ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ఏం సాధించారు?
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్‌గా మారుస్తాం:మాజీ ఎంపీ వినోద్ కుమార్
మానకొండూర్ (కరీంనగర్): మైండ్‌గేమ్‌తోనే నాడు చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.
కార్యక్రమానికి హాజరైన గంగుల మాట్లాడుతూ..‘1995 ఆగస్టు 26న చంద్రబాబును బలపరుస్తూ ఇప్పుడే 110 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారని ఈనాడు పత్రిక ఓ కథనా న్ని ప్రచురించింది. అది చూసిన 110 ఎమ్మెల్యేలు అప్పుడు వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. అలా ఎమ్మెల్యేలందరూ వెళ్లి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు..ఇప్పుడు అదేవిధంగా బీఆర్‌ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్ ఆడుతోంది’అని తెలిపారు.
టీఆర్‌ఎస్‌గా మారుస్తాం..
బీఆర్‌ఎస్ పార్టీని తిరిగి టీఆర్‌ఎస్‌గా మారుస్తామని ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చిస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నాటి సమావేశంలో హడావుడే తప్ప ఏం సాధించారని ఎద్దేవా చేశా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, మేయర్ సునిల్‌రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment