'తీరు మారకుంటే అంతం చేస్తామన్నారు’ | maoist warning to TRS government | Sakshi
Sakshi News home page

'తీరు మారకుంటే అంతం చేస్తామన్నారు’

Published Sat, Nov 21 2015 12:59 PM | Last Updated on Mon, Oct 8 2018 8:37 PM

'తీరు మారకుంటే అంతం చేస్తామన్నారు’ - Sakshi

'తీరు మారకుంటే అంతం చేస్తామన్నారు’

చర్ల: మావోయిస్టుల ఎజెండానే తమ ఎజెండా అని పేర్కొంటూ అధికారంలోకి వచ్చిన కేసీఆర్ బూటకపు ఎన్‌కౌంటర్లతో అరాచకాలు సృష్టిస్తున్నారని మావోయిస్టులు మండిపడ్డారు. శనివారం మావోయిస్టుల చెర నుంచి విడుదలైన భద్రాచలం నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ మానె రామకృష్ణ చర్లలో విలేకరులతో మాట్లాడారు. మావోయిస్టుల సూచన మేరకు ఆయన మీడియాకు వివరాలు చెప్పారు.

సర్కారు తీరు మారకుంటే గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు టీఆర్‌ఎస్ నాయకులను అంతం చేస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్టు చెప్పారు. ఇకనైనా సర్కారు తన తీరు మార్చుకోవాలని, ఎన్‌కౌంటర్లు, కూంబింగ్‌లు నిలిపివేయాలని చెప్పమన్నారని వెల్లడించారు. మావోయిస్టులు తమను బాగానే చూసుకున్నట్టు రామకృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement