మించిన గాలేరు నగరి, హంద్రీనీవా, వెలుగొండ ప్రాజెక్టుకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. టీబీ డ్యాం నుంచి దిగువ కాల్వకు సమాంతర కాలువ తవ్వేందుకు కేంద్రం అనుమతివ్వాలన్నారు. పోలవరం, దుమ్ముగూడెం ప్రాజెక్టులను పూర్తి చేసి 242 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణ బేసిన్‌కు తరలించి ఆ నీటిని వరద ఆధారిత ప్రాజెక్టులైన హంద్రీనీవా, గాలేరు, తెలుగు గంగ, ఎస్సార్బీసీ, వెలుగొండ ప్రాజెక్టులకు నికర జలాలుగా కేటాయించాలన్నారు. అనంతరం సదస్సులో 10 తీర్మానాలు చేశారు. -
నేడు మున్సిపల్ ఇంజనీర్ల దీక్షలు
అమలాపురం టౌన్, న్యూస్‌లైన్ :సమైక్యాంధ్రకు మద్దతుగా మున్సిపల్ ఇంజనీర్లు గురువారం నుంచి మూడు రోజుల పాటు సామూహిక సెలవులు పెడుతున్న సంగతి తెలిసిందే. తొలిరోజు గురువారం రాజమండ్రిలోని మున్సిపల్ ఎస్ఈ కార్యాలయం వద్ద ఉభయ గోదావరి జిల్లాల్లోని మున్సిపాలిటీ లకుచెందిన ఇంజనీర్లు ఒకరోజు నిరాహార దీక్షలు చేపట్టనున్నారు. ర్యాలీ కూడా చేపడతారు. మూడు రోజులు విధులకు హాజరుకాకుండా నిరసన తెలుపుతారు. ఈ నెల 28న జిల్లాలోని రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో విద్యుద్దీపాలు వెలిగించకుండా నిరసన వ్యక్తం చేయనున్నారు. దాదాపు 90 మంది మున్సిపల్ ఇంజనీర్లు పాల్గొననున్నారు. -
నిజమైన హీరోలు ఇంజనీర్లే
పటాన్చెరు, న్యూస్‌లైన్: సినీ నటులు కేవలం రీలు హీరోలేనని.. వాస్తవ జీవితంలో ఇంజనీర్లు నిజమైన హీరోలని వర్థమాన సినీ నటుడు ఏ కృష్ణుడు అన్నారు. ప్రసిద్ధ సివిల్ ఇంజనీర్ సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి సందర్భంగా శనివారం గీతం విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ప్రాంగణంలోని ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినీ రంగంలో ఇంజనీర్ల ప్రాముఖ్యత, ఆవశ్యకత గురించి వివరించారు. గీతం పూర్వ విద్యార్థి, విశాఖ జిల్లా బీఎస్ఎన్ఎల్లో అదనపు జనరల్ మేనేజర్ వైవీ శాస్త్రి మానవ విలువలు, వృత్తి పట్ల నిబద్ధతల గురించి చెప్పారు. తన విద్యార్థి అనుభవాలను వివరించారు. బీఎస్ఎన్ఎల్లో ఉపాధి అవకాశాల గురించి విద్యార్థులకు తెలిపారు. మరో పూర్వ విద్యార్థి ‘మిరపకాయ్’ ఫేమ్, స్క్రీన్‌ప్లే డెరైక్టర్ ఏ దీపక్ రాజ్ కూడా తన అనుభవాలను విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో గీతం హైదరాబాద్ క్యాంపస్ డెరైక్టర్ డాక్టర్ సీహెచ్ సంజయ్, రెసిడెంట్ డెరైక్టర్ డీవీవీఎస్ ఆర్ వర్మ, వైస్ ప్రిన్సిపాల్ బీ బసవరాజ, ఈసీఈ విభాగాధిపతి కే మంజునాథ చారి, అసోసియేటెడ్ ప్రొఫెసర్ పీ త్రినాథ్ రావు, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు, టెక్నాలజీ రంగ నిఫుణులు, సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు. ఎల్లంకిలో... ఎల్లంకి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, పటేల్ గూడలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో శనివారం భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతిని ఘనంగా జరిగాయి. ఎల్లంకి గ్రూప్‌లోని అన్ని కళాశాలల విద్యార్థులు ‘లైఫ్ వితౌట్ ఇంజనీరింగ్’ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం వీడియో కాస్ట్ కూడా ప్రదర్శించారు. కార్యక్రమంలో గ్రూప్ చైర్మన్ ఎల్లంకి సదాసదాశివరెడ్డి, టీ శ్రవణ్ కుమార్, ఈసీఈ డిపార్టుమెంట్ హెచ్ఏడీ ప్రిన్సిపాల్ అంజాన్ షేక్, మహిళా కళాశాల ప్రిన్సిపాల్ నమ్రత మనోహర్, కే శ్రీధర్, కేఆర్ఎన్ ఠాగూర్ పవన్‌కుమార్, ప్రసాద్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
డీల్..!
వరంగల్, న్యూస్‌లైన్ : ఎన్పీడీసీఎల్లో వెలుగులోకి వస్తున్న అక్రమాలపై దూకుడు ప్రదర్శిస్తున్న సీఎండీ కార్తికేయ మిశ్రాను సాగనంపేందుకు డిస్కంలోని ఇంజినీర్లు పథకం పన్నారు. ఆయన బదిలీ కోసం కోట్లు ఖర్చు పెట్టేందుకు డీల్ కుదుర్చుకున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న అవినీతి బాగోతాలు ఎన్పీడీసీఎల్‌ను కుదిపేస్తున్నాయి. ఈ అక్రమాల్లో కంపెనీకి చెందిన పలువురు ఇంజినీర్లతోపాటు ఉన్నతస్థాయి సిబ్బంది వరకు పాత్ర ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణ చేపట్టగా... నివేదికలు తుది ద శకు చేరుకున్నాయి. పని చేసిన చోటల్లా అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువైంది. కంపెనీకి చెం దిన కోట్ల రూపాయలు దుర్వినియోగమైనట్లు తేటతెల్లమైంది. దీంతో అక్రమార్కులు తమకు తిప్పలు తప్పవనే ఉద్దేశంతో మిశ్రాను బదిలీ చేసే పనిలో ప డ్డారు. ఏకంగా ఓ కేంద్ర మంత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎండీని ఇక్క డి నుంచి బదిలీ చేస్తే డబ్బుల సంచులను బహుమానంగా ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. ఎందుకంటే... ఇటీవల వెలుగులోకి వచ్చిన కేబుల్ కుంభకోణం ఎన్పీడీసీఎల్‌ను కుదిపేసింది. దీంతో సీఎండీ కార్తికేయ మిశ్రా విచారణ బాధ్యతలను థర్డ్ పార్టీకి అప్పగించారు. మీటర్ల కొనుగోలు, అధిక ధరలకు దిగుమతి చేసుకోవడం.. వంటి తదితర అంశాలను పూర్తిస్థాయిలో వెలికి తీసే పనిలో పడ్డారు. కొనుగోలు చేసిన ప్రతి వస్తువు బిల్లులను తనిఖీ చేసేందుకు సిద్ధమయ్యూరు. అంతేకాదు... కింది స్థాయిలో విధులను నిర్లక్ష్యం చేసిన వారిపైనా కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన డీఈల బదిలీల్లో ఈ మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని బదిలీ చేసినట్లు సంస్థ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో సీఎండీ కార్తికేయ మిశ్రా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుమిత్ర కార్యక్రమంలో కూడా అవినీతి జరిగినట్లు తెలుస్తోంది. కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. ట్రాన్స్ఫార్మర్లకు మైనర్ మరమ్మతులు వచ్చినా... వాటిని మేజర్‌గా చూపించి కాంట్రాక్టర్లతో కలిసి బిల్లులు విడుదల చేశారని సీఎండీకి ఫిర్యాదులు సైతం అందాయి. ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్న మిశ్రా కఠిన నిర్ణయూలకు వెనుకాడడం లేదు. అన్నింటిపైనా క్రమక్రమంగా విచారణ చేపట్టాలని ఆదేశాలిచ్చారు. రైతుమిత్ర, బిల్ కలెక్షన్లు, విద్యుత్ సరఫరాపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇది ఇంజినీర్లకు మింగుడు పడడం లేదు. అంతేకాకుండా చాలా ఏళ్ల తర్వాత ఎన్పీడీసీఎల్కు ఐఏఎస్ అధికారి సీఎండీగా రావడంతో సీనియర్లంతా అయిష్టంగానే ఉన్నారు. ఐఏఎస్‌లు లేకపోవడం, తమతో పనిచేసిన ఇంజినీర్లు సీఎండీగా ఉండడంతో వారిదే ఇష్టారాజ్యం. తాము అడిందే ఆట.. పాడిందే పాటగా పలు యూనియన్లు చక్రం తిప్పాయి. ఇప్పుడా పరిస్థితి లేదు... దీంతో ఆయనను ఈపీడీసీఎల్‌కు సాగనంపేందుకు ఓ ఇంజినీరింగ్ అసోసియేషన్ నేతలు రాష్ర్టస్థాయిలో రంగంలోకి దిగారు. ఈ విషయం సీఎండీ కార్తికేయ మిశ్రా దృష్టికి సైతం వెళ్లినట్లు తెలిసింది.