enquiry commissions
-
కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విచారణలో కీలక ఆధారాలు లభించాయి. కమిషన్ ఎదుట కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్ (ఈఎన్సీ) వెంకటేశ్వర్లు నేడు మరోసారి విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా డీపీఆర్ ఎస్టిమేట్ డాక్యుమెంట్‌కు మాజీ కేసీఆర్ ఆమోదం తెలిపినట్లు కమిషషన్ ఎదుట డాక్యుమెంట్ల దాఖలు చేశారు. కాళేశ్వరం డిజైన్లు, డ్రాయింగ్స్ కేసీఆర్ ఫైనల్ చేయమని చెప్పినట్లు మినేట్స్ డాక్యుమెంట్స్ దాఖలు చేశారు. దీంతో కమిషన్ వద్దకు అన్నారం ఆక్సిస్ చేంజ్ డాక్యుమెంట్స్, జియోటెక్నికల్ ఫౌండేషన్ టెస్టుల ఆధారాలు వచ్చాయి.మూడు బ్యారేజీల వివరాలను వెంకటేశ్వర్లు కమిషన్‌కు అందించారు. కమిషన్ బహిరంగ విచారణలో మేడిగడ్డ బ్లాక్ సెవెన్ ఘటన ప్రస్తావనకు రాగా.. ఆపరేషన్ అండ్ మైంటెనెన్స్ కారణంగానే మేడిగడ్డ డ్యామేజ్ అయింది కదా అని కమిషన్ ప్రశ్నించింది. మేడిగడ్డతో పాటు మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని ఎవరు ఆదేశించారని ప్రశ్నించింది. అయితే నాన్ అవైలబిలిటీ ఆఫ్ టెయిల్ వాటర్, ఆపరేషన్ ఆఫ్ గేట్స్ కారణంగా డామేజ్ అయిందని, మూడు బ్యారేజీలలో నీళ్లను నింపమని హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆదేశించారని వెంకటేశ్వర్లు తెలిపారు.బ్యారేజీలకు ఒరిజినల్ ఎస్టిమేషన్ ప్రారంభంలో మేడిగడ్డ రూ, 2591 కోట్లు, అన్నారం 1785 కోట్లు, సుందిళ్ల 1437 కోట్లు అని చెప్పారు. మూడు బ్యారేజీలు పూర్తి అయ్యేసరికి మేడిగడ్డ 4613 కోట్లు, అన్నారం 2700 కోట్లు, సుందిళ్ల 2200 కోట్లకు పెరిగినట్లు చెప్పారు వెంకటేశ్వర్లు. కాగా వెంకటేశ్వర్లను అక్టోబర్ 24న కూడా కాళేశ్వరం కమిషన్ విచారించింది. బ్యారేజీల డీపీఆర్, నీటి నిల్వ గురించి ప్రశ్నించింది.ప్రభుత్వానికి చేరిన మెడిగడ్డ పై విచారణ విజిలెన్స్ రిపోర్ట్రిపోర్ట్ను పరిశీలిస్తున్న ప్రభుత్వంరెండు మూడు రోజుల్లో కాళేశ్వరం కమిషన్ కు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వనున్న సర్కార్.అధికారుల తప్పిదాలు ఉన్నట్లు ఇప్పటికే తాత్కాలిక రిపోర్ట్విజిలెన్స్ రిపోర్ట్ పరిశీలన తరువాత ఐఎఎస్ అధికారులను పిలువనున్న కమిషన్ -
మాజీ ఈఎన్సీకి కాళేశ్వరం కమిషన్ కీలక ఆదేశాలు
సాక్షి,హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు మాజీ ఇంజినీర్‌ఇన్‌చీఫ్(ఈఎన్సీ) వెంకటేశ్వర్లుకు కాళేశ్వరం విచారణ కమిషన్ ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిర చేసింది. వెంకటేశ్వర్లు శుక్రవారం(అక్టోబర్ 25) కమిషన్ ముందు వరుసగా రెండోరోజు విచారణకు హాజరయ్యారు. రెండు రోజుల విచారణలో భాగంగా కమిషన్ మాజీ ఈఎన్సీని రెండు వందలకుపైగా ప్రశ్నలు అడిగింది. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పని ఈఎన్సీ జవాబులు డ్యాక్యుమెంట్ల రూపంలో అందిస్తానని కమిషన్‌కు తెలిపారు. దీంతో సోమవారం విచారణకు వచ్చేటపుడు డాక్యుమెంట్స్ తీసుకురావాలని కమిషన్ ఆదేశించింది. వెంకటేశ్వర్లు బీఆర్ఎస్ హయాంలో కాళేశ్వరం ఈఎన్సీగా పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం నిర్మాణంలో అక్రమాలపై విచారణకు కమిషన్ వేసిన విషయం తెలిసిందే.ఇదీ చదవండి: భూదాన్ భూముల భాగోతం.. ఐఏఎస్‌పై ఈడీ ప్రశ్నల వర్షం -
