Dasari Kiran Kumar
-
వ్యూహం సినిమా వివాదం.. హైకోర్టు కీలక ఆదేశాలు!
టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం రిలీజ్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ మూవీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ కీలక ఉత్తర్వులిచ్చింది. అయితే ఈ సినిమాపై సింగిల్బెంచ్లోనే తేల్చుకోవాలన్న ఉన్నత న్యాయస్థానం.. మెరిట్స్ ఆధారంగా చేసుకుని ఈనెల 8వ తేదీనే పిటిషన్‌పై తుది తీర్పు ఇవ్వాలని సూచించింది. కాగా.. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును దాసరి కిరణ్‌కుమార్ సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. తాజాగా దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆదేశాలిచ్చింది. కాగా.. వ్యూహం సినిమాకు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికెట్ చట్టవిరుద్ధమని.. ఏపీ రాజకీయాలను ప్రభావం చేసేలా సినిమా ఉందంటూ టీడీపీ లీడర్ నారా లోకేశ్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. దీంతో లోకేష్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ బెంచ్.. ఈ నెల 11వ తేదీ సినిమా రిలీజ్ చేయవద్దంటూ ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. -
'వ్యూహం' నిర్మాత బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో ఆర్జీవీ
డైరెక్టర్ ఆర్జీవీ పుట్టినరోజు వేడుకల్లో కనిపించాడు. అవును మీరు సరిగానే విన్నారు. సాధారణంగా ఇలాంటి వాటికి దూరంగా ఉండే రామ్‌గోపాల్ వర్మ.. నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నాడు. ఆయన్ని తన డెన్‌కి ఆహ్వానించి నిలువెత్తు పూలమాలతో సత్కరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!) రామదూత క్రియేషన్స్ అధినేత నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కాంబోలో ప్రస్తుతం 'వ్యూహం', 'శపథం' సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఇందులో తొలి భాగమైన 'వ్యూహం' మూవీ త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనుంది. (ఇదీ చదవండి: చెప్పిన టైమ్ కంటే ముందే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హిట్ సినిమా) Wishing a very very HAPPY BIRTHDAY to my VYOOHAM film producer @dkkzoomin 💐💐💐🔥🔥🔥 pic.twitter.com/QlpN8HAgY2 — Ram Gopal Varma (@RGVzoomin) November 28, 2023 -
RGV: ఆర్జీవీ వ్యూహం.. రిలీజ్ డేట్‌పై క్రేజీ అప్డేట్!
టాలీవుడ్ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం వ్యూహం. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్‌కుమార్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. వ్యూహం సినిమా రిలీజ్‌ను ఆపేయాలని టీడీపీ నాయకుడు లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా రిలీజ్‌ను మేకర్స్ వాయిదా వేశారు. రివైజింగ్ కమిటీ సినిమా చూసిన తరవాత కొత్త విడుదల తేదీ ప్రకటిస్తామని ఆర్జీవీ గతంలోనే చెప్పారు. తాజాగా ఆర్జీవీ ఈ విషయంపై ట్వీట్ చేశారు. వ్యూహం సినిమా త్వరలోనే థియేటర్లలో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు సినిమా పోస్టర్‌ను తన ట్విటర్లో పంచుకున్నారు. ఈ సినిమాపై గతంలోనే ఆర్జీవీ మాట్లాడుతూ.. ప్రముఖ నాయకుడు, దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి గారు మరణించినప్పుడు ఎవరికి వారు వ్యూహాలు పన్నారు. అందులో నాకు తెలిసినవే వ్యూహం సినిమా ద్వారా చెప్తున్నాను. నేను నమ్మిన దాన్ని సినిమా తీస్తున్నానని రామ్‌గోపాల్ వర్మ క్లారిటీ ఇచ్చాడు. గతంలో ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటామని.. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం చిత్రాన్ని రిలీజ్ చేసుకుంటామని వెల్లడించారు. pic.twitter.com/WTUeAA7Fmk — Ram Gopal Varma (@RGVzoomin) November 19, 2023 -
మా వ్యూహం మాకుంది
‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు. అలాగే మా ‘వ్యూహం’ సినిమా విడుదలను కూడా ఆపలేరు. ఈలోగా మా సినిమాపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. ఒకవేళ మా చిత్రం రిలీజ్‌కి అడ్డంకులు సృష్టిస్తే ఏం చేయాలో మా వ్యూహం మాకుంది’’ అని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన చిత్రం ‘వ్యూహం’. దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తొలి భాగం ఈ నెల 10న విడుదల కావాల్సి ఉంది. అయితే రిలీజ్‌ని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్మీట్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ–‘‘వ్యూహం’ చూసిన సెన్సార్ సభ్యులు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నట్లు సమాచారం ఇచ్చారు. ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో కారణాలు చెప్పలేదు. దీంతో ప్రస్తుతానికి సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే ‘ఉడ్తా పంజాబ్, పద్మావత్’ వంటి హిందీ సినిమాలకు కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెచ్చుకున్నట్లే మేమూ తెచ్చుకుంటాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా ‘వ్యూహం’ను రిలీజ్ చేసుకుంటాం. ఈ సినిమా విడుదల ఆపాలని నారా లోకేశ్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. అయితే అదెంత నిజమో చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెప్పినట్లే ‘వ్యూహం’ ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. అది ఎవరైనా వింటారా? లేదా అన్నది అర్థం లేని ప్రశ్న. సినిమా ఇవ్వడం వరకే నా బాధ్యత’’ అన్నారు. ‘‘మా సినిమాను రివైజింగ్ కమిటికీ పంపినా నష్టం జరగదు. మేము అనుకున్నట్లే అన్నీ సకాలంలో జరుగుతాయని ఆశిస్తున్నాం. కొత్త రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తాం’’అన్నారు దాసరి కిరణ్ కుమార్. -
వ్యక్తుల సంఘర్షణే వ్యూహం
‘‘నాకు టీడీపీ గురించి తెలియదు. వైసీపీ గురించి తెలియదు. నేను రాజకీయాలు ఫాలో కాను. ఈ ‘వ్యూహం’ చిత్రానికి పార్టీలకు, ప్రభుత్వాలకు సంబంధం లేదు. ఇది కేవలం వ్యక్తుల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ (సంఘర్షణ)’’ అని దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. అజ్మల్, మానస ప్రధాన పాత్రధారులుగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన తాజా పోలిటికల్ చిత్రం ‘వ్యూహం’. ఈ సినిమా రెండో భాగం ‘శపథం’. రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ‘వ్యూహం’ సినిమా నవంబరు 10న, ‘శపథం’ చిత్రం జనవరి 25న విడుదల కానున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన ‘వ్యూహం’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ – ‘‘వాస్తవ సంఘటనలు, వాటి తాలూకు పాత్రల పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉంటూనే ఉంటుంది. నా దర్శకత్వంలో వచ్చిన సినిమాల్లో దాదాపు 80 శాతం వరకు ఏదో ఒక సంఘటన నుంచి స్ఫూర్తి ΄పొందినవే ఉంటాయి’’ అన్నారు. దాసరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ –‘‘ప్రజలకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ అంశాలను ΄పొందుపరిచి ఓ సందేశంగా.. సినిమాగా చెప్పాలనిపించి, సమయానుకూలంగా ‘వ్యూహం’ని ఇప్పుడు నిర్మించి, విడుదల చేస్తున్నాం. ఇది బయోపిక్ కాదు. ఈ సినిమాని చాలా పెద్ద స్థాయిలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఐదు లక్షల మందితో నవంబరు 5న ప్రీ రిలీజ్ వేడుకను భారీ ఎత్తున జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
'వ్యూహం' కోసం ఎవరి పర్మిషన్ అవసరం లేదు.. వర్మ సంచలన కామెంట్లు
సంచలనాత్మక దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘వ్యూహం’ అనే సినిమాని తెరకెక్కిస్తున్న విషం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను ఆయన తాజాగా విడుదల చేశారు. ఇప్పటికే ఆయన పలు బయోపిక్ సినిమాలను ఉన్నది ఉన్నట్లుగా తీసి మంచి గుర్తింపు పొందాడు. తాజాగా వ్యూహం, శపథం అనే రెండు భాగాలతో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి గార్ల జీవిత చరిత్రలను ఆయన తెరకెక్కిస్తున్నాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. 'ఈ సినిమా వెనుక ఎలాంటి వ్యూహం లేదు. ఈ మూవీలో నిజం మాత్రమే ఉంది. వ్యూహం రెండు భాగాలుగా వస్తుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలతో ఈ రెండు సినిమాలు ఉంటాయి. నేను చాలా సౌమ్యుడిని. నేను ఎప్పుడు చంద్రబాబుని కలవలేదు. నాకు జగన్ గారు అంటే ఒక అభిప్రాయం ఉంది. అలాగే చంద్రబాబు గారు అంటే కూడా ఒక అభిప్రాయం ఉంది. కానీ నిజమనేది మాత్రమే ఈ సినిమాలో ప్రజలు చూస్తారు. జగన్ గారి మీద నాకు ఉన్న అభిప్రాయం వ్యూహం సినిమాలో కనపడుతుంది. మిగతా వారిపై నాకు ఎలాంటి అభిప్రాయం లేదు... నేను వేరే వాళ్ల మీద సినిమా తియ్యమంటే తియ్యను. ఈ సినిమాలో నేను నమ్మిన నిజం ఉంది. పబ్లిక్ డొమైన్లో ఉన్న జీవితాలను సినిమా తియ్యడానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు. నేను గతంలో లక్ష్మిస్ ఎన్టీఆర్ , సర్కార్ వంటి సినిమాలు అలా తీసినవే. నేను జగన్ గారి మీద ఉన్న అభిమానంతో సినిమా తీశాను. కానీ ఇక్కడ ప్యాకేజ్ అనేదానికి ఆస్కారం లేదు. నాకు టీడీపీ గురించి కానీ వైసీపీ గురించి కానీ వేరే పార్టీ గురించి కానీ తెలీదు. నేను నమ్మిన నిజం మాత్రమే సినిమాలో చూపిస్తున్నాను. నా రీసెర్చ్‌లో వెనుక ఏమి జరిగింది అనేదే ఈ సినిమా. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గారి పాత్ర కూడా ఉంది. ఆ కష్టాలు జగన్ గారు మాత్రమే పడ్డారు దేశంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా పడని కష్టాలు వైఎస్ జగన్ గారు పడ్డారు. అందుకే ఈ సినిమా తిస్తున్నట్లు వ్యూహం నిర్మాత దాసరి కిరణ్ కుమార్ చెప్పారు. కూడు గుడ్డ లేని వారికి పేద ప్రజల సంక్షేమానికి జగన్ గారి ప్రభుత్వం ఎంతో చేస్తుంది. దీంతో ఆయన ప్రజల గుండెళ్లో చిరస్థాయిగా ఉంటారు. ప్రజలు మళ్లీ వైఎస్ జగన్ గారికే పట్టం కడతారు. ఇదే తథ్యం అని కిరణ్ కుమార్ అన్నారు. -
సీఎం జగన్‌కు ఆజన్మాంతం రుణపడి ఉంటాను: దాసరి కిరణ్
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులుగా నియమించి, శ్రీవారికి సేవ చేసుకునే భాగ్యం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆజన్మాంతం రుణపడి ఉంటానని టీటీడీ బోర్డు సభ్యుడు, సినీ నిర్మాత దాసరి కిరణ్ అన్నారు. దాసరి కిరణ్ కుమార్ టీటీడీ బోర్డు మెంబర్ అయిన సందర్భంగా తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ అధ్యక్షతన తెనాలిలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. మంత్రి మేరుగు నాగార్జున, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణారావు, బాపట్ల ఎంపి నందిగామ సురేశ్, సినీ దర్శకులు బాబి కొల్లి, త్రినాధరావు, మిత్రులు, అభిమానులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ..‘టీటీడీ బోర్డు మెంబర్ అనేది ఒక పదవి కాదు.. శ్రీవారికి చేసే సేవ. ఇంత గొప్ప అవకాశం సీఎం జగన్ రూపంలో ఆ దేవుడు నాకు ఇచ్చినట్లు భావిస్తున్నాను’ అన్నారు. ‘కిరణ్‌లాంటి మంచి మనిషికి దేవుని సేవ చేసుకునే అదృష్టం కలగడం చాలా ఆనందంగా ఉంది’అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘నేను చిరంజీవి అభిమానిగా ఉన్నప్పట్నుంచి దాసరి కిరణ్ అన్న నాకు పరిచయం. కిరణ్ అన్న చేసిన కార్యక్రమాలు నాకు తెలుసు. ఎంతో మందికి సాయం చేశారు. ఆ మంచితనమే కిరణన్నని ఈ రోజు ఇంతటి ఉన్నత స్థానంలో నిలబెట్టింది’ అని దర్శకుడు బాబీ అన్నారు. -
టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్ నియామకం
సాక్షి, అమరావతి: టీటీడీ బోర్డు సభ్యునిగా దాసరి కిరణ్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్న ఎం.హరి జవహర్ లాల్ జీవో జారీ చేశారు. టీటీడీ బోర్డుకు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి కూడా ప్రాతినిధ్యం ఉంది. దాసరి కిరణ్ కుమార్ తెలుగు సినిమా రంగానికి చెందిన వారు. నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మించారు. 24 మంది సభ్యుల బోర్డు సభ్యుల్లో ఒకరిగా నిర్మాత దాసరి కిరణ్ కుమార్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
నాకెందుకు దండేశారో నాకర్థం కాలేదు: ఆర్జీవీ ట్వీట్ వైరల్
రామ్ గోపాల్ వర్మ.. సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ ఈ పేరు. ఆయన తీసే సినిమాలతో పాటు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు కూడా అప్పుడప్పుడు వివాదస్పదం అవుతాయి. ఏ అంశంపైనైనా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఈ దర్శకుడికి అలవాటు. తాజాగా నిర్మాత దాసరి కిరణ్ బర్త్‌డే పై కూడా కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు ఆర్జీవీ. ఆయనకు బర్త్‌డే విషెస్ చెబుతూ ఓ ఫోటోని ట్విటర్లో షేర్ చేశాడు. అందులో ఆర్జీవీ మెడలో పెద్ద పూల దండ ఉంది. ఆ ఫోటోని ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘మా ‘వ్యూహం’ప్రొడ్యూసర్ దాసరి కిరణ్ కుమార్ గారి బర్త్‌డేకి నాకెందుకు దండేశారో నాకర్థం కాలేదు. వెరీ వెరీ హ్యాపీ బర్త్‌డే. టు దాసరి కిరణ్’ అని ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఆర్జీవీ త్వరలోనే రాజకీయాలపై ‘వ్యూహం’ అనే చిత్రం తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి దాసరి కిరణ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. pic.twitter.com/PpYtcMpIjU — Ram Gopal Varma (@RGVzoomin) November 29, 2022 -
టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా దాసరి కిరణ్ కుమార్
Dasari Kiran Kumar: వ్యాపారవేత్త, రామదూత క్రియేషన్స్ అధినేత, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ‘తిరుమల తిరుపతి దేవస్థానం’ బోర్డు ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తనని టీటీడీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, టీటీడీ బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: శ్రీవారిని దర్శించుకున్న సమంత -
వంగవీటికి వందకి వంద
‘‘వంగవీటి మోహనరంగాగారు మరణించి 28 ఏళ్లయింది. తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రయోగాత్మక చిత్రాలు... వాస్తవ సంఘటనలు, నిజజీవిత కథల ఆధారంగా సినిమాలు తీసే నిర్మాతలు చాలామంది ఉన్నారు. సున్నితమైన అంశాన్ని స్పృశించడం ఎందుకు? అనుకున్నారో ఏమో! 28 ఏళ్లుగా వంగవీటి కథను ఎవరూ ఎంపిక చేసుకోలేదు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమర్థవంతంగా సినిమా తీసి మెజారిటీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాను’’ అన్నారు దాసరి కిరణ్‌కుమార్. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మించిన సినిమా ‘వంగవీటి’. 1973 నుంచి 88 మధ్య విజయవాడలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 23న విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా దాసరి కిరణ్‌కుమార్ చెప్పిన విశేషాలు.... ► మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసిన చిత్రమిది. అప్పటి సంఘటనలను ప్రజల ముందుకు తీసు కెళ్లాలనే లక్ష్యంతో తీశా. ‘వంగవీటి’ అనగానే కొందరు ఆయన జీవితకథ అనుకుని, మెంటల్‌గా ప్రిపేర్ అయి థియేటర్లకు వచ్చారు. ‘‘వంగవీటి మోహనరంగా బయోపిక్ కాదిది. రాధా నుంచి రంగా హత్య వరకూ జరిగిన సంఘటనల సమాహారమే ఈ సినిమా’’ అని వర్మ మొదట్నుంచీ చెబుతున్నారు. ►సినిమా బాగోలేదంటే సెకండ్ షోకి జనాలు లేని పరిస్థితి. డీమానిటైజేషన్ ప్రభావం వల్ల థియేటర్లకు జనాలు వచ్చి డబ్బులు ఖర్చుపెట్టే పరిస్థితి లేదు. ఈ తరుణంలో విజయవాడలో 9, గుంటూరులో 7 షోలు, భీమవరంలో మిడ్నైట్ రెండింటికి షో వేశారు. ‘రంగాగారిపై ప్రజల్లో ఉన్న అభిమానం చెక్కు చెదరలేదు’ అనడానికి ఇదే నిదర్శనం. ►‘‘సినిమా చూశాం. చాలా బాగుంది, బాగా తీశారు. రాధా, రంగాలను డీసెంట్‌గా చూపించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల్లో పేదల పక్షాన నిలబడి పోరాటం చేసిన ఓ వ్యకిగా రాధాగారిని బాగా చూపించారు. ఫస్టాఫ్‌లో రాధాగారిని చూసిన తర్వాత సెకండాఫ్‌లో రంగాగారిపై మరిన్ని సీన్లు చూపిస్తారని ఆశించాం’’ అని రంగాగారి అభిమానులు చెప్పారు. వాళ్ల అభిప్రాయాన్ని గౌరవిస్తాను. నా వ్యక్తిగత అభిప్రాయం కూడా అదే. సినిమా చూసిన తర్వాత రాధాగారి తరహాలో రంగాగారిని మరో పది నిమిషాలు చూపిస్తే బాగుంటుందనుకున్నా. ► ఓ సినిమాగా చూస్తే ‘వంగవీటి’ పర్ఫెక్ట్. వందకి వంద మార్కులు వేసుకోగలిగే సినిమా. ఈ సినిమా విడుదలకు ముందూ తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురవుతాయని ముందే ఊహించా. వాటిని ఎదుర్కోగలననే ధైర్యంతో, ఆత్మ విశ్వాసంతో ఈ సినిమా తీశా. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత కాలం ఈ సినిమా గురించి చెప్పుకుంటారు. ►సినిమా రిలీజ్ టైమ్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సహకరించిన ఏపీ పోలీస్ సిబ్బంది, డీజీపీ నండూరి సాంబశివరావుగారికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ►సంక్రాంతి తర్వాత తదుపరి సినిమా వివరాలు ప్రకటిస్తా. ప్రస్తుతం వర్మగారు అమితాబ్ బచ్చన్‌తో ‘సర్కార్–3’ చేస్తున్నారు. ఈ స్క్రిప్ట్‌ని ఈ నిర్మాత హ్యాండిల్ చేయగలడనే నమ్మకం ఆయనకు కలిగితే, ఏ నిర్మాతకైనా సినిమా తీసే ఛాన్స్ వస్తుందని నా భావన. ఆయన ఎప్పుడంటే అప్పుడు మళ్లీ సినిమా తీయడానికి నేను రెడీ. -
`వంగవీటి` విడుదల తేదీ ప్రకటించిన వర్మ
విజయవాడ నగరంలోఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన కొంతమంది వ్యక్తులు, కొన్ని సంఘటనలు ఆధారంగా రామ్‌గోపాల్ వర్మ ‘వంగవీటి’ సినిమా చేయబోతున్నానని అనౌన్స్ చేయగానే సినిమాపై చాలా ఆసక్తి పెరిగింది. రామదూత క్రియేషన్స్ బ్యానర్‌పై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుండి ప్రేక్షకుల్లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదల చేసిన వంగవీటి ట్రైలర్‌కు రెండు మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికే విడుదలైన పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ.. ``విజయవాడ రౌడీయిజంపై నా దర్శకత్వంలో రూపొందుతోన్న `వంగవీటి` నాకు చాలా ప్రత్యేకమైన చిత్రం. అప్పట్లో అక్కడ జరిగిన చాలా సంఘర్షణలకు నేను ప్రత్యక్షసాక్షిని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే రవి శంకర్ మ్యూజిక్‌లో రూపొందిన మిగిలిన పాటలు కూడా అందరినీ ఆకట్టుకుంటాయి. డిసెంబర్ 3న వంగవీటి ఆడియో విడుదల కార్యక్రమాన్ని విజయవాడలోని కోనేరు లక్ష్మయ్య యూనివర్సిటీ గ్రౌండ్స్‌లో పలువురి ప్రముఖుల సమక్షంలో విడుదల చేయనున్నాం. ఇప్పుడు నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామ`ని తెలిపారు. ఈ సినిమాకు సాహిత్యం సిరాశ్రీ, చైతన్యప్రసాద్ అందించారు. సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్, కె.దిలీప్ వర్మ, సూర్య చౌదరి, ఎడిటర్: సిద్ధార్థ్ తాతోళ్లు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విస్సు. -
మరో లెవల్‌కి చేర్చే సినిమా : దాసరి
‘‘నో డౌట్... ‘సిద్ధార్థ్’ ఘనవిజయం సాధించడం ఖాయం’’ అని దాసరి కిరణ్‌కుమార్, సాగర్ అంటున్నారు. ఒకరు నిర్మాత... మరొకరు హీరో. మంచి ఫిల్మ్ తీశాననే ఆనందంలో కిరణ్‌కుమార్, మంచి సినిమాలో నటించామనే సంతృప్తితో సాగర్ ఉన్నారు. లంకాల బుచ్చిరెడ్డి సమర్పణలో రామదూత క్రియేషన్స్‌పై దయానంద్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం విడుదల కానుంది. ముత్యాల రమేశ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. దాసరి కిరణ్, సాగర్ చెప్పిన విశేషాలు... ♦ విస్సు ఇచ్చిన బలమైన కథకు పరుచూరి బ్రదర్స్ అంతే బలమైన మాటలు ఇచ్చారు. దయానంద్ అద్భుతమైన టేకింగ్ ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసేలా ఉంటుంది. మణిశర్మ ఇచ్చిన పాటలు, ఎస్. గోపాల్‌రెడ్డి కెమేరా.. అన్నీ అద్భుతంగా ఉంటాయి. లవ్, యాక్షన్, సెంటిమెంట్.. ఇలా అన్ని రకాల అంశాలతో రూపొందిన ఫుల్ మీల్ లాంటి మూవీ ఇది. ♦ ఈ కథకు సాగర్ అయితేనే యాప్ట్ అని తనను హీరోగా తీసుకున్నాం. నా నమ్మకం వమ్ము కాలేదు. యాక్షన్, లవ్, సెంటిమెంట్.. అన్నింట్నీ బ్రహ్మాండంగా పండించాడు. ఈ సినిమా చూసినవాళ్లు సాగర్‌లో మంచి హీరో మెటీరియల్ ఉన్నాడని కచ్చితంగా అంటారు. ♦ మంచి సినిమా తీస్తున్నామనే నమ్మకంతోనే సినిమా మొదలుపెట్టా. ఫస్ట్ కాపీ చూశాక విజయంపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. మంచి సినిమా తీస్తే సరిపోదు.. అది జనాలకు బాగా రీచ్ కావాలనే ఆలోచనతోనే పబ్లిసిటీ పరంగా రాజీపడలేదు. మా రామదూత క్రియేషన్స్ పేరుని మరో లెవల్‌కి తీసుకెళ్లే సినిమా అవుతుంది. ♦ కథానాయికలు రాగిణీ నంద్వాని, సాక్షీ చౌదరి అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో రాగిణి నటన అందర్నీ హత్తుకుంటుంది. టోటల్‌గా అందరూ ఓన్ చేసుకునే సినిమా ఇది. ప్రేక్షకుల ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చా - సాగర్ ♦ నటుడు కావాలనే ఆకాంక్ష నాలో కలిగింది నందమూరి తారక రామారావుగారి వల్లే. ఆయన ఆత్మవిశ్వాసం, అంకితభావం, నటుడిగా ఆయన ప్రతిభ నాకు ఆదర్శం. రామారావుగారి తర్వాత నేను బాగా ఇష్టపడింది చిరంజీవిగార్ని. చిన్నప్పుట్నుంచీ నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్. కొంచెం పెద్దయ్యాక మనం స్క్రీన్ మీద బాగుంటామా? అని చిన్ని కెమెరాతో చెక్ చేసుకున్నా. ఆ తర్వాత పెద్ద కెమేరాతో. ‘మొగలి రేకులు’టీవీ సీరియల్ నటుడిగా నన్ను అందరికీ దగ్గర చేసింది. బుల్లితెర ప్రేక్షకులు ఇచ్చిన ప్రోత్సాహమే నన్ను వెండితెర వైపు అడుగులు వేసేలా చేసింది. ‘సిద్ధార్థ్’ని ఆదరించి, ఇంకా ఎంకరేజ్ చేస్తారని నమ్ముతున్నా. ♦ దాసరి కిరణ్‌కుమార్‌గారి లాంటి నిర్మాత దొరకడం లక్ అని చెప్పాలి. ఓ సొంత బ్రదర్ లాంచింగ్ సినిమాని నిర్మించినట్లుగా ‘సిద్ధార్థ్’ని నిర్మించారు. ఇదే బేనర్లోనే నా నెక్ట్స్ సినిమా ‘హరి’ ఉంటుంది. ‘సిద్ధార్థ్’లో ఎన్నారై కుర్రాడి పాత్ర చేశాను. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా. యాక్షన్‌తో పాటు లవ్, సెంటిమెంట్.. ఇలా అన్ని ఎలిమెంట్స్‌కి స్కోప్ ఉన్న కథ ఇది. బేసిక్‌గా నాకు యాక్టింగ్ అంటే ఇష్టం కాబట్టి, ఎంత రిస్కీ సీన్ అయినా ఇష్టంగానే ఉంటుంది. మలేసియాలో చేసిన ఛేజింగ్ సీన్ కొంచెం కష్టం అనిపించింది. అయినా చాలా ఎంజాయ్ చేశా. ♦ నాకు ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఆసక్తి. టీవీ సీరియల్ చేసినప్పుడే చాలా ఫిట్‌గా ఉండేవాణ్ణి. అది ఈ సినిమాకి హెల్ప్ అయింది. ప్రత్యేకంగా మేకోవర్ అవ్వాల్సిన అవసరంలేదు. కాకపోతే ఎన్నారై కుర్రాడి పాత్ర కాబట్టి అందుకు తగ్గట్టుగా మౌల్డ్ అయ్యాను. దయానంద్రెడ్డిగారు సినిమాని చాలా బాగా తీశారు. సక్సెస్ విషయంలో కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. ప్రేక్షకుల ఆశీర్వాదం దక్కుతుందని నమ్ముతున్నాం. -
ఎలాంటి రోల్స్‌కైనా రెడీ!
‘‘ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చాను. హీరోగా ఇమేజ్ చట్రంలో బందీ కాకుండా నటుడిగా మంచి పేరు, దర్శక- నిర్మాతల హీరో అనిపించుకోవాలనుంది. ప్రేక్షకులు కొత్తదనాన్ని ఆదరిస్తున్నారు. వైవిధ్యమైన పాత్రలు, సినిమాలు చేయడా నికి నేను రెడీ’’ అన్నారు సాగర్. ఆయన హీరోగా దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన ‘సిద్ధార్థ’ ఈ నెల 16న విడుదలవుతోంది. సాగర్ చెప్పిన సంగతులు... ♦ ‘మిస్టర్ పర్ఫెక్ట్’లో చిన్న పాత్ర చేసి తప్పు చేశాననిపించింది. ప్రేక్షకులు నా నుంచి అలాంటి పాత్రలు ఆశించడం లేదని అర్థమైంది. అదే నన్ను ‘సిద్ధార్థ’ వైపు నడిపించింది. ఈ మేకోవర్ కోసం ఏడాది కష్టపడ్డా. యాక్షన్ సీన్స్ కష్టమైనా ఇష్టపడి చేశా. రిజల్ట్‌పై కాన్ఫిడెంట్‌గా ఉన్నా. ♦ గౌతమ బుద్ధుడిగా మారిన ‘సిద్ధార్థ’ మనకు తెలుసు. మా ‘సిద్ధార్థ’ లక్ష్యం ఏంటి? అతనేం చేశాడనేది సినిమా చూసి తెలుసుకోవాలి. అనంతపురం ఫ్యాక్షన్ నేపథ్యంలో నడిచే ఓ ఎన్నారై యువకుడి ప్రేమకథ. ♦ మా చిత్ర దర్శకుడు కేవీ దయానంద్‌రెడ్డి గతంలో పవన్‌కల్యాణ్ టీమ్‌లో పదిహేనేళ్లు పనిచేశారు. ప్రతి విషయంలోనూ ఆయనకు మంచి పట్టుంది. నాకు ఇండస్ట్రీలో మంచి స్థానం ఏర్పడాలని పరు చూరి బ్రదర్స్, సినిమాటోగ్రాఫర్ ఎస్.గోపాల్‌రెడ్డి, మణిశర్మ, దయా నంద్ వంటి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ ఎంతో ప్రేమతో చేసిన చిత్రమిది. ♦ ఓ సినిమా జనాల్లోకి వెళ్లాలంటే.. మూవీ మేకింగ్, ప్లానింగ్, ప్రేక్షకులకు ఏయే అంశాలు నచ్చుతాయనే అంశాలపై అవగాహన ముఖ్యం. మా చిత్ర నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ అటువంటి వ్యక్తే. మా ఇద్దరి భావాలూ కలిశాయి. నా తదుపరి సినిమా ‘హరి’లో పవర్ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపిస్తాను. కిరణ్‌కుమార్ గారి రామదూత క్రియేషన్స్, అవ్యక్ ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభమవుతుంది. -
సిద్ధార్థ నుంచే వంగవీటి వస్తోంది
- రామ్‌గోపాల్ వర్మ ‘‘సిద్ధార్థ పేరుతో నాకు స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది. నేను గూండాలు, రౌడీలు, హింస గురించి నేర్చుకున్నది విజయవాడ సిద్ధార్థ కాలేజీలోనే. అక్కడ నేర్చుకున్న రౌడీయిజం నుంచే దాసరి కిరణ్ నిర్మాతగా ‘వంగవీటి’ తీస్తున్నాను. బహుశా.. ఈ కనెక్షన్ మా నిర్మాత కూడా ఆలోచించి ఉండరు’’ అని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సాగర్ హీరోగా కేవీ దయానంద్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా ‘సిద్ధార్థ’. రాగిణీ నంద్వాణి, సాక్షీ చౌదరి హీరోయిన్లు. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ‘‘సాగర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కమర్షియల్ అంశాలన్నీ ఉన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ‘‘మొగలిరేకులు’ సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి తెలిసిన సాగర్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు దయానంద్ మంచి సినిమా తీశారు. గోపాల్‌రెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. బుచ్చిరెడ్డిగారు, విస్సు సహకారంతో సినిమా బాగా వచ్చింది’’ అన్నారు. ‘‘జీవితంలో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఈ సినిమాతో నాకు మంచి కుటుంబం ఏర్పడింది’’ అన్నారు సాగర్. ‘‘దాసరి కిరణ్ ఆలోచనలు గొప్పగా ఉంటాయి. విడుదల తర్వాత సాగర్ తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకుంటాడు’’ అని కేవీ దయానంద్ అన్నారు. చిత్ర సమర్పకులు లంకాల బుచ్చిరెడ్డి, సహనిర్మాత ముత్యాల రమేశ్, దర్శకులు బి.గోపాల్, బాబీ, నిర్మాతలు రాజ్ కందుకూరి, ‘మల్టీడైమన్షన్’ వాసు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, హీరో హవీష్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రేమ.. యాక్షన్.. కామెడీ...
సాగర్ హీరోగా కేవీ దయానంద్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న చిత్రం ‘సిద్ధార్థ’. రాగిణీ నంద్వాణి, సాక్షీ చౌదరి హీరోయిన్లు. మణిశర్మ సంగీతమందించిన పాటల్ని సెప్టెంబర్ 2న విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. వినోదంతో పాటు మంచి ఎమోషనల్ కంటెంట్ ఉంటుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ మంచి మ్యూజిక్ అందించారు. కథకు తగ్గట్టు పరుచూరి బ్రదర్స్ అద్భుతమైన డైలాగులు రాశారు. సెప్టెంబర్‌లోనే చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు. కోట శ్రీనివాసరావు, అజయ్, సుబ్బరాజు తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: ముత్యాల రమేశ్. -
దీనికి అన్నీ ప్లస్లే!
స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతోన్న వ్యక్తి దాసరి కిరణ్‌కుమార్. రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌కు చేరుకున్న కిరణ్ ఏ పని చేసినా తనదైన ముద్ర కనబరుస్తానంటున్నారు. ‘జీనియస్’ చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రామ్‌లీల’ నేడు తెరకొస్తోంది. కోనేరు సత్యనారాయణ సమర్పణలో హవీష్, అభిజిత్, నందిత ముఖ్యతారలుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్ర విశేషాలను దాసరి కిరణ్‌కుమార్ ఈ విధంగా చెప్పారు. హవీష్‌తో సినిమాలు నిర్మించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే ‘జీనియస్’ తర్వాత మళ్లీ వెంటనే తనతోనే ‘రామ్ లీల’ చేశాను. ఈ చిత్రకథకు వంద శాతం తనే నప్పుతాడు. నటుడిగా హవీష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కచ్చితంగా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది. ఓ విశిష్టమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ఈ చిత్రం తర్వాత శ్రీపురం కిరణ్ పెద్ద దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. ఎంత బాగా కథ చెప్పాడో అంత బాగా తెరకెక్కించాడు. అభిజిత్ చేసిన పాత్ర చాలా బాగుంటుంది. నందిత అందచందాలు, అభినయం ఓ ప్లస్ పాయింట్. విస్సు రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. ఎస్. గోపాలరెడ్డిగారి ఫొటోగ్రఫీ హైలైట్. చిన్నా ఇచ్చిన పాటలకు మంచి స్పందన వస్తోంది. 36 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసినప్పటికీ ఎక్కడా రాజీపడలేదు. అన్ని వర్గాలవారికీ నచ్చే చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో చేశాం. ఈ చిత్రం ఎవరినీ నిరాశపరచదు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలన్నదే నా ఆశయం. ఇక ముందూ కొత్త దర్శకులతో సినిమాలు నిర్మిస్తాను. -
హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం
- దాసరి కిరణ్‌కుమార్ ‘‘ఈ చిత్రనిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నాకు చిరంజీవిగారి అభిమానిగా పరిచయం. ఎంతో కష్టపడి ఆయన నిర్మాతగా మారారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హవీష్, అభిజిత్, నందిత, అక్ష హీరో హీరోయిన్లుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి చిన్నా పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వీవీ వినాయక్ సీడీని ఆవిష్కరించి కోనేరు సత్యనారాయణకు ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని దర్శకుడు బాబీ ఆవిష్కరించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఓ చక్కని కథతో శ్రీపురం కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాసరి కిరణ్ రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం మంచి ఫలితానివ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. కిరణ్‌కుమార్ మంచి చిత్రాలు తీయాలనే తపన ఉన్న నిర్మాత అని బి. గోపాల్ చెప్పారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘మా విశ్వ విద్యాలయాన్ని హవీష్ బాగా చూసుకునేవాడు. సినిమాలంటే తనకు ఆసక్తి కావడంతో ప్రోత్సహించాం. వాస్తవానికి ‘జీనియస్’కన్నా ముందు చేయాల్సిన చిత్రం ఇది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మా సంస్థ నుంచి వచ్చిన గత చిత్రం ‘జీనియస్’ని మించిన విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంటుంది. హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. చక్కని అవగాహనతో దర్శకుడు ఈ సినిమా తీశారు’’ అని చెప్పారు. ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని హవీష్ అన్నారు. ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకోవాలని ఎస్. గోపాల్‌రెడ్డి, చిన్నా అభిలషించారు. ఈ వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు, విస్సు, ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బాధ్యత కలిగిన ‘సిద్దార్థ’
వెండితెర నుంచి బుల్లితెరకు చాలామంది స్టార్లు వచ్చారు. కానీ బుల్లితెర స్టార్లు వెండితెరపైకి రావడం అరుదు. ‘మొగలిరేకులు’లో చేసిన ఆర్కే నాయుడు పాత్ర ద్వారా ఇంటిల్లిపాదికీ దగ్గరైన సాగర్ హీరోగా ‘సిద్దార్థ’ అనే చిత్రం రూపొందనుంది. హవీష్ హీరోగా తొలి ప్రయత్నంగా రామదూత క్రియేషన్స్ పతాకంపై ‘జీనియస్’ చిత్రాన్ని నిర్మించి, ప్రస్తుతం హవీష్తోనే ‘వస్తా నీ వెనక’ చిత్రం నిర్మిస్తున్న దాసరి కిరణ్‌కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సరేశ్చంద్ర దర్శకుడు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఈ కథ అద్భుతంగా ఉంది. వచ్చే నెల పూజా కార్యక్రమాలు జరిపి, మార్చిలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అని చెప్పారు. ‘‘ప్రముఖ సంస్థల్లో దర్శకత్వ శాఖలో చేశాను. తొలి ప్రయత్నంగా దర్శకత్వం వహించబోతున్న ఈ చిత్రానికి మంచి కథ కుదిరింది. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఓ యువకుని కథ ఇది’’ అన్నారు. సాగర్ సరసన ప్రముఖ హీరోయిన్ నటించే ఈ చిత్రానికి సంగీతం: చిన్నా, కెమెరా: సతీష్, మాటలు: విస్సు, జనార్థన్, కెమెరా: సతీష్, ఎడిటింగ్: కార్తీక్ శ్రీనివాస్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేష్. -
క్యూట్ పెయిర్‌తో స్వీట్ లవ్‌స్టోరీ
‘‘పబ్లిసిటీ డిజైనింగ్ నుంచి వచ్చిన మా దర్శకుడు రమేష్ వర్మకు మంచి విజన్ ఉంది. ప్రేమకథలను తను చాలా అందంగా తెరకెక్కించగలడు. హవీష్, ఇషాలాంటి క్యూట్ పెయిర్‌తో చేస్తున్న లవ్‌స్టోరీ ఇది. జనవరి మూడోవారంలో యూరప్‌లో చిత్రీకరణ మొదలుపెడతాం’’ అని నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ తెలిపారు. హవీష్, ఇషా జంటగా రమేష్‌వర్మ దర్శకత్వంలో ఆయన నిర్మిస్తోన్న ‘వస్తా నీ వెనక’ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి డి.రామానాయుడు కెమెరా స్విచాన్ చేయగా, దాసరి నారాయణరావు క్లాప్ ఇచ్చారు. బి.గోపాల్ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా రమేష్‌వర్మ మాట్లాడుతూ -‘‘రైడ్, వీర తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. సంగీతానికి అధిక ప్రాధాన్యం ఉంటుంది’’ అని చెప్పారు. కథ తనను అమితంగా ఆకట్టుకుందని ఇషా అన్నారు. బద్రినాథ్, జీనియస్ తర్వాత తాను చేస్తున్న సినిమా ఇదని రచయిత విస్సు చెప్పారు. ముక్కోణ ప్రేమకథ ఇదని హవీష్ పేర్కొన్నారు. బ్రహ్మానందం, అలీ, రాజా రవీంద్ర, విస్సు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: విజయ్ కె.చక్రవర్తి, స్క్రిప్ట్ కో ఆర్డినేటర్: పాత్రికేయ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: మురళీకృష్ణ.