సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలోనే తమ పార్టీ వైఖరి వెల్లడిస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. సాక్షి టీవీతో మాట్లాడుతూ.. అవిశ్వాసంపై ఓటింగ్ జరుగుతుందని అనుకోవడం లేదని పేర్కొన్నారు. నాలుగేళ్ల పాటు బీజీపీతో పొత్తు కొనసాగించిన టీడీపీ ఇప్పుడు అవిశ్వాసం పెట్టడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు.
తెలంగాణ వ్యతిరేక పార్టీ టీడీపీ..
టీడీపీ తెలంగాణ వ్యతిరేక పార్టీ అని పేర్కొన్న వినోద్ కుమార్.. ఆ పార్టీ వల్లే తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. పునర్విభజన చట్టంలోని అనేక అంశాలు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతులు జారీ చేసినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. అయితే హైకోర్టు, బయ్యారం ఉక్కు కర్మాగారం, గిరిజన యూనివర్సిటీ అనుమతి తదితర అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment