
సాగర్, ప్రగ్యా జంటగా సీనియర్ నటులు సుమన్, వినోద్‌కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'సమరం' బషీర్ ఆలూరి దర్శకత్వంలో జీవీయస్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. బషీర్ ఆలూరి మాట్లాడుతూ 'యాక్షన్, రొమాంటిక్ ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది. రెండో షెడ్యూల్ మొదలుపెట్టాం' అన్నారు.
చక్కటి కథతో నా మొదటి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు సాగర్. 'మంచి కుటుంబ కథతో రూపొందుతోన్న సినిమా ఇది. నిర్మాత కొత్త అయినా అనుభవం ఉన్నవారిలా నిర్మిస్తున్నారు. సరైన సమయంలో విడుదల చేస్తే మంచి విజయం సాధిస్తుంది' అన్నారు సుమన్. సీనియర్ నటులు వినోద్ కుమార్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment