ముంబై : బద్లాపుర్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడు అక్షయ్ షిండేది ఫేక్ ఎన్‌కౌంటర్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్ని మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. నిందితులు పోలీసులపై కాల్పులు జరుపుతుంటుంటే చప్పట్లు కొట్టరు కదా అని ప్రశ్నించారు.
విపక్షాలు చేస్తున్న విమర్శలపై దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. బద్లాపుర్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడిని నుంచి ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎన్‌కౌంటర్ చేసినట్లు ఫడ్నవిస్ స్పష్టం చేశారు. అయితే ‘తాను ఎన్‌కౌంటర్‌లకు పూర్తి వ్యతిరేకమన్న ఫడ్నవీస్.. నిందితులు దాడులు చేస్తే పోలీసులు చప్పట్లు కొట్టరు’ కదా అని అన్నారు.
పోలీసులపై అక్షయ్ షిండే దాడికి యత్నం
బద్లాపుర్ పాఠశాలలో చిన్నారులపై లైంగిక దాడి ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో నిందితుడు అక్షయ్ షిండేపై అతడి మొదటి భార్య ఫిర్యాదు చేసింది.
ఆ ఫిర్యాదుతో విచారించేందుకు నిందితుడిని తలోజా జైలు నుంచి బద్లాపుర్‌కు పోలీసులు బయలుదేరారు. ముంబ్రా బైపాస్‌కు చేరుకున్న సమయంలో పోలీసు వాహనంలో ఉన్న నిందితుడు అక్షయ్ షిండే తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మరణించాడు. పోలీసులుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఫడ్నవీస్‌ను కీర్తిస్తూ..
ఆ ఘటన తర్వాత ముంబైలోని పలు ప్రాంతాల్లో ఫడ్నవీస్‌ను అభినందిస్తూ హోర్డింగ్‌లు వెలిశాయి. ఈ హోర్డింగ్‌లలో ఫడ్నవీస్ తుపాకీని పట్టుకుని ఉండగా.. అందులో బద్లా పురా (ప్రతీకారం పూర్తి) అనే క్యాప్ష్‌ను జోడించారు.
హోర్డింగ్‌లపై గురించి ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా..ఇలాంటి హోర్డింగ్‌లు పెట్టడం పూర్తిగా తప్పు. ఇలా హోర్డింగ్‌లు పెట్టకూడదు అని డిప్యూటీ సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment