Nandita
-
ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఈమే..
ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్‌కార్ట్‌కు అత్యంత ఆదరణ తీసుకొచ్చింది బిగ్‌బిలియన్ డేస్ సేల్. ఇది దేశంలోనే అతిపెద్ద ఆన్లైన్ షాపింగ్ ఫెస్టివల్. ఈ సేల్ నిర్వహించినప్పుడు కొనుగోళ్లు విపరీతంగా ఉంటాయి. కారణం ఈ సమయంలో లభించే ఆఫర్లు. అయితే ఈ బిగ్‌బిలియన్ డేస్ సేల్ సృష్టికర్త ఎవరో తెలుసా? మింత్రా దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ మార్కెట్ ప్లేస్‌లలో ఒకటి. వాల్-మార్ట్ యాజమాన్యంలో ఉన్న ఈ ఈ-కామర్స్ వెబ్సైట్ ఒక సూపర్ ఉమన్ సీఈవోగా ఉన్నారు. ఆమే నందితా సిన్హా. అంచెలంచెలుగా ఎదిగి కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. నందితా సిన్హా 2022 జనవరి 1న మింత్రా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయ్యారు. ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ రంగాలలో ఆమెకు 16 సంవత్సరాల అనుభవం ఉంది. హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్‌లో కెరీర్ ప్రారంభించిన ఆమె బ్రిటానియా లో కూడా పనిచేశారు. సమ్మర్ ట్రైనీగా ప్రారంభించి 2009లో కస్టమర్ మేనేజర్‌గా నిష్క్రమించారు. ఐదేళ్లపాటు హెచ్‌యూఎల్‌లో కొనసాగారు. బ్రిటానియాలో ఆమె ప్రోడక్ట్ మేనేజర్‌గా పనిచేశారు. మీడియా ప్లానింగ్, కమ్యూనికేషన్‌కు బాధ్యత వహించారు. ఆ తరువాత ఆమె మైబేబీకార్ట్ (MyBabyCart.com) అనే ఈ-కామర్స్ స్టార్టప్‌ను ఏర్పాటు చేశారు. నందితా సిన్హా 2013లో ఫ్లిప్‌కార్ట్‌లో చేరారు. ఆ తర్వాత ఆ కంపెనీ మింత్రాను కొనుగోలు చేసింది. ఫ్లిప్‌కార్ట్ వాల్‌మార్ట్ యాజమాన్యంలోకి వెళ్లింది. నందితా సిన్హా ఎనిమిదేళ్లకుపైగా ఫ్లిప్‌కార్ట్‌లో ఉన్నారు. ఆమె లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్‌లో ఆమె కస్టమర్ల ఆకర్షణ, గ్రోత్ ఫంక్షన్‌కు నాయకత్వం వహించారు. ఫ్లిప్‌కార్ట్ బ్రాండ్‌ను నిర్మించడంలో ఆమె పాత్ర కీలకమైనది. బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నడిపించింది ఈమే. మింత్రా సీఈవో కావడానికి ముందు నందితా సిన్హా కస్టమర్ గ్రోత్, మీడియా, ఎంగేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా చేశారు. లక్నోకు చెందిన ఆమె ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వారనాసీ (బనారస్ హిందూ యూనివర్సిటీ) నుంచి బీటెక్ చేసిన ఆమె ప్రతిష్టాత్మక ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎఫ్ఎంఎస్) నుంచి మార్కెటింగ్ అండ్ స్ట్రాటజీలో ఎంబీఏ చేశారు. -
పెళ్లికి ముందే విడిపోయిన హీరో.. ఎంగేజ్మెంట్ రద్దు
ఇండస్ట్రీలో ఈమధ్య ప్రేమ-విడాకులు కామన్ అయిపోయాయి. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. మరికొందరేమో నిశ్చితార్థం చేసుకొని పెళ్లి కాకుండానే బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ హీరో విద్యుత్ జమ్వాల్ తన ప్రేయసికి బ్రేకప్ చెప్పేశారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ఊసరవెల్లి, శక్తి, తుపాకీ సినిమాల్లో నటించిన విద్యుత్ బాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కమాండో సీక్వెల్, ఖుదా హాఫీజ్, జంగ్లీ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన విద్యుత్ కొంతకాలంగా నందితా మహ్తానీ అనే ఫ్యాషన్ డిజైనర్‌తో ప్రేమలో ఉన్నాడు. 2021 సెప్టెంబరులో వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుతారనుకుంటే ఇలా బ్రేకప్ చెప్పేసి షాక్ ఇచ్చారు. రీసెంట్గా అనన్య కజిన్ పెళ్లికి విడివిడిగా హాజరైన విద్యుత్-నందితా పెడమొహంగా కనిపించారు. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా బ్రేకప్‌కు సంబంధించిన కొటేషన్స్‌ని షేర్ చేశారు. బీటౌన్ క్యూట్ కపుల్‌గా కనిపించిన ఈ జంట బ్రేకప్ ఫ్యాన్స్‌కు షాకిచ్చినట్లయ్యింది. -
స్వస్తిక్
‘‘స్వస్తిక్.. పూజలప్పుడు, దసరాకి బండి పూజ చేసేప్పుడు తప్ప ఈ సింబల్‌ని, ఈ పేరుని నేను ఎక్కడా వినలేదు తెల్సా?’’ ఆశ్చర్యం. ‘‘హ్మ్... యు నో ముగ్ధా! మా క్లాస్‌లో అప్ టు పీజీ, ఈవెన్ ఎట్ ఆఫీస్.. నాదే యూనిక్ నేమ్’’ సేమ్ సర్ప్రయిజ్ అవతలి వైపు నుంచి కూడా!‘‘చిన్నప్పుడు రాత్రిళ్లు నైట్‌మేర్స్‌తో భయపడితే .. మా నాన్నమ్మ నా బెడ్ కింద పసుపు, కుంకుమతో స్వస్తిక్ ముగ్గు వేసేది...’’ నవ్వు ఎమోజీతో. ‘‘ఇప్పుడూ వస్తాయా.. నైట్ మేర్స్?’’మళ్లీ నవ్వు ఎమోజీ.. తర్వాత తనే ‘‘అవునూ నీకు దయ్యాలంటే భయమా?’’ ‘‘హేయ్.. ఆ క్వశ్చన్ నేను అడగాలి.. ’’ స్వస్తిక్. వరుసగా ఓ నాలుగు నవ్వు ఎమోజీలు ముగ్ధ నుంచి.‘‘ఇప్పుడా..? భయమా? నాకా?’’ మళ్లీ నవ్వు ఎమోజీ.థమ్స్ అప్ పెట్టాడు స్వస్తిక్‘‘అమ్మ వస్తున్నట్టుంది. ఉంటా మరి బై..’’ ముగ్ధ. ‘‘మళ్లీ ఎప్పుడు ఆన్‌లైన్‌కి?’’ స్వస్తిక్.‘‘ఎప్పుడూ ఆన్లైనే..’’ముగ్ధ.ఈసారి స్వస్తిక్ నుంచి నవ్వు ఎమోజీ‘‘సరే.. బై ఫర్ నౌ’’ అని పెడ్తూ ఆఫ్ అయిపోయింది ముగ్ధ. ఆమె షట్‌డౌన్ చేసేకంటే కొన్ని నిమిషాల ముందు.. తలుపులు వేసున్న కూతురు గది దగ్గరికి వచ్చి తలుపు తట్టబోయింది నందిత. ‘‘నందితా.. ఏమైంది’’ అంటూ భుజమ్మీద చేయి పడేసరికి వెనక్కి తిరిగింది. ‘‘అమ్మాయి గదిలో అలికిడి వినపడితే...’’ అంటూ ఆగిపోయింది. ఆమె భుజాలు పట్టుకొనితమ గది వైపు మరలిస్తూ ‘‘అమ్మాయి పడుకుంది నందితా’’ అంటూ ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు భర్త.‘‘లేదు.. పడుకోలేదు’’ అంటూ మళ్లీ కూతురు గదివైపు తిరిగే ప్రయత్నం చేసింది. ఆమె బయటకు వెళ్లకుండా తలుపులేస్తూ ‘‘పడుకో నందితా...’’ అన్నాడు అనునయంగా. కానీ నందితలో ఆందోళన ఆమెను నిద్రపోనివ్వలేదు. ‘‘శ్లోకా.. ముగ్ధ ఎఫ్బీలో ఫోటోస్ అప్డేట్ అవుతున్నాయే’’ షాకింగ్‌గా ఉంది నూర్‌కి.‘‘వ్వాట్?’’ అదిరిపడింది శ్లోక. ‘‘యెస్. స్వస్తిక్ లైక్స్ కొడ్తున్నాడు, కామెంట్స్ కూడా పెడ్తున్నాడే’’ అదే షాక్ కంటిన్యూ అవుతూ నూర్. ‘‘ఏదీ.. చూద్దాం’’ అంటూ గబగబా తన సెల్ఫోన్లో ఎఫ్బీ ఓపెన్ చేసి చూసింది. నిజమే. కూర్గ్‌కి వెళ్తూ దిగిన ఫోటోస్. ఈ పొద్దునే పోస్ట్ చేసినట్టుంది. దిమ్మ తిరిగింది శ్లోకకి. సన్నగా కాళ్లలో వణుకు. స్వస్తిక్కి ఫోన్ ట్రై చేసింది. స్విచ్డ్ ఆఫ్. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే కూర్గ్‌లో స్వస్తిక్‌ని కలిసేవాళ్లు. ముగ్ధ అతనితో ఫోన్లో మాట్లాడ్తున్నప్పుడు పక్కనుంచి వీళ్లూ ‘‘హాయ్, హలో’’ అంటూఆటపట్టించడమే తప్ప అతణ్ణి చూడలేదు, మాట్లాడలేదు ఇంతవరకు.తర్వాత రోజూ పనిగట్టుకొని మరీ ఎఫ్బీ చెక్ చేశారు నూర్, శ్లోక. ఇంకొన్ని ఫోటోస్ అప్డేట్ అయ్యున్నాయి. ఇద్దరి మొహంలో నెత్తురు చుక్కలేదు. ‘‘ఆంటీ వాళ్లు అబ్జర్వ్‌చేసి ఉంటారా? చెబ్దామా?’’ అంది నూర్. తలూపింది శ్లోక ఏదో లోకంలో ఉన్నట్టు. అదే రోజు రాత్రి..‘‘ఏమండీ... ఏమండీ’’ కలవరం నందిత స్వరంలో. ‘‘ఊ.. ’’ అంటూ బద్ధకంగా అటు తిరిగి పడుకున్నాడు ఆమె భర్త. ‘ మళ్లీ చప్పుడండీ..లేవండీ’’ భర్తను తట్టి లేపుతోంది. ‘‘ఏంలేదు .. పడుకో’’ కళ్లు మూసుకునే జవాబు చెప్పాడు భర్త. ‘‘కాదండీ.. ల్యాప్‌టాప్ కీబోర్డ్ శబ్దం వినిపిస్తోంది’’ అంటూ ఆయన వీపు తడుతోంది. ‘‘అబ్బబ్బ..నీ అనుమానంతో చంపుతున్నావ్! నిద్రపోనివ్వవా?’’ విసుక్కుంటూనే లేచి కూర్చున్నాడు. అదేమీ పట్టించుకోకుండా ‘‘వినండీ’’ అంటూ తలను కాస్త వంచి చెవులు రిక్కించింది నందిత. నిర్లక్ష్యంగా కుడిచేతి చిటికెన వేలును కుడి చేవిలో పెట్టుకొని తిప్పుకుంటూ ముసుగుదన్నబోతూ ఆగాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే ‘‘ష్...’’ అని నోటి మీదవేలువేసుకుంటూ నెమ్మదిగా మంచం దిగాడు. గది తలుపులు తెరిచాడు. ‘‘స్లక్.. స్లక్.. స్లక్.. స్లక్.. ’’ల్యాప్‌టాప్ కీబోర్డ్ టైప్ చేస్తున్న శబ్దం చాలా స్పష్టంగా వినపడుతోంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో. అడుగులోఅడుగు వేసుకుంటూ కూతురి గది దగ్గరకు వెళ్లాడు. వెనకాలే భార్య కూడా. టక్కున కీబోర్డ్ శబ్దం ఆగిపోయింది. భార్య వంక చూశాడు. ‘‘నేను చెప్పలేదా?’’ అన్నట్టు చూసింది భర్తను. ‘‘ఉదయం నూర్ వాళ్లూ ఫోన్‌చేశారు.. ముగ్ధ ఎఫ్బీలో యాక్టివ్‌గా ఉందని’’ యాడ్ చేసింది నందిత.కూతురి గది తలుపు తెరిచాడు. స్టడీ టేబుల్ మీదున్న ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉంది. ఆమె ఫేస్బుక్లో చాట్ విండో ఓపెన్ చేసి ఉంది. కుర్చీలో కూర్చున్నాడు విష్ణు. పక్కనే నందిత నిలబడింది.వణుకుతున్న చేతులతో కర్సర్‌ను కదిలిస్తూ చాట్ చదవడం ఆరంభించాడు. దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆ కిందటి క్షణం దాకా చాటింగ్ సాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిలోకూడా చెమటలను పుట్టిస్తోంది భయం. సెకన్లలోనే తేరుకుని మంచం కింద, కప్బోర్డ్ పైన, బాత్రూమ్లో.. ఇల్లంతా.. ఇంటి ముందు వాకిలి, వెనక పెరడు.. అంతా వెదికాడు భర్త. ఎక్కడా ఏ అనవాలూ లేదు. మరి ఈ చాటింగ్ ఏంటీ? నందిత అయితే స్థాణువైంది.ఇన్నాళ్లూ తన భార్యది భ్రమ, భ్రాంతి అనుకున్నాడు.కానీ కాదు. గబగబా స్వస్తిక్ ఎఫ్బీ ఎకౌంట్ చూశాడు. ఫోన్ నంబర్ ఉంది. తలుపులు తెరిచాడు సుభాష్. ఎదురుగా ఉన్న జంటను చూసి త్వరగానే పోల్చుకున్నాడు ఆ ఉదయం ఫోన్ చేసిన వారే అయ్యుంటారని. అయినా ‘‘నేను విష్ణు.. తను నా మిసెస్ నందిత’’ అంటూ పరిచయం చేసుకున్నాడు విష్ణు.‘‘అనుకున్నానండీ మీరే అని.. రండి.. రండి’’ అంటూ సాదరంగా లోపలకి ఆహ్వానించాడు సుభాష్. ‘‘కూర్చోండి’’ అని సోఫా చూపిస్తూ వాళ్లావిడను కేకేశాడు. నందిత వయసున్న స్త్రీయే వచ్చింది లోపలి నుంచి. పరిచయం చేశాడు సుభాష్. ఆ జంట కూడా నందితా వాళ్లకు ఎదురుగా ఉన్న సోఫాలో కుర్చున్నారు. గొంతు సవరించుకున్నాడు విష్ణు ఏదో గంభీరమైన విషయం చెప్పడానికి నాందిగా. ‘‘సర్.. మా అమ్మాయి ముగ్ధ. టీసీఎస్‌లో పనిచేసేది’’ చెప్తూన్నాడు. ఆసక్తిగా వింటున్నారు సుభాష్, అతని భార్య. ‘‘మా అమ్మాయికి మీ అబ్బాయి ఎప్పుడు పరిచయమయ్యాడో తెలీదు కానీ రెండుమూడు నెలల నుంచి చాటింగ్ చేసుకుంటున్నట్టున్నారు. మాకు నిన్ననే తెలిసిందండీ.. నిన్న కూడా మా అమ్మాయి మీ అబ్బాయితో చాట్ చేసింది’’ అంటూ ఆపాడు చిన్న నిట్టూర్పుతో విష్ణు. ఇప్పుడు సుభాష్ తన భార్య వంక చూశాడు. ఆమె.. నందిత, విష్ణుల వైపు విస్మయంగా చూసింది.‘‘ఒక్కసారి లోపలికి వస్తారా?’’ ఆ ఇద్దరినీ అడిగింది సోఫాలోంచి లేస్తూ. ఆ ఇద్దరికీ అయోమయం.సుభాష్‌ను చూశారు. ‘‘రండి’’అంటూ తనూ సోఫాలోంచి లేస్తూ ముందుకు సాగాడు. ఆ జంటను అనుసరిస్తూ నందిత, విష్ణూ ఓ గదిలోకి వెళ్లారు. అశనిపాతం తగిలినట్టు చేష్టలుడిగిపోయారు. ఎదురుగా గోడ మీద లైఫ్ సైజ్ ఫోటోకి దండ వేసి ఉంది. ‘‘ఈ అబ్బాయి..’’ అంటూ ఆగింది నందిత. ‘‘మా అబ్బాయే! స్వస్తిక్. యేడాది అవుతోంది...’’ గొంతు పెగల్లేదు ఆమెకు బాధతో.‘‘మా అమ్మాయి కూడా. ఇరవై రోజులకిందట కూర్గ్‌కి వెళుతూ యాక్సిడెంట్లో’’ పూర్తిచేయలేకపోయింది నందిత ఈసారి ఆ ఇద్దరూ అప్రతిభులయ్యారు. - సరస్వతి రమ -
విశ్వామిత్ర టీజర్: నందిత మళ్లీ భయపెడుతుందా?
రాజ్‌కిరణ్ సినిమా బ్యానర్‌పై రూపొందుతోన్న చిత్రం ‘విశ్వామిత్ర’ టీజర్ విడుదలైంది. నందితరాజ్, ప్రసన్నకుమార్, సత్యం రాజేశ్, అశుతోష్ రాణా, విద్యుల్లేఖా రామన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. రాజ్‌కిరణ్ దర్శకత్వంలో మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. యూఎస్‌లో జరిగిన ఒక యథార్థ ఘటనను ఆధారంగా చేసుకుని హారర్, థ్రిల్లర్ జానర్‌గా ఈ సినిమా ప్రేక్షకులముందుకు రాబోతోంది. ప్రేమకథా చిత్రంలో దెయ్యం ప్రాతలో అలరించిన నందిత మరి ఈ సినిమాలో కూడా భయపెట్టబోతోందా?, లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
నిజజీవిత సంఘటనల ఆధారంగా ‘విశ్వామిత్ర’
గీతాంజలి సినిమాతో దర్శకుడి మంచి విజయం సాధించిన రాజ్‌కిరణ్, రెండో ప్రయత్నంగా తెరకెక్కించిన త్రిపుర సినిమాతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో కొంత గ్యాప్ తీసుకొని ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో నిర్మాతగా మారి విశ్వామిత్ర సినిమాను తెరకెక్కిస్తున్నారు. అమెరికాలో జరిగిన నిజ జీవిత సంఘటన ఆధారంగా థ్రిల్లర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నందిత రాజ్, సత్యం రాజ్, విద్యుల్లేఖ రామన్, అశుతోష్ రానాలు కీలకపాత్రలో నటిస్తున్నారు. రాజ్ కిరణ్ సినిమా బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను మాధవి అద్దంకి, రజనీకాంత్.ఎస్‌లు నిర్మిస్తున్నారు. -
ఓంపురి ఆకస్మిక మృతి
► గుండెపోటుతో కన్నుమూసిన విలక్షణ నటుడు ► బాలీవుడ్, రాజకీయ నేతల సంతాపం ముంబై/సాక్షి, హైదరాబాద్: నటనకు కొత్త భాష్యం పలికిన విలక్షణ నటుడు, సమాంతర చిత్రాల దిగ్గజం ఓంపురి(66) ఇకలేరు. ముంబైలో స్వగృహంలో శుక్రవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో ఆయన ఆకస్మిక గుండెపోటుతో మృతిచెందారు. ఓం పురి వంటగదిలో నేలపై విగతజీవిలా కనిపించారని ఆయన మాజీ భార్య నందిత చెప్పారు. ఓం పురి, నందితలకు ఇషాన్ అనే కుమారుడు ఉన్నాడు. ఓంపురి భౌతికకాయాన్ని అమితాబ్ బచ్చన్, షబానా అజ్మీ, శేఖర్ కపూర్ తదితర సినీ ప్రముఖులు సందర్శించి, నివాళి అర్పించారు. అంత్యక్రియలను ఓషివారా శ్మశాన వాటికలో కుమారుడు పూర్తి చేశాడు. అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. ఓం పురి మృతిపై బాలీవుడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. షారుక్ ఖాన్, శ్యాం బెనగళ్, మీరా నాయర్, ప్రియాంకా చోప్రా తదితరులు ఆయనతో తమ సినీ అనుభవాలను గుర్తుచేసుకున్నారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ కూడా సంతాపం తెలిపారు. భారత సినీ పరిశ్రమ గొప్ప నటుణ్ని కోల్పోయిందని ప్రణబ్ అన్నారు. ‘సామాజిక చైతన్యం ఉన్న నటుడిని కోల్పోయాం’ అని సోనియా పేర్కొన్నారు. ఓం పురి వర్ధమాన నటులకు ఆదర్శమని, సినీపరిశ్రమకు ఆయన మరణం తీరని లోటు అని తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. సహజ నటుడు..: బాలీవుడ్ హీరో అంటే ‘అందంగా ఉండాల’నే భావనను ఓం పురి బద్దలు కొట్టాడు. పాత్రల స్వభావాలను అత్యం త సహజంగా ప్రదర్శించడం ఆయనకు కొట్టినపిండి. ‘అర్ధ్ సత్య,’ ‘ఆక్రోశ్’, ‘మిర్చ్ మసాలా’, ‘సద్గతి’, ‘దిశ’, ‘భూమిక’ వంటి మరెన్నో చిత్రాలు ఆయన నటనా పటిమకు అద్దం పడతా యి. బాలీవుడ్లోనే కాకుండా హాలీవుడ్‌లోనూ.. ‘గాంధీ’, ‘సిటీ ఆఫ్ జాయ్’, ‘ఊల్ఫ్’, ‘ఈస్ట్ ఈజ్ ఈస్ట్’ వంటి చిత్రాలతో మెప్పించారు. తెలుగు చిత్రం ‘అంకురం’లోనూ కనిపించారు. పలు మలయాళీ సినిమాల్లోనూ నటించిన ఆయనకు కేరళలో పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. ‘విజేత’, ‘ద్రోహ్ కాల్’, ‘చాచీ 420’, ‘దేవ్’, ‘ఘాయల్’ వంటి ప్రధాన స్రవంతి సినిమాల్లోనూ సత్తా చాటారు. హరియాణాలోని అంబాలాలో జన్మించిన ఓం పురి పుణేలోని ప్రఖ్యాత ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో నటనలో పాఠాలు నేర్చుకున్నారు. మరో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా ఆయనకు సహధ్యాయి. 1976లో ‘ఘాసీరామ్ కొత్వాల్’ మరాఠీ సినిమాతో తెరంగేట్రం చేసిన ఓం పురి 300కుపైగా చిత్రాల్లో నటించారు. జాతీయ ఉత్తమ నటుడు, పద్మశ్రీ వంటి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. జాతీయ చలనచిత్ర పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ గానూ పనిచేశారు. బ్రిటిష్ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఆయనను ‘హానరరీ ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్’ పురస్కారంతో సత్కరించింది. నందిత ‘ఓం పురి: అన్ లైక్లీ హీరో’(2009) పేరుతో ఆయన జీవిత చరిత్రను రాశారు. ‘నేను ఈ లోకం నుంచి వెళ్లిపోయాక నటుడిగా తను చేసిన కృషిని ప్రపంచం గుర్తిస్తుంది. యువతరం.. ముఖ్యంగా సినీ విద్యార్థులు నా చిత్రాలను చూస్తారు’ అని ఒంపురి గత డిసెంబర్లో ఇచ్చిన ఇంటర్యూలో చెప్పారు. అనుకున్నదాన్ని నిర్భయంగా చెప్పే ఓం పురి.. గోవధపై నిషేధానికి వ్యతిరేకంగా, నక్సల్స్‌కు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. -
ఆగస్ట్‌లో ఎళ్‌కుత్తు
ఎళ్‌కుత్తు చిత్రం ఆగస్ట్‌లో విడుదలకు ముస్తాబవుతోంది. వరుసగా పలు చిత్రాలను నిర్మిస్తున్న కెనన్నా ఫిలింస్ ఆధినేత జే.సెల్వకుమార్ నిర్మిస్తున్న చిత్రం ఎళ్‌కుత్తు. ఇంతకు ముందు ఆయన అట్టకత్తి దినేశ్, నందిత జంటగా తిరుడన్ పోలీస్ వంటి విజయవంతమైన చిత్రాన్ని నిర్మించారు. దానికి కార్తీక్‌రాజా దర్శకుడు. అదే కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఆ ఎళ్‌కుత్తు. బాలశరవణన్, జాన్‌విజయ్, చాయాసింగ్, శ్రీమాన్, శరత్, దిలీప్ సుబ్బరాయన్ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి జస్టిన్‌ప్రభాకరన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం గురించి నిర్మాత సెల్వకుమార్ తెలుపుతూ ఇది కుమరి జిల్లా సముద్ర ప్రాంత గ్రామాల అందాలను తెరపై ఆవిష్కరించే చిత్రం అన్నారు. ఆ ప్రాంతంలోని మత్స్యకారుల జీవితాల ఇతివృత్తంగా ఎళ్‌కుత్తు చిత్రం ఉంటుందన్నారు. వైవిధ్యభరిత చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తున్న తమ సంస్థ నుంచి వస్తున్న తాజా చిత్రం ఇదని తెలిపారు. చిత్రాన్ని ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న బ్రూస్లీ, సంతానం హీరోగా నిర్మిస్తున్న సర్వర్‌సందరం చిత్రాలను వరుసగా తెరపైకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. -
నందితకు అవకాశం దక్కేనా?
సీక్వెల్ ట్రెండ్ అన్నది కోలీవుడ్‌లోనే ఎక్కువగా సాగుతోందని చెప్పవచ్చు. ఆ తరహా చిత్రాలు మంచి విజయాలను పొందడం అందుకు ఒక కారణం కావచ్చు. అలా సీక్వెల్ చిత్రాల్లో మరో చిత్రం చేరబోతోందన్నది తాజా సమాచారం. అట్టకత్తి చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన నటి నందిని యువ నటుడు విజయ్‌సేతుపతి జంటగా నటించిన చిత్రం ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా. ఈ చిత్రం అప్పట్లో మంచి విజయానే సొంతం చేసుకుంది. అందులో నందిత కుముదా అనే పాత్రలో నటించింది. విజయ్‌సేతుపతి ఆమెను తరచూ కుముదా హ్యాప్పీ అనే వాడు. ఆ డైలాగ్ బయట బాగా పాపులర్ అయ్యింది. అంతే కాదు వారిద్దరూ హిట్ పెయిర్‌గా గుర్తింపు పొందారు. ఆ చిత్రం తరువాత విజయ్‌సేతుపతి, నందిత జంటగా ఇడం పోరుళ్ ఏవల్ అనే చిత్రంలో నటించారు. అయితే అందులో మొదట నందిత పాత్రకు నటి మనిషాయాదవ్ను ఎంపిక చేసి కొంత షూటింగ్ కూడా చేశారు. ఆ తరువాత ఆమెను తొలగించి నందితను నటింపజేశారు. ఈ మార్పు వెనుక నటుడు విజయ్‌సేతుపతి హస్తం ఉందనే వదంతులు కూడా హల్చల్ చేశాయి. ప్రస్తుతం వరుస విజయాలతో మంచి జోరు మీద ఉన్న విజయ్‌సేతుపతి ఇప్పటి వరకూ సీక్వెల్ చిత్రాల్లో నటించలేదు. తాజాగా ఇదర్కుదానే అశైపట్టాయ్ బాలకుమారా చిత్ర సీక్వెల్లో నటించడానికి సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ఆ చిత్ర దర్శకుడు గోకుల్నే సీక్వెల్ చిత్రాన్ని హ్యాండిల్ చేయనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం నయనతార, తమన్నా అంటూ టాప్ కథానాయికలతో నటిస్తున్న విజయ్‌సేతుపతి ఇదర్కుదానే ఆశైపట్టాయ్ బాలకుమారా చిత్ర సీక్వెల్లో నటి నందితకు అవకాశం కల్పిస్తారా? అన్నదే చర్చనీయాంశంగా మారింది. నటి నందిత ఇలాంటి సందిగ్ధంలోనే ఉన్నట్లు సమాచారం. ఎందుకంటే ఈ అమ్మడు ఇంత వరకూ టాప్‌హీరోల సరసన నటించలేదు. అలాంటి అవకాశం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తోందని చెప్పవచ్చు. -
నా నమ్మకం నిజమైంది
నారా రోహిత్, నందిత జంటగా విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై పవన్ సాదినేని దర్శకత్వంలో డా. వీబీ రాజేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సావిత్రి’. చిత్ర విజయోత్సవాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. నారా రోహిత్ మాట్లాడుతూ -‘‘ ‘సోలో’ తర్వాత నా కెరీర్లో ‘సావిత్రి’ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా నిలిచిపోతుందన్న నా నమ్మకం నిజమైంది’’ అని చెప్పారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘హీరో, హీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఎంటర్టైన్మెంట్ సినిమాకు హైలైటైంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులు ఎమోషనల్ సీన్స్‌కు బాగా కనెక్ట్ అవుతున్నారు’’ అని నిర్మాత తెలిపారు. ఈ వేడుకలో నందిత, ప్రభాస్ శ్రీను, ‘సత్యం’ రాజేశ్ తదితరులు పాల్గొన్నారు. -
'సావిత్రి' రివ్యూ
జానర్ : ఫ్యామిలీ ఎంటర్ టెయినర్ నటీనటులు : నారా రోహిత్, నందిత, రమప్రభ, మధునందన్, శ్రీముఖి తదితరులు దర్శకత్వం : పవన్ సాదినేని సంగీతం : శ్రవణ్ నిర్మాత : డా.వి.బి.రాజేంద్రప్రసాద్ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉన్న నారా రోహిత్ ఈ శుక్రవారం 'సావిత్రి' అనే టైటిల్‌తో ప్రేక్షకులను పలకరించాడు. 'ప్రేమ ఇష్క్ కాదల్' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన పవన్ సాదినేని చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కించిన సినిమా 'సావిత్రి'. టైటిల్‌తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ లో బడ్జెట్ మూవీ ప్రేక్షకులను ఏమేరకు అలరించిందో చూద్దాం.. కథ : సావిత్రి (నందిత) అనే అమ్మాయికి చిన్నప్పటి నుంచి పెళ్లి అంటే విపరీతమైన ప్రేమ. ఖాళీ దొరికినప్పుడల్లా తన పెళ్లి గురించే కలలు కంటూ ఉంటుంది. పెళ్లి జరిగేందుకు ఏం చేయడానికైనా వెనుకాడని విచిత్ర మనస్తత్వం ఉన్న చలాకీ పిల్ల. తమ కుటుంబానికి సన్నిహితులైన ఓ వ్యక్తితో సావిత్రికి పెళ్లి నిశ్చయం అవుతుంది. నానమ్మ (రమప్రభ)తో కలిసి సంతోషంగా దైవ దర్శనానికి రైల్లో షిర్డీ బయలుదేరుతుంది సావిత్రి. ఆ ప్రయాణంలో తారసపడతాడు రిషి(నారా రోహిత్). ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిన ప్రేమ జంట (మధునందన్, శ్రీముఖి)ను రక్షించే క్రమంలో రిషీ ఆ రైల్లో ప్రయాణించాల్సి వస్తుంది. తొలిచూపులోనే సావిత్రికి ఆకర్షితుడైన రిషి.. ఆమె ప్రేమను గెలుచుకోవాలనుకుంటాడు. అయితే ప్రేమ జంటను రౌడీల నుంచి తప్పించే సమయంలో రిషితోపాటు సావిత్రి కూడా ట్రైన్ మిస్ అవుతుంది.ఇక తిరిగి వాళ్లు రైలును అందుకోవడానికి చేసే ప్రయత్నాలు, ప్రేమజంట పెళ్లి, సావిత్రి ప్రేమ పొందడానికి రిషి పడే కష్టాలతో మిగిలిన కథ నడుస్తుంది. ఎవరెలా చేశారంటే.. ఎప్పటికప్పుడు తన పాత్రల్లో వైవిధ్యం ఉండాలని తపనపడే నటుల్లో నారా రోహిత్ ఒకరు. రిషి పాత్రలో తేలికగా ఒదిగిపోయాడు. హీరోయిన్ నందిత అందంగా కనపడింది. తన రోల్ కు పూర్తి న్యాయం చేసిందని చెప్పొచ్చు. పెద్దలకు తెలియకుండా పారిపోయి వచ్చిన జంటగా కామెడీ టచ్‌తో మధునందన్, శ్రీముఖిలు అలరించారు. ప్రభాస్ శీను, ఫిష్ వెంకట్, షకలక శంకర్ లు కాసేపు నవ్వించగలిగారు. సీనియర్ నటి రమాప్రభతో సహా మిగిలిన నటీనటులంతా తమ పాత్ర మేరకు రాణించారు. అయితే దర్శకుడు ఇంతకుముందు తెలిసిన కథనే ఎంచుకోవడంతో పెద్దగా థ్రిల్లింగ్ గా అనిపించదు. తర్వాత ఏం జరుగుతుందనేది ముందే అర్థమైపోతుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోరుతోపాటు పాటలు పర్లేదనిపించాయి. కుటుంబ విలువలను చూపించే ప్రయత్నం బావుంది. క్లైమాక్స్‌లో డైలాగులు పేలాయి. ఓవరాల్‌గా సావిత్రి సాధారణ సినిమానే. -
ఈ సినిమాతో రోహిత్ పెద్ద ధైర్యమే చేశాడు - బాలకృష్ణ
‘‘సావిత్రి అనే చక్కటి టైటిల్ పెట్టినందుకు ఆనందంగా ఉంది. నారా రోహిత్ తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. సినిమా తీసే వాళ్లకు కథ తెలుస్తుంది. కానీ, టైటిల్‌ను బట్టి ప్రేక్షకులు సినిమాకు వస్తారు. ఈ టైటిల్ థియేటర్‌కి రప్పించే విధంగా ఉంది’’అని హీరో బాలకృష్ణ అన్నారు. నారా రోహిత్, నందిత జంటగా పవన్ సాదినేని దర్శకత్వంలో విజన్ ఫిలిం మేకర్స్ పతాకంపై వీబీ రాజేంద్రప్రసాద్ నిర్మించిన చిత్రం ‘సావిత్రి’. శ్రవణ్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో బాలకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘నారా రోహిత్ ఈ సినిమాలో పాట పాడాడని తెలిసింది. నాకు పాటలు పాడటం ఇష్టమే కానీ, నాతో ఎవరూ పాడించడం లేదు. పాట పాడి, ఈ సినిమాతో రోహిత్ పెద్ద ధైర్యమే చేశాడు’’ అని చెప్పారు. ‘‘ఈ సినిమా లేట్‌గా ప్రారంభమైనా మంచి నిర్మాత దొరకడంతో క్వాలిటీ ఔట్పుట్ వచ్చింది. ‘సోలో’ తర్వాత మళ్లీ అలాంటి సినిమా అవుతుంది’’ అని నారా రోహిత్ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘ఎలాంటి వల్గారిటీ లేకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నారా రోహిత్ ఫ్యాన్స్‌కు ఐ ఫీస్ట్ అవుతుంది’’ అని తెలిపారు. హీరో తారకరత్న, దర్శకుడు ప్రవీణ్ సత్తారు, నిర్మాత సాయి కొర్రపాటి, కథానాయికలు శ్రద్ధాదాస్, రష్మీ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు. -
65 ఏళ్ల వయసులో ఓంపురి సంచలన నిర్ణయం
ముంబై: సీనియర్ నటుడు ఓం పురి దంపతులు విడిపోయారు. అయితే వాళ్లకు కోర్టు మాత్రం విడాకులు మంజూరు చేయలేదు. 26 ఏళ్ల క్రితం పెళ్లయిన ఓంపురి, నందిత దంపతులు విడాకులు కావాలంటూ కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తర్వాత ఇద్దరూ రాజీకి రావడంతో కోర్టు వారికి 'జ్యుడీషియల్ సెపరేషన్' మంజూరు చేసింది. దీని ప్రకారం వాళ్లిద్దరూ చట్ట ప్రకారం భార్యాభర్తలుగానే ఉంటారు గానీ.. విడివిడిగా ఉండాలి. ఒకరి వ్యవహారాల్లో మరొకరు జోక్యం చేసుకోకూడదు. కొడుకు ఇషాన్ (18) బాగోగులను మాత్రం ఇద్దరూ చూసుకుంటారు. మొత్తానికి 65 ఏళ్ల వయసులో ఓంపురి భార్య నుంచి విడిపోవాలన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు! అయితే.. కోర్టు వీళ్లకు ఓ నిబంధన కూడా విధించింది. ఒకవేళ మళ్లీ వీళ్లు తిరిగి ఎప్పుడు కలవాలన్నా.. ఓ థర్డ్ పార్టీ సమక్షంలోనే కలుసుకోవాలని షరతు విధించింది. అలాగే ఓంపురికి తన 18 ఏళ్ల కొడుకుని కలుసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు పెట్టిన కేసులను ఉపసంహరించుకున్నారు. భవిష్యత్తులో మళ్లీ మీరు కలిసి జీవించే అవకాశం ఉందా అని మీడియా ప్రశ్నించినపుడు.. చెప్పలేం అని నందిత సమాధానమిచ్చారు. అసలు గొడవ ఎలా వచ్చిందంటే.. సుదీర్ఘ కాలం పాటు సంసార జీవితాన్ని గడిపిన ఓంపురి, నందితలకు అసలు గొడవ ఓ పుస్తకం కారణంగా వచ్చింది. 2009లో 'అన్ లైక్లీ హీరో, ది స్టోరీ అఫ్ ఓంపురి' అంటూ ఆయన జీవిత చరిత్ర పుస్తకాన్ని నందిత రాసి విడుదల చేశారు. దాంట్లో ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన, ఓంపురికి సంబంధించిన కొన్ని అభ్యంతరకర శృంగార ఘటనలను ప్రచురించడం, అది కూడా చాలా అగౌరవకరంగా ఉండటంతో ఓంపురికి ఎక్కడలేని కోపం వచ్చింది. అప్పటి నుంచి వారి మధ్య వివాదం రాజుకుంది. ఈ నేపథ్యంలోనే భర్త తనపై దాడి చేశాడంటూ ముంబైలోని వెర్సోవా పోలీసుస్టేషన్లో గృహహింస కేసును నమోదుచేసిన సంగతి తెలిసిందే. -
బ్రేకప్ లిస్ట్‌లో... ఓంపురి
2016... ఈ ఏడాది బాలీవుడ్ ప్రేమలు ఒక్కొక్కటిగా విఫలమైన గాథలుగా మారుతున్నాయి. బాలీవుడ్ నటుడు ఓంపురి ఆ జాబితాలో చేరారు. ఆయన తన భార్య నందితతో ఉన్న 26 ఏళ్ల బంధానికి స్వస్తి పలికారు. ఓంపురి - నందితల జంటకు ఇటీవలే కోర్టు అధికారికంగా విడాకులు మంజూరు చేసింది. ఓంపురి-నందితలకు 18 ఏళ్ల కుమారుడు ఇషాన్ ఉన్నారు. ఈ దంపతులు విడిపోవడానికి గల కారణాలు బయటికి రాలేదు. ఇది ఇలా ఉంటే ఇటీవల విడిపోయిన జంటల్లో రణబీర్ కపూర్- కత్రినా కైఫ్, విరాట్ కొహ్లీ-అనుష్క శర్మ వంటి లవర్స్ మాత్రమే కాకుండా పెళ్లయిన ఫర్హాన్ అక్తర్- అధునా భబానీ లాంటి పెళ్లయిన జంట కూడా ఉంది. మొత్తానికి, బ్రేకప్‌లు ఎక్కువైపోయాయనుకోవచ్చు. -
నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ సూపర్..
చారిత్రక హైదరాబాద్ సకల సంస్కృతుల నిలయం. ఐటీలో మేటి. నాన్న ఉద్యోగరీత్యా ఇక్కడికి బదిలీ కావడంతో సిటీతో విడదీయరాని బంధం ఏర్పడింది. ఇంటర్ నుంచి ఇక్కడే చదువుకున్నా. నేను ఢిల్లీ, బెంగళూర్, కోల్‌కతా, చెన్నై.. ఇలా ఎన్నో నగరాలు పర్యటించాను. కానీ అక్కడ దొరకని ఆత్మీయత మన సిటీలో దొరుకుతుంది. సాయంసంధ్య వేళ.. లైట్ల వెలుగులో నెక్లెస్ రోడ్డులో డ్రైవింగ్ చేయడమంటే చాలా ఇష్టం. హైదరాబాద్ బిర్యానీ అంటే పడిచస్తా. కాస్మొపాలిటన్ సిటీ అంటే హైదరాబాదే. ఏ నగరంలోనూ కనిపించని భిన్న సంస్కృతులు ఇక్కడ చూడొచ్చు. ఇదొక మినీ ఇండియా. - నందిత, సినీనటి -
ఇప్పుడు ప్రేమకథల స్వరూపం మారిపోయింది - దాసరి
‘‘ఒకప్పుడు ప్రేమకథలంటే ప్రేమ గొప్పదనాన్ని తెలియచెప్పేవిగా ఉండేవి. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రస్తుతం ప్రేమకథల స్వరూపం మారిపోయింది. ఇప్పుడు ప్రేమకథల పేరుతో కామ కథలను తీస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో లగడపాటి శ్రీధర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ వంటి ప్రేమ గొప్పదనం తెలియజెప్పే సినిమా తీశారు. విడుదలకు ముందే ఈ చిత్రం చూసి, సూపర్‌హిట్ అవుతుందని చెప్పాను’’ అని దాసరి నారాయణరావు చెప్పారు. సుధీర్‌బాబు, నందిత జంటగా చంద్రు దర్శకత్వంలో లగడపాటి శ్రీధర్ నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం ఇటీవల జైపూర్‌లో జరిగిన చలన చిత్రోత్సవాల్లో ‘బెస్ట్ రొమాంటిక్ ఫిల్మ్’ అవార్డును గెలుచుకుంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దాసరి నారాయణరావు ఈ చిత్రబృందాన్ని అభినందించారు. హిందీలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని లగడపాటి శ్రీధర్ తెలిపారు. ఈ సమావేశంలో నటులు సుధీర్‌బాబు, గిరిబాబు, దర్శకులు చంద్రు, ఎన్. శంకర్, నీలకంఠ తదితరులు మాట్లాడారు. -
‘బిగ్’ కిడ్నాప్
బిగ్ ఎఫ్ఎం 92.7 ఆధ్వర్యంలో ‘బిగ్ జూనియర్ ఆర్జే హంట్’ మూడో సీజన్‌ను గురువారం ప్రారంభించారు. పిల్లల్లో ప్రతిభా పాటవాలు... వాక్చాతుర్యాన్ని గుర్తించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ‘శంకరాభరణం’చిత్ర హీరో నిఖిల్, హీరోయిన్ నందితలు పాల్గొన్నారు. ‘బిగ్ కిడ్నాప్’ పేరుతో చిన్నారులు వారిని తాళ్లతో బంధించారు. తమ ప్రతిభతో వారిద్దరూ మెప్పించడంతో విడిచిపెట్టారు. - సనత్‌నగర్ -
ఎంతైనా సై అనే ఎన్నారై
ఆ కుర్రాడు ఎన్నారై. అంటే... నాన్ రెసిడెంట్ ఇండియన్ కాదట. ఏ వస్తువైనా నచ్చితే ఎంత రేటైనా ఇచ్చి కొనుక్కునే టైప్ అని కొత్త డెఫినిషన్ చెబుతున్నాడు. తండ్రి కష్టపడి బిలియన్స్ సంపాదిస్తే... ఎంతో ఈజీగా ఖర్చు పెట్టే కొడుకన్నమాట. ఇలాంటి కుర్రాడు ఇండియాలో అడుగుపెడతాడు. ఇక్కడ ఈ ఎన్నారై పడిన కష్టాల సమాహారమే ‘శంకరాభరణం’. రచయిత కోన వెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘‘కైమ్‌లో కామెడీ మిక్స్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. ఇంతకుముందు చాలా క్రైమ్ కామెడీ సినిమాలు వచ్చాయి. వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా కోసం సెట్స్ ఉపయోగించలేదు. టాకీ మాత్రమే కాదు... చివరికి పాటలను కూడా సహజమైన లొకేషన్స్‌లో తీశాం. బీహార్‌లోని డేంజరస్ స్పాట్స్‌లో కీలక సన్నివేశాలు చిత్రీక రించాం. ఈ నెల 30న పాటలను, దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అని కోన వెంకట్ తెలిపారు. ‘‘కోన వెంకట్ మంచి కథ ఇచ్చారు. ఎక్కడా రాజీపడకుండా భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ప్రవీణ్ లక్కరాజు, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు: కోన వెంకట్, ఎడిటింగ్: ఛోటా కె. ప్రసాద్, సహ-నిర్మాతలు: వి.ఎస్.ఎన్. కుమార్ చీమల, జి. వెంకటేశ్వరరావ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రామన్ చౌదరి. -
శంకరాభరణం మంచి విజయం సాధించాలి : పవన్‌కల్యాణ్
‘శంకరాభరణం’ లాంటి క్లాసిక్ టైటిల్‌తో క్రైమ్ కామెడీ చూపిస్తానంటున్నారు హీరో నిఖిల్. కోనవెంకట్ సమర్పణలో నిఖిల్, నందిత జంటగా ఉదయ్ నందనవనమ్ దర్శకత్వంలో ఎం.వి.వి సత్యనారాయణ నిర్మించిన చిత్రం ‘శంకరాభరణం’. ఈ సినిమా టీజర్‌ను బుధవారం హైదరాబాద్‌లో ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ షూటింగ్ లొకేషన్లో హీరో పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి’’ అని ఆకాంక్షించారు. కోన వెంకట్ మాట్లాడుతూ-‘‘ మా ‘గీతాంజలి’ చిత్రం ఫస్ట్‌లుక్‌ను పవన్‌కల్యాణ్ ఆవిష్కరించారు. ఆ సెంటిమెంట్‌తో ‘శంకరాభరణం’ టీజర్‌ను ఆవిష్కరించాలని అడిగితే, పవన్‌కల్యాణ్ వెంటనే ఒప్పుకున్నారు. ‘శంకరాభరణం’ క్రైమ్ కామెడీ జానర్లో ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అవుతుంది. నిఖిల్ ఇమేజ్ను కొత్త హైట్స్‌కు తీసుకెళ్లే సినిమా ఇది’’ అని చెప్పారు. నిఖిల్ మాట్లాడుతూ-‘‘పవన్‌కల్యాణ్ అభిమానినైన నేను ఆయన చేతుల మీదుగా నా మూవీ టీజర్ లాంచ్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను. ఇందుకు కారకులైన కోనవెంకట్‌గారిని ఎప్పటికీ మర్చిపోలేను’’ అన్నారు. ఉదయ్ నందనవనమ్ మాట్లాడుతూ-‘‘ దర్శకునిగా నా తొలి సినిమా ఇది. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’’అని చెప్పారు. ఈ కార్యక్రమంలో నందిత, సంగీత దర్శకుడు ప్రవీణ్ లక్కరాజు, కెమెరామ్యన్ సాయి శ్రీరామ్ , ఎడిటర్ ఛోటా కె. ప్రసాద్, సహనిర్మాత వీఎస్ఎన్ కుమార్ చీమల తదిత రులు పాల్గొన్నారు. -
ఇదొక శుభ పరిణామం -ఎస్.వి.కృష్ణారెడ్డి
సుధీర్ బాబు, నందిత జంటగా అందమైన ప్రేమకథగా తెరకెక్కించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. ఆర్. చంద్రు దర్శత్వంలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ పతాకంపై లగడపాటి శిరీష, లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ- ‘‘ఈ చిత్రం ఆగస్టు 7న 50 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఆనంద సమయంలో ఏదైనా చేయాలనుకున్నా. అందుకే చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించిన ‘సినిమా చూపిస్త మావ’ యూనిట్‌ను సత్కరిస్తున్నాను’’ అని చెప్పారు. ఒక హిట్ చిత్రాన్ని మరో హిట్ చిత్ర సభ్యులు సత్కరించడం శుభ పరిణామమని ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్.వి. కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ వేడుకలో ‘సినిమా చూపిస్త మావ’ చిత్ర నిర్మాత బెక్కం వేణుగోపాల్, దర్శకుడు త్రినాథరావుతో పాటు దర్శకుడు ‘మధుర’ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
అందంగా ఉండను... బయటకు వెళ్లలేను... ఎలా?
నేనో గృహిణిని. మావారు ఆఫీసుకి, పిల్లలు స్కూలుకి వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగానే ఉంటాను. దాంతో ఊసుపోక అప్పుడప్పుడూ పక్కింటి వాళ్లతో కబుర్లు చెబుతుంటాను. ఈ మధ్యనే మా పక్కింట్లోకి కొత్తగా ఒక కుటుంబం వచ్చింది. ఆ ఇంటావిడే వచ్చి నన్ను పరిచయం చేసుకుంది. మంచిదానిలాగే ఉంది కదా అని స్నేహం చేశాను. కానీ ఆమె ధోరణి నాకు కాస్త ఇబ్బందిగా ఉంది. మా వ్యక్తిగత విషయాల్లో కూడా జోక్యం చేసుకుంటోంది. మాట తప్పించినా పదే పదే గుచ్చి అడుగుతుంటుంది. అలాగే వాళ్ల ఇంట్లో విషయాలూ నాకు చెబుతుంది. నాకు ఈ రెండూ ఇష్టం లేదు. అలాగని ఆమె చెడ్డదేమీ కాదు. అందుకే స్నేహం చెడగొట్టుకోలేకపోతున్నాను. ఎంతైనా ఇరుగు పొరుగు వాళ్లం కదా? ఆవిడ మనసు బాధపడకుండా ఆమెలో మార్పు ఎలా తీసుకురావాలో తెలియజేయండి. - కృష్ణవేణి, రేణిగుంట ఈ సమస్య మీ ఒక్కరిదే కాదు... చాలామందిది. ‘స్నేహితుల్ని ఎలా చేసుకోవాలి?’ అని డేల్ కార్నీ దగ్గర్నుంచి చాలామంది రాశారు కానీ... ‘ఎలా వదిలించుకోవాలి’ అనే పుస్తకాలు చాలా తక్కువ వచ్చాయి. తెలుగులో అయితే అస్సలు రాలేదు. ముక్తసరిగా మాట్లాడటమనేది ఒక కళ. ఆసక్తిగా వినకుండా ‘ఏదైనా పని ఉంది’ అని తప్పించుకోవచ్చు. బాధలు వినడంలో ఆసక్తి తగ్గించుకోండి. మీరొక జ్ఞానమూర్తిగా ఊహించుకుని సలహాలివ్వడం మానెయ్యండి. ఆమెలో మార్పు తీసుకురావడానికి మీరేమీ ప్రయత్నం చేయక్కర్లేదు. మీరు మారండి. వీలైనంత వరకూ స్నేహాన్ని ఎక్కడ ఉంచాలో అక్కడి వరకూ ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఆమె చెడ్డదేమీ కాదు అన్నారు. మనల్ని బాధపెట్టడానికి అవతలివారు చెడ్డవారు కానవసరం లేదు. ఇద్దరు మంచి వ్యక్తులు కూడా మంచి ఇరుగూ పొరుగూ అవ్వకపోవచ్చు. నేను నల్లగా పొట్టిగా ఉంటాను. మొహం మీద మచ్చలు. దానికి తోడు కళ్లజోడు. జుట్టు కూడా బాగా ఊడిపోతోంది. బయటకు వెళ్లాలన్నా, అందరితో మాట్లాడాలన్నా ఫ్రీగా ఉండలేకపోతున్నాను. నామీద నాకు అసహ్యం వేస్తోంది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏదైనా సలహా ఇవ్వగలరా? - నందిత, చేబ్రోలు సమస్యలు రెండు రకాలు. మనం అధిగమించగలిగేవి, అధిగమించలేనివి. సమస్యల్ని మర్చిపోవాలి. అధిగమించగలిగిన ఉన్నత స్థానాల్ని చేరుకోవాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే చాలా రంగాల్లో పెద్ద పెద్ద స్థానాలు అలంకరించిన వారందరూ కాస్త అందవిహీనంగానే ఉంటారు. ఆ ఆత్మన్యూనతా భావమే బహుశా వారి వెనుక స్ఫూర్తి. మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. అందంతో కాదు, ఏదైనా కళతో గెలవండి. సచిన్ టెండూల్కర్ పొట్టి. స్టీఫెన్ హాకింగ్ అంగవైకల్యుడు. అయినా కూడా కృషితో, పట్టుదలతో పైకొచ్చారు. అందరిచేతా గుర్తింపబడ్డారు. వారిని ప్రేరణగా తీసుకుంటే మీకంటూ ఒక ప్రపంచం ఏర్పడుతుంది. బెస్టాఫ్ లక్! ఫలానా రోజు, ఫలానా చోట, ఫలానా నదిలో మునిగితే పుణ్యం వస్తుంది అనే నమ్మకంలో తర్కం ఉందా? దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? - ప్రహ్లాద్, హైదరాబాద్ నమ్మకం వేరు, తర్కం వేరు. నలుగురు మనుషులు కూర్చుని ఒక చేదు ద్రవాన్ని తాగుతూ ఇదే ఆనందం అనుకోవడంలో ఏం తర్కం ఉంది? కానీ ఎంతమంది దాన్ని ఆనందిస్తున్నారో తెలుసు కదా! భక్తి కూడా అలాంటిదే. అది ఒక తదాత్మ్యత. అయితే చాలామంది దాన్ని ఆస్వాదించడం, ఆనందించడం మానేసి పాపభయంతో చేయడమే విచారకరం. ఆచారాలు మనిషికి ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. కానీ వాటిని పాటించకపోతే మాత్రం ఘోరమైన కష్టాల్లో పడతామనే భయం వాటిని పాటించేలా చేస్తోంది. అదే నిజం కాకపోతే పుణ్యక్షేత్రాలు దర్శించినవారు, పుణ్యనదుల్లో స్నానం చేసినవారు చాలా సంతోషంగా, ఒక రకమైన అలౌకిక ఆనందంలో ఉండాలి. కానీ ఉండరు. మొక్కు తీర్చకపోతే మాత్రం వచ్చిన ప్రతి కష్టాన్నీ దానికి ఆపాదించుకుంటారు. అంతవరకూ సరేగానీ తమ మొక్కుల కోసం పసిపిల్లల్ని కూడా ఆ కష్టాల్లో ఇరికించడం... ఆ ఒత్తిడికీ, కష్టాలకీ గురి చేయడాన్ని మాత్రం భగవంతుడనేవాడుంటే అతడు కూడా క్షమించడు. -
ఆయనతో నటించడం తీయని అనుభవం
ఊహించలేనివి జరిగితే ఎవరైనా ఎగ్జైట్ అవుతారు. నటి నందిత పరిస్థితి ఇంచుమించు అలానే ఉంది. అట్టకత్తి చిత్రంతో హీరోయిన్గా తెరపైకి వచ్చిన ఈ ఆరణాల తమిళమ్మాయి తొలి చిత్రంతోనే విజయంతో పాటు ప్రశంసలు అందుకుంది. అయినా ఇప్పటి వరకు యువ హీరోలతోనే జత కడు తూ వచ్చింది. అలాంటి నందితకు అనూహ్యంగా పులి చిత్ర యూనిట్ నుంచి పిలుపొచ్చింది. అది ఇళయదళపతి విజయ్‌తో నటించే అవకాశం. కలా! నిజమా! కొంచెం సందిగ్ధం. కొన్ని క్షణాల తరువాత నిజం అన్న విషయాన్ని గ్రహించి పట్టరాని ఆనందంతో మునిగిపోయానంటున్న నందిత చేతిలో ప్రస్తుతం పలు చిత్రాలు ఆ విషయం కంటే ముందు విజయ్‌తో కలిసి పులి చిత్రంలో నటించిన అనుభవాల్నే చెప్పుకుంటోంది బ్యూటీ. ఎదుర్‌నీచ్చల్ చిత్రంలో నా నటన చూసి విజయ్ మెచ్చుకున్నారు. అలాంటి ఆయనతో కలసి నటిస్తానని కలలోకూడా ఊహించలేదు. పులి చిత్రంలో విజయ్‌తో నటించడానికి కాస్త తడబడ్డాను.ఆయన ఎంతో సౌమ్యంగా, సన్నిహితంగా మెలిగి నా భయాన్ని పోగొట్టారు. విజయ్‌తో కలసి నటించడం తీయని అనుభవం. పులి చిత్రంలో చిన్న పాత్ర అయినా నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అంటున్న నందిత నటిస్తున్న నాలుగు చిత్రాల్లో రెండు చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మరో రెండు హారర్ చిత్రాలను అంగీకరించారు. -
ఓపెన్ ఛాలెంజ్
సుధీర్‌బాబు, నందిత జంటగా శిరీషా శ్రీధర్ నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ చిత్రం ఇటీవ ల విడుదలైన విషయం తెలిసిందే. ఈ చిత్రం గురించి ఓ టీవీ చానల్లో ‘ఇది ఫీల్ గుడ్ మూవీ... కానీ, భయపడి కామెడీని ఇరికించారు’ అని చెప్పారట. ‘‘మంచి సినిమా తీసిన ఆనందంలో ఉన్న మమ్మల్ని ఆ వ్యాఖ్య చాలా బాధపెట్టింది. అందుకే, ఈ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా’’ అని శిరీషా శ్రీధర్ అన్నారు. సవాల్ ఏంటంటే... నేడు (గురువారం) హైదరాబాద్‌లోని ప్రసాద్ ఐమ్యాక్స్‌లో 3 గంటల 15 నిమిషాలకు ప్రదర్శితమయ్యే ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ షో చూసినవాళ్లు, అక్కడ జరిగే ఈ చిత్రం విజయోత్సవంలో పాల్గొనవచ్చు. నచ్చినవాళ్లు తమ అనుభూతిని పంచుకోవచ్చు. నచ్చలేదని ఎవరైనా అంటే, టికెట్ డబ్బు వెనక్కి ఇచ్చేస్తామని శిరీషా శ్రీధర్ అన్నారు. ‘‘సినిమా చూసిన వాళ్లు తమ అభిప్రాయాన్ని ‘8886084077’ నంబర్‌కు వాట్సప్ కూడా చేయొచ్చని అన్నారు. -
నచ్చకపోతే దారి ఖర్చులు వాపస్!
