దీనికి అన్నీ ప్లస్‌లే! | Ram Leela to release on Feb 27 | Sakshi
Sakshi News home page

దీనికి అన్నీ ప్లస్‌లే!

Published Thu, Feb 26 2015 11:30 PM | Last Updated on Sat, Sep 2 2017 9:58 PM

దీనికి అన్నీ ప్లస్‌లే!

దీనికి అన్నీ ప్లస్‌లే!

స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతోన్న వ్యక్తి దాసరి కిరణ్‌కుమార్. రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌కు చేరుకున్న కిరణ్ ఏ పని చేసినా తనదైన ముద్ర కనబరుస్తానంటున్నారు. ‘జీనియస్’ చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రామ్‌లీల’ నేడు తెరకొస్తోంది. కోనేరు సత్యనారాయణ సమర్పణలో హవీష్, అభిజిత్, నందిత ముఖ్యతారలుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్ర విశేషాలను దాసరి కిరణ్‌కుమార్ ఈ విధంగా చెప్పారు.
 
  హవీష్‌తో సినిమాలు నిర్మించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే ‘జీనియస్’ తర్వాత మళ్లీ వెంటనే తనతోనే ‘రామ్ లీల’ చేశాను. ఈ చిత్రకథకు వంద శాతం తనే నప్పుతాడు. నటుడిగా హవీష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కచ్చితంగా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది.  ఓ విశిష్టమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ఈ చిత్రం తర్వాత శ్రీపురం కిరణ్ పెద్ద దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. ఎంత బాగా కథ చెప్పాడో అంత బాగా తెరకెక్కించాడు.
 
  అభిజిత్ చేసిన పాత్ర చాలా బాగుంటుంది. నందిత అందచందాలు, అభినయం ఓ ప్లస్ పాయింట్. విస్సు రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. ఎస్. గోపాలరెడ్డిగారి ఫొటోగ్రఫీ హైలైట్. చిన్నా ఇచ్చిన పాటలకు మంచి స్పందన వస్తోంది.   36 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసినప్పటికీ ఎక్కడా రాజీపడలేదు. అన్ని వర్గాలవారికీ నచ్చే చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో చేశాం. ఈ చిత్రం ఎవరినీ నిరాశపరచదు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలన్నదే నా ఆశయం. ఇక ముందూ కొత్త దర్శకులతో సినిమాలు నిర్మిస్తాను.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement