Encounters
-
సమిధలవుతున్న సమరాంగనలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టుల ను నిర్మూలించాలన్న లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ కగార్ అమల్లో.. ఈ ఏడాది ఆరంభం నుంచి కేంద్రప్రభుత్వం వేగం పెంచింది. దీంతో బస్తర్ అడవుల్లో ఎన్కౌంటర్లు నిత్యకృత్యంగా మారాయి. అయితే, ఈ ఎదురు కాల్పుల్లో మహిళా మావోయిస్టులు ఎ క్కువగా చనిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతతోనే దళాల్లోకి.. ఆది నుంచీ విప్లవ పోరాటాలు మహిళలకు ప్రాధాన్యమిస్తూనే వచ్చాయి. సాధారణ మహిళల సమస్యలకు తోడు.. పితృస్వామ్య వ్యవస్థ కారణంగా ఎదుర్కొనే ఇబ్బందులపై మార్క్సిస్టు పార్టీ లు గళం విప్పాయి, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే విధానాన్ని నాటి నక్సలైట్లు, నేటి మావోయిస్టులు అనుసరించారు. అయితే మార్క్సిస్టు విధానం చెప్పే సామాజిక మార్పులపై ఆకర్షితులైన మహిళలు ఆరంభంలో చేతన నాట్యమంచ్ (సీఎన్ఎం), దండకారణ్య క్రాంతికారి ఆదివాసీ మహిళా సంఘాల్లోనే ఎక్కువగా ఉండేవారు. కానీ 2006లో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ సర్కారు నెలకొల్పిన సల్వాజుడుం, అందులోని కొందరు స్పెషల్ పోలీస్ అధికారులు (ఎస్పీవోలు) అడవుల్లోని ఆదివాసీ గూడేలపై దాడి చేసి గ్రామాలను తగులబెట్టడం, అక్కడ కనిపించిన మహిళలపై అకృత్యాలకు పాల్పడటం వంటివి చేశారు. దీంతో ప్రభుత్వ బలగాలపై ఆదివాసీ మహిళల్లో వ్యతిరేకత పెరిగింది. ఫలితంగా ఆదివాసీ స్త్రీలలో దళాల్లోకి చేరాలన్న ఆసక్తి పెరగడంతో.. మావోయిస్టు సాయుధ దళాల్లో మహిళల సంఖ్య ఎక్కువైంది. 40 శాతం మహిళలు ఇరవై ఏళ్ల చరిత్ర కలిగి మావోయిస్టు పార్టీ సాయుధ దళాల్లో ప్రస్తుతం 40 శాతం మేర మహిళలున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ కగార్ ప్రారంభించడానికి ముందు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వివిధ సందర్భాల్లో వెల్లడించిన వివరాల ప్రకారం సుమారు 2,500 మంది సాయుధ మావోయిస్టులు ఉండగా.. ఇందులో మహిళల సంఖ్య సుమారు వెయ్యికి పైగానే ఉన్నట్టు సమాచారం. ఇందులో దక్షిణ బస్తర్ డివిజన్ ప్రాంతంలో 300కు పైగా, పశ్చిమ బస్తర్‌లో 150 మందికి పైగా, ఉత్తర బస్తర్ డివిజన్లో 100 మందికి పైగా మహిళా మావోయిస్టులున్నట్టు సమాచారం. ఇక మావోయిస్టుల షెల్టర్ జోన్‌గా పరిగణించే మాడ్ డివిజన్లో 350 మంది వరకు మహిళా మావోయిస్టులున్నట్టు పోలీసుల వర్గాల అంచనా. మిగిలిన మహారాష్ట్ర, ఒడిశా, ఝార్ఖండ్, ఏవోబీల్లో తక్కువ సంఖ్యలోనే ఉన్నట్టు భావిస్తున్నారు. మృతుల్లో పెరుగుతున్న మహిళలు సాధారణంగా పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగిన సందర్భాల్లో.. సాయుధులైన పురుష మావోయిస్టులే ఎక్కువగా చనిపోతుంటారు. కానీ ఈ ఏడాది జరిగిన పలు ఎన్కౌంటర్లలో మహిళా మావోయిస్టులు భారీగా చనిపోతుండటం మానవతావాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఈనెల 4న జరిగిన తుల్తులీ ఎన్కౌంటర్లో 38 మంది మావోయిస్టులు చనిపోగా.. వారిలో 14 మంది మహిళలు ఉన్నారు. అంతకుముందు ఏప్రిల్ 16న కాంకేర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 29 మంది మావోయిస్టులు చనిపోతే.. అందులో 15 మంది మహిళలున్నారు. వీటితో పాటు సెపె్టంబర్ 3న బీజాపూర్/దంతెవాడల్లో జరిగిన ఎన్కౌంటర్లో 9 మంది చనిపోతే.. వారిలో ఆరుగురు మహిళలున్నారు. సెపె్టంబర్ 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో జరిగిన ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు నేలకొరిగిపోతే.. వారిలో ఇద్దరు మహిళలున్నారు. వెనుకబాటులో ఆదివాసీలే అధికం సామాజికంగా, ఆర్థికంగా, విద్య, వైద్యం తదితర అనేక అంశాల్లో దేశంలో ఆదివాసీలే ఎక్కువగా వెనుకబాటుకు గురయ్యారు. అందులో ఆదివాసీ స్త్రీల పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. దుర్భర పరిస్థితుల మధ్య విప్లవ బాట పట్టి దళాల్లో చేరిన మహిళలపై పారా మిలిటరీ బలగాలతో దాడులు చేయించడం, నలువైపులా చుట్టుముట్టి ఎదురుకాల్పుల్లో మట్టుబెట్టడం సరికాదనే అభిప్రాయాన్ని ప్రజాస్వామికవాదులు వ్యక్తం చేస్తున్నారు. ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో ఆదివాసీ మహిళలు చనిపోతుండడాన్ని దేశ అంతర్గత భద్రత సమస్యగా కాకుండా.. సామాజిక వెనుకబాటు సమస్యగా ప్రభుత్వం పరిగణించాలని డిమాండ్ చేస్తున్నారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ స్త్రీలపై కర్కశంగా ఉక్కుపాదం మోపడం సరికాదంటున్నారు. ఎన్కౌంటర్లలో ఆదివాసీ స్త్రీల మరణాలు ఎక్కువగా ఉంటున్న నేప«థ్యాన.. ఆయుధం పట్టిన ఆదివాసీ మహిళల భద్రత, ప్రాణ రక్షణ, వారి సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చ మొదలైంది. -
నిందితులు కాల్పులు జరుపుతుంటే..పోలీసులు చప్పట్లు కొట్టాలా?: ఫడ్నవీస్
ముంబై : బద్లాపుర్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడు అక్షయ్ షిండేది ఫేక్ ఎన్కౌంటర్ అంటూ విపక్షాలు చేస్తున్న విమర్శల్ని మహరాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఖండించారు. నిందితులు పోలీసులపై కాల్పులు జరుపుతుంటుంటే చప్పట్లు కొట్టరు కదా అని ప్రశ్నించారు.విపక్షాలు చేస్తున్న విమర్శలపై దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో మాట్లాడారు. బద్లాపుర్‌లో లైంగిక వేధింపులకు పాల్పడ్డ నిందితుడిని నుంచి ఆత్మరక్షణ కోసమే పోలీసులు ఎన్కౌంటర్ చేసినట్లు ఫడ్నవిస్ స్పష్టం చేశారు. అయితే ‘తాను ఎన్కౌంటర్లకు పూర్తి వ్యతిరేకమన్న ఫడ్నవీస్.. నిందితులు దాడులు చేస్తే పోలీసులు చప్పట్లు కొట్టరు’ కదా అని అన్నారు.పోలీసులపై అక్షయ్ షిండే దాడికి యత్నంబద్లాపుర్ పాఠశాలలో చిన్నారులపై లైంగిక దాడి ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. అదే సమయంలో నిందితుడు అక్షయ్ షిండేపై అతడి మొదటి భార్య ఫిర్యాదు చేసింది.ఆ ఫిర్యాదుతో విచారించేందుకు నిందితుడిని తలోజా జైలు నుంచి బద్లాపుర్‌కు పోలీసులు బయలుదేరారు. ముంబ్రా బైపాస్కు చేరుకున్న సమయంలో పోలీసు వాహనంలో ఉన్న నిందితుడు అక్షయ్ షిండే తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. తుపాకీతో పోలీసులపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించగా.. అప్రమత్తమైన పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు మరణించాడు. పోలీసులుకు గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఫడ్నవీస్‌ను కీర్తిస్తూ.. ఆ ఘటన తర్వాత ముంబైలోని పలు ప్రాంతాల్లో ఫడ్నవీస్‌ను అభినందిస్తూ హోర్డింగ్‌లు వెలిశాయి. ఈ హోర్డింగ్‌లలో ఫడ్నవీస్ తుపాకీని పట్టుకుని ఉండగా.. అందులో బద్లా పురా (ప్రతీకారం పూర్తి) అనే క్యాప్ష్ను జోడించారు. హోర్డింగ్‌లపై గురించి ఫడ్నవీస్‌ను ప్రశ్నించగా..ఇలాంటి హోర్డింగ్‌లు పెట్టడం పూర్తిగా తప్పు. ఇలా హోర్డింగ్‌లు పెట్టకూడదు అని డిప్యూటీ సీఎం సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ అన్నారు. -
జమ్ము కశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురి ఉగ్రవాదుల హతం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో రెండు చోట్ల జరిగిన ఎన్కౌంటర్లలో ముగ్గురు ఉగ్రవాదులు హతం అయ్యారు. గురువారం కుప్వారా, రాజౌరీ ప్రాంతాల్లో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం అందటంతో భద్రతా బలగాలు సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో భద్రత బలగాలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం భద్రతా బలంగాలు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదుల మృతి చెందినట్లు అధికారులు పేర్కొన్నారు.‘ఉగ్రవాదుల చొరబాటుకు సంబంధించి ఇంటెలిజెన్స్ సమాచారం అదించింది. దీంతో 28, 29 తేదీల్లో ఆర్మీ బలగాలు, జమ్ము కశ్మీర్ పోలీసులతో సంయుక్తంగా మచల్, కుప్వారా ప్రాంతాల్లో ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్ చేపట్టాం. ప్రతికూల వాతావరణంలో అనుమానాస్పద కదలికలుపై కాల్పులు జరిపాం. ఇద్దరు ఉగ్రవాదులు హతం అయ్యారు’ అని శ్రీనగర్‌కు చెందిన చినార్ కార్ప్స్ ‘ఎక్స్’లో పేర్కొంది.OP PHILLORA, TANGDHAR #Kupwara Based on intelligence inputs regarding likely infiltration bids, a Joint anti-infiltration Operation was launched by #IndianArmy & @JmuKmrPolice on the intervening night of 28-29 Aug 24 in general area Tangdhar, Kupwara. One terrorist is likely to… pic.twitter.com/R2N6ql2NgM— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) August 29, 2024 ఇవాళ ఉదయం కుప్వారా మచిల్ సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదుల ఏరివేత కర్యకలాపాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.J-K: One terrorist likely killed in anti-infiltration Op in KupwaraRead @ANI Story | https://t.co/R5Q1x1r2rp#Infiltration #Kupwara #IndianArmy pic.twitter.com/8aJvooyP4i— ANI Digital (@ani_digital) August 29, 2024 -
ఇందిరమ్మ రాజ్యమంటే ఎమర్జెన్సీలు.. ఎన్కౌంటర్లు
సాక్షి ప్రతినిధి, వరంగల్/ సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యమట.. ఆ రాజ్యంలో ఏం జరిగిందో మనకు తెల్వదా?, అంత తొందరగా మరచిపోతమా?. ఇందిరమ్మ రాజ్యమంటే ఎన్కౌంటర్లు, ఎమర్జెన్సీలు.. జైలు పాలు చేసే బానిస బతుకులే కదా. తెలంగాణ ప్రజలు అరిగోస పడ్డది ఆ పాలనలోనే కదా. కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సంపదను పెంచుకుంటూ అభివృద్ధి పథంలో సాగే పాలన కావాలా? రైతుబంధు, ఉచిత విద్యుత్, ధరణిలపై అక్కసు వెళ్లగక్కుతూ దళారీల పాలన తెస్తామంటున్న ఇందిరమ్మ రాజ్యం కావాలా? మీరంతా ఆలోచించాలి. రాష్ట్ర సాధన తర్వాత తొమ్మిదేళ్లలో ఎవరూ ఊహించని విధంగా అభివృద్ధి పథంలో దేశంలోనే నంబర్ వన్‌గా ఎదిగాం. ఇలాంటి ప్రభుత్వాలను బలపరిస్తేనే భవిష్యత్ తరాలకు కూడా మంచి జరుగుతుంది. కాబట్టి అధికార బీఆర్ఎస్ను బలపరచాలి..’ అని ఆ పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల జిల్లా నస్పూర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన మాట్లాడారు. తల్లులకు మొక్కినం..రాష్ట్రం సాధించుకున్నం ‘సమ్మక్క సారలమ్మ నేలకు వందనం. రాష్ట్రం కోసం తల్లులకు మొక్కినం. ఎన్నోసార్లు మా తెలంగాణ రావాలని బంగారం ఇచ్చాం. మొక్కులు చెల్లించినం. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల హక్కుల సాధన కోసం. 15 ఏళ్లు మడమ తిప్పకుండా పోరాటం చేసి సాధించుకున్నాం. అంతకుముందు ఈ జాతరకు అంత ఆదరణ లేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏటా రూ.80 కోట్ల నుంచి రూ.100 కోట్లతో బ్రహా్మండంగా నిర్వహిస్తున్నాం. ఇంకా అభివృద్ధి చేయాల్సి ఉంది. తొలుత ప్రజా సంక్షేమ సంకల్పంతో విధి వంచితులైన వితంతువులు, వృద్ధులు, వికలాంగుల లాంటి వారిని పరిగణనలోకి తీసుకొని బిర్యానీ కాకపోయినా పప్పు, చారుతోనైనా తినాలని, ఆసరా పింఛన్ రూ.200 నుంచి రూ.2 వేలకు పెంచాం. ఈ ఎన్నికల తర్వాత రూ.5 వేల వరకు పెంచుతాం. చందూలాల్ ఉన్నప్పుడు ములుగు తండావాసీ బాధ చూసి కూతురి పెళ్లికి సాయం చేశాం. ఆ తర్వాత కల్యాణలక్ష్మి ప్రారంభించాం. యాభై ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఇలాంటి పథకాలు ఒక్కటైన తెచ్చారా? పక్కన గోదావరి, కృష్ణానది ఉన్నా.. ఎక్కడా తాగునీటి కల్పనకు చర్యలు తీసుకోలేదు. కానీ బీఆర్ఎస్ పాలనలో నల్లగొండ జిల్లా ఆరోగ్య సమస్య పరిష్కారానికి మిషన్ భగీరథ పథకం అమలు చేశాం. 44,861 ఎకరాల పోడు భూములు పంపిణీ చేయడమే గాకుండా కేసులు ఎత్తేసి, రైతుబంధు అమలు చేసి, త్రీఫేజ్ కరెంటు సరఫరా పనులు చేపట్టాం. పల్లె, బస్తీ దవాఖానాల్లో ఉచితంగా పరీక్షలు చేస్తున్నాం. కేసీఆర్ కిట్లు ఇస్తున్నాం. గిరిజనేతర పోడు భూమి రైతులకు కూడా పట్టాలు ఇప్పిస్తాం..’ అని కేసీఆర్ చెప్పారు. దొంగల చేతిలో రాష్ట్రాన్ని పెట్టొద్దు ‘ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా సుమారు 80 నియోజకవర్గాల్లో పర్యటించా. ఇంకో ఇరవై తిరుగుతా. కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు.. తుస్సుమంది. వచ్చేది లేదు.. చచ్చేదీ లేదు. తప్పిదారి ఆ పారీ్టకి అధికారం ఇస్తే వైకుంఠం ఆటలో పెద్దపాము మింగినట్లే. తెలంగాణలోనూ కర్ణాటక తరహాలోనే దగా చేస్తారు. మళ్లీ దొంగల చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టొద్దు. రైతులకు ఉచిత కరెంటు ఇస్తుంటే కాంగ్రెస్ 3 గంటలు సరిపోతుందంటోంది. 30 లక్షల పంపుసెట్లను 10 హెచ్‌పీకి పెంచితే అయ్యే రూ.50 వేల కోట్లు ఎవరు ఇస్తారు?. భూ భద్రతతో పాటు రైతుబంధు డబ్బులు నేరుగా ఖాతాల్లో పడే సాంకేతికతతో కూడిన ధరణిని ఎద్దు ఎవుసం తెలియని రాహుల్‌గాంధీ బంగాళాఖాతంలో పడేస్తరట. సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నాం. మొన్ననే సింగరేణి కారి్మకులకు బోనస్ కానీ, లాభాల్లో వాటా కానీ..రూ.1,000 కోట్ల వరకు పంచినం. సింగరేణి తెలంగాణకు సిరులతల్లి.. దీన్ని మరింత విస్తరిస్తాం. బయ్యారం ఉక్కు పరిశ్రమ విషయంలో కేంద్రం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఇకపై దాని బాధ్యతలను సైతం సింగరేణి తీసుకుంటుంది. రాష్ట్రంలో ఎక్కడ మైనింగ్‌కు అవకాశాలున్నా సింగరేణి ఆధ్వర్యంలో చేపడతాం. బీజేపీకి ఓటేస్తే మోరీలో వేసినట్లే. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే రాష్ట్రంలో పెట్టాలని వంద లేఖలు రాసినా పట్టించుకోలేదు. బొగ్గు గనులు ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రతి జిల్లాకు నవోదయ, మెడికల్ కాలేజీ ఇయ్యని బీజేపీకి ఎందుకు ఓటెయ్యాలి?..’ అని కేసీఆర్ ప్రశ్నించారు. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది ‘ఓటేసే ముందు పారీ్టల చరిత్ర, నడవడిక, దృక్పథం పరిగణనలోకి తీసుకోవాలి. మంచి ఎమ్మెల్యే గెలిస్తే, మంచి గవర్నమెంట్ వస్తది. ఈ రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉంటే బాగా అభివృద్ధి చెందుతుందో ఆలోచించాలి. కాంగ్రెస్ 50 సంవత్సరాల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని పరిపాలించిన తీరు, బీఆర్ఎస్ పాలన తీరు బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. ఎవరైతే న్యాయంగా అవసరమైన పేదలకు పని చేయగలుగుతారో చూసి ఓటెయ్యాలి..’ అని కేసీఆర్ కోరారు. ‘గతంలో ములుగులో ఓడించారు. మీమీద అలిగిన. ఇప్పుడు గెలిపించకుంటే మీతో పంచాయితీ పెట్టుకుంటా..’ అని అన్నారు. ఆయా సభల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు బడే నాగజ్యోతి (ములుగు), గండ్ర వెంకటరమణా రెడ్డి (భూపాలపల్లి), నడిపెల్లి దివాకర్‌రావు (మంచిర్యాల), కోరుకంటి చందర్ (రామగుండం), మంత్రులు సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీలు కవిత, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సిరికొండ మధుసూదనాచారి, వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
యూపీలో ఆరేళ్లలో 10,900 ఎన్కౌంటర్లు
యూపీలో ఆరేళ్లలో 10,900 ఎన్కౌంటర్లు -
360 మందిని ఎన్కౌంటర్ చేయించాడు.. కడియంపై కస్సుమన్న రాజయ్య
చిల్పూరు: కడియం శ్రీహరి టీడీపీ హయాం నుంచి అతనికి గిట్టని వారిని ఎన్కౌంటర్లు చేయించాడని, ఒక్క నియోజకవర్గంలోనే 360 మంది అమాయకులను చంపించాడని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సంచలన ఆరోపణలు చేశారు. జనగామ జిల్లా చిల్పూరు మండలం చిన్నపెండ్యాలలో కొత్త పింఛన్‌దారులకు సోమవారం ఆయన కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనకు రాజకీయ గురువు వైఎస్సార్ అయితే ప్రస్తుత సీఎం కేసీఆర్ దేవుడని, నియోజకవర్గానికి తాను పూజారినని, ఆ దేవుడిచ్చే వరాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. ఎప్పటికీ స్టేషన్‌ఘన్‌పూర్ తన అడ్డా అని.. ఎవరినీ కాలు పెట్టనీయనని శపథం చేశారు. -
కశ్మీర్లో ఎందుకీ అభద్రత?
శ్రీనగర్: ఉగ్రవాదులతో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఎన్కౌంటర్లు, ముష్కరుల నుంచి పెరిగిపోతున్న ముప్పు, సాధారణ పౌరుల్ని కాల్చి చంపడం, సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లతో కశ్మీర్లో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కశ్మీర్లో భద్రతపై రాజ్‌భవన్‌లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసు, ఇతర భద్రతా సంస్థల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బలగాలు అన్ని వైపులా మోహరించిన ఉన్నప్పటికీ ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని షా అధికారుల్ని నిలదీశారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. మైనార్టీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రదాడుల్లో ఐదుగురు బీహార్ కూలీలు సహా మొత్తం 11 మంది సాధారణ పౌరులు కేవలం అక్టోబర్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అమిత్ షా కశ్మీర్‌కు రావడం ఇదే తొలిసారి. మంచు, భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆదివారం జమ్మూలో జరగాల్సిన ర్యాలీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఇన్స్పెక్టర్ కుటుంబానికి షా పరామర్శ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని షా పరామర్శించారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా వారి ఇంటికి వెళ్లారు. అహ్మద్ భార్య ఫాతిమా అక్తర్‌కు కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ని అమిత్ షా ఇచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ శివార్లలోని నౌగామ్‌లో నివాసం ఉండే అహ్మద్‌ను జూన్ 22న ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. రాష్ట్రహోదా పునరుద్ధరిస్తాం జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. యూత్ క్లబ్ సభ్యులతో ఆయన ముచ్చటిస్తూ..కశ్మీర్ యువతకి స్నేహహస్తం అందించడానికే తాను వచ్చానని చెప్పారు. ‘ఆ భగవంతుడు ఈ లోయని ఒక స్వర్గంలా మార్చాడు. ప్రకృతి సౌందర్యంతో సర్వాంగ సుందరంగా వెలిగిపోతోంది. మోదీ ఈ లోయ అభివృద్ధిని, శాంతి సుస్థిరతల్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం కశ్మీర్ యువత సహకరించాలి. వారి సహకారం కోసమే ఇక్కడికి వచ్చాను’’ అని అమిత్ షా వెల్లడించారు. కేంద్రం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. -
ఎవరీ మడవి హిడ్మా?
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా.. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లింది ఆయనను పట్టుకునేందుకే.. కానీ పక్కాగా ప్లాన్ చేసి ఇంతమంది పోలీసులను రప్పించి, దాడి చేసిందీ ఆయనే.. ఇంతకుముందు జరిగిన భారీ ఎన్కౌంటర్లు, దాడుల ఘటనల్లో కీలకమూ ఆయనే.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తాజా ఘటనతో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తోంది. మరి ఇంతకీ ఎవరీ హిడ్మా? ఎక్కడివాడు, ఏం చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు. 5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్ కౌంటర్ అఫెన్సివ్ క్యాంపెయిన్ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది. హిడ్మా భార్య కూడా మావోయిస్టు పారీ్టలోనే పనిచేస్తోంది. పీఎల్జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్ ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. రామన్న తర్వాత హిడ్మా.. ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్ ఆపరేషన్లు చేసే పోలీస్ బలగాలపై, సీఆర్పీఎఫ్ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్ఐఏ చార్జీషీట్ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ.. 2010 ఏప్రిల్ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్ ప్రొటెక్షన్ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లుమృతి చెందారు. 2017 ఏప్రిల్ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్ పరిధిలోని బుర్కాపాల్ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్పీఎఫ్ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు. 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు. -
పచ్చని అడవికి నెత్తుటి మరకలు
సాక్షి, మంచిర్యాల: పోలీసు, మావోయిస్టుల మధ్య అనేక ఎన్కౌంటర్లకు ఉమ్మడి జిల్లా అడవులు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో పదేళ్ల క్రితం వరకూ ఇక్కడి అడవుల్లో తుపాకుల మోతలు వినిపించేవి. అప్పటి పీపుల్స్‌వార్ గ్రూప్ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు ఎన్నో ఎన్కౌంటర్లు జరిగాయి. యాక్షన్ టీం మెంబర్ల నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలపై పోలీసు తుటాలు పేలాయి. ఈ ఆధిపత్య పోరులో ఒక్కోసారి దళ సభ్యులది.. ఎక్కవసార్లు పోలీసు బలగాలది పైచేయిగా మారింది. దళ సభ్యుల క్యాంపులపై బలగాలు విరుచుకుపడిన ఘటనలు ఉండగా.. పక్కా సమాచారంతో మాటువేసి దాడులు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. కొన్నిసార్లు రోజులకొద్దీ కాల్పులు సాగాయి. దశాబ్దం తర్వాత మళ్లీ కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ ఉమ్మడి జిల్లాలో గతంలో పేలిన తూటాల చప్పుళ్లను గుర్తుచేసింది. చదవండి: (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?) సంచలనం రేపిన ఆజాద్ ఎన్కౌంటర్ 2010లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్ అలియాస్ ఆజాద్ కాగజ్‌నగర్ మండలం జోగాపూర్ అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సీనియర్ జర్నలిస్టు హేమచంద్ర కూడా చనిపోయారు. ఈ ఎన్కౌంటర్ బూటకమంటూ ఆజాద్ భార్య పద్మ కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్కౌంటర్లో పాల్గొన్న 20 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ఆదిలాబాద్ స్పెషల్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. చదవండి:(19 ఏళ్లకే దళంలోకి.. మూడు నెలలకే ఎన్కౌంటర్) మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలిన సంఘటనలు 2001లో జన్నారం, దండేపల్లి అడవుల్లో జిల్లా కమిటీ సెక్రటరీ సూర్యం ఎన్కౌంటర్ అయ్యాడు. కీలక సభ్యుడి మరణంతో పార్టీకి పెద్ద నష్టం వాటిల్లింది. 2003 డీసీఎస్ (జిల్లా కమిటీ సెక్రటరీ)గా ఉన్న ఎల్లంకి అరుణ అలియాస్ లలితక్కను ప్రస్తుత కుమురంభీం జిల్లా.. అప్పటి బెజ్జూరు మండలం అగర్గూడలోని కొండ ప్రాంతంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా సభ్యులు చనిపోయారు. 2003లో ప్రస్తుత మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ఉన్న సుదర్శన్‌రెడ్డి అలియాస్ రామక్రిష్ణ ఎన్‌కౌంటర్‌తో పార్టీకి పెద్ద నష్టం జరిగింది. 2006లో కాగజ్‌నగర్ మండలం మానిక్‌పటార్‌లో వరుసగా మూడు రోజులపాటు కాల్పులు జరగగా.. ఓ దళ కమాండర్ సహా ముగ్గరు మావోలు చనిపోయారు. అంతకుముందు 1989లో ప్రస్తుత నిర్మల్ జిల్లా పెంబి మండలం తులసి పేట అడవుల్లో జిల్లా కమిటీ సభ్యుడు సుగుణాకర్, 1992లో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం చింతలబోరి వద్ద ఎన్కౌంటర్లో బోథ్ దళ కమాండర్‌తోపాటు ఐదుగురు దళ సభ్యులు చనిపోయారు. 1993లో ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండలం డెడ్రా అడవుల్లో బోథ్ దళ కమాండర్‌తోపాటు ముగ్గురు దళ సభ్యులు మరణించారు. ఇవేకాకుండా కెరమెరి, సిర్పూర్(టి), ఖానాపూర్, చెన్నూరు ప్రాంతాల్లోనూ ఎన్కౌంటర్లు జరిగాయి. మావోయిస్టుల ప్రతీకార దాడులు 1985లో ప్రస్తుత కుమురం భీం జిల్లా పాత బెజ్జూరు మండలం లోడ్పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా దహెగాం మండలం బీబ్రా ఎస్సై లక్ష్మణరావును కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్వార్టర్లో ఉండగా ఉదయం ఏడు గంటలకు బయటకు పిలిచి కాల్చి చంపారు. 1989లో ప్రస్తుత పెంచికల్‌పేట మండలం చేడ్వాయి గుట్ట వద్ద ల్యాండ్‌మైన్ పేల్చి ఐదుగురు పోలీసులను హతమార్చారు. 1991లో నెల వ్యవధిలోనే రెండుసార్లు కౌటాల పోలీసు స్టేషన్‌పై దాడులు జరిగాయి. 1997లో ప్రస్తుత కుమురంభీం జిల్లా సిర్పూర్ (యూ) పోలీస్‌స్టేషన్‌ను బాంబులతో పేల్చివేయగా 11 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు సాధారణ వ్యక్తులున్నారు. 1998లో కాగజ్‌నగర్ డీఎస్పీ కార్యాలయంపై దాడి చేయగా ముగ్గురు గన్మెన్లు మృత్యువాత పడ్డారు. 1999 బెజ్జూరు ఫారెస్టు రేంజర్ కొండల్‌రావును పిస్తోల్‌తో కాల్చి చంపారు. గోలేటీ సీఐఎస్ఎఫ్ క్యాంపుపై దాడితోపాటు అనేక ప్రతీకార దాడులు జరిగాయి. కోల్‌బెల్టు ప్రాంతంలో ‘సికాస’ ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంత పరిధిలో అటవీ, గిరిజన ప్రాంతాల్లో పీపుల్స్ వార్ ఎన్కౌంటర్లు, ప్రతీకార దాడులు జరుగుతుండగా.. అదే సమయంలో తూర్పు ప్రాంతంగా ఉన్న ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో పీపుల్స్‌వార్ గ్రూప్ అనుబంధ కార్మిక సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మిలిటెంట్ దళాల నియంత్రణకు పోలీసు బలగాలు అనేక ఎన్కౌంటర్లు జరిపాయి. 1996లో జిల్లా కార్యదర్శిగా ఉన్న మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్ రమాకాంత్ ఎన్కౌంటర్ ‘సికాస’ చరిత్రలో ప్రముఖమైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్ స్లాబ్క్వార్టర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో సమ్మిరెడ్డితోపాటు అప్పటి చెన్నూరు సీఐ చక్రపాణి, కానిస్టేబుల్ అశోక్ మరణించారు. ముఖ్యమైన ఎన్కౌంటర్లు చూస్తే 1991లో శ్రీరాంపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు, 1993లో రామక్రిష్ణాపూర్‌లో ఇద్దరు, 1996లో బెల్లంపల్లి మండలం చిన్నబుదలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు, 1998లో మాదారంలో, 1999లో నస్పూర్‌లో సికాస సభ్యులు ఎన్కౌంటర్లో మరణించారు. 2002లో బెల్లంపల్లిలోని గాంధీనగర్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సికాస సభ్యులు మరణించారు. అప్పటి ఆఫీసర్లే ఇప్పుడు సారథ్యం ఉమ్మడి జిల్లాలో అనేక ఎన్కౌంటర్లలో దూకుడుగా ఉన్న అప్పటి ఎస్సైలే ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అప్పటి యువ అధికారులే ప్రస్తుతం కీలక ప్రాంతాల్లో ఉన్నతాధికారులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ‘మావోయిస్టు ఆపరేషన్’ కొనసాగుతోంది. భాస్కర్ వేటలో భారీ కూంబింగ్ వేమనపల్లి: రెండు రోజులుగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్ కొనసాగుతోంది. పొరుగున ఉన్న ఆసిఫాబాద్‌కొమురంభీం జిల్లా కదంబా ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే కాల్పుల నుంచి తప్పించుకున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, మరో ఇద్దరు మావోయిస్టుల కోసం ప్రాణహిత తీరం వెంట డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు. కల్లెంపల్లి ఫెర్రీ పాయింట్‌ను పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ వేమనపల్లి మండలం కల్లెంపల్లి, ముక్కిడిగూడెం అడవులను పోలీసుబలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ రవీందర్, జైపూర్ ఏసీపీ నరేందర్, రూరల్ సీఐ నాగరాజు సోమవారం కూంబింగ్ బలగాల వద్దకు వెళ్లి దిశానిర్దేశం చేశారు. కల్లెంపల్లి, ముక్కిడిగూడం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో జనం ముందుకు వస్తున్న మావోయిస్టులకు ఇప్పటికే ఎవరూ సహకరించడం లేదని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సహకరించొద్దని, కదలికలు ఉన్నట్లు గమనిస్తే 100కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వాలని అన్నారు. రాకపోకల నిలిపివేత కదంబా ఎదురుకాల్పుల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ప్రాణహిత నదిపై రాకపోకలు నిలిపివేసినట్లు డీసీపీ, ఏసీపీ తెలిపారు. మండలంలోని ప్రాణహిత ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. మావోయిస్టులు నది మీద రాకపోకలు సాగించే వీలున్నందున కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు రాచర్ల, రేగుంట, వేమనపల్లి, కళ్లెంపల్లి ఫెర్రీ పాయింట్ల వద్ద తాత్కాలికంగా పడవలను నిలిపివేశామన్నారు. నది అవతలి వైపు ఉన్న సిరోంచ, బామిని, రేగుంట, వెంకటాపూర్ పోలీస్స్టేషన్ల సహకారం తీసుకుని ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలోని తీరం వెంట ఉన్న పోలీస్స్టేషన్లను అప్రమత్తం చేశామని, 10 గ్రేహౌండ్స్ బృందాలకు చెందిన 400 మంది పోలీసులతో కూంబింగ్ కొనసాగుతోందన్నారు. తప్పిపోయిన మావోయిస్టులకు లొంగిపోవడమే శరణ్యమని, లేకుంటే ఏ క్షణంలోనైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. అర్ధరాత్రి బాదిరావు అంత్యక్రియలు నేరడిగొండ: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కదంబా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్ గ్రామానికి చెందిన జుగ్నక్ బాదిరావు మృతిచెందిన విషయం విదితమే. ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. నేరడిగొండ పోలీసులు మృతుడి తల్లితోపాటు సర్పంచ్ సీతారాం, పలువురు గ్రామస్తులను ఆదివారం ఉదయం ఆసిఫాబాద్ జిల్లాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అదే అర్ధరాత్రి మృతదేహాన్ని ఇచ్చోడ సీఐ కంప రవీందర్, నేరడిగొండ ఎస్సై భరత్‌సుమన్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు అద్దాల తిమ్మాపూర్‌కు తీసుకొచ్చారు. అనంతరం అంత్యక్రియలు చేపట్టారు. రోధిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు దీంతో బంధువులు, ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు సోమవారం మృతుడి ఇంటికి చేరుకున్నారు. ఆయన తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జుగ్నక్ బాదిరావు కొంతకాలం నేరడిగొండలో లారీ క్లీనర్‌గా పనిచేశాడు. నాలుగైదు నెలల క్రితం నిర్మల్‌లో క్లీనర్‌గా పనిచేశాడు. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు కంటతడి పెడుతూ తెలిపారు. నిర్మల్‌లోని లారీ యజమానిని అడగగా 20రోజులుగా పనికి రాలేదని తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. చేతికొచ్చిన కొడుకు ఇలా ఎన్కౌంటర్లో మృతిచెందడంతో ఆ కుటుంబం రోధనలు మిన్నంటాయి. -
ఆడ బిడ్డల ఆర్తనాదాలు
సాక్షి, హైదరాబాద్: నేరం..ఈ ఏడాది రాష్ట్రంపై పడగ విప్పింది. ప్రశాంత జీవనాన్ని తన ఉనికితో ఉలికిపాటుకి గురిచేస్తూ మానవత్వాన్ని మృగ్యం చేసింది. మానవ సంబంధాల విలువల్ని తుంచు తూ వికృత చేష్టలతో మనిషంటే ఓ భరోసా అన్న నమ్మకాన్ని సడలించింది. అవినీతి కేసులు, వివాహేతర సంబంధాలు, కిడ్నాప్‌లు, అత్యాచారాలు, ఎన్కౌంటర్లు, హత్యలతో అన్ని రకాల నేరాలకూ రాష్ట్రం ఆలవాలమైంది. రాజధానిలో చోటుచేసుకు న్న కొన్ని నేరాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. వరుసగా వెలుగుచూసిన అత్యాచారాలు, హత్యలతో ఒక దశలో మహిళలు, చిన్నారుల రక్షణ సందేహం లో పడింది. ముఖ్యంగా ‘దిశ’కేసులో నిందితులు ఆమెను చంపిన తీరు..దేశవ్యాప్త ఉద్యమానికి దారి తీసింది. అదేరోజు వరంగల్‌లో మానస, అదేవారంలో ఆసిఫాబాద్‌లో ‘సమత’ అత్యాచారం అ నంతరం దారుణహత్యలకు గురయ్యారు. జూన్‌లో వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై లైంగికదాడి హత్య తో ప్రజలు కోపంతో రగిలిపోయారు. మరోవైపు యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హా జీపూర్లో శ్రీనివాసరెడ్డి.. ముగ్గురు మైనర్లపై అ త్యాచారం జరిపి, తన వ్యవసాయబావిలో పూడ్చి న ఘటన కలకలం రేపింది. ఈ ఏడాది జరిగిన నేరాలన్నింటినీ సింహావలోకనం చేసుకుంటే... ► కోస్టల్‌బ్యాంక్ డైరెక్టర్, ఎన్ఆర్ఐ, ప్రముఖ వ్యాపార వేత్త చిగురుపాటి జయరాం (55) జనవరి 31న హత్యకు గురయ్యారు. తెలంగాణలో హత్యచేసి మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్‌లో వదిలివేశారు. తెలంగాణకు కేసు బదిలీఅయ్యాక ప్ర ధాన నిందితుడు రాకేశ్‌రెడ్డి, అతని అ నుచరులను అరెస్టు చేశారు. సహకరిం చిన ఇద్దరు పోలీసులపై వేటుపడింది. ► డేటా చౌర్యం కేసులో మాదాపూర్‌లోని ఐటీ గ్రీడ్ కార్యాలయాన్ని మార్చి 8న పోలీస్ లు సీజ్ చేశారు. ఈ కేసు తెలంగా ణ, ఏపీలో సంచలనం సృష్టిం చింది. రెండు తెలుగు రా ష్ట్రాల రాజకీయ పార్టీల తో ముడిపడి ఉన్న కేసు దర్యాప్తునకు ప్రభుత్వం ఐజీ స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో సిట్ ఏర్పాటు చే సింది. దర్యాప్తు కొనసాగుతోంది. ► యాదాద్రి జిల్లా బొమ్మల రామారం మండలం హాజీపూర్‌లో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గు రు బాలికలను అపహరించి అత్యాచారం చేసి న విషయం ఏప్రిల్ 26న వెలుగుచూసింది. ఊరికి రవాణా సదుపాయం లేకపోవడంతో లిఫ్ట్ ఇస్తానని చెప్పి, బాలికలను తన వ్యవసా య బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి అక్కడే మృతదేహాల్ని పాతిపెట్టాడు. ► టీవీ9 యాజమాన్య బదిలీ విషయంలో పలు అడ్డంకులు సృష్టించిన కేసులో ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాశ్‌పై మే 9న పోలీసులు కేసు లు నమోదు చేశారు. టీవీ9 చానల్‌ను ఏబీసీఎల్ నుంచి అలందా మీడియాకు బదిలీ కా కుండా నటుడు శివాజీతో ప లు నకిలీ పత్రాలు సృష్టించారని రవిప్రకాశ్, శివాజీలపై కేసు నమోదైంది. ఈ కేసులో నిం దితులిద్దరూ పోలీసులకు చిక్కకుండా పరారవడం, అపుడప్పుడూ వీడియోలు విడుదల చేయడం సంచలనం రేపింది. ► హన్మకొండ కుమార్‌పల్లిలో తల్లిపక్కనే నిద్రపోతున్న 9 నెలల పసిపాపను ప్రవీణ్ అనే యువకుడు జూన్ 30న ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి, చంపేశాడు. పోలీసులు ఫాస్ట్‌ట్రాక్ కోర్టు లో 48 రోజుల్లో నిందితుడి నేరం నిరూపిం చారు. అతనికి కోర్టు ఉరిశిక్ష విధించింది. ఆపై దాన్ని హైకోర్టు జీవితఖైదుగా మార్చింది. ► కుమరంభీం జిల్లా సార్సాల అటవీ అధికారిణి అనితపై కోనేరు కోనప్ప సోదరుడు, జెడ్పీటీ సీ సభ్యుడు కోనేరు కృష్ణారావు తన అనుచరులతో జూన్ 30న దాడి చేశారు. ► పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో టీఆర్ ఎస్ ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాసరావును మావోయిస్టు లు జూలై9న అపహరించి కాల్చిచంపారు. కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బెస్తకొత్తూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. ► జూలై 10న ఏసీబీ దాడుల్లో కేశంపేట తహసీల్దార్ వి.లావణ్య వద్ద ఏకంగా రూ.93 లక్షల నగదు 40 తులాల బంగారం లభించింది. ► ఎంసెట్ పేపర్ లీకేజీలో సీఐడీ పోలీసులు జూలై 16న చార్జిషీటు దాఖలు చేశారు. ► భద్రాద్రి జిల్లా గుండాలలో జూలై 31న ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి లింగన్న మరణించాడు. ► ఏపీ మాజీ స్పీకర్ కోడెల ఆత్మహత్య,కుటుంబ సమస్యల కారణంగా కోడెల హైదరాబాద్‌లోని సొంతింట్లో ఆగస్టు 16వ తేదీన ఉరేసుకుని మరణించారు. ► ఈఎస్ఐలోని ఐఎంఎస్ కుంభకోణంలో 700 కోట్ల మేరకు అవతవకలు ఆరోపణల నేపథ్యంలో ఆగస్టు 29న మాజీ డైరెక్టర్ దేవికారా ణి, మాజీ జేడీ పద్మలను ఏసీబీ అరెస్టు చేసిం ది. ఇప్పటిదాకా 21 మంది అరెస్టయ్యారు. ► హయత్‌నగర్‌లో..ప్రియుడు శశికుమార్ బ్లాక్‌మెయిలింగ్‌కు తలొగ్గిన కీర్తి అనే యువతి అక్టోబరు 28న తల్లి రజితను చంపి, శవాన్ని మాయం చేసిన ఘటన వెలుగుచూసింది. ► అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డిని భూవివాదంలో కూర సురేశ్ నవంబరు 4న పెట్రోల్ పోసి నిప్పంటించాడు. విజయారెడ్డి అక్కడికక్కడే మరణించగా, నిందితుడు సురేశ్, డ్రైవర్ గురునాథం, అ టెండర్ చంద్రయ్య తరువాత మరణించారు. ► కాచిగూడలో హంద్రీనీవా– ఎంఎంటీఎస్ రైళ్లు కాచిగూడలో నవంబరు 11న ఎదురెదురుగా ఢీకొన్నాయి. 8 మంది గాయపడ్డారు. లోకోపైలెట్ చంద్రశేఖర్ చికిత్స పొందుతూ మరణించాడు. ► ఆసిఫాబాద్ జిల్లాలో సమతపై ముగ్గురు టేకు చెక్కల స్మగ్లర్లు నవం బరు 24న లైంగికదాడి చేసి, కత్తితో గొంతుకోసి చంపారు. దీనిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటైంది. ► రాష్ట్రంలో ఒకేరోజు వెటర్నరీ వైద్యురాలు దిశ, వరంగల్‌లో డిగ్రీ విద్యార్థిని మానసలు నవం బరు 27 అపహరణకు గురై అత్యాచారం అనంతరం హత్యకు గురయ్యారు. ► దిశ కేసులో నిందితులు నలుగురు ఎన్కౌంటర్లో మరణించారు. డిసెంబరు 6న చటాన్‌పల్లి బ్రిడ్జి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో నిందితు లు మహమ్మద్ ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీ న్, చింతకుంట చెన్నకేశవులు పోలీసులపై దాడి చేసి, తుపాకులు లాక్కున్నారు. పోలీ సుల ఎదురుకాల్పుల్లో నలుగురు హతమయ్యారు. దీనిపై సిట్ విచారణ నడుస్తోంది. -
ఎన్కౌంటర్లే ఏకైక పరిష్కారమా?
‘‘చట్టాలను కఠినతరం చేసినా మహిళ లపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతు న్నాయి. ఇలాంటి నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర తీర్పులు రాకపోవటం ఒక కారణం. సమాజంలో మార్పు కోసం కూలం కషమైన చర్చ జరగాలి’’ – సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ‘‘అత్యాచార కేసుల్లో నిందితులను వెంటనే కొట్టి చంపాలని, ఉరి తీయాలని కోరడం సరైన నిర్ణయం కాదు. హత్య కేసుల్లో మరణశిక్షలు ఉన్నా హత్యలు జరుగుతూనే ఉన్నాయి, అలాగే ‘రేప్’ కేసుల్లో మరణశిక్ష విధించినా ఆ కేసులూ ఆగడం లేదు. మొత్తం సమాజ వ్యవస్థలో మార్పు రావాలి, జెండర్ సెన్సిబిలిటీ, నైతికతను పాటించడంలో నిబద్ధత ఉండాలి’’ – ఐపీఎస్ (రిటైర్డ్) అధికారి సి. ఆంజనేయరెడ్డి స్త్రీలపై అత్యాచారాలు, హత్యలు, అవమానకర పురుష ప్రవర్తనలూ గత 72 ఏళ్ల దేశ స్వాతంత్య్ర చరిత్రలో కొత్తేమీ కాదు, హైదరాబాద్ చరిత్రలో డాక్టర్ దిశ దారుణ హత్య, ఆ దుర్ఘటన ఆధారంగా న్యాయ స్థానాలతో నిమిత్తం లేకుండా జ్యుడీషియరీ పాత్రను పోలీసులే తమ చేతుల్లోకి గుంజుకుని నిందితులను ఎన్కౌంటర్ చేయడమూ, ఇదే ఆఖరి ఉదంతంగా భావించడానికి వీల్లేదు. ఈ ఉదంతం ఇలా ఉండగానే ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఓ పోలీస్ జవాన్ తన సహచరుల పైననే కాల్పులు జరపగా ఆరుగురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ‘విశ్రాంతి కరువవడం, సెలవులు తక్కువ కావడం, మాన సిక ఒత్తిళ్లకు గురైన ఫలితమే సహచర జవాన్లను అలా కాల్చి చంపడానికి కారణం’ (6.12.2019 నాటి పత్రికా వార్తలు). ప్రస్తుతం మన దేశంలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థ కొనసాగుతున్న తీరు తెన్నులకు ఇవి అద్దంపడుతున్నాయి. ఏడు దశాబ్దాలకుపైగా మన దేశంలో పేరుకుపోయి, రాజకీయనేతల, పాలక శక్తుల అండ దండలతో నానాటికీ విజృంభిస్తున్న ధనస్వామ్య వ్యవస్థ, దాని స్వప్రయోజనాల కోసం పెంచగా.. పెరిగిపోతున్న సామాజిక, ఆర్థిక అసమానతలు, కుల, మత, వర్గ, వర్ణ వివక్షతో జన జీవనం రోజు రోజుకీ కునారిల్లిపోతోంది. చివరికి ఈ దుస్థితి ఎంతవరకు ఏ దశకు చేరుకుంటోందంటే– వ్యవస్థా నిర్వాహకులే కులాలమధ్య, మతాల మధ్య పొరపొచ్చాలు కల్పించి, ప్రజలమధ్య తగాదాలు, కొట్లాటలు సృష్టించడం ద్వారా ‘విదూషకులు’గా మారి ఆనందిస్తున్నారు. ఈ వికృత ‘ఆనంద తాండవం’లో భాగమే సామాజిక దౌష్ట్యాలకు అసలు కారకులెవరో తెలియనీయకుండా చేయడం. ‘పూటబత్తెమే పుల్ల వెలుగు’గా భావించే నిర్భాగ్యులూ పేద, మధ్య తరగతి, బడుగు బలహీన వర్గాల ప్రజలు, నిరక్షరాస్యులు, నిరుద్యోగులు దుర్ఘటనల మూలాలను తెలుసుకోకుండా వారిని పాలనా శక్తులు మైకంలోకి నెట్టి వేస్తున్నాయి. తీరా ఈ ధనస్వామ్య పాలనా వ్యవస్థలు ఏ స్థాయికి దిగజారుతున్నాయంటే, ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, అనం తరం నిందితులకు కఠిన శిక్షలను విధించే అవకాశాన్ని కోర్టులకు కల్పించకుండానే, వాటి పాత్రను పోలీసులకు అప్పగించి, సమగ్ర విచారణకు వీలులేని ‘ఎన్కౌంటర్ల’తో, న్యాయస్థానాల ఉనికినే ప్రశ్నా ర్థకంగా మార్చుతున్నాయి. అత్యాచారాలు, హత్యలవల్ల బాధితు లుగా మారిన వారు, వారి కుటుంబాలు క్రిమినల్ కేసుల్లో సత్వర న్యాయం కోసం ఎదురు చూడటాన్ని ఎవరూ తప్పుపట్టకూడదు. పాశవిక ఘటనలలో సత్వర న్యాయం కోసం, తక్షణ తీర్పుల కోసం చట్టాల్ని సవరించి తీరాలని ప్రజాక్షేమాన్ని, సమాజ శాంతిని కోరేవారంతా– ముందు ఆర్థిక, సామాజిక అసమానతలను రద్దుచేసే ఒకే నీతి, ఒకే న్యాయం అమలుకు పట్టుబట్టాలి. ఇంతకాలం దగా పడుతూ వచ్చిన అట్టడుగు వర్గాల, బడుగు, నిరుపేద బహుజను లకు, సంపన్న వర్గాలకు మధ్య వివక్షను, వ్యత్యాసాన్ని రద్దు చేయగల పరిణామానికి నాంది పలకగల వ్యవస్థను మాత్రమే ప్రజా బాహుళ్యం కోరుకుంటోంది. మానవ హక్కుల కమిషన్‌గానీ, కేంద్ర ప్రెస్ కౌన్సిల్‌గానీ కోరలు పీకేసిన విచారణ సంస్థలుగానే మిగిలిపోతూ వచ్చాయి, వాటికి శిక్షలు ఖరాలు చేసి అమలుజరిపే శాసనాధికారం లేదు. ఇదే పరిస్థితి క్రిమినల్ చట్టాలలోని లోపాలకు వర్తిస్తుంది. ఈ దుస్థితికి కారణం– పాలనా వ్యవస్థలోని రాజకీయనేతలే నేరగాళ్లతో, కోటీశ్వరుల ప్రయో జనాలతో మిలాఖత్ కావడం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహి స్తున్నవారు కొందరూ.. పార్లమెంట్, అసెంబ్లీ సభ్యులలో కొందరూ మహిళలపై అత్యాచారాలలో, హత్యలలో ప్రత్యక్షంగానో, పరోక్షం గానో పాత్ర వహించడమూ! ఉత్తరప్రదేశ్‌లో పేరుమోసిన పాలకపక్ష శాసనసభ్యుడే ఉన్నావ్‌లో పేద మహిళపైన అత్యాచారానికి పాల్పడి తుదకు ఆమె కుటుంబ సభ్యుల మరణానికీ కారకుడయ్యాడు. ఢిల్లీలో సామాన్య పేద విద్యావంతురాలైన ‘నిర్భయ’ దారుణ హత్యోదం తంలో గత ఏడేళ్లుగా శిక్షలు ఖరారై కూడా అమలు జరక్కపోవడం, దేశంలో ఇంతవరకూ 35,000 మంది అత్యాచారాలకు, హత్యలకు గురి కావడం, వారి విచారణల, శిక్షల గతి ఏమైందో ఇంతవరకూ దేశ ప్రజలకు తెలియకపోవటం న్యాయ వ్యవస్థలో స్తబ్దతను వేనోళ్ల ప్రశ్నించడానికి ఆస్కారమైంది. అందుకే– హైదరాబాద్ దుర్ఘటన (దిశ) సందర్భంగా, ఆ ఘటన వెల్లడి కాకముందు బిడ్డ గతిని తెలు సుకునేందుకు ‘దిశ’ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి రెండు పోలీస్ ఠాణాలకు కాళ్లకు బలపాలు కట్టుకునిపోగా, మూడు కిలోమీటర్ల పర్యంతం రెండు ఠాణాల పోలీసు అధికారులు ఫిర్యాదు నమోదు చేయడానికి మాది బాధ్యత కాదంటే మాది కాదని వారిని తిప్పి పంపడం జరిగింది. ఒక పోలీస్ స్టేషన్లో అయితే, ‘మీ పిల్ల ఎవడితోనైనా లేచిపోయిందేమో’ అని వెటకారం చేసి ‘దిశ’ తల్లి దండ్రులకు మనోవేదన కలిగించారంటే మన పోలీసుల శిక్షణా పద్ధ తులు ఎంత లోపభూయిష్టంగా ఉన్నాయో తెలుస్తుంది. అంత నిర్ల క్ష్యంగా వ్యవహరించిన కింది అధికారులను తరువాత ఉన్నతాధికారి ‘సస్పెండ్’ చేసినా, ‘దిశ’ హత్యా నిందితుల్ని తక్షణం గాలించి అరెస్టు చేయడానికి గల అవకాశం ఉండేది. కానీ అవకాశం కోల్పోయిన ఉన్న తాధికారులు తేలికైన ‘ఎన్కౌంటర్’ బాట పట్టవలసి వచ్చింది. ఇలాంటి ఘటనలో సత్వర న్యాయాన్ని ప్రజలు ఆశించడం సహజం. అయితే అది జరగనప్పుడే, పోలీసు యంత్రాంగం తన ఉనికి కోసం ఇతర మార్గాలు అనుసరించాల్సి వస్తుంది. అయితే అంతమాత్రాన, ఇదే వ్యవస్థలో మరో భాగమైన న్యాయ వ్యవస్థ పాత్ర మాత్రం ముగిసిపోయినట్టు భావించి పోలీసు యంత్రాంగం యథేచ్ఛగా ‘ఎన్కౌంటర్ల’కు పాల్పడరాదు. అలా జరిగితే, ప్రజా బాహుళ్యంలో ఏ వర్గానికి ఆ వర్గం తామే ‘చట్టం’ అని భావించుకుని శాంతి భద్రతల సమస్యపై కోర్టులతోనూ, ఠాణాలతోనూ సంబంధం లేకుండా యథేచ్ఛగా వ్యవహరించే పెద్ద ప్రమాదం ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు సహితం ‘పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అధికారం దుర్వినియోగం చేయడం ప్రభుత్వ ఉగ్రవాద చర్య (స్టేట్ టెర్రరిజం) అవుతుందని చెబుతూ ‘పోలీసులు జరిపే ఎన్ కౌంటర్లపై విచారణకు వివరమైన మార్గదర్శకాలను’ ప్రకటించాల్సి వచ్చింది. ఆమధ్య ఛత్తీస్‌గఢ్‌లోని సర్కె గూడా గ్రామంలో ‘నక్సలైట్లు’ అనే పేరిట సంబంధంలేని 15మంది సామాన్య గ్రామీణుల్ని స్థానిక, కేంద్ర పోలీసులు హతమార్చారని ఆ ఘటనపై పూర్తి విచారణ జరి పిన మధ్యప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి వి.కె. అగర్వాల్ కమిషన్ ప్రక టిస్తూ, ఎదురుకాల్పుల్లో పోలీసులకు జరిగినట్లుగా చూపిన గాయా లను మాత్రం స్నేహపూర్వక గాయాలని (ఫ్రెండ్లీ ఫైర్) పేర్కొంది. ఇక ‘దిశ’ దుర్ఘటన అలా ఉండగానే, అదే స్థాయిలో ఇంతకు ముందు, ఇటీవలికాలంలో బడుగు, బలహీన వర్గాల కుటుంబాలలో పేద ఆడపిల్లలపై సంపన్న కుటుంబీకులు జరిపిన అత్యాచారాలు, హత్యలు ఎలాంటి వాకబు, విచారణ లేకుండా, నమోదు కాకుండా, అరెస్టులు లేకుండా ముగిసిపోవడం దారుణమైన వివక్ష కాదా? అన్న ప్రశ్న తలెత్తింది. ‘మా బిడ్డలూ ఆడబిడ్డలేకదా?’ అన్న సూటి ప్రశ్నను దివంగత టేకు లక్ష్మి (ఆసిఫాబాద్), మానస (వరంగల్), సుద్దాల శైలజ (మంచిర్యాల), మనీషా (హాజీపూర్) తల్లిదండ్రులు, భర్తలూ సంధిస్తున్నారు. పాలకుల నుంచి, అంతరాల దొంతర్ల సమాజం నుంచి వీరు సమాధానాలు కోరుకుంటున్నారు. చివరికి అంతటి గుండెకోత మధ్య కూడా ‘దిశ’ తండ్రి, వీర సైనికుడైన శ్రీధర్‌రెడ్డి సహితం నిందితుల్ని ‘చట్ట ప్రకారమే శిక్షించాలని’ ఆ దిశగా చట్టాలను బలోపేతం చేయాలనీ కోరారు. అందుకే, ధనస్వామ్య వ్యవస్థలో ఉన్న ఇన్ని ప్రజా వ్యతిరేక అవలక్షణాల వల్లనే ప్రపంచ ప్రసిద్ధ సామా జిక శాస్త్రవేత్తలు ఒక చిరంతన సత్యాన్ని మన తలకెక్కించడానికి ఏనాడో ప్రయత్నించారు: ‘సంపన్న వర్గ నాగరికతలో నేర చరిత్ర’ ఎలా ఉంటుంది? ఆ వ్యవస్థలో ఓ తత్వవేత్త, భావాలను అందిస్తాడు, ఓ కవి కవితలు అల్లుకుంటూ పోతాడు, ఓ మతాచారి ప్రవచనాలు వల్లిస్తాడు, ఓ ప్రొఫెసర్ గ్రంథ రాజాల సారాంశాన్ని అందజేస్తాడు, ఓ నేరగాడు నేరాలు చేస్తూ పోతాడు. ఈ వ్యవస్థలో నేరానికి పాల్ప డటం కూడా వస్తూత్పత్తి క్రమంలో సమాజంలో ఒక భాగంగానే సాగి పోతూ ఉంటుంది. ఇలా అటు సరుకుల ఉత్పత్తి క్రమానికి, సమాజా నికి మధ్య ఏర్పడే అవినాభావ సంబంధాన్ని దగ్గరగా పరిశీలిస్తే– మనలో పేరుకున్న అనేక భ్రమలు, దురభిప్రాయాలు పటాపంచలై పోతాయి. ఎందుకంటే నేరస్తుడనేవాడు ఒక్క నేరాలు చేయడంతోనే ఆగిపోడు, ఆ నేరాలతో పాటు ఆ నేర చట్టాన్ని (క్రిమినల్లా) రూపొందించడానికి తోడ్పడతాడు. కథ అంతటితో ఆగదు, నేర చట్టం ఆధారంగా మన ప్రొఫెసర్ ఆపైన ఉపన్యాసాలు దంచుతాడు. ఆపైన వాటన్నింటినీ క్రోడీకరించి అదే ఆచార్యుడు ఓ ఉద్గ్రంథం రాసేసి ఆ సంకలనాన్ని మార్కెట్లోకి ‘అమ్మకపు సరుకు’గా జనం లోకి తోసేస్తాడు. అలా ఈ నేర వ్యవస్థ మొత్తం పోలీసు వ్యవస్థను సృష్టిస్తుంది, నేర న్యాయ వ్యవస్థ, కానిస్టేబుల్స్, జడ్జీలు, ఉరితీసే తలారులు, తీర్పరులూ ఏర్పడతారు. సామాజిక శ్రమ విభజన, మానవుడిలో విభిన్న కోణాలలో శక్తి యుక్తులు పెరగడానికి దోహద పడుతుంది. తద్వారా కొత్త అవసరాల్ని, వాటిని తీర్చుకునేందుకు కొత్త మార్గాల్ని వెతుకుతుంది. ఈ అన్వేషణలో భాగంగా నేర చట్టాన్ని, శిక్షాస్మృతి, పీనల్కోడ్స్ని, వాటి తోపాటు లెజిస్లేటర్లనూ ఉత్పత్తి చేస్తుంది. ఈ విధంగా నేరగాడు సమాజపు రొడ్డకొట్టుడు స్తబ్దతను చెదరగొట్టి, నిత్యం అభద్రతలో గడిపే ‘భద్ర పురుషుల’ జీవితాలకు భరోసాగా ఉంటాడు’’! ఈ వ్యవస్థలోనే కొనసాగుతున్నవి మన జీవితాలు! నేరగాళ్లను ఉత్పత్తి చేసే దోపిడీ వ్యవస్థ స్థానంలో నవ్య సమాజ సృష్టిని స్ఫురింపజేసే పుడమితల్లికి పురుటి నొప్పులు ఎప్పటివో?! వ్యాసకర్త, ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఎన్కౌంటర్స్ @ సిటీ
నగర శివార్లలో దిశ నిందితులు హతమైన నేపథ్యంలో సిటీ పరిధిలో గతంలోజరిగిన ఎన్కౌంటర్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. గత కొన్ని దశాబ్దాలుగా హైదరాబాద్ నగరంలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. టెర్రరిస్టులు, దోపిడీ దొంగలు పోలీసుల చేతిలో హతమయ్యారు. సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ నగర శివార్లలో శుక్రవారం జరిగిన ‘దిశ’ నిందితుల ఎన్కౌంటర్ సంచలనం సృష్టించింది. ఇదొక్కటే కాదు.. గత కొన్ని దశాబ్ధాలుగా రాజధానిలో తుపాకీ మోతలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు పోలీసుల చేతిలో హతమౌతున్నారు. నగరానికి చెందిన ముష్కరులు కొందరు ఇతర ప్రాంతాలు, దేశాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో హతమయ్యారు. నగరంలో జరిగిన ఎన్కౌంటర్లు ఇవీ.. ♦ ఇంటెలిజెన్స్ విభాగం అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్, ఆయన గన్‌మ్యాన్ వెంకటేశ్వర్లును హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాదులు 1992 నవంబర్ 29న హత్య చేశారు. టోలిచౌకి పరిధిలోని బృందావన్ కాలనీలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న లయాఖ్ అలీని సిట్ పోలీసులు అదే ఏడాది డిసెంబర్ 11న నగర శివార్లలో జరిగిన ఎదురు కాల్పుల్లో మట్టుబెట్టారు. ♦ నల్లగొండ జిల్లాకు చెందిన మీర్ మహ్మద్ అలీ, మహ్మద్ ఫసీయుద్దీన్ కరసేవకులైన నందరాజ్‌గౌడ్, పాపయ్య గౌడ్లను హతమార్చిన కేసులో నిందితులుగా ఉన్నారు. ఫసీ మాడ్యుల్‌కు చెందిన ఈ ఉగ్రవాదులు 1993 జూన్ 21న కార్ఖానా పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యారు. ♦ దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా దేవాలయం వద్ద జరిగిన బాంబు పేలుడు కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ బారీ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాది మహ్మద్ ఆజం ఆదే ఏడాది ఉప్పల్‌లో, మరో నిందితుడు సయ్యద్ అబ్దుల్ అజీజ్ సరూర్‌నగర్‌లో ఎన్కౌంటర్ అయ్యారు. ♦ నేరేడ్మెట్ రౌడీషీటర్ వేణు, బస్ డెకాయిటీ గ్యాంగ్ లీడర్ కొక్కుల రాజు, గుంటూరుకు చెందిన కిడ్నాపర్ కామేశ్వరావు, గ్యాంగ్ స్టర్ అజీజ్‌రెడ్డి, కిడ్నాపర్ గౌరు సురేష్.. ఇలా పలువురు అసాంఘిక శక్తులు నగరంలో ఎన్కౌంటర్ అయ్యారు. ♦ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ ప్రాంతంలో 2016లో జరిగిన ఎదురు కాల్పుల్లో చైన్ స్నాచర్ శివ చనిపోయాడు. శుక్రవారం షాద్‌నగర్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో ‘దిశ’ నిందితులు హతమయ్యారు. ‘బయట’ హతమైన నగర ముష్కరులు... ♦ కరసేవకులైన నందరాజ్‌గౌడ్, పాపయ్య గౌడ్లను ఫసీ మాడ్యుల్ 1993లో హత్య చేసింది. ఈ మాడ్యుల్ దీంతో పాటు మరికొన్ని ఘోరాలకు పాల్పడింది. ఈ కేసులో రెండో నిందితుడిగా ఉన్న మీర్జా ఫయాజ్ అహ్మద్ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ఇతడు నగరంలోని మౌలాలీ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వ్యక్తి. ♦ వరంగల్‌కు చెందిన ఆజం ఘోరీ కూడా ఉగ్రవాద బాటపట్టాడు. హైదరాబాద్‌లో ఉంటూ తన కార్యకలాపాలు సాగించడంతో పాటు సొంతంగా ఓ గ్యాంగ్ (మాడ్యుల్) తయారు చేసుకున్నాడు. అనేక కేసుల్లో వాటెండ్‌గా మారడంతో ఇక్కడి పోలీసుల నిఘా, గాలింపు పెరగడంతో జగిత్యాలకు మకాం మార్చాడు. 2000 ఏప్రిల్ 6న అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ♦ నల్లగొండ జిల్లా అభియ కాలనీకి చెందిన గులాం యజ్దానీ ఆజం ఘోరీ మాడ్యుల్లో కీలకంగా వ్యవహరిస్తూ నగరం కేంద్రంగానే తన కార్యకలాపాలు సాగించాడు. ఇతడి గ్యాంగ్ హైదరాబాద్‌తో పాటు విజయవాడ, బోధన్, నిజామాబాద్, మెట్పల్లి తదితర ప్రాంతాల్లో పంజా విసిరింది. ఇతను 2006లో ఢిల్లీలో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. ♦ నగరంలో జరిగిన అనేక ఉగ్రవాద ఘటనలకు సూత్రధారిగా ఉండి సుదీర్ఘకాలం పాకిస్థాన్‌లో తలదాచుకున్న ఉగ్రవాది బిలాల్, అతడి సోదరుడు సమద్‌లు 2008లో లాహోర్‌లో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యారు. ♦ తెహరీఖ్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) పేరుతో సంస్థను ఏర్పాటు చేసి అనేక దోపిడీలకు, బందిపోటు దొంగతనాలు, హత్యలకు పాల్పడిన వికారుద్దీన్ గ్యాంగ్ 2015లో ఆలేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో హతమైంది. ఈ ముఠా సభ్యులందరూ సిటీకి చెందిన వారే కావడం గమనార్హం. ♦ నల్లగొండ జిల్లా నుంచి నగరం మీదుగా రాష్ట్రం మొత్తం నెట్వర్క్ విస్తరించుకుని, దేశంలోని అనేక చోట్ల డెన్లు ఏర్పాటు చేసుకున్న గ్యాంగ్‌స్టర్ నయీం 2016లో షాద్‌నగర్ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. -
తెలంగాణలో సంచలన ఎన్కౌంటర్లు ఇవే!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఏడు ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. అన్నీ సంచలన కేసులే కావడం గమనార్హం. వీరిలో నలుగురు మావోయిస్టులు, పేరుమోసిన మాఫియాడాన్, రెండు ఘటనల్లో సిమీ ఉగ్రవాదులు ఉన్నారు. 2015, ఏప్రిల్ 4 : తెలంగాణలో తొలి ఎన్ కౌంటర్ జరిగింది. నల్లగొండ సిమీ ఉగ్రవాదుల సంచారంతో వణికిపోయింది. 2013లో మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జైలు నుంచి పారిపోయిన ఐదుగురిలో ఇద్దరు ఉగ్రవాదులు సూర్యాపేటలో బస్సులు తనిఖీ చేస్తున్న సమయంలో పోలీసులపైకి కాల్పులు జరిపి పారిపోయారు. జానకీపురం గ్రామంలో పోలీసులతో జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు సిమీ ఉగ్రవాదులు హతమయ్యారు. 2015, ఏప్రిల్ 7 : సిమీ ఉగ్రవాది వికారుద్దీన్ అతని నలుగురు సహచరులను హైదరాబాద్‌లోని కోర్టుకు తీసుకువస్తుండగా ఆలేరు సమీపంలో పోలీసులపైకి దాడికి దిగారు. ఉగ్రవాదులు ఫైర్ ఓపెన్ చేయడంతో పోలీసులు ఎదురుకాల్పులకు పాల్పడ్డారు. ఈ కాల్పుల్లో వికారుద్దీన్‌తోపాటు నలుగురు సహచరులు మరణించారు. 2015, సెప్టెంబర్ 15 : ఉమ్మడి వరంగల్ జిల్లా వెంగళాపూర్ వద్ద మావోయిస్టులకు, పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పో యారు. వీరిలో ఒకరు మహిళ. 2016, ఆగస్టు 8 : షాద్‌నగర్ సమీపంలోని మిలీనియా టౌన్షిప్ పరిసరాల్లో జరిగిన ఎన్కౌంటర్లో మాఫియాడాన్ నయీముద్దీన్ అలియాస్ నయీమ్ హతమయ్యాడు. 2019, జూలై 31 : కొత్తగూడెం జిల్లా రోళ్లగూడెం వద్ద జరిగిన ఎన్కౌంటర్లో న్యూడెమోక్రసీ నేత లింగన్న హతమయ్యాడు. 2019–20 : మణుగూరు మండలం బూరుగుల గ్రామంలో జాడి వీరాస్వామి అలియాస్ రఘును మట్టుబెట్టారు. 2019, డిసెంబర్ 6 : దిశ కేసులో ఆరిఫ్, శివ, నవీన్, చెన్నకేశవులు చటాన్‌పల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. -
ఖానాపూర్‌లో నేటికీ చెదరని జ్ఞాపకాలు
సాక్షి, ఖానాపూర్ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నేటికి చెదరని నెత్తుటి చేదుజ్ఞాపకాలు.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసిన అన్నల అలజడి... తుపాకీ చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నక్సలైట్లు విధ్వంస చర్యలు జరుగుతూనే ఉండేవి. తరుచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి... నక్సలైట్ల కవ్వింపు చర్యలు తిప్పికొట్టే ప్రయత్నాల్లో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు మరువలేనివి. ఈ క్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్‌లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలి అయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఎర్పరచుకున్నారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహ చర్యలకు శ్రీకారం చుట్టారు. సంఘటనల వివరాలివే.. 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడిచి వెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్ వద్ద 30 మంది నక్సలైట్లు పకడ్బందీ పథకం ప్రకారం మాటువేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. 1989 పిభ్రవరి ఒకటిన జరిగిన సంఘటకు ఒక రోజు ముందు ఖానాపూర్ మండలంలోని రాజూరా గ్రామంలో నక్సలైట్లు దోపిడికి పాల్పడ్డారు. దోపిడి నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి వెళ్తుండగా కడెం మండలం సింగాపూర్ గ్రామ సమీపంలో పకడ్బందీ వ్యూహంతో నక్సలైట్లు పోలీసుల జీపును పేల్చివేశా రు. ఎస్ఐ ఖాదర్‌ఉల్‌హక్, ఆరుగురు కానిస్టేబుళ్లు జీ. బాపురావు, ఎండీ జలీల్, షేక్‌హైదర్, వేణుగోపాల్, బోజరావు, ఎస్. మోహన్‌దాస్‌లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డాడు. 1999 డిసెంబర్ ఐదున కడెం మండలంలో బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామసమీపంలో నక్సలైట్లు రిమోట్‌కంట్రోలర్ సహాయంతో పోలీసు జీపును పేల్చివేశారు. ఎస్ఐ మల్లేశ్‌తో పాటు కానిస్టేబుల్, జీపు డ్రైవర్ దుర్మరణం చెందారు. ఖానాపూర్‌లో అమరుల స్థూపం ఖానాపూర్ పోలీస్‌స్టేషన్‌లో అమవీరుల స్మారాకర్థం స్థూపం లేకపోవడంతో స్టేషన్ ఆవరణలోని ఓ వేపచెట్టు కింద శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచేవారు. అనంతరం 2008 సంవత్సరంలో అప్పటి సీఐ, ఎస్ఐలు స్మారక స్థూప నిర్మాణానికి కృషి చేశారు. ప్రస్తుత సీఐజయరాంనాయక్‌తో పాటు ఎస్ఐ గోగికారి ప్రసాద్‌లు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. -
ఎన్కౌంటర్ల దర్యాపుపై సుప్రీం మార్గదర్శకాలు పాటించాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ : పోలీస్ ఎన్కౌంటర్లపై దర్యాప్తు జరిపేటప్పుడు గతంలో జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం ఇచ్చిన తీర్పులోని మార్గదర్శకాలను పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2006లో నాటి మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శి మాధవ్ అలియాస్ బుర్రా చిన్నయ్యసహా 8 మంది నక్సలైట్లు ఎన్కౌంటర్లో హతమయ్యారు. కె.రాధ అనే వ్యక్తి ఈ ఘటనలో గాయపడ్డారు. ఈ ఘటనపై ఏపీ సివిల్ లిబర్టీస్ కమిటీ(ఏపీసీఎల్సీ) హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. అది ఎన్కౌంటర్ కాదని, అక్రమంగా నిర్బంధించి తెచ్చి అడవుల్లో చంపేశారని పిటిషన్లో పేర్కొంది. జస్టిస్ గోడ రఘురాం, జస్టిస్ వీవీఎస్ రావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, జస్టిస్ రమేశ్ రంగనాథన్, జస్టిస్ జి.భవానీప్రసాద్‌లతో కూడిన ఫుల్ బెంచ్ విచారణ జరిపి ఫిబ్రవరి 6, 2009న తీర్పు ప్రకటించింది. ‘ఒక పోలీస్ అధికారి ఒక వ్యక్తి మరణానికి కారణమైతే, అధికార విధుల్లో భాగమైనా, ఆత్మరక్షణ కోసమైనా, ఘటనకు దారితీసిన కారణాలను నిక్షిప్తం చేస్తూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి’అని ఆ తీర్పులో పేర్కొంది. -
వారానికో క్రిమినల్ బుల్లెట్లకు బలయ్యాడు!
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్కౌంటర్లలో సరికొత్త రికార్డ్ సృష్టించింది. 2017 మార్చి 19న యూపీ ముఖ్యమంత్రిగా యోగి పగ్గాలు చేపట్టారు. అప్పటినుంచి 16 నెలల్లో, అంటే 2018 జూలై వరకు రాష్ట్రంలో మూడు వేల 26 ఎన్కౌంటర్లు జరిగాయి. అందులో 78 మంది నేరస్తులు చనిపోయారు. 838 మంది గాయపడ్డాడు. 7043 మంది క్రిమినల్స్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. నేరచరిత్ర ఉన్న 11వేల 981 మంది బెయిల్ రద్దు చేసి వారిని కోర్టుల్లో హాజరుపరిచారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం సాధించిన ఘనతను ప్రజలకు తెలియజేసేందుకు మొత్తం రికార్డులను పరిశీలించగా.. ఈ లెక్కలు వెలుగులోకి వచ్చాయి. గణాంకాల ప్రకారం 16 నెలల కాలంలో రోజుకు ఆరు ఎన్కౌంటర్లు జరిగాయి. సగటున వారానికి ఒక క్రిమినల్ పోలీసుల బుల్లెట్లకు బలయ్యాడు. -
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఎన్కౌంటర్లలో సరికొత్త రికార్డ్
-
నెత్తురోడిన కశ్మీర్!
నిత్యాగ్నిగుండమైన జమ్మూ–కశ్మీర్ మరోసారి నెత్తురోడింది. శనివారం ఆ రాష్ట్రంలోని పుల్వామా జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన దురదృష్ట ఘటనలో ఒక జవానుతోపాటు ఏడుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు. ఎన్కౌంటర్లో ముగ్గురు మిలిటెంట్లు మరణించారు. పౌరులందరూ ఎన్కౌంటర్ ప్రాంతానికి చొచ్చుకురావడానికి ‘ప్రమాదకరమైన రీతి’లో ప్రయత్నించడం వల్ల ఇలా జరిగిందన్నది భద్రతాదళాల కథనం. ఈ ఉదంతంలో 30మంది పౌరులు కూడా గాయాలపాల య్యారు. జమ్మూ–కశ్మీర్ రాష్ట్రంలో పరిస్థితులు నానాటికీ దిగజారుతూ ఆందోళనకరంగా మారుతు న్నాయి. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఆ పరిస్థితులను చక్కదిద్దడంలో విఫలమవుతు న్నారు. అక్కడ చారిత్రక తప్పిదాలు చేయడం రివాజుగా మారింది. నాలుగురోజుల క్రితం కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన ప్రకటన దీనికి అద్దం పడుతుంది. 2010లో తమ ప్రభుత్వం కశ్మీర్‌పై ముగ్గురు మధ్యవర్తులతో నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక అమలుకు చర్యలు తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డారు. ఆ సమస్యతో సరిగా వ్యవహరించలేక పోయామని ఆయన ‘తీవ్ర పశ్చాత్తాపం’ వెలిబుచ్చారు. ఆయన పశ్చాత్తాపాలు ఇప్పుడెందుకూ కొరగావు. ముందూ మునుపూ అధికారం వచ్చినా ఇంతకన్నా మెరుగ్గా వ్యవహరిస్తారన్న నమ్మకం ఎవరికీ లేదు. ఎందుకంటే తమంత తాము నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికపై కూడా అప్పటి యూపీఏ ప్రభుత్వం వీసమెత్తు శ్రద్ధ చూపలేదు. ఆ కమిటీ నివేదికలో విలువైన అంశాలున్నాయి. విలీనం సమయంలో ఆ రాష్ట్రానికి ఇచ్చిన అనేక అధికారాలకూ, రాజ్యాంగం కల్పిస్తున్న ప్రత్యేక రక్ష ణలకూ కోత పెడుతూ వస్తున్న తీరును ఆ కమిటీ ప్రత్యేకంగా ఎత్తిచూపింది. వాటిని ‘కొంతమే రకైనా’ పునరుద్ధరించవలసిన అవసరం ఉన్నదని అభిప్రాయపడింది. సాయుధ దళాల (ప్రత్యేకాధి కారాల) చట్టాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసింది. జమ్మూ, కశ్మీర్, లడఖ్‌లకు ప్రాంతీయ మండళ్లు ఏర్పాటు చేసి వాటిద్వారా ఆర్థిక పురోగతికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిం చింది. అధికార వికేంద్రీకరణ జరిపి, పంచాయతీరాజ్ సంస్థలకు అధికారాలు అప్పగించాలని కోరింది. ఈశాన్య రాష్ట్రాల్లో సాయుధ దళాల చట్టం అమలుపై 2005లో నియమించిన జస్టిస్ బీపీ జీవన్‌రెడ్డి కమిటీ సైతం ఆ చట్టం రద్దు కావలసిందేనని అభిప్రాయపడింది. అది అణచివేతకు ప్రతీ కగా, విద్వేషాన్ని కలిగించేదిగా, వివక్ష, పెత్తందారీ పోకడల ఉపకరణంగా ఉన్నదని అభివర్ణిం చింది. మిలిటెన్సీని అదుపు చేయడానికి గట్టి చర్యలు అవసరమనుకుంటే అందులోని కొన్ని నిబం ధనలను చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టంలో చేర్చవచ్చునని సూచించింది. అయితే ఈశాన్య రాష్ట్రాల్లోనైనా, జమ్మూ–కశ్మీర్‌లోనైనా ఆ చట్టం అండ లేకుండా తాము పనిచేయలేమని సైన్యం చెప్పిన పర్యవసానంగా యూపీఏ ప్రభుత్వం అటు జస్టిస్ జీవన్ రెడ్డి కమిటీ సిఫార్సులనూ, ఇటు ముగ్గురు మధ్యవర్తుల కమిటీ ఇచ్చిన నివేదికనూ పక్కనబెట్టింది. 2014లో నరేంద్ర మోదీ ప్రధానిగా వచ్చాక ఎన్డీఏ ప్రభుత్వం కశ్మీర్‌ను కొత్త కోణంలో చూడటం ప్రారంభించింది. అంత క్రితం వరకూ తాము అధికారంలోకొస్తే కశ్మీర్ స్వయంప్రతిపత్తిని రద్దు చేస్తామని చెబుతూ వచ్చిన బీజేపీ అక్కడ పీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాక ఆ విషయంలో పట్టు బట్టరాదని నిర్ణయించుకుంది. అటు సాయుధ దళాల చట్టాన్ని రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేస్తూ వచ్చిన పీడీపీ ఆ విషయంలో మెత్తబడింది. దాని అమలును తమ ప్రభుత్వం సమీక్షించి, చట్టం అవసరం లేని ప్రాంతాలేవో నిర్ణయించి, కేంద్రానికి సిఫార్సులు చేస్తుందని ఆ కూటమికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన ముఫ్తీ మహ్మద్ సయీద్ ప్రకటించారు. ఆయన మరణానంతరం వచ్చిన మెహబూబా ముఫ్తీ నాయకత్వంలోని ప్రభుత్వం ఆ విషయంలో ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఈలోగా నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్రోత్సవంనాడు జాతి నుద్దేశించి మాట్లాడుతూ కశ్మీర్ సమస్యకు చర్చలే పరిష్కారం తప్ప బుల్లెట్లు కాదని చెప్పినప్పుడు అందరిలో ఆశలు చిగురించాయి. ఆ తర్వాత అక్టోబర్‌లో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) మాజీ చీఫ్ దినేశ్వర్ శర్మను కేంద్రం ప్రత్యేక దూతగా నియమించింది. అయితే దానివల్ల ఆశించిన ఫలితాలేవీ రాకపోగా, ఈలోగా రాష్ట్రంలో పీడీపీ–బీజేపీ కూటమి ప్రభుత్వం కాస్తా కుప్పకూలింది. ఆ తర్వాత అసెంబ్లీ రద్దయి గవర్నర్ పాలన వచ్చింది. ఇప్పుడు పుల్వామా జిల్లాలో జరిగిన ఘటన భద్రతా విభాగాల మధ్య సమన్వయం కొరవడటంవల్ల జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ జరిగే ప్రాంతానికి సాధారణ పౌరులు చేరకుండా స్థానిక పోలీసుల సాయం తీసుకోవాల్సి ఉండగా అది జరగలేదంటున్నారు. అలాగే కాల్పులు జరిపేముందు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కనుకనే ఏం జరుగుతున్నదో తెలుసుకోవాలని ఇంటి ముందు నిల్చున్న యువకుడు సైతం ప్రాణాలు కోల్పోయాడని కాంగ్రెస్, పీడీపీ ఎత్తిచూపుతున్నాయి. ఈ ఏడాది ఇంతవరకూ రాష్ట్రంలో 587 హింసాత్మక ఉదంతాలు చోటుచేసుకున్నాయి. వీటిలో 47మంది పౌరులు, 90మంది జవాన్లు ప్రాణాలు కోల్పోగా 245మంది మిలిటెంట్లు హతమయ్యారు. పౌరుల మరణాలు 2016నాటితో పోలిస్తే 2017–18లో 167శాతం పెరిగాయని కేంద్ర హోంశాఖ చెప్పిందంటే అక్కడ ఎంతటి క్లిష్ట పరిస్థితులు నెలకొన్నాయో అర్ధమవుతుంది. జమ్మూ–కశ్మీర్ పొరుగున పాకిస్తాన్‌వైపు నుంచి ఉండే చొరబాట్లు మిలిటెన్సీని అంతకంతకు పెంచుతున్నాయి. ఉపాధి దొరక్క, భవిష్యత్తు అగమ్యగోచ రమై అక్కడ యువత మిలిటెన్సీ వైపు అడుగులేస్తోంది. ఇలాంటి ఉదంతాలు దానికి మరింత దోహ దపడతాయి. కనుక అక్కడ ఆచి తూచి అడుగులేయాలి. ఆ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి అవసరమైన చర్యలు ప్రారంభించాలి. అంతేతప్ప సమస్యకు బుల్లెట్లే పరిష్కారమన్నట్టు వ్యవహరించటం తగదు. -
తొలిదశలో 60.5% పోలింగ్
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో మొదటి విడత పోలింగ్ ముగిసింది. ఎన్నికల ప్రక్రియను అడ్డుకునేం దుకు మావోయిస్టులు చేసిన చర్యలను పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టారు. మొత్తం 90 స్థానాలకుగాను సోమవారం 18 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. 60.5 శాతం పోలింగ్ నమోదైందని ఛత్తీస్‌గఢ్ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుబ్రత్ సాహూ రాయ్‌పూర్‌లో చెప్పారు. తుది నివేదికలు అందాక పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశముంది. ఢిల్లీలో ఎన్నికల అధికారులు మాట్లాడుతూ 60–70 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2013 ఎన్నికల్లో 75.06 శాతం పోలింగ్ నమోదైంది. 10 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు, మిగిలిన 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటేసేందుకు ప్రజలకు అవకాశమిచ్చారు. నియోజకవర్గాల వారీగా చూస్తే దంతెవాడలో 49%, బస్తర్‌లో 58 శాతం, కొండగావ్‌లో 61.47 శాతం, ఖైరాగఢ్‌లో 70.14%, డోంగర్‌గఢ్‌లో 71 శాతం, డోంగర్‌గావ్‌లో 71 శాతం, ఖుజ్జీలో 72 శాతం పోలింగ్ నమోదైంది. మిగిలిన 72 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరిగి, వచ్చే నెల 11న ఫలితాలు వెలువడతాయి. ఎన్నికల రోజూ ఎన్కౌంటర్లు చర్ల: ఎన్నికల రోజున కూడా ఛత్తీస్‌గఢ్‌లో ఎన్కౌంటర్లు జరిగాయి. సుక్మా జిల్లాలో భద్రతా దళాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు నక్సలైట్లు హతమవ్వగా మరో ఇద్దరు పట్టుబడ్డారని అధికారులు చెప్పారు. బస్తర్ జిల్లాలో మారుమూలన ఉన్న ఓ పోలింగ్ బూత్‌ను ముట్టడించేందుకు పది మందికి పైగా నక్సల్స్ యత్నించారనీ, మూడు గంటలకు పైగా వారితో పోరాడి ఆ ప్రయత్నాన్ని తాము అడ్డుకున్నామని భద్రతా దళాలు చెప్పారు. అటు బీజాపూర్ జిల్లాలో పామెడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో మొత్తంగా ఐదుగురు కోబ్రా సిబ్బంది గాయపడ్డారు. దంతెవాడ జిల్లాలోని కాటేకళ్యాణ్లో నక్సలైట్లు మందుపాతర పేల్చినప్పటికీ ఎవ్వరికీ హాని జరగలేదని అధికారులు చెప్పారు. సుక్మా జిల్లాలో చెట్టు కిందే పోలింగ్ బూత్ -
మావోయిస్టు పంథా మారాల్సిందే!
ప్రజాకోర్టు పేరిట జరిగిన ఈ దారుణ హత్యాకాండను ఖండించి తీరాల్సిందే. ఈరకమైన వ్యక్తిగత హింసాకాండ ఏమాత్రం కష్టజీవులకు మేలుకలిగించదు. అలా హత్యకు గురైన వారిపట్ల ప్రజలలో సానుభూతి పెరుగుతుంది. పైగా గిరిజనులపై జరుగుతున్న దోపిడీ దుర్మార్గాలు తగ్గే అవకాశం కూడా ఉండదు. ఆ సాయుధ పోరాటం, వ్యక్తిగత హింస ఇకనైనా విడనాడండి. రండి ఈ మేడిపండు ప్రజాస్వామ్యంలోని పురుగులను ఏరివేసి స్వచ్ఛమైన, సత్యమైన ప్రజాస్వామ్యాన్ని , నిజమైన ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసే పనిలో కృషి చేద్దాం. మీ సాహసాలు, త్యాగనిరతి, పోరాట పటిమ సముద్రంలో కురిసిన వానలాగా వృధా కాకుండా సమాజంలోకి రండి. ఇటీవల విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, అతనితోపాటు మాజీ ఎమ్మెల్యే సి.వే.రి. సోములను మావోయిస్టు దళం హతమార్చిన ఘటనతో ఆ ప్రాంతం హఠాత్తుగా ఉలిక్కిపడ్డట్టయింది. ప్రస్తుత ఎమ్మెల్యే కిడారి 2014 ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా శాసనసభకు ఎన్నికై, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలోకి మారాడు. కొత్తగా తమ పార్టీలో చేరిన కిడారికి ఆ ప్రాంత మాజీ ఎమ్మెల్యే సి.వే.రి. సోముకు మధ్య సీఎం చంద్రబాబు రాజీ కుదిర్చి పార్టీ బలోపేతం కోసం గ్రూపులు కట్టకుండా కిడారితో కలిసి పనిచేయాలని ఆదేశించారు. ఆ రాజీలో భాగంగానే కిడారితోపాటు సోము కూడా ఆరోజు కలిసివెళ్లి మావోయిస్టుల వ్యూహంలో చిక్కుకున్నారు. మావోయిస్టు దళం అరకు ప్రాంతంలో వారిద్దరినీ చుట్టుముట్టిన సందర్భంగా కిడారిని పార్టీ మారినందుకు ఎంత ముట్టిందనీ, (12 కోట్లని కిడారి చెప్పారట), గిరిజన సంపదగా ఉండాల్సిన ఖనిజసంపదను దోచుకునే మాఫియాతో చేతులు కలపవద్దని పలుసార్లు హెచ్చరించినా ఎందుకు చేతులు కలిపావనీ ప్రశ్నించిన తర్వాత వారిద్దరినీ మావోయిస్టులు కాల్చిచంపారు. మావోయిస్టులు అవతారపురుషులా? అయితే ఈ దారుణ హత్యాకాండను ఖండించి తీరాల్సిందే. ఈరకమైన వ్యక్తిగత హింసాకాండ ఏమాత్రం కష్టజీవులకు మేలు కలిగించకపోగా అలా హత్యకు గురైన వారిపట్ల ప్రజలలో సానుభూతి పెరగడం సంగతి అటుంచి, గిరిజనులపై జరుగుతున్న దోపిడీ దుర్మార్గాలకు కూడా అది పరిష్కారం కాదు. ఈ అంశంపై 1946–51 మధ్యకాలంలో జరిగిన వీరతెలంగాణ విప్లవ సాయుధ రైతాంగ పోరాటం అనంతరం మాస్కోలో తనను కలిసిన నాటి సీపీఐ ప్రతినిధివర్గంతో అప్పటి సోవియట్ యూనియన్ అధినేత స్టాలిన్ వ్యక్తిగత హింసపై చెప్పిన అంశం కూడా మావోయిస్టుల దృష్టిలో ఉండాల్సింది. ఇలాంటి హింస కారణంగా.. ‘ ప్రజలు తమకు తాము సంఘటితమై, సమరశీల పోరాటం ద్వారా తమ శతృవర్గాన్ని ఎదుర్కొనాల్సిన చోట, ఆ కర్తవ్యాన్ని తమ బదులు అవతార పురుషుల వంటి కొందరు విప్లవకారులు నెరవేరుస్తారులే అనే భ్రమ, నిస్తేజం ప్రజల్లో కలుగుతాయి‘ అన్నది నాటి స్టాలిన్ హెచ్చరిక. పైగా ఇప్పుడు మావోయిస్టులు, తమ చర్యవలన ఎవరికి ఉపయోగం జరగాలని ఆశిస్తారో, అదే ఆదివాసీ గిరిజన శాసనసభ్యులను మట్టుబెట్టారు. అది ఆదివాసీ ప్రజానీకం దృష్టిలో కూడా దారుణమైన చర్యే అవుతుంది. ఆమేరకు మావోయిస్టులు ఆదివాసీలనుంచి వేరుపడే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయం గమనంలో ఉండాలి. 25–09–2018 నాటి టైమ్స్ ఆఫ్ ఇండియా వార్త ప్రకారం, ‘మావోయిస్టులు నల్లమల విడిచి వెళ్లిన తర్వాత అక్రమంగా గనుల తవ్వకాల మాఫియా, గిరిజన వనరులను దోచుకోవడం ఎక్కువైంది.‘ మావోలు అటవీ ప్రాంతాన్ని ఖాళీ చేసిన తదుపరి ఆ ప్రాంతంలో అభివృద్ధి జరగకపోగా పోలీసులు ఆ ప్రాంతంలో నిఘా పెంచిన పిదప ఏర్పడిన ’శాంతి’ తర్వాత మైనింగ్ మాఫియా ఆగడాలు పెచ్చుమీరాయి! 2009 వరకు ఏ రాజకీయ నేత కూడా కృష్ణానదీతీరాన అక్రమ ఇసుక తవ్వకాలు చేపట్టినట్లు లేదు. ఇప్పుడు రోజుకు రూ 10 కోట్లను ఈ స్థానిక పాలకపార్టీ సిండికేట్లు దండుకుంటున్నారు. విలువైన సున్నపురాయి ఖనిజాలున్న గురజాల ప్రాంతంలో అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారు. గ్రానైట్ గనులున్న వినుకొండ, సత్తెనపల్లి వంటి చోట్ల కూడా అదే మైనింగ్ మాఫియా రాజ్యమేలుతోంది. ఇక ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ప్రజా ప్రతినిధులు, నేతలు పార్టీ మారటానికి ప్రధాన కారణం.. అక్రమంగా మైనింగ్ చేసి కోట్లు ఆర్జించవచ్చన్న ఉద్దేశంతోనేనని ఆ స్థానికులు చెప్పుకుంటున్నారు. మాచర్ల ఎమ్మెల్యే అక్రమ మైనింగ్ కేసులో అది వాస్తవమేనని హైకోర్టు తీర్పునిచ్చింది కూడా. సమాచారం ఇచ్చిందెవరు? గతంలో ఇలాంటి దాడులకు పాల్పడిన నాలుగైదు రోజుల్లోపే ఆ చర్యకు తామే బాధ్యులమని మావోయిస్టులు ప్రకటన చేసేవారు. పది రోజులు దాటినా ఇంతవరకు మావోయిస్టుల నుంచి సాధికార ప్రకటన రాలేదు. దాంతో కొన్ని ఊహాగానాలకు ఆస్కా రం ఏర్పడింది. ఆ ప్రాంతంలో గంజాయి సాగు, ఈ మైనింగ్ వ్యవహారాలు, దాని ఎగుమతి అమ్మకాల విషయంలో స్థానిక మాఫియా నేతల మధ్య విభేదాలు వచ్చి ఒక ముఠా.. మావోయిస్టులకు కిడారి, సోముల కదలికల సమాచారం చేరవేసి వారితో కుమ్మక్కయి ఈ ఘాతుకం చేయించారన్నది అలాంటి ఊహాగానాల్లో ఒకటి. అది వాస్తవమే అయి నా, మావోయిస్టుల ఈ ఘాతుకానికి అది సమర్థన కానే కాదు. పైగా మావోయిస్టులు ఇలా కిరాయి హం తకులుగా మారారా? అనే వ్యతిరేక భావం సాధారణ ప్రజానీకంలో సైతం వెగటు కలిగిస్తుంది. వరవరరావు వంటి నేతలపై మోదీ హత్య కుట్ర కేసు ను బనాయించడం ఎంత తీవ్ర తప్పిదమో, అరకు ప్రాంతంలో మావోయిస్టుల చర్య కూడా అలాంటి తీవ్ర తప్పిదమే. మానవ హక్కుల సంఘం నేత ప్రొ. హరగోపాల్ సైతం దీన్ని ఖండించారు. మావోయిస్టుల దుశ్చర్యను నేనూ ఖండిస్తున్నాను. అయితే ప్రజాజీవితంలోకి రండని కంటితుడుపుగా అన్నట్లుగా వారికి సలహా ఇవ్వగల స్థితిలో లేను. ప్రజాజీవనం అంటే ప్రస్తుతం నడుస్తున్న ప్రజాస్వామ్య పంథాకు రమ్మనేనా? ప్రస్తుతం కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాల తీరు చూస్తుంటే ఈ ప్రజాస్వామ్యాన్ని అటు మోదీ ఇటు చంద్రబాబు, కేసీఆర్ కలిసి నేతి బీరలో నెయ్యిలాగా చేస్తారని భయాందోళన కలుగుతోంది. ఈ ముగ్గురూ సహజ మిత్రులు. కృత్రిమంగా శతృత్వాన్ని నటిస్తున్న పార్టీల నేతలు. ఏ జనజీవన స్రవంతిలోకి ఆహ్వానించాలి? మావోయిస్టు మిత్రులారా, మీ సాయుధ పోరాటానికి, వ్యక్తిగత హింసావాదానికి కాలం చెల్లింది. ఇక దాన్ని పట్టుకుని వేళ్లాడి ఏం ప్రయోజనం? ఆ కొండల్లో, గుట్టల్లో, ఎండకు, వానకు, చలికి, ఆ పురుగుపుట్రల మధ్య ఎంత శ్రమించినా ఉపయోగం లేదు. పైగా మీరు సరే.. ఆ ఆడకూతుళ్లను కూడా ఈ కష్టభరితమైన జీవితానికి ప్రోత్సహించడం తగునా? వారిని కూడా అమరవీరులను చేయడం వల్ల ఏం ఫలితం? ఆ పంథా విడిచిపెట్టండి అని గొంతెత్తి పిలవాలనిపిస్తోంది. కానీ ప్రజాస్వామ్యం పేరిట నడుస్తున్న ఆధిపత్య కులాల, కోటీశ్వరుల దోపిడీ పాలనామార్గానికి రండని వారిని ఎలా ఆహ్వానించగలను? ఎన్నికల ప్రచారంలో ఒక పార్టీ తరపున, మరో పార్టీని తీవ్రంగా విమర్శించి తీరా ఆ పార్టీయే ప్రభుత్వంలోకి వస్తే తాము గెలిచిన పార్టీని వీడి ఆ పాలక పక్షంలో ఎలాంటి బిడియం లేకుండానే చేరిపోతున్నారు. మరోవైపున ప్రభుత్వ పక్షం లక్ష్యం కూడా తన మందీ మార్బలం పెరగడమే కనుక వీరికి ఎర్రతివాచీ పరిచి తమలో కలుపుకునేందుకు పాలకపార్టీకి కనీస లజ్జ కూడా ఉండదు. ఈ ప్రక్రియనంతటినీ పర్యవేక్షించి, ఏమాత్రం రాజ్యాంగ విలువలూ లేకుండా ప్రభుత్వ పదవులు సైతం ప్రతిష్టించే సభాపతులను చూస్తున్నాం.ప్రతిపక్షం నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను తమ పక్షంలో చేర్చుకునేందుకు 20–30 కోట్ల రూపాయలను బాబు ప్రభుత్వం ఇచ్చిందన్నది నానుడి. (అదే ఆదివాసీ ఎమ్మెల్యేలకు అయితే రూ. 10 లేదా రూ.12 కోట్లు సరిపోతుంది.) పార్టీలతో పని లేకుండా ఎలాగైనా సరే గెలిచి వస్తే చాలు ఒక్కో విజేతకు వందకోట్ల రూపాయలిచ్చి కొనుక్కుందాం అనే భరోసా ఉన్న పాలకుల ప్రజాస్వామ్యం మనది. ఇలా చెల్లింపులకు సింగపూర్ బ్యాంకు సంచీ విదిలిస్తే చాలు. లేకపోతే పోలవరం, పట్టిసీమ, నదుల అనుసంధానం, నడిచేవాళ్లు, వాహనాలు లేకున్నా 8 లేన్ల రోడ్లు, మెట్రో రైళ్లు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు నిర్మిస్తున్నట్లు చెబుతూ ప్రైవేట్ కాంట్రాక్టులకు ఇస్తే బోలెడన్ని కమీషన్లు. ఖర్చయ్యేది ప్రజలసొమ్ము. ఆ కాంట్రాక్టర్ల ద్వారా చేరేది మనకు అనే నేతలూ.. ప్రజాసేవలో మొదటి తరగతి కూడా పూర్తి చేయని కొడుకులను చినబాబు అంటూ తన సీఎం పదవికి వారసులుగా ప్రమోట్ చేసుకున్న పెదబాబులను కళ్లముందే చూస్తున్నాం. నిజమైన ప్రజాస్వామ్యమే లక్ష్యం కావాలి! కనుక మావోయిస్టులకు చెబుతున్నాను. ఆ సాయుధ పోరాటం, వ్యక్తిగత హింస విడనాడండి. రండి ఈ మేడిపండు ప్రజాస్వామ్యంలోని పురుగులను ఏరివేసి స్వచ్ఛమైన, సత్యమైన ప్రజాస్వామ్యాన్ని నిజమైన ప్రజాస్వామ్యాన్ని రూపకల్పన చేసే పనిలో కృషి చేద్దాం. మీ సాహసాల్ని, త్యాగనిరతిని, పోరాట పటిమను సముద్రంలో కురిసిన వాన లాగా వృధా కాకుండా సమాజంలోకి రండి. పైన పేర్కొన్న పదవీవ్యామోహ, అవకాశవాద, ధనస్వామ్య, ఆధిపత్య కుల అహంకారులే కాదు. ప్రజలు కూడా ఉన్నారు. వారిలో నేటికీ నిజాయితీపరులే ఎక్కువ. వారితో కలిసి ఈ నయవంచక పాలనపై సమరశీల ఉద్యమాలు నిర్మిద్దాం. కమ్యూనిస్టు పార్టీలు చీలిపోయి, బలహీనపడినా అవి నేటికీ ప్రజాక్షేత్రంలోనే ఉన్నాయి. వాటితో మీరూ కలవండి. కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యత సాధిద్దాం. కమ్యూనిస్టులు కాని వారిలో కష్టజీవులే కాదు. వర్ణ వివక్షతో అణగారిపోతున్న కోట్లాదిమంది బహుజనులున్నారు. మైనారిటీలు ఉన్నారు. మహిళలున్నారు. శ్రామిక వర్గేతర పార్టీల్లోనూ మాట తప్పని నిజాయితీపరులూ, ప్రజాసేవపై అనురక్తి కలవారూ ఉన్నారు. అందరం కలిసి ఈ నయవంచక పాలన స్థానంలో బహుజన వామపక్ష భావజాలం కల ప్రజానీకంతో నిజమైన ప్రజాస్వామ్యాన్ని సాధించే కృషిలో చేయి చేయి కలు పుదాం! మావోయిస్టులను అందుకు ఆహ్వానిద్దాం. డాక్టర్ ఏపీ విఠల్ వ్యాసకర్త మార్క్సిస్ట్ విశ్లేషకులు మొబైల్ : 98481 69720 -
‘హిందూవులకు రక్షణలో బీజేపీ వైఫల్యం’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో హిందూవులకు రక్షణ కల్పిచడంలో అధికార బీజేపీ ఘోరంగా విఫలమైంది ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. యూపీలో లక్నోలో యాపిల్ సంస్థ మేనేజర్‌ను శనివారం యూపీ పోలీసులు కాల్పిచంపిన విషయం తెలిసిందే. యూపీ పోలీసుల తీరుపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. దీనిపై స్పందించిన కేజ్రీవాల్.. హిందూవుల రక్షణే ద్వేయంగా ఏర్పడిన పార్టీ బీజేపీ అని ఆ పార్టీ నేతలు ఓ వైపు గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు బూటకపు ఎన్‌కౌంటర్లలతో హిందూవులను చంపేస్తున్నారని విమర్శించారు. ‘‘ హిందూవైన వివేక్ తివారిని యూపీ పోలీసులు దారుణంగా కాల్చిచంపారు. దేశంలోని హిందూవులకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది’’ అని ట్వీట్ చేశారు. వివేక్ ఎన్‌కౌంటర్‌పై యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ అధినేత అఖిలేస యాదవ్ తీవ్రంగా స్పందించారు. యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్ వైఫల్లాల వల్లనే ఇలాంటి ఎన్కౌంటర్లు జరుగుతున్నామని మండిపడ్డారు. యూపీ సర్కార్ జరిపిన బూటకపు ఎన్కౌంటర్ల వల్ల ఎంతో మంది అమయాకులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ యోగి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎలాంటి విచారణ జరపకుండా చట్టాని చేతుల్లోకి తీసుకుని అక్రమంగా ఎన్కౌంటర్లు చేయడమేంటని ప్రశ్నించారు. ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేయించాలని యాదవ్ డిమాండ్ చేశారు. చదవండి : కారు ఆపనందుకు కాల్చేశారు -
ఇంత అహంకారమా?: భారత్‌పై ఇమ్రాన్ ధ్వజం
కరాచీ : భారత్‌తో శాంతి చర్చలకు సిద్దమన్న తమ ప్రతిపాదనను తిరస్కరించడం నిరాశకు గురిచేసిందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ తెలిపారు. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను పునరుద్దరించాల్సిందిగా ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించిన విషయం తెలిసిందే. దీనిపై భారత ప్రభుత్వాన్ని తప్పుబడుతూ ఇమ్రాన్ ఖాన్ ట్విటర్ వేదికగా స్పందించారు. ‘శాంతి కోసం చర్చలకు రావాలని నేను రాసిన లేఖకు భారత్ నుంచి అహంకారపూరిత ప్రతికూల స్పందన రావడం నిరాశ కలిగించింది. ఉన్నత పదవులు చేపట్టిన తక్కువ స్థాయి వ్యక్తులను నేను చాలామందిని చూశాను. విశాల ప్రపంచాన్ని చూడగల దార్శనికత వారికి ఉండదు.’ అని భారత ప్రధాని నరేంద్ర మోదీని పరోక్షంగా ప్రస్తావిస్తూ ఇమ్రాన్ ట్వీట్ చేశారు. Disappointed at the arrogant & negative response by India to my call for resumption of the peace dialogue. However, all my life I have come across small men occupying big offices who do not have the vision to see the larger picture. — Imran Khan (@ImranKhanPTI) September 22, 2018 ఇక కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుందన్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్‌ఖాన్ ఇటీవల భారత్‌కు రాసిన లేఖలో ప్రతిపాదించారు. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలెలా జరపుతామని భారత ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. -
పాకిస్తాన్‌కు షాకిచ్చిన భారత్..!
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌తో చర్చలకు సిద్దమన్న పాకిస్తాన్‌కు భారత ప్రభుత్వం షాకిచ్చింది. భారత్–పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలను మళ్లీ ప్రారంభించాల్సిందిగా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాసిన లేఖను భారత్ తిరస్కరించింది. కశ్మీర్ సరిహద్దుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాన్, ముగ్గురు ఎస్పీవోలను పాక్ దారుణ హత్య చేసిన నేపథ్యంలో భారత్ ఈ చర్చలను రద్దు చేసుకుంది. ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పే ప్రక్రియలో భాగంగా.. ఈ నెలలో న్యూయార్క్‌లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశానికి హాజరయ్యే భారత్, పాక్ విదేశాంగ మంత్రులు భేటీ కావాలని ఇమ్రాన్ ఇటీవల రాసిన లేఖలో ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ఓ వైపు చర్చలకు సిద్దమంటూనే సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్‌తో చర్చలకు భారత ప్రభుత్వం ససేమిరా అంటో్ంది. బుధవారం రామ్‌గడ్ సెక్టారులో ఓ బీఎస్ఎఫ్ జవాన్‌ను తూటలు దింపు, గొంతుకోసి అత్యంత దారుణంగా హత్యచేసిన ఘటన మరువకముందే గురువారం ముగ్గురు ఎస్వీవోలను పాకిస్తాన్ కిరాతకంగా హత్యచేసింది. ఈ నేపథ్యంలో పాక్‌తో్ శాంతి చర్చలకు ఒప్పుకునేదిలేదని.. ప్రభుత్వం ప్రకటించింది. కాగా సరిహద్దులో పాక్ చర్యలకు తూటలతోనే సమాధానం చెప్తుతామని ఇటీవల భారత సైన్యం ప్రకటించిన విషయం విధితమే. పాకిస్తాన్ నూతన ఇటీవల ఎన్నికైక ఇమ్రాన్ ఖాన్‌కు అభినందనలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఇదివరకే లేఖ రాశారు. దక్షిణాసియాను ఉగ్రవాద రహితంగా మార్చేందుకు ముందుకు రావాలని ఆనాటి లేఖలో మోదీ అన్నారు. దీనిపై ఇమ్రాన్ స్పందిస్తూ.. ద్వైపాక్షిక బంధాలపై మూడుసార్లు సానుకూల ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో భారత్‌తో చర్చలకు సిద్దమంటూ ఈ నెల 14న మోదీకి ఇమ్రాన్ లేఖ రాశారు. సరిహద్దులో పాక్ వైఖరిపై భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. కాగా భారత్, పాకిస్తాన్ విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం 2015లో చివరి సారిగా జరిగింది. ఆ తరువాత 2016 పఠాన్‌కోట వైమానిక కోటపై పాక్ భారీ దాడికి పాల్పడడంతో ద్వైపాక్షిక చర్చలను నిలిపివేస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి రెండు దేశాల మధ్య ఇంతవరకూ చర్చలు జరగలేదు. అమెరికా ఆహ్వానం... పాక్, భారత్ విదేశాంగ ప్రతినిధుల మధ్య చర్చలు జరుగుతాయన్న వార్తలపై అగ్రరాజ్యం అమెరికా హర్షం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక చర్చలు చాలా ముఖ్యమని గురువారం వైట్‌హౌస్ వ్యాఖ్యానించింది. భవిషత్తులో భారత్, పాక్ మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావాలని అకాక్షిస్తున్నట్లు అమెరికా విదేశాంగ ఓ ప్రకటలో తెలిపింది. -
ఒడిశాలో ఎన్కౌంటర్లు.. ఆరుగురు మావోలు హతం
మల్కన్‌గిరి: ఒడిశాలోని బలంగీర్ జిల్లా కోప్రకోల్ సమితి డుడ్కమాల్ గ్రామ సమీపంలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు మావోయిస్టులు హతమైనట్టు తెలిసింది. ఈ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు అందిన సమాచారంతో బలంగీర్ ఎస్పీ శివసుబ్రహ్మణ్యం ఆదేశాలతో సీఆర్పీఎఫ్, డీబీఎఫ్ దళాలు కూంబింగ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ఓ ఇంటి వద్ద రాకేశ్, సంజీవ్ అనే ఇద్దరు మావో కమాండర్లు కనిపించి పోలీసులపై కాల్పులకు దిగారు. ఎదురు కాల్పుల్లో వారిద్దరూ మృతిచెందారు. అనంతరం పోలీసులు ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగించారు. అర్థరాత్రి సమయంలో మరోసారి జరిగిన ఎదురు కాల్పుల్లో మరో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. కాగా, మావోయిస్టు సంజీవ్‌పై ఒడిశా ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది. -
దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు
-
‘మహా’ ఎన్కౌంటర్.. రక్తపుటేరుగా ఇంద్రావతి
గడ్చిరోలి ; మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృత దేహాలు ఇంకా బయటపడుతూనే ఉన్నాయి. గడ్చిరోలి వద్ద ఇంద్రావతి నదిలో మరో రెండు మృతదేహాలను పోలీసు బలగాలు వెలికి తీశాయి. దీంతో వరుస ఎన్కౌంటర్లలో మృతుల సంఖ్య 42కి చేరింది. ఇంతకు ముందు నది నుంచి 15 మృతదేహాలను వెలికి తీయటం తెలిసిందే. తప్పించుకునే మార్గం లేకే?... నది తీర ప్రాంతంలో మావోయిస్టులు గుడారాలు వేసుకున్న ఆనవాలు, ఘటనాస్థంలో కొన్ని వస్తువులు దర్శనమిచ్చాయి. ఎన్కౌంటర్ నేపథ్యంలో తప్పించుకునే మార్గం లేక మావోయిస్టులంతా నదిలోకి దూకేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మొసళ్లు, చేపలు పీక్కుతినటంతో మృతదేహాల గుర్తింపు కష్టతరంగా మారింది. మరోవైపు మృతుల్లో నలుగురు దళ కమాండర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఈ రెండు జిల్లాల్లో ఆహెరి, పెరిమిళ దళాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లేనని పోలీసులు ప్రకటించారు. మృతుల్లో పౌరులు లేరు... ఇక మృతుల్లో సాధారణ పౌరులు ఉన్నట్లు వస్తున్న వార్తలను తడ్‌గావ్ ఏఎస్సై సమీర్ దబాడే తోసిపుచ్చారు. ‘ఒకవేళ పౌరులు చనిపోయి ఉంటే వారి తరపు బంధువులుగానీ, ప్రజాసంఘాలుగానీ, నేతలుగానీ ఫిర్యాదు చేసి ఉండేవారు. కానీ, అలా జరగలేదు. చనిపోయివారంతా మావోయిస్టులే’ అని సమీర్ మీడియాకు వెల్లడించారు. ఇంద్రావతి నది పరిసరాల్లో కూంబింగ్ కొనసాగుతోందని.. మరిన్ని మృతదేహాలు బయటపడే పరిస్థితులు కనిపిస్తున్నాయన్నారు. మృతదేహాలను హెలికాఫ్టర్‌లో తరలిస్తున్న సీఆర్పీఎఫ్ బలగాలు ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద శనివారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఆదివారం రాత్రి సుక్మా జిల్లాలో 5 గురు.. రాజారాం ఖాండ్లా అడవి(గడ్చిరోలి)లోని జిమాల్‌గట్ట ప్రాంతంలో 4గురు మృతి చెందగా.. మంగళవారం ఉదయం గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. -
నక్సల్స్ నెత్తుటిధార.. 40కి పెరిగిన మృతులు
గడ్చిరోలి: వేసవికాలంలో పలుచబడ్డ అడవిలో నెత్తుటిధారలు ఆగడంలేదు. మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో ఒకదానితర్వాత మరొకటి ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. గడ్చిరోలి, సుక్మా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో శనివారం నుంచి మంగళవారం వరకు చోటుచేసుకున్న ఎన్కౌంటర్లలో సుమారు 40 మంది మందికి మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. నక్సల్స్ నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నామని, ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం లేకపోలేదు. ఇంద్రావతి తీరంలో 15 మృతదేహాలు.. ►అసలేం జరిగింది?: ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో శనివారం నక్సల్స్ జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ ఏఎస్సై ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఆ వెంటనే నక్సల్స్ కోసం భారీ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభమైంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, సీఆర్పీఎఫ్, కోబ్రా బలగాలు సంయుక్తంగా కిలోమీటర్ల మేర అడవిని జల్లెడపట్టాయి. ఈ క్రమంలో.. ►శనివారం రాత్రి.. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా ఏటపల్లి వద్ద చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ►ఆదివారం రాత్రి.. ఛత్తీస్‌గఢ్ సుకుమా జిల్లాలోని పూసుపాల్ సమీపంలోని అడవిలో పోలీసులతో జరిగిన ఎదురుకాల్పుల్లో 5గురు నక్సల్స్ చనిపోయారు. ►సోమవారం సాయంత్రం..గడ్చిరోలి జిల్లా రాజారాం ఖాండ్లా అడవిలోని జిమాల్‌గట్ట ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగడంతో 4గురు మావోయిస్టులు మరణించారు. ►మంగళవారం ఉదయం.. గడ్చిరోలి జిల్లా ఇంద్రావతి నదీ తీరంలో 15 మంది మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. -
28న ఖమ్మంలో రాజ్యహింస వ్యతిరేక సభ
హైదరాబాద్ : ప్రజా పోరాటాలపై రాజ్యహింస, ఎన్కౌంటర్ హత్యలకు వ్యతిరేకంగా ఈ నెల 28న ఖమ్మంలో అమరుల బంధుమిత్రులసంఘం ఆధ్వర్యంలో మహాసభ నిర్వహించనున్నట్లు విరసం నేత వరవరరావు తెలిపారు. హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో బుధవారం జరిగిన పోస్టర్ ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. మార్చి 2న ఛత్తీస్‌ఘడ్‌లోని పూజారి పరా– కాంకేర్ (తడపలగుట్ట) ఎన్కౌంటర్లో అమరులైన 10 మంది విప్లవకారుల సంస్మరణ సభను ఈ నెల 28న ఖమ్మంలోని రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సభలో ‘విప్లవోద్యమంలో ఆదివాసీ మహిళల పాత్ర’అంశంపై సామాజిక కార్యకర్త సోనిసోరి, కాత్యాయని విద్మహే (ప్రజాస్వామ్య రచయిత్రుల వేదిక) మాట్లాడతారని చెప్పారు. -
‘బతకాలంటే బీజేపీతో డీల్ చేస్కో’
ఝాన్సీ : యూపీలో ఎన్కౌంటర్ల పర్వం కొనసాగుతున్న వేళ.. ఓ సంచలన ఆడియో టేపు వాట్సాప్ గ్రూప్‌లో చక్కర్లు కొడుతోంది. ఓ పోలీస్ అధికారి- ఓ క్రిమినల్‌కు మధ్య కొనసాగిన సంభాషణ అది. ప్రాణాలతో బయటపడాలంటే బీజేపీ నేతలతో డీల్ కుదుర్చుకోవాలని ఆ అధికారి సదరు క్రిమినల్‌కు సలహా ఇచ్చాడు. ఈ ఆడియోను సదరు క్రిమినల్ వైరల్ చేయగా.. ప్రస్తుతం ఆ అధికారిపై వేటు పడింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మురానిపూర్ పోలీస్ స్టేషన్లో సునీత్ కుమార్ సింగ్ ఎస్‌హెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం, లేఖ్‌రాజ్ యాదవ్ అనే రౌడీ షీటర్‌కు ఫోన్ చేసి.. ఎన్కౌంటర్ లిస్ట్ లో అతని పేరు ఉన్నట్లు అప్రమత్తం చేశాడు. లేఖ్‌రాజ్‌పై హత్యలు, దొమ్మీలు ఇలా మొత్తం 14 కేసులు ఉండగా.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. అయితే ప్రాణాలతో బయటపడాలనుకుంటే మాత్రం తక్షణమే స్థానిక బీజేపీ నేతలు రాజీవ్ సింగ్ పరిచా, సంజయ్ దుబేలను ఆశ్రయించి డీల్ కుదుర్చుకోవాలని లేఖ్రాజ్కు సునీత్ సూచించాడు. ఈ మొత్తం కాల్ సంభాషణను లేఖ్‌రాజ్ తన ఫోన్లో రికార్డు చేశాడు. అదే రోజు సాయంత్రం అతను ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్నాడు. దీంతో ఆగ్రహంతో లేఖ్‌రాజ్ వాట్సాప్‌లో ఆ ఆడియో క్లిప్‌ను విడుదల చేసేశాడు. శనివారం ఉదయం నుంచి అది వాట్సాప్ గ్రూప్‌ల్లో చక్కర్లు కొడుతోంది. ఈ ఫిక్సింగ్ వ్యవహారంపై యూపీ పోలీస్ శాఖ స్పందించింది. ఆ ఆడియో టేపుపై దర్యాప్తు కొనసాగుతుందన్న డీజీపీ ఓపీ సింగ్.. పోలీసులు-క్రిమినల్స్ కుమ్మకయ్యారన్న ఆరోపణలను మాత్రం తోసిపుచ్చారు. మరోవైపు దర్యాప్తు ముగిసే వరకు సునీత్ కుమార్‌పై వేటు పడింది. ఇక సదరు బీజేపీ నేతలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో యూపీలో 1000కి పైగా ఎన్కౌంటర్లు జరగ్గా.. సుమారు 50 మందికి పైగా క్రిమినల్స్ మృతి చెందారు. విమర్శలు వెల్లువెత్తినప్పటికీ.. మానవ హక్కుల సంఘం నోటీసులు పంపినప్పటికీ ఎన్కౌంటర్ల విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కుండబద్ధలు కొట్టారు. సునీత్ కుమార్ సింగ్.. లేఖ్‌రాజ్ యాదవ్ -
‘దాడులను ప్రతీ ఒక్కరు ఖండించాలి’
న్యూఢిల్లీ : కశ్మీర్లో జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమత్రి ఫరుఖ్ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్ లోయలో జరుగుతున్న కాల్పుల వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండించాలని ఆయన కోరారు. కాగా కశ్మీర్లో జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించాలని పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలుకు మద్దతుగా ఫరుఖ్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కశ్మీర్లో పరిస్థితి మరింత దిగజారపోయిందని, శాంతి నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం పాక్‌తో చర్చలు ప్రారంభించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ మహ్మాద్ భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే. -
జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి
-
సరిహద్దులో అలజడి; వరుస ఎన్కౌంటర్లు..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మళ్లీ అలజడి. పాక్ సరిహద్దు జిల్లాల్లో ఆదివారం తెల్లవారుజామున వరుస ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు తెలిసిన సమాచారం ప్రకారం ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సోఫియాన్ జిల్లాలో రెండు చోట్ల, అనంతనాగ్ జిల్లాలో ఒకచోట ఈ ఘటనలు చోటుచేసుకున్నాయి. ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. సోఫియాన్ జిల్లా కచ్చాదోరా ఏరియా, ద్రాగాడ్ గ్రామాల్లోకి సాయుధులు చొరబడ్డారన్న సమాచారంతో భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకోగా ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అటు అనంతనాగ్ జిల్లాలోని దైల్‌గావ్ ఏరియాలో.. ఉగ్రవాదులు, జమ్ముకశ్మీర్ పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఒక మిలిటెంట్ హతం కాగా, ఇంకొకడు ప్రాణాలతో పట్టుబడ్డాడు. ఈ వార్తలకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సిఉంది. -
24 గంటలు.. ఏడు ఎన్కౌంటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తుల ఏరివేత కొనసాగుతోంది. సహరాన్పూర్, ఘజియాబాద్, గౌతమ్‌బుద్ధ నగర్, ముజఫర్‌నగర్ జిల్లాలో 24 గంటల్లో 7 ఎన్కౌంటర్లు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ముగ్గురు మోస్ట్‌వాంటెడ్ నేరస్తులు హతమయ్యారు. ఏడుగురిని అరెస్టుచేశారు. నేరస్తులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు పోలీసులకు గాయాలయ్యాయి. గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్ గాయపడ్డ గ్యాంగ్‌స్టర్ శ్రవణ్ చౌదరీ ఆదివారం చికిత్స పొందుతూ చనిపోయాడని శాంతిభద్రతల డీఐజీ ప్రవీణ్ తెలిపారు. సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో పరారీలో ఉన్న సలీమ్ అనే నేరస్తుడిని హతమార్చినట్లు చెప్పారు. ఓ రైతు నుంచి బైక్, రూ.లక్ష దోచుకున్నట్లు ఫిర్యాదు రావడంతో తొలుత పోలీసులు రంగంలోకి దిగారన్నారు. ఛిల్కానాలో బైక్‌ను ఆపాల్సిందిగా కోరినప్పటికీ సలీమ్ పోలీసులపై కాల్పులు జరిపాడనీ, దీంతో తాము ఎదురుకాల్పులు జరపడంతో దుర్మరణం చెందాడన్నారు. -
ప్రజా నాయకుల ఎన్కౌంటర్లు బూటకం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా నాయకులను హత్యలు చేసి ఎన్కౌంటర్లు పేరు చెప్పడం బూటకమని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు నాగన్న ఆరోపించారు. ఆదివారం స్థానిక రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ జిల్లా కమిటీ సమావేశం సుబ్బారావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగన్న మాట్లాడుతూ దేశ సంపదను బ్యాంకుల నుంచి దోచుకునే వారి పట్ల ఉదాసినంగా వ్యవహరిస్తున్న పాలకులు, ప్రజలు కోసం, దేశం కోసం పోరాడుతున్న వారిని హత్యలు చేయడం దుర్మార్గం అన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలకు విరుద్ధంగా వ్యవహరిస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలు ఇప్పటికైనా సంపూర్ణ స్థాయిలో ప్రభుత్వం అమలుకు పూనుకోవాలన్నారు. రాబోయే ఎన్నికల్లో కళాకారులు తగిన గుణపాఠం చెప్తారన్నారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, నాయకులు జీవన్, కృష్ణమూర్తి, నాగేశ్వరరావు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
వరుసగా ఎదురుదెబ్బలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొన్నేళ్లుగా వరుసగా జరిగిన ఎన్కౌంటర్లతో దెబ్బతిన్న మావోయిస్టు పార్టీకి తాజా ఎన్కౌంటర్ శరాఘాతంలా పరిణమించింది. ఛత్తీస్‌గఢ్–తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏకంగా 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాదాపు ఏడాదిన్నర కింద దేశంలోనే భారీ ఎన్కౌంటర్ అయిన ఆంధ్రా–ఒడిశా సరిహద్దు (ఏవోబీ)ల్లో మల్కన్‌గిరి ఎన్కౌంటర్ జరిగింది. అందులో 26 మంది మావోయిస్టులు మరణించారు. మావోయిస్టు పార్టీగా మారకముందు, తర్వాత కూడా జరిగిన ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మృతి చెందారు. 1996లో ఖమ్మం జిల్లా పగిడేరు వద్ద జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది పీపుల్స్‌వార్ సభ్యులు చనిపోయారు. ఆ 16 మంది సభ్యులు కూడా కొత్తగా రిక్రూటైన వారే. వారిని ఖమ్మం జిల్లా నుంచి ఛత్తీస్‌గఢ్ ప్రాంతానికి వాహనాల్లో తీసుకెళుతుండగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని కాల్చి చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. 1998లో ఒడిశాలో పీపుల్స్‌వార్ ప్లీనరీపై పోలీసులు దాడి చేసిన ఎన్కౌంటర్లో 17 మంది నక్సలైట్లు మరణించారు. అందులో నలుగురు జిల్లా కమిటీ స్థాయి నాయకులున్నారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్ర చిన్నన్న ఎన్కౌంటర్ జరిగిన నల్లమల ఘటనలో 11 మంది మరణించారు. వరంగల్ జిల్లా కౌకొండ ఘటనలో సుధాకర్ సహా 9 మంది, కరీంనగర్ జిల్లా అచ్చంపల్లిలో రామన్నతో పాటు 12 మంది, పాలకుర్తిలో 9 మంది, సింహాచలం కొండల్లో ఓబులేసు సహా 14 మంది, ఎర్రగుంటపాలెంలో సుదర్శన్‌తోపాటు 12 మంది, నల్లమల సున్నిపెంటలో మట్ట శ్రీధర్ సహా 11 మంది, గాజుల నర్సాపూర్‌లో సిటి ప్రభాకర్‌తోపాటు 13 మంది, మానాలలో రమేశ్‌తోపాటు 12 మంది, నేరెళ్ల పద్మక్క ఎన్కౌంటర్లో ఆరుగురు.. ఇలా పెద్ద సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. ఇవేగాకుండా ఇద్దరి నుంచి ఐదారుగురి వరకు మావోయిస్టులు, ముఖ్య నాయకులు మృతిచెందిన ఎన్కౌంటర్లు ఎన్నో ఉన్నాయి. -
యూపీలో యోగి ‘దబాంగ్’
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో ఇప్పుడు జైళ్లన్నీ క్రిమినల్స్‌తో కిటకిటలాడుతున్నాయి. ఏ క్షణాన తమల్ని లేపేస్తారేమోనన్న భయంతో వారంతా స్వచ్ఛందంగా పోలీసులకు లొంగిపోతున్నారు. ఇక మీద నేరాలు చెయ్యం.. ప్రాణాలతో వదిలేయండి బాబోయ్.. అంటూ అధికారులను వేడుకుంటున్న దృశ్యాలు కూడా దర్శనమిస్తున్నాయి. నేరాలను అదుపు చేసే క్రమంలో నేరస్థులపై ఉక్కు పాదం మోపుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరుస ఎన్కౌంటర్లతో భీతిల్లుతున్న నేరస్థులు స్టేషన్లకు క్యూ కడుతున్నారు. ఇప్పటిదాకా 142 మంది నేరస్థులు లొంగిపోయారని యూపీ డీజీపీ కార్యాలయం శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘పోలీసులకు కాదు.. నేరానికి నేను భయపడుతున్నా సార్’ అంటూ దబాంగ్ సినిమాలోని డైలాగ్‌ను యూపీ పోలీస్ శాఖ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంతే సల్మాన్ ఫోటోకు యోగి తలను అంటించేసి పలువురు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తున్నారు. అవి ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. కూలీపనులు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటాం తప్ప ఇకపై నేరాల జోలికి వెళ్లబోమని వారంతా చెబుతున్నారంట. వీరిలో చాలా మందిపై భారీ రివార్డులే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఆస్తులను సీజ్ చేయటంతో ధరావత్తు కూడా కట్టలేని స్థితిలో కొందరు జైళ్లలోనే ఉండిపోయారు. ఇక గత నెలరోజుల్లో 60 ఎన్కౌంటర్లు చోటు చేసుకోగా.. 8 మంది గ్యాంగ్స్టర్లను పోలీసులు ఎన్కౌంటర్ లో లేపేశారు. గతేడాది యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మొత్తం 1200 ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. 40 మంది క్రిమినల్స్‌ను పోలీస్ శాఖ మట్టుబెట్టింది. ఎన్కౌంటర్ల పర్వంపై మానవ హక్కుల సంఘం నోటీసులు జారీ చేయగా.. యూపీ ప్రభుత్వం భిన్నంగా స్పందించింది. క్రిమినల్స్ పై ఉదాసీనత చూపటమే ప్రజా స్వామ్యానికి, సమాజానికి నిజమైన చేటు అని సీఎం యోగి చెబుతున్నారు. తుపాకీకి తుపాకీతో సరైన సమాధానం చెప్పాలని గోరఖ్‌పూర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఆయన ప్రకటించిన విషయం కూడా తెలిసిందే. पुलिस से नहीं, क्राइम से डर लगता है साहेब !! pic.twitter.com/HXmfRafCzN — UP POLICE (@Uppolice) 16 February 2018 -
తుపాకీకి తుపాకీతోనే సమాధానం: యోగి
గోరఖ్‌పూర్: హింసకు పాల్పడే వారికి అదే రీతిలో సమాధానం చెప్పాలని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించారు. యూపీలో ఇటీవల ఎన్కౌంటర్లు పెరగాయనే విమర్శలపై ఆయన ఇలా స్పందించారు. ‘అందరికీ భద్రత కల్పించడం ప్రభుత్వం కనీస బాధ్యత. సమాజంలో ప్రశాంతతను చెదరగొడుతూ తుపాకీని నమ్మే వారికి తుపాకీ భాషలోనే సమాధానం చెప్పాలి. ఈ విషయంలో ఆందోళన చెందనక్కర్లేదని అధికారులకు చెప్పాను’ అని యోగి అన్నారు. అంతకు ముందు లక్నోలో విలేకర్లలో మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా వారు అమర్యాదగా వ్యవహరించారన్నారు. -
తీవ్ర విమర్శలు.. ‘అయినా తూటాలు పేలాల్సిందే’
లక్నో : అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాలేదు. 10 నెలల వ్యవధిలో 1,142 ఎన్కౌంటర్లు.. 38 మంది క్రిమినల్స్ హతం. గత 25 రోజుల్లో 60 ఎన్కౌంటర్లు 8 మంది గ్యాంగ్స్టర్లను మట్టుబెట్టేశారు. ఇది ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ హయాంలో ఉత్తర ప్రదేశ్ పోలీస్ శాఖ సాధించిన ట్రాక్ రికార్డు. అయితే ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం గోరఖ్‌పూర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాస్త తీవ్రంగానే స్పందించారు. ‘‘ప్రతీ ఒక్కరికీ రక్షణ అవసరం. కానీ, తుపాకీనే నమ్ముకున్న కొందరు మాత్రం శాంతి భద్రతలను దెబ్బతీస్తున్నారు. తుపాకీకి తుపాకీతోనే దెబ్బ కొట్టాలి. అలాంటి వారికి తూటాలతోనే సమాధానం ఇవ్వాలి. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గొద్దని అధికారులను ఆదేశిస్తున్నా. విమర్శలు చేసేవారు ప్రజల బాగోగులు గురించి ఆలోచించటం లేదు. అలాంటప్పుడు వారిని మేమెందుకు పట్టించుకోవాలి’’ అని యోగి పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ ఏడాది కాలంలో జరుగుతున్న ఎన్కౌంటర్లతో స్థానికులు హడలెత్తిపోతున్నారు. ఓవైపు రాజకీయంగా విమర్శలు ఎదుర్కుంటుండగా.. యోగి ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం(గత నవంబర్లోనే) నోటీసులు కూడా జారీ చేసింది. అయినప్పటికీ ఎన్కౌంటర్ల విషయంలో యోగి ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. అసెంబ్లీలో రచ్చ... ఇక ఈ అంశంపై గురువారం యూపీ అసెంబ్లీలో పెద్ద రచ్చే జరిగింది. ఫేక్ ఎన్కౌంటర్లలో అమాయకపు పౌరులను బలి తీసుకుంటున్నారని సమాజ్‌వాదీ పార్టీ వాదన వినిపించగా.. ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు ఫ్లకార్డులు, నినాదాలతో సభను హోరెత్తించారు. ఇక మరికొందరు ప్రతిపక్ష సభ్యులు బెలూన్లను ఎగరేయటం.. గవర్నర్ మీదకు పేపర్లను విసిరేయటంతో మార్షల్స్ సీన్లోకి రావటం.. కాస్త ఉద్రిక్త పరిస్థితులే నెలకొన్నాయి. -
10 నెలలు.. 1,142 ఎన్కౌంటర్లు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న నేరస్తులపై యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. గత మార్చిలో యోగి సీఎంగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి 2018, జనవరి 31 వరకూ యూపీలో 1,142 ఎన్కౌంటర్లు జరిగినట్లు పోలీసులు ఓ నివేదిక విడుదల చేశారు. ఈ కాల్పుల్లో 34 మంది నేరస్తులు ప్రాణాలు కోల్పోగా, 265 మంది గాయపడ్డారు. గత 10 నెలల్లో 2,744 మంది హిస్టరీ షీటర్ల(నేర చరిత్ర ఉన్నవారు)ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆపరేషన్లలో నలుగురు పోలీస్ సిబ్బంది చనిపోగా, 247 మంది గాయపడ్డారు. రాష్ట్రంలో నేరస్తులను ఏరివేయడానికి పోలీసులకు సీఎం యోగి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో ‘ఆపరేషన్ క్లీన్’ పేరిట పరారీలో ఉన్న నేరస్తుల కోసం వేట మొదలైందన్నారు. ‘లొంగిపోండి లేదా రాష్ట్రం విడిచివెళ్లిపోండి’ అని నేరస్తులకు ప్రభుత్వం స్పష్టం చేసిందన్నారు. మీరట్ జోన్లో పోలీసులు అత్యధికంగా 449 ఎన్కౌంటర్లు చేయగా, ఆ తర్వాతి స్థానాల్లో ఆగ్రా(210), బరేలీ(196), కాన్పూర్(91) జోన్లు నిలిచాయన్నారు. సీఎం యోగి నియోజకవర్గమైన గోరఖ్‌పూర్ జోన్లో(31) అతితక్కువ ఎన్కౌంటర్లు జరిగినట్లు వెల్లడించారు. దీంతోపాటు రాష్ట్రంలో నేరాలను అరికట్టడానికి 167 మంది క్రిమినల్స్‌పై జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద కేసు నమోదు చేయడంతో పాటు రూ.150 కోట్ల విలువైన ఆస్తుల్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎన్కౌంటర్ ముసుగులో సామాన్య పౌరుల్ని పోలీసులు కాల్చిచంపడంపై యూపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. నోయిడాలోని ఓ జిమ్ యాజమానితో పాటు మరో వ్యక్తిని పోలీసులు కాల్చిచంపడంపై జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) యూపీ ప్రభుత్వానికి ఇప్పటికే నోటీసులు సైతం జారీచేసింది. ఈ ఎన్కౌంటర్లపై సరైన ప్రభుత్వ పర్యవేక్షణ లేకుంటే 1991 నాటి పిలిభిత్ నకిలీ ఎన్కౌంటర్ లాంటి ఘటనలు పునరావృతమవుతాయని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 1991లో ప్రైవేటు బస్సులో ఓ పుణ్యక్షేత్రానికి వెళ్లివస్తున్న 10 మంది సిక్కుల్ని యూపీ పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లో కాల్చిచంపారు. వీరిందరూ పాకిస్తాన్ ప్రోద్బలం ఉన్న ఖలిస్తానీ తీవ్రవాదులని బుకాయించారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక సీబీఐ కోర్టు 2016లో 47 మంది పోలీస్ అధికారుల్ని దోషులుగా తేల్చింది. ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ ప్రతినిధి రాజేంద్ర చౌధరీ మాట్లాడు తూ.. ‘ప్రభుత్వం నేరాలను తగ్గించడంలో విఫలమై ఎన్కౌంటర్ల ముసుగులో తన అసమర్థతను కప్పిపుచ్చుకుంటోంది’ అని అన్నారు. -
ఉత్తరప్రదేశ్ పోలీసుల దూకూడు 18 ఎన్కౌంటర్లు
-
ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రేహౌండ్స్ బలగాలెందుకు?
సాక్షి, హైదరాబాద్: ఎన్కౌంటర్లు హత్యలకు ప్రత్యామ్నాయ పదంగా మారాయని, టేకులపల్లి హత్యాకాండను ఖండిస్తున్నామని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు చెప్పారు. ఇవి, ఎన్కౌంటర్ పేరున జరిగిన హత్యలని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మళ్లీ వెంగళరావు కాలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తు చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా మొదటిసారిగా ప్రాజెక్టుల నిర్మాణానికి గ్రేహౌండ్స్, పారామిలటరీ దళాలు ఎందుకు ఉపయోగిస్తున్నారని ఆయన నిలదీశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టఫ్, విరసం, పౌరహక్కుల సంఘం, తెలంగాణ ప్రజాఫ్రంట్ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అనంతరంప్రజా సంఘాల నాయకులు విమలక్క, నలమాస కృష్ణ, లక్ష్మణ్ తదితరులతో కలసి వరవరరావు విలేకరులతో మాట్లాడారు. ఇళ్లనుంచి పట్టుకొని వచ్చి మరీ ఆదివాసీ విద్యార్థులను చిత్రహింసలు పెట్టి, హత్యలు చేసి ఎన్‌కౌంటర్లుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఆదివాసీలంటే మావోయిస్టులుగా, మావోయిస్టులంటే ఆదివాసీలుగా ముద్రవేస్తున్నారని ఆరోపించారు. టేకులపల్లి కాల్పుల ఘటనపై హత్యానేరం నమోదు చేసి, ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను సస్పెండ్ చేసి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న సోయం బాబూరావును అరెస్టు చేయడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. ఆదివాసులకు లంబాడీలకు మధ్య చిచ్చు పెట్టి ప్రభుత్వం తమాషా చూస్తోందని వరవరరావు విమర్శించారు. పౌరహక్కుల సంఘం నేత లక్ష్మణ్ మాట్లాడుతూ ఇళ్ల నుంచి పట్టుకొచ్చిన వారిని ఎన్కౌంటర్ పేరున హత్య చేయడం అమానుషమని విమర్శించారు. స్వయంప్రతిపత్తి గల ఒక విచారణ కమిటీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడిన తరవాత జరిగిన పెద్ద మారణకాండ ఇదని, హక్కుల కోసం మాట్లాడుతున్న వారిని, ప్రశ్నించే గొంతులను లేకుండా చేస్తున్న హత్యలని నలమాస కృష్ణ అభిప్రాయపడ్డారు. భూమిని, ఖనిజ సంపదను తాకట్టు పెడుతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే ఎన్కౌంటర్ పేర హత్యలు చేస్తున్నారని అరుణోదయ విమలక్క విమర్శించారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి మధ్యాహ్నం వరకు మీడియాను, ప్రజలను ఆ ప్రదేశానికి ఎందుకు రానివ్వలేదని ఆమె ప్రశ్నించారు. ఆదివాసీలపై పెట్టిన కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర పోలీసులు విద్యార్థులయిన ఆదివాసీలను హింసించి హత్య చేశారని, ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని ఆమె ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో న్యూడెమొక్రసీ పరశురాం, పీడీఎస్‌యూ నేత గౌతమ్ పాల్గొన్నారు. -
బస్తర్‌లో ఖాకీ రాజ్యం
-
బస్తర్‌లో ఖాకీ రాజ్యం
హక్కుల ఊసెత్తితే జైలే! ⇒ ఛత్తీస్‌గఢ్ జైల్లో మూడు నెలలుగా తెలంగాణ హక్కుల నేతల బృందం ⇒ ఎన్కౌంటర్లు, అత్యాచారాలపై నిజనిర్ధారణ కోసం పయనం.. ⇒ భద్రాచలంలోనే అరెస్ట్.. ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగింత! సాక్షి నాలెడ్జ్ సెంటర్: తెలంగాణకు చెందిన న్యాయవాదులు, పాత్రికేయులతో కూడిన ఏడుగురు హక్కుల కార్యకర్తలు గత మూడు నెలలుగా ఛత్తీస్‌గఢ్ జైల్లో మగ్గుతున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఎన్కౌంటర్లు, అత్యాచారాల ఘటనలపై నిజనిర్ధారణ కోసం తెలంగాణ ప్రజాస్వామిక వేదిక(టీడీఎఫ్)కు చెందిన ఈ ప్రతినిధి బృందం డిసెంబర్ 24న ఛత్తీస్‌గఢ్ బయల్దేరింది. అయితే 26వ తేదీన వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్బంధించారు. మావోయిస్టులకు సాయం చేస్తున్నారన్న ఆరోపణలతో కోర్టులో హాజరుపర్చగా.. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించి సుక్మా జైలుకు పంపింది. బెయిల్ దరఖాస్తులనూ తిరస్కరించింది. జనవరిలో కూడా వారి బెయిల్ దరఖాస్తులను దంతెవాడ జిల్లా కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఎఫ్ఐఆర్ నకలు కానీ, వారి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్తున్న వస్తువుల వివరాలు, పంచనామా నివేదికలు కానీ డిఫెన్స్ న్యాయవాదులకు ఇవ్వలేదు. ప్రస్తుతం హైకోర్టులో వారి బెయిల్ పిటిషన్ విచారణలో ఉంది. ఎవరు వారు? ఛత్తీస్‌గఢ్ జైల్లో ఉన్నవారిలో హైదరాబాద్‌కు చెందిన సామాజిక కార్యకర్త దుర్గాప్రసాద్ (36), ఆదివాసీ తుడుం దెబ్బ ఖమ్మం కార్యదర్శి ఆర్.లక్ష్మయ్య (45), హైదరాబా ద్‌కు చెందిన పాత్రికేయులు బి.ప్రభాకర్ రావు (52), రాజేంద్రప్రసాద్ (28), హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్‌రావు (48), బి.రవీంద్రనాథ్ (42), ఉస్మానియా యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్, తెలంగాణ విద్యార్థి వేదిక నాయకుడు మొహమ్మద్ నిజాం ఉన్నారు. నిజానికి.. హైదరాబాద్ నుంచి బయల్దేరిన ఈ బృందాన్ని 25న భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం గ్రామంలో తెలంగాణ పోలీసులే నిర్బంధించారని, తర్వాత వారిని ఛత్తీస్‌గఢ్ పోలీసులకు అప్పగించారని తెలంగాణ పౌర హక్కుల సంఘాలు ఆరోపించాయి. వీరు ఏడుగురూ మావోయిస్టు పార్టీకి సాయం చేస్తున్నారని, వాళ్లు ప్రయాణిస్తున్న నాలుగు మోటారు సైకిళ్లు, రూ.లక్ష విలువైన రద్దు చేసిన నోట్లు, మొబైల్ ఫోన్లు, మావోయిస్టు సాహిత్యం స్వాధీనం చేసుకున్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు ఆరోపించారు. నక్సలైట్ల కోసం పాత కరెన్సీని మార్చి ఇస్తున్నారని, మావోయిస్టులకు సాయం చేయాలని స్థానికులపై ఒత్తిడి తెస్తు న్నారని అభియోగాలు మోపారు. బస్తర్‌లో హక్కుల గురించి మాట్లాడినా, అత్యాచారాల గురించి కథనాలు రాసినా.. హక్కుల నేతలు, పాత్రికేయులపై తప్పుడు కేసులు మోపడం పరిపాటిగా మారిందని పలు సంఘటనలను ఉదహరిస్తూ కేంద్ర మానవ హక్కుల కమిషన్, సుప్రీంకోర్టులకు కూడా లేఖలు రాశాయి. ప్రొఫెసర్లు, జర్నలిస్టులకు వేధింపులు డిసెంబర్ మొదటి నెలలో ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ నందినీ సుందర్, జేఎన్‌యూ ప్రొఫెసర్ అర్చనాప్రసాద్ తదితరులపై సుక్మా జిల్లాలో పోలీసులు హత్య కేసు నమోదు చేశారు. నవంబర్ 4న రాష్ట్రంలో హత్యకు గురైన ఒక గిరిజనుడి భార్య ఫిర్యాదు మేరకు ఈ హత్య కేసు నమోదు చేసినట్లు చెప్పారు. బస్తర్‌లో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నందినీ సుందర్ ఎంతో కాలంగా హక్కుల విషయాలపై పని చేస్తున్నారు. ఆమె వేసిన పిటిషన్ వల్లనే మావోయిస్టు వ్యతిరేక సాల్వాజుడుంను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సామాజిక కార్యకర్త డాక్టర్ బినాయక్‌సేన్, ఆదివాసీ హక్కుల కార్యకర్త సుకుల్ ప్రసాద్ బార్సే, గిరిజన కార్యకర్త, లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేసిన సోనీ సోరి, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మాలినీ సుబ్రమణ్యం, టీవీ విలేకరి ప్రభాత్సింగ్, పత్రిక విలేకరి దీపక్ జైశ్వాల్‌లను కూడా పోలీసులు ఇలాగే వేధించారు. కొందరు పాత్రికేయులు పోలీసుల కేసులు, వేధింపులకు భయపడి ఆ ప్రాంతాలను వీడి వెళ్లిపోయారు. 13 ఏళ్ల బాలుడి ‘ఎన్కౌంటర్’ కేసు కిందటేడాది ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాల ‘ఎన్కౌంటర్’లలో 134 మంది చనిపోయారు. ఆ బలగాలు లైంగిక హింసకు పాల్పడిన మూడు ఉదంతాలు వెలుగులోకి వచ్చాయి. టీడీఎఫ్ నిజనిర్ధారణ పర్యటనలో భాగంగా.. బీజాపూర్ జిల్లా మెటపల్ గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు సోమారు పొట్టం ‘ఎన్కౌంటర్’ ఘటనను కూడా పరిశీలించనుంది. ఛత్తీస్‌గఢ్ పోలీసులు డిసెంబర్ 16న ఈ బాలుడిని పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్పూర్ హైకోర్టులో బాలుడి తండ్రి పిటిషన్ వేశారు. అతడిని పోలీసులు చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, గ్రామస్తులందరూ చూస్తుండగా అతి సమీపం నుంచి కాల్చి చంపారని ఆరోపించారు. దీంతో ఆ బాలుడి మృతదేహాన్ని బయటికి తీసి మళ్లీ శవపరీక్ష నిర్వహించాలని బిలాస్పూర్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో డిసెంబర్ 25, 26 తేదీల్లో శవపరీక్ష చేశారు. ఈ కేసులో నిజనిర్ధారణ చేయనున్న టీడీఎఫ్ బృందాన్ని ముందుగానే అరెస్ట్ చేసి జైలుకు పంపారు. వీరిని అరెస్ట్ చేసిన సమయంలోనే జగదల్పూర్ న్యాయ సహాయ బృందానికి చెందిన శాలినీ గేరా అనే న్యాయవాది.. మావోయిస్టులకు రూ.10 లక్షల కొత్త నోట్లు మార్చి ఇచ్చారని, దంతెవాడ అడవుల్లో ఆమె మావోయిస్టులను కలిసినట్లు తమకు ఫిర్యాదు అందిందంటూ బస్తర్ ఎస్పీ ఆర్.ఎన్.దాష్ ఆరోపించారు. ఈ మేరకు ఆమెకు ఫోన్ చేసి బెదిరించారు. ఆమె గదిని సోదా చేయాలని, విచారణకు స్టేషన్‌కు రావాలని బెదిరించారు. ఇంతకూ ఆమె ఎవరో కాదు.. పోలీసుల చేతుల్లో హతమైన 13 ఏళ్ల బాలుడి ఎన్‌కౌంటర్‌పై అతడి తల్లిదండ్రుల తరఫున హైకోర్టులో పిటిషన్ వేసిన న్యాయవ్యాది కావడం గమనార్హం! ఛత్తీస్‌గఢ్‌లో మహిళా మావోయిస్టుల ర్యాలీ మల్కన్‌గిరి: మహిళా దినోత్సవం సందర్భంగా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమ జిల్లా అడవిలో బుధవారం మహిళా మావోయిస్టులు ర్యాలీ నిర్వహించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణకు చెందిన సభ్యులు స్థానిక గిరిజన మహిళలతో కలిసి భారీగా ప్రదర్శన నిర్వహించారు. మహిళలు హక్కుల కోసం పోరాడాలని, గిరిజన మహిళల్లో చైతన్యం రావాలని వారు కోరారు. ఈ సందర్భంగా జననాట్యమండలి ఆధ్వర్యంలో గీతాలాపనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆత్మరక్షణ విధానాలపై వారికి అవగాహన కల్పించారు. -
బూటకపు ఎన్కౌంటర్లపై ప్రజా సంఘాల మండిపాటు
-
ఎన్కౌంటర్ల పేరిట మారణకాండ
– కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాల ధర్నా కర్నూలు(న్యూసిటీ): బహుళ జాతి సంస్థలకు బాక్సైట్ ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఎన్కౌంటర్ల పేరిట ప్రభుత్వం మారణకాండ జరుపుతోందని విప్లవ రచయితల సంఘం(విరసం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పినాకపాణి ఆరోపించారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నాకు సీపీఐ జిల్లా నాయకుడు రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా పినాకపాణి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్–ఒడిశా సరిహద్దు(ఏఓబీ)లో నవంబర్ 23వ తేదీన జరిగిన ఎన్కౌంటర్ బూటకమన్నారు. ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాబకాష్ , విరసం రాష్ట్ర నాయకుడు అరుణ్ మాట్లాడుతూ.. ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేయడం రాజ్యాంగం ప్రకారం నేరమని కోర్టులు చాలా సందర్భాల్లో పేర్కొన్నాయన్నారు. ప్రజా అభ్యుదయ సంస్థ జిల్లా కార్యదర్శి భార్గవ్‌కుమార్ , సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి.షడ్రక్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జేమ్స్, పౌర హక్కుల సంఘం జిల్లా నాయకుడు రత్నం ఏసేపు, జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లాబకాష్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు శేషఫణి తదితరులు పాల్గొన్నారు. -
ఈ ఘర్షణ సమసిపోవాలంటే..
కొత్త కోణం 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆదివాసులు అనారోగ్యంతో, ఆకలితో అవమానాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. వారికి ఆసరాగా నిలబడుతున్నది నక్సలైట్లే. అందుకే ఆదివాసులు మావోయిస్టులతో మమేకమవుతున్నారు. తుపాకులు పట్టిన మావోయిస్టులలో అత్యధికులు వారే. ప్రభుత్వాలు నక్సలైట్లను ఏరివేసి, ఆదివాసీ ప్రాంతాలను కార్పొరేట్లకు అప్పగించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో కచ్చితమైన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలు అమలు జరగాలి. వామపక్ష తీవ్రవాదం(నక్సలిజం) జాతీయ భద్రతా సమస్యగా ఉన్నందున సైనిక చర్యలు మాత్రమే పరిష్కారమనే భావన ఉంది. కానీ ఈ విధానం ఆదివాసులను మరింత దూరం చేయగలదు. ప్రభుత్వానికి, ఆదివాసులకు మధ్య అగాధం పెంచగలదు. అందువల్ల ఇది ఎటువంటి పరిస్థితుల్లో ఆచర ణీయం కాకూడదు. 2004లో ఆదివాసీ సమస్యలపై నియమించిన ఉన్నత స్థాయి సంఘం ఇచ్చిన నివేదికలోని వాక్యాలివి. తరతరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న ఆదివాసీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం కూడా అవసరమని సామాజిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ వర్జినియస్ కాకా నేతృత్వంలోని ఆ కమిటీ భావించింది. ఆదివాసీ ప్రాంతాల్లోని వనరులను కొల్లగొట్టడానికి ప్రభు త్వాలు, కార్పొరేట్ సంస్థలు కలిసి చట్టాలను ఉల్లంఘించి, అక్రమాలకు పాల్పడటాన్ని అరికట్టాలని అది చాలా స్పష్టంగా పేర్కొన్నది. ఆదివాసుల ప్రయోజనాలకు, అభీష్టానికి వ్యతిరేకంగా వారి ఆవాస ప్రాంతాల నేలలో నిక్షిప్తమై ఉన్న సహజ వనరులను గిరిజనేతరులకు ధారాదత్తం చేయకూ డదని, వాటి ద్వారా వచ్చే లాభాల్లో ఆదివాసులకు సైతం వాటా ఉండాలని, దానిని వారి అభివృద్ధికి ఉపయోగించాలని కమిటీ సూచించింది. కానీ భారత ప్రభుత్వాలు ఏనాడూ అడవి బిడ్డలైన ఆదివాసులను ఈ సమాజంలో భాగంగా చూడలేదు. వారికి తమదైన సొంత సంస్కృతి, ప్రత్యేక ఆచార, సాంప్రదాయాలు ఉన్నాయని కూడా పరిగణనలోనికి తీసుకోలేదు. నక్సలైట్ పార్టీలు అటవీ ప్రాంతాల్లో ఉద్యమాలు నిర్మించడానికి ముందు ప్రభుత్వ యంత్రాంగం అక్కడ అడుగుపెట్టిన జాడే లేదు. ఆదివాసీలను, వారి వన రులను దోపిడీ చేసేందుకే అటవీ ప్రాంతాల్లోనికి అడుగుపెట్టిన షావు కార్లు, కాంట్రాక్టర్లు, వారిని నిత్యం హింసించే ఫారెస్ట్ అధికారులు మాత్రమే అప్పు డప్పుడు వెళ్లేవారు. 1993లో కొంత మంది జర్నలిస్టులం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతానికి వెళ్లాం. మమ్మల్ని చూసిన ఆడవాళ్లు, పిల్లలు గుడిసెల్లో దూరి పోయారు. మాతో ఒక షావుకారు ఉండటం వల్ల కొంతమంది మగవాళ్లు మాత్రం నిలబడ్డారు. కార్పొరేట్ల ధన దాహం వల్లనే... అంటే, ఆ ప్రజలకు అప్పటికి షావుకార్లు, ఫారెస్టు ఆఫీసర్లు తప్ప బాహ్య ప్రపంచం తెలియదు. ప్రభుత్వాధికారుల జాడే ఉండేది కాదు. పైగా, మేం వెళ్లినది వాహనాలు వెళ్ళగలిగే ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం. వారం రోజుల క్రితం నేటి ఏపీ పోలీసులు ఒడిశాలో నక్సలైట్లపై దాడి చేసిన ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్న ప్రాంతం. దాదాపు 27 మంది నక్సలైట్లని, లేదా ఆదివాసులను ఒకేసారి కాల్చి చంపిన మొదటి ఘటన అది. ఇవి ఎదురు కాల్పులని పోలీసులు ప్రకటించినా, సాధారణ పౌరులెవ్వరూ ఇది నిజంగానే ఎన్కౌంటర్ అని విశ్వసించే స్థితిలో లే రు. మావోయిస్టు పార్టీ సీనియర్ నాయకులు, పొలిట్ బ్యూరో సభ్యులు అక్కిరాజు హరగోపాల్ అలి యాస్ ఆర్కే ఘటనాస్థలిలో ఉన్నట్టు పోలీసులు ధ్రువీకరించారే కానీ, ఇంకా ఆయన ఆచూకీని బయటపెట్టలేదు. ఆర్కే భార్య పద్మక్క ఈ సోమవారం హైకోర్టులో దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి, జస్టిస్ ఎమ్మెస్కే జైస్వాల్... మావోయిస్టయినా, సాధారణ పౌరుడైనా వారి ప్రాణ రక్షణ బాధ్యత ప్రభుత్వాలదేనని తేల్చి చెప్పడం ప్రభుత్వాల తీరుతెన్నులకు మందలింపుగా భావించవచ్చు. ప్రభు త్వాలు పౌరుల రక్షణకు బాధ్యత వహించాలని కోర్టులు పదే పదే చెప్పినా అది వాటి చెవికి ఎక్కక పోవడం యాదృచ్ఛికం కాదేమో. నిజమైన ఎదురు కాల్పులు జరిగినప్పుడు రెండు వైపులా భావోద్వేగాలు ఉంటాయన్నది వాస్తవం. కానీ ప్రభుత్వాలు మరింత బాధ్యతతో పౌరుల ప్రాణాలకు హానీ కలిగించకుండా జాగ్రత్త వహించాలి. కానీ అందుకు భిన్నమైనదే ఆచరణలో జరుగుతోంది. మొత్తంగా ఈ వ్యవహారాన్ని నక్సలైట్లకూ పోలీసులకూ మధ్య యుద్ధంగా మార్చి ప్రభువులు పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. ప్రభు త్వాల పెద్దలు తమ రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు సాధారణ పోలీసులను పావులుగా వాడుకుంటున్నారు. నిజానికి ఇది పోలీసులకు, నక్సలైట్లకు మధ్య యుద్ధం కాదు. ఇది కార్పొరేట్ల ధన దాహం, ప్రభుత్వాల దళారీతనాలకూ, ఆదివాసీల అస్తిత్వ, ఆత్మ గౌరవాలకూ మధ్య సంఘర్షణ. ఈ ప్రాథమిక అంశాన్ని మరుగుపరచడానికి పోలీసులను, ఆ తర్వాత సైన్యాన్ని ముందు పెట్టి కార్పొరేట్ కంపెనీలు ఖనిజ వనరుల దోపిడీకి పాల్పడుతున్నాయి. నక్సలిజం, మావోయిజాలకు మూలం నక్సలైట్లు, మావోయిస్టుల పుట్టుకకు, మనుగడకు రాజకీయ, సిద్ధాంత కార ణాలకన్నా స్థానికమైన సామాజిక, ఆర్థిక విషయాలే ప్రధాన కారణమని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయి. పైగా ప్రభుత్వాలన్ని ఉద్దేశపూర్వకంగానే రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కాయి. ‘‘ఆదివాసులకు ప్రత్యేక పాలనా ధికారాలు, స్వయంపాలనా వ్యవస్థలు ఉంటాయి. వారి ఆర్థిక, సామాజిక పునాదులపై ఆధారపడి మాత్రమే వారి అభివృద్ధి సాగాలి. వారి ప్రాంతానికి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా వాళ్ల ప్రత్యేక మండలుల అంగీకారం తప్పనిసరిగా ఉండాలి’’ అని రాజ్యాంగ సభ అధ్యక్షుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ 1949లోనే అన్నారు. మన రాజ్యాంగకర్తలు ఎంతో సామాజిక చైత న్యంతో, బాధ్యతతో చట్టాలను రూపొందిస్తే మన పాలకులు వాటిని బుట్ట దాఖలు చేశారు. నక్సలైట్ ఉద్యమ ప్రస్థానమే దానికి నిదర్శనం. నక్సలైట్ ఉద్యమం పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరిలో ఆరంభమైంది. ఆదివాసీలు తరతరాలుగా తమ అధీనంలో ఉన్న భూములను బయటి ఆదివాసేతరులైన భూస్వాములు ఆక్రమించు కోవడాన్ని ఎదిరించి, తమ భూములు తాము దున్నుకోవడం ప్రారంభించగా ఘర్షణ ప్రారంభమైంది. ఇది ప్రారంభం. నక్స ల్బరీలో రక్తపుటేరులు ప్రవహించాయి. దానికి సమాంతరంగా, సరిగ్గా అదే సమయంలో శ్రీకాకుళం ఏజెన్సీ ఆదివాసీలు తమ హక్కుల కోసం, షావు కార్లు, భూస్వాముల దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఉద్యమించారు. భూస్వాముల గూండాలు దాడి చేసి కోరన్న, మంగన్న అనే తొట్టతొలి మార్క్సిస్టు, లెనినిస్టు కార్యకర్తలను హతమార్చారు. వారి మరణంతో ఆ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఆయుధాలు తీసుకున్నారు. ఈ రెండు ఘటనలు దేశవ్యాప్తంగా ఆదివాసీ తిరుగుబాట్లకు మార్గం వేశాయి, నక్సలైట్ సాయుధ పోరాటానికి కారణమయ్యాయి. ప్రభుత్వాలు ఈ ఉద్యమాన్ని అణచివేయడానికి పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టి వందలాది మంది నక్సలైట్ నాయకులను, కార్యకర్త లను, సామాన్య ప్రజలను చంపివేశాయి. ‘ఎన్కౌంటర్’లు ప్రారంభమైంది కూడా శ్రీకాకుళంలోనే. ఆదివాసీ ఉద్యమా లపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేస్తూనే, ఆదివాసీ రక్షణ పేరుతో కొన్ని చట్టాలను, సంస్కరణలను ప్రభు త్వాలు ముందుకు తెచ్చాయి. ఆ విధంగానే మన రాష్ట్రంలో 70 (1) చట్టం ఉనికిలోనికి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రవేశ పెట్టిన ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ అథారిటీ(ఐటీడీఏ) వ్యవస్థలు. ఆదివాసుల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కోసం, 1974లోనే ట్రైబల్ సబ్‌ప్లాన్ (టీఎస్పీ)లు అందులో భాగమే. అయితే కాలక్రమేణా 70 (1) చట్టం నీరుగారి పోయింది. ఆదివాసుల నుంచి ఆదివాసీయేతరులు భూములు కొనకూడదనే రక్షణను కల్పించడంలో ఈ చట్టం ఆచరణలో విఫలమైంది. ఐటీడీఏల ద్వారా ఆదివాసీలకు అరకొరగానే అయినా కొంత మెరుగైన సౌకర్యాలు కలిగాయి. ట్రైబల్ సబ్‌ప్లాన్ అమలు కూడా సరైన విధంగా ఫలితాలను ఇవ్వలేదు. ఆదివాసీ హక్కుల నిరాకరణే అసలు సమస్య అందువల్లనే నక్సలైట్ ఉద్యమం అటు జార్ఖండ్‌కు, ఇటు గోదావరి లోయ ప్రాంతంలోనికి, ఆదిలాబాద్ అడవికి విస్తరించింది. 1980 తర్వాత ఛత్తీస్ గఢ్‌లోకి ప్రవేశించినప్పటికీ, 1990 తర్వాతనే అక్కడ ఉద్యమం బల పడింది. 1990 అనంతరం ఆర్థిక సంస్కరణల ద్వారా వచ్చిన ప్రపంచీకరణలో భాగంగా ముందుకు వచ్చిన సరళీకరణ విధానాలు ప్రైవేట్ కంపెనీల జోరుకు ఊపునిచ్చాయి. దానితో కార్పొరేట్ కంపెనీల దృష్టి ఆదివాసీ ప్రాంతాల మీదకు వెళ్ళింది. మన దేశంలో లభించే బొగ్గు, ఇతర ఖనిజాల్లో నూటికి 70 శాతం ఆదివాసీ ప్రాంతాల్లోనే ఉన్నాయి. 1995లో చంద్రబాబు అధికారం లోని వచ్చిన తర్వాత ఒడిశా–ఏపీ సరిహద్దుల్లో బాక్సైట్ గనులపై సర్వహ క్కులు« ప్రైవేట్ కంపెనీలకు ధారాదత్తం చేశారు. ఈ ఒప్పందంపైనే సమత అనే స్వచ్ఛంద సంస్థ కోర్టుని ఆశ్రయించింది. ఆదివాసులు ఈ బాక్సైట్ తవ్వ కాలపట్ల తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు. చివరకు సుప్రీంకోర్టు, ఆదివాసీ ప్రాంతాల్లోని భూమితో సహా ఎటువంటి వనరులనూ గిరిజనేతరులు ఉప యోగించుకోవడానికి వీలులేదని, ప్రభుత్వాలు కూడా గిరిజనేతరు లేనని, వారికి కూడా ఈ నియమం వర్తిస్తుందని చారిత్రాత్మకమైన తీర్పును వెలు వరించింది. అయినా ప్రభుత్వాలు తమ ప్రయత్నాలను మానుకోకపోవడం వల్ల దాదాపు రెండు కోట్ల మందికి పైగా ఆదివాసులు నిరాశ్రయులైనట్టు ప్రభుత్వ లెక్కలే చెపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్లీ నక్సలైట్లు, మావోయి స్టులు ఆదివాసులకు అండగా నిలిచారు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఆదివాసులు అనారోగ్యంతో, ఆకలితో అవమానాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వారికి ఆసరాగా నిలబడుతున్నది, వారి అభివృద్ధికి తోడ్పడుతున్నది నక్సలైట్లు మాత్రమే. అందుకే ఆదివాసులు మావోయిస్టులతో మమేకమవుతున్నారు. ప్రభుత్వాలు నక్సలైట్లను ఏరివేసి, ఆదివాసీ ప్రాంతాలను కార్పొరేట్లకు అప్ప గించాలని విశ్వప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగమే ఆపరేషన్ గ్రీన్ హంట్. ఇది ఆదివాసులలో మరింత తీవ్ర అశాంతిని రగులుస్తోంది. తుపా కులు పట్టిన మావోయిస్టులలో అత్యధికులు ఆదివాసులేనంటే ఆశ్చర్యపోవా ల్సిన పనిలేదు. ఈ పరిస్థితి మారాలంటే ఆదివాసీ ప్రాంతాల్లో కచ్చితమైన రాజ్యాంగ స్ఫూర్తితో చట్టాలు అమలు జరగాలి. తామూ ఈ దేశంలో భాగమే ననే విశ్వాసం ఆదివాసులకు కలగాలి. అది జరగకుంటే అక్కడ అలజడి ఆగదు. సంఘర్షణ సమసిపోదు. నక్సలైట్ ఉద్యమాన్ని ఈ చారిత్రక క్రమం నుంచి అర్థం చేసుకోకుంటే ప్రభుత్వాలు భవిష్యత్‌లో మరిన్ని ఉద్యమాలను ఎదుర్కోక తప్పదు. (వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య సామాజిక విశ్లేషకులు మొబైల్ : 97055 66213) -
నక్సల్స్ ఎజెండా అంటూనే ఎన్కౌంటర్లు
పదవి భయంతోనే నయీంను ¯ హతమార్చారు విరసం నాయకుడు వరవరరావు శృతి, సాగర్ ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక రాష్ట్ర కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ హన్మకొండ : నక్సల్స్ ఎజెండానే తన ఎజెండా గా చెప్పుకునే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఎన్కౌంటర్లు చేయిస్తుండడం గర్హనీయమని విరసం నాయకుడు వరవరరావు అన్నారు. హన్మకొండ శ్యామలదుర్గాప్రసాద్ కాలనీలోని శ్యామల గార్డెన్స్‌లో శృతి, సాగర్ల సంస్మరణ సభ ఆదివారం జరిగింది. ఈ సభకు పో లీసులు అనుమతి నిరాకరించారు. దీంతో శృతి, సాగర్ తల్లిదండ్రులు తమ బిడ్డల సంస్మరణ సభను మైక్, వేదికపై ప్లెక్సీలు లేకుండానే నిర్వహించారు. సభలో వరవరరావు మాట్లాడుతూ తమ బిడ్డలను సామూహికంగా స్మరించుకునే అవకాశం తల్లిదండ్రులకు కల్పించక పోవడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్కౌంటర్లు ఉండవని, నెత్తురు పారదని చెప్పి.. నెత్తురు పారిస్తున్నారన్నారు. శృతి, సాగర్‌ను సజీవంగా పట్టుకుని, అతి క్రూరంగా హింసించి మేడారం అడవుల్లో ఎన్కౌంటర్ చేశారని అన్నారు. అలాగే, నయీం సమాంతర పాలన నడిపిస్తున్నందునే ఆయనను సీఎం కేసీఆర్ ఎన్కౌంటర్లో చంపించారని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు.. ఎన్టీఆర్‌ను పదవీచ్యుతున్ని చేసినట్లుగా, తన మంత్రివర్గంలోని ఐదుగురితో కలిసి ఎక్కడ ముప్పు తెస్తారన్న భయంతో ఈ ఘటనకు పాల్పడ్డారన్నారు. ప్రపంచ బ్యాంక్ ఏజెంట్‌గా మారిన చంద్రబాబును ప్రజ లు పక్కకు తప్పించారని గుర్తు చేస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ఇదే గతి పడుతుందని వరవరరావు పేర్కొన్నారు. ఇక వరంగల్‌లో పోలీసులు పాలిస్తున్నారో, ప్రజాప్రతినిధులు పాలిస్తున్నారో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మతతత్వ విధానాలను అవలంభిస్తోందన్నారు. ఆ వైఖరిని విడనాడాలన్నారు. తెలంగాణ ప్రజా స్వామిక వేదిక కన్వీనర్ చిక్కుడు ప్రభాకర్ మాట్లాడుతూ నక్సల్స్ ఎజెండానే తన ఎజెండాగా చెప్పుకుంటున్న సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే శృతి, సాగర్ల ఎన్‌కౌంటర్‌పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. సభలో శృతి తల్లిదండ్రులు మాధవి, సుదర్శన్, సాగర్ తండ్రి సుధాకర్‌రెడ్డి, కుల నిర్మూలన పోరాట కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు భూరం అభినవ్, డీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్, ప్రజాసంఘాల నాయకులు శిల్ప, ఉదయ్‌సింగ్, మెట్టు రవీందర్, కోట శ్రీనివాస్‌రావు, యోగానంద్, మాధవి, జన్ను శాంతి, బద్రి, అనిల్, శాఖమూరి రవి, దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్లు
ఏడుగురు ఉగ్రవాదుల హతం ఒక జవాను మృతి శ్రీనగర్: జమ్మూ కశ్మీర్లో వేరు వేరు జిల్లాల్లో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లలో ఏడుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక సీఆర్పీఎఫ్ జవాను చనిపోగా, ఐదుగురు జవాన్లు గాయపడ్డారు. శ్రీనగర్‌లోని నౌహట్టాలో జమా మసీదు వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి జరపగా ఒక జవాను మరణించాడు. ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. ఎదురు కాల్పులు కొనసాగిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. ఈ దాడులపై కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ విచారం వ్యక్తం చేశారు. ఐదుగురు తీవ్రవాదులు హతం... భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదులను భారత జవాన్లు హతమార్చారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా వద్ద అనుమానాస్పద కదలికల సమాచారం రాగానే బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో జవాన్లు ఎదురు కాల్పులు జరిపారు. ప్రమోద్ కుమార్ అనే జవానుకు మెడ భాగంలో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయాలయ్యాయి. అనంతరం అతడిని ఆర్మీ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఆరుగురు ఉగ్రవాదుల హతం
- కశ్మీర్లో 2 ఎన్కౌంటర్లు - నలుగురిని మట్టుబెట్టి సైనికుడి వీరమరణం శ్రీనగర్: కశ్మీర్లో రెండ్రోజుల వ్యవధిలో జరిగిన రెండు ఎన్కౌంటర్లలో ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. హంగ్ పంద్ దాదా అనే జవాను మృతి చెందాడు. కుప్వారా జిల్లా నౌగమ్ సెక్టార్‌లోని ఎల్ఓసీ ప్రాంతంలో నలుగురు ఉగ్ర వాదులు పాక్ ఆక్రమిత కశ్మీర్‌నుంచి గురువారం భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఉగ్రవాదుల కదలికల్ని గుర్తించిన భద్రతా దళాలు వారిపై కాల్పులు జరపగా, నలుగురు ఉగ్రవాదులు మరణించారు. కాగా.. బారాముల్లా జిల్లా తంగ్‌మార్గ్‌లో జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు మరణిం చారు. వీర మరణం: హవిల్దార్ హంగ్పంద్ దాదా (36) గతేడాది నుంచి 13 వేల అడుగుల ఎత్తులోనున్న శామ్శబరి రేంజ్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. గురువారం ఉగ్రవాదుల కదలికలను పసిగట్టిన దాదా బృందం వెంటనే రంగంలోకి దిగి ముగ్గురిని అక్కడే చంపేసింది. మరొక ఉగ్రవాదిని దాదా కాల్చిచంపాడు. తన సమయస్ఫూర్తితో తోటి సైనికులను కాపాడాడు. దాదా తీవ్రంగా రక్తం కారుతున్నా, వెనక్కి తగ్గకుండా ఎంతో ధైర్యసాహసాలతో పోరాడి దేశం కోసం ప్రాణాలు అర్పించాడని అధికారులు వెల్లడించారు. దాదా అరుణాచల్‌ప్రదేశ్ వాసి. -
ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో అప్రమత్తమైన పోలీసులు
దుమ్ముగూడెం: ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో పోలీస్ కొరియర్ల పోలీస్ కొరియర్ల పేరుతో మావోయిస్టులు గిరిజనులను కిడ్నాప్ చేయడంతో ఖమ్మం జిల్లా దుమ్ముగూడెం మండల సరిహద్దు గ్రామాల్లో పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. పోలీసులు మావోయిస్టులను ఎన్కౌంటర్ చేయడం, ప్రతీకారంగా మావోలు పోలీసులపై కాల్పులు జరిపి హతమార్చడం వంటి ఘటనలు ఇటీవల చోటుచేసుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో మావోయిస్టు కొరియర్లపై పోలీసులు డేగకన్ను వేశారు. కాగా మావోయిస్టులు కూడా తొట్టెంతోగు ఎన్‌కౌంటర్‌పై విచారణ పేరుతో కొందరు గిరిజనులను కిడ్నాప్ చేశారు. పోలీస్ కొరియర్లను గుర్తించి మావోయిస్టులు కిడ్నాప్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు గిరిజనులను అప్రమత్తం చేసినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు దుమ్ముగూడెం ఎస్ఐ కడారి ప్రసాద్ ఆధ్వర్యంలో స్పెషల్ పార్టీ, సీఆర్పీఎఫ్ బలగాలు వాహన తనిఖీలు విస్తృతంగా చేయడంతో పాటు సరిహద్దులో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా మావోయిస్టులు దండకారణ్యం దాటి తెలంగాణలోకి రాకుండా గట్టి జాగ్రత్తలు చేపట్టినట్లు సమాచారం.అటు మావోలు ఇటు పోలీసులు ప్రతీకారంతో రగిలిపోతూ వేస్తున్న ఎత్తులతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రాత్రి సమయాల్లో ఎవరి నుంచి ఏ ముప్పు వస్తుందో అని వణికిపోతున్నారు. కొందరు గిరిజనులు ఇళ్ల వద్ద ఉండకుండా బయట ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నట్లు సమాచారం. -
బూటకపు ఎన్కౌంటర్లు ఆపాలి
ప్రొఫెసర్ హరగోపాల్ హైదరాబాద్: ప్రభుత్వం, పోలీసులు చేస్తున్న బూటకపు ఎన్కౌంటర్లను ఆపితేనే తెలంగాణ రాష్ట్రం శాంతి యుతంగా ఉంటుందని, లేదంటే రాష్ట్రం హింస, ప్రతిహింసల వలయంలో కొట్టుకుపోతుందని ప్రొఫెసర్ హరగోపాల్ గురువారం అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు లేకపోయినా ఎన్కౌంటర్ల వంటి ఘటనలకు పాల్పడడం దుర్మార్గమైందన్నారు. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్‌పై నిరసన తెలిపేందుకు ట్యాంక్‌బండ్‌పై నున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చిన ప్రజా సంఘాల నేతలను పోలీసులు గురువారం అక్కడికక్కడే అరెస్టు చేశారు. హరగోపాల్‌తో కలసి తెలంగాణ ప్రజాఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చిక్కుడు ప్రభాకర్, ప్రజా కళా మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు రాజు, అమరుల బంధు మిత్రుల సంఘం రాష్ట్ర నాయకులు నర్సన్న, పద్మ, తదితరులతో పాటు పలువురు ప్రజాసంఘాల నేతలు ఛత్తీస్‌ఘడ్ సంఘటనపై నిరసన తెలిపేందుకు అంబేడ్కర్ విగ్రహం వద్దకు వచ్చారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం హరగోపాల్ విలేకరులతో మాట్లాడుతూ గతంలో పౌరహక్కుల మహాసభలలో పాల్గొన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉండవని చెప్పారని గుర్తు చేశారు. పౌర హక్కులకు భంగం వాటిల్లకుండా చూస్తానన్నారనీ, కానీ ఆయన అధికారం చేపట్టగానే రాష్ట్రంలో పౌర హక్కులను ధ్వంసం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ అవతరించిన ఈ 18 నెలల కాలంలో మావోయిస్టుల నుంచి ఎలాంటి చర్యలు జరగలేదని తెలిపారు. తెలంగాణలో ఎన్కౌంటర్లు ఆపితేనే శాంతియుతంగా ఉంటుందని, లేదంటే హింస, ప్రతిహింసల నడుమ నలిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మన రాష్ట్ర పోలీసులు ఛత్తీస్‌ఘడ్‌కు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని, అసలు ఏం జరిగిందని ఎన్కౌంటర్లు చేశారని ప్రశ్నించారు. -
'తీరు మారకుంటే అంతం చేస్తామన్నారు’
చర్ల: మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని పేర్కొంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బూటకపు ఎన్కౌంటర్లతో అరాచకాలు సృష్టిస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు. శనివారం మావోయిస్టుల చెర నుంచి విడుదలైన భద్రాచలం నియోజకవర్గ టీఆర్ఎస్ ఇన్చార్జ్ మానె రామకృష్ణ చర్లలో విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల సూచన మేరకు ఆయన మీడియాకు వివరాలు చెప్పారు. సర్కారు తీరు మారకుంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్ఎస్ నాయకులను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్టు చెప్పారు. ఇకనైనా సర్కారు తన తీరు మార్చుకోవాలని, ఎన్కౌంటర్లు, కూంబింగ్‌లు నిలిపివేయాలని చెప్పమన్నారని వెల్లడించారు. మావోయిస్టులు తమను బాగానే చూసుకున్నట్టు రామకృష్ణ చెప్పారు. -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దని మానవహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే అవి 30, 40 ఏళ్ల పాటు నలిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్కౌంటర్లు లేని తెలంగాణను తమకివ్వాలని ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను కోరుతున్నట్లు ఆయన తెలిపారు. వందేళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర చరిత్ర రాస్తే, మొదటి మంత్రివర్గం ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందని, ఈ విషయాన్ని కేసీఆర్ గుర్తించాలని ఆయన చెప్పారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సమీపంలో ఆయనను పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులకు పైనుంచి అనుమతి ఉంటేనే ఎన్కౌంటర్లు జరుగుతాయని చెప్పారు. వీలుంటే అరెస్టు చేయడం, విచారించడం, న్యాయవ్యవస్థ ద్వారా విచారణ చేయడం పద్ధతి అని, మావోయిస్టుల విషయంలోనైనా.. మరెవరి విషయంలోనైనా ఇదే చేయాలని చెప్పారు. ఏకపక్షంగా చంపడం రాజ్యానికి, తెలంగాణ ప్రభుత్వానికి మంచిది కాదని అన్నారు. వందేళ్ల తర్వాత చరిత్ర రాస్తే ఈ మొదటి కేబినెట్ ఎలా పనిచేసిందన్నది రికార్డవుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉమ్మడి రాష్ట్ర పోలీసులైనా, తెలంగాణ పోలీసులైనా ఒకేలా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇది తెలంగాణ ప్రభుత్వం.. ప్రజలను ఏమీ చేయొద్దని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలిస్తే వాళ్లేమీ చేయరని తెలిపారు. -
తెలంగాణ పల్లెల్లో విధ్వంసం సృష్టించొద్దు
-
పోలీసు ఎన్కౌంటర్లను విడనాడాలి
- పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కులకు భరోసా కల్పించాలి - ‘చలో అసెంబ్లీ’కి అనుమతినివ్వాలి - మానవ హక్కుల వేదిక డిమాండ్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పౌర, ప్రజాస్వామిక, మానవ హక్కుల అమలుకు ప్రభుత్వం భరోసానివ్వాలని, రాజ్యాంగం కల్పించిన నిరసన తెలిపే హక్కును గౌరవించాలని మానవ హక్కుల వేదిక ఒక ప్రకటనలో డిమాండ్ చేసింది. ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిర్వహించనున్న చలో అసెంబ్లీ కార్యక్రమానికి ప్రభుత్వం మద్దతునివ్వాలని కోరింది. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని భగ్నం చేసే చర్యల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులకు పాల్పడడాన్ని మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.జీవన్‌కుమార్, ప్రధాన కార్యదర్శి వీఎస్ కృష్ణ తీవ్రంగా ఖండించారు. అరెస్టులను వెంటనే నిలిపివేయాలని కోరారు. అరెస్టుల పర్వం నిరంకుశమైన పాలనను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక విధానపరమైన నిర్ణయంగా కొనసాగిన ఎన్కౌంటర్ హత్యలను విడనాడాలని, రాష్ట్రంలో ప్రజాస్వామిక వాతావరణానికి, చట్టబద్ధమైన పాలనకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలని కోరారు. ఈ మేరకు గత 30 ఏళ్లుగా కొనసాగుతున్న పోలీస్ ఎన్కౌంటర్లు, నిర్బంధం వల్ల ప్రజలు అనేక కష్టాలను, బాధలను అనుభవించారని కోట్లాది మంది ప్రజల ఆకాంక్షల మేరకు ఆవిర్భవించిన తెలంగాణ రాష్ర్టంలో శాంతియుతమైన, ప్రజాస్వామిక వాతావరణం ఉండేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు మానవ హక్కుల వేదిక రాసిన లేఖలో పలు అంశాలివీ.. - ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన ఉద్యమం సందర్భంగా వెలువడిన ప్రజల ఆకాంక్షల్లో ఉమ్మడి రాష్ర్టంలో కొనసాగిన అణచివేత, నిర్బంధం, ఎన్కౌంటర్లు లేని స్వేచ్ఛాయుతమైన వాతావరణం నెలకొనాలని వ్యక్తమైంది. రాజ్యాంగబద్ధమైన, చట్టబద్ధమైన పాలన కొనసాగాలని ప్రజలు ఆకాంక్షించారు. కానీ ప్రస్తుతం అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. - ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎన్కౌంటర్లను ఒక విధానంగా కొనసాగించాయి. చంద్రబాబునాయుడు హయాంలోనే 1,448 మంది ఎన్కౌంటర్ల పేరిట హతమయ్యారు. ఎన్కౌంటర్ హత్యలకు పాల్పడిన పోలీసు అధికారులకు సీనియారిటీతో నిమిత్తం లేకుండా పదోన్నతులు, డబ్బు రూపేణా పారితోషికం అందజేయడం వంటి విధానాలు అమలు చేశారు. - తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరిగిన మూడు ఎన్కౌంటర్లలో ఇప్పటి వరకు 8 మంది మరణించారు. పోలీసు లాకప్పుల్లో ఒక దళిత మహిళసహా 6 అనుమానాస్పద లాకప్పు మరణాలు సంభవించాయి. - ఎన్కౌంటర్ హత్యలు తెలంగాణలో ఉండవనే పాలనాపరమైన విధానాన్ని నిర్ధిష్టంగా ప్రకటించాలి. -
‘ఎన్కౌంటర్లు’ లేని తెలంగాణ కావాలి!
అభ్యర్ధన ప్రజల ఆకాంక్షల్లోంచి ఉద్భ వించిన హక్కుల అంశంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనను మా ‘‘మానవ హక్కుల వేదిక’’ (హెచ్ఆర్ఎఫ్) బలపరి చింది. ప్రజలతో గొంతు కలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి హక్కుల భాషలో మాట్లాడింది. తెలంగాణ ఉద్యమంపై అమలైన నిర్బంధాన్ని ఎప్పటిక ప్పుడు నిజనిర్ధారణ చేసి ఎలుగెత్తి ఖండించింది. ఆ ఉద్యమం సందర్భంగా వెలువడ్డ ప్రజల ఆకాంక్షల్లో... నక్సలైట్ల అణచివేత కోసం ప్రభుత్వాలు విధానపరంగా ఎంచుకునే పద్ధతుల వల్ల జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశం విస్పష్టంగా వ్యక్తమైంది. నిర్భయం గా, స్వేచ్ఛగా ప్రజలు తమ ప్రాథమిక, పౌర హక్కులను అనుభవించే పరిస్థితులు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో నెలకొనాలని ప్రజలు గాఢంగా కాంక్షించారు. ఉద్యమ నాయకులు కూడా అటువంటి వాతావరణం ఏర్పడా ల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. అందుకు భరోసా ఇస్తూ మాట్లాడారు. కానీ గతంలో ఉన్న పరిస్థితులే కొన సాగడం, నక్సలైట్లను అణచివేయడానికి ఎన్కౌంటర్ల పద్ధతిని కొనసాగించడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తుం ది. ప్రజల ఆకాంక్షలను, మా సంస్థ అభిప్రాయాలను తెలుపుతూ ఈ విషయంపై నిర్దిష్టమైన నిర్ణయాన్ని తీసు కోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ లేఖ రాస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ‘ఎన్కౌంటర్’ హత్యలు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగా జరి గాయి. బ్రహ్మానందరెడ్డి, వెంగళరావులు సీఎంలుగా ఉన్న పదకొండేళ్లలో 350 మంది నక్సలైట్ కార్యకర్త లను ఎన్కౌంటర్లలో కాల్చివేశారు. 1979-80లో చెన్నా రెడ్డి గారు సీఎంగా ఉండగా ఎన్కౌంటర్లు వద్దని ఆదేశిం చడంతో ఆగిపోయాయి. ఆ తర్వాత అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి కాలంలో పెద్దగా ఎన్కౌంటర్లు జరగలేదు. ఎన్కౌంటర్లు అసలే ఉండొద్దన్న ఎన్టీఆర్ సీఎంగా ఉండగా కొన్ని మాత్రమే జరిగాయి. 1989లో చెన్నారెడ్డి రెండవసారి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఎన్ కౌంటర్లు కూడదనటంతో జరగలేదు. 1992-94 మధ్య సీఎం నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఎన్కౌంటర్లు చేయడా నికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో 340 మందిని కాల్చి వేశారు. రెండోసారి ఎన్టీఆర్ తొమ్మిది నెలల పాలన తర్వాత ముఖ్యమంత్రయిన చంద్రబాబు నాయుడు ఎన్ కౌంటర్లను విధానపరంగా పూర్తిగా సమర్థించాడు. ఆయ న పాలించిన 8 సంవత్సరాల 8 నెలల్లో 1,448 మందిని ఎన్కౌంటర్ల పేరుతో కాల్చేశారు. ఈ హత్యాకాండ స్పష్ట మైన ప్రభుత్వ ఆదేశాల మేరకే జరిగింది. ఎన్కౌంటర్ హత్యలు చేసిన పోలీసు అధికార్లకు ప్రమోషన్లు, డబ్బు రూపేణా పారితోషికం ఇచ్చారు. దీంతో పోలీసులు ప్రైవేట్ గ్యాంగులకు ఆయుధాలిచ్చి హక్కుల సంఘం కార్యకర్తలపైన, ప్రజాసంఘాల కార్యకర్తలపైన, వామ పక్ష సానుభూతిపరులపైన దాడులే కాదు, హత్యలు కూడా చేయించారు. ఇవన్నీ పూర్తి చట్టవిరుద్ధంగా, ఒక పాలనా విధానంలో భాగంగా జరిగాయి. ప్రజల హక్కుల, ఆకాంక్షల నేపథ్యంలో ఏర్పడ్డ నూతన తెలంగాణ రాష్ట్రం దాన్ని పాలించే ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు, జవాబుదారీ తనానికి కట్టుబడి ఉం డాలని హక్కుల సంఘంగా మేము కాంక్షిస్తున్నాం. చట్ట బద్ధ పాలన ద్వారా మాత్రమే ప్రభుత్వానికి ప్రజలను పాలించే నైతిక సాధికారత లభిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం. గత ప్రభుత్వాలు నక్సలైట్ ఉద్యమాన్ని శాంతి భద్రతల సమస్యగానే పరిగణించి నక్సలైట్ కార్య కర్తలను, సానుభూతిపరులను భౌతికంగా నిర్మూ లించడాన్ని ఒక పాలనా విధానంగా అమలు పరచాయి. గత 45 ఏళ్లుగా హక్కుల ఉద్యమం నక్సలైట్ ఉద్యమాన్ని ఒక రాజకీయ ఉద్యమంగానే భావిస్తోంది, అదే ప్రభు త్వాలకూ చెబుతోంది. నక్సలైట్ పార్టీలు హింసకు పాల్ప డినప్పటికీ దానిని రాజకీయ ఉద్యమంగానే చూడాలని ప్రభుత్వాలకి స్పష్టం చేస్తూ వస్తోంది. నక్సలైట్ పార్టీల హింసను చూస్తూ ఊరుకోవాలన్నది మా వైఖరి కాదు. పోలీసులు విధిగా స్పందించాలి. అయితే పోలీసులు చేపట్టే చర్యలేవైనా రాజ్యాంగం నిర్దేశించిన చట్టపరిధిలో ఉండాలి. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జరిగిన మూడు ఎన్ కౌంటర్లలో 8 మంది (రంగారెడ్డి జిల్లాలో పారిపోతు న్నాడన్న నెపంతో నేర చరిత్ర కలిగిన ఒక దొంగ, ఆలేరు ఎన్కౌంటర్లో గొలుసులతో వ్యాన్‌లోని సీట్లకు కట్టేసిన ఐదుగురు ముస్లిం యువకులు, వరంగల్ ఏటూరు నాగారం అడవుల్లో ఒక మహిళ సహా ఇద్దరు మావో యిస్టు కార్యకర్తలు) మరణించారు. పోలీసు లాకప్పుల్లో 6 (ఒక దళిత మహిళ సహా) అనుమానాస్పద మరణాలు జరిగాయి. జాతీయ మానవ హక్కుల సంఘం, రాష్ట్ర హైకోర్టు నిర్దేశించిన సూచనల మేరకు ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులపై సెక్షన్ 302 ప్రకారం కేసులు పెట్టి, స్వతంత్ర నేర పరిశోధన విభాగం చేత విచారణ సాగిం చడాన్ని ఈ ప్రభుత్వం కూడా చేయడం లేదు. కొత్త రాష్ట్రంలో నక్సలైట్లను అణచివేసే విషయంలో పాత విధానాలే కొనసాగించడం పట్ల హక్కుల సంఘాలు, ప్రజాస్వామిక వాదులు, ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. ప్రభుత్వం చట్టబద్ధ పాలనకు కట్టుబడి ఉండాలని పౌర, మానవ హక్కులకు భరోసా కల్పిం చాలని మేం కోరుకుంటున్నాం. పైన వివరించిన నేప థ్యం వెలుగులో తెలంగాణ రాష్ట్రంలో ‘‘ఎన్కౌంటర్ హత్యల ప్రక్రియ’’ఉండదనే పాలనాపరమైన విధానాన్ని నిర్దిష్టంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. - వి.ఎస్.కృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎన్.జీవన్‌కుమార్, అధ్యక్షులు, మానవ హక్కుల వేదిక -
ఎన్కౌంటర్లన్నీ సర్కార్ హత్యలే
నిజామాబాద్ : పీడిత ప్రజల విముక్తి కోసం పోరాడుతున్న విప్లవకారులను పాలకవర్గాలు పట్టుకుని కాల్చిచంపి ఎన్కౌంటర్ కథలల్లుతున్నాయని అమరుల, బంధుమిత్రుల సంఘం రాష్ట్ర కార్యదర్శి పద్మకుమారి ఆరోపించారు. ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆమె స్పష్టం చేశారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మావోయిస్టు నాయకురాలు లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన అలియాస్ నవతక్క కుటుంబ సభ్యులను ఓదార్చడానికి వచ్చిన సంఘం నేతలు నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఎన్కౌంటర్ పేరుతో వివేక్, సూర్యంతోపాటు మరో ఇద్దరు మహిళలను ప్రభుత్వాలు పట్టుకుని కాల్చిచంపి ఎన్కౌంటర్ కథలల్లాయన్నారు. ఈ నెల 17,18 తేదీలలో హైదరాబాద్‌లో సంఘం మూడవ మహాసభలు జరిగాయని, ఈ సభలలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ ముందుకు నడవవాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ఆమె వెంట సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మ, ఉపాధ్యక్షురాలు శాంత, రాష్ట్ర కమిటీ సభ్యులు నర్సన్న ఉన్నారు. -
చంద్రశాసనం కాదు, చట్టపాలన కావాలి
త్రికాలమ్ ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎన్కౌంటర్ చేసిన పోలీసుల చర్యను ఎందుకు ఖండించడం లేదు? పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని. పోలీసు అధికారులను మందలించే సాహసం ముఖ్యమంత్రులు, హోంమంత్రులు చేయలేకపోతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకే రోజు రెండు ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత ఇద్దరు వ్యక్తులు పదేపదే గుర్తుకొస్తున్నారు. ఒకరు బాలగోపాల్, మరొకరు కన్నబీరన్. మూడు దశాబ్దాల కిందట బాలగోపాల్ భయం పోలీసులకే కాదు, పాలకులకే కాదు, పాత్రికేయులకూ ఉండేది. ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగినా బాలగోపాల్ నాయకత్వంలో నిజనిర్థారణ బృందం ఘటన జరిగిన స్థలానికి వెళ్లిరావడం, తమ బృందం తెలుసుకున్న నిజాలను మీడియా సమావేశంలో నిర్భయంగా చెప్పడం, వాటిని పొల్లుపోకుండా రాసి ప్రచురించడం అలవాటు. క్షేత్రంలో బాలగోపాల్ పర్యటనలు ఉండేవి. న్యాయస్థానంలో కన్నబీరన్ వాద నలు జరిగేవి. ఎన్కౌంటర్ల వార్తలు రాసే పాత్రికేయులకూ, వాటిపై వ్యాఖ్యా నాలు రాసే సంపాదకులకూ, సీనియర్ జర్నలిస్టులకూ మనసులో ఒక మూల భయసందేహాలు ఉండేవి. మనం రాస్తున్న విశ్లేషణను బాలగోపాల్ ఆమోది స్తారా లేదా అవహేళన చేస్తారా అనే సంకోచం పీడిస్తూ ఉండేది. ఇప్పుడా భయం పాత్రికేయులకు లేదు. ఎన్కౌంటర్ చేసిన పోలీసుల పేర్లు ప్రకటిస్తూ వారిపైన హత్యానేరం మోపుతూ కేసు పెట్టాలంటూ బాలగోపాల్ ఉద్యమం చేస్తారనే భయం పోలీసులకూ లేదు. మానవ హక్కులను హరిస్తున్నందుకు ప్రభుత్వాన్ని ఎండగడతారనే భయం పాలకులకు లేదు. కన్నబీరన్, బాల గోపాల్, చంద్రశేఖర్ (గుంటూరు న్యాయవాది, చుండూరు కేసులో దళితుల తరఫున వాదించిన మానవ హక్కుల నేత), ఇతర పౌరహక్కుల నాయకులూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నెలకొల్పిన పారదర్శక, ప్రజాస్వామ్య వాతావరణం, పోలీసులనూ, పాలకులనూ నిలదీసే సాహసం క్రమంగా హరించుకుపో యింది. బాలగోపాల్ సజీవంగా ఉంటే శేషాచలం అడవుల్లో జరిగిన నరమేధం పట్ల, ఆలేరులో పోలీసు కస్టడీలో ఉన్న ఐదుగురు ముస్లిం నిందితుల హత్య పట్ల ఎట్లా స్పందించేవారో ఊహిస్తే, ఇప్పుడు స్పందన ఎంత పేలవంగా ఉన్నదో గమనిస్తే పౌరసమాజంలో వచ్చిన మార్పు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. గతంలో కూడా ఎన్కౌంటర్ చేసిన పోలీసు అధికారులపైన కేసులు పెట్టే వారు కాదు. ఎన్కౌంటర్ అంటే నిరాయుధులను పోలీసులు కాల్చి చంపడం అనే అర్థం రూఢి అయింది. కానీ ఎప్పుడు ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా పోలీ సుల కథనంతో పాటు ప్రత్యక్షసాక్షుల కథనం వచ్చేది. అనంతరం రెండు మూడు రోజులకు నిజనిర్ధారణ బృందం నివేదిక వచ్చేది. ప్రజలకు వాస్తవాలు కొంతవరకైనా తెలిసేవి. ఇప్పుడు పోలీసుల కథనం మాత్రమే వస్తున్నది. ఇతర కథనాలూ, ఇతర కోణాలూ రావడం లేదు. పైగా చనిపోయినవారు నేరస్థులే నంటూ ఊహించి కథనాలు ప్రచురించడం ద్వారా పాలకులకు మద్దతు ఇచ్చే రోజులు వచ్చాయి. పాలకులను ప్రశ్నించడం పోయి, వారి కొమ్ము కాసే కాలం దాపురించింది. ఎన్కౌంటర్లు జరిగిన తర్వాత పదిరోజులకైనా హైదరాబాద్‌లో ఇందిరాపార్కు దగ్గర ధర్నా నిర్వహించిన పౌరహక్కుల నాయకులకూ, న్యాయస్థానంలో పిటిషన్లు వేసి వాదిస్తున్న న్యాయవాదులకూ అభినందనలు. నక్సలైట్ ఉద్యమం ఆంధ్రప్రదేశ్‌లో ఉధృతంగా ఉన్న రోజుల్లో ఎన్‌కౌం టర్లు తరచుగా జరిగేవి. ఎన్కౌంటర్ చేసే ముందు పోలీసులు కొన్ని జాగ్రత్తలు తీసుకునేవారు. అగ్రశ్రేణి నక్సలైట్ నాయకులను మహారాష్ట్రలో అరెస్టు చేసి ఆదిలాబాద్ జిల్లా అడవులలోకి తీసుకొని వచ్చి కాల్చి చంపిన ఘటన అందరికీ తెలిసిందే. శేషాచలం, ఆలేరు ఎన్కౌంటర్లలో పాల్గొన్న పోలీసులకు చట్టభయం బొత్తిగా లేదనీ, తెలివితేటలు తక్కువనీ, సరైన శిక్షణ కూడా లేదనీ మాజీ డీజీపీ ఒకరు వ్యాఖ్యానించారు. ‘నా శిక్షణలో తయారైన అధికారులు ఇంత అవివే కంగా ఎన్కౌంటర్ చేయరు’ అని అన్నారు. తెలంగాణలో పనిచేసిన పోలీసు అధికారులకు ఎన్కౌంటర్ చేసే ముందు ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసు. జరిగింది ఏకపక్షం కాల్పులు కాదనీ, నిజంగా ఎన్కౌంటరేననీ నమ్మిం చేందుకు పోలీసు జవాన్లు ప్రాణాపాయం లేకుండా తొడలోనో, కాళ్లమీదో ఎముకకు తగలకుండా కాల్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. శేషాచలం అడవులలో చనిపోయిన ఇరవై మంది కూలీలలో పదకొండు మంది ఆదివాసులని జాతీ య ఎస్టీ కమిషన్ వైస్‌చైర్మన్ రవి ఠాకూర్ శనివా రం నాడు తిరుపతిలో చెప్పారు. ప్రభుత్వం, పోలీ సు అధికారులు వాదిస్తున్నట్టు కూలీలు స్మగ్లర్లు నియమించినవారే కావచ్చు. అర్ధరాత్రి అడవుల్లో చెట్లు నరికే వారు మామూలు కూలీలు కాకపోవ చ్చు. కానీ వారినీ, వారిని నియమించిన దొంగ వ్యాపారులనీ అరెస్టు చేసి న్యాయస్థానంలో బోనె క్కించి నేరం నిరూపిం చడానికి అవసరమైన యంత్రాగాన్ని సమాయ త్తం చేసుకోవాలి కానీ చొక్కాలు కూడా లేని కూలీల ఛాతిమీద కాల్చి చంపడం అమానుషం. ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలి ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై ఎఫ్ఐఆర్ (ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేయాలంటూ బిలాల్ నజ్కీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా ఉన్న కాలంలో ఆయనా, జస్టిస్ రఘురామ్, మరో న్యాయమూర్తి ఉన్న ధర్మాసనం నిర్ణయించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేసింది. హైకోర్టు తీర్పుపైన సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సాధారణంగా పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపామని చెబుతారు. శేషాచలంలో రాళ్లతో తమపైన దాడి చేసిన కారణంగా కూలీలను చంపివేశామని పోలీసులు చెబితే, ఆలేరులో నిందితులలో ఒకరు పోలీసు జవాను చేతిలోని రైఫిల్ లాక్కొని తమపైన కాల్పులు జరపబోతే తిరిగి కాల్చవలసి వచ్చిందని చెబుతున్నారు. రెండువాదనలలో పసలేదని ఇంగితజ్ఞానం ఉన్నవారికి ఎవరికైనా తెలిసి పోతుంది. ఎర్రచందనం దొంగలు అటవీశాఖ అధికారులనూ, పోలీసు అధికారు లనూ హత్య చేసిన మాట వాస్తవమే. ఎర్రచందనం అపహరణను నిలువరించ వలసిన అవసరం ఉన్న మాటా కాదనలేం. వీరప్పన్కూ, ఆతని ముఠాసభ్యు లకూ ఆశ్రయం, సమాచారం ఇచ్చిన వారిపైన తమిళనాడు ప్రభుత్వం ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. వీరప్పన్ వారసులు చాలామంది ఎర్రచందనం చెట్లు నరికించి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న మాట నిజం. వీరి ఆట కట్టిం చాలంటే తమిళనాడు ప్రభుత్వంతో కలసి సంయుక్తంగా వ్యూహం రచించాలి. దొరికిన వారిని దొరికినట్టు అరెస్టు చేసి కేసులు పెట్టాలి. నేర నిరూపణకు అవసరమైన సాక్ష్యాధారాలను పోలీసులు సేకరించాలి. అందుకు అవసరమైన యంత్రాంగాన్ని సమకూర్చుకోవాలి. నేరం నిరూపించే శక్తియుక్తులు లేక, సహనం లేక నిందితులను న్యాయస్థానంలో విచారించే పని లేకుండా ఎన్‌కౌం టర్ చేయడం చట్టవిరుద్ధం. రెండు ఎన్కౌంటర్లూ బూటకమే ఆలేరు ఎన్కౌంటర్లో మరణించిన వికార్ అహ్మద్ అలియాస్ వికారుద్దీన్, సులేమాన్ ఇద్దరూ నేరాలు చేసినట్టు దాఖలాలు ఉన్నాయి. వికార్ తనను తానే జిహాదీగా పరిగణించుకొని ఫసియుద్దీన్ మాదిరి దోపిడీ చేసిన డబ్బుతో దాడులు నిర్వహించేవాడని పోలీసుల సమాచారం. అహ్మదాబాద్‌లో మకాం పెట్టి ఏకంగా నరేంద్రమోదీపైన దాడి చేయడానికి ప్రయత్నించాడనీ, అక్కడే వినయ్ యాదవ్ అనే పోలీసు కానిస్టేబుల్ని హత్య చేశాడనీ ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఒక కానిస్టేబుల్నీ, ఒక హోంగార్డునూ చంపాడని పోలీసుల ఆరోపణ. ఇతనిపై హైదరాబాద్‌లో కానీ అహ్మదాబాద్‌లో కానీ చార్జిషీటు దాఖలు కాలేదు. అండర్‌ట్రయల్‌గా ఉండగానే ఇతను చంచల్ గూడా జైలులో వార్డెన్‌పై చేయి చేసుకుంటే వరంగల్లు జైలుకు తరలించారు. అక్కడి నుంచి ఏప్రిల్ ఏడవ తేదీన నాంపల్లి కోర్టుకు తీసుకువస్తున్న సమ యంలో ఆలేరు దగ్గర బస్సులోనే అతడినీ, నలుగురు సహచరులనీ కాల్చి చంపారు. పద్దెనిమిది మంది సాయుధ పోలీసులు అయిదుగురు అండర్ట్ర యల్స్ వెంట ఉన్నారు. ఒక్క పోలీసు ఉద్యోగికీ చిన్న దెబ్బకూడా తగలకుండానే అయిదుగురు నిందితులనూ కాల్చిచంపడాన్ని ఎట్లా సమర్థించుకుంటారు? ఉగ్రవాదులను ఉపేక్షించాలని ఎవ్వరూ వాదించడం లేదు. ఎర్రచందనం దొంగలను నిరోధించవద్దని ఎవ్వరూ అనడం లేదు. పోలీసులే చట్టాన్ని చేతు లోకి తీసుకొని ఎవరిపైన అనుమానం ఉంటే వారిని కాల్చివేస్తుంటే ఇక చట్టాలెందుకు, న్యాయస్థానాలెందుకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శేషాచలం ఎన్కౌంట ర్ని ఖండించిన దాఖలా లేదు. తమిళనాడు ముఖ్యమంత్రికి లేఖ రాస్తామ న్నారు. మెజిస్ట్రేట్‌తో దర్యాప్తు జరిపిస్తామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికారంలోకి వస్తూనే పోలీసులకు కొత్త వాహనాలు ఏర్పాటు చేశారు. వారికి అదనపు సౌకర్యాలు సమకూర్చారు. పోలీసు వ్యవస్థ పటిష్ఠంగా ఉంటేనే శాంతిభద్రతలు సజావుగా ఉంటాయంటూ అనేక సందర్భాలలో అన్నారు. మొన్న కలెక్టర్లతో విడియో కాన్ఫరెన్స్ ప్రారంభిస్తూ అన్నిటి కంటే శాంతిభద్రతల పరిరక్షణ ముఖ్యమని నొక్కి చెప్పారు. వికారుద్దీన్ బృందం హత్యని ముఖ్యమంత్రి బహిరంగంగా ఖండించలేదు. వారి మరణంపై దర్యాప్తు జరిపించేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ (సిట్)ను నియమిస్తామని ప్రక టించారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ ఎన్కౌంటర్ చేసిన పోలీసుల చర్యను ఎం దుకు ఖండించడం లేదు? పోలీసుల ఆత్మస్థయిర్యం దెబ్బతింటుందని. పోలీసు అధికారులను మందలించే సాహసం ముఖ్యమంత్రులు, హోంమంత్రులు చేయ లేకపోతున్నారు. ‘మీకూ, మావోయిస్టులకూ మధ్యా, మీకూ, ఉగ్రవాదులకూ మధ్య మేము లేకపోతే మీ పని ఖాళీ’ అంటూ పోలీసు అధికారులు న్యాయమూ ర్తులనూ, రాజకీయ నాయకులనూ, ఐఏఎస్ అధికారులనూ హెచ్చరించే పరిస్థి తులున్నాయి. అందువల్ల ఎన్కౌంటర్ చేయడం అనవసరమనీ, చట్టబా హ్యమనీ, నేరమనీ స్పష్టంగా తెలిసినప్పటికీ పోలీసు అధికారులను తప్పు పట్టడానికి పాలకులు సిద్ధంగా లేరు. శేషాచలం ఎన్కౌంటర్ తీవ్రత దృష్ట్యా దాని దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతను హైకోర్టు స్వీకరించింది. రెండు ఎన్‌కౌం టర్లపైనా పదవిలో ఉన్న న్యాయమూర్తుల చేత దర్యాప్తు జరిపించి నిజం నిగ్గు తేల్చాలి. చట్టంతో నిమిత్తం లేకుండా వ్యక్తిగత ఎజెండాతో ఎవరు వ్యవహరిం చినా అప్రజాస్వామికమే. చంద్రబాబునాయుడినీ, చంద్రశేఖరరావునీ ముఖ్య మంత్రులుగా ప్రజలు ఎన్నుకున్నది చంద్రశాసనం అమలు చేయాలని కాదు. చట్టపాలన అమలు చేయాలని. చట్టాలని ఉపయోగించుకొని జనరంజకంగా పాలించాలని. చట్టాలు చాలకపోతే కొత్త చట్టాలు చేసుకోవచ్చును కానీ ఉన్న చట్టాలను ఉల్లంఘించడం, జీవించే హక్కును కాలరాయడం శిక్షార్హమైన నేరం. -
ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా ఖైదీ నిరశన
రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు ఎన్కౌంటర్ల పేరుతో ఒకేరోజు 25 మందిని హతమార్చడాన్ని మావోయిస్టు ఖైదీ సాకే కృష్ణ గర్హించారు. కడప సెంట్రల్ జైలులో ఉన్న ఆయన.. శేషాచలం, ఆలేరు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా మంగళవారం రాత్రి నుంచి నిరశన చేపడుతున్నట్లు జైలు సూపరింటెండెంట్ గోవిందరాజులుకు సమాచారం ఇచ్చారు. ఇదే విషయాన్ని జైలర్ మీడియాకు చెప్పారు. 2003లో అలిపిరి వద్ద నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి కేసులో సాకే కృష్ణ నిదితుడు. -
ఎవరైనా ఎందుకు చావాలి?
సాక్షి వెబ్సైట్ ప్రత్యేకం అది 90వ దశకంలో రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాదం బలంగా ఉన్న కాలం.. ఎన్ కౌంటర్లు, మందుపాతరలు నిత్యకృత్యం. అటు నక్సలైట్లు, ఇటు పోలీసులు, సాధారణ పౌరులు, ప్రజాప్రతినిధుల మరణాలు లేని రోజులు చాలా అరుదు. అలాంటి సమయంలో క్రైమ్ రిపోర్టర్‌గా ఒక ఆంగ్ల దినపత్రికలో ఉద్యోగం.. ప్రతి రోజు కత్తి మీద సామును గుర్తుకు తెచ్చేది. పోలీసు అధికారులతో పాటు ప్రజాసంఘాలు, పౌరహక్కుల ప్రతినిధులతో సమానమైన సంబంధాలు, బ్యాలెన్స్ తప్పకుండా రిపోర్టింగ్ చేయాల్సిన బాధ్యత. ఈ క్రమంలో ఎన్నెన్ని మృతదేహాలు.. ఛిద్రమైన దేహాలు.. ఇంటినుంచి బయటకు వస్తే మళ్లీ ఇంటికి ఎప్పుడు వెళతామో తెలియని అనిశ్చితి. అలా రెండు మూడేళ్లు గడిచేసరికి మనసు స్పందించడం మానేసింది. హైదరాబాద్- కరీంనగర్ రాజీవ్ రహదారిపై ప్రజ్ఞాపూర్ దాటిన తర్వాత రోడ్డుకు ఎడమవైపు మూడు కిలోమీటర్ల లోపల అహ్మదీపూర్ అనే గ్రామం ఉంది. ఎన్కౌంటర్ జరిగిందని తెలియగానే ప్రయాణం.. చెల్లాచెదురుగా మృతదేహాలు! చనిపోయింది ఏడుగురు. అక్కడ ఆరు దేహాలు మాత్రమే కనబడుతున్నాయి. 'ఏడో బాడీ ఎక్కడ?' అక్కడే ఉన్న కానిస్టేబుల్‌ను అడిగా. పైనుంచి కిందివరకు పరికించి చూసి 'ఎన్ని సంవత్సరాలుగా ఈ ఉద్యోగం చేస్తున్నావ'ని ప్రశ్న. జవాబు చెప్పేలోపే మీరు కూడా మాలాగే మొద్దుబారిపోయారు అని ముక్తాయింపు. కొరడాతో మొహం మీద కొట్టిన ఫీలింగ్. ఇన్ని సంవత్సరాల రిపోర్టింగ్ ప్రయాణంలో చాలామంది పోలీసు అధికారులు కూడా తమ మొద్దుబారిపోయిన మనసులు విప్పిన సందర్భాలు ఉన్నాయి. ''ఐ షుడ్ టేక్ ఎట్ లీస్ట్ టెన్ డెత్స్ టు మై గ్రేవ్'' అని వాపోయిన ఒక అధికారి మాటలు ఇంకా గుర్తున్నాయి. తర్వాతి కాలంలో క్రమంగా వామపక్ష తీవ్రవాదం బలహీనపడింది. 'చావు వార్తల' ఫ్రీక్వెన్సీ తగ్గింది. ఏదో ఒక రిలీఫ్ అనిపించేది. కానీ అకస్మాత్తుగా గత పదిరోజులుగా ఆ ప్రశాంతత దూరమైంది. నల్లగొండలో వరుస సంఘటనలు, చిత్తూరు ఎర్రచందనం కూలీల 'ఎన్ కౌంటర్' వాదోపవాదాలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు.. వీటిమధ్య హక్కుల ఉల్లంఘన అంశం మరుగున పడిపోయింది. ఎన్కౌంటర్లపై గతంలో జరిగిన విచారణల్లో పెద్దగా తేలింది ఏమీ లేదు. ''నువ్వు చంపితే నేనూ చంపుతా''ననే ఆటవిక న్యాయం ముందు సామాన్యుడి ప్రాణాలకు విలువ లేకుండా పోయింది.. పోతోంది. నక్సల్స్ సమస్య శాంతిభద్రతల సమస్యా, సామాజిక ఆర్థిక అంశమా అనే చర్చ దశాబ్దాలుగా కొనసాగుతూనే ఉంది. మత ఉగ్రవాదానికి కారణాలేమిటీ అనే చర్చ వందలకొద్దీ గంటలు టీవీల్లో వినపడుతూనే ఉంటుంది. ఎర్రచందనం కూలీలు, స్మగ్లర్ల చేతుల్లో మోసపోతారు. పోలీసుల తూటాలకు బలి అవుతారు. 'ఒక ఎన్ కౌంటర్ చేస్తే భయపడతారు' అనే పిడివాదం ఫలితాలు ఇచ్చిందనడానికి దాఖలాలు లేవు. యాసిడ్ దాడులు జరుగుతూనే ఉన్నాయి. లైంగిక దాడుల సంఖ్య ప్రమాదకరంగా పెరిగిపోతూనే ఉంది. బాంబులు పేలుతూనే ఉన్నాయి. ప్రతిగా వాడుతున్న తూటాల సంఖ్య భారీగానే పెరుగుతోంది. 'తుపాకులు ఉన్నది ఎందుకు' అని గతంలో మంత్రిగా పనిచేసిన ఓ పెద్దాయన ప్రశ్నిస్తాడు. గడ్డి కోసుకోవడానికి వచ్చారా అని ఒక మంత్రివర్యుడు వ్యంగంగా వ్యాఖ్యానిస్తాడు. ఎన్ కౌంటర్ అర్థాన్ని మార్చిన తెలుగు ప్రజల నేల ఇది. ''ఏంటి రెచ్చిపోతున్నావ్, ఎన్ కౌంటర్ చేస్తా''ననే ఖాకీ బెదిరింపులు సర్వసాధారణంగా వినిపిస్తున్న ఠాణాలు ఉన్న ప్రాంతం ఇది. గడిచిన పదిరోజుల సంఘటనలు భవిష్యత్తులో రెండు రాష్ట్రాల్లో ఏర్పడబోయే పరిస్థితికి ముందస్తు హెచ్చరికలా? 'వై షుడ్ ఎనీబడీ గెట్ కిల్డ్? వెదర్ ఇట్ ఈజ్ ఏ టెర్రరిస్ట్ ఆర్ ఏ కామన్ మ్యాన్ ఆర్ ఏ పోలీస్ మన్? ఈజ్ రైట్ టు లివ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్?' దిల్సుఖ్ నగర్ పేలుళ్ల తర్వాత అప్పుడే ప్రపంచాన్ని చూడటం అలవాటు చేసుకున్న నా పెద్ద కూతురు అడిగిన ప్రశ్న. చాలా రోజులపాటు నన్ను వెంటాడిన ప్రశ్న. క్రమంగా మరుగున పడిపోతున్న దశలో సూర్యాపేట బస్టాండ్ లో హోంగార్డ్, కానిస్టేబుల్ లాంటి ఇద్దరు చిరుద్యోగులు టెర్రరిస్టుల తూటాలకు బలయిన సందర్భంలో మళ్లీ గుర్తుకొచ్చిన ప్రశ్న. వరుస సంఘటనలతో ఆ ప్రశ్న మళ్లీ బలంగా వినపడుతోంది. 'వై ఎనీబడీ గెట్ షుడ్ కిల్డ్? - ఎస్. గోపినాథ్ రెడ్డి -
ఎన్కౌంటర్ల హోరు!
సంపాదకీయం అయిదారు రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో పేలుతున్న తుపాకులు... ఉమ్మడి రాష్ట్రంగా ఉండగా కొన్నేళ్లపాటు కొనసాగిన ఉద్రిక్త పరిస్థితులను గుర్తుచేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో గత బుధవారం రాత్రి బస్టాండ్‌లో పోలీసులు తనిఖీ చేస్తున్న సందర్భంలో ఉన్నట్టుండి ఇద్దరు ఉగ్రవాదులు ఒక కానిస్టేబుల్‌నూ, హోంగార్డునూ కాల్చిచంపింది మొదలు చోటుచేసుకున్న ఘటనల పరంపర ప్రజలను కలవరపరిచింది. ఇంతలోనే మంగళవారం రెండు రాష్ట్రాల్లోనూ మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. నల్లగొండ-వరంగల్ జిల్లా సరిహద్దుల్లో జాతీయ రహ దారిపై ఉగ్రవాది వికారుద్దీన్, అతని గ్యాంగ్ సభ్యులు అయిదుగురు ఎన్కౌంటర్లో మరణించారు. అటు ఆంధ్రప్రదేశ్‌లోని శేషాచలం అడవుల్లో రెండు ఎన్కౌంటర్లు సంభవించాయి. ఎర్రచందనం చెట్లను నరికేందుకు స్మగ్లర్లు తమిళనాడు నుంచి తీసుకొచ్చినట్టు చెబుతున్న 20 మంది కూలీలు ఈ ఎన్కౌంటర్లలో మరణించారు. ఉగ్రవాదుల ఆగడాలనుగానీ... శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను విచక్షణారహితంగా నరికేస్తున్న స్మగ్లర్ల కార్యకలాపాలనుగానీ ఎవరూ సమర్థించరు. చట్టవిరుద్ధమైన ఇలాంటి వాటిని ఏ ప్రభుత్వమూ చూస్తూ ఊరుకోలేదు. నల్లగొండ జిల్లాలో ఉగ్రవాదులు సృష్టించిన విషాదం అంతా ఇంతా కాదు. తమను పట్టుకోవడానికి ప్రయత్నించిన పోలీసులను కాల్చిచంపడమే కాదు... ఆ దారిన పోతున్న వారిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలు మరిచిపోక మునుపే ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఇందులో చనిపోయిన వికారుద్దీన్ గ్యాంగ్ గతంలో మారణాయుధాలతో సాగించిన దోపిడీలు, దాడులు అందరికీ తెలుసు. ఆ కేసుల్లో వారు చివరకు పట్టుబడి జైలుకెళ్లారు. అక్కడ కూడా జైలు సిబ్బందిపై దాడులు చేయడం వంటివి చోటుచేసుకున్నాయి. అయితే ప్రజాస్వామ్యంలో నమ్మకం ఉన్నవారు ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న శక్తులను చట్టబద్ధంగా శిక్షించాలని కోరుకుంటారు తప్ప పోలీసులే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవాలనుకోరు. ఎన్కౌంటర్లో మరణించిన ఉగ్రవాదులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నవారు. వారి ప్రాణాలకు ముప్పు కలగకుండా చూసుకోవాల్సింది ఎస్కార్ట్‌గా ఉన్న పోలీసు సిబ్బందే. ఏదో వంకతో వ్యాన్‌ను ఆపించి ఉగ్రవాదులు పారిపోవడానికి ప్రయత్నిం చారని, ఈ క్రమంలో తమ వద్దనుంచి వికారుద్దీన్ తుపాకి గుంజుకోవడానికి ప్రయత్నించగా మిగిలిన నలుగురూ తిరగబడ్డారని పోలీసుల కథనం. అప్పుడు జరిగిన కాల్పుల్లో వారు మరణించారని పోలీసులు చెబుతున్నారు. ఎన్కౌంటర్ సమయంలో ఉగ్రవాదులందరూ వ్యాన్లోనే ఉన్నారు. వారి చేతులకు సంకెళ్లు న్నాయి. పోలీసుల కథనం నిజమే అనుకున్నా... వ్యాన్‌లో ఉన్నవారిని, అందునా సంకెళ్లతో ఉన్నవారిని ప్రాణాలు తీయకుండా అదుపు చేయడం అసాధ్యమా? 17 మంది పోలీసు సిబ్బంది ఉండికూడా ఇలా చేయలేకపోయారంటే అది వారి అసమర్థతే అవుతుంది. అసలు జరిగిందేమిటో చెప్పడానికి పోలీసుల కథనం తప్ప మరే ఆధారమూ లేకపోవడంవల్ల ఈ ఉదంతం సంశయాలను పెంచింది. శేషాచలం అడవుల్లో చోటుచేసుకున్న రెండు ఎన్కౌంటర్ల విషయంలోనూ ఇలాంటి అనుమానాలే ఉన్నాయి. ఎన్కౌంటర్ జరిగిన రెండు ప్రదేశాల పేర్లే చిత్రంగా ఉన్నాయనుకుంటే పోలీసుల కథనాలు అంతకన్నా విచిత్రంగా ఉన్నాయి. ఒకటి సచ్చినోడి బండ. అక్కడ 11 మంది కూలీలు ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు. రెండోది చీకటీగల కోన. ఆ ప్రాంతంలో 9మంది కూలీలు చనిపోయారు. తమపై 100 మందికిపైగా కూలీలు గొడ్డళ్లతో, రాళ్లతో దాడి చేశారని... ఆ క్రమంలోనే ఈ ఎన్కౌంటర్లు చోటుచేసుకున్నాయని పోలీసుల కథనం. దుంగలను మోసుకుపోయే కూలీలు గొడ్డళ్లతో, రాళ్లతో తిరగబడటం...వారినుంచి ‘ఆత్మరక్షణ’ చేసుకోవడానికి కాల్పులు జరపడం ఆశ్చర్యం కలిగించే విషయం. అసలు కాల్పుల్లో ఒకరో, ఇద్దరో నేలకొరిగాక చుట్టూ ఎవరైనా మిగులుతారా? మృతదేహాలవద్ద దుంగలు పడివున్నాయి తప్ప మరెక్కడా లేవు. అంటే... పారిపోయిన 80 మంది దుంగలతో పరారైనట్టా? ఆ అటవీ ప్రాంతంలో దుంగలు పట్టుకుని పరుగులె త్తడం సాధ్యమేనా? పైగా మృతుల వద్ద లభించిన దుంగలన్నిటిపైనా పెయింట్ గుర్తులుండటం మరిన్ని అనుమానాలకు తావిస్తున్నది. స్వాధీనమైన దుంగలపై అటవీ సిబ్బంది ఈ గుర్తులువేస్తారు. నరికి తీసుకెళ్తున్న దుంగలపైకి ఈ గుర్తులెలా వ చ్చాయో అధికారులే చెప్పాలి. ఆ ప్రాంతాల్లో దొరికినవి మూడు గొడ్డళ్లు, రెండు నాటు తుపాకులు! ఇవన్నీ ఎన్కౌంటర్ల బూటకత్వాన్ని తెలిపినంతగా...పోలీసు కథనాల నిజాయితీని చాటడం లేదు. తమిళనాడు నుంచి వచ్చినవారికి ఆ రాత్రి అడవుల్లో ఏం పని అని ప్రశ్నిస్తున్నారు కొందరు అమాత్యులు. వారంతా స్మగ్లర్ల తరఫున చందనం చెట్లు నరకడానికి వెళ్లినవారే అయినా...ఆ కారణంతో వారిని కాల్చిచంపేయవచ్చా? ఈ ఎన్కౌంటర్ మృతులంతా తమిళనాడువారు కావడంతో ఏపీ బస్సులపై అక్కడ దాడులు జరిగాయి. నిరసన ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. 20 మంది మరణించే స్థాయిలో రెండు ఎన్కౌంటర్ ఉదంతాలు జరిగాయని మాత్రమే కాదు... పొరుగు రాష్ట్రంలో అవి సృష్టించిన ఉద్రిక్తతలను గమనించాకైనా ఏపీ సీఎం చంద్రబాబు బాధ్యతను గుర్తించి మీడియా ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సింది. ఎన్కౌంటర్లపై వస్తున్న సంశయాలను నివృత్తిచేసేందుకు తగిన విచారణ జరుపుతామని చెప్పాల్సింది. మౌనంవహించడంవల్ల మరిన్ని అనుమానాలు పెరగడం తప్ప జరిగేదేమీ ఉండదు. ఇరు రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మృతులు కరుడుగట్టిన నేరస్తులే అనుకున్నా వారిని చట్టం విధించిన పరిమితులకు లోబడి శిక్షించాలి తప్ప వేరేవిధంగా కాదు. వ్యవస్థలు ప్రజాస్వామ్యయుతంగా ఉంటేనే సమాజంలో ఆ తరహా భావనలు వెల్లివిరుస్తాయి. లేనట్టయితే సమాజమూ బండబారుతుంది. అప్పుడు మిగిలేది ఆటవిక న్యాయమే! -
15 ఏళ్లు.. 14 ప్రాణాలు
సాక్షి, సిటీబ్యూరో : ఉగ్ర బాట పడుతున్న కొందరు నగర యువకులు తమ భవిష్యత్తును చేజేతులా కాల రాసుకుంటున్నారు. పోలీసు తూటాలకు బలై... అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. పదిహేనేళ్ల కాలంలో వివిధ ప్రాంతాలలో జరిగిన ఎన్కౌంటర్లలో 14 మంది మృతి చెందడమే దీనికి నిదర్శనం. బాబ్రీ విధ్వంసానికి ప్రతీకారం తీర్చుకునేందుకంటూ ఏర్పడిన తన్జీమ్-ఇస్లా-ఉల్-ముస్లమీన్ (టీ ఐఎం) నుంచి లష్కర్-ఎ-తోయిబా (ఎల్టీ), ఇండియన్ ముజాహిద్దీన్ (ఐఎం), తెహరిక్-గల్భా-ఎ-ఇస్లాం (టీజీఐ), ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్), హిజబుల్ ముజాహిద్దీన్, జైషే మహమ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలతో నగర యువకులు సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇందులో కొందరు పాకిస్తాన్, బంగ్లాదేశ్, దుబాయ్‌లకు పారిపోయి అక్కడి నుంచి ఉగ్ర కార్యకలాపాలు కొనసాగించారు. ఈ తరహా దారుణాలలో పాలు పంచుకున్న 14 మంది వివిధ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో మరణించారు. అంతకుముందు 1993 జూలైలో పాతబస్తీకి చెందిన ఫసియుద్దీన్ నగరంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడు. ఇవీ సంఘటనలు.. 2000వ సంవత్సరం ఏప్రిల్‌లో నిజామాబాద్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో తన్జీమ్- ఇస్లా- ఉల్- ముస్లమీన్ (టీ ఐఎం) వ్యవస్థాపకుడు ఆజంఘోరి చనిపోయాడు. 2002 నవంబర్‌లో దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుల్లో ఒక డైన సయ్యద్ అజీజ్ కరీంనగర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించాడు. అజీజ్ ఎన్కౌంటర్ జరిగిన రెండు రోజులకే ఉప్పల్‌లో జరిగిన ఎన్కౌంటర్లో మరోనిందితుడు, మాదన్నపేటకుచెందిన ఆజంఎన్కౌంటర్లో మృతి చెందాడు. 2003 సెప్టెంబర్ 12న ముంబ యిలో జరిగిన ఎన్కౌంటర్లో బార్కాస్‌కు చెందిన హసన్ ఆమూది, కింగ్‌కోఠి షేర్‌గేట్‌కు చెందిన మరో యువకుడు మృతి చెందాడు. 2003లో కాశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో నగరానికి చెందిన మిర్జాఫయాజ్ బేగ్ మృతి చెందాడు. అంతకుముందు కొద్ది నెలల క్రితం పోలీసు ఎస్కార్ట్ కళ్లు గప్పి, నాంపల్లి కోర్టు నుంచి పారిపోయాడు. అక్టోబర్ 31, 2004లో లక్డీకాపూల్ లోని డీజీపీ కార్యాలయంలో గుజరాత్ పోలీసులు తెహరిక్ తౌఫుజ్ షాహరే ఇస్లామ్ (టీటీఎస్‌ఐ) మౌలానా నసీరుద్దీన్‌ను అరెస్టు చేసే సమయంలో కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆ సమయంలో జరిపిన కాల్పుల్లో ముజాహిద్దీన్ సలీం మృతి చెందాడు. 2006 మార్చి 14న ఢిల్లీలో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తోయిబా నేత, ఎల్బీనగర్కు చెందిన గులామ్ ఎజ్దానీ మృతి చెందాడు. 2007 ఆగస్టు 28న పాకిస్తాన్‌లోని లాహోర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో లష్కర్-ఏ-తయిబా దక్షిణ భారతదేశ ఇన్చార్జి, మూసారాంబాగ్‌కు చెందిన షాహిద్ బిలాల్, అతని సోదరుడు సమద్‌లు మృతి చెందారు. 2015 ఏప్రిల్ 7న ఆలేరులో జరిగిన ఎన్కౌంటర్లో వికార్, అమ్జద్, జకీర్, డాక్టర్ హనీఫ్ మరణించారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోంది?
నల్లగొండ కాల్పుల్లో గాయపడ్డ ఎస్ఐ సిద్ధయ్య మరణం.. మూడు రోజుల కిందట ఇద్దరు సిమి ముష్కరుల హతం.. ముగ్గురు కానిస్టేబుళ్ల మృతి.. ఈ రోజు చిత్తూరు జిల్లాలో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్కౌంటర్.. వరంగల్ జిల్లాలో ఉగ్రవాది వికారుద్దీన్ సహా అతడి గ్యాంగ్‌ను పోలీసులు కాల్చిచంపడం.. గత వారంరోజులగా తెలుగు ప్రజలు సహా పోలీసులు, దర్యాప్తు సంస్థలకు కంటిమీద కునుచేస్తోన్న అంశాలపై కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దృష్టిసారించింది. తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతోందంటూ ఆరా తీసింది. మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి ఎల్ సీ గోయల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని గురించే చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకున్న ఎన్కౌంటర్లపై సత్వరమే నివేదిక పంపాలని హోం సెక్రటరీ గోయల్.. ఏపీ, తెలంగాణ డీజీపీలను ఆదేశించారు. చిత్తూరు ఎన్‌కౌంటర్‌పై ఏపీ సీఎం చంద్రబాబు.. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోపాటు గవర్నర్ నరసింహన్‌కు వివరణ ఇచ్చారు. మృతులకు ఏపీ ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం డిమాండ్ చేశారు. పలు తమిళపార్టీల హెచ్చరికల నేపథ్యంలో ఆ రాష్ట్రానికి వెళ్లే బస్సు సర్వీసులను అధికారులు నిలిపివేశారు. -
మరికాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ
హైదరాబాద్: వరుస ఎన్ కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణ కేబినెట్ మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. వరంగల్, నల్లగొండ జిల్లాల్లో జరిగిన ఎన్ కౌంటర్లపై ఈ భేటీ లో చర్చించనున్నారు. అధేవిధంగా రాష్ట్రంలో తీవ్రవాదుల కదలికలపై కూడా కేబినెట్ లో చర్చిస్తారు. తీవ్రవాద, మావోయిస్టుల కార్యకలాపాల్లో చనిపోయిన పోలీసులకు ఎక్స్ గ్రేషియాను ప్రభుత్వం పెంచనుంది. ఈ మేరకు కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు. -
ఎదురు దెబ్బలు
పెరిగిపోయిన మావోయిస్టుల లొంగుబాట్లు 240 మంది మిలీషియా సభ్యుల సరెండర్ 2005-2015 మధ్య పది ఎన్కౌంటర్లు: 30 మంది మృతి ఉద్యమంపై తీవ్ర ప్రభావం ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లో మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఒకప్పుడు తమదే పైచేయిగా వ్యవహరించిన దళసభ్యులు పోలీసుల దాడుల్లో ఒక్కరొక్కరుగా మరణిస్తుండగా..ఈస్టు డివిజన్లో మావోయిస్టులకు వెన్నుదన్నుగా ఉండే మిలీషియా సభ్యులు ఐదేళ్లలో 240 మంది లొంగిపోయారు. ఇది ఆ పార్టీకి ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. పెద్ద నేతలు పోలీసులకు చిక్కడం, లేదా లొంగిపోవడం కూడా ఉద్యమంపై తీవ్రప్రభావం చూపుతోంది. కొయ్యూరు: ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో మావో యిస్టులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత ఐదేళ్లుగా దళసభ్యులతోపాటు మిలీషియా సభ్యు లు లొంగిపోతున్నారు. గాలికొండ దళ సభ్యుడు పంగి భాస్కరరావు అలియాస్ సూర్యాన్ని(22) జిల్లా పోలీ సులు మంగళవారం అరెస్ట్ చేశారు. గాలికొండ దళం ఆర్మడ్ అండ్ హార్డ్‌కోర్ మిలీ షియా సభ్యులు పదకొండు మంది ఎస్పీ కోయ ప్రవీణ్ ఎదుట లొంగిపోయారు. వీరితో పాటు అనారోగ్యంతో బాధపడుతున్న కలిమెల దళం సభ్యురాలు కొర్ర శాంతి అలియాస్ రత్నం(22)కూడా పోలీసులకు లొంగిపోయింది. ఏవోబీలో కీలక నేతగా ఉన్న చడ్డా భూషణం అలియాస్ నాగరాజు శిమిలిగుడ వద్ద ఏడాది క్రితం దొరికిపోయి జైలులో ఉన్నారు. ఏవోబీలో ‘ఆపరేషన్ ఆల్ అవుట్’ పేరిట ఇరువైపుల నుంచి ఏపీ, ఒడిశా బలగాల కూంబింగ్‌తో ఫలితాలు వస్తున్నాయి. 2005 నుంచి 2015 మధ్య జరిగిన ఎన్కౌంటర్లలో సుమారు 30 మంది దళసభ్యులు మరణించారు. 2007లో జీకేవీధి మండలంలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు వక్కాపూడి చంద్రమౌళి అలియాస్ దేవన్న,అతని భార్య మరణించారు ఈస్టు డివిజన్లో చోటుచేసుకుంటున్న ఎన్కౌంటర్లలో ఎక్కువ మంది మావోయిస్టులే మరణిస్తున్నారు. గునుకురాయి వద్ద 2006,2008 లలోజరిగిన జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. 2007లో కొయ్యూరు మండలం కన్నవరంలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు చనిపోయారు. అనంతరం అమ్మిడేలు సంఘటనలో ఇద్దరు మరణించారు. అప్పట్లో మావోయిస్టు నేత బాకూరు వెంకటరమణ అలియాస్ గణేష్ తప్పించుకున్నట్టుగా పోలీసులు భావించారు. అనంతరం 2009లో గొల్లువలస ఎన్కౌంటర్లో ఇద్దరు మరణించారు. 2010లో చెరువూరు సంఘటనలో నలుగురు మరణించారు. ఇందులో గుంటూరు జిల్లా పత్తికొండ ప్రాంతానికి చెందిన యువతి కూడా మరణించింది. 2013 జూలైలో కొయ్యూరు మండలం కిండంగి వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మల్కన్‌గిరి జిల్లాలో కలిమెల దళానికి చెందిన సహాయ కమాండర్ రంబోత అలియాస్ లక్ష్మి చనిపోయారు. 2014లో వీరవరం ఘటనలో గిరిజనుల చేతిలోనే గాలికొండ ఏరియా కమిటీకి చెందిన శరత్‌తో పాటు మరో మిలీషియా సభ్యులు మరణించారు. దశాబ్ద కాలంలో మావోయిస్టులు 30 మంది వరకు చనిపోయారు. 2005లో పుట్టకోట వద్ద జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత కైలాసం మరణించారు. ఇప్పుడు ఈస్టు డివిజన్ కార్యదర్శికి అతని పేరు పెట్టారు. -
ఎన్కౌంటర్లు లేని తెలంగాణకావాలి..
శ్రీరాంపూర్ : నెత్తురు పారని, ఎన్కౌంటర్లు లేని తెలంగాణ కావాలని, తెలంగాణలో జరుగుతున్న విధ్వంసాన్ని అడుకోవాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు విమలక్క పేర్కొన్నారు. శ్రీరాంపూర్ కృష్ణాకాలనీలోని గౌరిసుత గణేశ్ మండలి మైదానంలో బహుజన బతుకమ్మ సంబరా లు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విమలక్క మహిళలతో కలిసి బతుకమ్మ ఆ డారు. జిల్లాలో ప్రజల జీవనంపై విధ్వంసం పెరిగిం దన్నారు. టైగర్ జోన్ పేరిట ఆదివాసీలను అడవికి దూరం చేసి అందులోని సంపదను బహుళజాతి సం స్థలకు అప్పగించడానికి పాలక వర్గం కుట్ర చేస్తుంద ని మండిపడ్డారు. విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొ గ్గు ఇక్కడ నుంచి అందిస్తున్న ఇక్కడ జల్ జంగల్ జ మీన్ కోసం పోరాడిన కొమురం భీమ్‌ను ఆదర్శంగా తీసుకొని పోరాడాలన్నారు. చాలా కాలం బతుకమ్మను దళితులకు దూరం చేశారని అందుకు బహుజన బతుకమ్మ పేరుతో బతుకమ్మను బహుజనులకు దగ్గర చేస్తున్నామన్నారు. ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు ముందుగా బతుకమ్మలతో భారి ఊరేగింపు నిర్వహిం చారు ఒగ్గు కళాకారుడు ఐలయ్య బృందం, ధూంధాం కళాకారుడు డప్పు సమ్మయ్య బృందం డప్పు చప్పుళ్లతో బారి ఊరేగింపు జరిగింది. వేదికపై అరుణోదయ సాంస్కృతిక మండలి కళాకారులు పాడిన పాటలు డ్యాన్స్‌లు ఆకట్టుకున్నాయి. స్వరమాదురి కళానిలయం వ్యవస్థాపకులు, ధూంధాం కళాకారుడు అంతడప్పుల నాగరాజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. పెద్దయెత్తున మహిళలు బతుకమ్మ సం బరాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీసీఎఫ్ నిర్వాహకులు బైరాగి మోహన్, తిరుపతిరెడ్డి, ఏఐఎఫ్టీయూ డివిజన్ అధ్యక్షుడు మేకల పోశమల్లు, ప్రధాన కార్యదర్శి మల్లయ్య, పీఓడబ్ల్యూ నాయకులు కరుణ, రమా, కళాకారులు డప్పు సమ్మయ్య, రేగుం ట చంద్రశేఖర్, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు పత్తి గట్టయ్య, టీడీజీ మండల ప్రధాన కార్యదర్శి జక్కుల కుమార్, ఎంపీటీసీ ఉడుత రాజమౌళీ, ఉప సర్పంచ్ మోతె కనుకయ్య, బీజేపీ మండల నాయకులు అగల్‌డ్యూటీ రాజు, కాసెట్టి నాగేశ్వర్‌రావులు పాల్గొన్నారు. -
ఒక ఎన్కౌంటర్... ఎన్నో ప్రశ్నలు!
కారణాలేమైనా కావొచ్చు... తరచు వార్తల్లో ఉండటం గుజరాత్‌కు రివాజుగా మారింది. దశాబ్దకాలంనుంచీ ఇదే పరిస్థితి. 2002లో అక్కడ సాగిన మారణకాండ, అటుతర్వాత సాగిన ఎన్కౌంటర్లు వగైరాలపై విచారణలు, దర్యాప్తులు ఇప్పటికీ ఎడతెగని సీరియల్లా నడుస్తూనే ఉన్నాయి. ఈ పరంపరలో మరో అంకానికి తెరలేచింది. 2004లో 19ఏళ్ల యువతి ఇష్రాత్ జహాన్, మరో ముగ్గురు యువకులు మరణించిన ఎన్‌కౌంటర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) మాజీ సీనియర్ అధికారి రాజిందర్ కుమార్‌ను, ఆ విభాగానికే చెందిన మరో ముగ్గురు అధికారులనూ ముద్దాయిగా చేరుస్తూ సీబీఐ అనుబంధ చార్జిషీటు దాఖలుచేసింది. సర్వీసులో ఉన్న ముగ్గురు అధికారుల ప్రాసిక్యూషన్‌కు సంబంధించి ముందస్తు అనుమతి తీసు కోవాలా, వద్దా అనే అంశంలో అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని చెప్పేలో గానే సీబీఐ ఈ చార్జిషీటు దాఖలుచేసింది. ‘నా హృదయం ఈ నిర్ణయం వద్దని చెప్పినా... మనసు మాత్రం చేయకతప్పదన్నది’అని సీబీఐ డెరైక్టర్ రంజిత్‌సిన్హా వ్యాఖ్యానించారు. ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులను నిందితులను చేర్చాల్సిరావడం ఆయనకు బాధాకరమే అనిపించిందట! ఈ సందర్భంగానే రంజిత్‌సిన్హా మరో కీలక వ్యాఖ్య చేశారు. ‘గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అనుచరుడు అమిత్‌షాను కూడా ముద్దాయిగా చేర్చివుంటే యూపీఏ సర్కారు సంతోషించేదేమో...కానీ, మేం సాక్ష్యాధారాలనుబట్టే అన్నీ చేశాం’అని ఆయనన్నారు. ఒక కేసులో కూలంకషంగా దర్యాప్తు చేసి, అందులో కొందరిని ముద్దాయిలుగా నిర్ధారించాక సీబీఐ డెరైక్టరంతటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యకరమే. కానీ, ఈ కేసుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇందులో కేంద్ర ప్రభుత్వానికే చెందిన రెండు కీలక సంస్థలు పరస్పరం తలపడుతున్నాయి. అందులో ఒకటి సీబీఐ కాగా, రెండోది ఇంటెలిజెన్స్ బ్యూరో. కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఈ ఎన్కౌంటర్ బూటకమని చెప్పడంతో ఆగిపోలేదు. ఎన్‌కౌంటర్‌కు దారి తీసిన సమాచారం ఎవరిచ్చారు... అది వారికి ఎలా వచ్చిందన్న కూపీ లాగింది. సరిగ్గా అక్కడే ఐబీకి చిర్రెత్తుకొస్తున్నది. గుజరాత్ హైకోర్టు అడిగిందేమిటి? సీబీఐ శోధిస్తున్నదేమిటని దర్యాప్తు దశలోనే నిలదీసింది. ఇది సరికాదని కేంద్ర హోంమంత్రి నుంచి ప్రధాని వరకూ చాలామంది దగ్గర చెప్పింది. కానీ, ఏ కారణం చేతనో రంజిత్‌సిన్హా వదల్లేదు. ఇష్రాత్ జహాన్, మరో ముగ్గురు యువకులూ ఉగ్రవాదులనీ... వారు నరేంద్ర మోడీని హతమార్చడానికి కుట్రపన్ని అహ్మదాబాద్ దిశగా వస్తున్నారనీ సమాచారం అందించిన రాజిందర్ కుమార్‌ను కూడా ముద్దాయిని చేశారు. ఐబీకి స్పెషల్ డెరైక్టర్‌గా ఉండగా రాజిందర్పై అభియోగం మోపితే బాగుండదనుకున్నారేమో... ఆయన రిటైర య్యేదాకా వేచివుండి చార్జిషీటు దాఖలుచేశారు. ఎన్కౌంటర్ల కథకు ఆద్యులెవరోగానీ... స్థలకాలాదులు, వ్యక్తులు మినహా ఆ కథలో లేశమాత్రమైనా మార్పుం డదు. గుజరాత్లో ఉగ్రవాదులు, ఇతర రాష్ట్రాల్లో నక్సలైట్లు, కొన్నిచోట్ల దోపిడీదొంగలు, గంధపు చెక్కల స్మగ్లర్లు ఈ ఎన్కౌంటర్లలో మరణిస్తారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఉన్న విభాగాలకూ, వారికి సాయపడుతున్న గూఢచార విభాగాలకూ తగిన జవాబుదారీతనం కొరవడటంవల్లనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయన్నది పౌరహక్కుల సంఘాల ఆరోపణ. 2002-07 మధ్య గుజరాత్లో సాగిన 22 బూటకపు ఎన్కౌంటర్ ఘటనలపై విచారణ జరిపించాలని పౌరసమాజ ప్రతినిధులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తే అందులో కనీసం అయిదు ఎన్కౌంటర్లు రాజిందర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా చేసినవే. ఇష్రాత్ జహాన్ ఎన్కౌంటర్ కేసులో సీబీఐ సాగించిన దర్యాప్తు అంతా రాజకీయ ఒత్తిళ్లతో సాగిందని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ ఆరోపిస్తున్నా అందులో జవాబులేని ప్రశ్నలు చాలా ఉన్నాయి. మృతులందరూ లష్కరే తొయిబా ఉగ్రవాదులనీ, వారు పాకిస్థాన్ పౌరులనీ పోలీసులు చెప్పినా ఇష్రాత్ ముంబైకి చెందిన యువతిగా, మరో యువకుడు కేరళకు చెందినవాడుగా నిర్ధారణ అయింది. మరో ఇద్దరు ఎవరన్నది తేలకపోయినా, వారి మృతదేహాలవద్ద లభించిన పాకిస్థాన్ గుర్తింపు కార్డులు ఫోర్జరీవని రుజువైంది. మున్సిఫ్ మేజిస్ట్రేట్ నిర్వహించిన దర్యాప్తులోనూ, అటు తర్వాత గుజరాత్ హైకోర్టు నియమించిన సిట్ దర్యాప్తులోనూ ఈ ఎన్కౌంటర్ బూటకమని నిర్ధారించారు. కేసులో ప్రత్యక్ష సాక్షులు లేకపోయినా, పరిస్థితులు పట్టి ఇస్తున్న ఆధారాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ హత్యేనని సీబీఐ తేల్చిచెప్పింది. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటికే ఐపీఎస్ అధికారులు డీజీ వంజారా, పీపీ పాండే, గిరిష్ సింఘాల్లాంటివారు నిందితులుగా ఉన్నారు. ఈ కేసు సాకుతో సీబీఐ తమను వేధిస్తున్నదనీ, తమ విభాగం నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రమాదకర క్రీడకు అది తెరలేపిందని నిరుడు కేంద్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో ఐబీ చీఫ్ ఆసిఫ్ ఇబ్రహీం ఆరోపించారు. ఇది దేశభద్రతకు చేటు తెస్తుందని కూడా హెచ్చరించారు. తమకు వివిధ వర్గాలనుంచి అందే సమాచారాన్ని వేర్వేరు విభాగాలకు పంపడం రివాజని, దాన్లో కూడా కుట్ర కోణాన్ని చూస్తే ఎలా అన్నది ఐబీ అభ్యంతరం. అసలు గూఢచార విభాగాలైనా, సీబీఐలాంటి సంస్థలైనా నిర్దిష్టమైన చట్టాలకు, నిబంధనలకు లోబడి పారదర్శకంగా పనిచేస్తే ఏ సమస్యలూ రావు. తాము ఏదంటే అది నడుస్తున్నదన్న ధీమాతో, అడిగేవారు లేరన్న ధైర్యంతో వ్యవహరించడంవల్లే ఇలాంటి దుస్థితి ఏర్పడుతుంది. తాజా పరిణామాల నేపథ్యంలోనైనా ఆయా విభాగాల్లో పరిస్థితులను చక్కదిద్దడానికి చర్యలు తీసుకోవాలి. వ్యక్తులైనా, సంస్థలైనా చట్టబాహ్యతకు పాల్పడకుండా తగిన కట్టుదిట్టాలు చేయాలి. -
కాంగ్రెస్ దుర్మర్గం