Badlapur
-
బద్లాపూర్ ఎన్కౌంటర్: మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఇటీవల పోలీసుల ఎదురుకాల్పుల్లో మృతి చెందాడు. ఈ ఘటనకు సంబంధించి తాజాగా నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి దిలీప్ భోసలేతో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటి మూడు నెలల్లోగా ఎన్కౌంటర్ ఘటనపై పూర్తి నివేదిక సమర్పించనుంది.Maharashtra Government forms a 1-member inquiry committee of retired High Court judge Dilip Bhosale, into the encounter of Badlapur sexual assault accused Akshay Shinde. The commission will submit the report within 3 months.— ANI (@ANI) October 2, 2024 నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ ఘటన ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే ప్రభుత్వం.. దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. అదేవిధంగా ఈ ఎన్‌కౌంటర్‌పై విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.చదవండి: నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్ -
నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్
ముంబై : బద్లాపుర్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడు అక్షయ్ షిండేది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్ని మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. నిందితులు పోలీసులపై కాల్పులు జరుపుతుంటుంటే చప్పట్లు కొట్టరు కదా అని ప్రశ్నించారు.విపక్షాలు చేస్తున్న విమర్శలపై దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. బద్లాపుర్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడిని నుంచి ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు ఫడ్నవిస్ స్పష్టం చేశారు. అయితే ‘తాను ఎన్కౌంటర్లకు పూర్తి వ్యతిరేకమన్న ఫడ్నవీస్.. నిందితులు దాడులు చేస్తే పోలీసులు చప్పట్లు కొట్టరు’ కదా అని అన్నారు.పోలీసులపై అక్షయ్ షిండే దాడికి యత్నంబద్లాపుర్ పాఠశాలలో చిన్నారులపై లైంగిక దాడి ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో నిందితుడు అక్షయ్ షిండేపై అతడి మొదటి భార్య ఫిర్యాదు చేసింది.ఆ ఫిర్యాదుతో విచారించేందుకు నిందితుడిని తలోజా జైలు నుంచి బద్లాపుర్‌కు పోలీసులు బయలుదేరారు. ముంబ్రా బైపాస్కు చేరుకున్న సమయంలో పోలీసు వాహనంలో ఉన్న నిందితుడు అక్షయ్ షిండే తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మరణించాడు. పోలీసులుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఫడ్నవీస్‌ను కీర్తిస్తూ.. ఆ ఘటన తర్వాత ముంబైలోని పలు ప్రాంతాల్లో ఫడ్నవీస్‌ను అభినందిస్తూ హోర్డింగ్‌లు వెలిశాయి. ఈ హోర్డింగ్‌లలో ఫడ్నవీస్ తుపాకీని పట్టుకుని ఉండగా.. అందులో బద్లా పురా (ప్రతీకారం పూర్తి) అనే క్యాప్ష్ను జోడించారు. హోర్డింగ్‌లపై గురించి ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా..ఇలాంటి హోర్డింగ్‌లు పెట్టడం పూర్తిగా తప్పు. ఇలా హోర్డింగ్‌లు పెట్టకూడదు అని డిప్యూటీ సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. -
బద్లాపూర్ నిందితుడి ఎన్‌కౌంటర్‌ను సమర్థించిన సీఎం షిండే
ముంబయి:బద్లాపూర్ లైంగికదాడి కేసులో నిందితుడిని ఎన్‌కౌంటర్‌ను మహారాష్ట్ర సీఎం ఏకనాథ్‌షిండే సమర్థించారు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ సీఎం షిండే ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.‘నిందితుడి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో పోలీసులపై కాల్పులు జరిపాడు. ఆత్మరక్షణ కోసమే పోలీసులు తిరిగి కాల్పులు జరిపారు. ఇందులో తప్పేమీ లేదు’అని ఏక్‌నాథ్‌షిండే అన్నారు.కాగా, మహారాష్ట్ర బద్లాపూర్‌లోని ఓ పాఠశాల టాయిలెట్లో ఇద్దరు బాలికలపై లైంగిక దాడి జరిపిన కేసులో నిందితుడు అక్షయ్‌షిండేను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అక్షయ్‌షిండేను వాహనంలో తీసుకు వెళ్తుండగా అతడు పారిపోయేందుకు ప్రయత్నించి తమపై కాల్పులు జరిపాడని, ఇందుకు తాము తిరిగి జరిపిన కాల్పుల్లో నిందితుడు మరణించాడని పోలీసులు తెలిపారు.బద్లాపూర్ లైంగికదాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.ఇదీ చదవండి: బద్లాపూర్ నిందితుడి ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు -
బద్లాపూర్ నిందితుడి ఎన్కౌంటర్.. పోలీసులకు హైకోర్టు ప్రశ్నలు
ముంబై: బాద్లాపూర్ లైంగిక వేధింపుల నిందితుడి కస్టడీ మరణంపై బాంబే హైకోర్టు ముంబై పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిందితుడి ఎన్కౌంటర్ అనుమానాలకు తావిస్తోందని.. ఈ సంఘటనను ఎన్‌కౌంటర్‌గా పేర్కొనలేమని పేర్కొంది. నిందితుడు అక్షయ్ షిండేను జైలు నుంచి బయటకు తీసుకొచ్చినప్పటి నుంచి శివాజీ ఆస్పత్రిలో మరణించినట్లు ప్రకటించే వరకు సీసీటీవీ ఫుటేజీని తమకు సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.కాగా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బద్లాపూర్ పాఠశాలలో ఇద్దరు బాలికలపై లైంగిక దాడులకు పాల్పడిన కేసులో నిందితుడు పోలీసుల కాల్పుల్లో మృతి చెందిన విషయం తెలిసిందే. విచారణ సమయంలో నిందితుడు అక్షయ్ శిండేపై.. అతడి మొదటి భార్య వేధింపుల కేసు పెట్టింది.అయితే ఈ కేసులో ప్రశ్నించేందుకు పోలీసులు నిందితుడిని కారులో తీసుకొని తాలోజా జైలు నుంచి బద్లాపూర్ బయల్దేరారు. ఈ క్రమంలో పోలీస్ అధికారి చేతిలో నుంచి తుపాకీ లాక్కొని ఎస్కార్టింగ్ పోలీసు బృందంపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే పోలీసులు ఎదురుకాల్పులు జరపగా.. అతడు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.తీవ్రంగా గాయపడిన షిండేను ఛత్రపతి శివాజీ మహరాజ్ దవాఖానకు తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో ఏఎస్ఐ నీలేష్ మోరే, ఇన్స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారని చెప్పారు. అయితే ఇదంతా అబద్దమని, తన కొడుకునే పథకం ప్రకారమే హతమార్చారని ఆరోపిస్తూ నిందితుడు తండ్రి హైకోర్టును ఆశ్రయించారు.దీనిపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది.. ఈ సందర్భంగా పోలీసులకు న్యాయస్థానం పలు ప్రశ్నలు సంధించింది. నిందితుడు కాల్చిన ఆ రెండు బుల్లెట్లు ఎక్కడ..? అంటూ ప్రశ్నించింది. ‘ఇది నమ్మడం కష్టం. ప్రాథమికంగా ఫౌల్ ప్లే కనిపిస్తుంది. ఒక సామాన్యుడు రివాల్వర్ లాగా పిస్టల్‌ను కాల్చలేడు. ఏ టామ్, డిక్, హ్యారీ చేయగలడు, బలహీనమైన వ్యక్తి పిస్టల్‌ను లోడ్ చేయలేడు.’ పోలీసుల కథనాన్ని నమ్మడం కష్టంగా ఉంది. నిందితుడు పోలీసులపైకి మూడు బుల్లెట్లు కాల్చారని మీరు చెప్పారు. ఒక్కటే పోలీసులను తాకింది. మిగతా రెండు బుల్లెట్ల ఏమయ్యాయి. పోలీసు అధికారి సంజయ్ షిండే నిందితుడి తలపై కాకుండా కాళ్లు లేదా చేతులపై గురిపెట్టి ఉండాల్సింది. వాహనంలో ఉన్న నలుగురు అధికారులు ఒక్క వ్యక్తిని అధిగమించలేకపోయారంటే ఎలా నమ్మాలి? అతడేం భారీ మనిషికాదు. మీరు సులభంగానే అతడిని అడ్డుకొని ఉండొచ్చు. దీనిని ఎన్కౌంటర్ అని అనలేం. అలాగే ఇంతవరకు కేసు పత్రాలు సీఐడీకి ఎందుకు అప్పగించలేదు. ఏ దర్యాప్తులో అయినా సమయం కీలకం. ఆలస్యం అవుతుంటే ప్రజల్లో అనుమానాలు వస్తాయి’ అని కోర్టు ప్రశ్నించింది. పోలీసుల చర్యను అనుమానించడం లేదు కానీ నిజాన్ని తెలుసుకోవాలనుకుంటున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. -
బద్లాపూర్ నిందితుడు హతం: ఎన్కౌంటర్ వెనక కుట్ర?
ముంబై: మహారాష్ట్రలోని ‘బద్లాపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే ఎన్కౌంటర్ తీవ్ర దుమారం రేపుతోంది. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అక్షయ్‌ను.. ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా హతమార్చినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడు అక్షయ్ షిండే ఎన్‌కౌంటర్‌పై అతని తల్లి స్పందించారు. అక్షయ్‌ని చంపడానికి పోలీసులు చెప్పిన కారణాలను తోసిపుచ్చారామె. ఈ కేసులో పెద్ద కుట్రలో భాగంగా తన కుమారుడుని పోలీసులు హత్య చేసినట్లు ఆరోపించారు. ‘‘నా బిడ్డ అక్షయ్ షిండే హత్య పథకం ప్రకారం జరిగిన పెద్ద కుట్ర. పోలీసులే నా బిడ్డను హత్య చేశారు. ఈ ఘటనలో పోలీసులతో పాటు స్కూల్ యాజమాన్యాన్ని కూడా విచారించాలి. విచారణ జరిపి దోషులకు శిక్ష పడుతుందని హామీ ఇచ్చే వరకు నా కుమారుడి మృతదేహాన్ని తీసుకోవడానికి మేము అంగీకరించము’ అని అన్నారామె.#BadlapurSchoolSexualAssaultCase: Accused Shot Dead In Police Custody, Mother Alleges Conspiracy#DNAVideos For more videos, click here https://t.co/6ddeGFqM3o pic.twitter.com/2urBcFH6cY— DNA (@dna) September 24, 2024 క్రెడిట్స్: DNA (@dna)ఈ ఎన్కౌంటర్ ఘటన మహారాష్ట్రలో రాజకీయాల్లో దుమారం రేపుతోంది. అసెంబ్లీ ఎన్నికలు సమీస్తున్న వేళ ఈ కేసు విషయంలో కేవలం రాజకీయ సానుభూతి పొందేందుకు ఏక్నాథ్ షిండే ప్రభుత్వం దారుణంగా నిందితుడిని హత్య చేయించిందని ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ఈ కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసే ప్రయత్నమే నిందితుడిని ఎన్కౌంటర్ చేయించటమని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత విజయ్ వాడెట్టివార్ అన్నారు. ‘‘పోలీసులు అక్షయ్ షిండేను తీసుకువెళ్లే సమయంలో అతని చేతులు కట్టేయలేదా? అనికి తుపాకీని ఎలా లభించింది. పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు?. ఈ కేసులో స్కూల్ మేనేజ్మెంట్పై ఎటువంటి చర్యలు లేవు. కానీ అరెస్టు చేసిన నిందితుడిని మాత్రం ఆత్మ రక్షణ పేరుతో అనుమానాస్పద ఎన్కౌంటర్లో కాల్చి చంపారు. మాకు బద్లాపూర్ పోలీసులపై నమ్మకం లేదు. ఈ ఘటపై జ్యుడిషియల్ విచారణకు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని తీసుకువెళ్తున్న సమయంలో హోం శాఖ చూపిన నిర్లక్ష్యం సందేహాస్పదంగా ఉంది. ప్రభుత్వం బలహీనంగా మారినట్లు కనిపిస్తోంది’ అని ఎన్సీపి(ఎస్పీ) చెందిన ఓ నేత రాష్ట్ర హోం శాఖపై విమర్శలు గుప్పించారు.అయితే.. ప్రతిక్షాల ఆరోపణలపై సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ ముఖ్యమంత్రి మాఝీ లడ్కీ బహిన్ పథకం విజయవంతం చేసింది. ఈ పథకం విజయవంతం కావడంతో ప్రతిపక్షంలో ఉన్న మూడు పార్టీలు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నాయని అన్నారు.చదవండి: పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి -
పోలీసుల ఎదురుకాల్పుల్లో ‘బద్లాపూర్’ రేప్ నిందితుడి మృతి
ముంబై: మహారాష్ట్రలో ఆగస్ట్‌లో సంచలనం సృష్టించిన ‘బద్లాçపూర్’ బాలికలపై అత్యాచారం కేసులో నిందితుడు అక్షయ్ షిండే పోలీసుల ఎదురుకాల్పుల్లో చనిపోయాడు. నవీ ముంబైలోని తలోజా జైలు నుంచి థానె జిల్లాలోని బద్లాçపూర్ పట్టణానికి తీసుకొస్తుండగా పోలీసుల నుంచి పిస్టల్ లాక్కుని కాల్పులకు తెగబడిన అతడిని పోలీసులు క్షణాల్లో మట్టుబెట్టారు. సోమవారం సాయంత్రం 6.15గంటలకు ముంబ్రా బైపాస్ రోడ్డు వద్ద ఈ ఎదురుకాల్పుల ఘటన జరిగిందని పోలీసులు వెల్లడించారు. బద్లాçపూర్లోని ఓ స్కూల్లో స్వీపర్‌గా పనిచేస్తున్న 24 ఏళ్ల అక్షయ్ అక్కడి నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై లైంగికంగా దాడిచేశాడని ఆరోపణలు వెల్లువెత్తడం తెల్సిందే. విషయం తెల్సిన మరుక్షణం స్కూలు పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు, నిరసనకారులు వేలాదిగా ఆందోళన చేపట్టడం తెల్సిందే. ఎదురుకాల్పుల ఉదంతంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే విలేకరులతో మాట్లాడారు. ‘‘ అక్షయ్‌పై అతని మాజీ భార్య లైంగిక హింస కేసు పెట్టింది. ఈ కేసులో విచారణ నిమిత్తం తలోజా జైలు నుంచి ఇతడిని బద్లాçపూర్‌కు ఒక పోలీస్ ఎస్కార్ట్ బృందం తీసుకొస్తోంది. మార్గమధ్యంలో పోలీసు వాహనం ముంబ్రా బైపాస్ చేరుకోగానే పోలీస్ నుంచి పిస్టల్‌ను లాక్కొని నిందితుడు ఒక అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ నీలేశ్ మోరెపైకి 2–3 రౌండ్ల కాల్పులు జరిపాడు. హఠాత్ పరిణామం నుంచి తేరుకున్న మరో పోలీసు అధికారి వెంటనే తన తుపాకీతో అక్షయ్‌ను కాల్చాడు. రక్తమోడుతున్న ఇతడిని దగ్గర్లోని కల్వా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆత్మరక్షణ కోసం మాత్రమే పోలీసు ఇతనిపై కాల్పులు జరిపాడు’’ అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. -
అమ్మాయిలకే కాదు.. అబ్బాయిలకు తప్పొప్పులు నేర్పించాలి: బాంబే హైకోర్టు
ముంబై: బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో ఇద్దరు చిన్నారులపై లైంగిక వేధంపుల కేసులో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అబ్బాయిలకు చిన్నతనం నుంచే వారి ఆలోచన ధోరణిలో మార్పులు తీసుకురావాలని తెలిపింది. అమ్మాయిలను, మహిళలను గౌరవించడం నేర్పంచాలని సూచించింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని.. అందుకే మగపిల్లలకు చిన్నప్పటి నుంచే చెడు ప్రవర్తనపై అవగాహన కల్పించాలని జస్టిస్ రేవతి మోహితే దేరే, జస్టిస్ పృథివీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ సూచించింది.ద్లాపూర్లోని తమ పాఠశాలలో ఇద్దరు నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుపై సుమోటోగా స్వీకరించిన బాంబే హైకోర్టు..తాజాగా విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం మాట్లాడుతూ.. బాలురకు లింగ సమానత్వం, సున్నితత్వం గురించి అవగాహన కల్పించాలని తెలిపింది. సమాజంలో పురుషాధిక్యత కొనసాగుతోందని, పిల్లలకు సమానత్వం గురించి బోధించే వరకు ఏదీ మారదని పేర్కొంది.‘సమాజంలో పురుషాధిక్యత ఇప్పటికీ ఉన్నాయి. మన ఇంట్లో పిల్లలకు సమానత్వం గురించి చెప్పేంత వరకు ఏమీ జరగదు. అప్పటి వరకు నిర్భయ వంటి చట్టాలన్నీ పని చేయవు. మనంం ఎప్పుడూ అమ్మాయిల గురించే మాట్లాడుతుంటాం. అబ్బాయిలకు ఏది ఒప్పు, తప్పు అని ఎందుకు చెప్పకూడదు? అబ్బాయిల ఆలోచనా ధోరణిని చిన్నతనంలోనే మార్చాలి. మహిళలను గౌరవించడం నేర్పించాలి’ అని పేర్కొంది.కాగా గత వారం బద్లాపూర్‌లో కిండర్ గార్టెన్ విద్యార్థినులపై పాఠశాల అటెండర్ లైంగిక వేధింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది. రిటైర్డ్ పోలీసు, రిటైర్డ్ జడ్జి, రిటైర్డ్ అధ్యాపకుడు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యుడితో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. పాఠశాలల్లో ఈ ఘటనలను ఎలా అరికట్టాలనే దానిపై కమిటీ సిఫారసులతో ముందుకు రావలని తెలిపింది. -
జనం రోడ్డెక్కనిదే స్పందించరా?
ముంబై: మహారాష్ట్రలో థానే జిల్లాలోని బద్లాపూర్ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపులు దిగ్భ్రాంతికరమని బాంబే హైకోర్టు ఆవేదన వెలిబుచ్చింది. దారుణం జరిగిన నాలుగైదు రోజులకు ప్రజలు మూకుమ్మడిగా ఆందోళనకు దిగితే గానీ పోలీసులు స్పందించలేదంటూ మండిపడింది. ‘‘పసిబిడ్డలపై అఘాయిత్యం జరిగితే తేలిగ్గా తీసుకోవడమేమిటి? జనం ఆగ్రహంతో వీధుల్లోకి వస్తే తప్ప ప్రభుత్వ యంత్రాంగం ముందుకు కదలదా? అంటూ ఆగ్రహించింది.ఈ కేసులో బద్లాపూర్ పోలీసుల దర్యాప్తు సక్రమంగా లేదంటూ ఆక్షేపించింది. ‘‘బాధితులు ఫిర్యాదు చేశారు గనుక ఈ వ్యవహారం బయటకొచి్చంది. బయటకు రాని కేసులు ఎన్నో ఉండొచ్చు’’ అని అభిప్రాయపడింది. ‘‘పోలీసు వ్యవస్థ, న్యాయ వ్యవస్థ పట్ల ప్రజలు విశ్వాసం కోల్పోయే పరిస్థితి రాకూడదు. వారు న్యాయం కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేసే పరిస్థితి ఉండకూడదు’’ అని పేర్కొంది.‘‘పిల్లలకు స్కూళ్లలో కూడా భద్రత లేకపోతే ఏం చేయాలి? ఇక విద్యా హక్కు చట్టానికి అర్థమేమిటి?’’ అంటూ నిలదీసింది. ఎఫ్ఐఆర్ నమోదులో ఎందుకు జాప్యం జరిగిందని పోలీసులను ప్రశ్నించింది. ‘‘బాలికల భద్రతపై రాజీపడడానికి వీల్లేదు. వేధింపుల గురించి తెలిసినా పోలీసులకు ఫిర్యాదు చేయని స్కూలు యాజమాన్యంపై చర్యలు తీసుకోండి’’ అని ఆదేశించింది. 27లోగా నివేదిక సమర్పించండిబద్లాపూర్ పాఠశాలలో నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలికలపై జరిగిన అఘాయిత్యం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. స్కూల్ వాష్ రూమ్‌లో అటెండర్ వారిని లైంగికంగా వేధించినట్లు వెల్లడైంది. ఈ నెల 12, 13న దారుణం జరిగితే పోలీసులు 16న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 17న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై జస్టిస్ రేవతి మొహితే, జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్‌తో కూడిన బాంబే హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని గుర్తుచేసింది. బాలికలకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని, మరింత బాధకు గురిచేయొద్దని ఆదేశించింది. ఈ కేసులో 27వ తేదీలోగా నివేదిక సమర్పించాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. -
మహిళా జర్నలిస్ట్‌పై అసభ్య వ్యాఖ్యలు.. చిక్కుల్లో శివసేన షిండే వర్గం నేత
ముంబై: బద్లాపూర్‌లో చిన్నారులపై జరిగిన హత్యాచారాన్ని కవర్ చేస్తున్న ఓ మహిళా జర్నలిస్ట్‌పై శివసేన (షిండే) వర్గం నేత చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు వివాదాస్పదయ్యాయి. హత్యాచార ఘటనను కవర్ చేస్తున్న తనపై శివసేన (షిండే) వర్గం నేత వామన్ మాత్రే.. అసభ్య వ్యాఖ్యలు చేశారని స్థానిక టీవీలో పనిచేసే మహిళా జర్నలిస్టు తెలిపారు. ‘‘బాద్లాపూర్ మాజీ మేయర్ అయిన వామన్ మాత్రే నాపై చేసిన వ్యాఖ్యలు, ఆయన ప్రవర్తన ఆమోద యోగ్యం కాదు. ఆయన వ్యాఖ్యలు నాకు చాలా ఆగ్రహం కలిగించాయి. నేను నిజాల ఆధారంగానే హత్యాచార ఘటనను కవర్ చేశాను’’ అని మహిళా జర్నలిస్ట్ అన్నారు. అనంతరం వామన్ మాత్రే స్పందిసూ.. జర్నలిస్ట్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. మహిళా జర్నలిస్ట్ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో కుమ్మక్కు అయ్యారని అన్నారు. ‘‘ఇది ఆ మహిళా జర్నలిస్ట్ చేస్తున్న ఒక స్టంట్. ఆమె నాకు చాలా రోజుల నుంచి తెలుసు. ఆమె శివసేన(యూబీటీ)కి అనుకూలంగా పనిచేస్తారు. మీరు ఈ సంఘటనను రెండుమూడు రోజులుగా కవర్ చేస్తున్నారు. బాలికలపై దాడి జరిగిందా? లేదా? అనే దాని గురించి సరైన సమాచారాన్ని నివేదించాలని అడిగాను. అంతేకాని, నేను ఆమెతో అసభ్యంగా మాట్లాడలేదు’’ అని అన్నారు.మరోవైపు.. వామన్ మాత్రే చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిచాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. మాత్రే వ్యాఖ్యలను ముంబై ప్రెస్ క్లబ్ ఖండించింది. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేను కోరింది. ప్రజల సెంటిమెంట్‌ను, పత్రికా గౌరవాన్ని ఇలా నిర్లక్ష్యం చేయడం ఆమోదయోగ్యం కాదని ఒక ప్రకటనలో పేర్కొంది. -
ఫెయిర్ అండ్ యమి
ఇంట్లో టీవీ పెడితే యమి గౌతమ్ కనిపిస్తుంది. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్ లేని రోజు ఉంటుందా? యమి ఆ క్రీమ్ పూసుకుని మెరిసే సౌందర్యవతి. ఫెయిర్ అండ్ లవ్లీ మోడల్‌గా మాత్రమే కాదు నటిగా కూడా ఆమె బాలీవుడ్లో పై వరుసలో ఉంది. ఈ అందమైన జీవితంలోనూ సవాళ్లు ఉంటాయి. ప్రశ్నలు ఉంటాయి. వాటిని అధిగమిస్తూ యమి విజేతగా నిలిచింది. కొన్నేళ్ల క్రితం ఉదయం నాలుగ్గంటలకు యమి గౌతమ్ ఫోన్ మోగింది. చేసింది ఒక ప్రముఖ పత్రిక నుంచి జర్నలిస్ట్. ‘ఏంటి?’ అని అడిగింది యమి. ‘మీ మీద ట్రోలింగ్ జరుగుతోంది.. దీనికి మీ సమాధానం ఏమిటి?’ అని అడిగాడు జర్నలిస్ట్. అప్పటికి ట్రోలింగ్ అంటే ఏమిటో యమికి తెలియదు. ‘ట్రోలింగ్ అంటే?’ అని అడిగింది. ‘మిమ్మల్ని తిట్టి పోస్తున్నారు’ అన్నాడతను. ‘ఎందుకు?’ అని అడిగింది నెర్వస్‌గా. ఇంతలో ఫోన్ కట్ అయ్యింది. అభయ్ డియోల్ బాలీవుడ్లో పేరున్న నటుడు. తన ఫేస్బుక్ పేజిలో ఒక పోస్ట్ పెట్టాడు. ‘సినిమా తారలు అనవసరంగా కలరిజమ్ను ప్రచారం చేస్తున్నారు. తెల్లరంగే గొప్పది అనే ఈ ప్రచారం ఆ రంగు లేని వారందరినీ అవమానించే స్థాయిలో ఉంది. షారుక్‌ఖాన్, ఐశ్వర్యరాయ్, సోనమ్‌కపూర్, షాహిద్ కపూర్, జాన్ అబ్రహమ్... వీళ్లంతా తెల్లగా చేసే క్రీములంటూ ఫెయిర్‌నెస్ క్రీములను ప్రమోట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు’ అని పోస్ట్ పెట్టాడు. ఈ వరుసలో యమి పేరు కూడా ఉంది. ఎందుకంటే ఫెయిర్‌నెస్ క్రీముల్లో ఫెయిర్ అండ్ లవ్లీ అగ్రస్థానంలో ఉంది. దాని బ్రాండ్ అంబాసిడర్ యమి. దాంతో సోషల్ మీడియాలో యమి మీద విమర్శలు వెల్లువెత్తాయి. భిన్నమైన రంగులు ఉన్నవారిని న్యూనత పరిచే ఇటువంటి యాడ్స్‌లో నటించేవారికి కనీస ఆలోచన లేదని చాలామంది రాశారు. ఇలా జరుగుతుందని యమి ఊహించలేదు. దానికి ఎలా రియాక్ట్ కావాలో కూడా తెలియదు. ఆ రోజంతా వెక్కివెక్కి ఏడుస్తూ కూచుంది. అసలు ఇందుకేనా ఈ రంగంలోకొచ్చింది? ∙∙ యమికి పుస్తకం తప్ప అద్దం తెలియదు. పుస్తకమే తన అద్దం అన్నట్టుగా ఎప్పుడూ అందులోనే తల దూర్చి ఉండేది చిన్నప్పుడు. వాళ్లది హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్. తండ్రి ముకేష్ గౌతమ్ చిన్నస్థాయి పంజాబీ సినిమాల దర్శకుడు. ఆయన పంజాబీ. తల్లి అంజలి గౌతమ్ హిమాచల్ కొండజాతి మూలాలున్న స్త్రీ. యమి గౌతమ్ బాల్యం బిలాస్పూర్లో గడిచినా హైస్కూల్, కాలేజ్ చండీగఢ్‌లోనే సాగాయి. చిన్నప్పటి నుంచి చదువు మీదే ఆమె ధ్యాస. ఐ.ఏ.ఎస్ చేయాలనేది కల. స్కూలు సొంతదే అయినా ఆ స్కూల్లో ఆమె చాలా బిడియంగా తిరుగుతూ ఉండేది. నలుగురి ఎదుటకు రావడానికి చాలా సంకోచించేది. వాళ్ల తాతను ఇంప్రెస్ చేయడానికి ఒకసారి టీచర్లు యానివర్సరీ డేలో ఏదో కవిత చదివించాలని ప్రయత్నిస్తే యమి స్కూల్ వదిలి ఇంటికి పారిపోయింది. ఇలాంటి అమ్మాయిలకు చదువే కరెక్ట్ అని అనుకున్నారు అందరూ. కాని విధి వేరేగా ఆమె ప్రయాణాన్ని నిశ్చయించింది. అలా స్కూల్ వదిలి బిడియంతో పారిపోయిన అమ్మాయి ఇవాళ వందలాది మంది చూస్తూ ఉండగా కెమెరా ముందు డైలాగ్ చెప్పగలుగుతోంది. ఇది వింత కాకపోతే మరేమిటి? ∙∙ యమి లా డిగ్రీలో చేరింది. ఫైనలియర్లో ఉంది. ఆ రోజు ముంబైలో ఉండే బంధువులు చుట్టపు చూపుగా వాళ్లింటికి వచ్చారు. అందులో ఒకామె టీవీ రంగంలో పని చేసింది. ఆమె యమిని చూసిన మరుక్షణం నుంచి నువ్వు టీవీలో పనిచెయ్ టీవీలో పనిచెయ్ అని వెంటబడింది. ‘అమ్మా... ఏమిటి ఈ నస’ అని కిచెన్‌లోకి వచ్చి విసుక్కుంది యమి, తల్లితో. కాని ఆ వచ్చినామె వద్దన్నా యమి ఫొటో తీసుకుని ముంబై వెళ్లింది. ఆ తర్వాత తనకు తెలిసిన ప్రొడక్షన్ హౌస్లన్నింటిలో చూపించింది. ఒక ప్రొడక్షన్ హౌస్ వారు యమి ఫొటోను చూసి ‘వెంటనే రమ్మనమనండి’ అని అన్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. వెళ్లాలా వద్దా. ‘ఏమో.. ట్రై చేయరాదూ’ అని తల్లిదండ్రులు అన్నారు. అలా తన 20వ ఏట యమి ముంబైలో అడుగుపెట్టింది. వెంటనే రెండు సీరియల్స్‌లో పాత్రలు దొరికాయి. ‘కలర్స్’ టీవీలో ప్రసారమైన ‘యే ప్యార్ నా హోగా కమ్’ సీరియల్‌తో యమి స్టార్ అయిపోయింది. ఆ వెంటనే ‘ఫెయిర్ అండ్ లవ్లీ’ ఆమెను తన మోడల్‌గా ఎంపిక చేసుకుంది. కన్నడ రంగం నుంచి తొలిగా ‘ఉల్లాస ఉత్సాహ’ సినిమాలో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. ఇది మన తెలుగు ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’కు రీమేక్. హీరో కన్నడ స్టార్ గణేష్. అయితే ఆమెకు బాలీవుడ్లో పేరు రావాలి. అక్కడ హిట్ కావాలి. ‘వికీ డోనర్’ ఆ అవకాశం ఇచ్చింది. దర్శకుడు సూజిత్ సర్కార్ హీరో జాన్ అబ్రహమ్ను వొప్పించి అతడు నిర్మాతగా ఒక చిన్న సిన్మాకు దర్శకత్వం వహించే చాన్స్ కొట్టాడు. కథాంశం కొత్తది. ప్రత్యుత్పత్తి కేంద్రాలకు ‘వీర్యాన్ని డొనేట్ చేస్తూ’ జీవించే కుర్రాడికథ అది. ఆ పాత్రకు కొత్తవాడైన ఆయుష్మాన్ ఖురానాను తీసుకున్నాడు. అతడి ప్రియురాలిగా యమి గౌతమ్‌ను తీసుకున్నాడు సూజిత్. ‘వికీ డోనర్’ పెద్ద హిట్. ఆ వెంటనే తెలుగులో అల్లుశిరీష్‌తో ‘గౌరవం’, తరుణ్‌తో ‘యుద్ధం’ సినిమాలు చేసింది యమి. అవి సరిగ్గా ఆడలేదు. అజయ్ దేవగణ్‌తో చేసిన ‘యాక్షన్ జాక్సన్’ కూడా సత్ఫలితం ఇవ్వలేదు. కాని వరుణ్ ధావన్‌తో చేసిన ‘బద్లాపూర్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఏకంగా హృతిక్ రోషన్ సరసన నటించే చాన్స్ వచ్చింది. ‘కాబిల్’ కూడా ప్రేక్షకులు హిట్ చేశారు. ఇటీవల ఆమె వికీ కౌశల్‌తో చేసిన ‘ఉరి: ద సర్జికల్ స్ట్రయిక్’, ఆయుష్మాన్ ఖురానాతో చేసిన ‘బాలా’ సూపర్ డూపర్ హిట్స్ అయ్యాయి. ఉరిలో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్‌గా, బాలాలో అమాయకమైన స్మాల్‌టౌన్ గర్ల్‌గా యమి తన ముద్ర వేసింది. ఇప్పుడు ఆమె బాలీవుడ్లో ఎదిగిన నటి. స్టార్ పెర్ఫార్మర్. పెద్ద బేనర్లు, ఆమె చేస్తే బాగుండు అనుకునే స్క్రిప్ట్‌లు ఆమెకోసం వెయిట్ చేస్తున్నాయి. ∙∙ ‘తెల్లరంగు గొప్పది, నల్లరంగు తక్కువది అనే భావన తప్పు. తెల్లరంగు ఉన్నవారికే అవకాశాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, వాళ్లనే అందరూ అభిమానిస్తారు అని ప్రచారం చేయడం కూడా తప్పు. గతంలో ఆ ధోరణిలో యాడ్స్ వచ్చేవేమో. ఇప్పుడు మన సౌందర్యాన్ని మనం మరింత పెంచుకోవడం ఎలా అనే పాయింట్‌తో యాడ్స్ వస్తున్నాయి. అలాంటి యాడ్స్‌లో చేయడం తప్పు కాదు. నేను అలాంటి యాడ్స్‌నే చేస్తున్నానని గట్టిగా చెప్పగలను. అయినా నేను ఒక స్వతంత్రురాలిని. వేరొకరి ఆలోచనలు, భావధారను బట్టి నేను నా నిర్ణయాలను మార్చుకోను. ఏది సరైనదైతే అదే నేను చేస్తాను’ అని తన మీద వచ్చిన విమర్శలకు జవాబు ఇచ్చింది యమి ఆ తర్వాత. ∙∙ యమికి తన చెల్లెలు సురీలీ గౌతమ్‌తో, తమ్ముడు ఓజస్తో ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. తనకు షూటింగ్ లేకపోతే వారితోనే సమయాన్ని గడుపుతుంది. ఆమెకు పోల్ డాన్స్ తెలుసు. ప్రొఫెషనల్‌గా ఆ డాన్స్‌ను నేర్చుకుంది. మనం అనుకునే రంగం వేరు కావచ్చు, ప్రవేశించే రంగం వేరు కావచ్చు... కాని ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే గెలుపు అసాధ్యం కాదు అంటుంది యమి. ఆమె తమ బాహ్యసౌందర్యంతో పాటు మానసిక సౌందర్యాన్ని కూడా మెరుగు పెట్టుకుంటున్నదని ఆమె ఎదుగుదల, ఆలోచనలు, వ్యాఖ్యలు తెలియచేస్తున్నాయి. ఆమెను భవిష్యత్తులో మరింత అందంగా మనం చూడబోతున్నాం. – సాక్షి ఫ్యామిలీ -
సహజీవనం: మహిళా టెక్కీతో గొడవపడి..!
సహజీవనం చేస్తూ.. పెళ్లి విషయమై గొడవపడ్డందుకు ఓ 30 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్‌ను ఆమె భాగస్వామి గొంతునులిమి చంపాడు. ఈ ఘటన మహారాష్ట్ర థానె జిల్లాలోని బద్లాపూర్‌లో బుధవారం జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. నాసిక్‌కు చెందిన పూనం పూన్యకర్ గజ్‌బియే గత మూడేళ్లుగా బద్లాపూర్‌లో నివసిస్తోంది. ఆమె ముంబై కన్జుర్‌మార్గ్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిని... విజయ్ సంజయ్ ఝార్కడ్(22)తో అనే యువకుడితో ఆమె సహజీవనం చేస్తోంది. తమ సహజీవనం గురించి ఇంట్లో తెలిసిపోయిందని, దీనిని తమ కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తున్నారని, కాబట్టి ఇక తమ అనుబంధం కొనసాగబోదని పూనం చెప్పడంతో ఇద్దరి మధ్య బుధవారం రాత్రి గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో క్షణికావేశంలో విజయ్ చున్నీతో పూనం గొంతు నులిమి చంపేశాడు. ఆ వెంటనే ఇంటి బయటి నుంచి తలుపు పెట్టి స్నేహితుడి ఇంటికి పరారయ్యాడు. అక్కడ స్నేహితుడికి జరిగిన విషయం చెప్పడంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకొని.. ఆ తర్వాత విజయ్ను అదుపులోకి తీసుకున్నారు. బద్లాపూర్‌లోని ఓ మొబైల్ రిపేర్ షాపులో పూనం, విజయ్ను మొదట కలిసింది. కొన్నాళ్లుగా వారిరువురు సహజీవనం చేస్తున్నారు. 'ఆరు నెలల కిందట పూనం కొనుగోలు చేసిన గదిలో ఇద్దరూ కలిసి జీవిస్తున్నారు. రెండేన్నరేళ్లుగా ఇద్దరి మధ్య అనుబంధం కొనసాగుతోంది. ఇటీవల వారి సహజీవనం గురించి పూనం ఇంట్లో తెలిసిందే. దీనిని వారు వ్యతిరేకించడంతో ఈ విషయమై ఇద్దరి మధ్య గత కొన్నిరోజులుగా తరచూ గొడవలు జరిగాయి' అని జోన్ 4 డిప్యూటీ కమిషనర్ సునీల్ భరద్వాజ్ తెలిపారు. -
ఒకరికి వస్తే కోపం.. సమూహానికి వస్తే!
ముంబై: 'ఒకరికి వస్తే కోపం.. అదే కోపం ఒక సమూహానికి వస్తే అది ఉద్యమం' అని ఓ సినిమా డైలాగ్. శుక్రవారం ఉదయం ముంబై శివారులో సరిగ్గా అదే జరిగింది. లోకల్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయంటూ ప్రయాణికులు చేపట్టిన ఆందోళన.. నిమిషాల్లోనే ఉధృతంగా మారింది. కొన్ని గంటలపాటు ముంబై ప్రధాన రవాణా వ్యవస్థ కుప్పకూలినట్లైంది. ముంబై శివారు థానేలోని బదలాపూర్ స్టేషన్ కు ఉదయం 5:30కే ప్రయాణికులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. టైం ఏడు గంటలైనా రైలే రాలేదు. అప్పటికే స్టేషన్ జనసమూహంతో కిక్కిరిసిపోయింది. గంటలుగా పేరుకుపోయిన అసహనం ఒక్కసారిగా బద్దలై.. ఆవేశంగా మారింది. అంతా కలిసి స్టేషన్ మాస్టర్ కార్యాలయాన్ని నిర్భంధించారు. ఆయనా చేతులెత్తేయడంతో ప్రయాణికుల కోపం తారాస్థాయికి చేరుకుంది. ఒక్కసారిగా అన్ని ట్రాక్ లపైకి దూసుకెళ్లి ఎక్కడి రైళ్లను అక్కడే ఆపేశారు. వారు వెళ్లాల్సిన మార్గాన్నే (బదలాపూర్ ట్రాక్ నే) కాకుండా అన్ని ట్రాక్ లకు అడ్డంగా నిలబడ్డారు. దీంతో కీలకమైన సెంట్రల్ లైన్ (సీఎస్ టీ- కొపొలి) కూడా స్తంభించింది. ఈ కారణంగా ముంబై వ్యాప్తంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు నష్టనివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. దీంతో 'రైళ్లను పునరుద్ధరిస్తున్నాం.. దయచేసి ఆందోళన విరమించండి' అంటూ రైల్వే మంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికులను ఉద్దేశించి ట్వీట్ చేశారు. మొత్తానికి ఉదయం 11 గంటలకు బదలాపూర్ స్టేషన్ లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాకగానీ రైళ్ల రాకపోకలు కొనసాగలేదు. ముంబైకర్ల జీవితం లోకల్ రైళ్లలో ఎంతలా ముడిపడి ఉంటుందోనన్న సంగతి తెలిసికూడా రైళ్లను ఆలస్యంగా నడిపితే పరిస్థితి ఎలా ఉంటుందో అధికారులకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. ప్రయాణికులు కూడా కాస్త సంయమనం పాటించి ఉంటే బాగుండేదేమో! -
నాన్న ఎంత పనిచేశాడు!
థానె: నాన్న కొత్త షూలు కొనిపెడతానని చెప్పగానే ఆరేళ్ల చిన్నారి సంబరపడింది. తండ్రితో కలిసి ఉత్సాహంగా బయటకు వెళ్లింది. కన్నతండ్రి కాలయముడిగా మారతాడని ఊహించలేకపోయింది. ఏం దుర్బుద్ధి పుట్టిందో, ఏమో పసిపిల్ల అని కూడా చూడకుండా ఆమె నదిలోకి విసిరేశాడు. మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన చోటు చేసుకుంది. అనూహ్యంగా 11 గంటల తర్వాత చిన్నారి ప్రాణాలతో బయటపడింది. షూలు కొనిపెడతానని చెప్పడంతో బుధవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తండ్రితో కలిసి చిన్నారి బయటకు వెళ్లింది. బద్లాపూర్ వద్ద వాలివ్ల్లీ వంతెన పైనుంచి చిన్నారి ఆమె తండ్రి ఉల్హాస్ నదిలోకి విసిరేశాడు. మర్నాడు ఉదయం వంతెన కింద నుంచి పాప ఏడుపు వినిపిస్తుండడంతో నిర్మాణ కంపెనీ సెక్యురిటీ గార్డు రమేశ్ బొహెయిర్(35) పోలీసులకు సమాచారం అందించాడు. 15 నిమిషాల్లో అక్కడికి చేరుకున్న పోలీసులు 7.45 గంటల ప్రాంతంలో చిన్నారిని రక్షించారు. గుర్రపు డెక్క ఉండడంతో పాప ప్రాణాలతో బయట పడిందని పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి పాప కనబడడం లేదని ఆమె తల్లి ఫిర్యాదు చేసిందని వార్తక్ నగర్ పోలీసు అధికారి కేజీ గావిట్ తెలిపారు. గురువారం ఉదయం పాపను నదిలో కనుగొన్నామని చెప్పారు. చిన్నారిని నదిలోకి విసిరేసిన ఆమె తండ్రిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. -
దుమ్మురేపిన లోబడ్జెట్ సినిమాలు
భారీ బడ్జెట్‌తో కలెక్షన్లు కొల్లగొట్టవచ్చు అన్న బాలీవుడ్ మంత్రం ఇప్పుడు పనిచేయడం లేదు. సినిమాకు హీరో కంటే కథా బలమే ముఖ్యం. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. ఈ ఏడాది ఇప్పటి వరకు బాలీవుడ్లో విడుదలైన చిత్రాలు కూడా అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ మూడు నెలలలో విడుదలైన పెద్ద హీరోల సినిమాలేవి పెద్దగా సందడి చేయలేదు. లో బడ్జెట్ సినిమాలు దుమ్ము దులిపాయి. జరా హట్కే ఫార్మెట్ రూపొందించిన సినిమాలు బాక్సాఫీస్ బద్ధలు కొట్టాయి. గొప్ప స్క్రిప్ట్ ప్లస్ గ్రేట్ యాక్టర్స్ ప్లస్ లో బడ్జెట్ ఈజ్ ఈక్వల్ టూ న్యూ ఫార్మూలా ఆఫ్ సక్సెస్ అంటోంది బాలీవుడ్. బాక్సాఫీస్ బద్ధలు కొట్టిన ఎన్‌హెచ్-10 సినిమా బడ్జెట్ జస్ట్ 14 కోట్ల రూపాయలే. నాటక రంగానికి చెందిన నీల్ భూపాలమ్, అనుష్కా శర్మ ఈ సినిమాలో ఇరగదీశారు. దానికి ప్రేక్షకులు జై కొట్టారు. పగ, ప్రతీకారం చుట్టు తిరిగిన బద్లాపూర్ ప్రేక్షకుల మది దోచుకుంది. వరుణ్ అమాయక కళ్లు, రాధికా ఆప్టే బోల్డ్ యాక్టింగ్ సినిమాను విజయపథాన నిలిపాయి. ఈ సినిమా సక్సెస్ అంతా స్క్రిప్ట్ లోనే ఉందని సినీ విమర్శకులు అంటున్నారు. ఇంతకీ బద్లాపూర్ బడ్జెట్ ఎంతనుకుంటున్నారు? జస్ట్ 25 కోట్లు. దానికి రెండు రెట్లు సంపాదించారు నిర్మాతలు. బహుశా కలెక్షన్స్ వర్షం ఇంతగా కురుస్తుందని నిర్మాతలు కూడా ఊహించి ఉండరు. అందమైన హీరో, అందాల ఆరబోత లేకున్నా సక్సెస్ సాధించొచ్చని నిరూపించింది దమ్ లాగా కే హైస్సా. హరిద్వార్, రిషికేశ్‌లో రూపొందిన ఈ సినిమాలో హీరోయిన్ మన గీతా సింగ్‌ను పోలి ఉంటుంది. ఈ చిత్రం చాలా అద్భుతంగా ఉందని బిగ్ బీ ట్వీట్ కూడా చేశాడంటే, ఆ సినిమా ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. నైన్టీస్ ఫ్లేవర్‌ను తిరిగి గుర్తుకు తెచ్చారని ఆయన కామెంట్ కూడా చేశారు. ఏది ఏమైనా సినిమా సక్సెస్‌కు కావాల్సింది బిగ్ బడ్జెట్లు - పెద్ద స్టార్లు కాదు. స్టోరీ మే దమ్ రహ్నా అని నిరూపించాయి ఈ సినిమాలు. -
సెక్స్ ‘హంటర్’!
శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన లేటెస్ట్ హిట్ మూవీ ‘బదలాపూర్’లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మ రాధికా ఆప్టే... తన ‘బోల్డ్’నెస్‌ను మరోసారి చాటింది. రీసెంట్గా రిలీజైన ‘హంటర్’ సినిమాలో అమ్మడు మరింత రెచ్చిపోయిందట. అంతే కాదు... ఆఫ్ స్క్రీన్ కూడా అంతే ఓపెన్‌మైండెడ్‌గా మాట్లాడేస్తోంది. ఓ మరాఠీ డైలీతో మాట్లాడుతూ... అసలు తన దృష్టిలో ఆకలెలాగో సెక్సూ అంతేనని తెగేసి చెప్పింది. ‘సెక్స్ గురించి ఓపెన్‌గా మాట్లాడటం మన దగ్గర పెద్ద ఇష్యూ. అందుకే సినిమాల్లో దాన్ని వ్యాపారం చేసి అమ్ముకుంటున్నారు. ఆకలేస్తే అన్నమెలా తింటామో... శరీరానికి సెక్స్ కూడా కనీస అవసరం. ఇది ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తుంది’ అంటూ గటగటా చెప్పేసిందీ ఈ చిన్నది! -
తల్లీకూతుళ్లపై యాసిడ్ దాడి
ఉత్తరప్రదేశ్ జన్పూర్ జిల్లాలోని మచిలీగాం గ్రామంలో తల్లీకూతుళ్లపై ఆగంతంకులు యాసిడి దాడి చేశారని బద్లాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ శుక్రవారం వెల్లడించారు. గత రాత్రి ఇంట్లో తల్లీ చంపా (56), కుమార్తె మాధురి (21) నిద్రిస్తున్న సమయంలో ఆగంతకులు ఆ దాడి చేశారని, అయితే ఆ దాడిలో వారిద్దరికి తీవ్ర గాయాలపాలైయ్యారని తెలిపారు. దాంతో వారిని హుటాహుటిన వారణాసిలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పేర్కొన్నారు.