సాక్షి,హైదరాబాద్:కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో లోపాలపై సంబంధిత ఇంజినీర్ల మీద తెలంగాణ ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నివేదిక ఆధారంగా ఇద్దరు ఇంజినీర్లకు నోటీసులు జారీ చేసింది.
బ్యారేజీ పనులు పూర్తికాకున్నా సర్టిఫికెట్లు ఇచ్చిన ఇంజినీర్లు రమణారెడ్డి,తిరుపతి రావులకు నోటీసులు విజిలెన్స్ నోటీసులిచ్చింది. నోటీసులపై పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో మొత్తం ఇరవై మందికిపైగా ఇంజనీర్లు తప్పులు చేసినట్లు విజిలెన్స్ నివేదికలు పేర్కొన్నాయి.
2023అసెంబ్లీ ఎన్నికలకు కొద్దిరోజుల ముందు మేడిగడ్డ బ్యారేజీలో పెద్దశబ్దంతో పగుళ్లు ఏర్పడ్డ విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు, లోపాలపై జ్యుడీషియల్ కమిషన్ విచారణ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.
ఇదీ చదవండి: రేవంత్ ప్రజలకు క్షమాపణ చెప్పాల్సిందే
Comments
Please login to add a commentAdd a comment