shivasena
-
బీజేపీ మల్లగుల్లాలు .. పలు శాఖలపై షిండే పట్టు!
-
షోలాపూర్ సీటు: కాంగ్రెస్‌పై మండిపడ్డ సంజయ్ రౌత్
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ‘షోలాపూర్ సౌత్’ స్థానంలో అభ్యర్థిని నిలబెట్టటంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. తమ పార్టీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించిందని తెలిపారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.‘‘ఇటువంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపిస్తే.. మహా వికాస్ అఘాడి (MVA)కి సమస్యలను సృష్టించినట్లు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ తన కొత్త జాబితాలో షోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా దిలీప్ మానేను ప్రకటించింది. మేము ఇప్పటికే అదే స్థానం నుంచి మా పార్టీ తరఫున అమర్ పాటిల్‌ను బరిలోకి దింపాం. అయితే.. ఇది కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన జాబితాలో టైపింగ్ పొరపాటుగా భావిస్తున్నా. .. మా వైపు నుంచి కూడా అలాంటి పొరపాటు జరగొచ్చు. మా సీటు షేరింగ్ ఫార్ములాలో భాగమైన మిరాజ్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు పోటీ చేసేందుకు ఉత్సాహంగా ఉన్నారని విన్నా. మిత్రపక్షాలకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టడం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపిస్తే.. అది ఎంవీకే సమస్యలను సృష్టించినట్లు అవుతుంది’ అని అన్నారు.ముంబైలో ఎక్కువ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడంపై రౌత్ స్పందించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ముంబైలో మరో సీటు అడుగుతోంది. సాధారణంగా ముంబైలో శివసేన(యూబీటీ) ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తోంది’ అని అన్నారు. మరోవైపు.. షోలాపూర్ సౌత్ స్థానంలో పోటీ చేయాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. రాష్ట్ర స్థాయిలో మేము దీనిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేం. ఇక.. రేపటితో నామినేషన్ల దాఖలు అంశం ముగుస్తుంది’’ అని అన్నారు.నవంబర్ 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 200కు పైగా స్థానాలకు అభ్యర్థులను ఎంవీఏ కూటమి ప్రకటించింది. అయితే.. శివసేన (యూబీటీ ), కాంగ్రెస్ పార్టీ మధ్య కొన్ని సీట్ల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతుండటం గమనార్హం.చదవండి: ఎంతకు తెగించింది..! భర్త రూ.8 కోట్లు ఇవ్వలేదని, ప్రియుడితో కలిసి -
‘బాబోయ్ వాంతులు’.. కూటమిలో చిచ్చు పెట్టిన మంత్రి కామెంట్లు!
వీళ్ల పక్కన కూర్చోవాలంటేనే నాకు వాంతి వచ్చినట్లే అనిపిస్తుందంటూ ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్రతికూల ప్రభావం పడుతుందోనని అధికార మహాయుతి కూటమి నేతలకు భయం పట్టకుంది. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు?సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంత్రి తానాజీ సావంత్ ఎన్సీపీ (అజిత్‌పవార్), కాంగ్రెస్ పట్ల తనకున్న అయిష్టత గురించి బహిర్గతం చేశారు. ‘‘నేను హార్డ్‌కోర్ శివసైనికుడిని. నా జీవితంలో కాంగ్రెస్, ఎన్సీపీతో నేను ఎప్పుడూ స్నేహం చేయలేదు. విద్యార్థి దశ నుంచి ఆ రెండు పార్టీలకు నేనెప్పుడూ దూరమే. కానీ రాజకీయ పరిణామాల తర్వాత ఎన్సీపీ నేతలతో కలిసి కేబినెట్ సమావేశంలో కూర్చోక తప్పడం లేదు. కూర్చున్నప్పటికీ బయటకు వచ్చిన తర్వాత నాకు వాంతులు అవుతున్నట్లు అనిపిస్తుంది’’ అని మహరాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తానాజీ సావంత్ వ్యాఖ్యానించారు.STORY | Sit next to NCP ministers at cabinet meetings but it’s nauseating: Shiv Sena’s Tanaji SawantREAD: https://t.co/fMan6gEu4UVIDEO: (Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/YQIlgm72Hf— Press Trust of India (@PTI_News) August 30, 2024 ధర్మాన్ని కాపాడేందుకే మౌనంమరోవైపు తానాజీ సావంత్ కామెంట్స్‌పై ఎన్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అమోల్ మిత్కారీ ఓకింత అనుమానం, ఆగ్రహం వ్యక్తం చేశారు. బలహీనమైన సంకీర్ణాన్ని కొనసాగించడం తమ పార్టీ బాధ్యత మాత్రమేనా? అని ప్రశ్నించారు. సంకీర్ణ ధర్మాన్ని కాపాడుకోవడం కోసమే తాము మౌనంగా ఉన్నామని అన్నారు.బీజేపీకి అజిత్ పవార్ అవసరం తీరినట్లుందితానాజీ సావంత్ వ్యాఖ్యలపై ఎన్సీపీ(అజిత్ పవార్) వర్గం నేతలతో పాటు ఎన్సీపీ (శరద పవార్) వర్గం నేతలు సైతం స్పందిస్తున్నారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ప్రతినిధి క్లైడ్ క్రాస్టో మాట్లాడుతూ..తానాజీ వ్యాఖ్యలు మహాయుతి సంకీర్ణానికి ఇకపై అజిత్ పవార్ ఎన్సీపీ అవసరం లేదని స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లైంది. ఆర్ఎస్ఎస్లో కూడా అజిత్ పవార్‌తో పొత్తుపై ఆందోళనలు తలెత్తాయని, ఇప్పుడు సావంత్ ప్రకటనతో ఆందోళనలు బహిర్గతం అయ్యాయని సూచించారు. బీజేపీ అజిత్ పవార్‌ను మహాయుతి నుండి బయటకు పంపే సమయం ఆసన్నమైంది. పరిస్థితులు బాగలేవని చెప్పారు. ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిఅజిత్ పవార్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోయారని, ఎన్సీపీతో పొత్తుపై ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన నేతల్లో అసంతృప్తి పెరుగుతోందని మరో ఎన్సీపీ (ఎస్పి) ప్రతినిధి మహేష్ తపసే పేర్కొన్నారు. ఒకప్పుడు ఎన్‌సిపిలో అపారమైన గౌరవాన్ని పొందిన అజిత్ పవార్ అధికారం కోసం తన ఆత్మగౌరవాన్ని రాజీ చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదన్నారు. మరి ఈ వరుస పరిణామాలపై మహాయుతి కూటిమి పెద్దలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి మరి.తానాజీ సావంత్ వ్యాఖ్యలతో బీజేపీ, ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)మహారాష్ట్ర అధికార మహాయుతి కూటమి నేతల్లో గుబులు మొదలైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
‘దేవుళ్లకు మించిన వాళ్లమని అనుకోవద్దు’
ముంబై: ఉక్రెయిన్‌లో యుద్దం ఆపగలిగే ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్‌లో హిందువులపై కొనసాగుతున్న దాడులను ఆపాలని శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ఉక్రెయిన్‌లోని యుద్ధాన్ని ఆపగలిగే ప్రధాని మోదీ.. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో జరగుతున్న దాడుల నుంచి కూడా హిందువులను ఖచ్చితంగా రక్షించాలి. బంగ్లాదేశ్‌లో దాడులకు గురవుతున్న హిందువులకు ప్రధాని మోదీ న్యాయం చేయాలి’’ అని అన్నారు. బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న పరిస్థితులు భారత్‌లో కూడా జరుగుతాయా? అని అడిగిన విలేకర్ల ప్రశ్నకు.. ‘‘ఏ దేశంలోనైనా ప్రజలే సుప్రీం. ఏ రాజకీయ నాయకుడైనా ప్రజల సహనాన్ని పరీక్షించకూడదు. అలా చేస్తే ప్రజా కోర్టు ఎలా తీర్పు ఇస్తుందో బంగ్లాదేశ్‌లో కనిపించింది. అన్నింటికంటే ప్రజాకోర్టే సర్వోన్నతమైంది. దేశ రాజధానిలో నిరసన తెలిపేందుకు వచ్చిన రైతులను ఉగ్రవాదులు అన్నారు. బంగ్లాదేశ్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితి అందరికీ ఒక హెచ్చరిక. తాము దేవుళ్లకు మించిన వాళ్లమని ఎవరూ అనుకోకూడదు. మమంతా మనుషులమే’’ అని మోదీపై విమర్శలు గుప్పించారు. -
మహారాష్ట్ర బీజేపీలో నాయకత్వ మార్పు?
ముంబై: మహారాష్ట్ర లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోయింది. సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్న క్రమంలో బీజేపీ మహారాష్ట్రపై ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత మహారాష్ట్ర రాజకీయ పరిస్థితులుపై మంగళవారం భేటీ అయ్యారు. ఈ భేటీలో పాల్గొన్న పీయూష్ గోయల్ కొన్ని రోజులుగా మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘మహారాష్ట్ర బీజేపీ న్యాయకత్వంలో ఎటువంటి మార్పు ఉండదు. బీజేపీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (శివసేన (షిండే వర్గం)-బీజేపీ-ఎన్సీపీ( అజిత్ వర్గం) సంకీర్ణం ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రావటమే లక్ష్యంగా ఆచరించే వ్యూహాలపై కోర్ కమిటీ భేటీలో చర్చించాం’ అని అన్నారు.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి మహారాష్ట్రతో పేలవ ప్రదర్శన ఇచ్చింది. బీజేపీ-9, ఎన్సీపీ (అజిత్ వర్గం)-1, శివసేన (షిండే వర్గం)-7 సీట్లతో మొత్త 17 స్థానాలకే పరిమితమైంది. 2019 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-శివసేన కూటమి మొత్తం 48 స్థానాలకు 41 సీట్లు గెలుచకున్న విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల్లో పేలవ ప్రదర్శనకు బాధ్యత వహిస్తూ దేవేంద్ర ఫడ్నవిస్ తన డిప్యూటీ సీఎం పదివికిఈ రాజీనామా చేయాలని భావించగా.. బీజేపీ అగ్రనేతల సూచన మేరకు వెనక్కి తగ్గారు. అయితే అప్పటి నుంచి బీజేపీ చీఫ్‌ను మార్చనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాన్కులే స్థానంలో రావు సాహెబ్ పాటిల్‌ను మహారాష్ట్ర బీజేపీ కొత్త చీఫ్‌గా ఎంపిక చేయనున్నట్లు వార్తలు కూడా వ్యాప్తిచెందాయి. ‘మహాయుతి కూటమి పార్టీలతో కలిసి.. అసెంబ్లీ ఎన్నికల గెలుపు కోసం బ్లూప్రింట్ తయారు చేయటంపై చర్చించాం’డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నివిస్ భేటీ ముగిసిన తర్వాత మీడియాకు తెలిపారు. దీంతో మహారాష్ట్ర బీజేపీ చీఫ్ మార్పుపై పార్టీనేతల్లో నెలకొన్న ఊహాగానాలకు తెరపడినట్లు అయింది. -
ఉద్ధవ్ థాక్రే నష్టపోయారు: బీజేపీ నేత కీలక కామెంట్స్
ముంబై: మహారాష్ట్ర రాజకీయాలపై బీజేపీ వైఖరి మారుతోందా.. పాత మిత్రుడు ఉద్ధవ్ థాక్రేపై బీజేపీకి సాఫ్ట్ కార్నర్ పెరుగుతోందా.. ఉద్ధవ్‌తో కలిసి వెళితేనే త్వరలో రానున్నమరాఠా అసెంబ్లీ ఎన్నికల్లో సక్సెస్ అవుతామని బీజేపీ పెద్దలు భావిస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేన ఉద్ధవ్ కష్టం వల్లే కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్) పార్టీలకు మహారాష్ట్రలో ఎక్కువ ఎంపీ సీట్లు వచ్చాయని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ మంగళవారం(జూన్11) వ్యాఖ్యానించారు. ఆరోగ్యం బాగోలేకపోయినప్పటికీ ఉద్ధవ్ ఇండియా కూటమి కోసం కష్టపడ్డారని ప్రశంసించారు.గతంలో ఉద్ధవ్ బీజేపీతో ఉన్నప్పుడు 18 ఎంపీ సీట్లు గెలుచుకుని ఇప్పుడు కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగారని గుర్తు చేశారు. కాగా, ప్రస్తతం కేంద్రంలోని మోదీ3.0 ప్రభుత్వంలో చేరాల్సిందిగా బీజేపీ నేతలు ఉద్ధవ్ థాక్రేను కోరుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో చంద్రకాంత్ పాటిల్ వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకుంది. -
అందుకే ఉద్ధవ్‌కు రెబల్‌గా మారా: సీఎం ఏక్నాథ్ షిండే
నాగ్‌పూర్: బాలా సాహేబ్ ఠాక్రే స్థాపించిన శివసేనలో ఏక్నాథ్ షిండే రెబల్ నేతగా మారి.. బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. తాను ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్ నేతగా మారడానికి గల కారణాన్ని సీఎం ఏక్నాథ్ షిండే వివరించారు. ఆదివారం పార్టీ కార్యకర్తల మీటింగ్‌లో సీఎం ఏక్నాథ్ షిండే మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘నాకు ముఖ్యమంత్రి కావాలనే కోరిక లేదు. కానీ, శివసేన పార్టీలో బాలా సాహేబ్ ఠాక్రే సిద్ధాంతాలకు రాజీపడటం వల్లే ఉద్ధవ్ ఠాక్రేకు రెబల్‌గా మారాను. బాల సాహేబ్ ఠాక్రే పార్టీ కార్యకర్తలను ఎప్పుడూ స్నేహితుల్లా భావించేవారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే మాత్రం పార్టీ కార్యకర్తలను పని మనుషులుగా చూశారు’ అని సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. బలమైన నేతగా ఎదగాలంటే క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో కలిసి పని చేయాలన్నారు. ఇంట్లో కూర్చుంటే గొప్ప నేతగా ఎదగలేమని ఉద్ధవ్ ఠాక్రేను ఉద్దేశించి ఎద్దేవా చేశారు. మోదీ మూడోసారి ప్రధాని అయ్యేందుకు అధికారంలో ఉన్న పార్టీకే ఓటు వేయాలని ప్రజలను కోరారు. అదేవిధంగా ప్రతిపక్ష మహావికాస్ ఆఘాఢీకి అభివృద్ది చేయాలనే అజెండా లేదని అన్నారు. అధికార కూటమిలోని ఇరు పార్టీల మధ్య సీట్ల పంపకం రెండు, మూడు రోజుల్లో కొలిక్కి వస్తుందన్నారు. అలాగే విదర్భలోని అన్ని సీట్లను అధికార కూటమి కైవసం చేసుకుంటుందని సీఎం షిండే తెలిపారు. ఇక.. 2022 జూన్‌లో పలువురు రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి ఏక్నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చి బీజేపీ మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. అసలు శివసేన పార్టీ ఎవరిదని శివసేన చీలిక వర్గాలు పిటిషన్లు వేయగా.. షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
అలాంటి వాళ్లతో సావాసమా?, ఆదిత్య ఠాక్రేపై విమర్శలు
ముంబై : ముంబై బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే శివసేన నేత, మాజీ కేబినేట్ మంత్రి ఆదిత్య థాకరేపై విమర్శలు చేశారు. ఓ మహిళను వేధించి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను ఎలా కలిశారని ప్రశ్నించారు. అలాంటి వ్యక్తికి ఆదిత్య ఠాక్రే రక్షణ కల్పిస్తున్నారని రాణే ఆరోపించారు. రాణే మాట్లాడుతూ, ‘వార్డ్ నంబర్ 106లో యూబీటీ శివసేన నేత అమోల్ సంసారే అనే వ్యక్తి ఆస్తి కోసం మహిళలను వేధించినందుకు ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం బైయిల్‌పై ఉన్న ఆయన ఆదిత్య ఠాక్రేని కలిశారని అన్నారు. దీని బట్టి మహిళని హింసించిన అమోల్ సన్సారేకు ఆదిత్య ఠాక్రే మద్దతు పలుకుతున్నట్లే కాదా అని రాణే ప్రశ్నించారు. కాగా, నితీష్ రాణే యూబీటీ నాయకులపై విమర్శలు చేయడం ఇదేమి తొలిసారి కాదు. గతంలో ఆదిత్య ఠాక్రే, సంజయ్ రౌత్‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడారు. ఉద్దవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రేల పేర్లను ప్రస్తావించకుండానే కోవిడ్-19 కాలంలో జరిగిన అన్నీ కుంభకోణాల వెనుక ఉన్నవారు త్వరలో కటకటాల వెనుకకు వస్తారు అని వ్యాఖ్యానించారు. అందుకు యూబీటీ నేత సంజయ్ రౌత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. వచ్చే రెండు నెలల్లో మా ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి ఈడీ, సీబీఐ మూసివేసిన కేసుల్ని తిరిగి విచారణ జరిపిస్తాం. కాబట్టి అనవసర రాద్ధాంతం చేసే వారు ఆత్మపరిశీలన చేసుకోవాలని హెచ్చరించారు. #WATCH | Nitesh Rane Alleges Aaditya Thackeray Planning To Meet #ShivSenaUBT Worker Accused Of Harassing Woman#Mumbai #Maharashtra #BJP pic.twitter.com/AJc49QfmuA — Free Press Journal (@fpjindia) April 7, 2024 -
మహారాష్ట్రలో బీజేపీ ఎమ్మెల్యే బుల్లెట్ల వర్షం
థానె/ముంబై: మహారాష్ట్రలోని ఓ పోలీస్‌స్టేషన్ బీజేపీ ఎమ్మెల్యే కాల్పుల ఉదంతానికి కేంద్ర బిందువైంది. సీనియర్ ఇన్స్పెక్టర్ ఛాంబర్‌లోనే శివసేన నేత మహేశ్ గైక్వాడ్‌పై బీజేపీ ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కాల్పుల వర్షం కురిపించారు. బుల్లెట్ల గాయాలతో రక్తమోడుతున్న మహేశ్‌కు ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు ప్రకటించారు. పదేళ్ల క్రితం ఎమ్మెల్యే కొనుగోలు చేసిన భూమిని శివసేన నేత మహేశ్ కబ్జా చేశాడని ఆరోపణలున్నాయి. దీనిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన తన కుమారుడితో మహేశ్ మనుషులు దారుణంగా ప్రవర్తించారని ఎమ్మెల్యే ఆరోపించారు. శుక్రవారం అర్ధరాత్రి థానె జిల్లా ఉల్హాస్నగర్ హిల్‌లైన్ పోలీస్‌స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ‘‘తమ భూమి కబ్జాకు గురైందని ఫిర్యాదుచేసేందుకు ఎమ్మెల్యే కుమారుడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. అదే సమయానికి మహేశ్ తన మనుషులతో వచ్చారు. గణ్‌పత్ రాకతో గొడవ పెద్దదై కాల్పులకు దారి తీసింది’’అని అదనపు పోలీస్ కమిషనర్ షిండే వెల్లడించారు. కాల్పుల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అస్సలు బాధ లేదు: ఎమ్మెల్యే కాల్పులు జరిపినందుకు అస్సలు బాధ పడటం లేదని ఎమ్మెల్యే చెప్పారు. పోలీస్‌స్టేషన్‌లోనే నా ముందే నా కొడుకును అన్యాయంగా చితకబాదుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఐదు రౌండ్లు కాల్చా. శివసేనను చీల్చి బీజేపీతో అంటకాగుతున్న ఏక్నాథ్ షిండే మహారాష్ట్రలో నేర సామ్రాజ్యం సృష్టించారు’’ అని అరెస్ట్‌కు ముందు చెప్పారు. రాహుల్ పాటిల్ అనే వ్యక్తికీ బుల్లెట్లు తగిలాయి. కాల్పుల ఘటనలో ఎమ్మెల్యేతోపాటు మరో ఇద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తునకు ఆదేశించిన ఫడ్నవిస్ మొత్తం వివాదంపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శనివారం చెప్పారు. ఆయనది తప్పుందని తేలితే చర్యలు తీసుకుంటామని బీజేపీ పేర్కొంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదని ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అన్నారు. అధికార పార్టీల నేతల ఆగడాలతో రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని రుజువైందని కాంగ్రెస్ పేర్కొంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మహేశ్‌ను ముఖ్యమంత్రి ఏక్నాథ్ కలిసి పరామర్శించారు. -
Shivsena Row: స్పీకర్ నిర్ణయంపై సుప్రీంకోర్టుకు ఉద్ధవ్ థాక్రే
ముంబై: ఉద్ధవ్ థాక్రే శివసేన, షిండే శివసేన మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనే అసలైన శివసేన పార్టీ అని ఇటీవలే ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నర్వేకార్ ఇటీవల రూలింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ ఇచ్చిన రూలింగ్‌పై తాజాగా ఉద్ధవ్ థాక్రే సుప్రీంకోర్టుకు వెళ్లారు. దీంతో పాటు పార్టీ వీడి షిండేతో పాటు వేరు కుంపట్టి పెట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోవడాన్ని కూడా ఉద్ధవ్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. కాగా, జూన్ 2022లో పార్టీ రెండుగా చీలిపోయిన తర్వాత రెండు శివసేన వర్గాలు ఒకరిపై ఒకరు స్పీకర్‌కు అనర్హత పిటిషన్లు ఇచ్చారు. షిండేతో పాటు వెళ్లిన మొత్తం 40 మంది ఎమ్మెల్యేలపైనా ఉద్ధవ్ వర్గం అనర్హత పిటిషన్లు వేయగా ఉద్ధవ్ వర్గంలోని 14 మంది ఎమ్మెల్యేలపై షిండే వర్గం అనర్హత పిటిషన్లు ఇచ్చింది. షిండే నేతృత్వంలోని పార్టీయే అసలైన శివసేన అని గుర్తిస్తూ ధనుస్సు బాణం గుర్తును ఎన్నికల కమిషన్ గతేడాది వారికే కేటాయించడం గమనార్హం. ఇదీచదవండి.. విమాన ప్రయాణికులు మాతో సహకరించాలి : సింధియా -
పంజరంలో చిలుకలా ఈసీ: రౌత్
ముంబై: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘం కూడా పంజరంలో చిలుకలా మారిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనం కలి్పస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా పదేపదే చెబుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు. అదే హామీ విపక్షాలు ఇస్తే వెంటనే షోకాజ్ నోటీసులిచ్చేది’’ అంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన వ్యాసంలో రౌత్ విమర్శించారు. మోదీ హయాంలో భారత క్రికెట్ పూర్తిగా ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలిపోయిందని ఆరోపించారు. ‘‘గతంలో దేశ క్రికెట్‌కు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇప్పుడంతా అహ్మదాబాద్‌మయం! ప్రపంచ కప్ ఫైనల్ కూడా అక్కడే జరుగుతోంది! స్వీయ రాజకీయ లబ్ధి కోసం చివరికి క్రికెట్‌ను కూడా కూడా మోదీ సర్కారు పొలిటికల్ ఈవెంట్‌గా మార్చేసింది’’ అని ఎద్దేవా చేశారు. -
సీఎం ‘కుర్చీ’లో అజిత్ పవార్..
ముంబై: గురువారం ముంబైలో జరిగిన ఓ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన అజిత్ పవార్ సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన సీటులో కూర్చోవడంతో ఆయన నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ సోషల్ మీడియాలో పుకార్లు చెలరేగాయి. ఈ వీడియో వైరల్ కావడంతో అజిత్ మనసులోని మాటను ఈ విధంగానైనా బయట పెట్టారంటున్నారు నెటిజనులు. మహారాష్ట్రలో ఎన్సీపీ తిరుగుబాటు చేసిన నాటినుండి మహారాష్ట్ర రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతి సీను క్లైమాక్సును తలపిస్తూ సాగుతున్న అక్కడి రాజకీయాల్లో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న కుతూహలంతో ఎదురు చూస్తున్నారు రాజకీయ ఔత్సాహికులు. ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ పార్టీలో అధమస్థాయి ప్రాధాన్యతను తట్టుకోలేక తిరుగుబాటు పర్వానికి శ్రీకారం చుట్టి బీజేపీ- శివసేన సర్కారుకు జైకొట్టి అజిత్ పవార్ ఎలాగోలా డిప్యూటీ సీఎం కుర్చీ వరకు చేరుకోగలిగారు. తర్వాతి మెట్టు కోసం అజిత్ పవార్లో కోరిక లేకపోయినప్పటికీ ఆయన చేతల్లో మాత్రం ఆ కుతూహలం బయటపడుతుంటే రాజకీయ వర్గాల్లో కొత్త అనుమానాలు మొదలవుతున్నాయి. ప్రస్తుతం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో అజిత్ పవార్ అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అసలు ఆయన మనసులో ఏముందో గానీ ఆయన ఏమి చేసినా కూడా అది అధికారం కోసమే అన్నట్టుగా బయటకు కనిపిస్తూ ఉండడడం విశేషం. తాజాగా ఎమ్మెల్యే నివాసాల పునర్నిర్మాణ కార్యక్రమానికి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన ఆయన నేరుగా వెళ్లి సీఎం ఏక్నాథ్ షిండే కోసం కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు. అజిత్ రాకను గమనించి స్పీకర్ నర్వేకర్ కుర్చీకి అంటించి ఉన్న సీఎం పేరున్న స్టిక్కరును తొలగించారు. మొదట అజిత్ వేరే కుర్చీలో కూర్చున్నప్పటికీ సీఎం ఆ కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో ఖాళీగా ఉన్న ఆ కుర్చీలో కూర్చోమని పక్కనున్నవారు అజిత్ ను ఆహ్వానించారు. ఇదే వేదికపై ఉన్న మరో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ సమక్షంలోనే ఈ సన్నివేశం జరగడం విశేషం. ఈ వీడియో దృశ్యాలు ఇంటర్నెట్లో మహాజోరుగా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో నెటిజన్లు ఎన్సీపీ వర్గాలు అజిత్ పవార్ నెక్స్ట్ టార్గెట్ అదేనంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇది కూడా చదవండి: అమిత్ షా వ్యాఖ్యలను సమర్ధించిన మమతా -
‘ఇదే అసలైన పార్టీ.. ఈయనే అసలైన నాయకుడు’
ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు మరో ఎదురుదెబ్బ తగిలింది. శివసేన(UBT) ఎమ్మెల్సీ మనీషా కయాండే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీలో చేరారు. రెండ్రోజుల క్రితమే శిశిర్ షిండే ఉద్ధవ్ థాక్రే పార్టీని విడిచి వెళ్లిన సంగతి తెలిసిందే. అంతలోనే మనీషా కయాండే పార్టీని వీడటంతో శివసేన(UBT) ఆత్మరక్షణలో పడింది. శివసేన ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఈ నిర్ణయం తీసుకున్న ఎమ్మెల్సీ మనీషా ఉద్ధవ్ థాక్రేపైనా ఆ పార్టీ నేతలు సంజయ్ రౌత్, సుష్మా అంధారేలపైనా విమర్శలు గుప్పించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ఏక్ నాథ్ షిండే నాయకత్వంలోని శివసేన పార్టీనే అసలైనదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అత్యంత సమర్ధవంతంగా పనిచేస్తోందని అభినందించారు. గత ఏడాది కాలంగా నాయకులంతా ఒక్కొక్కరుగా ఉద్ధవ్ పార్టీని విడిచిపోతుంటే వారంతా ఎందుకు వెళ్లిపోతున్నారన్న ఆత్మపరిశీలన చేసుకుంటారని ఎదురు చూశానన్నారు. వారలా చేయకపోగా కాంగ్రెస్-ఎన్సీపీ ఎజెండాను ప్రచారం చేసే పనిలో ఉన్నారు. సంజయ్ రౌత్, సుష్మాపై అంధారేలైతే హిందూ దేవతలను కించపరుస్తూ కాంగ్రెస్-ఎన్సీపీ గొంతును వినిపిస్తున్నారు. ఇక ఉద్ధవ్ థాక్రే పార్టీ తాను పార్టీ వ్యతిరేక కార్కకలాపాలకు పాల్పడుతున్నానని చెప్పడం విడ్డూరంగా ఉందని, తానెన్నడూ అలా ప్రవర్తించలేదని, వారే మహిళల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీని వీడిపోతున్న సందర్బంగా చెత్త నుంచే విద్యుత్తు పుడుతుందన్న విషయాన్ని ఉద్ధవ్ థాక్రే మరచిపోకూడదని ఆమె గుర్తు చేశారు. ఇదిలా ఉండగా ఆమె బీజేపీ పార్టీతో తెగదెంపులు చేసుకుని మనీషా కయాండే మా పార్టీలోకి వచ్చారు. ఒక ఏడాదిలో ఆమె ఎమ్మెల్సీ పదవీకాలం ముగుస్తుంది. తిరిగి నామినేట్ అయ్యే అవకాశం లేకే రంగు మార్చారని అన్నారు శివసేన(UBT) నేత వినాయక్ రౌత్. ఇది కూడా చదవండి: కుష్బూపై వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత సస్పెండ్ -
ఔరంగజేబు వారసులెవరూ లేరిక్కడ!
మహారాష్ట్ర: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్.. వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగజేబు సమాధిని సందర్శించడాన్ని తప్పుబట్టారు. దీన్ని సమర్ధించినందుకు శివసేన(UBT) అధ్యక్షుడు ఉద్దవ్ థాక్రేపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. తాజాగా వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీ అధ్యక్షులు ప్రకాశ్ అంబేద్కర్ ఔరంగాబాద్‌లోని ఔరంగజేబు సమాధిని సందర్శించిన సందర్బంగా ఔరంగజేబు చాలా కాలం దేశాన్ని పరిపాలించారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ స్పందిస్తూ.. హిట్లర్ కూడా జర్మనీ దేశాన్ని చాలాకాలం పాలించాడు. అంతమాత్రాన అక్కడివారికి హిట్లర్ దేవుడు అవుతాడా? ఈ సందర్బంగా అంబేద్కర్ చర్యను మీరెలా సమర్ధిస్తారని ఉద్ధవ్ థాక్రేను ప్రశ్నించారు. మీరిద్దరూ పొత్తు పెట్టుకున్న కారణంగానే అసలేం మాట్లాడటం లేదా? అనడిగారు. అసలు పరాయి దేశం నుంచి వచ్చిన ఔరంగజేబు మన నాయకుడెలా అవుతాడు? ఛత్రపతి శివాజీ ఒక్కడే మన నాయకుడని ఆయన అన్నారు. మన దేశంలో ఉన్న ముస్లింలు ఔరంగజేబు వారసులు కారని.. వారసలు ఆ మొఘల్ చక్రవర్తిని తమ నాయకుడిగా అంగీకరించరని అన్నారు. వారు సైతం ఛత్రపతి శివాజీనే తమ నాయకుడిగా చెప్పుకుంటారన్నారు. ఒకప్పుడు బాల్ థాక్రే కాంగ్రెస్-ఎన్సీపీ పార్టీలతో చెట్లు కలపాల్సిన పరిస్థితి వస్తే తాను పార్టీని శాశ్వతంగా మూసివేస్తానన్న మాటను గుర్తుచేసి మీ తీరు మాత్రం భిన్నంగానూ మీ నాన్న గారికి వ్యతిరేకంగానూ ఉందన్నారు. ఇక బీహార్‌లో ఈ నెలలో జరగనున్న విపక్ష ఐక్య కూటమి సమావేశం గురించి ప్రస్తావించగా పనికిరాని వంద పాదులు ఏకమైనా ఒక మర్రిచెట్టుకు సమానం కావన్నారు. గతంలో మోదీ వ్యతిరేకంగా ఇంతకంటే పెద్ద కూటమే వచ్చింది. అప్పుడే ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు మాత్రం ఏం చేస్తారని వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: నా లివర్ ఇనుముతో తయారుకాలేదు.. -
20 రోజుల్లో షిండే సర్కార్ పతనం: సంజయ్
జల్గావ్: మహారాష్ట్రలోని ఏక్నాథ్ షిండే ప్రభుత్వానికి మరణశాసనం సిద్ధమైందని శివసేన్(ఉద్ధవ్ వర్గం)నేత సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. మరో 15–20 రోజుల్లో ఈ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని, మరణశాసనంపై సంతకం చేసేదెవరో ఇప్పుడు తేలాల్సి ఉందని రౌత్ జోస్యం చెప్పారు. ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంపై తిరుగుబాటు చేసి షిండే వర్గంలో చేరిన 16 మంది ఎమ్మెల్యేల అనర్హత సహా పలు పిటిషన్లు కోర్టులో పెండింగ్‌లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ..తీర్పు కోసం తమ పార్టీ ఎదురు చూస్తోందని, న్యాయం జరుగుతుందన్న నమ్మకం తమకుందని చెప్పారు. ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని గత ఏడాది జూన్‌లో షిండే, 39 మంది ఎమ్మెల్యేలు కూల్చి, బీజేపీ సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. -
‘ప్రజలను చంపుకొని తినే క్రూరమైన ప్రభుత్వమిది’.. సంజయ్ రౌత్‌పై కేసు
సాక్షి, ముబై: ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి చెందిన ఎంపీ సంజయ్ రౌత్‌పై శుక్రవారం మెరైన్‌లైన్స్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. శిందే వర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యేలు సంజయ్ శిర్సాట్, భరత్ గోగవావలే కిరణ్ పావస్కర్ మెరైన్ లైన్స్ పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ నీలేశ్ బాగుల్‌కు ఫిర్యాదు చేశారు. రౌత్ చేసిన ఆరోపణలు సమాజంలో విభేదాలు సృష్టించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదుదారులు ఆరోపించారు. న్యూ ముంబై ఖార్ఘర్లో గత ఆదివారం జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వడదెబ్బ తగలి చనిపోయిన వారు 14 మంది కాదని దాదాపు 50-75 మంది ఉన్నారని గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రౌత్ ఆరోపించారు. అంతేగాకుండా మృతుల సంఖ్యను తక్కువ చూపించేందుకు మృతుల కుటుంబ సభ్యులు, బందువుల ఇళ్లకు వెళ్లి లక్షల్లో డబ్బులు ఎరచూసాన విమర్శించారు. శిందే నోటికి తాళం పడిందా? అసలు మృతుల సంఖ్య ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నించారు. మననుషల ప్రాణాలకు విలువలేదు. డబ్బుతో వెల కడుతున్నారని దుయ్యబట్టారు. నిర్వాహకుల నిర్లక్ష్యంవల్లే ఇంతమంది చనిపోయారని, మృతులకు కారకులైన శిందే, ఫడ్నవీస్ పదవుల్లో కొనసాగే అధికారం లేదని, కింటనే రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. ప్రజలను చంపుకు తినే క్రూరమైన ప్రభుత్వమిదని మండిపడ్డారు. మొత్తం 14 మంది మృతుల్లో 12 మంది ఏడు గంటలకుపైగా ఎండతో ఉపవాసంతో ఉండటంవల్ల మృతి చెందినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొంది. దీంతో రౌత్ చేసిన ఆరోపణలకు మరింత బలం చేకూర్చినట్లైంది. కాగా, శిందే, ఫడ్నవీస్‌లపై మనుష్యవథ కేసు నమోదు చేయాలని సంఘటన జరిగిన తరువాత అదే రోజు అజిత్‌పవార్, సంజయ్ రౌత్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. కానీ గురువారం విలేకరుల ఎదుట సంజయ్ చేసిన విమర్శలు సమాజంలో విభేదాలు సృష్టించేలు ఉన్నాయంటూ కేసు నమోదు చేశారు. -
ఈసీ, మోదీపై ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు..
ముంబై: మహారాష్ట్రలో మరోసారి రాజకీయం హీటెక్కింది. శివసేన అధికారిక విల్లు బాణం గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం.. షిండే వర్గానికే ఇవ్వడంతో మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎన్నికల సంఘం, ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ‘విల్లుబాణం’ను చోరీచేశారంటూ మహా సీఎం షిండేను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. వివరాల ప్రకారం.. ఉద్ధవ్ థాక్రే నివాసం మాతోశ్రీ వద్ద మద్దతుదారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉద్ధవ్ థాక్రే మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోంది. కొందరి పక్షాన మద్దతుగా నిలుస్తోంది. ఎన్నికల సంఘం ఇంతకు ముందు ఎప్పుడూ చేయని విధంగా పనిచేస్తోంది. అయినా మనం చింతిచాల్సిన అవసరం లేదు. ఓపిక పట్టండి రానున్న రోజులున్నీ మనవే. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండండి అని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో షిండే వర్గంపై నిప్పులు చెరిగారు. శివసేన గుర్తు విల్లు-బాణం’ను చోరీ చేశారు. ఈ క్రమంలో నిందితుడికి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. మేము దీన్ని మండే కాగడాతో ఎదుర్కొంటాము అని కామెంట్స్ చేశారు. ఇక, ఉద్దవ్ థాక్రే ప్రసంగిస్తున్న సందర్బంగా మద్దతుదారులు మాతోశ్రీ వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మిగూడారు. ఏక్నాథ్ షిండే వర్గానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గానికి కాగడా ఎన్నికల గుర్తుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది అక్టోబర్‌లో మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ఎన్నికల సంఘం.. ఈ గుర్తును కేటాయించింది. కాగా, పుణే జిల్లాలోని కస్బాపేట్, చించ్వాడ్ ఉప ఎన్నికల వరకు ఉద్ధవ్ వర్గానికి ఈ కాగడా గుర్తు ఉంటుందని ఈసీ పేర్కొంది. ఈ స్థానాలకు ఫిబ్రవరి 26వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. మరోవైపు.. విల్లుబాణం గుర్తును తమకు కేటాయించడంపై సీఎం షిండే స్పందించారు. ఇది.. ప్రజాస్వామ్య విజయం అంటూ కామెంట్స్ చేశారు. ఉద్ధవ్ థాక్రే ఇప్పటికైనా ఆత్మపరిశీలన చేసుకోవాలని వ్యాఖ్యలు చేశారు. -
శివసేన సంజయ్ రౌత్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్‌కు బెయిట్ మంజూరైంది. పీఎంఎల్ఏ కోర్టు సంజయ్ రౌత్‌కు బెయిల్ ఇచ్చింది. కాగా, సంజయ్ రౌత్.. భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంజయ్ రౌత్ 100 రోజుల పాటు జైలు జీవితం గడిపారు. జూలై 31వ తేదీన సంజయ్ రౌత్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. -
శివసేన నేత దారుణ హత్య.. పట్టపగలే తుపాకులతో రెచ్చిపోయారు..
Sudhir Suri.. శివసేన నేత సుధీర్ సూరి దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో గుర్తుతెలియని వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన రాష్ట్రంలో కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. పంజాబ్‌కు చెందిన శివసేన నేత సుధీర్ సూరి.. శుక్రవారం ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా, ఇటీవల ఓ ఆలయ ప్రాంగణం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విరిగిన విగ్రహాలు కనిపించడంతో శివసేన నాయకులు ఆలయ అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా శివసేన నాయకులకు మద్దతిస్తూ సుధీర్ నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుంపులో నుంచి బయటకు వచ్చిన కొందరు వ్యక్తులు సుధీర్‌పై కాల్పులు జరిపారు. దీంతో, సుధీర్ అక్కడికక్కడే మృతి చెందగా.. కాల్పులు జరిపిన వ్యక్తిని శివసేన నాయకులు పట్టుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు.. వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, కొద్దిరోజుల క్రితం సుధీర్ సూరి ఓ వర్గానికి వ్యతిరేకంగా అభ్యంతరకరమైన పదజాలంతో దూషిస్తూ.. మతపరంగా మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో సుధీర్ సూరి.. హిట్ లిస్టులో ఉన్నట్టు పోలీసులు గుర్తించి భద్రత కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. కాగా, తాజాగా ఆయనపై కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఇక, సుధీర్ హత్యపై బీజేపీ నేత తజీందర్ సింగ్ బగ్గా స్పందించారు. ట్విట్టర్ వేదికగా తజీందర్ బగ్గా.. ‘పంజాబ్‌లో శాంతి భ్రదతలు పూర్తిగా విఫలమయ్యాయి. అమృత్‌సర్‌లో కాల్పులు జరిగిన ఘటనలో శివసేన నాయకుడు సుధీర్ సూరి తీవ్రంగా గాయపడ్డారు’ అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. Right under the nose of several police officers in Amritsar, Hindu activist Sudhir Suri shot dead at point blank range. He was reportedly on the hitlist of pro-Khalistani elements. Meanwhile Punjab CM Bhagwant Mann is busy with AAP's election campaign in Gujarat. What a shame!! pic.twitter.com/rcx2HaScXb — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) November 4, 2022 -
షిండే ప్రభుత్వం చిన్న అడ్డంకి మాత్రమే.. అధిగమిస్తాం: ఉద్ధవ్ థాక్రే
ముంబై: మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారి ‘మహా వికాస్ అఘాడీ’(ఎంవీఏ) కూటమి భాగస్వామ్య పక్షాలైన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు సమావేశమయ్యాయి. రానున్న అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఉమ్మడిగానే పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాంతాలను బట్టి ఉమ్మడిగానా లేదా స్వతంత్రంగానా? అనేది నిర్ణయం తీసుకోనున్నారని ఆయా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశానికి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ..‘మూడు పార్టీలు కలిసికట్టుగా కోవిడ్-19 మహమ్మారిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. దాంతో పోలిస్తే ఈ ఆటంకం(షిండే-ఫడ్నవీస్ ప్రభుత్వం) చాలా చిన్నది. దానిని మేము అధిగమించి కలిసే ఉన్నామని దేశానికి సందేశం ఇస్తాం. గతంలో కంటే ఇప్పుడే ఎంవీఏ బలంగా ఉంది. చాలా రోజుల తర్వాత మేము కలిశాం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనివ్వండి.’ అని పేర్కొన్నారు ఉద్ధవ్ థాక్రే. అందుకే అక్కడ భేటీ.. ఎంవీఏ భాగస్వామ్య పక్షాలు కలిసే ఉన్నాయని, ఈ సమావేశం ద్వారా ఆ సందేశాన్ని అందిస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు నానా పటోలే తెలిపారు. ఈ సమావేశం రాష్ట్ర శాసనసభలోని శివసేన శాసనసభాపాక్ష పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహా వికాస్ అఘాడీతోనే శివసేన ఉందనటమే కాదు.. థాక్రే వర్గమే అధికారిక శివసేన అనే సందేశాన్ని షిండే ప్రభుత్వానికి పంపించేందుకు ఇక్కడ భేటీ అయినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. థాక్రేతో పాటు ఎన్సీపీ నుంచి అజిత్ పవార్, జయంత్ పాటిల్, దిలిప్ వాల్సే పాటిల్, కాంగ్రెస్ నుంచి బాలాసాహేబ్ థోరట్, పృథ్విరాజ్ చావన్, అశోక్ చావన్, సమాజ్ వాదీ పార్టీ నుంచి రైస్ షేక్ వంటి సీనియర్ నేతలు హాజరయ్యారు. ఇదీ చదవండి: శివసేన గుర్తు ఎవరికి? 8 ప్రశ్నలు రూపొందించిన సుప్రీంకోర్టు -
శివసేన ఎంపీ సంజయ్ రౌత్ నివాసంలో ఈడీ సోదాలు
-
'విప్ ధికరణ'పై షిండే, థాక్రే వర్గాల ఢీ.. ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు
ముంబై: మహారాష్ట్రలో శివసేనపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే.. బీజేపీతో చేతులు కలిపి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. అయినా.. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ వేడి ఇంకా తగ్గటం లేదు. రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. తాజాగా.. విప్ ధిక్కరణపై 55 మంది శివసేన ఎమ్మెల్యేల్లో 53 మందికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు శాసనసభ సెక్రెటరీ. అందులో షిండే వర్గం ఎమ్మెల్యేలు 39 మంది ఉండగా.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఉద్ధవ్ వర్గంలోని ఎమ్మెల్యే సంతోష్ బంగర్.. జులై 4న బలపరీక్ష రోజే షిండేతో చేతులు కలిపారు. తమకు షోకాజ్ నోటీసులు అందినట్లు ఇరువర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ధ్రువీకరించారు. మహారాష్ట్ర శాసనసభ సభ్యుల (ఫిరాయింపుల ఆధారంగా అనర్హత) నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేశారు సెక్రెటరీ. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేశారు. స్పీకర్ ఎన్నిక, విశ్వాస పరీక్ష సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించారని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నాయి. విప్ ధిక్కరించిన వారిని అనర్హులుగా వేటు వేయాలని డిమాండ్ చేశాయి. అయితే.. అనర్హత వేటు వేయాలన్న ఎమ్మెల్యేల జాబితాలో ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే పేరును షిండే వర్గం మినహాయింటం గమనార్హం. 288 స్థానాలు కలిగిన అసెంబ్లీలో శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే.. అందులోంచి షిండే వర్గం తిరుగుబాటు చేసి బీజేపీతో చేతులు కలిపింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. బలపరీక్షలో 164 మంది మద్దతు తెలిపారు. కొత్త ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. జులై నాలుగున జరిగిన విశ్వాస పరీక్ష అనంతరం.. ఉద్ధవ్ థాక్రే వర్గానికి చెందిన 14 మంది ఎమ్మెల్యేలకు విప్ ధిక్కరించారంటూ నోటీసులు ఇచ్చింది షిండే వర్గం. ఇదీ చదవండి: ఉద్ధవ్‌కు దెబ్బ మీద దెబ్బ .. ప్రశ్నార్థకంగా మారిన శివసేన పార్టీ మనుగడ -
‘మహా’ సీఎం షిండే .. డిప్యూటీగా ఫడ్నవీస్
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ పరిణామాలు ఒక్కరోజులోనే వేగంగా మారిపోయాయి. అనూహ్యమైన మలుపులు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) ప్రభుత్వం కూలిపోయిన 24 గంటల్లోనే.. రాజకీయ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. మహారాష్ట్ర నూతన (20వ) ముఖ్యమంత్రిగా శివసేన రెబల్ నాయకుడు ఏక్నాథ్ షిండే(58), ఉప ముఖ్యమంత్రిగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(51) గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. రాత్రి 7.30 గంటల తర్వాత రాజ్‌భవన్‌లో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ వారిద్దరితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఏక్నాథ్ షిండే తొలుత దివంగత శివసేన అగ్రనేతలు బాల్ ఠాక్రే, ఆందన్ డిఘేకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర అభివృద్ధికే అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని, రాష్ట్రంలో అన్ని వర్గాలను తనతోపాటు కలుపుకొని ముందుకెళ్తానని షిండే మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దేవేంద్ర ఫడ్నవీస్ తన పట్ల ఉంచిన నమ్మకాన్ని వమ్ము కానివ్వబోనని అన్నారు. మహారాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నానని పేర్కొన్నారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. సీఎంగా తన నియామకం బాల్ ఠాక్రే సిద్ధాంతానికి, తన గురువు ‘ధర్మవీర్’ఆనంద్ డిఘే బోధనలకు లభించిన విజయమని వెల్లడించారు. ఫడ్నవీస్‌ను ఒప్పించిన బీజేపీ పెద్దలు మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో తాను భాగస్వామిగా ఉండడం లేదంటూ దేవేంద్ర ఫడ్నవీస్ మొదట ప్రకటించారు. అయినప్పటికీ ప్రభుత్వ పరిపాలన సాఫీగా సాగడానికి తన వంతు సాయం అందిస్తానన్నారు. కొద్దిసేపటి తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా స్పందిస్తూ.. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని నూతన మంత్రివర్గంలో ఫడ్నవీస్ ఒక సభ్యుడిగా కొనసాగుతారని తేల్చిచెప్పారు. బీజేపీ పెద్దల ఆదేశాలతో మంత్రివర్గంలో చేరడానికి, ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఫడ్నవీస్ అంగీకరించినట్లు సమాచారం. తదుపరి ముఖ్యమంత్రిగా షిండే పేరును ఫడ్నవీస్ స్వయంగా ప్రకటించడం గమనార్హం. అంతకముందు గురువారం మధ్యాహ్నం ఏక్నాథ్ షిండే గోవా నుంచి చార్టర్డ్ విమానంలో ముంబైకి చేరుకున్నారు. ఫడ్నవీస్‌ను ఆయన నివాసంలో కలిసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించారు. ఈ సందర్భంగా ఫడ్నవీస్ నివాసం వద్ద ఆందోళనకు దిగిన కొందరు శివసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఇరువురు నేతలు కొందరు బీజేపీ నాయకులతో కలిసి రాజ్‌భవన్‌కు బయలుదేరారు. గవర్నర్ కోషియారీతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కొందరు శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు, బీజేపీ ఎమ్మెల్యేలకు, స్వతంత్ర ఎమ్మెల్యేలకు చోటు కల్పించనున్నట్లు ఫడ్నవీస్ వెల్లడించారు. రెబల్ ఎమ్మెల్యేలు ఒక శివసేన కార్యకర్తను ముఖ్యమంత్రిగా చేయగలరా? అంటూ తాజా మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే విసిరిన సవాలుగా జవాబుగా ముఖ్యమంత్రి పదవిని బీజేపీ వదులుకున్నట్లు తెలుస్తోంది. ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన తిరుగుబాటు వర్గం మద్దతుతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారన్న ఊహాగానాలు సైతం వినిపించాయి. ఎన్నికలు రద్దుడాన్ని వ్యతిరేకిస్తున్నాం ఇది అధికారం కోసం జరిగిన పోరాటం కాదని ఫడ్నవీస్ అన్నారు. రాష్ట్రంపై ఎన్నికలను రుద్దడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. 2019 నాటి ప్రజాతీర్పును ఉద్ధవ్ ఠాక్రే–కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి అపహాస్యం చేసిందని విమర్శించారు. బాలాసాహెబ్ బాల్ ఠాక్రే జీవితాంతం వ్యతిరేకించిన పార్టీలతో ఉద్ధవ్ నిస్సిగ్గుగా చేతులు కలిపారని మండిపడ్డారు. మహా వికాస్ అఘాడీ(ఏంవీఏ) సర్కారు అవినీతిలో కూరుకుపోయిందన్నారు. షిండే వర్గానికి బీజేపీ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే తిరుగుబాటు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం వెనుక వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ప్రయోజనాలు లేవని ఏక్నాథ్ షిండ్ చెప్పారు. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసమే 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో తిరుగుబాటు బావుటా ఎగురవేశానని అన్నారు. ఏంవీఏ ప్రభుత్వంలో మంత్రులపై పరిమితులు విధించారని గుర్తుచేశారు. తన ఏకైక అజెండా అభివృద్ధి మాత్రమేనని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రిగా తనకు అవకాశం కల్పించినందుకు గాను ఫడ్నవీస్‌పై షిండే ప్రశంసల వర్షం కురిపించారు. ఒక శివ సైనికుడిని సీఎంను చేస్తుండడం వెనుక ఫడ్నవీస్ పెద్ద మనసు ఉందన్నారు. తిరుగుబాటు అనేది పార్టీలో జరిగిన ఒక అంతర్మథనం అని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు షిండే కృతజ్ఞతలు తెలియజేశారు. షిండేకు శివసేన, కొన్ని చిన్న పార్టీలు, స్వతంత్రులతో కలిపి 50 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు తెలుస్తోంది. మరికొంత మంది శాసనసభ్యులు తనకు మద్దతుగా ముందుకొస్తారని ఆయన చెప్పారు. శాసనసభలో బలనిరూపణపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించడంతో ఉద్ధవ్ ఠాక్రే బుధవారం సీఎం పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 మంది సభ్యులు ఉండగా, శివసేన తిరుగుబాటు వర్గం–బీజేపీ కూటమికి 170 మంది సభ్యుల మద్దతు ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. గోవా నుంచి షిండే రాక సందర్భంగా ముంబై పోలీసులు నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తే.. ముంబైకి బయలుదేరడానికి కంటే ముందు షిండే గోవాలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్ర గవర్నర్‌ను కలవడానికి ముంబైకి వెళ్తున్నట్లు చెప్పారు. మిగతా ఎమ్మెల్యేలంతా ప్రస్తుతానికి గోవాలోనే ఉంటారని వివరించారు. తమ ఫిర్యాదులను ఎంవీఏ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరించి ఉంటే పరిస్థితి ఇక్కడిదాకా వచ్చేది కాదన్నారు. మంత్రులకు శాఖల కేటాయింపుపై వస్తున్న ఊహాగానాలను నమ్మొద్దని షిండే తన అనుచరులకు సూచించారు. నూతన సీఎం ఏక్నాథ్ షిండేకు ప్రధానమంత్రి మోదీ అభినందలు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు సైతం అభినందనలు తెలియజేశారు. షిండేకు ఉద్ధవ్ అభినందనలు మహారాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్నాథ్ షిండేకు, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు తెలియజేశారు. ఈ నెల 2–3న అసెంబ్లీ భేటీ జూలై 2, 3 తేదీల్లో మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. సీఎం ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో తొలి మంత్రివర్గం సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. రెబల్స్‌కు విచారం తప్పదు: సంజయ్ రౌత్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు వారి దారి వారు చూసుకున్నారని, అందుకు వారు ఎప్పటికైనా విచారించక తప్పదని శివసేన ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ పేర్కొన్నారు. రెబల్ ఎమ్మెల్యేల తీరు పట్ల తమకు ఎలాంటి ఆందోళన లేదన్నారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే తరహాలో వస్త్రాలు ధరించిన వ్యక్తి ఫొటోను షేర్ చేశారు. ఈ ఫొటోలో సదరు వ్యక్తి వీపు భాగంలో రక్తపు మరకలు ఉన్నాయి. ఉద్ధవ్‌కు వెన్నుపోటు పొడిచారని సంజయ్ పరోక్షంగా వెల్లడించారు. సరిగ్గా ఇదే జరిగిందని ట్వీట్లో వివరించారు. ఇకపై శివసేన రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని ఉద్ఘాటించారు. మనీ లాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్లపై వివరణ ఇవ్వడానికి శుక్రవారం అధికారుల వద్దకు వెళ్తానని సంజయ్ రౌత్ తెలిపారు. రెబల్స్ వెళ్లే మార్గంలో తాము ఎలాంటి ఆటంకాలు కల్పించబోమని, ఆ ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. వారి పని వారు చేసుకుంటారు, తమ పని తాము చేసుకుంటామని, తమ ఇరువురి దారులు వేరయ్యాయని వ్యాఖ్యానించారు. శివసేనలో తిరుగుబాటుకు కారణం ఎవరో తమకు తెలుసని పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు. -
మెజారిటీ నిరూపించుకోమనండి.. మహారాష్ట్ర సంక్షోభంలో కీలక మలుపు
ముంబై/న్యూఢిల్లీ/గువాహటి: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం మంగళవారం కీలక మలుపు తిరిగింది. వారానికి పైగా వేచిచూసే ధోరణి అవలంబించిన బీజేపీ నేరుగా రంగంలోకి దిగింది. విపక్ష నేత, బీజేపీకి చెందిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం రాత్రి గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలిశారు. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేను అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘శివసేనపై 39 మంది ఎమ్మెల్యేలు ఏక్నాథ్ షిండే సారథ్యంలో తిరుగుబాటు చేసి మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో పాలక మహా వికాస్ అఘాడీ కూటమి మైనారిటీలో పడింది. అందుకే అసెంబ్లీలో బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా కోరుతూ గవర్నర్‌కు లేఖ సమర్పించాం’’ అని వివరించారు. అంతకుముందు మంగళవారం రోజంతా బీజేపీ శిబిరంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫడ్నవీస్ ఉదయమే ఢిల్లీ వెళ్లి పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తదితరులతో సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించిన రాజకీయ వ్యూహంపైనే వారు చర్చించినట్టు చెబుతున్నారు. రాత్రికి ముంబై తిరిగి రాగానే పదింటికి ఫడ్నవీస్ నేరుగా వెళ్లి గవర్నర్‌ను కలిశారు. మరోవైపు షిండే శిబిరంలో చేరిన 8 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉద్ధవ్‌ను మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా ఆదేశించాలని గవర్నర్‌ను ఈ మెయిల్ ద్వారా కోరినట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై రానున్నట్టు శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే ప్రకటించారు. వస్తే అన్ని విషయాలూ చర్చించుకుందామంటూ పార్టీ చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా రెబల్స్‌కు విజ్ఞప్తి చేశారు. ‘‘రెబల్స్‌కు ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. తిరిగొచ్చి నాతో మాట్లాడితే సమస్య పరిష్కారానికి దారి దొరుకుతుంది’’ అంటూ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో మొత్తం వ్యవహారం క్రమంగా క్రైమాక్స్‌కు చేరుతున్నట్టు కన్పిస్తోంది. షిండే వర్గం ఎమ్మెల్యేలు గురువారం ముంబై తిరిగొచ్చి బలపరీక్షకు ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరతారన్న వార్తలు రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. దమ్ముంటే పేర్లు చెప్పండి: షిండే 20 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉద్ధవ్‌తో టచ్‌లో ఉన్నారన్న శివసేన వ్యాఖ్యలను షిండే కొట్టిపారేశారు. దమ్ముంటే వారి పేర్లు చెప్పాలని సవాలు చేశారు. ఉద్ధవ్‌పై ఆయన తిరుగుబావుటా ఎగరేయడం, తన వర్గం ఎమ్మెల్యేలతో వారం రోజులుగా అసోంలోని గువాహటిలో ఓ స్టార్ హోటల్లో మకాం వేయడం తెలిసిందే. శిబిరంలో ఇప్పటికే 39 మంది సేన ఎమ్మెల్యేలు, మరో 10 మందికి పైగా స్వతంత్రులున్నారు. 19 మంది శివసేన లోక్‌సభ సభ్యుల్లో కూడా ఏకంగా 14 నుంచి 16 మంది షిండే వైపు చూస్తున్నట్టు చెబుతున్నారు. వారిలో కనీసం 12 మంది ఇప్పటికే శిబిరంలో చేరినట్టు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం హోటల్ బయట షిండే విలేకరులతో మాట్లాడారు. తన వర్గం ఎమ్మెల్యేలందరితో కలిసి త్వరలో ముంబై వస్తానని ప్రకటించారు. బాల్ ఠాక్రే హిందూత్వ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వారంతా స్వచ్ఛందంగా తనతో కలిసొచ్చారని పునరుద్ఘాటించారు. బీజేపీ దూకుడు మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా ప్రయత్నాలకు బీజేపీ పదును పెంచింది. అధికార సంకీర్ణంలో తలెత్తిన సంక్షోభంతో తమకు ఏ సంబంధమూ లేదని పార్టీ అంటున్నా, ఈ మొత్తం వ్యవహారంలో ఫడ్నవీస్‌దే కీలక పాత్ర అని భావిస్తున్నారు. మంగళవారం ఉదయమే ఢిల్లీ వెళ్లిన ఆయన ముందుగా అమిత్ షాతో సమావేశమయ్యారు. బీజేపీ ఎంపీ, సీనియర్ లాయర్ మహేశ్ జఠ్మలానీ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది! సేన రెబల్స్, స్వతంత్రుల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అందుబాటులో ఉన్న పలు అవకాశాలపై లోతుగా చర్చించినట్టు సమాచారం. అనంతరం ఫడ్నవీస్ నడ్డా నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. ఇదీ నంబర్ గేమ్ సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు) మెజారిటీ మార్కు: 144 షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు: 49 మంది పాలక కూటమి వాస్తవ బలం: 168 షిండే తిరుగుబాటు తర్వాత: 119 బీజేపీ కూటమి వాస్తవ బలం: 113 షిండే కూటమి మద్దతిస్తే: 162 -
సాక్షి కార్టూన్ 25-01-2022
అలా పైకి తెచ్చి మనం ఇలా కిందే ఉండిపోవాల్సి వచ్చింది..! -
శివసేనపై హోంమంత్రి ఆగ్రహం
సాక్షి, బనశంకరి(కర్ణాటక): శివసేన కార్యకర్తలు కన్నడ పతాకాన్ని కాల్చివేయడం సరైన చర్య కాదని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నమని హోంమంత్రి అరగజ్ఞానేంద్ర మండిపడ్డారు. బుధవారం బెళగావిలో విలేకరులతో మాట్లాడుతూ... మరాఠీలు, కన్నడిగులు అనే భేదభావం లేకుండా ప్రజలు ఉన్నారన్నారు. కానీ కొందరు శాంతికి భంగం కలిగించేందుకు యత్నిస్తున్నారు, దీనిని నిర్దాక్షిణ్యంగా అణచివేస్తామన్నారు. ఈ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అనేక ధర్నాలు జరుగుతున్నాయని, వాటన్నింటిని సమర్థంగా ఎదుర్కొంటామని చెప్పారు. కాగా, పోలీసుల వసతి, వేతన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చదవండి: లఖీంపూర్ ఖేరి ‘కుట్ర’పై... దద్దరిల్లిన లోక్‌సభ -
ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ..
సాక్షి, ముంబై(మహారాష్ట్ర): ప్రతి ఒక్కరు తమ జీవితంలో వివాహ వేడుకను గొప్పగా జరుపుకోవాలనుకుంటారు. దీనిలో భాగంగా.. మెహందీ,సంగీత్ వంటి అనేక కార్యక్రమాలను వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ కార్యక్రమాలకు బంధువులు, స్నేహితులు హజరై డ్యాన్స్‌లు చేస్తుంటారు. పెళ్లివేడుకలలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించి ఎన్నో వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా, పెళ్లి వేడుక డ్యాన్స్‌కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహారాష్ట్ర శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కుమార్తె పూర్వాన్షి వివాహం సోమవారం ముంబైలోని ప్రముఖ హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి అనేక మంది రాజకీయ నాయకులు, ప్రముఖులు హజరయ్యారు. ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే కూడా తమ కుటుంబంతో కలిసి వివాహ వేడుకకు హజరయ్యారు. పెళ్లి వేడుకలో భాగంగా.. సంగీత్ కార్యక్రమం జరిగింది. దీనిలో ఎంపీ సంజయ్‌రౌత్.. ఎన్సీపీ ఎంపీ సుప్రీయాతో కలిసి డ్యాన్స్ చేశారు. వీరిద్దరు కలిసి చక్కగా స్టెప్పులు వేసి.. వివాహ వేడుకకు హజరైన అతిథులను ఉల్లాసపరిచారు. దీంతో అక్కడ ఉన్నవారు కూడా వీరితో పాటు కలిసి హుషారైన స్టెప్పులు వేశారు. ఎంపీ సుప్రీయా సులే.. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కుమార్తె . పూర్వాన్షి రౌత్‌కు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన మల్హార్ నర్వేకర్‌తో వైభవంగా వివాహం జరిగింది. ఈయన తండ్రి రాజేష్ నర్వేకర్ ఒక సివిల్ సర్వీసెస్ అధికారి. ప్రస్తుతం ఇద్దరు ఎంపీలు చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
అమానుషం: ఇంకుచల్లి, చీర కట్టించి దాడి
ముంబై: మహారాష్ట్రలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తమ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై విమర్శలు గుప్పించిన వ్యక్తిపై శివసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శించిన నాయకుడిపై ఇంకుచల్లి పిడిగుద్దులతో దాడి చేయడమే కాకుండా చీరకట్టి ఊరేగింపు చేశారు. దీనిపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులు వెంటనే స్పందించి 17మందిని అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్రలోని పండరీపూర్‌లో బీజేపీ నేత శిరీశ్ కాటేకర్ సీఎం ఉద్దవ్‌పై విమర్శలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన శివసేన కార్యకర్తలు అతడిపై ఇంకు చల్లి పిడిగుద్దులతో దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆయనకు బలవంతంగా చీర కట్టి వీధుల్లో ఊరేగించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే దీనిపై పోలీసులకు ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్ చేశారు. అయితే ఈ దాడి విషయం తెలుసుకున్న పోలీసులు శివసేన నాయకులను అడ్డగించారు. పోలీసులను తోసివేసి మరీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. తమ పార్టీ అధినేతపై కాటేకర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతోనే అతడిపై దాడి చేసినట్లు శివసేన నాయకులు తెలిపారు. -
కంగనా ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పాలి... లేదంటే!
న్యూ ఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే కంగన రనౌత్ మరోసారి తన మాటలతో సమస్యల్లో చిక్కుకుంది. షహీన్ బాగ్ దాదీలలో ఒకరైన బిల్కిస్ బానోపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇబ్బందుల్లో పడేశాయి. నిరసనలలో కనిపించడానికి బిల్కిస్ బానో రూ.100 తీసుకుంటారని కంగన చేసిన ట్విట్‌పై దూమరం రేగింది. (చదవండి: శాసన మండలికి ఊర్మిళ?) ' హా హా హా ఏ దాదీ అయితే అత్యంత శక్తివంతమైన భారతీయురాలిగా టైమ్ మ్యాగజైన్లో చూసామో ఆమె ఇప్పుడు వంద రూపాయలకి నిరసనలలో అందుబాటులో ఉంటుంది. అంతర్జాతీయ ప్రజాసంబంధ సంస్థను భారతదేశానికి సంబంధించి కాకుండా, పాకిస్తాన్‌కి సంబంధించి ఎంచుకున్నారు. ఇటువంటి వాటి గురించి అంతర్జాతీయంగా మాట్లాడటానికి సొంత వాళ్లు కావాలి' అని కంగనా ట్వీట్ చేశారు. ఎంఎస్ మొహిందర్ కౌర్‌ని చూసి బిల్కిస్ బాను అనుకోని కంగనా ట్వీట్ చేసినందుకు లీగల్ నోటీసులు పంపిచానని న్యాయవాది హకమ్ సింగ్ పేర్కొన్నారు. వంద రూపాయలకి నిరసనలకి వస్తుంది అనే వ్యాఖ్యలపై ఏడు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే పరువు నష్టం దావా కేసును కొనసాగిస్తామని తెలిపారు. 'ఫ్యాక్ట్ చెక్' అనే ఆన్లైన్ పోర్టల్‌లో బానో మాట్లాడుతూ...నేను ఆరోజు నిరసనలో పాల్గొనలేదని, షహీన్ బాగ్‌లోని తన నివాసంలోనే ఉన్నానని, ఫోటోలో కనిపించింది నేనుకాదని అన్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ దర్యాప్తు సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలతో వెలుగులోకి వచ్చిన రనౌత్ నిత్యం ఏదొక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉంటుంది. మహారాష్ట్ర రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు కూడా ఆమెను చిక్కుల్లో పడేశాయి. ముంబైని పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చినందుకు శివసేన పార్టీ నాయకులు ఆమెపై దుమ్మెత్తిపోశారు.(చదవండి: యూపీ సీఎంతో బాలీవుడ్ హీరో భేటీ) మంగళవారం నటి ఊర్మిళ శివసేనలో చేరిన సంగతి విధితమే. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...' కంగనకు కావాల్సిన ప్రాముఖ్యత దక్కింది. నేను తనతో మాటల యుద్ధంలో పాల్గొనాలని అనుకోవడంలేదు. నేను ఆమె అభిమానిని కాదు. మనమందరం తన గురించి తను కోరుకున్నదానికంటే ఎక్కువగానే మాట్లాడుకున్నాం ఇక ఇప్పుడు మాట్లాడటానికి ఏమి లేదని అనుకుంటున్నాను. మనం ప్రజాస్వామ్యదేశంలో నివసిస్తున్నాం ప్రతి పౌరుడికి వాక్ స్వేచ్ఛ ఉంది కాబట్టి వారు ఏం చేయానుకుంటున్నారో చేయోచ్చు' అని అన్నారు. -
శివసేన పార్టీలో చేరిన బాలీవుడ్ నటి
బాలీవుడ్ నటి, రంగీలా ఫేమ్ ఊర్మిళ మతోంద్కర్ మహారాష్ష్ర్ట సీఎం, పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే నివాసంలో మంగళవారం మధ్యాహ్నం శివసేన పార్టీలో చేరారు. సీఎం ఉద్దవ్ ఠాక్రే ఆమెను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాక గవర్నర్ కోటా నుంచి ఆ పార్టీ తరపున ఆమె మహారాష్ష్ర్ట శాసనమండలిలో అడుగుపెట్టబోతున్నారు. రాష్ష్ర్ట పాలక మహావికాస్ అగాది, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీల కూటమి ఇప్పటికే 11 మంది పేర్లతోపాటూ ఆమె పేరును కూడా మహారాష్ష్ర్ట గవర్నర్ కోశ్యారీకి పంపడం జరిగింది. అయితే కేబినేట్ సిపారసు మేరకు మహారాష్ట్ర శాసన ఎగువ సభకు 12 మంది సభ్యుల జాబితాకు గవర్నర్ కోశ్యారీ ఆమోదం తెలపాల్సి ఉంది. (చదవండి: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే నిర్వాకం) 46 సంవత్సరాల ఊర్మిళ మతోంద్కర్ గత మార్చిలో రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీ తరపున లోక్ సభ ఎన్నికల్లో ముంబై ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సెప్టెంబర్‌లో ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి అంతర్గత రాజకీయాలతో ఆమె పార్టీని వీడారు. ముంబైను పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగన రనౌత్ నెపోటిజంపై కూడా ఊర్మిళ స్పందించారు. బాలీవుడ్లో కొందరు డ్రగ్స్ యూస్ చేసినంత మాత్రానా డ్రగ్ మాఫియా అనడం కరెక్ట్ కాదని అన్నారు. పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించిన విషయాల్లో కూడా సోషల్ మీడియా వేదికగా ఊర్మిళ తన స్వరం వినిపించింది. -
శివసేన ఎమ్మెల్యే నివాసంలో ఈడీ దాడులు
ముంబై: శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించింది. మనీలాండరింగ్ కేసుకు సంబంధించి పలు చోట్ల ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఈ విషయాన్ని ఈడీ ఇంకా నిర్ధారించలేదు. ఇటీవలె ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చిన కంగనాపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే ప్రతాప్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. థానేలోని ఓవాలా-మాజివాడ నియోజకవర్గానికి చెందిన శివసేన ఎమ్మెల్యే ప్రతాప్ సర్నాయక్ పేరు కంగనాపై విమర్శలతో పాపులారిటీని తెచ్చుకున్నారు. (ముంబై కార్పొరేషన్ ఎన్నికలకు ఎన్సీపీ సన్నద్దం?) కంగనా ముంబైకి వస్తే మా ధైర్యవంతులైన మహిళలు ఆమెను చెంపదెబ్బ కొట్టకుండా వదిలిపెట్టరంటూ ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిని సమర్థిస్తూ ఎంతోమంది పారిశామ్రికవేత్తలను, సినీ తారలను సృష్టించే ముంబైని పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పోల్చడం దారుణమని, ఇందుకు ఆమెపై దేశ ద్రోహం కేసు నమోదు చేయాలని ట్వీట్ చేసి రాజకీయ వేడిని మరింత పెంచారు. అంతేకాకుండా మంత్రులు, ముఖ్యమంత్రిని అవమానించారన్న ఆరోపణలపై రిపబ్లిక్ టీవీకి వ్యతిరేకంగా కేసు నమోదు ఫిర్యాదు చేశారు. (నడిరోడ్డుపై ఎమ్మెన్నెస్ నేత హత్య ) -
‘మహా’ ప్రభుత్వం పతనం ఖాయం.!
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని మహావికాస్ ఆఘడీ ప్రభుత్వంపై బీజేపీ నేత మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కుప్పుకూలనుందని జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తే మహారాష్ట్ర ప్రజలకు ప్రత్యామ్నాయం తామేనని అన్నారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ప్రభుత్వం త్వరలోనే పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. కూటమిలోని మంత్రుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయిని, ఇలాంటి ప్రభుత్వం ఎక్కవ కాలం పరిపాలన కొనసాగించలేదని పేర్కొన్నారు. శివసేన సర్కార్ పడిపోయిన వెంటనే తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామమని ఫడ్నవిస్ ధీమా వ్యక్తం చేశారు. (చదవండి:బిహార్ ఎన్నికల్లో ఎన్నో ‘సేలియెంట్ ఫీచర్స్’ ) గురువారం ముంబైలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఫడ్నవిస్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం సంక్షోభంలో ఉంది. రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. ప్రభుత్వం నుంచి వారికి ఎటువంటి సహాయం అందడం లేదు. ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన ఉంటూ, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. బిహార్ ఎన్నికల ఫలితాలు కేంద్ర రాజకీయాలను ప్రభావితం చేస్తాయి. వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలపై కూడా ఈ ప్రభావం చూపే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని’ వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిహార్ ఎన్నికల ఇంఛార్జ్‌గా ఫడ్నవిస్ బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. సీఎం నితీష్ కుమార్ పాలనకు ఆ రాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని అన్నారు. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నమ్మి ప్రజలు బీజేపీకి ఓటేశారని, నితీష్ కుమార్ ఫాలోయింగ్ కూడా తమకు కలిసొచ్చిందని అన్నారు. బిహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలకు మంగళవారం వెలువడిన ఫలితాల్లో ఎన్డీయే 125 సాధించింది. అందులో బీజేపీకి 74, జేడీయూకు 43, వికాశిల్ ఇసాన్ పార్టీకి 4, హిందుస్తానీ అవాం మోర్చాకి 4 సీట్లు వచ్చాయి. ప్రత్యర్ధి మహాఘట్ బంధన్ కి 110 సీట్లు రాగా, వీటిలో ఆర్జేడీ 75 , కాంగ్రెస్ 19, లెఫ్ట్ పార్టీలకు 16 సీట్లు సాధించాయి. ( చదవండి: ఫలితాలపై తేజస్వీ సంచలన ఆరోపణలు ) -
పీఓకే వ్యాఖ్యలు : త్వరలో ఫలితం చూస్తావు
ముంబై : ఇటీవల ముంబైపై బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై మహరాష్ట్ర అధికార పార్టీ శివసేన మరోసారి ఘాటుగా స్పందించింది. పార్టీ అధికార పత్రిక సామ్నా ద్వారా పరోక్షంగా శనివారం కంగనాపై మాటల యుద్దానికి దిగింది. ‘ముంబై పాకిస్తాన్ అక్రమిత కశ్మీర్(పీఓకే)’ కాదని, అలాంటి వ్యాఖ్యలు చేసిన వారు త్వరలోనే దాని ఫలితాన్ని ఆనందిస్తారని వ్యంగ్య వ్యాఖ్యలు చేయడమే కాకుండా కంగనాకు శుభాకాంక్షలు(ముబారక్ హో) అంటూ వ్యాఖ్యానించింది. అదే విధంగా దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై ఈ మధ్య వివాదాలకు అలవాటు పడిందని శివసేన పేర్కొంది. ఏ విధంగా అంటే.. మహాభారతంలో కౌరవులు ద్రౌపతి వస్ర్తాభరణ చేస్తుండగా పాండవులంతా తలవంచుకుంటారు... ప్రస్తుతం శివసేన కూడా అదే చేస్తుంది అని తెలిపింది. (చదవండి: విమానయాన సంస్థలకు హెచ్చరికలు జారీ చేసిన డీజీసీఏ) అయితే ముంబై జాతీయ సమగ్రతకు ప్రతీక అని అందరికి తెలిసినప్పటికీ వివాద మాఫీయా ఎప్పుడూ ముంబైని మాత్రమే విమర్శిస్తుంది తప్పా ఇతర రాష్ట్రాల రాజధానులను కాదంటూ సామ్నాలో శివసేన పేర్కొంది. ఛత్రపతి షాహు మహారాజ్, మహాత్మా జ్యోతిరావ్ పులే, భీమరావు అంబేద్కర్ జన్మించిన మహరాష్ట్ర ఒక దేశమని; మహారాష్ట్ర మరణిస్తే, దేశం నశించిపోతుందని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు సేనాపతి పాండురంగ చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా శివసేన గుర్తు చేసింది. దురదృష్టవశాత్తు, సంయుక్త మహారాష్ట్ర ఉద్యమ నాయకుడు దివంగత ప్రబోధంకర్ ఠాక్రే ఇచ్చిన జ్ఞానోదయంతో కానీ భారత రాజ్యాంగ వాస్తుశిల్పి అంబేద్కర్ ఆలోచనలతో సంబంధం లేని వారికి స్వాగతమివ్వడం బాధాకరమని.. విమనాశ్రయం నుంచి కంగనాకు వై కాటగిరి సెక్యూరిటితో స్వాగతం పలకడంపై అధికార పార్టీ ఆసహనం వ్యక్తం చేసింది. (చదవండి: కంగనా వివాదం : పవార్ కీలక వ్యాఖ్యలు) -
శివసేన కార్యకర్తల తెగింపు..
-
రిటైర్డ్ ఉద్యోగిపై శివసేన కార్యకర్తల దాడి..
ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేను అపహాస్యం చేస్తూ ఓ కార్టూన్ ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ నావికాదళ అధికారిపై శివసేన కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. వివరాలు.. మదన్ శర్మ అనే 65 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి ముంబైలోని కండివలి ఈస్ట్‌లో నివాసముంటున్నారు. ఈ క్రమంలో తనకు వాట్సప్‌లో వచ్చిన ఠాక్రేకు సంబంధించిన ఓ కార్టూన్‌ను మదన్ తమ రెసిడెన్షియల్ సొసైటీ గ్రూప్‌లో పంపించాడు. ఆ తర్వాత అతనికి కమలేష్ కదమ్ అనే వ్యక్తి కాల్ చేసి తన పేరు, ఇంటి చిరునామా అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం మదన్‌ను ఇంటి బయటకు పిలిచి కొందరు వ్యక్తుల బృందం ఆయనపై దాడి చేసింది. (కంగనా డ్రగ్స్ ఆరోపణలపై దర్యాప్తు) దాడి చేస్తున్న వీడియోలు సమీప సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయ్యాయి. ఈ వీడియోలో ఇంటి నుంచి బయటకు వస్తున్న మదన్ దాదాపు ఎనిమిది మందితో కూడిన శివసేన కార్యకర్తల బృందం వెంబడించింది. భయంతో లోపలికి పరుగెత్తుతున్న మదన్‌ను చొక్కా పట్టుకొని లాగి విచక్షణ రహితంగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మదన్ ముఖం మీద గాయాలవ్వగా, కన్ను రక్తంతో తడిసిపోయింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో బీజేపీ వర్గాలు శివసేన ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నాయి. నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసి రెచ్చిపోయిన శివసేన ఇప్పుడు రిటైర్డ్ అధికారిపై దాడికి తెగబడిందని బీజేపీ ఆరోపిస్తోంది. (ఠాక్రే-పవార్ మధ్య చిచ్చుపెట్టిన కంగనా!) ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా పలువురు బీజేపీ నాయకులు గాయపడిన మదన్ శర్మ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘చాలా విచారకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన. రిటైర్డ్ నావీ ఆఫీసర్ కేవలం వాట్సప్ ఫార్వార్డ్ చేసిన కారణంగా గూండాల దాడిలో గాయపడ్డారు. దయచేసి ఇలాంటివి ఆపండి ఉద్దవ్ ఠాక్రే జీ. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము’ అని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు కమలేష్ కదమ్ సహా ఐదుగురిని అరెస్టు చేశారు. (సోనియా గాంధీని టార్గెట్ చేసిన కంగనా..) -
హిందూస్తాన్ ఏ ఒక్కరి సొత్తు కాదు :రౌత్
సాక్షి, ముంబై : శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మరోసారి బీజేపీపై విరుచుకుపడ్డారు. ఆదివారం ట్టిటర్‌లో ఓ ప్రముఖ కవి వ్యాఖ్యలను ఉటంకిస్తూ ‘హిందూస్తాన్ ఏ ఒక్కరి సొత్తుకాదు. ఈ దేశ మట్టిలో అందరి రక్తం ఉంది’ అంటూ ట్వీట్ చేశారు. అంతకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం దేశంలోని హిందూ - ముస్లింల మధ్య విభేదాలకు బీజేపీ ప్రయత్నిస్తోందని సంజయ్ ఆరోపించారు. గతంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే పౌరసత్వ సవరణ చట్టం గురించి మాట్లాడుతూ.. మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థులకు ఏ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తారు? దీనికి సంబంధించిన ప్రణాళిక ఏమైనా కేంద్రం వద్ద ఉందా? ఉంటే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాగా, సీఏఏ బిల్లుపై లోక్‌సభలో కేంద్రానికి మద్దతిచ్చిన శివసేన, రాజ్యసభలో మాత్రం ఓటింగ్‌కు గైర్హాజరై సభ నుంచి వాకౌట్ చేసింది. అంతకు ముందు మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 35 ఏళ్లుగా బీజేపీతో ఉన్న పొత్తును వదులుకున్న సంగతి తెలిసిందే. చదవండి : రాహుల్ వ్యాఖ్యలపై శివసేన కౌంటర్ -
‘వారి జీవితాలతో ఆటలు ఆడొద్దు’
ముంబై: గాంధీ కుటుంబానికి స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు (ఎస్పీజీ) భద్రతను తొలగించటంపై శివసేన పార్టీ మండిపడింది. కేంద్ర సర్కారు గాంధీ కుటుంబ భద్రతపై వ్యవహరిస్తున్న తీరు సరికాదని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు శివసేన పార్టీ పత్రిక సామ్నా తన సంపాదకీయంలో కథనం వెలువరించింది. ఢిల్లీ, మహారాష్ట్ర.. దేశంలో ఎక్కడైనా రాజకీయాలు భద్రతతో కూడిన సురక్షితమైన వాతావరణంలో జరగాలని పేర్కొంది. గాంధీ కుంటుంబీకుల జీవితాలతో ఆటలు ఆడొద్దని ధ్వజమెత్తింది. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు తమకు భద్రత కలింగించే రక్షణ సిబ్బంది లేకుండా ఉండలేరు. అంటే భద్రతకు ఎంత ప్రముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు’ అని సామ్నా పేర్కొంది. అటువంటి భద్రత గాంధీ కుంటుంబానికి తొలగించటంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీ జోక్యం చేసుకొని స్పందించాలని కోరింది. హోం మంత్రిత్వ శాఖలో ఇటువంటి నిర్ణయం ఎవరు.. ఎలా తీసుకుంటారని సామ్నా తన సంపాదకీయంలో ప్రశ్నించింది. గాంధీ కుటుంబానికి చెందినవారు కాకుండా ఆ స్థానంలో వేరే వాళ్లు ఉంటే. కేంద్రం ఇదే తరహాలో నిర్ణయం తీసుకుంటుందా.. అని సామ్నా తన సంపాదకీయంలో నిలదీసింది. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలకు కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు(ఎస్పీజీ) భద్రతను ఉపసంహరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గాంధీ కుటుంబాన్ని ఎస్పీజీ నుంచి సీఆర్పీఎఫ్ బలగాల సంరక్షణలోని జడ్ ప్లస్ కేటగిరీకి మార్పు చేసినట్లు ప్రకటించింది. కాగా గాంధీ కుటుంబానికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే భద్రత తొలగించినట్లు హోం మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేసిన విషయం తేలిసిందే. ఇక దాదాపు 28 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి ఉన్న ఎస్పీజీ భద్రతను.. వారికి ప్రాణహాని తగ్గినట్లు తేలడంతోనే తొలగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అదే విధంగా ఇకపై రాష్ట్రపతి, దేశ ప్రధానికి భద్రతకై ఎస్పీజీలోని సుమారు 3 వేల మంది సైనికులను వినియోగించనుంది. కాగా 1991లో ఎల్టీటీఈ తీవ్రవాదులు రాజీవ్‌గాంధీని హతమార్చిన తర్వాత గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను కల్పించారు. చదవండి: మీ అందరికీ ధన్యవాదాలు: రాహుల్ గాంధీ -
శివసేనకు కార్యకర్త రాజీనామా
సాక్షి, ముంబై : మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య మహాకూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంలో శివసేనలో లుకలుకలు మొదలవుతున్నాయి. విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన ఇరు పార్టీలు ఒకే గూటికి చేరడం పట్ల ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లు శివసేనకు దూరమవుతున్నారు. ముంబైకి చెందిన రమేష్ సోలంకి అనే శివసేన కార్యకర్త ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. సిద్ధాంతాలకనుగుణంగా పనిచేస్తున్న నాకు కాంగ్రెస్‌తో శివసేన పొత్తు పెట్టుకోవడం నచ్చలేదని, ఇక ఆ పార్టీలో ఉండలేనని వెల్లడించారు. ఇన్నాళ్లూ తనకు పార్టీలో పనిచేసే అవకాశం కల్పించిన ఉద్దవ్ థాకరేకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక శివసేన తీరుపట్ల పలువురు హిందుత్వవాదులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధాంతాలను వదిలేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
శివసేన నేతృత్వంలో సంకీర్ణం
నాగ్‌పూర్/ముంబై: మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడటం ఖాయంగా కనిపిస్తోంది. అభివృద్ధే లక్ష్యంగా ఏర్పడబోయే తమ ప్రభుత్వం ఐదేళ్ల పూర్తికాలం కొనసాగుతుందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రకటించారు. విభిన్న సైద్ధాంతిక భావాలున్న తమ మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం శివసేన నేతృత్వంలో ఏర్పాటుకానుందని వెల్లడించారు. కొత్త ప్రభుత్వం ప్రాథామ్యాలపై కనీస ఉమ్మడి కార్యక్రమం (సీఎంపీ)పై మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చాయి. ముఖ్యమంత్రి పదవిలో శివసేన నేత ఉంటారని ఎన్సీపీ నేత మాలిక్ తెలిపారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ శుక్రవారం నాగ్‌పూర్‌లో మీడియాతో మాట్లాడుతూ..‘త్వరలో అధికారంలోకి రానున్న సేన–ఎన్సీపీ–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఐదేళ్లూ కొనసాగుతుంది. అభివృద్ధే లక్ష్యంగా మా సర్కారు సుస్థిర పాలన అందిస్తుంది. రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు అవకాశమే లేదు’అని పేర్కొన్నారు. సంకీర్ణ ప్రభుత్వం ఆరు నెలలు కూడా ఉండదని, మళ్లీ తామే అధికారంలోకి వస్తామంటూ మాజీ సీఎం ఫడ్నవీస్ చెప్పడంపై స్పందిస్తూ.. ‘ఫడ్నవీస్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. కానీ, ఆయన జ్యోతిష్యం కూడా నేర్చుకున్న సంగతి తెలియదు. మళ్లీ అధికారంలోకి వస్తామంటూ ఆయన పదేపదే అంటున్నారు. అది తప్ప మరేదైనా కొత్త విషయం చెప్పమనండి. మా సంకీర్ణం లౌకిక భావాల ప్రాతిపదికన పనిచేస్తుంది. ఏ మతానికీ వ్యతిరేకం కాదు’అని స్పష్టం చేశారు. 25 ఏళ్లు అధికారంలో ఉంటాం: సంజయ్ రౌత్ శివసేన నేతృత్వంలో త్వరలో ప్రభుత్వం ఏర్పాటు కానుందని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తెలిపారు. ‘మా పార్టీ రానున్న ఐదేళ్లే కాదు..మరో 25 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగనుంది. రాష్ట్ర ప్రయోజనాల మేరకు సీఎంపీ రూపొందించాం. ముఖ్యమంత్రి పీఠాన్ని పంచుకునే విషయంలో కాంగ్రెస్, ఎన్సీపీలతో చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు విషయంలో పార్టీల సిద్ధాంతాల ప్రస్తావన లేదు. గతంలో కూడా సీఎంపీ ప్రాతిపదికన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి’అని పేర్కొన్నారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న, ముస్లిం రిజర్వేషన్ వంటి డిమాండ్లను శివసేన వదులుకుంటుందా అన్న ప్రశ్నకు రౌత్ స్పందించలేదు. కాగా, శరద్ పవార్ 17వ తేదీన ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశమై సీఎంపీ, ప్రభుత్వ ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఇలా ఉండగా, తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్పాటిల్ తెలిపారు. -
మహా మలుపు
-
సిఎం పదవి విషయంలో వెనక్కి తగ్గని శివసేన
-
‘కశ్మీర్ మన అంతర్గత విషయం కాదా?’
సాక్షి, ముంబై : కశ్మీర్లో వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు యూరోపియన్ యూనియన్ పార్లమెంటు ప్రతినిధుల బృందాన్ని అనుమతించడంపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్డీఏ భాగస్వామి అయిన శివసేన కూడా చేరిపోయింది. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చేయడంలో బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో ఇబ్బంది పడ్డ శివసేన ఆ పార్టీని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తోంది. ఇన్నాళ్లూ కశ్మీర్ దేశ అంతర్గత సమస్య అంటూ ఐక్యరాజ్యసమితి ప్రతినిధులను కూడా అడుగుపెట్టనివ్వని ప్రభుత్వం, ఇప్పుడు విదేశీ ప్రతినిధులను ఎందుకు అనుమతినిచ్చిందని బుధవారం ఆ పార్టీ పత్రిక సామ్నా సంపాదకీయంలో నిలదీసింది. ‘కశ్మీర్ మనదేనని ఆర్టికల్ 370 రద్దు చేశాం. అక్కడ జాతీయ జెండా ఎగురవేశాం. ఈ పరిణామాలతో ప్రధాని నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షాలను చూసి యావత్ దేశం గర్వపడింది. కానీ, కశ్మీర్లో అంతా బావుందనే ప్రభుత్వం ఇప్పుడు విదేశీ ప్రతినిధులను ఎందుకు ఆహ్వానించింది? కశ్మీర్ మన అంతర్గత విషయం కాదా? ఇది మన స్వేఛ్చపై దాడి కాదా? అంతేకాక, ఈ చర్య కొన్ని సీరియస్ ప్రశ్నలను లేవనెత్తేందుకు ప్రతిపక్షాలకు అవకాశమిచ్చింద’ని తీవ్రంగా మండిపడింది. కాగా, మహారాష్ట్రలో 50 : 50 ఫార్ములా ప్రకారం అధికార కాలాన్ని పంచుకోవాలని, పదవుల్లో కూడా చెరిసగం వాటాలుండాలని శివసేన బీజేపీని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే శివసేన ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించింది. మంగళవారం ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ.. అలాంటి ప్రతిపాదనకు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. తమ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీంతో అసంతృప్తికి లోనైన శివసేన మరునాడే బీజేపీని విమర్శిస్తూ తన పత్రికలో సంపాదకీయం రాయడం గమనార్హం. -
బీజేపీకి చుక్కలు చూపిస్తున్న శివసేన
ముంబై : హరియాణాలో జేజేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న బీజేపీకి.. మహారాష్ట్రలో మాత్రం శివసేన చుక్కలు చూపిస్తోంది. బీజేపీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో శివసేనతో కలిసి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ సోమవారం నాడు రెండు పార్టీలు వేర్వేరుగా గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని కలవడానికి నిర్ణయించుకున్నాయి. ఇందులో భాగంగా శివసేన పార్టీ నాయకుడు దివాకర్ రౌత్ ఉదయం 10. 30 గంటల ప్రాంతంలో గవర్నర్‌ను కలిశారు. సేన నేతలతో కలిసి రాజ్‌భవన్‌కు వచ్చిన దివాకర్... పార్టీ తరపున గవర్నర్‌కు దీపావళి శుభాకాంక్షలు తెలిపామని, తమ మధ్య రాజకీయాలపై ఎలాంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఈ భేటీ తర్వాత బీజేపీ నాయకులు, సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా గవర్నర్‌ను కలిసి చర్చించే అవకాశం ఉంది. దీపావళి సందర్భంగా గవర్నర్‌ను కేవలం మర్యాద పూర్వకంగా కలుస్తున్నట్లు రెండు పార్టీలు చెప్తుండడం కొసమెరుపు. కాగా అక్టోబర్ 21న జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహ కూటమికి మెజారిటీ సాధించినప్పటికీ, శివసేన అధినాయకత్వం ముఖ్యమంత్రి పదవికి 50:50 ఫార్ములా డిమాండ్‌ను తేవడంతో.. బీజేపీ అధినాయకత్వం ఈ విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. ఎన్నికలు ముందు చెప్పినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అనుసరించాలని, మంత్రి పదవులు సైతం సమానంగా ఇవ్వాలని శివసేన వాదిస్తోంది. దీంతో బీజేపీ అధినాయకత్వం నేడు శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేతో సమావేశమై ప్రభుత్వ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్డీఏ భాగస్వామి అయిన ఆర్పీఐ అధినేత రామ్‌దాస్ అథవాలే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 50:50 ఫార్ములా పై ఆయన మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాల పాటు ఆదిత్య ఠాక్రే డిప్యూటీ సీఎంగా ఉండే ఆఫర్‌కు శివసేన సమ్మతం తెలపాలన్నారు. ప్రజాభిప్రాయం మేరకు రెండు పార్టీలు కలిసి పనిచేయాలని కోరారు. రెండు పార్టీల మధ్య కొనసాగుతున్న వివాదాలకు త్వరలోనే ముగింపు పలికి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఎన్నికలు ముందు చెప్పినట్లుగానే ప్రభుత్వ ఏర్పాటులో 50-50 ఫార్ములా అనుసరించాలని, మంత్రి పదవులు సైతం సమానంగా ఇవ్వాలని శివసేన వాదిస్తోంది. అలా కానీ పక్షంలో రిమోట్ తమ దగ్గర ఉందని, అలాగే ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నట్లు చెబుతోంది. -
బీజేపీ గెలిచింది కానీ..!
ముంబై/చండీగఢ్: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం అనూహ్య ఫలితాలు వెలువడ్డాయి. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన కూటమి అధికారాన్ని నిలుపుకున్నప్పటికీ.. ఆశించిన మెజారిటీ రాలేదు. మరోవైపు, గెలుపు సునాయాసమనుకున్న హరియాణాలో బీజేపీ ఊహించని రీతిలో చతికిలపడింది. చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా అతిపెద్ద పార్టీగా అవతరించింది. హంగ్ ఏర్పడటంతో హరియాణాలో 10 స్థానాలు గెలుచుకున్న జననాయక జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్‌గా మారింది. అక్టోబర్ 21న జరిగిన ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీ శివసేన కూటమి విజయం, హరియాణాలో బీజేపీ గెలుపు అంతా ఖాయమనుకున్నారు. ఈ సంవత్సరం మే నెలలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లోనూ పూర్తిస్థాయిలో ఆధిక్యత చూపడంతో ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు ఖాయమేనని భావించారు. ప్రచారంలోనూ ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వలేదని భావించారు. కానీ అనూహ్యంగా మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి, హరియాణాలో కాంగ్రెస్ పుంజుకున్నాయి. 288 స్థానాల మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ శివసేన కూటమికి 200కి పైగా సీట్లు వస్తాయని భావించారు. కానీ కాషాయ కూటమి 161 స్థానాల్లో(బీజేపీ 105, శివసేన 56) మాత్రమే విజయం సాధించింది. అయితే, మెజారిటీ రావడంతో రెండో సారి అధికారం చేపట్టనుంది. అనూహ్యంగా పుంజుకున్న ఎన్సీపీ 54 సీట్లలో, కాంగ్రెస్ 45 సీట్లలో విజయం సాధించాయి. హరియాణాలో 90 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 40 సీట్లలో గెలుపొంది, మెజారిటీకి 6 స్థానాల దూరంలో నిలిచింది. కాంగ్రెస్ 31 సీట్లు గెలుచుకుంది. 2014 ఎన్నికల్లో 15 స్థానాలే గెలుచుకున్న కాంగ్రెస్‌కు ఇది డబుల్ ధమాకానే. 10 స్థానాల్లో విజయం సాధించిన జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) కింగ్ మేకర్‌గా నిలిచింది. ఐఎన్ఎల్డీ ఒక స్థానంలో ఇతరులు 8 స్థానాల్లో విజయం సాధించారు. జేజేపీని గత సంవత్సరమే దుష్యంత్ చౌతాలా స్థాపించారు. ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీకి మద్దతివ్వాలా లేక కాంగ్రెస్‌కా అనేది ఇంకా నిర్ణయించుకోలేదని దుష్యంత్‌చౌతాలా చెప్పారు. కాగా, హరియాణాలో బీజేపీనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా గురువారం స్పష్టం చేశారు. మరోవైపు, హరియాణాలో బీజేపీయేతర పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుకు కలసిరావాలని కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా పిలుపునిచ్చారు. కాగా, మహారాష్ట్ర, హరియాణా ఫలితాలను బీజేపీ స్వాగతించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, హరియాణా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్‌పై ఆయా రాష్ట్రాల ప్రజలు మరోసారి విశ్వాసం చూపారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమని పార్టీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. బీజేపీపై మళ్లీ విశ్వాసం చూపించారు: మోదీ న్యూఢిల్లీ: మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీ (బీజేపీ), ఆ పార్టీ ముఖ్యమంత్రులపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పేర్కొన్నారు. ప్రజలకు సేవ చేయడానికి వచ్చే ఐదేళ్లలో వారు మరింత కష్టపడతారని చెప్పారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ల నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, 2014లో పాలనా పగ్గాలు చేపట్టేనాటికి ఎటువంటి అనుభవం లేనప్పటికీ గడచిన ఐదేళ్లలో వారు స్వచ్ఛమైన పరిపాలనను ప్రజలకు అందించి, ప్రజల విశ్వాస్వాన్ని గెలుపొందారని పేర్కొన్నారు. 2014కు ముందు రెండు రాష్ట్రాల్లో జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ అటు తర్వాత కీలకస్థానానికి చేరిన విషయాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఫలితాలపై సమీక్ష గురువారమిక్కడ జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ అత్యున్నత స్థాయి సమావేశానికి ప్రధాని నేతృత్వం వహించారు. ఈ సమావేశంలో తాజా అసెంబ్లీ ఫలితాలను సమీక్షించారు. మహారాష్ట్రతో పాటు, మెజారిటీకి ఆరు సీట్ల దూరంలో నిలిచిన హరియాణాలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేయాలని బోర్డు నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
అక్కడ చక్రం తిప్పినవారికే..!
సవాళ్ల బాటలో.. ఈ సారి ఎన్నికలు అందరికీ గట్టి సవాళ్లే విసురుతున్నాయి. ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీ బలం పుంజుకోకపోగా మరికాస్త బలహీనపడింది. కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లేమి సమస్య వెంటాడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు అగ్రనాయకులు ఎందరో పార్టీలు మారారు. ఎంపీ ఉద్యానరాజే భోస్లే వంటి వారు చేజారిపోయారు. మరఠ్వాడా ప్రాంతంలో ఫిరాయింపుల ప్రభావం ఎక్కువగా చూపించనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీనియర్ నాయకులు పదవుల్ని వీడడంతో ఆ పార్టీ ఆత్మరక్షణలో పడిపోయింది. ఇక ఎన్సీపీ ఈడీ నీడలో ఉంటూ ఎన్నికల్ని ఎదుర్కొంటోంది. పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ చుట్టూ ఈడీ ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో ఎందరో నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరిపోయారు. ఇక బీజేపీకి ఈ సారి ఎన్నికల్లో గెలుపు అత్యంత అవసరం. ఎందుకంటే గత ఏడాది జరిగిన రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటమి పాలైన ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. కానీ ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల నాటికి బలం పుంజుకుంది. అయితే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల అంశాలు, ప్రాధాన్యాలు వేరు కావడంతో ఆ పార్టీ కూడా ఒక మెట్టు దిగి శివసేనతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక శివసేనకు ఇవి చారిత్రాత్మక ఎన్నికలు. ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగారు. కొన్నాళ్లుగా నేరుగా ప్రధాని మోదీపైనే విమర్శలు గుప్పిస్తూ వచ్చిన శివసేన ఈ సారి క్షేత్రస్థాయిలో బలపడి సీట్లు పెంచుకోవాలని తహతహలాడుతోంది. అందుకే ఆదిత్య ఠాక్రే ఎన్నికల బరిలో దిగినట్టుగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రైతు సమస్యలు, ఆర్థిక మందగమనం, వరదలు వంటి పరిస్థితులు నెలకొన్న వేళ బీజేపీ శివసేన కూటమి తన వ్యూహాన్ని మార్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కశ్మీర్ 370 రద్దుపైనే అధికంగా దృష్టి సారించారు. పదే పదే దానిపైన విపక్ష పార్టీకి సవాళ్లు విసురుతున్నారు. రాహుల్ గాంధీ ఇంకా రఫేల్ అంశాన్నే పట్టుకొని వేళ్లాడుతున్నారు. విపక్షాల బలహీనతే ఈ సారి బీజేపీ కూటమికి వరంగా మారుతుందని రెండు చోట్లా ఒకటే ప్రభుత్వం అన్న సంప్రదాయం కొనసాగుతుందనే అభిప్రాయం వినిపిస్తోంది. మహారాష్ట్రలో ఎన్నికల వేడి రాజుకుంది. బీజేపీ–శివసేన, కాంగ్రెస్–ఎన్సీపీ మధ్యే పోటీ నెలకొని ఉంది. గత 20 ఏళ్లుగా ఈ రెండు కూటముల మధ్యే రాజకీయాలు తిరుగుతున్నాయి. రెండు కూటములు అధికారాన్ని అనుభవించాయి. ప్రతీసారి లోక్‌సభ ఎన్నికలు జరిగిన అయిదారు నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతూ ఉండడంతో సార్వత్రిక ఎన్నికల ప్రభావం వీటి మీద తప్పనిసరిగా పడుతోంది. 1999 నుంచి గణాంకాలను లోతుగా పరిశీలిస్తే ఓటర్లు కేంద్రంలో అధికారం చేపట్టిన పార్టీకే తిరిగి అందలం ఎక్కిస్తున్నారు. అంతకు ముందు 1990–91, 1995–96లో వ్యతిరేక ఫలితాలు వచ్చాయి కానీ, ఆ తర్వాత నుంచి ఓటర్లు రెండు చోట్ల ఒకే ప్రభుత్వం ఉండాలని కోరుకుంటున్నారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత, 1993 ముంబై పేలుళ్ల తర్వాత మహారాష్ట్రలో హిందూత్వ వాదులు బలపడ్డారు. కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇచ్చే స్థాయికి బీజేపీ సేన కూటమి ఎదిగింది. 2004లో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైతే, మహారాష్ట్రలో తిరిగి కాంగ్రెస్ కూటమి అధికారాన్ని దక్కించుకుంది. 2009లో కేంద్రంలో యూపీఏ–2 ఏర్పాటైతే, రాష్ట్రంలో కాంగ్రెస్ ఎన్సీపీ అధికారాన్ని దక్కించుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కలసికట్టుగా బీజేపీ, శివసేన పోటీ చేశాయి. కేంద్రంలో పూర్తిస్థాయి మెజార్టీతో మోదీ ప్రభుత్వం ఏర్పాటైంది. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన రెండూ విడివిడిగా పోటీ చేశాయి. కానీ ఎన్నికల అనంతరం పొత్తు కుదుర్చుకున్నాయి. -
ముందంజలో బీజేపీ–శివసేన!
బలహీనమైన ప్రతిపక్షాలు, కాంగ్రెస్ వంటి జాతీయ పార్టీల్లో నాయకత్వ లేమి... వలస రాజకీయాలు! వెరసి... ఈ నెల 21న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ... శివసేనతో కలిసి మరోసారి పగ్గాలు చేపట్టే అవకాశాలు మెరుగయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమితో పోలిస్తే రాజకీయంగా బీజేపీ–శివసేన ఎన్నో మైళ్ల ముందుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ చేతిలో ఘోరపరాభవానికి గురైన కాంగ్రెస్, ఎన్సీపీలు ఆ తరువాత కీలక నేతల వలసలతో దాదాపుగా కుదేలైంది. గత మూడు నెలల్లో సుమారు 30 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీవైపు మళ్లడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఒక్కతాటిపై ఉంచగలిగే వారు లేకుండా పోయారు. సంప్రదాయ ఓటుబ్యాంకు కూడా కకావికలమైపోయింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు ఈ సారి గెలుపు మాదేనన్న ధీమాతో ప్రచార బరిలోకి దిగడం గమనార్హం. ఎన్సీపీకి రెండు సమస్యలు పార్టీ ఎమ్మెల్యేలు అటు బీజేపీలోకి లేదంటే శివసేనలోకి వెళ్లిపోవడం ఒక్కటే శరద్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) ఎదుర్కొంటున్న సమస్య కాదు. ఈ వలసల కారణంగా దశాబ్దాలుగా తమకు పట్టున్న పశ్చిమ మహారాష్ట్ర ప్రాంతంలో పార్టీ బలహీనడిందన్నది వాస్తవం. దీంతోపాటు మహారాష్ట్ర సహకార బ్యాంకు స్కామ్‌లో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌తోపాటు అజిత్ పవార్లు చిక్కుకోవడంతో పార్టీ పరువు మరింత పోయినట్టుగా పరిశీలకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం... మళ్లీ పగ్గాలు చేపట్టడంలో, వారసుడి ఎంపికలో సోనియాగాంధీ చేసిన జాప్యం కారణంగా పార్టీ సంస్థాగతంగా భారీగా నష్టపోయింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్, ఎన్సీపీలు హంగు, ఆర్భాటాలు, చర్చల్లాంటివేవీ లేకుండానే ఎన్నికల నోటిఫికేషన్‌కు ఐదు రోజులు ముందే పొత్తు, సీట్ల పంపిణీ ఫార్ములా ఖరారు చేసుకుని ప్రచార బరిలోకి దిగేశాయి. ఇరు పార్టీలు చెరి 125 స్థానాల్లో పోటీపడుతూండగా మిగిలిన 38 సీట్లు కూటమిలోని చిన్న పార్టీలకు కేటాయించాయి. ఓట్లు లెక్కలూ బీజేపీకే అనుకూలం.. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, శివసేనలు విడివిడిగా పోటీ చేసినప్పటికీ ఇరు పార్టీలకు పోలైన ఓట్లు యాభై శాతం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. బీజేపీ 27.59, శివసే, 23.29 శాతం ఓట్లు సాధించగా కాంగ్రెస్, ఎన్సీపీలకు 16.27 శాతం, 15.52 శాతం ఓట్లు దక్కాయి. 2014 నాటి అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీజేపీ అత్యధికంగా 122 స్థానాలు గెలుపొందగా శివసేన 63 స్థానాలకే పరిమితమైంది. మరోవైపు కాంగ్రెస్ 42 సీట్లు, ఎన్సీపీ 41 స్థానాలు మాత్రమే గెలిచాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. లోక్‌సభ ఎన్నికల్లో బరిలోకి దిగని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన ఈ సారి అసెంబ్లీకి పోటీ చేస్తోంది. ఆర్మీ పేరుతో ఇందిర ఓట్లు అడగలేదు సైనికుల పేరు చెప్పి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నడూ ఓట్లు కోరలేదని, కానీ ప్రధాని మోదీ మాత్రం ఆ పని చేశారని ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ విమర్శలు సంధించారు. ‘‘ఆర్మీ పరాక్రమాన్ని చూపించి ఇందిరాగాంధీ ఓట్లు అడగలేదు. కానీ దేశం కోసం జరిగిన కీలక యుద్ధాల్లో విజయం వారి ఘనతగానే చెప్పారు. కానీ గత లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జాతి భద్రత అంశాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించుకున్నారు’’అంటూ మహారాష్ట్రలోని బాలాపూర్ పట్టణంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా శరద్ పవార్ పేర్కొన్నారు. కాంగ్రెస్‌లోకి ఐఎన్ఎల్డీ మాజీ ఎంపీలు హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు గడువు దగ్గర పడుతున్న సమయంలో ఐఎన్ఎల్డీకి చెందిన ఇద్దరు మాజీ ఎంపీలు కాంగ్రెస్‌లో గూటిలోకి చేరిపోయారు. చరణ్‌సింగ్ రోరి, సుషీల్కుమార్ ఇండోరా మంగళవారం సిర్సాలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ కుమారి శెల్జా సమక్షంలో పార్టీలో చేరారు. – టి.ఎన్.రఘునాథ, సీనియర్ జర్నలిస్ట్, ముంబై -
రాజకీయాల్లోకి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్!
ముంబై : ముంబైకి చెందిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఇన్స్పెక్టర్ ప్రదీప్‌శర్మ తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాజకీయాల్లో చేరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నటు ఆయన వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను సీనియర్ అధికారులకు పంపించారు. మహారాష్ట్రలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన తరపున ఆయన పోటీ చేయనున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. కాగా 2008లో ముంబై గ్యాంగ్‌స్టర్ లఖన్ భాయ్‌పై జరిగిన నకిలీ ఎన్కౌంటర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న శర్మతో పాటు మరో 13 మంది పోలీస్ అధికారులపై అప్పట్లో మహారాష్ట్ర పోలీస్ విభాగం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఐదేళ్ల పాటు విధులకు దూరంగా ఉన్న ప్రదీప్ శర్మ 2013లో తిరిగి థానే కైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరారు. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా పేరు.. 1983లో మహారాష్ట్ర పోలీస్ విభాగంలో చేరిన ప్రదీప్ శర్మ అనతికాలంలోనే ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. 90వ దశకంలో అండర్‌వరల్డ్ మాఫియా కార్యకలపాలను అడ్డుకునే అధికారాన్ని ముంబై క్రైమ్ బాంచ్ శర్మకు కట్టబెట్టడంతో ఆయన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడైన ఇక్బాల్ కస్కర్‌ను అరెస్టు చేసి పెను సంచలనమే సృష్టించారు. మొత్తం 300 మందికి పైగా గ్యాంగ్‌స్టర్స్‌ను అంతమొందించిన ప్రదీప్ శర్మ జీవితం ఆధారంగా బాలీవుడ్లో సినిమాలు కూడా తెరకెక్కడం విశేషం. -
రాహుల్, ప్రియాంక చాలా కష్టపడ్డారు : శివసేన
ముంబై : నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని పీఠం అలంకరిస్తారని బీజేపీ మిత్రపక్షం శివసేన ధీమా వ్యక్తం చేసింది. మంగళవారం తన అధికార పత్రిక సామ్నాలో ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ప్రియాంకల మీద కూడా ప్రశంసలు కురిపించింది. ‘ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయనే విషయం మాకు అనవసరం. ప్రజల ఉత్సాహం చూస్తూంటే నరేంద్ర మోదీనే మరోసారి ప్రధాని అవుతారనే నమ్మకం కల్గుతుంది. ఇక పోతే ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ, ప్రియాంక చాలా కష్ట పడ్డారు. వారి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఈ సారి పార్లమెంట్లో కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేద’ని శివసేన పేర్కొంది. అంతేకాక ‘2014లో కాంగ్రెస్‌కు సరిపడా సీట్లు లభించకపోవడంతో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. ఈసారి తప్పకుండా ప్రతిపక్ష నాయకుడు కాంగ్రెస్ నుంచే ఉండబోతున్నారు. దీన్ని రాహుల్ విజయంగానే చెప్పుకోవాలి’ అని శివసేన అభిప్రాయపడింది. ఏడో దశ ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయేకు స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టాయి. తరువాతి స్థానం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏకు దక్కనున్నట్లు సర్వేలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీతో జట్టుకట్టిన శివసేన పరోక్షంగా కాంగ్రెస్‌కు ఓటమి తప్పదని చెబుతూనే ఆ పార్టీ బలమైన ప్రతిపక్షంగా నిలవబోతోందని అభిప్రాయపడింది. -
శివసేన గూటికి చతుర్వేది
న్యూఢిల్లీ/ముంబై: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రియాంక చతుర్వేది శుక్రవారం ఆ పార్టీని వీడారు. ఆ వెంటనే ఉద్దవ్ ఠాక్రే సమక్షంలో శివసేన పార్టీలో చేరారు. చతుర్వేది కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి, వివిధ పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత రాహుల్‌గాంధీకి పంపారు. ఆమె పార్టీ అధికార ప్రతినిధిగా, మీడియా విభాగం ఇన్‌చార్జీగా కొనసాగుతున్నారు. పార్టీలో కొందరు నాయకులు తనపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కొద్ది వారాలుగా తనకు అవమానాలు జరుగుతున్నాయని ఆమె కొద్దిరోజుల క్రితం పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారిని అధిష్టానం సస్పెండ్ కూడా చేసింది. అయితే, ఆ పార్టీ పశ్చిమ ఉత్తరప్రదేశ్ ఇన్చార్జి జ్యోతిరాదిత్య జోక్యంతో ఇటీవల వారిని మళ్లీ పార్టీలోకి తీసుకున్నారు. దీంతో ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్‌లో తన సేవలకు విలువలేదని, అందుకే పార్టీని వీడుతున్నానని రాహుల్‌ను ఉద్దేశించి ఒక లేఖ రాశారు. ప్రియాంక చతుర్వేదిని ఉద్దేశించి ఉద్దవ్ ఠాక్రే మాట్లాడుతూ శివసేన కార్యకర్తలకు మంచి సోదరి లభించిందని అన్నారు. తన స్వస్థలం ముంబై అని, అందుకే శివసేనలో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు రక్షణలేదని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. -
కశ్మీరీ విద్యార్థులపై సేన కార్యకర్తల దాడి
ముంబాయి: ఇద్దరు కశ్మీరీ విద్యార్థులపై శివసేన యూత్ వింగ్ కార్యకర్తలు బుధవారం రాత్రి దాడిచేశారు. అనంతరం దాడి చేసిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. విషయం తెలిసిన పోలీసులు దాడికి పాల్పడిన 8 మంది సేన కార్యకర్తలను అరెస్ట్ చేసి వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం..దాయాబాయి పటేల్ శారీరిక్ శిక్షణ్ మహావిద్యాలయకు చెందిన ఇద్దరు కశ్మీరీ విద్యార్థులు మార్కెట్ నుంచి వారు ఉంటున్న అద్దె ఇంటికి వెళ్తుండగా చింతామని నగర్ ప్రాంతం వద్ద సేన కార్యకర్తలు అడ్డుకున్నారు. వారిపై దాడి చేసి వందేమాతరం, భారత్ మాతాకీ జై అని దేశభక్తి నిరూపించుకోవాలని బలవంతంగా నినాదాలు చేయించారు. ఆ సంఘటన నుంచి బయటపడిన అనంతరం బాధితులు మీడియాతో మాట్లాడారు. ఉగ్రదాడి జరిగిన నాటి నుంచి తమకు ముప్పు ఉందని, మేము ఇక్కడ ఒకటిన్నర సంవత్సరం నుంచి ఉంటున్నామని, కానీ ఇప్పుడు అద్దెకు ఉంటున్న గదిని నాలుగు రోజుల్లో ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చదువుకోవడం చాలా కష్టంగా ఉందని బాధితులు వాపోయారు. శివసేన యూత్ వింగ్ యువసేన ప్రెసిడెంట్ ఆదిత్యా థాక్రే ఈ దాడిని ఖండించారు. అమాయకులను అనవసరంగా లక్ష్యంగా చేసుకుని దాడులు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ దాడిలో పాల్గొన్న యువసేన కార్యకర్తలను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు. దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఎస్పీ ఎం రాజ్‌కుమార్ మీడియాకు తెలిపారు. పుల్వామా జిల్లాలో జైష్ ఈ మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది ఓ వాహనంతో సీఆర్ఫీఎఫ్ జవాన్లు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టి తనను తాను పేల్చుకోవడంతో 40 మంది జవాన్లు మరణించిన సంగతి తెల్సిందే. అప్పటి నుంచి పలు రాష్ట్రాల్లో కశ్మీరీలపై చిన్న చిన్న దాడులు జరుగుతూనే ఉన్నాయి. -
రామ మందిరం కట్టకపోతే బీజేపీ కథ అంతే!
లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే బీజేపీకి అధికారం దక్కదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే హెచ్చరించారు. రెండు రోజుల అయ్యోధ్య పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. ఆదివారం ఉదయం వివాదాస్పద రామమందిరం-బాబ్రీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన బీజేపీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ‘రామ మందిర నిర్మాణం ఎప్పుడు చేపడతారో బీజేపీ చెప్పాలి. రాష్టంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే. దశాబ్దాలుగా రామమందిర విషయాన్ని కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో మందిర నిర్మాణం కష్టమే కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీలో ఉందన్నారు. ఆర్డినెన్స్ తెస్తారో చట్టం చేస్తారో మాకనవసరమని, రామ మందిర నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారో మాత్రమే చెప్పండంటూ నిలదీశారు.‘ రామ మందిరాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిర్మించాలి, ఆ ఘనతను వారేనే తీసుకోమనండి. వారు నిర్మించకపోయినా.. రామమందిర నిర్మాణం జరుగుతుంది, కానీ బీజేపీ మాత్రం అధికారంలో కొనసాగదు’ అని హెచ్చరించారు. రామమందిరం ముందుండేది, ఇప్పుడు, ఎప్పుడు ఉంటుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్ వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. ఈ ఆలయ నిర్మాణం హిందువుల మనోభావాలకు సంబంధించిందని, ఇంకెప్పుడు నిర్మిస్తారని, తామెప్పుడు చూడాలని ప్రశ్నించారు. తొలుత ఆర్ఎస్సెస్(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) రామమందిర నిర్మాణనికి ఆర్డినేన్సు తిసుకురావలంటూ డిమాండ్ చేయగా.. తాజాగా విశ్వహిందూ పరిషత్, శివసేనలు సైతం ఆలయ నిర్మాణం చేపట్టాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి. ఈ ఆలయ స్థలం వివాదం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా, న్యాయస్థానం ఈ కేసును జనవరికి వాయిదా వేసిన విషయం తెలిసిందే. -
ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్
ఢిల్లీ: ఆల్ ఇండియా మజ్లిస్ ఇత్తెహదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో శివసేన తెలంగాణ అధ్యక్షుడు తిరుపతి నరసింహ మురారి పిటిషన్ దాఖలు చేశారు.ఆర్టికల్ 226 కింద ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోందంటూ ఎంఐఎం సిద్ధాంతాల జాబితాను ఢిల్లీ హైకోర్టుకు మురారి సమర్పించారు. -
అకౌంటెంట్ పరీక్షలో అందరూ ఫెయిలే..
పణజి: ఏ పరీక్షలోనైన పాస్, ఫెయిల్ అనేవి సర్వ సాధారణం కానీ, ఈ పరీక్షలో మాత్రం అందరూ ఫెయిలే. ఈ ఘటన గోవాలో జరిగింది. బుధవారం అకౌంటెంట్ పరీక్ష ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ అకౌంట్స్ విడుదల చేసింది. పరీక్షకు హాజరైన 8 వేల మంది అభ్యర్థులూ ఫెయిలయ్యారని పేర్కొంది. గోవా ప్రభుత్వం 80 అకౌంటెంట్ పోస్టుల భర్తీలో భాగంగా ఈ ఏడాది జనవరి 7న పరీక్ష నిర్వహి ంచింది. మొత్తం 100 మార్కుల పేపర్‌కు 5గంటల సమయం కేటాయించారు. దీంట్లో ఉత్తీర్ణత సాధించా లంటే కనీసం 50 మార్కులు రావాలి. ఏ ఒక్క అభ్య ర్థికీ 50 మార్కులు రాకపోవడం, వీరంతా గ్రాడ్యు యేట్ విద్యార్థులే కావడం గమనార్హం. గోవా యూని వర్సిటీ, కామర్స్ కాలేజీలు విద్యార్థులను ఇలా చేయడం సిగ్గుచేటని శివసేన దుయ్యబట్టారు. -
మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా
ముంబై: ఫ్రాన్స్ ఫుట్‌బాల్ ప్రపంచకప్ గెలిచినట్లు ప్రధాని మోదీ అవిశ్వాస పరీక్షలో నెగ్గినా, రన్నరప్‌గా నిలిచిన క్రొయేషియాలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నారని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచినప్పటికీ, గొప్ప ఆటతీరు, పోరాటపటిమను ప్రదర్శిం చిన జట్టుగా క్రొయేషియాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్‌ను అందరూ ఇదే తరహాలో చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా అతను మిగతా వారి కంటే నాలుగైదు అడుగులు ముందుంటాడు’ అని వ్యాఖ్యానించారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారనీ, ప్రధానికి షాకివ్వాలన్న లక్ష్యంతో రాహుల్ ఆ పని చేసుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్లేనని రౌత్ అభిప్రాయపడ్డారు. -
ప్రజలు చనిపోతారేమో కానీ మోదీకేం కాదు
ముంబై : 2019 లోక్‌సభ ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రి అభ్యర్థిగా ఆరెస్సెస్ ప్రకటించే అవకాశముందని పేర్కొన్న మరుసటి రోజే శివసేన ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు సంబంధించిన లేఖపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ప్రధాని మోదీ హత్యకు భారీ కుట్ర జరుగుతోందని, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని ఎల్టీటీఈ హతమార్చిన తరహాలోనే ఆయన హత్యకు మావోయిస్టులు ప్రణాళికలు రచిస్తున్నారని పుణే పోలీసులు ఓ లేఖను బయట పెట్టిన విషయం తెలిసింది. ఈ లేఖ రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అయితే ఈ లేఖపై శివసేన తమ అధికారిక పత్రిక సామ్నాలో సెటైరిక్‌గా స్పందించింది. ఇది చాలా ఆసక్తికరంగా.. ప్రమాదకరంగా ఉందని, కానీ ప్రజలు చనిపోతారేమో కానీ.. మోదీకి ఏం కాదని పేర్కొంది. ఇటీవల ఈ లేఖపై ఎన్సీపీ నేత శరద్ పవార్ సైతం స్పందించారు. బీజేపీ తన పట్టు కోల్పోతుందని గ్రహించి ఈ కుట్రకు తెరలేపిందని ఆయన విమర్శించారు. దీన్ని గ్రహించలేని స్థితిలో ప్రజలు లేరన్నారు. ఇలాంటి లేఖలు మీడియా వద్దకు కాకుండా భద్రతా ఎజెన్సీలకు ఎలా చేరుతాయని ప్రశ్నించారు. ఇది బీజేపీ నాయకుల డ్రామా అని విమర్శించారు. -
ప్రణబ్ ప్రధాని అభ్యర్థి కావొచ్చు
ముంబై: 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఆధిక్యం రాకపోతే.. ప్రధాన మంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీకి బదులు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆరెస్సెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉందని శివసేన సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుడైన ప్రణబ్ ముఖర్జీ ఈ నెల 7న నాగ్‌పూర్‌లో జరిగిన ఆరెస్సెస్ కార్యక్రమానికి హాజరై ప్రసంగించడం తెలిసిందే. ఆరెస్సెస్ అసలు ప్రణబ్‌ను ఎందుకు ఆహ్వానించిందో సాధారణ ఎన్నికల అనంతరం కానీ స్పష్టత రాదని శివసేనకు చెందిన సంజయ్ రౌత్ అన్నారు. ఆదివారం ఆయన ముంబైలో మాట్లాడుతూ ‘పరిస్థితి చూస్తుంటే 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా లేదు. హంగ్ ఏర్పడిన పక్షంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీకి ఇతర పార్టీలు మద్దతివ్వకపోతే, ప్రణబ్ ముఖర్జీని ప్రధాని అభ్యర్థిగా ఆరెస్సెస్ ముందుకు తెచ్చే అవకాశం ఉంది. ఆయనైతే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటారు’ అని అన్నారు. అయితే సంజయ్ రౌత్ వ్యాఖ్యలను ప్రణబ్ కూతురు, కాంగ్రెస్ నాయకురాలు శర్మిష్ట ముఖర్జీ ఖండించారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన తన తండ్రికి లేదని ఆమె స్పష్టం చేశారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలపై శర్మిష్ట ట్విట్టర్లో స్పందిస్తూ ‘సంజయ్ రౌత్.. మా నాన్న రాష్ట్రపతిగా పనిచేసి పదవీ విరమణ పొందారు. మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి ఆయన రారు’ అని స్పష్టం చేశారు. -
ఉద్ధవ్‌తో అమిత్ షా భేటీ
ముంబై: బీజేపీ, శివసేన మధ్య వైరుధ్యాలు తారస్థాయికి చేరిన నేపథ్యంలో బుధవారం బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా.. శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరేతో సమావేశమయ్యారు. ముంబైలోని ఉద్ధవ్ నివాసం మాతోశ్రీలో జరిగిన ఈ భేటీకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ కూడా హాజరయ్యారు. 2019 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇటీవలే బీజేపీ ప్రారంభించిన ‘మద్దతు కోసం కలుసుకోవడం’ (సంపర్క్ సే సమర్థన్) కార్యక్రమంలో భాగంగా ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన పార్టీ అధ్యక్షుడితో ఈ భేటీ జరిగింది. అమిత్ షా పర్యటన రోజే బీజేపీపై సామ్నా సంపాదకీయంలో శివసేన విమర్శల దాడి చేసింది. బీజేపీ నేతృత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన నాలుగేళ్ల తర్వాత ఎన్డీయే పక్షాలను బీజేపీ చీఫ్ కలవాలనుకోవడంలో ఆంతర్యమేంటని అందులో ప్రశ్నించింది. ‘ఇటీ వలి ఉపఎన్నికల్లో బీజేపీ ఓటమిపాలైంది. అందుకే మళ్లీ మిత్రపక్షాలను కలవాలని యత్నిస్తోంద’ని పేర్కొంది. సంపర్క్ సే సమర్థన్ కార్యక్రమంలో భాగంగా అమిత్ షా ముంబై పర్యటనలో సీఎం ఫడ్నవిస్‌తో కలిసి.. బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్, ఆమె భర్త డాక్టర్ శ్రీరామ్‌లను జుహూలోని మాధురి నివాసంలో కలిశారు. ఫడ్నవిస్ వద్దు... ఉద్ధవ్: ‘మాతోశ్రీ’కి అమిత్ షా, ఫడ్నవిస్ వచ్చిన సందర్భంగా ఆసక్తికర ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ‘మాతోశ్రీ’లో షా, ఉద్ధవ్ చర్చలకు సిద్ధమవుతుండగా.. ఫడ్నవిస్‌ను ఈ భేటీకి దూరంగా ఉండాలని ఉద్ధవ్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో రెండో అంతస్తులో ఇరు పార్టీల అధ్యక్షులు మాట్లాడుతుండగా.. ఫడ్నవిస్ ఒక్కరే మొదటి అంతస్తులో కూర్చున్నారు. అయితే, బుధవారం ఉదయమే అమిత్ షాకు ఉద్ధవ్ సందేశాన్ని పంపించారని.. షా ఒక్కరినే తను కలుస్తానని అందులో పేర్కొన్నారని శివ సేన వర్గాలు వెల్లడించాయి. మొన్నటి మార్చి లో సచివాలయంలో రెండుగంటలపాటు వేచిచూసినా ఫడ్నవిస్ కలవకపోవడం, ఇటీవలి పాల్ఘర్ ప్రచారంలో ఉద్ధవ్, ఫడ్నవిస్ వ్యక్తిగత విమర్శలు చేసుకున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. -
ఆ మూడు పార్టీలు కలిస్తే.. బీజేపీకి కష్టకాలమే!
నాలుగు లోక్‌సభ, పది అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీయేతర పార్టీల విజయం బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పక్షాల ఐక్యతకు దారితీస్తుందని భావిస్తున్నారు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని కైరానా లోక్‌సభ , నూర్పూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ప్రాంతీయపక్షాలైన రాష్ట్రీయ లోక్‌దళ్(ఆరెల్డీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) గెలుపు తాజాగా ఈ విషయం స్పష్టం చేశాయి. ఈ రెండు పార్టీలకు బీఎస్పీ మద్దతు పలకడం, కాంగ్రెస్ కూడా సమర్థించడంతో బీజేపీ ఈ రెండు సీట్లను కోల్పోయింది. బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి 2019 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసి పోటీచేస్తే అత్యధిక సీట్లు కైవసం చేసుకోవచ్చు. బిహార్‌లో అతి పెద్ద ప్రాంతీయపక్షమైన ఆర్జేడీ కూడా కాంగ్రెస్, మాజీ సీఎం జీతన్ రాం మాంఝీ నాయకత్వంలోని హెచ్ఏఎంతో పొత్తు పెట్టుకుని జోకీహాట్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ నుంచి కైవసం చేసుకుంది. 2014, 2015 ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బిహార్‌లో కాంగ్రెస్‌తో పాటు హెచ్ఏఎం వంటి చిన్నా చితకా ప్రాంతీయపక్షాలతో కలిసి ఆర్జేడీ బరిలోకి దిగితే అత్యధిక సీట్లు సాధించవచ్చు. జార్ఖండ్‌లో రెండు అసెంబ్లీ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన జేఎంఎం రెండింటినీ నిలబెట్టుకుంది. రెండుచోట్లా బీజేపీ సంకీర్ణ భాగస్వామి అయిన ఏజేఎస్‌యూ అభ్యర్థులను జేఎంఎం ఓడించింది. ఈ రాష్ట్రంలో బీజేపీని మినహాయిస్తే జేఎంఎం, ఏజేఎస్‌యూ వంటి ప్రాంతీయపక్షాలకు చెప్పుకోదగ్గ బలముంది. ఈ రాష్ట్రంలో ప్రాంతీయపక్షాలు ప్రతిసారీ కూటములు మారుతుంటాయి. వచ్చే పార్లమెంటు ఎన్నికలనాటికి ఎన్డీఏ నుంచి ఏజేఎస్‌యూ బయటికొచ్చి జేఎంఎం, ఆర్జేడీ, కాంగ్రెస్తదితర బీజేపీ వ్యతిరేక ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపితే అత్యధిక సీట్లలో బీజేపీని ఓడించడం తేలికవుతుంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీయేతర పక్షాలన్నీ ఏకమైతే? పశ్చిమ బెంగాల్లో ఉప ఎన్నిక జరిగిన ఒకే సీటును పాలక టీఎంసీ భారీ మెజారిటీతో నిలబెట్టుకున్నా బీజేపీ రెండో స్థానంలో నిలబడడం సీఎం మమతా బెనర్జీకి ఆందోళన కలిగించే విషయం. బెంగాల్లో బలపడతున్న బీజేపీకి వచ్చేసారి రెండు సీట్లు కూడా రాకుండా చేయడానికి ఆమె కాంగ్రెస్, వీలైతే వామపక్షాలతో కూడా పొత్తు పెట్టుకోవడానికి అంగీకరించే అవకాశాలున్నాయి. తృణమూల్‌తో సర్దుబాటుకు సీపీఎం అంగీకరిస్తే బీజేపీకి ఒక్క సీటు రాకుండా చేయవచ్చు. ఒడిశలో 18 ఏళ్లుగా అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్(బీజేడీ) కొంత బలహీనపడినట్టు స్థానిక ఎన్నికల ఫలితాలు నిరూపించాయి. రెండో పెద్ద పార్టీగా కాంగ్రెస్ స్థానాన్ని బీజేపీ ఆక్రమించింది. బీజేపీని ఓడించడానికి బీజేడీ అవసరమైతే కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటుకు ప్రయత్నించే వీలుంది. మహారాష్ట్రలో కాంగ్రెస్ మద్దతుతో భండారాగోండియా లోక్‌సభ సీటును బీజేపీ నుంచి ఎన్సీపీ కైవసం చేసుకుంది. కిందటి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న ఎన్సీపీ అదే ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేసింది. బీజేపీ, శివసేన కూడా విడివిడిగా పోటీచేసినా చివరికి సంకీర్ణ భాగస్వాములయ్యాయి. బీజేపీతో సంబంధాలు క్షీణిస్తున్న నేపథ్యంలో 2019 ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉండదని కూడా ఇదివరికే శివసేన ప్రకటించింది. ఇదే జరిగితే తన ఉనికి కాపాడుకోవడానికి కాంగ్రెస్ ఎన్సీపీ, ఒకప్పటి ఎన్డీఏ భాగస్వామి స్వాభిమాన్ పక్ష, బహుజన్వికాస్ఆఘాడీ(బీవీఏ) వంటి చిన్నపార్టీలతో చేతులు కలిపి పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు లేకపోలేదు. పాల్ఘర్ లోక్‌సభ ఉప ఎన్నికలో బీజేపీ వ్యతిరేక ఓట్లు శివసేన(2,43,206), బీవీఏ(2,22,837) మధ్య చీలిపోవడంతో బీజేపీ అభ్యర్థి స్వల్ప మెజారిటీతో గెలిచారు. శివసేన సహా మిగిలిన చిన్న చిన్న ప్రాంతీయపక్షాలన్నీ కాంగ్రెస్ ఎన్సీపీ కూటమితో చేతులు కలిపితే బీజేపీకి రాష్ట్రంలో దక్కే సీట్లు గణనీయంగా పడిపోతాయి. 2014 లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పటి వరకూ 27 లోక్‌సభ సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ తన ఖాతాలోని 7 స్థానాలు కోల్పోయింది. ఆరు చోట్ల మాత్రమే గెలుపు సాధించింది. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
కరీంనగర్ సిటీ: ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా హిందూ సామ్రాజ్య స్థాపన దినోత్సవాన్ని శివాజీ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. హిందూ ధర్మయాత్ర చేపట్టారు. కమిటీ అధ్యక్షుడు తోట అర్జున్ ఆధ్వర్యంలో మారుతినగర్ హన్మాన్ ఆలయం నుంచి యాత్ర ప్రారంభించారు. నగర పురవీధుల గుండా యాత్ర సాగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే గంగుల కమలాకర్, డిప్యూటీ మేయర్ రమేశ్, శివసేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పి.వి.మాధవ్‌రాజు హాజరయ్యారు. సమాజహితం కోసం పని చేసిన శివాజీని ఆదర్శంగా తీసుకోవాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కమిటీ సభ్యులు పెద్ది శివ, చిగుళ్ల అనుష్, శేఖర్, దిలీప్, శేఖర్, శివగణేశ్, వినీత్‌రెడ్డి, అశోక్, రంజిత్, మల్లికార్జున్ పాల్గొన్నారు. బైక్ ర్యాలీ హైందవ సంస్కృతి కీర్తి పతాక శివాజీ అని వీహెచ్‌పీ జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు గాజుల రవీందర్ అన్నారు. విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు మధుసూదన్‌రావు, కార్యదర్శి కోమళ్ల రాజేందర్‌రెడ్డి, తోట రాజేందర్, భజరంగ్‌దళ్ జిల్లా కన్వీనర్ తోట ప్రదీప్, శ్రావణ్‌కుమార్, గుజ్జేటి రాజేందర్ పాల్గొన్నారు. శివసేన ఆధ్వర్యంలో.. శివసేన పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలో జయంతి యాత్ర నిర్వహించారు. కిసాన్‌నగర్‌లో గల శివసేన పార్టీ కార్యాలయం నుంచి నగర పురవీధుల గుండా యాత్ర సాగి సర్కస్ గ్రౌండ్లో ముగిసింది. ముఖ్య అతిథిగా శివసేన పార్టీ తెలంగాణ ఇన్చార్జి దామెర క్రిష్ణ హాజరై యాత్రను జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు సోమిడి వేణుప్రసాద్, ఇందూర్ అధ్యక్షుడు శ్రీహరి, యువసేన నాయకులు రాజేందర్, సట్ల సాయి, చందు, రావుల సాయికిరణ్, క్రాంతికుమార్, గుగ్గిళ్ల సత్యనారాయణ, వంగల ప్రదీప్, కార్తీక్, శ్రీకర్, నర్సింగ్, శివ గణేశ్, అజయ్, సోను, రఘు పాల్గొన్నారు. -
హస్తంతోనే స్నేహం
సాక్షి, ముంబై: వచ్చే శాసన సభ ఎన్నికల్లో పొత్తు కుదుర్చుకునేందుకు కాంగ్రెస్ స్నేహ హస్తం చాపితే తమకు ఎలాంటి అభ్యతరం లేదని బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ నాయకుడు ప్రకాశ్ అంబేడ్కర్ అన్నారు. అయితే పొత్తుకు ముందు కాంగ్రెస్ తమ వైఖరేంటో స్పష్టం చేస్తే అప్పుడు తమ నిర్ణయమేంటో వెల్లడిస్తామని స్పష్టంచేశారు. దాదర్‌లోని అంబేడ్కర్ భవన్లో ఆదివారం సాయంత్రం బీఆర్పీ బహుజన్ మహాసంఘ్ రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొద్ది సేపు మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో ఎన్సీపీ, బీజేపీ, శివసేనతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా ప్రకాశ్ స్పష్టమైన సంకేతాలిచ్చారు. వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయి.. భీమా కోరేగావ్ దాడుల ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న మిలింద్ ఏక్బోటేను ఎన్సీపీ కాపాడే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. శివసేన స్నేహ హస్తం చూపితే పొత్తుపెట్టుకుంటారా...? అని విలేకరులడిగిన మరో ప్రశ్నకు ప్రకాశ్ సమాధానమిస్తూ శివసేన ముందు బీజేపీతో తెగదెంపులు చేసుకుని ప్రభుత్వంలోంచి బయటపడాలని, ఆ తరువాత పొత్తు విషయంపై మేం ఆలోచిస్తామని అన్నారు. ఏక్బోటే బీజేపీతో ఉన్నారని, అతన్ని ఎన్సీపీ రక్షించే ప్రయత్నం చేయడం విడ్డూరంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ విచారణ పూర్తయ్యేంత వరకు ఏక్బోటేను అరెస్టు చేయరని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ అంటున్నారని, దీన్నిబట్టి ఏక్బోటేను ముఖ్యమంత్రి కూడా వెనుకేసుకొస్తున్నట్లు స్పష్టమవుతోందని ఆరోపించారు. నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన అభ్యర్థులను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించిందని, కానీ, వీరందరిని ఉన్న ఫలంగా ఉద్యోగంలోంచి తొలగిస్తే వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. ఉద్యోగుల కొరత వల్ల కార్యాలయాల్లో సకాలంలో పనులు జరగవన్నారు. ఫలితంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని, దీంతో వీరందరికి పదోన్నతులు కల్పించకుండా ప్రస్తుతం కొనసాగుతున్న చోటే విధులు నిర్వహించేలా ఉద్యోగంలో కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. -
మాజీ కార్పొరేటర్ అశోక్ సావంత్ హత్య
సాక్షి, ముంబయి : శివసేన మాజీ కార్పొరేటర్‌ను అతి దారుణంగా హత్య చేశారు. బయటకు వెళ్లి తన ఇంటికి తిరిగొస్తున్న ఆయనను గుర్తు తెలియని దుండగులు దాడి చేసి చంపేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. అశోక్ సావంత్ (62) అనే వ్యక్తి గతంలో శివసేన కార్పొరేటర్‌గా పనిచేశాడు. టెలివిజన్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన ఆయనకు ఇటీవల పెద్ద మొత్తంలో బెదిరింపులు వస్తున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు కూడా ఆయనకు చెబుతూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఆదివారం రాత్రి 11గంటల ప్రాంతంలో తన స్నేహితుడిని కలిసి వస్తుండగా ఇంటికి 200 మీటర్ల దూరంలో గుర్తు తెలియని దుండగులు నేరుగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ఉన్న ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. -
‘అచ్ఛేదిన్‌కు అడుగడుగునా గండాలే’
సాక్షి,ముంబయిః అధిక ధరలు, పెట్రో ఉత్పత్తులు భారమవడంపై బీజేపీ మిత్రపక్షం శివసేన మోదీ సర్కార్‌పై విరుచుకుపడింది. అచ్ఛేదిన్ నిత్యం ప్రభుత్వంచే హత్యకు గురవుతున్నాయని తీవ్రంగా విమర్శించింది. పెట్రోల్ ధరలు విపరీతంగా పెరగడాన్ని కేంద్ర మంత్రి కేజే ఆల్ఫోన్స్ సమర్ధించడాన్ని తప్పుపట్టింది. కేంద్ర మంత్రి తన జేబు నుంచి ఎప్పుడూ ఖర్చు చేయరు కాబట్టే ఇంధన ధరలు పెరిగినా ఆయన సమర్ధిస్తున్నారని వ్యాఖ్యానించింది. కాంగ్రెస్ పాలనలోనూ ఇలాంటి బాధ్యతారాహిత్య ప్రకటనతో పేదలను బాధించలేదని పార్టీ పత్రిక సామ్నా ఎడిటోరియల్‌లో శివసేన పేర్కొంది. కాంగ్రెస్ హయాంలో పెట్రో ధరలను పెంచినప్పుడు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, స్మృతీ ఇరానీ, ధర్మేంద్ర ప్రధాన్ వంటి బీజేపీ నేతలు ఖాళీ సిలిండర్లతో వీధుల్లో నిరసనలు చేపట్టడాన్ని వారు మర్చిపోయారా అని నిలదీసింది. అధికారంలోకి రాగానే ఆల్ఫోన్స్ వంటి మంత్రులు తమ వ్యాఖ్యలతో ప్రజలను తప్పుదారిపట్టిస్తున్నారని శివసేన వ్యాఖ్యానించింది. -
'లక్ష కోట్ల లూటీకే మోదీ 'బుల్లెట్''
ముంబయి : ప్రధాని నరేంద్రమోదీపై శివసేన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేసింది. రూ.1.08లక్షల కోట్లను లూటీ చేసేందుకే బుల్లెట్ రైలు ప్రాజెక్టును మోదీ తెరమీదకు తెచ్చారంటూ తన అధికార పత్రిక సామ్నాలో దుయ్యబట్టింది. ఇది మోదీ అత్యంత ఖరీదైన డ్రీమ్ అని దాని పేరిట దేశం సొమ్మును దోపిడిచేయాలనుకుంటున్నారనితీవ్ర ఆరోపణలు చేసింది. ముఖ్యంగా ఈ మధ్య పీయూష్ గోయల్‌ను రైల్వే మంత్రిని చేశారని, ఆయన బీజేపీ కోశాధికారి కూడా అని, అందుకే ఆయనను ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టు కోసం రైల్వేమంత్రిని చేశారంటూ విమర్శించింది. 'ఈ ప్రాజెక్టు కోసం జపాన్ ప్రతి ఒక్కటి అందిస్తుంది.. నెయిల్స్ నుంచి రైళ్ల వరకు.. మానవ శక్తి వనరుల నుంచి సాంకేతిక పరిజ్ఞానం వరకు ఇంకా చెప్పాలంటే సిమెంట్ నుంచి కాంక్రీట్ వరకు కూడా.. డబ్బు భూమి మాత్రం.. గుజరాత్, మహారాష్ట్రది. మొత్తం ఆదాయం మాత్రం టోక్యోకు వెళ్లిపోతుంది. ఈ లూటీని, మోసాన్ని ఎవరూ ప్రశ్నించకుండా మోదీ మానస పుత్రిక (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు)కు మాత్రం అభినందనలు చెబుతున్నారు' అంటూ తీవ్ర వ్యాఖ్యలతో మండిపడింది. -
‘ఈ నష్టం ఫుల్‌టైం రక్షణ మంత్రి లేనందువల్లే’
న్యూఢిల్లీ: శివసేన పార్టీ మరోసారి ప్రధాని నరేంద్రమోదీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు రక్షణశాఖ పూర్తిస్థాయి మంత్రిని ఎందుకు పెట్టడం లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్షణ మంత్రి లేకపోవడం వల్లే సరిహద్దులో జవాన్లకు నష్టం జరుగుతుందని మండిపడ్డారు. భారత ఆర్మీ లెఫ్టినెంట్ అధికారి ఉమర్ ఫయాజ్ ను కశ్మీర్లో కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అనంతరం హత్య చేసిన నేపథ్యంలో శివసేన తన అధికారిక పత్రిక సామ్నాలో ఈ డిమాండ్ చేసింది. భారత్‌కు పూర్తి స్థాయిలో పనిచేసే రక్షణ మంత్రి లేకపోవడం వల్లే ప్రస్తుతం ఇలాంటి క్లిష్టమైన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీగానీ, ఆయన ప్రభుత్వంగానీ అంత తీవ్రంగా పరిగణించడం లేదు. ఇంత జరుగుతున్నా వారు పట్టించుకోవడం లేదు. రక్షణశాఖ విషయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు సగంగాను సగంలో సగంగాను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. నష్ట నివారణకు ఇప్పటికైనా పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోవాలి’ అని డిమాండ్ చేసింది. -
ప్రపంచ నేరాలకు రాజధానిగా చేస్తారా ఏంటి?
ముంబయి: నాగ్‌పూర్‌ను బీజేపీ నుంచి రక్షించాలని ప్రజలకు శివసేన పిలుపునిచ్చింది. నాగ్‌పూర్‌లో శాంతిభద్రతల పరిస్థితులు బాగా క్షీణించాయని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మొత్తానికే ఆ పట్టణాన్ని వదిలేశారని, బీజేపీని ఓడించడం ద్వారానే దానిని కాపాడుకోగలమంటూ ఘాటుగా విమర్శించింది. లేదంటే నాగ్‌పూర్‌ను ప్రపంచ నేర సామ్రాజ్యానికి రాజధానిగా చేస్తారని తీవ్ర ఆరోపణలు బీజేపీపై చేసింది. ముఖ్యమంత్రి ఫడ్నవీస్, ఆయన బీజేపీ నాయకులు కేవలం ముంబయి, పుణె నగరాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారు. కానీ, నాగ్‌పూర్‌ను మాత్రం వదిలేశారు. సమస్యల్లో ముంచారు. నేరాలు బాగా జరుగుతున్నాయి. నాగ్‌పూర్ ప్రపంచ నేరాలకు రాజధానిగా మారితే ముందు సమాధానం చెప్పాల్సిది బీజేపీనే అంటూ శివసేన అధికారిక పత్రిక సామ్నా పేర్కొంది. ప్రస్తుతం స్థానిక ఎన్నికల నేపథ్యంలో శివసేన చేసిన ఈ ఆరోపణలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
అంతరార్థం ఏమిటి?
విశ్లేషణ రాజకీయ పార్టీలు రకరకాల కారణాలతో ఏర్పడుతుంటాయి. వాటిలో ఒకటి నల్లధనాన్ని అక్రమంగా చలామణి చేయడమని ఎన్నికల కమిషన్ గుర్తించింది. అలాంటి దాదాపు రెండు వందల పార్టీల గుర్తింపును రద్దు చేసింది. పార్టీల ఏర్పాటుకు ఇతర కారణాలూ ఉంటాయి. పార్టీలోని వ్యక్తిగత, భావజాల వివాదాలు, వారసత్వ పోరాటాలు వంటివి కూడా వాటిలో ఉంటాయి. ములాయంసింగ్ యాదవ్ చేతులెత్తేయకపోతే రెండు సమాజ్‌వాదీ పార్టీలుండేవే. పదేళ్ల క్రితం రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన(ఎమ్ఎన్ఎస్)ను ఏర్పాటు చేయడంతో శివసేన చీలిపోయింది. అదో ప్రత్యేకవాద పార్టీ. తమ పార్టీ అది కాక మరేదో అన్నట్టుగా అది నటించిందీ లేదు. మౌలికంగా మరాఠీలే ఆ పార్టీ ఓటర్లు. అది, తమది బాల్ ఠాక్రే నిర్మించిన పార్టీగా చెప్పుకుంటుంది. అయితే ఈ పార్టీ ఏర్పాటుకు అసలు కారణం నేడు రాజ్ మేనబావ ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో ఉన్న శివసేన నాయకత్వ వారసత్వ సమస్య వల్ల మాత్రమే ఎమ్ఎన్ఎస్ ఏర్పడింది. ఇద్దరూ మరాఠీలే కాబట్టి, వారు ఐక్యం కావాలని రెండు పార్టీల కేడరూ కోరుకుంటున్నారని ఎప్పుడూ వారికి సూచనలు అందుతూనే ఉన్నాయి. అయితే ఆ ఇద్దరు నేతలు మాత్రం ఆ విషయం గురించి ఎన్నడూ మాట్లాడలేదు. కలసి పనిచేయడం కాదుగదా, కనీసం ఇద్దరి మధ్య అగాధాన్ని పూడ్చే ప్రయత్నమైనా వారిలో ఏ ఒక్కరూ చేయలేదు. స్థానిక పౌర పరిపాలనా సంస్థల నుంచి శాసనసభ వరకు అన్ని స్థాయిల్లోని ఎన్నికల రాజకీయాల్లోనూ వారు ప్రత్యర్థులుగానే ఉంటూ వచ్చారు. అయితే, ముంబైసహా పది ప్రధాన పౌర పురపాలన సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో రాజ్ ఠాక్రే హఠాత్తుగా ఆశ్చర్యకరంగా ప్రవర్తించారు. రాజ్ తన బావ ఉద్ధవ్‌కు ఏడు సార్లు ఫోన్ చేశారు. ఆయన ఫోన్ తీయలేదు. ఉద్ధవ్ ఎక్కడ, ఎన్ని సీట్లు ఇవ్వడానికి సిద్ధపడ్డా అంగీకరించి రెండు పార్టీల మధ్య ఎన్నికల సర్దుబాట్లు చేసుకోవాలనేదే ఈ చర్య వెనుక ఉన్న S ఉద్దేశం. రాజ్ పంపిన దూతను సైతం ఉద్ధవ్ కలవలేదు. మరో నేతను కలిసినా ఎలాంటి ఫలితమూ లేకపోయింది. ఇది, ఎంత హఠాత్తుగా మొదలైందో అంత హఠాత్తుగానే ముగిసిపోయిన ప్రధాన పరిణామం. బలహీనపడుతున్న ఎమ్ఎన్ఎస్ నేత వేసిన ఈ ఎత్తుగడ ఆయనలోని నిస్పృహను సూచిస్తోంది. నాసిక్ మునిసిపల్ కార్పొరేషన్లో మూడొంతుల మంది కార్పొరేటర్లు, అంటే 40 మంది ఉన్న ఎమ్ఎన్ఎస్ ఆ సంస్థను నియంత్రిస్తోంది. కానీ అక్కడి ఆ పార్టీ ప్రతినిధులు శివసేనలోకో లేక బీజేపీలోకో ఫిరాయిస్తున్నారు. 2009లో 13గా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 2014 నాటికి ఒకటికి పడిపోయింది. ఏ ప్రాతినిధ్య సంస్థలోనైనా ఎంత మంది ప్రజాప్రతినిధులున్నారు అనే దాన్ని బట్టే ఒక పార్టీ బలాన్ని లెక్కిస్తారు. అంతేగానీ ఏ సమస్యపైనైనా అది ఎంత ప్రభావాన్ని నెరపగలుగుతుందనేదాన్ని బట్టి కాదు. సేన, ఎమ్ఎన్ఎస్లకు సొంత రాజకీయ రంగ స్థలిౖయెన ముంబైలో పార్టీ అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం కీలకమైనది. దాదర్ శివసేనకు కీలక ప్రాంతం. గత ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ చిత్తుగా ఓడిపోయింది. ఠాక్రే కుటుంబీకులు నివసించే ది, శివసేన ఏర్పడింది, దాని ప్రధాన కార్యాలయం ఉన్నది ఆ ప్రాంతంలోనే. ఈ ఘోర పరాజయం రాజ్‌కు మింగుడు పడటం కష్టమే. ఇకపై శివసేన ఏ పార్టీతోనూ ఎన్నికలకు ముందు కలిసేది లేదని ఆ పార్టీ ముందుగానే ప్రకటించిందనే విషయాన్ని ఇక్కడ చెప్పడం అవసరం. అయినా రాజ్ ఠాక్రే సర్దుబాట్ల కోసం పాకులాడారు. బీజేపీకి, సేనకు మధ్యనే ప్రధానంగా సాగే ఎన్నికల పోరులో మరాఠీ ఓట్లు చీలిపోకూడదనేదే తమ ఉద్దేశమని వివరించ డానికి ఆయన తంటాలుపడ్డారు. ఇదో చిన్నపాటి బెదిరింపే కాదు, ఆ పునాదిని నిలబెట్టుకోగలిగే ఆశలు లేవని ఎమ్ఎన్ఎస్ అంగీకరించడం కూడా. అయితే రాజ్ ఇలా ఉద్ధవ్‌కు సంకేతాలను పంపడం అతి చాకచక్యంగా వేసిన ఎత్తు అని ప్రస్తుతం రాజకీయ పరిశీలకులు విశ్వసిస్తున్నారు. ముంబై స్థానిక ఎన్నికల్లో బీజేపీ చేతుల్లో శివసేన ఓడిపోతే... మరాఠీ భూమిపుత్రులతో శివసేన జూదం ఆడాలని ప్రయత్నిం చిందనే విషయం ప్రపంచానికి తెలుస్తుంది అనేదే రాజ్ ఉద్దేశమని అంటున్నారు. బీజేపీని మహారాష్ట్రేతరుల పార్టీగానే చూస్తుంటారు. అది వాస్తవాలపై ఆధారపడి ఏర్పడ్డ అభిప్రాయం కానవసరం లేదు. అయినాగానీ బీజేపీ చేతిలో ఓటమి కంటే ఎక్కువగా మరాఠీ అస్తిత్వాన్ని గాయపరచేది మరొకటి ఉండదు. ఒక రాజకీయ పరిణామం జరిగిన తర్వాత దానికి కారణాన్ని చెప్పడం అవసరం. శివసేన ఓటమిని వివరించడానికి జరిపే విశ్లేషణగా అది తెలివైన ఎత్తే కావచ్చు. కానీ అసలీ కాళ్లబేరంలో రాజ్ ఠాక్రే తాను ద్వేషించే నాయకుని పార్టీతోనే మైత్రిని కోరి తన బలహీనతను ఎందుకు ప్రదర్శించాల్సి వచ్చిందో అది వివరించదు. ఏది ఏమైనా ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో ఎమ్ఎన్ఎస్ను అది తక్కువగా చేసి చూపింది. - మహేష్ విజాపృకర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com -
'నోట్ల రద్దు ఓ అణుబాంబు.. అందరు బలి'
ముంబయి: ప్రధాని నరేంద్రమోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని హిరోషిమా నాగాసాకిలపై వేసిన అణుబాంబులతో పోల్చారు. పెద్ద నోట్ల రద్దు అనే అణుబాంబుతో మోదీ భారత ఆర్థిక వ్యవస్థను హిరోషిమా, నాగసాకి స్థాయికి తగ్గించారని ఆరోపించారు. 'అందరూ బలయ్యారు' ఈ నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు అంటూ ఉద్ధవ్ బుధవారం తమ అధికారిక పత్రికలు 'సామ్నా, దోపహార్ కా సామ్నా'లో ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే సమయంలో రిజర్వ్ బ్యాకు ఆఫ్ ఇండియా చెప్పినా వినలేదని మండిపడ్డారు. 'చెవిటి, మూగ రామచిలుకల్లా కేబినెట్లో కూర్చుని ఉర్జిత్ పటేల్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించారు. దేశ ఆర్థికవ్యవస్థ అమాంతం పడిపోయింది' అంటూ ఆయన అందులో ఆరోపించారు. -
శివసేనకు రూ.85కోట్లు ఇచ్చిన వీడియోకాన్
ముంబయి: ప్రముఖ వ్యాపార సంస్థ వీడియోకాన్ మహారాష్ట్రలోని శివసేన పార్టీకి రూ.85కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్లో శివసేన పేర్కొంది. దీని ప్రకారం శివసేనకు పెద్ద మొత్తంలో విరాళం ఇచ్చే సంస్థగా వీడియోకాన్ ఉండటం కూడా గమనార్హం. 2015-16 సంవత్సరానికిగాను, కార్పొరేట్ సంస్థలు, కార్పొరేటరేతర సంస్థల నుంచి మొత్తం రూ.86.84కోట్ల మొత్తం విరాళ రూపంలో వచ్చిందని పేర్కొనగా అందులో రూ.85కోట్లు వీడియోకాన్ ఇచ్చిందట. ఇక ఇదే సంస్థ శరద్ పవార్ కు చెందిన నేషనల్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం రూ.25లక్షలు మాత్రమే విరాళంగా ఇచ్చింది. ఆదాయ పన్నుకు సంబంధించిన 139వ సెక్షన్ ప్రకారం 2016, సెప్టెంబర్ 27న శివసేన పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్ ఈ వివరాలు ఎన్నికల కమిషన్‌కు సమర్పించారు. ఈ వివరాలు కమిషన్ వెబ్ సైట్లో కూడా అందుబాటులో ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ కూడా ఈ వివరాలు అందించగా బీజేపీ మాత్రం ఇంకా సమర్పించలేదు. -
బీజేపీ, ‘సేన’ల కయ్యాల కాపురం
- విశ్లేషణ బీజేపీ, శివసేనల మధ్య నేటి మైత్రి... విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లాడ కుండానే తిరిగి చేస్తున్న సంసారం వంటిది. ఈ బంధం గతానికి సంబంధించినది, అధికారంలోకి తిరిగి రావాల్సిన అవసరంతో ఏర్పడినది. దేశంలోని ఇతర అన్ని ప్రాంతాలలో లాగే కాంగ్రెస్ మహారాష్ట్రలో కూడా బలహీనపడింది. నరేంద్ర మోదీ అధికారం లోకి వచ్చినప్పటి నుంచి రివాజుగా ఆ పార్టీ భార తీయ జనతా పార్టీ ప్రభు త్వానికి ప్రతిపక్షం పాత్రను పోషిస్తోంది. అయినా అది నిస్తేజంగానే ఉంది. కాంగ్రెస్‌కు ఒకప్పటి భాగస్వామి అయిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) సైతం అంత కంటే మెరుగ్గా లేదు. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం నుంచి శివసేన ఎప్పుడు తప్పుకుంటే అప్పుడు ఆ స్థానంలోకి ప్రవే శించగల శక్తిని సమకూర్చుకుంటోందనే అనుమా నాలను అది రేకెత్తిస్తోంది. ప్రభుత్వంలో చేరకుండా, తప్పుకోకుండా శివ సేన వారాల తరబడి తాత్సారం చేస్తుండటంతో బీజేపీ మెజారిటీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో ఉన్నప్పుడు... బయట నుంచి మద్దతును ఇస్తామంటూ ఎన్సీపీ ముందుకు వచ్చింది. ఈ పరిణామం శివసేనపై విచిత్రమైన రీతిలో ప్రభా వాన్ని నెరపింది. సందు దొరికితే చాలు ఎన్సీపీ తన స్థానంలోకి చొరబడిపోతుందనే భయం దానికి పట్టుకుంది. దీంతో అది తన సొంత బ్రాండు హిందుత్వనూ, దాని పట్ల శ్రద్ధనూ తగ్గించింది. ఆవశ్యకంగానే చతుర్ముఖ పోటీగా సాగిన ఎన్నికల పోరులో మంచి ఫలితాలనే సాధించగలిగిన శివ సేన అలాంటి స్థితిలో పడటం విచారకరమే. భారతీయ జనతా పార్టీ, శివసేనల మధ్య నేడున్న మైత్రిని విడాకులు తీసుకుని, మళ్లీ పెళ్లి చేసుకోకుండానే తిరిగి చేస్తున్న సంసారంతో తప్ప మరి దేనితోనూ పోల్చలేం. ఈ బంధం గతానికి సంబంధించినది, అధికారంలోకి తిరిగి రావాల్సిన అవసరం వల్ల ఏర్పడినది. ఇక వైరం, సుదీర్ఘ వైవా హిక జీవితం తర్వాత 2014లో విడిపోవడం నుంచి పుట్టుకొచ్చినది. అప్పటి పెళ్లిలో బీజేపీ ఛోటా భాగ స్వామి. సంప్రదాయక హిందూ వివాహంలో భర్త పట్ల భార్య వినమ్రంగా, విధేయంగా ఉండాల్సిందే. ఒకరినొకరు ఎరుగని వారేమీ కాని ఈ జంట మధ్య పోరు రోజురోజుకూ విద్వేషపూరితమైన దిగా, అమర్యాదకరమైనదిగా దిగజారుతున్న అను చిత సన్నివేశం మహారాష్ట్రలో నేడు ప్రదర్శితమౌ తోంది. 2014 శాసనసభ ఎన్నికల వరకు వారు మిత్రులు గానే ఉన్నా... ఆ ఎన్నికల్లో వారు ప్రతి మాటలోనూ విద్వేషం ఉట్టిపడేలా ఒకరితో ఒకరు పోరాడారు. వారిక శాశ్వతంగా విడిపోయినట్టేనని అంతా అనుకున్నారు. అయితే, బీజేపీ ఉండాల్సి నట్టు వినమ్రంగా, విధేయమైన భాగస్వామిగా ప్రవర్తించే నడవ డికను శివసేన అలవరుచుకున్నట్టు అనిపించింది. కానీ అలవరచుకోలేదు. గుడ్డు, గుడ్డుతో వేసిన అట్టు కూడా తనకు దక్కాలని శివ సేన నిర్ణయించుకుంది. దేవేంద్ర ఫడ్నవీస్ 2014 అక్టోబర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో అది డిసెంబర్ 2014లో మోసపూరితంగా చేరింది. అప్పటి నుంచి అవకాశం దొరికినప్పుడల్లా అది బీజేపీని దూషించసాగింది. అది సతాయింపును మించిపోయింది. ప్రభుత్వానికి సంబంధించినంత వరకు శివసేన అంతర్గత ప్రతిపక్షం. ప్రతిపక్ష బెంచీలలోని కాంగ్రెస్, ఎన్సీపీలు నెరవేర్చాల్సిన బాధ్యతలను అది వాటికి తప్పించింది. అవి రెండూ ప్రతిపక్షమనే భావనకు అస్పష్టమైన నీడ లుగా మిగిలాయి. గతవారం బీజేపీ, శివసేనలు తమలోని చెడు నంతా బయట పెట్టుకున్నాయి. శివసేన సాగిం చిన విమర్శల దాడిని బీజేపీ కూడా అంతే తీవ్రమైన మాటలతో తిప్పికొట్టింది. అవి తిట్లకు లంకించుకోవడం అందులో భాగం మాత్రమే. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో శివసేన కూడా భాగస్వామే. సోషల్ మీడియాలో విద్వేషపూరిత మైన పోస్టర్లు వెలిశాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని సైతం ఆ మిత్రపక్షం వదిలిపెట్టలేదు. ఇది సాధారణంగా కూటమిలోని సాధారణమైన అంత ర్గత కుమ్ములాటలను, ఒకరినొకరు దెప్పి పొడుచు కోవడాలను మించిపోయింది. తమది పవిత్రమైన పార్టీ, మచ్చలేని చరిత్ర అన్నట్టుగా ఏక్నాథ్ ఖడ్సే చేత శివసేన బలవం తంగా రాజీనామా చేయించింది. దీంతో ఈ రభస ఖడ్సే సొంత పట్టణం జల్గావ్లో వీధులకు సైతం ఎక్కింది. శివసేన జిత్తులమారితనానికి పాల్పడటమే గాక బీజేపీతో పోరుకు దిగడం ద్వారా అది ఎన్సీపీ బలాన్ని క్షీణింపజేసే అవకాశాన్ని కోల్పో తోంది. బీజేపీకి కయ్యాలమారి భాగస్వామిగా ఉండ టానికి బదులుగా అది భరోసాను కల్పించే దిగా ఉండి 1999 నుంచి 2014 వరకు ఎన్సీపీ మంత్రులపై వచ్చిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తులను కోరాల్సింది. ఎన్సీపీ ప్రముఖ నేత మాజీ మంత్రి ఛగన్ భుజబల్, అతని సమీప బంధువు ఇంకా బె యిల్ లేకుండా నిర్బంధంలోనే ఉన్నారు. అంత కంటే చిన్నపాటి కుంభకోణంలో అతని కుమారులలో ఒకరిపై కూడా కన్నేసి ఉంచారు. మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ మాజీ రాష్ట్ర అధినేత, మంత్రి సునీల్ తత్కారేలపై దర్యాప్తులు బలహీనంగా ఉన్నాయి. అయితే శివసేన ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలపై, ప్రత్యేకించి 2017లో ఎన్నికలు జరగ నున్న బంగారు గుడ్లూ, బాతూ కూడా అయిన ముంబై స్థానిక ప్రభుత్వ ఎన్నికలపై ఎక్కువగా దృష్టిని కేంద్రీకరిస్తోంది. బీజేపీకి ఎలాంటి అవకా శమూ లేకుండా చేయాలని కత్తులు దూస్తోంది. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో, ముందు కేంద్రంలో భాగస్వామి అయిన శివసేనకు స్థానిక సంస్థలపై ఉన్న పట్టును తప్పించడం వైపు బీజేపీ మొగ్గు చూపుతోంది. కాబట్టి శివసేన అలా భావించడాన్ని అర్థం చేసుకోగలం. దీంతో అది ఎన్సీపీని తక్కువ ప్రాధాన్యంగల ప్రత్యర్థిగా పరిగణిస్తోంది. కాస్త ముందో వెనుకో శివసేన ఇందుకు చింతించాల్సి రావచ్చు. - మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
'కాంగ్రెస్ డిమాండ్ తప్పుకాదు.. కరెక్టే'
న్యూఢిల్లీ: అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీపై విమర్శలకు దిగే శివసేన పార్టీ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీని వెనుకేసుకొచ్చింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధింపు అంశంపై పార్లమెంటులో చర్చ జరగాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న డిమాండ్ సరైనదేనని శివసేన నేత సంజయ్ రావత్ అన్నారు. ఈ విషయం నుంచి కేంద్రం పక్కకు జరిగితే ప్రజలకు తప్పుడు సంకేతాలు వెళతాయని హెచ్చరించారు. 'పార్లమెంటులో ఒక అంశాన్ని చర్చకు అంగీకరించకుండా పార్లమెంటు సమావేశాలను ముందుకు నడిపించాలని చూస్తే ప్రజలు మీకు మద్దతు ఇవ్వరు. మీరు చెప్పే కారణాన్ని మెచ్చుకోరు. శివసేన కావచ్చు.. కాంగ్రెస్ కావచ్చు. ఒక ముఖ్యమంత్రికి తన మెజార్టీ నిరూపించుకునే అవకాశం ఇవ్వాలి. కానీ, ఉత్తరాఖండ్‌లో అలా జరగలేదు. అందుకే ఈ విషయంపై చర్చించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇది సరైనదే' అని ఆయన సోమవారం ఓ మీడియాతో అన్నారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయవ్యవస్థ పరిధికి వెళ్లిందికదా అని ప్రశ్నించగా.. అది కోర్టు విచారణలో ఉందేమోకానీ.. అంతకంటే ముందుకు రాజకీయ పరంగా ఎంతో ముఖ్యమైన అంశం అని ఆయన బదులిచ్చారు. -
'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'
ముంబయి: శివసేన పార్టీ మరోసారి బీజేపీని, ఆరెస్సెస్‌ను టార్గెట్ చేసింది. తాను బతికుండగానే రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పిన ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తాము ఆహ్వానిస్తున్నామని, అయితే ఆయన కేవలం ప్రకటనలతో సరిపెడితే సరిపోదని ఆ పార్టీ పేర్కొంది. సరిగ్గా రామమందిరం ఎప్పుడు పూర్తి చేస్తారో తమకు స్పష్టతనివ్వాలని, ఒక తేదిని ప్రకటించాలని ఆ తేదీలోగా రామమందిరం పూర్తవుతుందని చెప్పాలని డిమాండ్ చేసింది. తన అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన ఎడిటోరియల్‌లో శివసేన ఈ వ్యాఖ్యలను చేసింది. ఈ అంశం ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉందని ఇక అలా ఉంచడానికి వీల్లేదని వెంటనే ఓ పరిష్కారం కనుగొనాలని ఆయన డిమాండ్ శివసేన సూచించింది. -
థాక్రే చెంపపై కొడితే రూ.2 లక్షలు
చెన్నై: దేశ ప్రజల్లో సహనం నశిస్తోందంటూ బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులోనూ ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే చెంపమీద కొడితే బహుమతిని ఇస్తామని తమిళనాడు తవ్హీద్ జమాత్ శుక్రవారం ప్రకటించింది. బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ ఇటీవల ఒక కార్యక్రమంలో ప్రసంగిస్తూ దేశ ప్రజల్లో సహనం నశిస్తోంది, అభద్రతా భావం పెరిగిపోతోంది, విదేశాలకు వెళ్లిపోవడం మేలని తన భార్య చెబుతోందని అన్నారు. ఈ వ్యాఖ్యలకు ఒకవైపు నిరసన, మరోవైపు హర్షాతిరేకాలు వెలువడ్డాయి. ఆమిర్ ఖాన్‌ను చెంపదెబ్బ కొడితే రూ.లక్ష ఇస్తామని శివసేన ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనకు తమిళనాడు తవ్హీద్ జమాత్ తీవ్రస్థాయిలో ప్రతిస్పందించింది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాక్రే చెంపపై కొట్టినవారికి రూ.2 లక్షలు బహూకరిస్తామని పేర్కొంటూ జమాత్ సహాయ ప్రధాన కార్యదర్శి తవ్బీక్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు బెదిరిపోమని, మతఛాందసవాదులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన హెచ్చరించారు. -
'నితీశ్ నిజమైన హీరో'
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మిత్రపక్షం బీజేపీని దెప్పిపొడుస్తూ శివసేన వ్యాఖ్యలు చేసింది. ఈ ఓటమికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బాధ్యత వహించాలని పేర్కొంది. అదేసమయంలో బిహార్ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన నితీశ్‌కుమార్‌ను నిజమైన హీరోగా పేర్కొంటూ శివసేన ప్రశంసల్లో ముంచెత్తింది. 'కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే అది సోనియాగాంధీ బాధ్యత అవుతుంది. అదేవిధంగా బిహార్ ఫలితాలను ప్రధాని మోదీ బాధ్యతగా బీజేపీ తప్పక అంగీకరించాలి' అని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ పేర్కొన్నారు. 'ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు వచ్చినా ఫలితాలు ఇదేవిధంగా ఉంటాయి. ఎన్నికలకు మేం భయపడటం లేదు' అని ఆయన అన్నారు. రాజకీయ హీరోగా అవతరించిన నితీశ్‌కుమార్‌కు తమ పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే అభినందనలు తెలిపారని చెప్పారు. -
ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం' చేస్తున్నారు
భారత్, పాకిస్థాన్‌ల మధ్య క్రికెట్ సిరీస్‌ను నిర్వహిచకూడదంటూ బీసీసీఐ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనను కాంగ్రేస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై కాంగ్రేస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం'గా మారుస్తున్నారని ఆరోపించారు. ఇటీవల శివసేన కార్యకర్తల నిరసనలతో.. పాకిస్థానీ గాయకుడు గులామ్ అలీ కార్యక్రమం రద్దు కావడం దురదృష్టకరమన్నారు. మహారాష్ట్రలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం రాష్ట్రపతి ప్రణబ్ చర్యలు తీసుకోవాలని తివారీ కోరారు. -
రాజకీయాల్లో ఫేక్ డిగ్రీలు ట్రెండ్ గా మారాయి
ముంబయి: అవకాశం వచ్చినప్పుడల్లా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా బీజేపీపై చిర్రుబుర్రులాడే శివసేన పార్టీ మరోసారి పరోక్షంగా విమర్శల దాడి చేసింది. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పేరును ప్రస్తావించకుండానే.. అసలు నకిలీ డిగ్రీలనేవి ఒక ట్రెండ్‌గా మారింది.. ఇలాంటి పనులు ఎందుకు చేస్తారో అంటూ శివసేన పార్టీ చీఫ్ ఉద్దవ్ ఠాక్రే అన్నారు. ఓ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. 'నకిలీ డిగ్రీలు కలిగి ఉండటం రాజకీయాల్లో ట్రెండ్‌గా మారింది. ఏదైన ఒక మంచిపనిని సక్రమంగా చేయాలి. దాని కోసం ఎందుకు తప్పుడు మార్గాల్లో వెళతారు' అని వ్యాఖ్యానించారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన విద్యాశాఖ మంత్రి వినోద్ తవదే, కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై నకిలీ డిగ్రీలు కలిగి ఉన్నారని కేసులు నమోదైన నేపథ్యంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమైంది. అంతేకాకుండా మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి పంకజ్ ముండే పై వచ్చిన రూ.200 కోట్ల రూపాయల కుంభకోణం అంశంపై కూడా ఉద్దవ్ స్పందించారు. ఇది అత్యంత ముఖ్యమైన విషయమైనా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, నిర్ణయాన్ని వెలువరించలేదని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. -
రామ మందిరం నిర్మాణంపై 'మన్ కీ బాత్' చెప్పరేం!!
ముంబై: మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దేశంలో నెలకొన్న అన్ని సమస్యలపై అనర్గళంగా మాట్లాడుతోన్న ప్రధాని మోదీ అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపైనా స్పందించాలని ఎన్డీఏ మిత్రపక్షం శివసేన పార్టీ తన పత్రిక సామ్నా సంపాదాకీయంలో పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా చట్టసభలోనో లేక మరో మార్గంలోనే సమస్యను పరిష్కరించి మందిరం నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని, ఈ విషయంలో బీజేపీ అనవసర భయాలకు పోతోందని ఆ పార్టీ ఎంపీ వినయ్ కటియార్ వ్యాఖ్యలను ఉటంకించిన శివసేన.. మందిర నిర్మాణంపై మోదీ మన్ కీ బాత్ బయటపెట్టాలని డిమాండ్ చేసింది. కాగా, మత సామరస్యానికి విఘాతం కలిగించే ఎలాంటి చేయబోనని, ఎవరరైనా అలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోనని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేసిన మరుసటిరోజే బీజేపీ ఎంపీ వినయ్ కటియార్ రామ మందిరంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మోదీ.. రోడ్లు కాదు.. మీవాళ్ల నోర్లు శుభ్రం చేయ్
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీపై శివసేన పార్టీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. అతి ముఖ్యమైన విషయాల్లో కూడా సొంత పార్టీ నేతలు అవాకులు చెవాకులు పేలుతుంటే స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించింది. పొగాకు వాడకంపై బీజేపీ ఎంపీ దిలీప్‌గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో మంగళవారం శివసేన పార్టీ తన అధికారిక పత్రిక సామ్నాలో ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టింది. రోడ్లు, వీధులపై ఉన్న చెత్త చెదారాన్ని ఊడ్చిపారేసేందుకు తాను చీపురు పట్టానని నరేంద్రమోదీ చెప్తున్నారు.. కానీ గబ్బుమాటలతో కంపుకొడుతున్న తన సొంత పార్టీ నేతల నోర్లు ఎవరు శుభ్రం చేస్తారని ప్రశ్నించింది. పొగాకు వినియోగంవల్ల క్యాన్సర్ రాదనే కొత్త విషయాన్ని ఆవిష్కరించిన ఎంపీ దిలీప్‌కు ఖచ్చితంగా నోబెల్ బహుమతి అందించాలని, ఆయన డాక్టర్ కాకపోయినా ఆ అవార్డు ఇవ్వాల్సిన అవసరం మనకుందని ఎద్దేవా చేసింది. అంత గొప్ప ఆవిష్కరణ చేసి పొగాకును వ్యతిరేకించేవారందరి దిమ్మతిరిగిపోయేలా చేశారని హేళన చేసింది. ముంబైలోని టాటా ఆస్పత్రిలో 100 మంది క్యాన్సర్ పేషేంట్లు ఉండగా వారిలో 60 నుంచి 65 మంది పొగాకు వల్ల క్యాన్సర్ బారిన పడ్డవారున్నారని చెప్పారు. పొగాకుపై వైద్యులు ఇంతగా ఆందోళన చెందుతుంటే గాంధీ మాత్రం విస్తృతంగా పొగాకు ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రధాని మోదీ స్పందిచాలని డిమాండ్ చేసింది. -
‘మహా’ రభస!
మహారాష్ట్రలో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం పోకడ ఎలా ఉండబోతున్నదో బుధవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు కళ్లకుకట్టాయి. సభలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో దాన్ని అయిందనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు...ఆ తర్వాత సభలో చోటుచేసుకున్న దురదృష్టకర పరిణామాలు కాంగ్రెస్‌కు చెందిన అయిదుగురు సభ్యుల్ని రెండేళ్లపాటు సభనుంచి సస్పెండ్ చేయడానికి దారితీశాయి. కొత్త శాసనసభ కొలువుదీరిన తొలిరోజే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం పార్టీల ప్రతిష్టను పెంచదు. తగినంత సంఖ్యాబలం ఇవ్వకపోయి ఉండొచ్చుగానీ మహారాష్ట్ర ప్రజలు బీజేపీ నాయ కత్వంలో ప్రభుత్వం ఏర్పడాలనే కోరుకున్నారు. అందులో సందేహం లేదు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 122 స్థానాలు కైవసం చేసుకుని అతి పెద్ద పార్టీగా అవతరించింది. శివసేనకు 63, ఎన్సీపీకి 41, కాంగ్రెస్‌కు 42 లభించాయి. తన సర్కారు మనుగడ సాధించాలంటే ఈ ముగ్గురిలో ఎవరో ఒకరి మద్దతు పొందక తప్పని స్థితిలో బీజేపీ ఉన్నది. మిగిలిన చిన్నా చితకా పార్టీలకు 18 స్థానాలు మాత్రమే ఉన్నందువల్ల వారందరి సహకా రమూ పొందినా ప్రభుత్వ మనుగడకు అవసరమైన 145 సం ఖ్యను చేరుకోవడం అసాధ్యం. కనుక మహారాష్ట్రలో ఇప్పుడున్నది మైనారిటీ ప్రభు త్వమన్నది సుస్పష్టం. దానికి తగినవిధంగా బలం చేకూర్చుకుని, సుస్థిర పాలనను అందివ్వాలన్న దృఢ సంకల్పం ఉన్నప్పుడు బీజేపీ తన పూర్వ మిత్ర పక్షం శివసేనను బుజ్జగించి, వారి డిమాండ్లపై చర్చించి ఒక అవగాహనకు వచ్చి ఉండాలి. లేదా కోర కుండానే మద్దతివ్వడానికి ముందుకొచ్చిన ఎన్సీపీ తోడ్పాటు అయినా తీసుకోవాలి. కానీ, బీజేపీ తీరు చూస్తుంటే అది ఈ మార్గాలను బేఖాతరు చేస్తూనే లేదా చేసినట్టు కనిపిస్తూనే ప్రభుత్వాన్ని నడపదల్చుకున్నట్టు అర్థమవుతుంది. బహుశా లోగడ కర్ణాటకలో యడ్యూరప్ప నేతృత్వంలోని కమలం సర్కారు చేసినట్టు కొంతమంది విపక్ష సభ్యుల్ని రాజీనామాలు చేయించి మళ్లీ పోటీకి నిలబెట్టే యోచన ఏమైనా ఉన్నదేమో! వాస్తవానికి శాసనసభ సమావేశాలు ఎంతో సుహృద్భావ వాతావరణంలో మొదలయ్యాయి. స్పీకర్ స్థానానికి పోటీ పడదామనుకున్న శివసేన, కాంగ్రెస్‌లు రెండూ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ వినతిమేరకు రంగంనుంచి తప్పుకున్నాయి. ఈ ఘట్టం పూర్తయి, కొత్త స్పీకర్ హరిభావ్ బగ్డే సభాధ్యక్ష స్థానంలో ఆశీనులైన కాసేపటికే ఇదంతా మారిపోయింది. ఆ వెంటనే బీజేపీ ఎమ్మెల్యే ఒకరు విశ్వాస తీర్మానం ప్రతిపాదించడం, తీవ్ర గందరగోళంమధ్య మూజువాణి ఓటుతో అది ఆమోదం పొందినట్టు స్పీకర్ ప్రకటించడం పూర్తయ్యాయి. శివసేన, కాంగ్రెస్‌లు తేరుకుని, ఓటింగ్‌కు పట్టుబట్టేసరికి నిబంధనలు ఒప్పుకోవని ఆయన నిరాకరించారు. చట్టసభకు స్పీకరే అధిపతి. అక్కడ ఆయన నిర్ణయమే అంతిమం. సాంకేతికంగా దీన్నెవరూ కాదనలేరు. కానీ నైతికంగా చూసినా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం చూసినా బీజేపీ సర్కారుకు సాధికారత ఉంటుందా? 1999లో కేంద్రంలో వాజపేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఒక్క ఓటు తేడాతో కుప్పకూలిన వైనాన్ని ఈ సందర్భంగా గుర్తుకుతెచ్చుకోవాలి. సభలో తమ బలం అంతంతమాత్రమేనని...ఒకరో ఇద్దరో జారుకున్నా జారుకోవచ్చునని తెలిసికూడా ఆనాడు వాజపేయి బలపరీక్షకు సిద్ధమయ్యారు. అంతేతప్ప స్పీకర్ సాయం తీసుకుని మూజువాణి ఓటుతో గట్టెక్కాలని చూడలేదు. రాజకీయాల్లో నైతిక విలువలకు పెద్ద పీట వేయాలనుకున్నప్పుడు అనుసరించాల్సిన మార్గమది. దురదృష్టమేమంటే ఇటీవలికాలంలో చట్టసభల్లో మూజువాణి ఓటు ప్రయోగం ఎక్కువైపోయింది. ఏ పార్టీ ఎలాంటి వైఖరి తీసుకున్నదో తెలియకుండా, సభ్యుల్లో ఎవరి వాదన ఏమిటో అర్థంకాకుండా కీలకమైన ప్రతిపాదనలన్నీ మూజువాణి ఓటుతో నిర్ణయాలుగా మారిపోతున్నాయి. కోట్లాదిమంది పౌరుల జీవితాలతో ముడిపడి ఉండే వందలు, వేల కోట్ల రూపాయల విలువైన బడ్జెట్ పద్దులు సైతం ఈ మార్గంలోనే ఆమోదం పొందుతున్నాయి. గిలెటిన్ అవుతున్నాయి. పార్లమెంటరీ పరిభాషలో ‘ఫ్లోర్ మేనేజ్మెంట్’ అనే మాట ఉంది. కానీ, అది సభలో పారదర్శక పద్ధతుల్లో ప్రతిబింబించాలి తప్ప ఇలా సాంకేతిక కారణాలను చూపి సర్కారును నిలబెట్టుకునే తీరుగా ఉండకూడదు. అత్యధిక స్థానాలున్న పార్టీగా అవసరమైన బలాన్ని సమీకరించుకోవడానికి వివిధ పక్షాలతో బీజేపీ మాట్లాడి ఉండాల్సింది. వెనువెంటనే ఎవరూ ఎన్నికలు కోరుకునే పరిస్థితి ఉండదు గనుక ఆ విషయంలో బీజేపీ పని సులభమై ప్రభుత్వం విశ్వాస పరీక్ష నెగ్గి ఉండేదేమో కూడా! కానీ, ఆ రాజమార్గాన్ని ఎన్నుకునే ధైర్యాన్ని ఫడ్నవీస్ సర్కారు ప్రదర్శించలేకపోయింది. అలాంటపుడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెల్చుకున్నా తాము విపక్షంలోనే కూర్చుంటామని ప్రకటించిన అక్కడి బీజేపీ నేతలను ఆదర్శంగా తీసుకోవాల్సింది. ‘కాలు తొక్కిననాడే కాపురం సొగసు ఎలా ఉంటుందో తెలిసింద’న్నట్టు మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే అనవసర వివాదానికి తావిచ్చి ప్రజలు తమపై చూపిన విశ్వాసాన్ని ఫడ్నవీస్ ప్రభుత్వం మసకబార్చింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి మరో ఆర్నెల్లవరకూ విశ్వాసపరీక్ష ఎదుర్కొనవలసిన అవసరం ఉండదు. కానీ, కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సివచ్చినప్పుడల్లా ఈ ‘మైనారిటీ’ సమస్య అడ్డం పడుతూనే ఉంటుంది. ప్రభుత్వానికి బలం ఉన్నదో లేదో తేలాల్సింది రాజ్భవన్లలో కాదని, చట్టసభల్లో మాత్రమేనని ఎస్ఆర్ బొమ్మైకేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. చట్టసభల్లో కూడా మూజువాణి ఓటు ద్వారా కాక విస్పష్టమైన ఓటింగ్ ద్వారా మాత్రమే బలాబలాలను తేల్చాలన్న నిబంధన తీసుకురావడం అవసరమని మహారాష్ట్ర అనుభవం చాటిచెబుతున్నది. ఎన్నికల వ్యవస్థపైనా, చట్టసభలపైనా ప్రజలకు విశ్వాసం పెరగాలంటే ఇది తప్పనిసరి. -
దీపావళి తరువాతే ముహూర్తం!
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు ఎవరి మద్దతు తీసుకోవాలన్న అంశంపై బీజేపీ ఇంకా ఊగిసలాడుతోంది. శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో రాజకీయం ఉయ్యాలా జంపాలలా ఊగుతోంది. బీజేపి ఇక్కడ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బయట నుంచి మద్దతు ఇవ్వడానికి ఎన్సీపి ముందుకు వచ్చింది. అయినా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపి ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు. చిరకాలం నుంచి మిత్రపక్షంగా ఉన్న శివసేన మద్దతు తీసుకోవాలా? ఎన్సీపి మద్దతు తీసుకోవాలా? అనే అంశం తేల్చుకోలేకపోతోంది. దాంతో ప్రభుత్వం ఏర్పాటుకు ఆలస్యం జరుగుతోంది. ఫలితాలు వెలువడిన తరువాత మద్దతు ఇవ్వడానికి శివసేన ముందుకురాలేదు. వాళ్లే తమ దగ్గరకు రావాలన్నట్లు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే భీష్మించుకు కూర్చున్నారు. అంతేకాకుండా, మహారాష్ట్ర అభివృద్ధికి పాటుపడే ఎవరితోనైనా కలుస్తామని ప్రకటించడం బీజేపికి ఇబ్బందిగా పరిణమించింది. మరోవైపు ఎన్సీపి అడగకుండానే మద్దతు ఇస్తామని ప్రకటించింది. బీజేపి శివసేనకు షాక్ ఇచ్చే విధంగా ఎన్సీపి, ఇతర చిన్న పార్టీలు, స్వతంత్రుల మద్దతు తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. శివసేనను మద్దతు అడుగకూడదని బీజేపి నిర్ణయించుకుంది. ఆ పార్టీ మద్దతు లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది. ఈ నేపధ్యంలో మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు దీపావళి తరువాతే ముహూర్తం నిర్ణయిస్తారని తెలుస్తోంది. ** -
మహారాష్ట్రలో రాజకీయ ’ఉయ్యాలా..జంపాలా’