బుల్లితెరపై మొగలి రేకులు సీరియల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్‌లో మరింత ఫేమ్ తెచ్చుకున్న సాగర్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం 'ది 100'. ఈ సినిమా విడుదలకు ముందే సత్తా చాటుతోంది. అంతర్జాతీయ వేదికపై సైతం అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలు ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్స్‌లోనూ అవార్డులను గెలుచుకుంది.
అయితే ఈ మూవీతో కృష్ణవంశీ శిష్యుడు ఓంకార్ శశిధర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సక్సెస్ అంతా కృష్ణవంశీకే అంకితమని ఓంకార్ శశిధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆయన వల్లే తనకు ఇంత పేరు వచ్చిందన్నారు. గతంలో కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శశిధర్ ఈ మూవీ ద్వారానే టాలీవుడ్‌లో అరంగేట్రం చేస్తున్నారు.
ఆయనకే అంకితం..
శశిధర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను దర్శకత్వం వహించిన తొలి చలనచిత్రం "ది 100" అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాత్రలను ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అర్ధవంతమైన కథను రూపొందించడం, దాని పాత్రలను సృష్టించడం వెనుక పూర్తిగా నా గురువుగా, కృష్ణవంశీ సార్ నుంచి ప్రేరణ పొందినదే. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విలువలు, కథలు చెప్పే పద్ధతులు ఈ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. అందుకే ఈ విజయాన్ని 100 శాతం నా గురువుగారికి అంకితం చేస్తున్నా. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ దీవెనలు, మద్దతు మా టీమ్‌కు ఎల్లప్పుడు ఉండాలి. నాకు మార్గదర్శకంగా నిలిచినందుకు కృష్ణ వంశీ సార్‌కు కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ట్రైలర్ విడుదల చేసిన అంజనాదేవి..
యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ది 100 మూవీ టీజర్‌ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా సాగర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాగర్ సరసన మిషా నారంగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment