బాధ్యత కలిగిన ‘సిద్దార్థ’
బాధ్యత కలిగిన ‘సిద్దార్థ’
Published Sun, Jan 26 2014 11:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
వెండితెర నుంచి బుల్లితెరకు చాలామంది స్టార్‌లు వచ్చారు. కానీ బుల్లితెర స్టార్లు వెండితెరపైకి రావడం అరుదు. ‘మొగలిరేకులు’లో చేసిన ఆర్కే నాయుడు పాత్ర ద్వారా ఇంటిల్లిపాదికీ దగ్గరైన సాగర్ హీరోగా ‘సిద్దార్థ’ అనే చిత్రం రూపొందనుంది. హవీష్ హీరోగా తొలి ప్రయత్నంగా రామదూత క్రియేషన్స్ పతాకంపై ‘జీనియస్’ చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం హవీష్‌తోనే ‘వస్తా నీ వెనక’ చిత్రం నిర్మిస్తున్న దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.
సరేశ్చంద్ర దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ కథ అద్భుతంగా ఉంది. వచ్చే నెల పూజా కార్యక్రమాలు జరిపి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘ప్రముఖ సంస్థల్లో దర్శకత్వ శాఖలో చేశాను. తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఓ యువకుని కథ ఇది’’ అన్నారు. సాగర్ సరసన ప్రముఖ హీరోయిన్ నటించే ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, కెమెరా: సతీష్, మాటలు: విస్సు, జనార్థన్, కెమెరా: సతీష్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేష్.
Advertisement
Advertisement