Sagar
-
తెలుగు యూట్యూబర్ సృజన సాగర్ నూతన గృహప్రవేశం.. టాలీవుడ్ బుల్లితెర తారల సందడి (ఫోటోలు)
-
హీరోగా మొగలి రేకులు సీరియల్ ఫేమ్.. రిలీజ్‌కు ముందే అవార్డులు కొల్లగొట్టిన చిత్రం!
బుల్లితెరపై మొగలి రేకులు సీరియల్ ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సీరియల్లో మరింత ఫేమ్ తెచ్చుకున్న సాగర్ హీరో నటిస్తోన్న తాజా చిత్రం 'ది 100'. ఈ సినిమా విడుదలకు ముందే సత్తా చాటుతోంది. అంతర్జాతీయ వేదికపై సైతం అవార్డ్‌ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా పలు ఫిల్మ్ ఫేర్ ఫెస్టివల్స్‌లోనూ అవార్డులను గెలుచుకుంది.అయితే ఈ మూవీతో కృష్ణవంశీ శిష్యుడు ఓంకార్ శశిధర్ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సక్సెస్ అంతా కృష్ణవంశీకే అంకితమని ఓంకార్ శశిధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఆయన వల్లే తనకు ఇంత పేరు వచ్చిందన్నారు. గతంలో కృష్ణవంశీ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన శశిధర్ ఈ మూవీ ద్వారానే టాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్నారు.ఆయనకే అంకితం.. శశిధర్ తన ఇన్‌స్టాలో రాస్తూ..' నేను దర్శకత్వం వహించిన తొలి చలనచిత్రం "ది 100" అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ చిత్రాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాత్రలను ఎంతో మెచ్చుకున్నారు. ఇంత అర్ధవంతమైన కథను రూపొందించడం, దాని పాత్రలను సృష్టించడం వెనుక పూర్తిగా నా గురువుగా, కృష్ణవంశీ సార్ నుంచి ప్రేరణ పొందినదే. ఆయన దగ్గర నేను నేర్చుకున్న విలువలు, కథలు చెప్పే పద్ధతులు ఈ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించాయి. అందుకే ఈ విజయాన్ని 100 శాతం నా గురువుగారికి అంకితం చేస్తున్నా. త్వరలోనే ఈ చిత్రాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ దీవెనలు, మద్దతు మా టీమ్‌కు ఎల్లప్పుడు ఉండాలి. నాకు మార్గదర్శకంగా నిలిచినందుకు కృష్ణ వంశీ సార్‌కు కృతజ్ఞతలు' అంటూ పోస్ట్ చేశారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.ట్రైలర్ విడుదల చేసిన అంజనాదేవి..యాక్షన్ థ్రిల్లర్‌గా వస్తోన్న ది 100 మూవీ టీజర్‌ను ఇటీవల చిరంజీవి తల్లి కొణిదెల అంజనాదేవి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ చిత్రంలో విక్రాంత్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా సాగర్ కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సాగర్ సరసన మిషా నారంగ్ హీరోయిన్గా నటిస్తోంది. ధన్యా బాలకృష్ణ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు అర్జున్‌రెడ్డి, యానిమల్ ఫేమ్ హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. View this post on Instagram A post shared by Sasidhar P (@raghavomkarsasidhar) -
ఏపీలో సోషల్ మీడియా కార్యకర్తలపై వేధింపులు
-
దళితులంటే బాబుకు చులకన
-
దళితులంటే ఇంత చిన్నచూపా?
సాక్షి, అమరావతి: సూపర్ సిక్స్ సహా ఎన్నికల హామీల అమలు, ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యాలపై ప్రశ్నిస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష పరాకాష్టకు చేరింది. ప్రభుత్వ హామీల అమలుపై నిలదీస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులను ఉక్కుపాదంతో అణచివేస్తోంది. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను తుంగలో తొక్కుతూ అక్రమ కేసులతో వేధిస్తోంది. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టినట్లు ఎవరిపైనైనా కేసు నమోదు చేస్తే.. ముందు 41ఏ నోటీసు జారీ చేయాలి. ఆ తర్వాత నిందితుడి నుంచి పోలీసులు సమాధానం తీసుకోవాలి. నిందితుడిపై నమోదైన అభియోగాలతో మేజిస్ట్రేట్ సంతృప్తి చెంది, అనుమతి ఇస్తేనే అరెస్టు చేయాలి. కానీ.. పోలీసులు చట్టాన్ని యథేచ్ఛగా తుంగలో తొక్కుతున్నారు. రాజమహేంద్రవరంలో వరదలు వచ్చినప్పుడు ప్రజలు పడిన ఇబ్బందులను నెల రోజుల్లోనే పరిష్కరించానంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీనిపై దళిత యువకుడు పులి సాగర్ స్పందిస్తూ.. తాను నివాసం ఉండే కృష్ణానగర్, బ్రదరన్ చర్చి ప్రాంతాల్లో వరద నీళ్లు ఇంకా నిల్వ ఉన్నాయని, ఇతర సమస్యలు అలాగే ఉన్నాయని పోస్టు పెట్టారు. దీనిపై గత నెల 30న పోలీస్‌స్టేషన్‌కు రావాలని రాజమహేంద్రవరం ప్రకాష్‌నగర్ స్టేషన్ పోలీసులు ఆదేశిస్తే.. ఈ నెల 2న పులి సాగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ పోలీసులు అతడిని తీవ్ర స్థాయిలో దుర్భాషలాడుతూ బెదిరించారు. అంతేకాకుండా బీఎస్సీ, బీఈడీ చదివిన తనను సెల్లో అర్ధనగ్నంగా నిలబెట్టి.. మహిళా పోలీసు కానిస్టేబుళ్లను కాపలాగా ఉంచారని పులి సాగర్ ఆవేదన వ్యక్తం చేశాడు. సీఐ బాజీలాల్ తన పట్ల దురుసుగా వ్యవహరించి గొంతుకు రాయికట్టి గోదావరిలో పడేస్తానని బెదిరించారని బుధవారం మీడియా ఎదుట కన్నీటి పర్యంతమయ్యాడు. కొవ్వుపట్టి కొట్టుకుంటున్నావురా నా..కొ.. అంటూ రెచ్చిపోయారని, పందిలా ఉన్నావు.. నిన్ను కోసి రైలు పట్టాల మీద పడేస్తే దిక్కెవరని బెదిరించారని చెప్పారు. స్థానిక సమస్యపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి దళిత యువకుడినైన తన ఆత్మగౌరవాన్ని పోలీసులు దెబ్బతీసి అమానవీయంగా వ్యవహరించడమే కాక నోటికొచి్చనట్లు అసభ్యంగా మాట్లాడారని పులి సాగర్ వాపోయాడు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ నేతలు మార్గాని భరత్, వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, మాదిగ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొమ్మూరి కనకారావు తీవ్రంగా స్పందించారు. బాధిత యువకుడు పులి సాగర్‌తో కలిసి వీరు బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన సంఘటనను మీడియాకు వివరించారు. -
ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్
-
ఆక్వా ఎగుమతుల్లో మీసం మెలేస్తున్న భారత్
సాక్షి, విశాఖపట్నం: ఎగుమతులను ప్రోత్సహించేలా ప్రభుత్వం తీసుకొచి్చన సంస్కరణలు.. మార్కెటింగ్ సౌకర్యాలు సత్ఫలితాలివ్వడంతో గడచిన పదేళ్లలో భారత్ నుంచి మీసం మెలేసేలా రొయ్యల ఎగుమతులు, ఉత్పత్తి దూసుకుపోతున్నాయని కేంద్ర మత్స్య శాఖ జాయింట్ డైరెక్టర్ సాగర్ మెహ్రా అన్నారు. విశాఖలో జరిగిన మత్స్యశాఖ ఎగుమతుల ప్రోత్సాహ సదస్సుకు హాజరైన మెహ్రా ‘సాక్షి’తో పలు అంశాలపై మాట్లాడారు. 2023–24లో ఏపీ నుంచి ఏకంగా 19,420 కోట్ల సీఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి జరిగిందనీ.. ఆక్వా ఉత్పత్తులు, ఎగుమతుల్లో దేశంలోనే ఏపీ టాప్‌లో ఉందని తెలిపారు. సాగర్ మెహ్రా.. ఇంకా ఏమన్నారంటే... 4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు దేశవ్యాప్తంగా 4.20 లక్షల హెక్టార్లలో రొయ్యల సాగు కొనసాగుతోంది. 12 సంవత్సరాల్లో సాగు రెట్టింపైంది. మరో 2.20 లక్షల హెక్టార్లలో సాగు చేసేందుకు అనువైన వాతావరణం దేశంలో ఉంది. 2008లో రొయ్యల ఉత్పత్తి 75 వేలు టన్నులుండగా.. 2022–23 సంవత్సరంలో 10 లక్షల టన్నులకు చేరుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వల్లే ఈ ఫలితాలు సాధ్యమవుతున్నాయి. మన దేశ రొయ్యల కోసం వివిధ దేశాలు ఎదురుచూస్తున్నాయి. 2010–11లో కేవలం రూ.8,175 కోట్ల విలువైన రొయ్యల ఎగుమతులు జరగ్గా.. 2022–23 లో రూ.43,135 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. 2025 నాటికి దేశం నుంచి రూ.లక్ష కోట్ల ఎగుమతులు చేయాలని కేంద్ర మత్స్యశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఆ దిశగా.. సీఫుడ్ పరిశ్రమలకు కావల్సిన ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. 132 దేశాలకు ఎగుమతులు భారత్ ఆక్వా ఉత్పత్తులకు విదేశాల్లో భారీగా డిమాండ్ ఉంది. భారత్ నుంచి 132 దేశాలకు సీఫుడ్ ఎగుమతులు జరుగుతున్నాయి. 2023–24లో 132 దేశాలకు రూ.60,523 కోట్ల సీఫుడ్ ఎగుమతులు జరిగాయి. గ్లోబల్ మార్కెట్లో 4 శాతం వాటాతో 6వ అతిపెద్ద ఎగుమతిదారుగా భారత్ నిలిచింది. మన దేశం నుంచి యూఎస్ఏకు 34.5 శాతం, చైనాకు 18.76, జపాన్‌కు 5.42, వియత్నాంకు 5.30, థాయ్‌లాండ్‌కు 3.82 శాతం ఎగుమతులు జరుగుతున్నాయి. ఇందులో ఫ్రోజెన్ ష్రింప్ వాటా 40 శాతం ఉంది. ఎగుమతుల్లో ఏపీ టాప్సీఫుడ్, ఆక్వా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా దూసుకుపోతోంది. దేశంలోనే టాప్ లో ఉంది. 2018–19 నాటికి 13,855 కోట్ల విలువైన ఉత్పత్తులు ఏపీ నుంచి ఎగుమతి అవ్వగా.. 2023–24 లో ఏపీ నుంచి రూ.19,420 కోట్ల విలువైన 3,47,927 మెట్రిక్ టన్నుల సీ సీఫుడ్ ఎగుమతి జరిగింది. మొత్తంగా అగ్రి ఎక్స్‌పోర్ట్స్‌లో ఆంధ్రప్రదేశ్ 31 శాతం వాటాతో అగ్రగామిగా ఉండగా.. తర్వాత స్థానాల్లో కేరళ 13, మహారాష్ట్ర 12, తమిళనాడు 11, గుజరాత్ 8.5 శాతంతో ఉన్నాయి. ప్రస్తుతం కొన్నిరకాల చేపలు మాత్రమే భారత్‌నుంచి ఎగుమతి అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్లో ఎన్నో రకాల చేపలకు డిమాండ్ ఉంది. వాటిని అందిపుచ్చుకుంటే.. అంతర్జాతీయ సీఫుడ్ మార్కెట్‌ని శాసించే స్థాయికి భారత్ చేరుకుంటుంది. సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు సీఫుడ్ ఎగుమతుల్లో ఎదురవుతున్న సవాళ్లని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. మత్స్య సంపద ఉత్పత్తిలో యాంటీబయాటిక్స్ వినియోగం తగ్గిస్తున్నాం. వివిధ దేశాల్లో డిమాండ్‌కు అనుగుణంగా చేపలు, ఆక్వా ఉత్పత్తుల్ని ప్రోత్సహిస్తున్నాం. చైనా, వియత్నాం దేశాల తరహాలో ఆక్వా ఉత్పత్తుల్లో వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తున్నాం. కోల్డ్ చైన్ సౌకర్యాలు, హైజనిక్ హ్యాండ్లింగ్.. ఇలా భిన్నమైన ప్రణాళికలు అమలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ తిరుగులేని శక్తిగా ఎదిగేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాం. -
‘కాలం రాసిన కథలు’ చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది: ఎం.ఎన్.వి సాగర్
యమ్ యన్ వి సాగర్ స్వీయ దర్శకత్వం లో నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం 'కాలం రాసిన కథలు.' నూతన నటీనటులు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలే విడుదలై అందరినీ అలరించింది. ఈ సినిమా కి హిట్ టాక్ రావడం తో ఈ ఫిలిం యూనిట్ ఈ రోజు సక్సెస్ మీట్ నిర్వహించారు.దర్శక నిర్మాతలు ఎం.ఎన్.వి సాగర్ మాట్లాడుతూ, "ఈ సినిమా కోసం గత రెండు సంవత్సరాలుగా నేను పని చేస్తున్నాను. సినిమా విడుదక అయ్యాక ప్రేక్షకుల స్పందన బాగుంది. చిన్న సినిమాల్లో మా సినిమా మంచిగా రాణిస్తుంది. మంచి రిలీజ్ ని మాకు అందించినందుకు డిస్ట్రిబ్యూటర్ కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సినిమా విజయం నేను తదుపరి చేయబోయే సినిమాల మీద విశ్వాసాన్ని పెంచింది. ఈ సినిమా లో పెద్ద స్టార్స్ లేకున్నా, కొత్త వాళ్ళని కూడా ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ చిత్రం లో అన్ని పాత్రలు ప్రేక్షకులకి దగ్గరయ్యాయి. ముఖ్యనగ, కిరాక్ కిరణ్ పాత్ర క్లైమాక్ లో బాగా పండింది. ఈ సినిమా లో చేసిన ముగ్గురు హీరోయిన్స్ కి స్పెషల్ గా థాంక్స్ చెప్తున్నాను. హన్విక తనకి ఇచ్చిన పాత్ర లో అందరినీ మెప్పించింది. ఉమా కూడా అద్భుతమైన నటన కనబరిచి బేబీ సినిమా లో వైష్ణవి ఛైతన్య లాగా, ఆర్ఎక్స్ 100 లో పాయల్ రాజ్‌పుత్ లాగా మెప్పించింది. రాబోయే వారాల్లో కూడా ఈ సినిమా ఇంకా బాగా ఆడాలని కోరుకుంటున్నాను." అన్నారు.హన్విక శ్రీనివాస్ మాట్లాడుతూ, "నేను ఈ చిత్రం లో నవ్య అనే పాత్ర పోషించాను. ఈ పాత్రని చాలా బాగా రాసారు. సాగర్ గారు ఈ పాత్రకి నన్ను ఎంచుకున్నందుకు ఆయనకీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను". ఇక్కడకొచ్చిన మీడియా వాళ్లందరికీ కూడా థాంక్స్." అన్నారు.ఉమా రేచర్ల మాట్లాడుతూ, "ఈ సినిమా లో నా కో-స్టార్స్ అభిలాష్ మరియు శ్రీధర్ నాకు బాగా సపోర్ట్ చేసారు. నేను కొత్త అయినా నన్ను ప్రేక్షకులు ఆదరించినందుకు సంతోషంగా ఉంది." అని చెప్పారు.నటుడు వికాస్ మాట్లాడుతూ, "ఈ పాత్ర నాకు దక్కినందుకు చాలా అదృష్టం గా ఉంది. ఈ సినిమా మొదట నా దగ్గరకొచ్చినపుడు నేను చేయగలనో లేదో అనిపించింది కానీ సాగర్ గారు నాకు ధైర్యం ఇచ్చారు. మేమందరం సినిమా విజయం సాధించినందుకు సంతోషంగా ఉన్నాను." అన్నారు. -
సాగర్ కుడికాలువకు 4 టీఎంసీలు
సాక్షి, అమరావతి: గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ కుడికాలువ ద్వారా నాలుగు టీఎంసీల విడుదలకు కృష్ణాబోర్డు త్రిసభ్య కమిటీ అంగీకరించింది. ఈ నెల 17వ తేదీ నుంచి రోజుకు 5,500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయాలని బోర్డుకు సిఫార్సు చేసింది. హైదరాబాద్‌లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో సోమవారం బోర్డు సభ్య కార్యదర్శి డి.ఎం.రాయ్‌పురే అధ్యక్షతన ఏపీ, తెలంగాణ ఈఎన్సీలు సి.నారాయణరెడ్డి, అనిల్‌కుమార్ సభ్యులుగా ఉన్న త్రిసభ కమిటీ సమావేశమైంది.గుంటూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడికాలువకు నాలుగు టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన విజŠక్షప్తికి బోర్డు సభ్య కార్యదర్శి డి.ఎం.రాయ్‌పురే సానుకూలంగా స్పందించారు. సాగర్‌లో నీటిమట్టం తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం నుంచి విద్యుదుత్పత్తి చేస్తూ 5.7 టీఎంసీలను సాగర్‌కు తరలించి, అందులో నాలుగు టీఎంసీలను కుడికాలువకు కేటాయిస్తామని చెప్పారు. ఇందుకు ఏపీ ఈఎన్సీ అంగీకరించారు. శ్రీశైలం నుంచి మూడు టీఎంసీలు ఏపీ, 2.7 టీఎంసీలను తెలంగాణ విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేయాలన్న రాయ్‌పురే సూచనకు రెండు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. శ్రీశైలం, సాగర్‌లలో లభ్యతగా ఉన్న నీటిని తాగునీటి అవసరాల కోసం వాడుకోవడానికి రాయ్‌పురే అంగీకరించారు. -
సమాజానికి అండగా ఉండాలి
వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): సామాజిక సేవలందించే సంస్థలు సమాజానికి మరింత అండగా ఉండాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ సూచించారు. అన్న సంతర్పణ సమితి ట్రస్ట్ తృతీయ వార్షికోత్సవం ఎన్టీఆర్ జిల్లా విజయవాడలోని పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ ఆవరణలో ఆదివారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ.. అన్నసంతర్పణ సమితి అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ సేవలను విçస్తృతం చేయాలని సూచించారు. ప్రముఖ వైద్యుడు డాక్టర్ సమరం, వాసవి క్లబ్ గవర్నర్ కొత్త గణేష్‌బాబు అన్నసంతర్పణ సమితి ట్రస్ట్ సేవలను కొనియాడారు. ట్రస్ట్ అధ్యక్షుడు గుండు దిలీప్, కార్యదర్శి పీఎస్ఆర్ మూర్తి మాట్లాడుతూ.. మూడేళ్లుగా నిర్విరామంగా నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. త్వరలో ఒక సత్రంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. అనంతరం సేవలందించిన వలంటీర్లకు ప్రశంసా పత్రాలు అందించారు. -
పామును పట్టి, డబ్బాలో పెట్టి, నాలుగు రోజులకు తెరవగానే..
పామును చూడగానే చాలామంది భయపడిపోతుంటారు. మధ్యప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌లో పామును పట్టుకున్న తరువాత విచిత్ర పరిణామం చోటుచేసుకుంది. అది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. బుందేల్‌ఖండ్‌లోని మక్రోనియా పరిధిలోగల బెటాలియన్ ప్రాంతంలో పాములుపట్టే అఖిల్ బాబా ఇటీవల ఒక నాగు పామును పట్టుకున్నాడు. తరువాత దానిని ఒక పెట్టెలో బంధించాడు. నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెను తెరచి చూసి, ఆశ్యర్యంతో నోరెళ్లబెట్టాడు. తన 30 ఏళ్ల అనుభవంలో తొలిసారిగా ఇలాంటి ఘటన జరిగిందని తెలిపాడు. తాను ఒక నాగు పామును పట్టుకుని పెట్టెలో బంధించి ఉంచానని, అయితే నాలుగు రోజుల తరువాత ఆ పెట్టెలో నుంచి ఏవో శబ్ధాలు రావడంతో తెరిచి చూసేసరికి ఆ పాముతో పాటు ఏకంగా 16 పాము గుడ్లు కనిపించాయని తెలిపాడు. వీటిని అటవీశాఖ అధికారులకు అప్పగిస్తానని అఖిల్ బాబా తెలిపారు.నాగుపాము అనేది పాము జాతులలో ప్రమాదకరమైనదిగా పరిగణిస్తారు. ఇది భారతదేశంతో సహా అనేక దేశాలలో కనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆడ నాగుపాము ఒకేసారి 10 నుండి 30 గుడ్లు పెడుతుంది. వాటి నుంచి 45 నుండి 70 రోజులలో పాము పిల్లలు బయటకు వస్తాయి. -
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న యంగ్ హీరో!
తొలి సినిమా ‘అల్లుడు శీను’తోనే హిట్ కొట్టి టాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆ తర్వాత జయ జానకి నాయక, రాక్షసుడు వంటి హిట్ చిత్రాలతో స్టార్ హీరోల లిస్ట్‌లో చేరిపోయాడు. అయితే ఈ యంగ్ హీరో ఇటీవల నటించిన చిత్రాలేవి బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. దీంతో కాస్త గ్యాప్ తీసుకున్న ఈ సిక్స్ ప్యాక్ హీరో..ఇప్పుడు వరుస సినిమాలను లైన్లో పెట్టేశాడు. ప్రస్తుతం 14 రీల్స్ ప్రొడక్షన్ హౌస్ బ్యానర్‌పై టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో పూర్తి కానుంది. దీంతోపాటు షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్స్‌తో మరియు మూన్‌షైన్ పిక్చర్స్‌తో చేతులు కలిపాడు.వీటి కోసం..మునుపెన్నడూ చూడని లుక్‌లో శ్రీనివాస్ కనిపించనున్నాడు అని తెలుస్తుంది. ఇవీ అన్నీ కూడా చాలా ప్రత్యకమైన కథలు అని, ఇవి అతని కెరీర్లో కొత్త అధ్యాయాన్ని క్రియేట్ చేస్తాయి అని అంటున్నారు. యాక్షన్-ఓరియెంటెడ్ మరియు కంటెంట్-డ్రైవెన్ సినిమాలతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. శ్రీనివాస్ రీ ఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ ఈ సినిమాలు ఆయనకు మంచి కమ్ బ్యాక్ మూవీలు అవుతున్నాయి అని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. -
స్నేహితుడిని కలిసేందుకు వెళుతూ.. విషాదం!
మెదక్: స్నేహితుడిని కలిసేందుకు వెళుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న గుంతలో పడడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటన దుబ్బాక మండలం బల్వంతాపూర్ శివారులో మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ఎస్ఐ గంగరాజు తెలిపిన సమచారం మేరకు.. దుబ్బాకకు చెందిన అంబేడ్కర్ సంఘం మాజీ అధ్యక్షుడు ఆస చిన్న ముత్యం ఏకైక కుమారుడు సాగర్(22) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి సాగర్ ఇంటికి వచ్చాడు. సిద్దిపేట మండలం మాచాపూర్‌లో తన స్నేహితుడిని కలిసేందుకు మంగళవారం రాత్రి తన తండ్రి బైక్ తీసుకొని జీడీ దినేశ్ అనే మరో స్నేహితుడితో కలిసి వెళ్లాడు. మంగళవారం అర్ధరాత్రి బల్వంతాపూర్ ఒడ్డెర కాలనీ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న గుంతలో పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దినేశ్‌కు గాయాలయ్యాయి. సాగర్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గంగరాజు తెలిపారు. ఇవి చదవండి: పథకం ప్రకారమే మహిళ దారుణహత్య! చివరికి.. -
ఆర్కే నాయుడు హీరోగా 'ద 100' సినిమా.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'మొగలిరేకులు' సీరియల్లో ఆర్కే నాయుడు పాత్రలో నటించి చాలా ఫేమస్ అయిన నటుడు సాగర్.. హీరోగా మరో సినిమా రెడీ చేశాడు. గతంలో 'సిద్ధార్థ' చిత్రంతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 'షాదీ ముబారక్' సినిమా చేశాడు. ఇప్పుడు క్రేజీ యాక్షన్ మూవీతో రాబోతున్నాడు. 'ద 100' అనే డిఫరెంట్ టైటిల్ నిర్ణయించారు. అలానే పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవేంటో తెలుసా?) రాఘవ్ ఓంకార్ శశిధర్.. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ మూవీలో విక్రాంత్ అనే ఐపీఎస్ అధికారిగా ఆర్కే సాగర్ కనిపించబోతున్నాడు. ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో యాక్షన్ ఎంటర్టైనర్గా ఇది ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో ఆకట్టుకున్న హర్షవర్ధన్ రామేశ్వర్.. ఈ సినిమాకు సంగీతమందిస్తున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
సాగర్ లో ఈసారి కాంగ్రెస్ విజయం పక్కా: కుందూరు జైవీర్ రెడ్డి
-
మహనీయుల స్ఫూర్తితో ఉత్తమ న్యాయవాదులుగా ఎదగండి
చిలకలపూడి (మచిలీపట్నం): సహనంలో మహాత్మాగాందీ, జ్ఞానంలో బీఆర్ అంబేడ్కర్, ధైర్యంలో అల్లూరి సీతారామరాజు, సాహసంలో టంగుటూరి ప్రకాశం పంతులును ఆదర్శంగా తీసుకున్నప్పుడే సంపూర్ణ న్యాయవాదులుగా ఎదుగుతారని హైకోర్టు న్యాయమూర్తి, కృష్ణా జిల్లా పరిపాలన న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని జిల్లా కోర్టు ప్రాంగణంలో నిర్మించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు మొదటి అంతస్తు భవనాన్ని ఆదివారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. బార్ అసోసియేషన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్ శేషసాయి మాట్లాడారు. న్యాయ వ్యవస్థకు ఎంతో మంది గొప్ప న్యాయమూర్తులు, న్యాయవాదులను అందించిన ఘనత మచిలీపట్నం బార్ అసోసియేషన్‌కు ఉందన్నారు. జస్టిస్ కృపాసాగర్ మాట్లాడుతూ..తన సొంత బార్ అసోసియేషన్ అయిన మచిలీపట్నం బార్ అసోసియేషన్‌కు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తదితరులు పాల్గొన్నారు. -
ఆనాటి సీరియల్ రామాయణం.. ఎలా ఉన్నారో చూసేయండి (ఫోటోలు)
-
శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ మావే..
సాక్షి, అమరావతి: కృష్ణా జలాల్లో అంగీకరించిన వాటా కంటే తెలంగాణ సర్కార్ అధికంగా 90.36 టీఎంసీలు వాడుకుందని.. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న నీళ్లన్నీ తమకే చెందుతాయని కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. తాగునీటి అవసరాలు, ఉద్యాన పంటలు, సాగు చేసిన పంటలను రక్షించుకోవడం కోసం సాగర్ కుడి కాలువకు 6, ఎడమ కాలువకు 1 టీఎంసీని విడుదల చేస్తూ తక్షణమే ఉత్తర్వులివ్వాలని కోరింది. ఈ మేరకు గురువారం కృష్ణా బోర్డు చైర్మన్ శివ్‌నందన్‌కుమార్‌కు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ లేఖ రాశారు. ఆ లేఖలో ప్రధానాంశాలివీ.. ♦ దిగువ కృష్ణా బేసిన్లో ప్రస్తుత నీటి సంవత్సరంలో లభ్యతగా ఉన్న జలాలు 961.07 టీఎంసీలు. ఇందులో అంగీకరించిన మేరకు ఏపీ వాటా 634.30 టీఎంసీలు(66 శాతం) తెలంగాణ వాటా 326.77 టీఎంసీలు(34 శాతం). ♦ ఈ నెల 12 వరకూ ఏపీ 470.63 టీఎంసీలు, తెలంగాణ 417.13 టీఎంసీలు వాడుకున్నాయి. వీటిని పరిశీలిస్తే.. ఏపీ కోటా కింద ఇంకా 163.67 టీఎంసీలు మిగిలాయి. తెలంగాణ సర్కార్ కోటా కంటే ఎక్కువగా 90.36 టీఎంసీలు అధికంగా వాడుకుంది. ♦ ఈ నెల 12 నాటికి శ్రీశైలం, సాగర్‌లలో నిల్వ ఉన్న 126.01 టీఎంసీలన్నీ ఏపీవే. ఆ రెండు ప్రాజెక్టుల నుంచి నీటిని వాడుకోకుండా తెలంగాణను కట్టడి చేసి, దిగువ రాష్ట్రమైన ఏపీ హక్కులు పరిరక్షించండి. -
Sitamma Sagar: కేసీఆర్ సర్కార్‌కు షాక్
సాక్షి, ఢిల్లీ/భద్రాద్రి: తెలంగాణ సర్కార్‌కు ఎన్జీటీ నుంచి మరో ఝలక్ తగిలింది. ప్రతిష్టాత్మకంగా నిర్మించతలబెట్టిన సీతమ్మ సాగర్ బ్యారేజ్ ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బ్రేకులు వేసింది. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మిస్తున్న ప్రాజెక్టు పనుల్ని వెంటనే నిలిపివేయాలని, అనుమతులు తీసుకోవాల్సిందేనంటూ ఎన్జీటీ చెన్నై బెంచ్ తీర్పు ఇచ్చింది ట్రిబ్యునల్. గోదావరి నీటి నిల్వతో పాటు జల విద్యుదుత్పత్తికి ఉపయోగపడేలా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం వద్ద కేసీఆర్ సర్కార్.. ఈ ప్రాజెక్టును నిర్మించ తలపెట్టింటి. దుమ్ముగూడెం ఆనకట్టకు ఎగువన భద్రాచలం సీతమ్మ వారి పర్ణశాలకు దగ్గరగా బ్యారేజీ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో.. సీతమ్మ సాగర్‌గా నామకరణం చేసింది. 37 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా బ్యారేజీ, 320 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేసేలా ప్లాంటు నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అయితే.. ఒకవైపు బ్యారేజీ నిర్మాణ పనులు నెమ్మదిగా కొనసాగుతుండగా.. పర్యావరణ అనుమతులు వచ్చాకే ప్రాజెక్టు పనులు కొనసాగించాలని ఇప్పుడు ఎన్జీటీ ఆదేశించడం గమనార్హం. ఈ మేరకు తదుపరి విచారణను ఏప్రిల్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఇదీ చదవండి: మా మెట్రో ఏం పాపం చేసింది? -
బతుకమ్మ చీరలు @ రూ.330 కోట్లు
సిరిసిల్ల: రాష్ట్రంలోని తెల్లరేషన్ కార్డుదారులకు ప్రభుత్వం ఏటా అందించే బతుకమ్మ పండుగ కానుక చీరల రంగులను, డిజైన్లను తెలంగాణ పవర్లూమ్ టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ఖరారు చేసింది. 21 రంగుల్లో 25 డిజైన్లలో బతుక మ్మ చీరలను ఆర్డర్ చేసింది. రాష్ట్రంలోని కోటి మందికి బతుకమ్మ పండగ కానుకగా ప్రభుత్వం చీరలను అందిస్తున్న సంగతి తెలిసిందే. సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో 2017 నుంచి బతుకమ్మ పండుగకు చీరలను సారెగా అందిస్తున్నారు. గతంలో రాష్ట్ర చేనేత సహకార సంస్థ (టెక్సో) ద్వారా ఈ చీరల ఆర్డర్లు ఇవ్వగా.. ఈసారి తెలంగాణ పవర్లూమ్, టెక్స్టైల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీపీటీడీసీఎల్) ద్వారా ఆర్డర్లు ఇచ్చారు. సిరిసిల్లలోని 139 మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (మ్యాక్స్)లకు 3.70 కోట్ల మీటర్ల బట్టను (64.03 లక్షల చీరలు), 126 చిన్న తరహా పరిశ్రమల (ఎస్ఎస్ఐ)కు 1.84 కోట్ల మీటర్ల బట్టను (31.87 లక్షల చీరలు) ఆర్డర్లు ఇచ్చారు. జాకెట్ పీసుల కోసం మరో 68 లక్షల మీటర్ల బట్టను సిరిసిల్ల శివారు టెక్స్టైల్ పార్క్‌లోని ఆధునిక మగ్గాలకు ఇచ్చారు. మొత్తంగా 6.22 కోట్ల మీటర్ల బట్టను బతుకమ్మ చీరల ఉత్పత్తి లక్ష్యంగా ఈ ఏడాది నిర్ణయించారు. చీరలకు ఉత్పత్తి రవాణా, ప్రాసెసింగ్ ఇతర ఖర్చులకు మొత్తం రూ.330 కోట్లు కేటాయించారు. సెపె్టంబరు నెలాఖరులోగా ఈ చీరలను సిరిసిల్ల నేతన్నలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. మగ్గాల సంఖ్య ఆధారంగా ఆర్డర్లు ఇస్తాం సిరిసిల్ల నేతన్నలకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చాము. 21 రంగుల్లో 25 డిజైన్లలో చీరలను ఉత్పత్తి చేయాలని స్పష్టం చేశాము. మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్లలోని మరమగ్గాల సంఖ్య ఆధారంగా వస్త్రోత్పత్తిదారులకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇస్తాం. గడువులోగా చీరలను ఉత్పత్తి చేసి అందించాల్సి ఉంటుంది. – సాగర్, జౌళిశాఖ, ఏడీ -
విషాదం.. ప్రముఖ సీనియర్ దర్శకుడు కన్నుమూత
తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో విషాదంలో కూరుకుంది. 73 ఏళ్ల ప్రముఖ సీనియర్ దర్శకుడు సాగర్(విద్యాసాగర్ రెడ్డి) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఈ ఉదయం గం. 6.03ని.లకు తుదిశ్వాస విడిచారు. 1983లో నరేష్-విజయశాంతిల ‘రాకాసిలోయ’సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన నటశేఖర కృష్ణతో తీసిన ‘అమ్మదొంగా’ చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. భానుచందర్, లిజీలతో ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్, యాక్షన్ నెంబర్ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'రామసక్కనోడు' చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి. అంతేకాదు ఈయన తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. శీనువైట్ల, వి.వి.వినాయక్ , శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి లాంటి ఎందరో దర్శకులు ఈయన శిష్యులే. సాగర్ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. -
Asian Airgun Championship 2022: భారత్ ఖాతాలో మరో నాలుగు స్వర్ణాలు
డేగూ (కొరియా): ఆసియా ఎయిర్‌గన్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత షూటర్ల పతకాల వేట కొనసాగుతోంది. బుధవారం జరిగిన నాలుగు ఈవెంట్స్‌లోనూ భారత షూటర్లు స్వర్ణ పతకాలు సొంతం చేసుకున్నారు. జూనియర్ మహిళల 10 ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్లో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ 15–17తో భారత్‌కే చెందిన మనూ భాకర్ చేతిలో ఓడిపోయి రజతం దక్కించుకుంది. సీనియర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో రిథమ్ సాంగ్వాన్ 16–8తో భారత్‌కే చెందిన పలక్‌పై గెలిచి పసిడి పతకం సొంతం చేసుకుంది. సీనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో శివ నర్వాల్, నవీన్, విజయ్‌వీర్‌లతో కూడిన భారత జట్టు 16–14తో కొరియా జట్టును ఓడించి బంగారు పతకం సాధించింది. జూనియర్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్లో సాగర్, సామ్రాట్ రాణా, వరుణ్ తోమర్లతో కూడిన భారత జట్టు 16–2తో ఉజ్బెకిస్తాన్ జట్టుపై గెలిచి స్వర్ణం కైవసం చేసుకుంది. మరో రెండు రోజులు ఉన్న ఈ ఈవెంట్లో ఇప్పటి వరకు భారత్‌కు 21 స్వర్ణ పతకాలు లభించాయి. -
40 మంది పిల్లలతో వెళ్తున్న స్కూల్ బస్ బోల్తా.. విద్యార్థి మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ సాగర్ జిల్లా రహత్‌గఢ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. 40 మంది పిల్లలతో వెళ్తున్న ప్రైవేటు స్కూల్ బస్సు చంద్రాపూర్ గ్రామం సమీపంలో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది గాయపడ్డారు. తీవ్రగాయాలపాలైన ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు జిల్లా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్, యజమానిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు పేర్కొన్నారు. అయితే డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని అందులోని విద్యార్థులు తెలిపారు. తమ తోటి విద్యార్థి మృతితో శోకసంద్రంలో మునిగిపోయారు. చదవండి: పీఎఫ్ఐపై రెండో విడత దాడులు.. కర్ణాటకలో 45 మంది అరెస్టు -
అలా అయితే నా భర్త బతికేవాడు.. జీవితం ఇంకోలా ఉండేది: మీనా ఎమోషనల్
ప్రముఖ నటి మీనా భర్త విద్యాసాగర్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. భర్త మరణంతో తీవ్ర విషాదంలో ఉన్న మీనా.. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి కోలుకుంటున్నారు. ఇటీవల సినిమా షూటింగ్స్‌కి కూడా హాజరయ్యారు. పలువురు బంధువులు, స్నేహితులు తరుచూ కలుస్తుండడంతో మీనా మళ్లీ యాక్టివ్ అయ్యారు. అంతేకాదు తాజాగా ఆమె గోప్ప నిర్ణయం తీసుకున్నారు. తన తదనంతరం అవయవాలను దానం చేస్తున్నట్లు ప్రకటించి, అందరిచే శభాష్ అనిపించుకున్నారు. వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే(ఆగస్ట్ 13) సందర్భంగా తాను ఆర్గాన్ డొనేట్ చేయాలనే నిర్ణయాన్ని తీసుకున్నానని, మీరు కూడా గొప్ప నిర్ణయాన్ని తీసుకోండి అని చెబుతూ సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. (చదవండి: 'జబర్దస్త్' మానేయడంపై తొలిసారి నోరువిప్పిన అనసూయ) ‘ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఇంకోటి ఉండదు. అవయవాలను దానం చేయడం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడవచ్చు. అనారోగ్యంతో బాధపడుతుంటే.. ఒకరికి అవయవాలు దానం చేయడం వల్ల వారి కుటుంబంలో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో నేను కళ్లారా చూశాను. మా సాగర్‌కు(మీనా భర్త) ఇంకా అలాంటి దాతలు దొరికి ఉంటే నా జీవితం ఇంకోలా ఉండేది. ఒక దాత 8 మంది ప్రాణాలను కాపాడొచ్చు. అవయవ దానం గొప్పదనం గురించి ప్రతీ ఒక్కరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. అవయవ దానం అనేది కేవలం డాక్టర్లు, పేషెంట్ల మధ్య సంబంధం కాదు.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా అందరికీ సంబంధించింది. నేను నా ఆర్గాన్స్‌ను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నాను’అంటూ ఎమోషనల్ పోస్ని ఇన్‌స్టాలో షేర్ చేసింది. మీనా నిర్ణయం వెనుక ఆమె భర్త విద్యాసాగర్ ఆకస్మిక మరణం కూడా ఒక కారణంగా తెలుస్తోంది. మీనా భర్తకు ఊపిరితిత్తులు మారిస్తే బ్రతికేవాడు. కానీ సమయానికి దాతలు దొరక్కపోవడంతో ఆయన మృతి చెందారు. View this post on Instagram A post shared by Meena Sagar (@meenasagar16) -
రవితేజ 'ఫుల్ కిక్' సాంగ్ వచ్చేసిందిగా.. ఇది 'ఖిలాడి' కిక్
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. జనవరి 26న రవితేజ పుట్టినరోజు సందర్భంగా వరుస సినిమా అప్డేట్లతో అభిమానులకు పెద్ద పండుగ విందు ఇచ్చాడు. ఇప్పటికే 'రామారావు ఆన్ డ్యూటీ' పోస్టర్ విడుదల కాగా తాజాగా ఖిలాడి సినిమాలోని నాలుగోపాట ఫుల్ కిక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ గీతాన్ని సాగర్, మమత శర్మ ఆలపించగా శ్రీమణి సాహిత్యం అందించారు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ మాస్ బీట్‌కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అలరిస్తున్నాయి. పాట ప్రారంభంలో రవితేజ చెప్పే డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఖిలాడి సినిమా విషయానికొస్తే ఈ సినిమాను 'రాక్షసుడు' ఫేమ్ రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. సత్యనారాయణ కోనేరు నిర్మాతగా వ్యవహరించగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతిలు రవితేజ సరసన అలరించనున్నారు. అలాగే అర్జున్, అనసూయ కీలక పాత్రలు పోషించగా, ఈ సినిమా ఫిబ్రవరి 11న విడుదలకు సిద్ధంగా ఉంది. -
హైదరాబాద్‌లో దీపావళి సందడి
-
ఏపీ అధికారుల వాదనలు సమర్థించిన కేఆర్ఎంబీ
సాక్షి, హైదరాబాద్: ఏపీ అధికారులు విద్యుత్ ఉత్పత్తిపై వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ పరిగణలోకి తీసుకున్నారు. ఏపీ అధికారుల వాదనలు కేఆర్ఎంబీ సమర్థించింది. సాగర్, కృష్ణా డెల్టాలకు అవసరాలకు అనుగుణంగానే.. విద్యుత్ ఉత్పత్తి ఉండాలని కేఆర్ఎంబీ చైర్మన్ తెలిపారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తిలో చైర్మన్ నిర్ణయంపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆయన సమాధానంతో సంతృప్తి చెందని తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. కేఆర్ఎంబీ చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యక్షతన బుధవారం జలసౌధలో జరిగిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ సమావేశానికి ఏపీ, తెలంగాణ అధికారులు హాజరయ్యారు. ఏపీ నుంచి జల వనరుల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్యామలరావు, ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల అంతర్ రాష్ట్ర జల విభాగం సీఈ శ్రీనివాస్ రెడ్డి హాజరుకాగా, తెలంగాణ నుంచి జల వనరుల శాఖ సెక్రటరీ రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధరరావు, అంతర్రాష్ట్ర జల విభాగం సీఈ మోహన్ కుమార్ హాజరయ్యారు. చదవండి: రైతు రథం.. టీడీపీ నాయకుల అవినీతి పథం -
రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో ఛార్జ్ షీట్ దాఖలు
-
రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు
న్యూఢిల్లీ: భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు నమోదైంది. సుశీల్‌కు చెందిన ఛత్రశాల్ స్టేడియం లోపల మంగళవారం రాత్రి జరిగిన గొడవలో 23 ఏళ్ల సాగర్ అనే రెజ్లర్ మృతి చెందాడు. దాంతో ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల సుశీల్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు ఆఫీసర్ కుమార్ తెలిపారు. సుశీల్ ప్రస్తుతం అందుబాటులో లేడని, అతని కోసం గాలిస్తున్నామని కుమార్ తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సుశీల్ కుమార్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. -
‘షాదీ ముబారక్’ సరికొత్త రికార్డు
గత శుక్రవారం(మార్చి 5) రిలీజ్ అయిన షాదీ ముబారక్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ లో 9.1 రేటింగ్ తో టాప్ పోజీషన్ లో నిలిచింది. హిలేరియస్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా కి ప్రేక్షకులు ఆదరణ లభించింది. బుల్లితెరమీద స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న సాగర్ వెండితెర పై కూడా ఈ సారి బలమైన కంటెంట్ తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నాడు. ఏ సినిమా కయినా కంటెంట్ బేస్ చేసుకొని రేటింగ్ ని అందించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ ( ఐ ఎమ్ డి బి) షాదీ ముబారక్ కు 9.1 రేటింగ్ ని అందించడం పై యూనిట్ హార్షం వ్యక్తం చేసింది. పెళ్ళి కోసం ఇండియాకి వచ్చిన ఎన్నారై కి పెళ్ళి చూపుల్లో ఎదురైన అనుభవాలను సునిశిత హాస్యంతో మలిచారు దర్శకుడు పద్మశ్రీ. సీరియస్ పాత్రల నుండి ఒక పక్కింటి కుర్రాడు పాత్రకి సాగర్ మారిన తీరు పై ప్రశంసలు దక్కుతున్నాయి. తొలి చిత్రం తోనే తెలుగులో చాలా మంచి పేరును తెచ్చుకుంది దృశ్య . ఈ అమ్మాయి చలాకీ తనం తెరమీద మరో సాయిపల్లవిని గుర్తు చేసింది. రొమాంటిక్ కామెడీ జానర్ లో జంట మద్య కెమిస్ట్రీ కుదిరితేనే ఆ కథ లో ప్రేక్షకులు ఇన్వాల్వ్ కాగలరు. సున్నిపెంట మాధవ్, తుపాకుల సత్యభామ క్యారెక్టర్స్ తో ఆడియన్స్ లవ్ లో పడతారు. సిట్యువేషనల్ గా వచ్చే కామెడీ తో ఫ్యామిలీ మొత్తం చూసి ఆస్వాదించతగిన విధంగా రూపొందించడంతో ‘‘ షాదీ ముబారక్’’ ఆల్ టైం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మారింది. తమ కంటెంట్ కి టాప్ రేటింగ్ దక్కడం చిత్ర యూనిట్ కి కొత్త ఉత్సాహం అందించింది. సాగర్ షాదీ ముబారక్ ఇచ్చిన కిక్ మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ లతో రాబోతున్నాడు. -
‘షాదీ ముబారక్’ మూవీ రివ్యూ
టైటిల్ : షాదీ ముబారక్ నటీనటులు : సాగర్, దృశ్య రఘునాథ్, రాహుల్ రామకృష్ణ, హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు దర్శకత్వం : పద్మశ్రీ నిర్మాతలు : దిల్ రాజు, శిరీష్ బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంగీతం : సునీల్ కశ్యప్ సినిమాటోగ్రఫి : శ్రీకాంత్ నరోజ్ ఎడిటింగ్ : మధు చింతల విడుదల తేది : మార్చి 5, 2021 బుల్లితెరపై ఆర్కే నాయుడుగా నటించి కుటుంబ ప్రేక్షకుల అభిమానం చూరగొన్నాడు ‘మొగలిరేకులు’ సీరియల్ ఫేం సాగర్. గతంలో ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమాతో వెండితెరపై తళుక్కుమన్న అతడు హీరోగా పరిచయం అవుతున్న మూవీ ‘షాదీ ముబారక్’. టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు నిర్మించగా, పద్మశ్రీ దర్శకత్వం వహించారు. ఆకట్టకునే టైటిల్‌తో తెరకెక్కిన మూవీ ట్రైలర్‌పై పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతోమంచి అంచనాలే ఏర్పడ్డాయి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమేర ఆకట్టుకుంది? హీరోగా సాగర్ ఎంత వరకు సక్సెస్ అయ్యాడు? అన్న అంశాలు రివ్యూలో గమనిద్దాం. కథ మాధవ్ (సాగర్) ఫారిన్లో ఉంటాడు. ఆస్ట్రేలియాలో నివసించే అతడు పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయి, వధువును సెలక్ట్ చేసుకునే క్రమంలో హైదరాబాద్ వస్తాడు. అక్కడే ఓ మ్యారేజ్ బ్యూరోను ఆశ్రయించి తనకు ఎలాంటి అమ్మాయి కావాలో వివరాలు చెప్తాడు. ఈ క్రమంలో మ్యారేజ్ బ్యూరో ఓనర్ కూతురు అయిన తుపాకుల సత్యభామ (దృశ్య రఘునాథ్) పరిచయం అవుతుంది. తన తల్లికి యాక్సిడెంట్ కావడంతో తానే బ్యూరో వ్యవహారాలు చూస్తున్న, ఆమె మాధవ్‌తో కలిసి సత్యభామ పెళ్లి చూపులకు హాజరవుతూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న సత్యభామ, మాధవ్ ప్రేమలో పడతారు. మరి వారి ప్రేమ ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి పీటలు ఎక్కిందా? సత్యభామ- మాధవ్ ఒక్కటయ్యారా లేదా తెలియాలంటే షాదీ ముబారక్ చూడల్సిందే. నటీనటులు బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్లో నటించి లక్షలాది మంది ప్రేక్షకుల అభిమానాన్ని చురగొన్న సాగర్..మంచి కథతో హీరో అయ్యాడు.మాధవ్ పాత్రలో ఒదిగిపోయాడు. స్క్రీన్‌పై బాగా కనిపించడమే కాకుండా మంచి ఫెర్ఫార్మెన్స్‌ను ప్రదర్శించాడు. ఇక హీరోయిన్ దృశ్య రఘునాథ్ అందం, అభినయంతో ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో అలరించింది.రాహుల్ రామకృష్ణ, హేమంత్, భద్రం తమదైన కామెడీతో నవ్వించారు. హేమ, రాజశ్రీ నాయర్, బెనర్జీ, అదితి మ్యాకాల్ తదితరులు తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ దర్శకుడు పద్మశ్రీకి తొలి సినిమా ఇది. కానీ ఎన్నో సినిమాలు తీసిన అనుభవం ఉన్నట్లుగా కథను తెరకెక్కించాడు. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని సాధించాడని చెప్పొచ్చు. తక్కువ బడ్జెట్లో ఓ అందమైన కథను ప్రేక్షకులకు అందించాడు. యువతను అకర్షించే అంశాలైన రొమాన్స్, కామెడీని తన కథలో మిస్ కాకుండా చూసుకున్నాడు. ప్రేక్షకుడికి బోర్ కొట్టకుండా సింపుల్ కథని చక్కగా తెరపై చూపించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. ఇక ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ సునీల్ కశ్యప్ సంగీతం. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. మధు చింతల ఎడిటింగ్, శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫి బాగుంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. -
చిట్‌చాట్ విత్ షాదీ ముబారక్ హీరో
-
ట్రైలర్: ‘మొగలిరేకులు’ సాగర్ హీరోగా సినిమా
బుల్లితెరలో నటించి మహిళల ఆదరాభిమానం పొందిన నటుడు సాగర్ ఆర్కే నాయుడు ఇప్పుడు వెండితెరపై హీరోగా పరిచయం అవుతున్నాడు. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించిన సాగర్ తొలిసారిగా హీరోగా నటిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో దిల్ రాజు నిర్మిస్తుండగా సాగర్ హీరోగా ‘షాదీ ముబారక్’ సినిమా తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ‘మొగిలిరేకులు, చక్రవాకం’ సీరియల్స్‌తో పేరు పొందిన సాగర్ నటించిన ‘షాదీ ముబారక్’ ట్రైలర్‌ను గురువారం నిర్మాత దిల్ రాజు విడుదల చేశాడు. ‘సిద్ధం కండి.. ప్రేమ రైడ్‌కు హార్దిక స్వాగతం పలికేందుకు’ అని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. కొత్త దర్శకుడు పద్మశ్రీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. పెళ్లి చూపుల నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ ఉంది. సాగర్‌కు జోడీగా దృశ్య రఘునాథ్ హీరోయిన్గా నటిస్తోంది. ఎన్నారై పాత్రలో సాగర్ నటిస్తున్నాడు. ఒకే రోజు మూడు పెళ్లి సంబంధాలు చూసేందుకు వెళ్లి సాగర్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడో సినిమా కథ ఉన్నట్టు తెలుస్తోంది. అందంగా.. ఆహ్లాదకరంగా ట్రైలర్ రూపొందించారు. ఈ సినిమాను మార్చి 5వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. -
‘ఎన్నిసార్లు మంత్రిగా ఉన్నామనేది ముఖ్యం కాదు’
సాక్షి, విజయనగరం : శ్రీరామతీర్థ సాగర్ ద్వారా విజయనగరానికి నీళ్లు తీసుకొస్తామని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఇప్పటికే పేదలందరికీ ఇళ్లు పట్టాలు ఇచ్చామని, మిగిలిన వాళ్లకి కూడా ఇస్తామని భరోసానిచ్చారు. అందరికి తమ దగ్గర ప్రాంతంలోనే ఇళ్ల పట్టాలు ఇస్తామని, ఆర్థికంగా సాయం అందిస్తామని తెలిపారు. జిల్లాలో మంత్రి శుక్రవారం మాట్లాడుతూ.. ఇచ్చిన మాట ప్రకారం విజయనగరం జిల్లా అభివృద్ధి చెందాలని పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని సార్లు మంత్రి పదవి చేశామని కాదని, ప్రజలకు కావల్సిన పనులు చేయడం ముఖ్యమన్నారు. నగరంలో ఎమ్మెల్యే పూర్తిగా ఆ దిశగా పని చేస్తున్నారని తెలిపారు. శ్రీరామతీర్ధ సాగర్ నుంచి నీరు తీసుకురావాలని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నప్పుడే ప్రయత్నించామని మంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం కక్షతో ఆ ప్రాజెక్టుని నిలిపి వేసిందని విమర్శించారు. చదవండి: ‘అబద్ధాలు తప్ప.. ఆయన చేసిందేమీలేదు’ ప్రతిపక్షాల విమర్శలు పట్టించుకోమన్న మంత్రి.. ప్రజల నుంచి రావడం వల్ల వాళ్ల కష్టాలు తమకు తెలుసని అన్నారు. వృద్దులకు వాలంటీర్లు ద్వారా ఉదయాన్నే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. మోసం, దగా లేకుండా పారదర్శకంగా అందిస్తున్నామన్నారు. అమ్మ ఒడి ద్వారా పండగకు ముందే వారి ఖాతాలో డబ్బులు జమచేశారని పేర్కొన్నారు. ఇలాంటి ఆలోచన చంద్రబాబుకి ఎప్పుడూ రాదని ఎద్దేవా చేశారు. పద్దెనిమిది నెలల కాలంలో మీరు ఎంత సంతోషంగా ఉన్నారో, గత అయిదేళ్ళలో ఎలాంటి ఇబ్బంది పడ్డారో ఆలోచన చేయాలని ప్రజలకు సూచించారు. కరోనా సమయంలో అధికారులతో సంప్రదించి ప్రజలు ఇబ్బంది పడకూడదని చెబుతూ వచ్చారన్నారు. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి, దేవుడిపై దాడులు చేస్తున్నారని మండిపడ్డ బొత్స.. అధికారంలో లేనప్పుడే టీడీపీకి దేవుళ్లు కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
లోఫర్ ప్రేమ కథ
ఎమ్.ఎన్.వి. సాగర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కొంటె కుర్రాడు’. ‘ఓ లోఫర్‌గాడి ప్రేమ కథ’ ట్యాగ్‌లైన్. ఎస్. ఎమ్. ఫోర్ ఫిలిమ్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ సినిమా బ్యానర్, టైటిల్ లోగో విడుదల చేశారు. ‘‘గ్రామీణ నేపథ్యంతో పాటు పునర్జన్మల కథాంశంతో మాస్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది’’ అన్నారు ఎమ్.ఎన్.వి. సాగర్. ఈ చిత్రానికి కెమెరా: సీఎస్ చంద్ర, సంగీతం అరమాన్ మెరుగు. -
‘కరకట్ట పునర్నిర్మాణ పనులు చేపడతాం’
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలంలో ఉన్న సారళాసాగర్ ప్రాజెక్టుకు వరద నీటి ఉధృతి పెరగడంతో మంగళవారం గండిపడింది. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సరళాసాగర్ కరకట్టకు గండిపడటంపై సాంకేతిక నిపుణులతో విచారణ చేయిస్తామని ఆయన తెలిపారు. కరకట్టకు గండిపడటం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఆయన పేర్కొన్నారు. రబీలో సాగుకు సన్నద్దమైన రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. 4, 200 ఎకరాలకు నీరందిస్తామని.. ప్రాజెక్టు పునర్నిర్మాణ పనులు వెంటనే చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదవండి: సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి -
సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీ గండి
సాక్షి, వనపర్తి: జిల్లాలోని మదనాపురం మండలం సమీపంలో ఉన్న సరళాసాగర్ ప్రాజెక్టుకు వదర నీరు పోటెత్తటంతో మంగళవారం గండిపడింది. దీంతో కరకట్ట తెగి నీరు వృధాగా పోయింది. కరకట్ట తెగడంతో వరద నీరు రోడ్డు మీదికి చేరింది. దీంతో కొత్తకోట-ఆత్మకూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పదేళ్ల తర్వాత సరళాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వదర నీరు చేరింది. సరళాసాగర్ ప్రాజెక్టు ఆసియాలోనే మొట్టమొదటి సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టుగా గుర్తింపు పొందింది. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రాజెక్టును సందర్శించి కొట్టుకుపోయిన ప్రాజెక్టు గండిని పూడ్చేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
అమ్మకు ప్రేమతో.. దేవీ శ్రీ ప్రసాద్
సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్ తన తల్లి శిరోమణి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. అమెరికాలో జరిగిన ఓ మ్యూజికల్ కన్సర్ట్‌లో ఆమె పుట్టిన రోజు సందర్భంగా పాడిన పాట వీడియోను తన ట్విటర్ పేజ్‌లో పోస్ట్ చేశారు దేవీ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా నాన్న 30 ఏళ్ల వయసులో తీవ్రమైన గుండెపోటు వచ్చింది. కానీ అప్పటి నుంచి మా అమ్మ ఆయన్ను అంటిపెట్టుకొని ఉంటూ ఆయన్ను కాపాడుతూ వచ్చారు. ఆమె ఓ మెడిసిన్‌లా నాన్నను రక్షించారు. ఈ రోజు మేం ఇలా ఉన్నాం అంటే అందుకు కారణం అమ్మే’ అన్నాడు దేవీ శ్రీ ప్రసాద్. దేవీ తమ్ముడు సాగర్‌తో పాటు ఆయన మ్యూజిక్ ట్రూప్‌లోని గాయకులు, వాద్య కళాకారులు కూడా ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం దేవీ శ్రీ ప్రసాద్ తెలుగులో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు, మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ సినిమా, అల్లు అర్జున్, సుకుమార్‌ల సినిమా, నితిన్ రంగ్దేలకు సంగీతమందిస్తున్నారు. ThankU all so much 4 d Love n wishes on my Mom’s Birthday today❤️🙏🏻 Here’s d Special Video 4 my Mom, which was a Surprise 4 her on my USA TOUR Thanks 2 all my Singers,Musicians & Team 4 makin it Happen🙏🏻@sagar_singer @Raninareddy @shraddhadas43 @iamMadhuShalini @amritharam2 pic.twitter.com/sx7wbTa4LR — DEVI SRI PRASAD (@ThisIsDSP) August 27, 2019 -
మాటల రచయితగా మారిన సింగర్
టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్ సోదరుడు సాగర్ మాటల రచయితగా అవతారమెత్తాడు. ఇప్పటివరకు పాటలు పాడి ప్రేక్షకులను మెప్పించిన సాగర్.. ఇకపై మాటలతోనూ పలకరించనున్నాడు. తన సోదరుడు డైలాగ్ రైటర్‌గా మారిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశాడు. సింగర్‌గా ఉన్న తన సోదరుడు ‘రాక్షసుడు’ చిత్రంతో మాటల రచయితగా మారాడని.. ఈ విషయాన్ని పంచుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమ తండ్రి (రచయిత సత్యమూర్తి) వారసత్వాన్ని కొనసాగించేందుకు అందరి ఆశీస్సులు కావాలని ట్విటర్ వేదికగా కోరారు. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరణ్ కాంబోలో తమిళ సూపర్‌హిట్ రాక్షసన్‌కు రీమేక్‌గా ‘రాక్షసుడు’ చిత్రం తెరకెక్కుతోంది. Am Glad 2 share dat my brother @sagar_singer whom U all know as a SINGER is bein introduced as a DIALOGUE WRITER in #RAKSHASUDU 😁🎶 Need all ur blessings 4 him to take up my Father’s Love 4 Writing n continue his Legacy🙏🏻❤️@BSaiSreenivas @anupamahere https://t.co/HbgmZO1rt7 — DEVI SRI PRASAD (@ThisIsDSP) June 8, 2019 -
ఈ ముఖ్యమంత్రికి రైతు సమస్యలేం తెలుస్తాయి
త్రిపురాంతకం: వ్యవసాయం దండగ అన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రైతుల కష్టాలు ఏం తెలుస్తాయని యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త, సంతనూతలపాడు ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. త్రిపురాంతకంలో శనివారం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో రైతులు సాగర్ నీటి కోసం ఎన్ఎస్పీ కార్యాలయం ముట్టడి, నేషనల్ హైవేపై ప్రదర్శన, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సురేష్ మాట్లాడుతూ ఈరాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. రైతులకు సాగర్ జలాలు అందక నాలుగేళ్లయిందన్నారు. ఈఏడాది సాగునీరిస్తున్నట్లు ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి స్వయంగా ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాకు పదహారు సార్లు వచ్చారని..కనీసం రైతులకు సాగర్ జలాలను సాగుకు అందించలేకపోవడం దారుణమన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదని మభ్యపెడుతున్నారని విమర్శించారు. సాగర్ డ్యాంలో నీరున్నా కుడి కాలువ దిగువన నీరందించలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందన్నారు. ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ వచ్చి అధికారుల సమీక్షలు నిర్వహించారు కానీ నీరందలేదన్నారు. రోజుకో విధానం అమలు చేస్తున్నారని..గతంలో నీరు నిరంతరంగా ఇచ్చేవారని చెప్పారు. ఇప్పుడు తొమ్మిది రోజులు ఇచ్చి, ఆరు రోజులు ఆపుతామన్నారని..అది కూడా అమలు జరగడం లేదన్నారు. ఇక నుంచి ఇలా నీరిస్తే పంట పూర్తిగా ఎండిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా ప్రధాన కాలువకు మూడువేల క్యూసెక్కుల నీరు అందించాలని డిమాండ్ చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నీటిని నిరాటంకంగా అందించారని గుర్తు చేశారు. వరుణుడు కరుణించి వర్షంపడి శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు నిండుకుండలా ఉంటే, ఆ నీటిని రైతులకు అందించలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్న విషయాన్ని రైతులు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రకటనతో రైతులు ఆశించి పంటలు పండించవచ్చనుకుంటే వారికి నీరివ్వక నిలువునా మోసం చేశారని విమర్శించారు. పంటలు వేసేవారికి నీరెప్పుడివ్వాలి, ఎప్పుడు ఎరువులు కావాలి, ఎప్పుడు గిట్టుబాటు ధర కావాలో రైతు బిడ్డకు తెలుస్తుంది కానీ మాటలు చెప్పి కాలయాపన చేసే ఈ ముఖ్యమంత్రికి రైతుల కష్టమేమి తెలుస్తుందని ప్రశ్నించారు. రైతన్నల కష్టాలు తీర్చేందుకు జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని సురేష్ పిలుపునిచ్చారు. సాగునీటి పోరుకు స్వచ్ఛందంగా తరలివచ్చిన రైతులు: సాగర్ సాగునీటి కష్టాలు తీర్చాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. రైతులను సాగునీటి పోరాటంలో పాల్గొనకుండా అధికార యంత్రాంగం, పోలీస్‌శాఖ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినా స్వచ్ఛందంగా రైతులు తరలివచ్చారు. త్రిపురాంతకానికి ఎమ్మెల్యే సురేష్ తెల్లవారే సరికి చేరుకున్నారు. ఆయనను గృహనిర్బంధం చేయాలని రాస్తారోకో, కార్యాలయం ముట్టడి కార్యక్రమాలను నిరోధించే ప్రయత్నాలు చేశారు. అయినా ప్రకటించిన విధంగా ఎమ్మెల్యే సురేష్ ఆధ్వర్యంలో అనంతపురం–అమరావతి హైవేపై రైతులు ప్రదర్శన చేశారు. సాగర్ కార్యాలయాన్ని ముట్టడించారు. అక్కడ రైతుల సాగునీటి సమస్యపై మండిపడ్డారు. సాగర్ కాలువల ఎస్ఈ కె.రవి మాట్లాడుతూ సాగర్ ప్రధాన కాలువ ద్వారా తక్కువ నీరు వస్తున్నందున నీటి సరఫరా పెరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్ఈ వెంట ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డి, ఏఈలు విజయకుమార్, ప్రసన్నకుమార్ ఉన్నారు. డీఎస్పీ రామాంజనేయులు, సీఐలు మల్లికార్జున్‌రావు, శ్రీరామ్, ఎస్ఐలు కమలాకర్, మాధవరావు, దేవకుమార్‌లు హైవే పై బైఠాయించిన సురేష్‌తోపాటు రైతులను బలవంతంగా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో సాగునీటి సమస్య తీవ్రతను వారికి వివరించారు. కార్యక్రమాల్లో వైఎస్సార్ సీపీ నాయకులు పి.చంద్రమౌళిరెడ్డి, ఆళ్ల ఆంజనేయరెడ్డి, కోట్ల సుబ్బారెడ్డి, ఎస్.పోలిరెడ్డి, వజ్రాల కోటిరెడ్డి, దగ్గుల గోపాల్‌రెడ్డి, ఆళ్ల కృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, గాలెయ్యయాదవ్, ఉడుముల శ్రీనివాసరెడ్డి, రెంటపల్లి సుబ్బారెడ్డి, నక్కా చిన్నత్రిపురారెడ్డి, పిచ్చయ్య, బాలకోటిరెడ్డి, వెంగళరెడ్డి, సత్యనారాయణరెడ్డి, యల్లారెడ్డి, సుబ్రహ్మణ్యం, మల్లికార్జున, కృష్ణారెడ్డి ,శ్రీనివాసరెడ్డి, వెంకటనారాయణ, రంగయ్య, రంగబాబు, నాయకులు పాల్గొన్నారు. ఎట్టకేలకు స్పందించిన సాగర్ ఉన్నతాధికారులు త్రిపురాంతకం: సాగర్ నీటి కోసం వైఎస్సార్ సీపీ రైతు విభాగం ఆధ్వర్యంలో సాగునీటికి ఉద్యమించడంతో ఎట్టకేలకు సాగర్ ఉన్నతాధికారుల బృందం ప్రధాన కాలువపై పర్యటించింది. నాగార్జున సాగర్ ప్రధాన కాలువ జిల్లా సరిహద్దు 85–3 వద్దకు సాగర్ కాలువల చీఫ్ ఇంజినీర్ గోపాల్‌రెడ్డి, ఎస్ఈ రవి, ఆర్డీఓ రామకృష్ణారెడ్డి, ఈఈ శ్రీనివాసరెడ్డి, డీఈ నరసింహారెడ్డిలు పర్యటించారు. వీరితో పాటు ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే డేవిడ్‌రాజు ఉన్నారు. సాగునీటి సరఫరా సక్రమంగా లేనందున వరిపంట దెబ్బతింటుందన్న విషయాన్ని వ్యవసాయశాఖ అధికారులు సాగర్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. కనీసం జిల్లా ఆయకట్టులోని పంటలు దెబ్బతినకుండా సాగునీరందించాలంటే 3300 క్యూసెక్కులు ముందుగా పదిహేను రోజులు ఇవ్వాల్సి ఉంటుందన్న అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం 2046 క్యూసెక్కుల నీటి సరఫరా అవుతోంది. దీనిని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ మేరకు జలవనరుల శాఖ మంత్రితో చర్చించారు. వైఎస్సార్ సీపీ రైతుల సాగునీటి సమస్యపై ముందు నుంచి అధికారులతో ఎప్పటికప్పుడు చర్చిస్తూ వచ్చింది. రైతులు పూర్తిగా నష్టపోతున్న తరుణంలో వారి సాగునీటి కష్టాలు తీర్చేందుకు రోడ్డెక్కాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించింది. నీటి సమస్య పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
లోఫర్‌ప్రేమకథ
సాగర్ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కొంటె కుర్రాడు’. ‘ఓ లోఫర్‌గాడి ప్రేమకథ’ అనేది ట్యాగ్‌లైన్. వెన్నెల విహర్ కథానాయిక. ఏనుగుతల దేవదాసు, సైధూల్ బాథరాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ అభిమానిగా కనిపిస్తారు సాగర్. హీరో ‘రవితేజ అమర్ అక్బర్ ఆంటొని’ సినిమా విడుదల సందర్భంగా ‘కొంటె కుర్రాడు’ చిత్రంలోని ఓ సాంగ్‌ను వృద్ధాశ్రమంలో విడుదల చేశారు. ‘‘రవితేజగారికి సాగర్ వీరాభిమాని. విడుదల చేసిన సాంగ్‌ను మాస్ మహారాజ్ రవితేజకు డెడికేట్ చేస్తున్నాం. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తాం. ఈ సినిమాను సాగర్ చక్కగా తెరకెక్కిస్తున్నారు’’ అన్నారు నిర్మాతలు. ‘సస్పెన్స్, లవ్‌తో ఎవరూ ఊహించని విధంగా క్లైమాక్స్ ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుంది’’ అన్నారు సాగర్. యస్.ఏ. అరమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. -
ప్రేమను తిరస్కరించిందని చంపేసాడు
-
ఇంటికో హీరో
సుమన్ ముఖ్య పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘సడి’. పాలిక్ దర్శకత్వంలో భాను ఎంటర్టైన్మెంట్స్, శ్రీ సాయి అమృతలక్ష్మి క్రియేషన్స్‌పై గోదారి భానుచందర్ నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి దర్శకులు ధవళ సత్యం కెమెరా స్విచ్చాన్ చేయగా, మరో దర్శకులు వి.సాగర్ క్లాప్ ఇచ్చారు. నటుడు, దర్శకుడు గూడ రామకృష్ణ గౌరవ దర్శకత్వం వహించారు. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఫ్యామిలీ నేపథ్యంలో సాగే క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ప్రతి ఇంటికీ ఒక హీరో ఉంటాడు. ఈ సినిమాలో నేను ఒక ఇంటికి హీరోగా చేస్తున్నా’’ అన్నారు. ‘‘ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎదుర్కొన్న ఊహించని పరిణామాలే ఈ చిత్రం. మే నెలాఖరులో షూటింగ్ ప్రారంభించి సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేస్తాం’’ అన్నారు పాలిక్. ‘‘సుమన్గారితో నా తొలి సినిమా చేయడం హ్యాపీ’’ అన్నారు గోదారి భానుచందర్. దర్శకుడు వీరశంకర్, నటుడు గూడ రామకృష్ణ పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: జశ్వంత్, సంగీతం: యాజమాన్య. -
లవర్‌తో వీడియో కాల్, లైవ్ లో ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్ : క్షణికావేశంతో ఓ యువకుడు తీసుకున్న నిర్ణయంతో నిండు జీవితాం అర్థాంతరంగా ముగిసింది. ప్రేమికురాలితో వీడియో కాల్ మాట్లాడుతూనే ఆ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమ విఫలం కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 20 ఏళ్ల అజ్మీర్ సాగర్ మల్కాజ్‌గిరిలోని వినాయక్ నగర్లో తన సోదరితో కలసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సాగర్ కొంతకాలంగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే నాలుగు నెలల క్రితం ఆ యువతి బంధువులతోపాటు, ఇంట్లోవాళ్లు కూడా ఈ ప్రేమ వ్యవహరంలో సాగర్ని హెచ్చరించారు. సాగర్ తల్లిదండ్రులు అతనికి పెళ్లి సంబంధాలు చూడటంతో తీవ్ర మనస్థాపానికి లోనయ్యాడు. ఈ సందర్భంగా ప్రేమికుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో ఆమె నువ్వు చనిపోతే నీ మీద కోపం పోతుంది అంటూ సాగర్‌కు వాట్సాప్‌లో సందేశం పంపింది. ఈ విషయంపై మాట్లాడాలంటూ సాగర్ గురువారం ఉదయం ఆమెకు మెసేజ్ చేశాడు. తాను చనిపోవడం చూడాలనుకుంటే వీడియో కాల్ చేయమని కోరాడు. ఆ యువతి వీడియో కాల్ చేయగానే.. సాగర్ తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని తెలిపాడు. అయితే సాగర్ సీరియస్‌గా చెప్పినప్పుటికీ ఆ విషయాన్ని ఆమె సరదాగా తీసుకోవడంతో సాగర్ ... వీడియో కాల్ మాట్లాడుతూనే సీలింగ్ ఫ్యాన్‌కి ఊరేసుకుని తనువు చాలించాడు. -
యాక్షన్.. రొమాన్స్
సాగర్, ప్రగ్యా జంటగా బషీర్ ఆలూరి దర్శకత్వంలో యూనివర్శల్ ఫిలిమ్స్ పతాకంపై జీవీఎస్ నిర్మాణంలో రూపొందు తున్న చిత్రం ‘సమరం’. నాలుగో షెడ్యూల్ కంప్లీట్ అయింది. బషీర్ మాట్లాడుతూ– ‘‘యాక్షన్, రొమాంటిక్ అండ్ లవ్‌స్టోరీ మూవీ ఇది. అన్ని కమర్షియల్ హంగులు జోడించాం’’ అన్నారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నా’’ అన్నారు సాగర్. ‘‘ఒక మంచి సినిమాకి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్నాయి. కరెక్ట్ టైమ్‌లో రిలీజ్ చేస్తే మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు నటుడు వినోద్‌కుమార్. రామ్ జగన్, ప్రభావతి, రాగిణి, అప్పారావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీత దర్శకుడు: రాజ్ కిరణ్, కెమెరా: నాగబాబు. -
ఎవరీ సాగర్..?
యదళ్లపల్లి విశ్వనాథం (ఆజాద్), కొమురం వెంకటేశ్వర్లు(గణేష్), ఆవునూరి నారాయణ స్వామి(మధు), దనసిరి సమ్మయ్య(గోపి), లింగన్న, ఏనుగుల చంద్రారెడ్డి్డ(సాగర్), ‘..........?’ వీరంతా ఎవరనేదేగా మీ ప్రశ్న..! ఇల్లెందు: భూమి కోసం.. భుక్తి కోసం.. భూస్వామ్య వ్యవస్థ నుంచి విముక్తి కోసం.. సమ సమాజ స్థాపన కోసం... ఇంటిని విడిచి, కుటుంబీకులను వదిలి, విప్లవ బాట పట్టిన ఒకప్పటి ఉడుకు రక్తపు యువకులే వీరంతా. ఆ తరువాతి రోజుల్లో న్యూడెమోక్రసీ నాయకులు. తుపాకులు చేబూని, జన రక్షణ పేరుతో అడవికి పయనమైన అజ్ఞాత దళాల అగ్ర నేతలు. వనంలో ఉన్నంత కాలం వీరు సురక్షితంగా ఉన్నారు..! జనంలోకి వచ్చిన తర్వాత పోలీసులకు దొరికిపోతున్నారు..!! వనం వదిలి.. జనంలోకి వచ్చి.. జైలుకెళుతున్నారు...!!! ‘‘అసలేం జరుగుతోంది..? న్యూడెమోక్రసీ (రాయల–చంద్రన్న) అజ్ఞాత అగ్ర నేతలంతా ఇలా ఒకరొక్కరుగా పోలీసులకు ఎలా పట్టుబడుతున్నారు..? ఇటీవలి కాలంలో మధు, గోపి, లింగన్న, సాగర్ వరుసగా పట్టుబడ్డారు. ‘..........’ ఈ ఖాళీలో చేరే తరువాతి నేత పేరేమిటి..?’’ న్యూడెమోక్రసీ శ్రేణులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ఆ పార్టీలోని రెండు వర్గాలను అభిమానించే–ఆరాధించే సానుభూతిపరులు, అడవి బిడ్డలు.. అందరూ ఆవేదనాపూరిత స్వరంతో అడుగుతున్న ప్రశ్నలివి. వారిని కలవరపెడుతున్న సమాధానం లేని సందేహాలివి. మొన్న లింగన్న.. నిన్న సాగర్.. రేపు..? పోలీసులు మహా ఉత్సాహంతో ఉన్నారు. న్యూడెమోక్రసీ అజ్ఞాత దళ అగ్ర నేతల్లో ఒకరైన లింగన్నను మొన్న పట్టుకున్నారు. మరుసటి రోజున చంద్రన్న వర్గం రాష్ట్ర నాయకుడు ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ చంద్రం అలియాస్ సాగర్‌ను అరెస్ట్ చేశారు. ‘ఆ తరువాత ఎవరు..?’ పోలీసుల్లో ఉత్సుకతను, ఎన్డీ శ్రేణుల్లో కలవరపాటును కలిగిస్తున్న ప్రశ్న ఇది. ఎవరీ సాగర్..? ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ చంద్రం అలియాస్ సాగర్‌ది కూసుమంచి మండలం రాజుపేట గ్రామం. ఉన్నత విద్యావంతుడు. ఖమ్మంలో డిగ్రీ చదివారు. ఆ రోజుల్లోనే అలీగఢ్ యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) చేశారు. అంతేకాదు.. పీజీలో గోల్డ్ మెడల్ కూడా సాధించారు. ఖమ్మంలో పీడీఎస్‌యూ నాయకుడిగా, కొత్తగూడెం–మణుగూరులో ఐఎఫ్టీయూ నాయకుడిగా పనిచేశారు. 17 ఏళ్ల క్రితం అడవి బాట (అజ్ఞాత వాసం) పట్టారు. లింగన్న–సాగర్ సమకాలికులే కాదు, ప్రాణ మిత్రులు కూడా. గుండాల దళానికి లింగన్న, ఆళ్లపల్లి దళానికి సాగర్ నేతలుగా పనిచేశారు. ఐదేళ్ల తర్వాత బయ్యారం ఏరియాకు సాగర్ వెళ్లారు. అక్కడ అశోక్ దళంతో కలిసి పనిచేశారు. కొన్నేళ్ల క్రితం చర్చల పేరుతో వీరిని మావోయిస్టులు పిలిచారు. అక్కడ వీరి నుంచి ఆయుధాలను లాక్కుని ఉత్త చేతులతో పంపించేశారు. విచిత్రంగా వీరిద్దరినీ ఒకే రోజున (ఈ నెల 7న) పోలీసులు పట్టుకున్నారు. మధ్యాహ్నం లింగన్నను, అర్థరాత్రి వేళ సాగర్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిక్కిందెవరు..? మిగిలిందెవరు..? ఉమ్మడి ఖమ్మం–వరంగల్ జిల్లా ఏరియా(ఈ రెండు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతం)లో న్యూడెమోక్రసీ(చందన్న–రాయల)కి దాదాపుగా 12 అజ్ఞాత దళాలు ఉన్నాయి. కీలక అజ్ఞాత–అగ్ర నేతలుగా ఆజాద్, గణేష్, సురేష్, ప్రతాప్, మధు, గోపి, లింగన్న, సాగర్, అశోక్ ఎదిగారు. వీరంతా ఇప్పుడు ఎక్కడున్నారో, ఏం చేస్తున్నారో చూద్దాం. ఆజాద్: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన, మూడు నెలల కిందట బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ అజ్ఞాతంలోకి వెళ్లారు. గణేష్: రాయల వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. పార్టీతో ఏమాత్రం సంబంధం లేకుండా ఇంటి వద్దనే ఉంటున్నారు. సురేష్: చంద్రన్న వర్గం జిల్లా నాయకుడైన ఈయన బెయిల్‌పై బయటికొచ్చారు. బూర్గంపాడు ఏరియాలో లీగల్‌గా పనిచేస్తున్నారు. ప్రతాప్: చంద్రన్న వర్గానికి చెందిన ఈయనను పోలీసులు నెల కిందట అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. మధు: న్యూడెమోక్రసీ రాయల వర్గం రాష్ట్ర నాయకుడైన ఈయన నెల కిందట బెయిల్‌పై బయటికొచ్చారు. ఇల్లెందు కేంద్రంగా లీగల్‌గా పనిచేస్తున్నారు. గోపి: రాయల వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా, మహబూబాబాద్ జిల్లా కార్యదర్శిగా ఉన్నారు. గత నెల 30న పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం జైలులో ఉన్నారు. లింగన్న: రాయల వర్గం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి. ఈ నెల 7న మధ్యాహ్నం రఘునాథపాలెం వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. జైలులో ఉన్నారు. సాగర్: చంద్రన్న వర్గం రాష్ట్ర కమిటీ సభ్యుడు. 7వ తేదీ అర్ధరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జైలులో ఉన్నారు. అశోక్: చంద్రన్న వర్గం దళ నేత. ఖమ్మం–వరంగల్ ఏరియా కార్యదర్శిగా ఉన్నారు. పైన తెలిపిన అందరిలోకి ఈయనే సీనియర్. పోలీ సుల ‘వాంటెడ్ లిస్ట్’లో అశోక్‌తోపాటు, ఇతని దళ సభ్యుడైన మోరే రవి కూడా ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అసలేం జరుగుతోంది..? న్యూడెమోక్రసీలో అసలేం జరుగుతోంది..? సుదీర్ఘ కాలంగా అజ్ఞాత జీవితం గడుపుతున్న ఆ పార్టీ నేతలు ఒకరొక్కరుగా ఎందుకు పోలీసులకు ‘చిక్కుతున్నారు’? ఏజెన్సీలో, జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం ఇది ఆసక్తికర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటివరకు అరెస్టయిన వారంతా ‘అనారోగ్యం’తో బాధపడుతున్నవారే(నట). వైద్యం కోసం వనం నుంచి జనంలోకి (ఆస్పత్రికి) వస్తున్నారు. అరెస్టవుతున్నారు. దశాబ్దాల కాలంగా అజ్ఞాత వాసం గడుపుతున్న అనేకమంది అజ్ఞాత నాయకుల్లో కొందరైనా వైద్యం కోసం గతంలో పట్టణాల్లోకి వచ్చి ఉంటారు. వైద్యం పూర్తయిన తరువాత తిరిగి అజ్ఞాతంలోకి వెళ్లి ఉంటారు. అప్పడెప్పుడూ అరెస్టులు జరగలేదు. ఇప్పుడు మాత్రమే జరుగుతున్నాయి. ఎందుకు? కీలక స్థాయిలోని అజ్ఞాత నాయకులు జనంలోకి రావడం అనివార్యమైనప్పుడు విప్లవ పార్టీ్టలు అనేక జాగ్రత్తలు తీసుకుంటాయి. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగింది, ఇప్పుడు మావోయిస్టు పార్టీలో జరుగుతున్నది ఇదే. మావోయిస్టు పార్టీ కీలక నేతలెవరూ (శ్రీరాముల శ్రీనివాస్ మినహా) గత కొన్నేళ్లుగా బయటికొచ్చి అరెస్టయింది లేదు. న్యూడెమోక్రసీ నాయకులు మాత్రమే ఇలా వరుసపెట్టి పోలీసులకు చిక్కుతున్నారు. దీనిని ఎలా భావించాలి..? పోలీసుల విజయంగానా..?! న్యూడెమోక్రసీ వైఫల్యంగానా..??!! ‘ఏకే’పై ‘గురి’..! తుపాకుల్లో శక్తివంతమైనది ఏకే–47. అశోక్ కూడా అంతే. న్యూడెమోక్రసీలోని అజ్ఞాత దళ నేతల్లో ఈయనే సీనియర్. బయ్యారం మండలం రామచంద్రాపురం గ్రామస్తుడు. ప్రస్తుతం చంద్రన్న వర్గంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లా ఏరియా కార్యదర్శిగా ఉన్న ఇతని అసలు పేరు వజ్జా పొట్టయ్య అలియాస్ అశోక్. పార్టీలోని సహచరులు పిలిచే పేరు మాత్రం.. ‘ఏకే’! బాల్యంలోనే విప్లవోద్యమ బాట పట్టిన ఇతని వయసు కూడా దాదాపుగా ‘47’ సంవత్సరాలు ఉంటాయి!! అత్యంత ‘శక్తివంత’ నాయకుడైన ఈ ‘ఏకే–47’పై మహబూబాబాద్ పోలీసులు గురి పెట్టారు. పాల్వంచ వద్ద ఓ రాజకీయ నాయకుడిని పట్టపగలు కొట్టి చంపిన కేసులో ప్రధాన నిందితుడైన మోరే రవి, ఈ ‘ఏకే’ దళంలోనే ఉన్నట్టుగా పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల ‘వాంటెడ్’ జాబితాలో మోరే రవి పేరు ఉంది. -
పోలీసుల అదుపులో దళనేత ‘సాగర్’!
మిర్యాలగూడ/హైదరాబాద్: సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ చంద్రన్న వర్గానికి చెందిన దళ నేత, రాష్ట్ర కమిటీ సభ్యుడు ఏనుగుల చంద్రారెడ్డి అలియాస్ సాగర్‌ను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వైద్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ నుంచి నెల్లూరుకు ఆర్టీసీ బస్సులో వెళ్తుండగా.. మిర్యాలగూడ ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. సాగర్‌తో పాటు మరో ఇద్దరు అనుచరులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే.. సాగర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు మిర్యాలగూడ డీఎస్పీ శ్రీనివాస్ ధ్రువీకరించడం లేదు. కాగా సాగర్‌ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని మానవ హక్కుల వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోహన్, ఉపాధ్యక్షుడు సుబ్బారావులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సాగర్‌ను వెంటనే కోర్టులో హాజరుపరచాలని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ నేతలు శుక్రవారం హైదరాబాద్‌లో అదనపు డీజీపీ అంజనీకుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. సాగర్ ఆచూకీ ఇంత వరకు లభ్యం కాలేదని, ప్రాణహాని తలపెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. అదనపు డీజీపీని కలసిన వారిలో ఎస్.వెంకటేశ్వర్రావు, కె.గోవర్ధన్, వి.సంధ్య, ఎం.శ్రీనివాస్, అనురాధ, అచ్యుత రామారావు తదితరులు ఉన్నారు. ఎమ్మెస్సీలో గోల్డ్ మెడల్ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం రాజుపేటకి చెందిన ఏనుగు చంద్రారెడ్డి అలియాస్ సాగర్ విద్యార్థి దశలోనే పీడీఎస్‌యూ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ గోల్డ్ మెడల్ సాధించారు. తర్వాత ఖమ్మంలో కార్మికనేతగా పనిచేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. -
ప్రేమ సమరం
సాగర్, ప్రగ్యా జంటగా సీనియర్ నటులు సుమన్, వినోద్‌కుమార్ ప్రధాన పాత్రల్లో రూపొందుతోన్న చిత్రం 'సమరం' బషీర్ ఆలూరి దర్శకత్వంలో జీవీయస్ నిర్మిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తయింది. బషీర్ ఆలూరి మాట్లాడుతూ 'యాక్షన్, రొమాంటిక్ ప్రేమకథతో తెరకెక్కుతోన్న చిత్రమిది. కుటుంబమంతా కలసి చూసేలా ఉంటుంది. రెండో షెడ్యూల్ మొదలుపెట్టాం' అన్నారు. చక్కటి కథతో నా మొదటి సినిమా చేస్తుండటం హ్యాపీగా ఉందన్నారు సాగర్. 'మంచి కుటుంబ కథతో రూపొందుతోన్న సినిమా ఇది. నిర్మాత కొత్త అయినా అనుభవం ఉన్నవారిలా నిర్మిస్తున్నారు. సరైన సమయంలో విడుదల చేస్తే మంచి విజయం సాధిస్తుంది' అన్నారు సుమన్. సీనియర్ నటులు వినోద్ కుమార్ ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. -
'ప్రభాస్' మూవీ ఓపెనింగ్
నితీష్ రెడ్డి హీరోగా సీనియర్ డైరెక్టర్ సాగర్ దర్శకత్వంలో ఫార్చ్యూన్ మూవీస్ వారు నిర్మిస్తున్న సినిమా 'ప్రభాస్'. ఈ చిత్రం 22 వ తేదీ ఉదయం అన్నపూర్ణ స్టూడియోలో ప్రారంభం అయ్యింది.హీరో నితీష్ రెడ్డి, హీరోయిన్స్ నందిని, అమృత లపై తొలి సన్నివేశాన్ని చిత్రీకరించారు. ఈ సన్నివేశానికి ప్రముఖ నిర్మాత కె.ఎస్.రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేయగా, మరో సీనియర్ నిర్మాత, తెలంగాణ ఎఫ్.డి.సి ఛైర్మెన్ పీ. రామ్మోహన్ రావ్ క్లాప్ కొట్టారు. ప్రముఖ దర్శకులు ఎస్.వి. కృష్ణా రెడ్డి తొలి షాట్ కి దర్శకత్వం వహించారు. -
అనాథలకు ఆధార్ సాగర్
సాగర్ తనకు ఊహ తెలిసేటప్పటికే మహారాష్ట్ర, లోనావాలాలోని అంతర్ భారతి బాలాశ్రమంలో ఉన్నాడు. తాత అప్పుడప్పుడూ వచ్చి చూసి వెళ్లేవాడు. ఆ తర్వాత తాత కాలం చేశాడు. సాగర్‌కు 18 ఏళ్లు వచ్చాయి. అనాథాశ్రమం నుంచి బయటికి అడుగుపెట్టక తప్పలేదు. బయట ప్రపంచంలో ఇమడలేక ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అలాంటి వ్యక్తి నేడు నవీ ముంబయిలోని వాషిలో ‘ఏక్తా నిరాధార్ సంఘ్’ను స్థాపించి వందల మందికి ఆశ్రయమివ్వడంతోపాటు అనాథల హక్కుల కోసం పోరాడుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన వెంకటేష్ రెడ్డి, ఉద్యోగం కోసం మహారాష్ట్రకు వలస వెళ్లాడు. అక్కడ చెందిన పౌర్ణిమ కాలే అనే క్రిస్టియన్ యువతిని ప్రేమించాడు. పెద్దలు అంగీకరించకపోవడంతో ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్నాడు. పెద్దలకు భయపడ్డ వెంకటేష్ రాయిగడ్ జిల్లాలో భార్యతో గుట్టుగా నివసించసాగాడు. వారికి 1986 మార్చి 20న సాగర్ రెడ్డి పుట్టాడు. రెండేళ్లకు వీళ్ల ఆచూకీ తెలుసుకున్న వెంకటేశ్ తరఫు వాళ్లు ఆ దంపతులను దారుణంగా చంపేశారు. అప్పటికి సాగర్ ఏడాది పిల్లాడు. ఆ పసివాడి ప్రాణాలు కూడా తీస్తారేమోనన్న భయంతో అతడి తాత (తల్లి తండ్రి) డేవిడ్ కాలే, సాగర్ని అనాథాశ్రమంలో చేర్పించారు. సాగర్ అక్కడే టెన్త్ పూర్తి చేశాడు. ఆ తర్వాత అతడిని 2001లో ముంబై చెంబూరులోని ఆదిత్య బిర్లా సెంటర్ అనా«థాశ్రమానికి మార్చారు. 2003లో సాగర్‌కి 18 ఏళ్లు నిండడంతో ప్రభుత్వ నియమాల ప్రకారం అనాథాశ్రమం నుంచి బయటపడ్డాడు. ఎటు వెళ్లాలో తెలీక... గమ్యం తెలియని ప్రయాణాన్ని ఎలా మొదలుపెట్టాలో కూడా తెలియని అయోమయంలో ఏ దారీ కన్పించక మూడు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న అతనికి ఓ వ్యక్తి ఇంజినీరింగ్ చదవడానికి సహాయం చేశారు. ఇంజినీరింగ్ అయ్యాక ‘ఎల్ అండ్ టి’లో ఉద్యోగం లభించింది. ఎవరైనా అక్కడితో రిలాక్స్ అవుతారు. సాగర్ అక్కడి నుంచే తన అసలు జీవితాన్ని ప్రారంభించాడు. అనాథల హక్కుల కోసం... అనాథలకు ప్రభుత్వం, దాతలు ఎవరో ఒకరు అన్నం పెడుతున్నారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్లకు ఒక ఉనికి ఉండడం లేదు. ఆ ఉనికికి ఒక వేదిక ఏర్పాటు చేయాలనుకున్నాడు. 2010లో ‘ఏక్తా నిరాధార్ సంఘ్’ను స్థాపించాడు. అనాథలను చేరదీయడంతోపాటు వారికి ఆధార్ వంటి గుర్తింపు కార్డులు ఇప్పించే పనులు చేస్తున్నాడు. ఈ ఆరేళ్లలో ఏక్తా నిరాధార్ సంఘ్ 250 మంది పిల్లలకు ఆశ్రయం ఇచ్చింది. అతను చేస్తున్న పోరాటాన్ని చూసి అనేకమంది సహాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. 18 ఏళ్లు నిండి ఆశ్రమం వదిలి బయటకు వెళ్లాల్సిన వాళ్ల కోసం జాబ్ మేళాలు పెట్టిస్తున్నారు. సామూహిక వివాహాలు చేస్తున్నారు. తన ఆశ్రమంలో ఉన్న అనాథ పిల్లలను... మంచినీరు లేని గ్రామాలకు నీటి సరఫరా చేయడం వంటి సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తున్నారు. సేవకు సత్కారం... సాగర్ రెడ్డికి అనేక అవార్డులు లభించాయి. ముఖ్యంగా మరాఠీ న్యూస్ చానెళ్లు ఏబీపి మాజా ‘బెస్ట్ సింగిల్ ఫాదర్’ అవార్డుతో సత్కరించాయి. ఇప్పటివరకు ఈ అవార్డు అందుకున్న వారందరిలోనూ వయసులో చిన్నవాడు సాగర్. అతడిని ఐబీఎన్ ఇండియన్ పాజిటివ్ యంగ్‌గా గుర్తింపు నిచ్చింది. కర్ణాటక ప్రభుత్వం పౌర సన్మానం చేసింది. – గుండారపు శ్రీనివాస్ సాక్షి, ముంబయి గుర్తింపు కార్డు కోసమే... సొసైటీలో అనా«థలకు ఎలాంటి గుర్తింపూ ఉండడం లేదు. చివరికి తీవ్రవాదులకు కూడా ఏదో ఓ దేశ పౌరసత్వం ఉంటుంది. కాని అనాథలమైన మాకు ఈ దేశపౌరులమని చెప్పేందుకు ఎలాంటి అధికారిక ఆధారాలులేవు. బ్యాంకు ఖాతా తెరవాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు తదితరాలు దొరకడం చాలా కష్టం. ఓటరుగా గుర్తింపు లేదు. ఎవరో చేసిన తప్పుకు వీరు జీవితాంతం శిక్షను అనుభవిస్తూనే ఉండాలి. నిరాశ్రయులు, అనా«థలకు నీడనిచ్చేందుకు దేశంలో వేలాది స్వచ్ఛంద సంస్థలున్నాయి. కానీ 18 ఏళ్ల తర్వాత ఎక్కడికి వెళ్తారు..? చాలామంది అబ్బాయిలు దొంగతనాలు, సంఘవిద్రోహ కార్యక్రమాలవైపు మళ్లుతున్నారు. అమ్మాయిలను బలవంతంగా వ్యభిచారంలోకి దించుతున్నారు. అందుకే నేను... నాలాంటి వారి కోసమే ఈ సంస్థను ఏర్పాటు చేశాను. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగాల్లో, పై చదువుల కోసం ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించడంతోపాటు ఆధార్, రేషన్, ఓటరు కార్డులను అనాథలకు కూడా జారీ చేయాలి. – సాగర్ రెడ్డి బెస్ట్ సింగిల్ ఫాదర్ అవార్డు గ్రహీత -
మా వాటా పూర్తయ్యాక చూద్దాం..
సాగర్, శ్రీశైలంలో కనీస మట్టాల దిగువకు వెళ్లడంపై ఏపీ ఇంకా 17 టీఎంసీలు రావాల్సి ఉందంటూ డ్రాఫ్ట్ నోట్ సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర సాగు, తాగు నీటి అవసరాల కోసం నాగార్జునసాగర్, శ్రీశైలంలో నిర్ణయించిన కనీస మట్టాలకన్నా దిగువకు వెళ్లేందుకు అనుమతించాలన్న తెలంగాణ ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ అడ్డుపడేలా ఉంది. రెండు ప్రాజెక్టుల పరిధిలో నిర్ణయించిన నీటి మట్టాల్లో ప్రస్తుతం ఉన్న నీరంతా తమకే దక్కుతుందంటున్న ఏపీ.. ఆ వినియోగం పూర్తయ్యాకే మరింత దిగువకు వెళ్లే అంశంపై చర్చిద్దామనే ధోరణి ప్రదర్శిస్తోంది. ఈ విషయమై కృష్ణాబోర్డుకు లేఖ రాసేందుకు ఏపీ జల వనరుల శాఖ అధికారులు డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేశారని.. నేడో, రేపో పంపించే అవకా శం ఉందని బోర్డు వర్గాల ద్వారా తెలిసింది. నిజానికి శ్రీశైలంలో 785, సాగర్‌లో 503 అడు గుల కనీస మట్టాల వరకు నీరు తీసుకోవాలని తొలుత నిర్ణయం జరిగింది. ప్రస్తుతం ఆ నీటిమట్టాల వద్ద 17 టీఎంసీల మేర నీరుంది. ఆ నీరంతా తమకే దక్కుతుందని ఏపీ ఇదివరకే స్పష్టం చేసింది. అయితే తమ కోటా పూర్తయినందున ప్రస్తుత ఎండకాలంలో జంట నగరాలు, నల్లగొండ జిల్లా తాగునీటి అవసరాలకు 10 టీఎంసీల అవసరం ఉంటుందంటూ వారం కింద బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు సాగర్‌లో 500, శ్రీశైలంలో 765 అడుగుల దిగువకు వెళ్లి నీరు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. దీనిపై బోర్డు ఏపీ అభిప్రాయాన్ని కోరగా, ఆ రాష్ట్ర అధికారులు డ్రాఫ్ట్ నోట్ సిద్ధం చేసి అధికారుల పరిశీలనకు పంపారు. ముందు మా వాటా విడుదల చేయాలి తమకు ఇంకా 17 టీఎంసీలు రావాల్సి ఉందని, తొలుత సాగర్ నుంచి తమ వాటా పూర్తి స్థాయిలో విడుదల చేయాలని డ్రాఫ్ట్ నోట్లో పేర్కొన్నట్లు తెలిసింది. ప్రస్తుతం సాగర్‌లో 507 అడుగుల వద్ద నీటి మట్టాలున్నాయని, అందులో మొదటగా నిర్ణయించిన మేరకు 503 అడుగుల వరకు తమకు విడుదల చేయాలని ఏపీ స్పష్టం చేయనున్నట్లు తెలిసింది. తమ వాటా వినియోగం పూర్తయిన తర్వాతే మరింత దిగువకు వెళ్లే అంశంపై నిర్ణయం తీసుకుం టామని నోట్లో పేర్కొన్నట్లు సమాచారం. బోర్డుకు మంగళవారమే అభిప్రాయం తెలపాల్సి ఉన్నా అధికారుల ఆమోదం తీసుకున్నాక పంపాలన్న నిర్ణయంతో వాయిదా వేశారు. డ్రాఫ్ట్‌ను బుధ లేక గురు వారం బోర్డుకు పంపే అవకాశముందని ఏపీ అధికార వర్గాల ద్వారా తెలిసింది. -
సాగర్‌పై సస్పెన్షన్ వేటు!
సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏలూరు డెప్యూటీ తహసీల్దార్ ఎల్.విద్యాసాగర్‌పై సస్పెన్షన్ వేటు పడినట్టు సమాచారం. ఇటీవల కలెక్టర్, రెవెన్యూ అసోసియేషన్ మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో తాజా వ్యవహారం చర్చనీయాంశమైంది. డెప్యూటీ తహసీల్దార్ హోదాలో విద్యాసాగర్ తమను వేధిస్తున్నారంటూ రేషన్ డిపో డీలర్లు కలెక్టర్ కె.భాస్కర్‌కు శనివారం ఫిర్యాదు చేయడంతో ఆయనను సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. ‘విద్యాసాగర్ మమ్మల్ని ఏమేయ్.. ఒసేయ్ అంటూ అసభ్యంగా మాట్లాడుతున్నారు. ఐదు కిలోల బియ్యం తగ్గినా వేధిస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే డిపోకు తాళం వేస్తానని బెదిరిస్తున్నారు’ అంటూ రేషన్ డీలర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఏలూరు ఆర్డీఓకు ఆదేశాలిచ్చారు. తిట్లు.. వేధింపులు భరించలేకపోతున్నామని ఫిర్యాదు ఏలూరు మండలానికి చెందిన రేషన్ డీలర్లు, గుమాస్తాలు విద్యాసాగర్ పెట్టే బాధలు భరించలేకపోతున్నామని కలెక్టర్ ఎదుట వాపోయారు. తమ తల్లిదండ్రులను సైతం చెప్పుకోలేని విధంగా తిడుతున్నారంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రతి నెలా ఒక్కొక్క రేషన్ డిపో నుంచి రూ.వెయ్యి వసూలు చేస్తున్నారని, లంచం ఇవ్వకపోతే డిపోకు తాళాలు వేస్తామని బెదిరిస్తూ బండబూతులు తిడుతున్నారని వారు ఆరోపించారు. గర్బిణి అని కూడా చూడకుండా తనను నోటికి వచ్చినట్టు దూషించి.. 10 కేజీల బియ్యం ఎందుకు తగ్గాయని నిలదీశారని ఈపిచర్ల గంగ అనే డీలర్ వాపోయారు. బస్తాను ఎలుకలు కొరికివేయడం వల్ల బియ్యం కారిపోయి కింద పడ్డాయని, వాటిని పక్కకు తీసి ఉంచానని, వెనక్కి పంపిద్దామనే ఉద్దేశంతో పంపిణీ చేయకుండా డిపోలోనే ఉంచేసినట్టు చెప్పినా వినకుండా కేసు రాస్తే డిపో రద్దవుతుందని అంటూ బెది రించారని ఆమె ఆరోపించింది. డిపో రద్దయితే జీవనోపాధి పోతుందనే భయంతో రూ.5 వేలను సాగర్‌కు లంచంగా ఇచ్చామని, రెండు రోజుల తరువాత మళ్లీ వచ్చి డిపో రికార్డుల తనిఖీ అంటూ వేధిస్తున్నారని ఆరోపించారు. ‘చంద్రబాబైనా, జిల్లా కలెక్టరైనా నాకు గొప్పకాదు. నేను చెప్పినంత డబ్బు ఇవ్వకపోతే ఏదో పేరుతో డిపోను రద్దు చేయిస్తానని భయపెడుతున్నారు’ అని డీలర్లు ఎస్.సత్యవతి, ఆర్.విమలాదేవి, సుబ్రహ్మణ్యం, సుబ్బారావు, ప్రసాద్, శ్రీరేఖ తదితరులు కలెక్టర్‌కు వివరించారు. తన తల్లి కోడూరు పార్వతి పక్షవాతంతో బాధపడుతోందని, సహాయం గా తాను డిపోలో పనిచేస్తుంటే సాగర్ వచ్చి బినామీ పేరుతో డిపో నడుపుతున్నావంటూ తన తల్లిని బెదిరించారని, కేసు లేకుండా చేయాలంటే రూ.5 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారని డీలర్ కుమార్తె రమాదేవి వాపోయింది. గతంలో కూడా చెప్పడానికి వీలులేని దుర్భాషలాడుతూ.. లంచాలు ఇవ్వకపోతే డిపోకు తాళం వేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని పలువురు డీలర్లు చెప్పారు. కలెక్టర్ స్పందిస్తూ ఎవరికీ, ఏ ఒక్కరూ లంచం ఇవ్వాల్సిన పనిలేదని, ఎవరైనా లంచం అడిగితే తన దృష్టికి తీసుకురావాలని అన్నారు. రేషన్ డిపోల్లో గతంలో అక్రమాలు జరిగేవని, ఈ–పాస్ విధానం అమల్లోకి రావడంతో ఆ పరిస్థితి లేదన్నారు. డీలర్లు ఎవరికీ బయపడాల్సిన పనిలేదని, ఎవరైనా బెదిరిస్తే తన దృష్టికి తీసుకు వస్తే అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఏలూరు ఆర్డీఓను విచారణ అధికారిగా నియమించారు. తక్షణమే నివేదిక సమర్పించాలని కోరారు. ఇదిలావుంటే.. రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడి హోదాలో విద్యాసాగర్ ఇటీవల కలెక్టర్‌కు వ్యతిరేకంగా ఉద్యమించేందుకు సిద్ధమయ్యారు. వర్క్ టు రూల్ పాటిస్తామని ప్రకటించడంతోపాటు కలెక్టర్‌పై ఆరోపణ లు చేశారు. వాటిని కలెక్టర్ తిప్పికొట్టగా, ఆ తర్వాత తహసీల్దార్ల ఒత్తిడితో వర్క్ టు రూల్ చేస్తామన్న అల్టిమేటమ్ నుంచి విద్యాసాగర్ వెనక్కి వెళ్లారు. ఈ నేపథ్యంలో సాగర్‌పై ఒకేసారి డీలర్లంతా వచ్చి ఫిర్యాదు చేయడం చర్చనీయాంశమైంది. -
ఖేలో ఇండియాలో సాగర్ సత్తా
విజయవాడ స్పోర్ట్స్ : గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జరుగుతున్న ఖేలో ఇండియా జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రాష్ట్ర అథ్లెట్ ఎం.సాగర్ ఫాస్టెస్ట్ (100 మీటర్ల పరుగు) రన్నింగ్‌లో రజత పతకం సాధించాడు. అండర్–14 విభాగంలో ఫాస్టెస్ రన్నర్‌గా జార్ఖండ్ అథ్లెట్ నిలువగా, కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం కల్లుదేవకుంటకు చెందిన ఎం.సాగర్ (11.82 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచి రాష్ట్రానికి రజత పతకం సాధించాడు. ఈ సందర్భంగా సాగర్‌ను సాయ్ రీజనల్ డైరెక్టర్ (గుజరాత్) రూప్కుమార్నాయుడు, శాప్ వీసీ అండ్ ఎండీ ఎస్.బంగారురాజు, ఓఎస్డీ పి.రామకృష్ణ అభినందించారు. -
హత్య చేసిందెవరు?
సాగర్, స్వప్నిక జంటగా నండూరి వీరేశ్ దర్శకత్వంలో గూన అప్పారావు నిర్మిస్తున్న ‘సంభవం’ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్ రావు క్లాప్ ఇవ్వగా, మాజీ ఎంపీ ఆవుల వీరశేఖర్ కెమేరా స్విచ్చాన్ చేశారు. వ్యాపారవేత్త బాబా భాయ్ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే హారర్–థ్రిల్లర్ చిత్రమిది. హత్య చేసిందెవరు? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్’’ అన్నారు నండూరి వీరేశ్. ‘‘మా సంస్థ నిర్మించిన ‘లవ్ స్పాట్’, ‘గురుబ్రహ్మ’ చిత్రాల్ని త్వరలో విడుదల చేస్తాం’’ అన్నారు గూన అప్పారావు. -
కనీస నీటి మట్టానికి చట్టబద్ధత కల్పించాలి
కర్నూలు సిటీ: శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం 854 అడుగులు ఉండేలా చట్ట బద్ధత కల్పించాలని రాయ సీమ సాగు నీటి సాధన సమితి కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. శనివారం కర్నూలు నగరానికి వచ్చిన సీఎం చంద్రబాబు.. శ్రీశైలంలో 874 అడుగుల నీటి మట్టం ఉండేలా చర్యలు తీసుకున్న ఘనత టీడీపీదేనని ప్రకటించడం దారుణమన్నారు. శ్రీశైలంలో నీటి మట్టం 875 అడుగలకుపైన ఉన్న సమయంలో మాత్రమే దిగువన ఉన్న సాగర్‌కు నీటిని విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించాలని పేర్కొన్నారు. -
సాగర్ నీటి విడుదలపై స్పష్టత కోరుతూ ధర్నా
వైఎస్సార్సీపీ ధర్నా నేపధ్యంలో దిగి వచ్చిన ప్రభుత్వం హడావిడిగా బుధవారం నీటి విడుదల స్పష్టత లేకపోవడంతో ఎన్నో అనుమానాలు సాక్షి, అమరావతి బ్యూరో: రబీలో సాగర్ కుడికాలువల కింద మాగాణి పంటలకు నీరు ఇవ్వాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు ప్రభుత్వాన్ని ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. సాగర్ నీటి విడుదలపై స్పష్టత లేక పోవడంతో బుధవారం చిలకలూరిపేట, నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, గురజాల, పెదకూరపాడు నియోజక వర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేశారు. ప్రభుత్వతీరును ఎండగట్టారు. నీటి విడుదల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ధర్నా చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి హడావిడిగా బుధవారం ఉదయం 7.30 గంటలకు సాగర్ నీటిని విడుదల చేసింది. అయితే నీరు ఎప్పటి వరకు విడుదల చేస్తారు, ఎన్ని టీఎంసీలు విడుదల చేస్తారో షెడ్యూల్ మాత్రం ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాను విఫలం చేయడానికి నీటిని విడుదల చేసి ప్రభుత్వం మరోసారి రైతులను మోసం చేసిందన్న అనుమానాలు రేకేత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన ధర్నాలో వైఎస్సార్సీపీ నేతలు మాట్లాడుతూ రబీలో మాగాణి పంటలకు నీరు ఇవ్వాల్సిందేననని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరికలు జారీ చేశారు. రబీ సీజన్ ముగిసే వరకు నీరు ఇవ్వాల్సిందే: మర్రి రాజశేఖర్ రబీ సీజన్ ముగిసే వరకు సాగర్ కుడికాలువకు నీరు ఇవ్వాల్సిందేననని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. చిలకలూరిపేట ఎన్ఆర్టీ రోడ్డులోని ఎన్ఎస్పీ కెనాల్స్ డివిజన్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ జలాశయంలో రబీకి సరిపడినంత నీరు ఉన్నా కుడికాలువకు విడుదల చేయకపోవటం ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధర్నాకు పిలుపునివ్వడంతో హడావిడిగా ఆరుతడి పంటలకు నీరు ఇస్తామని చెప్పటం దుర్మార్గంగా ఉందన్నారు. సాగర్ వరకు పాదయాత్ర చేస్తాం: గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి రబీలో మాగాణి భూములకు తగినంత సాగునీరు ఇవ్వాలని నరసరావు పేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరసరావుపేటలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రైతులతో కలిసి ధర్నా చేశారు. నీటి విడుదల విషయంలో స్పష్టత లేకుంటే నరసరావుపేట పార్లమెంటు పరిధిలోని రైతులు, నాయకులతో కలిసి అద్దంకినార్కెట్పల్లి రహదారిపై భారీ రాస్తారోకో చేసి, నాగార్జున సాగర్ డ్యాం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. రైతులతో దోబూచులాడుతున్నారు: అంబటి రాంబాబు స్పీకర్ నవంబరు 1 వతేదీన నీటిని విడుదల చేస్తామని పేర్కొంటే, మంత్రులు ఏకంగా నీటిని విడుదల చేసి రైతులతో దోబూచులాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. అంబటి నేతత్వంలో సత్తెనపల్లి ఎన్ఎస్పీ ఈఈ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. రైతుల ఇబ్బందులను దష్టిలో ఉంచుకొని వారి సమస్యలపై ప్రధాన ప్రతిపక్షం పోరాడుతోందని ఈ సందర్భంగా అంబటి అన్నారు. ప్రభుత్వం మెడలు వంచి నీరు తీసుకొస్తామని, దీనికోసం రాజకీయాల కతీతంగా టీడీపీ రైతులు కూడా కలిసి రావాలన్నారు. ఈ ధర్నాలో సీపీఎం రాష్ట్ర కమిటీæ సభ్యుడు గద్దె చలమయ్య ప్రసంగించారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం: జంగా కష్ణమూర్తి ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగా కష్ణమూర్తి తీవ్రంగా విమర్శించారు. జంగా కష్ణమూర్తి నేతత్వంలో గురజాల డివిజన్ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. రెండేళ్ళుగా రైతులు అతివష్టి, అనావష్టితో అల్లాడుతున్నారని, సాగర్ కుడికాలువకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చి 31వ తేదీ వరకు నీటిని విడుదల చేయాలని లేకపోతే పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అన్నమో రామచంద్రా అని అలమటించాల్సి వస్తోంది: నాగిరెడ్డి చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా అన్నమో రామచంద్రా అని ప్రజలు అలమటించాల్సి వస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వినుకొండ నియోజక వర్గ ఇన్‌ఛార్జి బొల్లా బ్రహ్మనాయుడు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో శివయ్య స్తూపం సెంటర్లో ధర్నా నిర్వహించారు. నాగిరెడ్డి మాట్లాడుతూ నికర జలాలు ఉన్నా సాగర్‌కు ఖరీఫ్‌లో రెండేళ్ళుగా నీరు విడుదల చేయకపోవడం దారుణమన్నారు. బొల్లా బ్రహ్మ నాయుడు మాట్లాడుతూ దాళ్వా పంటకు సాగర్ జలాలు విడుదల చేయకపోతే దూడకు గడ్డి, బిడ్డకు తిండి ఉండని పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందన్నారు. చంద్రబాబుకు వ్యవసాయంపై విశ్వాసం లేదు: కావటి మనోహరనాయుడు చంద్రబాబుకు వ్యవసాయంపై విశ్వాసం లేదని వైఎస్సార్సీపీ పెదకూరపాడు నియోజకవర్గ సమన్వయకర్త కావటి మనోహరనాయుడు అన్నారు. క్రోసూరు మండల కేంద్రంలోని నాగార్జున సాగర్ కార్యాలయం ఎదుట చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎప్పటి దాకా సాగర్ నీళ్లు విడుదల చేస్తున్నదీ స్పష్టం చేయకపోతే∙వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నీటి కోసం ఆందోళన చేపడుతున్నట్లు తెలిసిన వెంటనే ప్రభుత్వం నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించం చూస్తే ఆందోళన చేస్తే తప్ప ప్రభత్వం దిగిరాదని అర్ధం చేసుకోవచ్చునని నన్నారు. పూర్తి స్థాయిలో నీరు విడుదల చేయాలి: పిన్నెల్లి వెంకటరామిరెడ్డి నామ మాత్రంగా కాకుండా వరి సాగుకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాచర్లలో స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పీడబ్ల్యూడీ కాలనీలో కెనాల్స్ విభాగం కార్యాలయం వరకు రైతులు , కార్యకర్తలతో కలిసి ఆయన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ఏడాది కుడికాలువ ప్రయోజనాలను కాపాడకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తామన్నారు. -
బుద్ధవనంలో విదేశీయుల సందడి
నాగార్జునసాగర్: శ్రీపర్వతారామంలోని బుద్ధవనాన్ని శనివారం 14 దేశాలకు చెందిన ప్రతినిధులు సందర్శించారు. ఈ సందర్భంగా 40 అడుగుల బుద్ధుడి విగ్రహాన్ని, మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఫణిగిరితో పాటు, ఖమ్మం జిల్లాలోనే నేలకొండపల్లిని సందర్శించేందుకు వెళ్లారు. సాగర్‌కు వచ్చిన వారిలో ఆస్ట్రేలియాకు చెందిన కుహదాస్ వివేకానంద, జర్మనీకి చెందిన గెర్డ్ మథియాస్ డెకెర్ట్, గ్రీస్‌రం చెందిన తెకహరిదౌఅతనాస్య, ఇటలీకి చెందిన అనియోలోడెల్‌గట్టో, గబ్రీలా, బాల్దిని, ఆంటోనియా అర్టోలెవతో పాటు మలేసియా, నెదర్లాండ్, తైవాన్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. వీరివెంట పర్యాటక సంస్థ జిల్లా మేనేజర్ వెంకటేశ్వర్రావు, గైడ్ సత్యనారాయణ, శ్యాంలు ఉన్నారు. -
సీఎం తీరుతో సాగర్ రైతులకు ఇబ్బందులు
నరసరావుపేట : సీఎం చంద్రబాబు చేతగానితనంతో నాగార్జునసాగర్ కుడికాలువ రైతులు సాగు నీటì æకోసం ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంతో విభేదాలు, కేసులు, సొంత అజెండాతో కేసీఆర్‌తో మాట్లాడలేకపోవటం ఈ దుస్థితికి కారణమని పేర్కొన్నారు. కుడికాలువ ఆయకట్టు రైతులకు రబీ సీజన్లోనైనా సాగర్ ద్వారా నీరందించాలని కోరారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వర్షాభావంతో మినుము ఎండిపోతే అకాలవర్షాల వలన పత్తి, మిర్చి, కంది పంటలు దెబ్బతిన్నాయన్నారు. శ్రీశైలంలో 883 అడుగులకు నీరుచేసి 210 టీఎంసీల నీరు నిల్వ ఉందని చెప్పారు. శ్రీశైలంలో 846 అడుగుల నీరు వస్తేనే నాగార్జునసాగర్‌కు నీరు విడుదల చేయవచ్చని జీవో ఉందన్నారు. చేరిన నీటిలో 70 టీఎంసీలు మంచినీటి కోసం కేటాయించినా ఇంకా 140 టీఎంసీలు అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇంతటి వెసులుబాటున్నా రైతులకు నీరొచ్చేదీ లేనిది స్పష్టత ఇవ్వకపోవటం బాధాకరమన్నారు. డెల్టా తర్వాత అంతటి ప్రాధాన్యమున్న సాగర్ కుడికాలువ ఆయకట్టు రైతులు చంద్రబాబు తీరుతో నష్టపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్ట్‌లు నిర్మిస్తున్నా మాట్లాడలేని పరిస్థితి చంద్రబాబుది అన్నారు. నష్ట పరిహారం సక్రమంగా ఇవ్వకపోతే ధర్నా చేస్తాం భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు పార్టీలు, కులాలు, మతాలకతీతంగా సహాయం చేయాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి డిమాండ్ చేశారు. లేకపోతే తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. జయహో భారత్ ఉగ్రవాదులను మట్టుబెట్టిన భారతీయ జవాన్లకు ఆయన అభినందనలు తెలిపారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ సుజాతపాల్, జిల్లా అధికార ప్రతినిధి పిల్లి ఓబుల్‌రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి జీ గాబ్రేల్, పట్టణ అధ్యక్షుడు ఎస్ఏ హనీఫ్, జిల్లా కార్యదర్శి కందుల యజ్రా, రొంపిచర్ల మండల అధ్యక్షుడు పచ్చవ రవీంద్ర పాల్గొన్నారు. -
చిగురిస్తున్న ఆశలు
– క్రమంగా పెరుగుతున్న సాగర్ నీటిమట్టం – శ్రీశైలం నుంచి 73,840 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో – ఆయకట్టు రైతుల్లో ఆనందం నాగార్జునసాగర్ నాలుగు రోజులుగా శ్రీశైలం జలాశయం నుంచి విడుదలవుతున్న నీటితో సాగర్ జలాశయం క్రమంగా పెరుగుతోంది. 512 అడుగులున్న జలాశయ నీటిమట్టం ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో ప్రస్తుతం 522.20(153.3180టీఎంసీలు)అడుగులకు చేరుకుంది. రెండవ పంటకైనా నీరు వస్తుందని ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వాగులు,వంకలు,ఉపనదులు పొంగిపొర్లుతుండటంతో కృష్ణానదిలోకి నీరు వచ్చి చేరుతోంది. సాగర్ ఎగువ జలాశలయాలైన ఆల్మట్టి,నారాయణపూర్, జూరాల జలాశయాలు నిండుకుండలా ఉన్నాయి. శ్రీశైలం జలాశయం 881.80(197.9120టీఎంసీలు)అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటిమట్టం 885అడుగులు(215టీఎంసీలు). ఎగువ నుంచి 1,20,300క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరదనీరు వస్తుండటంతో విద్యుదుత్పాదన రెండు యూనిట్ల ద్వారా 73,840క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయానికి సోమవారం 1,90వేల మేరకు వరద నీరు రాగా మంగళవారానికి వరద తగ్గుముఖం పట్టింది.ఉదయం 1,40వేల క్యూసెక్కులు రాగా సాయంత్రానికి 1.30వేల వచ్చింది. రాత్రి సమయానికి అది ఇంకా తగ్గింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయం ఎగువ నుంచి వరద వస్తేనే సాగర్ జలాశయంలోకి వరద తీవ్రత పెరిగే అవకాశాలున్నాయి. సాగర్‌కు శ్రీశైలమే ఆధారం నాగార్జునసాగర్ జలాశయం వరద నీటి కోసం శ్రీశైలం జలాశయం మీదనే ఆధారపడాల్సి ఉంది. శ్రీశైలం జలాశయానికి,పులిచింతల ప్రాజెక్టుకు ఉన్నన్నీ ఉపనదులు సాగర్ జలాశయానికి లేవు. స్థానికంగా కురిసిన వర్షాలకు సాగర్‌లోకి ఏ మాత్రం నీరు చేరే అవకాశాలు లేవు. కేవలం డిండి వాగు,ఉప్పాగు,మైనంపల్లివాగులు మినహాయిస్తే సాగర్ జలాశయంలోకి నీరు భారీ స్థాయిలో వచ్చే ఉపనదులు లేవు.సాగర్ ప్రాజెక్టు దిగువన ఆంధ్రావైపు నుంచి వచ్చే, చంద్రవంక వాగు,తెలంగాణ వైపు నుంచి వచ్చి కలిసే అహాల్యవాగు,మూసినీరు ఇలా చాలా ఉపనదుల నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. -
పెరుగుతున్న సాగర్ నీటి మట్టం
కృష్ణా ఎగువ పరీవాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో దిగువ జలాశయాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పాదన అనంతరం శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు 74,140 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయ నీటిమట్టం 519.00 అడుగుల వద్ద ఉంది. ఇది 147.4580 టీఎంసీలకు సమానం. గత ఏడాది ఇదే రోజు సాగర్ నీటిమట్టం 511.00 అడుగుల వద్ద ఉంది. – విజయపురి సౌత్ -
సాగర్‌లో ఏఐఏడబ్ల్యూయూ నాయకులు
నాగార్జునసాగర్: అఖిల భారత వ్యవసాయకార్మిక సంఘం నాయకులు శుక్రవారం నాగార్జునసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. రెండు రోజులుగా నల్లగొండలో జరిగిన జాతీయ కౌన్సిల్ సమావేశాలకు హాజరైన అనంతరం వారు సాగర్‌కు వచ్చారు. ప్రాజెక్టును సందర్శించిన అనంతరం లాంచీలో నాగార్జుకొండకు వెళ్లారు. అనంతరం ఎత్తిపోతల, బుద్దవనం ప్రాంతాలను సందర్శించారు. వీరికి స్థానిక జెన్కో అతిథిగృహంలో మెమొంటోలు అందజేశారు. వీరి వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రాంగారెడ్డి, నాగిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కేవీ. అయిలయ్య, గౌతంరెడ్డి, మునినాయక్‌లు ఉన్నారు. -
సాగర్‌లో సచివాలయ అధికారులు, ట్రైనీ ఐపీఎస్‌ల సందడి
నాగార్జునసాగర్ : హైదరాబాద్ సచివాలయ అధికారులు, ట్రైనీ ఐపీఎస్‌లు ఆదివారం నాగార్జునసాగర్‌ను వేరువేరుగా సందర్శించారు. సెక్రటేరియట్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ముందుగా సాగర్ డ్యాం చూసిన తర్వాత లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి అక్కడ మ్యూజియంను సందర్శించారు. అనంతరం ఎత్తపోతల, బుద్దవనం తదితర ప్రాంతాలను సందర్శించారు. వీరి వెంట కరీంనగర్ జిల్లా డీటీఓ వెంకటేశ్వర్రావు, రాజమౌళి, సత్యం, సత్యనారాయణలు ఉన్నారు. అదే విధంగా పలువురు ట్రైనీ ఐపీఎస్‌లు లాంచీలో నాగార్జునకొండకు వెళ్లి మ్యూజియం, బుద్ధుడికి సంబంధించిన చిత్రాలను పరిశీలించారు. అనంతరం ఎత్తిపోతల చూడడానికి వెళ్లారు. సాగర్‌కు వచ్చిన వారిలో ట్రైనీ ఐపీఎస్‌లు లోకేశ్వర్, వినీత్, విశాల్, రాజ్‌కుమార్, మౌనిక, కృష్ణారావు ఉన్నారు. వీరివెంట మిర్యాలగూడ డీఎస్పీ రామ్మోహన్రావు, హాలియా సీఐ పార్థపారధి, ఎస్ఐ రజనీకర్, ఎస్బీ హెడ్‌కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి, కిషన్‌లు ఉన్నారు. వీరికి గైడ్ సత్యం నాగార్జునకొండ గురించి వివరించారు. -
సాగర్‌ను మండల కేంద్రం చేయాలి
అఖిలపక్షం ఆధ్వర్యంలో వినతులు అందజేస్తున్న జూలకంటి, నోముల, అఖిలపక్ష నాయకులు నాగార్జునసాగర్ : సాగర్‌ను మండల కేంద్రం చేయాలని కోరుతూ అఖిలపక్ష నాయకులు శుక్రవారం సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి నోముల నర్సింహయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డికి, మండలాల పునర్విభజన ప్రత్యేకాధికారులను కలిసి వినతిపత్రాలు అందజేశారు. పెద్దవూర మండలంలోని చింతలపాలెం, నెల్లికల్లు, తునికినూతల గ్రామ పంచాయతీలను తిరుమలగిరిలో కలుపొద్దని విన్నవించారు. ఈ మూడు పంచాయతీలను కలిపి సాగర్‌ను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని కోరారు. సాగర్ 10 కిలో మీటర్ల దూరం ఉంటే తిరుమలగిరి 25కిలో మీటర్లు దూరం అవుతుందన్నారు. దామరచర్ల మండలంలోని నడిగడ్డ మండలాన్ని సాగర్‌లో కలిపితే 36వేల జనాభా అవుతుందని మ్యాప్‌తో కూడిన వివరాలతో విజ్ఞాపన పత్రాలు అందజేశారు. సాగర్‌ను మండల కేంద్రం చేస్తే ప్రభుత్వానికి పైసా ఖర్చు ఉండదని, ఇప్పటికే సాగర్‌లో క్యాంపు కార్యాలయాల పేరుతో అన్ని శాఖలకు ప్రభుత్వ క్వార్టర్లు అలాట్ చేయబడి ఉన్నాయన్నారు. కార్యక్రమంలో పెద్దవూర మండలంలోని మూడు గ్రామపంచాయతీల సర్పంచులు, సాగర్‌కు చెందిన 50 మంది, పెద్దవూర ఎంపీపీ వస్త్రపురి మల్లిక, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కర్ణబ్రహ్మానందరెడ్డి, అఖిలపక్ష నాయకులు కున్‌రెడ్డినాగిరెడ్డి, రమేశ్‌జీ, రంగానాయక్, సునందారెడ్డి, వాసు, చిన్నిరామస్వామి, రామ్మోహన్రావు, బషీర్, రవినాయక్, జానయ్య, కాటు కృష్ణ సర్పంచులు, చంద్రయ్య,ఏడుకొండలు, ధర్మానాయక్ తదితరులు పాల్గొన్నారు. మండలం నుంచి వీడదీయం పెద్దవూర మండలం నుంచి నెల్లికల్లు, చింతలపాలెం, తునికినూతల మండలాలను విడదీయమని అఖిలపక్ష నాయకులకు మంత్రి హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అలాగే నాగార్జునసాగర్‌ను గ్రామ పంచాయతీ చేస్తామని అందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని ప్రజాభిప్రాయం మేరకు ఏదైనా జరుగుతుందన్నారు. సీఎం అపాయింట్మెంట్ దొరక్కపోవడంతో మంత్రిక సమస్యను వివరించారు. -
చదవడం ఇష్టంలేక ఆత్మహత్య
మదనపల్లి రూరల్: చదువుకోవడం ఇష్టంలేక ఓ విద్యార్ధి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలోని మదనపల్లి పట్టణంలోని జవహర్నవోదయ స్కూల్లో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని సుబాష్ రోడ్డులో నివాసముండే సాగర్(16), జవహర్ నవోదయ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. చదువుపై ఆసక్తి లేకపోవడంతో పలుమార్లు ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పాడు. ఈ విషయంలో తల్లి దండ్రులు కోపగించుకున్నట్టు సమాచారం. దాంతో సాగర్ హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. -
నేను కథ చెబుతానంటే పవన్ కల్యాణ్ కాదనరు!
‘‘సాగర్ టీవీ స్టార్‌గా ప్రేక్షకులకు తెలుసు. ఈ చిత్రం విడుదల తర్వాత ఇంకా ఫేమస్ అవుతాడు. అంతలా ఈ చిత్రం కోసం కష్టపడ్డాడు’’ అని దర్శకుడు దయానంద్ రెడ్డి అన్నారు. సాగర్, సాక్షీ చౌదరి, రాగిణి ప్రధాన పాత్రల్లో ఆయన దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ - ‘‘జానీ’ చిత్రం నుంచి ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ ప్రారంభం వరకూ పవన్ కల్యాణ్‌గారి దగ్గర పని చేశా. దర్శకుడిగా నా తొలి చిత్రం ‘అలియాస్ జానకి’. మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నాకు, సాగర్‌కు పరిచయం. అప్పట్లో మేమిద్దరం కలిసి ఓ చిత్రం చేద్దామనుకున్నాం. ఇప్పటికి కుదిరింది. విస్సుగారు సాగర్ కోసమే ఈ కథ రాసినట్టు అనిపించింది. కత్తి పట్టి తిరిగిన కుర్రాడు ఓ అమ్మాయి పరిచయంతో ఎలా మారాడు? మళ్లీ కత్తి పట్టాల్సి వచ్చినప్పుడు ఏం చేశాడు? అన్నదే కథాంశం. నాకు పవన్ కల్యాణ్‌గారు దర్శకత్వ బాధ్యతలు ఇచ్చినా, ఇవ్వకపోయినా.. నేను కథ చెబితే మాత్రం వింటారు. నేను ఆయన కోసం కథ సిద్ధం చేస్తే రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుంది’’ అన్నారు. -
మరో లెవల్‌కి చేర్చే సినిమా : దాసరి
‘‘నో డౌట్... ‘సిద్ధార్థ్’ ఘనవిజయం సాధించడం ఖాయం’’ అని దాసరి కిరణ్‌కుమార్, సాగర్ అంటున్నారు. ఒకరు నిర్మాత... మరొకరు హీరో. మంచి ఫిల్మ్ తీశాననే ఆనందంలో కిరణ్‌కుమార్, మంచి సినిమాలో నటించామనే సంతృప్తితో సాగర్ ఉన్నారు. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్‌పై దయానంద్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ముత్యాల రమేశ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. దాసరి కిరణ్, సాగర్ చెప్పిన విశేషాలు... ♦ విస్సు ఇచ్చిన బలమైన కథకు పరుచూరి బ్రదర్స్ అంతే బలమైన మాటలు ఇచ్చారు. దయానంద్ అద్భుతమైన టేకింగ్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. మణిశర్మ ఇచ్చిన పాటలు, ఎస్. గోపాల్‌రెడ్డి కెమేరా.. అన్నీ అద్భుతంగా ఉంటాయి. లవ్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్ని రకాల అంశాలతో రూపొందిన ఫుల్ మీల్ లాంటి మూవీ ఇది. ♦ ఈ కథకు సాగర్ అయితేనే యాప్ట్ అని తనను హీరోగా తీసుకున్నాం. నా నమ్మకం వమ్ము కాలేదు. యాక్షన్, లవ్, సెంటిమెంట్.. అన్నింట్నీ బ్రహ్మాండంగా పండించాడు. ఈ సినిమా చూసినవాళ్లు సాగర్‌లో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని కచ్చితంగా అంటారు. ♦ మంచి సినిమా తీస్తున్నామనే నమ్మకంతోనే సినిమా మొదలుపెట్టా. ఫస్ట్ కాపీ చూశాక విజయంపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. మంచి సినిమా తీస్తే సరిపోదు.. అది జనాలకు బాగా రీచ్ కావాలనే ఆలోచనతోనే పబ్లిసిటీ పరంగా రాజీపడలేదు. మా రామదూత క్రియేషన్స్ పేరుని మరో లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ♦ కథానాయికలు రాగిణీ నంద్వాని, సాక్షీ చౌదరి అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రాగిణి నటన అందర్నీ హత్తుకుంటుంది. టోటల్‌గా అందరూ ఓన్ చేసుకునే సినిమా ఇది. ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చా - సాగర్ ♦ నటుడు కావాలనే ఆకాంక్ష నాలో కలిగింది నందమూరి తారక రామారావుగారి వల్లే. ఆయన ఆత్మవిశ్వాసం, అంకితభావం, నటుడిగా ఆయన ప్రతిభ నాకు ఆదర్శం. రామారావుగారి తర్వాత నేను బాగా ఇష్టపడింది చిరంజీవిగార్ని. చిన్నప్పుట్నుంచీ నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. కొంచెం పెద్దయ్యాక మనం స్క్రీన్ మీద బాగుంటామా? అని చిన్ని కెమెరాతో చెక్ చేసుకున్నా. ఆ తర్వాత పెద్ద కెమేరాతో. ‘మొగలి రేకులు’టీవీ సీరియల్ నటుడిగా నన్ను అందరికీ దగ్గర చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను వెండితెర వైపు అడుగులు వేసేలా చేసింది. ‘సిద్ధార్థ్’ని ఆదరించి, ఇంకా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నా. ♦ దాసరి కిరణ్‌కుమార్‌గారి లాంటి నిర్మాత దొరకడం లక్ అని చెప్పాలి. ఓ సొంత బ్రదర్ లాంచింగ్ సినిమాని నిర్మించినట్లుగా ‘సిద్ధార్థ్’ని నిర్మించారు. ఇదే బేనర్లోనే నా నెక్ట్స్ సినిమా ‘హరి’ ఉంటుంది. ‘సిద్ధార్థ్’లో ఎన్నారై కుర్రాడి పాత్ర చేశాను. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. యాక్షన్‌తో పాటు లవ్, సెంటిమెంట్.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌కి స్కోప్ ఉన్న కథ ఇది. బేసిక్‌గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి, ఎంత రిస్కీ సీన్ అయినా ఇష్టంగానే ఉంటుంది. మలేసియాలో చేసిన ఛేజింగ్ సీన్ కొంచెం కష్టం అనిపించింది. అయినా చాలా ఎంజాయ్ చేశా. ♦ నాకు ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఆసక్తి. టీవీ సీరియల్ చేసినప్పుడే చాలా ఫిట్‌గా ఉండేవాణ్ణి. అది ఈ సినిమాకి హెల్ప్ అయింది. ప్రత్యేకంగా మేకోవర్ అవ్వాల్సిన అవసరంలేదు. కాకపోతే ఎన్నారై కుర్రాడి పాత్ర కాబట్టి అందుకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను. దయానంద్రెడ్డిగారు సినిమాని చాలా బాగా తీశారు. సక్సెస్ విషయంలో కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదం దక్కుతుందని నమ్ముతున్నాం. -
సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ను మండలం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సాగర్ బంద్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపక్కనే వంటావార్పు చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాగర్ మండలం చేయడం వల్ల దీనిని ఆనుకోని ఉన్న గ్రామాలు, తండాల ప్రజలకు మండలకేంద్రానికి వచ్చేందుకు 25 కిలోమీటర్లదూరం తగ్గుతుందని అన్నారు. మండలం చేసేవరకు ఉద్యమం ఆపేది లేదని నాయకులు తెలిపారు. ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మైత్రివారధికి ఇవతలి వైపున రెండు గంటలపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపక్కనే వంటావార్పు పెట్టి ఆర్డీఓ వచ్చే వరకు కదలమని భీష్మించారు. ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్‌చేశారు. పోలీస్ వాహనంలో తీసుకవెళుతుండగా వాహనానికి అడ్డంగా నినాదాలు చేస్తూ కదలనీయలేదు. ప్రభుత్వానికి పోలీసుల పక్షాన నివేదికను పంపుతామని నచ్చచెప్పి నాయకులను పోలీస్టేషన్‌కు తరలించి వదిలిపెట్టారు. విద్యుత్ టవరెక్కిన నాయకులు సాగర్‌ను మండలం చేయాలంటూ ఓ పక్క రహదారిపై రాస్తారోకో చేస్తుండగా మరోపక్క అఖిలపక్ష నాయకులు రామస్వామి, నందూనాయక్లు ఆర్డీఓ రావాలంటూ విద్యుత్ టవర్ ఎక్కారు. పోలీసులు, యువకులు, నాయకులు వచ్చి బతిమిలాడి టవర్దింపారు. స్వచ్ఛందంగా సాగర్ బంద్ స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే షాపులు, హోటళ్లు, పాఠశాలలు, స్థానిక నాట్కో ఫ్యాక్టరీని మూసివేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో యువకులు కాలనీలలో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కున్రెడ్డి నాగిరెడ్డి, రమేశ్‌జీ, పొదిలశ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మిట్టపల్లిశ్రీనివాస్, సునందారెడ్డి, బషీర్, రంగానాయక్, కృష్ణ, సాంబశివ, కిశోర్, జగదీష్, జంగయ్య, గౌస్, వేణు, రామస్వామి, నాగవర్థన్, సర్పంచులు మేకపోతుల చంద్రయ్య, బూడిదపావిత్రిఏడుకొండలు, లాలునాయక్, హచ్చునాయక్, లక్ష్మీతారాసింగ్, శౌరినాయక్, మునినాయక్, వాల్య, తాతారావు, మల్లన్న, సారమ్మ, రమేశ్‌గౌడ్, నజీర్, మందశాంత, సైదమ్మ, కైకా, శేఖరాచారి, అచ్చమ్మ, జిలానీ, జహంగీర్, నాట్కోప్రసాద్, శ్రీనివాస్, యాదగిరి, యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
సాగర్‌ను మండలకేంద్రం చేయాలని రాస్తారోకో
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్‌ను మండలం చేయాలని బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో సాగర్ బంద్ నిర్వహించారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో చేపట్టారు. రోడ్డుపక్కనే వంటావార్పు చేపట్టారు. ఈసందర్భంగా నాయకులు మాట్లాడుతూ సాగర్ మండలం చేయడం వల్ల దీనిని ఆనుకోని ఉన్న గ్రామాలు, తండాల ప్రజలకు మండలకేంద్రానికి వచ్చేందుకు 25 కిలోమీటర్లదూరం తగ్గుతుందని అన్నారు. మండలం చేసేవరకు ఉద్యమం ఆపేది లేదని నాయకులు తెలిపారు. ఆంధ్రా–తెలంగాణ రాష్ట్రాల మైత్రివారధికి ఇవతలి వైపున రెండు గంటలపాటు రోడ్డుపై రాస్తారోకో చేపట్టడంతో వాహనాలు నిలిచిపోయి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. రోడ్డుపక్కనే వంటావార్పు పెట్టి ఆర్డీఓ వచ్చే వరకు కదలమని భీష్మించారు. ఎస్ఐ రజనీకర్ ఆధ్వర్యంలో పోలీసులు అఖిలపక్షం నాయకులను అరెస్ట్‌చేశారు. పోలీస్ వాహనంలో తీసుకవెళుతుండగా వాహనానికి అడ్డంగా నినాదాలు చేస్తూ కదలనీయలేదు. ప్రభుత్వానికి పోలీసుల పక్షాన నివేదికను పంపుతామని నచ్చచెప్పి నాయకులను పోలీస్టేషన్‌కు తరలించి వదిలిపెట్టారు. విద్యుత్ టవరెక్కిన నాయకులు సాగర్‌ను మండలం చేయాలంటూ ఓ పక్క రహదారిపై రాస్తారోకో చేస్తుండగా మరోపక్క అఖిలపక్ష నాయకులు రామస్వామి, నందూనాయక్లు ఆర్డీఓ రావాలంటూ విద్యుత్ టవర్ ఎక్కారు. పోలీసులు, యువకులు, నాయకులు వచ్చి బతిమిలాడి టవర్దింపారు. స్వచ్ఛందంగా సాగర్ బంద్ స్థానిక ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్ నిర్వహించారు. ఉదయం నుంచే షాపులు, హోటళ్లు, పాఠశాలలు, స్థానిక నాట్కో ఫ్యాక్టరీని మూసివేశారు. అఖిలపక్షం ఆధ్వర్యంలో యువకులు కాలనీలలో బైకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కున్రెడ్డి నాగిరెడ్డి, రమేశ్‌జీ, పొదిలశ్రీనివాస్, రామకృష్ణారెడ్డి, నారాయణరెడ్డి, మిట్టపల్లిశ్రీనివాస్, సునందారెడ్డి, బషీర్, రంగానాయక్, కృష్ణ, సాంబశివ, కిశోర్, జగదీష్, జంగయ్య, గౌస్, వేణు, రామస్వామి, నాగవర్థన్, సర్పంచులు మేకపోతుల చంద్రయ్య, బూడిదపావిత్రిఏడుకొండలు, లాలునాయక్, హచ్చునాయక్, లక్ష్మీతారాసింగ్, శౌరినాయక్, మునినాయక్, వాల్య, తాతారావు, మల్లన్న, సారమ్మ, రమేశ్‌గౌడ్, నజీర్, మందశాంత, సైదమ్మ, కైకా, శేఖరాచారి, అచ్చమ్మ, జిలానీ, జహంగీర్, నాట్కోప్రసాద్, శ్రీనివాస్, యాదగిరి, యూసూఫ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి రోల్స్‌కైనా రెడీ!
‘‘ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. హీరోగా ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా నటుడిగా మంచి పేరు, దర్శక- నిర్మాతల హీరో అనిపించుకోవాలనుంది. ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడా నికి నేను రెడీ’’ అన్నారు సాగర్. ఆయన హీరోగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ ఈ నెల 16న విడుదలవుతోంది. సాగర్ చెప్పిన సంగతులు... ♦ ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో చిన్న పాత్ర చేసి తప్పు చేశాననిపించింది. ప్రేక్షకులు నా నుంచి అలాంటి పాత్రలు ఆశించడం లేదని అర్థమైంది. అదే నన్ను ‘సిద్ధార్థ’ వైపు నడిపించింది. ఈ మేకోవర్ కోసం ఏడాది కష్టపడ్డా. యాక్షన్ సీన్స్ కష్టమైనా ఇష్టపడి చేశా. రిజల్ట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ♦ గౌతమ బుద్ధుడిగా మారిన ‘సిద్ధార్థ’ మనకు తెలుసు. మా ‘సిద్ధార్థ’ లక్ష్యం ఏంటి? అతనేం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఓ ఎన్నారై యువకుడి ప్రేమకథ. ♦ మా చిత్ర దర్శకుడు కేవీ దయానంద్‌రెడ్డి గతంలో పవన్‌కల్యాణ్ టీమ్‌లో పదిహేనేళ్లు పనిచేశారు. ప్రతి విషయంలోనూ ఆయనకు మంచి పట్టుంది. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఏర్పడాలని పరు చూరి బ్రదర్స్, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ, దయా నంద్ వంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఎంతో ప్రేమతో చేసిన చిత్రమిది. ♦ ఓ సినిమా జనాల్లోకి వెళ్లాలంటే.. మూవీ మేకింగ్, ప్లానింగ్, ప్రేక్షకులకు ఏయే అంశాలు నచ్చుతాయనే అంశాలపై అవగాహన ముఖ్యం. మా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అటువంటి వ్యక్తే. మా ఇద్దరి భావాలూ కలిశాయి. నా తదుపరి సినిమా ‘హరి’లో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాను. కిరణ్‌కుమార్ గారి రామదూత క్రియేషన్స్, అవ్యక్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. -
సాగర్ కాల్వలో యువకుడు గల్లంతు
– ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద ఘటన – చెన్నంపల్లెలో విషాదం కొలిమిగుండ్ల: మండల పరిధిలోని ఎస్. చెన్నంపల్లెకు చెందిన యువకుడు హరి(16) శనివారం ప్రకాశం జిల్లా చీమకుర్తి వద్ద ఉన్న నాగార్జున సాగర్ కాల్వలో గల్లంతయ్యాడు. అక్కడి పోలీసులు యువకుడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చెన్నంపల్లెకు చెందిన నందిగం నడిపెన్న, శారద దంపతులకు అరుణ, హరి సంతానం. రెండేళ్ల క్రితం కూతురును అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన రామాంజికిచ్చి పెళ్లి జరిపించారు. అక్కడే వారు సోపాసెట్ల అమ్మకాలు, మరమతుల షాపు నిర్వహిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం రామాంజి జీపులో భార్య అరుణను పుట్టింటి వద్ద వదిలిపెట్టి...బావమర్ది హరితో కలిసి సోపాసెట్ల కొనుగోలుకు హైదరాబాద్ వెళ్తున్నట్లు చెప్పి బయలుదేరాడు. శనివారం ఉదయం ప్రకాశం జిల్లాలోని జలాశయం నుంచి ఒంగోలుకు నీటిని సరఫరా చేసే నాగార్జున సాగర్ కుడికాల్వలో హరి కొట్టుకుపోతున్నట్లు అత్తమామకు ఫోన్ చేసి చెప్పాడు. కుటుంబ సభ్యులు వెంటనే అక్కడకు బయలుదేరి వెళ్లారు. అక్కడి పోలీసులు కాల్వ వెంట గాలింపు చేపట్టారు. అయితే బావమర్ధిని హైదరాబాద్ తీసుకెళ్తున్నట్లు చెప్పిన రామాంజి.. ప్రకాశం జిల్లాలోని కాల్వలో కొట్టుకుపోతున్నట్లు ఫోన్ చేయడంపై బంధువులు, కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
మూడు రోజులైనా నో ‘లిఫ్ట్’
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడిచాయి. కానీ, ఎడమ కాల్వపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు మాత్రం ఇప్పటి వరకు నీటిని విడుదల చేయలేదు. మరమ్మతులు పూర్తయిన ఎత్తిపోతలకు నీటిని విడుదల చేసే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు పరిధిలో పంటలు ఎండిపోతున్నాయని అధికారులు, ప్రజాప్రతినిధులు రైతులతో సమావేశం ఏర్పాటు చేసి ఈనెల 25న నీటిని విడుదల చేశారు. ఎడమ కాల్వ పరిధిలో మొదటి జోన్ (పాలేరు రిజర్వాయర్ వరకు)కు విడతల వారిగా నీటిని విడుదల చేశారు. మొదటి జోన్ పరిధిలోని కాల్వ ద్వారా 2,81,570 ఎకరాలు, ఎడమ కాల్వపై ఉన్న 40 ఎత్తిపోతల పథకాల కింద 81,641 ఎకరాలకు మొత్తం 3,63,211 ఎకరాలకు నీటిని విడుదల చేశారు. దీంతో పాటు ఏఎంఆర్పీతో పాటు ఎడమ కాల్వ పరిధిలోని 93 చెరువులను నింపడానికి ఎన్ఎస్పీ అధికారులు నీటిని విడుదల చేశారు. కాగా, మొదటి విడుతలో పది రోజుల పాటు నీటిని విడుదల చేసిన తర్వాత మరో ఐదు విడుతల్లో 15 రోజుల్లో ఎనిమిది రోజు చొప్పున నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే మొదటి విడతలో ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడిచాయి. కానీ, ఎత్తిపోతల పథకాలకు ఇప్పటి కూడా నీటిని విడుదల చేయలేదు. దీంతో లిఫ్ట్‌ల కింద ఉన్న రైతులు ఆందోళన చెంతున్నారు. -
లిఫ్టులకు నీటిని విడుదల చేయాలి
మిర్యాలగూడ : నాగార్జునసాగర్ ఎడమ కాలువపై ఉన్న ఎత్తిపోతల పథకాలకు నీటిని విడుదల చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ సలీం డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి మూడు రోజులు గడిచినా లిఫ్టులకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. ఆరు విడుతలుగా సాగర్ ఎడమ కాలువ నీటిని విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయించగా మొదటి విడుతలో పది రోజులకు గాను మూడు రోజులు గడిచినా లిఫ్టుకు నీటిని విడుదల చేయడం లేదన్నారు. లిఫ్టులకు కింద సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. సమావేశంలో వేములపల్లి, మిర్యాలగూడ మండల పార్టీ అధ్యక్షులు పెదపంగ సైదులు, పిల్లుట్ల బ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. -
సాగర్‌కాల్వలో పడి విద్యార్థి మృతి
నకరికల్లు (గుంటూరు ): సాగర్‌కాల్వలో పడి విద్యార్థి మృతి చెందాడు. ఈసంఘటన మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో గురువారం జరిగింది. సంఘటనకు సంబంధించి స్ధానికులు∙వివరాలు ఇలాఉన్నాయి. గ్రామానికి చెందిన దాచేపల్లి రంజాన్ షరీఫ్ (12) స్నేహితులతో పాటు గ్రామ సమీపంలోని కాలువ వద్దకు వెళ్లాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడు. ఈత రాకపోవడంతో ఊపిరాడక మృ తిచెందినట్టు చెబుతున్నారు. షరీఫ్ గ్రామంలోని ఉన్నతపాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మికంగా మృతిlచెందడంతో తల్లిదండ్రులు బాబు, జానమ్మలు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
చెరువులను నింపాలని అధికారులకు వినతి
చిలుకూరు: సాగర్ నీటి ద్వారా మండలంలోని అన్ని చెరువులను నింపాలని కోరుతూ బుధవారం ఎన్ఎస్పీ సీఈ సునీల్‌కుమార్ ఎస్ఈ అంజయ్యలకు వినతి పత్రం అందజేసినట్లుగా ఎంపీపీ బొలిశెట్టి నాగేంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆర్కే మేజర్ ఓటి నుంచి 0.594 కిలోమీటర్ వద్ద నూతన తూము ద్వారా ఉన్న జాలు కాలువ నుంచి చిలుకూరు , నారాయణపురం ఊర చెరువును నింపాలని, ముక్యాల కాలువ 5ఎల్ నుంచి ఫీడర్ చానల్ ద్వారా సీతరాంపురం, పాలె అన్నారం చెరువులు, మండలంలోని చెన్నారిగూడెం పరిధిలోని నరసింహులకుంట, రాముల కుంటకు , జెర్రిపోతులగూడెం, మొగిళ్ల కుంట చెరువును ప్రధాన కాలువ నుంచి∙జాలు కాలువ ద్వారా నింపాలని సంబంధిత అధికారులను కోరినట్లుగా తెలిపారు. దాదాపుగా మండలంలోని అన్ని చెరువులను నింపేందుకు ఎన్ఎస్పీ ఆధికారుల సానుకూలంగా స్పందించినట్లుగా తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు, వైస్ ఎంపీపీ వట్టికూటి నాగయ్య చంద్రకళ, బేతవోలు సోసైటీ చైర్మన్ బెక్కం లక్ష్మీనారాయణ, మాజీ సర్పంచ్ బాదె,అంజనేయులు తదితరులు ఉన్నారు. -
నీటిని సద్వినియోగం చేసుకోవాలి
మిర్యాలగూడ : ఖరీఫ్‌లో సాగర్ ఎడమ కాల్వకు విడుదల చేసే నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ పార్లమెంట్ సభ్యులు గుత్తా సుఖేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎన్ఎస్పీ క్యాంపులో ఎన్ఎస్పీ అధికారులు నీటి విడుదల, వినియోగంపై రైతులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడారు. ఇటీవల కృష్ణానది ఎగువ భాగంలో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టులో తెలంగాణ వాటాలో 30 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉందన్నారు. దాంతో ప్రస్తుతం ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంటలను కాపాడేందుకు గాను ఎట్టి పరిస్థితుల్లో నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని, నీటిని వృథా చేయకుండా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. నీటి విడుదలపై జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో నిర్వహించే సమావేశంలో నిర్ణయించనున్నట్లు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నీటి విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉందని అన్నారు. ఈ సందర్బంగా పలువురు రైతులు మాట్లాడుతూ సాగర్ ఎడమ కాల్వకు నిరంతరాయంగా 25 రోజుల పాటు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని కోరారు. కాగా ఎన్ఎస్పీ సీఈ సునిల్, ఎస్ఈ అంజయ్య మాట్లాడుతూ సాగర్ ఎడమ కాలువకు ప్రజాప్రతినిధుల, రైతుల అభిప్రాయం మేరకు 15 రోజుల పాటు నిరంతరాయంగా నీటిని విడుదల చేయాలని, ఆ తర్వాత వారబందీ పద్ధతిలో నీటిని విడుదల చేయడానికి ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్ శ్యాంప్రసాద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహారెడ్డి, వేనేపల్లి చందర్రావు, డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, టీఆర్ఎస్ నాయకులు సాములు శివారెడ్డి, చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, గాయం ఉపేందర్‌రెడ్డి, చిట్టిబాబునాయక్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి రమేష్, ప్రజాప్రతినిధులు, డీసీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. -
సాగర్‌జలాలతో చెరువులు నింపాలి
యాద్గార్పల్లి (మిర్యాలగూడ రూరల్) : నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసి ఆయకట్టు ప్రాంతంలో ఉన్న చెరువులను నింపాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశాడు. సీపీఎం, సీపీఐ, ఎంసీపీఐ, టీడీపీ ఆధ్వర్యంలో సోమవారం మండలంంలో యాద్గార్‌పల్లిలో గల పందిళ్లపల్లి చెరువు (పెద్దచెరువు)లో చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. గత కొన్ని దశాబ్దాలుగా ఎండని యాద్గార్పల్లి చెరువుతోపాటు ఆయకట్టులోని చెరువులన్నీ ఎండిపోడంతో బోర్లు, బావుల్లో భూగ ర్భజలాలు తగ్గాయన్నారను. ఈ నేపథ్యంలో నీటిని విడుదల చేస్తే సాగు, తాగు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి వీరేపల్లి వెంకటేశ్వర్లు, ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి వస్కుల మట్టయ్య, సీపీఐ ,సీపీఎం మండల కార్యదర్శులు బంటు వెంకటేశ్వర్లు, పగిడోజు రామ్మూర్తి, రైతుసంఘం డివిజన్ కార్యదర్శి గార్ల ఇంద్రారెడ్డి, రాయకులు గోవింద రెడ్డి, శ్రీనివాసాచారి, పరశురాములు, గౌతంరెడ్డి, రామకృష్ణ, సీతారాములు, భరత్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాగర్ నీటిని విడుదల చేయాలి
మిర్యాలగూడ: నాగార్జునసాగర్ ఎడమ కాలువకు వెంటనే నీటిని విడుదల చేయాలని టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నామిరెడ్డి యాదగిరిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం పట్టణంలో∙ఏర్పాటు చేసిన విలేకరుల సమావే«శంలో మాట్లాడారు. బోర్లు ఎండిపోయి పత్తి, కంది, పెసర పంటలు ఎండిపోయేస్థితిలో ఉన్నాయన్నారు. ఎండిన పంటలకు నష్టపరిహారంగా ఎకరాకు రూ.10వేలు ఇవ్వాలని కోరారు. బ్యాంకు రుణాలు పూర్తిగా మాఫీ చేసి, రైతులను ఆదుకోవాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి పురుగు మందులను 50శాతం సబ్సిడీతో ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కొండేటి జలంధర్, మిర్యాల మధుసూదన్, రామచంద్రారెడ్డి, రామిరెడ్డి, పందుల జానికిరాములు పాల్గొన్నారు. -
సాగర్ జలాల కోసం ఎదురుచూపు
ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు నూజివీడు : వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే సాగర్ జలాలను విడుదల చేసి పంటలను కాపాడాలని నూజివీడు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. జూలై నెల మొదటి వారంలో కురిసిన వర్షాలకు నూజివీడు, మైలవరం, తిరువూరు నియోజకవర్గాలలోని రైతులు వరి, పత్తి, మిరప, టమోటా తదితర పంటలు సాగుచేశారన్నారు. 50 రోజులుగా చినుకు జాడే లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని చెప్పారు. పది రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయని, దీంతో బోర్ల నుంచి సాగునీరు అందించినా ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. కళ్లెదుటే పంటలు ఎండిపోతుంటే వాటిని ఎలా రక్షించుకోవాలో తెలియక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. జిల్లాకు జలవనరుల శాఖ మంత్రి ఉన్నందున ఇప్పటికైనా తెలంగాణ మంత్రులతో మాట్లాడి మూడో జోన్‌కు సాగర్ జలాలను రప్పించి చెరువులన్నింటినీ నింపాలని కోరారు. -
ఎడమ కాల్వకు నీటిని విడుదల చేయాలి
నేరేడుచర్ల : నాగార్జున్‌సాగర్ ఎడమ కాల్వకు సాగు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం సీపీఎం, వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఐ, టీడీపీ, బీజేపీల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీల నాయకులు మాట్లాడుతూ రెండేళ్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల సాగు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. బోర్లు, బావుల కింద నాట్లు వేసినా భూగర్భ జలాలు అడుగంటడంతో అవి ఎండిపోతున్నాయన్నారు. ప్రభుత్వం తక్షణమే ఎడమ కాల్వకు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇనుపాల పిచ్చిరెడ్డి, బెల్లంకొండ గోవింద్ గౌడ్, సీపీఎం నాయకులు సుంకరి క్రాంతికుమార్, యడ్ల సైదులు, సీపీఐ నాయకులు ధనుంజయనాయుడు, శ్రీను, సత్యం, టీడీపీ నాయకులు కందిబండ పద్మనాభం, ఆదిరెడ్డి, వెంకటరెడ్డి, కాంగ్రెస్ నాయకులు అకారపు వెంకటేశ్వర్లు, భూక్యా గోపాల్, రామకృష్ణ పాల్గొన్నారు. -
ఎంపీలకు సన్మానం
నాగార్జునసాగర్ : కష్ణాపుష్కరాలకు సాగర్‌కు వచ్చిన నల్లగొండ, మల్కాజ్గిరి ఎంపీలను రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం స్థానిక రెడ్డి హాస్టల్ ముందు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. 1,500మంది విద్యార్థులకు రెడ్డిహాస్టల్లో భోజన సౌకర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు వి.సత్యనారాయణరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, డాక్టర్ భాస్కర్‌రెడ్డి, రాయపురెడ్డి, కర్నబ్రహ్మానందరెడ్డి, నర్సిరెడ్డి, కోటిరెడ్డి, నారాయణరెడ్డి, కేశవరెడ్డి, సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ వాయినం..
త్రిపురారం : నాగార్జున సాగర్‌లోని శివాలయం ఘాట్‌లో కృష్ణా పుష్కరస్నానం ఆచరించిన అనంతరం హైదరాబాద్‌లోని దిల్షుక్ నగర్ చెందిన డాక్టర్ శారదా, రంగారెడ్డి జిల్లాలోని కీసర ప్రాంతానికి చెందిన పి.రాజేశ్వరి అక్కడి భక్తులకు, ముత్తదువులకు వాయినం ఇచ్చారు. ‘ఇస్తినమ్మా వాయినం’ అంటూ చీరలు, జాకెట్లు ఉచితంగా దానం చేశారు. ప్రతి పుష్కరాల్లో చీరలు దానం చేయడం తమ కుటుంబ సంప్రదాయమని వారు పేర్కొన్నారు. -
కొత్త బ్రిడ్జి వరకు బస్సులు నడపాలి
నాగార్జునసాగర్ : పుష్కర భక్తుల సౌకర్యార్థం కొత్తబ్రిడ్జి వరకు ఉచిత బస్సులు వెళ్లేలా చూడాలని ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం నాగార్జునసాగర్‌లోని శివాలయం, సురికివీరాంజనేయ స్వామి ఘాట్లను సందర్శించారు. భక్తులతో మాట్లాడారు. వారి ఇబ్బందులను తెలుసుకున్న ఎస్పీ పైవిధంగా స్పందించారు. వెంటనే సాగర్ భద్రతను పరిశీలించే డీస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఘాట్లలోని అధికారులతో కలిసి కోఆర్డినేషన్ మీటింగులు జరపాలన్నారు. -
సాగర్ కుడికాలువకు జలకళ
మాచర్ల : సాగర్ జలాశయం నుంచి ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం కుడికాలువకు బుధవారం నీటిని విడుదల చేశారు. దీంతో ఉదయం నుంచి కుడికాలువలో సాగర్ నుంచి బుగ్గవాగు రిజర్వాయర్ వరకు జలకళ సంతరించుకుంది. ప్రకాశం జిల్లా తాగునీటి అవసరాల నిమిత్తం 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కోరింది. దీనికి స్పందించిన బోర్డు 3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సాగర్ కుడికాలువ గేట్లు ఎత్తి 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రతి రోజు ఐదువేల క్యూసెక్కుల చొప్పున మూడు టీఎంసీల నీటిని విడుదల చేయడం జరుగుతుందని సాగర్ కెనాల్స్ విభాగ ఈఈ జబ్బార్, డీఈ నిమ్మగడ్డ వెంకటేశ్వరరావు తెలిపారు. తాగునీటి అవసరాల నిమిత్తం కాలువకు విడుదల చేయడంతో మళ్లీ ఈ ప్రాంతం భూగర్భ జలాలు పెరుగుతాయని ప్రజలు ఆనందం వ్యక్తం చే స్తున్నారు. -
సాగర్‌లో మంత్రుల ఘోరావ్
హాలియా : కృష్ణాపుష్కరాల సందర్భంగా నాగార్జునసాగర్‌లో మీడియా ప్రతినిధులపై పోలీసులు పెడుతున్న ఆంక్షలకు నిరసనగా మంగళవారం శివాలయం ఘాట్ వద్ద మీడియా ప్రతినిధులు రాష్ట్ర మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిల ఘఘోరావ్ చేశారు. ఈసందర్భంగా మీడియా ప్రతినిధులు మాట్లాడుతూ తమపై పోలీసులు ఆంక్షలు విధించడమే కాకుండా గుర్తింపు పాస్‌లు ఉన్నప్పటికీ ప్రతి చెకింగ్ పాయింట్ వద్ద ఆపి ఇబ్బందులకు గురిచేస్తున్నారని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. దీంతో స్పందించిన మంత్రులు మీడియా ప్రతినిధులను అన్ని ఘాట్లకు అనుమతించాలని ఆదేశించారు. -
ఇప్పటికి ఆ ఆలోచన లేదు!
‘‘నాకు ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేదు. 2003లో ఇండస్ట్రీకొచ్చినప్పుడు ఐదారేళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నా. దీంతో బ్యాక్ టు సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నా. ఆ పరిస్థితుల్లో ‘చక్రవాకం’ సీరియల్ నాకు మంచి బ్రేక్ ఇచ్చింది’’ అని చెప్పారు నటుడు సాగర్. ఆర్కే నాయుడు, మున్నాగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడైన సాగర్ హీరోగా నటించిన చిత్రం ‘సిద్ధార్థ’. సాగర్, సాక్షీ చౌదరి, రాగిణి ప్రధాన పాత్రల్లో కేవీ దయానంద్ రెడ్డి దర్శకత్వంలో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రవిశేషాలను సోమవారం పాత్రికేయుల సమావేశంలో సాగర్ పంచుకున్నారు... అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కథ ఉంటుంది. యాక్షన్ నేపథ్యంలోనే ప్రేమకథ కూడా ఉంటుంది. కథానుగుణంగా ఇరవై ఐదురోజులు మలేసియాలో చిత్రీకరణ జరిపాం. ప్రేక్షకులకు ఎక్కడా బోర్ అనిపించకుండా కమర్షియల్ ఫార్మాట్లో తెరకెక్కించాం. ఆడియన్స్ డిజప్పాయింట్ కారు స్మాల్ స్క్రీన్ అయినా, బిగ్ స్క్రీన్ అయినా నటనలో పెద్దగా తేడా అనిపించలేదు. టీవీ కంటే సినిమాకు హై టెక్నికల్ వేల్యూస్ ఉంటాయి. ఈ చిత్రంలో పాటలు సందర్భోచితంగా ఉంటాయి. దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించారు. నిర్మాత ఖర్చు, క్వాలిటీ విషయంలో రాజీ పడలేదు. ఈ చిత్రానికి ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ, పరుచూరి బ్రదర్స్ వంటి సీనియర్లు పనిచేయడం నా అదృష్టం. ఈ నెల 22న టీజర్, నెలాఖరులో పాటలు, సెప్టెంబరులో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం. మళ్లీ సీరియల్స్‌లో నటించమని అడుగుతున్నారు. ఇప్పటికి ఆ ఆలోచన లేదు. ప్రస్తుతానికి నా దృష్టి సినిమాలపైనే ఉంది. మంచి పాత్రలు వస్తే ఇతరుల చిత్రాల్లోనూ చేస్తా. సొంత ప్రొడక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. -
పుష్కరం.. పాపాహరణం
–పుష్కర స్నానంతో సకల పాపాలు మటుమాయం –మహాపుణ్య ఫలం.. –ఇప్పటి వరకు మూడు పుష్కరాలు చూశా –2004లో పుష్కరాలకు భక్తులు పోటెత్తారు –‘సాక్షి’తో శివాలయం ప్రధాన అర్చకుడు జూనోతుల సుధాకరశాస్త్రి కోట్లాది ప్రజలు భక్తితో వేచి చూస్తున్న కృష్ణా పుష్కరాలకు సమయం ఆసన్నమైనది. మహిమాన్వితమైన కృష్ణా నదిలో పుష్కర స్నానం ఆచరిస్తే మహా పుణ్యఫలం దక్కుతుంది. దీర్ఘకాలిక రోగాలు మటుమాయమవుతాయి. కోటి జన్మల్లో చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి. నదీతీరంలో తపుస్సు, కురుక్షేత్రంలో దానం, కాశి క్షేత్రంలో మరణం పొందినంత ఫలితం ఉంటుంది’ అంటున్నారు నాగార్జునసాగర్ కృష్ణా నదితీరంలోని శివాలయం ప్రధాన అర్చకుడు జూనొతుల సుధాకరశాస్త్రి. మరో పది రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తన పుష్కర అనుభవాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆయన మాటల్లోనే.. –నాగార్జునసాగర్ పుష్కరమంత్రం : ‘పిప్పలాదా త్సముత్పనే– కృత్త్యేలోకే భయంకరే మృత్తికాంతే మయాదత్త మహారార్ద ప్రకల్పయ అస్యాం మహానద్యాం సమస్త పాపాక్షయార్దం కన్యాగతే దేవగురౌ సార్ధ త్రికోటి తీర్థ సహిత,తీర్థ రాజ సమాగ మాఖ్య మహాపర్వణి పుణ్యకాలే కృష్ణానదీ స్నానమహం కరిష్యే! అని మూడుసార్లు తూర్పుగా తిరిగి మూడుమునకలు వేయాలి (అంటే నదీ స్నానమును ఎల్లప్పుడూ గోచి పెట్టుకోని చేయాలి. మలమూత్ర విసర్జనములు నీటిలో చేయరాదు. ఉమ్మి వేయకూడదు) 1980లో వేళ్లమీద లెక్కపెట్టే భక్తులు సాగర్‌లోని కృష్ణా నది తీరంలో శివాలయ నిర్మాణం జరిగినప్పటి నుంచి ప్రధాన అర్చకులుగా పని చేస్తున్నాను. ఇప్పటి వరకు మూడు పుష్కరాలు చూశాను. 1980 పుష్కరాల సమయంలో వేళ్లమీద లెక్కపెట్టే స్థాయిలో భక్తులు వచ్చారు. 1992లో సౌకర్యాలు సరిగా లేకున్నా భక్తులు భారీగానే వచ్చారు. కృష్ణలో స్నానాలు చేసి స్వర్గస్తులైన వంశ కుటుంబ సభ్యులకు పిండప్రధానాలు చేసి ముక్తి పొందారు. 2004లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సాగర్‌లో నాలుగు పుష్కరఘాట్లు నిర్మాణం చేయించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించారు. దీంతో పుష్కరస్నానంపై ప్రజలకు అవగాహన వచ్చింది. సాగర్‌కు లక్షల సంఖ్యలో భకుల్తు పోటెత్తారు. మెుదట ఘాట్లలో నీరు లేనప్పటికీ పుష్కరాలు పూర్తయ్యేలోపు నదిలోకి నీటి విడుదల జరిగింది. దేవతలతో పాటు భక్తుల పుణ్యస్నానం ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం మొదలుతో పుష్కరం ప్రారంభం అవుతుంది. అదే నెల 23న సూర్యాస్తమయం వరకు భక్తులు పుష్కర స్నానం ఆచరించవచ్చు. గురువు(బృహస్పతి) కన్యారాశిలో ప్రవేశించినప్పుడు పుష్కర సమయం ప్రారంభమవుతుంది. పుష్కర సమయం ప్రారంభంలో ముక్కోటి దేవతలు నదిలో స్నానాలు ఆచరిస్తారు. పుష్కరాలు జరిగే 12 రోజులు ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఈ రోజుల్లో ముక్కోటి దేవతామూర్తులు స్నానమాచరించే సమయంలో భక్తులు సైతం పుష్కర స్నానాలు చేయడం ద్వారా ఎంతో పుణ్యం లభిస్తుంది. చేయాల్సిన దానాలు నదిలో స్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు పుష్కరాలు జరిగే 12రోజుల పాటు దానధర్మాలు చేస్తే పుణ్యఫలం దక్కుతుంది. 1వ రోజు : బంగారం, వెండి, ధాన్యం, భూమి అన్నదానం చేయాలి 2వ రోజు : ఆవు, రత్నాలు, ఉప్పు 3వరోజు : పండ్లు, కూరలు, బెల్లం, వెండితో చేసిన గుర్రం బొమ్మ 4వ రోజు : నెయ్యి, నూనె, తేనే, పాలు, చెక్కెర 5వ రోజు : ధాన్యం, పండ్లు, గేదెలు, నాగలి 6వ రోజు : మంచి గంధపు చెక్క, కర్పూరం, కస్తూరి, ఔషధాలు 7వ రోజు : ఇల్లు, వాహనం, కూర్చునే ఆసనం 8వ రోజు : పూలు, అల్లం, గంధపు చెక్క 9వ రోజు : కన్నాదానం, పిండప్రదానం 10వ రోజు : హరిహరపూజ, లక్ష్మీపూజ, గౌరిపూజ, నదిపూజ 11వ రోజు : వాహనం, పుస్తకాలు, తాంబూలం 12వ రోజు : నువ్వులు, మేకలను పేదవారికి దానం చేస్తే పుణ్యం కలుగుతుంది. -
సాగర్‌కు 10 టీఎంసీలు
శ్రీశైలం నుంచి విడుదల చేసేందుకు ఏపీ సర్కారు ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 10 టీఎంసీలు నాగార్జునసాగర్‌కు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు బుధవారం అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాల కోసం సాగర్ కుడి కాలువకు 4 టీఎంసీలు విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరిన విషయం విదితమే. ఈ మేరకు నీటిని విడుదల చేయాలని బోర్డు తెలంగాణను కోరింది. అయితే శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేస్తేనే సాగర్ కుడి కాలువకు నీళ్లిస్తామని తెలంగాణ మంగళవారం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో బుధవారం విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు తో జలవనరుల శాఖ ఈఎన్సీ వెంకటేశ్వరరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీశైలం నుంచి సాగర్‌కు 10 టీఎంసీలు విడుదల చేయాలని నిర్ణయించారు. -
పాత బైపాస్కు పునర్వైభవం
నాగార్జునసాగర్ : సాగర్‌లోని పైలాన్ ముత్యాలమ్మ గుడి నుంచి శివంహోటల్ వరకు గల రోడ్డుకు పునర్ వైభవం రానుంది. ఈ రోడ్డును పునరుద్ధరించి బైపాస్‌గా మారిస్తే హిల్‌కాలనీ రహదారులపై రద్దీ తగ్గుతుందని సాక్షి ప్రచురించిన కథనాలకు అధికారులు స్పందించారు. ముత్యాలమ్మగుడి దగ్గరినుండి శివం హోటల్ వరకు 5.8 కిలో మీటర్లు బీటీ వేసేందుకు రూ.2.77 కోట్లతో టెండర్లు పిలిచి ఆపనులను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఆగస్టు 5వ తేదీ లోగా పూర్తయ్యేలా పనులను చురుగ్గా నిర్వహిస్తున్నారు. -
పుష్కరాలకు ఉచిత బస్సులు
నాగార్జునసాగర్ : కృష్ణా పుష్కరాలకు పొట్టిచెలిమ నుంచి కృష్ణా తీరంలోని స్నానఘాట్ల వరకు ఉచితంగా బస్సులు నడపనున్నట్లుగా నల్లగొండ ఆర్టీసీ డిపో మేనేజర్ జె.వి.బాబు తెలిపారు. గురువారం నాగార్జునసాగర్‌లోని పుష్కరఘాట్లు, హిల్‌కాలనీ, పైలాన్‌కాలనీ బస్టాండ్లను సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నల్లగొండ, హైదరాబాద్, మిర్యాలగూడ, సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులు పొట్టిచెలిమ వరకు వచ్చి తిరిగి వెళ్తాయన్నారు. అక్కడ ఏర్పాటు చేసే పార్కింగ్ స్థలంలో బస్సులు ఆగుతాయన్నారు. భక్తులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఆయన వెంట అసిస్టెంట్ జిల్లామేనేజర్ లావణ్య తదితరులు ఉన్నారు. -
గడువులోగా పుష్కర పనులు పూర్తి
నాగార్జునసాగర్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా నిర్వహించే కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. సాగర్‌లోని విజయవిహార్ సమావేశ మందిరంలో మంగళవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో పుష్కర పనులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. పుష్కర భక్తుల సౌకార్యార్థం నూతనంగా రహదారుల నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ పనులు చేపట్టినట్లు తెలిపారు. రెండు జిల్లాలో కలిపి 53 ఘాట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆ ఘాట్లన్నీ గడువులోపే పూర్తవుతాయని వెల్లడించారు. రోడ్లు కొంత మేరకు పనులు వెనుకబడి ఉన్నప్పటికీ అధికారులు అందించిన వివరాల ప్రకారం ఆగస్టు 5వ తేదీ వరకు పూర్తికానున్నట్లు తెలిపారు. ఘాట్ల వద్ద భక్తులకు తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు నిర్మించినట్లు తెలిపారు. నల్లగొండ జిల్లాలో కృష్ణా నది 120 కిలోమీటర్లు ప్రవహిస్తుండగా 28 ఘాట్లు నిర్మించినట్లు వివరించారు. మహాబూబ్‌నగర్‌లో 25 ఘాట్లు నిర్మించినట్లు తెలిపారు. గత గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని ఆ అనుభవాలను జోడించి భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు వివరించారు. సమావేశంలో డీజీపీ అనురాగ్‌శర్మ, జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సత్యనారాయణ, మహబూబ్‌నగర్ ఎస్పీ రమారాజేశ్వరి, జిల్లా ఎస్పీ ప్రకాశ్‌రెడ్డి, ఎస్ఈలు ధర్మానాయక్, రమేశ్, జిల్లాపరిషత్ సీఈఓ మహేదంర్‌రెడ్డి పాల్గొన్నారు. -
గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పైలాన్‌కాలనీ(నాగార్జునసాగర్) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో గిరిజనుల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారని ఎమ్మెల్సీ సఫావత్ రాములునాయక్ అన్నారు. ఆదివారం పైలాన్ కాలనీలోని జెన్కో అతిథి గృహంలో గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేశవ్అజ్మీరా ఆధ్వర్యంలో జరిగిన నాగార్జునసాగర్ నియోజకవర్గ బంజారభేరీ సదస్సులో పాల్గొని మాట్లాడారు. 500మంది జనాభా ఉన్న ప్రతితండాను గ్రామపంచాయతీ చేయడం, తండాల్లోని ఆలయాల్లో పూజలు చేసే బావోజీలకు దూపదీపనైవేద్యం కింద ఆరువేలు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖతతో ఉందన్నారు. జానాభా ప్రాతిపదికన 12శాతం రిజర్వేషన్ అమలు చేయడం, అటవీభూములకు హక్కులు కల్పించడం అంశాలపై మేథోమదనం జరుగుతుందని తెలిపారు. సమావేశానికి ముందే బంజారాభేరీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఆయనతో పాటు గిరిజన ఐక్యవేదిక అధ్యక్షులు నాగార్జుననాయక్, రతన్‌సింగ్‌నాయక్, చంధ్రమౌళినాయక్, శ్రీనివాసాయక్, శంకర్‌నాయక్, ధన్‌సింగ్‌నాయక్, దేశ్యానాయక్, చందూనాయక్, చిన్నానాయక్ తదితరులు పాల్గొని మాట్లాడారు. -
కుటుంబంలో చిచ్చు రేపిన వివాహేతర సంబంధం
పిల్లలను వదిలి ప్రేమికుడితో వెళ్లిన వివాహిత ప్రియుడు హ్యాండివ్వడంతో తిరిగి భర్త చెంతకు భర్త అంగీకరించకపోవడంతో ఆస్తిలో వాటా ఇవ్వాలని డిమాండ్ మండ్య: పరపురుషుడి వ్యామోహంలో పడిన ఓ వివాహిత భర్తను, పిల్లలను వదిలి ప్రియుడితో వెళ్లింది. కొన్ని రోజుల తర్వాత సదరు ప్రియుడు హ్యాండ్ ఇవ్వడంతో తిరిగి భర్త వద్దకు చేరుకుంది. తనతో కాపురం చేయకపోతే డబ్బులివ్వాలని డిమాండ్ చేస్తోంది. అయితే తనను వదిలి వెళ్లిన భార్యను స్వీకరించేది లేదని భర్త చెబుతున్నారు. పోలీసుల కథనం మేరకు.. మహిళ రశ్మి అలియాస్ లక్ష్మి, ఆమె భర్త శశిలు తమ పిల్లలతో కలిసి మండ్యలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్నారు. ఈ క్రమంలో రశ్మికి ఎదురింట్లో నివాసమున్న సాగర్‌కు పరిచమేర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈక్రమంలో భర్తను వదిలి సాగర్‌తో వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంది. దీంతో భార్య,భర్తల మధ్య గొడవలు మొదలయ్యి శశి బంధువులు సాగర్‌కు దేహశుద్ధి చేయడంతో వ్యవహారం పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసుల సమక్షంలోనే తనకు భర్త శశితో ఉండడం ఇష్టం లేదని సాగర్‌ను పెళ్లి చేసుకొని అతనితోనే జీవిస్తానని రశ్మి చెప్పడంతో శశి కూడా అంగాకరించాడు. ఇకపై రశ్మికి,తనకు సంబంధం లేదని తేల్చి చెప్పాడు. ఇది జరిగిన కొద్ది రోజుల అనంతరం రశ్మి ప్రేమికుడు జరుగుతున్న పరిణామాలతో బెదిరిపోయి పారిపోయాడు. దీంతో రశ్మి పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోవడంతో తిరిగి భర్త వద్దకే చేరుకుంది. ఇకపై భర్తతోనే ఉంటానని, అందుకు ఒప్పుకోకుంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని ఇంట్లో తిష్టవేసింది. దీంతో ఏమి చేయాలో తోచని స్థితిలో రశ్మిపై అమె భర్త శశి పోలీసులకు ఫిర్యాదు చేసాడు. కాగా ప్రజలు మందు, మీడియా ముందు తనను తన పిల్లను వదిలేసి వెళ్లిన రశ్మిని తిరిగి భార్యగా స్వీకరించేది లేదని ఆమె భర్త శశి తేల్చి చెప్పారు. -
హితుడా? హంతకుడా?
పట్టుకోండి చూద్దాం కేరళలోని ఓ కొండప్రాంతం... జనం గుమిగూడి ఉన్నారు. అందరూ కొండ మీద నిలబడి కింద ఉన్న లోయలోకి చూస్తున్నారు. వాళ్ల మధ్య నిలబడిన ఓ వ్యక్తి ‘సాగర్’ అని అరుస్తూ ఏడుస్తున్నాడు. అందరూ అతణ్ని ఓదార్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘‘ఏమైంది’’ అన్నాడు ఇన్స్పెక్టర్ వస్తూనే. ‘‘నా ఫ్రెండ్ సర్. ట్రెక్కింగ్ చేస్తూ లోయలోకి పడిపోయాడు. తనని కాపాడండి సర్. వెంటనే వెతకండి సర్’’ అంటూ మరింత బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టాడతను. ‘‘ఏడవకండి. అసలేం జరిగిందో వివరంగా చెప్పండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘మాది హైదరాబాద్ సర్. నా పేరు వినీత్. నేను నా ఫ్రెండ్ సాగర్ టూర్‌కి వచ్చాం. ఇందాక మేం ట్రెక్కింగ్ చేస్తుంటే నా ఫ్రెండ్ సాగర్ నడుముకి కట్టుకున్న బెల్ట్ ఊడిపోయింది. దాంతో తను జారి లోయలోకి పడిపోయాడు సర్.’’ లోయలోకి తొంగి చూశాడు ఇన్స్పెక్టర్. చాలా లోతు ఉంది. పడితే బతికే చాన్సే లేదు. అయినా అలా అనలేదు. ‘‘నేను వెతికిస్తాను, మీరు ధైర్యంగా ఉండండి’’ వెళ్లిపోయాడు. రెండు రోజులు గడిచినా సాగర్ సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ దొరకలేదు. దాంతో పోలీసులు వినీత్‌ని వెళ్లిపొమ్మన్నారు. ఏదైనా ప్రోగ్రెస్ ఉంటే తెలియజేస్తామన్నారు. దాంతో భారమైన మనసుతో హైదరాబాద్ బయలుదేరాడు వినీత్. రెండు రోజుల తర్వాత... సీరియస్‌గా ఫైల్ తిరగేస్తున్న ఇన్స్పెక్టర్ అభిమన్యును ఫోన్ రింగయిన శబ్దం డిస్టర్బ్ చేసింది. ‘ప్చ్’ అని విసుక్కుంటూ ఫోన్ తీసి హలో అన్నాడు. ‘‘నేను కేరళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాను మిస్టర్ అభిమన్యూ. ఇక్కడ లోయలో ఒక వ్యక్తి మృతదేహం దొరికింది. అతను హైదరాబాద్‌కి చెందినవాడే. తన ఫ్రెండ్‌తో పాటు టూర్‌కి వచ్చాడు. ట్రెక్కింగ్ చేస్తూ లోయలో పడిపోయాడు. దాంతో అతని ఫ్రెండ్ కంప్లయింట్ ఇచ్చాడు. రెండు రోజులు వెతికినా దొరక్కపోవడంతో అతన్ని వెళ్లిపొమ్మన్నాం. ఈరోజు ఉదయం డెడ్‌బాడీ దొరికింది. బాడీని హైదరాబాద్ పంపిస్తున్నాం. కాస్త మీరిది డీల్ చేయాలి’’ చెప్పాడు ఫోన్ చేసిన వ్యక్తి. ‘‘ష్యూర్... అది నా బాధ్యత’’ అన్నాడు అభిమన్యు. అవతలి వ్యక్తి చెప్పిన మిగతా వివరాలు కూడా విని ఫోన్ పెట్టేశాడు. కాసేపట్లో మృతుడి ఫొటోతో పాటు అతడి వివరాలు కూడా ఫ్యాక్స్‌లో వచ్చేశాయి. ఇరవై తొమ్మిదేళ్ల వయసు. దగ్గర దగ్గర ఆరడుగుల పొడవున్నాడు. చనిపోయినప్పుడు నల్లరంగు ప్యాంటు, లేత నీలం రంగు చొక్కా వేసుకున్నాడు. చనిపోయి అయిదు రోజులు కావడంతో మృతదేహం పాడైపోయి పోలికలు తెలియడం లేదు. కానిస్టేబుల్ని పిలిచాడు అభిమన్యు. మృతుడి వివరాలిచ్చి, ‘‘అతని కుటుంబానికి విషయం తెలియజెయ్యండి. అలాగే అతని ఫ్రెండ్‌కి కూడా’’ అని ఆదేశించాడు. ‘‘బాబూ సాగర్’’... మృతదేహం చూస్తూనే దిక్కులు పిక్కటిల్లేలా అరిచింది తల్లి. ‘‘తండ్రి లేని పిల్లాడని కళ్లలో పెట్టుకుని పెంచుకున్నాను. వాడే ప్రపంచం అనుకున్నాను. ఇప్పుడు నాకు దిక్కెవరు’’ అంటూ ఆ ముసలి తల్లి కన్నీరు మున్నీరవుతుంటే అందరి మనసులూ తల్లడిల్లాయి. అయ్యోపాపం అన్నట్టుగా చూస్తున్నారంతా. సాగర్ తల్లిని ఓ వ్యక్తి ఓదారుస్తున్నాడు. ‘‘సర్... అతనే వినీత్. సాగర్‌తో కేరళ వెళ్లిన వ్యక్తి’’ అన్నాడు కానిస్టేబుల్ కామేష్. అలాగా అన్నట్టు తలూపాడు అభిమన్యు. అంతక్రియలు పూర్తయ్యేవరకూ అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత వినీత్ దగ్గరకు వెళ్లి అన్నాడు... ‘‘వినీత్... మీరో సారి స్టేషన్‌కు వస్తే స్టేట్మెంట్ తీసుకోవాలి.’’ ‘‘ఇంకా ఏం తీసుకుంటారు సర్ స్టేట్ మెంట్? చూస్తున్నారుగా మా పరిస్థితి? వాడు నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను వదిలేసి వెళ్లిపోయాడు. పాపిష్టివాణ్ని. నేనే తనని పట్టుబట్టి టూర్‌కి తీసుకెళ్లాను. నావల్లే వాడికిలా అయ్యింది. నా పాపం ఊరికే పోదు.’’ ‘‘అవును... మీ పాపం ఊరికే పోదు.’’ ఉలిక్కిపడ్డాడు వినీత్. ‘‘ఏమంటున్నారు?’’ అన్నాడు అయోమయంగా. ‘‘ఏమంటాను? స్నేహితుణ్ని నమ్మించి, ఊరు గాని ఊరు తీసుకెళ్లి, కొండమీద నుంచి తోసేసి క్రూరంగా చంపేసిన పాపం ఊరికే ఎలా పోతుంది అంటున్నాను.’’ అవాక్కయిపోయాడు వినీత్. ‘‘నేను నేను’’ ‘‘ఇక తప్పించుకోలేవు వినీత్. నాకు బలమైన సాక్ష్యం దొరికింది. ఇదిగో’’ అన్నాడు అభిమన్యు. అతని చేతిలో తన రిటర్న టికెట్ చూసిన వినీత్ నీరుగారిపోయాడు. మౌనంగా పోలీసుల వెంట నడిచాడు. ఇంతకీ ఆ టికెట్లో ఏముంది? అది చూసి వినీత్ హంతకుడని అభిమన్యు ఎలా కనిపెట్టాడు?! జవాబు: ఇన్స్పెక్టర్కి రిటర్న టికెట్ దొరికింది కదా! దానిమీద కేరళ వెళ్లినప్పుడు బుక్ చేసిన టికెట్ మీద ఏ డేటు ఉందో అదే ఉంది. అంటే రాను పోను ఒకేసారి బుక్ చేశాడు వినీత్. మరి రిటర్న టికెట్ తనకు మాత్రమే చేశాడంటే సాగర్ తనతో తిరిగి రాడనే కదా! దాన్ని బట్టి అతణ్ని చంపేయడానికి ముందే స్కెచ్ వేశాడని అర్థమవుతోంది. -
వీడియో ఆధారంగా ఓ అభిప్రాయానికి రాలేం
శ్రుతి, సాగర్ ఎన్కౌంటర్ కేసులో హైకోర్టుకు విన్నవించిన ఎయిమ్స్ సాక్షి, హైదరాబాద్: వరంగల్ జిల్లా తాడ్వాయి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన శ్రుతి, విద్యాసాగర్‌లకు స్థానిక వైద్యులు పోస్టుమార్టం నిర్వహణకు సంబంధించిన వీడియో ఆధారంగా నిర్దిష్ట అభిప్రాయానికి రావడం సాధ్యం కాదని ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (ఎయిమ్స్) వైద్యులు తేల్చి చెప్పారు. పోస్టుమార్టం నిర్వహించిన వైద్య బృందంతో చర్చించిన తరువాతనే ఓ అభిప్రాయానికి రాగలమని హైకోర్టుకు నివేదించారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు... ఎయిమ్స్ వైద్యులు కోరుతున్న విధంగా పోస్టుమార్టం తాలూకు డాక్యుమెంట్లు, దాన్ని నిర్వహించిన వైద్యుల ఫోన్ నంబర్లు, ఎఫ్ఐఆర్ తదితర వివరాలు పంపాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అన్నింటినీ పరిశీలించి జూన్ 15 లోపు అభిప్రాయాన్ని తెలియచేయాలని ఎయిమ్స్ వైద్యులను ఆదేశించింది. ఈ వ్యవహారంలో సమన్వయ బాధ్యతలను ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది శరత్‌కుమార్‌కు అప్పగిస్తూ, తదుపరి విచాణను జూన్ 20కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎయిమ్స్ వైద్యులు ఇచ్చే నివేదికను సీల్డ్ కవర్లోనే అందచేయాలని శరత్‌కు ధర్మాసనం స్పష్టం చేసింది. -
హీరోగా మరో కమెడియన్
అలీ, సునీల్, వేణుమాధవ్, ధనరాజ్ లాంటి కమెడియన్స్ హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకోగా ఇప్పుడు మరో కామెడీ స్టార్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు. డిఫరెంట్ డిక్షన్‌తో ఆకట్టుకుంటున్న యంగ్ కమెడియన్ సప్తగిరి కూడా త్వరలోనే హీరోగా మారబోతున్నాడు. ఓ సీనియర్ డైరెక్టర్ సప్తగిరిని హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే కథా చర్చలు కూడా పూర్తయిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ప్రేమ కథాచిత్రం, జ్యోతి లక్ష్మీ, సౌఖ్యం లాంటి సినిమాలతో స్టార్ కమెడియన్ అనిపించుకున్న సప్తగిరి, సీనియర్ దర్శకుడు సాగర్ దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అంతేకాదు ఈ సినిమాను సాగర్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేసి స్టార్ డైరెక్టర్లుగా ఎదిగిన వినాయక్, శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి, నాగేశ్వర్ రెడ్డిలు నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే హీరోగా మారిన చాలా మంది కమెడియన్స్ సక్సెస్ కోసం ఎదురుచూస్తుండగా, సప్తగిరికి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి. -
'కృష్ణా, సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలి'
గుంటూరు: గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను గురువారం వైఎస్సార్సీపీ నేతలు మర్రి రాజశేఖర్, ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), డాక్టర్ గోపిరెడ్డి, కోనా రఘుపతి తదితరులు కలిశారు. ఈ సందర్భంగా కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీటిని విడుదల చేయాలని వారు జిల్లా జాయింట్ కలెక్టర్ ను డిమాండ్ చేశారు. పట్టిసీమ నిర్మాణంతో కృష్ణాడెల్టాకు నీరు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడేమి చేస్తోందని వారు ప్రశ్నించారు. కృష్ణా డెల్టా, సాగర్ ఆయకట్టుకు వెంటనే నీరు విడుదల చేసి పంటలను కాపాడాలని వైఎస్ఆర్ సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు. -
ఎన్‌కౌంటర్‌పై న్యాయ విచారణ చేయాలి
వరంగల్ అడవుల్లో జరిగిన పోలీసుల బూటకపు ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని విప్లవ రచయితల సంఘం సభ్యుడు తంగళ్ల సుదర్శన్ డిమాండ్ చేశారు. పోలీసులు చేసిన బూటకపు ఎన్ కౌంటర్ లో తన కుమార్తె శృతి మృతి చెందిందని తెలిపారు. బుధవారం ఆదిలాబాద్ జిల్లా శ్రీరాంపూర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఎన్కౌంటర్ దోషులపై 302 సెక్షన్ కింద కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే ఎన్కౌంటర్లు ఉండవని, నక్సలైట్ల ఎజెండానే అమలు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. మాట తప్పారని అన్నారు. ప్రజా వ్యతిరేకులు, ఉద్యమ ద్రోహులకు మంత్రి పదవులు ఇస్తున్నారని.. మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా తన కూతురు శృతి ఊరూరా తిరిగి.. తెలంగాణ పాటలు పాడిందని గుర్తుచేసుకున్నారు. అలాంటి శృతిని ప్రాణాలతో పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారన్నారు. -
సినిమా హిట్‌కు హీరోహీరోయిన్లే అక్కర్లేదు..
ప్రముఖ దర్శకుడు సాగర్ రాజమండ్రి : సినిమా సూపర్‌హిట్‌కు ప్రముఖ హీరో హీరోయిన్లే అవసరం లేదని కథ, కథనం బాగుండి, దాన్ని డీల్ చేసే సత్తా గల దర్శకుడుంటే నూతన నటులైనా హిట్ అవుతుందని ప్రముఖ దర్శకుడు సాగర్ అన్నారు. 40 ఏళ్ల క్రితం తాను అసోసియేట్ డెరైక్టర్‌గా పనిచేసిన ‘నీడలేని ఆడది’ అందుకు నిదర్శనమని, అదే సమయంలో కృష్ణ నిర్మించిన ‘కురుక్షేత్రం’తో పోలిస్తే ఆ సినిమా అప్పట్లో సూపర్హిట్టన్నారు. శనివారం ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, వర్ధమాన హాస్యనటుడు కర్రి రామారెడ్డితో కలిసి మందపల్లి ఉమా మందేశ్వరస్వామి వారిని దర్శించుకుని, పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ విలేకరులతో మాట్లాడుతూ ఒకప్పుడు 5 శాతం పెట్టుబడితో సినిమా నిర్మాణానికి ముందుకు వస్తే 95 శాతం బయటనుంచి సమకూరేదని ఇప్పుడా పరిస్థితి లేదని అన్నారు. రూ.కోటిన్నరతో కొత్త నటీనటులతో సినిమా తీయవచ్చని, అదే పాత, కొత్తవాళ్ళతో తీయాలంటే రూ. 5 నుంచి 6 కోట్లవుతుందని అన్నారు. కథలో బలం, చిత్ర నిర్మాణంలో దర్శకుడికి స్వేచ్ఛ ఉన్నప్పుడే దర్శకుడి అంచనాలకు, బడ్జెట్‌కు అనుగుణంగా సినిమా తయారై బాగా ఆడుతుందన్నారు. గతంలో దర్శకునికి 90 శాతం స్వేచ్ఛ ఉండగా నేడు 10 శాతమే ఉందని, దానితో అనుకున్నట్టు తీయలేకపోతున్నారని అన్నారు. ఒకప్పుడు సంవత్సరానికి 40 సినిమాలు రిలీజైతే నేడు 400 వరకూ రిలీజవుతున్నాయని, ఏ సినిమా ఎప్పడొచ్చి, ఎప్పుడు పోతుందో తెలియడం లేదని అన్నారు. 1983లో నరేష్-విజయశాంతిల ‘రాకాసిలోయ’కు తొలుత దర్శకత్వం వహించిన తాను ఇంతవరకూ 30 సినిమాలు రూపొందించానన్నారు. కృష్ణ, సౌందర్యలతో ‘అమ్మదొంగా’, భానుచందర్, లిజీలతో ‘స్టూవర్ట్‌పురం దొంగలు, వాణిశ్రీ, సౌందర్య, వినోద్‌కుమార్‌లతో ‘అమ్మనా కోడలా’ తన ఆణిముత్యాలన్నారు.‘ఆశలపల్లకి’అనే సందేశాత్మక చిత్రానికి నంది అవార్డు వచ్చిందన్నారు. ఈ ఏడాది రెండు సినిమాలకు ప్లాన్ చేస్తున్నామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. -
సాగర్ ఎడమ కాల్వకు గండి
ఖమ్మం: నాగార్జున సాగర్ ఎడమ కాల్వకు 133వ కిలో మీటరు వద్ద గండిపడింది. దీంతో ఖమ్మం జిల్లాలతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లో అనేక ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోయింది. సుమారు 4 నుంచి 10 మీటర్ల వెడల్పుతో గండి పడినట్లు తెలిసింది. దీంతో పాలేరు దిగువకు నీటి సరఫరాను నిలిపివేశారు.. దీంతో రెండున్నర లక్షల ఏకరాల ఆయకట్టుకు నీటి సరఫరా నిలిచిపోయంది. ఈ విషయమై సమాచారమందుకున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, తన్నీరు హరీశ్‌రావులు అధికారులను అప్రమత్తం చేశారు. కాల్వకు వెంటనే మరమతులు చేపట్టి నీటిని విడుదల చేయాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గండిపడిన ప్రాంతంలో శుక్రవారం పొక్లెయిన్‌తో తవ్వకాలు చేసి సాధ్యమైనంత మేరకు గండిని బంక మట్టిని నింపి అవసరమైతే కాంక్రీటు చేసి ఈనెల రోజులు తాత్కాలికంగా రైతులకు నీరు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సంబధిత అధికారులు తెలిపారు. గండి పూడ్చే పనులు కనీసం నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని తెలుస్తుంది. -
రబీ కష్టాలు గట్టెక్కేనా..?
31.40 టీఎంసీల సాగర్ నీరు అవసరం లేదంటే సాగు ప్రశ్నార్థకమే.. ఖమ్మం అర్బన్ : ఖరీఫ్‌లో కష్టాలు ఎదుర్కొన్న రైతులకు ఊరట కలగలేదు. రబీలోనూ అవస్థల మధ్య సాగర్ నీరు అందుతోంది. పంటలు చేతికి అందాలంటే ఖరీఫ్‌లో మిగిలి ఉన్న పంటలకు మార్చి 15, రబీలో సాగు చేసిన పంటలకు ఏప్రిల్ 15 వరకు నీరు అందాల్సి ఉంది. ఆయకట్టు లెక్క ప్రకారం 31.40 టీఎంసీల నీరు కావాల్సిందేనని ఎన్నెస్పీ అధికారులు నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపారు. ఎన్నెస్పీ అధికారుల లెక్కల ప్రకారం ఖరీఫ్‌లో టేకులపల్లి సర్కిల్ (ఖమ్మం) పరిధిలోని జోన్ 1,2,3లో రైతులు 2 లక్షల 23 వేల 591 ఎకరాలు సాగు చేశారు. ప్రభుత్వం కేటాయించిన నీటి కేటాయింపుల ప్రకారం 35 టీఎంసీలను వాడుకున్నారు. ఇందులో లక్షా 20 వేల ఎకరాల వరకు వరి సాగు చేశారు. మిగిలిన ఎకరాల్లో రైతులు మొక్కజొన్న, మిరప తోటలు, వేరుశనగ తదితర ఆరుతడి పంటలు సాగు చేశారు. ఆరుతడి పంటలు సాగు చేసిన వాటిని పంట చేతికందే వరకు కనీసం 9.16 టీఎంసీలు నీరు అవసరం ఉందని, దీని ద్వారా లక్షా 11 వేల 565 ఎకరాల్లో పంట చేతికందుతుందని లెక్కలు చెబుతున్నాయి. రబీలో సాగులో ఉన్న లక్షా 39 వేల ఎకరాలకు 22.24 టీఎంసీలు నీరు అవసరం ఉంటుందని అధికారులు అంటున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో జోన్ 1,2,3లో లక్షా 20 వేల ఎకరాలు, నల్లగొండ జిల్లాలోని జోన్1 పరిధిలో 19 వేల 500 ఎకరాలకు నీరు అందిస్తే తప్ప పంట సక్రమంగా చేతికందే పరిస్థితి ఉంటుందంటున్నారు. ప్రధానంగా రబీలో కల్లూరు డివిజన్ పరిధిలోని కల్లూరు, తల్లాడ, బోనకల్లు, మధిర, ఎర్రుపాలెం తదితర మండలాల్లో అత్యధికంగా రైతులు వరి సాగు చేశారని చెబుతున్నారు. వీటితోపాటు వైరా చెరువు, పాలేరు చెరువు తదితర ప్రధాన జలాశయాల పరిధిలో కూడా రైతులు వరి సాగు చేశారు. అధికారికంగానే కాకుండా అనధికారికంగా వేలాది ఎకరాలను రైతులు వివిధ రకాల పంటను సాగు చేశారు. సాగునీటితోపాటు వేసవిలో తాగునీటి అవసరాలకు కూడా అదనంగా నీరు కేటాయింపులు చేయాల్సి ఉంది. ఇప్పటికే అనేక ప్రాంతాల నుంచి కాల్వల పరిధిలో చివరి భూములకు నీరు సక్రమంగా అందడం లేదని రైతులు ఎన్నెస్పీ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఆరురోజుల క్రితం ఎన్నెస్పీ ఎస్ఈని పాలేరు నియోజకవర్గంలోని రైతులు ఘెరావ్ చేసి ఆందోళనకు దిగారు. సాగునీరు అందించాలని కోరారు. సాగునీటి కోసం కల్లూరు డివిజన్ రైతుల నుంచి మరింత డిమాండ్ ఉందని ఎన్నెస్పీ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికే సాగర్ జలాశయంలో నిల్వలు తగ్గడంతో డిమాండ్‌కు అనుగుణంగా నీరు అందించడం ప్రశ్నార్థకమేనని తెలుస్తోంది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించి రబీ పంటలు చేతికి అందేలా చర్యలు చేట్టాలని రైతులు కోరుతున్నారు. -
చదువు సమాజానికి ఉపయోగపడాలి
బొల్లికుంట(సంగెం) : విద్యార్ధుల చదువు సామాజానికి ఉపయోగపడేలా ఉండాలని ప్రముఖ సామాజిక, జానపద ఉద్యమగాయకుడు గోరెటి వెంకన్న కోరారు. మండలంలోని బొల్లికుంటలోగల వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో మూడు రోజుల పాటు నిర్వహించిన 5వ జాతీయస్థాయి టెక్నో కల్చరల్ ఫెస్ట్ వాగ్ తరంగ్ 2కే-14 ముగింపు కార్యక్రమం బుధవారం రాత్రి జరిగింది. ముఖ్యఅతిధిగా హాజరైన గోరటి వెంకన్న మాట్లాడుతూ ప్రపంచదేశాలన్నింటికీ మన భారతదేశం, తెలంగా ణ మేధోసంపత్తిని అందిస్తున్నదన్నా రు. అనంతరం ఆయన తన పాటలు, నృత్యా ల ద్వారా ఆకట్టుకున్నారు. కాగా, వర్ధమాన సినీగాయకులు రెని నారెడ్డి, సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ సోదరుడు సాగర్ ఆలపించిన గీతాలు ఉర్రూతలూగించాయి. కళాశాల కార్యద ర్శి దేవేందర్‌రెడ్డి, ఏఓ సత్యపాల్‌రెడ్డి, ప్రిన్సిపాల్స్ సత్తయ్య, ప్రకాశ్, డెరైక్టర్ భా స్కర్‌రావుతో పాటు రాజారావు, నాగరా జు, శ్రావణ్‌రెడ్డి, సురేష్ పాల్గొన్నారు. -
‘సాగర్’ మథనం!
సాక్షి, సిటీబ్యూరో: గణనాథుని నిమజ్జనోత్సవం ముగిసింది. నగరంలోని వేలాది వినాయక విగ్రహాలు హుస్సేన్ సాగర్‌లో జలప్రవేశం చేశాయి. వీటి వ్యర్థాలను తొలగించేందుకు ‘సాగర్’ వడపోత కార్యక్రమానికి హెచ్ఎండీఏ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది చిన్నా, పెద్దవి కలిపి సుమారు 60 వేల వినాయక ప్రతిమలు నిమజ్జనమైనట్టు అధికారుల అంచనా. వీటిని సత్వరం వెలికితీసి సాగర్‌ను కాలుష్యం నుంచి కాపాడేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఎలాంటి ప్రతికూల పరిస్థితి ఎదురైనా ఈ నెల 12కల్లా నిమజ్జన పూడిక తొలగింపు పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ప్రత్యేకించి ఎన్టీఆర్ మార్గ్‌లోని 9 ప్లాట్‌ఫారాల వద్ద నిమజ్జనం చేసిన గణేశ్ విగ్రహాల అవశేషాలు, పూలు, పత్రి తదితర వ్యర్థాలను ఒడ్డుకు చే రుస్తున్నారు. వాటిని కవాడీగూడలోని జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలించే పనులను మంగళవారం రాత్రి నుంచి ముమ్మరం చేశారు. ప్రధానంగా ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నెం.4 వద్ద సాగర్‌లో పెద్ద మొత్తంలో వినాయక విగ్రహాలు పోగవ్వడంతో ఖైరతాబాద్ భారీ వినాయకుడి నిమజ్జనానికి అడ్డంకిగా మారాయి. ఈపరిస్థితిని గమనించిన హెచ్ఎండీఏ అధికారులు మంగళవారం ఉదయం 150 మంది కూలీలు, యంత్రాలను నియమించి 3 గంటల వ్యవధిలో వాటిని పక్కకు తొలగించారు. అనంతరం పోలీసుల సహకారంతో ట్రాఫిక్‌ను నియంత్రించి, సుమారు 170 టన్నుల వ్యర్థాలను జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్‌కు తరలించారు. ఈ పనులన్నీ ఖైరతాబాద్ భారీ వినాయకుడు సాగర్‌కు చేరుకునే లోగానే పూర్తవడంతో పోలీసులు, ఇతర అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. లేదంటే భారీ గణేశుడి నిమజ్జనం మరింత ఆలస్యమయ్యేది. భారీ విగ్రహాన్ని నీటిలో కాకుండా గట్టున వేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నందున అధికారులు క్షణాల్లో చర్యలు చేపట్టి నిమజ్జనానికి మార్గం సుగమం చేశారు. మిగతా ఫ్లాట్ ఫారాల వద్ద నిమజ్జనమైన విగ్రహాలను కూడా నీటిలోకి జారిపోకుండా ఎప్పటికప్పుడు గట్టుకు చేర్చి జాగ్రత్తలు తీసుకున్నారు. నిరంతరాయంగా పరిశుభ్రత వినాయక నిమజ్జన వ్యర్థాలను తొలగించే పనులను నిరంతరాయంగా కొనసాగించే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. ఇందుకోసం 200 మంది కూలీలు, 10 టిప్పర్లు, 2 డీయూసీలు, 3 జేసీబీలు, 1 పాంటూన్ ఎక్స్కవేటర్లను వినియోగిస్తున్నట్లు బీపీపీ ఓఎస్డీవి.కృష్ణ, ఎస్ఈ బీఎల్ఎన్.రెడ్డిలు తెలిపారు. షిఫ్టుల వారీగా ఏకధాటిగా ప్రక్షాళన పనులు నిర్వహించి, 12వ తేదీలోగా పూర్తి చే స్తామని వారు ధీమా వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ మార్గ్ వైపు నిమజ్జనమైన విగ్రహాలను ఇప్పటికే గట్టుకు చేర్చామని, వీటిని రెండు రోజుల్లో పూర్తి స్థాయి లో తొలగిస్తామని తెలిపారు. ఖైరతాబాద్ భారీ వినాయకుడికి సుమారు 10 టన్నుల వరకు ఇనుము వినియోగించారని, దీన్ని సేకరించేందుకు గణేశ్ ఉత్సవ సమితికి ఈ నెల 11వరకు సమయమిచ్చి, 12న ఆ విగ్రహ శకలాలను కూడా పూర్తిగా తొలగిస్తామని వారు వెల్లడించారు. స్క్రాప్ కోసం ఆరాటం నిమజ్జన విగ్రహాల ఇనుము (స్క్రాప్)ను చేజిక్కించుకొనేందుకు కొందరు పడుతున్న ఆరాటం చూపరులను విస్మయానికి గురిచేస్తోంది. పీకలోతు నీటిలోకి వెళ్లి విగ్రహాల నుంచి వీలైనంత స్క్రాప్‌ను పోగు చేసుకొనేందుకు కొందరు యువకులు పోటీలు పడ్డారు. గట్టుకు చేర్చిన ఇనుమును కూడా చేతనైనంత వరకు తీసుకెళ్లడం కనిపించింది. వీరితోపాటు అక్కడి క్రేన్ వద్ద పనిచేస్తున్న కూలీలు, వివిధ బస్తీల నుంచి వచ్చిన నిరుపేదలు కూడా ఇనుమును సేకరించేందుకు తీవ్రంగా శ్రమించారు. వీటివల్ల వచ్చే ఆదాయమే పలువురు నిరుపేదలకు జీవనాధారం కావడంతో అధికారులు కూడా వారికి అడ్డు చెప్పకుండా వదిలేశారు. -
సాగర్ రెండోజోన్‌కు సాగునీరు విడుదల
కూసుమంచి : పాలేరు రిజర్వాయర్ నుంచి జిల్లాలోని సాగర్ రెండో జోన్‌కు శనివారం నీటిని విడుదల చేశారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి నీటిని కాల్వలకు వదిలారు. అంతకు ముందు వారు కృష్ణమ్మకు పూజలు చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ జిల్లాలో సాగర్ మొదటి జోన్‌కే ప్రభుత్వం తొలుత నీటిని విడుదల చేసిందని, రెండో జోన్ పరిధిలోని రైతుల సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకుని రెండోజోన్‌కు కూడా నీటిని వదలాలని రాష్ర్ట భారీ నీటిపారుదల మంత్రి హరీష్‌రావును కోరగా ఆయన అంగీకరించారని తెలిపారు. ఇందుకు కలక్టర్ చేత ప్రతిపాదన కూడా పంపించిన ట్లు తెలిపారు. ఈక్రమంలో సాగర్‌డ్యామ్‌కు ఎగువ నుంచి నీరు రావడంకూడా కలసిరావడంతో రెండోజోన్‌కు ప్రభుత్వం నీటిని త్వరిత గతిన విడుదల చేసిందన్నారు. ప్రతి రైతుకు నీరు ముఖ్యమని, పొదుపుగా వాడుకోవాలని సూచిం చారు. కాల్వ పరిధిలోని మొదటి రైతులు సహకరించి చివరి రైతులకు నీరు చేరేలా చూడాల్సిన బాధ్యత ఉందన్నారు. జిల్లాలోని ఆయకట్టులో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆంధ్రలో మూడో జోన్లో జిల్లాకు చెందిన 17 వేల ఎకరాల ఆయకట్టు ఉందని , దాన్ని రెండో జోన్లో చేర్చాలని నీటి పారుదల శాఖ మంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. రైతులకు ఎరువులు కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నీరు ఎంతో విలువైందని, దానిని ప్రతి రైతు పొదుపుగా వాడుకునేలా అధికారులు శ్రద్ధ వహించాలని కోరారు. రైతులకు ప్రభుత్వం రుణాలు మాఫీ చేయాలని, ఎరువులు అందుబాటులో ఉంచాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పాలేరు ఇన్చార్జ్ సాధు రమేష్‌రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు వడ్త్యి రాంచంద్రునాయక్, ఎన్నెస్పీ ఎస్ఈ అప్పలనాయుడు, ఈఈలు సుమతీదేవి, కృష్ణకుమార్, డీఈఈలు అక్బర్‌పాషా, యాదగిరిరెడ్డి, జేఈఈలు రంజిత్ కుమార్, శ్రీనివాస్, ట్రాన్స్‌కో, జెన్కో డీఈఈలు వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, పాలేరు, నాయకన్‌గూడెం సర్పంచ్‌లు మాదవీరెడ్డి, దేవర అమల, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, ఎంపీటీసీ సభ్యులు బారి శ్రీనివాస్, అలింగ గోవిందరెడ్డి, కోఆఫ్షన్ అహ్మద్అలీ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బజ్జూరి వెంకటరె డ్డి, నాయకులు సత్యనారాయణరెడ్డి, మంగిరెడ్డి, బయ్య లింగ య్య, వైవీడీరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మట్టె గురవయ్య, బిక్షంనాయక్, బాలకృష్ఫారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్తయ్య, టీఆర్ఎస్ నాయకులు షేక్ రంజాన్ పాలొన్నారు. -
నాని బుజ్జి బంగారం మూవీ స్టిల్స్
-
రేపిస్టుల నుంచి తప్పించుకుని, దూకి చనిపోయిన యువతి
లైంగిక అత్యాచారానికి గురైన ఒక గిరిజన యువతి రేపిస్టులనుంచి తప్పించుకునేందుకు నగ్నంగానే పరుగులు తీసి, చివరికి 70 అడుగుల ఎత్తైన టవర్ నుంచి దూకి ప్రాణాలువదిలేసింది. గుండెల్ని పిండేసే ఈ సంఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో జరిగింది. సంఘటన సోమవారం జరిగినా ఇప్పటి వరకూ పోలీసులు ఎవర్నీ అరెస్టు చేయలేదు. ఆ గిరిజన యువతి ఉద్యోగం కోసం ఇండోర్ నగరానికి వెళ్తూండగా ఈ సంఘటన జరిగింది. ఆమె సొంతూరు డిండోరీ. -
'మొగలి రేకులు' హీరో పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్: తన పేరుతో ఓ యువకుడు నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నాడని ‘మొగలి రేకులు’ టీవీ సీరియల్ కథానాయకుడు సాగర్ మాదాపూర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. సీఐ నర్సింహులు తెలిపిన ప్రకారం...ఖమ్మం జిల్లా కొల్లూర్‌కు చెందిన గోపీనాథ్ బికాం ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఇతను ‘మొగలి రేకులు’ కథానాయకుడు సాగర్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్‌ను ఓపెన్ చేశాడు. ప్రొఫైల్‌లో సాగర్ ఫొటో పెట్టాడు. దీంతో పలువురు యువతీ యువకుల నుంచి రిక్వెస్ట్‌లు వచ్చాయి. వాటన్నింటినీ కన్ఫార్మ్ చేసిన గోపీనాథ్... తానే సాగర్ నాయుడునని చెప్పుకున్నాడు. మూడు నెలలుగా ఎంతో మంది యువతులతో ఆన్లైన్లో చాటింగ్‌తో పాటు ఫోన్లో మాట్లాడుతున్నాడు. విషయం తెలుసుకున్న హీరో సాగర్ శనివారం రాత్రి మాదాపూర్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఐపీసీ సెక్షన్ 419,420, ఐటీ యాక్ట్ 66 ప్రకారం కేసు నమోదు చేసి, విచారిస్తున్నారు. -
బాధ్యత కలిగిన ‘సిద్దార్థ’
వెండితెర నుంచి బుల్లితెరకు చాలామంది స్టార్లు వచ్చారు. కానీ బుల్లితెర స్టార్లు వెండితెరపైకి రావడం అరుదు. ‘మొగలిరేకులు’లో చేసిన ఆర్కే నాయుడు పాత్ర ద్వారా ఇంటిల్లిపాదికీ దగ్గరైన సాగర్ హీరోగా ‘సిద్దార్థ’ అనే చిత్రం రూపొందనుంది. హవీష్ హీరోగా తొలి ప్రయత్నంగా రామదూత క్రియేషన్స్ పతాకంపై ‘జీనియస్’ చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం హవీష్తోనే ‘వస్తా నీ వెనక’ చిత్రం నిర్మిస్తున్న దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సరేశ్చంద్ర దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ కథ అద్భుతంగా ఉంది. వచ్చే నెల పూజా కార్యక్రమాలు జరిపి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘ప్రముఖ సంస్థల్లో దర్శకత్వ శాఖలో చేశాను. తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఓ యువకుని కథ ఇది’’ అన్నారు. సాగర్ సరసన ప్రముఖ హీరోయిన్ నటించే ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, కెమెరా: సతీష్, మాటలు: విస్సు, జనార్థన్, కెమెరా: సతీష్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేష్. -
సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’
-
సాగర్ చుట్టూ ‘నో ఎంట్రీ’
=న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మంగళవారం రాత్రి 10 గంటల నుంచి బుధవారం తెల్లవారుజాము 2 గంటల వరకు సాగర్ పరిసరాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు విధిస్తూ కొత్వాల్ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. =ఈ సమయంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్‌రోడ్, అప్పర్ ట్యాంక్ బండ్లపై వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. =ఈ సమయంలో భారీ వాహనాలను సైతం సిటీలోకి రానీయరు. జంట కమిషనరేట్ల పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లను మూసేస్తారు. =సచివాలయం పక్కనున్న మింట్ కాంపౌండ్ లైన్‌ను పూర్తిగా మూసేస్తారు. ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు విధించారు. =వీవీ స్టాట్యూ నుంచి నెక్లెస్‌రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను ఖైరతాబాద్, రాజభవన్ మీదుగా మళ్లిస్తారు. =బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వచ్చే ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్, లక్డీకాపూల్, అయోధ్య సర్కిల్ వైపు పంపుతారు. =లిబర్టీ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్లే ట్రాఫిక్‌ను జీహెచ్ఎంసీ కార్యాలయం నుంచి బీఆర్కే భవన్, తెలుగుతల్లి, ఇక్బాల్ మినార్, రవీంద్రభారతి, లక్డీకాపూల్, అయోధ్య సర్కిల్ మీదుగా మళ్లిస్తారు. =ఖైరతాబాద్ మార్కెట్ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను మీరా టాకీస్ లైన్ మీదుగా పంపుతారు. =నల్లగుట్ట రైల్వే బ్రిడ్జి వైపు నుంచి వచ్చే వాహనాలను సంజీవయ్య పార్క్, నెక్లెస్‌రోడ్ పైకి పంపరు. వీటిని కర్బాలా మైదాన్, మినిస్టర్స్ రోడ్ మీదుగా పంపిస్తారు. =సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను సెయిలింగ్ క్లబ్ నుంచి కవాడిగూడ చౌరస్తా, లోయర్ ట్యాంక్‌బండ్, కట్టమైసమ్మ టెంపుల్, అశోక్‌నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్ వైపు మళ్లిస్తారు. =డ్రంకన్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ట్రిపుల్‌రైడింగ్ తదితర ఉల్లఘనలపై స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించడానికి ప్రత్యేక బృందాల ఏర్పాటు. =రోడ్ల పక్కన, నో పార్కింగ్ జోన్లో వాహనాలు ఆపితే చర్యలు తప్పవు. -
హడలెత్తించిన సాగర్
జింఖానా, న్యూస్‌లైన్: పోస్టల్ జట్టు బౌలర్ సాగర్ 8 వికెట్లు పడగొట్టి మిధాని జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. ఎ-ఇన్స్టిట్యూషన్ వన్డే లీగ్‌లో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో పోస్టల్ జట్టు 10 వికెట్ల తేడాతో మిధాని జట్టుపై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మిధాని... సాగర్ ధాటికి 53 పరుగులకే కుప్పకూలింది. అనంతరం బరిలోకి దిగిన పోస్టల్ జట్టు వికె ట్ కోల్పోకుండా 55 పరుగులు చేసింది. మరో మ్యాచ్‌లో హెచ్ఏఎల్ జట్టు 8 వికెట్ల తేడాతో కెనరా బ్యాంక్‌పై గెలుపొందింది. మొదట బరిలోకి దిగిన కెనరా బ్యాంక్ 96 పరుగులకే చేతులెత్తేసింది. హెచ్ఏఎల్ బౌలర్ సిద్ధప్ప 6 వికెట్లు చేజిక్కించుకున్నాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన హెచ్ఏఎల్ రెండే వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో సెయింట్ సాయి జట్టు బౌలర్ అనీష్ (6/53) విజృంభించాడు. దీంతో ఆ జట్టు 23 పరుగుల తేడాతో డెక్కన్ కోల్ట్స్ జట్టుపై నెగ్గింది. తొలుత డెక్కన్ కోల్ట్స్ 177 పరుగులకు ఆలౌటైంది. ప్రదీప్ 33 పరుగులు చేశాడు. సెయింట్ సాయి బౌలర్ జగదీశ్ 3 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన సెయింట్ సాయి 153 పరుగులకు ఆలౌటైంది. జితేందర్ (33), చర్దిల్ (32) మినహా మిగతా వారు రాణించలేకపోయారు. -
చిన్ననాటి చందమామ కథే స్ఫూర్తి!
తొలియత్నం మొదటి సినిమా అనగానే దర్శకుడి మనసులో బోలెడన్ని ఊహలు, ఆలోచనలు. ఎప్పటినుంచో దాచుకున్న ఐడియాలు, స్టోరీలు. ఒక్కసారి అన్నీ దుమ్ము దులిపి... ఏ లైన్ బాగుంటుంది, ఏ కాంబినేషన్ వర్కవుట్ అవుతుంది, అది తన కెరీర్‌కు సరైన ఫౌండేషన్ అవుతుందా, లేదా?... ఇలా ఎన్నో ఈక్వేషన్లు, క్యాలిక్యులేషన్లు. దర్శకుడు సాగర్ తన తొలి సినిమా సమయంలో సరిగ్గా ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొన్నారు. చిన్ననాటి సరదా ఊహ తొలి యత్నానికి దారితీసిన వైనం గురించి సాగర్ ఫ్లాష్‌బ్యాక్. చిన్నప్పుడు మద్రాస్‌లో చదువుకునేటప్పుడు చందమామలో రాకాసి లోయ సీరియల్‌ను కథను ఆసక్తిగా చదివేవాళ్లం. పిల్లలందరం కలిసి పెద్దయ్యాక, దీన్ని సినిమాగా తీయాలనుకున్నాం. అందులో ఒకడు అంత పెద్ద రాక్షసులకు మనం అన్నం ఎలా పెడతాం అన్నాడు. మరొకడు విజయా గార్డెన్స్ మొత్తం అద్దెకు తీసుకుని, పెద్ద పెద్ద చువ్వలున్న బోనులో పెట్టి పైనుంచి హెలికాప్టర్లోంచి ఆహారం విసిరేద్దాం అన్నాడు. అలా చిన్నతనంలో ఆ కథ చుట్టూతా బోలెడన్ని ఊహలు. ఎస్సెల్సీ పూర్తయ్యాక, చదువు మీద ఆసక్తి లేకపోవడంతో ఖాళీగా ఉన్నాను. అప్పట్లో మా కుటుంబానికి బాగా తెలిసినతను, ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. మా అమ్మ అతన్ని నాకేమైనా అవకాశం ఇప్పించమని అడిగింది. ‘సినిమాల్లో పనిచేయాలంటే చాలా సహనం, ఓర్పు ఉండాలి. మీవాడు అక్కడ సెట్ అవలేడు’ అనడంతో మా అమ్మ చాలా బాధపడింది. ఆ సంఘటన నాలో పట్టుదలను పెంచింది. ఎలాగోలా సినిమా రంగంలోకి ప్రవేశించి, మధు పిక్చర్స్ మల్లికార్జునరావు తమ్ముడు శ్రీహరిగారి వద్ద, ‘ఇంటి గౌరవం’ అనే సినిమాకి ఎడిటింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్‌గా చేరాను. నన్ను నేను నిరూపించుకోవడానికి తీవ్రంగా కష్టపడేవాణ్ని. ఈ క్రమంలో ఒక చేదు సంఘటన ఎదురైంది. మొదట నాకు అవకాశం ఇవ్వకుండా మా అమ్మతో నా గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి, ఇక్కడ కూడా నన్ను అణగదొక్కడానికి ప్రయత్నించాడు. దాంతో నాకు కోపం వచ్చి అక్కడి నుంచి బయటికొచ్చేశాను. ఎటు వెళ్లాలో తెలీక రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు మా అన్నయ్య ద్వారా మహ్మద్ బీన్ తుగ్లక్ సినిమాకు అసిస్టెంట్‌గా అవకాశం వచ్చింది. బీవీ ప్రసాద్‌గారు డెరైక్టర్. దాసరి నారాయణరావుగారు రైటర్. ఆయన ద్వారా రేలంగి నరసింహారావు అసిస్టెంట్ అవడంతో నేను మరో మెట్టు ఎక్కి సెకెండ్ అసోసియేట్ డెరైక్టర్ అయ్యాను. అప్పట్లో మేం పనిచేసిన సినిమాను మా సొంత సినిమా అనుకుని పనిచేసేవాళ్లం. అసిస్టెంట్ నుంచి కో-డెరైక్టర్‌గా నా కెరీర్ సాగుతున్న క్రమంలో చాలామంది సినిమా డెరైక్షన్ చేయమని అడిగేవారు. నేను మాత్రం సున్నితంగా తిరస్కరించాను. నా మీద నాకు నమ్మకం వచ్చాక, తప్పక చేస్తానని చెప్పాను. తర్వాత కోదండరామిరెడ్డిగారి ‘కిరాయి కోటిగాడు’ సినిమాకు కో-డెరైక్టర్‌గా సినిమా చేశాను. అది చాలా పెద్ద హిట్టయింది. ఇక నేను సొంతంగా చేస్తే బాగుంటుందనుకున్నా. అదే సమయంలో మద్రాస్ వాణీ సిల్క్ సెంటర్ యజమాని నా దగ్గరకు వచ్చి ఓ సినిమా చేద్దామన్నాడు. ఆయన ఉత్సాహం చూసి డేట్స్ కోసం కృష్ణగారి దగ్గరికి వెళ్లాను. కృష్ణగారు వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారు. కొంతకాలం ఆగు, ప్రస్తుతానికి నరేష్‌తో సినిమా చేయి అన్నారు. కథ మలుపు తిరిగింది. ఏం చేయాలా అన్న సంఘర్షణ మొదలైంది. అప్పుడు విజయకృష్ణా బ్యానర్లో పనిచేసే నా మిత్రుడు విఠల్ ఒక సినిమా చేద్దామని వచ్చాడు. ఎంతుంది అని అడిగా. ఐదు వేలు అన్నాడు. ఐదు రోజులకు కూడా సరిపోవు అన్నా. వెనుక లారీలో డబ్బొచ్చేస్తుంది అన్నాడు. సరే కానీ అన్నా. నిజానికి అప్పట్లో మద్రాస్‌లో రోజుకు పదిహేనొందలుంటే సినిమా తీయొచ్చు. ఫుడ్, ట్రాన్స్పోర్ట్ ప్రతిదీ అప్పు మీద దొరికేది. ఇక ఏ జానర్లో సినిమా చేస్తే బాగుంటుందని ఆలోచించాం. అప్పుడు నా చిన్ననాటి చందమామ కథ గుర్తుకొచ్చింది. అది మదిలో మెదలగానే ఏదో తెలియని సంతోషం. అదే సమయంలో ‘హిల్స్ హ్యావ్ నో ఐస్’ అనే ఇంగ్లిష్ సినిమా చూశాను. బాగా నచ్చింది. ఈ రెండు ఆలోచనల ఆధారంగా రాకాసి లోయ కథ అల్లుకున్నాను. కొడుకుతో పాటు వేటకు వెళ్లిన రంగనాథ్‌ను అడవి మనుషులు చంపుతారు. తిరిగి సిటీకి వచ్చిన కొడుకు పెద్దయ్యాక, తన తండ్రి మరణానికి కారణాన్ని అన్వేషించే క్రమంలో తన మిత్రులతో కలిసి రాకాసి లోయకు వస్తాడు. స్థూలంగా ఇదీ కథ. నరేష్, రాజేష్, రవివర్మ, విజయశాంతి, ముచ్చెర్ల అరుణ, దీప నటీనటులు. లొకేషన్ కోసం వేట మొదలైంది. తలకోన మద్రాస్‌కు చాలా దగ్గర. కానీ నాకు అదంత పరిచయం లేని ప్రాంతం. గతంలో కలియుగ సీత తీసినప్పుడు పశ్చిమ గోదావరిలోని బుట్టాయిగూడెం అడవులు బాగా పరిచయం. అక్కడ కరాటం కృష్ణమూర్తిగారని ఒక దొర ఉండేవారు. చుట్టుపక్కల ఆయన మాట వేదం. వెళ్లి ఆయనకు పరిస్థితి చెప్పాను. ఆయన అభయమివ్వగానే షూటింగ్ సగం పూర్తయిందనిపించింది. ఎందుకంటే అక్కడైతే మా బడ్జెట్లోనే సినిమా చేసుకోవచ్చు. బుట్టాయిగూడెం గ్రామంలో మా యూనిట్‌కు వసతి కల్పించారు. మేకప్‌తో సహా ఆరు గంటలకు లొకేషన్లోకి వెళ్లాలనుకునేవాళ్లం. కానీ ఎవరూ సమయానికి రెడీ అవకపోవడంతో ఏ రోజు కూడా తొమ్మిదికి ముందు చేరుకోలేకపోయేవాళ్లం. కొండల్లో దారులు చాలా ఇరుకుగా ఉండేవి. ఎదురుగా మరో వెహికల్ వస్తే మా వాహనం ఆగిపోవాల్సిందే. లొకేషన్‌కు చేరుకునేసరికి ఆర్టిస్టుల ఒళ్లంతా దుమ్ము పేరుకుపోయేది. ఆ షూటింగ్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఒకసారి షూటింగ్లో వాడుతున్న ఒరిజినల్ రివాల్వర్ మాయమైంది. ఎటు పోయిందో తెలియదు. నక్సలైట్స్ తీసుకుపోయారని కొంతమంది అన్నారు. మొత్తానికి చాలా టెన్షన్ పడ్డాం. కానీ అది దొరకలేదు. ఈ సినిమాలో ఫలానా హీరో పక్కన ఫలానా హీరోయిన్ అని లేకున్నా, నరేష్, ముచ్చెర్ల అరుణతో ఒక పాట తీయాలనుకున్నాం. దాంతో విజయశాంతి అలిగింది. నేను కో-డెరైక్టర్‌గా పనిచేసిన రెండు మూడు సినిమాల్లో ముచ్చెర్ల అరుణ నటించడంతో ఆమెతో నాకు కొంత సాన్నిహిత్యం ఉంది. తనకెలాగో నచ్చచెప్పి నరేష్ పక్కన విజయశాంతితో పాట తీశా. దాంతో నరేశ్, ముచ్చెర్ల అరుణతో తీసిన సీన్‌ని తొలగించాల్సి వచ్చింది. ఈ సినిమాకు విజయశాంతి పారితోషికం 12 వేలు, ముచ్చెర్ల అరుణ పారితోషికం 14 వేలు. నలభై రోజుల సినిమా పూర్తయ్యాక, దీప ఉండే గూడేనికి సంబంధించిన సన్నివేశాలు షూట్ చేయాల్సిన సమయం వచ్చింది. చెట్ల మీద ఇళ్ల సెట్ వేయాలి. చాలా హడావుడిలో పని చేయడంతో ఆ సన్నివేశాలు నేననుకున్నంత బాగా రాలేదు. కానీ మొత్తానికి సినిమా బాగానే వచ్చిందని చెప్పాలి. సినిమా పూర్తయ్యాక, నైజాం డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి మేం చాలా డబ్బు పెట్టి సినిమా కొన్నాం. మూడు పాటలు పెట్టి మా మొహాన విసిరేస్తే ఎలా అన్నారు. ఒక పని చేయండి, సినిమా చూసి ఎక్కడ పాట పెట్టొచ్చో చెప్పండి, పెడదాం అన్నాను. సినిమా చూసి ఎక్కడా ఒక్క పాట కూడా పెట్టడం కుదరదని అన్నారు. సినిమాలో ఉన్న మూడు పాటలకూ సత్యంగారు అద్భుతమైన సంగీతం అందించారు. విడుదలయ్యాక, సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెకెండాఫ్‌లో సినిమా గ్రాఫ్ పడిపోతున్నా డెరైక్టర్ అదే టెంపోమెయిన్టెయిన్ చేశాడని ‘‘ది హిందూ’’ పత్రిక చాలా గొప్పగా రాసింది. ‘రాకాసి లోయ’ సినిమా చూసిన హిందీ రైటర్ ఒకాయన సవేరా హోటల్లో నన్ను కలిశాడు. ఆయన ఈ ఐడియా చాలా గ్రేట్, ఇంత గొప్ప ఐడియా మీకెలా వచ్చిందని నన్ను వేపుకు తినడం మొదలుపెట్టాడు. ఏం చెప్పాలో తెలీక అప్పటికప్పుడు ఒక కథ అల్లేశాను. దేవుడు ఈ భూమ్మీద మనుషుల్ని మూడు చోట్ల సృష్టించాడు. నగరంలో సృష్టించబడినవాడికి అన్యాయాలు, అక్రమాలు చేయడం తెలుసు. పల్లెలో పుట్టినవాడికి తన కర్మానుసారం జీవించడం తెలుసు. కానీ అడవిలో ఉన్నవాడికి ఎప్పుడూ ఏదో అభద్రత, భయం ఉంటుంది. జంతువుల నుంచి, ప్రకృతి నుంచి, బయట నుంచి వచ్చే మనుషుల నుంచి ప్రమాదం ఉంటుంది. ఆ భయంలో భాగంగా చాలా విపరీత ప్రవర్తనతో ఉంటాడు. ఈ ఆలోచన నుంచే రాకాసి లోయ కథ పుట్టిందని చెప్పగానే ఆయన నన్ను విపరీతంగా పొగిడారు. అలా ‘రాకాసి లోయ’ నాకు చాలా అనుభవాలను మిగిల్చింది. నా తరువాత భవిష్యత్‌కు మంచి పునాది వేసింది. -కె.క్రాంతికుమార్‌రెడ్డి -
హ్యాపీగా... గాసిప్ డేస్!
కాలేజీ లైఫ్... సరదాలు... షికార్లు... కబుర్లు... ఆటపట్టించుకోవడాలు...పేమలో పడటం... పార్క్‌లకి వెళ్లడం... లెక్చరర్స్‌లో కొందరంటే ఇష్టపడడం... కొందరిని చూసి భయపడటం... క్యాంటీన్లో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకోవడం... ‘స్టూడెంట్ లైఫ్ చాలా జాలీ, రమ్మన్నా రాదండి మళ్లీ’ అన్న సినీ రచయిత మాటలు అక్షరసత్యం... అని చూపాడు కొత్తగూడానికి చెందిన సాగర్ వి.ఎస్. అనే దర్శకుడు ‘గాసిప్’ లఘుచిత్రం ద్వారా... డెరైక్టర్స్ వాయిస్: నేను ఎంబిఏ, ఎం.ఫిల్ చేశాను. ఇప్పటివరకు హ్యాపీ బర్త్‌డే, గాసిప్... అనే రెండు షార్ట్ ఫిల్మ్స్ తీశాను. ప్రస్తుతం ‘కార్తికేయ’ అనే దర్శకుడి దగ్గర అసిస్టెంట్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నాను. స్క్రిప్ట్, స్క్రీన్‌ప్లే రైటర్‌గా తెలుగు, ఇంగ్లీషు చలనచిత్ర పరిశ్రమలలో చేస్తున్నాను. ‘గాసిప్’ చిత్రాన్ని ఐదు రోజులలో పూర్తి చేశాను. ఈ చిత్రానికి 60,000 రూపాయలు ఖర్చయ్యింది. ఇందులో నటించినవారిలో కొందరు ప్రొఫెషనల్స్, కొందరు టీవీ యాంకర్లు ఉన్నారు. ప్రసాద్ ల్యాబ్స్‌లో తమ్మారెడ్డి భరద్వాజ, రఘుకుంచె, సినీ క్రిటిక్ జీవీ... వంటి ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించాను. రావిశాస్త్రి, శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి, తిలక్, పానుగంటి... వీరి రచనలు ఎక్కువగా చదువుతాను. హృదయానికి హత్తుకునే కుటుంబ కథా చిత్రాలు తీయాలనేది నా కోరిక. అలాగే మానవ విలువలతో కూడిన చిత్రాలు కూడా తీయాలనుకుంటున్నాను. ఎప్పటికైనా మంచి దర్శకుడిగా నిలబడాలన్నదే నా లక్ష్యం. షార్ట్‌స్టోరీ: కాలేజీ విద్యార్థులు క్యాంటీన్‌కి వెళ్లినప్పుడు, పార్క్‌కి వెళ్లినప్పుడు, ఎక్కడ కలిసినా ఏవో కబుర్లు ఉంటాయి. వారు ఎలా మాట్లాడుకుంటారో, ఏ విధంగా ప్రవర్తిస్తారో చూపడమే ఈ కథ. కామెంట్: ‘దేర్ ఆర్ నో జనరేషన్ ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ ఓన్లీ బిహేవియరల్ ప్రాబ్లమ్స్’ అని ట్యాగ్‌లైన్ పెట్టడంలోనే దర్శకుడి ఆలోచన విధానం కనపడుతుంది. మంచి దార్శనికత ఉన్న దర్శకుడు. స్క్రీన్‌ప్లే చక్కగా ఉంది. బ్యాక్ స్కోర్లోవచ్చిన వాయిస్ బావుంది. ప్రతి ఆర్టిస్ట్‌ని ఎంతో అందంగా చూపాడు. మంచి మేక ప్ ఉంది. నటీనటులు బాగా నటించారు. కాలేజీ లైఫ్, వాతావరణం చాలా సహజంగా ఉంది. ముఖ్యంగా ఇందులో నటించిన వారంతా చాలా ప్రొఫెషనల్‌గా ఉన్నారు. లఘుచిత్రంలా కాకుండా, చలనచిత్రం స్థాయిలో తీశాడు. ఇందులో ఇంగ్లీషు ప్రయోగం తగ్గించి, తెలుగు ఉపయోగించి ఉంటే కృత్రిమత్వం ఉండేది కాదు. ‘ఏరా, ఏమే’ అనే సంప్రదాయానికి స్వస్తి పలికితే బాగుంటుంది. కథనంలో కొంచెం స్పీడ్ ఉండాలి. హ్యాపీడేస్ టేకి ంగ్ లా ఉంది. ఏది ఏమైనా లఘుచిత్రానికి చలనచిత్ర స్థాయి తీసుకు వచ్చిన సాగర్‌కి ఆల్ ద బెస్ట్. -
రెండేళ్లకు నిండిన ‘సాగర్’
నిజాంసాగర్, న్యూస్‌లైన్ :రెండున్నర లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరందించే నిజాంసాగర్ ప్రాజెక్టు రెండేళ్లకు నిండింది. ఎగువ ప్రాంతా ల్లో కురిసిన వ ర్షాల వల్ల వచ్చిన వరద నీటితో ప్రాజెక్టును ఆదుకున్నాయి. వర్షాకాలం ఆరంభం నుంచి వర్షాలు కురవడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో జిల్లాలోని ఆయకట్టు పంటలకు సాగు, బాన్సువాడ, బోధన్, నిజామాబాద్ పట్టణ ప్రాంతాల ప్రజలకు తాగునీరు అందనుంది. అంతే కాకుండా ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న హెడ్‌స్లూయిస్ వి ద్యుదుత్పత్తి కేంద్రంలో జలవిద్యుదుత్పత్తి జరగనుంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి 1405 అడుగులు 17.8 టీఎంసీలకు ప్రస్తుతం 1403.42 అడుగులతో 15.557 టీఎం సీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 1,878 క్యూసెక్కుల మేర నీరు వచ్చిచేరుతోంది. ప్రాజెక్టు ఆయకట్టు కింద సాగు చేస్తున్న ఖరీఫ్ పంటలతో పాటు రబీసీజన్‌లో చివరి ఆయకట్టు వరకు పంటల సాగు కు ఢోకా లేదు. ప్రాజెక్టుకు ఎగువన ఉన్న సింగూరు జలాశయం సైతం ఆశించిన నీటితో నిండుకుండలా మారింది. దీంతో సింగూరు నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు రావాల్సిన వాటా నీరు యథాతథంగా రానుంది. తాగు, సాగుకు నీరు పుష్కలం నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఆయకట్టు కింద ఖరీఫ్, రబీపంటలకు సాగు నీరు పుష్కలంగా అందనుంది. చివరి ఆయకట్టు వరకు 2.5లక్షల ఎకరాల్లో పంటలను రైతులు సాగు చేస్తున్నారు. చివరి ఆయకట్టు ప్రాంతంలో సాగవుతున్న పంటలకు మాసాని, గుత్ప ఎత్తిపోతల పథకాల ద్వారా సాగునీరందుతుంది. అందు వల్ల అలీసాగర్ రిజర్వాయర్ దిగువ వరకు ఉన్న పంటలకు సాగర్ నీరు అందుతోంది. ఆశించిన స్థాయిలో జల విద్యుదుత్పత్తి నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నీరు నిండటంతో హెడ్స్లూ యిస్ విద్యుదుత్పత్తి కేంద్రంలో జల విద్యుదుత్పత్తికి ఢోకా లేదు. రెండు టర్బయిన్లద్వారా పది మెగా వాట్ల విద్యుదుత్పత్తి జరుగనుంది. ఈ ఏడాది స్థానిక విద్యుదుత్పత్తి కేం ద్రంలో విద్యుదుత్పత్తి ఇప్పటికే ప్రారంభమైయింది. దీనికి తోడు ప్రా జెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో రబీ పంటలకు సాగు నీరు విడుదల చేస్తే ఆశించిన స్థాయిలో విద్యుదుత్పత్తి జరుగనుంది. గతేడాది ప్రతికూల పరిస్థితులతో వెలవెల గతేడాది వర్షాభావం, ప్రతికూల పరిస్థితుల వల్ల ప్రాజెక్టు నిండలేదు. తద్వారా ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఆయకట్టు కింద పంటలు సాగుకు నోచుకోలేదు. దీనికి తోడు హెడ్‌స్లూయిస్ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో విద్యుదుత్పాదనకు నోచుకోలేదు. గతేడాది ప్రాజెక్టులో 1392.34 అడుగులతో 5.17 టీఎంసీల నీరు నిల్వ మాత్రం ఉంది. -
సాగర్‌కి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'
బుల్లితెరపై ‘మొగలి రేకులు’ సీరియల్కితో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సాగర్ హీరోగా ఓ చిత్రం రూపొందుతోంది. పి.ఏ.అరుణ్‌ప్రసాద్ దర్శకుడు. అభి స్టూడియోస్ పతాకంపై బి.సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాజేంద్రప్రసాద్, రాశి ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈ చిత్రానికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘విపత్కర పరిస్థితులనైనా ఎదిరించి చాకచక్యంగా తన పనిని పూర్తి చేసే సామర్థ్యం కలవాడు మా హీరో. అందుకే ఈ టైటిల్ పెట్టాం’’ అని చెప్పారు. ఈ పాటతో షూటింగ్ పూర్తవుతుంది. త్వరలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఈ సినిమాతో తనకు మంచి గుర్తింపు వస్తుందని సాగర్ అన్నారు. -
మాది ధర్మయుద్ధం
బయ్యారం అడవుల నుంచి ఎ.అమరయ్య, సాక్షి ప్రతినిధి: ‘‘మాది ప్రజాపంథా. ధర్మయుద్ధం. నిరుపేదలకు భూమి దక్కేలా చూడడమే మా లక్ష్యం. ఇందుకోసం శ్రమిస్తాం. ఎంతకైనా తెగిస్తాం. అందుకే ఆయుధాన్ని చేపట్టాం. దోపిడీ, పీడన లేని సమాజమే మా లక్ష్యం’’ అని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ 11 సాయుధ దళాల కమాండర్ సాగర్ స్పష్టంచేశారు. డిప్యూటీ కమాండర్లు గోపీ, సూర్యం, అశోక్‌లతో కలిసి ఆయన బయ్యారం అడవుల్లో మంగళవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రజల కోసం చేత పట్టిన ఆయుధాన్ని దింపబోమని, ప్రజా విముక్తి పోరులో భాగమే తమ తుపాకీ అని సాగర్ స్పష్టం చేశారు. ‘సుదీర్ఘ సైద్ధాంతిక విభేదాలతో ఇమడలేక మితవాదులతో విడిపోయాం. పాటూరి ఆదినారాయణ స్వామి ఎలియాస్ చంద్రన్న కార్యదర్శిగా ఎన్నుకున్నాం. ప్రజాస్వామిక ఆకాంక్షల్ని నెరవేర్చడమే ప్రస్తుత గమ్యం’ అని చెప్పారు. రాయల సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలోని రాష్ట్ర కమిటీపై మండిపడ్డారు. బోస్, డీవీ కృష్ణ, వేములపల్లి వెంకట్రామయ్య (వీవీ) ఓ పథకం ప్రకారం పార్టీని కబ్జా చేసే ప్రయత్నించారు. సాయుధ దళాలను నిర్వీర్యం చేశారు. మితవాదులుగా మారి సీపీఐ, సీపీఎంలతో మిలాఖత్కు తాపత్రయపడ్డారని విమర్శించారు. వీళ్లు ముగ్గురూ సమైక్యవాదులు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించకూడదన్నదే వీరి వాదన. సాయుధ దళాల కొనసాగింపు వీరికి ఏ మాత్రం ఇష్టం లేదు. గిరిజన వ్యతిరేకమైన పోలవరం ప్రాజెక్టు కట్టాలన్నారు. గిరిజన భూ హక్కుకు సంబంధించిన 1/70 చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. చివరకు చంద్రన్నపై అవినీతి, ఆర్థిక ఆరోపణలు చేయడంతో ఇక లాభం లేదనుకుని తెగతెంపులు చేసుకున్నాం’ అని వివరించారు. ‘మాది నిజమైన పార్టీ...చండ్రపుల్లారెడ్డి, పైలా వాసుదేవరావుల స్ఫూర్తిని మేం కొనసాగిస్తాం. ఈ త్రికూటమి చిట్‌ఫండ్ వ్యాపారాలకు, చేస్తున్న పంచాయితీలకు వంతపాడుతున్న మధు, పోటు రంగారావు, రాయల చంద్రశేఖర్‌లను ప్రజల ఎదుట దోషిగా నిలబెడతాం’ అని చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజల ఆకాంక్ష, తెలంగాణ వస్తే నక్సలైట్ల ప్రభావం పెరుగుతుందన్నది భ్రమ’ అని సాగర్ చెప్పారు.