బద్లాపూర్‌ ఎన్‌కౌంటర్‌: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం | maha Govt sets up commission for probe Badlapur accused | Sakshi
Sakshi News home page

బద్లాపూర్‌ ఎన్‌కౌంటర్‌: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

Published Wed, Oct 2 2024 3:51 PM | Last Updated on Wed, Oct 2 2024 5:12 PM

maha Govt sets up commission for probe Badlapur accused

ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాపూర్‌’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్‌ షిండే  ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దిలీప్ భోసలేతో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటి మూడు నెలల్లోగా ఎన్‌కౌంటర్‌ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించనుంది.

 

నిందితుడు అక్షయ్‌ షిండే ఎన్‌కౌంటర్‌ ఘటన ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు  ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే  ప్రభుత్వం.. దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అదేవిధంగా ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement