సెమీస్‌లో శశిధర్, సంజన | sashidhar, sanjana enter semis of asian junior tennis tourny | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో శశిధర్, సంజన

Published Thu, Nov 10 2016 11:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

sashidhar, sanjana enter semis of asian junior tennis tourny

ఆసియన్ జూనియర్స్ టెన్నిస్ టోర్నీ

సాక్షి, హైదరాబాద్: ఆసియన్ జూనియర్స్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్‌లో కోట శశిధర్, సంజన క్వార్టర్‌ఫైనల్లోకి ప్రవేశించారు. తెలంగాణ రాష్ట్ర టెన్నిస్ సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఈ టోర్నీలో బుధవారం జరిగిన బాలుర క్వార్టర్స్‌లో శశిధర్ 6-2, 6-3తో సిద్ధార్థ్ రెడ్డిపై గెలుపొందాడు. బాలికల విభాగంలో సంజన సిరిమల్ల 6-0, 6-1తో తనీషా ప్రాంజల్‌పై విజయం సాధించింది. బాలుర డబుల్స్ క్వార్టర్స్‌లో మనన్- ఆర్నవ్ ద్వయం 6-2, 6-2తో కార్తీక్- క్రిష్ పటేల్ జోడీపై నెగ్గగా... బాలికల విభాగంలో సృజన- ముషత్ర్ ద్వయం 6-1, 6-4తో ధమిజ- శ్రీచంద్రకళ జోడీపై గెలుపొందింది.

 ఇతర క్వార్టర్స్ మ్యాచ్‌ల ఫలితాలు

 బాలుర సింగిల్స్: కృషన్ హుడా 6-4, 6-2తో ఆర్నవ్‌పై, లిస్టన్ 6-0, 6-1తో అభిజ్ఞన్‌పై, భూపతి శక్తివేల్ 6-0, 6-0తో దేవ్ పటేల్‌పై గెలిచారు.


 బాలికల సింగిల్స్: ధమిజ 7-6 (3), 6-2తో స్మృతి బాసిన్‌పై, శాంభవి 6-3, 6-2తో రిధిపై, మలైకా 6-3, 6-4తో సృజనపై విజయం సాధించారు.


 బాలుర డబుల్స్: ఆదిత్య- కార్తీక్ సక్సేనా ద్వయం 6-1, 6-3తో యశ్ అగర్వాల్- లోకాదిత్య వర్ధన్ జోడీపై, జై గొల్లపూడి- సిద్ధార్థ్ ద్వయం 6-4, 5-7, 10-1తో శ్రీశరణ్- అభిషేక్ జోడీపై, కృషన్- భూపతి ద్వయం 6-2, 6-4తో దేవ్- లిస్టన్ జోడీపై గెలుపొందింది.
.
 బాలికల డబుల్స్: అభిలాష- తనీష ద్వయం 6-3, 6-4తో సారుు దియా- స్మిత జోడీపై, సృ్మతి బాసిన్- శాంభవి ద్వయం 6-0, 6-1తో ఐశ్వర్య- ఖుషీ విశ్వనాథ్ జోడీపై, అదితి- సాగరిక ద్వయం 6-4, 6-0తో స్టీషా- శైలా ఖట్టర్ జోడీపై విజయం సాధించాయి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement