SashiDhar
-
హీరోగా మొగలి రేకులు సీరియల్ ఫేమ్.. రిలీజ్‌కు ముందే అవార్డులు కొల్లగొట్టిన చిత్రం!
బుల్లితెరపై మొగలి రేకులు సీరియల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో మరింత ఫేమ్ తెచ్చుకున్న సాగర్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం 'ది 100'. ఈ సినిమా విడుదలకు ముందే సత్తా చాటుతోంది. అంతర్జాతీయ వేదికపై సైతం అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలు ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్స్‌లోనూ అవార్డులను గెలుచుకుంది.అయితే ఈ మూవీతో కృష్ణవంశీ శిష్యుడు ఓంకార్ శశిధర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సక్సెస్ అంతా కృష్ణవంశీకే అంకితమని ఓంకార్ శశిధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆయన వల్లే తనకు ఇంత పేరు వచ్చిందన్నారు. గతంలో కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శశిధర్ ఈ మూవీ ద్వారానే టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు.ఆయనకే అంకితం.. శశిధర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను దర్శకత్వం వహించిన తొలి చలనచిత్రం "ది 100" అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాత్రలను ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అర్ధవంతమైన కథను రూపొందించడం, దాని పాత్రలను సృష్టించడం వెనుక పూర్తిగా నా గురువుగా, కృష్ణవంశీ సార్ నుంచి ప్రేరణ పొందినదే. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విలువలు, కథలు చెప్పే పద్ధతులు ఈ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. అందుకే ఈ విజయాన్ని 100 శాతం నా గురువుగారికి అంకితం చేస్తున్నా. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ దీవెనలు, మద్దతు మా టీమ్‌కు ఎల్లప్పుడు ఉండాలి. నాకు మార్గదర్శకంగా నిలిచినందుకు కృష్ణ వంశీ సార్‌కు కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ట్రైలర్ విడుదల చేసిన అంజనాదేవి..యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ది 100 మూవీ టీజర్‌ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా సాగర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాగర్ సరసన మిషా నారంగ్ హీరోయిన్గా నటిస్తోంది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
సెమీస్‌లో శశిధర్, సంజన
ఆసియన్ జూనియర్స్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆసియన్ జూనియర్స్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో కోట శశిధర్, సంజన క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన బాలుర క్వార్టర్స్‌లో శశిధర్ 6-2, 6-3తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలుపొందాడు. బాలికల విభాగంలో సంజన సిరిమల్ల 6-0, 6-1తో తనీషా ప్రాంజల్పై విజయం సాధించింది. బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో మనన్- ఆర్నవ్ ద్వయం 6-2, 6-2తో కార్తీక్- క్రిష్ పటేల్ జోడీపై నెగ్గగా... బాలికల విభాగంలో సృజన- ముషత్ర్ ద్వయం 6-1, 6-4తో ధమిజ- శ్రీచంద్రకళ జోడీపై గెలుపొందింది. ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు బాలుర సింగిల్స్: కృషన్ హుడా 6-4, 6-2తో ఆర్నవ్‌పై, లిస్టన్ 6-0, 6-1తో అభిజ్ఞన్పై, భూపతి శక్తివేల్ 6-0, 6-0తో దేవ్ పటేల్‌పై గెలిచారు. బాలికల సింగిల్స్: ధమిజ 7-6 (3), 6-2తో స్మృతి బాసిన్‌పై, శాంభవి 6-3, 6-2తో రిధిపై, మలైకా 6-3, 6-4తో సృజనపై విజయం సాధించారు. బాలుర డబుల్స్: ఆదిత్య- కార్తీక్ సక్సేనా ద్వయం 6-1, 6-3తో యశ్ అగర్వాల్- లోకాదిత్య వర్ధన్ జోడీపై, జై గొల్లపూడి- సిద్ధార్థ్ ద్వయం 6-4, 5-7, 10-1తో శ్రీశరణ్- అభిషేక్ జోడీపై, కృషన్- భూపతి ద్వయం 6-2, 6-4తో దేవ్- లిస్టన్ జోడీపై గెలుపొందింది. . బాలికల డబుల్స్: అభిలాష- తనీష ద్వయం 6-3, 6-4తో సారుు దియా- స్మిత జోడీపై, సృ్మతి బాసిన్- శాంభవి ద్వయం 6-0, 6-1తో ఐశ్వర్య- ఖుషీ విశ్వనాథ్ జోడీపై, అదితి- సాగరిక ద్వయం 6-4, 6-0తో స్టీషా- శైలా ఖట్టర్ జోడీపై విజయం సాధించాయి. -
శశిధర్, ఉషశ్రీలకు టైటిల్స్
ఏపీ వెటరన్ బ్యాడ్మింటన్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ వెటరన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శశిధర్, ఉషశ్రీలు విజేతలుగా నిలిచారు. అండర్-35 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను శశిధర్, మహిళల సింగిల్స్ ట్రోఫీని ఉషశ్రీ కైవసం చేసుకున్నారు. చందానగర్‌లోని పీజేఆర్ స్టేడియంలో బుధవారం జరిగిన ఫైనల్లో హైదరాబాద్ ఆటగాడు శశిధర్ వాకోవర్‌తో మురళీకృష్ణ (వైజాగ్)పై గెలుపొందగా, ఉషశ్రీ (విజయనగరం) 21-19, 21-11తో సరిత ప్రియాల్ (వరంగల్)పై నెగ్గింది. అండర్-35 పురుషుల డబుల్స్ ఫైనల్లో కిషోర్ కుమార్ (హైదరాబాద్)-ఉదయ్ భాస్కర్ (వైజాగ్) జోడి 21-8, 21-19తో మురళీకృష్ణ (వైజాగ్)-మనోజ్ కుమార్ (మెదక్) ద్వయంపై విజయం సాధించగా, మహిళల ఫైనల్లో చంద్రకళ (ఖమ్మం)-సరిత ప్రియా (వరంగల్) ద్వయం 21-18, 21-19 సుబ్బలక్ష్మి-ఉషశ్రీ (విజయనగరం) జంటపై గెలుపొందింది. అండర్-45 పురుషుల సింగిల్స్ ఫైనల్లో లింగేశ్వర రావు (వైజాగ్) 21-17, 21-9తో వైజాగ్‌కే చెందిన నాయక్‌ను ఓడించగా, మహిళల సింగిల్స్‌లో గురుప్రీత్ సంధు 21-15, 21-16తో సావిత్రిపై గెలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో గురుప్రీతమ్ సింగ్-స్మిత (హైదరాబాద్) జోడి 21-16, 21-15తో అఫ్జల్ బేగం-సావిత్రి (ఖమ్మం) జంటపై నెగ్గింది. అండర్-45 మిక్స్డ్ డబుల్స్ తుదిపోరులో కమలాకర్-గురుప్రీత్ సంధు (హైదరాబాద్) జంట 21-9, 21-6తో లింగేశ్వర రావు-స్మిత జిందాల్ (వైజాగ్) ద్వయంపై గెలిచింది. అండర్-55 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ప్రకాశ్ (హైదరాబాద్) చేజిక్కించుకోగా, డబుల్స్ టైటిల్‌ను రవీంద్రనాథ్ రెడ్డి-ప్రకాశ్ (హైదరాబాద్) జోడి గెలుచుకుంది. -
శశిధర్ కోసం లైఫ్‌లైన్