vinod kumar
-
తెలీదు!
నివాస్, అమిత శ్రీ జంటగా వినోద్ కుమార్, రఘుబాబు, పృథ్వీ, భరద్వాజ్, ఖయ్యూం కీలక ΄పాత్రల్లో ‘తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా’ సినిమా గురువారం ఆరంభమైంది. వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు రఘుబాబు క్లాప్ ఇచ్చారు.వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ– ‘‘పూర్తి వినోదాత్మకంగా రూపొందుతున్న చిత్రం ఇది. ఈ నెల 18న రెగ్యులర్ షూట్ ఆరంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘మా సినిమా పేరులో గుర్తులేదు అని ఉంది కానీ సినిమా మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా ఉంటుంది’’ అని శరత్‌బాబు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అభిలాష్ .ఎం, సంగీతం: అజయ్ పట్నాయక్. -
కామెడీ ఎంటర్ టైనర్‌గా ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’
నివాస్, అమిత శ్రీ జంటగా నటిస్తున్న సినిమా "తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా". ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు, భరద్వాజ్, ఖయ్యూం నటిస్తున్నారు. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా చిత్రాన్ని చెన్నా క్రియేషన్స్ బ్యానర్ పై శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా దర్శకుడు వెంకటేష్ వీరవరపు రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ నివ్వగా, సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.ఈ సందర్భగా నటుడు పృథ్వీ మాట్లాడుతూ - మంచి కథ, కథనాలతో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా మీ ముందుకు రాబోతోంది. ఈ చిత్రంలో ఒక ఇంట్రెస్టింగ్ రోల్ చేశాను. ఈ పాత్రకు ఎవరు సరిపోతారో వాళ్లనే పర్పెక్ట్ గా కాస్టింగ్ చేశారు. నిర్మాత శరత్ చెన్నా గారు బాగా చదువుకున్న వ్యక్తి. ఎంతో ప్యాషన్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. అలాగే దర్శకుడు వెంకటేష్ ఈ మూవీని అనేక ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో ఎంటర్ టైనింగ్ గా రూపొందిస్తున్నాడు. కొత్త హీరో నివాస్, హీరోయిన్ అమిత శ్రీకి నా బెస్ట్ విశెస్ తెలియజేస్తున్నా. అన్నారు.దర్శకుడు వెంకటేశ్ వీరవరపు మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. 30 ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘు బాబు కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 18వ తేదీ నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తున్నాం. మాకు ఎంతో సపోర్ట్ గా నిలుస్తున్న మా ప్రొడ్యూసర్ శరత్ గారికి, పృథ్వీ గారికి, మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మేమంతా అజయ్ పట్నాయక్ గారి టీమ్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తున్నాం. అన్నారు.హీరోయిన్ అమిత శ్రీ మాట్లాడుతూ - తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా సినిమాతో హీరోయిన్ గా మీ ముందుకు వస్తుండటం సంతోషంగా ఉంద. నాయికగా ఇది నా ఫస్ట్ మూవీ. తొలి చిత్రంతోనే మంచి అవకాశం కల్పించిన నిర్మాత శరత్ గారికి, దర్శకుడు వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.హీరో నివాస్ మాట్లాడుతూ - అందరికీ నమస్కారం. మా మూవీ ప్రారంభోత్సవానికి వచ్చిన గెస్ట్ లు రఘుబాబు గారు, పృథ్వీగారు, ఆర్పీ పట్నాయక్ గారికి థ్యాంక్స్. మంచి వినోదాత్మక చిత్రమిది. మీ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాతో హీరోగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. అన్నారు. -
కవితకు బెయిల్ ఆలస్యమైనా.. న్యాయం గెలిచింది: బీఆర్ఎస్ నేతలు
న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లు పేర్కొంది.కవిత బెయిల్‌పై తెలంగాణ రాజకీయం వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నెలకొంది. బెయిల్ విషయంలో కుమ్మక్కయ్యారంటూ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు.లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తున్నారని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అయిదునెలలుగా ఒక ఆడబిడ్డ జైల్లో ఇబ్బంది పడిందని, అన్యాయంగా కవితను జైల్లో పెట్టారని విమర్శించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్.. సుప్రీంకోర్టు తీర్పును కించపరిచే విధంగా దానికి రాజకీయాలు ముడి పెట్టి దుర్మార్గంగా మాట్లాడారని మండిపడ్డారు.సుప్రీంకోర్టు తీర్పును అపహాస్యం చేస్తున్నారని, కేంద్రమత్రిగా ఉండి బండి సంజయ్ ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడిన వ్యాఖ్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. మహేష్ కుమార్ గౌడ్‌పై కేసులు వేస్తామని, బెయిల్‌ను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడారని విమర్శించారు. కోర్టులో జరిగిన వాదనలు సమాజం చూసిందని, ఈబీ, సీబీఐ వరి కనుసన్నల్లో నడుస్తున్నాయనేది దేశం మొత్తం తెలుసని అన్నారు. బెయిల్ రావడం ఆలస్యమైనా.. న్యాయం గెలిచిందన్నారు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. నిజం ఆలస్యంగా గెలుస్తుందని నిరూపితమైందని తెలిపారు. రాజకీయ నేతలు ఈ కేసులో లేకపోతే 15 రోజుల్లో బెయిల్ వచ్చేదని పేర్కొన్నారు. బీజేపీ వ్యతిరేక పార్టీలకు చెందిన రాజకీయ నేతలు ఈ కేసులో ఉన్నారు కాబట్టే జైల్లో పెట్టారని ఆరోపించారు. ఢీల్లి లిక్కర్ కేసులో ఒక్క రూపాయి రికవరీ చేయలేదని, సౌత్ గ్రూప్ అని పేరు పెట్టి అహంకారంతో వ్యవహరించారని మండిపడ్డారు.‘చార్జీషీట్ దాఖలు చేసిన తర్వాత జైల్లో ఎందుకు ఉండాలని కోర్టు అడిగింది. అడిషనల్ సాలిసిటర్ జనరల్ ఆ ప్రశ్నకు నీళ్లు నమిలారు. మహిళలకు బెయిల్ విషయంలో కొన్ని చట్టబద్ధమైన హక్కులు ఉంటాయి. ఢీల్లి హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. బండి సంజయ్ అనాలోచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. బండి సంజయ్‌కు అసలు తెలివి ఉందా? సుప్రీంకోర్టులో లాయర్లు పార్టీల తరపున ఉండరు. ముకుల్ రోహత్గీ బీజేపీ ప్రభుత్వంలో సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్‌గా ఐదేళ్ళు పని చేశారుకేంద్ర హోంశాఖా సహాయ మంత్రి హోదాను బండి సంజయ్ కాపాడుకోవాలి. మేము బాంఛన్ అంటే కవిత ఎప్పుడో బయటకు వచ్చేది. చట్ట ప్రకారం కొట్లాడదామనే మేము ముందుకు వెళ్ళాము. స్త్రీలను ఇబ్బంది పెట్టిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై చర్యలు తీసుకోలేదు. బీజేపీలో చేరిన హిమంత బిశ్వశర్మపై కేసులు లేకుండా చేసి సీఎంను చేశారు.ఏపీలో టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు రాజ్యసభ సభ్యులపై ఈడీ కేసులు ఎందుకు నడవడం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో బీజేపీలో చేరిన ఎంతో మంది నేర చరితలపై విచారణ జరగడం లేదు. బీజేపీలో చేరితే కేసులు లేకుండా చేస్తున్నారు. కవితపై పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపిత కేసు. కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టే కుట్ర చేశారుబండి సంజయ్ తెలంగాణలో 750 కోట్ల సివిల్ సప్లై స్కాం పై ఎందుకు మాట్లాడడం లేదు. కేంద్ర ప్రభుత్వ సివిల్ సప్లై శాఖ పై ఎందుకు దృష్టి పెట్టలేదు. తెలంగాణ ఆడబిడ్డ బెయిల్ వస్తే ఎందుకింత అక్కసు?- మాజీ మంత్రిగంగుల కమలాకర్. -
మైండ్‌గేమ్‌తో నాడు బాబు.. నేడు రేవంత్ మాయ
మానకొండూర్ (కరీంనగర్): మైండ్‌గేమ్‌తోనే నాడు చంద్రబాబు అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చారని, ఇప్పుడు సీఎం రేవంత్‌రెడ్డి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీల వీడ్కోలు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు.కార్యక్రమానికి హాజరైన గంగుల మాట్లాడుతూ..‘1995 ఆగస్టు 26న చంద్రబాబును బలపరుస్తూ ఇప్పుడే 110 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లోని వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారని ఈనాడు పత్రిక ఓ కథనా న్ని ప్రచురించింది. అది చూసిన 110 ఎమ్మెల్యేలు అప్పుడు వైస్రాయ్ హోటల్‌కు చేరుకున్నారు. అలా ఎమ్మెల్యేలందరూ వెళ్లి ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోశారు..ఇప్పుడు అదేవిధంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 22 మంది చేరుతున్నారని కాంగ్రెస్ పార్టీ మైండ్‌గేమ్ ఆడుతోంది’అని తెలిపారు.టీఆర్ఎస్గా మారుస్తాం..బీఆర్ఎస్ పార్టీని తిరిగి టీఆర్ఎస్గా మారుస్తామని ఇందుకోసం పార్టీ అధినేత కేసీఆర్‌తో చర్చిస్తామని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి శనివారం నాటి సమావేశంలో హడావుడే తప్ప ఏం సాధించారని ఎద్దేవా చేశా రు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్, మేయర్ సునిల్‌రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీలు పాల్గొన్నారు. -
తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం.. మాజీ ఎంపీ వినోద్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చి తెలంగాణ పేగుబంధాన్ని తెంచుకున్నాం. ఏస్, అందులో నేనూ ఓ పాత్రధారినే అంటూ బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మానకొండూరులో జరిగిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారాయన. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్‌తో మాట్లాడి తెలంగాణ అనే అంశంతో ముడివిడిపోకుండా పార్టీని సన్నద్ధం చేస్తామన్నారు. టీఆర్ఎస్ పవర్లో లేకపోవచ్చు కానీ.. పవర్ ఫుల్ పార్టీ అన్నారాయన. -
తెలంగాణ శాసనమండలి మనుగడకు ప్రమాదం ఏర్పడింది
-
12 శాతం వృద్ధి లక్ష్యం: డాలర్ ఇండస్ట్రీస్
హైదరాబాద్ , బిజినెస్ బ్యూరో: డాలర్ ఇండస్ట్రీస్ 2024–25లో 12% ఆదాయ వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. 2023–24లో కంపెనీ రూ.506 కోట్ల టర్నోవర్‌పై రూ.90 కోట్ల నికరలాభం ఆర్జించింది. సంస్థ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 8 శాతంగా ఉందని ఎండీ వినోద్ కుమార్ గుప్తా మీడియాకు తెలిపారు. ‘సంస్థ మొత్తం అమ్మకాల్లో దక్షిణాది వాటాను 20 శాతానికి చేరుస్తాం. ఈ ప్రాంతంలో మూడేళ్లలో 50 ఔట్లెట్లను తెరుస్తాం’ అని అన్నారు. 2025 –26లో రూ.2,000 కోట్ల టర్నోవర్ సాధిస్తామని జేఎండీ బినయ్ కుమార్ గుప్తా తెలిపారు. బ్రాండెడ్ హొజైరీ రంగంలో కంపెనీ మార్కెట్ వాటా 15 శాతం. -
‘బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారు’
సాక్షి, కరీంనగర్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే ఆలోచనలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే.. బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతోంది. నేను గెలిస్తే వాటిని కొట్లాడి అడ్డుకుంటా. హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు రైలు రాబోతుంది.. అది నేను చేసిన పని.. గెలిస్తే వస్తుంది. తెలంగాణా నిధుల కోసం మోదీని నేను కలిసినన్ని సార్లు బండి సంజయ్ కలిశాడా?. కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేయి కోట్లు తెచ్చిన. యువకుల్లరా మీకు ఉద్యోగాలు కావాలా.. విధ్వంసాలు కావాలా? అభివృద్ధి కోసం నా వెంట రండి.ప్రజా స్పందన చూస్తే భారీ మెజరిటితో గెలువబోతున్నానన్న ధీమా కలుగుతోంది.పాంప్లెంట్లులో మోదీ బొమ్మ పెట్టకుండానే సంజయ్ ప్రచారం చేసిండు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రతి మంత్రిని కలిసినా నేను. బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం మోదీని ఏనాడూ కలువలేదు. కేబుల్ బ్రిడ్జిపైన నేడు చెత్త పేరుకు పోయింది.. అభివృద్ధి ఎటు పోతుంది? నా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కరీంనగర్‌ను వైబ్రెంట్ కరీంనగర్‌గా మార్చి చూపిస్తా’’ అని వినోద్ కుమార్ అన్నారు. -
బీఆర్ఎస్తోనే అన్నివర్గాలకు న్యాయం : గంగుల కమలాకర్
కరీంనగర్: బీఆర్ఎస్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని, రానున్న ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా వినోద్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించా లని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలు పునిచ్చారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భా గంగా కిసాన్‌నగర్ 3,25వ డివిజన్లో కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఎమ్మెల్యే కమలాకర్, వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక స్మార్ట్‌సిటీ నిధులతో పాటు సీఎం హామీ నిధులు రూ.360 కోట్లతో కరీంనగర్ నగరాన్ని అద్దంలా తీర్చిదిద్దామని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీల మోసపూరిత వాగ్దానాలను తిప్పికొట్టి బీఆర్ఎస్కు అండగా నిలవాలని ప్రజలను కోరా రు. మేయర్ సునీల్‌రావు, బీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, ఎడ్ల అశోక్, కుర్ర తిరుపతి, కంసాల శ్రీనివాస్, కామారపు శ్యాం పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ ఎందుకు సుమోటోగా తీసుకోవడం లేదు? -
ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా?: మాజీ ఎంపీ వినోద్
సాక్షి, కరీంనగర్: బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటిపేరు ఒకటైతే బంధువులు అవుతారా? అని ప్రశ్నించారు. బండి సంజయ్ తనపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని సీరియస్ అయ్యారు. కాగా, వినోద్ కుమార్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జెన్కో ప్రభాకర్‌రావు ఉద్యోగం ఇచ్చిన బోయినపల్లి సరితకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దీనిని బీజేపీ, కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేశారు. ఇంటి పేరు ఒకటైతే బంధువులు అవుతారా?. అలాగైతే ప్రధాని మోదీ, నీరవ్ మోదీలు బంధువులా?. నా 22 ఏళ్ల రాజకీయ జీవితంలో నేను ఏనాడూ తప్పులను ప్రోత్సహించలేదు. చట్ట వ్యతిరేక పని చేయమని చెప్పను. బండి సంజయ్ కావాలనే నాపై బీజేపీ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. గోబెల్స్ ప్రచారం ఆపాలి. ఆ అమ్మాయి నా బంధువు అని రుజువు చేయగలరా?’ అని ప్రశ్నించారు. -
‘స్కిల్’ శిక్షకులకు ఆహ్వానం
సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన 192 స్కిల్ హబ్స్, ప్రతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన మరో 26 స్కిల్ కాలేజీలు, ఒక స్కిల్ యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఔత్సాహికుల నుంచి ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ(ఏపీఎస్ఎస్డీసీ) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రతి జాబ్ రోల్‌కు ఒక సర్టిఫైడ్ ట్రైనర్ చొప్పున మొత్తం 2,000 మంది శిక్షకులు అవసరమవుతారని ఏపీఎస్ఎస్డీసీ అంచనా వేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ తరగతులపై ట్రైనింగ్ ఇచ్చి శిక్షకులుగా ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణ విధివిధానాలు (ఎస్వోపీ)ని రూపొందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ సీఈవో వినోద్‌కుమార్ గురువారం ‘సాక్షి’కి తెలిపారు. ఆసక్తిగలవారికి కేంద్ర నైపుణ్య శిక్షణ ఎన్ఎస్క్యూఎఫ్ ప్రమాణాల ప్రకారం నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత శిక్షకులుగా సర్టిఫికెట్ జారీచేసి ఏపీఎస్ఎస్డీసీ ఎంపానల్మెంట్లో నమోదు చేస్తామని చెప్పారు. మొత్తం 20 రంగాలకు చెందిన 44 జాబ్ రోల్స్‌లో శిక్షకులను నియమించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ పోర్టల్ https://skilluniverse.apssdc.in/ user®istration లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని ఎంపికైన అభ్యర్థులను ఏపీ స్కిల్ యూనివర్సల్ పోర్టల్ లేదా యాప్‌లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల్లో శిక్షణ అవసరమైనప్పుడు వీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, శిక్షణా వ్యయంలో సుమారు 13 శాతం వరకు శిక్షకులకు పారితోషికంగా ఇస్తామని, కోర్సును బట్టి వీటి ఫీజులు మారుతుంటాయని వినోద్‌కుమార్ తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకురావడమే కాకుండా దానికి అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి పిరమిడ్ ఆకృతిలో ఒక ఎకో సిస్టమ్‌ను రూపొందించారు. ఇంటర్మీడియెట్లోపు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్ హబ్స్, ఆపైన విద్యార్థులకు స్కిల్ కాలేజీలు, హైఎండ్ స్కిల్ శిక్షణ కోసం స్కిల్ యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. -
ఓ యువతి కథ
కర్ణాటక రాష్ట్రంలో హళిబేడు ఆలయానికి సమీపంలో ఉన్న గిరిజన తండాలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా నిర్మాత కేఎస్ రామారావు పర్యవేక్షణలో తెరకెక్కిన పీరియాడికల్ ఫిల్మ్ ‘శాంతల’. నిహాల్ కోదాటి, అశ్లేషా ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించగా, వినోద్ కుమార్ ఓ ప్రధాన పాత్రలో నటించారు. ఇండో అమెరికన్ ఆర్ట్స్ పతాకంపై డా. యిర్రంకి సురేష్ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 17న తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ, మరాఠీ భాషల్లో విడుదల కానుంది. ‘‘ఓ గిరిజన తండాలో అమాయక స్త్రీలను చెరబట్టే అరాచకానికి ఒడిగడుతున్న ఒక కామాంధుడి బారి నుండి విముక్తి ΄పొందిన ఒక యువతి కథే ‘శాంతల’ చిత్రకథ. బేలూరు, హళిబేడు జంట దేవాలయాల వద్ద అత్యంత సుందరమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించాం. అలాగే కీలక సన్నివేశాలను కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లో దర్శకుడు శేషు పెద్దిరెడ్డి నిర్దేశకత్వంలో కేఎస్ రామారావు షూటింగ్ కార్యక్రమాలను నిర్వహించారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
తెలంగాణ వర్సిటీ అధ్యాపకుల సమస్యల్ని పరిష్కరిస్తాం: వినోద్‌కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టీఎస్‌యూటీఏ) 3వ కన్వెన్షన్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా ‘తెలంగాణలో ఉన్నత విద్య– సమకాలీన సమస్యలు – సాధ్యమైన చర్యలు‘ అనే అంశంపై నిర్వహించిన సదస్సుకు వినోద్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వర్సిటీ నిర్మాణాల అభివృద్ధికి సీఎస్ఆర్ నిధులు వినియోగించాలని సూచించారు. వివిధ భావజాలాలతో సంబంధం లేకుండా విద్యార్థులను రాజకీయ భాగస్వామ్యానికి దూరంగా ఉంచడంలో కుట్ర దాగుందని, దీని పర్యవసానాలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని చెప్పారు. టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడు తూ..పెండింగ్‌లో ఉన్న వర్సిటీ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కరించాలని కోరారు. -
బాసూ రెడీయా...
‘ఏం బాసూ రెడీయా.. వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోని’ అనే డైలాగ్స్‌తో ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ ఆరంభం అయింది. విశాల్ పలు షేడ్స్‌లో టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఇది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్‌ని హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మంచివాడిగా, విలన్‌గా, గుండుతో స్టైలిష్‌గా, తండ్రిని కాపాడుకోవాలనుకునే వ్యక్తిగా... ఇలా పలు షేడ్స్‌లో విశాల్ కనిపిస్తారు. ఓ టైమ్ మిషన్ కాకుండా ఓ ఫోన్ హీరోని గతానికి తీసుకెళ్తే తనేం చేశాడనే కథాంశంతో ‘మార్క్ ఆంటోని’ని రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు. -
కక్షిదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి
కుషాయిగూడ: న్యాయం కోసం కోర్టుకు వచ్చే కక్షిదారులకు సత్వర న్యాయం అందించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే అన్నారు. కుషాయిగూడ పారిశ్రామికవాడలోని ఆఫెల్ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ప్రిన్సిపల్ డ్రాస్టిక్ కోర్టుతో పాటు ఇతర కోర్టుల సముదాయాన్ని శనివారం ఆయన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కోర్టు అడ్మిమినిస్టేటివ్ జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి. వినోద్‌కుమార్‌తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో జస్టిస్ అరాధే మాట్లాడుతూ, సత్వర న్యాయం అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఒకటన్నారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించే కక్షిదారులకు న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. న్యాయవ్యవస్థ పనితీరు ప్రభావవంతంగా, సమర్థవంతంగా ఉన్నప్పుడే న్యాయస్థానాలపై విశ్వాసం పెరుగుతుందన్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు కోర్టులో మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని చీఫ్ జస్టిస్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి బి.ఆర్. మధుసూదన్‌రావు, జిల్లా కలెక్టర్ డి.అమోయ్‌కుమార్, టీఎస్ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాచకొండ సీపీ డి.ఎస్. చౌహాన్, రిజిస్ట్రార్ జనరల్ తిరుమలదేవి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి రఘునాథ్‌రెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కె. రామచంద్రారెడ్డి, సెక్రటరీ ఎం.రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతంగా జువెనైల్ జస్టిస్
సాక్షి, హైదరాబాద్: పిల్లల సంరక్షణ, పునరావాసం కోసం జువెనైల్ జస్టిస్ చట్టాలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం, యూనిసెఫ్ పలు చర్యలు తీసుకుంటున్నాయని తెలంగాణ లీగల్ సర్విసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని.. వారి అభివృద్ధే సమాజ ప్రగతి అన్నారు. లీగల్ సర్విసెస్ అథారిటీ, జ్యుడీషియల్ అకాడమీ సంయుక్తంగా ఇలాంటి అవగాహన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. జువెనైల్ జస్టిస్‌పై రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీలో ఒకరోజు అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్యామ్ కోషి, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షుడు, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ, జ్యువెనైల్ జస్టిస్ బోర్డు చైర్మన్, న్యాయమూర్తి జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లు ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్యామ్ కోషి మాట్లాడారు. పాఠశాలల్లో, నివాస ప్రాంతాల్లో ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని, పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాలని జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలీ ఉద్ఘాటించారు. బాల నేరస్తులను సంస్కరించడం, పునరావాసం కల్పించడం లాంటి అంశాలను చట్టంలో పొందుపరిచారని జస్టిస్ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. జువెనైల్కు న్యాయ సేవలను అందించడంలో లీగల్ సర్వీసెస్ అథారిటీ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ స్టేట్ లీగల్ సర్విసెస్ అథారిటీ మెంబర్ సెక్రటరీ ఎస్.గోవర్ధన్‌రెడ్డి వివరించారు. జువెనైల్ జస్టిస్ బలోపేతానికి ఈ కార్యక్రమం దోహదం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి భారతి హోళికేరి తదితరులు పాల్గొన్నారు. -
వరదల్లో బురద రాజకీయం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వివాదం
తెలంగాణలో వర్షాలు, వరదలు తగ్గాయి. బురద రాజకీయాలకు తెరలేచింది. వరద బాధితులను ఆదుకునే బాధ్యత మీదంటే, మీదనే స్థాయిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిందించుకుంటున్నాయి. వర్షం, వరదల నష్టంపై రాష్ట్రం సమాచారం ఇవ్వకపోయినా మానవతా దృక్పథంతో కేంద్ర బృందాలను పంపించి ఆదుకునే చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేయగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించి కేంద్రమంత్రి ఏం చేశారని ప్రశ్నిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు. వర్షం వరదలు సృష్టించిన భీభత్సంపై రాజకీయ దుమారం నెలకొంది. వరదలు సృష్టించిన బీభత్సంతో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పుడిప్పుడే తేరుకుంటుంది. రాజకీయ పార్టీల నేతలు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి బురద రాజకీయాలు చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షం వరదల ధాటికి 31 మంది ప్రాణాలు కోల్పోగా నలుగురి ఆచూకీ లభించకలేదు. ఆపార నష్టం వాటిల్లింది. వరద నష్టాన్ని పరిశీలించి బాధితులకు భరోసా కల్పించే పనిలో ప్రభుత్వంతో పాటు రాజకీయ పార్టీల నేతలు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. పార్టీ పరంగా సహాయం చేసే పనిలో నిమగ్నమయ్యారు. గ్రేటర్ వరంగల్, భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో కేంద్రమంత్రి బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి పర్యటించి వర్షం వరదలు సృష్టించిన బీభత్సాన్ని పరిశీలించారు. పార్టీపరంగా నిత్యావసర సరకులు, దుప్పట్లు పంపిణీ చేసిన కిషన్ రెడ్డి వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద జాతీయ విపత్తు నిధులు రూ. 914 కోట్ల వరకు ఉన్నాయని, ప్రస్తుతం 2023-24 సంవత్సరానికి సంబంధించిన 197 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. యూసీ తీసుకువస్తే రాష్ట్రప్రభుత్వ అకౌంట్లో జమ చేస్తామన్నారు. వర్షం వరద నష్టంపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నివేదిక పంపకపోయినప్పటికి మానవతా దృక్పథంతో కేంద్ర ప్రభుత్వమే కేంద్ర బృందాలను పంపించిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతో వరద బాధితులకు ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల చొప్పున ఇవ్వొచ్చని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యం చేయకుండా సహాయక చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం పంటల ఫసల్ బీమాను అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. ఇక నాలుగు నెలలు మాత్రమే ఉండే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పంటల పసల్ బీమా పథకాన్ని అమలు చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వరద ప్రాంతాల్లో పర్యటించి అవగాహన లేకుండా అనవసర వ్యాఖ్యలు చేశారని మండిపడుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్రం పన్నుల రూపంలో చెల్లించే డబ్బులతోనే కేంద్ర ప్రభుత్వం నడుస్తుందనే విషయాన్ని గమనించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. జాతీయ విపత్తుల నిర్వహణ యాక్ట్ కింద కేంద్రం నిధులు ఇచ్చి ఖర్చు చేయకుండా అనేక నిబంధనలు పెడుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కించపరిచేలా మాట్లాడితే జాతీయ సమైక్యతకు ముప్పు వస్తుందని స్పష్టం చేశారు. దయచేసి రాజకీయాలు మాట్లాడకుండా ఏం చేద్దామో చెప్పండని కోరారు. విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం సమంజసం కాదన్నారు. రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అందరికీ తెలుస్తుందని, నీళ్ళు, నిప్పును ఎవరు ఎదుర్కోలేరని తెలిపారు. వరద నష్టాన్ని అంచనా వేస్తున్నాం, వర్షం వరద నష్టంపై డిపిఆర్ తయారు చేస్తున్నామని స్పష్టం చేశారు. వరంగల్ మహానగరంలో రెండు రివర్ ఫ్రంట్ లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇదిలా ఉండగా కేంద్రంలో అధికారం ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు మద్య విమర్శలు వరద బాధితులను ఆవేదనకు గురిచేస్తోంది. బురద రాజకీయాలు మానుకుని బాధితులను ఆదుకునే తక్షణం చర్యలు చేపట్టాలని జనం కోరుతున్నారు. -
ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. ఇద్దరు పిల్లలు పుట్టాక..
కర్నూలు: తనను ప్రేమించి.. పెళ్లి చేసుకొని.. ఇద్దరు పిల్లలు జన్మించాక వదిలేయడం అన్యాయమని, తనకు న్యాయం చేయాలంటూ రజియాబీ అనే మహిళ ఆదివారం భర్త వినోద్‌కుమార్ ఇంటి ఎదుట బైఠాయించింది. వివరాలు.. కడివెళ్ల గ్రామానికి చెందిన గొల్ల వినోద్‌కుమార్ తమ ఇంటి సమీపంలో నివాసముంటున్న రజియాబీనీ ప్రేమించాడు. 13 సంవత్సరాల క్రితం ముంబైకి తీసుకెళ్లి పెళ్లి చేసుకొని కాపురం పెట్టారు. ఎనిమిదేళ్ల క్రితం కాపురాన్ని ఎమ్మిగనూరుకు మార్చాడు. వీరికి గొల్ల తేజ(7), గొల్ల అంజలి(5) ఇద్దరు సంతానం ఉన్నారు. ఎమ్మిగనూరు నుంచి స్వగ్రామమైన కడివెళ్లకు వెళ్లి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో వర్గం యువతిని పెళ్లి చేసుకున్నావని, కులం వాళ్లు నుంచి మాట వస్తోందని వినోద్‌కుమారుకు కుటుంబసభ్యులు చెబుతూ వచ్చారు. దీంతో కొన్ని నెలల నుంచి రజియాబీకి దూరంగా ఉండటం ప్రారంభించాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గుట్టుచప్పుడు కాకుండా నెల క్రితం కర్ణాటకలోని తమ బంధువుల అమ్మాయితో వినోద్‌కుమార్‌కు రహస్యంగా పెళ్లి జరిపించారు. విషయం తెలుసుకున్న రజియాబీ రూరల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఈ నెల 5న వినోద్‌కుమార్‌తో పాటు మరో ఐదుగురు కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. అయితే తనకు న్యాయం చేసేంత వరకు భర్త ఇంటి ముందు నుంచి కదలబోనని కడివెళ్లలో రజియాబీ ఆదివారం దీక్షకు దిగింది. విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని సర్దిచెప్పారు. అయినా ఆమె వినుకోలేదు. తన భర్త ఇంట్లోకి పిలుచుకోవాలని లేదంటే బయటే కూర్చుంటానని తేల్చిచెప్పారు. వినోద్ కుటుంబ సభ్యులతో పోలీసులు చర్చిస్తున్నారు. -
ఆధునిక హంగులతో.. పర్యాటక కేంద్రాల అభివృద్ధి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహబూబ్‌నగర్‌తో పాటు వివిధ పట్టణాలలో ఆధునిక మ్యూజికల్ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేసే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రులు తెలిపారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన దక్షిణ కొరియా యోసూ పట్టణంలోని బిగ్ ఓ మ్యూజికల్ ఫౌంటెన్ షోను శనివారం మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్ తదితరులు తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ ఫౌంటెన్ కంటే ఆధునికమైన ఫౌంటెయిన్‌ను కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్‌లో ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. దక్షిణ కొరియాలోని పర్యాటక ప్రదేశాలను పరిశీలించి ఆధునిక హంగులతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని పర్యాటక కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామన్నారు. రాష్ట్రానికి విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో పనిచేసే మ్యూజికల్ ఫౌంటెయిన్లు, జెయింట్ వీల్స్, వాటర్ స్పోర్ట్స్ వంటి వాటిని కరీంనగర్‌లోని మానేరు రివర్ ఫ్రంట్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, మహబూబ్‌నగర్‌లోని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామన్నారు. -
టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవితకాల జైలుశిక్ష
సాక్షి, విజయవాడ: బాలిక ఆత్మహత్య కేసులో టీడీపీ నేత వినోద్‌కుమార్ జైన్‌కు జీవిత కాల శిక్ష, రూ.3 లక్షల జరిమానా పోక్సో కోర్టు విధించింది. సెక్షన్ 305 కింద జీవితకాల జైలుశిక్షను విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. పోక్సో యాక్ట్ 9,10 సెక్షన్ల కింద ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. బాలికను లైంగికంగా వేధించిన వినోద్‌జైన్.. ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడు. రూ. 3 లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం.. బాధిత కుటుంబానికి చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో బాధితుల తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుజ్జుల నాగిరెడ్డి వాదనలు వినిపించారు. స్పెషల్ పీపీ నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ‘‘లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో బాలికను వినోద్ జైన్ వేధింపులకు గురి చేశారు. ఎవరికి చెప్పలేని విధంగా బాలికను లైంగికంగా వేధించారు. సూసైడ్ నోట్లో వినోద్ జైన్ వేధింపులను బాలిక స్పష్టంగా రాసింది. రెండు పేజీల లేఖలో నిందితుడి అకృత్యాలను వెల్లడించింది. బాలిక మరణంతో బాధిత కుటుంబ సభ్యులు నేటికీ కోలుకోలేకపోతున్నారు.’’ అని పేర్కొన్నారు. చదవండి: 2 నెలలుగా అసభ్యంగా ప్రవర్తించాను ‘‘2021 ఎన్నికల్లో టీడీపీ తరపున కార్పొరేటర్‌గా వినోద్ జైన్ పోటీ చేసి ఓడిపోయారు.సమాజంలో పెద్ద మనిషిగా తిరుగుతూ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.పోలీసులు కేసును ఛాలా సిరియస్ గా తీసుకున్నారు.సైన్టిఫిక్ ఎవిడెన్స్ ఆధారంగా నిందితుడికి శిక్ష పడింది’’ అని నాగిరెడ్డి అన్నారు. -
మోదీ కొత్తగా రైల్వే ప్రాజెక్టులు ఏం తెచ్చారు?
-
మోదీ కొత్తగా తెలంగాణకు చేసిందేమి లేదు.: వినోద్ కుమార్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం కేంద్రానికి సహకరించట్లేదనే ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ తెలిపారు. తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి ప్రధాన మంత్రి ఏం మాట్లాడుతారని ధ్వజమెత్తారు. రైల్వే ప్రాజెక్టుల్లో భూసేకరణ రాష్ట్రం భరిస్తోంది.. హైదరాబాద్-కరీంనగర్ రైల్వే పనులు తెలంగాణ పైసలతో అవుతున్నాయన్న విషయాన్ని గుర్తు చేశారు. రాష్ట్రంలో 33 మెడికల్ కాలేజీలకు కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. జాతీయ రహదారుల అభివృద్ధి అనేది తెలంగాణ బిల్లులో పొందుపరిచిన అంశం తప్ప, కేంద్రం ప్రేమతో ఇచ్చినవి కాదని స్పష్టం చేశారు. జాతీయ రహదారులకు, మోదీకి సంబంధం లేదన్నారు. మోదీ కొత్తగా రైల్వే ప్రాజెక్ట్‌లు ఏం తెచ్చారని ప్రశ్నించారు. విభజన చట్టం మేరకు జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని తెలిపారు. కేటీఆర్, కవిత, హరీష్ రావు ఉద్యమంలో పాల్గొన్నవాళ్లు.. బీజేపీ పార్టీలో ఉన్నవాళ్లలో కుటుంబ పాలన లేదా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్న మోదీ.. తెలంగాణకు ఏం చేశారో చెప్పాలి. ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. మోదీని గద్దె దింపేవరకు వదిలిపెట్టం. -మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ‘తెలంగాణపై ప్రధాని మోదీ విషం కక్కారు. మోదీదే అవినీతి ప్రభుత్వం. నేటీకి గుజరాత్లో ఇంటింటికి మంచి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. తెలంగాణ అభివృద్ధి నీ చూసి మోదీ ఓర్వలేక పోతున్నారు. తెలంగాణలో అభివృద్ధి.. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అవినీతి. ప్రధాని తనసభలో ప్రజలను మోసం చేసే పద్ధతిలో మాట్లాడారు. ప్రధాని స్థాయిలో మోదీ మాట్లాడలేదు. మోదీ పర్యటనతో తెలంగాణకు ఉపయోగం లేదు. -మంత్రి జగదీష్ రెడ్డి -
హెచ్3ఎన్2పై ఆందోళన వద్దు
సాక్షి, అమరావతి : కొత్త రకం ఫ్లూ హెచ్3ఎన్2 ప్రభావం రాష్ట్రంలో పెద్దగా లేదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) డాక్టర్ వినోద్‌కుమార్ స్పష్టం చేశారు. అనవసరంగా ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ♦ ముక్కు నుంచి గొంతు మధ్యలోనే ఈ ఫ్లూ వైరస్ ప్రభావం ఉంటుంది. ♦ కరోనా వైరస్లాగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుపోయే స్వభావం దీనికి లేదు. ♦ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్న కొందరిలో ఊపిరితిత్తుల్లోకి చేరి న్యుమోనియాకు దారితీస్తుంది. ♦ ప్రస్తుతం ఫ్లూ చిన్న పిల్లలు, వృద్ధుల్లో కొంతమేర ప్రభావం చూపుతుంది. దీనిని కనిపెట్టడం చాలా సులభం. ♦ప్రభుత్వాస్పత్రుల్లో ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లు ద్వారా కేసులు గుర్తిస్తున్నాం ♦ తిరుపతి స్విమ్స్‌లో తరచూ వైరస్‌లపై సీక్వెన్సింగ్ చేస్తుంటాం.. ఇలా గత జనవరిలో 12 కేసులు, ఫిబ్రవరిలో 9 హెచ్3ఎన్2 కేసులు నమోదయ్యాయి. ♦దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న వారు జాగ్రత్తలు తీసుకోవాలి. టవైరల్ జ్వరాలకు యాంటిబయోటిక్స్ పనిచేయవు. కాబట్టి జ్వరం వచి్చందని ప్రజలు అనవసరంగా వాటిని వాడొద్దు. ఆస్పత్రుల్లో చేరేవారు చాలా అరుదు ఇక జ్వరాలు, ఇతర లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్నవారిలో ప్రతి వెయ్యి ఓపీల్లో 0.1 శాతం సందర్భాల్లో అడ్మిషన్ అవసరం అవుతోందని విజయవాడ ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్, జనరల్ మెడిసిన్ వైద్యుడు డా. సుధాకర్ చెప్పారు. ఎవరికైనా జ్వరం, జలుబు వచ్చినట్లయితే పారాసిటమాల్, దగ్గు ఉన్నట్లైతే సిట్రిజీన్ మాత్ర వాడితే సరిపోతుందన్నారు. అదే విధంగా గొంతు ఇన్ఫెక్షన్ ఉంటే వేడినీళ్లు తాగడంతో పాటు, విక్స్ బిళ్లలు వాడాలన్నారు. మరోవైపు.. గుంటూరు జ్వరాల ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘు మాట్లాడుతూ.. ప్రతి ఏడాది సీజన్ మారేప్పుడు జ్వరాలు వస్తుంటాయన్నారు. వీటికి ఇంటి వద్దే జాగ్రత్తలు తీసుకుంటే చాలన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆ కాలేజీల్లో అడ్మిషన్లు కాగా.. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఐదు కొత్త వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందని డీఎంఈ వినోద్ తెలిపారు. విజయనగరం వైద్య కళాశాలకు ఇప్పటికే అనుమతులు లభించాయని.. మిగిలిన నాలుగు కళాశాలలకు అనుమతులు వస్తాయని భావిస్తున్నామన్నారు. ఏడాదికి మూడు నుంచి నాలుగు వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు రచించామన్నారు. అలాగే, ఖాళీ అయిన 246 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను ఎన్నికల కోడ్ ముగియగానే భర్తీ చేస్తామని.. సీనియర్ రెసిడెంట్ల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వినోద్ చెప్పారు. -
విజయం సాధించే వరకు పోరాడతాం
సాక్షి, హైదరాబాద్: ‘మా దేశం పాలు, పాలపొడి సహా ఇతర వస్తువులను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోకుండా అమెరికా ఆంక్షలు విధించింది. క్యూబాను ఆర్థికంగా దిగ్బంధిస్తోంది. అన్ని రంగాల్లోనూ అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటునే ఉన్నాం. కానీ ఈ ఆర్థిక దిగ్బంధం మమ్మల్ని ఎప్పటికీ ఓడించలేదు. చేగువేరా స్ఫూర్తితో, ఫిడేల్ క్యాస్ట్రో చూపిన మార్గంలో విజయం సాధించి తీరుతాం. గెలిచే వరకు పోరాడాలన్న చేగువేరా పిలుపు మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది’ అని చేగువేరా తనయ డాక్టర్ అలైదా గువేరా అన్నారు. నేషనల్ కమిటీ ఫర్ సాలిడారిటీ విత్ క్యూబా, ఐప్సో సంస్థలు ఆదివారం రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన క్యూబా సంఘీభావ సభలో ఆమె ప్రసంగించారు. క్యూబా సార్వభౌమ, స్వతంత్ర దేశమని... ప్రపంచ దేశాల అండ, సంఘీభావంతో తప్పకుండా అమెరికా దుర్నీతిపై విజయం సాధించి తీరుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నేను క్యూబన్ మహిళను... ‘వేలాదిగా తరలివచ్చి ఇలా మీ సంఘీభావాన్ని తెలియజేయడంతో ఎంతో సంతోషంగా ఉంది. రంగు, రూపం వల్ల కాకుండా మనుషులను మనుషులుగా గౌరవించే సమాజం కోసం అందరం సంఘటితం కావాల్సి ఉంది. చేగువేరా కూతురుగా నన్ను ప్రత్యేకంగా చూడొద్దు. నేను క్యూబన్ మహిళగా ఈ సభల్లో పాల్గొంటున్నాను. చేగువేరా ఒక పరిపూర్ణమైన కమ్యూనిస్టు. సామాజిక సేవను ఆయన నుంచే నేర్చుకున్నాం. ప్రతి మనిషిలో సామాజిక దృక్పథాన్ని పెంచేందుకు స్వచ్ఛంద సేవ దోహదంచేస్తుంది. చేసే పని మనిషి గౌరవాన్ని పెంచుతుంది. క్యూబా సామ్యవాద దేశంగా అభివృద్ధి చెందుతోంది. మా వనరులకు, సంపదకు మేమే యజమానులం. మా సామ్యవాద విధానాల వల్లే అమెరికా భయపడుతోంది. రకరకాల ఆంక్షలు విధిస్తోంది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్యూబా ప్రపంచ దేశాలకు ఆదర్శంకాకూడదనేదే దాని ఉద్దేశం. కానీ కచ్చితంగా క్యూబా గెలుస్తుంది’ అని అలైదా అన్నారు. ఈ సందర్భంగా క్యూబాకు మద్దతుగా చేసిన తీర్మానాన్ని వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. అమెరికా సామ్రాజ్యవాదాన్ని నిరసిస్తూ గోరటి వెంకన్న పాడిన పాటతో సభ హోరెత్తింది. చేగువేరాపై సుద్దాల ఆంగ్లంలో పాడిన పాట ఆకట్టుకుంది. ఈ సభలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాధారాణి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, పీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి, ఐప్సో ప్రతినిధి యాదవరెడ్డి, సీనియర్ సంపాదకులు కె.శ్రీనివాస్, శ్రీనివాస్‌రెడ్డి, ఆప్ నేత సుధాకర్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రజాగాయకుడు గద్దర్, ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, అరుణోదయ విమల, పీఓడబ్ల్యూ సంధ్య తదితరులు పాల్గొని క్యూబాకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. -
30లోగా ఈసీకి మా వైఖరి చెప్తాం
సాక్షి, హైదరాబాద్: రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతి రేకిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ తెలిపారు. ఢిల్లీలో రిమోట్ ఓటింగ్‌పై ఎన్నికల కమిషన్ నిర్వహించిన సమావేశానికి గైర్హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున వినోద్‌కుమార్ స్పందించారు. రిమోట్ విధానంపై పార్టీ నేతలతో చర్చించి ఈనెల 30 లోగా ఎన్నికల కమిషన్‌కు లిఖిత పూర్వకంగా బీఆర్ఎస్ అభి ప్రాయాన్ని తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు. కాగా రిమోట్ విధా నం దేశానికి అవసరం లేదని, అభి వృద్ధి చెందిన దేశాలే ఈ పద్ధతిని పక్కన పెడుతున్నాయని అన్నారు. ఇప్పుడున్న ఈవీఎంలనే హ్యాక్ చేస్తున్నారనే ప్రచారాలు ఉన్నాయ ని, వాటినే ఈసీ ఇప్ప టివరకు నివృత్తి చేయలేదన్నారు. ఈ పరిస్థితుల్లో రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసిస్తామని ప్రశ్నించారు.