![Shinde-led Maharashtra government will collapse in 15-20 Days - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/24/sanjayr-rau.jpg.webp?itok=x99XPoMg)
జల్గావ్: మహారాష్ట్రలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు.
ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసి షిండే వర్గంలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత సహా పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..తీర్పు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్‌సీపీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్‌లో షిండే, 39 మంది ఎమ్మెల్యేలు కూల్చి, బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment