నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) తరహాలో తమకూ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది.
సాక్షి, హైదరాబాద్: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్(ఎన్‌టీపీసీ) తరహాలో తమకూ వేతనాలు ఇవ్వాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేసింది. ట్రాన్స్‌కో సీఎండీ సురేష్‌చందాను కలిసి సంఘం అధ్యక్షుడు శివాజీ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం యాజమాన్యం ఇవ్వచూపుతున్న 22 శాతం ఫిట్‌మెంట్ తమకు సమ్మతం కాదన్నారు. ఎన్‌టీపీసీ తరహాలో వేతనాలు, 33 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలన్నారు. తమ డిమాండ్ల కోసం మంగళవారం నుంచి విద్యుత్ సౌధలో ధర్నా చేపట్టనున్నట్టు ప్రకటించారు.