బద్లాపూర్ ఎన్కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దిలీప్ భోసలేతో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటి మూడు నెలల్లోగా ఎన్కౌంటర్ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించనుంది.Maharashtra Government forms a 1-member inquiry committee of retired High Court judge Dilip Bhosale, into the encounter of Badlapur sexual assault accused Akshay Shinde. The commission will submit the report within 3 months.— ANI (@ANI) October 2, 2024 నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ ఘటన ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అదేవిధంగా ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.చదవండి: నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్ -
‘భారత్ జోక్యం లేదు’.. కెనడాకు విచారణ కమిషన్ షాక్
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో.. తమ దేశ ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని ఆరోపణలు చేయటంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని అక్కడి ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటంతో ప్రధాని జస్టిన్ ట్రూడ్ సీనియర్ అధికారులతో కూడిన విచారణ కమిషన్ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా ఆ విచారణ కమిషన్ కీలక విషయాలు వెల్లడించింది. కెనడా ఎన్నికల్లో భారత్ అసలు జోక్యం చేసుకోలేదని తేల్చి చెప్పింది. ‘2021 కెనడా ఎన్నికల్లో భారత ప్రభుత్వం జోక్యం చేసుకున్నట్లు ఆధారాలు లేవు. ఎలాంటి సాక్ష్యాలు మా దృష్టికి రాలేదు’ అని ఎన్నికల అధికారి దర్యాప్తు కమిషన్‌కు వెల్లడించారు. అయితే గతంలో జరిగిన రెండు కెనడా ఎన్నికల్లో మాత్రం చైనా జోక్యం చేసుకుందని కెనడా ఇంటెలిజెన్స్ ఎజెన్సీ కనుకున్నట్లు విచారణ కమిషన్ వెల్లడించింది. ఇక.. 2019, 2121 కెనడా ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకుందని కెనడా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెర్వీసెస్(సీఎస్ఐఎస్) ఆరోపణలు చేసింది. దీంతో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై ప్రతిపక్షాలు దర్యాప్తు చేయాలని ఒత్తిడి పెంచాయి. ఈ వ్యవహారంపై ప్రధాని జస్టిన్ ట్రూడో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో జోక్యం చేసుకున్నట్లు చైనాతో పాటు భారత్ పేరు కూడా ప్రధాని ట్రూడో చేర్చారు. కెనడా చేస్తున్న ఆరోపణలపై భారత్ తీవ్రంగా ఖండించింది. ‘కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకుందని దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేసినట్ల మీడియా ద్వారా తెలిసింది. ఆ ఆరోపణలను భారత్ తీవ్రంగా ఖండిస్తుంది. కెనడా చేస్తున్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదు’ అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి రణ్‌దీర్ జైశ్వాల్ ఫిబ్రవరిలో స్పష్టం చేశారు. ఇతర దేశాల ప్రజాస్వామ్య ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవటం భారత్ విధానం కాదన్నారు. కెనడానే తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చుతోందని మండిపడ్డారు. -
అమ్మ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది
సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (అమ్మ) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆమె నెచ్చెలి శశికళ ఓ అఫిడవిట్లో తెలిపారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులను విచారిస్తున్న ఆరుముగసామి కమిషన్‌కు శశికళ తరఫు లాయర్ సమర్పించిన ఆ అఫిడవిట్ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాక జయలలిత తీవ్ర మనోవేదనకు గురయ్యారని శశికళ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందనీ, 2016 సెప్టెంబరు 22న రాత్రి బాత్రూంలో పడిపోవడంతో డాక్టర్ శివకుమార్‌ను పిలిపించానని తెలిపారు. అపోలో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే జయ స్పృహలోకి వచ్చి, ఆస్పత్రికి వద్దే వద్దని కోప్పడ్డారని పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి, చికిత్స జరిపిన వైద్యులు, డిసెంబరు ఐదు వరకు ఆమెను ఎవరెవరు పరామర్శించారు తదితర వివరాలను ప్రమాణ పత్రంలో పొందుపరిచారు. గవర్నర్ విద్యాసాగర్ రావు, భద్రత అధికారులు వీర పెరుమాళ్ స్వామి, పెరుమాళ్ స్వామి, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, కార్మిక మంత్రి నిలోఫర్ కబిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితరులు జయలలితను పరామర్శించిన వారిలో ఉన్నట్లు వివరించారు. డిసెంబరు నాలుగో తేదీన ‘జై హనుమాన్’ సీరియల్ చూసిన కాసేపటికే ఆమెలో వణుకుడును పుట్టిందనీ ఆ మరుసటి రోజే చనిపోయారని తెలిపారు. -
కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే
విజయవాడ: టీడీపీ ప్రభుత్వ హయాంలో బెజవాడ కనకదుర్గమ్మకు ఎప్పుడూ అపచారమే జరుగుతోందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో దుర్గమ్మ నగలు దొంగతనం జరిగితే వాటి స్థానంలో నకిలీ వస్తువులు పెట్టారు.. ఇపుడు ఆలయంలో తాంత్రిక పూజలు చేశారని తెలిపారు. ఆ పూజలు మీ అనుమతి లేకుండా చేశారా.. ఎవరి కోసం చేశారో చెప్పాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబును నిలదీశారు. తాంత్రిక పూజలపై దొంగే దొంగ అన్నట్లుగా ఉందంటూ ఈ పూజలపై విచారణ అంటున్న ప్రభుత్వం గతంలో వేసిన విచారణ కమిటీల నివేదికలపై తీసుకున్న చర్యలేమిటో ప్రజలకు తెలపాలన్నారు. తాంత్రిక పూజలు భక్తులు మనోభావాలను దెబ్బతీశాయన్నారు. మీ విచారణల మీద ప్రజలకు నమ్మకం లేదని, అందువల్ల హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రఘువీరా డిమాండ్ చేశారు. కాగా, గత నాలుగు విడతల జన్మభూమి కార్యక్రమాల్లో ఇచ్చిన హామీలకే దిక్కులేదు.. మళ్లీ ఇపుడు జన్మభూమి నిర్వహిస్తున్నారు.. దీనివల్ల ఏ ఒక్కరికీ ఉపయోగం లేదన్నారు. జన్మభూమి, టీడీపీ కార్యక్రమాలకు ఉపాధ్యాయులు, విద్యార్థులను ఉపయోగించడం సబబుకాదన్నారు. పులివెందులలో మైక్ ఇవ్వకుండా చంద్రబాబు ఎంపీని అవమానించారన్నారు. ప్రైవేట్ వ్యక్తులు జన్మభూమి కార్యక్రమంలో ఎక్కవ కనిపిస్తున్నారని, పోలీస్ పహరాలోనే ఈ కార్యక్రమం జరుగుతోందని రఘువీరా విమర్శించారు. -
విచారణ కమిషన్ ముందుకు మాజీ సీఎస్
సాక్షి ప్రతినిధి, చెన్నై: జయలలిత మరణంపై తమిళనాడు ప్రభుత్వం నియమించిన విచారణ కమిషన్ ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామమోహన్‌రావు హాజరయ్యారు. జయలలిత సీఎంగా ఉన్న కాలంలో ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. గురువారం కమిషన్ కార్యాలయానికి వచ్చి కమిషన్ చైర్మన్ ముందు హాజరయ్యారు. స్పృహలో ఉన్న స్థితిలోనే జయ ఆస్పత్రికి వచ్చారా? అడ్మిట్ చేయడానికి అసలుకారణాలేంటి? చికిత్సకు సంబంధించి తప్పుల తడకలుగా బులెటిన్లు ఎందుకు విడుదల చేశారు? తదితర ప్రశ్నలు వేసినట్లు సమాచారం. -
అమ్మ మరణంలో సంచలన కొత్త కోణం
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీపై జరుగుతున్న విచారణ మరో మలుపు తిరిగింది. ప్రభుత్వం తరపున నియమితులైన తామే ఆస్పత్రిలో ఉన్న జయను చూడలేక పోయామని విచారణ కమిషన్ ముందు వైద్య బృందం చెప్పుకొచ్చింది. 75 రోజుల పాటు ప్రత్యేక గదికే పరిమితమై, సాయంకాలం వరకు కాలక్షేపం చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. స్వల్ప అనారోగ్య కారణాలతో గత ఏడాది సెప్టెంబర్ 22వ తేదీన చెన్నై అపోలో ఆస్పత్రిలో చేరారు. అమ్మకు జరుగుతున్న చికిత్సను పర్యవేక్షించేందుకు ఐదుగురితో కూడిన ప్రభుత్వ వైద్యుల బృందాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 75 రోజుల తర్వాత డిసెంబర్ 5న జయలలిత కన్నుమూశారు. దీనిపై ప్రతిపక్షాలు న్యాయవిచారణకు పట్టుపట్టడంతో గత ఏడాది సెప్టెంబర్ 25న ప్రత్యేక కమీషన్ ఏర్పాటు అయింది. ఇప్పటి వరకు 27 మంది తమ వాంగ్మూలాన్ని ఇచ్చారు. ఇందులో భాగంగా మరో వందమందికి పైగా ఫిర్యాదులతో కూడిన వినతిపత్రాలు సమర్పించగా వీరికి సైతం సమన్లు పంపాల్సిందిగా ఆర్ముగస్వామి తన సిబ్బందిని ఆదేశించారు. ఈ నెల 12వ తేదీన ఆక్యుపంచర్ వైద్యుడు శంకర్, 13న జయ మేనకోడలు దీప, 14న దీప సోదరుడు దీపక్, 20న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి షీలా బాలకృష్ణన్, 21న ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మెహన్‌రావు హాజరయ్యేలా సమన్లు వెళ్లాయి. గదికే పరిమితం కమిషన్ విచారణలో భాగంగా గురువారం చైర్మన్‌గా ఆర్ముగస్వామి ముందు వాంగ్మూలం ఇచ్చిన ప్రభుత్వ వైద్యుల బృందం కొత్త విషయాలను బైటపెట్టింది. వైద్యుల బృందం ఏర్పాటైంది. ఈ బృందం కో ఆర్డినేటర్ డాక్టర్ బాలాజీ, ఇతర నలుగురు వైద్యులను కమిషన్ వేర్వేరుగా విచారణ జరిపింది. తిరుప్పరగున్రం, తంజావూరు, అరవకురిచ్చి ఉప ఎన్నికల్లో బీఫాం కోసం శశికళ సమక్షంలో తానే జయ వేలిముద్రలు సేకరించానని, ఆ సమయంలో మరెవ్వరూ లేరని బాలాజీ వాంగ్మూలం ఇచ్చారు. అయితే ఆదే బృందంలోని మిగిలిన నలుగురు వైద్యులు మరో కోణాన్ని ఆవిష్కరించారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తాము ఒక్కసారి కూడా జయలలితను నేరుగా చూడలేదని, తమ కళ్లెదురుగా సీటీస్కాన్‌కు తీసుకెళ్లినపుడు సైతం ఆమె చుట్టూ కర్టెన్ కట్టారని తెలిపారు. అపోలో ఆస్పత్రిలో తమ నలుగురికీ కనీసం టీవీ కూడా లేని ఒక ప్రత్యేక గదిని కేటాయించారని చెప్పారు. గది నుంచి అప్పుడప్పుడూ బయటకు వదులుతారని, ఆ సమయంలో జయకు జరుగుతున్న చికిత్సపై విడుదల చేస్తున్న బులెటిన్‌ను తమకు చదివి వినిపిస్తారని అన్నారు. ప్రతిరోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకు గదిలో కూర్చుని వెళ్లిపోవడం మినహా చేసింది ఏమీ లేదని వారు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం. ప్రభుత్వం నియమించిన ఐదుగురు వైద్యుల బృందంలో బాలాజీ ఒక్కరు మాత్రమే జయ వద్దకు వెళ్లడం, మిగిలిన వారిని దూరంగా పెట్టడంపై అనుమానాలు రేగాయి. ఈనెల 27వ తేదీన మరోసారి హాజరుకావాల్సిందిగా డాక్టర్ బాలాజీని కమిషన్ ఆదేశించింది. మాజీ సీఎస్‌లకు సమన్లు విచారణ పూర్తి చేసిన నివేదిక అందజేసేందుకు మరో ఆరునెలల గడువు ఇవ్వాల్సిందిగా విచారణ కమిషన్ శుక్రవారం ప్రభుత్వానికి లేఖ రాసింది. సెప్టెంబర్ 25వ తేదీన కమిషన్ ఏర్పాటు సమయంలోనే ప్రభుత్వం మూడునెలల గడువు విధించింది. ఆర్ముగస్వామి బాధ్యతల స్వీకరణలోనే (అక్టోబర్ 24) నెలరోజుల జాప్యం ఏర్పడింది. ఆ తరువాత విచారణ వేగవంతంగా సాగుతున్నా ఈనెల 24వ తేదీతో ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగుస్తుంది. ఇంకా పలువురిని విచారించాల్సి ఉన్నందున మరో ఆరునెలలకు గడువు పొడిగించాల్సిందిగా కోరుతూ ప్రభుత్వానికి లేఖ రాసింది. -
మిస్టరీ.. హిస్టరీ!
32 ఏళ్లలో 19 విచారణ కమిషన్లు అన్నీ అవాంఛనీయ సంఘటనలకు ఇదే మంత్రం తాజాగా జయలలిత మృతిపైనా మరో విచారణ కమిషన్ రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ప్రజలను, ప్రతిపక్షాలను శాంతపరిచేందుకు విచారణ కమిషన్లు ఏర్పాటు చేయడమే ప్రభుత్వాల లక్ష్యంగా మారింది. 32 ఏళ్లలో ఇప్పటివరకు 19 విచారణ కమిషన్లను ప్రభుత్వాలు ఏర్పాటు చేశాయి. తాజాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణ మిస్టరీని ఛేదించేందుకంటూ ఎడపాడి ప్రభుత్వం మరో కమిషన్‌ను ప్రకటించడం గమనార్హం. సాక్షి, చెన్నై: దాడులు, పోరాటాలు, తుపాకీ కాల్పులు, తొక్కిసలాటలో దుర్మరణాలు ఇలా రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా ప్రజలను, ప్రతిపక్షాలను శాంతింపజేసేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయడమే ప్రభుత్వాల ఏకైక మంత్రంగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకేల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కమిషన్ ఏర్పాటుతో కన్నీళ్లు తుడవడం మాత్రం షరామామూలుగా మారింది. ఇప్పటి వరకు ఏర్పాటైన 19 విచారణ కమిషన్ల వల్ల బాధితులకు ఎంతవరకు న్యాయం జరిగింది అనే ప్రధాన అంశాలు మాత్రం (ఏవో ఒకటి రెండు మినహా) వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోతున్నాయి. తాజాగా, దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి ప్రకటించి ఈ సంఖ్యను 20 కి పెంచారు. 1995 నుంచి 2017 ఆగస్టు వరకు రాష్ట్రంలో ఏర్పాటైన విచారణ కమిషన్ల వివరాలు ఇలా ఉన్నాయి. - దక్షిణాది జిల్లాల్లో 1995 జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో చోటు చేసుకున్న జాతి కలవరాలపై న్యాయమూర్తి నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్. - చెన్నై సెంట్రల్ జైల్లో 1999 నవంబర్‌లో జరిగిన ఘర్షణలో డిప్యూటీ జైలర్ జయకుమార్ సజీవ దహనం కాగా, ఈ సందర్భంగా జరిగిన తుపాకీ కాల్పుల్లో 11 మంది ఖైదీలు ప్రాణాలు విడిచారు. ఈ సంఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - మాంజోలైలో తేయాకు తోటల కార్మికుల కూలీల సమస్యపై నిర్వహించిన ఊరేగింపులో ఘర్షణలు చోటు చేసుకోగా, పోలీసులు లాఠీచార్జి చేశారు. ఈ సమయంలో తామరభరణి చెరువులో మునిగిపోయి 17 మంది మృత్యువాతపడ్డారు. దీనిపై 1999లో న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - చెన్నైలోని డాక్టర్ అంబేడ్కర్ లా కళాశాల హాస్టల్లోకి 2001లో పోలీసులు చొరబడి దాడికి పాల్పడిన సంఘటనపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - డీఎంకే అధ్యక్షుడు కరుణానిధిని 2001లో అర్ధరాత్రి అరెస్టు చేయడంపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అరెస్టును నిరసిస్తూ 2001 ఆగస్టులో నిర్వహించిన ర్యాలీలో ఐదుగురు మరణించారు. ఈ సందర్భంగా చోటు చేసుకున్న విధ్వంసాలపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - సమ్మెకు దిగిన 1,70,241 మంది ప్రభుత్వ ఉద్యోగులను 2001లో అప్పటి అన్నాడీఎంకే ప్రభుత్వం విధుల నుంచి శాశ్వతంగా తొలగించడంపై ముగ్గురు రిటైర్డు న్యాయమూర్తులచే విచారణ కమిషన్ - మదురై మేలూరు ప్రభుత్వ కళాశాలలో 2002లో విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలపై న్యాయమూర్తి సుబ్రహ్మణ్యం నేతృత్వంలో విచారణ కమిషన్. ఈ విచారణ కమిషన్ మాత్రమే పోలీసులను తప్పుపట్టడంతో పాటు, కళాశాలనే మరో చోటుకు మార్చాలని సిఫార్సు చేసింది. - అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో వెంకటేశ పన్నయార్ అనే వ్యక్తి పోలీసు ఎన్కౌంటర్లో మృతి చెందడంపై న్యాయమూర్తి రామన్ నేతృత్వంలో విచారణ కమిషన్. - కుంభకోణం పాఠశాలలో దారుణ అగ్నిప్రమాదంపై న్యాయమూర్తి నేతృత్వంలో 2004లో విచారణ కమిషన్. - చెన్నై ఎంజీఆర్ నగర్లో 2005 ఆఖరిలో వరద నివారణ పంపిణీలో తొక్కిసలాట జరిగి 42 మంది మృతి చెందిన సంఘటనపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - చెన్నై ప్రభుత్వ న్యాయకళాశాలలో 2008లో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - జయలలిత విశ్రాంతి కోసం నిర్మాణం చేసిన సిర్ధాఊరు బంగళా నిర్మించిన స్థలం అన్నాదురై పాలన కాలంలో దళితులకు పంపిణీ చేసిన పట్టా భూమి అని, అప్పట్లో కమ్యూనిస్టులు పోరాడారు. దీనిపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - సేలంలోని ఓమలూరు పాతిమా పాఠశాలలో సుకన్య అనే విద్యార్థిని అనుమానాస్పద మృతిపై న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ - టెలిఫోన్లో ఓట్ల ప్రచారంపై 2010లో న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - కొత్త సచివాలయం నిర్మాణం గురించి విచారణ కోసం 2011లో ఏర్పాటైన కమిషన్ చైర్మన్‌గా రిటైర్డ్ న్యాయమూర్తి నియామకమయ్యారు. - మౌళివాక్కంలో 2014 జూన్‌లో బహుళ అంతస్థుల అపార్ట్మెంట్ కూలిపోయిన దుర్ఘటనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. - తమిళనాడులో ఇసుక క్వారీల దోపిడీపై హైకోర్టు ఆదేశాల ప్రకారం 2014లో ఐఏఎస్ అధికారి సహాయం నేతృత్వంలో విచారణ కమిషన్ - 2017 జనవరిలో జరిగిన జల్లికట్టు పోరాటం, ఆందోళనపై రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్. జయ మరణ మిస్టరీపైనా విచారణ కమిషన్ గత ఏడాది సెప్టెంబరు 22 వ తేదీన ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరారు. జ్వరం, డీహైడ్రేషన్ వల్ల స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. జయ కోలుకున్నారు, నేడో రేపో డిశ్చార్జ్ అంటూ అపోలో వైద్యులు, అన్నాడీఎంకే వర్గాలు నెలల తరబడి ప్రకటిస్తూ వచ్చాయి. అయితే 74 రోజుల పాటు చేసిన ప్రకటనలకు పూర్తి భిన్నంగా.. జయలలిత కన్నుమూసినట్లుగా డిసెంబర్ 5వ తేదీన చావుకబురు చల్లగా చెప్పారు. అభిమానులు, ప్రజలు, ప్రతిపక్షాలు అమ్మ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశాయి. న్యాయవిచారణ, సీబీఐ విచారణ కోరుతూ డిమాండ్లు చేశారు. ఎవరెంత గీ పెట్టినా రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపలేదు. ఎడపాడి, పన్నీర్ వర్గాలు ఏకం కావాలని ప్రధాని ఒత్తిడి, శశికళ కుటుంబాన్ని దూరం పెట్టాలని పన్నీర్ సెల్వం షరతు, పార్టీపై పట్టు కోసం టీటీవీ దినకరన్ దూకుడు పెంచి ప్రభుత్వ మనుగడకే ముప్పువాటిల్లే తరుణంలో జయ మరణంపై రిటైర్డు న్యాయమూర్తిచే విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ఎడపాడి పళనిస్వామి గురువారం సాయంత్రం అకస్మాత్తుగా ప్రకటించడం గమనార్హం. జయ మరణంలో చోటుచేసుకున్న అనుమానాలను నివృత్తి కోసమేనా లేదా రాజకీయ ప్రయోజనాలకా అనే ప్రశ్నకు సమాధానం కోసం కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.