విడుదలకు ముందు బయటివాళ్లకి సినిమా చూపించ డం అంటే సాహసమే. అది ఎంత గొప్ప సినిమా అయినా సరే. కానీ, లగడ పాటి శ్రీధర్ ఆ సాహసం చేశారు. సుధీర్‌బాబు, నందిత జంటగా చంద్రు దర్శకత్వంలో ఆయన నిర్మించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ నేడు తెరకొస్తున్న విషయం తెలిసిందే. గురువారం ఈ చిత్రాన్ని చిత్రసీమకు సంబంధం లేని కొంతమందికి చూపించారు. సినిమా నచ్చకపోతే దారి ఖర్చులు వెనక్కి ఇచ్చి మరీ పంపిస్తానని పేర్కొన్నారు కూడా. బయ్యర్లందరూ వద్దంటున్నా, ఓ ప్రత్యేక షో ఏర్పాటు చేసి మరీ, చూపించారాయన. లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ - ‘‘నా మొదటి సినిమా ‘ఎవడి గోల వాడిదే’ అప్పట్నుంచీ, విడుదలకు ముందు బయటివారికి చూపిస్తానని చెప్పుకుంటూ వచ్చాను. ఈసారి కూడా అలానే అన్నాను. దాదాపు వంద మంది వరకూ ఈ సినిమా చూడ్డానికి వచ్చారు. ‘సినిమా చాలా బాగుంది’ అని అందరూ ప్రశంసించారు’’ అన్నారు. -
ఆ కథతో ప్రేమలో పడ్డా!
‘‘కన్నడంలో రూపొందిన ‘చార్మినార్’ చిత్రం చూడగానే, ఆ కథతో ప్రేమలో పడిపోయా. అందుకే తెలుగు పునర్నిర్మాణ హక్కులు పొందాను. కన్నడ చిత్రానికి దర్శకత్వం వహించిన చంద్రూతోనే తెలుగు రీమేక్ రూపొందించాను. అసభ్యతకు తావు లేని చిత్రం ఇది. సుధీర్‌బాబు, నందితల నటన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇది కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ 19న విడుదల చేసే ఈ చిత్రానికి కూడా మంచి ప్రేక్షకాదరణ లభిస్తుందనే నమ్మకం ఉంది’’ అని లగడపాటి శ్రీధర్ అన్నారు. సుధీర్‌బాబు, నందిత జంటగా ఆర్. చంద్రు దర్శకత్వంలో శ్రీమతి లగడపాటి శిరీషా శ్రీధర్ నిర్మించిన చిత్రం ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’. గురువారం హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ - ‘‘కన్నడంలో ఇప్పటివరకూ నేను రూపొందించిన ఎనిమిది సినిమాలూ మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తెలుగులో నాకిది తొలి చిత్రం. నా జీవితంలో జరిగిన ఓ సంఘటన ఆధారంగా చేసిన చిత్రం ఇది’’ అని తెలిపారు. యువతకు ఈ చిత్రం ఓ గైడ్లాంటిదని రచయిత సాయినాథ్ అన్నారు. తన కెరీర్లో ఇది మంచి సినిమాగా నిలిచిపోతుందని నందిత చెప్పారు. -
అందంగా కనిపిస్తాను
ఇక పై విభిన్న నందితను చూస్తారంటోంది నందిత. అట్టకత్తి చిత్రం ద్వారా కోలీవుడ్లోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ తమిళ ప్రేక్షకుల నుంచి పక్కింటి అమ్మాయిగా పేరు సంపాదించుకుంది. ప్రస్తుతం చేతిలో రెండు మూడు చిత్రాలతో బిజీగా ఉన్న నందిత త్వరలో హార్రర్ చిత్రంలో భయపెట్టడానికి సిద్ధం అవుతోంది. యువనటుడు శివ హీరోగా నటించనున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో సెట్‌పైకి రానుంది. ప్రస్తుతం రాధామోహన్ దర్శకత్వంలో ఉప్పుకరువాడు చిత్రంతో పాటు భరత్‌బాలా శిష్యుడు రాజశేఖర్ మోగాఫోన్ పట్టిన నూతన చిత్రంలో నటిస్తోంది. వీటి గురించి నందిత మాట్లాడుతూ ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయిగా చూసిన తనను ఇకైపై విభిన్న పాత్రల్లో చూస్తారంది. ఉప్పుకరువాడు చిత్రంలో తన పాత్రను దర్శకుడు రాధామోహన్ చాలా కొత్తగా తీర్చిదిద్దుతున్నారని పేర్కొంది. నవ దర్శకుడు రాజశేఖర్ చిత్రంలో నాగరికతతో కూడిన గ్లామరస్ పాత్రను పోషిస్తునట్లు చెప్పింది. ఈ పాత్రలో తాను కలర్‌ఫుల్ దుస్తుల్లో చాలా అందంగా కనిపిస్తానని నందిత చెబుతోంది. -
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ’ అందరికీ నచ్చుతుంది
విశాఖపట్నం : ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ’ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీనికోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. నాకు మంచిపేరు తెచ్చిపెడుతుంది’ అన్నారు కథానాయిక నందితా రాజ్‌గురు. గాజువాకలో కళానికేతన్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆమె స్థానిక విలేకరులతో ముచ్చటించారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే... కొత్త సినిమాలున్నాయి.. కృష్ణమ్మ కలిపింది ఇద్దర్నీ సినిమా పూర్తవుతుండగానే మరో రెండు సినిమాలకు సంతకం చేశాను. ఆ వివరాలు నేను చెప్పడం బాగుండదు. త్వరలోనే మీకు తెలుస్తాయి. పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉన్న సినిమాలు ఇష్టం.. గ్లామర్ పాత్రలే కాదు.. పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉన్న సినిమాలను ఇష్టపడతాను. వైవిధ్య భరితంగా ఉన్న పాత్రలన్నీ చేస్తాను. హర్రర్ పాత్రలు కూడా.. ఉద్దేశపూర్వకంగా హర్రర్ సినిమాల్లో చేయాలని కాదు, కథలో భాగంగా ఆ పాత్రలో నటిస్తాను. అది కూడా పెర్ఫార్మెన్స్కు అవకాశం ఉంటుంది. ప్రతీ సారి సెలవులకు ఇక్కడే... విశాఖపట్నం అంటే నాకు చాలా ఇష్టం. ఇది మా అమ్మమ్మగారి ఊరు. అమ్మ కూడా ఇక్కడే పెరిగింది. అందుకే నేను ప్రతీ సారి సెలవులకు ఇక్కడికే వచ్చేదాన్ని. ఇప్పుడు కూడా షూటింగ్లో బాగా అలసిపోయాననిపిస్తే సేదదీరటానికి ఇక్కడికే వస్తాను. విశాఖ ప్రజలు మంచోళ్లు.. విశాఖపట్నంలోని ప్రజలు చాలా మంచోళ్లు. ఇక్కడ ప్రశాంతత నాకు నచ్చుతుంది. నేను సెలవులకు ఇక్కడికే వస్తాను కాబట్టి ఇది నాకు కొత్తగా అనిపించదు. -
కప్పు మనదే..
ఫటాఫట్ వరల్డ్ కప్‌లో దుమ్ము రేపుతున్న ధోనీ సేన.. ఈసారి కూడా కప్పు కొట్టేస్తుందంటోంది ముద్దుగుమ్మ నందిత. క్రికెట్‌ను ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. శ్రీనగర్ కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో వస్త్రవిభ-2015 ప్రారంభోత్సవానికి నందిత విచ్చేసింది. రామ్‌లీలా నిర్మాత దాసరి కిరణ్‌కుమార్, దర్శకుడు శ్రీపురం కిరణ్‌లతో కలసి ఎక్స్‌పోలో కలియ తిరిగింది. ఈ సందర్భంగా నందిత తో సిటీప్లస్ ఫటాఫట్... - సత్య, శ్రీనగర్ కాలనీ రామ్‌లీల సక్సెస్ టాక్‌ను ఎలా ఎంజాయ్ చేస్తున్నారు..? రామ్‌లీల బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ టాక్ తెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేమక థా చిత్రంలో భయపెట్టి ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాను. లవర్స్ మూవీతో యువతరానికి మరింత దగ్గరయ్యాను. రామ్‌లీల నా ఇమేజ్ను మరింత పెంచుతుందన్న నమ్మకం ఉంది. క్రికెట్ చూస్తున్నారా..? ఓహ్..! ఇండియా మ్యాచ్ అయితే అస్సలు మిస్సవ్వను. మనవాళ్లు భలేగా ఆడుతున్నారు. కప్పు గెలిచే అవకాశం మరో దేశానికి ఇవ్వరు. మీ అభిమాన క్రికెటర్లు..? ధోని, కోహ్లీ.. మరి మీ అభిమాన నటుడు..? ప్రిన్స్ మహేష్‌బాబు. ఆయన సినిమాలన్నీ చూస్తుంటాను. మీ తర్వాతి చిత్రం..? మహేష్‌బాబు బావ సుధీర్‌బాబుతో కలసి నటించిన ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’ త్వరలో విడుదలకానుంది. మరో రెండు చిత్రాలు స్క్రిప్ట్ దశలో ఉన్నాయి. మీ డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా..? పర్టిక్యులర్‌గా అంటూ ఏం లేదు. ప్రేక్షకులకు కలకాలం గుర్తుండిపోయే పాత్రలు చేయాలని ఉంది. మీ ఫ్యాషన్ ఫార్ములా..? ఆధునిక వస్త్రాలంటే ఎక్కువగా ఇష్టపడతాను. హైదరాబాద్ గురించి..? బ్యూటిఫుల్ సిటీ. నేను ఎక్కువగా ఇంట్లోనే ఉండటానికి ఇష్టపడతాను. బోర్ కొడితే మాత్రం ట్యాంక్‌బండ్, నెక్లెస్ రోడ్‌పై చక్కర్లు కొడతాను. అక్కడ దొరికే జంక్ ఫుడ్ భలే రుచిగా ఉంటుంది. హైదరాబాద్ బిర్యానీ అంటే చాలా ఇష్టం. -
'రామ్‌లీల' టీంతో సాక్షి చిట్‌చాట్
-
దీనికి అన్నీ ప్లస్లే!
స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతోన్న వ్యక్తి దాసరి కిరణ్‌కుమార్. రియల్ ఎస్టేట్ నుంచి రీల్ ఎస్టేట్‌కు చేరుకున్న కిరణ్ ఏ పని చేసినా తనదైన ముద్ర కనబరుస్తానంటున్నారు. ‘జీనియస్’ చిత్రంతో నిర్మాతగా మారిన ఆయన నిర్మించిన తాజా చిత్రం ‘రామ్‌లీల’ నేడు తెరకొస్తోంది. కోనేరు సత్యనారాయణ సమర్పణలో హవీష్, అభిజిత్, నందిత ముఖ్యతారలుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్ర విశేషాలను దాసరి కిరణ్‌కుమార్ ఈ విధంగా చెప్పారు. హవీష్‌తో సినిమాలు నిర్మించడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. అందుకే ‘జీనియస్’ తర్వాత మళ్లీ వెంటనే తనతోనే ‘రామ్ లీల’ చేశాను. ఈ చిత్రకథకు వంద శాతం తనే నప్పుతాడు. నటుడిగా హవీష్ చాలా ఇంప్రూవ్ అయ్యాడు. కచ్చితంగా తనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టే చిత్రం అవుతుంది. ఓ విశిష్టమైన కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ మధ్యకాలంలో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ఈ చిత్రం తర్వాత శ్రీపురం కిరణ్ పెద్ద దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. ఎంత బాగా కథ చెప్పాడో అంత బాగా తెరకెక్కించాడు. అభిజిత్ చేసిన పాత్ర చాలా బాగుంటుంది. నందిత అందచందాలు, అభినయం ఓ ప్లస్ పాయింట్. విస్సు రాసిన సంభాషణలు ప్రధాన ఆకర్షణ. ఎస్. గోపాలరెడ్డిగారి ఫొటోగ్రఫీ హైలైట్. చిన్నా ఇచ్చిన పాటలకు మంచి స్పందన వస్తోంది. 36 రోజుల్లోనే ఈ చిత్రాన్ని పూర్తి చేసినప్పటికీ ఎక్కడా రాజీపడలేదు. అన్ని వర్గాలవారికీ నచ్చే చిత్రం ఇవ్వాలనే ఆకాంక్షతో చేశాం. ఈ చిత్రం ఎవరినీ నిరాశపరచదు. ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలన్నదే నా ఆశయం. ఇక ముందూ కొత్త దర్శకులతో సినిమాలు నిర్మిస్తాను. -
హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ ఖాయం
- దాసరి కిరణ్‌కుమార్ ‘‘ఈ చిత్రనిర్మాత దాసరి కిరణ్‌కుమార్ నాకు చిరంజీవిగారి అభిమానిగా పరిచయం. ఎంతో కష్టపడి ఆయన నిర్మాతగా మారారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని కోరుకుంటున్నాను’’ అని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. హవీష్, అభిజిత్, నందిత, అక్ష హీరో హీరోయిన్లుగా శ్రీపురం కిరణ్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మించిన చిత్రం ‘రామ్‌లీలా’. కోనేరు సత్యనారాయణ సమర్పణలో లంకాల బుచ్చిరెడ్డి సారథ్యంలో రూపొందిన ఈ చిత్రానికి చిన్నా పాటలు స్వరపరిచారు. ఈ చిత్రం ఆడియో వేడుకలో పాల్గొన్న వీవీ వినాయక్ సీడీని ఆవిష్కరించి కోనేరు సత్యనారాయణకు ఇచ్చారు. ప్రచార చిత్రాన్ని దర్శకుడు బాబీ ఆవిష్కరించారు. అనంతరం యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ - ‘‘ఓ చక్కని కథతో శ్రీపురం కిరణ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. దాసరి కిరణ్ రాజీపడకుండా నిర్మించిన ఈ చిత్రం మంచి ఫలితానివ్వాలని ఆశిస్తున్నాను’’ అన్నారు. కిరణ్‌కుమార్ మంచి చిత్రాలు తీయాలనే తపన ఉన్న నిర్మాత అని బి. గోపాల్ చెప్పారు. కోనేరు సత్యనారాయణ మాట్లాడుతూ - ‘‘మా విశ్వ విద్యాలయాన్ని హవీష్ బాగా చూసుకునేవాడు. సినిమాలంటే తనకు ఆసక్తి కావడంతో ప్రోత్సహించాం. వాస్తవానికి ‘జీనియస్’కన్నా ముందు చేయాల్సిన చిత్రం ఇది’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘మా సంస్థ నుంచి వచ్చిన గత చిత్రం ‘జీనియస్’ని మించిన విజయాన్ని ఈ చిత్రం సొంతం చేసుకుంటుంది. హవీష్‌కి మరో బ్లాక్ బస్టర్ హిట్ ఖాయం. చక్కని అవగాహనతో దర్శకుడు ఈ సినిమా తీశారు’’ అని చెప్పారు. ప్రతిభ గల సాంకేతిక నిపుణులతో ఈ సినిమా చేయడం ఆనందంగా ఉందని హవీష్ అన్నారు. ఈ చిత్రం ఘనవిజయాన్ని అందుకోవాలని ఎస్. గోపాల్‌రెడ్డి, చిన్నా అభిలషించారు. ఈ వేడుకలో పరుచూరి వెంకటేశ్వరరావు, విస్సు, ముత్యాల రమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’మూవీ న్యూ స్టిల్స్
-
నందితా ‘డెత్ నోట్’ రాసింది
రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టీకరణ బెంగళూరు: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి విద్యార్థిని నందితా అనుమానాస్పద మృతి కేసులో పోలీసులకు లభించిన ఉత్తరం నందితా రాసిన ‘డెత్‌నోట్’ అని ఫోరెనిక్స్ నిపుణులు నిర్ధారించారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ వెల్లడించారు. బుధవారమిక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రి ప్రాంగణంలో ‘చిన్నారులపై లైంగిక దౌర్జన్యాలు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కేజే జార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి ఘటనల్లో తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. ఇక నుండి డిసెంబర్ నెలను ‘మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాల నిరోధక మాసం’గా పరిగణించనున్నట్లు తెలిపారు. -
దీపావళి స్పెషల్ : నందితతో సాక్షి చిట్‌చాట్
-
మూలాల్ని మరచిపోకూడదు!
యువత ఎంత ట్రెండీగా ఉన్నా, ఫార్వార్డ్‌గా ఆలోచించినా మన మూలాల్ని మాత్రం మరచిపోకూడదు. ఈ నేపథ్యంలోనే ‘రామ్‌లీల’ సినిమా ఉంటుందంటున్నారు దాసరి కిరణ్‌కుమార్. ‘జీనియస్’ తర్వాత రామదూత క్రియేషన్స్ పతాకంపై ఆయన నిర్మిస్తోన్న సినిమా ఇది. హవీష్, అభిజిత్, నందిత ముఖ్యతారలు. రచయిత శ్రీపురం కిరణ్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. 3 పాటలు, 5 రోజుల టాకీ మినహా షూటింగ్ మొత్తం పూర్తయింది. దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ -‘‘అమెరికాలో ఓ తెలుగబ్బాయి నిజ జీవితంలో జరిగిన కథ ఇది. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది. మలేసియాలోని అందమైన ప్రదేశాల్లో 21 రోజులు చిత్రీకరణ జరిపాం’’ అని తెలిపారు. ఎస్. గోపాలరెడ్డి ఛాయాగ్రహణం, విస్సు సంభాషణలు ఈ సినిమాకు హైలైట్స్ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ముత్యాల రమేశ్, సమర్పణ: లంకాల బుచ్చిరెడ్డి, సారథ్యం: కోనేరు సత్యనారాయణ. -
బాలికను బలిగొన్న బడిబస్సు
ఫిట్నెస్ లేని బస్సులు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటున్న స్థానికులు బస్సు అద్దాలు, స్కూల్ ఫర్నిచర్ ధ్వంసం సరూర్‌నగర్: స్కూల్ బస్సు నుంచి దిగుతున్న చిన్నారి అదే వాహనం కిందపడి విగతజీవిగా మారిన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ తెలిపిన వివరాలు.. బడంగ్‌పేట నగర పంచాయతీ పరిధిలోని నాదర్గుల్ ప్రెస్ కాలనీలో నివాసం ఉండే పేట యాదగిరి, మమత దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. యాదగిరి కారుడ్రైవర్, మమత గృహిణి. వీరి కుమార్తె నం దిత (4) స్థానిక సెయింట్ మాథ్యూస్ హైస్కూల్లో ఎల్కేజీ చదువుతోంది. శనివారం ఒంటిపూట తరగతులు కావటంతో అదే స్కూల్‌కు చెందిన బస్సులో ఇంటికి బయలుదేరింది. వారి స్జేజీ వద్ద కు రాగానే బస్సు నుంచి కిందకు దిగు తుండగానే డ్రైవర్ వాహనాన్ని ముందు కు పోనిచ్చాడు. చిన్నారి అదుపుతప్పి కింద పడిపోయింది. బస్సు వెనుక చక్రా లు నందిత తలపై నుంచి వెళ్లటంతో అక్కడికక్కడే మృతి చెందింది. గమనిం చిన డ్రైవర్ బస్సును అక్కడే నిలి పివేసి పరారయ్యాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న తల్లితండ్రులు నందిత మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆరు నెలల క్రితం పెద్దకూతురు మృతి.. యాదగిరి, మమతలకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు. కాగా ఆరునెలల క్రితం వీరి పెద్ద కూతురు అనారోగ్యంతో చనిపోయింది. ఆ బాధ నుంచి తేరుకోకముందే నందితను స్కూల్ బస్సు కబ ళించడం ఆ దంపతులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అల్లారుముద్దుగా పెంచు కుంటున్న నందిత దుర్మరణాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. స్కూల్ బస్సు, ఫర్నిచర్ ధ్వంసం.. నందిత మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్థానికులు ప్రమాదానికి కారణమైన స్కూల్ బస్‌ను ధ్వంసం చేశారు. అనంతరం స్కూల్‌కు వెళ్లి కరస్పాండెంట్‌ను చితకబాది ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. మీర్‌పేట ఇన్స్పెక్టర్ శంకర్ యాదవ్ ఎస్ఐలు సిబ్బంది తో సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సూపర్వైజర్ లేకపోవడంతోనే.. ప్రతి స్కూల్ బస్సులో తప్పనిసరిగా సూపర్వైజర్, ఆయాను ఏర్పాటు చేయాల్సి ఉండగా.. అలాంటి ఏర్పాట్లు చేయకుం డానే నిబంధనలకు విరుద్ధంగా బస్ డ్రైవర్‌ను మాత్రమే నియమించుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్కూల్ బస్సు డ్రైవర్ మల్లేశ్ ఎప్పుడూ తప్పతాగి ఉంటాడని, అతడ్ని ఎలా నియమించుకున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యా న్ని నిల దీస్తున్నారు. సెయింట్ మాథ్యూ స్ పాఠశాలలో ఐదు బస్‌లు ఉండగా ఒక్క బస్సుకు కూడా ఫిట్నెస్ లేకపోవటం గమనార్హం. డొక్కు బస్సులతో పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అక్కడకు చేరుకున్న వార్డు కౌన్సిలర్లు యాతం శ్రీశైలం యాదవ్, అంకంగారి మంజుల ఆరోపించారు. మృతదేహంతో పాఠశాల ఎదుట ధర్నా పోస్టుమార్టం అనంతరం నందిత మృతదేహాన్ని తల్లితండ్రులకు అప్పగించటంతో కుంటుంబ సభ్యులు రాత్రి నాదర్గుల్కు చేరుకున్నారు. అనంతరం చిన్నారి మృతదేహంతో సెయింట్ మాథ్యూస్ స్కూల్ ఎదుట ధర్నాకు దిగారు. మృతికి స్కూల్ యాజమాన్యం బాధ్యత వహించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాఠశాల యాజమాన్యం వచ్చేవరకు ధర్నాను విరమించేది లేదని బాధితులు పేర్కొన్నారు. కాగా నాదర్గుల్, బడంగ్‌పేట వెళ్లే రహదారిని స్తంభింపచేశారు. స్కూల్ బస్సులు ఇలా ఉండాలి... బస్సు గాడమైన పసుపు రంగులో, స్పష్టంగా కనిపించేలా ఉండాలి. విద్యార్థులు బస్సులోకి ఎక్కడం, దిగడం డ్రైవర్‌కు కనిపించే విధంగా కన్వెక్స్ క్రాస్ వ్యూ అద్దాలు అమర్చాలి. బస్సు లోపలి భాగంలో ఒక పెద్ద పారదర్శకమైన అద్దం ఏర్పాటు చేయాలి. బస్సు ఇంజన్ కంపార్ట్మెంట్లో ఒక అగ్నిమాపక యంత్రం (ఫైర్ ఎక్స్టింగ్విషర్),పొడి అందుబాటులో ఉండాలి. అత్యవసర ద్వారం ఏర్పాటు చేయాలి. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండాలి. సదరు పాఠశాల/కళాశాల పేరు, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, పూర్తి చిరునామా బస్సుకు ఎడమవైపున ముందుభాగంలో స్పష్టంగా రాయాలి. సీట్ల కిందిభాగంలో బ్యాగుల కోసం అరలు, పట్టుకోవడానికి లోహపు స్తంభాలను బస్సులో అమర్చాలి. వాహనానికి నాలుగువైపులా పై భాగం మూలాల్లో (రూఫ్‌పై కాదు) బయటివైపు యాంబర్ (గాఢ పసుపు పచ్చని) రంగు గల ఫ్లాపింగ్ లైట్లను ఏర్పాటు చేయాలి. పిల్లలు దిగేటప్పుడు,ఎక్కేటప్పుడు ఈ లైట్లు వెలుగుతూ ఉండాలి. సదరు వాహనం స్కూల్ బస్సు అని తెలిసేవిధంగా ముందుభాగంలో పెద్ద బోర్డుపైన 250ఎం.ఎం.కు తగ్గని విధంగా ఇద్దరు విద్యార్థుల (ఒక అమ్మాయి, ఒక అబ్బాయి) బొమ్మలు నల్లరంగులో చిత్రించి ఉండాలి. ఆ చిత్రం కింద ‘‘స్కూల్ బస్సు’’ లేదా ‘‘ కళాశాల బస్సు’’ అని నల్ల రంగులో కనీసం 100ఎంఎం సైజు అక్షరాల్లో రాయాలి. అక్షరాల గాఢత సైజు కనీసం 11ఎం.ఎం.ఉండాలి. -
‘లవర్స్’ సినిమా మొదట హిందీలో చేద్దామనుకున్నా!
‘‘హిందీలో ఓ సినిమా చేయాలనుకుని, మొదట ‘లవర్స్’ కథ తయారు చేసుకున్నా. ఆ ప్రయత్నంలో ఉన్నప్పుడే, దర్శకుడు మారుతి ‘ప్రేమకథా చిత్రమ్’ను హిందీలో రీమేక్ చేయమని అడిగాడు. కుదర్లేదు. ఆ సమయంలోనే మారుతి ‘లవర్స్’ కథ విని తెలుగులో చేయమని అడిగారు. భవిష్యత్తులోనైనా ‘లవర్స్’ని హిందీలో చేస్తాను’’ అని దర్శకుడు హరినాథ్ చెప్పారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో మాయాబజార్ మూవీస్ సంస్థ నిర్మించిన ‘లవర్స్’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా యువతరంతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోందని హరినాథ్ ఆనందం వెలిబుచ్చారు. తన సినీప్రస్థానం గురించి హరినాథ్ వివరిస్తూ -‘‘న్యూయార్క్ ఫిలిమ్ అకాడమీలో ఫిలిమ్ మేకింగ్, స్క్రీన్ రైటింగ్‌లో స్పెషల్ కోర్స్ చేశాను. ముంబైలో మూడు హిందీ సినిమాలకు పని చేశాను. శ్రీకాంత్ హీరోగా ‘లక్కీ’ సినిమాతో దర్శకునిగా మారాను. ఆ తర్వాత మళ్లీ ముంబై వెళ్లి ‘లవర్స్’ కోసం హైదరాబాద్ వచ్చాను. ఇకపై రెగ్యులర్‌గా తెలుగు సినిమాలే చేస్తాను. ప్రస్తుతం నా దగ్గర నాలుగైదు కథలు సిద్ధంగా ఉన్నాయి’’ అన్నారు. ‘లవర్స్’ మేకింగ్ గురించి హరనాథ్ మాట్లాడుతూ -‘‘కథలో ఫ్రెష్‌నెస్ ఉంది. అలాగే ఆర్టిస్టుల్లోనూ ఫ్రెష్‌నెస్ ఉంది. సుమంత్ ఆశ్విన్, నందిత, సప్తగిరి ఈ సినిమా విజయంలో మెయిన్ పిల్లర్స్. మారుతి స్క్రిప్టు సైడ్ ఇచ్చిన సహకారం మరిచిపోలేనిది. ఆయన క్రియేటివ్ సైడ్ ఎక్కడా ఇన్వాల్వ్ కాలేదు’’ అని తెలిపారు. -
'ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి' స్టిల్స్
-
లవ్ ఇన్ లండన్ మూవీ పోస్టర్స్
-
లండన్ లో ఏం జరిగిందంటే..!?
‘‘తెలుగు సినీ కళాకారులకు మరింత ఉపాధి దొరకాలంటే... చిన్న సినిమాలు విజయం సాధించాలి. తెలుగు సినిమా కళకళలాడేది అప్పుడే’’ అని మురళీమోహన్ అన్నారు. పృధ్వీరాజ్, ప్రతాప్‌పోతన్, ఆండ్రియా, నందిత ప్రధాన పాత్రధారులుగా అనిల్ సి.మీనన్ దర్శకత్వంలో మలయాళంలో రూపొందిన చిత్రం ‘లండన్ బ్రిడ్జ్’. ఈ చిత్రం ‘లవ్ ఇన్ లండన్’గా తెలుగులో విడుదల కానుంది. సుంకేశుల రాజాబాబు నిర్మాత. రాహుల్‌రాజ్, శ్రీవల్సన్ జె. మీనన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో మురళీమోహన్ ఆవిష్కరించారు. నిర్మాత మాట్లాడుతూ -‘‘సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసం లండన్వెళ్లిన ఓ యువకుడికి అక్కడ ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనేది ఈ సినిమా కథ. మానవసంబంధాల నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. ‘ప్రేమకథాచిత్రమ్’ తర్వాత తనకు లభించిన మరో విజయమిదని, మలయాళంలో కూడా విజయాన్ని దక్కించుకోవడం ఆనందంగా ఉందని నందిత అన్నారు. -
అవకాశమొస్తే హిందీలో కూడా చేస్తా!
‘‘ఏ రంగంలో అయినా పోటీ సహజం. గ్లామర్ రంగంలో అయితే... మరీనూ. అందునా విజయంలో ఉన్నవారిపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే... జాగ్రత్తగా పాత్రలను ఎన్నుకుంటూ ముందుకెళ్తున్నాను’’ అని నందిత అన్నారు. సుమంత్ అశ్విన్, నందిత జంటగా హరినాథ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘లవర్స్’. మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు కలిసి నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. సినిమాకు మంచి స్పందన లభిస్తోందని నందిత ఆనందం వెలిబుచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటిస్తూ ‘‘మేం అనుకున్న దానికంటే ‘లవర్స్’కి మంచి స్పందన లభిస్తోంది. సుమంత్ అశ్విన్ సెటిల్డ్‌గా నటించాడు. సప్తగిరి, సాయి కామెడీ సినిమాకు ప్లస్ అయ్యింది’’ అని చెప్పారు నందిత. కుటుంబ ప్రేక్షకులకు దగ్గర కావడమే తన లక్ష్యమని, దాని కోసం ఏ తరహా పాత్ర చేయడానికైనా సిద్ధమని నందిత చెప్పారు. తెలుగుతో పాటు, తమిళ , మలయాళ భాషల్లో కూడా నటిస్తున్నానని, అవకాశం వస్తే బాలీవుడ్లో చేయడానికి కూడా సిద్ధమేనని నందిత తెలిపారు. -
పాటల్లో అందాలారబోశా
కనువిందు చేసే అందాలను ఆస్వాదించని వారుండరు. అందానికంత ప్రాదాన్యతనిస్తారు. ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అయినా సినిమా రంగంలో అందాలకిచ్చే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. తాజాగా వర్ధమాన నటి నందిత కూడా గ్లామర్‌కు మారింది. నలనుమ్ నందిత, ఎదిర్‌నీచ్చల్, అట్టకత్తి తదితర చిత్రాలలో సంప్రదాయ పాత్రలు పోషించి, పక్కింటి అమ్మాయి ఇమేజ్ సంపాదించుకున్న ఈ బ్యూటీ తాజాగా ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి చిత్రంలో అందాలారబోతకు దిగిందట. భరత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్యం ప్రొడక్షన్ పతాకంపై ప్రఖ్యాత దర్శకుడు కె.బాలచందర్ కూతురు పుష్పా కందస్వామి నిర్మించారు. ఎల్ జి రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నటుడు భరత్ 25వ చిత్రం కావడం విశేషం. ఇది ఈ నెల 22న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా చిత్ర నాయకి నందిత తన భావాలను తెలుపుతూ హాస్యాన్ని పండించటం అంత సులభం కాద ంది. సడన్‌గా ఈమె కామెడీ గురించి మాట్లాడుతుందేమిటని ఆశ్చర్యపోతున్నారా? ఐందామ్ తలైమురై సిద్ధ వైద్య శిఖామణి చిత్రంలో వినోదమే ప్రధానమట. ముఖ్యంగా పెళ్లి సన్నివేశంలో భరత్, నందితలతో సహా 22 మంది నటించారట. ఈ సన్నివేశంలో నటించిన వీళ్లే కడుపుబ్బ నవ్వేశారట. నటుడు భరత్ చుట్టూ తిరిగే ఈ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపు చెక్కలయ్యేలా నవ్వించడం ఖాయం అంటోంది నందిత. అన్నట్లు ఈ బ్యూటీ నటనకు అవకాశం వున్న పాత్రలో నటించారట. గ్రామీణ యువతి పాత్ర అయినా పాటల్లో కావలసినంత అందాల్ని ఆరబోశానంటోందీభామ. ఈ అమ్మడి అందాలు ఐందామ్ తలైమురై సిద్ధవైద్య శిఖామణి చిత్రానికి ఏ మాత్రం హెల్ప్ అవుతాయో చూద్దాం! -
ఇదో బలహీన ప్రేమకథాచిత్రమ్
తారాగణం: సుమంత్ అశ్విన్, నందిత, కెమేరా: మల్హర్ భట్ జోషీ, సంగీతం: జె.బి, నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, బి.మహేంద్ర బాబు, దర్శకత్వం: హరినాథ్, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు: మారుతి కొన్ని కథలు వినడానికి బాగుంటాయి... మరికొన్ని చూడడానికి బాగుంటాయి. వినడానికి బాగున్నవన్నీ తెరపై చూసేందుకు సరిపడక పోవచ్చు. పదే పదే ఒక అబ్బాయి ప్రేమను భగ్నం చేసే అమ్మాయి. చివరకు ఆ అమ్మాయి, అబ్బాయే ప్రేమలో పడితే? వినడానికి బాగున్న ఈ ఇతివృత్తానికి మారుతి మార్కు వెండితెర రూపం - ‘లవర్స’. కథ ఏమిటంటే... సిద్ధు (సుమంత్ అశ్విన్) ఇంటర్ చదువుతున్న రోజుల నుంచి ఒకరి తరువాత మరొకరుగా గీత (తేజస్వి), సౌమ్య అనే ఇద్దరు అమ్మాయిలతో ప్రేమలో పడతాడు. కానీ, ఆ అమ్మాయిలకు ఫ్రెండ్ అయిన చిత్ర (‘ప్రేమకథా చిత్రవ్‌ు’ ఫేవ్‌ు నందిత) ‘అది నిజమైన ప్రేమ కాదు... ప్రేమ పేరిట ఉబుసుపోక కాలక్షేప (ఫ్లర్టింగ్)’మంటూ, ఆ ప్రేమల్ని చెడగొడుతుంది. తీరా ఇంజినీరింగ్ చదువుకొంటున్న రోజుల్లో ఆ చిత్రనే అనుకోకుండా హీరో ప్రేమిస్తాడు. ఆ విషయం తెలిశాక ఏమైంది, వాళ్ళ ప్రేమ ఫలించిందా అన్నది మిగతా సినిమా. ఎలా నటించారంటే... హీరో సుమంత్ అశ్విన్ హుషారుగా నటించాడు, నర్తించాడు. కెమేరా లుక్స్ మీద, ఎంచుకొనే కథల మీద ఈ యువ నటుడు మరింత శ్రద్ధ పెట్టాలి. నందిత ఫరవాలేదనిపిస్తారు. మారుతి చిత్రాల్లో తరచూ కనిపించే సాయి పంపన హీరో ఫ్రెండ్‌గా మాటల హడావిడి చేశారు. సెకండాఫ్ లోని సప్తగిరి ఎపిసోడే ఈ బలహీనమైన కథ, కథనాల్లో కాస్త రిలీఫ్. ఎలా ఉందంటే... సినిమా మొదలైనప్పుడు కాస్త ఆసక్తిగా అనిపించినా, చర్చి ఫాదర్ (ఎమ్మెస్ నారాయణ)తో హీరో తన మొదటి ప్రేమకథ చెప్పి, రెండో కథ మొదలుపెట్టేటప్పటికే ఆసక్తి పోతుంది. పాత్రల పరిచయం, అసలు హీరోయిన్‌తో హీరో ప్రేమ మొదలవడం - ఈ కొద్దిపాటి కథనే ఫస్టాఫ్ అంతా నడిపారు. ఇక, వారిద్దరి మధ్య ప్రేమను ఎలా ముందుకు నడపాలన్న దానిపై దర్శక, రచయితలకు కూడా ఒక స్పష్టత లేదు. దాంతో, ప్రధాన కథకు సంబంధం లేని పాత్రలను తెచ్చి, వాటి ద్వారా కామెడీ చేయిస్తూ, కథను ముగింపు దగ్గరకు తీసుకురావాలని విఫలయత్నం చేశారు. కానీ, దురదృష్టవశాత్తూ ప్రేక్షకులప్పటికే డిస్కనెక్ట్ అయిపోతారు. మారుతి సినిమాలన్నిటి లాగానే దీనిలోనూ అక్కడక్కడ ఆడియో కట్లను దాటుకొని వచ్చిన ద్వంద్వార్థపు డైలాగులు వినిపిస్తాయి. ఒకటీ అరా చోట్ల డైలాగులు సమకాలీన యువతరం ఆలోచనల్ని ప్రతిఫలిస్తూ, హాలులో జనాన్ని నవ్విస్తాయి. కెమేరా వర్క, సంగీతం లాంటి అక్కడక్కడ ఫరవాలేదనిపించినా, పాత్రధారులకు టచప్ కూడా చేయకుండా తీసిన కొన్ని దృశ్యాలు, సాగదీత కథనం మధ్య వాటికి గ్రహణం పట్టేసింది. కథను ఎలా ముగించాలో తెలియక కేవలం సెకండాఫ్‌లో పిచ్చివాడు గజిని పాత్రలో సప్తగిరితో వచ్చే కామెడీతోనే సినిమాను నడిపేయాలనుకోవడం దర్శక, రచయితల పొరపాటు. వెరసి, హాలులోకి వెళ్ళిన కాసేటికే కథ గ్రహించేసిన జనం పూర్తిగా రెండు గంటల పది నిమిషాల సినిమా బోర్ అనుకోకుండా చూడగలగడం కష్టం. అందుకే, హాల్లోంచి బయటకొస్తూ ఒక స్టూడెంట్ అన్నట్లు, ఈ ‘లవర్స’ - ప్రేక్షకుల చెవిలో దర్శక, నిర్మాతలు పెట్టిన ఫ్లవర్స. బలాలు: * హీరో హుషారు నటన * లౌడ్‌గా అనిపించినా, కాసేపు నవ్వించే సప్తగిరి కామెడీ * ఒకటి రెండు పాటలు బలహీనతలు: * సున్నా కథ * మైనస్ కథనం * కథలోని పాత్రలను ప్రవేశపెట్టి, వాటి మధ్య అనుబంధం తెలియజేయడానికే ఫస్టాఫ్ అయిపోవడం ఫస్టాఫ్ కన్నా సెకండాఫ్‌లో కథ, * కథనం.. మరీ పిల్లలాట లాగా ఉండడం * దర్శకత్వం -
లండన్‌లో ప్రణయం
అతనో సాఫ్ట్వేర్ ఉద్యోగి. లండన్‌లో ఉద్యోగం. ఆమె ఓసంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయి. ఈ ఇద్దరికీ పెళ్లి చేయాలని పెద్దలు అనుకుంటారు. అతను తనకు తగినవాడేనా? అని ఆ అమ్మాయి, తనకు తగ్గ భార్యేనా అని అతను డైలమాలో పడతారు. చివరికి ఓ రోజు ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటారు. పెళ్లికి సుముఖంగానే ఉంటారు. ఈ నేపథ్యంలో అతని జీవితంలోకి ఇంకో అమ్మాయి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత కథ ఎలాంటి మలుపు తీసుకుంది? అనే కథాంశంతో రూపొందిన ఓ మలయాళ చిత్రం ‘లవ్ ఇన్ లండన్’ పేరుతో అనువాదమైంది. ఎస్సీఎస్ ఎంటర్టైన్మెంట్పై సుంకేశుల రాజబాబు ఈ చిత్రాన్ని అనువదించారు. పృథ్వీరాజ్, ఆండ్రియా, నందిత నాయకా నాయికలు. ఇటీవలే అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలో విడుదల చేయాలనుకుంటున్నారు. రాజబాబు మాట్లాడుతూ -‘‘ముక్కోణపు ప్రేమకథ నేపథ్యంలో సాగే ఈ చిత్రం షూటింగ్‌ను 99 శాతం లండన్‌లోనే చేశారు. దర్శకుడు అనిల్ సి. మీనన్ అద్భుతంగా తీశారు’’ అన్నారు. ఈ చిత్రానికి మాటలు: మహేశ్ దత్. -
అందరికీ నచ్చే లవర్స్
సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో రూపొందిన చిత్రం ‘లవర్స్’. హరినాథ్ ఈ చిత్రానికి దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ, మహేంద్రబాబు నిర్మాతలు. నిర్మాణం తుది దశకు చేరుకున్న ఈ చిత్రం ప్రచార చిత్రాలను సోమవారం హైదరాబాద్‌లో సుమంత్ అశ్విన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా సుమంత్ అశ్విన్ పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. ‘లవర్స్’ టీమ్ సమక్షంలో బర్త్‌డే వేడుకను జరుపుకోవడం ఆనందంగా ఉందని సుమంత్ అశ్విన్ అన్నారు. మారుతి మాట్లాడుతూ -‘‘నిర్మాణ బాధ్యత తప్ప క్రియేటివ్ సైడ్ ఎలాంటి జోక్యం చేసుకోకూడదు అనుకున్నాను. అయితే... ఎమ్మెస్ రాజుగారి కోరిక మేరకు ఈ సినిమాకు కథనం, సంభాషణలు అందించాల్సి వచ్చింది. రెండు రోజుల షూటింగ్ మినహా చిత్రీకరణ పూర్తయింది. సమంత చేతుల మీదుగా ఈ నెల 24న పాటల్ని విడుదల చేస్తాం. ఆగస్ట్‌లో సినిమా విడుదల ఉంటుంది’’ అని తెలిపారు. యువతరానికి నచ్చే అంశాలన్నీ ఇందులో ఉంటాయని దర్శకుడు చెప్పారు. చిత్రం యూనిట్ సభ్యులతో పాటు దామోదరప్రసాద్, వేమారెడ్డి కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: మల్హర్‌భట్ జోషి, సంగీతం: జె.బి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అడ్డాల శ్రీనివాస్. -
అందమైన జ్ఞాపకాల దొంతర
సుధీర్‌బాబు, నందిత జంటగా ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఆర్. చంద్రు దర్శకత్వంలో రామలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై శిరీషా శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రం మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి బి.గోపాల్ కెమెరా స్విచాన్ చేయగా, ఎ.కోదండరామిరెడ్డి క్లాప్ ఇచ్చారు. కె.రాఘవేంద్రరావు గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘కన్నడ చిత్రం ‘చార్మినార్’కు ఇది రీమేక్. తొలి చూపులోనే ప్రేమ అన్నట్టు... ఆ సినిమా చూడగానే ప్రేమలో పడిపోయి ఈ కథను తెలుగు ప్రేక్షకులకు కూడా అందించాలని నిర్ణయం తీసుకున్నాను. ‘ప్రేమకథాచిత్రమ్’ జంట సుధీర్‌బాబు, నందిత ఈ సినిమా కోసం జతకట్టడం ఆనందంగా ఉంది. చంద్రు ఈ చిత్రాన్ని చక్కగా తెరకెక్కిస్తాడనే నమ్మకం నాకుంది’’ అని లగడపాటి శ్రీధర్ చెప్పారు. ప్రతి ప్రేక్షకుని మనసునీ హత్తుకుపోయే సినిమా ఇదని, ఇదొక అందమైన జ్ఞాపకాల దొంతర అని సుధీర్‌బాబు అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ -‘‘కన్నడంలో భారీ సినిమాల మధ్య విడుదలై ‘చార్మినార్’ ఘన విజయం సాధించింది. శ్రీధర్‌గారు కథకు తగ్గ టైటిల్ ఖరారు చేశారు. ‘ఓనమాలు’ఫేం ఖదీర్‌బాబు సంభాషణలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలువనున్నాయి. మంచి టీమ్ కుదిరింది’’ అని తెలిపారు. గిరిబాబు, ఎమ్మెస్ నారాయణ, సారిక రామచంద్రరావు, చిట్టిబాబు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కేఎస్ చంద్రశేఖర్, కళ: నారాయణరెడ్డి, సంగీతం: హరి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దేవినేని రవికుమార్. -
మనీషాకు బదులు నందిత
కథ మారింది కల చెదిరింది అనే పాటను వర్ధమాన నటి మనీషా యాదవ్ పాడుకునే పరిస్థితి ఎదురైంది. ఈ బ్యూటీ మంచి నటే. ఆమె నటించిన వళక్కు ఎన్ 18/9. ఆదలాల్ కాదల్ సెయ్‌వీర్, జన్నల్ ఓరం వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. అయినా ఒక్కోసారి ఊహించని సంఘటనలు జరుగుతాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడికి దర్శకుడు శ్రీను రామసామి రూపంలో సడన్‌గా బ్రేక్ పడింది. అంతేకాదు ఇది ఆమె కెరీర్‌కు డ్రాబ్యాక్ అనే చెప్పాలి. జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత శీను రామసామి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ఇదం పొరుళ్ అవళ్. విజయ్ సేతుపతి, విష్ణు విశాల్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో మనిషాను హీరోయిన్గా ఎంపిక చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జంటగా మని షాకు చిత్రంలో గ్రామీణ యువతి పాత్రకు ఆమె నటన సంతృప్తికరంగా లేదంటూ దర్శకుడు ఆమెను మరో హీరోయిన్ పాత్రలో విష్ణు విశాల్‌కు జంటగా నటించమని అడిగారట. దీనికామె నిరాకరించడంతో ఇప్పుడా పాత్రకు నటి నందిత ఎంపికయ్యారు. ఈమెను ఇంతకు ముందు విష్ణు విశాల్‌కు జంటగా ఇదే చిత్రానికి ఎంపిక చేశారన్నది గమనార్హం. ఇప్పుడు విష్ణు విశాల్ సరసన నటించే నటి కోసం అన్వేషిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు. ఏదోమయినా నటి మనిషా యాదవ్‌కు ఈ సంఘటన పెద్ద దెబ్బేనని చెప్పాలి. -
రక్తదానం కాన్సెప్ట్‌తో...
‘‘తమిళంలో ఈ సినిమా నేనే చేయాలి. కథను జడ్జ్ చేయలేక వదులుకున్నాను. రక్తదానం కాన్సెప్ట్‌తో రూపొందిన చిత్రమిది. ఇందులో ఒక పాట పాడాను’’అని సందీప్ కిషన్ చెప్పారు. విజయ్ సేతుపతి, ‘కలర్స్’ స్వాతి, అశ్విన్, నందిత ముఖ్య తారలుగా గోకుల్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన ఓ చిత్రాన్ని ‘ఇదేగా ఆశపడ్డావ్’ పేరుతో తెలుగులో అనువదించారు సమన్యరెడ్డి, సుజన్. సిద్దార్థ్ విపిన్ స్వరాలందించిన ఈ సినిమా పాటల సీడీని దర్శకుడు హరీష్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ‘కలర్స్’ స్వాతి మాట్లాడుతూ -‘‘ఇందులో హీరో హీరోయిన్లు ఉండరు. అన్నీ పాత్రలే ఉంటాయి’’ అన్నారు. తెలుగులో దీన్ని రీమేక్ చేస్తే తానొక పాత్ర చేయాలనుకున్నానని నిఖిల్ తెలిపారు. విజయ్ సేతుపతి మంచి ఆర్టిస్ట్ అని, టైటిల్ బావుందని హరీష్ శంకర్ పేర్కొన్నారు. రాహుల్, రఘుబాబు, మహత్, నందిత, సంపూర్ణేష్‌బాబు తదితరులు మాట్లాడారు. -
ఫ్యామిలీ కోర్టులో బాలీవుడ్ నటుడికి ఎదురుదెబ్బ!
బాలీవుడ్ నటుడు ఓం పురికి ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గత కొద్దికాలంగా ఓంపురికి, ఆయన భార్య నందితకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నందితా ముంబైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. నందితా పిటిషన్ విచారణ చేపట్టిన కోర్టు గత వారం ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది. నందితాకు మెయింటెనెన్స్ కింద ప్రతినెలకు 1.25 లక్షల రూపాయలు.. కుమారుడికి 50 వేల రూపాయలను చెల్లించాలని కోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా వైద్య, విద్య ఖర్చుల కోసం పత్రినెల 1.15 లక్షలు చెల్లించాలని ఓం పురికి ఆదేశించింది. ఆదాయ వనరుల లేమి ఉన్నందున్న.. నందితా లీగల్ ఖర్చుల కింద 25 వేల రూపాయలు కూడా ఓంపురి చెల్లించాలని తీర్పులో పేర్కోంది. ఇవియే కాకుండా నందితా కోసం చెల్లిస్తున్న ఇన్పూరెన్స్ ప్రీమియం, మెడిక్లెయిమ్ పాలసీలు, విద్యుత్, టెలిఫోన్ బిల్లులు, సొసైటీ మెయింటెనెన్స్ చార్జీలను ఓంపురి చెల్లిస్తున్నారు. వ్యక్తిగత విభేదాల కారణంగా తాము ఇద్దరం కలిసి జీవించడానికి వీలు లేనందున తమకు విడాకులు మంజూరు చేయాలని 2012 లో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో తాను గృహిణి అని.. తనకు జీవించనడానికి ఆదాయ వనరులు లేనందున ఇంటిరిమ్ మెయింటెనెన్స్ చెల్లించాలని నందిత పిటిషన్ దాఖలు చేశారు. ప్రతినెల ఓంపురికి 35 లక్షల నుంచి 45 లక్షల రూపాయల ఆదాయం ఉందిని కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్ నందితా పేర్కొన్నారు. -
లవర్స్‌గా సుమంత్అశ్విన్, నందిత
‘‘ఈ కథను హరినాథ్ తొమ్మిది నెలలు కష్టపడి తయారు చేసుకున్నాడు. కథ, డైలాగులు అద్భుతంగా రాశాడు. అందుకే నిర్మాణంలో భాగస్వామి అయ్యాను. అంతకు మినహా క్రియేటివ్ సైడ్ నా ఇన్వాల్వ్మెంట్ ఏమీ ఉండదు. ఒకవైపు దర్శకత్వం వహించడంతో పాటు మరోవైపు మారుతి టాకీస్‌పై ఇలాంటి మంచి చిత్రాలను నిర్మిస్తుంటాను. ఈ నెల 26న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం’’ అన్నారు మారుతి. సుమంత్ అశ్విన్, నందిత జంటగా మారుతి సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, మహేంద్ర నిర్మిస్తున్న చిత్రం ‘లవర్స్’. హరినాథ్ దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి డా. డి.రామానాయుడు, కె.ఎస్. రామారావు కెమెరా స్విచాన్ చేయగా, బెల్లంకొండ సురేష్ క్లాప్ ఇచ్చారు. వీవీ వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని దర్శకుడు తెలిపారు. సుమంత్ అశ్విన్ మాట్లాడుతూ -‘‘అంతకు ముందు మంచి టీమ్‌తో, ఆ తర్వాత మంచి టీమ్‌తో సినిమా చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. ఈ స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది’’ అన్నారు. పెళ్లయిన కొత్తలో, సింహా, బస్‌స్టాప్, జబర్దస్త్ చిత్రాలకు సహనిర్మాతగా చేశానని, మాయాబజార్ మూవీస్ ప్రారంభించి తొలి ప్రయత్నంగా వంశీతో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నానని మహేంద్ర తెలిపారు. ఇంకా ఈ సమావేశంలో సూర్యదేవర నాగవంశీ, నందిత పాల్గొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: జీవన్, కెమెరా: మల్హర్‌భట్ జోషి, లైన్ ప్రొడ్యూసర్: డి. సతీష్. -
గీత స్మరణం
పల్లవి : ఓ మై లవ్... ఓ మై లవ్... మై లవ్ మై లవ్... ఓ మై లవ్... ఏ చోట ఉన్నా నీడల్లే నీవెంట ఉన్నా నన్నే నేను నీలో చూస్తు వున్నా ఓ మై హార్ట్ ఏం చేస్తు వున్నా ఏదోలా నీ తోడు కానా... నువ్వే లేని నేనే నేను కానా నాలోనూ దాగున్న నీ ప్రేమ... నీదాక చేరేది ఎలా మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చరణం : 1 కలిసేలా విషయముకై ఎదురే చూస్తుందే ఎదురైతే ఎందుకనో సిగ్గే వేస్తుందే నీవల్లే కలవరమంతా మదినే తడిపేస్తుందే చిత్రంగా ఉంది నాకే ఏదేదో చేస్తుంటే నీవేగా నీవేగా నీవేగా... నా చుట్టూ నీవేగా ఇలా... మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చరణం : 2 నువ్వే నా సొంతమని ధీమా వస్తుందే చొరవగనే వస్తున్నా చేరువ నీవుంటే నీవున్నావన్న ధ్యాసే నన్నే నడిపిస్తుందే అందంగా ఉంది నాకే నువ్వే నేనౌతుంటే నీవేగా నీవేగా నీవేగా... నేనంటూ నీవేగా ప్రియా... మై లవ్ ఓ... మై లవ్ ఓ... ఓ మై లవ్... చిత్రం : ప్రేమకథా చిత్రమ్ (2013) రచన : కాసర్ల శ్యామ్ సంగీతం : జె.బి., గానం : లిప్సిక