రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టీకరణ
బెంగళూరు: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి విద్యార్థిని నందితా అనుమానాస్పద మృతి కేసులో పోలీసులకు లభించిన ఉత్తరం నందితా రాసిన ‘డెత్‌నోట్’ అని ఫోరెనిక్స్ నిపుణులు నిర్ధారించారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ వెల్లడించారు. బుధవారమిక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రి ప్రాంగణంలో ‘చిన్నారులపై లైంగిక దౌర్జన్యాలు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కేజే జార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి ఘటనల్లో తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. ఇక నుండి డిసెంబర్ నెలను ‘మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాల నిరోధక మాసం’గా పరిగణించనున్నట్లు తెలిపారు.
నందితా ‘డెత్ నోట్’ రాసింది
Published Thu, Nov 20 2014 2:24 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement