
బషీర్, వీవీ వినాయక్, సాగర్, లక్ష్మణాచారి, శ్రీనివాస్
‘‘సమరం’ టైటిల్ చాలా బాగుంది. పోస్టర్స్ ఆసక్తిగా ఉన్నాయి. బషీర్ చెప్పిన కథ కొత్తగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయి ఇండస్ట్రీలో సాగర్ మంచి హీరోగా ఎదగాలని కోరుకుంటున్నా. టీమ్‌కి ఆల్ ది బెస్ట్’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. సాగర్ గంధం, ప్రగ్య నయన్ జంటగా, సుమన్, వినోద్ కుమార్ ముఖ్యపాత్రల్లో నటించిన చిత్రం ‘సమరం’. బషీర్ ఆలూరి దర్శకత్వం వహించారు.
యూనివర్సల్ ఫిలిమ్స్ సమర్పణలో జననీ క్రియేషన్స్ బ్యానరుపై శ్రీనివాస్ వీరంశెట్టి, పి .లక్ష్మణాచారి తెలుగు, కన్నడ భాషల్లో నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ని వీవీ వినాయక్ విడుదల చేశారు. బషీర్ ఆలూరి మాట్లాడుతూ– ‘‘పల్లెటూరి నుంచి సిటీకి వచ్చిన ఒక ఇంజినీరింగ్ అమ్మాయి సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాయిన్ అవుతుంది. అక్కడ ఎలాంటి పరిణామాలు జరిగాయి... అనేది చిత్ర కథాంశం. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాం’’ అన్నారు. ‘‘మాది మాచర్ల. పల్నాడు ప్రాంతం నుంచి వచ్చాను.
చిన్నప్పటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఓ మంచి సినిమా తీయాలన్నది నా కల. బషీర్ చెప్పిన కథ నచ్చి, ఈ సినిమా తీశాను. విడుదలకు సిద్ధంగా ఉంది’’ అన్నారు పోకూరి లక్ష్మణా చారి. ‘‘త్వరలోనే మా చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నాం’’ అని శ్రీనివాస్ వీరంశెట్టి అన్నారు. ‘సమరం’ చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది’’ అన్నారు సాగర్ గంధం. ఈ చిత్రానికి సంగీతం: రాజ్‌కిరణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.డేవిడ్, సహ నిర్మాత: ప్రగ్యానయన్.
Comments
Please login to add a commentAdd a comment