సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు లభించాయి. కమిషన్ ఎదుట కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వర్లు నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్‌కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు కమిషషన్ ఎదుట డాక్యుమెంట్ల దాఖలు చేశారు. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినేట్స్ డాక్యుమెంట్స్ దాఖలు చేశారు. దీంతో కమిషన్ వద్దకు అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్స్, జియోటెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల ఆధారాలు వచ్చాయి.
మూడు బ్యారేజీల వివరాలను వెంకటేశ్వర్లు కమిషన్‌కు అందించారు. కమిషన్ బహిరంగ విచారణలో మేడిగడ్డ బ్లాక్ సెవెన్ ఘటన ప్రస్తావనకు రాగా.. ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయింది కదా అని కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డతో పాటు మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది. అయితే నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెయిల్ వాటర్, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా డామేజ్ అయిందని, మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆదేశించారని వెంకటేశ్వర్లు తెలిపారు.
బ్యారేజీలకు ఒరిజినల్ ఎస్టిమేషన్ ప్రారంభంలో మేడిగడ్డ రూ, 2591 కోట్లు, అన్నారం 1785 కోట్లు, సుందిళ్ల 1437 కోట్లు అని చెప్పారు. మూడు బ్యారేజీలు పూర్తి అయ్యేసరికి మేడిగడ్డ 4613 కోట్లు, అన్నారం 2700 కోట్లు, సుందిళ్ల 2200 కోట్లకు పెరిగినట్లు చెప్పారు వెంకటేశ్వర్లు. కాగా వెంకటేశ్వర్లను అక్టోబర్ 24న కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. బ్యారేజీల డీపీఆర్, నీటి నిల్వ గురించి ప్రశ్నించింది.
ప్రభుత్వానికి చేరిన మెడిగడ్డ పై విచారణ విజిలెన్స్ రిపోర్ట్
రిపోర్ట్‌ను పరిశీలిస్తున్న ప్రభుత్వం
రెండు మూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వనున్న సర్కార్.
అధికారుల తప్పిదాలు ఉన్నట్లు ఇప్పటికే తాత్కాలిక రిపోర్ట్
విజిలెన్స్ రిపోర్ట్ పరిశీలన తరువాత ఐఎఎస్ అధికారులను పిలువనున్న కమిషన్
Comments
Please login to add a commentAdd a comment