Death Note
-
టెక్కీ అతుల్ భార్యకు నోటీసులు
బొమ్మనహళ్లి : భార్య వేధింపులతో 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న టెక్కీ అతుల్ కేసు దర్యాప్తును బెంగళూరు నగరం మారతహళ్లి పోలీసులు ముమ్మరం చేశారు. అందులో భాగంగా పరారీలో ఉన్న ఆయన భార్య నిఖితా సింఘానీయాకు సమన్లు జారీ చేశారు. ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ ఈనెల 6వ తేదిన బెంగళురు నగరలోని మారతహళ్లిలో ఉన్న మంజునాథ్ లేఔట్లో తన ఇంటిలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతుడి సోదరుడి ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఉత్తర ప్రదేశ్‌లోని జౌన్పురలో ఉన్న నిఖితా సింఘానియా ఇంటికి శుక్రవారం వెళ్లగా అక్కడ ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. మూడు రోజుల్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎఫ్ఐర్లో నిఖిత, తల్లి నిశా నింఘానియా, చిన్నాన్న సుశిల్ సింఘానియా, సోదరుడు ఆనురాగ్ సింఘానియా పేర్లు ఉన్నా నిఖితాను మాత్రమే విచారణకు హాజరు కావాలని సమన్స్‌లో పేర్కొన్నారు. కాగా కేసు దర్యాప్తు కట్టుదిట్టంగా జరుగుతోందని, ఈకేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని బెంగళూరు నగర పోలిసు కమిషనర్ బీ.దయానంద్ తెలిపారు.Atul Subhash Case: అతుల్.. అంతులేని ఆవేదన -
నా చావుకు నేనే కారణం..
బనశంకరి: కష్టం వస్తే పరిష్కరించుకుని ముందుకు సాగాలి కానీ, ఘోరాలకు పాల్పడితే జీవితాలు ముగిసిపోతాయి. అదే రీతిలో కుటుంబ కలహాలను తట్టుకోలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలను హత్య చేసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘోరం బెంగళూరు కొడిగేహళ్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. తల్లి కుసుమ (35), పిల్లలు శ్రీయాన్ (6), చార్వి (18 నెలలు) మృతులు. డెత్‌నోట్ రాసి.. వివరాలు.. కొడిగేహళ్లి అపార్టుమెంట్లో సురేశ్, కుసుమా దంపతులు నివాసం ఉంటున్నారు. సురేశ్ ప్రైవేటు కంపెనీలో అకౌంటెంట్. రెండు రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ చోటుచేసుకుంది. బుధవారం ఉదయం సురేశ్ ఆఫీసుకు వెళ్లిన తరువాత, నా చావుకు నేనే కారణమని కుసుమ డెత్‌నోట్ రాసింది. ముందుగా ఇద్దరు పిల్లలు ముఖం పై దిండుపెట్టి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. తరువాత కుసుమ ప్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 9.30 గంటలకు భర్త ఇంటికి చేరుకోగా ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. స్థానిక పోలీసులు చేరుకుని పరిశీలించి డెత్‌నోట్‌ను స్వా«దీనం చేసుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
భార్య కేసు పెట్టిందని.. 40పేజీల డెత్‌నోట్ రాసి
బనశంకరి: భార్య తనపై కేసు పెట్టిందనే ఆవేదనతో భర్త 40 పేజీల డెత్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులో సోమవారం వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్ (35) మారతహళ్లి మంజునాథ లేఔట్లో నివాసం ఉంటున్నారు. ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తాడని సమాచారం. ఇతని భార్య గొడవపడి యూపీలో పుట్టింటికి వెళ్లిపోయి అక్కడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో అప్పటినుంచి తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.కుమార్తెకు కానుక కొనుగోలుఆదివారం అర్ధరాత్రి 40 పేజీల డెత్‌నోట్ రాసి, పలు రకాల డాక్యుమెంట్లను జత చేసి ఓ సేవా సంస్థ వాట్సాప్ గ్రూప్‌లో పోస్టు చేశాడు. తన కుటుంబానికి సాయం చేయాలని కోరాడు. తన ఇంటి తాళం ఎక్కడ ఉంది, ఏయే పనులు జరిగాయి, పెండింగ్ పనులు ఎన్ని ఉన్నాయి అనే వివరాలను అందులో రాశాడు. చివరి క్షణంలో తన నాలుగేళ్ల కుమార్తె జ్ఞాపకం రావడంతో ఒక కానుకను కొనుగోలు చేసి ఉంచాడు. దానిని ఆమెకు ఇవ్వాలని రాశాడు. ఈ డెత్‌నోట్‌ను సుప్రీంకోర్టుకు పంపాలని కోరాడు.3 రోజుల నుంచి సన్నాహాలుగత మూడురోజుల నుంచి అతడు ఆత్మహత్యకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. డే1, డే 2, డే3 ఏమేం చేయాలి అనేది ఇంట్లో బోర్డు మీద కాగితాల్లో రాసి అతికించాడు. ఉదయం నిద్ర లేచినప్పటినుంచి ఆత్మహత్య చేసుకునే వరకు ఏమేం పనులు చేయాలి అని గుర్తు చేసుకున్నాడు. ఇక న్యాయం జరగడమే మిగిలి ఉంది అని ఆంగ్లంలో రాశాడు. ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే మారతహళ్లి పోలీసులు చేరుకుని పరిశీలించి డెత్‌నోట్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. యూపీలోని భార్య, కుటుంబానికి సమాచారం అందించారు. అతడు సున్నిత మన స్కుడని, కుటుంబ గొడవల వల్ల తీవ్రమైన డిప్రెషన్‌కు గురయ్యాడని, అందువల్లే ఇలా చేశాడని పలువురు నెటిజన్లు సానుభూతి తెలిపారు. -
20 రోజుల్లో షిండే సర్కార్ పతనం: సంజయ్
జల్గావ్: మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసి షిండే వర్గంలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత సహా పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..తీర్పు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్‌లో షిండే, 39 మంది ఎమ్మెల్యేలు కూల్చి, బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. -
హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు
వారం రోజుల కిందట బండెమఠం బసవలింగ స్వామి ఆత్మహత్య కేసులో తొలిరోజే వ్యక్తమైన అనుమానాలు నిజమయ్యాయి. మరో మఠం స్వామి కుట్ర పన్ని ఆయనను హనీ ట్రాప్‌లో ఇరికించడం, ఆ వీడియోలను బయటపెడతానని బెదిరించడం బండెమఠం స్వామి ఆత్మహత్యకు కారణమని తేలింది. ఓ యువతిని మఠానికి పంపి స్వామీజీని లోబర్చుకుని వీడియోలు తీశారు. పరువు పోవడం కంటే ప్రాణం పోతే మేలనుకునేలా ఆయనను ఒత్తిడికి గురిచేశారు. సూత్రధారి ఆయనకు బంధువు కావడం గమనార్హం. మఠాల మధ్య సాగుతున్న చీకటి పోరాటాల్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది. సాక్షి, బెంగళూరు: రామనగర జిల్లా మాగడి తాలూకా కంచుగల్ బండేమఠ బసవలింగస్వామి (45) ఆత్మహత్య కేసులో అదే జిల్లా కణ్ణూరు మఠం మృత్యుంజయ శ్రీ, స్థానిక నేత మహదేవయ్య, ఇంజనీరింగ్ విద్యార్థిని నీలాంబికను ఆదివారం రామనగర పోలీసులు అరెస్ట్‌చేశారు. బసవలింగ స్వామి రాసిన డెత్‌నోట్‌లో మూడు పేజీలలో పూర్తి సమాచారం తెలియపరిచారు. 21 ఏళ్ల నీలాంబికను బండేమఠానికి పంపి కణ్ణూరు మృత్యుంజయ స్వామి హనీట్రాప్‌కు పాల్పడ్డారని డెత్‌నోట్‌లో ప్రస్తావించారు. కణ్ణూరు స్వామి, ఇతర ఏడెనిమిదిమందితో వేధింపులను ఎదుర్కొన్నానని, మఠం గురించి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన చావుకు ఆ యువతి కారణమని రాసిపెట్టారు. రాష్ట్రంలో సంచలనం బండేమఠ బసవలింగస్వామీజీ ఆత్మహత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించగా, మూడు ప్రత్యేక పోలీస్ బృందాలతో నిందితుల కోసం వేట మొదలైంది. మృతుడు వివరంగా డెత్‌నోట్ రాయడంతో పోలీసుల పని సులువైంది. హనీ ట్రాప్ జరిగినట్లు తొలిరోజే వెలుగుచూసింది. నిందితుల అరెస్టులతో ఇది ఖరారైంది. అన్ని కోణాల్లో విచారణ చేపడుతున్నామని రామనగర ఎస్పీ సంతోష్‌బాబు తెలిపారు. నగ్న వీడియో వైరల్ బండేమఠం స్వామి ప్రైవేటు వీడియోలు వైరల్ అయ్యాయి. అందులో మొదటి రెండు వీడియోల్లో అర్దనగ్నంగా ఉన్న ఆయన ఆ తరువాత పూర్తి నగ్నంగా ఉన్నారు. కానీ వీడియో కాల్ చేసిన మహిళ ఎవరు అనేది ఇంకా తెలియరాలేదు. ఆమె వీడియో కాల్‌ను రికార్డ్ చేసుకుని ఆడియోను మ్యూట్ చేసింది. 8 మంది తీవ్ర విచారణ ఈ కేసులో 8 మందిని పోలీసులు విచారణ చేపట్టారు. స్వామీజీ యువతి గురించి పదేపదే లేఖలో పేర్కొన్నారు. మూడో వీడియో కూడా శనివారం లీక్ అయింది. మరో మొబైల్లో దృశ్యాలను చూపుతూ ముద్దు పెట్టుకుందామా అని మహిళను కోరే దృశ్యాలు ఉన్నాయి. దర్యాప్తులో మరిన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశముంది. పావుగా బెంగళూరు విద్యార్థిని ఈ కేసులో రామనగర పోలీసులు దర్యాప్తు వేగవంతం చేయగా బెంగళూరుకు చెందిన నీలాంబికను అదుపులోకి తీసుకున్నారు. కణ్ణూరు మృత్యుంజయస్వామీమి, బండెమఠం బసవలింగస్వామీజీ బంధువులని తెలిసింది. బండెమఠం పీఠం కోసం కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. మృత్యుంజయ స్వామిని రామనగర పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. ఇతనితో 8 మంది చేతులు కలిపినట్లు తెలిసింది. అపారమైన సంపద ఉన్న బండె మఠాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి యువతి ద్వారా పథకం నడిపించారు. బండెమఠ పాఠశాలలలో పనిచేసే పంకజ అనే మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
భార్య వేధింపులు తాళలేక...
యశవంతపుర: భార్య వేధింపులను తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన చిక్కమగళూరు జిల్లా కొప్ప తాలూకా జయపుర గ్రామంలో జరిగింది. అరవింద్ (42) తన తోటలోని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు డెత్‌నోట్ రాసి తన మరణానికి భార్య, ఆమె బంధువులు, పోలీసుల పేర్లు రాశాడు. 12 ఏళ్ల క్రితం అరవింద్‌తో రేఖనిచ్చి వివాహం చేశారు. రోజు ఏదో విషయంపై గొడవ పడేవారు. ఇద్దరి మధ్య గొడవలు జరగటంతో రేఖ బంధువులు ఇటీవల జయపుర స్టేషన్‌కు పిలిపించి విచారించారు. దీంతో విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకున్నాడు. జయపుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. భర్త చేతిలో భార్య హతం : కుటుంబ కలహాలతో భర్త భార్యను హత్య చేసిన ఘటన హాసన జిల్లా బేలూరు తాలూకా చీకనహళ్లి గ్రామంలో మంగళవారం జరిగింది. ఇంద్రమ్మ (48)ను ఆమె భర్త చంద్రేగౌడ నలుగురితో కలిసి హత్య చేసి పరారయ్యాడు. అడ్డుపడిన మహిళలపై కూడా నిందితులు దాడి చేశాడు. ఆరు నెలల క్రితం చంద్రమ్మను హత్య చేయటానికి పథకం వేయగా ఆమె తప్పించుకుంది. పుట్టినిల్లు చీకనహళ్లిలో ఉంటూ కూలీ పనులకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: హెలికాప్టర్ సర్వీస్ రూ. 17 వేలు టోపి) -
పోలీసుల వేధింపుల వల్లనే కుటుంబం ఆత్మహత్య.. యువతి డెత్‌నోట్
సాక్షి, కోలారు(కర్ణాటక): శిశువు కిడ్నాప్ కేసు కేసులో తమను మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వేధించారనే అవమానంతో ఒకే కుటుంబానికి చెందిన 5 మంది ఆత్మహత్య చేసుకున్న ఘటనలో నగర మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బందిని సస్పెండ్ చేయాలని వివిధ సంఘాలు డిమాండ్ చేశాయి. కోలారు నగరంలో తల్లితండ్రులు, కొడుకు, ఆరోపణలు వచ్చిన కూతురు, మనవరాలు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఆరోపి పుష్ప రాసిన నాలుగు పేజీల డెత్‌నోట్‌లో మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది వేధింపులు తట్టుకోలేకపోతున్నామని, కుటుంబమంతా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎస్ఐతో పాటు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువ అవుతోంది. ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని సంఘాల కార్యకర్తలు కోరారు. -
కుటుంబం ఆత్మహత్య: అతని వివాహేతర సంబంధమే కారణమా?
సాక్షి, బెంగళూరు: బెంగళూరు నగరంలో గత శుక్రవారం వెలుగుచూసిన ఒకే కుటుంబంలో తల్లీ ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఆత్మహత్య, మగశిశువు మృతి కేసు రోజుకొక మలుపు తిరుగుతోంది. తమ ఆత్మహత్యకు తండ్రి శంకర్‌కు మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే కారణమని కొడుకు మధుసాగర్ రాసిన డెత్‌నోట్ పోలీసుల సోదాల్లో ఆదివారం ఉదయం బయటపడింది. తండ్రి వల్ల ఇంట్లో కలహాలు ఏర్పడి ఆత్మహత్య చేసుకున్నట్లు రాశాడు. తన లాప్టాప్లో అన్ని వివరాలు ఉన్నట్లు తెలిపాడు. చదవండి: బెంగళూరులో సామూహిక ఆత్మహత్యల కలకలం కూతుళ్లదీ అదేమాట కూతుళ్లు సించన, సింధూరాణి గదులలో లభించిన డెత్‌నోట్‌లలోనూ తండ్రి వివాహేతర సంబంధం గురించి ప్రస్తావించారు. సించన అత్తవారింట్లో సంతోషం లేదని రాసింది. దీంతో లేఖలను, లాప్‌టాప్‌ను బ్యాడరహళ్లి పోలీసులు క్షుణ్ణంగా పరిశోధిస్తున్నారు. కేజీ బంగారం, రూ.12 లక్షలు సీజ్.. శంకర్ ఇంట్లో సోదాల్లో దొరికిన కేజీ బంగారం, రూ.12 లక్షలు నగదును కూడా పోలీసులు సీజ్ చేసి ఇంటికి తాళాలు వేశారు. శంకర్ విజ్ఞప్తి మేరకు పంచనామా సమయంలో విజయనగర ఎసీపీ నంజుండేగౌడ నేతృత్వంలో సీఐ రాజీవ్‌లు ఇంటిలోని ప్రతిభాగాన్ని వీడియో చిత్రీకరణ చేశారు. మృతుల మొబైల్ఫోన్లను స్వాధీనం చేసుకుని విశ్లేషించే పనిలో ఉన్నారు. అల్లుళ్లు ప్రవీణ్, శ్రీకాంత్‌లను ప్రశ్నించారు. ఇక శంకర్‌పై కుటుంబీకులే ఆరోపణలు చేయడంతో పోలీసులు ఆయన మీద దృష్టి సారించారు. మరోవైపు అంత్యక్రియలు జరుగుతున్న సమయంలో తన భార్యే గొడవలకు కారణమని శంకర్ రోదించాడు. చదవండి: సరిగా కూర్చోవాలని అన్నందుకు ఐరన్ రాడ్‌తో టీచర్‌పై.. -
ఈ బతుకు మాకొద్దు.. మరణించేందుకు అవకాశమివ్వండి
శివాజీనగర: ఆత్మహత్య లేఖ రాసి ఉంచి కుటుంబం అదృశ్యమైన సంఘటన బెంగళూరు బాగలగుంటలో చోటు చేసుకుంది. గాంధీ, శాలిని దంపతులు, వారి పిల్లలు భానుశ్రీ, హేమశ్రీ అదృశ్యమైనవారు. దంపతుల తనయుడు చిరంజీవి తుమకూరులో చదువుకుంటున్నాడు. రోజూ కుటుంబంతో ఫోన్లో మాట్లాడేవాడు. ఆగస్టు 12న ఫోన్ చేయగా అందరి ఫోన్లు స్విచ్చాఫ్ అని రావడంతో కంగారుపడిన చిరంజీవి, దగ్గర్లోని స్నేహితునికి సమాచారమిచ్చాడు. అతడు వెళ్లిచూడగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇంటి యజమానిని విచారించగా, కుటుంబంతో కలిసి వస్తువులన్నింటిని తీసుకొని వెళ్లారని చెప్పాడు. ఇది తెలిసి చిరంజీవి బాగలకుంటెకు వచ్చి తన వద్ద ఉన్న తాళంతో ఇంటి తలుపులు తీయగా, కిటికీ వద్ద డెత్‌నోట్ కనిపించింది. తమకు బతకటం చాలా కాష్టమవుతోంది, ఈ జీవితం అవసరం లేదు. దయచేసి మరణించేందుకు అవకాశం ఇవ్వాలని అందులో రాసి ఉంది. చిరంజీవి ఈ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయగా కేసు నమోదు చేసుకుని గాలింపు జరుపుతున్నారు. చదవండి: ఒక్క డ్యాన్స్‌తో సెలబ్రిటీగా మారిన ‘బుల్లెట్టు బండి’ వధువు -
నందితా ‘డెత్ నోట్’ రాసింది
రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ స్పష్టీకరణ బెంగళూరు: శివమొగ్గ జిల్లాలోని తీర్థహళ్లి విద్యార్థిని నందితా అనుమానాస్పద మృతి కేసులో పోలీసులకు లభించిన ఉత్తరం నందితా రాసిన ‘డెత్‌నోట్’ అని ఫోరెనిక్స్ నిపుణులు నిర్ధారించారని రాష్ట్ర హోం శాఖ మంత్రి కేజే జార్జ్ వెల్లడించారు. బుధవారమిక్కడి ఎంఎస్ రామయ్య ఆస్పత్రి ప్రాంగణంలో ‘చిన్నారులపై లైంగిక దౌర్జన్యాలు’ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి కేజే జార్జ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇలాంటి ఘటనల్లో తక్షణమే స్పందించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇప్పటికే పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. ఇక నుండి డిసెంబర్ నెలను ‘మహిళలు, చిన్నారులపై దౌర్జన్యాల నిరోధక మాసం’గా పరిగణించనున్నట్లు తెలిపారు. -
ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం
ఆత్మహత్యకు పురిగొల్పిన పెళ్లి నిశ్చయం చున్నీతో కట్టుకుని కాలువలో దూకి వారిద్దరూ చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు. తమను ఎవరూ విడదీయలేరనే విశ్వాసం వారిలో నిత్యం తొణికసలాడేది. అయితే కాలానుగుణంగా రావాల్సిన మార్పులను ఎవరూ ఆపలేరు కదా. వీరి విషయంలోనూ అదే జరిగింది. ఇద్దరిలో ఒకరికి పెళ్లి నిశ్చయం కావడంతో తమ స్నేహానికి అంతిమ గడియలు దాపురించాయని భయపడ్డారు. అలా కాకూడదనుకున్నారు. తమ స్నేహం అజరామరమని ఈ లోకానికి చాటి చెప్పాలనుకున్నారు. ఇద్దరూ బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ మరణం తమకే కానీ తమ స్నేహానికి కాదని చాటి చెప్పారు. శ్రీరంగ పట్టణ తాలూకాలోని మజ్జిగపురలో చోటు చేసుకున్న ఈ హృదయ విదారక సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. మండ్య : రామనగర తాలూకాలోని హొంబేగౌడన దొడ్డికి చెందిన పవిత్ర (22), చన్నపట్టణ తాలూకాలోని కాచహళ్లికి చెందిన జయంతి (22)లు ఎనిమిదో తరగతి నుంచి బీకాం వరకు కలసి చదువుకున్నారు. ఈ క్రమంలో వారి స్నేహం పటిష్ట పునాదులను పరుచుకుంది. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లే వారు. ఒకరినొకరు వదిలి ఉండేవారు కాదు. జయంతికి పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఇటీవలే నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే ఈ పెళ్లి జయంతికి ఇష్టం లేదు. పవిత్ర వివాహం చేసుకునే వరకు తానూ పెళ్లి చేసుకోకూడదనేది ఆమె ఉద్దేశం. అయితే పవిత్రకు అక్క ఉంది. ముందుగా ఆమెకు పెళ్లి కావాలి. ‘నిన్ను వదిలి ఈ పెళ్లి చేసుకోను’ అని పవిత్రకు జయంతి చెప్పింది. ఇద్దరూ తర్జన భర్జన పడ్డారు. చివరికి తమ స్నేహానికి అమరత్వం కల్పించాలని నిర్ణయించుకున్నారు. గురువారం మధ్యాహ్నం పవిత్ర తన ఇంటిలో మరణ వాంగ్మూలం రాసి టేబుల్‌పై ఉంచింది. అనంతరం జయంతిని కలుసుకుంది. ఇద్దరూ రామనగర నుంచి కృష్ణరాజ సాగర జలాశయం వద్దకు వెళ్లారు. అక్కడి నుంచి మజ్జిగపురం చేరుకున్నారు. తమ వెంట తెచ్చుకున్న మొబైల్ ఫోన్లను స్విచాఫ్ చేసి పక్కన పడవేశారు. చున్నీలతో చేతులు కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పవిత్ర కుటుంబ సభ్యులు మరణ వాంగ్మూలాన్ని చూసి గాబరా పడ్డారు. ఆమె కోసం వెదకడం ప్రారంభించారు. ఫోన్ చేసినా ఫలితం లేదు. ఇక లాభం లేదనుకుని ఇరు కుటుంబాల వారు పోలీసులను ఆశ్రయించారు. స్థానిక పోలీసులు అన్ని పోలీసు స్టేషన్లను అప్రమత్తం చేశారు. శుక్రవారం ఉదయం మజ్జిగపుర కాలువలో ఇద్దరి మృత దేహాలు కనిపించాయి. స్థానికులు పోలీసులకు సమాచారాన్ని చేరవేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పొలీసులు పక్కన పడి ఉన్న ఫోన్లను స్విచాన్ చేశారు. వెంటనే బంధువుల నుంచి ఫోన్ వచ్చింది. ఇక్కడ ఇద్దరి మృత దేహాలు ఉన్నాయని పోలీసులు తెలపడంతో, అందరూ అక్కడికి చేరుకుని బోరుమన్నారు. డెత్‌నోటు వివరాలు నేను మరియు జయంతి చని పోవాలని నిర్ణయించుకున్నాము. జయాకు పెళ్ళి చేసుకొవడం కొంచెం కూడ ఇష్టం లేదు. ఆమెకు కావాలిసింది నేను మాత్రమే. మీ స్వార్థం కోసం మమ్మల్ని ఇద్దరిని దూరం చేయకండి. రెండు తలలు కలిసి ఉంటాయి కాని, రెండు జడలు ఒక దగ్గర ఉండవని అంటారు కాని. అది మేము అబద్దమని నిరూపించాము. ఎంతో మంది ప్రేమ కోసం చనిపోతున్నారు. కాని స్నేహం కోసం ఎవరూ చనిపోరు. ఆ స్నేహం కోసం చని పోవాలని మేము మాత్రం నిర్ణయించుకున్నాము. గుడ్ బై. మా ఇద్దరి స్నేహితులకు వేరీ సారీ. ఇప్పటి వరకూ నేను ఎవరినీ ఏమి అడగ లేదు. మేము చనిపోయే ముందు అడిగేది ఒక్కటే. నన్ను జయంతిని ఇద్దరిని ఒకే చోట మట్టిలో ఫూడ్చండి. ఇది మా ఇద్దరి ఆశ. నా తల్లిదండ్రులను కోరేది కూడ ఇది ఒక్కటే. - (పవిత్ర) -
ఇంజనీర్ దంపతుల ఆత్మహత్య
బెంగళూరు, న్యూస్‌లైన్ : ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో నమ్మిన వారు మోసం చేయడమే కాక వేధింపులకు పాల్పడడంతో ఇంజనీర్ దంపతులు గురువారం ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... రామనగర జిల్లా ఐజూరు హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసముంటున్న విజయానందశెట్టి(45), లక్ష్మి(37) దంపతులు. బెంగళూరు శివారులోని రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలలో విజయానందశెట్టి బయోమెట్రిక్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. కొన్ని ఆర్థిక లావాదేవీలలో చిక్కుకున్న వీరు పలువురికి పోస్ట్ డెటెడ్ చెక్కులు, నగలు ఇచ్చి, తమ అప్పు తీరిన తర్వాత వాటిని తిరిగి ఇవ్వాలని కోరారు. తర్వాత వారికి నగదు చెల్లించినా చెక్కులు, నగలు వాపస్ ఇవ్వకుండా వేధించడమే కాక పరువు తీసేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంపై మనస్థాపం చెందిన విజయానందశెట్టి బుధవారం రాత్రి ఇంటికి చేరుకుని తన భార్యతో చాలా సేపు చర్చించాడు. సమాజంలో పరువు పోతుందని భావించి ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుని డెత్ నోట్ రాశారు. అందులో తాము ఎలా మోసపోయింది వివరించి ఇద్దరూ సంతకాలు చేశారు. తర్వాత తన స్నేహితుడికి తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు విజయానందశెట్టి ఎస్ఎంఎస్ పెట్టాడు. విషం తాగి లక్ష్మి బెడ్‌పై కుప్పకూలిపోయింది. అదే బెడ్రూంలో ఫ్యాన్‌కు విజయానందశెట్టి ఉరి వేసుకున్నాడు. ఎస్ఎంఎస్ అందుకున్న స్నేహితుడు, మరికొందరితో కలిసి హుటాహుటినా అక్కడకు చేరుకునే లోపు ఇద్దరూ మరణించారు. డెత్‌నోట్‌లో తాము ఎవరికి అపకారం చేయలేదని పేర్కొన్నారు. రాజరాజేశ్వరి మెడికల్ కళాశాల యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తమ ఇద్దరి మృతదేహాలను రాజరాజేశ్వరి మెడికల్ కళాశాలకు అప్పగించాలని రాసిపెట్టారు. డెత్‌నోట్ ఆధారంగా దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.