మరో లెవల్‌కి చేర్చే సినిమా : దాసరి
‘‘నో డౌట్... ‘సిద్ధార్థ్’ ఘనవిజయం సాధించడం ఖాయం’’ అని దాసరి కిరణ్‌కుమార్, సాగర్ అంటున్నారు. ఒకరు నిర్మాత... మరొకరు హీరో. మంచి ఫిల్మ్ తీశాననే ఆనందంలో కిరణ్‌కుమార్, మంచి సినిమాలో నటించామనే సంతృప్తితో సాగర్ ఉన్నారు. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్‌పై దయానంద్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ముత్యాల రమేశ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. దాసరి కిరణ్, సాగర్ చెప్పిన విశేషాలు...
♦ విస్సు ఇచ్చిన బలమైన కథకు పరుచూరి బ్రదర్స్ అంతే బలమైన మాటలు ఇచ్చారు. దయానంద్ అద్భుతమైన టేకింగ్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. మణిశర్మ ఇచ్చిన పాటలు, ఎస్. గోపాల్‌రెడ్డి కెమేరా.. అన్నీ అద్భుతంగా ఉంటాయి. లవ్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్ని రకాల అంశాలతో రూపొందిన ఫుల్ మీల్ లాంటి మూవీ ఇది.
♦ ఈ కథకు సాగర్ అయితేనే యాప్ట్ అని తనను హీరోగా తీసుకున్నాం. నా నమ్మకం వమ్ము కాలేదు. యాక్షన్, లవ్, సెంటిమెంట్.. అన్నింట్నీ బ్రహ్మాండంగా పండించాడు. ఈ సినిమా చూసినవాళ్లు సాగర్‌లో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని కచ్చితంగా అంటారు.
♦ మంచి సినిమా తీస్తున్నామనే నమ్మకంతోనే సినిమా మొదలుపెట్టా. ఫస్ట్ కాపీ చూశాక విజయంపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. మంచి సినిమా తీస్తే సరిపోదు.. అది జనాలకు బాగా రీచ్ కావాలనే ఆలోచనతోనే పబ్లిసిటీ పరంగా రాజీపడలేదు. మా రామదూత క్రియేషన్స్ పేరుని మరో లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది.
♦ కథానాయికలు రాగిణీ నంద్వాని, సాక్షీ చౌదరి అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రాగిణి నటన అందర్నీ హత్తుకుంటుంది. టోటల్‌గా అందరూ ఓన్ చేసుకునే సినిమా ఇది.
ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చా - సాగర్
♦ నటుడు కావాలనే ఆకాంక్ష నాలో కలిగింది నందమూరి తారక రామారావుగారి వల్లే. ఆయన ఆత్మవిశ్వాసం, అంకితభావం, నటుడిగా ఆయన ప్రతిభ నాకు ఆదర్శం. రామారావుగారి తర్వాత నేను బాగా ఇష్టపడింది చిరంజీవిగార్ని. చిన్నప్పుట్నుంచీ నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. కొంచెం పెద్దయ్యాక మనం స్క్రీన్ మీద బాగుంటామా? అని చిన్ని కెమెరాతో చెక్ చేసుకున్నా. ఆ తర్వాత పెద్ద కెమేరాతో. ‘మొగలి రేకులు’టీవీ సీరియల్ నటుడిగా నన్ను అందరికీ దగ్గర చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను వెండితెర వైపు అడుగులు వేసేలా చేసింది. ‘సిద్ధార్థ్’ని ఆదరించి, ఇంకా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నా.
♦ దాసరి కిరణ్‌కుమార్‌గారి లాంటి నిర్మాత దొరకడం లక్ అని చెప్పాలి. ఓ సొంత బ్రదర్ లాంచింగ్ సినిమాని నిర్మించినట్లుగా ‘సిద్ధార్థ్’ని నిర్మించారు. ఇదే బేనర్‌లోనే నా నెక్ట్స్ సినిమా ‘హరి’ ఉంటుంది. ‘సిద్ధార్థ్’లో ఎన్నారై కుర్రాడి పాత్ర చేశాను. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. యాక్షన్‌తో పాటు లవ్, సెంటిమెంట్.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌కి స్కోప్ ఉన్న కథ ఇది. బేసిక్‌గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి, ఎంత రిస్కీ సీన్ అయినా ఇష్టంగానే ఉంటుంది. మలేసియాలో చేసిన ఛేజింగ్ సీన్ కొంచెం కష్టం అనిపించింది. అయినా చాలా ఎంజాయ్ చేశా.
♦ నాకు ఫిజికల్ ఫిట్‌నెస్ అంటే ఆసక్తి. టీవీ సీరియల్ చేసినప్పుడే చాలా ఫిట్‌గా ఉండేవాణ్ణి. అది ఈ సినిమాకి హెల్ప్ అయింది. ప్రత్యేకంగా మేకోవర్ అవ్వాల్సిన అవసరంలేదు. కాకపోతే ఎన్నారై కుర్రాడి పాత్ర కాబట్టి అందుకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను. దయానంద్‌రెడ్డిగారు సినిమాని చాలా బాగా తీశారు. సక్సెస్ విషయంలో కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదం దక్కుతుందని నమ్ముతున్నాం.